శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 550 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 550 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 550 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 550 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।
సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀

🌻 550. 'వియదాది జగత్ప్రసూః' - 2 🌻


త్రిగుణముల ఆధారముగనే పంచభూతములు, మనస్సు పుట్టును. జీవులకు పంచభూతములు దేహములుగ యేర్పడును. పంచభూతములే లేనిచో జీవులకు దేహము లుండవు. కేవలము స్పందనాత్మక చైతన్యములుగ నుందురు. అట్టి జీవ చైతన్యములకు పంచభూతములతో కూడిన శరీర మేర్పరచి, శరీరమును వినియోగించుటకు బుద్ధి, మనస్సు, ఇంద్రియముల నేర్పరచి, వారు వసించుటకు గ్రహగోళముల నేర్పరచును. ఇట్లు తన వెలుగు నుండి సమస్త జగత్తును ప్రసరించునది శ్రీమాత. జగన్మాత అని కూడ పిలుతుము గదా! పై విధమగు ఆరోహణ క్రమములో శ్రీమాతను ఊహించు కొనవలెను. ఊహించుచూ ఆరాధించవలెను.



సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 550 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh
sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻

🌻 550. 'Viyadadi jagatprasuh' - 2 🌻


Panchabhutas and mind are born on the basis of trigunas. Panchabhutas are composed as bodies for living beings. Without the Panchabhutas, living beings have no body. There would only be reactive emotions. For those living beings, she will make a body with five elements, she will teach the intellect, mind and senses to use the body, and she will create planets for them to live. Thus it is Sri Mata who radiates the whole world from her light. We call her Jaganmata also, right! Srimata should be imagined in the above ascending order. She should be imagined and worshipped.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


సిద్దేశ్వరయానం - 92 Siddeshwarayanam - 92

🌹 సిద్దేశ్వరయానం - 92 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 కవితారంగము 🏵

సాహిత్యానికి సంబంధించి 15, 16 సంవత్సరాల వయస్సులోనే అవధాన ఆశుకవితా ప్రదర్శనలు చెయ్యటం మొదలై కొంతకాలం పాటు ఆ రంగంలో విహరించి నెమ్మదిగా వాటిని విరమించి కావ్య నిర్మాణ మార్గంలో ప్రయాణించడం మొదలైంది. 'రసవాహిని', 'ఆనందయోగిని', రసగంగ, గంధర్వగీతి పద్యకావ్యములు, శివసాహస్రి, ఐంద్రీసాహస్రి, అంబికాసాహస్రి మొదలైన స్తుతి కావ్యాలు, కవిబ్రహ్మ, కావ్యకంఠ మొదలయిన నాటకాలు, రమణీ ప్రియదూతిక, మొదలైన నవలలు. ఆంధ్రభాగవత విమర్శ,కవితామహేంద్రజాలము మొదలైన పరిశోధన గ్రంథాలు, తాంత్రిక ప్రపంచం వంటి మంత్రశాస్త్ర గ్రంథాలు వీటితో పాటు పత్రికలలో వ్యాస పద్య రచనలు షుమారు నాలుగు దశాబ్దాల సాహిత్య యాత్రలో ఉదయించినవి.

సాహితీరూపకమయిన భువన విజయంతో ప్రారంభించి, ఇంద్రసభ, వైకుంఠసాహితీసభ, కైలాససాహితీసభ, శ్రీనాధ విజయసభ వంటి ముప్పైకి పైగా రూపకాలను సృష్టించి ఆంధ్రదేశంలోని నలుమూలల్లో వివిధ రాష్ట్రాలలో ఆంధ్రులున్నచోట్ల, అంతేకాక అమెరికాఖండంలో న్యూయార్క్ నుండి కాలిఫోర్నియా దాకా ఉన్న మహానగరాలలో కవి పండిత బృందంతో పర్యటించి ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. వందలకొద్దీ జరిగిన ఈ రూపక ప్రదర్శనలు వేల కొలది జనాన్ని సమ్మోహితులను చేయడమే కాక తెలుగు పద్యానికి అపూర్వమైన ప్రచారాన్ని తెచ్చినవి.

నేను పీఠాధిపతిని అయిన తరువాత జరిగిన సభలలో కొంతమంది కవిపండితులు జనప్రియమైన సాహితీరూపకాలు ఇక ఏమి కానున్నవో అని ఆందోళనను వ్యక్తం చేశారు. ఎందుకంటే మునుపటివలె ఏ కృష్ణదేవరాయల పాత్రనో ఏ ఇంద్రుని పాత్రనో నేను ధరించడం జరుగదు కనుక. అప్పుడు నేను సమాధానం చెపుతూ "ఏవిద్య అయినా కళ అయినా వ్యక్తుల కోసం ఆగదు.

అనంతమైన కాలంలో మధ్య మధ్యలో కొద్దిపాటి విశ్రాంతి లేక విరమణ వచ్చినట్లు కన్పించినా ఎవరో తగిన వారు వస్తారు, రధయాత్ర కొనసాగుతునే ఉంటుంది. ఇప్పుడు కూడా నేను పాత్రధారణ చేయకూడదు గనుక చేయను. కానీ మా సన్నిధిలో సాహితీరూపకాలను జరిపిస్తూనే ఉంటాను" అన్నాను. ఇప్పుడు ఆ విధంగానే జరుగుతున్నది. ధర్మచైతన్యాన్ని పెంపొందించడానికి దేవతాభక్తిని వర్దిల్ల చేయడానికి సాహితీరూపకాన్ని ఇప్పుడు ఒక శక్తిమంతమైన ఉపకరణంగా ఉపయోగించటం జరుగుతున్నది.

( సశేషం )

🌹🌹🌹🌹🌹

శ్రీమద్భగవద్గీత - 547: 14వ అధ్., శ్లో 23 / Bhagavad-Gita - 547: Chap. 14, Ver. 23

 

🌹. శ్రీమద్భగవద్గీత - 547 / Bhagavad-Gita - 547🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 23 🌴

23. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే |
గుణా వర్తన్త ఇత్యేవం యోవతిష్టతి నేఙ్గతే ||

🌷. తాత్పర్యం : దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను : ఎవడు ప్రకృతిగుణములే ప్రవర్తించుచున్నవని తెలిసి, ఉదాసీనుడై ఉండి, త్రిగుణములచే చలింపక చిదాకాశ స్వరూపస్థితిలో సదా విలసిల్లుచుండునో వాడే త్రిగుణాతీతుడు.

🌷. భాష్యము :


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 547 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 23 🌴

23. udāsīna-vad āsīno guṇair yo na vicālyate
guṇā vartanta ity evaṁ yo ’vatiṣṭhati neṅgate


🌷 Translation : He who, seated like one unconcerned, is not moved by the qualities, and who, knowing that the qualities are active, is self-centred and moves not,


🌹 Purport :


🌹 🌹 🌹 🌹 🌹


🌹 03, JULY 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹

🍀🌹 03, JULY 2024 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 547 / Bhagavad-Gita - 547 🌹
🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 23 / Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 23 🌴
3) 🌹 సిద్దేశ్వరయానం - 92 🌹
🏵 కవితారంగము 🏵
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 550 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 550 - 2 🌹 
🌻 550. 'వియదాది జగత్ప్రసూః' - 2 / 550. 'Viyadadi jagatprasuh' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 547 / Bhagavad-Gita - 547🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 23 🌴*

*23. ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే |*
*గుణా వర్తన్త ఇత్యేవం యోవతిష్టతి నేఙ్గతే ||*

*🌷. తాత్పర్యం : దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను : ఎవడు ప్రకృతిగుణములే ప్రవర్తించుచున్నవని తెలిసి, ఉదాసీనుడై ఉండి, త్రిగుణములచే చలింపక చిదాకాశ స్వరూపస్థితిలో సదా విలసిల్లుచుండునో వాడే త్రిగుణాతీతుడు.* 

🌷. భాష్యము :

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 547 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 23 🌴*

*23. udāsīna-vad āsīno guṇair yo na vicālyate*
*guṇā vartanta ity evaṁ yo ’vatiṣṭhati neṅgate*

*🌷 Translation : He who, seated like one unconcerned, is not moved by the qualities, and who, knowing that the qualities are active, is self-centred and moves not,*

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 92 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*

*🏵 కవితారంగము 🏵*

*సాహిత్యానికి సంబంధించి 15, 16 సంవత్సరాల వయస్సులోనే అవధాన ఆశుకవితా ప్రదర్శనలు చెయ్యటం మొదలై కొంతకాలం పాటు ఆ రంగంలో విహరించి నెమ్మదిగా వాటిని విరమించి కావ్య నిర్మాణ మార్గంలో ప్రయాణించడం మొదలైంది. 'రసవాహిని', 'ఆనందయోగిని', రసగంగ, గంధర్వగీతి పద్యకావ్యములు, శివసాహస్రి, ఐంద్రీసాహస్రి, అంబికాసాహస్రి మొదలైన స్తుతి కావ్యాలు, కవిబ్రహ్మ, కావ్యకంఠ మొదలయిన నాటకాలు, రమణీ ప్రియదూతిక, మొదలైన నవలలు. ఆంధ్రభాగవత విమర్శ,కవితామహేంద్రజాలము మొదలైన పరిశోధన గ్రంథాలు, తాంత్రిక ప్రపంచం వంటి మంత్రశాస్త్ర గ్రంథాలు వీటితో పాటు పత్రికలలో వ్యాస పద్య రచనలు షుమారు నాలుగు దశాబ్దాల సాహిత్య యాత్రలో ఉదయించినవి.*

*సాహితీరూపకమయిన భువన విజయంతో ప్రారంభించి, ఇంద్రసభ, వైకుంఠసాహితీసభ, కైలాససాహితీసభ, శ్రీనాధ విజయసభ వంటి ముప్పైకి పైగా రూపకాలను సృష్టించి ఆంధ్రదేశంలోని నలుమూలల్లో వివిధ రాష్ట్రాలలో ఆంధ్రులున్నచోట్ల, అంతేకాక అమెరికాఖండంలో న్యూయార్క్ నుండి కాలిఫోర్నియా దాకా ఉన్న మహానగరాలలో కవి పండిత బృందంతో పర్యటించి ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. వందలకొద్దీ జరిగిన ఈ రూపక ప్రదర్శనలు వేల కొలది జనాన్ని సమ్మోహితులను చేయడమే కాక తెలుగు పద్యానికి అపూర్వమైన ప్రచారాన్ని తెచ్చినవి.*

*నేను పీఠాధిపతిని అయిన తరువాత జరిగిన సభలలో కొంతమంది కవిపండితులు జనప్రియమైన సాహితీరూపకాలు ఇక ఏమి కానున్నవో అని ఆందోళనను వ్యక్తం చేశారు. ఎందుకంటే మునుపటివలె ఏ కృష్ణదేవరాయల పాత్రనో ఏ ఇంద్రుని పాత్రనో నేను ధరించడం జరుగదు కనుక. అప్పుడు నేను సమాధానం చెపుతూ "ఏవిద్య అయినా కళ అయినా వ్యక్తుల కోసం ఆగదు.*

*అనంతమైన కాలంలో మధ్య మధ్యలో కొద్దిపాటి విశ్రాంతి లేక విరమణ వచ్చినట్లు కన్పించినా ఎవరో తగిన వారు వస్తారు, రధయాత్ర కొనసాగుతునే ఉంటుంది. ఇప్పుడు కూడా నేను పాత్రధారణ చేయకూడదు గనుక చేయను. కానీ మా సన్నిధిలో సాహితీరూపకాలను జరిపిస్తూనే ఉంటాను" అన్నాను. ఇప్పుడు ఆ విధంగానే జరుగుతున్నది.* *ధర్మచైతన్యాన్ని పెంపొందించడానికి దేవతాభక్తిని వర్దిల్ల చేయడానికి సాహితీరూపకాన్ని ఇప్పుడు ఒక శక్తిమంతమైన ఉపకరణంగా ఉపయోగించటం జరుగుతున్నది.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 550 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 550 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।*
*సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀*

*🌻 550. 'వియదాది జగత్ప్రసూః' - 2 🌻*

*త్రిగుణముల ఆధారముగనే పంచభూతములు, మనస్సు పుట్టును. జీవులకు పంచభూతములు దేహములుగ యేర్పడును.  పంచభూతములే లేనిచో జీవులకు దేహము లుండవు. కేవలము స్పందనాత్మక చైతన్యములుగ నుందురు. అట్టి జీవ చైతన్యములకు పంచభూతములతో కూడిన శరీర మేర్పరచి, శరీరమును వినియోగించుటకు బుద్ధి, మనస్సు, ఇంద్రియముల నేర్పరచి, వారు వసించుటకు గ్రహగోళముల నేర్పరచును. ఇట్లు తన వెలుగు నుండి సమస్త జగత్తును ప్రసరించునది శ్రీమాత. జగన్మాత అని కూడ పిలుతుము గదా! పై విధమగు ఆరోహణ క్రమములో శ్రీమాతను ఊహించు కొనవలెను. ఊహించుచూ ఆరాధించవలెను.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 550 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh*
*sarvavyadhi prashamani sarvamrutyu nivarini  ॥112 ॥ 🌻*

*🌻 550. 'Viyadadi jagatprasuh' - 2 🌻*

*Panchabhutas and mind are born on the basis of trigunas. Panchabhutas are composed as bodies for living beings.  Without the Panchabhutas, living beings have no body. There would only be reactive emotions. For those living beings, she will make a body with five elements, she will teach the intellect, mind and senses to use the body, and she will create planets for them to live. Thus it is Sri Mata who radiates the whole world from her light. We call her Jaganmata also, right! Srimata should be imagined in the above ascending order. She should be imagined and worshipped.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj