శ్రీ లలితా సహస్ర నామములు - 79 / Sri Lalita Sahasranamavali - Meaning - 79

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 79 / Sri Lalita Sahasranamavali - Meaning - 79 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।
తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀

🍀 357. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా -
ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపములనెడి అగ్నిచేత తపింప చేయబడిన వారలకు మిక్కిలి సంతోషమును కలుగజేయునట్టి వెన్నెల వంటిది.

🍀 358. తరుణీ -
ఎప్పుడు తరుణ వయస్సు, అనగా ఒకేరీతి యౌవనము గలది.

🍀 359. తాపసారాధ్యా -
తపస్సు చేయువారిచే ఆరాధింపబడునది.

🍀 360. తనుమధ్యా -
కృశించిన అనగా సన్నని కటి ప్రదేశము అనగా నడుము గలది.

🍀 361. తమో పహా - 
చీకటిని లేదా అజ్ఞానమును పోగొట్టునది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 79 🌹

📚. Prasad Bharadwaj

🌻 79. tāpatrayāgni-santapta-samāhlādana-candrikā |
taruṇī tāpasārādhyā tanumadhyā tamo'pahā || 79 || 🌻

🌻 357 ) Thapatryagni santhaptha samahladahna chandrika -
She who is like the pleasure giving moon to those who suffer from the three types of pain

🌻 358 ) Tharuni -
She who is ever young

🌻 359 ) Thapasa aradhya -
She who is being worshipped by sages

🌻 360 ) Thanu Madhya -
She who has a narrow middle (hip)

🌻 361 ) Thamopaha -
She who destroys darkness

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

24 May 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 30

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 30 🌹

✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : సాయి మణి ప్రియ

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అంతరంగం 🌻

తనతో పాటు వచ్చిన గుణములే ఆ మనిషిని నడిపిస్తూంటాయి. ఆ గుణముల స్వభావాన్ని బట్టి అతని స్థానం ఈ సమాజంలో ఎంత వుందో అవగతమౌతుంది. ఆ గుణములు సద్గుగుణములైతే ఆ నడత తీరు ఎంతో సంస్కారవంతముగా ఉంటుంది.

అతని తీరు సమాజానికి క్షేమము ను శ్రేయస్సు ను కలుగజేస్తుంది. ఈ సమాజాన్ని సుసంపన్నం చేస్తుంది. అతని జీవితం ....అతని జీవనవిధానం యజ్ఞార్థముగా సాగుతుంది.

అతడే భావితరాలకు ఆదర్శప్రాయుడై ప్రాతఃస్మరణీయుడౌతాడు. నేటి సమాజమునకు అటు వంటి వ్వక్తులే అవసరం మరియు ఆవశ్యకము కూడా.

🌹 🌹 🌹 🌹 🌹

24 May 2021

శ్రీ శివ మహా పురాణము - 402

🌹 . శ్రీ శివ మహా పురాణము - 402🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 21

🌻. పార్వతికి నారదుని ఉపదేశము - 1 🌻

నారదుడిట్లు పలికెను-

ఓ విధీ! తండ్రీ! నీవు మహాబుద్ధి శాలివి. విష్ణు శిష్యుడవు. ముల్లోకములను నీవు సృష్టించినావు. శంకరమహాత్ముని ఈ అద్భుతమగు గాథను చెప్పితివి (1). శంభుని మూడవ నేత్రము నుండి పుట్టిన అగ్నిచే మన్మథుడు భస్మము కాగా ఆ అగ్ని సముద్రములో ప్రవేశించగా, తరువాత ఏమి జరిగినదో నీవు చెప్పుము (2). హిమవత్పుత్రిక యగు పార్వతీ దేవి అపుడేమి చేసెను? ఆమె సఖురాండ్రిద్దరితో గూడి ఎచటకు వెళ్లెను? ఓ దయానిధీ! ఇపుడా వృత్తాంతమును చెప్పుము (3).

బ్రహ్మ ఇట్లు పలికెను-

వత్సా! నీవు మహా బుద్ధిశాలివి. నేను గొప్ప లీలాకరుడగు చంద్రశేఖర స్వామి చరితమును వర్ణించెదను. నీవు ఆదరముతో వినుము (4). శంభుని కంటినుండి బయల్వెడలిన అగ్ని మన్మథుని దహించివేసినది గదా! దాని ప్రభావముచే అద్భుతమగు మహాశబ్దము పుట్టి ఆకాశము నిండిపోయెను (5). దహింపబడిన కాముని చూచి, ఆ గొప్ప శబ్దమును విని ఆ పార్వతి భయపడినదై సఖురాండ్రిద్దరితో గూడి కంగారుగా తన గృహమునకు వెళ్లెను (6). ఆ శబ్దమును కుటుంబ సభ్యులతో గూడియున్న హిమవంతుడు గూడ విని శివుని వద్దకు వెళ్లియున్న కుమారైను స్మరించి విస్మయమును, మహా దుఃఖమును పొందెను (7).

శంభుని విరహముచే మహా దుఃఖమును పొంది రోదించుచున్న కుమారైను చూచి పర్వత రాజగు హిమవంతుడు శోకమును పొంది ఆమె వద్దకు వచ్చెను (8). ఆమెను తన దగ్గరకు తీసుకొని, ఆయన కన్నీటిని తుడిచి 'ఓ పార్వతీ! భయపడకుము, ఏడ్వకము' అని పలికి ఓదార్చెను (9). పర్వతరాజగు హిమవంతుడు వెంటనే తన కుమార్తెను ఒడిలో కూర్చుండ బెట్టుకొనెను. మరియు మిక్కిలి దుఃఖితురాలైయున్న ఆమెను ఓదార్చుచూ తన ప్రాసాదములోనికి తీసుకొనివెళ్లెను (10). శివుడు మన్మథుని బూడిద చేసి అంతర్ధానము కాగానే పార్వతి ఆయన యొక్క విరహముచే మిక్కిలి దుఃఖితురాలై ఎక్కడనూ మనశ్శాంతిని పొందలేకపోయెను (11).

ఆ పార్వతి తండ్రి గృహమును చేరిన తరువాత తల్లిని కలుసుకొనెను. అపుడామెకు తాను పునర్జన్మను పొందినట్లు భాసించెను (12) మరియు ఆమె తన రూపమును నిందించుకొని, 'అయ్యో! హతురాలనైతిని' అని దుఃఖించెను. సఖురాండ్రు ఆమెను ఓదార్చిరి. అయిననూ ఆమెకు దుఃఖవిముక్తి కలుగలేదు (13). ఆ పార్వతి నిద్రించుచున్నప్పుడు గాని, నీటిని త్రాగునప్పుడు గాని, స్నానమును చేయునప్పుడు గాని, ఇటునటు నడచునప్పుడు గాని, సఖురాండ్ర మధ్యలో నున్నప్పుడు గాని లేశ##మైననూ సుఖమును పొందలేక పోయెను (14). 'నా రూపము మరియు కర్మ నిందింపదగినవి' అని పలుకుచూ ఆమె సర్వదా శివుని చేష్టలను స్మరింపజొచ్చెను (15).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

24 May 2021

గీతోపనిషత్తు -202

🌹. గీతోపనిషత్తు -202 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 43

🍀 42. ఆత్మ సంయోగము - పూర్వజన్మము నందు బుద్ధితో సంయోగము చెందుటకు ప్రయత్నము జరుగుట వలన ఈ జన్మలో బుద్ధి సంయోగము పొందుటకు వలసిన వాతావరణము నందు జన్మించి, సిద్ధికొరకు యోగ సాధకుడు ప్రయత్నము సాగించును. ఈ జన్మ యందు అవకాశము మరల లభించినది కనుక ఈ జన్మమున పూర్ణసిద్ధి కొరకు అతడు తప్పక ప్రయత్నించును. జీవుల వెంట వచ్చు సంస్కారములలో దైవీ సంపర్క సంస్కారము జీవుని వెంటనంటి అతనిని కడతేర్చును.కావున మనసును బుద్ధితో చేర్చుచు పరిశుద్ధము, సుగంధభరితమునగు ఆత్మ సంస్కారము కొరకై ప్రయత్నించుటయే శుభకరము. 🍀

తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదైహికమ్ |
యతతే చతతో భూయః సంసిద్దె కురునందన || 43

పూర్వజన్మము నందు బుద్ధితో సంయోగము చెందుటకు ప్రయత్నము జరుగుట వలన ఈ జన్మలో బుద్ధి సంయోగము పొందుటకు వలసిన వాతావరణమునందు జన్మించి, సిద్ధికొరకు యోగ సాధకుడు ప్రయత్నము సాగించును. యోగుల కుటుంబమునందు జన్మించుట దుర్లభమని, ఉత్తమోత్తమ మని, అత్యంత శ్రేయస్కరమని తెలిపిన భగవానుడు, అట్టి యోగుల కుటుంబమున పుట్టుట కేవలము యోగపరమగు పూర్వజన్మ సంస్కారమును సంసిద్ధి పొందుటకే.

పూర్వజన్మమున అసంపూర్తిగ మిగులునట్టి ప్రయత్నము ఉత్తర జన్మమున కొనసాగును. పూర్వజన్మ సంస్కారము వలననే ఈ జన్మ యందు అవకాశము మరల లభించినది. కనుక ఈ జన్మమున పూర్ణసిద్ధి కొరకు అతడు తప్పక ప్రయత్నించును. మహారాష్ట్రమున పుండరీకుని కథ, ఆంధ్రమున వేమనకథ ఈ సందర్భమున ఉదాహరణముగ చెప్పుకొన వచ్చును.

వారిరువురును పూర్వ జన్మమున యోగ సంస్కారముతో పాటు కొంత స్త్రీ కామ సంబంధితమైన సంస్కారము కూడ మిగిలినది. తత్కారణముగ తరువాత జన్మలో యోగుల కుటుంబమున జన్మించి, భోగ విషయైక సంపర్కమున తదను గుణమైన మిథ్యను గ్రహించి, ఆ సంస్కార మంతము కాగ యోగ సంస్కారముననే నిలచి సిద్ధిని పొందిరి.

అజామీళుని కథకూడ దైవస్మరణతో మరణించినవారు మరు జన్మలలో ఆ సంస్కారములు వెంటరాగా, వరుసగ కొన్ని జన్మలలో యోగసిద్ధి చెందుదురని సూచించును. అజామీళుడా జన్మ యందు 'నారా' శబ్దము పలుకుచు మరణించెను. మరు జన్మలలో ఉత్తమోత్తమ మగు త్రివేణి సంగమ తీరమునందు జన్మలు పొంది, దైవీ సంస్కారమును పెంపొందించుకొనుచు సాగెను. కొద్ది జన్మలలోనే సిద్ధి పొందెను.

కావున జీవుల వెంటవచ్చు సంస్కారములలో దైవీ సంపర్క సంస్కారము జీవుని వెంటనంటి అతనిని కడతేర్చును. ఇతర సంస్కారములు మార్గమున నశించును. కావున మనసును బుద్ధితో చేర్చుచు పరిశుద్ధము, సుగంధభరితమునగు ఆత్మ సంస్కారము కొరకై ప్రయత్నించుటయే శుభకరము. చేసిన ప్రతి ప్రయత్నము జీవునియందు వికాసము కలిగించుచునే యుండును.

ఇట్టి యోగ సంస్కారముననే జీవుడు మరణమును దాటి, తా నెవరో తనకు తెలిసి, చిరంజీవియై నిలచి, జగత్కల్యాణ కారక మగు దివ్య ప్రణాళికలో అంతర్భాగమై శాశ్వతముగ నిలచి యుండును. దీనికొరకే బుద్ధియోగము, అటు పైన ఆత్మయోగము ఆవశ్యకమైనవి. ఇట్టి శాశ్వతత్వమునిచ్చు విద్య మానవులకే సాధ్యము.

కనుక మానవుడు తన కందివచ్చిన నరజన్మమును, మనో యింద్రియ శరీరముల పరితృప్తి కొరకు వ్యర్థము చేయరాదు. జీవుడు పశుజన్మలెత్తునపుడు ఇంద్రియ పరితృప్తి, శరీర పరితృప్తి చాలకాలము సాగించును. బుద్ధి పరితృప్తి, ఆత్మ పరితృప్తి కొరకే నరజన్మ ప్రకృతి అందించును. ఆత్మ సంయోగము జరిగినపుడే నరజన్మ సార్థక్యమగును.

అట్టి ప్రయత్నము జరుగుచున్న తడవంతయు ప్రకృతి నరజన్మ మందించగలదు. క్రమముగ ఉత్త మోత్తమ జన్మలు కూడ తనవంతు సహకారముగ అందించగలదు. దైవమిచ్చిన కర్మ జ్ఞాన సన్యాస సూత్రములను నిత్య జీవనమందు పాటించుచు, యతచిత్తుడై, మనస్సును బుద్ధిపై నిలపి బుద్ధితో సంయోగము చెంది, ఆ పిమ్మట బుద్ధియందు నిలచి, ఆత్మ సంయోగమునకు కృషి సలిపి ఆత్మయై నిలువవలెను.

అపుడు ఆత్మ బుద్ధి, మనసు, ఇంద్రియములు, శరీరము సూత్రమున కెక్కించిన మణులవలె ఒక మాలగ ఏర్పడును. అపుడు జీవుడు సమర్థుడై, సంపూర్ణుడై ప్రకాశించును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

24 May 2021

24-MAY-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 202🌹  
2) 🌹. శివ మహా పురాణము - 402🌹 
3) 🌹 Light On The Path - 149🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -30🌹  
5) 🌹 Osho Daily Meditations - 19🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 79 / Lalitha Sahasra Namavali - 79🌹 
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 79 / Sri Vishnu Sahasranama - 79🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -202 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 43

*🍀 42. ఆత్మ సంయోగము - పూర్వజన్మము నందు బుద్ధితో సంయోగము చెందుటకు ప్రయత్నము జరుగుట వలన ఈ జన్మలో బుద్ధి సంయోగము పొందుటకు వలసిన వాతావరణము నందు జన్మించి, సిద్ధికొరకు యోగ సాధకుడు ప్రయత్నము సాగించును. ఈ జన్మ యందు అవకాశము మరల లభించినది కనుక ఈ జన్మమున పూర్ణసిద్ధి కొరకు అతడు తప్పక ప్రయత్నించును. జీవుల వెంట వచ్చు సంస్కారములలో దైవీ సంపర్క సంస్కారము జీవుని వెంటనంటి అతనిని కడతేర్చును.కావున మనసును బుద్ధితో చేర్చుచు పరిశుద్ధము, సుగంధభరితమునగు ఆత్మ సంస్కారము కొరకై ప్రయత్నించుటయే శుభకరము. 🍀*

తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదైహికమ్ |
యతతే చతతో భూయః సంసిద్దె కురునందన || 43

పూర్వజన్మము నందు బుద్ధితో సంయోగము చెందుటకు ప్రయత్నము జరుగుట వలన ఈ జన్మలో బుద్ధి సంయోగము పొందుటకు వలసిన వాతావరణమునందు జన్మించి, సిద్ధికొరకు యోగ సాధకుడు ప్రయత్నము సాగించును. యోగుల కుటుంబమునందు జన్మించుట దుర్లభమని, ఉత్తమోత్తమ మని, అత్యంత శ్రేయస్కరమని తెలిపిన భగవానుడు, అట్టి యోగుల కుటుంబమున పుట్టుట కేవలము యోగపరమగు పూర్వజన్మ సంస్కారమును సంసిద్ధి పొందుటకే. 

పూర్వజన్మమున అసంపూర్తిగ మిగులునట్టి ప్రయత్నము ఉత్తర జన్మమున కొనసాగును. పూర్వజన్మ సంస్కారము వలననే ఈ జన్మ యందు అవకాశము మరల లభించినది. కనుక ఈ జన్మమున పూర్ణసిద్ధి కొరకు అతడు తప్పక ప్రయత్నించును. మహారాష్ట్రమున పుండరీకుని కథ, ఆంధ్రమున వేమనకథ ఈ సందర్భమున ఉదాహరణముగ చెప్పుకొన వచ్చును. 

వారిరువురును పూర్వ జన్మమున యోగ సంస్కారముతో పాటు కొంత స్త్రీ కామ సంబంధితమైన సంస్కారము కూడ మిగిలినది. తత్కారణముగ తరువాత జన్మలో యోగుల కుటుంబమున జన్మించి, భోగ విషయైక సంపర్కమున తదను గుణమైన మిథ్యను గ్రహించి, ఆ సంస్కార మంతము కాగ యోగ సంస్కారముననే నిలచి సిద్ధిని పొందిరి. 

అజామీళుని కథకూడ దైవస్మరణతో మరణించినవారు మరు జన్మలలో ఆ సంస్కారములు వెంటరాగా, వరుసగ కొన్ని జన్మలలో యోగసిద్ధి చెందుదురని సూచించును. అజామీళుడా జన్మ యందు 'నారా' శబ్దము పలుకుచు మరణించెను. మరు జన్మలలో ఉత్తమోత్తమ మగు త్రివేణి సంగమ తీరమునందు జన్మలు పొంది, దైవీ సంస్కారమును పెంపొందించుకొనుచు సాగెను. కొద్ది జన్మలలోనే సిద్ధి పొందెను. 

కావున జీవుల వెంటవచ్చు సంస్కారములలో దైవీ సంపర్క సంస్కారము జీవుని వెంటనంటి అతనిని కడతేర్చును. ఇతర సంస్కారములు మార్గమున నశించును. కావున మనసును బుద్ధితో చేర్చుచు పరిశుద్ధము, సుగంధభరితమునగు ఆత్మ సంస్కారము కొరకై ప్రయత్నించుటయే శుభకరము. చేసిన ప్రతి ప్రయత్నము జీవునియందు వికాసము కలిగించుచునే యుండును. 

ఇట్టి యోగ సంస్కారముననే జీవుడు మరణమును దాటి, తా నెవరో తనకు తెలిసి, చిరంజీవియై నిలచి, జగత్కల్యాణ కారక మగు దివ్య ప్రణాళికలో అంతర్భాగమై శాశ్వతముగ నిలచి యుండును. దీనికొరకే బుద్ధియోగము, అటు పైన ఆత్మయోగము ఆవశ్యకమైనవి. ఇట్టి శాశ్వతత్వమునిచ్చు విద్య మానవులకే సాధ్యము. 

కనుక మానవుడు తన కందివచ్చిన నరజన్మమును, మనో యింద్రియ శరీరముల పరితృప్తి కొరకు వ్యర్థము చేయరాదు. జీవుడు పశుజన్మలెత్తునపుడు ఇంద్రియ పరితృప్తి, శరీర పరితృప్తి చాలకాలము సాగించును. బుద్ధి పరితృప్తి, ఆత్మ పరితృప్తి కొరకే నరజన్మ ప్రకృతి అందించును. ఆత్మ సంయోగము జరిగినపుడే నరజన్మ సార్థక్యమగును. 

అట్టి ప్రయత్నము జరుగుచున్న తడవంతయు ప్రకృతి నరజన్మ మందించగలదు. క్రమముగ ఉత్త మోత్తమ జన్మలు కూడ తనవంతు సహకారముగ అందించగలదు. దైవమిచ్చిన కర్మ జ్ఞాన సన్యాస సూత్రములను నిత్య జీవనమందు పాటించుచు, యతచిత్తుడై, మనస్సును బుద్ధిపై నిలపి బుద్ధితో సంయోగము చెంది, ఆ పిమ్మట బుద్ధియందు నిలచి, ఆత్మ సంయోగమునకు కృషి సలిపి ఆత్మయై నిలువవలెను. 

అపుడు ఆత్మ బుద్ధి, మనసు, ఇంద్రియములు, శరీరము సూత్రమున కెక్కించిన మణులవలె ఒక మాలగ ఏర్పడును. అపుడు జీవుడు సమర్థుడై, సంపూర్ణుడై ప్రకాశించును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 402🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 21

*🌻. పార్వతికి నారదుని ఉపదేశము - 1 🌻*

నారదుడిట్లు పలికెను-

ఓ విధీ! తండ్రీ! నీవు మహాబుద్ధి శాలివి. విష్ణు శిష్యుడవు. ముల్లోకములను నీవు సృష్టించినావు. శంకరమహాత్ముని ఈ అద్భుతమగు గాథను చెప్పితివి (1). శంభుని మూడవ నేత్రము నుండి పుట్టిన అగ్నిచే మన్మథుడు భస్మము కాగా ఆ అగ్ని సముద్రములో ప్రవేశించగా, తరువాత ఏమి జరిగినదో నీవు చెప్పుము (2). హిమవత్పుత్రిక యగు పార్వతీ దేవి అపుడేమి చేసెను? ఆమె సఖురాండ్రిద్దరితో గూడి ఎచటకు వెళ్లెను? ఓ దయానిధీ! ఇపుడా వృత్తాంతమును చెప్పుము (3).

బ్రహ్మ ఇట్లు పలికెను-

వత్సా! నీవు మహా బుద్ధిశాలివి. నేను గొప్ప లీలాకరుడగు చంద్రశేఖర స్వామి చరితమును వర్ణించెదను. నీవు ఆదరముతో వినుము (4). శంభుని కంటినుండి బయల్వెడలిన అగ్ని మన్మథుని దహించివేసినది గదా! దాని ప్రభావముచే అద్భుతమగు మహాశబ్దము పుట్టి ఆకాశము నిండిపోయెను (5). దహింపబడిన కాముని చూచి, ఆ గొప్ప శబ్దమును విని ఆ పార్వతి భయపడినదై సఖురాండ్రిద్దరితో గూడి కంగారుగా తన గృహమునకు వెళ్లెను (6). ఆ శబ్దమును కుటుంబ సభ్యులతో గూడియున్న హిమవంతుడు గూడ విని శివుని వద్దకు వెళ్లియున్న కుమారైను స్మరించి విస్మయమును, మహా దుఃఖమును పొందెను (7).

శంభుని విరహముచే మహా దుఃఖమును పొంది రోదించుచున్న కుమారైను చూచి పర్వత రాజగు హిమవంతుడు శోకమును పొంది ఆమె వద్దకు వచ్చెను (8). ఆమెను తన దగ్గరకు తీసుకొని, ఆయన కన్నీటిని తుడిచి 'ఓ పార్వతీ! భయపడకుము, ఏడ్వకము' అని పలికి ఓదార్చెను (9). పర్వతరాజగు హిమవంతుడు వెంటనే తన కుమార్తెను ఒడిలో కూర్చుండ బెట్టుకొనెను. మరియు మిక్కిలి దుఃఖితురాలైయున్న ఆమెను ఓదార్చుచూ తన ప్రాసాదములోనికి తీసుకొనివెళ్లెను (10). శివుడు మన్మథుని బూడిద చేసి అంతర్ధానము కాగానే పార్వతి ఆయన యొక్క విరహముచే మిక్కిలి దుఃఖితురాలై ఎక్కడనూ మనశ్శాంతిని పొందలేకపోయెను (11).

ఆ పార్వతి తండ్రి గృహమును చేరిన తరువాత తల్లిని కలుసుకొనెను. అపుడామెకు తాను పునర్జన్మను పొందినట్లు భాసించెను (12) మరియు ఆమె తన రూపమును నిందించుకొని, 'అయ్యో! హతురాలనైతిని' అని దుఃఖించెను. సఖురాండ్రు ఆమెను ఓదార్చిరి. అయిననూ ఆమెకు దుఃఖవిముక్తి కలుగలేదు (13). ఆ పార్వతి నిద్రించుచున్నప్పుడు గాని, నీటిని త్రాగునప్పుడు గాని, స్నానమును చేయునప్పుడు గాని, ఇటునటు నడచునప్పుడు గాని, సఖురాండ్ర మధ్యలో నున్నప్పుడు గాని లేశ##మైననూ సుఖమును పొందలేక పోయెను (14). 'నా రూపము మరియు కర్మ నిందింపదగినవి' అని పలుకుచూ ఆమె సర్వదా శివుని చేష్టలను స్మరింపజొచ్చెను (15).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 149 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 11 - Master Hilarion’s note on Rule 21.
*🌻 To read, in the occult sense, is to read with the eyes of the spirit. To ask is to feel the hunger within – the yearning of spiritual aspiration. - 4 🌻*

557. A clairvoyant watching a revivalist meeting will generally see that non-human entities are gathered round it in order to take advantage of the vast waves of uncontrolled emotion. Emotion is a tremendous force and these waves are, if we consider actual measurement, things of enormous size and power. 

They dash and rush about through the astral world in the neighbourhood, and produce all the effect there that a great tempest would show on the physical plane. There are many astral creatures who revel in that. They plunge in and feel the greatest delight and excitement because of it. 

They neither know nor care whether the emotion is religious feeling or hatred or love; they want only the tremendous vibration, the swirl and sway of the storm. These beings take the greatest delight in sweeping round in its vortices, and being carried away by it, very much in the same way that surf-bathers do in the sea. 

For that purpose these entities will stir up emotion among human beings as much as they can; they simply know that here is something which they enjoy tremendously, so they go to work to intensify it as much as possible. Very largely they are responsible for the great outbursts of force on such occasions, and these creatures make it greater just as a school of whales rushing about in rough water would make it rougher. 

They have just about the same amount of intelligence as those animals, so there is nothing very spiritual about it. It is not, as many people think, a divine afflatus, nor is it exactly dignified to allow oneself to be the sport of creatures at that level.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#LightonPath #Theosophy
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 30 🌹
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనం : సాయి మణి ప్రియ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అంతరంగం 🌻

తనతో పాటు వచ్చిన గుణములే ఆ మనిషిని నడిపిస్తూంటాయి. ఆ గుణముల స్వభావాన్ని బట్టి అతని స్థానం ఈ సమాజంలో ఎంత వుందో అవగతమౌతుంది. ఆ గుణములు సద్గుగుణములైతే ఆ నడత తీరు ఎంతో సంస్కారవంతముగా ఉంటుంది. 

అతని తీరు సమాజానికి క్షేమము ను శ్రేయస్సు ను కలుగజేస్తుంది. ఈ సమాజాన్ని సుసంపన్నం చేస్తుంది. అతని జీవితం ....అతని జీవనవిధానం యజ్ఞార్థముగా సాగుతుంది. 

అతడే భావితరాలకు ఆదర్శప్రాయుడై ప్రాతఃస్మరణీయుడౌతాడు. నేటి సమాజమునకు అటు వంటి వ్వక్తులే అవసరం మరియు ఆవశ్యకము కూడా.
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 19 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 SPONTANEITY 🍀*

*🕉 Whatever you do, just do it as totally as possible. if you enjoy walking, good! if suddenly "you realize that you no longer have the urge or desire to move, then sit down immediately; not even a single step should be taken against your will. 🕉*

Whatever happens, accept and enjoy it; and don't force anything. If you feel like talking, talk. If you feel like being silent, be silent just move with the feeling. Don't force in any way, not even for a single moment, because once you force anything you are divided in twoand that creates the problem, then your whole life becomes split. 

The whole of humanity has become almost schizophrenic, because we have been taught to force, things. The part that wants to laugh and the part that doesn't allow you to laugh become separate, and then you are divided. 

You create a top dog and an underdog, so there is conflict. The rift that the conflict creates can become bigger and bigger and bigger. So the problem is how to bridge that rift, and how not to create it anymore. In Zen they have a very beautiful saying: Sitting, just sit. Walking, just walk. Above all, don't wobble.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 79 / Sri Lalita Sahasranamavali - Meaning - 79 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।*
*తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀*

🍀 357. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా - 
ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపములనెడి అగ్నిచేత తపింప చేయబడిన వారలకు మిక్కిలి సంతోషమును కలుగజేయునట్టి వెన్నెల వంటిది.

🍀 358. తరుణీ - 
ఎప్పుడు తరుణ వయస్సు, అనగా ఒకేరీతి యౌవనము గలది.

🍀 359. తాపసారాధ్యా - 
తపస్సు చేయువారిచే ఆరాధింపబడునది.

🍀 360. తనుమధ్యా - 
కృశించిన అనగా సన్నని కటి ప్రదేశము అనగా నడుము గలది.

🍀 361. తమో పహా - చీకటిని లేదా అజ్ఞానమును పోగొట్టునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 79 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 79. tāpatrayāgni-santapta-samāhlādana-candrikā |*
*taruṇī tāpasārādhyā tanumadhyā tamo'pahā || 79 || 🌻*

🌻 357 ) Thapatryagni santhaptha samahladahna chandrika -  
 She who is like the pleasure giving moon to those who suffer from the three types of pain

🌻 358 ) Tharuni -   
She who is ever young

🌻 359 ) Thapasa aradhya -  
 She who is being worshipped by sages

🌻 360 ) Thanu Madhya -   
She who has a narrow middle (hip)

🌻 361 ) Thamopaha -   
She who destroys darkness

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 79 / Sri Vishnu Sahasra Namavali - 79 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*పూర్వాషాడ నక్షత్ర తృతీయ పాద శ్లోకం*

*🍀 79. సువర్ణ వర్ణో హేమాంగో వరాంగ శ్చన్దనాంగదీ|
వీరహా విషమ శ్శూన్యో ఘృతాశీ రచల శ్చలః|| 🍀*

🍀 737. సువర్ణవర్ణః - 
బంగారు వర్ణము గలవాడు.

🍀 738. హేమాంగః - 
బంగారువన్నెగల అవయువములు గలవాడు.

🍀 739. వరంగః - 
అమోఘమైన అవయువములు గలవాడు.

🍀 740. చందనాంగదీ - 
చందనముతో అలంకృతమైనవాడు.

🍀 741. వీరహా - 
వీరులను వధించినవాడు.

🍀 742. విషమః - 
సాటిలేని వాడు.

🍀 743. శూన్యః - 
శూన్యము తానైనవాడు.

🍀 744. ఘృతాశీః - 
సమస్త కోరికలు నుండి విడువడినవాడు.

🍀 745. అచలః - 
కదలిక లేనివాడు.

🍀 746. చలః - 
కదులువాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 79 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Poorvashada 3rd Padam*

*🌻 79. suvarṇavarṇō hemāṅgō varāṅgaścandanāṅgadī |
vīrahā viṣamaḥ śūnyō ghṛtāśīracalaścalaḥ || 79 || 🌻*

🌻 737. Suvarṇavarṇaḥ: 
One who has got the colour of gold.

🌻 738. Hemāṅgaḥ: 
One whose form is like that of gold.

🌻 739. Varāṅgaḥ: 
He the parts of whose form are brilliant.

🌻 740. Candanāṅgadī: 
One who is adorned with armlets that generate joy.

🌻 741. Vīrahā: 
One who destroyed heroes (Viras) like Kiranyakashipu for protecting Dharma.

🌻 742. Viṣamaḥ: 
One to whom there is no euql because nothing is comparable to Him by any characteristic.

🌻 743. Śūnyaḥ: 
One who, being without any attributes, appears as Sunya (emptiness).

🌻 744. Ghṛtāśīḥ: 
One whose blessings are unfailing.

🌻 745. Acalaḥ: 
One who cannot be deprived of His real nature as Truth, Intelligence and Infinity.

🌻 746. Calaḥ: 
One who moves in the form of air.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹