2) 🌹. శివ మహా పురాణము - 430🌹
3) 🌹 వివేక చూడామణి - 105 / Viveka Chudamani - 105🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -57🌹
5) 🌹 Osho Daily Meditations - 46🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 106 / Lalitha Sahasra Namavali - 106🌹
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 106 / Sri Vishnu Sahasranama - 106🌹
8) 🌹. తొలి ఏకాదశి శుభాకాంక్షలు 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -229 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 13
*🍀 12. బ్రహ్మపథము - వ్యాన వాయువు నందు గల నాదముతో కూడి యుండగ సాధకుడు దేహము నుండీవలకు వచ్చుట లేక సమాధి స్థితి చేరుట జరుగును. ఆ విధముగ దేహ విసర్జనము, బ్రహ్మప్రాప్తి కలుగును. మరల ధ్యానము ముగియగనే దేహప్రవేశము, ఐహిక స్పృహ కలుగును. ఈ సాధన దీక్షగల ఏ మానవునికైనను సిద్ధింపగలదు. 🍀*
ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరన్ |
యః ప్రయాతి త్యజ నేహం సయాతి పరమాం గతిమ్ || 13
తాత్పర్యము : ఏకాక్షరమగు ఓంకారము నుచ్చరించుచు 'నన్ను' స్మరించుచు నిశ్వాస మార్గమున నిట్టనిలువుగ ఊర్ధ్యముగ చనుము. అపుడు శిరస్సునందలి బ్రహ్మరంధ్రము ద్వారా వాయు సహకారమున దేహమును త్యజించి పరమగు బ్రహ్మమును చేరెదవు.
వివరణము : ముందు శ్లోకమున తెలిపిన విధముగ సాధకుని ప్రజ్ఞ భ్రూమధ్యమున ఉదాన స్పందనముతో కూడి స్థిరముగ నుండును. అట్టి సమయమున నిశ్వాస మార్గమున జరుగుచున్న ఓంకారమును నిశితముగ అనుసరించినచో ఉదాన ప్రాణస్పందనము నుండి ప్రజ్ఞ వ్యాన స్పందనమున చేరును.
నిశ్వాస నాసా రంధ్రముల నుండి బాహ్యమునకు చనినను నిశ్వాస యందిమిడి యున్న నాదము ఊర్ధ్వముగ శిరస్సు పై భాగమునకు చనుట గుర్తింపవలెను. 'ఓం' అనెడి నిశ్వాసనాదము భ్రూమధ్యము నుండి ఊర్ధ్వముగ చనును. అపుడు వ్యాన స్పందనముతో సంధాన మేర్పడును. అట్టి సమయమున వాయువు నాసా పుటముల నుండి బాహ్యమునకు చనినను ప్రజ్ఞ నిట్టనిలువుగ శిరస్సు పై భాగమునకు పయనించును.
సహస్రారము భ్రూమధ్యము - ప్రజ్ఞామార్గము నిశ్వాస మార్గము
వ్యాన వాయువు నందు గల నాదముతో కూడి యుండగ సాధకుడు దేహము నుండీవలకు వచ్చుట లేక సమాధి స్థితి చేరుట జరుగును. ఆ విధముగ దేహ విసర్జనము, బ్రహ్మప్రాప్తి కలుగును. మరల ధ్యానము ముగియగనే దేహప్రవేశము, ఐహిక స్పృహ కలుగును. ఈ సాధన దీక్షగల ఏ మానవునికైనను సిద్ధింపగలదు. జాతి, మత, కుల, లింగ భేదములతో సంబంధము లేక అందరునూ నిర్వర్తించుకొన వచ్చును. ఇట్లు మానవులందు ప్రతియొక్కరు అక్షరము, పరము యగు బ్రహ్మముతో కూడి యుండుటకు అవకాశముండును. ఇదియే అక్షర పరబ్రహ్మ యోగము.
ఎనిమిదవ (8) శ్లోకము నుండి పదమూడవ (13) శ్లోకము వరకు పరమాత్మ పలికిన పలుకులను శ్రద్ధగ గ్రహించి ఆచరించు వారు నిస్సందేహముగ ఊర్ధ్వగతి చెందుదురు. దేహ పరిత్యాగము ఇట్లు సాధ్యపడును. బ్రహ్మపథము కూడ ఈ మార్గముననే పొందుదురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 429🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 25
*🌻. సప్తర్షులు పార్వతిని పరీక్షించుట - 6 🌻*
మంచి గుణములన్నింటినీ కలిగియున్న విష్ణు ప్రభుడు నీకు తగిన వరుడు. ఆయన వైకుంఠ నందుండును. లక్ష్మీ పతియగు విష్ణువు వివిధ క్రీడలలో నిపుణుడు.(53) ఆయన తోడి వివాహము సర్వసుఖముల నిచ్చును. నీకు ఆ వివాహము మేము చేయించెదము. ఈ మొండి పట్టును విడువుము, ఓ పార్వతీ! సుఖపడుము (54).
పార్వతి ఇట్లు పలికెను-
ఓ మహర్షులారా! మీరు మీకు తెలిసిన సత్యమును పలికితిరి. ఓ బ్రహ్మాణులారా కాని, నాకు గల ఈ హఠము తొలిగిపోయేది కానే కాదు(56). నేను పర్వతుని కుమార్తెను అగుటచే సహజముగానే కఠినురాలను. మీరు మంచి బుద్ధితో ఈ సత్యమును విచారించి నన్ను తపస్సు చేయవద్దని వారించుట తగదు (57)
దేవర్షి యగు నారదుని హితకరమగు వచనమును నేను ఎన్నటికీ త్యజించును గురువుల వచనము హితకరమని వేదవత్తలు చెప్పెదరు(58). గురువుల వచనము సత్యమనిఎవరికైతేదృఢమగు నిశ్చయము ఉండునో వారికి ఇహ పరలోకములలో పరమ సుఖహు కలుగును. వారికి ఎచ్చటనైననూ దుఃఖము లేదు(59).
గురువుల వచనం సత్యమనే నిర్ణయం ఎవరి హృదయములో ఉండదో, వారికి ఇహమునందు, పరమునందు కూడ దుఃఖము కలుగును. వారికి ఎచ్చటనైననూ సుఖము కలుగదు(60). ఓ బ్రహ్మణులారా! గురువచనమును ఎట్టి పరిస్థితులోనైననూ వీడరాదు. నా ఈ హఠము నన్ను గృహిణిని చేసి శాశ్విత సుఖము నీయ వచ్చును. లేదా నాకు శూన్యము మిగులవచ్చును (61).
ఓ ముని శ్రేష్ఠులారా! మీరు చక్కగా చెప్పిన వచనము సరిగాదు. దానిలో గల వివేకమును సంగ్రహముగా చెప్పెదను. (62) విష్ణువు గుణ సంపన్నుడనియు, విహరించు వాడనియు చెప్పితిరి సత్యమే. సదాశివుడు గుణహీనుడని చెప్పబడినాడు.దానికి గల కారణమును చెప్పెదను(63).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 105 / Viveka Chudamani - 105🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 24. సమాధి స్థితి - 1 🍀*
353. ఎప్పుడూ ఒక్కటే అయిన రెండవది ఏదీలేని ఆత్మను తెలుసుకొని, అందుకు నిర్వికల్ప సమాధిని పొంది, హృదయములో అజ్ఞానమనే ముడిని పూర్తిగా ద్వంసము చేయాలి.
354. బుద్ది యొక్క లోపాల వలన దాని ఊహలైన ‘నీవు’ ‘నేను’ ‘ఇది’ అనే వివిధ భావనలు చేయుట జరుగుచున్నది. అయితే ఎపుడైతే ఏకమైన, రెండవది ఏదీలేని పరమాత్మను తన సమాధి స్థితిలో స్థాపించగలుగుతారు, అలాంటి ఊహలన్ని కరిగిపోయి, సాధకుడు బ్రహ్మము యొక్క సత్యాన్ని తెలుసుకొనగలడు.
355. సన్యాసి నిశ్చలముగా, శాంతముగా స్థితప్రజ్ఞుడై, బాహ్య ప్రపంచ వస్తు సముధాయమును పూర్తిగా అడ్డు తొలగించుకొని, సమాధి స్థితి కొరకు తనను తాను అంకితము చేసుకొని, ఎల్లప్పుడు విశ్వాత్మయే తన ఆత్మ అను భావముతో ఉండగలుగుచున్నాడు. అజ్ఞానము వలన రూపొందిన భావనలను పూర్తిగా నాశనం చేసి అతడు బ్రహ్మనంద స్థితిలో ఉంటూ మనస్సు యొక్క ఊగిసలాటలతో కూడిన పనులను నాశనం చేయుచున్నాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 105 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 24. Samadhi State - 1 🌻*
353. When the Atman, the One without a second, is realised by means of the Nirvikalpa Samadhi, then the heart’s knot of ignorance is totally destroyed.
354. Such imaginations as "thou", "I" or "this" take place through the defects of the Buddhi. But when the Paramatman, the Absolute, the One without a second, manifests Itself in Samadhi, all such imaginations are dissolved for the aspirant, through the realisation of the truth of Brahman.
355. The Sannyasin, calm, self-controlled, perfectly retiring from the sense-world, forbearing, and devoting himself to the practice of Samadhi, always reflects on his own self being the Self of the whole universe. Destroying completely by this means the imaginations which are due to the gloom of ignorance, he lives blissfully as Brahman, free from action and the oscillations of the mind.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 57 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. సుఖ దుఃఖములు 🌻*
మానవులు సామాన్యముగా తనకు దుఃఖము కలుగకుండవలెననియు, సుఖము కలుగవలెననియు అభిప్రాయపడుదురు. దానిని అనుసరించి ప్రయత్నములు, పనులు చేయుచుందురు.
ప్రణాళికలు, పన్నుగడలు, తీర్పులు దానిని అనుసరించియే చేయుదురు. అన్ని పనులకును, అన్ని ప్రయత్నములకును, ఆదర్శములకును, ఆశయములకును పునాదిలో ఉండు అభిప్రాయము ఒక్కటే. దుఃఖములు, బాధలు తమకు కలుగకూడదనియు, సుఖము కలుగవలెననియు.
ఈ అభిప్రాయమే విషకీటకము వలె పనిచేసి దుఃఖములలో పడద్రోయుచుండును.
ఈ అభిప్రాయము నందు లోభము, స్వార్థము, ఇమిడి ఉండుటయే దీనికి కారణము. తుదకు పాపకార్యములు మాని పుణ్యకార్యములు చేయువారిలో కూడా చాలమందికి ఇదియే అభిప్రాయముండును.
పాపకార్యములు మానుట వలన దుష్కర్మ నశించుననియు, పుణ్యకార్యములు చేయుట వలన పుణ్యఫలము పెరుగుననియు పేరాశ వేదించుచుండును. వీరిని కూడా తమ కర్మఫలములు బంధించును. శుభాశుభఫల సమ్మిశ్రమముగా జీవితము జరుగుచుండును.
ఒకనాడు ఏడ్చుట, ఒకనాడు నవ్వుటగా సంసార సాగరపు తరంగ డోలికలపై జీవితము మునిగి తేలుచుండును. మోక్షమును కోరిన వారిలో కూడా చాలా మంది ఈ పేరాశతోనే ప్రవర్తింతురు.
మిగిలిన అజ్ఞాన జీవులకు కలుగుచున్న దుఃఖములు తమకు కలుగరాదనియు, ప్రపంచము నందలి కర్మ ఫలము తమకు అంటకుండ అతీతులై ఈ దుఃఖమయ ప్రపంచమును చూచుచుండవలెననియు వారు భావింతురు.
జనన మరణములకు అతీతులై శాశ్వత లోకమున ఉండి సుఖించుచుండవలెనని పేరాశతో మోక్ష ధర్మమును అవలంబించువారు కలరు. ఇది అన్నిటిని మించిన స్వార్థము కనుక వారు నిత్యనరకమున పడుచుందురు.
ఇంతకాలము నిస్వార్థముగా జీవించుట వలన లోకము మనలను ఏమి గుర్తించినది? అని దుర్భుద్ధి పుట్టును. దానితో మరల అసుర ప్రవృత్తి ప్రారంభమగును. వీరెవ్వరును మోక్షస్థితిని పొందలేరు.
తమ కర్తవ్యమును గుర్తించి, తమ ఆశ్రితులపై తమకు గల బాధ్యతను భగవంతుని కార్యముగా సమర్పణ బుద్ధితో సంతోషముగా ఆదరించు వారొక్కరే మోక్షమునకు అర్హులు. వారిదే భగవంతుని సామ్రాజ్యము!...
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 46 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 CONFUSION 🍀*
*🕉 Drop your fixed ideas. Then you will be able to enjoy confusion more. And it will not be confusion--it will be creative chaos. We need a creative chaos in the heart to give birth to dancing stars. There is no other way. 🕉*
If you have fixed ideas, life is going to create much confusion for you, because life never believes your ideas. It goes on muddling things. It goes on meddling with people. It goes on playing tricks. It is not a drawing room in which you fix your furniture and it remains the same. It is a very wild phenomenon.
God is very chaotic. God is not an engineer or an architect, scientist or a mathematician. God is a dreamer, and in a world of dreams, everything is muddled. Your boyfriend suddenly becomes a horse .... In a dream you never argue and never say, "What has happened? Just a moment before you were my boyfriend and now you have become a horse!" In a dream, you accept.
Not even a suspicion about what is happening arises, because in a dream you don't carry your ideas. But while you are awake it will be impossible for you to see that your boyfriend is turning into a horse, And boyfriends many times turn into horses! The face may remain the same but the energy becomes different. Then you feel confused.
I have never really come across any person who is confused. Rather I come across people who have fixed ideas. The more fixed the idea, the more confusion there will be. If you want to be unconfused, drop the idea-not that confusion will change, but it will not look like confusion at all. It is just life, alive.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 106 / Sri Lalita Sahasranamavali - Meaning - 106 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 106. మూలా ధారాంబుజారూఢా, పంచవక్త్రా,ఽస్థిసంస్థితా ।*
*అంకుశాది ప్రహరణా, వరదాది నిషేవితా ॥ 106 ॥🍀*
🍀 514. మూలాధారాంభుజారూఢా -
మూలాధార పద్మములో అధివసించునది.
🍀 515. పంచ వక్త్రా -
ఐదు ముఖములతో నుండునది.
🍀 516. అస్థి సంస్థితా -
ఎముకలను ఆశ్రయించి ఉండునది.
🍀 517. అంకుశాది ప్రహరణా -
అంకుశం మొదలైన ఆయుధములను ధరించి ఉండునది.
🍀 518. వరదాది నిషేవితా -
వరదా మొదలైన నలుగురు పరివార దేవతలచే సేవింపబడునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 106 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 106. mūlādhārāmbujārūḍhā pañca-vaktrā'sthi-saṁsthitā |*
*aṅkuśādi-praharaṇā varadādi-niṣevitā || 106 || 🌻*
🌻 514 ) Mooladrambujarooda -
She who sits on the mooladhara kamala or the lotus which is the basic support
🌻 515 ) Pancha vakthra -
She who has five faces
🌻 516 ) Sthithi samsthitha -
She who is in the bones
🌻 517 ) Ankusathi praharana -
She who holds Ankusha and other weapons
🌻 518 ) Varadadhi nishevitha -
She who is surrounded by Vardha and other shakthis
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 106 / Sri Vishnu Sahasra Namavali - 106 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*
*రేవతి నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం*
*🍀 106. ఆత్మయోని స్స్యయంజాతో వైఖాన స్సామగాయనః|*
*దేవకీ నన్దన స్స్రష్టా క్షితీశః పాపనాశనః || 106 ‖ 🍀*
🍀 985) ఆత్మయోని: -
తన ఆవిర్భావమునకు తానే కారణమైనవాడు.
🍀 986) స్వయంజాత: -
మరొకరి ప్రమేయము లేకనే తనకు తానుగ ఆవిర్భవించువాడు.
🍀 987) వైఖాన: -
ప్రాపంచిక దు:ఖమును నివారించువాడు.
🍀 988) సామగాయన: -
సామగానము చేయువాడు.
🍀 989) దేవకీనందన: -
దేవకీ పుత్రుడైన శ్రీ కృష్ణుడు.
🍀 990) స్రష్టా -
సృష్టికర్త
🍀 991) క్షితీశ: -
భూమికి నాధుడైనవాడు.
🍀 992) పాపనాశన: -
పాపములను నశింపజేయువాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 106 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*
*Sloka for Revathi 2nd Padam*
*🌻 106. ātmayōniḥ svayaṁjātō vaikhānaḥ sāmagāyanaḥ |*
*devakīnandanaḥ sraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ || 106 || 🌻*
🌻 985. Ātmayōniḥ:
One who is the source of all; that is, there is no material cause other than Himself for the universe.
🌻 986. Svayaṁ-jātaḥ:
He is also the instrumental cause.
🌻 987. Vaikhānaḥ:
One who excavated the earth, taking a unique form.
🌻 988. Sāmagāyanaḥ:
One who recites the Sama chants.
🌻 989. Devakī-nandanaḥ: The Son of Devaki in the incarnation as Krishna.
🌻 990. Sraṣṭā:
The creator of all the worlds.
🌻 991. Kṣitīśaḥ:
A master of the world. Here it denotes Rama.
🌻 992. Pāpanāśanaḥ:
He who destroys the sins of those who adore Him, meditate upon Him, remember and sing hymns of praise on Him.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. తొలి ఏకాదశి శుభాకాంక్షలు 🌹*
*శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం*
*విశ్వాధా(కా)రం గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం!*
*లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం*
*వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైక నాథం!!*
ఇందులో సృష్టిక్రమం, సృష్టిని పాలించే ఈశ్వర స్వరూపం ఒక చక్కని క్రమపద్ధతిలో నిబద్ధించారు.
14నామాలతో ‘విశ్వానికీ – విష్ణువునకు’ ఉన్న అభిన్న సంబంధాన్ని, ఈ శ్లోకం స్పష్టపరుస్తోంది.
ఒకే శ్లోకంలో, విశ్వానికి పూర్వ స్థితి నుండి సృష్టి స్థితులను కూడా నిర్వహిస్తున్న భగవత్తత్త్వాన్ని స్పష్టపరచడం, ఆర్ష దృష్టి వైభవం.
ఇంత స్పష్టంగా పరమేశ్వరుని గొప్పతనాన్ని, ఆయనలోని సాకార నిరాకార తత్వాలను తెలియజేస్తూ యోగపూర్వక ధ్యానం ద్వారా, మన హృదయాలలోనే ఆయనను దర్శించగలమనే, సాధనా రహస్యాన్ని కూడా, ఈ శ్లోకం అందిస్తోంది.
అర్థస్ఫూర్తితో దీనిని పఠిస్తే, దీనిలో పరిపూర్ణ పరమేశ్వర తత్త్వాన్ని, సులభంగా అందుకోగలం.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹