Twelve Stanzas from the Book of Dzyan - 2

No photo description available.
🌹 Twelve Stanzas from the Book of Dzyan  - 2 🌹
The Prophetic Record of Human Destiny and Evolution 

📚. Prasad Bharadwaj 

🌻 STANZA I -  The Genesis of Divine Love  - 2 🌻

5. The planet was doing her utmost. She knew how to love, and what it was to be loved. With all the zeal and fervour of her Loving Soul, she warmed the motionless stones, breaking through their hardness and elasticity. They revived, drinking in the generous currents of Love. 

Stones were resurrected! They began to blossom like petals of Divine Flowers, and took their place in turn. The planet was beautified by a profusion of flowers.

6. The warmth of the Sun became stronger, for he was clearly experiencing the magical Power of the influence of Love. 

And the flowers loved both their Father Sun and their Mother Earth. They were their children, born in common! The parents carefully looked after their flowers’ luxuriant heads of many colours, open wide towards them. 

The Universe beheld the work of the Lords, and was pleased with the flowers’ first successful appearance. Ceaselessly they worked, imbuing the world with a fragrant aroma. 

Attracted by the flowers’ Power of Love, constellations generously imparted their own... The Lords of Destiny were content: all was proceeding according to their Predestined Plan.
🌹🌹🌹🌹🌹

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 13

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 13 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻.. జ్ఞానోపదేశము 🌻

ఇంతవరకు యముడు నచికేతునకు అనేక విధములగు సంపదలనిచ్చెదనని ప్రలోభపెట్టినను వానిని సరకుగొనక మరణాంతర విషయమునే దృఢముగా కోరుట చేత వాని యోగ్యతను గుర్తించి యమధర్మరాజు వానికి జ్ఞానోపదేశము చేయనారంభించుచున్నాడు:
 
చాలా ముఖ్యమైనటువంటి అధికారిత్వాన్ని ఇక్కడ నిరూపించారనమాట. ముందు ఆచార్యవర్యులెవరైనా సరే ప్రలోభాలకు గురి అవుతాడా లేదా, అహంకారానికి గురి అవుతాడా లేదా, అజ్ఞానానికి గురి అవుతాడా లేదా, ఎంతవరకు ఇతని స్థాయిలో అతనికి బోధించడానికి తగినటువంటి అధికారిత్వం వున్నది అనేటటువంటి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తారు. 

అలా పరిశీలన చేసిన తరువాత మాత్రమే వారికి ఆత్మవిషయమును గురించినటువంటి బోధని పూర్తిచేయాలి. అంతేగానీ, వచ్చినవారందరికీ తగినవారందరికీ చెప్పాలా వద్దా అంటే వారి అధికారిత్వాన్ని అనుసరించి చెప్పాలి. 

ఎవరికి ఏ స్థాయిలో వున్నటువంటి వివేకము, విచారణ వుంటయ్యో, వారివారి స్థాయికి బుద్ధిగత వికాసాన్ని బట్టి , వారి వివేకాన్ని అనుసరించి వారికి మనం బోధించాలే గానీ , కనబడ్డవారందరికీ “నువ్వు ఆత్మ స్వరూపుడివి! నువ్వు బ్రహ్మస్వరూపుడివి ! నువ్వు పరబ్రహ్మస్వరూపుడివి! నువ్వు ఇక తెలుసుకొనవలసినది ఏమీ లేదు! చెయ్యవలసింది ఏమీలేదు! పొందవలసినది ఏమీలేదు!” అనేటటువంటి అంశాలను చెప్పామనుకోండీ, రెంటికీ చెడ్డ రేవడిగా అయ్యేటటువంటి అవకాశం వున్నది.

🌻. శ్రేయో మార్గము - ప్రేయో మార్గము స్వధర్మము-పరధర్మము 🌻

ఈ ప్రపంచములో మానవులు నడచుకొనుటకు రెండు మార్గములు కలవు. ఒకటి శ్రేయోమార్గము. రెండవది ప్రేయోమార్గము. 

ఈ రెండును విభిన్న ప్రయోజనములు కలవియై మానవుని బంధించుచున్నవి. కాబట్టి జీవులందరి ముందు ప్రతిచోట, ప్రతి క్షణం, ప్రతి తలపులో కూదా రెండు రకములైనటువంటి అవకాశాలను ఈ ప్రకృతి కల్పిస్తుంది.

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||

    అంటుంది భగవద్గీత. అంటే అర్ధం ఏమిటీ? శ్రేయము-ప్రేయము, స్వధర్మము-పరధర్మము. ఈ రెండు అంశాలు ఒకచోటే వుంటాయి. నీవు ఆచరణశీలమై చూసేటప్పుడు నా స్వధర్మమేది? అని చక్కగా విచారణ చేయాలి. పరధర్మమేది? అనేది విచారణ చెయ్యాలి. 

ఎంతగా నీకు సుఖాన్ని ఇచ్చేది అయినప్పటికీ పరధర్మము ఆచరణకు అనుచితమైనటువంటిది. ఎంత దగ్గరిదారి అయినప్పటికీ పరధర్మము ఆచరణకు అనుచితమైనటువంటిది. 

ఎంత ధర్మసంకటమై తోస్తూ నిన్ను వెంటనే సుఖాన్ని పొందింపచేయడానికి సిద్ధంగా వున్నప్పటికీ నీవు దానిని - పరధర్మాన్ని - ఆచరించకూడదు. కారణమేమిటంటే శ్రేయము-ప్రేయము అనే విభజన స్పష్టముగా చెప్తున్నాడు జీవితంలో. 

దేనిని ఆచరిస్తే అత్మానుభూతికి దగ్గరవుతావో, ఏ తీరుగా జీవిస్తే ఆత్మానుభూతిలో నిలకడ చెందుతావో, ఏ రకమైనటువంటి విజ్ఞానాన్ని కనుక నువ్వు ఆశ్రయిస్తే నీవు స్వయముగా ఆత్మానుభూతియందు నిలకడ కలిగివుంటావో అటువంటిది శ్రేయము. శ్రేయస్సును కలిగించేది. 

ఎన్ని జన్మలకైననూ నిన్ను విడువనటువంటి శ్రేయస్సును కలిగించేటటువంటిది. అసలు జన్మే లేకుండా చేసేటటువంటి శ్రేయస్సును కలిగించేటటువంటిది. అటువంటి శ్రేయోమార్గమును నువ్వు ఆశ్రయించాలి. 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

29-July-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 442 / Bhagavad-Gita - 442🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 230 / Sripada Srivallabha Charithamrutham - 230 🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 110🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 133🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 46 / Sri Lalita Sahasranamavali - Meaning - 46 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 49 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 17 🌹
8) 🌹. శివగీత - 15 / The Shiva-Gita - 15🌹
9) 🌹. సౌందర్య లహరి - 57 / Soundarya Lahari - 57🌹
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 356 / Bhagavad-Gita - 356🌹

11) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 183🌹
12) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 59 🌹
13) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 55🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 70 🌹
15) 🌹 Seeds Of Consciousness - 134 🌹
16) 🌹. మనోశక్తి - Mind Power - 73 🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 19 🌹
18) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 13🌹
19) 🌹. సాయి తత్వం - మానవత్వం - 57 / Sai Philosophy is Humanity - 57 🌹
20)

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 442 / Bhagavad-Gita - 442 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 52 🌴*

52. శ్రీభగవానువాచ
సుదుర్దర్శమిదం రూపం దృష్టవానపి యన్మమ |
దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణ: ||

🌷. తాత్పర్యం : 
శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ అర్జునా! నీవిపుడు దర్శించుచున్న నా ఈ రూపము గాంచుటకు మిగుల దుర్లభమైనది. అత్యంత ప్రియమైన ఈ రూపమును దర్శించు నవకాశమునకై దేవతలు సైతము నిత్యమూ వేచియుందురు.

🌷. భాష్యము : 
ఈ అధ్యాయపూ నలుబదియెనిమిదవ శ్లోకమున విశ్వరూపప్రదర్శనమును ముగించి, అట్టి తన విశ్వరూపములు పలు పుణ్యకార్యములు, యజ్ఞాదులచే దర్శింపసాధ్యము కానిదని శ్రీకృష్ణభగవానుడు అర్జునునితో పలికెను. 

కాని శ్రీకృష్ణుని ద్విభుజరూపము మరింత గుహ్యమైనదని తెలియజేయుచు ఇచ్చట “సుదుర్ధర్శనమ్” అను పదము వాడబడినది. తపస్సు, వేదాధ్యయనము, తాత్విక చింతనము లేదా కల్పనములనెడి వివిధకర్మలకు కొద్దిగా భక్తిని మిళితము చేయుట ద్వారా ఎవ్వరైనను శ్రీకృష్ణుని విశ్వరూపమును గాంచగలుగుదురు. అనగా అది సాధ్యమయ్యెడి కార్యమే. కాని పూర్వమే తెలుపబడినట్లు భక్తి లేకుండా మాత్రము అది సాధ్యము కాదు. 

శ్రీకృష్ణుని అట్టి విశ్వరూపదర్శనము కన్ను అతని ద్విభుజరూపదర్శనము అత్యంత దుర్లభమైనది. బ్రహ్మ, రుద్రాది దేవతలకు సైతము అది సాధ్యము కాదు. సదా వారు అతనిని గాంచ గోరుదురు. దీనికి శ్రీమద్భాగవతమున మనకు ఆధారము లభించగలదు. 

శ్రీకృష్ణుడు తన తల్లియైన దేవకీ గర్భమున ఉన్నప్పుడు అతనిని గాంచుటకు తమ లోకముల నుండి విచ్చేసిన దేవతలు భగవానుడు ఆ సమయమున దర్శనీయుడు కాకున్నను ప్రార్థనలు చేసి అతని దర్శనముకై వేచిరి. 

కాని అజ్ఞానుడైనవాడు శ్రీకృష్ణుడు సామాన్యమానవుడేయని తలచి అతనిని నిరసించుచు, ఆ దేవదేవునికి గాక అతని అంతరమందున్న ఏదియో నిరాకారమునకు వందనముల నర్పించగోరును. 

కాని ఇవన్నియును అర్థరహితములే. శ్రీకృష్ణుని ద్విభుజరూపమును గాంచుటకు బ్రహ్మ రుద్రాదుల వంటి దేవతలు సైతము నిత్యకాంక్షులై యుందురు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 442 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 52 🌴*

52. śrī-bhagavān uvāca
su-durdarśam idaṁ rūpaṁ
dṛṣṭavān asi yan mama
devā apy asya rūpasya
nityaṁ darśana-kāṅkṣiṇaḥ

🌷 Translation : 
The Supreme Personality of Godhead said: My dear Arjuna, this form of Mine you are now seeing is very difficult to behold. Even the demigods are ever seeking the opportunity to see this form, which is so dear.

🌹 Purport :
In the forty-eighth verse of this chapter Lord Kṛṣṇa concluded revealing His universal form and informed Arjuna that this form is not possible to be seen by so many pious activities, sacrifices, etc. Now here the word su-durdarśam is used, indicating that Kṛṣṇa’s two-handed form is still more confidential. 

One may be able to see the universal form of Kṛṣṇa by adding a little tinge of devotional service to various activities like penances, Vedic study and philosophical speculation.

 It may be possible, but without a tinge of bhakti one cannot see; that has already been explained. Still, beyond that universal form, the form of Kṛṣṇa with two hands is still more difficult to see, even for demigods like Brahmā and Lord Śiva. 

They desire to see Him, and we have evidence in the Śrīmad-Bhāgavatam that when He was supposed to be in the womb of His mother, Devakī, all the demigods from heaven came to see the marvel of Kṛṣṇa, and they offered nice prayers to the Lord, although He was not at that time visible to them. They waited to see Him. 

A foolish person may deride Him, thinking Him an ordinary person, and may offer respect not to Him but to the impersonal “something” within Him, but these are all nonsensical postures. Kṛṣṇa in His two-armed form is actually desired to be seen by demigods like Brahmā and Śiva.

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 230 / Sripada Srivallabha Charithamrutham - 230 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 44
*🌻. స్వర్ణపీఠికాపుర వర్ణన. 🌻*

భాస్కర పండితులు తిరిగి వివరించసాగారు : 
శ్రీపాదులవారు పీఠికాపురాన్నీ, తాము సంచరించిన ప్రాంతాలనూ జాగృతపరచి, భూచైతన్యాన్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి... పృధ్వీతత్త్వ యజ్ఞం ప్రారంభించారు. 

దీనివలన అక్కడి భూమి జాగృతమై ప్రజలు అక్కడకు ఆకర్షింపబడతారు. అంతే కాకుండా వారిలో గల శబ్ద, స్పర్శ, రూప, రస, గంధమైన భూతత్త్వం కూడా శుద్ధి చేయబడుతుంది.

భౌతిక పీఠికాపురము,భౌతిక కాశి ఎలా ఉన్నాయో... అలాగే స్వర్ణపీఠికాపురం, స్వర్ణ కాశీ అనేవి... చైతన్యంతో నిర్మించబడి ఉంటాయి. సాధకుడిలో ఆ చైతన్యానికి సంబంధించిన పదార్థం నిర్మించ బడినప్పుడు... అతడు స్వర్ణపీఠికాపురవాసి, స్వర్ణకాశివాసి అవుతాడు.

*🌻. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు పంచకోశాలు. 🌻*

మన చైతన్యం ఈ పంచకోశాల యాత్రను చేయడమే '' పంచకోశయాత్ర " అవుతుంది. శ్రీపాదులవారి అనుగ్రహంతో సాధకుడికి పంచకోశయాత్ర చేయగలిగే శక్తి లభిస్తుంది.

అందువల్లనే వారు పంచమహా యజ్ఞాలనూ వారి యోగశక్తితో నిర్వహించడానికి ప్రతీకగా, కురుంగడ్డ సమీపంలోని పంచదేవపహాడ్ లో దర్బారు నిర్వహించారు. పుణ్య నదులన్నీ పాపులైన మానవుల వల్ల అపవిత్రం అయినప్పుడు, మహాపురుషులు స్నానం చేయడం వల్ల తిరిగి పుణ్యవంతం అవుతాయి.

 అంతేకాకుండా మానవులలో రస స్వరూపంలో ఉన్న జలతత్త్వం శుద్ధి చేయడానికి జల యజ్ఞాన్ని చేయాలని సంకల్పించి, ప్రతిరోజూ గంగానదిలో స్నానం చేయదలిచారు. వారి అవతారం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.... మహా యోగులనూ, సిద్ధులను అనుగ్రహించి, వారి ద్వారా ధర్మాన్ని ఉద్ధరించడం.

శ్రీపాదులవారు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు ఒక సన్నాసి కుక్కుటేశ్వరాలయంలో ధ్యానంలో ఉండగా, అతనిని తీక్షణంగా చూసి అతడు అంతర్ముఖుడు అయ్యేటట్లు చేశారు.

అప్పుడు అతడు తన రక్తంలో కూడా చిన్న చిన్న చేపలను పోలిన కణాలు ఉన్నట్టు, మూలాధారం
దగ్గర ఉన్న వాసనలను గ్రహించే కణాలు కూడా చేప ఆకారంలోనే ఉన్నట్టు తెలుసుకుని
మత్స్యావతార ప్రక్రియ యొక్క అంతరార్థాన్ని గ్రహించాడు.

 మూలాధారం దగ్గర ఉన్న కణాలను
గురించి జ్ఞానం కలిగితే సర్వ వాసనలను నియంత్రించగలిగే శక్తి కలుగుతుంది. పరాశర మహర్షి మత్స్యగంధిని యోజన గంధిగా మార్చిన యోగ ప్రక్రియ కూడా ఇదేనని గ్రహించాడు.

శరీరంలోని అనుభూతులన్నీ సువాసనా భరితంగా మారినట్లైతే, భౌతికంగా కూడా సువాసనలు
వెదజల్లబడతాయి. ఆ రకంగానే పతివ్రతలు సువాసినులు అవుతారని తెలుసుకున్నాడు.

కూర్మం తన డిప్పలో శిరస్సును దాచుకున్నట్టు, మహాయోగి అంతర్ముఖుడై యోగాలను
చేసి, కర్మ బంధం నుండి విడుదల పొందుతాడని కూర్మావతారాన్ని గురించి కూడా శ్రీపాదులవారు ఆ సన్యాసికి తెలియజేశారు అని భాస్కర పండితులు వివరించారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sripada Srivallabha Charithamrutham - 230 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 24
*🌻 The influence of Shani is removed as a result of worshipping Siva at Shani Pradosha time 🌻*

When Mahasivarathri comes on a Tuesday (Mangal vaaram) it is very important. When Triodasi (thirteenth day) comes on Saturday, it is called Shani Triodasi.  

To avoid the problems that occur due to Shani, one should do Siva worship on ‘Shani triodasi’ day and give donation of ‘til’ (gilgelly) to please Shani. Siva is the supporting God for Shani. So if Siva is worshipped with gingelly oil, problem of Shani effect will be removed. 

 If Siva is worshipped at the ‘Pradosha time’ (evening sandhya time) all the faults in karma will vanish and people get happiness and peace.  

Shani is responsible for doing karma. Siva is responsible for death. Any man who wants to burn away the different kinds of sins due to inauspicious karmas, should do Siva worship at Shani pradhosha time.  

He will also get his body, mind, intellect, ego, inclination and atma purified with new auspicious divine glowing vibrations and get a new birth. Shani will be pacified in this way.  

In the night on Saturdays the supporting Gods of all types of karma faults i.e. the unfortunate or unlucky powers in the black form remaining incognito and the great destructive powers, reside in ‘Maha Kaali’ who is the Shakti form of ‘Maha Kaala’.  

On the next day, i.e. Sunday morning, that ‘Maha Shakti’ which pervades the ‘Savithri Mandalam’ (Bhanu Mandalam) will grace the sadhaka and he starts a new life.  

The bundles of sinful acts which are inauspicious will get burnt in Parameswara’s ‘Yogaagni’.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 110 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

భగవంతుడు జీవుడుగా దేహములలోనికి దిగివచ్చునపుడు , దేహములందలి యింద్రియములను సృష్టించి కాపాడు దేవతలకు గూడ వాని తత్త్వము అంతుపట్టదు.  

కనుకనే వేదములలో " కంటినుండి ఎవడు చూచునో, కన్ను ఎవరిని చూడలేదో, చెవినుండి ఎవడు వినునో, చెవి ఎవరిని వినలేదో, మనస్సు నుండి ఎవడూహించునో, మనస్సు ఎవనిని గూర్చి ఊహింపలేదో.....". అతడే భగవంతుడని వర్ణింపబడినది.  

ఆతడు ఇంద్రియముల నడుమ జీవుడై దిగివచ్చి క్రీడించుచు , ఇంద్రియములచే కూడ తెలియబడడు‌.

వేడుకతో గోపాలవరులతో గూడి గోవులను, దూడలను గాచెను. అపుడు గూడ నందలి గోపాలశ్రేష్ఠులకైనను తన సమగ్రమైన నిజస్వరూపమును చూపలేదు.

(గోపాలవరులు అను మాటకు ఇంద్రియములను రక్షించు దేవతలని కూడ నర్థము.) 

 భగవంతునికి పూజాదికముల రూపమున తమకున్నది సమర్పించుట మాని తమ్ము తాము సమర్పణ చేసుకొనువారికి సంసార తాపములను అతడే నివారించును.  
అట్టివారి కథలను ఆతని కథలుగా అనుభవించు వారు నిజమైన మోక్షమును పొందుచున్నారు.
...... ✍🏼 *మాస్టర్ ఇ.కె.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 131 🌹*
*🌴 The Crises - 5 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

*🌻 Standing above the Pairs of Opposites - 2 🌻*

May all beings live in poise, in peace and in happiness. 

We cannot just be happy when we alone are content but only when all are content. Otherwise we are egocentric. But even when there is a crisis we can remain in equilibrium and also when there is no crisis. 

There are so many crises and conflicts – personal, political, religious and ideological ones. Or also economic and ecologic crises and dangers for health. 

Our immediate responsibility is to transform ourselves so that we become useful instrument to help others. Without transforming ourselves we cannot think of transforming others.

In the early history of mankind there was a big crisis when individualisation took place and the one soul became many. 

Now the point is that the many become again one and that humanity is reborn in spirit. The personalities have to clear the way; otherwise they get broken. 

“Bend or break” is the only choice. Whether we like it nor not, Uranus brings the transformations to introduce the new age. 

He doesn’t make compromises. But with the help of wisdom and of the Masters we can transform ourselves and overcome the crises. This is the work ahead of us.

🌻 🌻 🌻 🌻 🌻 🌻 
Sources: Master K.P. Kumar: Uranus. The Alchemist of the Age / The Teachings of Sanat Kumara / notes from seminars. 

Continues
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 46 / Sri Lalita Sahasranamavali - Meaning - 46 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 85

387. నిత్యక్లిన్నా - 
ఎల్లప్పుడూ దయార్ద్రతతో తడుపబడి యుండునది.

388. నిరుపమా - 
పోల్చిచెప్పుటకు ఉపమానము ఏమియు లేనిది.

389. నిర్వాణసుఖదాయినీ -
 సర్వనివృత్తి రూపమైన బ్రహ్మపద ప్రాప్తి లేక మోక్ష సంబంధమైన ఆనందమును ఇచ్చునది.

390. నిత్యాషోడాశికారూపా - నిత్యాదేవతలగానున్న పదహారు కళల రూపము.

391. శ్రీకంఠార్థశరీరిణీ - 
శివుని సగము శరీరముగా నున్నది.

🌻. శ్లోకం 86

392. ప్రభావతీ - 
వెలుగులు విరజిమ్ము రూపము గలది.

393. ప్రభారూపా - 
వెలుగుల యొక్క రూపము.

394. ప్రసిద్ధా - 
ప్రకృష్టముగా సిద్ధముగా నున్నది.

395. పరమేశ్వరీ - 
పరమునకు అధికారిణి.

396. మూలప్రకృతిః - 
అన్ని ప్రకృతులకు మూలమైనది.

397. అవ్యక్తా - 
వ్యక్తము కానిది.

398. వ్యక్తావ్యక్తస్వరూపిణీ - 
వ్యక్తమైన, అవ్యక్తమైన అన్నిటి యొక్క స్వరూపముగా నున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 46 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 46 🌻*

387 ) Shadgunya paripooritha -   
She who is full of six characteristics viz., wealth, duty, fame, knowledge, assets and renunciation

388 ) Nithya klinna -   
She in whose heart there is always mercy

389 ) Nirupama -   
She who does not have anything to be compared to

390 ) Nirvanasukha dayini -   
She who gives redemption

391 ) Nithya shodasika roopa -   
She who is of the form sixteen goddesses

392 ) Sri kandartha sareerini -   
She who occupies half the body of Lord Shiva

393 ) Prabhavathi -   
She who is lustrous of supernatural powers

394 ) Prabha roopa -   
She who is personification of the light provided by super natural powers

395 ) Prasiddha -   
She who is famous

396 ) Parameshwari -   
She who is the ultimate goddess

397 ) Moola prakrithi -   
She who is the root cause

398 ) Avyaktha -   
She who is not clearly seen

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 49 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 27

🌻 27. ఈశ్వర రస్యాప్యభిమాన ద్వేషిత్వాత్‌ దైన్య ప్రియత్వాత్‌ - 6 🌻

4. ప్రాణాయామం : భాగవతులు, గురువులు ఉపదేశించిన మంత్రాన్ని శ్వాసతో అనుసంధానం చేస్తూ జపిస్తే ఏకాగ్రత లభిస్తుంది. దాని వలన మనలో ఉన్న భగవంతుని వద్దకు చేరగలం.

5. ప్రత్యాహారం : భగవద్భావాన్ని మనయందు నింపుకొని, అహంకార మమకారాలకు కారణమైన ఇంద్రియ, మనోబుద్ధులను లోనికి ముడుచుకోవాలి. అనగా తాబేలు తన అవయవాలను ముడుచుకొన్నట్లు చేసి, బయటి విషయాలలోకి పోనీయకుండడం.

6. ధారణ : భగవంతుని హృదయం నిండా నింపుకోవడమే ధారణ. ఈ ధారణ మధ్య మధ్యలో మనసు విషయాలమీదికి పోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మళ్ళీ ధారణ చేస్తూ ఉంటాం.

7. ధ్యానం : ధారణ ఖండ ఖండాలుగా జరుగుతూ, చివరకు అఖండ ధారణ జరిగితే అంతవరకు చేసే ప్రయత్నాన్ని ధ్యానం అంటారు.

8. సమాధి : ధ్యానం అఖండ ధారణగా మారినప్పుడు కలిగేది సమాధి. సమాధిలో దైవ సాక్షాత్కారమవుతుంది.

            ఈ ఎనిమిదింటిలో యమ నియమాలు పునాది వంటివి. ఆసన, ప్రాణాయామాలు ఉపకరాణాలు. ప్రత్యాహార, ధారణ, ధ్యానాలు సాధనా మార్గాలు. పర్యవసానంగా కలిగే సమాధి ఫలరూపమైన పరాభక్తి అనబడుతుంది.

   ఈ విధంగా జ్ఞాన, యోగ పద్ధతులలో కూడా భక్తుడు తనను తాను సంస్కరించుకొని సంసిద్ధుడవవచ్చును. అన్ని మార్గాలు ఉపయోగ పడేవే. ఏదో ఒక పద్ధతిలో యోగ్యత సంపాదించి, భగవదనుగ్రహం పొందే ప్రయత్నం భక్తులే చేసుకోవాలి. అంతేగాని, ఆయనను నిందించడం అవివేకం.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 17 🌹*
✍️. Sri GS Swami ji 
📚. Prasad Bharadwaj

*🌻 When they are beset with troubles caused by their own karma, begin studying the Guru Gita 🌻*
 
Because of the insistence of his mother, Viswaroopa secretly began distributing a portion of the fruits of the sacrificial rituals (yajnas) to the demons, while outwardly having the gods perform the rituals for their own benefit. 

The performance of so many wonderful yajnas by the celestials made Viswaroopa famous amongst them. 

Indra, on one hand began to resent the popularity that his Guru was enjoying amongst gods, demons, and humans, whom he had brought into limelight from obscurity. On the other hand he was unaware of Viswaroopa’s deception. 

One day, by the help of Narada, Indra learned of the secret goings on and understood the reason for his guru’s fame. By receiving the fruits of the rituals, the demons were now gaining strength. 

In a fit of rage Indra cut off the three heads of Viswaroopa as if he were swatting mosquitoes, without any consideration that he happened to be his Guru. Will the sin of killing Guru spare Indra? Guru was also a brahmin. 

The sin of killing a brahmin also accrued to him. In the meantime the demon Vritrasura began harassing Indra. Indra, who now lacked the support of Guru, was unable to withstand the attacks. One Guru he dismissed. 

Another Guru he slaughtered. Now he had no help. Under dire circumstances, he somehow managed to obtain the Vajra weapon by the grace of Sage Dadheechi and managed to kill Vritrasura. That is a very big story; a beautiful story. 

The sin of killing yet another brahmin befell him. Chased by the effects of these atrocious sins, in fright, Indra ran away from heaven and took shelter inside a lotus stalk within a pond. 

Like a small insect he remained hidden inside that narrow stem for ten thousand years. Nahusha, in the meantime became the new Indra. While hiding inside the stalk, Indra spent his time in intense prayer. 

Perhaps misfortune has its benefits. Many people, when they are beset with troubles caused by their own karma, out of desperation begin studying the Guru Gita, and the Bhagavatam. They memorize them. 

They chant the Sri Vishnu Sahasranama, Sri Lalita Sahasranama, Sri Lalitha Trisati, and they try to learn the meaning of these prayers. Let us also study one more time, the meaning of Sri Lalita Trisati that we had learned earlier. During that time Indra composed several Indra Kavachas. 

He composed prayers addressed to Goddess Lakshmi, and Lord Dattatreya also. Let us once again chant the Lakshmi Kavacham. Like this, many wonderful prayers came into existence while Indra remained inside the lotus stalk.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 15 / The Siva-Gita - 15 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ద్వితీయాధ్యాయము
*🌻. వైరాగ్య యోగము - 6 🌻*

యోని మన్యే ప్రపద్యన్తే - శరీర త్వాయ దేహినః
స్థాణు మన్యే ప్రపద్యన్తే - యధా కర్మ యధా శ్రుతమ్, 34

సుఖ్యహం దుఃఖ్య హం చేతి - జీవ ఏవాభి మన్యతే,
నిర్లే పోసి పరం జ్యోతి - ర్మోహిత శ్శం భూ మాయయా 35

ప్రాణి ఆయా కర్మముననుసరించి స్థావరత్వమును, జంగ మత్వమును బడయును. 

ఏదో ఒక శరీరమును ధరించి దాననుభవించే సుఖము గాని, దుఃఖము గాని యిదే దియు తనది గాక ఇది కేవలము ఈశ్వర మాయ యని తెలియవలెను.

కామః క్రోధ స్థదా లోభో - మదో మాత్సర్య మేవచః 36

మొహశ్చే త్యరి షడ్వర్గ - మహం కార గతం విదు:,
స ఏవ బధ్యతే జీవ - స్స్వప్న జాగ్రద వస్తయో: 37

సుషుప్తౌ తద భావాచ్చ - జీవ శ్శంకర తాం గతః,
సఏవ మాయయా స్పృష్టః - కారణం సుఖ దుఃఖ యో: 38

శుక్తౌ రజత వద్విశ్వం - మాయయా దృశ్యతే శివే,
తతో వివేక జ్ఞానేన - నకో ప్యత్రాస్తి దుఃఖ భాక్ 39

తతో విరమ దుఃఖాత్త్వం - కిం ముదా పరితప్యసే,

కామ - క్రోధ - మోహ - మద మాత్సర్యములను అరి షడ్వర్గ ములనబడును. ప్రాణి స్వప్నావస్థలో పైన చెప్పబడిన వాటికి లోబడి బందీ భూతుడగును.

సుషుప్తి అవస్తలో నా కామ క్రోదాదులకు లోబడని యెడల నతడే శివైక్యమును చెందును. అట్లు మాయకు వశీ భూతుడైనచో అతడు సుఖ దుఃఖములకు గారణ భూతుడే యగును. శక్తి క లో రజతము వలె, పరమ శివుని యందు ప్రపంచము మాయా మయంబుగా గోచరించును.

 వివేకముతో పరిశీలించి చూచిన సుఖ దుఃఖములు మృగ్యము లగును. 
అధవా మృగ తృష్టి క వంటిది. కావున ఓ రామా! సీతను గురించి యేల దుఃఖించెదవు? వృధా దుఃఖించకుము.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 The Siva-Gita - 15 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 02 : 
*🌻 Vairagya Yoga - 6 🌻*

34. 35. A Jeeva follows all such karmas and obtains mobility or immobility। Whatever body a Jeeva gains, in that
body whatever pleasures or pains it gains all those pleasures and pains are not at all his. That's all due to
the Shambhu Maya of lord Maheshwara.

36. Kama, Krodha, Lobha, Moha, Mada Maatsarya are called as Arishadvargam. A Jeeva gets shackeled with the aforementioned fetters in Dream state.  

When he doesn't fall prey to those vices in his Sushupti state (dreamless sleep), he attains oneness with Shiva. 

37. If he becomes a prey to Maya, he becomes the
reason for his pleasures and pains. Like silver in Suti, this entire universe is seen as illusion in Paramashiva. 

38. When analyzed through wisdom, these pleasures and pains would vanish otherwise that's too stubborn to get eradicated. 

39. Therefore, O Rama! How do you become sorrowful for Sita? That's worthless to become sorrowful.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 7 / Sri Gajanan Maharaj Life History - 7 🌹* 
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. 2వ అధ్యాయము - 3 🌻*

అతను నీరుత్రాగి ఇలా అన్నారు - ఆమాలి దగ్గర నుండి తెచ్చిన రొట్టెతో నన్ను సంతృప్తి చేసేందుకు ప్రయత్నించకు, నాకు నీనుండి వక్కకావాలి. బనకటలాల్ అతనికి వక్క ఇచ్చి దానితోపాటు ఒక రాగి నాణెం దక్షిణగా ఇస్తాడు. తను వ్యాపారిని ఏమీ కాను (ఈ ధనం స్వీకరించడానికి) అని శ్రీగజానన్ అంటారు. భక్తి కావాలని అడుగుతారు. 

తరువాత చిత్తసుద్ధితో కీర్తన వినమని బనకట్ను, పీతాంబర్ ను శ్రీగజానన్ అడిగారు. భాగవతంలోని ఒక కీర్తనతో గోవిందబువా తన కీర్తన ప్రారంభించాడు. గోవిందబువా ఆ కీర్తనలోని మొదటి పంక్తి ఆలాపించగానే శ్రీగజానన్ తరువాత భాగాన్ని గట్టిగా ఆలాపిస్తారు. 

ఈ విధంగా ఆలాపించిన వ్యక్తి మహాగొప్ప పండితుడు అయి ఉండాలి అని గోవిందబువా ఆశ్చర్యపోయి అంటాడు. ఈవిధంగా అంటూ శ్రీగజానన్న మందిరంలోకి రావలసిందిగా విన్నవిస్తాడు. 

మిగిలిన వ్యక్తులుకూడా అదేవిధంగా విన్నతించినప్పటికీ వారిని శ్రీగజానన్ మహారాజు లక్ష్యపెట్టలేదు. తరువాత గోవిందబువా స్వయంగా మహారాజుతో మీరు సాక్షాత్తు శివుని అవతారం దయచేసి లోపలికి రండి అంటాడు. 

దానికి నువ్వు చెప్పినదానిమీద ధృఢంగా ఉండు. ఇప్పుడే నువ్వు భగవంతుడు ప్రతిచోటాఉన్నాడు అని అంటూ ఇప్పుడు నన్ను మందిరంలోకి రమ్మని ఎందుకు బలవంతంచేస్తున్నావు ? నువ్వు భోధించే విషయం నువ్వు పాటించాలి. అంతేకాక విద్యార్ధి మాటలతో ఆడడం అనేది వదలాలి. 

నువ్వు భోధించిన భాగవతంలోని శ్లోకానికి విరుద్ధంగా ప్రవర్తించడం ఉచితంకాదు. నువ్వు ఒత్తి జీవన భత్యంకోసం భోధన చెయ్యటం అనేది నాకోరిక కాదు. ఇకవెళ్ళి నీ కీర్తన కొనసాగించు అని శ్రీమహారాజు ఈవిధంగా అంటారు. 

బువా వెనక్కివచ్చి షేగాంకి ఒక ఆణిముత్యం వచ్చింది జాగ్రత్తగా కాపాడండి. ఈ మానవ రూపంలో వచ్చిన పాండురంగ వలన షేగాం పండరపూర్ అవుతుంది. అతనికి అణకువగా ఉండి సేవచేస్తూ మీతో ఉండేలా చూసుకోండి, దీనివల్ల మీకు సంతోషం దొరుకుతుంది అని ప్రజలకి ప్రకటన చేసాడు. 

అత్యంతంగా పొంగివస్తున్న ఆనందంతో బనకటలాల్ ఇంటికి వచ్చి శ్రీగజానన్ గూర్చిన విషయం తన తండ్రి అయిన భవానీరాంకు చెప్పి మరియు శ్రీగజానన్ను తమ ఇంటికి తెచ్చేందుకు అనుమతి తీసుకున్నాడు. 4 రోజులుపాటు వెతికిన తరువాత మాణిక్ చౌక్ లో మహారాజును బనకటలాల్ చూస్తాడు. ఆసమయం సూర్యాస్థమాన సమయం కానీ, బనకటలాల్ కి అది శ్రీగజానన్ రుపంలో సుర్యోదయం అయింది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 7 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 2 - part 3 🌻*

He drank the water and said Don't try to satisfy me with the bread of that Mali. I want a nut from you. Bankatlal gave Him a nut and along with it offered a copper coin as Dakshina (offering). Shri Gajanan said that He was not a businessman to accept money, and asked for Bhakti only. 

Then Shri Gajanan asked Bankat and Pitambar to listen to the Kirtan attentively. Govind-Bua started the Kirtan with a stanza from Shri Bhagavat. 

Govind-Bua recited the first part of the stanza and Shri Gajanan loudly recited the latter part of it. Govind-Bua was surprised and said that the man who recited this stanza must be a man of great authority. 

Saying so, he requested Shri Gajanan Maharaj to come inside the temple. Likewise other people also requested Shri Gajanan Maharaj , but Shri Gajanan Maharaj ignored them all. 

Then Govind-Bua himself came out and said to Maharaj, You are the incarnation of Lord Shankar. Please come in. The temple will be empty without You. By the grace of some good deeds of my previous birth I have come across saint like you. 

So kindly come into the temple.” Shri Gajanan Maharaj said, Be firm on what you say. Just now you have said that God is every where, then why force me to come in the temple? 

You should practice what you preach and a student should avoid playing with words. It is not proper for you to behave against the preaching of the stanza from Bhagavat that you just preached to these people. 

I don't wish for you to be preaching just for livelyhood. Now go and continue your Kirtan. Bua returned and announced to the audience, An invaluable gem has come to your Shegaon. 

Protect Him carefully. With the arrival of this Pandurang in human form, Shegaon has become Pandharpur. See that He lives with you, serve Him well and obey Him. That alone will bring you all immense happiness. 

Bankatlal brimming with joy returned home and told his father Bhavaniram about Shri Gajanan and received his consent to bring Shri Gajanan Maharaj home.

Then he started his search for Shri Gajanan. After four days of wondering, Bankatlal Saw Shri Gajanan Maharaj in Manik Chowk. It was evening time and the sun was setting, but for Shri Bankatlal it was the rising of sun in the form of Shri Gajanan.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 57 / Soundarya Lahari - 57 🌹*

📚. ప్రసాద్ భరద్వాజ 

57 వ శ్లోకము

*🌴. అమ్మ దీవెనలతో అదృష్టము, అభివృద్ధి, సంపదలు కొరకు 🌴*

శ్లో:57. దృశా ద్రాఘీయస్యా దరదళిత నీలోత్పల రుచా 
దవీయాంసం దీనం స్నపయ కృపయా మా మపి శివేl 
అనే నాయం ధన్యో భవతి నచతే హానిరియతా 
వనే వా హర్మ్యేవా సమకరనిపాతో హిమకరః ll 
 
🌷. తాత్పర్యం : 
అమ్మా! శివుని పత్ని యగు ఓ పార్వతీ దేవీ చాలా పొడవైన వికసించిన నల్ల కలువల కాంతి గల నీ క్రీగంటి చూపు లోని కృపా రసముతో అతి దూరముగా ఉన్న నన్ను కొంచెము తడుపుము. అట్లు చేయుట వలన నేను ధన్యుడను అగుదును. ఈ మాత్రము నీవు చేయుటవలన నీకు ఎటువంటి నష్టమూ లేదు. చల్లదనముతో కూడిన చంద్రుడు అడవి యందు అయిననూ రాజప్రాసాదము వంటి భవనముల యందు అయిననూ ఒకే విధమయిన చల్లదనము చూపును. కదా !

🌷. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1,000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, పాయసం, తేనె నివేదించినచో అమ్మ దీవెనల ద్వారా సంపూర్ణ అదృష్టము, అభివృద్ధి, సంపదలు లభించును అని చెప్పబడింది.

*🌹 SOUNDARYA LAHARI - 57 🌹*
📚Prasad Bharadwaj 

SLOKA - 57 

*🌴 All round Luck, success, prosperity and well-being 🌴*

57. Drisa draghiyasya dhara-dhalita-nilotpala-rucha Dhaviyamsam dhinam snapaya kripaya mam api Sive; Anenayam dhanyo bhavathi na cha the hanir iyata Vane va harmye va sama-kara-nipaatho himakarah 
 
She who is the consort of Lord Shiva, Please bathe me with your merciful look, from your eyes which are very long, and have the glitter of slightly opened, Blue lotus flower divine. By this look I will become rich with all that is known, and you do not loose anything whatsoever, For does not the moon shine alike, In the forest and palaces great.

Chanting procedure and Nivedyam (offerings to the Lord) : 
If one chants this verse 1000 times a day for 45 days, offering honey, payasam as prasadam, one will be blessed by the Goddess for good luck and all round progress.

🌻 BENEFICIAL RESULTS: 
Wealth, fame, progeny and prosperity. 
 
🌻 Literal Results: 
All round success and general prosperity and well-being.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 356 / Bhagavad-Gita - 356 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 03 🌴*

03. యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ |
అసమ్మూఢ: స మర్త్యేషు సర్వపాపై: ప్రముచ్యతే ||

🌷. తాత్పర్యం :
నన్ను పుట్టుకలేనివానిగను, అనాదిగను, సర్వలోకములకు దివ్యప్రభువుగను తెలిసికొనినవాడు మాత్రమే మనుజులందరిలోను భ్రాంతిరహితుడై, సర్వపాపముల నుండి ముక్తుడగును.

🌷. భాష్యము : 
“మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతిసిద్ధయే” యని సప్తమాధ్యాయమున (7.3) తెలుపబడినట్లు ఆధ్యాత్మికానుభవ స్థాయిని పొందుటకై యత్నించువారు సామాన్యజనులు కానేరరు. ఆధ్యాత్మికానుభవమునకు సంబంధించిన జ్ఞానము ఏ మాత్రములేని కోట్లాది సామాన్యమానవుల కన్నను వారు నిక్కము ఉత్తములు. 

కాని ఆ విధముగా తమ ఆధ్యాత్మికస్థితిని అవగాహన చేసికొన యత్నించువారిలో శ్రీకృష్ణుడు దేవదేవుడు, సర్వమునకు ప్రభువు, పుట్టుకలేనివాడనెడి అవగాహనకు వచ్చినవాడు ఆత్మానుభవప్రాప్తిలో కృతకృత్యుడైనట్టివాడు. శ్రీకృష్ణుని దివ్యస్థితిని సంపూర్ణముగా నెరుగగలిగిన స్థితి యందే మనుజుడు సర్వవిధములైన పాపఫలముల నుండి ముక్తుడు కాగలడు.

ఇచ్చట శ్రీకృష్ణభగవానుడు అజునిగా (పుట్టుకలేనివానిగా) వర్ణింపబడినాడు. ద్వితీయాధ్యాయమున జీవులు సైతము అజులుగా తెలుపబడినను భగవానుడు వారికి భిన్నమైనవాడు. భౌతికబంధకారణముగా జన్మించుచు మరణించు జీవులకు అతడు భిన్నుడు. ఆ బద్ధజీవులు తమ దేహములను మార్చుచుండ, భగవానుని దేహము మార్పురహితమై యున్నది. అతడు భౌతికప్రపంచమునకు అరుదెంచినను అజునిగనే అరుదెంచును. 

కనుకనే శ్రీకృష్ణభగవానుడు తన అంతరంగశక్తి ద్వారా న్యునమైన భౌతికశక్తికి అధీనుడుగాక సదా దివ్యశక్తియందే స్థితుడై యుండునని చతుర్థాధ్యాయమున తెలుపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 356 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 10 - Vibhuti Yoga - 03 🌴*

03. yo mām ajam anādiṁ ca
vetti loka-maheśvaram
asammūḍhaḥ sa martyeṣu
sarva-pāpaiḥ pramucyate

🌷 Translation : 
He who knows Me as the unborn, as the beginningless, as the Supreme Lord of all the worlds – he only, undeluded among men, is freed from all sins.

🌹 Purport :
As stated in the Seventh Chapter (7.3), manuṣyāṇāṁ sahasreṣu kaścid yatati siddhaye: those who are trying to elevate themselves to the platform of spiritual realization are not ordinary men; they are superior to millions and millions of ordinary men who have no knowledge of spiritual realization. 

But out of those actually trying to understand their spiritual situation, one who can come to the understanding that Kṛṣṇa is the Supreme Personality of Godhead, the proprietor of everything, the unborn, is the most successful spiritually realized person. 

In that stage only, when one has fully understood Kṛṣṇa’s supreme position, can one be free completely from all sinful reactions.

Here the Lord is described by the word aja, meaning “unborn,” but He is distinct from the living entities who are described in the Second Chapter as aja. 

The Lord is different from the living entities who are taking birth and dying due to material attachment. The conditioned souls are changing their bodies, but His body is not changeable. 

Even when He comes to this material world, He comes as the same unborn; therefore in the Fourth Chapter it is said that the Lord, by His internal potency, is not under the inferior, material energy, but is always in the superior energy.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 184 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴* 
41. అధ్యాయము - 16

*🌻. సృష్టి వర్ణనము - 1 🌻*

అథ షోడశోsధ్యాయః
సృష్టి వర్ణనము

బ్రహ్మోవాచ |

శబ్దాదీని చ భూతాని పంచీకృత్వాహమాత్మనా | తేభ్యస్థ్సూలం నభో వాయుం వహ్నిం చైవ జలం మహీమ్‌ || 1

పర్వతాంశ్చ సముద్రాంశ్చ వృక్షాదీనపి నారద | కలాదియుగపర్యంతాన్‌ కాలానన్యానవాసృజమ్‌ || 2

సృష్ట్యం తానపరాంశ్చాపి నాహం తుష్టోsభవం మునే | తతో ధ్యాత్వా శివం సాంబం సాధకానసృజం మునే || 3

మరీచిం చ స్వనేత్రాభ్యాం హృదయాద్భృగుమేవ చ | శిరసోsంగిరసం వ్యానాత్పులహం మునిసత్తమమ్‌ || 4

బ్రహ్మ ఇట్లు పలికెను -

నేను శబ్దరూపరసస్పర్శగంధములనే సూక్ష్మ భూతములను పంచీకరణము (ఏభై శాతము పృథివికి మిగిలిన నాల్గు భూత సూక్ష్మములను పన్నెండున్నర శాతము చొప్పున కలిపితే స్థూల పృథివి అగును ) చేసి, వాటినుంటి ఆకాశవాయు అగ్ని జల పృథివులను స్థూల భూతములను సృజించితిని (1). 

ఓ నారదా! పర్వతములను, సముద్రములను, వృక్షాదులను, కళ మొదలు యుగము వరకు గల కాలావయవములను సృష్టించితిని (2). 

ఓ మహర్షీ! జన్మమరణములు గల ప్రాణులను సృష్టించితిని. కాని సంతుష్టి కలుగలేదు. అపుడు సాంబసదాశివుని ధ్యానించి సృష్టి సాధకులగు ఋషులను సృష్టించితిని (3). 

నా కళ్ల నుండి మరీచిని, హృదయము నుండి భృగుని, శిరస్సు నుండి అంగిరసుని, వ్యానము నుండి మునిశ్రేష్ఠుడగు పులహుని సృష్టించితిని (4).

ఉదానాచ్చ పులస్త్యం హి వసిష్ఠం చ సమానతః | క్రతుం త్వపానాచ్ఛ్రోత్రాభ్యామత్రిం దక్షం చ ప్రాణతః || 5

అసృజం త్వాం తదోత్సంగాచ్ఛాయాయాః కర్దమం మునిమ్‌ | సంకల్పాదసృజం ధర్మం సర్వసాధన సాధనమ్‌ || 6

ఏవ మేతానహం సృష్ట్వా కృతార్థస్సాధకోత్తమాన్‌ | అభవం మునిశార్దూల మహాదేవప్రసాదతః || 7

తతో మదాజ్ఞయా తాత ధర్మస్సంకల్ప సంభవః | మానవం రూపమాపన్నస్సాధకైస్తు ప్రవర్తితః || 8

ఉదానము నుండి పులస్త్యుని, సమానము నుండి వసిష్ఠుని, అపానము నుండి క్రతువును, చెవుల నుండి అత్రిని, ప్రాణము నుండి దక్షుని (5), 

తొడ నుండి నిన్ను, నీడ నుండి కర్దమ మహర్షిని, సంకల్పము నుండి సర్వసాధనములకు సాధనమైన ధర్మమును సృష్టించితిని (6). 

సృష్టి సాధకులగు ఈ ఉత్తములను మహాదేవుని అనుగ్రహముచే సృష్టించి, నేను కృతార్థుడనైతిని (7). 

ఓముని శ్రేష్ఠా! అపుడు సంకల్పము నుండి పుట్టిన ధర్మము నా ఆజ్ఞచే మానవుని రూపమును పొందగా, సృష్టి సాధకులు దానిని ప్రవర్తిల్లజేసిరి (8).

తతోsసృజం స్వగాత్రేభ్యో వివిధేభ్యోsమితాన్సుతాన్‌ | సురాసురాదికాంస్తేభ్యో దత్త్వా తాం తాం తనుం మునే || 9

తతోsహం శంకరేణాథ ప్రేరితోsంతర్గతేన హ | ద్విధా కృత్వాత్మనో దేహం ద్విరూపశ్చాభవం మునే|| 10

అర్ధేన నారీ పురుషశ్చార్థేన సంతతో మునే | స తస్యా మసృజద్ద్వంద్వం సర్వసాధనముత్తమమ్‌ || 11

స్వాయం భువో మనుస్తత్ర పురుషః పరసాధనమ్‌ | శతరూపాభిధా నారీ యోగినీ సా తపస్వినీ || 12

ఓ మహర్షీ! అపుడు నేను నా దేహావయవముల నుండి దేవతలు, రాక్షసులు మొదలైన లెక్కలేనంతమంది సంతానమును వారికి ఆయా దేహములనిచ్చి సృష్టించితిని (9). 

ఓ మహర్షీ! అపుడు నేను అంతర్యామియగు శంకరునిచే ప్రేరేపింబడిన వాడనై, నాదేహమును రెండు భాగములుగా చేసి రెండు రూపములను ధరించితిని (10). 

ఓ మునీ! ఒక సగము స్త్రీ కాగా, మరియొక సగము పురుషుడాయెను. వీరిద్దరి మధ్య విభేదము లేకుండెను. ఆ పురుషుడు ఆమె యందు సర్వమునకు సాధనమైన శ్రేష్ఠమగు జంటను సృష్టించెను (11). 

ఆ జంటలోని పురుషుడు ఉత్తమ సాధకుడగు స్వాయంభువమనువు. శతరూపయను పేరు గల స్త్రీ యోగిని, మరియు తపస్విని (12).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 59 🌹*
Chapter 16
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

🌻 Removing The Veil - 1 🌻

Avatar exists in the consciousness of God, and simultaneously the consciousness of everyone and everything. 

Because everything that is real and that is illusory is in the Avatar, the forces of both the real and the illusion pull at each other in his being. 

Because of all these forces pulling within him, he feels as if he is being pulled apart, and this feeling of being pulled apart is the root of his suffering. 

When the Avatar pulls together  
the forces of Reality and the forces of illusion within himself, he can work, because his work consists of pulling together into a harmony all the opposing forces of God and Maya. 
 
In Reality exists eternal bliss without a break, and in illusion continual suffering in the consciousness of everyone and everything that exists. 

In Reality exists infinite  
freedom, and in illusion the continual bondage of limitations. So there is always suffering in bondage, because bondage itself is suffering, for every state of consciousness in  
illusion is limited, and cannot find an escape from the barriers of its limitations. 
 
The Avatar as God is free and enjoys the bliss of his freedom, but so long as he is conscious of the cosmic illusion, he is forever bound by his one duty and responsibility toward all creation. This one duty pulls him down into cosmic illusion, age after age. 

In the existence of his oweternal, impersonal, formless state of infinitude, the Avatar enjoys fully his infinite bliss, but when he is pulled into the cosmic illusion to work for  
the universe, he has to suffer as does every other individual being. 

His suffering is unlike any other being, because he suffers simultaneously what every being is suffering, and thus his body is crushed as every being's suffering aches in his body. 

Though the physical body of the Avatar is being crushed, his divinity remains standing in the abode of Reality; his divinity remains standing at the crossroads of all the forces of Reality and illusion. 

There, standing helpless because of his duty, he is pulled by all the forces in cosmic illusion, and at the same time, he is pulled by the very power of Reality, because he is the Reality. 

There he stands at the threshold of all time and space, at the edge of infinity and eternity, pulled apart forever, but pulled together, as each individual, drop by drop, realizes the Reality. 

Because of these two opposite pulls, the Avatar has to suffer and because these two pulls are always in him, when he is in the body, his body suffers like no other human being's.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 55 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 25
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. వాసుదేవ మంత్ర లక్షణము - 2 🌻*

హృదయం చ శిరశ్చూడా కవచం నేత్రమస్త్రకమ్‌ | షడఙ్గాని తు బీజానాం మూలస్య ద్వాదశాఙ్గకమ్‌. 11

హృచ్ఛిరశ్చ శిఖా చైవ హస్తౌ నేత్రే తథోదరమ్‌ | పృష్ణ బాహూరు జానూంశ్చ జఙ్గే పాదౌ క్రమాన్య్నసేత్‌.

హృదయము, శిరస్సు, శిఖ, కవచము, నేత్రము, అస్త్రము అను ఈ ఆరును బీజముల అంగములు, హృదయము, శిరస్సు, శిఖ, హస్తములు, నేత్రములు, ఉదరము, పృష్ఠభాగము, బాహువులు, ఊరువులు, మోకాళ్ళు పిక్కలు, పాదములు ఈ పండ్రెండును మాలమునకు అంగములు, క్రమముగా వీటి అన్నింటిపై న్యాసము చేయవలెను.

కం టం పం శం వైన తేయః ఖం ఠం ఫం షం గదానుజః |

గం డం బం సం పుష్టిమన్త్రో ఘం ఢం భం హం శ్రియై నమః. 13

వం శం మం క్షం పాఞ్చజన్యం ఛం తం పం కౌస్తుభాయ చ |

జం ఖం వం సుదర్శనాయ శ్రీవత్సాయ సం వం దం చం లం. 14

"కం టం పం శం వైనతేయాయ సమః" ''ఖం ఠం ఫం, షం గదానుజాయ నమః" éగం డం బం సం పుష్టి మన్త్రాయ నమః". ఘం ఢం భం హం శ్రియై నమః'' ''వం శం మం క్షం పాఞ్చజన్యాయ నమః" "ఛం తం పం కౌస్తుభాయ నమః" "జం ఖం వం సుదర్శనాయ నమః " "సం వం దం చం లం శ్రీవత్సాయ నమః."

ఓ ధం వం వనమాలయై మహానన్తాయ వై నమః | నిర్బీజపదమన్త్రాణాం పదైరఙ్గాని కల్పయేత్‌. 15

ఓం ధం వం వనమాలయైన నమః "మహానన్తాయ నమః" బీజరహితములైన పదములు గల మంత్రములకు పదములచేతనే అంగములను కల్పింపవలెను.

జాత్యన్తైర్నమసంయుక్తైర్హృదయాదీని పఞ్చధా | ప్రణవం హృదయాదీని తతః ప్రోక్తాని పఞ్చధా. 16

నామసంయుక్తములును, జత్యంతములును అగు పదములచే హృదయాది పంచకన్యాసమును చేయవలెను. ప్రణవము, పిమ్మట ఐదు హృదయాదులును చెప్పబడినవి.

ప్రణవం హృదయం పూర్వం పరాయేతి శిరః శిఖా | నామ్నాత్మనా తు కవచ మస్త్రం నామాన్తకం భవేత్‌.

ముందుగా ప్రణవముచే హృదయమును, 'పరాయ' అని శిరస్సును, పేరుతో శికను, ఆత్మచేత కవచమును, నామాస్తముతో అస్త్రమును విన్యసించవలెను.

ఓం పరాస్త్రాది స్వనామాత్మా చతుర్థ్యన్తోనమో న్తకః |

ఏక వ్యూహాది షడ్వింశ వ్యూహాత్త స్యాత్మనో మనుః.

ఓంకారము ఆదియందు గల నామాత్మక పదమునకు చివర నమః చేర్చి నామాత్మక పదమును చతుర్థ్యంతము చేసి చెప్పవలెను. ఏక వ్యూహము మొదలు ఇరువదియారవ వ్యూహము వరకును ఇది సమనము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 70 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

37. “నేను వేదశాస్త్రాలు చదివాను. చాలా తపస్సు చేసాను. ఇక నేను మోక్షానికి అర్హుణ్ణే” అని ఎవరూ అనుకోరాదు! 

38. ఇంత తపస్సు చేస్తే నాకు మోక్షానికి ఎప్పుడో అర్హత వచ్చేసిందని - నా పని అయిపోయిందని - లోకక్షేమం కోసమే బ్రతుకుతున్నానని జ్ఞాని ఎప్పుడూ అనుకోడు. జీవన్ముక్తుడు కూడా ఎప్పుడూ అలా భావన చేయఖూడదు. అసలు చెయ్యనే చెయ్యడు. 

39. అనంత కల్యాణగుణ సంపన్నుడయిన, కరుణామయుడయిన ఆ హరిమాత్రమే ముక్తినివ్వాలి. అట్లా కోరాలి. సత్కర్మలు ఆచరించాను కాబట్టి మోక్షం రావాలి అంటే, అలా వీలు లేదు. కర్మకు, ముక్తికి సంబంధం లేదు.

40. కర్మ ముక్తి అయితే ఎలా? కర్మ బంధనం కదా! కర్మ వలన కదా మనం పుట్టాము. మళ్ళీ కర్మచేసి మోక్షము పొందటమేమిటి? అది తప్పు. 

41. సుఖదుఃఖాలు దూరం చేసుకోవటానికి తపస్సుచేస్తే, ఆ తరువాత సుఖాలు కూడా అధిగమించబడి దాటబడతాయి. అదీ పరిణామదశ, అట్టివాడు, వైరాగ్యప్రవృత్తి యందు దృధమయిన నిష్ట కలిగి యుండిన వాడు పరమపదం పొందుతాడు అని భృగుమహర్షి బోధించాడు.

42. తరవాత భరద్వాజుడు, “ఇహలోకానికి, పరలోకానికి భేదం ఏమిటి? అని అడిగాడు. 
దానికి భృగుమహర్షి బదులిస్తూ, ‘ఈ ఇహలోకమంతా కర్మభూమి, భోగాస్పదమైనటువంటిది. ఎక్కువ దుఃఖము, తక్కువ సుఖము కలిగినది. చాలా ఎక్కువ సుఖము – అనంతమైన సౌఖ్యప్రదమయినది – స్వర్గలోకమనబడుతుంది. ఆ సుఖానికీ, ఈ భూలోకసుఖానికీ హస్తిమశకాంతం. ఏనుగు-దోమ ఆ పరిణామాలలోని భేదమంతఉంది. అక్కడ సుఖానికీ ఇక్కడ సుఖానికి తేడా.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 134 🌹*
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

There are levels in consciousness, but not in awareness. It is of one block, homogeneous. It's reflection in the mind is love and understanding. 

There are levels of clarity in love and intensity in love, but not in their source. The source is simple and single, but the gifts are infinite. 

Only do not take the gifts for the source. Realize yourself as the source and not the river; that is all.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మనోశక్తి - Mind Power - 73 🌹*
 *Know Your Infinite Mind*
*🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴*
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. Q 64:--స్వప్న ప్రపంచం, భౌతిక రూపాలు 🌻

స్వప్న ప్రపంచం:--

Ans :--
1) స్వప్న ప్రపంచంలో మనిషి ఇతర జీవజాతులు భూమిపైన చైతన్య పరిణామం గురించి చర్చించుకుంటాయి.

అక్కడ కలుసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. భూమిపై ఉన్న జీవజాతులు అన్నతమ్ముల లాంటి వారు.అందరూ సక్రమంగా ఉంటే కుటుంబ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది.

భౌతిక రూపాలు :--

2) ఆత్మశకలం వేరే systems వేరే తలాల్లో కూడా జన్మ తీసుకుంటుంది. అక్కడ భూమి మీద వున్న భౌతిక రూపాలు ఉండవు.అక్కడ కమ్యూనికేషన్ అక్కడ శక్తిని అనుసరించి మానసికంగా, ఆధ్యాత్మికంగా చైతన్య శక్తిపరంగా ఉంటుంది. అక్కడి జీవులన్ని అంతర్ ప్రపంచం ద్వారా communicate అవుతాయి. ఎక్కువ నిద్రావస్థలో అన్ని జీవజాతులు telepathy కమ్యూనికేషన్ చేసుకుంటాయి.

3) జీవజాతులు అన్ని ఒకే లోకాన్ని ఎంచుకొన్నపుడు వాటి దేహాలన్ని ఒకే రసాయనిక శక్తి విద్యుదయస్కాంత శక్తి తో నిర్మింపబడి ఉంటాయి.దేహంలోని జీవకణాలన్నీ ఆ లోకంలోని ఖనిజ లవణాలు ధాతువులతో నిర్మింపబడి ఉంటాయి.మనిషికి ఇతర జీవజాతులకు మధ్య పోటీ ఉండదు. అన్ని జీవజాతులు సమిష్టిగా ఒకరికొకరు సహకరించిఉంటాయి.ఒక జాతి ఇంకో జాతిని ధ్వంసం చేయదు.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 19 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. అచ్చమ్మకు చెప్పిన జ్యోతిష్యం - 7 🌻*

మహమ్మదీయులు వందల సంఖ్యలో హిందువుల దేవాలయాలను సర్వనాశనం చేశారు. 

గుజరాత్ లోని అత్యంత సుసంపన్నమైన సోమనాథ ఆలయం మీద ముస్లిం చక్రవర్తుల వరుసగా అనేకసార్లు దండయాత్రలు చేసి అక్కడి సంపదను మొత్తం దోచుకుని వెళ్లారు.

5 వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది..

ఈ కాల పరిణామం సరస్వతీ నది విషయంలో అక్షరాలా జరిగింది. వేదకాలం నాటి సరస్వతీనది ప్రస్తుతం అంతర్ధానమై పోయినా, శాటిలైట్ ద్వారా ఆ నది గతంలో ప్రవహించిందని శాస్త్రవేత్తలు ధ్రువీకరించిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి.

గంగ విషయంలో జరుగుతుందో లేదోననే సందేహమే అక్కర్లేదు. ఇప్పటికే గంగానది ఉధృతి తగ్గింది. ఎండిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

చెన్నకేశవస్వామి మహిమలు నాశనమైపోతాయి.. కృష్ణానది మధ్య ఒక బంగారు తేరు పుడుతుంది. దాన్ని చూసినవారికి ఆ కాంతివల్ల కనులు కనబడవు.

ఇది ఇప్పటివరకూ జరగలేదు కానీ, ఇకముందు జరిగే అవకాశం ఉంది.

ప్రపంచంలో ఇకముందు పావుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది.

దీనికి సాక్ష్యాలు, నిదర్శనాలు అక్కరలేదు కదా! కళ్ళముందు కనిపిస్తున్న సత్యమే. ఇప్పుడు నడుస్తున్నది కలియుగం. అంటే, న్యాయం, ధర్మం ఒంటి కాలిమీద నడుస్తున్నాయి. మంచివారి సంఖ్య గణనీయంగా తగ్గింది. మోసం, ద్వేషం రాజ్యమేలుతున్నాయి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Twelve Stanzas from the Book of Dzyan - 2 🌹*
The Prophetic Record of Human Destiny and Evolution 

*🌻 STANZA I - The Genesis of Divine Love - 2 🌻*

5. The planet was doing her utmost. She knew how to love, and what it was to be loved. With all the zeal and fervour of her Loving Soul, she warmed the motionless stones, breaking through their hardness and elasticity. They revived, drinking in the generous currents of Love. 

Stones were resurrected! They began to blossom like petals of Divine Flowers, and took their place in turn. The planet was beautified by a profusion of flowers.

6. The warmth of the Sun became stronger, for he was clearly experiencing the magical Power of the influence of Love. 

And the flowers loved both their Father Sun and their Mother Earth. They were their children, born in common! The parents carefully looked after their flowers’ luxuriant heads of many colours, open wide towards them. 

The Universe beheld the work of the Lords, and was pleased with the flowers’ first successful appearance. Ceaselessly they worked, imbuing the world with a fragrant aroma. 

Attracted by the flowers’ Power of Love, constellations generously imparted their own... The Lords of Destiny were content: all was proceeding according to their Predestined Plan.
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 13 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻.. జ్ఞానోపదేశము 🌻*

ఇంతవరకు యముడు నచికేతునకు అనేక విధములగు సంపదలనిచ్చెదనని ప్రలోభపెట్టినను వానిని సరకుగొనక మరణాంతర విషయమునే దృఢముగా కోరుట చేత వాని యోగ్యతను గుర్తించి యమధర్మరాజు వానికి జ్ఞానోపదేశము చేయనారంభించుచున్నాడు:
 
చాలా ముఖ్యమైనటువంటి అధికారిత్వాన్ని ఇక్కడ నిరూపించారనమాట. ముందు ఆచార్యవర్యులెవరైనా సరే ప్రలోభాలకు గురి అవుతాడా లేదా, అహంకారానికి గురి అవుతాడా లేదా, అజ్ఞానానికి గురి అవుతాడా లేదా, ఎంతవరకు ఇతని స్థాయిలో అతనికి బోధించడానికి తగినటువంటి అధికారిత్వం వున్నది అనేటటువంటి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తారు. 

అలా పరిశీలన చేసిన తరువాత మాత్రమే వారికి ఆత్మవిషయమును గురించినటువంటి బోధని పూర్తిచేయాలి. అంతేగానీ, వచ్చినవారందరికీ తగినవారందరికీ చెప్పాలా వద్దా అంటే వారి అధికారిత్వాన్ని అనుసరించి చెప్పాలి. 

ఎవరికి ఏ స్థాయిలో వున్నటువంటి వివేకము, విచారణ వుంటయ్యో, వారివారి స్థాయికి బుద్ధిగత వికాసాన్ని బట్టి , వారి వివేకాన్ని అనుసరించి వారికి మనం బోధించాలే గానీ , కనబడ్డవారందరికీ “నువ్వు ఆత్మ స్వరూపుడివి! నువ్వు బ్రహ్మస్వరూపుడివి ! నువ్వు పరబ్రహ్మస్వరూపుడివి! నువ్వు ఇక తెలుసుకొనవలసినది ఏమీ లేదు! చెయ్యవలసింది ఏమీలేదు! పొందవలసినది ఏమీలేదు!” అనేటటువంటి అంశాలను చెప్పామనుకోండీ, రెంటికీ చెడ్డ రేవడిగా అయ్యేటటువంటి అవకాశం వున్నది.

*🌻. శ్రేయో మార్గము - ప్రేయో మార్గము స్వధర్మము-పరధర్మము 🌻*

ఈ ప్రపంచములో మానవులు నడచుకొనుటకు రెండు మార్గములు కలవు. ఒకటి శ్రేయోమార్గము. రెండవది ప్రేయోమార్గము. 

ఈ రెండును విభిన్న ప్రయోజనములు కలవియై మానవుని బంధించుచున్నవి. కాబట్టి జీవులందరి ముందు ప్రతిచోట, ప్రతి క్షణం, ప్రతి తలపులో కూదా రెండు రకములైనటువంటి అవకాశాలను ఈ ప్రకృతి కల్పిస్తుంది.

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||

    అంటుంది భగవద్గీత. అంటే అర్ధం ఏమిటీ? శ్రేయము-ప్రేయము, స్వధర్మము-పరధర్మము. ఈ రెండు అంశాలు ఒకచోటే వుంటాయి. నీవు ఆచరణశీలమై చూసేటప్పుడు నా స్వధర్మమేది? అని చక్కగా విచారణ చేయాలి. పరధర్మమేది? అనేది విచారణ చెయ్యాలి. 

ఎంతగా నీకు సుఖాన్ని ఇచ్చేది అయినప్పటికీ పరధర్మము ఆచరణకు అనుచితమైనటువంటిది. ఎంత దగ్గరిదారి అయినప్పటికీ పరధర్మము ఆచరణకు అనుచితమైనటువంటిది. 

ఎంత ధర్మసంకటమై తోస్తూ నిన్ను వెంటనే సుఖాన్ని పొందింపచేయడానికి సిద్ధంగా వున్నప్పటికీ నీవు దానిని - పరధర్మాన్ని - ఆచరించకూడదు. కారణమేమిటంటే శ్రేయము-ప్రేయము అనే విభజన స్పష్టముగా చెప్తున్నాడు జీవితంలో. 

దేనిని ఆచరిస్తే అత్మానుభూతికి దగ్గరవుతావో, ఏ తీరుగా జీవిస్తే ఆత్మానుభూతిలో నిలకడ చెందుతావో, ఏ రకమైనటువంటి విజ్ఞానాన్ని కనుక నువ్వు ఆశ్రయిస్తే నీవు స్వయముగా ఆత్మానుభూతియందు నిలకడ కలిగివుంటావో అటువంటిది శ్రేయము. శ్రేయస్సును కలిగించేది. 

ఎన్ని జన్మలకైననూ నిన్ను విడువనటువంటి శ్రేయస్సును కలిగించేటటువంటిది. అసలు జన్మే లేకుండా చేసేటటువంటి శ్రేయస్సును కలిగించేటటువంటిది. అటువంటి శ్రేయోమార్గమును నువ్వు ఆశ్రయించాలి. 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సాయి తత్వం - మానవత్వం - 57 / Sai Philosophy is Humanity - 57 🌹*
🌴. అధ్యాయము - 8 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మానవుని విధ్యుక్త ధర్మం 🌻

1. మానవజన్మ విలువైనదనియు, దానికెప్పటికైననూ మరణము అనివార్యమనియు గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరూకుడై యుండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలయును.

2. ఏ మాత్రమును అశ్రద్ధగాని ఆలస్యముగాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలెను.

3. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొఱకెంత ఆతురపడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి యెంతగా వెదకయత్నించునో యటులనే, విసుగు విరామములేక రాత్రింబవళ్ళు కృషి చేసి యాత్మసాక్షాత్కారమును సంపాదించవలెను.

4. బద్ధకమును, అలసతను, కునుకుపాట్లను దూరమొనర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను.

5. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయుమగుదుము.

🌻. తక్షణ కర్తవ్యం 🌻

1. మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదన, వెంటనే భగవత్సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకేగుట.

2.ఆధ్యాత్మికోపన్యాసములెన్ని వినినప్పటికి పొందనట్టిదియు, ఆధ్యాత్మికగ్రంథములెన్ని చదివినను తెలియనట్టిదియునగు ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చును.

3.నక్షత్రములన్నియు కలిసి యివ్వలేని వెలుతురును సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో యట్లనే ఆధ్యాత్మికోపన్యాసములు, గ్రంధములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు.

4.వారి చర్యలు, సామాన్య సంభాషణలే మనకు మౌనప్రబోధములు. శాంతి, ఖమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీన మందుంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణమలను - వారి ఆచరణలో చూచి, భక్తులు నేర్చుకొందురు.

5.వారి పావనచరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును.

6.సాయిబాబా యట్టి మహాపురుషుడు; సద్గురువు.

7. బాబా సామాన్య ఫకీరువలె సంచరించుచున్నప్పటికి వారెప్పుడును ఆత్మానుసంధానమునందే నిమగ్నులగుచుండిరి.

8.దైవభక్తిగల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన క్రుంగిపోవువారుకారు.

9.రాజైననూ, నిరుపేదలైననూ వారికి సమానమే. తమదృష్టి మాత్రమున ముష్టివానిని చక్రవర్తిని చేయగలశక్తి యున్నప్పటికి బాబా ఇంటింటికి తిరిగి భిక్ష నెత్తెడివారు! వారి భిక్ష యెట్టిదో చూతుము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sai Philosophy is Humanity - 57 🌹*
Chapter 8
✍️. Sri NV. Gunaji
📚. Prasad Bharadwaj

*🌻 Man's Endeavours 🌻*

Realizing how precious the human life is, and knowing that Death is certain and may snatch us at any time, we should be ever alert to achieve the object of our life. 

We should not make the least delay but make every possible haste to gain our object, just as a widower is most anxious to get himself married to a new bride, or just as a king leaves no stone unturned to seek his lost son. 

So with all earnestness and speed, we should strive to attain our end, i.e., self-realization. Casting aside sloth and laziness, warding off drowsiness, we should day and night meditate on the Self. 

If we fail to do this, we reduce ourselves to the level of beasts.

*🌻 How to Proceed? 🌻*

The most effective and speedy way to gain our object is to approach a worthy Saint or Sage - Sadguru, who has himself attained God-vision. 

What cannot be achieved by hearing religious lectures and study of religious works, is easily obtained in the company of such worthy souls. 

Just as the sun alone gives light, which all the stars put together cannot do, so the Sad-Guru alone imparts spiritual wisdom which all the sacred books and sermons cannot infuse. His movements and simple talks give us 'silent' advice. 

The virtues of forgiveness, calmness, disinterestedness, charity, benevolence, control of mind and body, egolessness etc. are observed by the disciples as they are being practiced in such pure and holy company. 

This enlightens their minds and lifts them up spiritually. Sai Baba was such a Sage or Sad-Guru. 

Though He acted as a Fakir (mendicant), He was always engrossed in the Self. He always loved all beings in whom He saw God or Divinity. 

By pleasures He was not elated. He was not depressed by misfortunes. A king and a pauper were the same to Him. 

He, whose glance would turn a beggar into a king, used to beg His food from door to door in Shirdi, and let us now see how He did it.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 7 / Sri Gajanan Maharaj Life History - 7 🌹

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 7 / Sri Gajanan Maharaj Life History - 7 🌹* 
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. 2వ అధ్యాయము - 3 🌻*

అతను నీరుత్రాగి ఇలా అన్నారు - ఆమాలి దగ్గర నుండి తెచ్చిన రొట్టెతో నన్ను సంతృప్తి చేసేందుకు ప్రయత్నించకు, నాకు నీనుండి వక్కకావాలి. బనకటలాల్ అతనికి వక్క ఇచ్చి దానితోపాటు ఒక రాగి నాణెం దక్షిణగా ఇస్తాడు. తను వ్యాపారిని ఏమీ కాను (ఈ ధనం స్వీకరించడానికి) అని శ్రీగజానన్ అంటారు. భక్తి కావాలని అడుగుతారు. 

తరువాత చిత్తసుద్ధితో కీర్తన వినమని బనకట్ను, పీతాంబర్ ను శ్రీగజానన్ అడిగారు. భాగవతంలోని ఒక కీర్తనతో గోవిందబువా తన కీర్తన ప్రారంభించాడు. గోవిందబువా ఆ కీర్తనలోని మొదటి పంక్తి ఆలాపించగానే శ్రీగజానన్ తరువాత భాగాన్ని గట్టిగా ఆలాపిస్తారు. 

ఈ విధంగా ఆలాపించిన వ్యక్తి మహాగొప్ప పండితుడు అయి ఉండాలి అని గోవిందబువా ఆశ్చర్యపోయి అంటాడు. ఈవిధంగా అంటూ శ్రీగజానన్న మందిరంలోకి రావలసిందిగా విన్నవిస్తాడు. 

మిగిలిన వ్యక్తులుకూడా అదేవిధంగా విన్నతించినప్పటికీ వారిని శ్రీగజానన్ మహారాజు లక్ష్యపెట్టలేదు. తరువాత గోవిందబువా స్వయంగా మహారాజుతో మీరు సాక్షాత్తు శివుని అవతారం దయచేసి లోపలికి రండి అంటాడు. 

దానికి నువ్వు చెప్పినదానిమీద ధృఢంగా ఉండు. ఇప్పుడే నువ్వు భగవంతుడు ప్రతిచోటాఉన్నాడు అని అంటూ ఇప్పుడు నన్ను మందిరంలోకి రమ్మని ఎందుకు బలవంతంచేస్తున్నావు ? నువ్వు భోధించే విషయం నువ్వు పాటించాలి. అంతేకాక విద్యార్ధి మాటలతో ఆడడం అనేది వదలాలి. 

నువ్వు భోధించిన భాగవతంలోని శ్లోకానికి విరుద్ధంగా ప్రవర్తించడం ఉచితంకాదు. నువ్వు ఒత్తి జీవన భత్యంకోసం భోధన చెయ్యటం అనేది నాకోరిక కాదు. ఇకవెళ్ళి నీ కీర్తన కొనసాగించు అని శ్రీమహారాజు ఈవిధంగా అంటారు. 

బువా వెనక్కివచ్చి షేగాంకి ఒక ఆణిముత్యం వచ్చింది జాగ్రత్తగా కాపాడండి. ఈ మానవ రూపంలో వచ్చిన పాండురంగ వలన షేగాం పండరపూర్ అవుతుంది. అతనికి అణకువగా ఉండి సేవచేస్తూ మీతో ఉండేలా చూసుకోండి, దీనివల్ల మీకు సంతోషం దొరుకుతుంది అని ప్రజలకి ప్రకటన చేసాడు. 

అత్యంతంగా పొంగివస్తున్న ఆనందంతో బనకటలాల్ ఇంటికి వచ్చి శ్రీగజానన్ గూర్చిన విషయం తన తండ్రి అయిన భవానీరాంకు చెప్పి మరియు శ్రీగజానన్ను తమ ఇంటికి తెచ్చేందుకు అనుమతి తీసుకున్నాడు. 4 రోజులుపాటు వెతికిన తరువాత మాణిక్ చౌక్ లో మహారాజును బనకటలాల్ చూస్తాడు. ఆసమయం సూర్యాస్థమాన సమయం కానీ, బనకటలాల్ కి అది శ్రీగజానన్ రుపంలో సుర్యోదయం అయింది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 7 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 2 - part 3 🌻*

He drank the water and said Don't try to satisfy me with the bread of that Mali. I want a nut from you. Bankatlal gave Him a nut and along with it offered a copper coin as Dakshina (offering). Shri Gajanan said that He was not a businessman to accept money, and asked for Bhakti only. 

Then Shri Gajanan asked Bankat and Pitambar to listen to the Kirtan attentively. Govind-Bua started the Kirtan with a stanza from Shri Bhagavat. 

Govind-Bua recited the first part of the stanza and Shri Gajanan loudly recited the latter part of it. Govind-Bua was surprised and said that the man who recited this stanza must be a man of great authority. 

Saying so, he requested Shri Gajanan Maharaj to come inside the temple. Likewise other people also requested Shri Gajanan Maharaj , but Shri Gajanan Maharaj ignored them all. 

Then Govind-Bua himself came out and said to Maharaj, You are the incarnation of Lord Shankar. Please come in. The temple will be empty without You. By the grace of some good deeds of my previous birth I have come across saint like you. 

So kindly come into the temple.” Shri Gajanan Maharaj said, Be firm on what you say. Just now you have said that God is every where, then why force me to come in the temple? 

You should practice what you preach and a student should avoid playing with words. It is not proper for you to behave against the preaching of the stanza from Bhagavat that you just preached to these people. 

I don't wish for you to be preaching just for livelyhood. Now go and continue your Kirtan. Bua returned and announced to the audience, An invaluable gem has come to your Shegaon. 

Protect Him carefully. With the arrival of this Pandurang in human form, Shegaon has become Pandharpur. See that He lives with you, serve Him well and obey Him. That alone will bring you all immense happiness. 

Bankatlal brimming with joy returned home and told his father Bhavaniram about Shri Gajanan and received his consent to bring Shri Gajanan Maharaj home.

Then he started his search for Shri Gajanan. After four days of wondering, Bankatlal Saw Shri Gajanan Maharaj in Manik Chowk. It was evening time and the sun was setting, but for Shri Bankatlal it was the rising of sun in the form of Shri Gajanan.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శివగీత - 15 / The Siva-Gita - 15 🌹