శివగీత - 19 / The Siva-Gita - 19

Image may contain: 3 people, people standing
🌹. శివగీత  - 19  / The Siva-Gita - 19 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము
🌻. విరజాదీక్షా లక్షణ యోగము - 3 🌻

హృతాయాం నిజ కాన్తాయాం - శత్రుణాం మమ తస్యవా,
యస్య తత్త్వ బుభు త్సాస్యా -త్స లోకే పురుషా దమః 12

తస్మాత్త స్యవదో పాయం -లంఘ యిత్వాం బుదింరణే ,
బ్రూహి మే ముని శార్దూల! - త్వత్తో నా న్యోస్తి మే గురు: 13

నా ప్రియమైన భార్య అపహరింప బడు చుండగా శత్రువు చేత  నవమానించ బడిన వాడికి తత్వ జిజ్ఞాస కలుగునో వాడు జగత్తు  నందు పురుషాధము డనబడును.
 
అందుచేత సాగరమును లంఘించి నాకు శత్రువైన రావణుని పరి 
మార్చుటకు తగిన మార్గము నాలోచించి ఆనతిమ్ము. నీవు దక్క నాకు వేరే గురువు లేడని రాముడు పలికెను.

ఏవం చే చ్చరణం యాహి - పార్వతీ పతిమ వ్యయమ్,
సచేత్ప్ర సన్నో భగవా - న్వాంఛి తార్ధం ప్రయచ్ఛతి . 14

దేవైర జేయ శ్క్రాద్యై - ర్హరి నా బ్రహ్మ ణాపివా,
సతే వధ్యః కధం వాస్యా - చ్చంక రాను గ్రహం వినా ? 15

అగస్త్యుడు చెప్పుచున్నాడు: అలా అయితే మృత్యుడు లేని మృత్యుం 
జయుడైన పరమ శివుని ఆశ్రయించుము .  ఆ పరశివ మూర్తి ప్రసన్నుడయ్యె నేని నీ అభీష్టములను తీర్చుటకు అతనొకడే సమర్ధుడు. 

లంకాధి పతియగు రావణాసురుడు ఇంద్రాది దేవతలకు బ్రహ్మ విష్ణువులకును  జయింప రాని వాడు నీ యందు నా పరమ శివుని యనుగ్రహమే లేని యెడల అతనిని నీవు జయించ లేవు; సీతను పొందుట కూడ నీకు సాధ్య పడదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 19 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️  Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 03 :
🌻 Viraja Deeksha Lakshana Yoga  - 3 🌻

The man whose wife gets abducted by an enemy and during that moment of insult caused by his enemy if 
a man gains interest in Tatwa jnanam such a man is regarded as the lowest among men.

Hence, suggest me the ways to cross the ocean and defeat my enemy viz. Ravana. 

Agastya said: In that case, take the refuge of the eternal (undecaying) lord Shiva the consort of Parvati. 

If  that paramashiva gets pleased with you, then know that he is the only one who can fulfil all your wishes. 

The king of lanka viz. Ravana is unconquerable even to Indra and other deities including brahma and Vishnu. 

Hence without the grace of Lord Shiva it's not possible for you to vanquish Ravana in battle.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 11 / Sri Gajanan Maharaj Life History - 11

Image may contain: 1 person, mountain, outdoor and nature
🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 11  /  Sri Gajanan Maharaj Life History - 11 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 3వ అధ్యాయము - 1 🌻

 శ్రీగణేశాయనమః ! ఓ సచ్చిదానందా శ్రీహరి నాయందు దయఉంచు, ఎందకంటే నువ్వు ఎప్పుడూ అల్పజీవులపైన క్రోధం చూపలేదు. నీవు దయాసాగరుడవు దుఖితులకు తల్లివంటివాడివి మరియు భక్తులకు కల్పతరువువంటి వాడవు. 

ఓరామా నీయొక్క ఈవిధమయిన ప్రతిభ మహామునులచేత చెప్పబడింది. అందుచే పురుషోత్తమా, విలంబం చేయకుండా ఈ దాసగణును కూడా ఆశీర్వదించండి.

 బనకటలాల్ ఇంటిలో శ్రీగజానన్ మహారాజు బసచేసారు. దూరప్రదేశాలనుండి కూడా ప్రజలు ఆయన దర్శనంకోసం రావడం ప్రారంభం అయింది. తేనె ఉన్నచోటుకు ఈగలు వాటిఅంతట అవేవస్తాయి. దానికి ఆహ్వనం అవసరంలేదు. 

ఇక ఒకరోజు ఏమయిందోవినండి. సూర్యోదయసమయం, తూర్పుదిశ ఎర్రగాఉంది, పక్షులు ఉదయరాగాలు తీస్తూఉండగా, చల్లటిగాలి వీస్తూఉండగా, వృద్ధులు తమ శయన కక్షలో ఉండి భగవంతుని నామస్మరణ చేస్తూఉన్న సమయంలో శ్రీమహారాజుకూడా మంచి ఆహ్లాదకరమయిన మనస్సుతో కూర్చునిఉన్నారు. 

సూర్యుడు కొద్దిగా తలఎత్తేటప్పటికి చీకటి పారిపోయింది. పతివ్రత స్త్రీలు ఆవుపేడకలిపిన నీళ్ళు ఇంటిముందర వాకిళ్ళలో చల్లుతున్నారు మరియు ఆవుదూడలు తల్లిపాలకోసం పరిగెడుతున్నాయి. 

ఇటువంటి ఆహ్లాదకరమయిన వాతావరణంలో ఒక బైరాగి శ్రీగజానన్ మహారాజు దర్శనానికి వచ్చాడు. చినిగిపోయిన వస్త్రాలలో అతను ఒకభిక్షగాడిలా కనిపిస్తున్నాడు. శ్రీమహారాజు చుట్టూకూర్చున్న ధనవంతుల నుండి ఈభిక్షగాడిలా కనిపిస్తున్న వ్యక్తి ఎలా ఆహ్వనం పొందగలడు ? 

అతని దగ్గర ఒక జీర్నావస్తలో ఉన్న ఒకచిన్న వస్త్రం, తలకి ఒకరుమాలు మరియుభుజానికి ఒకసంచి వేలాడుతూ ఉంది. అస్తవ్యస్తమయిన జుత్తు వీపువైపువాలి ఉంది. అతను శ్రీగజానన్ ముందు ఒకమూల నిశ్శబ్ధంగాకూర్చున్నాడు. 

శ్రీగజానన్ మహారాజు దర్శనానికి వస్తున్న అనేకమందిలో ఈబీదవాడిని ఎవరూ లక్ష్యపెట్టలేదు. అలాకూర్చునే శ్రీగజానన్ దగ్గరకి వెళ్ళి ఎలా పాదస్పర్శ చేయాలని ఆలోచిస్తున్నాడు. ఇతను శ్రీగజానన్ గొప్పతనంగురించి కాశీలోవిని గంజాయి శ్రీమహారాజుకు బహుమానంగా ఇద్దామని మొక్కుకుని వచ్చాడు. 

అతనిమొక్కు తీర్చుకునేందుకు మొదట ఆయనదగ్గరకు వెళ్ళడానికి అవకాశం దొరకటంలేదు, ఒకవేళ దొరికినా గంజాయి పేరువింటూనే అక్కడిప్రజలచేత తన్నులుతినవలసి వస్తుందేమో ? అసలు శ్రీగజానన్ దగ్గరకు రావడానికి ఉద్దేశం తను శ్రీమహారాజుకు మొక్కుకున్న గంజాయి ఇవ్వడమే. గంజాయి ఎందుకు అనుకున్నాడంటే తనకు స్వయంగా గంజాయిఅంటే ఇష్టం, అందువల్ల అదేగొప్ప బహుమానం అనుకున్నాడు. 

ఈవిధంగా అతను మనస్సులో అనుకుంటున్న విషయం శ్రీగజానన్ అర్ధంచేసుకుని, అక్కడచేరిన భక్తులతో ఈబైరాగిని తనదగ్గరకు తెమ్మని శ్రీమహారాజు అన్నారు. యోగులు భూత, భవిష్య మరియు వర్తమానాలు తెలిసినవారు, కనుక తను ఈ షేగాం రావడానికి కారణంకూడా శ్రీగజానన్ కు తెలిసిఉండాలి అని అనుకున్నాడు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 11 🌹
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 3 - part 1 🌻

Shri Ganeshayanamah! O Sachhidananda Shri Hari, be kind to me as You have never been harsh to the fallen ones. You are the ocean of kindness, a mother to the sufferers and a Kalpataru to Your devotees. 

O Rama, such is Your reputation as sung by the saints. So, Purushottama, please bless this Dasganu without delay. Shri Gajanan Maharaj stayed at Bankatlals house. 

People from distant places started coming to Him for Darshan. Flies gather where there is honey with no invitation. Now listen to what happened one day. Shri Gajanan Maharaj was sitting in a jubilant mood. It was morning time. 

Eastern horizon was red and birds were singing. Soft breeze was blowing and old people, sitting in their beds, were chanting Gods name. The sun, peeping up from the east, drove away the darkness. 

Pious married ladies were sprinkling water in their courtyard and calves were running to the cows. At such a pleasant morning, an ascetic came for the Darshan of Shri Gajanan Maharaj. 

With his worn out clothes, he was looking like a beggar. How can such a beggarly looking person expect good reception from the rich people sitting around Shri Gajanan Maharaj ? He had a small loincloth, a kerchief around his head and a small bag hanging from his shoulder. His dry disorderly hair was hanging on his back. 

He quietly sat in one corner before Shri Gajanan. Amongst many people coming for the Darshan of Shri Gajanan Maharaj , this poor man was totally neglected. Sitting there, he was wondering as to how to get near Shri Gajanan to touch His feet.

Having heard of the greatness of Shri Gajanan at Kashi, he had vowed to present Ganja to Shri Gajanan Maharaj . In the first place, now he was finding it difficult to get a chance to fulfil his vow, and if at all he got a chance, the utterance of the word Ganja in the temple would make him face kicks from the people around. 

But after all, his coming to Shri Gajanan was only for the fulfilment of the vow of offering Ganja to Shri Gajanan Maharaj . His vow of offering Ganja was because he liked it the most and so he thought it to be the best offering. 

While he was thinking so, Shri Gajanan understood and pointing to him asked the devotees to bring forth that ascetic to him. 

He was happy to see that Shri Gajanan knew everything that was going on in his mind. Saints know everything about the past, present and future. So he now expected Shri Gajanan to know the purpose of his coming to Shegaon. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

2-August-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 446 / Bhagavad-Gita - 446🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 234 / Sripada Srivallabha Charithamrutham - 234🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 114🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 136🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 50 / Sri Lalita Sahasranamavali - Meaning - 50 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 53 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 21 🌹
8) 🌹. శివగీత - 18 / The Shiva-Gita - 19🌹
9) 🌹. సౌందర్య లహరి - 61 / Soundarya Lahari - 61🌹
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 360 / Bhagavad-Gita - 360🌹

11) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 187🌹
12) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 63 🌹
13) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 59🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 74 🌹
15) 🌹 Seeds Of Consciousness - 137 🌹
16) 🌹. మనోశక్తి - Mind Power - 77 🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 23🌹
18) 🌹 Twelve Stanzas from the Book of Dzyan - 6 🌹
18) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 17🌹
19) 🌹. సాయి తత్వం - మానవత్వం - 60 / Sai Philosophy is Humanity - 60🌹
20) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 2 🌹
31) 🌹. శ్రీరామశర్మ ప్రజ్ఞా సూక్తములు - 2🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 446 / Bhagavad-Gita - 446 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 11వ అధ్యాయము -భక్తియోగము -01 🌴*

01. అర్జున ఉవాచ
ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే |
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమా: ||

🌷. తాత్పర్యం : 
అర్జునుడు ప్రశ్నించెను : నీ భక్తియుతసేవలో సదా యుక్తముగా నియుక్తులైనవయు మరియు అవ్యక్త నిరాకారబ్రహ్మమును ధ్యానించువారు అను ఇరువురిలో ఎవరు మిగుల పరిపూర్ణులని భావింపబడుదురు?

🌷. భాష్యము : 
సాకార, నిరాకార, విశ్వరూపముల గూర్చియు, పలురకములైన భక్తులు మరియు యోగుల గూర్చియు శ్రీకృష్ణభగవానుడు ఇంతవరకు వివరించెను. సాధారణముగా ఆధ్యాత్మికులు సాకారవాదులు మరియు నిరాకారవాదులను రెండు తరగతులుగా విభజించబడియుందురు. 

రూపము నందు అనురక్తుడైన భక్తుడు తన సంపూర్ణశక్తిని వినియోగించి శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవలో నియుక్తుడై యుండును. కాని నిరాకారవాదియైనవాడు శ్రీకృష్ణుని ప్రత్యక్షసేవలో నిలువక అవ్యక్త నిరాకరబ్రహ్మ ధ్యానమునందు నిమగ్నుడై యుండును.

పరతత్త్వానుభూతికి గల పలువిధములైన పద్ధతులలో భక్తియోగము అత్యంత ఉత్కృష్టమైనదని ఈ అధ్యాయనమున మనకు అవగతము కాగలదు. శ్రీకృష్ణభగవానుని సన్నిహిత సాహచర్యమును వాంచించినచో మనుజుడు ఆ దేవదేవుని భక్తియుతసేవను తప్పక స్వీకరింపవలసియున్నది.

ఈ భక్తియోగము అత్యంత ప్రత్యక్షమార్గమే గాక దేవదేవుని సాహచర్యమును పొందుటకు సులభతరమైన విధానమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 446 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 12 - Devotional Service - 01 🌴*

01. arjuna uvāca
evaṁ satata-yuktā ye
bhaktās tvāṁ paryupāsate
ye cāpy akṣaram avyaktaṁ
teṣāṁ ke yoga-vittamāḥ

🌷 Translation : 
Arjuna inquired: Which are considered to be more perfect, those who are always properly engaged in Your devotional service or those who worship the impersonal Brahman, the unmanifested?

🌹 Purport :
Kṛṣṇa has now explained about the personal, the impersonal and the universal and has described all kinds of devotees and yogīs. Generally, the transcendentalists can be divided into two classes. One is the impersonalist, and the other is the personalist.

 The personalist devotee engages himself with all energy in the service of the Supreme Lord. The impersonalist also engages himself, not directly in the service of Kṛṣṇa but in meditation on the impersonal Brahman, the unmanifested.

We find in this chapter that of the different processes for realization of the Absolute Truth, bhakti-yoga, devotional service, is the highest. If one at all desires to have the association of the Supreme Personality of Godhead, then he must take to devotional service.

Those who worship the Supreme Lord directly by devotional service are called personalists. Those who engage themselves in meditation on the impersonal Brahman are called impersonalists.

 Arjuna is here questioning which position is better. There are different ways to realize the Absolute Truth, but Kṛṣṇa indicates in this chapter that bhakti-yoga, or devotional service to Him, is the highest of all. It is the most direct, and it is the easiest means for association with the Godhead.

In the Second Chapter of Bhagavad-gītā, the Supreme Lord explained that a living entity is not the material body; he is a spiritual spark. 

And the Absolute Truth is the spiritual whole. In the Seventh Chapter He spoke of the living entity as being part and parcel of the supreme whole and recommended that he transfer his attention fully to the whole. 

So in practically every chapter the conclusion has been that one should be attached to the personal form of Kṛṣṇa, for that is the highest spiritual realization.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 234 / Sripada Srivallabha Charithamrutham - 234 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 45
*🌻. హనుమంతుల వారిని భూమి మీద అవతరించమని ఆదేశించడం 🌻*

శ్రీ భాస్కర పండితులు తిరిగి కొనసాగించారు : శ్రీపాదులవారు మహాపుణ్యక్షేత్రం, సిద్ధులకు నెలవు అయిన కాశీలో గంగా స్నానానికి ప్రతి రోజూ యోగ మార్గంలో వస్తారు. తమ తరువాతి నరసింగ సరస్వతి అవతారంలో అక్కడే సన్న్యాస దీక్షను స్వీకరిస్తారు. 

గృహస్థులకు క్రియా యోగాన్ని బోధించడానికి శ్యామాచరణుడు ఇక్కడ జన్మిస్తాడు.

 హనుమంతుడిని అతని దగ్గరకు పంపి క్రియాయోగ దీక్షను ఇప్పిస్తానని అక్కడ ఉన్న ఋషులతో చెప్పారు. బదరికావనంలో నరనారాయణ గుహలో అనేకమందికి క్రియాయోగ దీక్షను ఇచ్చి... ఊర్వశీ కుండంలో, ఋషి గంగలో స్నానంచేసి... సర్వేశ్వరానంద యోగిని ఆశీర్వదించి... నేపాళ దేశంలో హనుమంతుల వారికి సీతా, రామ, లక్ష్మణ, భరత , శతృఘ్న సమేతంగా దర్శనాన్ని ఇచ్చి... అతడు అగ్ని బీజమైన 'రాం' మంత్రజపంతో కాలాత్మకుడు, కాలాతీతుడు అయినాడని... “శాయీ" అనే నామంతో అవతారాన్ని ధరించమనీ
తెలిపారు.

హనుమ శివాంశ సంభూతుడు అయినా రామభక్తుడు. అరబ్బీ భాషలో ' అల్ ' అంటే శక్తి అనీ .... అహ్ ' అంటే శక్తిని ధరించినవాడు ' శాక్త' అని అర్థం. కనుక అల్లా అంటే శివశక్తులని అర్ధం. అందువలన మ్లేచ్ఛులకు ఆమోదయోగ్యమైన ' అల్లా ' నామాన్ని జపిస్తూ, హనుమ సాయి నామంతో శ్రీపాదులను శివశక్తిగా ఆరాధిస్తాడు. ' అల్లా మాలిక్ అంటే అల్లాయే యజమాని అని అర్ధం. తన యొక్క భరద్వాజ గోత్రంలోనే హనుమ అవతరిస్తాడనీ... స్వామి సమర్ధులుగా తాము దేహం విడిచే సమయంలో, సాయి తన అవతారం అని స్పష్టంగా తెలుపుతాననీ... కాలాతీతుడు అయినందువల్ల సాయుజ్యాన్నీ,
' నాధ' శబ్దాన్ని ఇచ్చి, 'సాయినాధుడి' గా పిలవబడతాడు అనీ... ఆ రోజు దత్త జయంతిగా నిర్ణయించి, హనుమలోని చైతన్యాన్ని దత్త చైతన్యంగా మార్చేశారు.

అతనికి మేచ్ఛ గురువుగా తనలో లీనమైన "మహబూబ్ సుభానీ" అనే జ్ఞాని వారిష్ ఆలీషా” గా జన్మిస్తాడనీ... శ్యామాచరణుడు క్రియా యోగాన్ని బోధిస్తాడు అనీ... వెంకూసాగా
పిలవబడే గోపాలరావు వైష్ణవ గురువు అవుతాడనీ తెలిపారు. జానకీమాత ఇచ్చిన మాణిక్యహారాన్ని హనుమ పారవేస్తే... దానిని తాము భద్రం చేసి ఉంచామనీ... ఆ మాణిక్య హారమే గురు స్వరూపమై మాణిక్య ప్రభువు అని పిలవబడతాడనీ శ్రీపాదులవారు తెలిపారు.

ఇక్కడ నుండి ద్రోణగిరి అనే సంజీవని పర్వతం దగ్గరకు, అక్కడ నుండి మహా
యోగులకు కూడా దర్శించడానికి వీలుకాని, కల్కి ప్రభువు జన్మించే శంబల గ్రామానికి వెళ్ళి, అక్కడ ఉన్న స్ఫటిక పర్వతంలోని శుద్ధ జలాన్ని త్రాగినందువల్ల 16 సంవత్సరాల వయస్సులోనే వారి శరీరం నిలిచిపోయింది.

తరువాత గోకర్ణ క్షేత్రంలో మూడు సంవత్సరాలు అనేక దివ్య లీలలను చూపించి... శ్రీశైలానికి
వెళ్ళి... యోగ మార్గంలో సశరీరంతో సూర్యమండలానికీ, ధృవ నక్షత్రానికీ, సప్తర్షి మండలానికీ, ఆర్ద్ర నక్షత్రానికి వెళ్ళి... తిరిగి శ్రీశైలానికి 4 నెలల తరువాత వచ్చారు. 

ఆర్థా నక్షత్రం నుంచి దివ్యజ్ఞాన యోగం అనే నూతన యోగాన్ని, శ్రీశైలంలోని సిద్ధ పురుషులకు బోధించారు. తరువాత కురుంగడ్డ అనే దివ్య స్థలాన్ని చేరారు అని భాస్కర పండితులు శంకరభట్టు, ధర్మగుప్తులవారికి శ్రీపాదులవారు పీఠికాపురాన్ని విడచి, కురువపురాన్ని చేరేవరకూ జరిగింది వివరించారు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sripada Srivallabha Charithamrutham - 234 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 25
*🌻 The birth of Vashista and Agastya 🌻*

When that ‘poorna kumbham’ was kept upside down, two great munis manifested. The first one manifested with white glow. He is Vashista. The second one Agastya was born with blue glow. Both were born with the amsas of Gods Mithra and Varuna.

 One should do Rudrabhishekam eleven times with the consecrated water in poorna kumbham. Then Parameswara who is the form of Ekadasa Rudras will give the power of merit of Ekadasi thithi.  

One should learn that Siva and Kesava are not different as there is a close relation between Ekadasa Rudras and the Ekadasi thithi related Vaishnavas.  

If Ekadasa Rudra Abhishekam is done with Namakam and Chamakam, the detrimental effects like premature deaths will be destroyed. The supporting Murthi of somalatha is Moon.  

He will shower the basic power for giving life again. This chandrakala will be glowing in Yogi’s head in the middle of forehead above the eye brows and infront of sahasraram.  

*🌻 Description of different forms of Eswar 🌻*

For this reason, it is said that Siva has ‘chandrakala’ on the head. In the Somanath kshetram in Gujarath, the Siva lingam is made of Chandrakantha Sila.  

On its head, there is a ‘sphatika’ (crystal) lingam in which a white moon crescent will be glowing. The shastras say that without getting Rudratwam himself, one should not do Rudra abhishekam.  

Time (kaalam) engulfs everything. So, the person doing abhishekam should become a ‘kaalaatmaka’ and invoke ‘yajna swaroopa’ into his body with Mahanyasam and then do Rudra abhishekam. In the method of Mahanyasa Rudra abhishekam, as described by Bodhayana maharshi, there are five murthis of Siva.  

They are Tatpurusha, Aghora, Sadyojatha, Vamadeva and Eesana. The Tatpurusha murthi will be in the form of ‘vidyut varna’ like pralaya agni. Aghora murthi will be in ‘blue colour i.e. black honeybee blue colour. Sadyojatha murthi is in white colour like moon. Vamadeva murthi is in Goura varna. Eesana murthi is Tejo murthi.  

So He is in Akasa varna’ Rudras are said to be in thousands of thousands in number. That means, the Gods said to be Rudra Gurus are there, three for each ‘gana’.  

Thus for 11 Rudra murthis, there are 33 crore of Rudra ganas. They surround the earth, sky, cosmos, water, air, sareera (body), prana and mind. That is what Veda says.

People who worship and remember Sripada will get the grace of 33 crore Rudra ganas. The Prabhu (lord) for the 33 crore Rudra ganas is Ganapathi. Sripada Srivallabha was born on Ganesh Chaturthi day to indicate the Ganapathi tatwam in Him. So people who remember Sripada will be able to get the grace of 33 crore Rudra ganas. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 114 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 

*🌻. జ్ఞానులు- దైత్యులు - 2 🌻*

 ఇక రెండవ తరగతి వారి దృష్టిలో అంతర్యామికున్న ప్రాధాన్యము మిగిలిన అంశములకు‌ లేదు. అంతర్యామి ఈ రూపముతో ఉండవలెనని వారు భగవంతుని ఆజ్ఞాపింపరు. 

ఈ వరములు ఇమ్మని ఇరుకున‌ పెట్టరు. ఇంత తపస్సు, యోగ సాధన చేసితిని అని దేవునకు రశీదు చూపించి దబాయించరు. దానికి ఫలితముగా సుఖమను మాటకు నిజమైన అర్థమును వీరు అనుభవించుచుందురు. వీరిని జ్ఞానులు, ముముక్షువులు అని పెద్దలు వ్యవహరింతురు. 

వేదము, శాస్ర్తము, ప్రకృతి శక్తుల వినియోగము, ఆచారము, ధర్మము, విధి నిషేధములు దైత్యులకును, మోక్ష జనులకును గూడా ఉన్నవి. 

దైత్యులలో తమ శాస్ర్తాదులకు తామే ప్రమాణము. సుఖము అను మాటకు తాము అనుకున్న అర్థమే తమకు ప్రమాణము. తత్ఫలితముగా సుఖమునకై శ్రమపడుట, సుఖము సాధింప యత్నించుచు కష్ట నష్టముల పాలగుట జరుగుచున్నది. 

వీరి జీవితమునందు స్వేచ్ఛ ఉండదు. ఇతరుల అభిప్రాయములను అనుసరించి పట్టుదలతోనో, అంగీకారముతోనో బ్రదకవలసి యుండును. 

తమ జీవితానుభవమునకు ఇతరులే నాయకులు. తాము ఇతరుల జీవితములకు, పద్ధతులకు నాయకులు. అనగా ఇతరుల‌ మంచి చెడ్డలను గూర్చి తమకు గట్టి అభిప్రాయములు ఉండును. నిర్భీతి ఇట్టి వారి జీవితమునకు ఉండదు...
....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 136 🌹*
*🌴 Crises and Development - 4 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

*🌻 Learning through Crises - 1 🌻*

In everything that happens, there is a hidden purpose of evolution. In every problem, there is a gift that reveals itself as soon as the problem is addressed and solved. If we refuse and repress the problem, it becomes bigger or comes back after a while, and the gift is withheld from us. 

The gift is a development of consciousness. He who learns moves forward, i.e. his consciousness expands. Every step of development is preceded by a corresponding crisis. 

If there is no crisis, the soul normally sleeps in the personality. In deep crises we can develop faster; we grow beyond ourselves to overcome the crisis. In such moments we can better understand our being and an initiation can take place.

The touch of the energy of the Master also causes crises in the beginning. Things like financial crises or strokes of fate happen to cleanse us of our past karma. Through the crises, the Master trains us. 

If we worry, we interrupt the thought of him and we drown in our emotions. The Masters can only help us if we ask them to do so. They respect free will and do not impose their help on us. 

So they wait and wish all the best. Especially in times of crisis we should stay in deep connection with the Master consciousness, keep a constant vibration and not stop with our exercises and prayers.

If we are affected by conflicts, there is a corresponding energy in us. If we do not have a corresponding theme, we will not be affected.

🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K.P. Kumar: Uranus. Notes from seminars.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 50 / Sri Lalita Sahasranamavali - Meaning - 50 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 93

435. కుశలా - 
క్షేమము, కౌశల్యమును గలది.

436. కోమలాకారా - 
సుకుమారమైన లేదా మృదులమైన స్వరూపము గలది.

437. కురుకుల్లా -

438. కులేశ్వరీ - 
కులమార్గమునకు ఈశ్వరి.

439. కులకుండలయా - కులకుండమును నిలయముగా గలది.

440. కులమార్గతత్పరసేవితా -
 కౌలమార్గమును అనుసరించువారిచే సేవింపబడునది.

🌻. శ్లోకం 94

441. కుమార గణనాథాంబా - కుమారస్వామికి, గణపతికి తల్లి అయినది.

442. తుష్టిః - 
తృప్తి, సంతోషముల రూపము.

443. పుష్టిః - 
సమృద్ధి స్వరూపము.

444. మతిః - బుద్ధి

445. ధృతిః - ధైర్యము.

446. శాంతిః - 
తొట్రుపాటు లేని నిలకడతనము గలది.

447. స్వస్తిమతీ - 
మంచిగా లేదా ఉండవలసిన విధానములో ఉండు మనోలక్షణము గలది.

448. కాంతిః - కోరదగినది.

449. నందినీ = ఆనందిని అంటే ఆనందమును అనుభవించునది.

450. విఘ్ననాశినీ - 
విఘ్నములను నాశము చేయునది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 50 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 50 🌻*

435 ) Champeya kusuma priya -   
She who likes the flowers of Champaka tree

436 ) Kusala -   
She who is intelligent

437 ) Komalakara -  
 She who has soft beautiful form

438 ) Kuru kulla -   
She who is of the form of Kuru kulla devi who lives in Vimarsa

439 ) Kuleshwari -   
She who is the goddess for the clan

440 ) Kula kundalaya -  
 She who lives in kula kunda or She who is the power called Kundalani

441 ) Kaula marga that para sevitha -   
She who is being worshipped by people who follow Kaula matha

442 ) Kumara gana nadambha -   
She who is mother to Ganesha and Subrahmanya

443 ) Thushti -   
She who is personification of happiness

444 ) Pushti -   
She who is personification of health

445 ) Mathi -   
She who is personification of wisdom

446 ) Dhrithi -   
She who is personification of courage

447 ) Santhi -   
She who is peaceful

448 ) Swasthimathi -   
She who always keeps well

449 ) Kanthi -   
She who is personification of light

450 ) Nandhini -   
She who is personification of Nadhini daughter of Kama denu

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 53 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 31

*🌻 31. రాజగృహ భోజనాదిషు తథైవ దృష్టత్వాత్‌ - 1 🌻*

            పరాభక్తి అనేది స్వయంగా ఫలరూపం అనడానికి (1) రాజు (2) గృహం (3) భోజనం అనే విషయాలను ఉదాహరణగా చెప్తున్నారు. 

(1) ఒక రాజుకు కొడుకు పుట్టాడు. ఎవరో దొంగలు ఆ శిశువును అపహరించు కొని వెళ్ళగా, ఒకడు రక్షించి సన్యాసి వద్దకు చేర్చాడు. అక్కడ ఆ శిశువు సన్యాసి బిడ్డగా పెరిగి, పెద్దవాడయ్యాడు. ఒకనాడు ఇతడికి తాను రాజకుమారుడని తెలిసి, రాజువద్దకు చేరి సుఖించాడు.

     తాను రాజకుమారుడననే జ్ఞానం కలుగగానే అతడు తెలుసు కున్నప్పటి నుండియే రాజకుమారుడా ? అంతకు ముందు రాజకుమారుడు కాదా ? ఏది సత్యం ? అజ్ఞాన కారణంగా కొంతకాలం నేను సన్యాసి కుమారుడను అని అనుకున్నంత మాత్రాన అతడు నిజానికి సన్యాసి బిడ్డ కాదు కదా ! అతడు పుట్టుకతోనే రాజకుమారుడనేదే సత్యం కదా ! అయితే ఆ సత్యం అతని భ్రాంతి వదలగానే తెలిసింది. 

తెలియడంలో జాప్యమే గాని, సన్యాసి బిడ్డ రాజకుమారుడుగా మారలేదు కదా ! రాజకుమారుడనేది కొంతకాలం మరుగున పడ్డది. అతడికి తాను రాజకుమారుడనే సత్యం తెలిసినా తెలియకపోయినా అతడు రాజ కుమారుడేగా! సన్యాసికి పుట్టలేదు కదా !

    అలాగే తాను భగవంతుడు అనేది సత్యం. భక్తుడనేది మరుపు. తిరిగి పరాభక్తి సిద్ధించగానే తాను మునుపటి నుంచే భగవంతుడనేది సత్యంగా గోచరించింది. దీనినే ‘‘అహంబ్రహ్మాస్మి’’ అనే జ్ఞానం అంటున్నాం. తాను భగవంతుడు కాదనుకొనేది అజ్ఞానం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 21 🌹*
✍️ Sri GS Swami ji Datta Vaakya
📚. Prasad Bharadwaj

*🌷 Praying the Guru, You are Praying all three primary deities Siva, Vishnu, and Brahma. Dattatreya Having 3 head is Symbol for that. 🌷*
  
 We have learned that when you have a Guru, you are not permitted to receive initiation, advice, spiritual images or talismans from other gurus. This is as per the direct counsel given by Lord Dattatreya to Lord Indra on the day he appeared before him (when Indra was hiding inside the lotus stalk). He had given this same instruction to King Kartaveeryarjuna also.
 
Some people express the doubt whether this tradition of following Guru applies more to the followers of Siva or to the followers of Vishnu. 

The answer to this question has already been given during our earlier discussion. But does it really matter? In the early part of the Guru Gita, because it says, “Sivaya Gurave Namaha” some persons wonder whether this teaching belongs primarily to the followers of Siva. But in verse 141 it says, “Sachchidananda roopaya Krishnaya klesaharine 
namo vedanta vedyaya gurave buddhisakshine.”
 
It is believed therefore that this instruction also belongs to the worshipers of Sakti because this came as an answer to the question posed by the Mother Goddess to Siva. However, one may question why in this scripture, in several instances Siva is referred to as Guru. 

The primal reason is that Siva is giving this discourse to His consort Parvati. This clarifies that for a woman, the husband is the foremost guru. 

When the husband is not eligible to be the guru to his wife, then both the husband and the wife should together seek initiation from the same Guru. Even then, Guru gives the initiation to the wife only through the husband, only after inquiring about the identity and whereabouts of the husband. Guru always honors that hierarchy. This is the tradition. Grace flows to the wife from Guru only through the husband. To make this point clear, it is shown that Siva, the husband of Parvati, is her true Guru.
 
There is another reason. Guru is easily pleased and grants boons quicker than any other deity. Siva, amongst all gods is the most easily pleased. He grants favors speedily. That is why in this scripture, Siva is presented as Guru. What is wrong in that?
 
The undivided Consciousness, by the turmoil caused by Maya (illusion) became split into two, as Nature and Soul (Prakriti and Purusha). Nature in turn divided itself into the three Gunas, Satva, Rajas, and Tamas. Consequently, Creation with name and form came into existence.

 In this Creation, Brahma, Vishnu, Siva, Devi and other deities came into being for performing the functions of Creation, Preservation, Destruction, and so on. 

Brahma began creating the Universe using Rajo Guna, the creative force. But he found to his displeasure that the people who were being created were slipping gradually into Tamo Guna, ignorance. 

Out of deep concern, to rescue his children from their plight and to uplift them, Brahma decided that an antidote for this had to be invented. He gave the issue some serious thought. The antidote had to raise their consciousness above and beyond the three Gunas. 

He dedicated his attention towards this mission. He at once stimulated the intellects of his mind-born son Atri, and his shadow-born son Prajapati. This was done through contemplation alone. Let us see what the result of his effort was.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 19 / The Siva-Gita - 19 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము
*🌻. విరజాదీక్షా లక్షణ యోగము - 3 🌻*

హృతాయాం నిజ కాన్తాయాం - శత్రుణాం మమ తస్యవా,
యస్య తత్త్వ బుభు త్సాస్యా -త్స లోకే పురుషా దమః 12

తస్మాత్త స్యవదో పాయం -లంఘ యిత్వాం బుదింరణే ,
బ్రూహి మే ముని శార్దూల! - త్వత్తో నా న్యోస్తి మే గురు: 13

నా ప్రియమైన భార్య అపహరింప బడు చుండగా శత్రువు చేత నవమానించ బడిన వాడికి తత్వ జిజ్ఞాస కలుగునో వాడు జగత్తు నందు పురుషాధము డనబడును.
 
అందుచేత సాగరమును లంఘించి నాకు శత్రువైన రావణుని పరి 
మార్చుటకు తగిన మార్గము నాలోచించి ఆనతిమ్ము. నీవు దక్క నాకు వేరే గురువు లేడని రాముడు పలికెను.

ఏవం చే చ్చరణం యాహి - పార్వతీ పతిమ వ్యయమ్,
సచేత్ప్ర సన్నో భగవా - న్వాంఛి తార్ధం ప్రయచ్ఛతి . 14

దేవైర జేయ శ్క్రాద్యై - ర్హరి నా బ్రహ్మ ణాపివా,
సతే వధ్యః కధం వాస్యా - చ్చంక రాను గ్రహం వినా ? 15

అగస్త్యుడు చెప్పుచున్నాడు: అలా అయితే మృత్యుడు లేని మృత్యుం 
జయుడైన పరమ శివుని ఆశ్రయించుము . ఆ పరశివ మూర్తి ప్రసన్నుడయ్యె నేని నీ అభీష్టములను తీర్చుటకు అతనొకడే సమర్ధుడు. 

లంకాధి పతియగు రావణాసురుడు ఇంద్రాది దేవతలకు బ్రహ్మ విష్ణువులకును జయింప రాని వాడు నీ యందు నా పరమ శివుని యనుగ్రహమే లేని యెడల అతనిని నీవు జయించ లేవు; సీతను పొందుట కూడ నీకు సాధ్య పడదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 19 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 03 : 
*🌻 Viraja Deeksha Lakshana Yoga - 3 🌻*

The man whose wife gets abducted by an enemy and during that moment of insult caused by his enemy if 
a man gains interest in Tatwa jnanam such a man is regarded as the lowest among men.

 Hence, suggest me the ways to cross the ocean and defeat my enemy viz. Ravana. 

Agastya said: In that case, take the refuge of the eternal (undecaying) lord Shiva the consort of Parvati. 

If that paramashiva gets pleased with you, then know that he is the only one who can fulfil all your wishes. 

The king of lanka viz. Ravana is unconquerable even to Indra and other deities including brahma and Vishnu. 

Hence without the grace of Lord Shiva it's not possible for you to vanquish Ravana in battle.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 11 / Sri Gajanan Maharaj Life History - 11 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. 3వ అధ్యాయము - 1 🌻*

 శ్రీగణేశాయనమః ! ఓ సచ్చిదానందా శ్రీహరి నాయందు దయఉంచు, ఎందకంటే నువ్వు ఎప్పుడూ అల్పజీవులపైన క్రోధం చూపలేదు. నీవు దయాసాగరుడవు దుఖితులకు తల్లివంటివాడివి మరియు భక్తులకు కల్పతరువువంటి వాడవు. 

ఓరామా నీయొక్క ఈవిధమయిన ప్రతిభ మహామునులచేత చెప్పబడింది. అందుచే పురుషోత్తమా, విలంబం చేయకుండా ఈ దాసగణును కూడా ఆశీర్వదించండి.

 బనకటలాల్ ఇంటిలో శ్రీగజానన్ మహారాజు బసచేసారు. దూరప్రదేశాలనుండి కూడా ప్రజలు ఆయన దర్శనంకోసం రావడం ప్రారంభం అయింది. తేనె ఉన్నచోటుకు ఈగలు వాటిఅంతట అవేవస్తాయి. దానికి ఆహ్వనం అవసరంలేదు. 

ఇక ఒకరోజు ఏమయిందోవినండి. సూర్యోదయసమయం, తూర్పుదిశ ఎర్రగాఉంది, పక్షులు ఉదయరాగాలు తీస్తూఉండగా, చల్లటిగాలి వీస్తూఉండగా, వృద్ధులు తమ శయన కక్షలో ఉండి భగవంతుని నామస్మరణ చేస్తూఉన్న సమయంలో శ్రీమహారాజుకూడా మంచి ఆహ్లాదకరమయిన మనస్సుతో కూర్చునిఉన్నారు. 

సూర్యుడు కొద్దిగా తలఎత్తేటప్పటికి చీకటి పారిపోయింది. పతివ్రత స్త్రీలు ఆవుపేడకలిపిన నీళ్ళు ఇంటిముందర వాకిళ్ళలో చల్లుతున్నారు మరియు ఆవుదూడలు తల్లిపాలకోసం పరిగెడుతున్నాయి. 

ఇటువంటి ఆహ్లాదకరమయిన వాతావరణంలో ఒక బైరాగి శ్రీగజానన్ మహారాజు దర్శనానికి వచ్చాడు. చినిగిపోయిన వస్త్రాలలో అతను ఒకభిక్షగాడిలా కనిపిస్తున్నాడు. శ్రీమహారాజు చుట్టూకూర్చున్న ధనవంతుల నుండి ఈభిక్షగాడిలా కనిపిస్తున్న వ్యక్తి ఎలా ఆహ్వనం పొందగలడు ? 

అతని దగ్గర ఒక జీర్నావస్తలో ఉన్న ఒకచిన్న వస్త్రం, తలకి ఒకరుమాలు మరియుభుజానికి ఒకసంచి వేలాడుతూ ఉంది. అస్తవ్యస్తమయిన జుత్తు వీపువైపువాలి ఉంది. అతను శ్రీగజానన్ ముందు ఒకమూల నిశ్శబ్ధంగాకూర్చున్నాడు. 

శ్రీగజానన్ మహారాజు దర్శనానికి వస్తున్న అనేకమందిలో ఈబీదవాడిని ఎవరూ లక్ష్యపెట్టలేదు. అలాకూర్చునే శ్రీగజానన్ దగ్గరకి వెళ్ళి ఎలా పాదస్పర్శ చేయాలని ఆలోచిస్తున్నాడు. ఇతను శ్రీగజానన్ గొప్పతనంగురించి కాశీలోవిని గంజాయి శ్రీమహారాజుకు బహుమానంగా ఇద్దామని మొక్కుకుని వచ్చాడు. 

అతనిమొక్కు తీర్చుకునేందుకు మొదట ఆయనదగ్గరకు వెళ్ళడానికి అవకాశం దొరకటంలేదు, ఒకవేళ దొరికినా గంజాయి పేరువింటూనే అక్కడిప్రజలచేత తన్నులుతినవలసి వస్తుందేమో ? అసలు శ్రీగజానన్ దగ్గరకు రావడానికి ఉద్దేశం తను శ్రీమహారాజుకు మొక్కుకున్న గంజాయి ఇవ్వడమే. గంజాయి ఎందుకు అనుకున్నాడంటే తనకు స్వయంగా గంజాయిఅంటే ఇష్టం, అందువల్ల అదేగొప్ప బహుమానం అనుకున్నాడు. 

ఈవిధంగా అతను మనస్సులో అనుకుంటున్న విషయం శ్రీగజానన్ అర్ధంచేసుకుని, అక్కడచేరిన భక్తులతో ఈబైరాగిని తనదగ్గరకు తెమ్మని శ్రీమహారాజు అన్నారు. యోగులు భూత, భవిష్య మరియు వర్తమానాలు తెలిసినవారు, కనుక తను ఈ షేగాం రావడానికి కారణంకూడా శ్రీగజానన్ కు తెలిసిఉండాలి అని అనుకున్నాడు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 11 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 3 - part 1 🌻*

Shri Ganeshayanamah! O Sachhidananda Shri Hari, be kind to me as You have never been harsh to the fallen ones. You are the ocean of kindness, a mother to the sufferers and a Kalpataru to Your devotees. 

O Rama, such is Your reputation as sung by the saints. So, Purushottama, please bless this Dasganu without delay. Shri Gajanan Maharaj stayed at Bankatlals house. 

People from distant places started coming to Him for Darshan. Flies gather where there is honey with no invitation. Now listen to what happened one day. Shri Gajanan Maharaj was sitting in a jubilant mood. It was morning time. 

Eastern horizon was red and birds were singing. Soft breeze was blowing and old people, sitting in their beds, were chanting Gods name. The sun, peeping up from the east, drove away the darkness. 

Pious married ladies were sprinkling water in their courtyard and calves were running to the cows. At such a pleasant morning, an ascetic came for the Darshan of Shri Gajanan Maharaj. 

With his worn out clothes, he was looking like a beggar. How can such a beggarly looking person expect good reception from the rich people sitting around Shri Gajanan Maharaj ? He had a small loincloth, a kerchief around his head and a small bag hanging from his shoulder. His dry disorderly hair was hanging on his back. 

He quietly sat in one corner before Shri Gajanan. Amongst many people coming for the Darshan of Shri Gajanan Maharaj , this poor man was totally neglected. Sitting there, he was wondering as to how to get near Shri Gajanan to touch His feet.

Having heard of the greatness of Shri Gajanan at Kashi, he had vowed to present Ganja to Shri Gajanan Maharaj . In the first place, now he was finding it difficult to get a chance to fulfil his vow, and if at all he got a chance, the utterance of the word Ganja in the temple would make him face kicks from the people around. 

But after all, his coming to Shri Gajanan was only for the fulfilment of the vow of offering Ganja to Shri Gajanan Maharaj . His vow of offering Ganja was because he liked it the most and so he thought it to be the best offering. 

While he was thinking so, Shri Gajanan understood and pointing to him asked the devotees to bring forth that ascetic to him. 

He was happy to see that Shri Gajanan knew everything that was going on in his mind. Saints know everything about the past, present and future. So he now expected Shri Gajanan to know the purpose of his coming to Shegaon. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 61 / Soundarya Lahari - 61 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

61 వ శ్లోకము

*🌴. అమ్మ దీవెనలతో మనో నియంత్రణ, కోరికలు తీరుట కొరకు, కుండలినీ జాగృతి 🌴*

శ్లో: 61. అసౌ నాసా వంశ - స్తుహినగిరి వంశధ్వజపటి 
త్వదీయో నేదీయః ఫలతు ఫలమస్మాక ముచితమ్ l 
వహత్యంతర్ముక్తాః శ్శిశిరకర నిశ్వాస గళితం 
సమృద్ధ్యా య స్తాసాం బహిరపి చ ముక్తామణిధరః ll 
 
🌻. తాత్పర్యం : 
అమ్మా! తుహినగిరి రాజ పుత్రీ అయిన ఓ పార్వతీ దేవీ నీ యొక్క వెదురు వలె ఉన్న నాసా దండము మాకు కోరిన కోరికలను తీర్చుచున్నది,ఆ నాసా దండము లోపల మణులను ధరించు చున్నది.ఆ మణుల నిండు దనముచే చంద్రునిదగు ఎడమ ముక్కు ద్వారా వచ్చు గాలి వలన బయట కూడా ముక్తా మణిని ధరించెను కదా ! 

🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 12000 సార్లు ప్రతి రోజు 8 రోజులు జపం చేస్తూ, కొబ్బరికాయ, పళ్లు, తేనె నివేదించినచో అమ్మ దీవెనల ద్వారా సకల కోరికలు నెరవేరును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 SOUNDARYA LAHARI - 61 🌹*
📚. Prasad Bharadwaj 

SLOKA - 61 

*🌴 Victory over Mind and Getting of Wealth and activates kundalini 🌴*

61. Asau naasa-vamsas tuhina-girivamsa-dhvajapati Thvadhiyo nedhiyah phalatu phalam asmakam uchitam; Vahathy anthar muktah sisira-kara-nisvasa galitham Samruddhya yat tasam bahir api cha mukta-mani-dharah 
 
 🌻 Translation :
Oh goddess, who is the flag of the clan of Himalayas, let your nose which is like a thin bamboo, give us the blessings which are apt and near feel mother that you are wearing a rare pearl, brought out by your breath, through your left nostril, for your nose is a storehouse, of rarest pearls divine.

Chanting procedure and Nivedyam (offerings to the Lord) : 
If one chants this verse 12000 times a day for 8 days, offering pongal, honey, fruits and coconut as prasadam, it is believed that they will be achieve success in all efforts and blessed with all wealth and Activates kundalini.

🌻 BENEFICIAL RESULTS: 
Success in all endeavours of trade, speculation etc., power to fascinate man and conquer the mind. 
 
🌻 Literal Results: 
Eradicates the tendencies of previous births and activates kundalini.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

 🌹. శ్రీమద్భగవద్గీత - 360 / Bhagavad-Gita - 360 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 08 🌴

08. అహం సర్వస్య ప్రభవో మత్త: సర్వం ప్రవర్తతే |
ఇతి మత్వా భజన్తే మాం బుధా భావసమన్వితా: ||

🌷. తాత్పర్యం :
నేనే సర్వములైన ఆధ్యాత్మిక, భౌతికజగములకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపుర్వకముగా అర్చింతురు.

🌷. భాష్యము : 
వేదములను సంపూర్ణముగా అధ్యయనము చేసినవాడును మరియు శ్రీచైతన్యమహాప్రభువు వంటి ప్రామాణికుల ద్వారా జ్ఞానమును పొంది, ఆ ఉపదేశములను ఏ విధముగా ఆచరణలో పెట్టవలెనో ఎరిగినవాడు అగు పండితుడు శ్రీకృష్ణుడే భౌతిక, ఆధ్యాత్మికజగత్తుల యందలి సర్వమునకు మూలమని అవగాహన చేసికొనగలడు. 

ఈ విషయమును పూర్ణముగా నెరిగియుండుటచే అతడు అ భగవానుని భక్తియుతసేవలో స్థిరముగా నుమగ్నుడగును. అర్థరహిత వ్యాఖ్యానములచే గాని, మూర్ఖులచేగాని ప్రభావితుడు గాక ఆ భక్తుడు తన భక్తిమార్గము నుండి వైదొలగకుండును. 

శ్రీకృష్ణుడే బ్రహ్మ, శివుడు మరియు ఇతర దేవతలందరికీ మూలమని వేదవాజ్మయము ఆంగీకరించుచున్నది. “యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ గాపయతి స్మ కృష్ణ: “ యని అథర్వణవేదము నందలి గోపాలతాపన్యుపనిషత్తు (1.24) నందు తెలుపబడినది. 

అనగా ఆదిలో బ్రహ్మదేవునకు వేదజ్ఞానమొసగినవాడును మరియు పూర్వము వేదజ్ఞానమును విస్తరింపజేసినవాడును శ్రీకృష్ణుడే. అదే విధముగా నారాయణోపనిషత్తు(1) నందు కూడా “అప్పుడు దేవదేవుడైన నారాయణుడు జీవులను సృజించదలచెను” అని తెలుపబడినది (అథ పురుషో హ వై నారాయణో(కామయత ప్రజా: సృజేయేతి). 

అదే ఉపనిషత్తు ఇంకను కొనసాగి “నారాయణాద్ బ్రహ్మా జాయతే, నారాయణాద్ ప్రజాపతి:ప్రజాయతే, నారాయణాద్ ఇంద్రోజాయతే, నారాయణాదష్టౌవసవో జాయన్తే, నారాయణాద్ ఏకాదశ రుద్రా జాయన్తే, నారాయణాద్ ద్వాదశాదిత్యా:” యనియు తెలిపినది. అనగా నారాయణుని నుండియే బ్రహ్మదేవుడు మరియు ప్రజాపతులు ఉద్భవించిరి. నారాయణుని నుండియే ఇంద్రుడు జన్మించెను. నారాయణుని నుండియే అష్టవసువులు జన్మించిరి. 

నారాయణుని నుండియే ఏకాదశ రుద్రులు ఉద్భవించిరి మరియు నారాయణుని నుండియే ద్వాదశాధిత్యులును జన్మించిరి. అట్టి నారాయణుడు శ్రీకృష్ణభగవానుని ఒక ప్రధాన విస్తృతాంశము.

నారాయణోపనిషత్తు(4) నందే “బ్రహ్మణ్యో దేవకీపుత్ర:” అని తెలుపబడినది. అనగా దేవకీపుత్రుడైన శ్రీకృష్ణుడే ఆదిదేవుడు. 

దాని యందే మరల “ఏకో వై నారాయణ ఆసీన్నబ్రహ్మా న ఈ శానో నాపో నాగ్ని- సోమౌ నేమే ద్యావాపృథ్వీ న నక్షత్రాణి న సూర్య:” అని తెలుపబడినది. అనగా సృష్ట్యారంభమున దేవదేవుడైన నారాయణుడొక్కడే యుండెను. 

బ్రహ్మదేవుడుగాని, శివుడుగాని, అగ్నిగాని, చంద్రుడుగాని, ఆకాశమున నక్షత్రములుగాని, సూర్యుడుగాని అప్పుడు లేరు. అదే విధముగా మహోపనిషత్తు(1) నందు కూడా శివుడు దేవదేవుని ఫాలభాగము నుండి జన్మించెనని తెలుపబడినది. కనుకనే బ్రహ్మరుద్రాదులను సృష్టించిన దేవదేవుడే పూజనీయుడని వేదములు పలుకుచున్నవి.

మోక్షధర్మమునందు శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను: 

ప్రజాపతిం చ రుద్రం చాప్యహం ఏవ సృజామి వై |
తౌ హి మాం న విజానీతో మమ మాయావిమోహితౌ ||

“ప్రజాపతులు, శివుడు మరియు ఇతరులు మాయాశక్తిచే భ్రమితులైన కారణమున నాచే తాము సృజించబడితిమని ఎరుగకున్నను వాస్తవముగా నా చేతనే సృష్టించబడిరి.” వరాహపురాణమునందు కూడా ఇదే విషయము ఇట్లు తెలుపబడినది.

నారాయణ: పరో దేవస్తస్మా జ్జాతశ్చతుర్ముఖ: |
తస్మాద్ రుద్రో(భవద్దేవ స చ సర్వజ్ఞతాం గత: ||

“నారాయణుడు దేవదేవుడు. అతని నుండియే బ్రహ్మ జన్మించగా, ఆ బ్రహ్మ నుండి శివుడు ఉద్భవించెను.”

కనుకనే శ్రీకృష్ణుడు సమస్త సృష్టికి కారణమైయుండి సర్వమునకు కారణునిగా పిలువబడుచున్నాడు. 

కనుకనే ఆ భగవానుడు “సర్వము నా నుండియే ఉద్భవించుట వలన సర్వమునకు నేనే ఆదికారణుడనై యున్నాను. సమస్తము నా ఆధీనమునందే కలదు. నా కన్నను అధికులెవ్వరు లేరు” అని పలికెను. అనగా శ్రీకృష్ణుడు తప్ప అన్యమైన దివ్యనియామకుడు వేరోక్కడు లేడు. 

ప్రామాణికుడైన గురువు నుండి శాస్త్రాన్వయముతో శ్రీకృష్ణుని గూర్చి ఈ విధముగా అవగతము చేసికొనినవాడు తన శక్తినంతటిని కృష్ణభక్తిభావనలో నిమగ్నము చేసి నిజమైన పండితుడు కాగలడు. 

అట్టివానితో పోల్చినచో కృష్ణుని గూర్చి సరిగా ఎరుగనట్టి ఇతరులందరును మూర్ఖులే. కేవలము మూర్ఖుడైనవాడే శ్రీకృష్ణుని సాధారణమానవునిగా భావించును. 

కనుక కృష్ణభక్తిభావన యందున్నవాడు అట్టి మూర్ఖులచే ఎన్నడును కలతనొందరాదు. భగవద్గీతకు గల అప్రామాణిక వ్యాఖ్యానములకు మరియు వివరణములకు అతడు దూరుడై కృష్ణభక్తిరసభావనమందే నిశ్చయము మరియు స్థిరత్వముతో కొనసాగవలెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 360 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 08 🌴

08. ahaṁ sarvasya prabhavo
mattaḥ sarvaṁ pravartate
iti matvā bhajante māṁ
budhā bhāva-samanvitāḥ

🌷 Translation : 
I am the source of all spiritual and material worlds. Everything emanates from Me. The wise who perfectly know this engage in My devotional service and worship Me with all their hearts.

🌹 Purport :
A learned scholar who has studied the Vedas perfectly and has information from authorities like Lord Caitanya and who knows how to apply these teachings can understand that Kṛṣṇa is the origin of everything in both the material and spiritual worlds, and because he knows this perfectly he becomes firmly fixed in the devotional service of the Supreme Lord. 

He can never be deviated by any amount of nonsensical commentaries or by fools. All Vedic literature agrees that Kṛṣṇa is the source of Brahmā, Śiva and all other demigods. 

In the Atharva Veda (Gopāla-tāpanī Upaniṣad 1.24) it is said, yo brahmāṇaṁ vidadhāti pūrvaṁ yo vai vedāṁś ca gāpayati sma kṛṣṇaḥ: “It was Kṛṣṇa who in the beginning instructed Brahmā in Vedic knowledge and who disseminated Vedic knowledge in the past.” 

Then again the Nārāyaṇa Upaniṣad (1) says, atha puruṣo ha vai nārāyaṇo ’kāmayata prajāḥ sṛjeyeti: “Then the Supreme Personality Nārāyaṇa desired to create living entities.” 

The Upaniṣad continues, nārāyaṇād brahmā jāyate, nārāyaṇād prajāpatiḥ prajāyate, nārāyaṇād indro jāyate, nārāyaṇād aṣṭau vasavo jāyante, nārāyaṇād ekādaśa rudrā jāyante, nārāyaṇād dvādaśādityāḥ: 

“From Nārāyaṇa, Brahmā is born, and from Nārāyaṇa the patriarchs are also born. From Nārāyaṇa, Indra is born, from Nārāyaṇa the eight Vasus are born, from Nārāyaṇa the eleven Rudras are born, from Nārāyaṇa the twelve Ādityas are born.” This Nārāyaṇa is an expansion of Kṛṣṇa.

It is said in the same Vedas, brahmaṇyo devakī-putraḥ: 

“The son of Devakī, Kṛṣṇa, is the Supreme Personality.” (Nārāyaṇa Upaniṣad 4) Then it is said, eko vai nārāyaṇa āsīn na brahmā neśāno nāpo nāgni-somau neme dyāv-āpṛthivī na nakṣatrāṇi na sūryaḥ: “In the beginning of the creation there was only the Supreme Personality Nārāyaṇa. 

There was no Brahmā, no Śiva, no water, no fire, no moon, no heaven and earth, no stars in the sky, no sun.” (Mahā Upaniṣad 1.2) 

In the Mahā Upaniṣad it is also said that Lord Śiva was born from the forehead of the Supreme Lord. Thus the Vedas say that it is the Supreme Lord, the creator of Brahmā and Śiva, who is to be worshiped.

In the Mokṣa-dharma section of the Mahābhārata, Kṛṣṇa also says,

prajāpatiṁ ca rudraṁ cāpy
aham eva sṛjāmi vai
tau hi māṁ na vijānīto
mama māyā-vimohitau

“The patriarchs, Śiva and others are created by Me, though they do not know that they are created by Me because they are deluded by My illusory energy.” In the Varāha Purāṇa it is also said,

nārāyaṇaḥ paro devas
tasmāj jātaś caturmukhaḥ
tasmād rudro ’bhavad devaḥ
sa ca sarva-jñatāṁ gataḥ

“Nārāyaṇa is the Supreme Personality of Godhead, and from Him Brahmā was born, from whom Śiva was born.”

Lord Kṛṣṇa is the source of all generations, and He is called the most efficient cause of everything. He says, “Because everything is born of Me, I am the original source of all. Everything is under Me; no one is above Me.” There is no supreme controller other than Kṛṣṇa. 

One who understands Kṛṣṇa in such a way from a bona fide spiritual master, with references from Vedic literature, engages all his energy in Kṛṣṇa consciousness and becomes a truly learned man. 

In comparison to him, all others, who do not know Kṛṣṇa properly, are but fools. Only a fool would consider Kṛṣṇa to be an ordinary man. 

A Kṛṣṇa conscious person should not be bewildered by fools; he should avoid all unauthorized commentaries and interpretations on Bhagavad-gītā and proceed in Kṛṣṇa consciousness with determination and firmness.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹