🌹 23, JULY 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

🍀🌹 23, JULY 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 23, JULY 2023 SUNDAY ఆదివారం, భాను వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 402 / Bhagavad-Gita - 402 🌹
 🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 30 / Chapter 10 - Vibhuti Yoga - 30 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 249 / Agni Maha Purana - 249 🌹 
🌻. శివ పూజా విధి వర్ణనము - 5 / Mode of worshipping Śiva (śivapūjā) - 5 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 114 / DAILY WISDOM - 114 🌹 
 23. లైంగిక సౌందర్యం అంటే ఏమిటి? / 23. What is Sexual Beauty? 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 380 🌹*
6) 🌹. శివ సూత్రములు - 116 / Siva Sutras - 116 🌹 
🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 19 / 2-07. Mātrkā chakra sambodhah   - 19 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 23, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాస స్కంద షష్టి, Masik Skanda Sashti 🌻*

*🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 17 🍀*

*31. భాస్కరః సురకార్యజ్ఞః సర్వజ్ఞస్తీక్ష్ణదీధితిః |*
*సురజ్యేష్ఠః సురపతిర్బహుజ్ఞో వచసాం పతిః*
*32. తేజోనిధిర్బృహత్తేజా బృహత్కీర్తిర్బృహస్పతిః |*
*అహిమానూర్జితో ధీమానాముక్తః కీర్తివర్ధనః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : కుటుంబము నెడ ఆసక్తత - కుటుంబము మొదలైన వానియెడ ఆసక్తత సామాన్యంగా సాధకుడు ఆరాధించే ఈశ్వరునకు అడ్డుగాగాని పోటీగాగాని తయారుకావడం కద్దు. అట్టి సందర్భంలో సాధకుడు దానిని తప్పక విడిచిపుచ్చ వలసే వుంటుంది. అయితే, ఇదంతా క్రమంగా సాధించవచ్చును. ఉన్న సంబంధాలను విడగొట్టుకోడం కొందరికి అవసరమైనా అందరికీ ఆది వర్తించ నక్కరలేదు.🍀* 

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల పంచమి 11:46:34 వరకు
తదుపరి శుక్ల షష్టి
నక్షత్రం: ఉత్తర ఫల్గుణి 19:47:44
వరకు తదుపరి హస్త
యోగం: పరిఘ 14:16:55 వరకు
తదుపరి శివ
కరణం: బాలవ 11:43:33 వరకు
వర్జ్యం: 01:02:06 - 02:49:14
మరియు 29:02:06 - 30:47:50
దుర్ముహూర్తం: 17:08:33 - 18:00:34
రాహు కాలం: 17:15:03 - 18:52:35
గుళిక కాలం: 15:37:32 - 17:15:03
యమ గండం: 12:22:29 - 14:00:00
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48
అమృత కాలం: 11:44:54 - 13:32:02
సూర్యోదయం: 05:52:24
సూర్యాస్తమయం: 18:52:35
చంద్రోదయం: 10:12:20
చంద్రాస్తమయం: 22:34:10
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: మిత్ర యోగం - మిత్ర
లాభం 19:47:44 వరకు తదుపరి
మానస యోగం - కార్య లాభం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 402 / Bhagavad-Gita - 402 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 30 🌴*

*30. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాల: కలయతామహమ్ |*
*మృగాణాం చ మృగేన్ర్ద్రోహం వైనతేయశ్చ పక్షిణామ్ ||*

*🌷. తాత్పర్యం : నేను దైత్యులలో భక్త ప్రహ్లాదుడను, అణుచువారిలో కాలమును, మృగములలో సింహమును, పక్షలలో గరుత్మంతుడను అయి యున్నాను.*

*🌻. భాష్యము : అక్కాచెల్లెండ్రయిన దితి మరియు అదితులలో అదితి తనయులు అదిత్యులుగా, దితి తనయులు దైత్యులుగా పిలువబడిరి. వారిలో ఆదిత్యులు భగవానుని భక్తులు కాగా, దైత్యులు నాస్తికులైరి. ప్రహ్లాదుడు అట్టి దైత్యవంశమున జన్మించినప్పటికి చిన్ననాటి నుండియు గొప్పభక్తుడై యుండెను. తన భక్తితత్పరత మరియు దైవీస్వభావము కారణముగా అతడు శ్రీకృష్ణుని ప్రతినిధిగా గుర్తింపబడినాడు. దమన మొనర్చునవి లేక అణుచునవి మొదలగు అంశములు పలు ఉన్నప్పటికిని కాలము మాత్రము భౌతికవిశ్వమునందలి సమస్తమును అణుచునదై యున్నది. కనుక అది శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము వహించును. మృగములలో సింహము అతి భయంకరము మరియు శక్తివంతమైనది. అదే విధముగా లక్షలాది పక్షిజాతులలో విష్ణువాహనమైన గరుడుడు అత్యంత ఘనుడు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 402 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 10 - Vibhuti Yoga - 30 🌴*

*30. prahlādaś cāsmi daityānāṁ kālaḥ kalayatām aham*
*mṛgāṇāṁ ca mṛgendro ’haṁ vainateyaś ca pakṣiṇām*

*🌷 Translation : Among the Daitya demons I am the devoted Prahlāda, among subduers I am time, among beasts I am the lion, and among birds I am Garuḍa.*

🌹 Purport : 
*Diti and Aditi are two sisters. The sons of Aditi are called Ādityas, and the sons of Diti are called Daityas. All the Ādityas are devotees of the Lord, and all the Daityas are atheistic. Although Prahlāda was born in the family of the Daityas, he was a great devotee from his childhood. Because of his devotional service and godly nature, he is considered to be a representative of Kṛṣṇa. There are many subduing principles, but time wears down all things in the material universe and so represents Kṛṣṇa. Of the many animals, the lion is the most powerful and ferocious, and of the million varieties of birds, Garuḍa, the bearer of Lord Viṣṇu, is the greatest.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 249 / Agni Maha Purana - 249 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 74*

*🌻. శివ పూజా విధి వర్ణనము - 5 🌻*

*'హుంఫట్‌' అను మంత్రముచే ప్రాకారమును భావన చేసి, ఆత్మరక్ష ఏర్పరచుకొనవలెను. దీని బైట, వెలుపల, క్రింద, మీద, భావన ద్వార శక్తి జాలమును విస్తరింపచేయవలెను. పిమ్మట మహాముద్రాప్రదర్శనముచేసి, పూరకప్రాణాయామముతో హృదయకమలమునందున్న శివుని ధ్యానించి, ఆనందామృతమయ మకరందముతో, (నిండిన) భావమయపుష్పము లతో శివునకు పాదములనుండి శిరస్సు వరకును అంగపూజ చేయవలెను. శివమంత్రములతో నాభికుండమునందున్న శివ స్వరూపాగ్నిని తృప్తుని చేయవలెను. ఆ శివానలమే లలాటమున బిందురూపములో నున్నది; దాని విగ్రహము మంగలమయము (అని) భావన చేయవలెను. స్వర్ణపాత్రము గాని, రజతపాత్రము గాని, తామ్రపాత్రము గాని అర్ఘ్యము నిమిత్తమై గ్రహించి దానిని అస్త్రబీజము (ఫట్‌) ఉచ్చరించుచు కడగవలెను.*

*బిందు రూపశివునినుండి అమృతము ఆవిర్భవించుచున్నట్లు భావనచేసి హృదయమంత్రము (నమః) ఉచ్చరించుచు, దానితో కలిసిన జలాక్షతాదులతో ఆ పాత్రను నింపవలెను. దానికి షడింగ పూజ చేసి, దేవతామూలమంత్రముచే అభిమంత్రించవలెను. అస్త్రమంత్రము (ఫట్‌) చే దాని రక్ష చేసి, కవచబీజ (హుమ్‌) ముచే దానిని కప్పవలెను. ఈ విధముగ అష్టాంగార్ఘ్యము ఏర్పరచి, ధేనుముద్రచే దానికి అమృతీకరణముచేసి, ఆ జలమును అన్ని వైపులను చల్లవలెను. తన శిరస్సుపై కూడ చల్లుకొనవలెను. పూజాసామగ్రిమీద కూడ అస్త్రబీజము నుచ్చరించుచు చల్లవలెను. హృదయబీజముతో అభిమంత్రించి, 'హుమ్‌' బీజముచే (లేదామత్స్యముద్రచే) దానిని ఆచ్ఛాందిచవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 249 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 74*
*🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 5 🌻*

31. Having protected the enclosure with the weapon and the outer place with its mantra the mahāmudrā consisting of the energy should be shown below and above that.

32-33. One should worship Śiva in the lotus in the heart from head to foot with the retention of breath and with the flowers of one’s own feeling. One should then offer the clarified butter of ambrosia to the fire of Śiva in the sacred pit of the navel with the mantras of Śiva. One should contemplate the white figure of the form of bindu on the forehead.

34. One of the vessels among the golden pitchers, should be purified by water of nectar got from the speck and by unbroken rice.

35. Having filled the vessel with the six constituents and after having worshipped it, it should be consecrated. After having protected it with the mantra hā one should cover it with the armour.

36. After having made ready the water of offering, one should sprinkle the eight constituents (with water) by (showing) the dhenumudrā (a particular form of intertwining the fingers representing the cow). One should then sprinkle one’s own self on the head with the particles of that water.

37. One should sprinkle water of the weapon on the materials of worship kept there. One should then encircle them with the armour of piṇḍa with the hṛt (mantra).

38-39. After having shown the amṛtā mudrā (formation with fingers denoting non-decay) and putting flower on its seat and a mark on the forehead consecrated by the principal mantra (of the god) a bold man should remain perfectly silent at the time of bathing, worship of the god, (offering) oblation unto fire, eating, practising yoga and repetition of necessary (mantras).

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 114 / DAILY WISDOM - 114 🌹*
*🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 23. లైంగిక సౌందర్యం అంటే ఏమిటి? 🌻*

*స్త్రీలలో పురుషులకి, పురుషులలో స్త్రీలకి కనిపించే ఆ సౌందర్యం అనేది ఈ ద్వైలింగ ప్రకృతి ముందు మనుగడలో ఉన్న ఏకలింగ ప్రకృతి యొక్క సంపూర్ణత్వం యొక్క అభివ్యక్తిగా చెప్పవచ్చు. ఆ సంపూర్ణత యొక్క ఆకర్షణే ఈ లింగాల మధ్య సౌందర్యంగా ప్రకటితం అవుతుంది. మరి అలాంటప్పుడు లైంగిక సౌందర్యం అంటే ఏమిటి? అలాంటిది అంటూ ఒకటి ఉందా? ఉంది మరియు లేదు.*

*ఉన్నట్లు మనకు కనిపిస్తుంది కాబట్టి ఉంది. కానీ మనకు కనిపించేది నిజానికి సౌందర్యం కాదు. మనం దానిని సౌందర్యం అని అనుకుంటాం. కనిపించే లింగాల అందం అనేది వ్యక్తిత్వం యొక్క భౌతిక జీవులలో జరిగే కంపనసారూప్యత యొక్క పరిణామం. ఇది వ్యతిరేక లింగానికి ఆకర్షణగా పరిణమిస్తుంది. ఎందుకంటే ఇది వ్యతిరేక లింగంలో కేవలం తనలాంటి వ్యక్తిని మాత్రమే కాకుండా ఒక నిగూఢమైన అర్థం వ్యక్తి యొక్క శరీరంలోకి చదవబడుతుంది, ఈ అర్థం వ్యక్తి కంటే అందం యొక్క అవగాహనకు కారణం.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 114 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 23. What is Sexual Beauty? 🌻*

*The beauty that the sexes feel between each other is the glamour projected by this super-individual urge in the form of the sexes so that it may be safely said that sexual beauty which is visible to the male in the female and to the female in the male is the form of that lost identity of unisexuality which preceded the subsequent manifestation of bisexual individuals. Then, what is sexual beauty? Does it really exist? Yes, it does, and it does not.*

*It exists because it is seen; it does not exist because what is seen is not beauty but something else which is mistaken for what is known as beauty. The beauty of the sexes that is visible is the consequence of a similarity of vibration that takes place in the vital and physical organisms of the personality which gets pulled magnetically towards the opposite sex, since it sees in the opposite sex not merely a person like oneself but a strange meaning which is read into the body of the person, this meaning being the cause for the perception of beauty more than the person as such.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 380 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. వ్యక్తి అస్తిత్వానికి తల వంచాలి. తనని తను సమర్పించుకోవాలి. నీలోని పువ్వుల్ని, అంటే నువ్వు సృష్టించిన వాటిని అస్తిత్వానికి సమర్పించాలి. చిన్ని కాంతిని అనంత కాంతికి అదనంగా అందించాను అన్న సంతృప్తి కావాలి. 🍀*

*నా సంపూర్ణ ప్రయత్నం మిమ్మల్ని మరింత ఉత్సవ గుణంతో వుంచడు. మరింత ఆనందంగా వుండేలా చెయ్యడం, అనంతం మీకిచ్చిన బహుమానం పట్ల అవనతంగా వుండడం. కృతజ్ఞత నించీ గానం పుడుతుంది. పాటలు పల్లవిస్తాయి. అప్పుడు వ్యక్తి అస్తిత్వానికి తల వంచాలి. తనని తను సమర్పించుకోవాలి. నీలోని పువ్వుల్ని, అంటే నీ పాటల్ని, నువ్వు సృష్టించిన వాటిని అస్తిత్వానికి సమర్పించాలి.*

*వ్యక్తికి నేను ప్రపంచానికి చెందిన అందంలో ఆత్యల్పభాగాన్ని సృష్టించాను. అస్తిత్వానికి సంబంధించి దయా కెరటాన్ని అందుకున్నాను. చిన్ని కాంతిని అనంత కాంతికి అదనంగా అందించాను అన్న సంతృప్తి కావాలి. సృజనాత్మకత మతం, సృజన ప్రార్థన, సృజన ధ్యాన గుణం నించే వస్తుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 116 / Siva Sutras - 116 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-07. మాతృక చక్ర సంబోధః   - 19 🌻*
*🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴*

*ఉన్మేశ దశలో శుద్ధవిద్య అంచెలంచెలుగా పెరగడం కారణంగా ఉష్మాన్ బహిర్గతం అవుతుంది. శుద్ధవిద్య అనేది ఆచార వ్యవహారాలలో మునిగిపోవడం కంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించడానికి బాధ్యత వహిస్తుంది. రెండవ భాగం ఈశ్వర, ఇది వ్యక్తి సాధించిన ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంగా పని చేసేలా చేస్తుంది. శుద్ధవిద్య యొక్క మూడవ భాగం సదాశివ, ఇందులో జ్ఞానం మరియు చర్య రెండూ సమాన నిష్పత్తిలో ఉంటాయి. చివరిది మొత్తం సృష్టిలో అత్యంత ముఖ్యమైన భాగం, శక్తి. శక్తి సాక్షాత్కారానికి నాందిగా వ్యక్తమవుతుంది. ఇది శివుని సాక్షాత్కారానికి ముందు దశ. శివ అనేది శుద్ధ విశదీకరణ, ఇది కాంతికి కారణం.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 116 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-07.  Mātrkā chakra sambodhah   - 19 🌻*
*🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization.  🌴*

*In the stage of unmeṣa the resultant ūṣman unfold because of the successive stages of suddhavidyā. Suddhavidyā consists of suddhavidyā, which is responsible for acquiring spiritual knowledge than indulging in rituals. The second component is Īsvara, which makes a person to act on the basis of spiritual knowledge attained. The third component of suddhavidyā is Sadāśiva, wherein both knowledge and action are in equal proportion. The last one is the most significant part of the whole creation, Śaktī. Śaktī manifests as a prelude to Realisation. This is the penultimate stage of realising Śiva. Śiva is pure elucidation, which is the cause of Light.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj