🌹. శ్రీ లలితా పరమేశ్వరి మంత్రిణులు 🌹

🌹. శ్రీ లలితా పరమేశ్వరి మంత్రిణులు 🌹

♦అమ్మవారి మంత్రిణులు 16 మంది ఉంటారు. వారి పేర్లు;

1. సంగీత యోని
2. శ్యామా
3. శ్యామలా
4. మంత్రనాయికా
5. మంత్రిణీ
6. సచివేశానీ
7. ప్రధానేశ
8. కుశప్రియా
9. వీణావతీ
10. వైణికీ
11. మద్రిణీ
12. ప్రియకప్రియా
13. నీపప్రియా
14. కదంబవేశ్యా
15. కదంబ వనవాసినీ
16. సదామలా

🌺వీరిలో 'శ్యామలా' ముఖ్యురాలు.🌺

🔱అమ్మవారి సేనానులు: 🔱

♦అమ్మవారికి 12 మంది సేనానులు ఉంటారు. వారి పేర్లు:

1. పంచమీ
2. దండనాధా
3. సంకేతా
4. సమయేశ్వరీ
5. సమయసంకేతా
6. వారాహీ
7. పోత్రిణీ
8. శివా
9. వార్తాళీ
10. మహాసేనానీ
11. ఆజ్ఞాచక్రేశ్వరీ
12. అలిందినీ

🌺వీరిలో 'వారాహీ'  ముఖ్యురాలు.🌺

🌹. శ్రీచక్ర విజ్ఞానం - 10 🌹

🌹. శ్రీచక్ర విజ్ఞానం - 10 🌹 
10 వ భాగం

🌹9-నవమ ఆవరణం - బిందు మండలం🌹

ఇది శ్రీ చక్ర కేంద్రం వద్ద బిందు పరిమాణంలో ఉంటుంది. ఈ ఆవరణలో పదహారు నిత్యా దేవతలు ఉంటారు. వీరందరూ లలితాదేవి తో సమానమైన తేజస్సు, పరాక్రమం తో ఉంటారు. వీళ్ళందరూ కాల రూపులు, విశ్వమంతా వ్యాపించి వుంటారు.  

🔱నిత్యాదేవతల పేర్లు..🔱

1. కామేశ్వరీ
2. భగమాలినీ
3. నిత్యక్లిన్నా
4. భేరుండా
5. వహ్నివాసినీ
6. మహావజ్రేశ్వరీ
7. శివదూతీ
8. త్వరితా
9. కులసుందరీ
10. నిత్యా
11. నీలపతాకా 
12. విజయా
13. సర్వమంగాళా
14. జ్వాలామాలినీ
15. చిత్రా
16. మహా నిత్యా

బిందు మండలం చేరిన సాధకుడు అమ్మవారి సన్నిధి చేరినట్లే..

🌹శ్రీ మాత అనుగ్రహ ప్రాప్తిరస్తు శుభమస్తు🌹

🌹శ్రీ మాత్రే నమః🌹

🌹. శ్రీచక్ర విజ్ఞానం - 9 🌹

🌹. శ్రీచక్ర విజ్ఞానం - 9 🌹 
(9 వ భాగం)

🌹8-ఎనిమిదవ ఆవరణ : త్రికోణం🌹

శ్రీ చక్రం లో ఎనిమిదవ ఆవరణ మూడు కోణాలు కలిగిన త్రిభుజాకారం లో ఉంటుంది. 

ఈ ఆవరణలో ముగ్గురు 'అతి రహస్య శక్తులు' పటం లో చూపించిన వరుస క్రమంలో ఉంటారు. వీరికి ఒకొక్కరికీ ఎనిమిది చేతులు ఉంటాయి. వాటిలో వరుసగా, బాణం, చాపం, పాన పాత్ర, మాతులుంగ , ఖడ్గం, డాలు, నాగపాశం, ఘంటాయుధం ధరించి వుంటారు. వీరి పేర్లు;

❇కామేశ్వరీ 
⚜భగమాలినీ
🔯వజ్రేశ్వరీ

సాధకుని తరువాత గమ్యం బిందు మండలం . (సశేషం)

🌹శ్రీ మాత్రే నమః🌹

🌹. శ్రీచక్ర విజ్ఞానం - 8 🌹

🌹. శ్రీచక్ర విజ్ఞానం - 8 🌹
 (8 వ భాగం)

🌹7-సప్తమావరణం - వసుకోణం🌹

శ్రీ చక్రం లో ఏడవ ఆవరణ ఈ క్రింది పటంలో చూపిన విధంగా 8 కోణాలు కలిగిన ఆకారం లో ఉంటుంది. 

ఈ ఆవరణలో ఎనిమిదిమంది 'వాగ్దేవతలు'  ఉంటారు. వీరు రక్తాశోక కాంతి గల శరీర కాంతిలో ఉంటారు. ఒకొక్కరికీ  నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో బాణం, విల్లు, వీణ, పుస్తకం ధరించి ఉంటారు. వీరి పేర్లు;

1. వశినీ 
2. కామేశ్వరీ
3. మోదినీ
4. విమలా
5. అరుణా
6. జయినీ
7. సర్వేశ్వరీ
8. కౌళినీ

వాగ్దేవతల అనుగ్రహాన్ని సాధించి సాధకుడు ముందుకు వెళతాడు. (సశేషం)

🌹శ్రీ మాత్రే నమః🌹

🌹. శ్రీచక్ర విజ్ఞానం - 7 🌹

🌹. శ్రీచక్ర విజ్ఞానం - 7 🌹 
(7 వ భాగం)

🌹6 -ఆరవ ఆవరణ - అంతర్దశారం🌹

శ్రీ చక్రం ఆరవ ఆవరణ ఈ క్రింది పటంలో చూపిన విధంగా 10 కోణాలు కలిగిన ఆకారం లో ఉంటుంది. 

ఈ ఆవరణలో 10 మంది 'నిగర్భ యోగినులు' ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. నాలుగు చేతులలోనూ వజ్రము, శక్తి, తామరం, చక్రం ధరించి ఉంటారు.  వీరి పేర్లు;

1. సర్వజ్ఞా
2. సర్వ శక్తి
3. సర్వ ఐశ్వర్య ప్రద
4. సర్వ జ్ఞానమయీ
5. సర్వ వ్యాధి వినాశిని
6. సర్వాధార స్వరూపా
7. సర్వపాపహరా
8. సర్వానందమయీ
9. సర్వ రక్షాస్వరూపిణీ
10. సర్వేప్సితార్ధప్రదా

సాధకుడు ఈ ఆవరణలో ఈ యోగ శక్తులను ప్రాప్తిన్చుకుని సాధనలో ముందుకు సాగుతాడు. (సశేషం)

🌹శ్రీ మాత్రే నమః🌹

🌹. శ్రీ చక్ర విజ్ఞానం - 6 🌹

🌹. శ్రీ చక్ర విజ్ఞానం - 6 🌹
 (6 వ భాగం)

🌹5-ఐదవ ఆవరణ - బహిర్దశారం🌹

ఈ ఆవరణ ఈ క్రింది పటంలో చూపిన విధంగా 10 కోణాలు కలిగిన ఆకారంలో ఉంటుంది: 

ఈ ఆవరణలో పది 'శక్తులు' పటంలో చూపిన వరుస క్రమంలో ఉంటారు. స్ఫటిక మణి కాంతి కలిగిన శరీర కాంతి తో ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో వరుసగా పరశువు, పాశము, గద, ఘంటామణి ధరించి ఉంటారు. ఈ పదిమంది శక్తుల పేర్లు ఇవి; 

1. సర్వ సిద్ధిప్రద
2. సర్వ సంపత్ప్రద
3. సర్వ ప్రియంకరీ
4. సర్వ మంగళకారిణీ
5. సర్వ కామప్రద
6. సర్వ దుఃఖవిమోచినీ
7. సర్వ మృత్యుప్రశమనీ
8. సర్వ  విఘ్ననివారిణీ
9. సర్వాంగ సుందరీ
10.సర్వ సౌభాగ్యదాయినీ

సాధకుడు ఈ ఆవరణలో ఈ శక్తులను  ప్రాప్తించుకుని, సాధనలో ముందుకు సాగుతాడు. (సశేషం)

🌹శ్రీ మాత్రే నమః🌹

🌹. శ్రీ చక్రం విజ్ఞానం - 2 🌹

🌹. శ్రీ చక్రం విజ్ఞానం - 2 🌹 
(2 వ భాగం)

🌹మొదటి ఆవరణం - ధరణీ సదనం (భూపురం)🌹

శ్రీ చక్రానికి వెలుపల నాలుగు వైపులా గోడలాగా ఉండే దాన్ని భూపురం అంటారు. అది ఈ క్రింది విధం గా ఉంటుంది:

ఈ ప్రధమ ఆవరణలో అణిమాది దేవతలు 28 మంది ఉంటారు. వీరందరూ మందార పువ్వు రంగు గల దేహచ్చాయ తో ఉంటారు. ఒక్కొక్కరికి నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో చింతామణి, కపాలం, త్రిశూలం, అంజనం లేదా కాటుక ఆయుధాలుగా ధరించి వుంటారు.  ఆ 28 దేవతల పేర్లు క్రింద ఇవ్వబడ్డాయి:

అష్ట సిద్దులు: 
1. అణిమా  
2. మహిమా
3. గరిమ
4. లఘిమా 
5. ప్రాప్తి
6. ప్రాకామ్య 
7. ఈశిత్వ 
8. వశిత్వ 

9. ఇచ్ఛా   
10. సర్వకామ 

సప్త మాతృకలు: 
11. బ్రాహ్మి 
12. మాహేశ్వరి 
13. కౌమారి 
14.  వైష్ణవి, 
15. వారాహి 
16. మహేన్ద్రి 
17. చాముండా 

18. మహాలక్ష్మి 

19. సర్వసంక్షోభిని 
20. సర్వ విద్రావిణీ 
21. సర్వాకర్షణీ
22. సర్వవశంకరీ 
23. సర్వోన్మాదినీ 
24. సర్వ మహంకుశా 
25. సర్వ ఖేచరీ 
26. సర్వ బీజా
27. సర్వ యోని 
28. సర్వ త్రిఖండా

శ్రీ విద్య ఉపాసకుడు సాధించే మొదటి మెట్టు ప్రధమ ఆవరణ. ఈ ఆవరణలో అష్ట సిద్ధులు, సప్త మాతృకలు, మరి ఎన్నో ఇతర శక్తులు ఉన్నాయి. ఈ ఆవరణ సాధించినవారికి వీరి అనుగ్రహం కలుగుతుంది.  (సశేషం)

🌹శ్రీ మాత్రే నమః🌹

🌹. శ్రీ చక్ర విజ్ఞానం - 1 🌹

🌹. శ్రీ చక్ర విజ్ఞానం  - 1 🌹
 (1 భాగం)

శ్రీ చక్రం - నిర్మాణము, ఆవరణలు, అధిదేవతలు.
సాధారనంగా శ్రీ చక్రం అంటే అమ్మవారి స్వరూపం అని అందరికి తెలుసు నవర్ణావ పూజ చేస్తారు అని తెలుసు, అయితే ఈ ఆవరణ నిర్మాణ పద్దతులు అందులోని దేవతలు అర్చన విధానాలు గురించి చాల మందికి అవగాహన ఉండదు.. తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నా వివరంగా తెలిపే వారు తక్కువ మంది ఉన్నారు చెప్పే వాళ్ళు ఉన్నా నేర్చుకునే సమయం ఈ రోజుల్లో అందరికి లేదు..మనిషి ఆయువు కాలం కలియగంలో  తక్కువ కనుక ఉన్న సమయంలోనే అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక పయనం కొనసాగించాలి అలా మనము శ్రీ చక్ర నిర్మాణ ము , అందులో శక్తి రూపాలు , ఆవరణలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము..

 శ్రీ చక్ర నిర్మాణం, అందులోని ఆవరణలు, అధిదేవతలు గురించి తెలియటమే కాక అందులోని కేంద్ర బిందుమండల స్థానంలో తేజోమయ రూపంలో విరాజిల్లే అమ్మవారిని ఉపాసిస్తారు. ఇప్పుడు మనవంటి వారికోసం, శ్రీ చక్రం గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

"బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ  మన్వస్ర నాగదళ షోడశ పత్రయుక్తం
వృత్త త్రయంచ ధరణీ సదన త్రయంచ శ్రీ చక్ర రాజ ఉదితః పరదేవతాయాః"

గోపురము వలే కనబడు శ్రీ చక్రము చూడటానికి పైనుండి క్రిందకు క్రమముగా; 
1. బిందువు
2. త్రికోణము
3. వసుకోణం
4. అంతర్దశారము
5. బహిర్దశారం
6. చతుర్దశారం
7. అష్టదళపద్మం
8. షోడశదళపద్మం, దాని చుట్టూ మూడు వృత్త రేఖలు
9. మూడు రేఖలతో ధరణీ సదనం (భూపురం)

బిందువు  వద్ద పరదేవత అయిన శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారు ఆశీనురాలై ఉంటుంది. 

నవావరణములు: 

శ్రీ చక్రం లో తొమ్మిది ఆవరణలు ఉంటాయి. వాటినే నవావరణలు అంటారు. 
బయటనుండి కేంద్రం వైపు పోయే వరసలో వాటి పేర్లు ఈవిధంగా వుంటాయి. 

1. ధరణీ సదనం లేదా భూపురం
2. పదహారు దళ పద్మం
3. నాగ(అష్ట) దళ పద్మం
4. చతుర్దశారం
5. బహిర్దశారం
6. అంతర్దశారము
7. వసుకోణం
8. త్రికోణము
9. బిందువు
(సశేషం).

🌹శ్రీ మాత్రే నమః🌹

🌹. శ్రీచక్ర విజ్ఞానం - 5 🌹

🌹. శ్రీచక్ర విజ్ఞానం - 5 🌹
(5 వ భాగం)

🌹4 -నాలుగవ ఆవరణ - మన్వస్రం 🌹

శ్రీ చక్రం లోని నాలుగవ ఆవరణ ఇక్కడ క్రింది పటం లో చూపిన విధంగా 14 కోణాలు కలిగిన ఆకారంతో ఉంటుంది. ఇక్కడ 'సంప్రదాయ యోగినిలు' 14 మంది పటం లో సూచించిన సంఖ్యల క్రమం లో ఉంటారు. 

వీరు కాలానల శరీర కాంతి తో ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో వహ్ని చాపం, వహ్ని బాణం,  వహ్ని రూప ఖడ్గం,  వహ్ని రూప చక్రం ధరించి ఉంటారు. వీరి పేర్లు;

1. సర్వ సంక్షోభిణీ
2. సర్వ విద్రావణీ
3. సర్వ ఆకర్షిణీ
4. సర్వ ఆహ్లాదినీ
5. సర్వ సమ్మోహినీ
6. సర్వ స్తంభినీ
7. సర్వ జ్రుమ్భిణీ
8. సర్వ వశంకరీ
9. సర్వ రంజనీ
10.సర్వోన్మాదినీ
11.సర్వార్ధ సాధినీ
12. సర్వ సంపత్తి పూరిణీ
13. సర్వ మంత్రమయీ
14. సర్వ ద్వంద్వక్షయంకరీ

ఈ ఆవరణలో సాధకుడు ఈ యోగినీ శక్తులను ప్రాప్తించుకుని తన సాధనలో ముందుకు సాగుతాడు. (సశేషం)..

🌹శ్రీ మాత్రే నమః🌹

🌹. శ్రీ చక్ర విజ్ఞానం - 4 🌹

🌹. శ్రీ చక్ర విజ్ఞానం - 4 🌹
(4 వ భాగం)

🌹3.తృతీయ ఆవరణం - అష్ట దళ పద్మం🌹

శ్రీ చక్రంలోని మూడవ ఆవరణం 8 దళాల పద్మాకారంలో ఇక్కడ చూపిన విధంగా ఉంటుంది. 

ఆ మూడవ ఆవరణలో 8 మంది 'గుప్తతర దేవతలు' ఉంటారు. మందార పువ్వు రంగు దేహకాంతి తో ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. చెరుకు విల్లు, పుష్ప శరం, పుష్ప గుచ్చం, ఉత్పలం ధరించి ఉంటారు.  వీరి పేర్లు వరుసగా; 

1. అనంగ కుసుమ
2. అనంగ మేఖల
3. అనంగ మదన
4. అనంగ మదనాతుర
5. అనంగ రేఖా
6. అనంగ వేగినీ
7. అనంగాంకుశ
8. అనంగ మాలినీ

సాధకుడు ఈ ఆవరణ ప్రవేశించి మరింత ముందుకు వెళతాడు. (సశేషం)

🌹శ్రీ మాత్రే నమః🌹

🌹. శ్రీ చక్ర విజ్ఞానం - 3 🌹

🌹. శ్రీ చక్ర విజ్ఞానం - 3  🌹
(3 వ భాగం)

🌹రెండవ ఆవరణ - షోడశ దళ పద్మం 🌹

ఇది 16 దళాల పద్మాకారం లో ఉంటుంది. ఈ క్రింది పటం లో చూడవచ్చు. 

ఈ ఆవరణలో 16 మంది గుప్త దేవతలు పైన చూపిన సంఖ్యల క్రమంలో ఉంటారు. ఒకొక్కరికి నాలుగు చేతులు ఉంటాయి. మూడు నేత్రాలు ఉంటాయి. చంద్ర వంక ను ధరించి ఉంటారు. ధనుస్సు , బాణం, డాలు, ఖడ్గం ఆయుధాలుగా దరించి ఉంటారు. వారి పేర్లు వరుసగా; 

1. కామాకర్షిణీ (మనసు) (Conscious mind)
2. బుద్హ్యాకర్షిణీ (బుద్ధి) (Intellect)
3. అహంకారాకర్షిణీ (అహంకారం) (I or Ego)

(పంచ తన్మాత్రలు) (The 5 Sensory Perceptions of Ears, Skin, Eyes, Tongue, Nose)

4. శబ్దాకర్షిణీ (Hearing)
5. స్పర్శాకర్షిణీ (Touch)
6. రూపాకర్షిణీ (Seeing)
7. రసాకర్షిణీ (Taste)
8. గంధాకర్షిణీ (Smell)

9. చిత్తాకర్షిణీ (Sub-conscious mind)
10. ధైర్యాకర్షిణీ
11. స్మృత్యా కర్షిణీ
12. నామాకర్షిణీ
13. బీజాకర్షిణీ
14. ఆత్మాకర్షిణీ
15. అమృతాకర్షిణీ
16. శరీరాకర్షిణీ

ఈ రెండవ ఆవరణ లోకి ప్రవేశించిన సాధకునకు అమ్మవారి అనుగ్రహం వలన ఈ ఆకర్షణ శక్తుల పట్ల సంయమనం లభిస్తుంది.

ఈ ఉన్నతి ని సాధించి శ్రీ విద్యోపాసకుడు మరింత ముందుకు సాగుతాడు.

చక్ర విజ్ఞానం - 2 - స్వాధిష్ఠాన చక్రము

చక్రార్థ నిరూపణ
(చక్ర విజ్ఞానం / షట్చక్ర నిరూపణ)

          --- 2 ---

స్వాధిష్టానచక్రం 

ఐం హ్రీం శ్రీం కాం సోహం స్వాధిష్టానదేవతాయై కాకినీ సహిత బ్రహ్మస్వరూపిణ్యై నమః 

ఈ స్వాధిష్ఠాన కమలం ఆరు దళాలుగల జలతత్త్వం కలది. అధిదేవత కాకిని.

    ఈమె బం, భం, మం, యం, రం, లం అను యోగినులచే సేవించబడుతున్నది. వాహనం మొసలి.

    'మేధోనిష్టా మధుప్రీతా బందిన్యాది సమన్వితా  దధ్యాన్నాసక్త హృదయా కాకినీ రూపధారిణీ  మేధో దాతువునకు అధిష్టానదేవతయైన ఈమెకు పెరుగన్నం ప్రీతి.  
స్వాధిష్టానం (స్వ + అధిష్టానం) తనను తానుగా సమాజంలో నిరూపించుకోవడానికి అవసరమైన శక్తిని ఇది సమకూరుస్తుంది. అనేకజన్మలనుండి వెంటతెచ్చుకునే పాపపుణ్యాలను అనుభవమునకు తీసుకొచ్చే చక్రమిది. 

జననేంద్రియము వెనుకభాగమున వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 11,664 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. ఇది స్త్రీలల్లో ఓవరీస్ కు, పురుషులలో టెస్టిస్ కు ప్రాణశక్తినిస్తుంది. గర్భస్థశిశువుకు ప్రాణశక్తినిచ్చే చక్రమిదే.  జీవునకు తల్లి గర్భమునందు స్థానమేర్పడుటకు మూలాధారచక్రం కారణం కాగా, అటు తర్వాత పిండం భౌతిక శరీరంగా ఏర్పడుటకు కావాల్సిన ప్రాణశక్తిని ఈ చక్రమే ఇచ్చుచున్నది. 

ఈ ప్రాణశక్తి వలనే శరీరవ్యాపారాదులు నడుచుచున్నవి. శరీరంలోని ఉష్ణోగ్రత ఈ చక్రంనకు సంబంధించినదే. జీర్ణశక్తి అధికమవ్వడానికి తోడ్పడుతుంది. ప్రాణవాయువు ఊపిరితిత్తులనిండా వ్యాపించటానికి ఈ చక్రం సహాయకారి అవుతుంది. ఈ చక్రంకు పంచకోశాలలో ప్రాణమయకోశంతో సంబంధం. శారీరక వ్యవస్థలోని విసర్జక వ్యవస్థతో సంబంధం.

 జ్ఞానేంద్రియం కన్ను. రాజస తామస గుణాలతో వుంటుంది. పునరుత్పత్తి కి సహాయకారి. 

    దీనిలోశక్తి  చైతన్య రూపంలో మనిషిలో ప్రవహిస్తూ ప్రాణమయ కోశానికి శక్తినందిస్తుంది

ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే ........ 
శారీరకంగా పాండురోగం, కంటిజబ్బులు, గర్భకోశ వ్యాదులు, జ్వరాలు లాంటి రుగ్మతలకు కారణమౌతుంది. 

ఈ చక్ర మానసిక స్వభావం ........
మూసుకుపోవడం వలన మితిమీరిన కామవాంఛ. విషయసుఖాలపై ఆసక్తి, అపరాధ భావన, దురాశ, క్రోధం, అనుమానం, ఉద్రేకం జూదరితనం, వివాదాస్పద తత్త్వం, నిరాశనిస్పృహలు.  
స్వాధిష్టానం తెరుచుకుంటే సత్యం అవగాహన అవుతుంది.  జీవియందలి 'నేను' అను వ్యక్తిగత ప్రజ్ఞయే అహంకారం. అట్టి అహంకారంవలన జీవుడు తనను తానూ పరమాత్మ నుండి వేరుచేసుకొనుచున్నాడు. ఇది జీవియందు నేనున్నాను అను సంకల్పంగా పనిచేయుచున్నది. తానేమిటో మర్చిపోయిన మనిషి ఆ మరిచిపోయిన సత్యానికై బయట దొరుకుతుందని వెదుకులాడుతూ తపన చెందుతున్నాడు, బాహ్యంగా గోచరిస్తుందని భ్రమిస్తున్నాడు, బయట నుండి సంపాదించవచ్చని ఆరాటపడుతున్నాడు, బాహ్యంగా దర్శించవచ్చని తాపత్రయపడుతున్నాడు. ఓ చర్యలో, సంఘటనలో, సన్నివేశంలో, పరిచయంలో ఈ సత్యం లేదని, అది బయటనుండి రాదనీ, మనలోనుండే రావాలని, అంటే తనలో తానై ఈ సత్యం వుందన్న అవగాహనయ్యేది  ఈ చక్రశుద్ధి వలనే .  
ప్రాణశక్తి చక్కగా ఆవిర్భవిస్తుంది. ఈ చక్రాన్నిఅధిగమిస్తే ఇంద్రియాలన్నింటిపైన నియంత్రణ కల్గుతుంది. 
అలానే ఈ నాడీకేంద్రం  అంతర్గత సంస్కారానికి వేదిక. 

మరి ఈ చక్రంను ఎలా శుద్ధి చేసుకోవడం ???

శాస్త్ర ప్రకారం పరిశీలిస్తే - 
ఈ చక్రమునకు "కాకిని" దేవత.  మేధో దాతువునకు అధిష్టానదేవతయైన ఈమెకు పెరుగన్నం ప్రీతి.  ఈ చక్రం బలహీనంగా ఉంటే పెరుగన్నంను బలం కలుగుటకు స్వీకరించాలి. కాచిన పాలలో అన్నం వేసి తోడుపెట్టి ఉదయముననే ఆ పెరుగన్నం తినవలెను.వ్యాదులను బట్టి అవసరమైనచో కొన్ని ఔషదములను ఉపయోగిస్తూ,  బీజాక్షరం "వం" ధ్యానించువారికి ఈ నాడీకేంద్రం వలన వచ్చే బాధలు నివారణ కాగలవు. 

ఈ  చక్రంలో జాగృతి తీసుకురావాలంటే .....

కరుణ, వాత్సల్యం, ప్రేమ, అనురాగం, మైత్రిల్లాంటి సద్గుణాలను అలవర్చుకోవాలి. అలాగే అహింసా వ్రతం(ఏ ఒక్కర్నీ మాటలతోగానీ, చేతలతోగాని నొప్పించి,బాధించే ప్రవృత్తి లేకుండా వుండడమే అహింస) ఆచరించాలి. 
అలాగే ఈ చక్రమునకు అధిపతి శుక్రుడు. ఉల్లాసానికీ, మర్మాంగాల  కామప్రకోపానికీ అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు విశేషించి స్త్రీల జబ్బులకు కారణభూతుడు. ఈ గ్రహం సానుకూలంగా వుండాలంటే ......
హాయిగా నవ్వాలి. ఆనందంగా సంతోషంగా వుండాలి. సంగీతం, నాట్యం, రచన, హాస్యచతురత ఈ చక్ర పరిధిలోనివే. అందుచే యాంత్రికతకు భిన్నంగా మనస్సును రంజింపజేసే వినోదకార్యక్రమాలు, లలిత కళలలో పాల్గొంటూ, ఒకింత కళాపోషణ అలవర్చుకోవాలి.

 గాయత్రీ మంత్రాన్ని జపించడం, తాను నొవ్వక ఎదుటివార్ని నొప్పించక జీవించడం, మన భావాలు మరొకరికి భారం కాకుండా, బాధ కల్గించకుండా చూసుకోవడం లాంటివి ఆచరించగలిగితే శుక్రగ్రహం అనుగ్రహంతో స్వాధిష్టానం అనుకూలించి జాగృతి అవుతుంది. 

ముఖ్య గమనిక :-

కొందరు ఈ చక్రం అగ్నితత్త్వం గలదిగా అనుకుంటారు. కానీ ఈ చక్రం జల తత్త్వం గలదిగా ప్రాజ్ఞుల, యోగుల అవగాహన. అయితే  శ్రీ శంకరాచార్యులవారు సౌందర్యలహరి లో తెలిపిన  పద్యం ఓసారి గమనిస్తే, ఇది అగ్నితత్త్వం గలదిగా నిర్ధారణ చేసుకోవచ్చు.అయితే ఈ విషయంలో పండితులలోనూ/సాధకులలోనూ....ఒకింత భేదాభిప్రాయము ఎందుకో.....చోటు చేసుకుంటోంది. ఇది పరిశోధనార్హం. 

అగ్ని తత్వానికి ఉత్పత్తి స్థానమగు స్వాధిష్టాన కమలమున ప్రళయాగ్ని జ్వాలారూపమైన శక్తి ధ్యానింప తగినది. ప్రళయాగ్ని శక్తుల వలన జగములు భస్మమగును. భస్మములైన లోకములు మణిపూరక కమలమునందున్న భగవతి కృపచేత నిలుచుచున్నవి.

చక్ర విజ్ఞానం - 1 - మూలాధార చక్రం

చక్రార్థ నిరూపణ
( చక్ర విజ్ఞానం)

       --- 1 ---

 మూలాధార చక్రం 

మూలాధారాన్ని సృష్టికి మూల స్థానంగా వ్యవహరిస్తారు. మనిషి జననానికి ఈ స్థానం ఒక పునాది లాంటిది. దీనిని భూలోకం అంటారు. 3 1/2 చుట్లు తిరిగి ఉన్న  "చుట్టుకున్న సర్పం" (coiled serpent) ...ఈ మూలాధార స్థానంలో ఉంటుంది. ఇది ఈ ప్రదేశంలో నిద్రాణమై ఉన్న శక్తికి రూపకల్పనగా చెప్పబడింది. ఈ నిద్రాణమై ఉన్న శక్తి సుషుమ్న ద్వారా awakening చెందాలి. 3  1/2 చుట్లు అని చెప్పడంలో ఒక విశేషం ఉంది. మనస్సు యొక్క స్వప్న, సుషుప్తి, స్వల్పమైన చేతనా స్థితులకు సూచిక గానూ...ఈ స్థితులలో ఉన్న మనస్సును తురీయావస్థకు తీసుకురావడాన్ని symbolic గా చెప్పబడింది. ఈ 3 1/2  చుట్లు తిరిగిన సర్పం ...మూలాధార చక్రం లో కలదు. మగవాళ్ళలో ఈ స్థానం "scrotam", మలద్వారాల (anus) ల మధ్య ఉంటుంది. స్త్రీలలో ఇది "సెర్విక్స్" కి వెనుక భాగంలో ఉంటుంది.
    మూలాధార చక్ర స్థానంలో 4 దళాలున్న పద్మం ఉంటుంది. ఇది భూమి యొక్క నాలుగు దిక్కులకు సంకేతం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనబడే స్థితులకు కూడా ఈ 4 దళాలు సంకేతం. పద్మ దళాలపై... వం, శం, షం, సం ... అనే బీజాక్షరాలుంటాయి. లోపల పసుపు పచ్చగా ఉండే ఒక మూపురం ఉంటుంది. ఇది భూమికి సూచనగా చెప్పబడింది. ఇక్కడ పృథ్వీ తత్వం ఉంటుంది. ఈ చక్రం రంగు చిక్కటి ఎరుపు. మూలాధార చక్ర బీజ మంత్రం "లం". ఈ చక్రం యొక్క అధిష్టాన దేవత అనుకూల శక్తికి సూచికగా చెప్పబడిన "గణేశుడు". ఈ చక్రం ఘ్రాణేంద్రియంతో సంబంధం కలిగి ఉన్నది. అన్నమయ కోశానికి మూలస్థానం మూలాధారం. మూలాధారానికి సంబంధించిన కర్మేంద్రియం మలద్వారం. ఈ చక్రానికి సంబంధించిన ధాతువు ఎముక.

 పృథ్వీ తత్వానికి చెందిన మూలాధార చక్రానికి యంత్రం చతురస్రం. దీనిలో 7 తొండాలున్న ఏనుగు ఉంటుంది. ఏనుగు లో ఎంత శక్తి ఉంటుందో అలాగే ఈ మూలాధార స్థానం లోని భూతత్వం అంత శక్తి కలిగి యుంటుందని సూచనగా చెప్పబడింది. మనలో దాగి ఉన్న శక్తికి ఇది ఒక సూచిక. ఏనుగుకి ఉన్న ఏడు తొండాలు మనిషి యొక్క సప్త ధాతువులకి సూచనగా చెప్పబడ్డాయి. ఏనుగు వీపు మీద ఎరుపు రంగులో తిరగ వేసిన త్రికోణం ఉంటుంది. ఇది సృజనాత్మక శక్తికి సంబంధించినది. ఇక్కడ పొగ లాంటి బూడిద రంగులో లింగం ఉంటుంది. ఇది astral body ని సూచిస్తుంది. మూలాధార స్థితిలో ఉండడమంటే ఒక రకంగా un conscious స్థితిలో ఉండడమే మరి.
     ఈ చక్రం ...తనను తాను రక్షించుకొనే స్వార్థం, భయం, క్రూరమైన ఆక్రమణ తత్వం, మృగ మనస్తత్వం...అనే లక్షణాలను కలిగి యుంటుంది.
     ఈ చక్రం ఆరోగ్య స్థితిలో ఉన్నవారు బలమూ, అతి శ్రద్ధ, నిర్భయత్వము, దేనినైనా సాధించే వారుగా ఉంటారు. ఈ చక్రం బలహీనమయ్యేకొద్దీ పైన వివరించిన శక్తులు కోల్పోతూ అనారోగ్యం ప్రారంభం అవుతుంది.

     మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రము. ఇది షట్చక్రాలలో మొదటిది.  ఈ మూలాధార చక్రములో ‘సాకిని’ నివసిస్తుంది. ఈమెకు ఐదు ముఖములు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనబడే ఐదు తన్మాత్రలు ఈ మూలాధారం వద్దే పనిచేస్తాయి. గర్భస్త శిశువుకి ఐదవ మాసములో చర్మం ఏర్పడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానము కలుగుతుంది. ఈమె అస్తి సంస్థిత అనగా ఎముకలను అంటిపెట్టుకుని ఉంటుంది. వజ్రేశ్వరి. ఈ దేవతకి నాలుగు చేతులు. అంకుశము, కమలం, పుస్తకము, జ్ఞానముద్ర కలిగి ఉంటుంది.

    ఈ మూలాధార చక్రాన్ని శ్రీ విద్యోపాసనలో త్రైలోక్య మోహన చక్రము అంటారు.
 ఇది నాల్గు దళములు గల పద్మము.  ఈ చక్రమునకు ఆధి దేవత విఘ్నేశ్వరుడు.  బీజాక్షరము "లం". మూలాధారము, స్వాధిష్టానములను కలిపి ఉంచే గ్రంథి "బ్రహ్మ గ్రంథి". సాధకుడనేవాడు చక్రాలనే కాక ఈ గ్రంథులు లనే 3 ముడులను కూడా ఛేదించాలి.  దీనిని పాశ్చాత్య తాత్వికులు “sacral plexus " అంటారు. మూలాధారమునందు ధ్యానము చేసినచో కుండలిని జాగృతమగుట సులభమగును. హఠ యోగం నందు, శ్రీ విద్యోపాసన యందు,లయ యోగమందు, కుండలినీ యోగమందు , ఈ చక్రమును జాగరణ చేసి జయించు క్రియలు చెప్పబడినవి. మూలాధారము కుండలిని శక్తికి switch స్థానము. యోగ శాస్త్రము ప్రకారము "గణపతి " మూలాధారస్థితుడు. షట్చక్రములలో అన్నిటికన్నా క్రింద ఉండి అన్నిటికి ఆధారమైనదే మూలాధారం (త్వం మూలాధార స్థితోసి నిత్యమ్ ! అని "గణపతి అధర్వ శీర్షం " లోని వాక్యము).
లలిత సహస్ర నామములో  "మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథి విభేధిని"  అని వస్తుంది. అమ్మవారు ఈ మూలాధారం లో కాల సర్పం గా కుండలినిలో నిండుగా చుట్టుకొని ఉంటుంది .లౌకిక అలౌకిక సుఖాల అనుమానం తొలగిపోయినప్పుడు ఈ కుండలిని నిద్ర తొలగి పోతుంది .ఒక సారి కుండలిని మేలుకొంటే సాధకుడి కల చెదిరిపోతుంది .అప్పుడు తన నిజ స్వరూపాన్ని   గుర్తిస్తాడు .దీన్ని యోగ శాస్త్రం లో ‘’ముడి విడిపోవటం" అంటారు .సాధకుడి ధ్యానం మరియూ ధారణ మూలాధారం నుండి పైకి లేచినప్పుడు ఈ ముడి అంటే గ్రంథి విడిపోతుంది .సాధనా మార్గం లో అనేక గ్రంథులున్నాయి .మూలాధారానికి పైన ఉన్న గ్రంథులలో  మొదటిది "బ్రహ్మ గ్రంథి" .బ్రహ్మ సమస్త ప్రపంచాన్ని సృష్టి చేస్తాడు. మూలాధారం చేసే పని కూడా ఇదే. దీని రహస్యం తెలుసుకొన్న సాధకుడు తనకు తెలిసినదంతా ఒక స్వప్నం గా తెలుసుకొంటాడు .దీనితో కల చెదిరి పోతుంది .మరొకటి మొదలవుతుంది .ఇక్కడి నుండి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది .దూర ప్రయానికి ఇది మొదటి మజిలీ మాత్రమే .ఈ గ్రంథి విప్పించే మాత ‘బ్రహ్మ గ్రంథి విభేదిని‘ అయింది. మూలాధారచక్ర అధిష్టాన దేవత “సిద్ధవిద్యాదేవి” సాకిణీ రూపములో ఉంటుంది. మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రము. ఇది షట్చక్రాలలో మొదటిది. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనబడే ఐదు తన్మాత్రలు ఈ మూలాధారం వద్దే పనిచేస్తాయి. గర్బస్ధ శిశువుకి ఐదవ మాసములో చర్మం ఏర్పడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానము కలుగుతుంది.
మన శరీరములోని మూలాధార చక్రము, శ్రీచక్రము లోని త్రైలోక్య మోహన చక్రానికి ప్రతీక. దీంట్లో మూడు భూపురాలు ఉంటాయి. అవి మూడు లోకాలకు ప్రతీక. అవియే గాయత్రి వ్యాహృతులు అయిన "భూః, భుః, సువః".  సౌందర్య లహరి లో శ్రీ శంకర భగవత్పాదులు ఈ మూలాధార చక్రము గురించి "సౌందర్య లహరి"లో ఇలా చెప్పారు.(సశేషం)

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము - 8 🌹

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
8 వ భాగము

🌴 ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻 సృష్టి 🌻

బ్రహ్మతత్వము స్వయం ప్రకాశము. అదియే పరమాత్మ మరియు ఆత్మతత్వము. ఆత్మతత్వము నుండి విష్ణువుదయించెను. విష్ణువు నాభి నుండి బ్రహ్మ జన్మించెను. ఈ ప్రాణులు లాభా లోభములు కల్గి, అల్పాయుష్కులయి, విషయభోగముల వలన, దుఃఖితులై యుండిరి. బ్రహ్మ, వారి కష్టములు గాంచి కరుణించి, వారి మంచి కొరకై చింతించి, వారి దుఃఖ నివారణ కొరకు తపస్సు, ధర్మము, దానము, సత్యము, తీర్ధములను, శుద్ధ సాధనములను సృష్టించెను. అయినను జ్ఞానమొక్కటే జీవుల తరుణోపాయమునకు మార్గమని తెలిపెను. అందుకుగాను బ్రహ్మం, సంకల్ప మాత్రమున బ్రహ్మను సృష్టించెను. నిర్మల స్వరూపియగు వసిష్ఠుని, బ్రహ్మ చంచలమగు నీ మనస్సులో ఒకింత అజ్ఞానము ప్రవేశించుగాక అని శపించెను. అంత వసిష్ఠుని బుద్ధి జడత్వము పొందగా, దీనుడై దుఃఖ శోకముల దగుల్కొనెను. అంతట తన దుఃఖమును గాంచిన బ్రహ్మ తన పుత్రుని సంసార దుఃఖము నుండి తప్పించుటకు, తత్వజ్ఞానముపదేశించెను. తదుపరి వసిష్ఠుడు తత్వజ్ఞానము నిర్మలమగు తత్వ జ్ఞానమున స్ధితుడైనాడు.

అంతట బ్రహ్మ నేను నీ కొసగిన తత్వ జ్ఞానమును ప్రాజ్ఞులగు వారికి బోధించుమని పల్కెను. అంతట వసిష్ఠుడు, నిరహంకారముతో, అభిమానరహితుడై తత్వజ్ఞానమును రామునికి బోధించెను. వసిష్ఠుడు ధర్మార్థ కామమోక్షములు పొందు నిమిత్తమై ఋషులకు స్మృతి శాస్త్రము, యజ్ఞశాస్త్రములు రచించి బోధించెను. కాలక్రమమున జనులు ధనసంపాదన, భోగలాలసులై అందుకొరకు కలహించుచు, యుద్ధములలో మునిగి దీనులు కాదొడగిరి.అపుడు జ్ఞానులైన ఋషులు, ప్రజల దైన్యమును పోగొట్టుటకై ఆత్మతత్వమును ప్రచారము కావించిరి. రాజులు తత్వజ్ఞానమును పొంది దుఃఖరహితులైరి. కాని వివేకవంతులగు తత్వజ్ఞులు, వైరాగ్యమును పొందిరి. అట్లు వైరాగ్యమును పొందిన వారే దుస్తరమగు ఈ సంసార సాగరమును తరింతురు. అందువలన శ్రీరాముని విచారమును పోగొట్టుటకై జ్ఞానమును వసిష్ఠుడు బోధించెను.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

🌹 పరమాత్మ మనకి దగ్గరా ? దూరమా ? 🌹

🌹 పరమాత్మ మనకి దగ్గరా ? దూరమా ? 🌹
✍సద్గురు శ్రీ చలపతిరావు 🙏

🌻 క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం నుండి 🌻

ఒక వస్తువు స్థూలం అయిన కొద్దీ తెలుస్తుంది. సూక్ష్మం అయిన కొద్దీ తెలియకుండా పోతుంది. భూమి, నీరు, స్థూలం కనుక తెలుస్తుంది. అగ్ని కొంచెం సూక్ష్మం, కనుక తెలుస్తుంది. వాయువు ఇంకా సూక్ష్మం కనుక చర్మానికి తప్ప తెలియదు. ఆకాశం ఇంకా సూక్ష్మం. శబ్ధగుణం వల్ల తెలియాల్సిందే తప్ప ఇక ఏ ఇంద్రియానికి గోచరం కాదు.

పరమాత్మ ఆకాశం కన్నా సూక్ష్మాతి సూక్ష్మం కనుక ఏ ఇంద్రియానికి తెలియదు. బాహ్య దృష్టి గలవారు ఎన్నటికీ తెలుసుకోలేరు. అంతర్దృష్టితో మాత్రమే తెలుస్తుంది.

భగవంతునిపట్ల విముఖులై, ఆయన గురించి తెలుసుకోవాలనే ఆలోచన లేక, ఆయనకు సంబంధించిన పనులు చేయకుండా, నిరంతరం లౌకిక వ్యవహారాలలో మునిగిన వారికి పరమాత్మ చాలా దూరం. కోటి జన్మలకైనా సాధ్యం కాదు.

అదే దూరస్థం.
అలాగాక బాహ్య విషయాల పట్ల ఆసక్తిని విడిచి, ఆ పరమాత్మను అందుకొనుటే ప్రధానంగా భావించి, శ్రవణ, మనన, నిధి ధ్యాసనల ద్వారా నిరంతరం సాధనలతో ఉండేవారికి పరమాత్మ దగ్గర. ఒక్క జన్మ చాలు.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము - 7 🌹

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
7 వ భాగము

🌴 ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻 5. పురుష ప్రయత్నము - 2 🌻

అదృష్టమును, దైవమును నమ్మి పురుషార్ధమును చేయకున్న, వాడు. ఏమియు సాధించలేడు. దైవమనగా, మనము చేసిన కర్మకు ఏ ఫలము లభించునో అది దైవము, వాటి అనుభవమే దైవము కాని వేరే దైవమెచటను లేదు. ఈ ప్రపంచమున దైవమునకే కర్తృత్వమున్న, పురుష ప్రయత్నమేల. దైవమే స్నాన దాన జపాదుల నొనర్చును. (ఇచట వసిష్ఠుని భావమేమనగా, దైవమనగా అదృష్టము, అదృష్టమనగా దృశ్యముకానిది, దైవము కూడ దర్శనీయము కాదు. అందువలన దైవముపై, అదృష్టముపై ఆధారపడకుండా, పురుష ప్రయత్నముపై మనుజుడు ఆధారపడవలెనని భావము. మనిషి ఆకారము. దైవము ఆకారము లేనిది. అందువలన రెండింటి కలయిక అసంభవము. దైవము, మనిషి కలవాలంటే మనిషి దైవము కావాలి. అనగా బంధనాల నుండి విముక్తి పొందాలి లేదా దైవము ఆకృతి దాల్చాలి. అనగా అవతారమెత్తాలి అని భావము. శూరులు, పరాక్రమవంతులు, బుద్ధిమంతులు, పండితులు అయిన వారు దైవము కొరకు వేచియుండవలసిన అవసరము లేదు. విశ్వామిత్రుడు, అదృష్టముపై ఆధారపడక, పురుషాకారము వలననే బ్రహ్మత్వము పొందినాడు. కుటుంబ పోషణ భోగవిలాసములు మొదలగునవి పురుష ప్రయత్నము వలననే గాని, దైవము వలన పొందుట లేదు. అందువలన ఎవరైనను, దైవముపై గాక పురుష ప్రయత్నముపైననే ఆధారపడవలెను.

అపుడు వసిష్ఠుని శ్రీరాముడిట్లు ప్రశ్నించెను. అసలు దైవమనునది వున్నదా లేదా తెలుపుమని పలికెను. అపుడు వసిష్ఠుడు దైవము ఏమిచేయుట లేదు, ఏమి అనుభవించుట లేదు. ఒక పురుషార్ధము వలననే లోకమున ఫలము లభించుచున్నది. దైవము వలన కాదు. అది కేవలము కర్మఫలము మాత్రమే. వెనుకటి జన్మల లోనివగు వాసనలు, ప్రభోదితములై, కర్మలుగ మారును. జన్మజన్మల సంస్కారముల ననుసరించి, బుద్ధి పనిచేయుటను. బుద్ధిననుసరించి, మనసు పని చేయును. మనసే కర్మలకు కారణము. ఆ కర్మల వలననే ఫలితములు లభించుచున్నవి . అంతేకాని, ఇచట దైవ ప్రసక్తి లేదు. దైవము మిథ్య. కేవలము పురుషాకారమే అభీష్టములన్నియు సిద్ధింపజేయుచున్నది. అదృష్టము వలన గాదు.

జీవుని చిత్తము శిశువువలె చంచలము. దానిని చెడు నుంచి మంచికి త్రిప్పిన, మంచికి మరలును. అలాగే మంచి నుండి చెడుకు మారవచ్చును. అందువలన ప్రయత్న పూర్వకముగ మంచికి మరల్చవలెను. అభ్యాసము వలననే వాసనలు ప్రభలమగుచున్నవి. కనుక మంచి పనుల అభ్యాసము ఫలవంతమగును. మంచి కొరకు పురుష ప్రయత్నము నవలంభించి, శుభములు పొంది, పంచేంద్రియములను జయించవలెను. మొదట శుభ వాసనలను అనుసరించి శోకరహితమగు పరమార్ధమును పొంది క్రమముగా, శుభవాసనలను కూడ వదలి, సత్యస్వరూపమున స్ధితుడు కావలెను.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము - 6 🌹

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
6 వ భాగము

🌴 ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻 5. పురుష ప్రయత్నము - 1 🌻

వశిష్ఠుడు రామునుద్దేశించి, ఇంకను ఏమి చెప్పుచున్నాడంటే, పురుష ప్రయత్నము వలననే, జ్ఞానము లభించుచున్నది. జ్ఞానము వలన జీవన్ముక్తి లభించును.

పురుషాకారము అనగా మనోవాక్కాయములందు చరించుట. అనగా ఏది ఆలోచిస్తామో అది మాట్లాడుట, ఏది చెబుతామో అది చేయుట. అలా కానిచో అది గతి తప్పుట. శాస్త్రానుసారము, ఎవరేది కోరునో వారది పొందును. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారి వారి పురుషాకారముల వలననే సృష్టి, స్ధితి, లయ కారకులయ్యారు. పురుష ప్రయత్నము, శాస్త్ర విరుద్ధమైన కార్యము లాచరించినపుడు, వ్యధలనుభవించవలసి వచ్చును.

ఉదా:సూర్యచంద్రులు, తమ గతి తప్పినపుడు, ప్రళయము సంభవించును. అలానే విద్యుక్త ధర్మము ననుసరించకపోయిన, దుష్ఫలితము సంభవించును. మంచి కర్మల వలన చెడు నశించును. ఒకవేళ సత్కర్మ చేసినప్పటికి ఫలితము చెడుగానున్న, చెడు సంస్కారములు బలముగానున్నట్లు భావించవలెను. అపుడు సత్కర్మలు ఆపకుండా కొనసాగించిన సత్ఫలితములు కల్గును.

శరీరము అస్ధిరము. మరణము నీడ వలె వెంటాడుచున్నదని ఎల్లపుడు భావించుచుండవలెను. ముముక్షువు పురుషాకారమున మొదట సాధన చతుష్టయము ననుసరించవలెను.

సత్‌ శాస్త్ర విధిననుసరించి, సత్‌ సంగమొనర్చి, సదాచార పూర్వకముగ నొనర్చిన కర్మయే, సంపూర్ణ ఫలప్రదమగును. అనర్ధ హేతువగు సోమరి తనము లేకున్న దొడ్డ ధనికుడో లేక పండితుడో కాని వాడెవడు. సోమరి తనము వలనే భూమండలము మూర్ఖులతో దరిద్రులతోను నిండి యున్నది. అదృష్టమన్న దానిని కూడ నమ్మరాదు. సాధనయే జీవుని యుద్ధరించునది. ఈ జన్మమున యొనర్చిన అశుభకర్మలు ప్రాయశ్చిత్తాది కర్మల వలన శుభములుగ మారునట్లు, పూర్వకర్మలు కూడ పురుష ప్రయత్నము వలన, శుభప్రదములుగ మార్చవచ్చును. కష్టపడి ఆర్జించిన విత్తమంతయు నష్టమైన, మరల పొందుటకు ప్రయత్నింపవలెను గాని దుఃఖించుట అనుచితము.

జయించ వీలు లేని మృత్యువును గూర్చి ప్రతి దినము దుఃఖించుచుండ మృత్యువు ఆగునా! అందువలన పౌరుషము నాశ్రయించి, సాదుసంఘశాస్త్ర విచారము వలన చిత్తశుద్ధిని పొంది సంసార సాగరమును దాటవలెను.
ఏ పురుషుడైనను, పురుష ప్రయత్నము వలన ప్రాప్తకర్మలను అణగదొక్కిన సుఖ, దుఃఖములను దాటగలడు. పురుషాకారమును విడిచి ''ఎవరో నన్ను ఉద్ధ్రించగలరు'' అని తలచువాడు వ్యర్ధుడు.

ఎన్ని సమస్యలు వచ్చినను, రాగద్వేషములన్నియు సిద్ధించును.
శుశ్రూష, స్వాధ్యాయము, సాధుసంగమము, శ్రవణాదుల వలన చిత్తమును, కలుషరహిత మొనర్చి, ఆత్మోద్ధరణకు పాటుపడవలెను.

పరలోకమున అనుభవించగా మిగిలిన ప్రాప్తకర్మనే, అదృష్టమని, దైవమని అనవచ్చును.

పురుష ప్రయత్నము వలన ఫలము అరచేతిలోని ఉసిరిక వలె లభించును. మూర్ఖుడే పురుష ప్రయత్నము వీడి, అదృష్టముపై ఆధారపడును.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము - 5 🌹

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
5 వ భాగము

🌴 ఉత్పత్తి ప్రకరణము  🌴

🌻 4. సూక్ష్మశరీరము   🌻

తదుపరి వశిష్ఠుడు శ్రీరామునికి సూక్ష్మశరీరతత్వమును బోధించుచున్నాడు. ఏ ప్రాణియైనను, మృతి చెందినపుడు, జీవాత్మ సూక్ష్మశరీరము ధరించి హృదయాకాశమున వాసనామయములగు (సంస్కారములు) త్రిలోకములను గాంచుచుండును. నిజానికి ఈ జీవాత్మ జన్మాది వికార రహితుడగు పరబ్రహ్మము. మరణ సమయమున మానసమందు నిలబడు కోర్కెలలో నేది అగ్రగణ్యమో దానినే జీవు డనుభవించును. నిజానికి జగత్తుమిధ్య, అసత్యమైనది. ఈ విషయము మరణ సమయ మందు, జనన సమయమందు, హృదయాకాశమున అనుభూతమగును. అనగా మరణ వేదనలో తన సంస్కారములన్ని, అనుభూతికి వచ్చి అంతా భ్రమయని తోచును. కాని సంస్కారములు నశించవు.

జన్మ సమయములో గూడ, ఆ సంస్కారములు భ్రమయని తెలిసినప్పటికి జన్మించిన తరువాత, మాయ ఆవరించి తన గత సంస్కారములు అలానే వుండును. బ్రతుకు నందలి ఆశ, పుట్టుక, చావు అనుమిధ్యా ప్రపంచము నిజమని తలచును.

స్ధూల శరీరములో సూక్ష్మ శరీరము, సూక్ష్మ శరీరములో కారణ శరీరము గలదు. ఈ మూడు శరీరములే సంసారమునకు కారణమగుచున్నవి.

సాధన ద్వారా ఈ మూడు శరీరములు దగ్ధమైనపుడే ముక్తి లభించును. ఈ సంస్కార తరంగములు నిద్రాసమయమందును, ప్రళయ సమయమందును చలనము లేక స్ధిరముగ వుండును. అది విశ్రాంతి సమయము. సృష్టి సమయము, స్వప్న సమయము లందు మరల భ్రాంతులు, తరంగములు లేచుచున్నవి. ఈ దేహత్రయములకు బ్రహ్మయే ఉపాధి. అందువలన స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు నశించగానే బ్రహ్మము మిగులును.

సంస్కారముల ననుసరించి జన్మ లభించును.
జనులు మాటి మాటికి పుట్టుచూ, చచ్చుచూ క్రమముగా  సంస్కారములలోమార్పు తెచ్చుకొనుచు, చివరికి విదేహముక్తులగుదురు.

ఉదాహరణకు వ్యాసుడు ఈ బ్రహ్మయుగములో ముప్పది రెండవ వ్యాసుడు. అనగా పూర్వపు సృష్టులందు, ముప్పది ఒక్క వ్యాసులు చనిరి. ఇంకను వ్యాసులు ఎనిమిది పర్యాయములు జన్మించి, భారత ఇతిహాసములను, వేదవిభజనను ఎనిమిది పర్యాయములు చేసి భారత వంశమునకు కీర్తి దెచ్చి, పిదప విదేహముక్తుడై బ్రహ్మమును పొందును.

అలానే ప్రతి జీవి లక్షల జన్మములు ఎత్తి చివరకు ముక్తులు కావలసినదే. వివిధ జన్మలలో, ఇప్పుడున్న వారె అప్పుడు యధావిధిగ జన్మించి, సమకాలికులుగ వుందురు. అప్పుడప్పుడు విడివిడిగా గూడ జన్మింతురు. ఆయా జన్మలలో వారి వారి భార్య, బంధువులు, ఆయుర్ధాయము, జ్ఞానము ఒకే విధముగ ఇప్పుడున్నట్లే వుండును.

కేవలము ఒక్క తత్వజ్ఞాని మాత్రమే, వికల్పములు లేక పరమ శాంతుడై సంతృప్తుడై బ్రహ్మ పదమును పొందును. జ్ఞాని సదేహముక్తుడైనను, విదేహముక్తుడైనను ఒకటియె. ఈ రెండు ముక్తులును భిన్నములు కావు. సదేహముక్తునకు విషయ భోగములున్నచో, విదేహముక్తుని కంటే, తక్కువగ నెంచుకొనవచ్చును. అయితే విషయ భోగమందు రసబోధ లేనందు వలన రెండును నిర్వాణముక్తి వంటివే. నీరు అలలుగా వున్నను, కదలకున్నను నీరు నీరే కదా! అలానే గాలి కదులుచున్నను, కదలకవున్నను గాలి గాలే కదా!.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము - 4 🌹

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
4 వ భాగము

🌴 ఉత్పత్తి ప్రకరణము  🌴

🌻 3. అఖండ చైతన్య స్వరూపము  🌻

అందుకు జనకుడు తాను గ్రహించినది తన తండ్రి పల్కినది కాక వేరేదియు లేదనియు ''అఖండచైతన్య స్వరూపము, అద్వితీయమైన పరమాత్మ స్వరూపము ఒక్కటే వున్నదని, తక్కిన వన్నియు లేనివేనని, అజ్ఞాన సంస్కారములు నశించినచో వ్యక్తి ముక్తుడై స్వస్వరూపమును పొందునని'' పల్కెను. చిన్న వయస్సులోనే శుకుడు భోగములను అనుభవించకుండగనే, విరక్తిని ప్రకటించి, పూర్ణత్వమును సాధించి సర్వజ్ఞానమును పొంది, వేదవ్యాసుని కంటే, గురువగు తన కంటే అధికుడవైనట్లు జనకుడు పల్కెను. నీ మనోరధము సిద్దించినదని, నీవు పొందవలసినదంతయు పొందియెయుంటి, ముక్తుడవని తెల్పెను.

తదుపరి శుకుడు సంశయరహితుడై, నిష్కాముడై నిర్వికల్ప సమాధి యందు, పదివేల ఏడ్లుండి, తైలహీన మగుదీపము వలె, ఆత్మ స్వరూపమున నిర్వాణమందెను. అని విశ్వామిత్రుడు శుకుని చరిత్రను తెల్పెను.*
*శుకుని వలె శ్రీరామచంద్రుడు తెలుసుకొనవలసినదంతయు తెలుసుకున్నాడని, శ్రీరాముడు భోగములందు విరక్తుడైనాడని పల్కెను.

కామక్రోధాదుల నెవడు జయించునో వాడే ముక్తుడు. అయితే శ్రీరాముని చిత్త శాంతి కొరకు వశిష్ఠుడు అతనికి తత్వబోధన చేయవలెనని పల్కెను. తక్కిన ఋషి పుంగవులు విశ్వామిత్రునితో ఏకీభవించిరి.

శ్రీ వశిష్ఠులు విశ్వామిత్రుని వచనములను తలదాల్చి శ్రీరామునికి అఖండ ఆత్మజ్ఞానమును బోధించుటకు ఉద్యుక్తుడయ్యెను. కాని శ్రీరాముడు మోక్ష శాస్త్రమును బోధించుటకు ముందు తన సందేహమును తీర్చవలయునని ఇట్లు పల్కెను.

శుకుని తండ్రియైన వ్యాసమహర్షి సర్వజ్ఞుడైనను విదేహముక్తిని పొందలేదు. అతని కుమారుడైన శుకుడు ఏల నిర్వాణముక్తిని పొందగల్గెను. అందుకు వశిష్ఠుడు ఇట్లు పల్కెను. పరమాత్ముని చైతన్య శక్తి యందు లేచి, మరల లీనమగు బ్రహ్మండత్రసరేణువులు అసంఖ్యాకములు, త్రిభువన మండలములు కూడ అసంఖ్యాకములు. అలాంటి జగద్రేణువులను జీవన్ముక్త పురుషులైన శుకుని వంటవారు నమ్మరు. అందువలన వీరు విదేహముక్తులుగ పిలువబడతారు. అందుకు శ్రీరాముడు తృప్తి చెంది, తాను అఖండ బ్రహ్మత్వమును గ్రహించితినని తెల్పెను.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము - 3🌹

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
3 వ భాగము

🌴 ఉత్పత్తి ప్రకరణము 🌴

2. ముముక్షుత్వము

అంతట సభనలంకరించి యున్న వశిష్ఠ, విశ్వామిత్రాది మహర్షులు, ఇతర మంత్రులు, సామంతులు, దశరధుడు మొ|| వారందరు, రాముని వాక్యములు విని పులకిత శరీరులై, రాముని కలత తీర్చుటకు ఎవ్విధమైన సమాధానము లభించునో అని కుతూహలురై యుండిరి. అలానే సిద్ధులు రాముని ప్రశ్నలకు పులకించి, పుష్పవర్షము కురిపించి సభలోకి ప్రవేశించి ఉపవిష్ఠులై, సమాధానములు వినుటకు కుతూహలురైరి. వారిలో నారదుడు, దేవతలు, వ్యాసుడు, మరీచి, దుర్వాసుడు, అంగీరసుడు, వాత్సాయనుడు, భరద్వాజుడు, వాల్మీకి, ఉద్దాలకుడు మొ|| మునులు, వేదవేద్యులగు తత్వజ్ఞులు ఉపవిష్ణులై యుండిరి.

రాముని వాక్యములు, విచారయుతములు, జ్ఞానబోధకములు, ఆర్యోచితములు, స్ధిరములు, సంతోషదాయములైయున్నవి. అట్టి వాక్యములకు సమాధానములు వినుటకై ఎల్లరు కుతూహలురై వుండిరి. అపుడు శ్రీవాల్మికి రామునుద్దేశించి నీ ప్రశ్నలన్నియు, జ్ఞానయుతములైయున్నవి. నీవు తెలుసు కొనవలసినది ఇంకేమియులేదు అని పల్కి వ్యాసపుత్రుడైన శుకుని బుద్ధి నీ బుద్ధి కూడ జ్ఞానమును పొందియు అంతర శాంతిని కోరుచున్నది అని పల్కెను.

అంత శ్రీరాముడు, శుకుడు విచారబుద్ధి వలన జ్ఞానము పొందియు మొదట శాంతిని పొందక తదుపరి శాంతిని ఎట్లు పొందగల్గెనని ప్రశ్నించెను. అందుకు విశ్వామిత్రుడు శుకదేవుని వృత్తాంతమును తెల్పెను. శుకుడు వ్యాసుని కుమారుడు. అతడు తేజస్వి, శాస్త్రజ్ఞుడు, ప్రాజ్ఞుడు, రూపుదాల్చిన యజ్ఞము. సంసారగతిని, దాని మాలిన్యమును చింతించుట వలన అతడు వివేకి అయ్యెను. అతడు చాలాకాలము విచారణ జరిపి చివరకు సత్యమును గ్రహించెను. అయినను అతడు శాంతిని పొందలేదు. క్షణ భంగురములైన విషయముల నుండి విరక్తి కల్గెను.

ఒక పర్యాయము శుకుడు తండ్రియైన వ్యాసుని భక్తితో ఇట్లు ప్రశ్నించెను. ''ఈ సంసారాడంబరమెట్లు ఉదయించినది. ఇది ఎంతకాలము, ఎట్లు, ఎచ్చట వుండును? దీని అంతమేది? ఇది దేహేంద్రియాది సంఘాతమా? లేక అందుకు వ్యతిరేకమైనదా? అని ప్రశ్నించెను''. వ్యాసుడు అందుకుతగిన ప్రత్యుత్తర మిచ్చినప్పటికి శుకుడు తృప్తి నొంద లేదు. అపుడు వ్యాసుడు తానంతకు మించి చెప్పగల్గినదేదియు లేదు. జనకుడను రాజు ఒకడు గలడు. అతని కడకేగిన అతడు నీకు తగిన సమాధానము చెప్పగలడని పలకగా, శుకుడు తండ్రి సలహా మేరకు విదేహ నగరమునకు ఏతెంచి, ద్వారము వద్ద తన రాకను జనకునకు తెలియబంపెను. జనకుడు ద్వార పాలకుని మాటవిని ఏ మాత్రము బదులివ్వలేదు. శుకుడు ఏడురోజులట్లే ద్వారము చెంతయూరకుండెను. తదుపరి లోనికి ప్రవేశింప అనుమతి నొసంగెను. శుకుని పరీక్షింపనెంచి జనకుడు మరల ఒక వారము దినముల వరకు రాజదర్శనము లభించదని తెలియపర్చెను. వారము దినములలో శుకునకు అందమైన యువతులు, భోజన వస్తువులు విలాస ద్రవ్యములు పంపి శుకునకు బరిచర్యలు నొసర్చెను.

శుకుడు దుఃఖ స్వరూపము గల ఆభోగ్యవస్తువులకు ఏవిధముగ చలింపక స్ధిరచిత్తుడై యుండెను. అపుడు జనకుడు శుకదేవుని స్వభావమును గ్రహించి, అతనిని పిలువనంపి, రప్పించి అతనికి వందన మొనర్చి ఇట్లు పల్కెను. నీవు జగత్తు నందలి కర్తవ్యములన్నింటిని నెరవేర్చితివి కృతకృత్యుడవైతివి.

నీవేమి పని మీద వచ్చితివని ప్రశ్నించెను. అందుకు శుకుడు జనకుని గురువుగా ఎంచి, ఈ సంసారాడంబర మెట్లు ఉదయించి, ఎట్లు ఉపశమించునో తెలుపమని పల్కెను. అపుడు జనకుడు వ్యాసుడు చెప్పిన సమాధానమే చెప్పెను. అపుడు శుకుడు ఆ విషయము తనకు తెలుసుననియు, శాస్త్రములు కూడ అట్లే తెలుపుచున్నవని పల్కెను. నిస్సారమగు ఈ సంసారము అజ్ఞానము నుండి వెలువడుచున్నది. అజ్ఞానము నశించిన, ఇదియు నశించునని పల్కెను. ఈ విషయము ఎంత వరకు సత్యమో తెలియబర్చి తనకు శాంతి నొసంగుమని కోరెను.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్