Showing posts with label life. Show all posts
Showing posts with label life. Show all posts

Balance Your 7 Chakras, Transform Your Life


Balance Your 7 Chakras, Transform Your Life

🌈 Balance Your 7 Chakras, Transform Your Life ✨

Your body is more than just physical—it’s energy in motion. The 7 chakras are the body’s main energy centers, each influencing your physical, emotional, and spiritual well-being.



🔴 Root Chakra – Stability & Security

🟠 Sacral Chakra – Creativity & Emotions

🟡 Solar Plexus Chakra – Confidence & Personal Power

🟢 Heart Chakra – Love & Compassion

🔵 Throat Chakra – Communication & Truth

🟣 Third Eye Chakra – Intuition & Wisdom

⚪️ Crown Chakra – Spiritual Connection & Higher Consciousness


When your chakras are balanced, you may feel more peaceful, energized, focused, and connected. Through yoga, breathwork, meditation, and mindful practices, you can support the natural flow of energy within your body. ✨🧘‍♀️

Seven Ways to Purify Your Life



https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2197251574394645


🌹🕉 Seven Ways to Purify Your Life 🕉🌹

🧘🏽‍♂️ Seven Divine Practices That Transform an Ordinary Person into a Noble Human Being 🧘🏽‍♂️

✍️ Prasad Bharadwaj


మాయా జగత్తులో జీవన పరమార్థం | ఆధ్యాత్మిక రహస్య గీతం
Life, Maya, Realization - Telugu Spiritual Song

https://youtu.be/08KfOSUQ9Yw




🌹🌹🌹🌹🌹



జీవితాన్ని శుద్ధి చేసే ఏడు మార్గాలు (Seven Ways to Purify Life) (YT Short)





🌹🕉 జీవితాన్ని శుద్ధి చేసే ఏడు మార్గాలు 🕉🌹
🧘🏽‍♂️ మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దే ఏడు దివ్య సాధనలు 🧘🏽‍♂️
✍️ ప్రసాద్ భరద్వాజ


కాలచక్రంలో అహంకారపు అంతులేని పొరలను తొలగించినప్పుడే, నీవు నిన్ను నీవుగా చూడగలవు.


https://youtu.be/VXXrVSDFf1E


🌹🕉 Seven Ways to Purify Life 🕉🌹
🧘🏽‍♂️ Seven Divine Practices That Mold a Person into a Great Being 🧘🏽‍♂️
✍️ Prasad Bharadwaja


Only when you peel away the endless layers of ego within the wheel of time can you truly see yourself as you are.

🌹🌹🌹🌹🌹


మీరు జీవితాన్ని చూస్తున్నారా? లేక మీ చైతన్యమే ప్రపంచాన్ని చూపిస్తుందా? (Are you looking at life? Or is your consciousness revealing the world to you?)




https://youtube.com/shorts/VrJZTvUR1RM


🌹మీరు జీవితాన్ని చూస్తున్నారా? లేక మీ చైతన్యమే ప్రపంచాన్ని చూపిస్తుందా? 🌹
🌹Are you looking at life? Or is your consciousness revealing the world to you? 🌹


✍️ ప్రసాద్ భరద్వాజ


Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹



Also, watch Full Video Here. 
చైతన్యపు ఏడు స్థాయిల ప్రయాణం – మనస్సు యొక్క రహస్య నిర్మాణం
The Journey Through Seven Levels of Consciousness – The Secret Structure of the Mind



https://youtu.be/HwS7dVlXtug


జీవన రథ తత్త్వం – శరీరం ఒక రథం The Philosophy of the Chariot of Life – The Body as a Chariot


Facebookhttps://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2061884504598020/

🌹 జీవన రథ తత్త్వం – శరీరం ఒక రథం : ఉపనిషత్తుల దృష్టిలో ఆత్మ, బుద్ధి, మనస్సు మరియు పంచేంద్రియాలు 🌹
✍️ ప్రసాద్‌ భరధ్వాజ


🌹 The Philosophy of the Chariot of Life – The Body as a Chariot: The Soul, Intellect, Mind, and Five Senses from the perspective of the Upanishads 🌹
✍️ Prasad Bharadwaj


ఇది ఉపనిషత్తుల దృష్టిలో మానవ జీవన నిర్మాణాన్ని అర్థం చేసుకునేందుకు ఇచ్చిన అత్యంత లోతైన తత్త్వబోధ. కఠోపనిషత్తు (1.3.3–4) లో జీవితం ఒక ప్రయాణంగా, శరీరాన్ని ఒక రథంగా ఉపమానిస్తూ అంతర్గత శక్తుల క్రమాన్ని స్పష్టంగా వివరిస్తుంది.

ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు |

బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ

ఇంద్రియాణి హయాన్ ఆహుః విషయాంస్తేషు గోచరాన్ |


అర్థం: ఆత్మనే రథంలో ప్రయాణించే యజమానిగా తెలుసుకో; శరీరం రథం; బుద్ధి సారథి; మనస్సు కళ్ళెం; ఇంద్రియాలు గుర్రాలు. ఇంద్రియాలు అనుభవించే విషయాలే వాటి గమ్యాలు. ఈ ఉపమానం ద్వారా శరీరానికి స్వతంత్ర నిర్ణయశక్తి లేదని, అది కేవలం జీవన ప్రయాణానికి ఒక సాధనమాత్రమేనని ఉపనిషత్తులు స్పష్టం చేస్తాయి.

ఇంద్రియాలు సహజంగా ప్రాపంచిక సుఖాల వైపు పరుగులు తీస్తాయి. నియంత్రణ లేని ఇంద్రియాలు రథాన్ని తప్పుదారిలోకి నెడతాయి. అందుకే మనస్సు అనే కళ్ళెం చాలా కీలకం. మనస్సు స్థిరంగా ఉంటే గుర్రాలైన ఇంద్రియాలు అదుపులో ఉంటాయి; మనస్సు చంచలమైతే, ఎంత శక్తివంతమైన రథమైనా ప్రమాదంలో పడుతుంది. అందువల్ల ఉపనిషత్తులు మనస్సు నియంత్రణనే ఆధ్యాత్మిక సాధనకు మూలంగా పేర్కొంటాయి.

మనస్సుకంటే ఉన్నతమైనది బుద్ధి. బుద్ధే సారథిగా మంచి–చెడుల మధ్య వివేకాన్ని చూపి రథాన్ని సరైన దిశలో నడిపిస్తుంది. ఈ అంతర్గత శక్తుల క్రమాన్ని భగవద్గీత (3వ అధ్యాయం, 42వ శ్లోకం) శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తూ స్పష్టంగా వివరిస్తాడు.


ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః |

మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః


అర్థం: స్థూల శరీరానికంటే ఇంద్రియాలు గొప్పవి; ఇంద్రియాలకంటే మనస్సు గొప్పది; మనస్సుకంటే బుద్ధి గొప్పది; ఆ బుద్ధికంటే కూడా పరమైనది ఆత్మ. అంటే బుద్ధి సారథిగా ఉండి మనస్సును, ఇంద్రియాలను నియంత్రించినప్పుడే జీవితం సరైన మార్గంలో సాగుతుంది.

ఈ సమస్త వ్యవస్థకు అధిపతి ఆత్మ. ఆత్మే జీవన పరమార్థాన్ని తెలిసిన శుద్ధ చైతన్యం. ఆత్మ జాగృతమైతే బుద్ధి శుద్ధమవుతుంది; బుద్ధి శుద్ధమైతే మనస్సు నియంత్రణలోకి వస్తుంది; మనస్సు నియంత్రణలో ఉన్నప్పుడు ఇంద్రియాలు క్రమశిక్షణను అలవర్చుకుంటాయి. అప్పుడు జీవన రథం బంధనాల వైపు కాక, మోక్ష మార్గం వైపు ప్రయాణిస్తుంది.

అందుకే శాస్త్రాలు మనస్సు ప్రాముఖ్యతను ఘనంగా ప్రకటించాయి.

మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః |

అర్థం: మనిషి బంధనాలకు అయినా, మోక్షానికి అయినా ప్రధాన కారణం మనస్సే. రథం గమ్యానికి చేరాలన్నా, పతనమవ్వాలన్నా కీలక పాత్ర పోషించేది మనస్సే. ఆ మనస్సును బుద్ధి ద్వారా శాసించి, ఆత్మ జాగృతితో జీవించడమే ఉపనిషత్తులు చూపిన పరమ జీవన మార్గం.

✍️. ప్రసాద్ భరద్వాజ


Meaning: The mind is the primary cause of both bondage and liberation for a person. Just as the mind plays a crucial role in whether a chariot reaches its destination or falls apart, so too does it determine a person's fate. The ultimate path to life shown by the Upanishads is to control that mind through intellect and live with spiritual awareness.

✍️. Prasad Bharadwaj


🌹🌹🌹🌹🌹


76. జీవితం యొక్క ఉన్నతమైన మూలం 76. The Supreme Source of Life


🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 76 🌹

🍀 76. జీవితం యొక్క ఉన్నతమైన మూలం 🍀

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀



🌹 Teachings of the Consciousness - 76 🌹

🍀 76. The Supreme Source of Life 🍀

Prasad Bharadhwaj

🌹🍀🌹🍀🌹🍀


ఇతరులతో కలిసి జెీవించడమే మంచి జీవితం - A good life is one lived with others


https://www.youtube.com/shorts/TRvx1UYis0k



🌹 ఇతరులతో కలిసి జెీవించడమే మంచి జీవితం - మనిషిలో అహం తగ్గి, గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


🌹🍀🌹🍀🌹🍀




🌹 A good life is one lived with others - the day a person loses his ego and pride, he will learn how to respect others. 🌹

Prasad Bharadwaj

🌹🍀🌹🍀🌹🍀

28. చైతన్య విజ్ఞాన సందేశములు - పాపాలు Teachings of the Consciousness - Sins


🌹 చైతన్య విజ్ఞాన సందేశములు Teachings of the Consciousness - 28 🌹

🍀 28. మూడు రకాల పాపాలు - దోష నివారణ - జీవన సార్థకత 🍀

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🍀🌹🍀🌹🍀




🌹 Teachings of the Consciousness - 28 🌹

🍀 28. Three Types of Sins - Prevention of Sin - Meaningfulness of Life 🍀

Prasad Bharadwaj

🌹🍀🌹🍀🌹🍀



జీవితం ప్రతి అడుగులోనూ నిర్ణయాలను తీసుకుంటుంది Life Involves Decisions At Every Step


https://www.youtube.com/shorts/jIYseqt47kQ


🌹 జీవితంలోని ప్రతి క్షణమూ నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క అడుగులోనూ రెండవ అడుగు గురించిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. 🌹

ప్రసాద్‌ భరధ్వాజ



🌹🌹🌹🌹🌹





అర్ధవంతమైన జీవితాన్ని గడపడానికి 5 సూత్రాలు (5 principles for living a meaningful life)

🌹 అర్ధవంతమైన జీవితాన్ని గడపడానికి 5 సూత్రాలు 🌹


1) ఇతరులకు సహాయపడే అవకాశాన్ని ఎప్పుడూ నాశనం చేయవద్దు.

మనం చేసే కర్మలకు ఒక అదృశ్య ఫలితం ఉంది- ఇతరులకు సహాయం అనే కర్మ ద్వారా సృష్టించబడిన పుణ్యం.. అదృష్టంగా మారుతుంది . అదృష్టం అంటే కనపడనిది - మనం కూడబెట్టుకున్న పుణ్యం అదృష్టంగా మారుతుంది.


2) మనం కఠినమైన పదాలు వాడకుండా ఉండాలి. ఇతరుల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడకండి. మన మనసు మనం వాడే పదాలతో భావనలు తయారు చేస్తుంది. మనం బుద్ధి ద్వారా మన వాక్కును శుద్ధి పరచి .. ఎప్పుడూ మంచిమాత్రమే మాట్లాడుతుంటే మన మనస్సు కూడా నిర్మలంగా ఉంటుంది.


3) మంత్రాన్ని జపించడం, ఒక్క రోజు కూడా తప్పకుండా చూసుకోండి. ఈ రోజువారీ పద్ధతులు ప్రతిరోజూ మనస్సులో పేరుకుపోయిన మలినాలను తొలగిస్తాయి. మీలో ఉత్సాహం మరియు శాంతిని కూడా నింపుతాయి.


4) సత్సంగంలో కనీసం కొంత సమయం గడపడానికి ప్రయత్నించండి. ప్రవచనాలు వినడం మంచి విషయాలు తెలుసుకోవడం ఇలాంటి విషయాలు సత్సంగం యొక్క ఆదర్శ రూపాలు. ఉత్తేజకరమైన ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడానికి కూడా సమయాన్ని వినియోగించ వచ్చు.


5) ప్రతిరోజూ, మనస్సు యొక్క స్వచ్ఛత మరియు మంచి చర్యలను చేయగల శక్తి కోసం దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థించండి.

ఆధ్యాత్మిక పురోగతి సాధించడం అత్యావశ్యకం ఇందుకోసం వినయం మరియు భక్తి ఖచ్చితంగా అవసరం. మనం వినయంగా ఉండటానికి ప్రతిజ్ఞ చేయాలి. వినయం భక్తికి తొలి మెట్టు ... విశ్వాసం భక్తికి మలి మెట్టు .



🌹 🌹 🌹 🌹 🌹


అద్భుతమైన లైఫ్ ఖచ్చితంగా ఇలా సాధ్యం

*అద్భుతమైన లైఫ్
ఖచ్చితంగా ఇలా సాధ్యం!*

ఈ క్షణం మీరెలా ఫీలవుతున్నారు? అద్భుతంగానా, డిజప్పాయింటెడ్‌గానా, బోర్‌గానా, చిరాకుగానా…? ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మన లైఫ్‌ని డిసైడ్ చేసే అతి పెద్ద ఫేక్టర్ ఇది.

బ్రెయిన్‌కి పంపించబడాల్సిన instructions చాలాసార్లు తప్పుగా హైజాక్ అవుతుంటాయి. అందుకే మనం ఫెయిల్యూర్డ్ పీపుల్‌గా మిగిలిపోతున్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే *“నెగిటివ్ ప్రోగ్రామింగ్”* చేయబడుతోంది బ్రెయిన్.

*బ్రెయిన్‌కి మంచీ చెడూకి మధ్య తేడా తెలీదు. మనం ఏది చెయ్యమంటే అది గుడ్డిగా చేస్తుంది.*

చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మీరు *“ఈ మధ్య జనాల పేర్లు మర్చిపోతున్నాం” అని రిపీటెడ్‌గా అనుకుంటూ ఉన్నారనుకోండి.. బ్రెయిన్ అలాగే ప్రోగ్రామింగ్ చెయ్యబడుతుంది.* మీరు గుర్తుంచుకోవాలని ట్రై చేసిన ప్రతీసారీ గుర్తుంచుకోవలసిన పేరుని డెఫినెట్‌గా మర్చిపోయి… మన నెగిటివ్ ప్రోగ్రామింగ్‌ని విజయవంతంగా ప్రాసెస్ చేసి పారేస్తుంది బ్రెయిన్.

మీకు హెల్త్ బాలేదని అనుకుంటూ ఉండండి…. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య వస్తుంది. *“బాలేదు బాలేదు” అనుకుంటున్న క్షణం నుండి బ్రెయిన్ వివిధ organsకి ఆదేశాలు జారీచేసి, బాడీ మెటబాలిజాన్ని తారుమారు చేసి ఏదో ఒక discomfort తలెత్తేలా చేసి తీరుతుంది.* దానికి మనం అప్పజెప్పిన task ఏదైతే ఉందో… “మన హెల్త్ బాలేదని” దాన్ని కంప్లీట్ చెయ్యడమే దాని లక్ష్యం.
————
చాలామంది ఉద్యోగాలు రావట్లేదనో, లైఫ్‌లో తాము ఎందుకూ పనికిరామనో, సంతోషం అంటే ఏమిటో తెలీదనో.. *రకరకాల మెంటల్ ట్రాప్‌లలో ఇరుక్కుపోతుంటారు.* ఇవి రిపీటెడ్ సజెషన్లని బ్రెయిన్‌కి పంపిస్తుంటాయి. దాంతో ఉద్యోగం కోసం ట్రై చేసే ప్రతీ ప్రయత్నంలోనూ ఏదో ఒక లోపం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది, సంతోషంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా చిరాకుగానే ఉండిపోతుంటాం.
————–
ప్రతీ క్షణం మన ఆలోచనల ద్వారానో, నోటితో మాటల ద్వారానో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. ఆ ఆలోచనలు ప్రోగ్రామింగ్ లాంటివి. *ఈ ప్రోగ్రామింగ్‌లో పాజిటివ్ ఏటిట్యూడ్ సాధించగలిగితే ఖచ్చితంగా ప్రతీ క్షణం చాలా అద్భుతంగా ఉంటుంది.*

అంటే *మనల్ని మనం blame చేసుకోవడం తగ్గించాలి, ఇతరులు మనల్ని చులకన చేస్తూ మాట్లాడే వాటిని బ్రెయిన్‌కి తీసుకుని కుంగిపోవడం తగ్గించాలి.* ఎంత నెగిటివ్ ఎనర్జీ మనం లోపలకు పంప్ చేస్తే అంత నెగిటివ్ output వస్తుంది. సరిగ్గా అలాగే *ఎంత పాజిటివ్ ఎనర్జీ పంప్ చేస్తే అంత పాజిటివ్ output వస్తుంది.*

ఇక్కడా మరో చిన్న ఉదాహరణ తీసుకుంటే… ఓ పబ్లిక్ గేదరింగ్‌లో అందరితో కలవలేక ఓ మూలన ఇరుక్కుంటే అందరూ సంతోషంగా ఉన్నట్లు కన్పిస్తారు. మనం ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అరమరికలు మర్చిపోయి మనుషుల మధ్య దూసుకుపోతే మన సంతోషం ముందూ, కలివిడితనం ముందూ అందరూ సరెండర్ అయిపోతారు.

సో *లైఫ్‌లో ప్రతీ క్షణం ఏ సిట్యుయేషన్‌ని ఎలా లీడ్ చేయాలన్నది మన చేతిలోనే ఉంటుంది. సో ఎలాంటి ఛాయిస్ తీసుకుంటే లైఫ్ అలా ఉంటుంది.*

*ప్రోగ్రామింగ్ ట్రాప్ అని మరొకటి ఉంటుంది. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే దానికి సంబంధించిన పాత జ్ఞాపకాలూ, అనుభవాలూ ఏమైనా మన బ్రెయిన్ డేటాబేస్‌లో ఉన్నాయేమో బ్రెయిన్ చకాచకా స్కాన్ చేస్తుంది.*

ఉదా.కు.. రోజూ మీకు టీ తాగే అలవాటు ఉంటే గతంలో ఎప్పుడో ఓరోజు సాయంత్రం టీ తాగలేదనుకుందాం. బాగా తలనొప్పి వచ్చి ఉంటుంది.

సో ఈరోజు మీరు మళ్లీ టీ తాగలేదనుకుందాం. వాస్తవానికి తలనొప్పి వచ్చే అవకాశం లేకపోయినా.. *బ్రెయిన్ ఒక కండిషన్‌కి ఓ రిజల్ట్‌ని match చేసుకుని ఆ outcome ఎలాగైనా సాధించి పెడుతుంది.*

ఇక్కడ కండిషన్ ఏంటంటే.. టీ తాగలేదు.

రిజల్ట్స్ ఏమిటంటే తలనొప్పి రావాలి.

సో తలనొప్పి వచ్చే ఛాన్స్ లేకపోయినా డేటాబేస్‌లోని పాత రికార్డుల ప్రకారం శరీరంలో బయలాజికల్ మార్పులను సృష్టించి మొత్తానికి తలనొప్పి తెప్పించేస్తుంది.
————
*సో ప్రతీ కండిషన్‌నీ, ప్రతీ అనుభవాన్నీ, ప్రతీ రోజునీ, ప్రతీ క్షణాన్నీ కొత్తగా చూస్తే, కొత్తగా రెస్పాండ్ అవుతూ పోతే బ్రెయిన్ డేటాబేస్‌లోని పాత రికార్డులూ, పనికిమాలిన చేదు జ్ఞాపకాలూ అన్నీ కొట్టుకుపోతాయి. లైఫ్ ఎప్పుడూ కొత్తగా ఉంటుంది.. ఇప్పుడే లైఫ్ మొదలెట్టినంత తాజాగా ఉంటాం.*

జీవితం అందమైనది...ఆనందంగా జీవించండి