శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 394 / Sri Lalitha Chaitanya Vijnanam - 394

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 394 / Sri Lalitha Chaitanya Vijnanam - 394🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 86. ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।
మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥ 🍀

🌻 394. 'ప్రభారూపా'🌻

కాంతిరూపము కలిగినది శ్రీమాత అని అర్థము. శ్రీమాత గుణమే కాదు; రూపము కూడ కాంతివంతమే. కాంతివంత మగు గుణ మున్ననూ, కాంతివంత మగు రూపము ఉండనక్కర లేదు. కాని శ్రీమాత విషయమున రూపము కూడ కాంతి వంతమే. కాంతి రూపముల యందలి కాంతి శ్రీమాతయే అని తెలియ వలెను. కన్నులలోని కాంతి ఆమెయే. శరీరమందలి మెఱపు ఆమెయే. కాంతికి ఆకర్షణ సహజ గుణము.

ఆకర్షణము ఎచ్చట నున్నదో అచ్చట శ్రీమాత యున్నదని తెలియవలెను. కాంతి రూపముతోనే అందరిని ఆకర్షించును. దుష్టులను మాయ చేయును. శిష్టులను అనుగ్రహించును. నిజముగ కాంతి మాయా రూపమే. సత్యమును మరుగు పరచగల కాంతి ఆమె. ఆమె కాంతి ఆవరణము నందే శివుడు సత్యమై యున్నాడు. సత్యమునకు ఆమె ప్రథమావరణ మగుటచే సత్యమును కూడ మరుగు పరచగల కాంతి రూపము శ్రీమాతది. ఆమె కాంతి ఆధారముగనే ఇచ్ఛా, జ్ఞాన, క్రియలు జీవుల కేర్పడి సృష్టి కార్యము నడచుచున్నది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 394 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj

🌻 86. Prabhavati prabha rupa prasidha parameshari
Mulaprakruti ravyakta vyaktavyakta svarupini ॥ 86 ॥ 🌻

🌻 394. Prabhārūpā प्रभारूपा 🌻

The luminous light emanating from Her and was referred to in the last nāma, is said to be powerful in this nāma. These devi-s derived their illumination from this brightness. She is said to be in the form of Supreme light.

Chāndogya Upaniṣad (III.14.2) describes this light “He is controlled by the mind. He has a subtle body and He is luminous (bhārūpaḥ).”

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

07 Aug 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 225. దూకడానికి సిద్ధంగా ఉండండి / Osho Daily Meditations - 225. KEEP JUMPING

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 225 / Osho Daily Meditations - 225 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 225. దూకడానికి సిద్ధంగా ఉండండి 🍀

🕉. ఒక రోజు - ఇది జరుగుతుంది. నేను దానిని సంభావ్యతగా చూడగలను. ఏ క్షణంలోనైనా సూర్యోదయం సాధ్యమే. కానీ ఉత్సాహంగా, దూకుతూ ఉండండి; నిద్రపోకండి. 🕉

ఎవరో రాత్‌స్‌చైల్డ్‌ని అడిగారు, 'నువ్వు ఇంత ధనవంతుడివి ఎలా అయ్యావు?' అతను సమాధానం చెప్పాడు, 'నేను ఎల్లప్పుడూ నా అవకాశం కోసం వేచి ఉంటాను, అది వచ్చినప్పుడు నేను దానిపైకి దూకాను.' ఆ వ్యక్తి ఇలా అన్నాడు, 'నేను కూడా ఎదురు చూస్తున్నాను అవకాశం కోసం. కానీ అది పోయినప్పుడు మాత్రమే తెలుస్తోంది! అవును, ఇది చాలా అరుదైన క్షణం. ఇది వస్తుంది. దానిని కోసం సిద్ధంగా లేకపోతే, అది తప్పి పోతుంది. 'అందుకని దూకుతూ ఉండండి, లేకపోతే మీరు మిస్ అవుతారు! నేను నా జీవితమంతా చేస్తున్నది అదే. అవకాశం రావచ్చు లేదా రాకపోవచ్చు-అది కాదు; నేను గెంతుతూనే ఉన్నాను. అది వచ్చినప్పుడు, నేను ఎప్పుడూ దూకుతున్నట్లు కనుగొంటుంది.

క్షణాల్లో అది వచ్చి పోతుంది. మీరు దాని గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటే మీరు దాన్ని కోల్పోతారు.' కాబట్టి దూకుతూ ఉండండి- ధ్యానం అంటే అంతే. ఏదో ఒకరోజు యాదృచ్ఛికం జరుగుతుంది. సరైన క్షణం దగ్గరగా వచ్చినప్పడు మీరు దానిలోకి దుంకడం చేస్తారు. ఏదో అద్భుతమైనది అవుతుంది మరియు ఏదో జరుగుతుంది. ఇది ఒక జరుగుతున్నదిగా ఉంటుంది; అది చేయడంగా కాదు. కానీ మీరు ఆ క్షణంలో దూకడము చేయకపోతే, మీరు దానిని కోల్పోతారు. ఇది కష్టంగా మరియు కొన్నిసార్లు నిరాశగానూ ఉంటుంది, ఎందుకంటే మీరు మళ్లీ మళ్లీ అదే స్థలానికి వస్తారు మరియు అది వృత్తాకారంగా మారుతుంది. కానీ దూకుతూ ఉండండి.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 225 🌹

📚. Prasad Bharadwaj

🍀 225. KEEP JUMPING 🍀

🕉. One day- it is going to happen. I can see it, just below the horizon. Any moment the sunrise is possible. But keep jumping; don't fall asleep. 🕉

Somebody asked Rothschild, "How did you become so rich?" He answered, "I always waited for my opportunity, and when it came One simply jumped on it." The man said, "I am also waiting for an opportunity, but I only know when it has gone! It is such a rare moment that it comes and by the time I am ready to jump on it, it IS gone. Rothschild laughed and he said, "Keep jumping, otherwise you will miss! That's what I have been doing all my life-jumping. An opportunity may come or not-that is not the point; I keep on jumping. When it comes, it finds me always jumping. It comes and goes in a moment, and if you are thinking about it you will miss it."

So keep jumping-that's all that meditation is about. Some day the coincidence will happen. You will be jumping and the right moment will be close by. Something clicks, and something happens. It is a happening; it is not a doing. But if you are not jumping, you will miss it. It is difficult and sometimes boring too, because you come again and again to the same space, and it becomes circular. But keep jumping.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

07 Aug 2022

శ్రీ శివ మహా పురాణము - 606 / Sri Siva Maha Purana - 606

🌹 . శ్రీ శివ మహా పురాణము - 606 / Sri Siva Maha Purana - 606 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 06 🌴

🌻. కుమారుని లీల - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడచట ఆ గంగా పుత్రుడు తన యందు భక్తిని కలిగించే ఒక చక్కని లీలను ప్రదర్శించెను. ఓ నారదా! ఆ లీలను ప్రీతితో వినుము(1). అదే సమయములో అచటకు యజ్ఞమును చేసిన శోభాయుక్తుడగు నారదుడనే ఒక బ్రాహ్మణుడు గుహుని శరణు పొందుటకు వచ్చెను (2). ప్రసన్నమగు మనస్సు గల ఆ బ్రాహ్మణుడు కార్తికుని సమీపమునకు వచ్చి శుభస్తోత్రములతో ప్రణమిల్లి తన అభిప్రాయమును చెప్పెను (3).

బ్రాహ్మణుడిట్లు పలికెను -

ఓ స్వామీ! నా మాటను వినుము. నాకిపుడు కలిగిన కష్టమును తొలగించుము. బ్రహ్మాండములన్నింటికీ ప్రభువు నీవే. అందువలననే నిన్ను శరణు జొచ్చితిని (4). నేను వైదిక కర్మను చేయ నారంభించితిని. నా ఇంటి వద్ద నున్న మేక త్రాటిని తెంపుకొని పారిపోయినది(5).

అది ఎచటకు పోయినదో తెలియకున్నది. నేను చాలా వెదికితిని. కాని దొరకలేదు. దీనివలన నా క్రతువునకు పెద్ద ఆటంకము వాటిల్లినది(6). విభూ! నీవు ప్రభువై యుండగా యజ్ఞము భగ్నమగుట ఎట్లు సంభవము? ఓ అఖిలేశ్వరా! నీవు ఆలోచించి నా కోర్కెను పరిపూర్ణము చేయుము (7). ఓ శివపుత్రా! ప్రభూ! బ్రహ్మాండములన్నింటికీ ప్రభుడు, దేవతలందరిచే సేవింపబడువాడు అగు నిన్ను విడిచి నేను ఎవరిని శరణు పొందగలను?(8)

నీవు దీనబంధుడవు. దయాసముద్రుడవు. సేవింపదగిన వాడవు. భక్తుల యందు ప్రేమ గలవాడవు. విష్ణుబ్రహ్మాది దేవతలచే స్తుతింపబడే పరమేశ్వరుడవు (9). పార్వతీ తనయుడవగు స్కందుడవు. అద్వయుడవు. శత్రువులను తపింప జేయువాడవు. పరమాత్మవు. శరణు గోరు సత్పురుషుల ఆత్మను రక్షించు స్వామివి(10). దీనుల ప్రభువగు మహేశ్వరా! శవపుత్రా! ముల్లోకములకు తండ్రియగు ప్రభూ! మాయను వశము చేసుకున్న వాడా! నిన్ను శరణు పొందితిని .

విప్రులు నీకు ప్రియమైన వారు. నన్ను రక్షించుము. నీవు అందరికీ ప్రియుడగు ప్రభుడవు. నీవు సర్వజ్ఞుడవు. బ్రహ్మాది దేవతలు నిన్ను స్తుతించెదరు. మాయకు అధీశ్వరుడవగు నీవు మాయచే ఆకారమును దాల్చి, నీ భక్తులను రక్షించి సుఖముల నిచ్చుచున్నావు (11).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 606🌹

✍️ J.L. SHASTRI

📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 06 🌴

🌻 The miraculous feat of Kārttikeya - 1 🌻

Brahmā said:—

1. There Kumāra showed a miraculous feat. O Nārada, listen to it that bestows devotion.

2. Then a certain brahmin Nārada came there, seeking refuge in Kumāra. He was glorious and had been performing a sacrifice.

3. Approaching Kumāra, bowing to and eulogising him with auspicious hymns the delighted brahmin related his tale.

The brahmin said:—

4. O lord, listen to my words. Relieve my distress. You are the lord of the universe. I seek refuge in you.

5. I began a goat sacrifice. The goat got loosened and strayed away from my house.

6. I do not know where it has gone. I have searched for it here and there but have not found it. Hence this will cause a serious default in my sacrifice.

7. While you are the lord, how can there be an obstacle to my sacrifice? O lord, after pondering over this matter please fulfil my task.

8. O lord, O son of Śiva, who else can I approach except you, who are worthy of being resorted to, who are the lord of the entire universe and are served by all the gods.

9-10. You are the kinsman of the distressed. You are worthy of being served well. You are favourably disposed to your devotees. You are the great lord eulogised by Viṣṇu, Brahmā and other gods. You are Skanda the delighter of Pārvatī, the sole destroyer of enemies, the great soul, the lord who bestows his own self upon the good seeking refuge in him.

11. O lord of the distressed, O great lord, O son of Śiva, O lord of the three worlds, O master of magical art, I have to seek refuge in you. O favourite of the brahmins, save me. You are the lord of all. You are eulogised by Brahmā and other gods who bow to you. You have assumed forms through magical art. You are the bestower of happiness to your devotees. You are eager to protect. You wield power of deluding others.

Continues....

🌹🌹🌹🌹🌹

07 Aug 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 90 / Agni Maha Purana - 90

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 90 / Agni Maha Purana - 90 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 30

🌻. కమలములలోని దేవతల మండల విధి -1 🌻

నారదుడు చెప్పెను : భద్రమండలము మధ్య నున్న కమలమున అంగదేవతా సహిత బ్రహ్మను పూజింపవలెను. తూర్పున నున్న కమలమున పద్మనాభుని, ఆగ్నేయమున నుద్న కమలమున ప్రకృతిని, దక్షిణమున నున్న కమలమున పురుషుని దక్షిణభాగమున అగ్నిదేవతను, నైరృతి దిక్కున నిరృతిని, పశ్చిమదిక్కున నున్న కమలమున వరుణుని, వాయవ్య దిక్కునం దున్న కమలమున వాయువును, ఉత్తర దిక్కునందున్న కమలమున ఆదిత్యుని, ఈశాన్య దిక్కునందున్న కమలమున బుగ్వేదయజుర్వేదములను పూజింపవలెను.

రెండవ ఆవరణమునందు ఇంద్రాది దిక్పాలకులను, షోడశదలకమలమున క్రమముగా సామవేద, అథర్వవేద, ఆకాశ, వాయు, తేజో, జల, పృథివీ, మనః, శ్రోత్ర, త్వక్‌, నేత్ర, రసనా, ఘ్రాణ, భూర్లోక, భువర్లోకములను పూజింపవలెను.

పిమ్మట తృతీయవరణము నందలి, ఇరువదినాలుగు దళముల కమలమున క్రమముగ మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక, అగ్నిష్టోమ, అత్యగ్నిష్ణోమ, ఉక్థ, షోడశీ, వాజపేయ, అతిరాత్ర, ఆప్తోర్యామ, వ్యష్టిమనో, వ్యష్టిబుద్ధి, వ్యష్ట్యహంకార, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, జీవ, సమస్టిమనః, సమష్టిబుద్ధి (మహత్తత్వ), సమష్ట్యహంకార, ప్రకృతులను పూజింపవలెను.

వీటి అన్నింటియొక్క స్వరూపము శబ్దమాత్రమే. అనగా కేవలము వీటి పేరులు చెప్పి నమస్కరించిన చాలును; మూర్తులను ధ్యానింపవసరము లేదు.

ఇరువదియైదవ అధ్యాయములో చెప్పిన వాసుదేవాదిమూర్తులను తొమ్మిందింటిని, దశవిధప్రాణములను, మనో, బుద్ధ్య, హంకార, పాయు, ఉపస్థలను, శ్రోత్ర, త్వక్‌, నేత్ర, రసనా, ఘ్రాణ, వాక్‌, పాణి, పాదములను, ఈ ముప్పదిరెండింటిని, ముప్పదిరెండు దళముల కమలమున ఆర్చన చేయవలెను. ఇవి నాల్గవ అవరణమునందలి దేతవలు. ఈ ఆవరణమున సాంగసపరివార దేవతాపూజ చేయవలెను.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Agni Maha Purana - 90 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 30

🌻 Mode of worship of different gods in specially drawn lotus figures - 1 🌻

Nārada said:

1. One has to worship Brahmā in the lotus at the centre, the lotus-navelled (Viṣṇu) with all his retinue in the east, the nature (primordial matter) in the lotus in the south-east and the supreme spirit in the lotus in the south.

2. (One has to worship) the fire-god (in the lotus) at the south of the supreme spirit, the wind-god in the south-west and west, the sun in the lotus of the moon, the Ṛg-(Veda)and Yajur-(Veda) in the lotus of the lord.

3-4. Indra and other gods are to be worshipped in the sixteen (lotuses) in the second (row) then, (along with) the Sāma-(veda), Atharva (veda), sky, wind, lustre, water, earth, mind, ear, skin, (and) eye. One should also worship the tongue, nose, (the worlds) Bhū, (and) Bhuva.

5-7. Having worshipped (the worlds) Mahas, Janas, Tapas (and) Satya and (also the sacrifices) Agniṣṭoma, Atyagniṣṭoma, Uktha, Ṣoḍaṣī, Vājapeya, Atirātra, one has to worship Aptoryāma, mind, intellect, ego, sound, touch, colour, taste, (and) smell in order in twenty-four lotuses. (One has to worship) the soul, ego, the lord of the mind, (and) the sound principle of the primordial matter.

8-9. (One should then worship) the images of Vāsudeva and others, having worshipped the (following) ten—the soul, mind, ear, skin, eye, tongue, nose, speech, hand, (and) foot in thirty-two lotuses. One has to worship these in the fourth enclosure along with their attendants and retinue.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

07 Aug 2022

కపిల గీత - 51 / Kapila Gita - 51

🌹. కపిల గీత - 51 / Kapila Gita - 51🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు,
📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴2వ అధ్యాయము - సృష్టి తత్వం - 7 🌴

07. తదస్య సంసృతిర్బన్ధః పారతన్త్ర్యం చ తత్కృతమ్
భవత్యకర్తురీశస్య సాక్షిణో నిర్వృతాత్మనః

జీవుడు ప్రకృతికి పారతంత్ర్యుడవుతాడు. ఈ ఆత్మ, అకర్తుః, దేనికీ కర్త కాదు, సాక్షి మాత్రమే. ఇలాంటి ఆత్మకు తనది కానిది, తనకు కాది, తాను కానిది, తనది, తనకు, తాను అనుకోవడం వలనే బంధము వస్తుంది.

సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Kapila Gita - 51 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

✍️ Swami Prabhupada. 📚 Prasad Bharadwaj

🌴 2. Fundamental Principles of Material Nature - 7 🌴

07. tad asya saṁsṛtir bandhaḥ pāra-tantryaṁ ca tat-kṛtam
bhavaty akartur īśasya sākṣiṇo nirvṛtātmanaḥ

Material consciousness is the cause of one's conditional life, in which conditions are enforced upon the living entity by the material energy. Although the spirit soul does not do anything and is transcendental to such activities, he is thus affected by conditional life.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

07 Aug 2022

07 Aug 2022 Daily Panchang నిత్య పంచాంగము

🌹07, August 2022 పంచాగము - Panchangam 🌹

శుభ ఆదివారం, Sunday, భాను వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ

ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻

🍀. శ్రీ సూర్య పంజర స్తోత్రం - 21 🍀

21. వజ్రాయుధాయ నమః శక్త్యాయుధాయ నమః
దణ్డాయుధాయ నమః ఖడ్గాయుధాయ నమః
పాశాయుధాయ నమః అఙ్కుశాయుధాయ నమః
గదాయుధాయ నమః త్రిశూలాయుధాయ నమః
పద్మాయుధాయ నమః చక్రాయుధాయ నమః
కటిస్థానే మాం రక్షతు ॥

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : సత్యస్వరూప సాక్షాత్కారం - అశరీరి అయిన అనంతునిగా భగవానుని నీవు చూడగలుగుతూ, పురుషుడు తన ప్రియురాలిని ప్రేమించినట్లుగా నీ వాయనను ప్రేమించగలిగితే, పరమసత్యపు అత్యున్నత శిఖరాలను నీవు అధిరోహించ గలిగావని చెప్పవచ్చు. 🍀

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం

దక్షిణాయణం, వర్ష ఋతువు

తిథి: శుక్ల-దశమి 23:52:39

వరకు తదుపరి శుక్ల-ఏకాదశి

నక్షత్రం: అనూరాధ 16:31:47

వరకు తదుపరి జ్యేష్ఠ

యోగం: బ్రహ్మ 10:02:20 వరకు

తదుపరి ఇంద్ర

కరణం: తైతిల 13:01:20 వరకు

వర్జ్యం: 21:40:38 - 23:09:06

దుర్ముహూర్తం: 17:03:57 - 17:55:15

రాహు కాలం: 17:10:22 - 18:46:33

గుళిక కాలం: 15:34:10 - 17:10:22

యమ గండం: 12:21:46 - 13:57:58

అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:46

అమృత కాలం: 06:42:32 - 08:13:04

మరియు 30:31:26 - 31:59:54

సూర్యోదయం: 05:56:59

సూర్యాస్తమయం: 18:46:33

చంద్రోదయం: 14:14:55

చంద్రాస్తమయం: 00:42:15

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: వృశ్చికం

మృత్యు యోగం - మృత్యు భయం

16:31:47 వరకు తదుపరి కాల

యోగం - అవమానం

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹

🍀 07 - AUGUST - 2022 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🍀

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 07, ఆదివారం, ఆగస్టు 2022 భాను వాసరే  Sunday 🌹
2) 🌹 కపిల గీత - 51 / Kapila Gita - 51 🌹 సృష్టి తత్వము - 7
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 90 / Agni Maha Purana - 90 🌹
4) 🌹. శివ మహా పురాణము - 606 / Siva Maha Purana -606 🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 225 / Osho Daily Meditations - 225 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 394 / Sri Lalitha Chaitanya Vijnanam - 394 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹07, August 2022 పంచాగము - Panchangam  🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀.  శ్రీ సూర్య పంజర స్తోత్రం - 21 🍀*

*21. వజ్రాయుధాయ నమః శక్త్యాయుధాయ నమః*
*దణ్డాయుధాయ నమః ఖడ్గాయుధాయ నమః*
*పాశాయుధాయ నమః అఙ్కుశాయుధాయ నమః*
*గదాయుధాయ నమః త్రిశూలాయుధాయ నమః*
*పద్మాయుధాయ నమః చక్రాయుధాయ నమః*
*కటిస్థానే మాం రక్షతు ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀.  నేటి సూక్తి : సత్యస్వరూప సాక్షాత్కారం - అశరీరి అయిన అనంతునిగా భగవానుని నీవు చూడగలుగుతూ, పురుషుడు తన ప్రియురాలిని ప్రేమించినట్లుగా నీ వాయనను ప్రేమించగలిగితే, పరమసత్యపు అత్యున్నత శిఖరాలను నీవు అధిరోహించ గలిగావని చెప్పవచ్చు. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శ్రావణ మాసం
దక్షిణాయణం, వర్ష ఋతువు
తిథి:  శుక్ల-దశమి 23:52:39
వరకు తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: అనూరాధ 16:31:47
వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం: బ్రహ్మ 10:02:20 వరకు
తదుపరి ఇంద్ర
కరణం: తైతిల 13:01:20 వరకు
వర్జ్యం: 21:40:38 - 23:09:06
దుర్ముహూర్తం: 17:03:57 - 17:55:15
రాహు కాలం: 17:10:22 - 18:46:33
గుళిక కాలం: 15:34:10 - 17:10:22
యమ గండం: 12:21:46 - 13:57:58
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:46
అమృత కాలం: 06:42:32 - 08:13:04
మరియు 30:31:26 - 31:59:54
సూర్యోదయం: 05:56:59
సూర్యాస్తమయం: 18:46:33
చంద్రోదయం: 14:14:55
చంద్రాస్తమయం: 00:42:15
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
మృత్యు యోగం - మృత్యు భయం
16:31:47 వరకు తదుపరి కాల
యోగం - అవమానం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో  నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం  దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 51 / Kapila Gita - 51🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు,
📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴2వ అధ్యాయము - సృష్టి తత్వం  - 7 🌴*

*07. తదస్య సంసృతిర్బన్ధః పారతన్త్ర్యం చ తత్కృతమ్*
*భవత్యకర్తురీశస్య సాక్షిణో నిర్వృతాత్మనః*

*జీవుడు ప్రకృతికి పారతంత్ర్యుడవుతాడు. ఈ ఆత్మ, అకర్తుః, దేనికీ కర్త కాదు, సాక్షి మాత్రమే. ఇలాంటి ఆత్మకు తనది కానిది, తనకు కాది, తాను కానిది, తనది, తనకు, తాను అనుకోవడం వలనే బంధము వస్తుంది.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 51 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*✍️  Swami Prabhupada.   📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 7 🌴*

*07.  tad asya saṁsṛtir bandhaḥ pāra-tantryaṁ ca tat-kṛtam*
*bhavaty akartur īśasya sākṣiṇo nirvṛtātmanaḥ*

*Material consciousness is the cause of one's conditional life, in which conditions are enforced upon the living entity by the material energy. Although the spirit soul does not do anything and is transcendental to such activities, he is thus affected by conditional life.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 90 / Agni Maha Purana - 90 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚.  ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః  ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 30*

*🌻. కమలములలోని దేవతల మండల విధి -1 🌻*

నారదుడు చెప్పెను : భద్రమండలము మధ్య నున్న కమలమున అంగదేవతా సహిత బ్రహ్మను పూజింపవలెను. తూర్పున నున్న కమలమున పద్మనాభుని, ఆగ్నేయమున నుద్న కమలమున ప్రకృతిని, దక్షిణమున నున్న కమలమున పురుషుని దక్షిణభాగమున అగ్నిదేవతను, నైరృతి దిక్కున నిరృతిని, పశ్చిమదిక్కున నున్న కమలమున వరుణుని, వాయవ్య దిక్కునం దున్న కమలమున వాయువును, ఉత్తర దిక్కునందున్న కమలమున ఆదిత్యుని, ఈశాన్య దిక్కునందున్న కమలమున బుగ్వేదయజుర్వేదములను పూజింపవలెను.

రెండవ ఆవరణమునందు ఇంద్రాది దిక్పాలకులను, షోడశదలకమలమున క్రమముగా సామవేద, అథర్వవేద, ఆకాశ, వాయు, తేజో, జల, పృథివీ, మనః, శ్రోత్ర, త్వక్‌, నేత్ర, రసనా, ఘ్రాణ, భూర్లోక, భువర్లోకములను పూజింపవలెను.

పిమ్మట తృతీయవరణము నందలి, ఇరువదినాలుగు దళముల కమలమున క్రమముగ మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక, అగ్నిష్టోమ, అత్యగ్నిష్ణోమ, ఉక్థ, షోడశీ, వాజపేయ, అతిరాత్ర, ఆప్తోర్యామ, వ్యష్టిమనో, వ్యష్టిబుద్ధి, వ్యష్ట్యహంకార, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, జీవ, సమస్టిమనః, సమష్టిబుద్ధి (మహత్తత్వ), సమష్ట్యహంకార, ప్రకృతులను పూజింపవలెను.

వీటి అన్నింటియొక్క స్వరూపము శబ్దమాత్రమే. అనగా కేవలము వీటి పేరులు చెప్పి నమస్కరించిన చాలును; మూర్తులను ధ్యానింపవసరము లేదు.

ఇరువదియైదవ అధ్యాయములో చెప్పిన వాసుదేవాదిమూర్తులను తొమ్మిందింటిని, దశవిధప్రాణములను, మనో, బుద్ధ్య, హంకార, పాయు, ఉపస్థలను, శ్రోత్ర, త్వక్‌, నేత్ర, రసనా, ఘ్రాణ, వాక్‌, పాణి, పాదములను, ఈ ముప్పదిరెండింటిని, ముప్పదిరెండు దళముల కమలమున ఆర్చన చేయవలెను. ఇవి నాల్గవ అవరణమునందలి దేతవలు. ఈ ఆవరణమున సాంగసపరివార దేవతాపూజ చేయవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 90 🌹*
*✍️ N. Gangadharan  📚. Prasad Bharadwaj *

*Chapter 30*
*🌻 Mode of worship of different gods in specially drawn lotus figures - 1 🌻*

Nārada said:
1. One has to worship Brahmā in the lotus at the centre, the lotus-navelled (Viṣṇu) with all his retinue in the east, the nature (primordial matter) in the lotus in the south-east and the supreme spirit in the lotus in the south.

2. (One has to worship) the fire-god (in the lotus) at the south of the supreme spirit, the wind-god in the south-west and west, the sun in the lotus of the moon, the Ṛg-(Veda)and Yajur-(Veda) in the lotus of the lord.

3-4. Indra and other gods are to be worshipped in the sixteen (lotuses) in the second (row) then, (along with) the Sāma-(veda), Atharva (veda), sky, wind, lustre, water, earth, mind, ear, skin, (and) eye. One should also worship the tongue, nose, (the worlds) Bhū, (and) Bhuva.

5-7. Having worshipped (the worlds) Mahas, Janas, Tapas (and) Satya and (also the sacrifices) Agniṣṭoma, Atyagniṣṭoma, Uktha, Ṣoḍaṣī, Vājapeya, Atirātra, one has to worship Aptoryāma, mind, intellect, ego, sound, touch, colour, taste, (and) smell in order in twenty-four lotuses. (One has to worship) the soul, ego, the lord of the mind, (and) the sound principle of the primordial matter.

8-9. (One should then worship) the images of Vāsudeva and others, having worshipped the (following) ten—the soul, mind, ear, skin, eye, tongue, nose, speech, hand, (and) foot in thirty-two lotuses. One has to worship these in the fourth enclosure along with their attendants and retinue.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 606 / Sri Siva Maha Purana - 606 🌹*
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి  📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః  - అధ్యాయము - 06 🌴*
*🌻. కుమారుని లీల  - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

అపుడచట ఆ గంగా పుత్రుడు తన యందు భక్తిని కలిగించే ఒక చక్కని లీలను ప్రదర్శించెను. ఓ నారదా! ఆ లీలను ప్రీతితో వినుము(1). అదే సమయములో అచటకు యజ్ఞమును చేసిన శోభాయుక్తుడగు నారదుడనే ఒక బ్రాహ్మణుడు గుహుని శరణు పొందుటకు వచ్చెను (2). ప్రసన్నమగు మనస్సు గల ఆ బ్రాహ్మణుడు కార్తికుని సమీపమునకు వచ్చి శుభస్తోత్రములతో ప్రణమిల్లి తన అభిప్రాయమును చెప్పెను (3).

బ్రాహ్మణుడిట్లు పలికెను -

ఓ స్వామీ! నా మాటను వినుము. నాకిపుడు కలిగిన కష్టమును తొలగించుము. బ్రహ్మాండములన్నింటికీ ప్రభువు నీవే. అందువలననే నిన్ను శరణు జొచ్చితిని (4). నేను వైదిక కర్మను చేయ నారంభించితిని. నా ఇంటి వద్ద నున్న మేక త్రాటిని తెంపుకొని పారిపోయినది(5).

అది ఎచటకు పోయినదో తెలియకున్నది. నేను చాలా వెదికితిని. కాని దొరకలేదు. దీనివలన నా క్రతువునకు పెద్ద ఆటంకము వాటిల్లినది(6). విభూ! నీవు ప్రభువై యుండగా యజ్ఞము భగ్నమగుట ఎట్లు సంభవము? ఓ అఖిలేశ్వరా! నీవు ఆలోచించి నా కోర్కెను పరిపూర్ణము చేయుము (7). ఓ శివపుత్రా! ప్రభూ! బ్రహ్మాండములన్నింటికీ ప్రభుడు, దేవతలందరిచే సేవింపబడువాడు అగు నిన్ను విడిచి నేను ఎవరిని శరణు పొందగలను?(8)

నీవు దీనబంధుడవు. దయాసముద్రుడవు. సేవింపదగిన వాడవు. భక్తుల యందు ప్రేమ గలవాడవు. విష్ణుబ్రహ్మాది దేవతలచే స్తుతింపబడే పరమేశ్వరుడవు (9). పార్వతీ తనయుడవగు స్కందుడవు. అద్వయుడవు. శత్రువులను తపింప జేయువాడవు. పరమాత్మవు. శరణు గోరు సత్పురుషుల ఆత్మను రక్షించు స్వామివి(10). దీనుల ప్రభువగు మహేశ్వరా! శవపుత్రా! ముల్లోకములకు తండ్రియగు ప్రభూ! మాయను వశము చేసుకున్న వాడా! నిన్ను శరణు పొందితిని .

విప్రులు నీకు ప్రియమైన వారు. నన్ను రక్షించుము. నీవు అందరికీ ప్రియుడగు ప్రభుడవు. నీవు సర్వజ్ఞుడవు. బ్రహ్మాది దేవతలు నిన్ను స్తుతించెదరు. మాయకు అధీశ్వరుడవగు నీవు మాయచే ఆకారమును దాల్చి, నీ భక్తులను రక్షించి సుఖముల నిచ్చుచున్నావు (11).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 606🌹*
*✍️  J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER  06 🌴*

*🌻 The miraculous feat of Kārttikeya - 1 🌻*

Brahmā said:—
1. There Kumāra showed a miraculous feat. O Nārada, listen to it that bestows devotion.

2. Then a certain brahmin Nārada came there, seeking refuge in Kumāra. He was glorious and had been performing a sacrifice.

3. Approaching Kumāra, bowing to and eulogising him with auspicious hymns the delighted brahmin related his tale.

The brahmin said:—
4. O lord, listen to my words. Relieve my distress. You are the lord of the universe. I seek refuge in you.

5. I began a goat sacrifice. The goat got loosened and strayed away from my house.

6. I do not know where it has gone. I have searched for it here and there but have not found it. Hence this will cause a serious default in my sacrifice.

7. While you are the lord, how can there be an obstacle to my sacrifice? O lord, after pondering over this matter please fulfil my task.

8. O lord, O son of Śiva, who else can I approach except you, who are worthy of being resorted to, who are the lord of the entire universe and are served by all the gods.

9-10. You are the kinsman of the distressed. You are worthy of being served well. You are favourably disposed to your devotees. You are the great lord eulogised by Viṣṇu, Brahmā and other gods. You are Skanda the delighter of Pārvatī, the sole destroyer of enemies, the great soul, the lord who bestows his own self upon the good seeking refuge in him.

11. O lord of the distressed, O great lord, O son of Śiva, O lord of the three worlds, O master of magical art, I have to seek refuge in you. O favourite of the brahmins, save me. You are the lord of all. You are eulogised by Brahmā and other gods who bow to you. You have assumed forms through magical art. You are the bestower of happiness to your devotees. You are eager to protect. You wield power of deluding others.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 225 / Osho Daily Meditations  - 225 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 225. దూకడానికి సిద్ధంగా ఉండండి 🍀*

*🕉. ఒక రోజు - ఇది జరుగుతుంది. నేను దానిని సంభావ్యతగా చూడగలను. ఏ క్షణంలోనైనా సూర్యోదయం సాధ్యమే. కానీ ఉత్సాహంగా, దూకుతూ ఉండండి; నిద్రపోకండి. 🕉*
 
*ఎవరో రాత్‌స్‌చైల్డ్‌ని అడిగారు, 'నువ్వు ఇంత ధనవంతుడివి ఎలా అయ్యావు?' అతను సమాధానం చెప్పాడు, 'నేను ఎల్లప్పుడూ నా అవకాశం కోసం వేచి ఉంటాను, అది వచ్చినప్పుడు నేను దానిపైకి దూకాను.' ఆ వ్యక్తి ఇలా అన్నాడు, 'నేను కూడా ఎదురు చూస్తున్నాను అవకాశం కోసం. కానీ  అది పోయినప్పుడు మాత్రమే తెలుస్తోంది! అవును, ఇది చాలా అరుదైన క్షణం. ఇది వస్తుంది. దానిని కోసం సిద్ధంగా లేకపోతే, అది తప్పి పోతుంది. 'అందుకని దూకుతూ ఉండండి, లేకపోతే మీరు మిస్ అవుతారు! నేను నా జీవితమంతా  చేస్తున్నది అదే.  అవకాశం రావచ్చు లేదా రాకపోవచ్చు-అది కాదు; నేను గెంతుతూనే ఉన్నాను. అది వచ్చినప్పుడు, నేను ఎప్పుడూ దూకుతున్నట్లు కనుగొంటుంది.*

*క్షణాల్లో అది వచ్చి పోతుంది. మీరు దాని గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటే మీరు దాన్ని కోల్పోతారు.' కాబట్టి దూకుతూ ఉండండి- ధ్యానం అంటే అంతే. ఏదో ఒకరోజు యాదృచ్ఛికం జరుగుతుంది. సరైన క్షణం దగ్గరగా వచ్చినప్పడు మీరు దానిలోకి దుంకడం చేస్తారు.  ఏదో అద్భుతమైనది అవుతుంది మరియు ఏదో జరుగుతుంది. ఇది ఒక జరుగుతున్నదిగా ఉంటుంది; అది చేయడంగా కాదు. కానీ మీరు ఆ క్షణంలో దూకడము చేయకపోతే, మీరు దానిని కోల్పోతారు. ఇది కష్టంగా మరియు కొన్నిసార్లు నిరాశగానూ ఉంటుంది, ఎందుకంటే మీరు మళ్లీ మళ్లీ అదే స్థలానికి వస్తారు మరియు అది వృత్తాకారంగా మారుతుంది. కానీ దూకుతూ ఉండండి.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 225 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 225. KEEP JUMPING 🍀*

*🕉. One day- it is going to happen. I can see it, just below the horizon. Any moment the sunrise is possible. But keep jumping; don't fall asleep. 🕉*
 
*Somebody asked Rothschild, "How did you become so rich?" He answered, "I always waited for my opportunity, and when it came One simply jumped on it." The man said, "I am also waiting for an opportunity, but I only know when it has gone! It is such a rare moment that it comes and by the time I am ready to jump on it, it IS gone. Rothschild laughed and he said, "Keep jumping, otherwise you will miss! That's what I have been doing all my life-jumping. An opportunity may come or not-that is not the point; I keep on jumping. When it comes, it finds me always jumping. It comes and goes in a moment, and if you are thinking about it you will miss it."*

*So keep jumping-that's all that meditation is about. Some day the coincidence will happen. You will be jumping and the right moment will be close by. Something clicks, and something happens. It is a happening; it is not a doing. But if you are not jumping, you will miss it. It is difficult and sometimes boring too, because you come again and again to the same space, and it becomes circular. But keep jumping.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 394 / Sri Lalitha Chaitanya Vijnanam  - 394🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  86. ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।*
*మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥ 🍀*

*🌻 394. 'ప్రభారూపా'🌻*

*కాంతిరూపము కలిగినది శ్రీమాత అని అర్థము. శ్రీమాత గుణమే కాదు; రూపము కూడ కాంతివంతమే. కాంతివంత మగు గుణ మున్ననూ, కాంతివంత మగు రూపము ఉండనక్కర లేదు. కాని శ్రీమాత విషయమున రూపము కూడ కాంతి వంతమే. కాంతి రూపముల యందలి కాంతి శ్రీమాతయే అని తెలియ వలెను. కన్నులలోని కాంతి ఆమెయే. శరీరమందలి మెఱపు ఆమెయే. కాంతికి ఆకర్షణ సహజ గుణము.*

*ఆకర్షణము ఎచ్చట నున్నదో అచ్చట శ్రీమాత యున్నదని తెలియవలెను. కాంతి రూపముతోనే అందరిని ఆకర్షించును. దుష్టులను మాయ చేయును. శిష్టులను అనుగ్రహించును. నిజముగ కాంతి మాయా రూపమే. సత్యమును మరుగు పరచగల కాంతి ఆమె. ఆమె కాంతి ఆవరణము నందే శివుడు సత్యమై యున్నాడు. సత్యమునకు ఆమె ప్రథమావరణ మగుటచే సత్యమును కూడ మరుగు పరచగల కాంతి రూపము శ్రీమాతది. ఆమె కాంతి ఆధారముగనే ఇచ్ఛా, జ్ఞాన, క్రియలు జీవుల కేర్పడి సృష్టి కార్యము నడచుచున్నది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 394 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma   📚. Prasad Bharadwaj*

*🌻 86. Prabhavati prabha rupa prasidha parameshari*
*Mulaprakruti ravyakta vyaktavyakta svarupini ॥ 86 ॥ 🌻*

*🌻 394. Prabhārūpā प्रभारूपा 🌻*

*The luminous light emanating from Her and was referred to in the last nāma, is said to be powerful in this nāma.  These devi-s derived their illumination from this brightness.  She is said to be in the form of Supreme light.*

*Chāndogya Upaniṣad (III.14.2) describes this light “He is controlled by the mind.  He has a subtle body and He is luminous (bhārūpaḥ).”*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

#నిత్యసందేశములు #DailyMessages 

Join and Share 

https://t.me/ChaitanyaVijnanam

https://t.me/Spiritual_Wisdom 

www.facebook.com/groups/chaitanyavijnanam/ 

https://dailybhakthimessages.blogspot.com

https://incarnation14.wordpress.com/

https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages

https://chaitanyavijnanam.tumblr.com/

https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj