మైత్రేయ మహర్షి బోధనలు - 78

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 78 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 64. అసత్య భాషణము 🌻

అసత్య భాషణము, భాషించు వానిని క్రమముగ క్రుంగతీయును. జీవితము బరువెక్కుచుండును. పలికిన ప్రతి అసత్యము ఏనుగంత బరువై బ్రతుకు భారముగ చేయును. అట్టి భాషణము

వలన వ్యక్తిగత కర్మము విపరీతముగ పెరుగును. దాని ఫలితము జీవుని స్వభావమున పాదుకొని జన్మ జన్మలు వెంబడించును. దానికి సంబంధించిన కర్మ భవిష్యత్తున ఆపదయై తారసిల్లును.

అసత్య భాషణము యొక్క ఫలములను తెలిసినవాడు అసత్య మాడుటకు భయపడును. తెలియనివాడు అసత్యమాడుచు జీవితమును క్లిష్టపరచుకొనును. తెలిసియు ఆచరింపని వాడు మూర్ఖుడు. అన్ని దోషముల యందు అసత్యదోషము జీవుల నెక్కువగా బాధించునని తెలియవలెను.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

24 Feb 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 141

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 141 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మీరు నిజమైన ప్రార్థనని నేర్చుకోవాలి. అది నిశ్శబ్దాన్ని నింపుకున్నది. దాంట్లో గాఢమయిన వినడమన్నది వుంది. దేవుడు నీకు ఏదో చెప్పాలనుకుంటాడు. నీ కోసం వెతుకుతాడు. కానీ నువ్వు కనిపించవు. కారణం బాగా బిజీగా వుంటావు. నిశ్శబ్దంగా వుండు. 🍀

ప్రార్థన అంటే దేవుడితో ఏదో చెప్పడం కాదు. ఏదో అడగటం కాదు. ప్రార్థన అంటే దేవుణ్ణి 'వినడం' నువ్వు చెప్పేది ఏదయినా వుంటే అది కేవలం కృతజ్ఞతే కేవలం ఒక ఆమోదం చాలు. సంస్థాగతమయిన మతాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అనవసరమైన ప్రార్థనల్ని బోధిస్తాయి. ప్రజలు ఆ ప్రార్థనల్ని పునశ్చరణ చేస్తూ వుంటారు. చిలక పలుకులు పలుకుతారు. వాళ్ళకు అర్థం తెలీదు. కేవలం ఆచార కర్మ కాండల్ని జరుపుతారు.

మీరు నిజమైన ప్రార్థనని నేర్చుకోవాలి. అది నిశ్శబ్దాన్ని నింపుకున్నది. దాంట్లో గాఢమయిన వినడమన్నది వుంది. దేవుడు నీకు ఏదో చెప్పాలనుకుంటాడు. నీ కోసం వెతుకుతాడు. కానీ నువ్వు కనిపించవు. కారణం బాగా బిజీగా వుంటావు. నిశ్శబ్దంగా వుండు. మరింత మరింతగా విశ్రాంతిగా వుండు. అప్పుడు, నువ్వు నిశ్చలమైన చిన్ని శబ్దాన్ని నీలోలోపల వింటావు. దేవుడు బయటి నించి మాట్లాడడు. నీ లోలోతుల నించీ మాట్లాడతాడు. అతను అప్పటికే అక్కడున్నాడు. నీ అంతరాంతరాలతో నువ్వు సంబంధమేర్పరచు కోవడమే నిజమైన ప్రార్ధన. నువ్వు సంబంధ మేర్పరచుకున్న క్షణం.. ఆ క్షణం ఆనందదాయకం, ఎంత పరవశమయ క్షణమంటే నువ్వు అప్పుడు కృతజ్ఞతతో తలవంచుతావు.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

24 Feb 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 10 / Agni Maha Purana - 10

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 10 / Agni Maha Purana - 10 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 4

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. వరాహావతార వర్ణనము - 1 🌻

అగ్ని దేవుడు పలికెను : పాపములను నశింపచేయు వరాహావతారమును గూర్చి చెప్పెదను. హిరణ్యాక్షుడనెడు రాక్షసరాజు ఉండెను. అతడు దేవతలను జయించి స్వర్గలోకములో నివసించెను. యజ్ఞస్వరూపు డగు విష్ణువును దేవత లందరును వచ్చి స్తుతింపగా ఆ హరి వరాహరూపము ధరించి, లోకకంటకు డైన ఆ దానవుని దైత్యులతోకూడ ఆశ్చర్యకర మగు విధమున సంహరించి, ధర్మమును దేవతలు మొదలగువారిని రక్షించి అంతర్థానము చెందెను.

హిరణ్యాక్షుని సోదరుడైన హిరణ్యకశిపుడు దేవతల యజ్ఞభాగములను అపహరించి దేవతలందరిపైనను అధికారమును జరిపెను. విష్ణువు దేవతాసమేపతుడై (వెళ్లి) నరసింహరూపము దాల్చి ఆ హిరణ్యకశిపుని సంహరించెను. దేవతలచే స్తుతింపబడిన ఆ నరసింహుడు దేవతలను తమతమ స్థానములలో నిలిపెను. పూర్వము దేవాసుర యుద్దమునందు బలి మొదలగువారిచే సురులు పరాజితులై, స్వర్గమును కోల్పోయిరి. వారు అపుడు హరిని శరణుజొచ్చిరి.

విష్ణువు దేవతలకు అభయ మిచ్చి, అదితికశ్యపులు తనను స్తుతింపగా ఆదితియందు వామనుడగ జన్మించెను. ఆ వామనుడు శోభాయుక్తముగ యజ్ఞము చేయుచున్న బలి చక్రవర్తి యజ్ఞమునకు వెళ్లి అచట రాజద్వారమునందు వేదమును పఠించెను. బలి వేదములను పఠించుచున్న ఆ వామనుని చూచి, ఆతడు కోరు కరముల నీయవలెనని నిశ్చయించుకొని, శుక్రాచార్యుడు నివారించుచున్నను, ఆతనితో '' నీ కేమి కావలెనో కోరుకొనుము; ఇచ్చెదను '' అని పలికెను. వామనుడు బలితో ఇట్లనెను : ''మూడు అడుగుల నిమ్ము; నా గురువునకు కావలెను''. బలి ''అట్లె ఇచ్చెదను'' అని పలికెను.

దానజలము చేతిలో పడగానే వామనుడు అవామనుడ (పెద్ద శరీరము కలవాడు) ఆయెను. భూలోక-భువర్లోక-స్వర్లోకములను మూడడుగులుగా గ్రహించి బలిని సుతలమునకు త్రొక్కివేసెను. వామనరూపుడైన హరి ఆ లోక త్రయమును దేవేంద్రున కిచ్చెను. దేవతాసహితు డగు ఇంద్రుడ హరిని స్తుతించి, త్రిభువనాధీశుడై సుఖముగా నుండెను.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 10 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

🌻 Chapter 4 - Manifestations of Viṣṇu as the Boar - 1 🌻

Agni said:

1. I describe (unto thee) the manifestation as a Boar (which) removes (one’s) sins. Hiraṇyākṣa[1] was a demon chief. He conquered the celestials and got established in the heavens.

2. Viṣṇu being praised by the celestials (who had) gone (to him), (he) assumed the form as Yajñavarāha (boar). Having killed that demon along with the (other) demons (he made the earth) devoid of thorns (difficulties).

3-4. (That) Hari, the protector of righteousness and the celestials (then) disappeared. Then (the demon) Hiraṇyakaśipu[2], brother of Hiraṇyākṣa after conquering the celestials (was grabbing a share of the offerings) exercised control over all the celestials. (Viṣṇu) assumed the form of Narasiṃha (human body with lion’s face) (and) killed him along with the (other) demons.

5-7. (He) re-established the celestials in their original places and was praised by the celestials. Once in the battle between the celestials and the demons, the celestials were defeated by (demon) Bali[3] and other demons (and) were driven away from the heaven (and) sought refuge in Hari (Viṣṇu). Having given refuge to the devas he being praised by Aditi (wife of the latter) (and mother of the celestials) and Kaśyapa (a sage) became a Dwarf (as a son) of Aditi (and) went to the sacrifice (performed by Bali) (and) recited the Vedas at the royal gates of Bali the sacrificer.

8-9. Having heard him reciting the Vedas, the bestower of the wanted things (Bali) said to the Dwarf in spite of being obstructed by Sukra (the preceptor of the demons), “Whatever (you) desire I shall give (you)”. The Dwarf asked Bali, “Get (me) three feet of space for the sake of the preceptor. (Bali) said to him, “I shall give (you)”.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

24 Feb 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 561 / Vishnu Sahasranama Contemplation - 561

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 561 / Vishnu Sahasranama Contemplation - 561🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 561. వనమాలీ, वनमाली, Vanamālī 🌻

ఓం వనమాలినే నమః | ॐ वनमालिने नमः | OM Vanamāline namaḥ

వనమాలీ, वनमाली, Vanamālī

భూతతన్మాత్ర రూపాం తామ్ వైజయన్త్యాహ్వయాం హరిః ।
వనమాలాం వహన్ వనమాలీతి హరిరుచ్యతే ॥

వనమాల అనగా వైజయంతీ నామక మాల ఈతనికి కలదు. పంచభూత తన్మాత్రారూపమగు వైజయంతీ మాలను వహించి యుండు వాడు గనుక ఆ హరి 'వనమాలీ'.

:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::

సీ.హార కిరీట కేయూర కంకణ ఘన భూషణుం డాశ్రిత పోషణుండులాలిత కాంచీకలాప శోభిత కటి మండలుం డంచిత కుండలుండుమహనీయ కౌస్తుభమణి ఘృణిచారు గ్రైవేయకుం డానంద దాయకుండుసలలిత ఘన శంఖ చక్ర గదా పద్మ హస్తుండు భువన ప్రశస్తుఁ డజుఁడుతే.గమ్ర సౌరభ వనమాలికా ధరుండు, హతవిమోహుండు నవ్యపీతాంబరుండులలిత కాంచన నూపురాలంకృతుండు, నిరతిశయసద్గుణుఁడు దర్శనీయతముఁడు. (251)

ఆ హరి హారాలు, కిరీటం, భుజకీర్తులు మొదలైన అలంకారాలతో అలరారుతుంటాడు. ఆయన కటిప్రదేశం అందమైన మొలనూలు చేత ప్రకాశిస్తుంటుంది. ఆయన చెవులకు మకరకుండలాలు ధరిస్తాడు. కౌస్తుభం అనే గొప్ప మణి కాంతులతో కమనీయమైన కంఠమాలికను ధరిస్తాడు. ఆయన ఆనందాన్ని కలిగించేవాడు. శంఖం, చక్రం, గద, పద్మం అనే నాలుగింటినీ నాలుగు చేతులతో పట్టుకొని ఉంటాడు. ఆయన లోకాలలో ప్రశస్తికెక్కినవాడు. పుట్టుక లేనివాడు. కమ్మని సువాసనగల వనమాలను మెడలో వేసుకుంటాడు. ఆ హరి అజ్ఞానాన్ని పొగొట్టేవాడు. సరిక్రొత్త పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించి ఉంటాడు. మేలిమి బంగారు అందియలు ఆయన కాళ్ళకు అలంకరింపబడి ఉంటాయి. గొప్ప సద్గుణాలు కలవాడు. చూడదగిన వారిలో అగ్రగణ్యుడు. భక్తజన శరణ్యుడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 561🌹

📚. Prasad Bharadwaj

🌻 561. Vanamālī 🌻

OM Vanamāline namaḥ

भूततन्मात्ररूपां ताम् वैजयन्त्याह्वयां हरिः ।
वनमालां वहन् वनमालीति हरिरुच्यते ॥

Bhūtatanmātrarūpāṃ tām vaijayantyāhvayāṃ hariḥ,
Vanamālāṃ vahan vanamālīti harirucyate.

Since Lord Hari wears the Vanamāla or floral wreath - called Vaijayanti made out of the tanmatrās or categories of five subtle elements, He is called Vanamālī.

:: श्रीमद्भागवते चतुर्थ स्कन्धे सप्तमोऽध्यायः ::

वक्षस्यधिश्रितवधूर्वनमाल्युदार हासावलोककलया रमयंश्चविश्वम् ।
पार्श्वभ्रमद्व्यजनचामरराजहंसः श्वेतातपत्रशशिनोपरि रज्यमानः ॥ २१ ॥

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 7

Vakṣasyadhiśritavadhūrvanamālyudāra hāsāvalokakalayā ramayaṃścaviśvam,
Pārśvabhramadvyajanacāmararājahaṃsaḥ śvetātapatraśaśinopari rajyamānaḥ. 21.

Lord Vis‌n‌u looked extraordinarily beautiful because the goddess of fortune and a garland were situated on His chest. His face was beautifully decorated with a smiling attitude which can captivate the entire world, especially the devotees. Fans of white hair appeared on both sides of the Lord like white swans and the white canopy overhead looked like the moon.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

भगवान् भगहाऽऽनन्दी वनमाली हलायुधः ।
आदित्यो ज्योतिरादित्यस्सहिष्णुर्गतिसत्तमः ॥ ६० ॥

భగవాన్ భగహాఽఽనన్దీ వనమాలీ హలాయుధః ।
ఆదిత్యో జ్యోతిరాదిత్యస్సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥

Bhagavān bhagahā’’nandī vanamālī halāyudhaḥ,
Ādityo jyotirādityassahiṣṇurgatisattamaḥ ॥ 60 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

24 Feb 2022

శ్రీ జానకి మాత జయంతి - Sri Janaki Mata Jayanthi

🌹. శ్రీ జానకి మాత జయంతి శుభాకాంక్షలు అందరికి - Sri Janaki Mata Jayanthi Wishes to all 🌹

ప్రసాద్ భరద్వాజ

🍀. శ్రీ జానకీ స్తుతి 🍀

1. జానకి త్వాం నమస్యామి సర్వపాపప్రణాశినీమ్ ॥ ౧॥

2. దారిద్య్రరణసంహత్రీం రణసంహత్రీం భక్తానాభిష్టదాయినీమ్ ।
విదేహరాజతనయాం రాఘవానన్దకారిణీమ్ ॥ ౨॥

భూమేర్దుహితరం విద్యాం నమామి ప్రకృతిం శివామ్ ।
పౌలస్త్యైశ్వర్యసన్త్రీ భక్తాభీష్టాం సరస్వతీమ్ ॥ ౩॥

పతివ్రతాధురీణాం త్వాం నమామి జనకాత్మజామ్ ।
అనుగ్రహపరామృద్ధిమనఘాం హరివల్లభామ్ ॥ ౪॥

ఆత్మవిద్యాం త్రయీరూపాముమారూపాం నమామ్యహమ్ ।
ప్రసాదాభిముఖీం లక్ష్మీం క్షీరాబ్ధితనయాం శుభామ్ ॥ ౫॥

నమామి చన్ద్రభగినీం సీతాం సర్వాఙ్గసున్దరీమ్ ।
నమామి ధర్మనిలయాం కరుణాం వేదమాతరమ్ ॥ ౬॥

పద్మాలయాం పద్మహస్తాం విష్ణువక్షస్థలాలయామ్ ।
నమామి చన్ద్రనిలయాం సీతాం చన్ద్రనిభాననామ్ ॥ ౭॥

ఆహ్లాదరూపిణీం సిద్ధి శివాం శివకరీ సతీమ్ ।
నమామి విశ్వజననీం రామచన్ద్రేష్టవల్లభామ్ ।

సీతాం సర్వానవద్యాఙ్గీం భజామి సతతం హృదా ॥ ౮॥

🌻 🌻 🌻 🌻 🌻

🍀 Shri Janaki Stuti 🍀

O Devi Janaki, I salute You; You are the destroyer of all Sins 1

(I Salute You) You are the destroyer of Poverty (in the battle of life) and bestower of wishes of the Devotees,

(I Salute You) You are the daughter of Videha Raja (King Janaka), and cause of Joy of Raghava (Sri Rama) 2

Salute You, You are the daughter of the Earth and the embodiment of Knowledge; You are the Auspicious Prakriti,

(I Salute You) You are the destroyer of the Power and Supremacy of (oppressors like) Ravana, (and at the same time) fulfiller of the wishes of the Devotees; You are an embodiment of Saraswati 3

Salute You, You are the best among Pativratas (Ideal Wife devoted to Husband), (and at the same time) the Soul of Janaka (Ideal Daughter devoted to Father),

(I Salute You) You are very Gracious (being Yourself the embodiment of) Riddhi (Lakshmi), (Pure and) Sinless, and extremely Beloved of Hari 4

Salute You, You are the embodiment of Atma Vidya, mentioned in the Three Vedas (Manifesting its Inner Beauty in Life); You are of the nature of Devi Uma,

(I Salute You) You are the Auspicious Lakshmi, the daughter of the Milky Ocean, and always intent on bestowing Grace (to the Devotees) 5

Salute You, You are like the sister of Chandra (in Beauty), You are Sita Who is Beautiful in Her entirety,

(I Salute You) You are an Abode of Dharma, full of Compassion and the Mother of Vedas 6

(I Salute You) (You as Devi Lakshmi) Abide in Lotus, hold Lotus in Your Hands, and always reside in the Heart of Sri Vishnu,

I Salute You, You reside in Chandra Mandala, You are Sita Whose Face resembles the Moon 7

(I Salute You) Your Form gives Joy to all, You are the Sati (Devoted Wife) Whose presence is Auspicious and confers Siddhi and Liberation,

I Salute the Mother of the Universe, Who is the Beloved of Ramachandra,

I always Worship You in my Heart, O Mother Sita, You are Beautiful in entirety, the Beauty which cannot be expressed in words. 8 ||

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. జానకి జయంతి విశిష్టత 🌹

🌻. జానకి జయంతిని సీతా అష్టమి మరియు సీతా జయంతి అని కూడా పిలుస్తారు. 🌻

ఈ పండుగను గుజరాత్ , ఉత్తరాఖండ్ , మహారాష్ట్ర , తమిళనాడులలో ప్రధానంగా జరుపుకుంటారు. ఈ రోజున , తల్లి సీత భూమిపై కనిపించిందని నమ్ముతారు. ఈ రోజున రాముడు , సీత ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సీత భూమి దేవత కుమార్తె , ఈమెను భూమి అని కూడా పిలుస్తారు. సీత మాత అయోధ్య యువరాజు అయిన రాముడిని వివాహం చేసుకుంది. రాముడు స్వయంవరం తన శౌర్యాన్ని నిరూపించాడు , అక్కడ సీత రాముడిని తన భర్తగా ఎన్నుకుంది.

ఈ దంపతులకు లవకుశులు అనే కుమారులనేది జగమెరిన సత్యం. సీతాదేవి త్యాగం , ధైర్యానికి ప్రసిద్ది చెందింది. జీవితంలో అన్ని అడ్డంకులను వదిలించుకోవడానికి ఈ రోజున సీతమ్మను పూజిస్తారు.

ఈ రోజున ఒక రోజు పాటు ఉపవాసం వుండే దంపతులను సీతమ్మ ఆశీర్వదిస్తుందని.. వారి వైవాహిక జీవితం నుండి అన్ని కష్టాలను తొలగిస్తుందని , అలాగే సీతమ్మ వారికి సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. సీతా అష్టమి రోజున ఉపవాసం ఉండటం భర్తకు సుదీర్ఘ జీవితాన్ని ఇస్తుంది. వివాహ అడ్డంకులు ఎదుర్కొంటున్న కన్యలు కూడా ఈ ఉపవాసం చేయడం ద్వారా కావలసిన వరుడిని పొందవచ్చు.

సీత అష్టమి రోజున , ఉదయం స్నానం చేసిన తర్వాత.. సీతారాములను పూజించేందుకు ముందు.. గణపతిని పూజించాలి. పసుపు పువ్వులు , పసుపు బట్టలు తల్లికి సీతకు అంకితం ఇవ్వాలి.

🍀. శ్రీ జానకి రామాభ్యామ్ నమః 🍀

మంత్రాన్ని 108 సార్లు జపించండి. పాలు - బెల్లంతో చేసిన వంటలను నైవేద్యం సమర్పించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

24 Feb 2022

24 - FEBRUARY - 2022 గురువారం MESSAGES శ్రీ జానకి మాత జయంతి శుభాకాంక్షలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 24, ఫిబ్రవరి 2022 గురువారం, బృహస్పతి వాసరే 🌹 
🌹 శ్రీ జానకి మాత జయంతి శుభాకాంక్షలు జానకీ స్తుతి 🌹
🌹 జానకీ మాత జయంతి విశిష్టత 🌹 
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 163 / Bhagavad-Gita - 163 - 4-01 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 561 / Vishnu Sahasranama Contemplation - 561🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 10/ Agni Maha Purana 10- వరాహావతార వర్ణనము - 1🌹  
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 240 / DAILY WISDOM - 240🌹 
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 141🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 78 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ గురువారం మరియు శ్రీ జానకిమాత జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 24, ఫిబ్రవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీజానకీ స్తుతి 🍀*

*1. జానకి త్వాం నమస్యామి సర్వపాప ప్రణాశినీమ్ ॥*
*2. దారిద్య్రరణసంహత్రీం భక్తానాభిష్టదాయినీమ్ ।*
*విదేహరాజతనయాం రాఘవానన్దకారిణీమ్ ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : అలౌకిక ఆవలి తీరం అన్నిచోట్ల ఉంది. మన చుట్టూ కూడా ఉంది. దానికి సదా అందుబాటులో ఉండడమే యోగ స్ధితి 🍀*

*పండుగలు మరియు పర్వదినాలు : జానకి జయంతి, Janaki Jayanti*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
ఉత్తరాయణం, శిశిర ఋతువు, 
మాఘ మాసం
తిథి: కృష్ణ అష్టమి 15:05:23 వరకు
తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: అనూరాధ 13:31:10 వరకు
తదుపరి జ్యేష్ఠ
యోగం: హర్షణ 26:59:08 వరకు
తదుపరి వజ్ర
కరణం: కౌలవ 15:02:22 వరకు
వర్జ్యం: 18:47:38 - 20:18:06
దుర్ముహూర్తం: 10:32:09 - 11:19:02
మరియు 15:13:26 - 16:00:19
రాహు కాలం: 13:57:15 - 15:25:09
గుళిక కాలం: 09:33:33 - 11:01:27
యమ గండం: 06:37:45 - 08:05:39
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:52
అమృత కాలం: 03:37:46 - 05:09:02
మరియు 27:50:26 - 29:20:54
సూర్యోదయం: 06:37:45
సూర్యాస్తమయం: 18:20:57
వైదిక సూర్యోదయం: 06:41:21
వైదిక సూర్యాస్తమయం: 18:17:22
చంద్రోదయం: 00:34:42
చంద్రాస్తమయం: 12:00:37
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
ఆనంద యోగం - కార్య సిధ్ధి 13:31:10
వరకు తదుపరి కాలదండ యోగం - 
మృత్యు భయం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ జానకి మాత జయంతి శుభాకాంక్షలు అందరికి - Sri Janaki Mata Jayanthi Wishes to all 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ జానకీ స్తుతి 🍀*

1. జానకి త్వాం నమస్యామి సర్వపాపప్రణాశినీమ్ ॥ ౧॥

2. దారిద్య్రరణసంహత్రీం రణసంహత్రీం భక్తానాభిష్టదాయినీమ్ ।
విదేహరాజతనయాం రాఘవానన్దకారిణీమ్ ॥ ౨॥

భూమేర్దుహితరం విద్యాం నమామి ప్రకృతిం శివామ్ ।
పౌలస్త్యైశ్వర్యసన్త్రీ భక్తాభీష్టాం సరస్వతీమ్ ॥ ౩॥

పతివ్రతాధురీణాం త్వాం నమామి జనకాత్మజామ్ ।
అనుగ్రహపరామృద్ధిమనఘాం హరివల్లభామ్ ॥ ౪॥

ఆత్మవిద్యాం త్రయీరూపాముమారూపాం నమామ్యహమ్ ।
ప్రసాదాభిముఖీం లక్ష్మీం క్షీరాబ్ధితనయాం శుభామ్ ॥ ౫॥

నమామి చన్ద్రభగినీం సీతాం సర్వాఙ్గసున్దరీమ్ ।
నమామి ధర్మనిలయాం కరుణాం వేదమాతరమ్ ॥ ౬॥

పద్మాలయాం పద్మహస్తాం విష్ణువక్షస్థలాలయామ్ ।
నమామి చన్ద్రనిలయాం సీతాం చన్ద్రనిభాననామ్ ॥ ౭॥

ఆహ్లాదరూపిణీం సిద్ధి శివాం శివకరీ సతీమ్ ।
నమామి విశ్వజననీం రామచన్ద్రేష్టవల్లభామ్ ।
సీతాం సర్వానవద్యాఙ్గీం భజామి సతతం హృదా ॥ ౮॥

🌻 🌻 🌻 🌻 🌻

*🍀 Shri Janaki Stuti 🍀*

O Devi Janaki, I salute You; You are the destroyer of all Sins 1

(I Salute You) You are the destroyer of Poverty (in the battle of life) and bestower of wishes of the Devotees,

(I Salute You) You are the daughter of Videha Raja (King Janaka), and cause of Joy of Raghava (Sri Rama) 2 

Salute You, You are the daughter of the Earth and the embodiment of Knowledge; You are the Auspicious Prakriti,
(I Salute You) You are the destroyer of the Power and Supremacy of (oppressors like) Ravana, (and at the same time) fulfiller of the wishes of the Devotees; You are an embodiment of Saraswati 3

Salute You, You are the best among Pativratas (Ideal Wife devoted to Husband), (and at the same time) the Soul of Janaka (Ideal Daughter devoted to Father),
(I Salute You) You are very Gracious (being Yourself the embodiment of) Riddhi (Lakshmi), (Pure and) Sinless, and extremely Beloved of Hari 4 

Salute You, You are the embodiment of Atma Vidya, mentioned in the Three Vedas (Manifesting its Inner Beauty in Life); You are of the nature of Devi Uma,
(I Salute You) You are the Auspicious Lakshmi, the daughter of the Milky Ocean, and always intent on bestowing Grace (to the Devotees) 5 

Salute You, You are like the sister of Chandra (in Beauty), You are Sita Who is Beautiful in Her entirety,
(I Salute You) You are an Abode of Dharma, full of Compassion and the Mother of Vedas 6 

(I Salute You) (You as Devi Lakshmi) Abide in Lotus, hold Lotus in Your Hands, and always reside in the Heart of Sri Vishnu,
I Salute You, You reside in Chandra Mandala, You are Sita Whose Face resembles the Moon 7 

(I Salute You) Your Form gives Joy to all, You are the Sati (Devoted Wife) Whose presence is Auspicious and confers Siddhi and Liberation,
I Salute the Mother of the Universe, Who is the Beloved of Ramachandra,
I always Worship You in my Heart, O Mother Sita, You are Beautiful in entirety, the Beauty which cannot be expressed in words. 8 ||

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. జానకి జయంతి విశిష్టత 🌹*

*🌻. జానకి జయంతిని సీతా అష్టమి మరియు సీతా జయంతి అని కూడా పిలుస్తారు. 🌻*
 
*ఈ పండుగను గుజరాత్ , ఉత్తరాఖండ్ , మహారాష్ట్ర , తమిళనాడులలో ప్రధానంగా జరుపుకుంటారు. ఈ రోజున , తల్లి సీత భూమిపై కనిపించిందని నమ్ముతారు. ఈ రోజున రాముడు , సీత ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సీత భూమి దేవత కుమార్తె , ఈమెను భూమి అని కూడా పిలుస్తారు. సీత మాత అయోధ్య యువరాజు అయిన రాముడిని వివాహం చేసుకుంది. రాముడు స్వయంవరం తన శౌర్యాన్ని నిరూపించాడు , అక్కడ సీత రాముడిని తన భర్తగా ఎన్నుకుంది.*
 
*ఈ దంపతులకు లవకుశులు అనే కుమారులనేది జగమెరిన సత్యం. సీతాదేవి త్యాగం , ధైర్యానికి ప్రసిద్ది చెందింది. జీవితంలో అన్ని అడ్డంకులను వదిలించుకోవడానికి ఈ రోజున సీతమ్మను పూజిస్తారు.*
 
*ఈ రోజున ఒక రోజు పాటు ఉపవాసం వుండే దంపతులను సీతమ్మ ఆశీర్వదిస్తుందని.. వారి వైవాహిక జీవితం నుండి అన్ని కష్టాలను తొలగిస్తుందని , అలాగే సీతమ్మ వారికి సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. సీతా అష్టమి రోజున ఉపవాసం ఉండటం భర్తకు సుదీర్ఘ జీవితాన్ని ఇస్తుంది. వివాహ అడ్డంకులు ఎదుర్కొంటున్న కన్యలు కూడా ఈ ఉపవాసం చేయడం ద్వారా కావలసిన వరుడిని పొందవచ్చు.*
 
*సీత అష్టమి రోజున , ఉదయం స్నానం చేసిన తర్వాత.. సీతారాములను పూజించేందుకు ముందు.. గణపతిని పూజించాలి. పసుపు పువ్వులు , పసుపు బట్టలు తల్లికి సీతకు అంకితం ఇవ్వాలి.*

 *🍀. శ్రీ జానకి రామాభ్యామ్ నమః 🍀* 
*మంత్రాన్ని 108 సార్లు జపించండి. పాలు - బెల్లంతో చేసిన వంటలను నైవేద్యం సమర్పించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 163 / Bhagavad-Gita - 163🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. చతుర్ధ అధ్యాయము - జ్ఞాన యోగము - 01 🌴*

*01. శ్రీభగవానువాచ*
*ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ |*
*వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేబ్రవీత్*

🌷. తాత్పర్యం :
*దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుడు పలికెను; మొదట ఈ జ్ఞానము సూర్యునికి (మానవునికి భగవానునితో గల సంబంధ విజ్ఞానము) ఉపదేశించితిని. ఆ వివస్వానుడు (సూర్యుడు) మానవులకు తండ్రియైన వైవస్వతమనువునకు చెప్పెను. మనువు ఇక్ష్వాకురాజునకు చెప్పెను.*

🌷. భాష్యము :
సూర్యలోకము మొదలుగా సర్వలోకములందలి రాజవంశములకు శ్రీమద్భగవద్గీతాజ్ఞానము ప్రాచీనకాలము నుండియే ఉపదేశించబడినదనెడి దాని చరిత్ర ఇచ్చట మనకు తెలియవచ్చుచున్నది. సర్వలోకరాజులు తమ ప్రజలకు రక్షణణమును కల్పించుటకే ప్రత్యేకముగా నిర్దేశింపబడియున్నారు. కనుక ప్రజలను చక్కగా పాలించి వారిని కామబంధము నుండి రక్షించుటకు రాజవంశము వారు భగవద్గీతా జ్ఞానమును సంపూర్ణముగా అవగాహన చేసికొనవలసిన అవసరమున్నది. దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుని నిత్య సంబంధములో ఆధ్యాత్మికజ్ఞానమును సంపాదించుటకే మానవజన్మ ఉద్దేశింపబడినది. 

ఈ సందేశమును ప్రజలకు విద్య, సంస్కృతి, భక్తి ద్వారా తెలియజేయుట సర్వదేశ, లోకపాలకుల బాధ్యాతయైయున్నది. అనగా జనుల శ్రేయస్సు కొరకు రాజులు ఈ కృష్ణసంబంధ విజ్ఞానమును విస్తృతముగా ప్రచారము చేయవలసియున్నది. తద్ద్వారా జనులు ఈ ఘనమైన శాస్త్రపు లాభమును బడసి, జయప్రదమైన మార్గమున పయనించి లభించిన మానవజన్మను సద్వినియోగపరచుకొనగలరు. ఈ కల్పము నందు సూర్యదేవుడు వివస్వానునిగా పిలువబడును. ఆ సూర్యుడే గ్రహమండలమందలి సర్వగ్రహములకు మూలము. బ్రహ్మసంహిత (5.52) యందు ఈ క్రింది విధముగా తెలుపబడినది.

యచ్చక్షు రేష సవితా సకలగ్రహాణామ్
రాజా సమస్తసురమూర్తిర శేష తేజా: |
యస్యాజ్ఞయా భ్రమతి సంభ్రుతకాలచక్రో
గోవిందం ఆదిపురుషం తమహం భజామి 

“ఏ ఆదిపురుషుని ఆజ్ఞచే గ్రహములకు రాజైన సూర్యుడు అత్యధికశక్తిని మరియు ఉష్ణమును పొందుచున్నాడో అట్టి దేవదేవుడైన గోవిందుని(శ్రీకృష్ణుని) నేను భజింతును. అట్టి సూర్యుడు ఆ భగవానుని నేత్రమై భాసించును, అతని ఆజ్ఞలకు లోబడి తన కక్ష్య యందు పరిభ్రమించుచుండును” అని బ్రహ్మదేవుడు స్తుతించెను.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 163 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 01 🌴*

*01. śrī-bhagavān uvāca*
*imaṁ vivasvate yogaṁ proktavān aham avyayam*
*vivasvān manave prāha manur ikṣvākave ’bravīt*

🌷 Translation : 
*The Personality of Godhead, Lord Śrī Kṛṣṇa, said: I instructed this imperishable science of yoga to the sun-god, Vivasvān, and Vivasvān instructed it to Manu, the father of mankind, and Manu in turn instructed it to Ikṣvāku.*

🌷 Purport :
Herein we find the history of the Bhagavad-gītā traced from a remote time when it was delivered to the royal order of all planets, beginning from the sun planet. The kings of all planets are especially meant for the protection of the inhabitants, and therefore the royal order should understand the science of Bhagavad-gītā in order to be able to rule the citizens and protect them from material bondage to lust. 

Human life is meant for cultivation of spiritual knowledge, in eternal relationship with the Supreme Personality of Godhead, and the executive heads of all states and all planets are obliged to impart this lesson to the citizens by education, culture and devotion. In other words, the executive heads of all states are intended to spread the science of Kṛṣṇa consciousness so that the people may take advantage of this great science and pursue a successful path, utilizing the opportunity of the human form of life.

In this millennium, the sun-god is known as Vivasvān, the king of the sun, which is the origin of all planets within the solar system. In the Brahma-saṁhitā (5.52) it is stated:

yac-cakṣur eṣa savitā sakala-grahāṇāṁ
rājā samasta-sura-mūrtir aśeṣa-tejāḥ
yasyājñayā bhramati sambhṛta-kāla-cakro
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi

“Let me worship,” Lord Brahmā said, “the Supreme Personality of Godhead, Govinda [Kṛṣṇa], who is the original person and under whose order the sun, which is the king of all planets, is assuming immense power and heat. The sun represents the eye of the Lord and traverses its orbit in obedience to His order.”
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 561 / Vishnu Sahasranama Contemplation - 561🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 561. వనమాలీ, वनमाली, Vanamālī 🌻*

* ఓం వనమాలినే నమః | ॐ वनमालिने नमः | OM Vanamāline namaḥ*

వనమాలీ, वनमाली, Vanamālī

*భూతతన్మాత్ర రూపాం తామ్ వైజయన్త్యాహ్వయాం హరిః ।*
*వనమాలాం వహన్ వనమాలీతి హరిరుచ్యతే ॥*

*వనమాల అనగా వైజయంతీ నామక మాల ఈతనికి కలదు. పంచభూత తన్మాత్రారూపమగు వైజయంతీ మాలను వహించి యుండు వాడు గనుక ఆ హరి 'వనమాలీ'.*

:: పోతన భాగవతము - చతుర్థ స్కంధము ::
సీ.హార కిరీట కేయూర కంకణ ఘన భూషణుం డాశ్రిత పోషణుండులాలిత కాంచీకలాప శోభిత కటి మండలుం డంచిత కుండలుండుమహనీయ కౌస్తుభమణి ఘృణిచారు గ్రైవేయకుం డానంద దాయకుండుసలలిత ఘన శంఖ చక్ర గదా పద్మ హస్తుండు భువన ప్రశస్తుఁ డజుఁడుతే.గమ్ర సౌరభ వనమాలికా ధరుండు, హతవిమోహుండు నవ్యపీతాంబరుండులలిత కాంచన నూపురాలంకృతుండు, నిరతిశయసద్గుణుఁడు దర్శనీయతముఁడు. (251)

ఆ హరి హారాలు, కిరీటం, భుజకీర్తులు మొదలైన అలంకారాలతో అలరారుతుంటాడు. ఆయన కటిప్రదేశం అందమైన మొలనూలు చేత ప్రకాశిస్తుంటుంది. ఆయన చెవులకు మకరకుండలాలు ధరిస్తాడు. కౌస్తుభం అనే గొప్ప మణి కాంతులతో కమనీయమైన కంఠమాలికను ధరిస్తాడు. ఆయన ఆనందాన్ని కలిగించేవాడు. శంఖం, చక్రం, గద, పద్మం అనే నాలుగింటినీ నాలుగు చేతులతో పట్టుకొని ఉంటాడు. ఆయన లోకాలలో ప్రశస్తికెక్కినవాడు. పుట్టుక లేనివాడు. కమ్మని సువాసనగల వనమాలను మెడలో వేసుకుంటాడు. ఆ హరి అజ్ఞానాన్ని పొగొట్టేవాడు. సరిక్రొత్త పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించి ఉంటాడు. మేలిమి బంగారు అందియలు ఆయన కాళ్ళకు అలంకరింపబడి ఉంటాయి. గొప్ప సద్గుణాలు కలవాడు. చూడదగిన వారిలో అగ్రగణ్యుడు. భక్తజన శరణ్యుడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 561🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 561. Vanamālī 🌻*

*OM Vanamāline namaḥ*

भूततन्मात्ररूपां ताम् वैजयन्त्याह्वयां हरिः ।
वनमालां वहन् वनमालीति हरिरुच्यते ॥

*Bhūtatanmātrarūpāṃ tām vaijayantyāhvayāṃ hariḥ,*
*Vanamālāṃ vahan vanamālīti harirucyate.*

*Since Lord Hari wears the Vanamāla or floral wreath - called Vaijayanti made out of the tanmatrās or categories of five subtle elements, He is called Vanamālī.*

:: श्रीमद्भागवते चतुर्थ स्कन्धे सप्तमोऽध्यायः ::
वक्षस्यधिश्रितवधूर्वनमाल्युदार हासावलोककलया रमयंश्चविश्वम् ।
पार्श्वभ्रमद्व्यजनचामरराजहंसः श्वेतातपत्रशशिनोपरि रज्यमानः ॥ २१ ॥

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 7
Vakṣasyadhiśritavadhūrvanamālyudāra hāsāvalokakalayā ramayaṃścaviśvam,
Pārśvabhramadvyajanacāmararājahaṃsaḥ śvetātapatraśaśinopari rajyamānaḥ. 21.

Lord Vis‌n‌u looked extraordinarily beautiful because the goddess of fortune and a garland were situated on His chest. His face was beautifully decorated with a smiling attitude which can captivate the entire world, especially the devotees. Fans of white hair appeared on both sides of the Lord like white swans and the white canopy overhead looked like the moon.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
भगवान् भगहाऽऽनन्दी वनमाली हलायुधः ।
आदित्यो ज्योतिरादित्यस्सहिष्णुर्गतिसत्तमः ॥ ६० ॥
భగవాన్ భగహాఽఽనన్దీ వనమాలీ హలాయుధః ।
ఆదిత్యో జ్యోతిరాదిత్యస్సహిష్ణుర్గతిసత్తమః ॥ 60 ॥
Bhagavān bhagahā’’nandī vanamālī halāyudhaḥ,
Ādityo jyotirādityassahiṣṇurgatisattamaḥ ॥ 60 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 10 / Agni Maha Purana - 10 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 4*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. వరాహావతార వర్ణనము - 1 🌻*

అగ్ని దేవుడు పలికెను : పాపములను నశింపచేయు వరాహావతారమును గూర్చి చెప్పెదను. హిరణ్యాక్షుడనెడు రాక్షసరాజు ఉండెను. అతడు దేవతలను జయించి స్వర్గలోకములో నివసించెను. యజ్ఞస్వరూపు డగు విష్ణువును దేవత లందరును వచ్చి స్తుతింపగా ఆ హరి వరాహరూపము ధరించి, లోకకంటకు డైన ఆ దానవుని దైత్యులతోకూడ ఆశ్చర్యకర మగు విధమున సంహరించి, ధర్మమును దేవతలు మొదలగువారిని రక్షించి అంతర్థానము చెందెను.

హిరణ్యాక్షుని సోదరుడైన హిరణ్యకశిపుడు దేవతల యజ్ఞభాగములను అపహరించి దేవతలందరిపైనను అధికారమును జరిపెను. విష్ణువు దేవతాసమేపతుడై (వెళ్లి) నరసింహరూపము దాల్చి ఆ హిరణ్యకశిపుని సంహరించెను. దేవతలచే స్తుతింపబడిన ఆ నరసింహుడు దేవతలను తమతమ స్థానములలో నిలిపెను. పూర్వము దేవాసుర యుద్దమునందు బలి మొదలగువారిచే సురులు పరాజితులై, స్వర్గమును కోల్పోయిరి. వారు అపుడు హరిని శరణుజొచ్చిరి.

విష్ణువు దేవతలకు అభయ మిచ్చి, అదితికశ్యపులు తనను స్తుతింపగా ఆదితియందు వామనుడగ జన్మించెను. ఆ వామనుడు శోభాయుక్తముగ యజ్ఞము చేయుచున్న బలి చక్రవర్తి యజ్ఞమునకు వెళ్లి అచట రాజద్వారమునందు వేదమును పఠించెను. బలి వేదములను పఠించుచున్న ఆ వామనుని చూచి, ఆతడు కోరు కరముల నీయవలెనని నిశ్చయించుకొని, శుక్రాచార్యుడు నివారించుచున్నను, ఆతనితో '' నీ కేమి కావలెనో కోరుకొనుము; ఇచ్చెదను '' అని పలికెను. వామనుడు బలితో ఇట్లనెను : ''మూడు అడుగుల నిమ్ము; నా గురువునకు కావలెను''. బలి ''అట్లె ఇచ్చెదను'' అని పలికెను.

దానజలము చేతిలో పడగానే వామనుడు అవామనుడ (పెద్ద శరీరము కలవాడు) ఆయెను. భూలోక-భువర్లోక-స్వర్లోకములను మూడడుగులుగా గ్రహించి బలిని సుతలమునకు త్రొక్కివేసెను. వామనరూపుడైన హరి ఆ లోక త్రయమును దేవేంద్రున కిచ్చెను. దేవతాసహితు డగు ఇంద్రుడ హరిని స్తుతించి, త్రిభువనాధీశుడై సుఖముగా నుండెను. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 10 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj*

*🌻 Chapter 4 - Manifestations of Viṣṇu as the Boar - 1 🌻*

Agni said:

1. I describe (unto thee) the manifestation as a Boar (which) removes (one’s) sins. Hiraṇyākṣa[1] was a demon chief. He conquered the celestials and got established in the heavens.

2. Viṣṇu being praised by the celestials (who had) gone (to him), (he) assumed the form as Yajñavarāha (boar). Having killed that demon along with the (other) demons (he made the earth) devoid of thorns (difficulties).

3-4. (That) Hari, the protector of righteousness and the celestials (then) disappeared. Then (the demon) Hiraṇyakaśipu[2], brother of Hiraṇyākṣa after conquering the celestials (was grabbing a share of the offerings) exercised control over all the celestials. (Viṣṇu) assumed the form of Narasiṃha (human body with lion’s face) (and) killed him along with the (other) demons.

5-7. (He) re-established the celestials in their original places and was praised by the celestials. Once in the battle between the celestials and the demons, the celestials were defeated by (demon) Bali[3] and other demons (and) were driven away from the heaven (and) sought refuge in Hari (Viṣṇu). Having given refuge to the devas he being praised by Aditi (wife of the latter) (and mother of the celestials) and Kaśyapa (a sage) became a Dwarf (as a son) of Aditi (and) went to the sacrifice (performed by Bali) (and) recited the Vedas at the royal gates of Bali the sacrificer.

8-9. Having heard him reciting the Vedas, the bestower of the wanted things (Bali) said to the Dwarf in spite of being obstructed by Sukra (the preceptor of the demons), “Whatever (you) desire I shall give (you)”. The Dwarf asked Bali, “Get (me) three feet of space for the sake of the preceptor. (Bali) said to him, “I shall give (you)”.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 అగ్ని మహా పురాణము చానెల్ 🌹Agni Maha Purana
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 240 / DAILY WISDOM - 240 🌹*
*🍀 📖. ఉపనిషత్తులపై పాఠాల నుండి 🍀*
*📝 . స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🌻 27. దేవుడు ప్రపంచాన్ని ఎలా సృష్టిస్తాడు? 🌻*

*మనం దేవుడు అని పిలుస్తున్న సృష్టికర్త ఈ విశ్వాన్ని వ్యక్తపరుస్తాడు, ఈ విశ్వాన్ని సృష్టిస్తాడు. ఆయన విశ్వాన్ని ఏ పద్ధతిలో సృష్టిస్తాడు? ఈ ప్రపంచంలో ఎవరో ఏదో సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. ఒక వడ్రంగి ఒక టేబుల్ లేదా కుర్చీని సృష్టిస్తాడు. ఒక కుమ్మరి మట్టి కుండను సృష్టిస్తాడు. దేవుడు ప్రపంచాన్ని సృష్టించే విధానం ఇదేనా? దేవుడు సృష్టించే విధానం ఇది కాదని కొందరు అంటారు, ఎందుకంటే వడ్రంగికి కొంత సాధనం మరియు కొంత సామగ్రి అవసరం మరియు దాని ద్వారా అతను టేబుల్ లేదా కొన్ని ఫర్నిచర్ తయారు చేయవచ్చు. కానీ, భగవంతుని కోసం పదార్థం లేదా పరికరం లేదా సాధనం ఎక్కడ ఉంది? భగవంతుని వెలుపల ఏదో ఒక పదార్థం ఉందని మనం చెబితే, మరొక క్లిష్టమైన ప్రశ్న ఉంటుంది: “ఈ పదార్థాన్ని ఎవరు సృష్టించారు?”*

*దేవుడు ప్రపంచాన్ని ఉనికిలో ఉన్న ఏదో ఒక పదార్థంతో సృష్టించి నట్లయితే, ఆ పదార్థాన్ని కూడా ఎవరో సృష్టించి ఉండాలి. దేవుడే ఆ పదార్థపు చెక్క లేదా ఈ కాస్మోస్ యొక్క పరికరాల యొక్క సృష్టికర్తా? ఈ ప్రశ్న దుర్మార్గమైనది కాదు ; దానినే 'ప్రశ్న లేదా వేడుకోవడం' అంటారు. కాబట్టి, ఈ విశ్వం సృష్టించబడిన సమయంలో భగవంతుని ముందు ఏదో ఒక పదార్థం ఉందని ఊహించడం ద్వారా ప్రపంచ సృష్టికి సంబంధించిన సమస్యలు సులభంగా పరిష్కరించ బడవు. కొంతమంది ఆలోచనాపరులు మరియు తత్వవేత్తలు ఈ విశ్వాన్ని భగవంతుడు రూపొందించిన శాశ్వతమైన పదార్థం ఉందనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నప్పటికీ, మరికొందరు సృష్టి వాస్తవాన్ని దృశ్యమానం చేయడానికి ఇది సరైన మార్గం కాదని భావిస్తున్నారు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 240 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 27. How does God Create the World? 🌻*

*The Creator, Whom we call God, manifests this universe, creates this universe. In what manner does He create the universe? There are instances of someone creating something in this world. A carpenter creates a table or a chair. A potter creates a mud pot. Is this the way in which God creates the world? Some say that this is not the way in which God creates, because a carpenter requires some tool and some material out of which and through which he can manufacture a table or some furniture. But, where is the instrument or tool, and where is the material for God? If we say that there is some material outside God, then there will be another difficult question: “Who created this material?”*

*If God created the world out of some existent material, someone must have created that material also. Is God Himself the creator of that material wood or furniture of this cosmos? The question is a vicious one; it is what is called ‘begging the question'. Hence, problems connected with the creation of the world do not seem to be easily solvable by merely assuming that there was some material before God at the time of the creation of this universe. Though there are some thinkers and philosophers who hold this opinion that there is an eternally existing material out of which God fashions this universe, there are others who feel that this is not the proper way of visualising the fact of creation.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 141 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మీరు నిజమైన ప్రార్థనని నేర్చుకోవాలి. అది నిశ్శబ్దాన్ని నింపుకున్నది. దాంట్లో గాఢమయిన వినడమన్నది వుంది. దేవుడు నీకు ఏదో చెప్పాలనుకుంటాడు. నీ కోసం వెతుకుతాడు. కానీ నువ్వు కనిపించవు. కారణం బాగా బిజీగా వుంటావు. నిశ్శబ్దంగా వుండు. 🍀*

*ప్రార్థన అంటే దేవుడితో ఏదో చెప్పడం కాదు. ఏదో అడగటం కాదు. ప్రార్థన అంటే దేవుణ్ణి 'వినడం' నువ్వు చెప్పేది ఏదయినా వుంటే అది కేవలం కృతజ్ఞతే కేవలం ఒక ఆమోదం చాలు. సంస్థాగతమయిన మతాలన్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అనవసరమైన ప్రార్థనల్ని బోధిస్తాయి. ప్రజలు ఆ ప్రార్థనల్ని పునశ్చరణ చేస్తూ వుంటారు. చిలక పలుకులు పలుకుతారు. వాళ్ళకు అర్థం తెలీదు. కేవలం ఆచార కర్మ కాండల్ని జరుపుతారు.*

*మీరు నిజమైన ప్రార్థనని నేర్చుకోవాలి. అది నిశ్శబ్దాన్ని నింపుకున్నది. దాంట్లో గాఢమయిన వినడమన్నది వుంది. దేవుడు నీకు ఏదో చెప్పాలనుకుంటాడు. నీ కోసం వెతుకుతాడు. కానీ నువ్వు కనిపించవు. కారణం బాగా బిజీగా వుంటావు. నిశ్శబ్దంగా వుండు. మరింత మరింతగా విశ్రాంతిగా వుండు. అప్పుడు, నువ్వు నిశ్చలమైన చిన్ని శబ్దాన్ని నీలోలోపల వింటావు. దేవుడు బయటి నించి మాట్లాడడు. నీ లోలోతుల నించీ మాట్లాడతాడు. అతను అప్పటికే అక్కడున్నాడు. నీ అంతరాంతరాలతో నువ్వు సంబంధమేర్పరచు కోవడమే నిజమైన ప్రార్ధన. నువ్వు సంబంధ మేర్పరచుకున్న క్షణం.. ఆ క్షణం ఆనందదాయకం, ఎంత పరవశమయ క్షణమంటే నువ్వు అప్పుడు కృతజ్ఞతతో తలవంచుతావు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 78 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 64. అసత్య భాషణము 🌻*

*అసత్య భాషణము, భాషించు వానిని క్రమముగ క్రుంగతీయును. జీవితము బరువెక్కుచుండును. పలికిన ప్రతి అసత్యము ఏనుగంత బరువై బ్రతుకు భారముగ చేయును. అట్టి భాషణము
వలన వ్యక్తిగత కర్మము విపరీతముగ పెరుగును. దాని ఫలితము జీవుని స్వభావమున పాదుకొని జన్మ జన్మలు వెంబడించును. దానికి సంబంధించిన కర్మ భవిష్యత్తున ఆపదయై తారసిల్లును.*

*అసత్య భాషణము యొక్క ఫలములను తెలిసినవాడు అసత్య మాడుటకు భయపడును. తెలియనివాడు అసత్యమాడుచు జీవితమును క్లిష్టపరచుకొనును. తెలిసియు ఆచరింపని వాడు మూర్ఖుడు. అన్ని దోషముల యందు అసత్యదోషము జీవుల నెక్కువగా బాధించునని తెలియవలెను.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹