శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 385 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 385 - 1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 385 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 385 - 1🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 84. సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా
షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా ॥ 84 ॥ 🍀

🌻 385. ‘సాక్షివర్జితా' - 1🌻

శ్రీమాతకు వేరొక సాక్ష్యము లేదు. కనుక ఆమె 'సాక్షివర్జిత’ అయినది. శ్రీమాతకు ముందున్నది తత్త్వమే. తత్త్వము నుండియే శివ శక్తు లుద్భవించినవి. అందువలన వారే లోకసాక్షులు. వారి నుండి దిగివచ్చినవారు వారిచే గమనింపబడు చుందురు. దిగివచ్చిన వారి నుండి తర తరములుగ దిగివచ్చినవారిని పరికించవచ్చును. సర్వ జీవులను సూర్యుడు, చంద్రుడు, యముడు, కాలము, పంచ భూతములు గమనించు చుండునని 374వ నామమున తెలుపబడినది. వారిని లోకసాక్షు లందురు.

వారికన్న క్రిందుగల లోకములను వారు సాక్షులై చూతురు. కాని వారిని కూడ గమనించునది, పరికించునది శ్రీమాత. క్రింది లోకములవారిని పై లోకములవారు దర్శించ గలరు. చీమ, దోమ, పురుగు మొదలగు జీవులు మనల నంతగ దర్శించవు. మనము వాటిని దర్శింతుము. అట్లే మనము దేవతల నంతగ దర్శింపము. కాని దేవతలు మనలను గమనించుచునే యున్నారు. వారు మనకన్న ఉన్నత లోకముల నున్నవారు. వారిలో కూడ శ్రేణులు గలవు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 385 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 84. Sadyah prasadini vishvasakshini sakshivarjita
Shadanga devata yukta shadgunya paripurita ॥ 84 ॥ 🌻

🌻 385. Sākṣivarjitā साक्षिवर्जिता🌻

But She is without witness. The existence of the Supreme form of the Brahman cannot be witnessed by anyone, as this form of the Brahman has no known source of origin. Another quality of the pure Brahman is referred here.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

10 Jul 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 211. బాధ్యతారాహిత్యం / Osho Daily Meditations - 211. IRRESPONSIBILITY

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 211 / Osho Daily Meditations - 211 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 211. బాధ్యతారాహిత్యం 🍀

🕉. మీరు మీ పట్ల బాధ్యత వహించడం ప్రారంభించినప్పుడు, మీరు మీ తప్పుడు ముఖాలను వదిలివేయడం ప్రారంభిస్తారు. మరికొందరు ఆందోళన చెందడం ప్రారంభిస్తారు, ఎందుకంటే వారు ఎల్లప్పుడూ అంచనాలను కలిగి ఉంటారు మరియు మీరు ఆ ఆకాంక్షలను నెరవేరుస్తూ వచ్చారు. కనుక ఇప్పుడు మీరు బాధ్యతారాహిత్యంగా మారుతున్నారని వారు భావిస్తారు. 🕉

మీరు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పినప్పుడు, మీరు వారి ఆధిపత్యం నుండి బయటపడుతున్నారని వారు మాత్రమే చెబుతున్నారు. మీరు స్వేచ్ఛగా మారుతున్నారు. మీరు చేస్తున్న పనిని ఖండించడానికి, వారు దానిని 'బాధ్యతా రహితం' అంటారు. నిజానికి, మీ స్వేచ్ఛ పెరుగుతోంది. మరియు మీరు బాధ్యత వహిస్తున్నారు, కానీ బాధ్యత అంటే ప్రతిస్పందించే సామర్థ్యం. ఇది సాధారణ అర్థంలో నెరవేర్చవలసిన విధి కాదు. ఇది ప్రతిస్పందన, సున్నితత్వం.

కానీ మీరు ఎంత సున్నితంగా మారితే, అంతగా మీరు బాధ్యతారాహిత్యంగా మారుతున్నారని చాలా మంది భావిస్తారని మీరు కనుగొంటారు. మీరు దానిని అంగీకరించాలి-ఎందుకంటే వారి ఆసక్తులు, వారి పెట్టుబడులు సంతృప్తి చెందవు. చాలా సార్లు మీరు వారి అంచనాలను నెరవేర్చలేరు, కానీ ఎవరి అంచనాలను నెరవేర్చడానికి ఇక్కడ ఎవరూ లేరు. ప్రాథమిక బాధ్యత తన పట్ల తనకు ఉంది. కాబట్టి ధ్యానం చేసేవాడు మొదట చాలా స్వార్థపరుడు అవుతాడు. కానీ తరువాత, ఒకరు మరింత కేంద్రీకృతమై, ఒకరి స్వంత జీవిలో పాతుకు పోయినప్పుడు, శక్తి పొంగి పొర్లడం ప్రారంభమవుతుంది. కానీ అది విధి కాదు. ఇది చేయవలసింది అని కాదు కానీ ఒకరు దీన్ని ఇష్టపడతారు; అది ఒక భాగస్వామ్యం.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 211 🌹

📚. Prasad Bharadwaj

🍀 211. IRRESPONSIBILITY 🍀

🕉. When you start becoming responsible toward yourself, you start dropping your false faces. Others start feeling disturbed, because they have always had expectations and you were fulfilling those demands. Now they feel that you are becoming irresponsible. 🕉

When say that you are being irresponsible, they are simply saying that you are getting out from under their domination. You are becoming freer. To condemn what you are doing, they call it "irresponsible." In fact, your freedom is growing. And you are becoming responsible, but responsibility means the ability to respond. It is not a duty that has to be fulfilled in the ordinary sense. It is responsiveness, a sensitivity.

But the more sensitive you become, the more you will find that many people think that you are becoming irresponsible-and you have to accept that-because their interests, their investments, will not be satisfied. Many times you will not fulfill their expectations, but nobody is here to fulfill anybody else's expectations. The basic responsibility is toward oneself. So a meditator first becomes very very selfish. But later on, when one has become more centered, rooted into one's own being, energy starts overflowing. But it is not a duty. It is not that one has to do it. One loves to do it; it is a sharing.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

10 Jul 2022

శ్రీ శివ మహా పురాణము - 592 / Sri Siva Maha Purana - 592

🌹 . శ్రీ శివ మహా పురాణము - 592 / Sri Siva Maha Purana - 592 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 04 🌴

🌻. కార్తికేయుని కొరకై అన్వేషణ - 1 🌻

నారదుడిట్లు పలికెను -

ఓ దేవ దేవా! ప్రజాపతీ! విధీ! తరువాత ఏమాయెను? శివలీలలతో కూడిన వృత్తాంతమును దయతో ఇపుడు చెప్పుము (1).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీ! కృత్తికలు ఆ శివసుతుని తీసుకు వెళ్లిన తరువాత కొంత కాలము గడిచెను. కాని పార్వతికి ఏమియూ తెలియకుండెను (2). ఆ సమయములో చిరునవ్వుతో ప్రకాశించే ముఖపద్మము గల దుర్గ దేవదేవుడు, సర్వేశ్వరుడు అగు శంభు స్వామితో నిట్లనెను (3).

పార్వతి ఇట్లు పలికెను -

దేవదేవా! మహాదేవా! నా శుభవచనమును వినుము. ఓ ఈశ్వరా! అతిశయించిన పూర్వపుణ్యవిశేషముచే నీవు నాకు లభించినావు (4). యోగి శ్రేష్టుడవగు నీవు దయతో నాతో గలిసి విహారము నందు నిమగ్నమై యుండగా దేవతలు మన విహారమునకు భంగము కలిగించిరి. ఓ శివా! (5) విభో! నీ తేజస్సు నాలో ప్రవేశించలేదు. ఓ దేవా! ఆ తేజస్సు ఏమైనది? ఏ దేవత దానిని దాచినాడు? (6) మహేశ్వరా! అమోఘమగు నా స్వామి యొక్క తేజస్సు వ్యర్థమైనది. ఆ తేజస్సు శిశురూపమును దాల్చినదా?, అయినచో ఆ శిశువు ఎక్కడ? (7)

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీశ్వరా! ఆ జగదీశ్వరుడు పార్వతి యొక్క మాటలను విని నవ్వి దేవతలను మరియు మునులను ఆహ్వానించి ఇట్లు పలికెను (8).

మహేశ్వరుడిట్లు పలికెను -

దేవతలారా! నా మాటను వినుడు. పార్వతి యొక్క ప్రశ్నను వింటిరి గదా! అమోఘమగు నా తేజస్సు నుండి జన్మించినన శిశువును దాచిన వారెవరు? (9) వెంటనే భయముతో సత్యమును వెల్లడించ లేకపోయిన వ్యక్తి దండమునకు అర్హుడు కాబోడు. దండించవలసిన వానిని ఏ రాజు దండించడో, ఏ రాజు ప్రజాధనమును భక్షించునో, వాడు ప్రజలచే బాధితుడగును (10). శంభుప్రభుని ఆ మాటలను విని పరస్పరము సంప్రదించు కొని వారందరు భయపడుతూ శంభుని ఎదుట వరుసగా నిట్లు పలికిరి(11).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 592 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 04 🌴

🌻 Search for Kārttikeya and his conversation with Nandin - 1 🌻

Nārada said:—

1. O lord of people, O Brahmā, O lord of gods, what happened after that? Narrate it to me kindly besides the description of Śiva’s sports.

Brahmā said:—

2. O sage, after the son of Śiva had been taken over by the Krttikās some time elapsed but the daughter of Himavat had no knowledge of the same.

3. Meanwhile Pārvatī beaming with her lotus like face told her husband Śiva, the lord of the gods.

Pārvatī said:—

4. O lord of the gods, listen to my auspicious words. O lord, you have been attained by me, thanks to my previous merits.

5. Although you are the most excellent among the Yogins, O lord, you became desirous of dalliance. But my dalliance with you was interrupted in the middle by the gods.

6. O lord, your semen fell on the ground and not in my womb. Where did it go? Among the gods by whom could it have been concealed?

7. O lord, infallible is your semen, how can it be fruitless? Or has it developed into a child somewhere?

Brahmā said:—

8. O great sage, on hearing the words of Pārvatī, the lord of the universe called the gods and the sages and laughingly said to them.

Lord Śiva said:—

9. O gods, listen to my words. Has Pārvatī’s statement been heard by you? Where has my unfailing semen gone? By whom has it been concealed?

10. If he, out of fear, falls at my feet quickly he may not be punished. If a king, competent enough, does not rule firmly he will be harrassed by the subjects. He cannot be a protector.

Brahmā said:—

11. On hearing the words of Śiva and after consulting one another they replied one by one. They were so afraid of the great lord.

Continues....

🌹🌹🌹🌹🌹

10 Jul 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 76 / Agni Maha Purana - 76

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 76 / Agni Maha Purana - 76 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 27

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. దీక్షా విధి - 2 🌻

ప్రద్యుమ్న మంత్రముతో కలిపి గరిటిచేత మెల్లగా ఎనపవలెను. ఉడికిన తరువాత, గురువు అనిరుద్ధమంత్రముతో దింపవలెను. ఆ పాత్రను కడిగి, నారాయణమంత్రముతో, భస్మచేత పాత్రకు ఊర్ధ్వపుండ్రము లుంచవలెను. ఈ విధముగ ఆ చరువును చక్కగా సంస్కరించవలెను.

ఒక భాగము దేవునకు, రెండవ భాగము కలశకు సమర్పించి, మూడవ భాగముచే మూడు ఆహుతులు చేయవలెను. నాల్గవ భగామును గురువు శిష్యులతో కూడా భుజించవలెను. క్షీరవృక్షమనుండి దంత కాష్ఠమును గ్రహించి, దానిని నారాయణ మంత్రముచే ఏడు సార్లు అభిమంత్రించి పవిత్రము చేసి, దానిని నమలి విడువవలెను. తన పాప మంతయు ఈశాన్యదిగభి ముఖముగా పడిపోయినట్లు భావన చేయవలెను. శుభ##మైన నరసింహమంత్రముతో నూరు సార్లు హోమము చేసి, ఆచమనము చేసి, పూజా గృహము ప్రవేశించి, తూర్పున విష్ణువును స్థాపించి ప్రదక్షిణము చేయవలెను.

"భక్తవత్సలుడవైన ఓదేవా! సంసార సముద్రమునందు మునిగి యున్న పశువుల పాపములను తొలగించుటకు నీ వొక్కడవేశరణము. ఓ! దేవదేవా! ప్రాకృతములైన పాశబంధనములచే బద్ధులైన ఈ పశువులను, నీ అనుగ్రహము వలన విముక్తులను చేసెదను. అనుజ్ఞఇమ్ము." అని విష్ణువును ప్రార్థించవలెను.

విష్ణువునకు ఈ విధముగా విజ్ఞాపన చేసి, పిమ్మట పశువులను ప్రవేశించి, పూర్వము చేప్పినట్లు ధారణలచేతను, జ్వలనాదికముచేతను సంశోధనముచేసి సంస్కరించి, మూర్తితో కలిపి, నేత్రములను బంధించి చూపవలెను. అచట పుష్పమములతో నిండిన దోసిళ్లను విసిరి, ఆ పేర్లను చేర్చవలెను. అచట వెనుకటివలె క్రమముగా మంత్రరహితముగా అర్చన చేయవలెను. పుష్పము ఏ మూర్తిపై పడునో ఆ మూర్తి యొక్క పేరు ఆతనికి పెట్టవలెను.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 76 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 27

🌻 Mode of performing the initiation rite - 2 🌻

12. After stirring it with the (basic syllable of) Pradyumna the worshipper has to mix it slowly with the ladle and then the cooked food is lifted with the (basic syllable of) Aniruddha.

13. Having washed him and besmearing (with sandals), the vertical mark is made on the forehead with the ashes. The food thus prepared well is placed by the side with the (basic syllable of) Nārāyaṇa.

14. A part of it has to be offered to the deity, the second part to the jar, and with the third part he should offer three oblations.

15-17. The preceptor has to partake of the fourth part in the company of his disciples for the sake of purification. Having consecrated seven times (the stick) got from the milky tree, the piece of wood for cleaning the tree being made use of and discarded and being conscious of one’s sins and having offered oblations to the hundred auspicious and most excellent lions lying in the north, northeast, east and southeast, having done the ācamana[4] and having entered the chamber of worship, the knower of the mystic syllables should assign ViṣṇU in the east and do circumambulation.

18. You are, alone, O Lord! the refuge of the beings immersed in the ocean of mundane existence, for the release from the fetters. You are always kind towards your worshippers.

19. “O Lord of Lords! (you) permit (me). (I will) free these beings by your grace from their earlier fetters by which they are bound”.

20-21. Having submitted thus to the lord of the celestials and having made the animals enter (the place), (they) have to be purified then by holding them as before and to be consecrated with the fire. Having yoked them with the deity their eyes should be closed. Their eyes are covered. Handful of flowers are offered there and their names are added.

22. Worship is made duly as before without reciting any basic syllable (mantra). That particular name of the idol on which the flower falls that is pointed out.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

10 Jul 2022

కపిల గీత - 36 / Kapila Gita - 36

🌹. కపిల గీత - 36 / Kapila Gita - 36🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴. 15. భగవంతుని అతీంద్రియ స్వరూపంపై ధ్యానం - 3 🌴

36. తైర్దర్శనీయావయవైరుదార విలాసహాసేక్షితవామసూక్తైః
హృతాత్మనో హృతప్రాణాంశ్చ భక్తిరనిచ్ఛతో మే గతిమణ్వీం ప్రయుక్తే

ఇలా సుందరమైన దివ్య మంగళ విగ్రహం, విలాసముతో కూడిన చూపులు, తీయని మాటలు, మనసు హరించబడి, పైప్రాణం పైనే పోతుంది అనిపించేవారు నేను ఇవ్వాలనుకునే మోక్షాన్ని కూడా వారు కోరరు.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 36 🌹

✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj

🌴 15. Meditation on the Lord's Transcendental Form - 3 🌴

36. tair darsaniyavayavair udaravilasa- haseksita-vama-suktaih
hrtatmano hrta-pranams ca bhaktir anicchato me gatim anvim prayunkte

Upon seeing the charming forms of the Lord, smiling and attractive, and hearing His very pleasing words, the pure devotee almost loses all other consciousness. His senses are freed from all other engagements, and he becomes absorbed in devotional service. Thus in spite of his unwillingness, he attains liberation without separate endeavor.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

10 Jul 2022

10 Jul 2022 Daily Panchang నిత్య పంచాంగము

🌹10, July 2022 పంచాగము - Panchangam 🌹

శుభ ఆదివారం, Sunday, భాను వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : దేవశయని ఏకాదశి, Devshayani Ekadashi 🌻

🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం - 15 🍀

15. ధాత్రే నమః అంశుమతే నమః
పూష్ణే నమః పర్జన్యాయ నమః
విష్ణవే నమః నేత్రస్థానే మాం రక్షతు ॥

16. అరుణాయ నమః సూర్యాయ నమః
ఇన్ద్రాయ నమః రవయే నమః
సువర్ణరేతసే నమః యమాయ నమః
దివాకరాయ నమః కర్ణస్థానే మాం రక్షతు ॥

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : సాధనకు ఉపకరించేది -సర్వ యోగుల హృదయాల్లో భగవంతుడ్ని దర్శించటం, పండితుల్ని, ఋషుల్ని, గురువును, పౌరాణికుడ్ని ఆరాధించడం. ప్రతీ ప్రాణిలో భగవంతుడ్ని దర్శించటం మాత్రమే 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, ఆషాడ మాసం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

తిథి: శుక్ల-ఏకాదశి 14:15:25 వరకు

తదుపరి శుక్ల ద్వాదశి

నక్షత్రం: విశాఖ 09:56:23 వరకు

తదుపరి అనూరాధ

యోగం: శుభ 24:45:17 వరకు

తదుపరి శుక్ల

కరణం: విష్టి 14:09:25 వరకు

వర్జ్యం: 13:35:00 - 15:02:36

దుర్ముహూర్తం: 17:09:46 - 18:02:12

రాహు కాలం: 17:16:20 - 18:54:38

గుళిక కాలం: 15:38:01 - 17:16:20

యమ గండం: 12:21:23 - 13:59:42

అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47

అమృత కాలం: 01:41:00 - 03:11:00

మరియు 22:20:36 - 23:48:12

సూర్యోదయం: 05:48:08

సూర్యాస్తమయం: 18:54:38

చంద్రోదయం: 15:25:16

చంద్రాస్తమయం: 02:01:28

సూర్య సంచార రాశి: జెమిని

చంద్ర సంచార రాశి: వృశ్చికం

ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య

నాశనం 09:56:23 వరకు తదుపరి

మృత్యు యోగం - మృత్యు భయం

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

10 - JULY - 2022 SUNDAY MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 09, ఆదివారం, జూలై 2022 భాను వాసరే Sunday 🌹
🌹. తొలి, దేవశయని ఏకాదశి శుభాకాంక్షలు 🌹
2) 🌹 కపిల గీత - 36 / Kapila Gita - 36🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 76 / Agni Maha Purana - 76🌹 
4) 🌹. శివ మహా పురాణము - 592 / Siva Maha Purana - 592🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 211 / Osho Daily Meditations - 211🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 385-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 385-1🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹10, July 2022 పంచాగము - Panchangam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : దేవశయని ఏకాదశి, Devshayani Ekadashi 🌻*

*🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం - 15 🍀*

15. ధాత్రే నమః అంశుమతే నమః
పూష్ణే నమః పర్జన్యాయ నమః
విష్ణవే నమః నేత్రస్థానే మాం రక్షతు ॥

16. అరుణాయ నమః సూర్యాయ నమః
ఇన్ద్రాయ నమః రవయే నమః
సువర్ణరేతసే నమః యమాయ నమః
దివాకరాయ నమః కర్ణస్థానే మాం రక్షతు ॥

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : సాధనకు ఉపకరించేది -సర్వ యోగుల హృదయాల్లో భగవంతుడ్ని దర్శించటం, పండితుల్ని, ఋషుల్ని, గురువును, పౌరాణికుడ్ని ఆరాధించడం. ప్రతీ ప్రాణిలో భగవంతుడ్ని దర్శించటం మాత్రమే 🍀* 

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, ఆషాడ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల-ఏకాదశి 14:15:25 వరకు
తదుపరి శుక్ల ద్వాదశి
నక్షత్రం: విశాఖ 09:56:23 వరకు
తదుపరి అనూరాధ
యోగం: శుభ 24:45:17 వరకు
తదుపరి శుక్ల
కరణం: విష్టి 14:09:25 వరకు
వర్జ్యం: 13:35:00 - 15:02:36
దుర్ముహూర్తం: 17:09:46 - 18:02:12
రాహు కాలం: 17:16:20 - 18:54:38
గుళిక కాలం: 15:38:01 - 17:16:20
యమ గండం: 12:21:23 - 13:59:42
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47
అమృత కాలం: 01:41:00 - 03:11:00
మరియు 22:20:36 - 23:48:12
సూర్యోదయం: 05:48:08
సూర్యాస్తమయం: 18:54:38
చంద్రోదయం: 15:25:16
చంద్రాస్తమయం: 02:01:28
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: వృశ్చికం
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య
నాశనం 09:56:23 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 36 / Kapila Gita - 36🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴. 15. భగవంతుని అతీంద్రియ స్వరూపంపై ధ్యానం - 3 🌴*

*36. తైర్దర్శనీయావయవైరుదార విలాసహాసేక్షితవామసూక్తైః*
*హృతాత్మనో హృతప్రాణాంశ్చ భక్తిరనిచ్ఛతో మే గతిమణ్వీం ప్రయుక్తే*

*ఇలా సుందరమైన దివ్య మంగళ విగ్రహం, విలాసముతో కూడిన చూపులు, తీయని మాటలు, మనసు హరించబడి, పైప్రాణం పైనే పోతుంది అనిపించేవారు నేను ఇవ్వాలనుకునే మోక్షాన్ని కూడా వారు కోరరు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 36 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*

*🌴 15. Meditation on the Lord's Transcendental Form - 3 🌴*

*36. tair darsaniyavayavair udaravilasa- haseksita-vama-suktaih*
*hrtatmano hrta-pranams ca bhaktir anicchato me gatim anvim prayunkte*

*Upon seeing the charming forms of the Lord, smiling and attractive, and hearing His very pleasing words, the pure devotee almost loses all other consciousness. His senses are freed from all other engagements, and he becomes absorbed in devotional service. Thus in spite of his unwillingness, he attains liberation without separate endeavor.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 76 / Agni Maha Purana - 76 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 27*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. దీక్షా విధి - 2 🌻*

ప్రద్యుమ్న మంత్రముతో కలిపి గరిటిచేత మెల్లగా ఎనపవలెను. ఉడికిన తరువాత, గురువు అనిరుద్ధమంత్రముతో దింపవలెను. ఆ పాత్రను కడిగి, నారాయణమంత్రముతో, భస్మచేత పాత్రకు ఊర్ధ్వపుండ్రము లుంచవలెను. ఈ విధముగ ఆ చరువును చక్కగా సంస్కరించవలెను.

ఒక భాగము దేవునకు, రెండవ భాగము కలశకు సమర్పించి, మూడవ భాగముచే మూడు ఆహుతులు చేయవలెను. నాల్గవ భగామును గురువు శిష్యులతో కూడా భుజించవలెను. క్షీరవృక్షమనుండి దంత కాష్ఠమును గ్రహించి, దానిని నారాయణ మంత్రముచే ఏడు సార్లు అభిమంత్రించి పవిత్రము చేసి, దానిని నమలి విడువవలెను. తన పాప మంతయు ఈశాన్యదిగభి ముఖముగా పడిపోయినట్లు భావన చేయవలెను. శుభ##మైన నరసింహమంత్రముతో నూరు సార్లు హోమము చేసి, ఆచమనము చేసి, పూజా గృహము ప్రవేశించి, తూర్పున విష్ణువును స్థాపించి ప్రదక్షిణము చేయవలెను.

"భక్తవత్సలుడవైన ఓదేవా! సంసార సముద్రమునందు మునిగి యున్న పశువుల పాపములను తొలగించుటకు నీ వొక్కడవేశరణము. ఓ! దేవదేవా! ప్రాకృతములైన పాశబంధనములచే బద్ధులైన ఈ పశువులను, నీ అనుగ్రహము వలన విముక్తులను చేసెదను. అనుజ్ఞఇమ్ము." అని విష్ణువును ప్రార్థించవలెను.

విష్ణువునకు ఈ విధముగా విజ్ఞాపన చేసి, పిమ్మట పశువులను ప్రవేశించి, పూర్వము చేప్పినట్లు ధారణలచేతను, జ్వలనాదికముచేతను సంశోధనముచేసి సంస్కరించి, మూర్తితో కలిపి, నేత్రములను బంధించి చూపవలెను. అచట పుష్పమములతో నిండిన దోసిళ్లను విసిరి, ఆ పేర్లను చేర్చవలెను. అచట వెనుకటివలె క్రమముగా మంత్రరహితముగా అర్చన చేయవలెను. పుష్పము ఏ మూర్తిపై పడునో ఆ మూర్తి యొక్క పేరు ఆతనికి పెట్టవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 76 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 27*
*🌻 Mode of performing the initiation rite - 2 🌻*

12. After stirring it with the (basic syllable of) Pradyumna the worshipper has to mix it slowly with the ladle and then the cooked food is lifted with the (basic syllable of) Aniruddha.

13. Having washed him and besmearing (with sandals), the vertical mark is made on the forehead with the ashes. The food thus prepared well is placed by the side with the (basic syllable of) Nārāyaṇa.

14. A part of it has to be offered to the deity, the second part to the jar, and with the third part he should offer three oblations.

15-17. The preceptor has to partake of the fourth part in the company of his disciples for the sake of purification. Having consecrated seven times (the stick) got from the milky tree, the piece of wood for cleaning the tree being made use of and discarded and being conscious of one’s sins and having offered oblations to the hundred auspicious and most excellent lions lying in the north, northeast, east and southeast, having done the ācamana[4] and having entered the chamber of worship, the knower of the mystic syllables should assign ViṣṇU in the east and do circumambulation.

18. You are, alone, O Lord! the refuge of the beings immersed in the ocean of mundane existence, for the release from the fetters. You are always kind towards your worshippers.

19. “O Lord of Lords! (you) permit (me). (I will) free these beings by your grace from their earlier fetters by which they are bound”.

20-21. Having submitted thus to the lord of the celestials and having made the animals enter (the place), (they) have to be purified then by holding them as before and to be consecrated with the fire. Having yoked them with the deity their eyes should be closed. Their eyes are covered. Handful of flowers are offered there and their names are added.

22. Worship is made duly as before without reciting any basic syllable (mantra). That particular name of the idol on which the flower falls that is pointed out.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 592 / Sri Siva Maha Purana - 592 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 04 🌴*

*🌻. కార్తికేయుని కొరకై అన్వేషణ - 1 🌻*

నారదుడిట్లు పలికెను -

ఓ దేవ దేవా! ప్రజాపతీ! విధీ! తరువాత ఏమాయెను? శివలీలలతో కూడిన వృత్తాంతమును దయతో ఇపుడు చెప్పుము (1).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీ! కృత్తికలు ఆ శివసుతుని తీసుకు వెళ్లిన తరువాత కొంత కాలము గడిచెను. కాని పార్వతికి ఏమియూ తెలియకుండెను (2). ఆ సమయములో చిరునవ్వుతో ప్రకాశించే ముఖపద్మము గల దుర్గ దేవదేవుడు, సర్వేశ్వరుడు అగు శంభు స్వామితో నిట్లనెను (3).

పార్వతి ఇట్లు పలికెను -

దేవదేవా! మహాదేవా! నా శుభవచనమును వినుము. ఓ ఈశ్వరా! అతిశయించిన పూర్వపుణ్యవిశేషముచే నీవు నాకు లభించినావు (4). యోగి శ్రేష్టుడవగు నీవు దయతో నాతో గలిసి విహారము నందు నిమగ్నమై యుండగా దేవతలు మన విహారమునకు భంగము కలిగించిరి. ఓ శివా! (5) విభో! నీ తేజస్సు నాలో ప్రవేశించలేదు. ఓ దేవా! ఆ తేజస్సు ఏమైనది? ఏ దేవత దానిని దాచినాడు? (6) మహేశ్వరా! అమోఘమగు నా స్వామి యొక్క తేజస్సు వ్యర్థమైనది. ఆ తేజస్సు శిశురూపమును దాల్చినదా?, అయినచో ఆ శిశువు ఎక్కడ? (7)

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీశ్వరా! ఆ జగదీశ్వరుడు పార్వతి యొక్క మాటలను విని నవ్వి దేవతలను మరియు మునులను ఆహ్వానించి ఇట్లు పలికెను (8).

మహేశ్వరుడిట్లు పలికెను -

దేవతలారా! నా మాటను వినుడు. పార్వతి యొక్క ప్రశ్నను వింటిరి గదా! అమోఘమగు నా తేజస్సు నుండి జన్మించినన శిశువును దాచిన వారెవరు? (9) వెంటనే భయముతో సత్యమును వెల్లడించ లేకపోయిన వ్యక్తి దండమునకు అర్హుడు కాబోడు. దండించవలసిన వానిని ఏ రాజు దండించడో, ఏ రాజు ప్రజాధనమును భక్షించునో, వాడు ప్రజలచే బాధితుడగును (10). శంభుప్రభుని ఆ మాటలను విని పరస్పరము సంప్రదించు కొని వారందరు భయపడుతూ శంభుని ఎదుట వరుసగా నిట్లు పలికిరి(11).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 592 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 04 🌴*

*🌻 Search for Kārttikeya and his conversation with Nandin - 1 🌻*

Nārada said:—
1. O lord of people, O Brahmā, O lord of gods, what happened after that? Narrate it to me kindly besides the description of Śiva’s sports.

Brahmā said:—
2. O sage, after the son of Śiva had been taken over by the Krttikās some time elapsed but the daughter of Himavat had no knowledge of the same.

3. Meanwhile Pārvatī beaming with her lotus like face told her husband Śiva, the lord of the gods.

Pārvatī said:—
4. O lord of the gods, listen to my auspicious words. O lord, you have been attained by me, thanks to my previous merits.

5. Although you are the most excellent among the Yogins, O lord, you became desirous of dalliance. But my dalliance with you was interrupted in the middle by the gods.

6. O lord, your semen fell on the ground and not in my womb. Where did it go? Among the gods by whom could it have been concealed?

7. O lord, infallible is your semen, how can it be fruitless? Or has it developed into a child somewhere?

Brahmā said:—
8. O great sage, on hearing the words of Pārvatī, the lord of the universe called the gods and the sages and laughingly said to them.

Lord Śiva said:—
9. O gods, listen to my words. Has Pārvatī’s statement been heard by you? Where has my unfailing semen gone? By whom has it been concealed?

10. If he, out of fear, falls at my feet quickly he may not be punished. If a king, competent enough, does not rule firmly he will be harrassed by the subjects. He cannot be a protector.

Brahmā said:—
11. On hearing the words of Śiva and after consulting one another they replied one by one. They were so afraid of the great lord.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 211 / Osho Daily Meditations - 211 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 211. బాధ్యతారాహిత్యం 🍀*

*🕉. మీరు మీ పట్ల బాధ్యత వహించడం ప్రారంభించినప్పుడు, మీరు మీ తప్పుడు ముఖాలను వదిలివేయడం ప్రారంభిస్తారు. మరికొందరు ఆందోళన చెందడం ప్రారంభిస్తారు, ఎందుకంటే వారు ఎల్లప్పుడూ అంచనాలను కలిగి ఉంటారు మరియు మీరు ఆ ఆకాంక్షలను నెరవేరుస్తూ వచ్చారు. కనుక ఇప్పుడు మీరు బాధ్యతారాహిత్యంగా మారుతున్నారని వారు భావిస్తారు. 🕉*
 
*మీరు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పినప్పుడు, మీరు వారి ఆధిపత్యం నుండి బయటపడుతున్నారని వారు మాత్రమే చెబుతున్నారు. మీరు స్వేచ్ఛగా మారుతున్నారు. మీరు చేస్తున్న పనిని ఖండించడానికి, వారు దానిని 'బాధ్యతా రహితం' అంటారు. నిజానికి, మీ స్వేచ్ఛ పెరుగుతోంది. మరియు మీరు బాధ్యత వహిస్తున్నారు, కానీ బాధ్యత అంటే ప్రతిస్పందించే సామర్థ్యం. ఇది సాధారణ అర్థంలో నెరవేర్చవలసిన విధి కాదు. ఇది ప్రతిస్పందన, సున్నితత్వం.*

*కానీ మీరు ఎంత సున్నితంగా మారితే, అంతగా మీరు బాధ్యతారాహిత్యంగా మారుతున్నారని చాలా మంది భావిస్తారని మీరు కనుగొంటారు. మీరు దానిని అంగీకరించాలి-ఎందుకంటే వారి ఆసక్తులు, వారి పెట్టుబడులు సంతృప్తి చెందవు. చాలా సార్లు మీరు వారి అంచనాలను నెరవేర్చలేరు, కానీ ఎవరి అంచనాలను నెరవేర్చడానికి ఇక్కడ ఎవరూ లేరు. ప్రాథమిక బాధ్యత తన పట్ల తనకు ఉంది. కాబట్టి ధ్యానం చేసేవాడు మొదట చాలా స్వార్థపరుడు అవుతాడు. కానీ తరువాత, ఒకరు మరింత కేంద్రీకృతమై, ఒకరి స్వంత జీవిలో పాతుకు పోయినప్పుడు, శక్తి పొంగి పొర్లడం ప్రారంభమవుతుంది. కానీ అది విధి కాదు. ఇది చేయవలసింది అని కాదు కానీ ఒకరు దీన్ని ఇష్టపడతారు; అది ఒక భాగస్వామ్యం.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 211 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 211. IRRESPONSIBILITY 🍀*

*🕉. When you start becoming responsible toward yourself, you start dropping your false faces. Others start feeling disturbed, because they have always had expectations and you were fulfilling those demands. Now they feel that you are becoming irresponsible. 🕉*
 
*When say that you are being irresponsible, they are simply saying that you are getting out from under their domination. You are becoming freer. To condemn what you are doing, they call it "irresponsible." In fact, your freedom is growing. And you are becoming responsible, but responsibility means the ability to respond. It is not a duty that has to be fulfilled in the ordinary sense. It is responsiveness, a sensitivity.*

*But the more sensitive you become, the more you will find that many people think that you are becoming irresponsible-and you have to accept that-because their interests, their investments, will not be satisfied. Many times you will not fulfill their expectations, but nobody is here to fulfill anybody else's expectations. The basic responsibility is toward oneself. So a meditator first becomes very very selfish. But later on, when one has become more centered, rooted into one's own being, energy starts overflowing. But it is not a duty. It is not that one has to do it. One loves to do it; it is a sharing.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 385 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 385 - 1🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 84. సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా*
*షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా ॥ 84 ॥ 🍀*

*🌻 385. ‘సాక్షివర్జితా' - 1🌻* 

*శ్రీమాతకు వేరొక సాక్ష్యము లేదు. కనుక ఆమె 'సాక్షివర్జిత’ అయినది. శ్రీమాతకు ముందున్నది తత్త్వమే. తత్త్వము నుండియే శివ శక్తు లుద్భవించినవి. అందువలన వారే లోకసాక్షులు. వారి నుండి దిగివచ్చినవారు వారిచే గమనింపబడు చుందురు. దిగివచ్చిన వారి నుండి తర తరములుగ దిగివచ్చినవారిని పరికించవచ్చును. సర్వ జీవులను సూర్యుడు, చంద్రుడు, యముడు, కాలము, పంచ భూతములు గమనించు చుండునని 374వ నామమున తెలుపబడినది. వారిని లోకసాక్షు లందురు.*

*వారికన్న క్రిందుగల లోకములను వారు సాక్షులై చూతురు. కాని వారిని కూడ గమనించునది, పరికించునది శ్రీమాత. క్రింది లోకములవారిని పై లోకములవారు దర్శించ గలరు. చీమ, దోమ, పురుగు మొదలగు జీవులు మనల నంతగ దర్శించవు. మనము వాటిని దర్శింతుము. అట్లే మనము దేవతల నంతగ దర్శింపము. కాని దేవతలు మనలను గమనించుచునే యున్నారు. వారు మనకన్న ఉన్నత లోకముల నున్నవారు. వారిలో కూడ శ్రేణులు గలవు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 385 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 84. Sadyah prasadini vishvasakshini sakshivarjita
Shadanga devata yukta shadgunya paripurita ॥ 84 ॥ 🌻*

*🌻 385. Sākṣivarjitā साक्षिवर्जिता🌻*

*But She is without witness. The existence of the Supreme form of the Brahman cannot be witnessed by anyone, as this form of the Brahman has no known source of origin. Another quality of the pure Brahman is referred here.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹