🌹 09, JUNE 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 09, JUNE 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 09, JUNE 2023 FRIDAY శుక్రవారం, బృగు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 382 / Bhagavad-Gita - 382 🌹
 🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 10 / Chapter 10 - Vibhuti Yoga - 110 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 229 / Agni Maha Purana - 229 🌹 
🌻. ఉత్సవవధి కథనము -1 / Mode of taking out a procession and celebration of festivals -1 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 094 / DAILY WISDOM - 094 🌹 
🌻 3. ఆధ్యాత్మిక కోరిక కాకపోతే గురుత్వాకర్షణ అంటే ఏమిటి? / 3. What is Gravitation if not a Spiritual Urge? 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 360 🌹
6) 🌹. శివ సూత్రములు - 96 / Siva Sutras - 96 🌹 
🌻 2-06. గురు రూపాయః - 3 / 2-06. guru Rupāyah   - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 09, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 48 🍀*

*48. మఙ్గలం కరుణాపూర్ణే మఙ్గలం భాగ్యదాయిని ।*
*మఙ్గలం శ్రీమహాలక్ష్మి మఙ్గలం శుభమఙ్గలమ్ ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : భగవదభివ్యక్తిని గ్రహించే మార్గాలు - భగనదభివ్యక్తిని సాధకుడు తన చక్షురాది ఇంద్రియములలో ఏ ఒక దాని చేతనైననూ గ్రహించవచ్చును. లేక, తన ఆత్మ యందలి ఎరుకలో నైనను గ్రహించవచ్చును. సంపూర్ణాభివ్యక్తి యందు మాత్రం, దర్శనం, శ్రవణం, స్పర్శనం మొదలైనవి అన్నీ ఉంటాయి. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: కృష్ణ షష్టి 16:22:06 వరకు
తదుపరి కృష్ణ సప్తమి
నక్షత్రం: ధనిష్ట 17:10:04 వరకు
తదుపరి శతభిషం
యోగం: వైధృతి 15:46:17 వరకు
తదుపరి వషకుంభ
కరణం: వణిజ 16:24:06 వరకు
వర్జ్యం: 23:55:00 - 25:25:00
దుర్ముహూర్తం: 08:18:40 - 09:11:15
మరియు 12:41:33 - 13:34:07
రాహు కాలం: 10:36:41 - 12:15:16
గుళిక కాలం: 07:19:31 - 08:58:06
యమ గండం: 15:32:25 - 17:11:00
అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:41
అమృత కాలం: 07:33:14 - 09:01:58
సూర్యోదయం: 05:40:57
సూర్యాస్తమయం: 18:49:35
చంద్రోదయం: 23:56:20
చంద్రాస్తమయం: 10:48:02
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: మకరం
యోగాలు: ధాత్రి యోగం - కార్య
జయం 17:10:00 వరకు తదుపరి
సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 382 / Bhagavad-Gita - 382 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 10 🌴*

*10. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ |*
*దదామి బుద్ధియోగం తం యేన మాముపయాన్తి తే ||*

🌷. తాత్పర్యం :
*ప్రేమతో నా సేవయందు నిరంతర ఆసక్తులైనవారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేనొసగుదును.* 

🌷. భాష్యము :
*“బుద్ధియోగమ్” అను పదము ఈ శ్లోకమునందు ముఖ్యమైనది. ద్వితీయాధ్యాయమున శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు ఉపదేశమొసగుచు తాను అనేక విషయములను చర్చించితిననియు మరియు ఇకపై బుద్ధియోగము ద్వారా కొన్ని విషయములు తెలుపనున్నట్లుయు పలికియున్న విషయమును మనమిచ్చట జ్ఞాపకము చేసికొనవలెను. అట్టి బుద్ధియోగమే ఇచ్చట పేర్కొనబడినది. బుద్ధియోగమనగా కృష్ణభక్తిరసభావనలో కర్మనొనర్చుట యనియే భావము. అదియే అత్యుత్తమబుద్ధి మరియు జ్ఞానము అనబడును. బుద్ధి యనగా తెలివి మరియు యోగమనగా యోగకర్మలు. భగవద్దామమునకు చేరగోరి మనుజుడు కృష్ణభక్తిభావనలో భక్తియుక్తసేవయందు నిలిచినచో అతని కర్మలు బుద్ధియోగమనబడును. అనగా బుద్ధియోగము ద్వారా మనుజుడు భౌతికజగత్తు బంధముల నుండి సులభముగా విడివడగలడు. పురోగతి యనుదాని చరమప్రయోజనము శ్రీకృష్ణుడే. కాని జనసామాన్యము ఈ విషయము నెరుగరు. కనుకనే గురువు మరియు భక్తుల సాంగత్యము అత్యంత ముఖ్యమై యున్నది. కనుక ప్రతియొక్కరు శ్రీకృష్ణుడే పరమగమ్యమని తెలిసికొనవలసియున్నది. ఆ విధముగా గమ్యమును నిర్ణయించి, నెమ్మదిగా అయినప్పటికిని క్రమముగా ప్రయాణించినచో అంతిమలక్ష్యము ప్రాప్తించగలదు.*

*మానవుడు జీవితలక్ష్యము నెరిగియు తన కర్మ ఫలముల యెడ అనురక్తిని కలిగియున్నచో అతడు కర్మయోగమునందు వర్తించినవాడగును. అదే విధముగా మానవుడు కృష్ణుడే గమ్యమని తెలిసియు, కృష్ణుని అవగతము చేసికొనుటకు మానసికకల్పనలను ఆశ్రయించినచో జ్ఞానయోగమునందు వర్తించినవాడగును. ఇక మానవుడు తన గమ్యమును సంపూర్ణముగా నెరిగి కృష్ణభక్తిభావన యందు భక్తియోగము ద్వారా శ్రీకృష్ణుని పొందగోరినపుడు భక్తియోగమునందు లేదా బుద్ధియోగమునందు వర్తించినవాడగును. వాస్తవమునకు ఈ బుద్ధియోగమే సంపూర్ణము మరియు సమగ్రమైన యోగమై యున్నది. ఇదియే మానవజన్మ యొక్క అత్యున్నత పరిపూర్ణస్థితి. మనుజుడు ఆధ్యాత్మిక గురువును పొందినను మరియు ఏదేని ఒక ఆధ్యాత్మికసంఘముతో సంబంధమును కలిగయున్నను ఒకవేళ ఆధ్యాత్మికముగా పురోభివృద్ధిని పొందలేకపోయినచో ఎటువంటి కష్టము లేకుండా అతడు అంత్యమున తనను చేరురీతిలో శ్రీకృష్ణుడే అతనికి అంతర్యమున ఉపదేశములొసగును.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 382 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 10 - Vibhuti Yoga - 10 🌴*

*10. teṣāṁ satata-yuktānāṁ bhajatāṁ prīti-pūrvakam*
*dadāmi buddhi-yogaṁ taṁ yena mām upayānti te*

🌷 Translation : 
*To those who are constantly devoted to serving Me with love, I give the understanding by which they can come to Me.*

🌹 Purport :
*In this verse the word buddhi-yogam is very significant. We may remember that in the Second Chapter the Lord, instructing Arjuna, said that He had spoken to him of many things and that He would instruct him in the way of buddhi-yoga. Now buddhi-yoga is explained. Buddhi-yoga itself is action in Kṛṣṇa consciousness; that is the highest intelligence. Buddhi means intelligence, and yoga means mystic activities or mystic elevation. When one tries to go back home, back to Godhead, and takes fully to Kṛṣṇa consciousness in devotional service, his action is called buddhi-yoga. In other words, buddhi-yoga is the process by which one gets out of the entanglement of this material world. The ultimate goal of progress is Kṛṣṇa. People do not know this; therefore the association of devotees and a bona fide spiritual master are important.*

*One should know that the goal is Kṛṣṇa, and when the goal is assigned, then the path is slowly but progressively traversed, and the ultimate goal is achieved. When a person knows the goal of life but is addicted to the fruits of activities, he is acting in karma-yoga. When he knows that the goal is Kṛṣṇa but he takes pleasure in mental speculations to understand Kṛṣṇa, he is acting in jñāna-yoga. And when he knows the goal and seeks Kṛṣṇa completely in Kṛṣṇa consciousness and devotional service, he is acting in bhakti-yoga, or buddhi-yoga, which is the complete yoga. This complete yoga is the highest perfectional stage of life.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 229 / Agni Maha Purana - 229 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 68*

*🌻. ఉత్సవవధి కథనము -1 🌻*

*హయగ్రీవుడు పలికెను. ఇప్పుడు ఉత్సవ విధిని చెప్పెదను. ఉత్సవము లేని దేవతాప్రతిష్ఠ నిష్ఫలము, అందుచే దేవతాస్థాపనము చేసిన సంవత్సరమునందే ఏక రాత్రోత్సవము లేదా త్రిరాత్రోత్సవము లేదా అష్ఠరాత్రోత్సవము చేయవలెను. అయనసమయమునందు గాని, విషువసంక్రాంతి సమయమునందు గాని శయనోపవనమునందు లేదా దేవతా గృహమునందు లేదా కర్తకు అనుకూలముగా ఉన్న విధమున దేవుని నగరయాత్ర చేయించవలెను. ఆ సమయమున మంగలాంకురారోపణము, నృత్యగీతాదులు, వాద్యములు ఏర్పాటు చేయవలెను. అంకురారోపణమునకు మూకుళ్ళు ఉత్తమమైనవి. యవ - శాలిజ - తిల - ముద్గగోధూమ - శ్వేతసర్షప - కులత్థ - మాష - నిష్పావములు కడిగి చల్లవలెను.*

*దీపములతో రాత్రి ఊరేగుచు ఇంద్రాదిదిక్పాలులకు, కుముదాది దిగ్గజములకు, సకల ప్రాణులకు పూర్వాదిదిక్కులందు బలి ప్రదానము చేయవలెను. దేవతా విగ్రహమును మోయుచు దేవయాత్రను అనుసరించు వారికి అడుగడుగునకు అశ్వమేధ యాగము చేసిన ఫలము లభించును, కొంచెమైనను సందేహము లేదు. ఆచార్యుడు తొలుచటి దివసమున దేవాలయమునకు వచ్చి దేవునితో - ''దేవశ్రేష్ఠా! రేపు నీ తీర్థ యాత్ర జరుపవలసి యున్నది. అందుకు అనుజ్ఞ ఇచ్చుటకై నీవు సర్వదా సమర్ధుడవు అని నివేదించి ఉత్సవకార్యము ప్రారంభింపవలెను. నాలుగు స్తంభములు గలదియు అంకురములున్న ఘటముతో కూడినదియు అలంకరింపబడినదియు అగు వేదిక దగ్గరకు వెళ్ళి దాని మధ్య భాగమున స్వస్తికము ప్రతిమనుంచి, తన కోరికను వ్రాసి చిత్రములపై స్థాపించి అధివాసము చేయవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 229 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 68*
*🌻Mode of taking out a procession and celebration of festivals -1 🌻*

The Lord said:

1. I shall describe the celebration of festival after the image has been installed. It shall be for a night, or three or five nights.

2-3. Without the festival the installation would become fruitless. The festival for the deity [i.e., utsava] should be celebrated when the sun enters the solstitial or the equinoctial points in the bedchamber or garden or it may be done in favour of the person at whose instance the ceremony is performed with the sowing of auspicious seeds and the notes of sacred music.

4-5. An earthen vessel, a small water pot or an embankment are suitable for the sowing of seeds. Grains of barley, uncultivated rice, sesamum, green gram, wheat, white mustard, horsegram, and black gram should be winnowed, washed and sown. Offerings should be made in the east and other directions. Lighted lamps should be carried round the edifice in the night.

6. (Offering should be made) to Indra, Kumuda and other -deities and spirits. They visit the place assuming shapes of men.

7. (One who carries such lamps) certainly gets the merit of (doing) aśvamedha (horse sacrifice) for every step he places. The priest should submit to the lord (as follows) after his return.

8. “O Lord! best among the Gods! you have to be taken in a procession tomorrow [i.e., tīrtha-yātrā]. By all means you deserve to permit us O Lord! to commence the same.

9. Having informed the lord in this way the festivities should be undertaken. The platform should be decorated with young shoots of plants and small water-jar.

10-11. Four pillars (should be erected). The image should be placed in a svastika (figure) (drawn) in their midst. Or desired objects should be painted and placed there and the act of making the deity present in the image should be done with the vaiṣṇava mantra. (The image) should be anointed with ghee with (the recitation of) the principal (mantra). Or the wise man should arrange an incessant flow of ghee over the image the whole night.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 94 / DAILY WISDOM - 94 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 3. ఆధ్యాత్మిక కోరిక కాకపోతే గురుత్వాకర్షణ అంటే ఏమిటి? 🌻*

*ప్రతి జీవం యొక్క మూలం విశ్వం లోని ఇతర జీవుల ఉనికి యొక్క మూలాలతో సంప్రదించడానికి ప్రయత్నిస్తుంది. ఈ విధంగా ప్రతి జీవి , ఇతర జీవుల ఉనికిలో మమేకమవ్వడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సంకల్పానికి నాంది. ఆధ్యాత్మిక ప్రేరణ కాకపోతే గురుత్వాకర్షణ అంటే ఏమిటి? ఆధ్యాత్మికం కాకపోతే భూమిని సూర్యుని చుట్టూ తిప్పే ఈ శక్తి ఏమిటి? గురుత్వాకర్షణ శక్తి ఆధ్యాత్మికంగా ఎలా ఉంటుందో మనం ఆశ్చర్యపోవచ్చు, ఎందుకంటే ఇది భౌతిక వి మాత్రమే తెలుసు.*

*కానీ, అదంతా కేవలం రకరకాల పేర్లు వల్ల వచ్చిన ప్రశ్నలు. మనం దానిని భౌతికంగా, మానసికంగా, సామాజికంగా, నైతికంగా, నైతికంగా లేదా ఆధ్యాత్మికంగా పిలుస్తాము. విషయం ఏమిటంటే, ఇది ముఖ్యంగా ఏమిటి? నైతిక శక్తి యొక్క ఆకర్షణ, మానసిక విషయాల యొక్క ఆకర్షణ, ప్రేమ మరియు ఆప్యాయత యొక్క ఆకర్షణ వంటి ఏదైనా ఆకర్షణలు ఎందుకు ఉన్నాయి? ఒక వస్తువును మరొకదాని వైపుకు లాగడం ఏమిటి? ఏదైనా ఏదో ఒక కేంద్రం వైపు ఎందుకు ఆకర్షింపబడాలి? ఈ ఆకర్షణ వెనుక ఉద్దేశం ఏమిటి, మరియు రహస్యం ఏమిటి?*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 94 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 3. What is Gravitation if not a Spiritual Urge? 🌻*

*There is a struggle of every individual structure or pattern to communicate itself with other such centres of force, and it is this tendency within the individual patterns or structures to melt into the being of others that is the beginning of all spiritual aspiration. What is gravitation if not a spiritual urge? What is this force that pulls the Earth round the Sun if it is not spiritual? We may wonder how the force of gravitation can be spiritual, because it is known to be a physical phenomenon.*

*But, it is all a question of nomenclature. We may call it physical, psychological, social, ethical, moral, or spiritual, as we like. The point is, what is it essentially? Why is there any pull at all—the pull of moral force, the pull of psychic contents, the pull of love and affection? What is it that pulls one thing towards another? Why is it that anything should gravitate towards some centre? What is the intention, what is the purpose, what is the motive and what is the secret behind this urge?*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 359 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మనసు స్వంత బుద్ధి లేనిది. నీకు వాస్తవానికి చెందిన అంతర్దృష్టి నివ్వదు. అది గ్రహించడానికి నీ హృదయం పని చేయాలి. ప్రేమ అంటే హృదయ స్పందన తప్ప మరొకటి కాదు. 🍀*

*ప్రేమించే హృదయమే అస్తిత్వ హృదయాన్ని స్పర్శిస్తుంది. మనసు బోలుది. పైపైది. మనసుకు లోతులు తెలీవు. ఎత్తులు తెలీవు. శిఖరాలూ తెలీవు. లోయలూ తెలీవు. మనసు బుద్ధి లేనిది. స్వంత బుద్ధి లేనిది. నీకు వాస్తవానికి చెందిన అంతర్దృష్టి నివ్వదు. అది గ్రహించడానికి నీ హృదయం పని చేయాలి. ప్రేమ అంటే హృదయస్పందన తప్ప మరొకటి కాదు. దాని పాట అది పాడటానికి హృదయాన్ని అనుమతించు. దాన్ని మనసు ఖండించినా లెక్క పెట్టకు. దాని పని ఖండించడమే. బాధా సందర్భంలో కూడా హృదయం గానం చెయ్యనీ. ఇది సందర్భమా? అట్లా పాడొచ్చా? అని మనసన్నా లెక్కపెట్టకు.*

*నీ హృదయం పాడనీ, ఆడనీ, పరవశించనీ మనసు నించీ కుక్కలు మొరగనీ. అది సహేతుకం కాదని అరచి గీపెట్టనీ. లెక్కపెట్టకు. అది లోపలి కవిత్వాన్ని ఖండిస్తుంది. లోపలి ప్రేమని ఖండిస్తుంది. నిన్ను హృదయం నించి లాగెయ్యడానికి ప్రయత్నిస్తుంది. దాని మాట వినకు. ఆడు, పాడు, ఆనందించు. అట్లా చేస్తూ వుంటే మనసు ఒకరోజు ఆశ్చర్యపోతుంది. కుక్కలు మొరగడం ఆపుతాయి. కుక్కలు అదృశ్యమవుతాయి. అది గొప్ప ఆశీర్వాదం అందిన రోజు. పూలు నీపై వర్షించిన రోజు. అస్తిత్వం అన్ని రకాలయిన ఆనందాల్ని నీ మీద వర్షిస్తుంది. నువ్వు సంపూర్ణతతో సంధానం చెందుతావు. అనంతంతో నీకు అనుబంధ మేర్పడుతుంది. నువ్వు రుషివవుతావు. అది నీకు అంతర్నేత్రాన్నిస్తుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 096 / Siva Sutras - 096 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-06. గురు రూపాయః - 3 🌻*
*🌴. మనస్సు మరియు శరీరం యొక్క మలినాలను అధిగమించడానికి, మాతృకలలో నివసించే మంత్ర శక్తులను మేల్కొల్పడానికి మరియు స్వయం యొక్క స్వచ్ఛమైన ఎరుకను పొందడానికి గురువు సాధనం. 🌴*

*ఆధ్యాత్మిక మార్గంలో, ప్రాథమికాలను సరిగ్గా అర్థం చేసుకోకపోతే, అది ఆశించేవారిని ఎక్కడికీ నడిపించదు. అతను అదే స్థాయిలో ఇరుక్కుపోయి ముందుకు సాగలేడు. పురోగతి లేకపోవడం వల్ల అతను నిరాశ చెందుతాడు మరియు ఆధ్యాత్మిక మార్గం నుండి వైదొలగాలని నిర్ణయించుకుంటాడు, తద్వారా విముక్తిని పొందే గొప్ప అవకాశాన్ని కోల్పోతాడు. అందుకే గురువు యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పారు. గురువు స్వీయ-సాక్షాత్కారమైన వ్యక్తి అయితే, అతను తన శిష్యుడిని అంతిమ సత్యం గ్రహించడానికి సరైన మార్గంలో తీసుకువెడతాడు. ఎవరి అనుగ్రహం ద్వారా శివుడు సాక్షాత్కరిస్తాడో ఆ శక్తి ఒక గురువు రూపంలో వ్యక్తమవుతుందని కూడా చెప్పవచ్చు. ఈ వివరణ రెండు విషయాలను నిర్ధారిస్తుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 096 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-06. guru rupāyah   - 3 🌻*
*🌴. The guru is the means to overcome the impurities of the mind and body, awaken the mantra shaktis who reside in the matrkas and attain the pure consciousness of the self.   🌴*

*In Spiritual Path, If the basics are not understood properly, it leads the aspirant nowhere. He gets stuck at the same level and unable to proceed further. Because of the lack of progression he becomes frustrated and decides to deviate from spiritual path, thereby losing a great opportunity to attain liberation. That is why the need of a guru is emphasised. If the guru is a Self-realised person, he will take his disciple through the correct path to realise the Ultimate Reality. It can also be said that Śaktī, through whose grace Śiva is realised, manifests in the form of a guru. This interpretation confirms two things.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 459 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 459 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 459 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 459 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀

🌻 459. ‘నళినీ’ - 2 🌻

వేదములందు పద్మము నొక విశిష్టమగు చిహ్నముగ పేర్కొందురు. సృష్టిని కూడ ఒక పద్మముగ కీర్తింతురు. సృష్టి కూడ పద్మమువలె గోళము నుండి విచ్చుకొనును. మొగ్గ విచ్చుకొనినట్లు సృష్టి కూడను విచ్చుకొనును. నవావరణములతో విచ్చుకొన్న అద్భుతమగు పద్మముల సృష్టిని ఋషులు దర్శించు చుందురు. సృష్టి కూడ పద్మమువలె కాంతివంతమై యున్నది. నవావరణములు నవ విధమగు వర్ణములు కలిగి యుండును. పద్మనాళమువలె సృష్టినాళము నుండి పద్మ ముద్భవించినది. ఈ నాళము పరతత్వము నుండి కలిగిన ప్రేరణ. అవ్యక్తము నుండి వ్యక్తమునకు గల మార్గము లేక బిలము. ఈ నాళము శ్రీమాతయే. దీనిని నిర్గుణ మందురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 459 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻


🌻 459. 'Nalini' - 2 🌻

In the Vedas, the lotus is a special symbol. Creation is also glorified as a lotus flower. Creation also breaks forth from the orb like a lotus. Creation also blossoms as a bud blossoms. Sages see the creation and blossoming of the wonderful lotuses that are bursting with new petals in the nine realms. Creation is also bright like a lotus. The nine realms will have nine different colors. Padma originates from the tube just like creation. This vessel is the inspiration from the beyond. This tube is a passage or way from the unmanifest to the manifest. This vessel is Srimata. It is called Nirguna.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


Osho Daily Meditations - 361. THE MYSTERIOLTS / ఓషో రోజువారీ ధ్యానాలు - 361. నిగూడ రహస్యాలు



🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 361 / Osho Daily Meditations - 361 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 361. నిగూడ రహస్యాలు 🍀

🕉. రహస్యాన్ని వినండి; దానిని తిరస్కరించవద్దు. అది ఉనికిలో లేదని అభ్యంతరకరంగా చెప్పకండి. రహస్యమైనది ఉనికిలో ఉంది అని భూమిపై స్పృహతో నడిచిన ప్రజలందరూ అంగీకరిస్తున్నారు. 🕉


ప్రపంచం కనిపించే దానితో పూర్తికాదు. అదృశ్యమైనది ఉంది, ఇక అది చాలా లోతుగా ఉన్నందున ఇది చాలా ముఖ్యమైనది. కనిపించేది అదృశ్యంలో ఒక అల మాత్రమే. కనిపించనిది సముద్రం. కాబట్టి ఏదైనా వింత జరిగినప్పుడు, దానిని తిరస్కరించవద్దు మరియు దానితో మిమ్మల్ని మీరు మూసివేయవద్దు. తెరవండి; దానిని లోపలికి రానివ్వండి. మరియు ప్రతి రోజు అనేక, అనేక క్షణాలు ఉన్నాయి, రహస్యo తలుపు తడుతుంది. అకస్మాత్తుగా ఒక పక్షి పిలవడం ప్రారంభిస్తుంది: ఇది వినండి మరియు హృదయం ద్వారా వినండి. దానిని విశ్లేషించడం ప్రారంభించవద్దు. దాని గురించి లోపల మాట్లాడటం ప్రారంభించవద్దు. నిశ్శబ్దంగా ఉండండి.

'అది మీలో వీలైనంత లోతుగా చొచ్చుకుపోనివ్వండి. మీ ఆలోచనలతో దానికి అడ్డుపడకండి. ఇది ఒక సంపూర్ణ ప్రకరణము అనుమతించు. అనుభవించండి -- ఆలోచించకండి. మీరు ఉదయాన్నే గులాబీని చూచినండదుకు మీరు రోజంతా భిన్నంగా ఉండవచ్చు. మీరు ఉదయాన్నే ఉదయిస్తున్న సూర్యుడిని చూసి, దానితో ఉక్కిరిబిక్కిరి అయినట్లయితే, మీరు రోజంతా పూర్తిగా భిన్నంగా అనిపించవచ్చు. మీరు ఎగురుతున్న పక్షులను చూసి, ఒక్క క్షణం వాటితో కలిసి ఉంటే మీరు పూర్తిగా కొత్త వ్యక్తిలా భావిస్తారు. మీ జీవితం మారడం ప్రారంభించింది. ఇది ఒక అన్వేషకుడిగా మారే మార్గం. అస్తిత్వం యొక్క అందాన్ని, దాని యొక్క పరిపూర్ణ ఆనందాన్ని, అఖండమైన ఆశీర్వాదాన్ని గ్రహించాలి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 361 🌹

📚. Prasad Bharadwaj

🍀 361. THE MYSTERIOLTS 🍀

🕉. Listen to the mysterious; don't deny it. Don’t say offhandedly that it doesn't exist. All the people who have walked on the earth in a conscious way agree - that the mysterious exists. 🕉


The world is not finished at the visible. The invisible is there, and it is far more significant because it is far deeper. The visible is only a wave in the invisible. The invisible is the ocean. So when something strange happens, don't deny it and don't close yourself to it. Open up; let it come in. And there are many, many moments every day when the mysterious knocks at the door. Suddenly a bird starts calling: Listen to it, and listen through the heart. Don't start analyzing it. Don't start talking inside about it. Become silent,

'let it penetrate you as deeply as possible. Don't hinder it by your thoughts. Allow it" an absolute passage. Feel it --don't think it. You may feel different the whole day because you encountered a rose in the early morning. You may feel totally different the whole day if you have seen the sun rising in the morning and were overwhelmed by it. You will feel like an utterly new person if you have seen birds on the wing and you have been with them for a moment. Your life has started changing. This is the way one becomes a seeker. One has to absorb the beauty of existence, the sheer joy of it, the overwhelming blessing of it.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ మహా పురాణము - 742 / Sri Siva Maha Purana - 742


🌹 . శ్రీ శివ మహా పురాణము - 742 / Sri Siva Maha Purana - 742 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 13 🌴

🌻. జలంధర వృత్తాంతములో ఇంద్రుడు ప్రాణములతో బయటపడుట - 1 🌻



వ్యాసుడిట్లు పలికెను -

ఓయీ పూజ్య బ్రాహ్మణా ! బ్రహ్మకుమారా! శంకరప్రభువు జలంధరుడను మహారాక్షసుని సంహరించెనని నేను పూర్వము వినియంటిని (1). ఓ మహాప్రాజ్ఞా! ఆ వృత్తాంతమును నీవు విస్తారముగా చెప్పుము. చంద్రశేఖరుని నిర్మలమగు కీర్తిని వినువాడు ఎవ్వాడు తృప్తిని చెందును? (2)


సూతుడిట్లు పలికెను -

బ్రహ్మ పుత్రుడు, మహర్షి, వాక్యనిపుణుడునగు సనత్కుమారుడు వ్యాసునిచే ఇట్లు ప్రశ్నింపబడినవాడై తొందరపాటు లేని అర్థవంతమైన వాక్యమును ఇట్లు పలికెను (3).


సనత్కుమారుడిట్లు పలికెను -

ఓ మహర్షీ ! ఒకప్పుడు బృహస్పతి, మరియు ఇంద్రుడు పరమభక్తితో ఈశ్వరుని దర్శించగోరి వేగముగా కైలాసమునకు బయలుదేరిరి (4). తన దర్శనమునాకాంక్షించే మనస్సు గల ఇంద్ర బృహస్పతులు బయలు దేరిన సంగతిని ఎరింగిన శంకరప్రభుడు వారి జ్ఞానమును పరీక్షింప గోరి (5), వారి మార్గమునకు అడ్డముగా దిగంబరుడై నిలబడి యుండెను. సత్సురుషులకు శరణ్యుడు అగు శివుడు వెనుకకు కట్టబడిన జటలతో ప్రకాశించు ముఖము గలవాడై నిలబడి యుండెను (6).

అపుడా ఇంద్ర బృహస్పతులు ఆనందముతో పయనిస్తూ, మార్గమధ్యములో అద్భుత భయంకరాకారము గల పురుషుని గాంచిరి (7). అతడు మహాతేజశ్శాలి, శాంతుడు, జటలతో కట్టబడిన శిరస్సు గలవాడు, పెద్ద బాహువులు గలవాడు, విశాలమగు వక్షస్థ్సలము గలవాడు, గౌరవర్ణము గలవాడు, మరియు భయంకరముగు కన్నులు గలవాడు (8). తమ మార్గమునకు అడ్డుగా నున్న ఆ పురుషుడు శంకరుడే నని యెరుంగక, అధికారముచే గర్వితుడై యున్న ఇంద్రుడు అప్పుడు అతనితో నిట్లనెను (9).



సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 742🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 13 🌴

🌻 Resuscitation of Indra in the context of the destruction of Jalandhara - 1 🌻



Vyāsa said:—

1. O holy lord, son of Brahmā, it has been heard by me before that the lord Śiva killed the great Asura Jalandhara.

2. O intelligent one, please narrate the story of the moon-crested lord in detail. Who can be satiated with listening to the spotless glory of the lord?


Sūta said:—

3. On being requested thus by Vyāsa, the great sage and son of Brahmā of eloquent speech spoke the following significant words without excitement.


Sanatkumāra said:—

4. O sage, once Bṛhaspati and Indra went to Kailāsa with great devotion, to see lord Śiva.

5-6. Coming to know of the arrival of Bṛhaspati and Indra eager to see him, lord Śiva wished to test their knowledge. Accordingly, the lord, the excellent goal of the good, stood blocking their path in the naked form with matted hair and beaming face.

7-9. Bṛhaspati and Indra were walking on gleefully. On their way they saw this wonderful person of huge size. He was quiet and composed and very refulgent with matted hair on his head. He was fair-complexioned with long arms and wide chest. He was terrible to look at. Without realising that the person who stood there blocking their path was Śiva himself, Indra who was proud of his authority said to him.


Continues....

🌹🌹🌹🌹🌹

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 781 / Vishnu Sahasranama Contemplation - 781



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 781 / Vishnu Sahasranama Contemplation - 781🌹

🌻781. దురారిహా, दुरारिहा, Durārihā🌻

ఓం దురారిఘ్నే నమః | ॐ दुरारिघ्ने नमः | OM Durārighne namaḥ


దురారిణో దానవాదీన్ హన్తీతి పరమేశ్వరః ।
దురారి హేత్యుచ్యతే స పురాణార్థ విశారదైః ॥

చెడుగా వర్తించువారు దురారులు. అట్టి దురారులను అనగా చెడుమార్గమున ప్రవర్తించువారిని సంహరించు పరమేశ్వరుడు దురారిహా.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 781🌹

🌻781. Durārihā🌻

OM Durārighne namaḥ


दुरारिणो दानवादीन् हन्तीति परमेश्वरः ।
दुरारि हेत्युच्यते स पुराणार्थ विशारदैः ॥

Durāriṇo dānavādīn hantīti parameśvaraḥ,
Durāri hetyucyate sa purāṇārtha viśāradaiḥ.


Since He kills vile enemies like asuras and others, He is called Durārihā.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

समावर्तोऽनिवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः ।
दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिहा ॥ ८३ ॥

సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ 83 ॥

Samāvarto’nivr‌ttātmā durjayo duratikramaḥ,
Durlabho durgamo durgo durāvāso durārihā ॥ 83 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


కపిల గీత - 189 / Kapila Gita - 189


🌹. కపిల గీత - 189 / Kapila Gita - 189 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 43 🌴

43. స్వయోనిషు యథా జ్యోతిరేకం నానా ప్రతీయతే|
యోనీనాం గుణవైషమ్యాత్తథాఽఽత్మా ప్రకృతౌ స్థితః॥


తాత్పర్యము : ఒకే అగ్ని వేర్వేఱు వస్తువులను ఆశ్రయించుటవలన వేర్వేఱు ఆకారములలో గోచరించనట్లు, దేవమనుష్యాది శరీరములలోగల ఆత్మ తాను ఆశ్రయించియున్న ప్రాణుల గుణముల భేదకారణముగా వేర్వేఱుగా భాసించును. విద్యుచ్ఛక్తి బల్బులలో వెలుతురుగను, ఫ్యాన్లలో గాలిగను, రేడియోలలో శబ్దముగను, దూరదర్శనులలో రూపముగను, హీటర్లలో వేడిగను కన్పించుచున్నను వాటిలోగల విద్యుచ్ఛక్తి ఒక్కటే. ఉపాధిభేదమలచే అది వేర్వేఱుగా గోచరించును.

వ్యాఖ్య : శరీరం నియమించ బడిందని అర్థం చేసుకోవాలి. ప్రకృతి అనేది భౌతిక ప్రకృతి యొక్క మూడు రీతుల ద్వారా పరస్పర చర్య, మరియు ఈ రీతుల ప్రకారం, ఎవరైనా చిన్న శరీరాన్ని కలిగి ఉంటారు మరియు ఎవరైనా చాలా పెద్ద శరీరాన్ని కలిగి ఉంటారు. ఉదాహరణకు, ఒక పెద్ద చెక్క ముక్కలో మంట చాలా పెద్దదిగా కనిపిస్తుంది మరియు ఒక కర్రలో అగ్ని చిన్నదిగా కనిపిస్తుంది. వాస్తవానికి, అగ్ని యొక్క నాణ్యత ప్రతిచోటా ఒకేలా ఉంటుంది, కానీ భౌతిక స్వభావం యొక్క అభివ్యక్తి ఇంధనం ప్రకారం, అగ్ని పెద్దదిగా మరియు చిన్నదిగా కనిపిస్తుంది. అదే విధంగా, సార్వత్రిక శరీరంలోని ఆత్మ, అదే గుణాన్ని కలిగి ఉన్నప్పటికీ, చిన్న శరీరంలోని ఆత్మకు భిన్నంగా ఉంటుంది.

ఆత్మ యొక్క చిన్న కణాలు పెద్ద ఆత్మ యొక్క జ్వాలల లాగా ఉంటాయి. పరమాత్మ పెద్దవాడు, కానీ పరమాత్మ చిన్న ఆత్మ కంటే పరిమాణాత్మకంగా భిన్నంగా ఉంటుంది. పరమాత్మ వేద సాహిత్యంలో చిన్న ఆత్మ (నిత్యం నిత్యానం) యొక్క అన్ని అవసరాలకు సరఫరాదారుగా వర్ణించబడింది. పరమాత్మ మరియు వ్యక్తిగత ఆత్మ మధ్య ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి విలాపానికి అతీతుడు మరియు శాంతియుత స్థితిలో ఉంటాడు. చిన్న ఆత్మ పరిమాణాత్మకంగా తనను తాను పెద్ద ఆత్మ వలె పెద్దదిగా భావించినప్పుడు, అతను ఆట యొక్క మాయలో ఉంటాడు, ఎందుకంటే అది అతని రాజ్యాంగ స్థానం కాదు. కేవలం మానసిక ఊహల ద్వారా ఎవరూ గొప్ప ఆత్మ కాలేరు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 189 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 4. Features of Bhakti Yoga and Practices - 43 🌴

43. sva-yoniṣu yathā jyotir ekaṁ nānā pratīyate
yonīnāṁ guṇa-vaiṣamyāt tathātmā prakṛtau sthitaḥ

MEANING : As fire is exhibited in different forms of wood, so, under different conditions of the modes of material nature, the pure spirit soul manifests itself in different bodies.


PURPORT : It is to be understood that the body is designated. Prakṛti is an interaction by the three modes of material nature, and according to these modes, someone has a small body, and someone has a very large body. For example, the fire in a big piece of wood appears very big, and in a stick the fire appears small. Actually, the quality of fire is the same everywhere, but the manifestation of material nature is such that according to the fuel, the fire appears bigger and smaller. Similarly, the soul in the universal body, although of the same quality, is different from the soul in the smaller body.

The small particles of soul are just like sparks of the larger soul. The greatest soul is the Supersoul, but the Supersoul is quantitatively different from the small soul. The Supersoul is described in the Vedic literature as the supplier of all necessities of the smaller soul (nityo nityānām). One who understands this distinction between the Supersoul and the individual soul is above lamentation and is in a peaceful position. When the smaller soul thinks himself quantitatively as big as the larger soul, he is under the spell of māyā, for that is not his constitutional position. No one can become the greater soul simply by mental speculation.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


08 Jun 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 08, జూన్‌, JUNE 2023 పంచాగము - Panchagam 🌹

శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺

🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 9 🍀

17. యోగిస్తుతో యోగిచంద్రో యోగివంద్యో యతీశ్వరః |
యోగాదిమాన్ యోగరూపో యోగీశో యోగిపూజితః

18. కాష్ఠయోగీ దృఢప్రజ్ఞో లంబికాయోగవాన్ దృఢః |
ఖేచరశ్చ ఖగః పూషా రశ్మివాన్భూతభావనః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : అంతస్సంయోగ లక్షణం - భగవంతుడు తనలోవున్నట్లు, విశ్వమందలి ప్రతివస్తువులోనూ ఉన్నట్లు. విశ్వమంతా ఆయనలోనే ఉన్నట్లు, ఆయన విశ్వాతీతుడుగా కూడ ఉన్నట్లు, సాధకుడు తెలుసుకోగలిగే అంతస్సంయోగమే అన్నిటికంటే గొప్పది ఈ అనుభూతి యందు సాధకుడు తన చక్షురాది-ద్వారమున గూడ భగవత్సాక్షాత్కారాన్నే పొందగలుగుతాడు. 🍀

🌷🌷🌷🌷🌷




విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,

జ్యేష్ఠ మాసం

తిథి: కృష్ణ పంచమి 19:00:18

వరకు తదుపరి కృష్ణ షష్టి

నక్షత్రం: శ్రవణ 19:00:50 వరకు

తదుపరి ధనిష్ట

యోగం: ఇంద్ర 18:58:24 వరకు

తదుపరి వైధృతి

కరణం: కౌలవ 08:24:36 వరకు

వర్జ్యం: 00:42:20 - 02:10:04

మరియు 22:40:50 - 24:09:34

దుర్ముహూర్తం: 10:03:40 - 10:56:14

మరియు 15:19:01 - 16:11:35

రాహు కాలం: 13:53:37 - 15:32:10

గుళిక కాలం: 08:57:58 - 10:36:31

యమ గండం: 05:40:52 - 07:19:25

అభిజిత్ ముహూర్తం: 11:49 - 12:41

అమృత కాలం: 09:28:44 - 10:56:28

సూర్యోదయం: 05:40:52

సూర్యాస్తమయం: 18:49:16

చంద్రోదయం: 23:11:09

చంద్రాస్తమయం: 09:44:33

సూర్య సంచార రాశి: వృషభం

చంద్ర సంచార రాశి: మకరం

యోగాలు: ధ్వజ యోగం - కార్యసిధ్ధి

19:00:50 వరకు తదుపరి శ్రీవత్స

యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం

దిశ శూల: దక్షిణం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹