చక్రార్థ నిరూపణ
( చక్ర విజ్ఞానం)
--- 1 ---
మూలాధార చక్రం
మూలాధారాన్ని సృష్టికి మూల స్థానంగా వ్యవహరిస్తారు. మనిషి జననానికి ఈ స్థానం ఒక పునాది లాంటిది. దీనిని భూలోకం అంటారు. 3 1/2 చుట్లు తిరిగి ఉన్న "చుట్టుకున్న సర్పం" (coiled serpent) ...ఈ మూలాధార స్థానంలో ఉంటుంది. ఇది ఈ ప్రదేశంలో నిద్రాణమై ఉన్న శక్తికి రూపకల్పనగా చెప్పబడింది. ఈ నిద్రాణమై ఉన్న శక్తి సుషుమ్న ద్వారా awakening చెందాలి. 3 1/2 చుట్లు అని చెప్పడంలో ఒక విశేషం ఉంది. మనస్సు యొక్క స్వప్న, సుషుప్తి, స్వల్పమైన చేతనా స్థితులకు సూచిక గానూ...ఈ స్థితులలో ఉన్న మనస్సును తురీయావస్థకు తీసుకురావడాన్ని symbolic గా చెప్పబడింది. ఈ 3 1/2 చుట్లు తిరిగిన సర్పం ...మూలాధార చక్రం లో కలదు. మగవాళ్ళలో ఈ స్థానం "scrotam", మలద్వారాల (anus) ల మధ్య ఉంటుంది. స్త్రీలలో ఇది "సెర్విక్స్" కి వెనుక భాగంలో ఉంటుంది.
మూలాధార చక్ర స్థానంలో 4 దళాలున్న పద్మం ఉంటుంది. ఇది భూమి యొక్క నాలుగు దిక్కులకు సంకేతం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనబడే స్థితులకు కూడా ఈ 4 దళాలు సంకేతం. పద్మ దళాలపై... వం, శం, షం, సం ... అనే బీజాక్షరాలుంటాయి. లోపల పసుపు పచ్చగా ఉండే ఒక మూపురం ఉంటుంది. ఇది భూమికి సూచనగా చెప్పబడింది. ఇక్కడ పృథ్వీ తత్వం ఉంటుంది. ఈ చక్రం రంగు చిక్కటి ఎరుపు. మూలాధార చక్ర బీజ మంత్రం "లం". ఈ చక్రం యొక్క అధిష్టాన దేవత అనుకూల శక్తికి సూచికగా చెప్పబడిన "గణేశుడు". ఈ చక్రం ఘ్రాణేంద్రియంతో సంబంధం కలిగి ఉన్నది. అన్నమయ కోశానికి మూలస్థానం మూలాధారం. మూలాధారానికి సంబంధించిన కర్మేంద్రియం మలద్వారం. ఈ చక్రానికి సంబంధించిన ధాతువు ఎముక.
పృథ్వీ తత్వానికి చెందిన మూలాధార చక్రానికి యంత్రం చతురస్రం. దీనిలో 7 తొండాలున్న ఏనుగు ఉంటుంది. ఏనుగు లో ఎంత శక్తి ఉంటుందో అలాగే ఈ మూలాధార స్థానం లోని భూతత్వం అంత శక్తి కలిగి యుంటుందని సూచనగా చెప్పబడింది. మనలో దాగి ఉన్న శక్తికి ఇది ఒక సూచిక. ఏనుగుకి ఉన్న ఏడు తొండాలు మనిషి యొక్క సప్త ధాతువులకి సూచనగా చెప్పబడ్డాయి. ఏనుగు వీపు మీద ఎరుపు రంగులో తిరగ వేసిన త్రికోణం ఉంటుంది. ఇది సృజనాత్మక శక్తికి సంబంధించినది. ఇక్కడ పొగ లాంటి బూడిద రంగులో లింగం ఉంటుంది. ఇది astral body ని సూచిస్తుంది. మూలాధార స్థితిలో ఉండడమంటే ఒక రకంగా un conscious స్థితిలో ఉండడమే మరి.
ఈ చక్రం ...తనను తాను రక్షించుకొనే స్వార్థం, భయం, క్రూరమైన ఆక్రమణ తత్వం, మృగ మనస్తత్వం...అనే లక్షణాలను కలిగి యుంటుంది.
ఈ చక్రం ఆరోగ్య స్థితిలో ఉన్నవారు బలమూ, అతి శ్రద్ధ, నిర్భయత్వము, దేనినైనా సాధించే వారుగా ఉంటారు. ఈ చక్రం బలహీనమయ్యేకొద్దీ పైన వివరించిన శక్తులు కోల్పోతూ అనారోగ్యం ప్రారంభం అవుతుంది.
మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రము. ఇది షట్చక్రాలలో మొదటిది. ఈ మూలాధార చక్రములో ‘సాకిని’ నివసిస్తుంది. ఈమెకు ఐదు ముఖములు, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనబడే ఐదు తన్మాత్రలు ఈ మూలాధారం వద్దే పనిచేస్తాయి. గర్భస్త శిశువుకి ఐదవ మాసములో చర్మం ఏర్పడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానము కలుగుతుంది. ఈమె అస్తి సంస్థిత అనగా ఎముకలను అంటిపెట్టుకుని ఉంటుంది. వజ్రేశ్వరి. ఈ దేవతకి నాలుగు చేతులు. అంకుశము, కమలం, పుస్తకము, జ్ఞానముద్ర కలిగి ఉంటుంది.
ఈ మూలాధార చక్రాన్ని శ్రీ విద్యోపాసనలో త్రైలోక్య మోహన చక్రము అంటారు.
ఇది నాల్గు దళములు గల పద్మము. ఈ చక్రమునకు ఆధి దేవత విఘ్నేశ్వరుడు. బీజాక్షరము "లం". మూలాధారము, స్వాధిష్టానములను కలిపి ఉంచే గ్రంథి "బ్రహ్మ గ్రంథి". సాధకుడనేవాడు చక్రాలనే కాక ఈ గ్రంథులు లనే 3 ముడులను కూడా ఛేదించాలి. దీనిని పాశ్చాత్య తాత్వికులు “sacral plexus " అంటారు. మూలాధారమునందు ధ్యానము చేసినచో కుండలిని జాగృతమగుట సులభమగును. హఠ యోగం నందు, శ్రీ విద్యోపాసన యందు,లయ యోగమందు, కుండలినీ యోగమందు , ఈ చక్రమును జాగరణ చేసి జయించు క్రియలు చెప్పబడినవి. మూలాధారము కుండలిని శక్తికి switch స్థానము. యోగ శాస్త్రము ప్రకారము "గణపతి " మూలాధారస్థితుడు. షట్చక్రములలో అన్నిటికన్నా క్రింద ఉండి అన్నిటికి ఆధారమైనదే మూలాధారం (త్వం మూలాధార స్థితోసి నిత్యమ్ ! అని "గణపతి అధర్వ శీర్షం " లోని వాక్యము).
లలిత సహస్ర నామములో "మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథి విభేధిని" అని వస్తుంది. అమ్మవారు ఈ మూలాధారం లో కాల సర్పం గా కుండలినిలో నిండుగా చుట్టుకొని ఉంటుంది .లౌకిక అలౌకిక సుఖాల అనుమానం తొలగిపోయినప్పుడు ఈ కుండలిని నిద్ర తొలగి పోతుంది .ఒక సారి కుండలిని మేలుకొంటే సాధకుడి కల చెదిరిపోతుంది .అప్పుడు తన నిజ స్వరూపాన్ని గుర్తిస్తాడు .దీన్ని యోగ శాస్త్రం లో ‘’ముడి విడిపోవటం" అంటారు .సాధకుడి ధ్యానం మరియూ ధారణ మూలాధారం నుండి పైకి లేచినప్పుడు ఈ ముడి అంటే గ్రంథి విడిపోతుంది .సాధనా మార్గం లో అనేక గ్రంథులున్నాయి .మూలాధారానికి పైన ఉన్న గ్రంథులలో మొదటిది "బ్రహ్మ గ్రంథి" .బ్రహ్మ సమస్త ప్రపంచాన్ని సృష్టి చేస్తాడు. మూలాధారం చేసే పని కూడా ఇదే. దీని రహస్యం తెలుసుకొన్న సాధకుడు తనకు తెలిసినదంతా ఒక స్వప్నం గా తెలుసుకొంటాడు .దీనితో కల చెదిరి పోతుంది .మరొకటి మొదలవుతుంది .ఇక్కడి నుండి చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది .దూర ప్రయానికి ఇది మొదటి మజిలీ మాత్రమే .ఈ గ్రంథి విప్పించే మాత ‘బ్రహ్మ గ్రంథి విభేదిని‘ అయింది. మూలాధారచక్ర అధిష్టాన దేవత “సిద్ధవిద్యాదేవి” సాకిణీ రూపములో ఉంటుంది. మనలోని భౌతిక శక్తిని నియంత్రించేది మూలాధార చక్రము. ఇది షట్చక్రాలలో మొదటిది. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనబడే ఐదు తన్మాత్రలు ఈ మూలాధారం వద్దే పనిచేస్తాయి. గర్బస్ధ శిశువుకి ఐదవ మాసములో చర్మం ఏర్పడి పంచ జ్ఞానేంద్రియ జ్ఞానము కలుగుతుంది.
మన శరీరములోని మూలాధార చక్రము, శ్రీచక్రము లోని త్రైలోక్య మోహన చక్రానికి ప్రతీక. దీంట్లో మూడు భూపురాలు ఉంటాయి. అవి మూడు లోకాలకు ప్రతీక. అవియే గాయత్రి వ్యాహృతులు అయిన "భూః, భుః, సువః". సౌందర్య లహరి లో శ్రీ శంకర భగవత్పాదులు ఈ మూలాధార చక్రము గురించి "సౌందర్య లహరి"లో ఇలా చెప్పారు.(సశేషం)
Please help to post about other chakras as well
ReplyDelete