మైత్రేయ మహర్షి బోధనలు - 127


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 127 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 98. అశ్వఘోషుడు - 2🌻

నిత్య జీవితమే ఒక సినిమా. దీనిని గమనించుట నేర్చినచో దాని దర్శకుడు. నిర్మాత యొక్క చాతుర్యము మనలను అబ్బుర పరచగలదు. ప్రకృతి యందుగాని, మానవుని ప్రవర్తనయందు గాని, అంతర్యామిని దర్శించుట, అందమును దర్శించుటే. అతని లీలలుయే పశుపక్ష్యాదులు, సమస్త మానవుల ప్రవర్తనలును. అంతర్యామి సృష్టి నుండి, సృష్టి జీవులనుండి తొంగి చూచుచుండును. తొణికిసలాడు చుండును. మిరుమిట్లు కొలుపుచుండును. దిగ్భ్రాంతి కలిగించు చుండును. భయభ్రాంతులను కూడ కలిగించు చుండును.

అతనిని చూచువారికి సృష్టి అందమే గోచరించును. అశ్వఘోషుడట్లు దర్శించి, స్పందించి, చిత్రించి జనసమూహములను ఉత్తేజపరచినాడు. అతడు కేవలము చిత్రకారుడు కాదు. తీవ్రమగు సాధకుడు. తాను దర్శించిన అంతర్యామి అందమును చిత్రముల బంధించు ప్రయత్నమున సిద్ధుడైనాడు. అతడు నిజమగు యుపాసకుడు. అందము తీరుతెన్ను లెరిగినవాడు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


01 Jun 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 188


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 188 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రేమ ఎక్కడికి తీసుకుపోతుందో ఎవరికీ తెలీదు. వూహకందనివి. పాతదాన్ని పునరుక్తం చెయ్యదు. అది ఎప్పుడు వర్తమానాన్నే ఆవిష్కరిస్తుంది. 'తల' ఎప్పుడూ గతంలో జీవిస్తుంది. అందువల్ల మేథ ఎప్పుడూ సంప్రదాయంలో వుంటుది. హృదయమెప్పుడూ విప్లవాత్మకం. 🍀


హృదయం ప్రేమగుండా జీవిస్తుంది. ప్రేమ అదుపులకు లొంగదు. అది సులభంగా తిరగబడుతుంది. ప్రేమ ఎక్కడికి తీసుకుపోతుందో ఎవరికీ తెలీదు. వూహకందనివి. హఠాత్తుగా జరిగేది. పాతదాన్ని పునరుక్తం చెయ్యదు. అది ఎప్పుడు వర్తమానాన్నే ఆవిష్కరిస్తుంది. 'తల' ఎప్పుడూ గతంలో జీవిస్తుంది. అందువల్ల మేథ ఎప్పుడూ సంప్రదాయంలో వుంటుది. హృదయమెప్పుడూ విప్లవాత్మకం.

కానీ నువ్వు హృదయం గుండానే విజయం సాధించగలవు. ప్రేమ గుండానే విజేతవవుతావు. లాజిక్ ద్వారా కాదు. ఇక్కడ అద్భుతం ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు గుంపు మనస్తత్వానికి వ్యతిరేకంగా తిరగబడినప్పుడు జరుగుతుంది. నువ్వు మరింత మరింత స్వతంత్రంగా మారతావు. అప్పుడు నువ్వు హఠాత్తుగా అనంతంలో భాగంగా అనుభూతి చెందుతావు. విశ్వంలో భాగమవుతావు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


01 Jun 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 288 - 14. భగవంతుడు సర్వోన్నత కర్త / DAILY WISDOM - 288 - 14. God is the Supreme Doer


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 288 / DAILY WISDOM - 288 🌹

🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 14. భగవంతుడు సర్వోన్నత కర్త 🌻


జీవితం యొక్క ప్రతి దశలోనూ జీవితం యొక్క లక్ష్యం భగవంతుని దర్శనం, భగవంతుని అనుభవం, భగవంతుని సాక్షాత్కారం - భగవంతుడు సర్వోన్నత కర్త మరియు అత్యున్నత ఉనికి. శ్రీమద్ భాగవత మహాపురాణం లేదా ఇలాంటి గ్రంథాల ద్వారా మళ్లీ మళ్లీ మనస్సులోకి చొప్పించబడే సూత్రం ఇదే. అటువంటి గ్రంథాల యొక్క నిరంతర అధ్యయనాన్ని అభ్యసిస్తే, అది శుద్ధి చేస్తుంది. ఇది స్వతహాగా ఒక తపస్సు, మరియు ఇది చివరికి తన స్వయం యొక్క స్వభావాన్ని అధ్యయనం చేస్తుంది. ఈ అధ్యయన ప్రక్రియను సూచించడానికి ‘స్వ’ అనే పదం ఇక్కడ ఉపయోగించబడింది-స్వాధ్యాయ.

అలాగే, మనము పతంజలి యొక్క ఒక సూత్రం, తదా ద్రష్టుః స్వరూపే అవస్థానం (I.3)లో ఇలా చెప్పబడింది. వృత్తులు లేదా మనస్సు యొక్క వివిధ మనోవిక్షేపాలు నిరోధించ బడినప్పుడు చూసేవారు తన స్వభావాన్ని కనుగొంటారు. ప్రతి సాధన యొక్క ఉద్దేశ్యం ఇంతే: మనస్సును దాని అసలు మూలానికి తిరిగి తీసుకురావడం. గ్రంధాలలో మనస్సుకు అందించబడిన వివిధ రకాల వివరాలు మనస్సును విలాసపరచడం లేదా బుజ్జగించడం కోసం ఉద్దేశించబడవు, కానీ మనసుకు పరధ్యానం మరియు బాహ్య వస్తువులతో అనుబంధం యొక్క అనారోగ్యాన్ని చికిత్స చేయడం కోసమే. ఈ లక్ష్యం అత్యంత ఆధ్యాత్మికమైనది.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 288 🌹

🍀 📖 from The Study and Practice of Yoga 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 14. God is the Supreme Doer 🌻


The goal of life in every stage of its manifestation is the vision of God, the experience of God, the realisation of God—that God is the Supreme Doer and the Supreme Existence. This is the principle that is driven into the mind again and again by the Srimad Bhagavata Mahapurana or such similar texts. If a continued or sustained study of such scriptures is practised, it is purifying. It is a tapas by itself, and it is a study of the nature of one's own Self, ultimately. The word ‘sva' is used here to designate this process of study—svadhyaya.

Also, we are told in one sutra of Patanjali, tada drastuḥ svarupe avasthanam (I.3), that the seer finds himself in his own nature when the vrittis or the various psychoses of the mind are inhibited. The purpose of every sadhana is only this much: to bring the mind back to its original source. The variety of detail that is provided to the mind in the scriptures has an intention not to pamper or cajole the mind, but to treat the mind of its illness of distraction and attachment to external objects. The aim is highly spiritual.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

01 Jun 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 609 / Vishnu Sahasranama Contemplation - 609


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 609 / Vishnu Sahasranama Contemplation - 609🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 609. శ్రీవిభావనః, श्रीविभावनः, Śrīvibhāvanaḥ 🌻


ఓం శ్రీవిభావనాయ నమః | ॐ श्रीविभावनाय नमः | OM Śrīvibhāvanāya namaḥ

వివిధాస్సర్వ భూతానాం విభావయతి యః శ్రియః ।
తత్తత్కర్మానురూపేణ స హరిః శ్రీవిభావనః ॥

సర్వ భూతములకును తమ తమ కర్మములకు తగిన విధముగా వివిధములగు శ్రీలను విశేషముగా కలుగజేయు వాడు గనుక హరికి శ్రీవిభావనః అను నామము గలదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 609🌹

📚. Prasad Bharadwaj

🌻609. Śrīvibhāvanaḥ🌻

OM Śrīvibhāvanāya namaḥ


विविधास्सर्व भूतानां विभावयति यः श्रियः ।
तत्तत्कर्मानुरूपेण स हरिः श्रीविभावनः ॥

Vividhāssarva bhūtānāṃ vibhāvayati yaḥ śriyaḥ,
Tattatkarmānurūpeṇa sa hariḥ śrīvibhāvanaḥ.

Since Lord Hari accords appropriate Śrī or different kinds of opulence on the beings in accordance to their deeds, He is known as Śrīvibhāvanaḥ.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।
श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥

శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।
శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥

Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,
Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


01 Jun 2022

01 - JUNE - 2022 బుధవారం, సౌమ్య వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 01, జూన్ 2022 బధవారం, సౌమ్య వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 210 / Bhagavad-Gita - 210 - 5- 06 కర్మ యోగము🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 609 / Vishnu Sahasranama Contemplation - 609🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 288 / DAILY WISDOM - 288🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 188 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 127 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 01, జూన్‌ 2022 జేష్ట మాసము*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺*

*🍀. నారాయణ కవచము - 5 🍀*

*9. షకారం తు భ్రువోర్మధ్యే ణకారం శిఖయా న్యసేత్ |*
*వేకారం నేత్రయోర్యుంజ్యాన్నకారం సర్వసంధిషు*
*10. మకారమస్త్రముద్దిశ్య మంత్రమూర్తిర్భవేద్బుధః |*
*సవిసర్గం ఫడన్తం తత్సర్వదిక్షు వినిర్దిశేత్*
*ఓం విష్ణవే నమః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ప్రకృతి జాగరణకు రామాయణము, పంచకోశ జాగరణకు మహాభారతము, చక్ర జాగరణకు భాగవతము దోహద పడతాయి. - మాస్టర్‌ ఆర్‌.కె. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, జేష్ఠ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల విదియ 21:48:34 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: మృగశిర 13:01:36 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: శూల 25:34:43 వరకు
తదుపరి దండ 
కరణం: బాలవ 08:32:46 వరకు
వర్జ్యం: 22:29:03 - 24:17:15
దుర్ముహూర్తం: 11:47:43 - 12:40:08
రాహు కాలం: 12:13:56 - 13:52:11
గుళిక కాలం: 10:35:40 - 12:13:56
యమ గండం: 07:19:10 - 08:57:25
అభిజిత్ ముహూర్తం: 11:47 - 12:39
అమృత కాలం: 03:07:22 - 04:55:18
మరియు 28:47:45 - 30:35:57
సూర్యోదయం: 05:40:55
సూర్యాస్తమయం: 18:46:56
చంద్రోదయం: 06:52:44
చంద్రాస్తమయం: 20:32:15
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: జెమిని
అమృత యోగం - కార్య సిధ్ది 13:01:36
వరకు తదుపరి ముసల యోగం 
- దుఃఖం  

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 210 / Bhagavad-Gita - 210 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 5 వ అధ్యాయము - కర్మయోగము - 06 🌴*

*06. సన్న్యాసస్తు మాహాబాహో దుఃఖమాప్తుమయోగత: |*
*యోగయుక్తో మునిర్బ్రహ్మ న చిరేనాధిగచ్ఛతి ||*

🌷. తాత్పర్యం :
*భక్తియుతసేవ యందు నియుక్తుడు కాకుండా కేవలము కర్మలను త్యజించుట ద్వారా ఎవ్వరును సుఖమును పొందలేరు. కాని భక్తియోగమునందు నియుక్తుడైన మననశీలుడు పరబ్రహ్మమును శీఘ్రముగా పొందగలడు.*

🌷. భాష్యము :
సన్న్యాసుల యందు(సన్న్యాసాశ్రమము నందున్నవారు) రెండు తరగతులవారు కలరు. మయావాద సన్న్యాసులు సాంఖ్యతత్త్వమును అధ్యయనము చేయుట యందు నియుక్తులై యుండగా, వైష్ణవసన్న్యాసులు వేదాంతసూత్రములకు చక్కని భాష్యమైన శ్రీమద్భాగవతతత్త్వమును అధ్యయనము చేయుట యందు నియుక్తులై యుందురు. మయావాదులు సైతము వేదాంతసూత్రములను అధ్యయనము చేసినను దాని కొరకు వారు శంకరాచార్యులు వ్రాసిన శారీరికభాష్యమనెడి తమ స్వంత వ్యాఖ్యానమును ఉపయోగింతురు. 

భాగవతధర్మము నందు భక్తులు “పాంచరాత్రిక” విధానము ద్వారా భగవానుని భక్తియుక్తసేవ యందు నెలకొనియుందురు. కనుకనే భాగవతధర్మము ననుసరించు వైష్ణవసన్న్యాసులు భగవానుని దివ్యసేవ యందు పలురకములైన కర్మలను కలిగియుందురు. భౌతికకర్మలతో ఎట్టి సంబంధము లేకున్నను వారు భాగవత్సేవ కొరకై పలువిధములైన కర్మలలో నియుక్తులగుదురు. సాంఖ్యమునందు, వేదాంతాధ్యయనము నందు, మనోకల్పనల యందు మునిగియుండెడి మయావాద సన్న్యాసులు అట్టి దివ్యసేవా మధురిమను అనుభవింపలేరు. 

అతిదీర్ఘమైన తమ అధ్యయనముల వలన వారు కొన్నిమార్లు పరబ్రహ్మమును గూర్చిన మానసికకల్పనల యెడ విసుగుచెంది శ్రీమద్భాగవతము నాశ్రయింతురు. కాని సరియైన అవగాహన లేకనే భాగవతమును స్వీకరించుచున్నందున వారి అధ్యయనము శ్రమ కారణమే కాగలదు. వాస్తవమునకు అట్టి శుష్క మానసికకల్పనలు మరియు కృత్రిమమైన నిరాకారభావపు వ్యాఖ్యానములు మయావాద సంన్యాసులకు నిరర్ధక కార్యములు. భక్తియోగమునందు చరించుచున్న వైష్ణవసన్న్యాసులు తమ దివ్య కర్మాచరణమునందు ఆనందము ననుభవించుచు అంత్యమున భగవద్ధామమును చేరుదుమనెడి అభయమును కలిగియుందురు. 

కాని మాయావాద సన్న్యాసులు కొన్నిమార్లు ఆత్మానుభవమార్గము నుండి పతనము నొంది భౌతికకలాపములేయైన ధర్మకార్యములు మరియు పరహితముల వంటి లౌకికకర్మలలో తిరిగి ప్రవేశింతురు. కనుక సారాంశమేమనగా ఏది బ్రహ్మము మరియు ఏది బ్రహ్మము కాదనెడి మనోకల్పనల యందే నియుక్తులై యుండు మాయావాద సన్న్యాసుల కన్నను కృష్ణ భక్తిరస భావిత కర్మల యందు నియుక్తులైనవారు సరియైన స్థితిలో నెలకొనినట్టివారు. అయినను మయావాద సన్న్యాసులు సైతము బహుజన్మల పిదప కృష్ణభక్తిభావనకు పొందగలరు. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 210 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 5 - Karma Yoga - 06 🌴*

*06. sannyāsas tu mahā-bāho duḥkham āptum ayogataḥ*
*yoga-yukto munir brahma na cireṇādhigacchati*

🌷 Translation : 
*Merely renouncing all activities yet not engaging in the devotional service of the Lord cannot make one happy. But a thoughtful person engaged in devotional service can achieve the Supreme without delay.*

🌹 Purport :
There are two classes of sannyāsīs, or persons in the renounced order of life. The Māyāvādī sannyāsīs are engaged in the study of Sāṅkhya philosophy, whereas the Vaiṣṇava sannyāsīs are engaged in the study of Bhāgavatam philosophy, which affords the proper commentary on the Vedānta-sūtras. The Māyāvādī sannyāsīs also study the Vedānta-sūtras, but use their own commentary, called Śārīraka-bhāṣya, written by Śaṅkarācārya. 

The students of the Bhāgavata school are engaged in the devotional service of the Lord, according to pāñcarātrikī regulations, and therefore the Vaiṣṇava sannyāsīs have multiple engagements in the transcendental service of the Lord. The Vaiṣṇava sannyāsīs have nothing to do with material activities, and yet they perform various activities in their devotional service to the Lord. But the Māyāvādī sannyāsīs, engaged in the studies of Sāṅkhya and Vedānta and speculation, cannot relish the transcendental service of the Lord. Because their studies become very tedious, they sometimes become tired of Brahman speculation, and thus they take shelter of the Bhāgavatam without proper understanding.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://www.tumblr.com/blog/bhagavadgitawisdom
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 609 / Vishnu Sahasranama Contemplation - 609🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 609. శ్రీవిభావనః, श्रीविभावनः, Śrīvibhāvanaḥ 🌻*

*ఓం శ్రీవిభావనాయ నమః | ॐ श्रीविभावनाय नमः | OM Śrīvibhāvanāya namaḥ*

*వివిధాస్సర్వ భూతానాం విభావయతి యః శ్రియః ।*
*తత్తత్కర్మానురూపేణ స హరిః శ్రీవిభావనః ॥*

*సర్వ భూతములకును తమ తమ కర్మములకు తగిన విధముగా వివిధములగు శ్రీలను విశేషముగా కలుగజేయు వాడు గనుక హరికి శ్రీవిభావనః అను నామము గలదు.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 609🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻609. Śrīvibhāvanaḥ🌻*

*OM Śrīvibhāvanāya namaḥ*

विविधास्सर्व भूतानां विभावयति यः श्रियः ।
तत्तत्कर्मानुरूपेण स हरिः श्रीविभावनः ॥

*Vividhāssarva bhūtānāṃ vibhāvayati yaḥ śriyaḥ,*
*Tattatkarmānurūpeṇa sa hariḥ śrīvibhāvanaḥ.*

*Since Lord Hari accords appropriate Śrī or different kinds of opulence on the beings in accordance to their deeds, He is known as Śrīvibhāvanaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
श्रीदश्श्रीशश्श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः ।श्रीधरः श्रीकरश्श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः ॥ ६५ ॥
శ్రీదశ్శ్రీశశ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।శ్రీధరః శ్రీకరశ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ 65 ॥
Śrīdaśśrīśaśśrīnivāsaḥ śrīnidhiḥ śrīvibhāvanaḥ,Śrīdharaḥ śrīkaraśśreyaḥ śrīmān lokatrayāśrayaḥ ॥ 65 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 288 / DAILY WISDOM - 288 🌹*
*🍀 📖. యోగా అధ్యయనం మరియు అభ్యాసం నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 14. భగవంతుడు సర్వోన్నత కర్త 🌻*

*జీవితం యొక్క ప్రతి దశలోనూ జీవితం యొక్క లక్ష్యం భగవంతుని దర్శనం, భగవంతుని అనుభవం, భగవంతుని సాక్షాత్కారం - భగవంతుడు సర్వోన్నత కర్త మరియు అత్యున్నత ఉనికి. శ్రీమద్ భాగవత మహాపురాణం లేదా ఇలాంటి గ్రంథాల ద్వారా మళ్లీ మళ్లీ మనస్సులోకి చొప్పించబడే సూత్రం ఇదే. అటువంటి గ్రంథాల యొక్క నిరంతర అధ్యయనాన్ని అభ్యసిస్తే, అది శుద్ధి చేస్తుంది. ఇది స్వతహాగా ఒక తపస్సు, మరియు ఇది చివరికి తన స్వయం యొక్క స్వభావాన్ని అధ్యయనం చేస్తుంది. ఈ అధ్యయన ప్రక్రియను సూచించడానికి ‘స్వ’ అనే పదం ఇక్కడ ఉపయోగించబడింది-స్వాధ్యాయ.*

*అలాగే, మనము పతంజలి యొక్క ఒక సూత్రం, తదా ద్రష్టుః స్వరూపే అవస్థానం (I.3)లో ఇలా చెప్పబడింది. వృత్తులు లేదా మనస్సు యొక్క వివిధ మనోవిక్షేపాలు నిరోధించ బడినప్పుడు చూసేవారు తన స్వభావాన్ని కనుగొంటారు. ప్రతి సాధన యొక్క ఉద్దేశ్యం ఇంతే: మనస్సును దాని అసలు మూలానికి తిరిగి తీసుకురావడం. గ్రంధాలలో మనస్సుకు అందించబడిన వివిధ రకాల వివరాలు మనస్సును విలాసపరచడం లేదా బుజ్జగించడం కోసం ఉద్దేశించబడవు, కానీ మనసుకు పరధ్యానం మరియు బాహ్య వస్తువులతో అనుబంధం యొక్క అనారోగ్యాన్ని చికిత్స చేయడం కోసమే. ఈ లక్ష్యం అత్యంత ఆధ్యాత్మికమైనది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 288 🌹*
*🍀 📖 from The Study and Practice of Yoga 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 14. God is the Supreme Doer 🌻*

*The goal of life in every stage of its manifestation is the vision of God, the experience of God, the realisation of God—that God is the Supreme Doer and the Supreme Existence. This is the principle that is driven into the mind again and again by the Srimad Bhagavata Mahapurana or such similar texts. If a continued or sustained study of such scriptures is practised, it is purifying. It is a tapas by itself, and it is a study of the nature of one's own Self, ultimately. The word ‘sva' is used here to designate this process of study—svadhyaya.*

*Also, we are told in one sutra of Patanjali, tada drastuḥ svarupe avasthanam (I.3), that the seer finds himself in his own nature when the vrittis or the various psychoses of the mind are inhibited. The purpose of every sadhana is only this much: to bring the mind back to its original source. The variety of detail that is provided to the mind in the scriptures has an intention not to pamper or cajole the mind, but to treat the mind of its illness of distraction and attachment to external objects. The aim is highly spiritual.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 188 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ప్రేమ ఎక్కడికి తీసుకుపోతుందో ఎవరికీ తెలీదు. వూహకందనివి. పాతదాన్ని పునరుక్తం చెయ్యదు. అది ఎప్పుడు వర్తమానాన్నే ఆవిష్కరిస్తుంది. 'తల' ఎప్పుడూ గతంలో జీవిస్తుంది. అందువల్ల మేథ ఎప్పుడూ సంప్రదాయంలో వుంటుది. హృదయమెప్పుడూ విప్లవాత్మకం. 🍀*

*హృదయం ప్రేమగుండా జీవిస్తుంది. ప్రేమ అదుపులకు లొంగదు. అది సులభంగా తిరగబడుతుంది. ప్రేమ ఎక్కడికి తీసుకుపోతుందో ఎవరికీ తెలీదు. వూహకందనివి. హఠాత్తుగా జరిగేది. పాతదాన్ని పునరుక్తం చెయ్యదు. అది ఎప్పుడు వర్తమానాన్నే ఆవిష్కరిస్తుంది. 'తల' ఎప్పుడూ గతంలో జీవిస్తుంది. అందువల్ల మేథ ఎప్పుడూ సంప్రదాయంలో వుంటుది. హృదయమెప్పుడూ విప్లవాత్మకం.*

*కానీ నువ్వు హృదయం గుండానే విజయం సాధించగలవు. ప్రేమ గుండానే విజేతవవుతావు. లాజిక్ ద్వారా కాదు. ఇక్కడ అద్భుతం ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు గుంపు మనస్తత్వానికి వ్యతిరేకంగా తిరగబడినప్పుడు జరుగుతుంది. నువ్వు మరింత మరింత స్వతంత్రంగా మారతావు. అప్పుడు నువ్వు హఠాత్తుగా అనంతంలో భాగంగా అనుభూతి చెందుతావు. విశ్వంలో భాగమవుతావు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 127 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 98. అశ్వఘోషుడు - 2🌻*

*నిత్య జీవితమే ఒక సినిమా. దీనిని గమనించుట నేర్చినచో దాని దర్శకుడు. నిర్మాత యొక్క చాతుర్యము మనలను అబ్బుర పరచగలదు. ప్రకృతి యందుగాని, మానవుని ప్రవర్తనయందు గాని, అంతర్యామిని దర్శించుట, అందమును దర్శించుటే. అతని లీలలుయే పశుపక్ష్యాదులు, సమస్త మానవుల ప్రవర్తనలును. అంతర్యామి సృష్టి నుండి, సృష్టి జీవులనుండి తొంగి చూచుచుండును. తొణికిసలాడు చుండును. మిరుమిట్లు కొలుపుచుండును. దిగ్భ్రాంతి కలిగించు చుండును. భయభ్రాంతులను కూడ కలిగించు చుండును.*

*అతనిని చూచువారికి సృష్టి అందమే గోచరించును. అశ్వఘోషుడట్లు దర్శించి, స్పందించి, చిత్రించి జనసమూహములను ఉత్తేజపరచినాడు. అతడు కేవలము చిత్రకారుడు కాదు. తీవ్రమగు సాధకుడు. తాను దర్శించిన అంతర్యామి అందమును చిత్రముల బంధించు ప్రయత్నమున సిద్ధుడైనాడు. అతడు నిజమగు యుపాసకుడు. అందము తీరుతెన్ను లెరిగినవాడు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #ChaitanyaVijnanam #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹