26-JULY-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 232 🌹  
2) 🌹. శివ మహా పురాణము - 433🌹 
3) 🌹 వివేక చూడామణి - 107 / Viveka Chudamani - 107🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -60🌹  
5) 🌹 Osho Daily Meditations - 49🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 109 / Lalitha Sahasra Namavali - 109🌹 
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 109 / Sri Vishnu Sahasranama - 109🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -232 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 16-1

*🍀 15-1. సత్యము - ధర్మము - ఏడు లోకములందు జీవులున్నారు. వారు మరల మరల ఆ లోకములలోనే జన్మించుటగాని, ఉత్తమము అధమము అగు లోకములలో మరల జన్మించుట గాని జరుగుచుండును. సత్యముగాని, ధర్మముగాని వారియందు లోపించినచో, వారు క్రింది లోకములలో జన్మ లెత్తవలసి యుండును. ఇట్లు బ్రహ్మసృష్టి యందలి అన్నిలోకముల యందు పునరావృత్తి, పునర్జన్మలు యున్నవి. పైకెగబ్రాకుట, క్రిందికి దిగివచ్చుట జీవుల వర్తనమందలి పాప పుణ్యములపై ఆధారపడి యున్నది. 🍀*


ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోబర్జున |
మా ముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే || 16

తాత్పర్యము : చతుర్ముఖ బ్రహ్మ సృష్టియందలి అన్ని లోకములందు మరల మరల జన్మలెత్తు లక్షణమున్నది. నన్ను చేరిన వారికి మరల జన్మయే లేదు. 

వివరణము : నారాయణుని నాభి కమలము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించెను. సప్తలోక సృష్టి బ్రహ్మదేవుని ద్వారానే ఏర్పడినది. ఏడు లోకములందు జీవులున్నారు. వారు మరల మరల ఆ లోకములలోనే జన్మించుటగాని, ఉత్తమము అధమము అగు లోకములలో మరల జన్మించుట గాని జరుగుచుండును. 

స్థూలముగ ఏడు లోకము లిట్లున్నవి. 1. భూలోకము, 2. భువర్లోకము, 3. సువర్లోకము, 4. మహర్లోకము, 5. జనోలోకము, 6. తపోలోకము, 7. సత్యలోకము. 

చతుర్ముఖ బ్రహ్మ సత్యలోకవాసియై యున్నాడు. ఆ లోకమున సత్యవంతు లుందురు. సత్యమును ధర్మమును నిరంతరము పాటించుచుండుట వలన, ఆ లోకమున వసించు స్థితి ఏర్పడినది. సత్యముగాని, ధర్మముగాని వారియందు లోపించినచో, వారు క్రింది లోకములలో జన్మ లెత్తవలసి యుండును. ఉదాహరణకు మహాభారతమందలి శంతన మహారాజు సత్యలోకవాసియే. గంగాదేవియందు మోహము కలుగుట వలన ధర్మాతిక్రమణము కలిగి భూలోకమందు జన్మించవలసి వచ్చెను. 

అట్లే ఊర్ధ్వము నుండి రెండవలోకము తపోలోకము. ఇందు తపస్సే జీవితముగ వర్తించు ఋషులుందురు. వారు తపః ఫలముగ సత్యలోకమును చేరవచ్చును లేదా ధర్మము తప్పుట వలన దిగువలోకము లోనికి దిగజారవచ్చును. భూలోకము నుండి ఊర్ధ్వమగు సత్యలోకము వరకు, అధో ముఖముగ సత్యలోకము నుండి భూలోకమునకు సత్య ధర్మముల ననుసరించి జీవులు పల్లటీలు పొందుచు నుందురు. 

ఇట్లు బ్రహ్మసృష్టి యందలి అన్నిలోకముల యందు పునరావృత్తి, పునర్జన్మలు యున్నవి. పైకెగబ్రాకుట, క్రిందికి దిగివచ్చుట జీవుల వర్తనమందలి పాప పుణ్యములపై ఆధారపడి యున్నది. కనుకనే ఉత్తమ జన్మ, ఉత్తమ సుఖము పొందువారు చేసిన పుణ్యమును బట్టి అట్టి జన్మలు పొందినను, అజ్ఞానవశమున మదముతో పాపము లాచరించి మరుజన్మలో కష్టనష్టముల పాలగుచుందురు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 432🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 26

*🌻. బ్రహ్మచారి రాక - 2 🌻*

నీవు ఎవరి కులములో జన్మించితివో చెప్పుము. నీ తండ్రి ఎవరు? నీకున్న జీవనాధరమేమి? నీరూపము మహా సౌభాగ్యవంతమై యున్నది. తపస్సుపై నీకు గల ప్రేమవ్యర్థము(13). నీవు వేదమాతవా? లక్ష్మివా? లేక సుందర రూపిణి యగు సరస్వతివా? వీరిలో నీవెవ్వరివి అను విషయమును ఊహించుట నాకు శక్యము కాదు (14). 

పార్వతి ఇట్లు పలికెను-

నేను వేదమాతను గాను, లక్ష్మిని గాను, సరస్వతిని కూడ గాను. నేను ఈ జన్మలో హిమవంతుని కుమార్తెను. నా పేరు పార్వతి (15). పూర్వ జన్మలో నేను సతియను పేర దక్షుని కుమార్తెనె జన్మించితిని. నా భర్తను నా తండ్రి నిందించుటచే, నేను యోగ మార్గములో దేహమును త్యజించితిని(16). ఈ జన్మలో శివుడు లభించినవాడు. కాని విధివిలాసముచే ఆయన మన్మథుని దహించి నన్ను వీడి వెళ్ళినాడు(17). శంకరుడు వెళ్ళిన తరువాత నేను దుఃఖముచే పీడింపబడిన దాననై తండ్రిగారి గృహమును విడిచి పెట్టితిని. హే విప్రా! గంగానది తీరమునందు తపస్సు చేయవలననే దృఢనిశ్చయముతో వచ్చియుంటిని(18).

నేను చిరకాలము కఠినమగు తపస్సును చేసియూ ప్రాణప్రియుని పొందజాలక, అగ్నిలో ప్రవిశించ గోరి, నిన్ను చూచి కొద్దిసేపు ఆగితిని(19). నీవు వెళ్లుము. నేను అగ్నిలో ప్రవేశించెదను. ఏలయన శివుడు నన్ను స్వీకరించలేదు. నేను ఎక్కడ జన్మించిననూ శివుని భర్తగా వరించెదను(20).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఇట్లు పలికి ఆ పార్వతి ఆయన యెదుట అగ్నిలో ప్రవేశించెను. ఆ బ్రాహ్మణుడు వద్దు వద్దని ఎన్నిసార్లు వారించిననూ ఆమె లెక్క చేయలేదు.(21) ఆయన మహిమచే అగ్నిలో ప్రవేశించిన పార్వతికి అగ్ని వెనువెంటనే గంధపు ముద్దవలె ఆయెను(22).

క్షణకాలము అగ్నియందుండి ఆకసము పైకి వచ్చుచున్న సుందరియగు పార్వతిని చూచిశివుడు చిరునవ్వుతో వెంటనే ఇట్లు ప్రశ్నించెను(23).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 108 / Viveka Chudamani - 108🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 24. సమాధి స్థితి - 4 🍀*

362. స్థిరమైన సాధన ద్వారా మనస్సు ఆ విధముగా స్వచ్ఛమైనప్పుడు, అది బ్రహ్మములో కలసి సవికల్ప సమాధి చేరి తరువాత నిర్వికల్ప సమాధిలో నేరుగా ప్రవేశించి నిజమైన, ఏకమైన బ్రహ్మానంద స్థితిని పొందగలదు. 

363. ఈ సమాధి వలన ముడుల వంటి అన్ని కోరికలు నాశనమై, సాధన పూర్తయి, లోపల మరియు బయట అన్ని చోట్ల ఎల్లపుడు నిరంతరం వ్యక్తి యొక్క నిజ స్థితి స్థిరపడుతుంది. 

364. వినేదానికంటే ప్రతి స్పందన వంద రెట్లు అధికంగా ఉంటుంది మరియు ధ్యానము ప్రతి స్పందన కంటే వేయి రెట్లు అధికము. అయితే నిర్వికల్ప సమాధి స్థితి శాశ్వతమైనది. అది అన్నింటి కంటే ఇంకా అనేక రెట్లు అధికము. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 108 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 24. Samadhi State - 4 🌻*

362. When the mind, thus purified by constant practice, is merged in Brahman, then Samadhi passes on from the Savikalpa to the Nirvikalpa stage, and leads directly to the realisation of the Bliss of Brahman, the One without a second.

363. By this Samadhi are destroyed all desires which are like knots, all work is at an end, and inside and out there takes place everywhere and always the spontaneous manifestation of one’s real nature.

364. Reflection should be considered a hundred times superior to hearing, and meditation a hundred thousand times superior even to reflection, but the Nirvikalpa Samadhi is infinite in its results.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 60 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. పాత్రత 🌻

తగినవాడు‌ కనిపించినపుడు దానము‌ చేయుము, తగని వారితో కూడా ప్రియముగనే మాట్లాడుము. అంత మాత్రమున అసత్యము మాట్లాడకుము. 

ఎవరికిని నీ‌ వలన బాధ కలుగరాదను ప్రయత్నము నిత్యము కలిగియుండుము. ఈ మార్గమున జీవించినచో నరుడు స్వర్గానికి చేరుదురని నా మతము. 

పాత్రునకు దానము చేయుట‌ అనగా బీదవారికిచ్చుట ఒక్కటే కాదు. మనము చేయలేని పని ఇంకొకడు చేయగలవాడు కనిపించినచో మన సహకారము, మన దగ్గరున్న సాధన సంపత్తి వానికి ఇచ్చునట్టి బుద్ధి యండవలెను. 

అది లేక పోవుట చేతనే ఉత్తమ ప్రభుత్వము స్థాపించ వలెనను బుద్ధితో ప్రజలు వర్గములై చిలిపోయి క్షుద్రులుగా ప్రవర్తించుట జరుగుచున్నది. 

అది లేకపోవుట చేతనే మహానుభావులైన స్వాముల వార్లు ఆశ్రమములను స్థాపించి హిందూ మతోద్ధరణకై ఎవనికి వాడుగా వేరుగా ప్రయత్నించుట, ఇంకొకని పొడగొట్టకుండుట, చీలిపోవుట జరుగుచున్నది. 

దేశమునకు ఉపయోగించు మహానీయునకు ఆరోగ్యము చెడినప్పుడు స్వయముగా పోయి మందిచ్చుట, అతని క్షేమము గూర్చి బాధ్యత స్వీకరించుట పాత్ర దానమగును. 

తనకన్నా తక్కువ వాని యందు జాలి, దానబుద్ధి చాలమందికి ఉండును. తనతో‌ సమానుడు, తాను చేయలేని పనులు సాధించువాడు కనిపించునపుడు తాను సహకరించునట్టి దాన బుద్ధి నిజమైన పాత్రత. 

దానిని‌ సాధింపవలెనన్నచో ఈర్ష్య మొదలగునవి దాటవలెను...

✍️ *మాస్టర్ ఇ.కె.* 
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 49 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 FAILURE 🍀*

*🕉 You cannot be a failure; life does not allow failure. And because there is no goal, you cannot be frustrated. 🕉*

If you feel frustrated, it is because of the mental goal you have imposed on life. By the time you have reached your goal, life has left it; just a dead shell of the ideals and the goals remain, and you are frustrated again. The frustration is created by you. 

Once you understand that life is never going to be confined to a goal, goal oriented, then you flow in all directions with no fear. Because there is no failure, there is no success either-and then there is no frustration. Then each moment becomes a moment in itself; not that it is leading somewhere, not that it has to be used as a means to some end-it has intrinsic value.

Each moment is a diamond, and you go from one diamond to another-but there is no finality to anything. Life remains alive ... there is no death. Finality means death, perfection means death, reaching a goal means death. Life knows no death-it goes on changing its forms, shapes. It is an infinity, but to no purpose.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 109 / Sri Lalita Sahasranamavali - Meaning - 109 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🍀 109. సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా |*
*సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ ‖ 109 ‖ 🍀*

🍀 528. సహస్రదళ పద్మస్థా - 
సహస్రార కమలములో ఉండునది.

🍀 529. సర్వవర్ణోప శోభితా - 
అన్ని అక్షరాలు, అన్ని మంత్రాలు, వర్ణపటంలోని అన్ని రంగులతో శోభిల్లునది.

🍀 530. సర్వాయుధ ధరా - 
అనంతమైన అన్ని రకముల ఆయుధములను ధరించి ఉండునది.

🍀 531. శుక్ల సంస్థితా - 
శుక్ల ధాతువును చక్కగా ఆశ్రయించి ఉండునది.

🍀 532. సర్వతోముఖీ - 
సర్వతోముఖమైన ఏర్పాట్లతో నుండునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 109 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 109. sahasradala-padmasthā sarva-varṇopa-śobhitā |*
*sarvāyudhadharā śukla-saṁsthitā sarvatomukhī || 109 || 🌻*

🌻 528 ) Sahasra dhala padhmastha -   
She who sits on thousand petalled lotus

🌻 529 ) Sarva varnopi shobitha -   
She who shines in all colours

🌻 530 ) Sarvayudha dhara -   
She who is armed with all weapons

🌻 531 ) Shukla samsthitha -   
She who is in shukla or semen

🌻 532 ) Sarvathomukhi -   
She who has faces everywhere

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/