1) ఇతరులకు సహాయపడే అవకాశాన్ని ఎప్పుడూ నాశనం చేయవద్దు.
మనం చేసే కర్మలకు ఒక అదృశ్య ఫలితం ఉంది- ఇతరులకు సహాయం అనే కర్మ ద్వారా సృష్టించబడిన పుణ్యం.. అదృష్టంగా మారుతుంది . అదృష్టం అంటే కనపడనిది - మనం కూడబెట్టుకున్న పుణ్యం అదృష్టంగా మారుతుంది.
2) మనం కఠినమైన పదాలు వాడకుండా ఉండాలి. ఇతరుల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడకండి. మన మనసు మనం వాడే పదాలతో భావనలు తయారు చేస్తుంది. మనం బుద్ధి ద్వారా మన వాక్కును శుద్ధి పరచి .. ఎప్పుడూ మంచిమాత్రమే మాట్లాడుతుంటే మన మనస్సు కూడా నిర్మలంగా ఉంటుంది.
3) మంత్రాన్ని జపించడం, ఒక్క రోజు కూడా తప్పకుండా చూసుకోండి. ఈ రోజువారీ పద్ధతులు ప్రతిరోజూ మనస్సులో పేరుకుపోయిన మలినాలను తొలగిస్తాయి. మీలో ఉత్సాహం మరియు శాంతిని కూడా నింపుతాయి.
4) సత్సంగంలో కనీసం కొంత సమయం గడపడానికి ప్రయత్నించండి. ప్రవచనాలు వినడం మంచి విషయాలు తెలుసుకోవడం ఇలాంటి విషయాలు సత్సంగం యొక్క ఆదర్శ రూపాలు. ఉత్తేజకరమైన ఆధ్యాత్మిక పుస్తకాలను చదవడానికి కూడా సమయాన్ని వినియోగించ వచ్చు.
5) ప్రతిరోజూ, మనస్సు యొక్క స్వచ్ఛత మరియు మంచి చర్యలను చేయగల శక్తి కోసం దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థించండి.
ఆధ్యాత్మిక పురోగతి సాధించడం అత్యావశ్యకం ఇందుకోసం వినయం మరియు భక్తి ఖచ్చితంగా అవసరం. మనం వినయంగా ఉండటానికి ప్రతిజ్ఞ చేయాలి. వినయం భక్తికి తొలి మెట్టు ... విశ్వాసం భక్తికి మలి మెట్టు .
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment