శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 374 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 374 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 374 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 374 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।
శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀

🌻 374 -1. 'కృతజ్ఞా'🌻


కృత జ్ఞానము కలది శ్రీదేవి అని అర్ధము. ‘కృత జ్ఞాన’ మనగా క్రియా జ్ఞానము. క్రియాశక్తి వలననే సమస్తము అవతరించును. చేయుటకు జ్ఞానము కావలెను. ఏమి చేయవలెనో తెలియవలెను. క్రియా జ్ఞానము నందు ఇచ్ఛా జ్ఞానము లిమిడి యుండును. పరహితము చేయవలెను అనునది ఇచ్ఛ. ఎట్లు చేయవలెనో తెలియక చేసినచో పరహిత ఇచ్ఛ ఫలించదు. ఎట్లు చేయవలెనో తెలిసిననూ కూడ చేయుట జరగనిచో ఫలించదు. ఏమి చేయవలెనో తెలియుట చాలదు. ఎట్లు చేయవలెనో తెలిసిననూ చాలదు. చేయవలెను కదా! కేవలము చేయుట తెలిసి, ఎట్లు చేయ వలెనో తెలియనిచో ఫలము లేదు. ఏమి చేయవలెనో తెలియనిచో కూడ ఫలము లేదు.

ఇట్లు ఇచ్ఛా జ్ఞానములను తెలిసి చేయుటయే జ్ఞానము. అట్టి జ్ఞానము యొక్క స్వరూపమే శ్రీదేవి. కనుకనే ఆమె సృష్టి నిర్వహణమును నైపుణ్యముతో నిర్వర్తించు చుండును. పరమశివుడు జ్ఞాన స్వరూపుడు. అతడెప్పుడునూ తపస్సునందే యుండును. క్రియయం దాసక్తి తక్కువ. అత్యవసరమైనచో గాని క్రియలోనికి దిగిరాడు. అట్టి శివునితో శ్రీమాత క్రీడాప్రాయముగ జూదమాడునట. శ్రీమాత క్రియా జ్ఞానము కలది గనుక సర్వదా శివుని జయించు చుండెడిదట. శివుడు కూడ శ్రీమాత గెలుపును గమనించి సంతసించెడి వాడట. ఇది శ్రీమాత క్రియా జ్ఞానమునకు తార్కాణము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 374 -1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 82. Kameshari prananadi krutagyna kamapujita
Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻

🌻 374-1. Kṛtajñā कृतज्ञा🌻

She is aware of all the actions of the universe. She is capable of transcending the secrecy or privacy, which ignorant men think that nobody is capable of hearing or seeing (recollect those two swans).

There are nine witnesses to all our actions. They are sun, moon, the lord of death (Yama), time (kala) and five basic elements ākāś, air, fire, water and earth. All these nine are under the control of Śaktī and that is why She is said to be the witness to all the actions of the universe. This can also be interpreted as ‘she is the one who imparts knowledge’.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


25 May 2022

No comments:

Post a Comment