శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 374 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 374 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 374 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 374 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।
శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀
🌻 374 -1. 'కృతజ్ఞా'🌻
కృత జ్ఞానము కలది శ్రీదేవి అని అర్ధము. ‘కృత జ్ఞాన’ మనగా క్రియా జ్ఞానము. క్రియాశక్తి వలననే సమస్తము అవతరించును. చేయుటకు జ్ఞానము కావలెను. ఏమి చేయవలెనో తెలియవలెను. క్రియా జ్ఞానము నందు ఇచ్ఛా జ్ఞానము లిమిడి యుండును. పరహితము చేయవలెను అనునది ఇచ్ఛ. ఎట్లు చేయవలెనో తెలియక చేసినచో పరహిత ఇచ్ఛ ఫలించదు. ఎట్లు చేయవలెనో తెలిసిననూ కూడ చేయుట జరగనిచో ఫలించదు. ఏమి చేయవలెనో తెలియుట చాలదు. ఎట్లు చేయవలెనో తెలిసిననూ చాలదు. చేయవలెను కదా! కేవలము చేయుట తెలిసి, ఎట్లు చేయ వలెనో తెలియనిచో ఫలము లేదు. ఏమి చేయవలెనో తెలియనిచో కూడ ఫలము లేదు.
ఇట్లు ఇచ్ఛా జ్ఞానములను తెలిసి చేయుటయే జ్ఞానము. అట్టి జ్ఞానము యొక్క స్వరూపమే శ్రీదేవి. కనుకనే ఆమె సృష్టి నిర్వహణమును నైపుణ్యముతో నిర్వర్తించు చుండును. పరమశివుడు జ్ఞాన స్వరూపుడు. అతడెప్పుడునూ తపస్సునందే యుండును. క్రియయం దాసక్తి తక్కువ. అత్యవసరమైనచో గాని క్రియలోనికి దిగిరాడు. అట్టి శివునితో శ్రీమాత క్రీడాప్రాయముగ జూదమాడునట. శ్రీమాత క్రియా జ్ఞానము కలది గనుక సర్వదా శివుని జయించు చుండెడిదట. శివుడు కూడ శ్రీమాత గెలుపును గమనించి సంతసించెడి వాడట. ఇది శ్రీమాత క్రియా జ్ఞానమునకు తార్కాణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 374 -1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 82. Kameshari prananadi krutagyna kamapujita
Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻
🌻 374-1. Kṛtajñā कृतज्ञा🌻
She is aware of all the actions of the universe. She is capable of transcending the secrecy or privacy, which ignorant men think that nobody is capable of hearing or seeing (recollect those two swans).
There are nine witnesses to all our actions. They are sun, moon, the lord of death (Yama), time (kala) and five basic elements ākāś, air, fire, water and earth. All these nine are under the control of Śaktī and that is why She is said to be the witness to all the actions of the universe. This can also be interpreted as ‘she is the one who imparts knowledge’.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
25 May 2022
ఓషో రోజువారీ ధ్యానాలు - 188 - 188. బలహీనత మరియు బలము / Osho Daily Meditations - 188 - 188. VULNERABLE & STRONG
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 188 / Osho Daily Meditations - 188 🌹
📚. ప్రసాద్ భరద్వాజ్
🍀 188. బలహీనత మరియు బలము 🍀
🕉. బలహీనంగా లేనప్పుడు మాత్రమే బలంగా భావించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ ఆ బలం కేవలం ముఖభాగం, మభ్యపెట్టడం. బలహీనంగా ఉండి దానిని గుర్తించి అధిగమించే వ్యక్తులూ ఉన్నారు. 🕉
బలహీనంగా ఉన్నప్పుడు బలహీనంగా భావించే వారు ఎక్కువ కాలం దుర్బలంగా భావించ లేరు: త్వరలో ఆ బలహీనత వారిని చాలా భయపడేలా చేస్తుంది, వారు మూసి వేయబడతారు. కాబట్టి సరైన విధానం బలహీనంగా ఉన్నప్పుడు బలమైన అనుభూతి పొందడం. అప్పుడు మీరు దుర్బలంగా ఉండగలరు కానీ ప్రతిరోజూ మీ బలం పెరుగుతుంది. మీరు మరింత దుర్బలంగా మారడానికి ధైర్యంగా ఉంటారు. నిజంగా ధైర్యవంతుడు ఖచ్చితంగా బహిరంగంగా ఉంటాడు. అదే ధైర్యానికి ప్రమాణం. పిరికివాడు మాత్రమే మూసివేయ బడతాడు మరియు బలమైన వ్యక్తి రాయిలా బలంగా ఉంటాడు మరియు గులాబీలా సున్నితత్వాన్ని కలిగి ఉంటాడు, ఇది ఒక వైరుధ్యం-మరియు వాస్తవమైనదంతా విరుద్ధమైనది.
కాబట్టి ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి: మీరు ఏదైనా విరుద్ధమైనదిగా భావించినప్పుడు, దానిని స్థిరంగా చేయడానికి ప్రయత్నించవద్దు, ఎందుకంటే ఆ స్థిరత్వం తప్పుగా ఉంటుంది. నిజమైన వాస్తవికత ఎల్లప్పుడూ విరుద్ధమైనది: ఒక వైపు మీరు బలహీనంగా భావిస్తారు, మరోవైపు మీరు బలంగా భావిస్తారు. అంటే సత్యం యొక్క క్షణం వచ్చిందని తెలుసుకుంటారు. ఒక వైపు మీకు ఏమీ తెలియదని మీరు భావిస్తారు, మరోవైపు మీకు అంతా తెలుసు అని మీరు భావిస్తారు-సత్యం యొక్క క్షణం వచ్చేసింది అని. ఒక వైపు మీరు ఎల్లప్పుడూ ఒక కోణాన్ని అనుభవిస్తారు, మరోవైపు ఖచ్చితమైన వ్యతిరేక కోణాన్ని అనుభవిస్తారు. మీరు ఈ రెండు అంశాలను ఏక కాలంలో కలిగి ఉన్నప్పుడు, ఏదైనా సత్య విషయం చాలా దగ్గరగా ఉందని గుర్తుంచుకోండి.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Osho Daily Meditations - 188 🌹
📚. Prasad Bharadwaj
🍀 188. VULNERABLE & STRONG 🍀
🕉 There are people who feel strong only when they are not vulnerable; but that strength is just a facade, a camouflage. Then there are people who are vulnerable but feel weak. 🕉
Those who feel weak when they are vulnerable cannot feel vulnerable for long: Sooner or later that weakness will make them so afraid that they will close up. So the right approach is to feel vulnerable and strong. Then you can remain vulnerable and each day your strength will grow, and you will become courageous enough to become more and more vulnerable. A really brave person is absolutely open-that is the criterion of courage. Only a coward is closed, and a strong person is as strong as a rock and as vulnerable as a rose, it is a paradox-and all that is real is paradoxical.
So always remember: When you feel something paradoxical, don't try to make it consistent, because that consistency will be false. Reality is always paradoxical: On the one hand you feel vulnerable, on the other hand you feel strong-that means a moment of truth has arrived. On the one hand you feel you don't know anything, on the other hand you feel you know all-a moment of truth has arrived. On the one hand you always feel one aspect, and on the other hand the exact opposite aspect, and when you have both these aspects together, always remember that something true is very close by.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
25 May 2022
శ్రీ మదగ్ని మహాపురాణము - 53 / Agni Maha Purana - 53
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 53 / Agni Maha Purana - 53 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 19
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌻. కశ్యప వంశ వర్ణనము - 3 🌻
హరియు, బ్రహ్మయు, పృథువును రాజ్యాభిషిక్తుని చేసి దీని నంతను ఆతని కిచ్చిరి. ప్రభువైన హరి క్రమముగా ఇతరులకు ఆయా రాజ్యాధికారముల నిచ్చెను.
బ్రాహ్మణులకును, ఓషధులకును చంద్రుడు రాజు, జలములకు కరుణుడు, రాజులకు వైశ్రవణుడు, సూర్యులకు విష్ణువు, వసువులకు అగ్ని, మరుత్తులకు ఇంద్రుడు,
ప్రజాపతులకు దక్షుడు, దానవులకు ప్రహ్లాదుడు, పితృదేవతలకు యముడు, భూతాదులకు శివుడు, శైలములకు హిమవంతుడు, నదులకు సముద్రుడు,
గంధర్వులకు చిత్రరథుడు, నాగులకు వాసుకి, సర్పములకు తక్షకుడు, పక్షులకు గరుత్మంతుడు, గజేంద్రములకు ఐరావతము, గోవులకు వృషభము, మృగములకు పులి,
వనస్పతులకు ప్లక్షము, అశ్వములకు ఉచ్ఛైఃశ్రవము ప్రభువలు తూర్పున సుధన్వ, దక్షిణమున శంఖపదుడు, పశ్చిమమున కేతుమంతుడు, ఉత్తరమున హిరణ్యరోమకుడును పాలకులు ఈ విధముగ అవాంతర సృష్టి (ప్రతి సర్గము ) చెప్పబడినది.
అగ్ని మహాపురాణమున ప్రతి సర్గవర్ణనమను ఏకోనవింశా ధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 53 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj
Chapter 19
🌻 The progeny of Kaśyapa - 3 🌻
22. All these (are) forms of Hari. Having installed Pṛthu as the ruler, Hari duly set apart kingdoms for others.
23. The moon (was made the king) of the twice-born and the plants, Varuṇa (as) the king of waters, Vaiśravaṇa (Kubera) (as) the king of kings, Viṣṇu (as) the lord of Suns.
24. Pāvaka (fire) as the king of Vasus; Vāsava (Indra) (as) the lord of Maruts and then Dakṣa (as the king) of Prajāpatis (patriarchs), Prahlāda (as) the ruler of demons.
25. Yama (was made) the king of manes, Hara (Siva) (as) the lord of goblins, Himavat (as the ruler) of mountains, the ocean (as) the lord of rivers.
26. Citraratha (was made the ruler) of Gandharvas, and then Vāsuki (as the ruler) of Nāgas, Takṣaka (as) the king of serpents, and then Garuḍa, among the birds.
27. The Airāvata (was made the ruler) among the lords of elephants, bull of the kine and the tiger, of the animals, (and) Plakṣa (the Indian fig-tree) (as) the lord of trees.
28. And Uccaiḥśravas (was made the ruler) among the horses.[6] Sudhanvan (son ofVairāja Prajāpati) became the regent of the east, Śaṅkhapād (the son of Kardama Prajāpati) (the regent) of the south, Ketumat (son of Rajas) as the protector of the waters (on the west), Hiraṇyaromaka (son of Parjanya Prajāpati) on the Saumya (the north).
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
25 May 2022
శ్రీ శివ మహా పురాణము - 569 / Sri Siva Maha Purana - 569
🌹 . శ్రీ శివ మహా పురాణము - 569 / Sri Siva Maha Purana - 569 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴
🌻. పతివ్రతా ధర్మములు - 7 🌻
ఓ పార్వతీ! నీకీ విధముగా పతివ్రతా ధర్మమును వర్ణించితిని. ఇపుడు నేను పతివ్రతలలోని భేదములను వర్ణించెదను. ప్రీతితో సావధానముగా వినుము (71). ఓ దేవీ! స్మరించి నంతనే పాపములను పోగొట్టే పతివ్రతలు ఉత్తమ మొదలగు భేదముచే నాల్గు తెరంగుల నున్నారని పెద్దలు చెప్పెదరు (72). ఉత్తమ, మధ్యమ, నికృష్ట, అతని కృష్ట అను నాల్గు విధముల పతివ్రతల లక్షణములను చెప్పెదను. సావధానముగా వినుము (73). ఓ మంగళ స్వరూపరాలా! ఏ స్త్రీ యొక్క మనస్సు నిత్యము స్వప్నములోనైనూ తన భర్తనే నిశ్చితముగా చూచునో, పరపురుషుని చూడదో, ఆమె ఉత్తమ అని చెప్ప బడినది (74).
ఓ పార్వతీ! ఏ స్త్రీ పరపురుషుని సద్బుద్ధితో తండ్రిని వలెగాని, సోదరుని వలెగాని, కుమారుని వలె గాని దర్శించునో, ఆమె మధ్యమ పతివ్రత అనబడును (75). ఓ పార్వతీ! స్వధర్మమును ఎరింగి మనస్సు చేననైననూ వ్యభిచరించని సుశీలయగు స్త్రీ నికృష్టపతివ్రత యనబడును (76). భర్త ఇంటిలో వారికి భయపడి వ్యభిచరించని స్త్రీ అధమ పతివ్రత యగునని ప్రాచీన విద్వాంసులు చెప్పెదరు (77). ఓ పార్వతీ ! ఈ నాల్గు విధముల పతివ్రతలు కూడా పాపములను పోగొట్టి, మానవులందరినీ పవిత్రులను చేసి ఇహపర సుఖముల నొసంగెదరు (78).
అత్రి భార్యయగు అనసూయ పాతివ్రత్య ప్రభావముచే త్రిమూర్తుల నర్థించి వారాహ శాపముచే మరణించిన బ్రాహ్మణుని ఒకనిని జీవింప చేసినది (79). ఓ పార్వతీ! నీవీ
సత్యము నెరింగి సర్వదా సర్వకామనల నీడేర్చు పతి సేవను ప్రీతితో ప్రతిదినము చేయవలెను (80). నీవు జగన్మాతవగు మహేశ్వరివి. నీ భర్త సాక్షాత్తుగా ఆ శివుడే. నిన్ను స్మరించు స్త్రీలు పతివ్రతలగుదురు (81). ఓ శివాదేవీ! ఈ ధర్మములను నీకు చెప్పబని యేమున్నది? అయిననూ, ఈనాడు లోకాచారముననుసరించి నీకు చెప్పి యుంటిని (82).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఆ బ్రాహ్మణస్త్రీ ఆమెతో ఇట్లు పలికి విరమించెను. శంకరునకు ప్రియురాలు, పర్వతునకు కుమార్తె యగు శివాదేవి ఆమెకు ప్రణమిల్లి మహానందమును పొందెను (83).
శ్రీ శివ మహాపురాణములో పతివ్రతా ధర్మవర్ణనమనే ఏబది నాల్గవ అధ్యాయము ముగిసినది (54).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 569 🌹
✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 54 🌴
🌻 Description of the duties of the chaste wife - 7 🌻
71. O daughter of the lord of mountains, thus the duty of a chaste wife is described to you. Now, listen to their classifications with attention and love.
72. O gentle lady, the chaste ladies can be divided into four classes. Even when they are remembered they dispel sins. The divisions comprise of the superior etc.
73. They are superior, middling, inferior and very inferior. I shall explain their characteristics. Listen with attention.
74. O gentle lady, she whose mind is not aware of any one else and who is conscious of her husband even in her dreams is the noblest of all.
75. O daughter of the mountain, she who sees another man as her father, brother or son with a clean conscience is the middling among chaste ladies.
76. O Pārvatī, she who ponders over her duty mentally and desists from going astray is inferior among the chaste. Of course she is pure in conduct.
77. She who remains chaste for fear of her husband or the family is very inferior among the chaste ladies, so say the ancient poets.
78. O Pārvatī, these four types of chaste ladies dispel sins. They sanctify all the worlds. They are delighted here and hereafter.
79. A brahmin who died due to the curse of Varāha (Boar), was at the request of the three deities, resuscitated by Atri’s wife (Anasūyā), thanks to the power of chastity.
80. O Śiva, O daughter of the mountain, knowing this well, you shall render service to your husband every day with pleasure as it bestows all desires.
81. You are the Goddess and the mother of the universe. Śiva Himself is your husband. By remembering you women become chaste.
82. O Pārvatī, O gentle lady, what avails mentioning all this to you. Still I mention this just to follow the worldly convention.
Brahmā said:—
83. Saying this, the brahmin lady stopped and bowed to her. Pārvatī, the beloved of Śiva, derived great pleasure.
Continues....
🌹🌹🌹🌹🌹
25 May 2022
కపిల గీత - 13 / Kapila Gita - 13
🌹. కపిల గీత - 13 / Kapila Gita - 13🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్ భరధ్వాజ
🌴. కపిల భగవానుని స్వీయ సాక్షాత్కార జ్ఞాన వివరణ - 2 🌴
13. శ్రీభగవానువాచ
యోగ ఆధ్యాత్మికః పుంసాం మతో నిఃశ్రేయసాయ మే
అత్యన్తోపరతిర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ
శరీరము కన్నా భిన్నమైన ఆత్మ ఒకటి ఉన్నది అని తెలుసుకోవడం జ్ఞ్యాన యోగం. ప్రతీ జీవికి ఉపయోగించేది ఇదే. జ్ఞ్యాన యోగం మాత్రమే జీవునికి మోక్షం రావడానికి ఉపయోగిస్తుందని నా సిద్ధాంతం. ఇలాంటి జ్ఞ్యాన యోగాన్ని అభ్యసిస్తే కలిగే లాభం, దుఖఃఅమూ సుఖమూ ఉండదు. సుఖాభిలాష దు@ఖాభిలాషా రెండూ ఉండవు.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 13 🌹
✍️ Swami Prabhupada.
📚 Prasad Bharadwaj
🌴 Lord Kapila Begins to Explain Self-realization - 2 🌴
13. sri-bhagavan uvaca
yoga adhyatmikah pumsam mato nihsreyasaya me
atyantoparatir yatra duhkhasya ca sukhasya ca
The Personality of Godhead answered: That yoga system which relates to the Lord and the individual soul, which is meant for the ultimate benefit of the living entity, and which causes detachment from all happiness and distress in the material world, is the highest yoga system.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
25 May 2022
హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలతో - హనుమ విశిష్టత Greetings on Hanuman Jayanti - Uniqueness Of Hanuman
🌹. హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలతో - హనుమ విశిష్టత 🌹
✍️. రామాయణం శర్మ (బద్రాచలం)
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. హనుమ - జననం - పొందిన వరాలు 🌻
హనుమంతుని తండ్రి పేరు కేసరి. అంజన ఆ కేసరి యొక్క భార్య. అంజన యొక్క కుమారుడు ఆంజనేయుడు. హనుమంతుడు, అంజనాదేవి గర్భాన - వాయుదేవుడు - శివతేజస్సును ప్రవేశపెట్టడం వలన జన్మించాడు. అందుచేత పవనతనయుడు, మారుతి నందనుడు వంటి పేర్లు కలిగియున్నాడు.
🌺. జయంతి: వైశాఖ బహుళ దశమి 🌺
🍀. హనుమ పొందిన వరాలు: 🍀
శిశువుగా ఉన్నప్పుడే, ఆకలి కలిగియున్నప్పుడు, సూర్యుని ఫలమనుకొని, పొందుటకు ఎగరడం, సూర్యుని వద్డ హనుమను చూచి, రాహువు ఇంద్రునికి ఫిర్యాదు వంటి సందర్భాలలో, ఇంద్రుడు వచ్చి వజ్రాయుధం ప్రయోగించడం సంభవించింది. అప్పుడు ఆ వజ్రాయుధం ఆంజనేయుని దౌడ(హనుమ)కు తగిలి, స్వామి నిర్జీవుడై పడిపోవడం జరిగింది. అది చూసి, వాయుదేవుడు సకల జీవరాశి నుంచి బయటకు వచ్చి సమ్మె చేశాడు. అది తెలిసిన బ్రహ్మదేవుడు, దేవతలతో వచ్చి, ఆంజనేయుని పునర్జీవితుని చేశాడు.
వాయువుకి సంతోషం కలిగించడానికీ, భవిష్యత్తులో దేవతల గొప్పకార్యాన్ని మారుతి నిర్వహించడానికీ, దేవతలందఱినీ మారుతికి వరాలిమ్మన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు,
1. ఇంద్రుడు: బంగారు పద్మహారమునిచ్చి, హనుమ అని నామమిడి, తన వజ్రాయుధము వలన ఏ హానీ కలుగదన్నాడు.
2. సూర్యుడు: తన తేజస్సులో నూఱోవంతు ఇస్తున్నాననీ, శైశవ దశనించీ విద్యార్జన స్థితి రాగానే, సకల శాస్త్ర జ్ఞానాన్నీ కలిగిస్తాననీ, తద్వారా వాక్చతురుడు కాగలడనీ, శాస్త్రజ్ఞానమందు హనుమతో సరితూగగలవాడు మరొకడుండడనీ అన్నాడు.
3. వరుణుడు: తన పాశము వలనగానీ, జలముల వలన గానీ, లక్షల కొలది సంవత్సరాల వరకూ మృత్యుభయం ఉండకుండా వరమిచ్చాడు.
4. యముడు: తన దండము వలన మృత్యువు కలగదనీ, ఎల్లప్పుడూ ఆరోగ్యభాగ్యాలతో వర్ధిల్లుతాడనీ, యుద్ధమునందు విషాదగ్రస్తుడు కాడనీ మారుతికి వరాలొసగాడు.
5. కుబేరుడు: సమరమునందు తన గద ఆంజనేయునికి ఎట్టి ఆపదను కలిగించదన్నాడు.
6. శంకరుడు: తన వలన గానీ, శూల పాశుపతాస్త్రాది తన ఆయుధాల వలనగానీ హనుమ వధ్యుడు కాడని వరమనుగ్రహించాడు.
7. విశ్వకర్మ: తాను నిర్మించిన దివ్యశస్త్రములలో ఏ ఒక్కటైననూ రణమందు వధింపజాలదనీ, చిరంజీవి అవుతాడనీ హనుమకి వరాలిచ్చాడు.
8. బ్రహ్మ: ఏ బ్రహ్మదండం చేతనూ వధ్యుడు కాడనీ, దీర్ఘాయువనీ మారుతికి వరాలిచ్చి, వాయుదేవునితో మారుతిని గూర్చి - శత్రువులను గడగడలాడించగలడనీ, - మిత్రులకు అభయప్రదాత అవుతాడనీ, - యుద్ధంలో శత్రువులకు అజేయుడై వర్ధిల్లుతాడనీ, - కోరుకొన్న రూపాలను పొందగలడనీ, - ఇష్టానుసారంగా అంతటా - వేగంగానూ, నెమ్మదిగానూ సంచరింపగలడనీ, - చిరస్థిరకీర్తితో వర్ధిల్లగలడనీ, - యుద్ధము నందు అతడొనర్చే వీరోచిత సాహసాద్భుత కృత్యాలన్నీ రావణ సంహారానికి కారకాలవుతూ, అవి రామునకు ప్రియము గూర్చుతాయనీ, లోకాలకు రోమాంచమునూ సంతోషాన్నీ కలిగిస్తాయనీ పేర్కొన్నాడు.
ఆ విధంగా సకల వరాలూ పొందిన శిశువైన మారుతిని, వాయుదేవుడు అంజనాదేవి వద్దకు తీసుకువచ్చి, ఆమెకు అప్పగించి, వరాలగూర్చి వివరించి వెళ్ళాడు. జాంబవంతుడు హనుమ శక్తిని పొగిడి సముద్ర లంఘనం చేయించాడు.
హనుమానంజనానూను: వాయుపుత్రోమహాబలః
రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్
మనం కూడా స్వామిని స్తుతిస్తే సకల శుభాలూ కలిగిస్తాడు. ప్రతిరోజూ ఆరాధిస్తూ, సకల శాస్త్ర పారంగతుడూ, సర్వశక్తిమంతుడూ అయిన హనుమని సేవిద్దాం. మన జీవిత లక్ష్యాలని నెరవేర్చుకొందాం. హనుమతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.
🌸.జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ - జై హనుమాన్ జై జై హనుమాన్ 🌸
🌹 🌹 🌹 🌹 🌹
25 May 2022
25 - MAY - 2022 బుధవారం, సౌమ్య వాసరే MESSAGES హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు
1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 25, బుధవారం, మే 2022 సౌమ్య వాసరే 🌹
🌹. హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు - హనుమ విశిష్టత 🌹
🌹 కపిల గీత - 13 / Kapila Gita - 13🌹
2) 🌹. శివ మహా పురాణము - 569 / Siva Maha Purana - 569🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 53 / Agni Maha Purana - 53🌹
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 188 / Osho Daily Meditations - 188🌹
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 374-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 374-1 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు మరియు శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 25, మే 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : హనుమాన్ జన్మదినోత్సవం, Hanuman Janmadinotsav . 🌺*
*🍀. శ్రీ హనుమాన్ స్తోత్రము 🍀*
*హనుమానంజనానూను: వాయుపుత్రోమహాబలః*
*రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమః*
*ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః*
*లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా*
*ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః*
*స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః*
*తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : సాధకులు తమ పాత్రతను పెంచుకోవడం వలన మాత్రమే దైవకృపకు పాత్రులు అవుతారు. సంకల్ప బలంతో ఆదర్శాల పట్ల పూర్తి సమర్పణ చేసుకోవాలి.- సద్గురు శ్రీరామశర్మ. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, వైశాఖ మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: కృష్ణ దశమి 10:34:37 వరకు
తదుపరి కృష్ణ ఏకాదశి
నక్షత్రం: ఉత్తరాభద్రపద 23:21:32
వరకు తదుపరి రేవతి
యోగం: ప్రీతి 22:44:59 వరకు
తదుపరి ఆయుష్మాన్
కరణం: విష్టి 10:35:38 వరకు
వర్జ్యం: 08:28:24 - 10:07:28
దుర్ముహూర్తం: 11:46:57 - 12:39:08
రాహు కాలం: 12:13:03 - 13:50:53
గుళిక కాలం: 10:35:12 - 12:13:03
యమ గండం: 07:19:31 - 08:57:22
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:39
అమృత కాలం: 18:22:48 - 20:01:52
సూర్యోదయం: 05:41:41
సూర్యాస్తమయం: 18:44:24
చంద్రోదయం: 02:16:52
చంద్రాస్తమయం: 14:31:04
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: మీనం
లంబ యోగం - చికాకులు, అపశకునం
23:21:32 వరకు తదుపరి ఉత్పాద
యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలతో - హనుమ విశిష్టత 🌹
✍️. రామాయణం శర్మ (బద్రాచలం)
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌻. హనుమ - జననం - పొందిన వరాలు 🌻*
*హనుమంతుని తండ్రి పేరు కేసరి. అంజన ఆ కేసరి యొక్క భార్య. అంజన యొక్క కుమారుడు ఆంజనేయుడు. హనుమంతుడు, అంజనాదేవి గర్భాన - వాయుదేవుడు - శివతేజస్సును ప్రవేశపెట్టడం వలన జన్మించాడు. అందుచేత పవనతనయుడు, మారుతి నందనుడు వంటి పేర్లు కలిగియున్నాడు.*
*🌺. జయంతి: వైశాఖ బహుళ దశమి 🌺*
*🍀. హనుమ పొందిన వరాలు: 🍀*
*శిశువుగా ఉన్నప్పుడే, ఆకలి కలిగియున్నప్పుడు, సూర్యుని ఫలమనుకొని, పొందుటకు ఎగరడం, సూర్యుని వద్డ హనుమను చూచి, రాహువు ఇంద్రునికి ఫిర్యాదు వంటి సందర్భాలలో, ఇంద్రుడు వచ్చి వజ్రాయుధం ప్రయోగించడం సంభవించింది. అప్పుడు ఆ వజ్రాయుధం ఆంజనేయుని దౌడ(హనుమ)కు తగిలి, స్వామి నిర్జీవుడై పడిపోవడం జరిగింది. అది చూసి, వాయుదేవుడు సకల జీవరాశి నుంచి బయటకు వచ్చి సమ్మె చేశాడు. అది తెలిసిన బ్రహ్మదేవుడు, దేవతలతో వచ్చి, ఆంజనేయుని పునర్జీవితుని చేశాడు.*
*వాయువుకి సంతోషం కలిగించడానికీ, భవిష్యత్తులో దేవతల గొప్పకార్యాన్ని మారుతి నిర్వహించడానికీ, దేవతలందఱినీ మారుతికి వరాలిమ్మన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు,*
*1. ఇంద్రుడు: బంగారు పద్మహారమునిచ్చి, హనుమ అని నామమిడి, తన వజ్రాయుధము వలన ఏ హానీ కలుగదన్నాడు.*
*2. సూర్యుడు: తన తేజస్సులో నూఱోవంతు ఇస్తున్నాననీ, శైశవ దశనించీ విద్యార్జన స్థితి రాగానే, సకల శాస్త్ర జ్ఞానాన్నీ కలిగిస్తాననీ, తద్వారా వాక్చతురుడు కాగలడనీ, శాస్త్రజ్ఞానమందు హనుమతో సరితూగగలవాడు మరొకడుండడనీ అన్నాడు.*
*3. వరుణుడు: తన పాశము వలనగానీ, జలముల వలన గానీ, లక్షల కొలది సంవత్సరాల వరకూ మృత్యుభయం ఉండకుండా వరమిచ్చాడు.*
*4. యముడు: తన దండము వలన మృత్యువు కలగదనీ, ఎల్లప్పుడూ ఆరోగ్యభాగ్యాలతో వర్ధిల్లుతాడనీ, యుద్ధమునందు విషాదగ్రస్తుడు కాడనీ మారుతికి వరాలొసగాడు.*
*5. కుబేరుడు: సమరమునందు తన గద ఆంజనేయునికి ఎట్టి ఆపదను కలిగించదన్నాడు.*
*6. శంకరుడు: తన వలన గానీ, శూల పాశుపతాస్త్రాది తన ఆయుధాల వలనగానీ హనుమ వధ్యుడు కాడని వరమనుగ్రహించాడు.*
*7. విశ్వకర్మ: తాను నిర్మించిన దివ్యశస్త్రములలో ఏ ఒక్కటైననూ రణమందు వధింపజాలదనీ, చిరంజీవి అవుతాడనీ హనుమకి వరాలిచ్చాడు.*
*8. బ్రహ్మ: ఏ బ్రహ్మదండం చేతనూ వధ్యుడు కాడనీ, దీర్ఘాయువనీ మారుతికి వరాలిచ్చి, వాయుదేవునితో మారుతిని గూర్చి - శత్రువులను గడగడలాడించగలడనీ, - మిత్రులకు అభయప్రదాత అవుతాడనీ, - యుద్ధంలో శత్రువులకు అజేయుడై వర్ధిల్లుతాడనీ, - కోరుకొన్న రూపాలను పొందగలడనీ, - ఇష్టానుసారంగా అంతటా - వేగంగానూ, నెమ్మదిగానూ సంచరింపగలడనీ, - చిరస్థిరకీర్తితో వర్ధిల్లగలడనీ, - యుద్ధము నందు అతడొనర్చే వీరోచిత సాహసాద్భుత కృత్యాలన్నీ రావణ సంహారానికి కారకాలవుతూ, అవి రామునకు ప్రియము గూర్చుతాయనీ, లోకాలకు రోమాంచమునూ సంతోషాన్నీ కలిగిస్తాయనీ పేర్కొన్నాడు.*
*ఆ విధంగా సకల వరాలూ పొందిన శిశువైన మారుతిని, వాయుదేవుడు అంజనాదేవి వద్దకు తీసుకువచ్చి, ఆమెకు అప్పగించి, వరాలగూర్చి వివరించి వెళ్ళాడు. జాంబవంతుడు హనుమ శక్తిని పొగిడి సముద్ర లంఘనం చేయించాడు.*
*హనుమానంజనానూను: వాయుపుత్రోమహాబలః*
*రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమః*
*ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః*
*లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా*
*ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః*
*స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః*
*తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్*
*మనం కూడా స్వామిని స్తుతిస్తే సకల శుభాలూ కలిగిస్తాడు. ప్రతిరోజూ ఆరాధిస్తూ, సకల శాస్త్ర పారంగతుడూ, సర్వశక్తిమంతుడూ అయిన హనుమని సేవిద్దాం. మన జీవిత లక్ష్యాలని నెరవేర్చుకొందాం. హనుమతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.*
*🌸.జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ - జై హనుమాన్ జై జై హనుమాన్ 🌸*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 13 / Kapila Gita - 13🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴. కపిల భగవానుని స్వీయ సాక్షాత్కార జ్ఞాన వివరణ - 2 🌴*
*13. శ్రీభగవానువాచ*
*యోగ ఆధ్యాత్మికః పుంసాం మతో నిఃశ్రేయసాయ మే*
*అత్యన్తోపరతిర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ*
*శరీరము కన్నా భిన్నమైన ఆత్మ ఒకటి ఉన్నది అని తెలుసుకోవడం జ్ఞ్యాన యోగం. ప్రతీ జీవికి ఉపయోగించేది ఇదే. జ్ఞ్యాన యోగం మాత్రమే జీవునికి మోక్షం రావడానికి ఉపయోగిస్తుందని నా సిద్ధాంతం. ఇలాంటి జ్ఞ్యాన యోగాన్ని అభ్యసిస్తే కలిగే లాభం, దుఖఃఅమూ సుఖమూ ఉండదు. సుఖాభిలాష దు@ఖాభిలాషా రెండూ ఉండవు.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 13 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*
*🌴 Lord Kapila Begins to Explain Self-realization - 2 🌴*
*13. sri-bhagavan uvaca*
*yoga adhyatmikah pumsam mato nihsreyasaya me*
*atyantoparatir yatra duhkhasya ca sukhasya ca*
*The Personality of Godhead answered: That yoga system which relates to the Lord and the individual soul, which is meant for the ultimate benefit of the living entity, and which causes detachment from all happiness and distress in the material world, is the highest yoga system.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
#కపిలగీతKapilaGita
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 569 / Sri Siva Maha Purana - 569 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴*
*🌻. పతివ్రతా ధర్మములు - 7 🌻*
ఓ పార్వతీ! నీకీ విధముగా పతివ్రతా ధర్మమును వర్ణించితిని. ఇపుడు నేను పతివ్రతలలోని భేదములను వర్ణించెదను. ప్రీతితో సావధానముగా వినుము (71). ఓ దేవీ! స్మరించి నంతనే పాపములను పోగొట్టే పతివ్రతలు ఉత్తమ మొదలగు భేదముచే నాల్గు తెరంగుల నున్నారని పెద్దలు చెప్పెదరు (72). ఉత్తమ, మధ్యమ, నికృష్ట, అతని కృష్ట అను నాల్గు విధముల పతివ్రతల లక్షణములను చెప్పెదను. సావధానముగా వినుము (73). ఓ మంగళ స్వరూపరాలా! ఏ స్త్రీ యొక్క మనస్సు నిత్యము స్వప్నములోనైనూ తన భర్తనే నిశ్చితముగా చూచునో, పరపురుషుని చూడదో, ఆమె ఉత్తమ అని చెప్ప బడినది (74).
ఓ పార్వతీ! ఏ స్త్రీ పరపురుషుని సద్బుద్ధితో తండ్రిని వలెగాని, సోదరుని వలెగాని, కుమారుని వలె గాని దర్శించునో, ఆమె మధ్యమ పతివ్రత అనబడును (75). ఓ పార్వతీ! స్వధర్మమును ఎరింగి మనస్సు చేననైననూ వ్యభిచరించని సుశీలయగు స్త్రీ నికృష్టపతివ్రత యనబడును (76). భర్త ఇంటిలో వారికి భయపడి వ్యభిచరించని స్త్రీ అధమ పతివ్రత యగునని ప్రాచీన విద్వాంసులు చెప్పెదరు (77). ఓ పార్వతీ ! ఈ నాల్గు విధముల పతివ్రతలు కూడా పాపములను పోగొట్టి, మానవులందరినీ పవిత్రులను చేసి ఇహపర సుఖముల నొసంగెదరు (78).
అత్రి భార్యయగు అనసూయ పాతివ్రత్య ప్రభావముచే త్రిమూర్తుల నర్థించి వారాహ శాపముచే మరణించిన బ్రాహ్మణుని ఒకనిని జీవింప చేసినది (79). ఓ పార్వతీ! నీవీ
సత్యము నెరింగి సర్వదా సర్వకామనల నీడేర్చు పతి సేవను ప్రీతితో ప్రతిదినము చేయవలెను (80). నీవు జగన్మాతవగు మహేశ్వరివి. నీ భర్త సాక్షాత్తుగా ఆ శివుడే. నిన్ను స్మరించు స్త్రీలు పతివ్రతలగుదురు (81). ఓ శివాదేవీ! ఈ ధర్మములను నీకు చెప్పబని యేమున్నది? అయిననూ, ఈనాడు లోకాచారముననుసరించి నీకు చెప్పి యుంటిని (82).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఆ బ్రాహ్మణస్త్రీ ఆమెతో ఇట్లు పలికి విరమించెను. శంకరునకు ప్రియురాలు, పర్వతునకు కుమార్తె యగు శివాదేవి ఆమెకు ప్రణమిల్లి మహానందమును పొందెను (83).
శ్రీ శివ మహాపురాణములో పతివ్రతా ధర్మవర్ణనమనే ఏబది నాల్గవ అధ్యాయము ముగిసినది (54).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 569 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 54 🌴*
*🌻 Description of the duties of the chaste wife - 7 🌻*
71. O daughter of the lord of mountains, thus the duty of a chaste wife is described to you. Now, listen to their classifications with attention and love.
72. O gentle lady, the chaste ladies can be divided into four classes. Even when they are remembered they dispel sins. The divisions comprise of the superior etc.
73. They are superior, middling, inferior and very inferior. I shall explain their characteristics. Listen with attention.
74. O gentle lady, she whose mind is not aware of any one else and who is conscious of her husband even in her dreams is the noblest of all.
75. O daughter of the mountain, she who sees another man as her father, brother or son with a clean conscience is the middling among chaste ladies.
76. O Pārvatī, she who ponders over her duty mentally and desists from going astray is inferior among the chaste. Of course she is pure in conduct.
77. She who remains chaste for fear of her husband or the family is very inferior among the chaste ladies, so say the ancient poets.
78. O Pārvatī, these four types of chaste ladies dispel sins. They sanctify all the worlds. They are delighted here and hereafter.
79. A brahmin who died due to the curse of Varāha (Boar), was at the request of the three deities, resuscitated by Atri’s wife (Anasūyā), thanks to the power of chastity.
80. O Śiva, O daughter of the mountain, knowing this well, you shall render service to your husband every day with pleasure as it bestows all desires.
81. You are the Goddess and the mother of the universe. Śiva Himself is your husband. By remembering you women become chaste.
82. O Pārvatī, O gentle lady, what avails mentioning all this to you. Still I mention this just to follow the worldly convention.
Brahmā said:—
83. Saying this, the brahmin lady stopped and bowed to her. Pārvatī, the beloved of Śiva, derived great pleasure.
Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 53 / Agni Maha Purana - 53 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 19*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*🌻. కశ్యప వంశ వర్ణనము - 3 🌻*
హరియు, బ్రహ్మయు, పృథువును రాజ్యాభిషిక్తుని చేసి దీని నంతను ఆతని కిచ్చిరి. ప్రభువైన హరి క్రమముగా ఇతరులకు ఆయా రాజ్యాధికారముల నిచ్చెను.
బ్రాహ్మణులకును, ఓషధులకును చంద్రుడు రాజు, జలములకు కరుణుడు, రాజులకు వైశ్రవణుడు, సూర్యులకు విష్ణువు, వసువులకు అగ్ని, మరుత్తులకు ఇంద్రుడు,
ప్రజాపతులకు దక్షుడు, దానవులకు ప్రహ్లాదుడు, పితృదేవతలకు యముడు, భూతాదులకు శివుడు, శైలములకు హిమవంతుడు, నదులకు సముద్రుడు,
గంధర్వులకు చిత్రరథుడు, నాగులకు వాసుకి, సర్పములకు తక్షకుడు, పక్షులకు గరుత్మంతుడు, గజేంద్రములకు ఐరావతము, గోవులకు వృషభము, మృగములకు పులి,
వనస్పతులకు ప్లక్షము, అశ్వములకు ఉచ్ఛైఃశ్రవము ప్రభువలు తూర్పున సుధన్వ, దక్షిణమున శంఖపదుడు, పశ్చిమమున కేతుమంతుడు, ఉత్తరమున హిరణ్యరోమకుడును పాలకులు ఈ విధముగ అవాంతర సృష్టి (ప్రతి సర్గము ) చెప్పబడినది.
అగ్ని మహాపురాణమున ప్రతి సర్గవర్ణనమను ఏకోనవింశా ధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 53 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *
*Chapter 19*
*🌻 The progeny of Kaśyapa - 3 🌻*
22. All these (are) forms of Hari. Having installed Pṛthu as the ruler, Hari duly set apart kingdoms for others.
23. The moon (was made the king) of the twice-born and the plants, Varuṇa (as) the king of waters, Vaiśravaṇa (Kubera) (as) the king of kings, Viṣṇu (as) the lord of Suns.
24. Pāvaka (fire) as the king of Vasus; Vāsava (Indra) (as) the lord of Maruts and then Dakṣa (as the king) of Prajāpatis (patriarchs), Prahlāda (as) the ruler of demons.
25. Yama (was made) the king of manes, Hara (Siva) (as) the lord of goblins, Himavat (as the ruler) of mountains, the ocean (as) the lord of rivers.
26. Citraratha (was made the ruler) of Gandharvas, and then Vāsuki (as the ruler) of Nāgas, Takṣaka (as) the king of serpents, and then Garuḍa, among the birds.
27. The Airāvata (was made the ruler) among the lords of elephants, bull of the kine and the tiger, of the animals, (and) Plakṣa (the Indian fig-tree) (as) the lord of trees.
28. And Uccaiḥśravas (was made the ruler) among the horses.[6] Sudhanvan (son ofVairāja Prajāpati) became the regent of the east, Śaṅkhapād (the son of Kardama Prajāpati) (the regent) of the south, Ketumat (son of Rajas) as the protector of the waters (on the west), Hiraṇyaromaka (son of Parjanya Prajāpati) on the Saumya (the north).
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 188 / Osho Daily Meditations - 188 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*
*🍀 188. బలహీనత మరియు బలము 🍀*
*🕉. బలహీనంగా లేనప్పుడు మాత్రమే బలంగా భావించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ ఆ బలం కేవలం ముఖభాగం, మభ్యపెట్టడం. బలహీనంగా ఉండి దానిని గుర్తించి అధిగమించే వ్యక్తులూ ఉన్నారు. 🕉*
*బలహీనంగా ఉన్నప్పుడు బలహీనంగా భావించే వారు ఎక్కువ కాలం దుర్బలంగా భావించ లేరు: త్వరలో ఆ బలహీనత వారిని చాలా భయపడేలా చేస్తుంది, వారు మూసి వేయబడతారు. కాబట్టి సరైన విధానం బలహీనంగా ఉన్నప్పుడు బలమైన అనుభూతి పొందడం. అప్పుడు మీరు దుర్బలంగా ఉండగలరు కానీ ప్రతిరోజూ మీ బలం పెరుగుతుంది. మీరు మరింత దుర్బలంగా మారడానికి ధైర్యంగా ఉంటారు. నిజంగా ధైర్యవంతుడు ఖచ్చితంగా బహిరంగంగా ఉంటాడు. అదే ధైర్యానికి ప్రమాణం. పిరికివాడు మాత్రమే మూసివేయ బడతాడు మరియు బలమైన వ్యక్తి రాయిలా బలంగా ఉంటాడు మరియు గులాబీలా సున్నితత్వాన్ని కలిగి ఉంటాడు, ఇది ఒక వైరుధ్యం-మరియు వాస్తవమైనదంతా విరుద్ధమైనది.*
*కాబట్టి ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి: మీరు ఏదైనా విరుద్ధమైనదిగా భావించినప్పుడు, దానిని స్థిరంగా చేయడానికి ప్రయత్నించవద్దు, ఎందుకంటే ఆ స్థిరత్వం తప్పుగా ఉంటుంది. నిజమైన వాస్తవికత ఎల్లప్పుడూ విరుద్ధమైనది: ఒక వైపు మీరు బలహీనంగా భావిస్తారు, మరోవైపు మీరు బలంగా భావిస్తారు. అంటే సత్యం యొక్క క్షణం వచ్చిందని తెలుసుకుంటారు. ఒక వైపు మీకు ఏమీ తెలియదని మీరు భావిస్తారు, మరోవైపు మీకు అంతా తెలుసు అని మీరు భావిస్తారు-సత్యం యొక్క క్షణం వచ్చేసింది అని. ఒక వైపు మీరు ఎల్లప్పుడూ ఒక కోణాన్ని అనుభవిస్తారు, మరోవైపు ఖచ్చితమైన వ్యతిరేక కోణాన్ని అనుభవిస్తారు. మీరు ఈ రెండు అంశాలను ఏక కాలంలో కలిగి ఉన్నప్పుడు, ఏదైనా సత్య విషయం చాలా దగ్గరగా ఉందని గుర్తుంచుకోండి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 188 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 188. VULNERABLE & STRONG 🍀*
*🕉 There are people who feel strong only when they are not vulnerable; but that strength is just a facade, a camouflage. Then there are people who are vulnerable but feel weak. 🕉*
*Those who feel weak when they are vulnerable cannot feel vulnerable for long: Sooner or later that weakness will make them so afraid that they will close up. So the right approach is to feel vulnerable and strong. Then you can remain vulnerable and each day your strength will grow, and you will become courageous enough to become more and more vulnerable. A really brave person is absolutely open-that is the criterion of courage. Only a coward is closed, and a strong person is as strong as a rock and as vulnerable as a rose, it is a paradox-and all that is real is paradoxical.*
*So always remember: When you feel something paradoxical, don't try to make it consistent, because that consistency will be false. Reality is always paradoxical: On the one hand you feel vulnerable, on the other hand you feel strong-that means a moment of truth has arrived. On the one hand you feel you don't know anything, on the other hand you feel you know all-a moment of truth has arrived. On the one hand you always feel one aspect, and on the other hand the exact opposite aspect, and when you have both these aspects together, always remember that something true is very close by.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://oshodailymeditations.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 374 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 374 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।*
*శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀*
*🌻 374 -1. 'కృతజ్ఞా'🌻*
*కృత జ్ఞానము కలది శ్రీదేవి అని అర్ధము. ‘కృత జ్ఞాన’ మనగా క్రియా జ్ఞానము. క్రియాశక్తి వలననే సమస్తము అవతరించును. చేయుటకు జ్ఞానము కావలెను. ఏమి చేయవలెనో తెలియవలెను. క్రియా జ్ఞానము నందు ఇచ్ఛా జ్ఞానము లిమిడి యుండును. పరహితము చేయవలెను అనునది ఇచ్ఛ. ఎట్లు చేయవలెనో తెలియక చేసినచో పరహిత ఇచ్ఛ ఫలించదు. ఎట్లు చేయవలెనో తెలిసిననూ కూడ చేయుట జరగనిచో ఫలించదు. ఏమి చేయవలెనో తెలియుట చాలదు. ఎట్లు చేయవలెనో తెలిసిననూ చాలదు. చేయవలెను కదా! కేవలము చేయుట తెలిసి, ఎట్లు చేయ వలెనో తెలియనిచో ఫలము లేదు. ఏమి చేయవలెనో తెలియనిచో కూడ ఫలము లేదు.*
*ఇట్లు ఇచ్ఛా జ్ఞానములను తెలిసి చేయుటయే జ్ఞానము. అట్టి జ్ఞానము యొక్క స్వరూపమే శ్రీదేవి. కనుకనే ఆమె సృష్టి నిర్వహణమును నైపుణ్యముతో నిర్వర్తించు చుండును. పరమశివుడు జ్ఞాన స్వరూపుడు. అతడెప్పుడునూ తపస్సునందే యుండును. క్రియయం దాసక్తి తక్కువ. అత్యవసరమైనచో గాని క్రియలోనికి దిగిరాడు. అట్టి శివునితో శ్రీమాత క్రీడాప్రాయముగ జూదమాడునట. శ్రీమాత క్రియా జ్ఞానము కలది గనుక సర్వదా శివుని జయించు చుండెడిదట. శివుడు కూడ శ్రీమాత గెలుపును గమనించి సంతసించెడి వాడట. ఇది శ్రీమాత క్రియా జ్ఞానమునకు తార్కాణము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 374 -1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 82. Kameshari prananadi krutagyna kamapujita*
*Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻*
*🌻 374-1. Kṛtajñā कृतज्ञा🌻*
*She is aware of all the actions of the universe. She is capable of transcending the secrecy or privacy, which ignorant men think that nobody is capable of hearing or seeing (recollect those two swans).*
*There are nine witnesses to all our actions. They are sun, moon, the lord of death (Yama), time (kala) and five basic elements ākāś, air, fire, water and earth. All these nine are under the control of Śaktī and that is why She is said to be the witness to all the actions of the universe. This can also be interpreted as ‘she is the one who imparts knowledge’.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Subscribe to:
Posts (Atom)