సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 9

🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 9 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 


🍃. ఏడవ స్థితి 🍃
 
287. గుప్తవిద్యలో దైవ శక్తులు 12 ఎళిఖిరిబిది (రాసులు) 12 గుర్తులుగా నమోదుకాబడినాయి. ఈ 12 రాసులు 7 గ్రహాలకు సంయోగము చెంది ఉన్నాయి. అవన్ని అసంఖ్యాకమైన దివ్య, అర్థ, విద్య, భౌతిక శక్తులుగా విభజింపబడతాయి.

288. దివ్య శక్తులు మొదటి స్థాయిలో 'పరబ్రహ్మ' నుండి ఆత్మ విడిపోయి 'బ్రహ్మ'గా మొదటి శ్రేణి శక్తులు కలిగి ఉంటుంది. రెండవ శ్రేణికి చెందినవారు ఆకాశ, అగ్ని తత్వములు కలిగి; ఆత్మ, బుద్ధికి సంబంధించినవారు. మూడవ శ్రేణికి చెందినవారు ఆత్మ, బుద్ధి, మనస్సుకు చెంది త్రిపుటిగా వర్ణింపబడిన శక్తులు. ఈ మూడు శ్రేణులు అరూప స్థితికి చెందినవి.
 
289. రూప స్థితిలో నాల్గవ స్థాయి చేతనత్వములో అగ్ని, నీరు, వాయువులు; ఈ మూడు పృధ్వీ తత్వమునకు చెందినవి కావు. కాని వాటి యొక్క తన్మాత్రలు.

290. 5వ శ్రేణి చేతనత్వములో చాలా రహస్యమైన మానవుని వ్యక్తపరుస్తుంది. ఇది మనస్సు యొక్క చేతనత్వము.
 
291. 6వ శ్రేణిలో మనిషికి, కింద శ్రేణికి చెందిన ప్రకృతి దేవతలు, భూతములు మొదలగునవి. ఈ విధముగా జీవన ప్రవాహాము వివిధ స్థాయిలలో క్రిందికి దిగుతుంది.
 
292. ఒకే ఆత్మ అనేక జన్మలు తీసుకొని వ్యవహరించుట జరుగుతుంది.

293. పరిణామ క్రమములో మొదటిది ఖనిజము, రెండవది వృక్షజాతి, మూడవది జంతువులు, నాల్గవది మనిషి. మనస్సు మనిషికి ప్రత్యేకముగా ఇయ్యబడుతుంది. మనస్సు తరువాత బుద్ధి, మనిషికి కలిగి ఆత్మను తెలుసుకొనుటకు మార్గము ఏర్పడుతుంది. ఇవన్నీ గుప్త విద్య యొక్క రెండవ భాగములో వివరంగా తెలుపబడినాయి.

294. ఏవిధంగా ఒకే చంద్రుడు అనేక తరంగాలలో ప్రతిబింబిస్తాడో అలానే ఒకే పరమాత్మ అన్ని శరీరాలలో ప్రతిబింభిస్తుంది.

295. ప్రస్తుత పరిణామ దిశకు వస్తే 7 పరిభ్రమణాలలో మొదటిదైన ఖనిజ జగత్తు, రెండవదైన వృక్షజగత్తు, మూడవదైన జంతుజగత్తు, నాల్గవదైన మానవుడు అనగా పురుషుడు ప్రకృతి మీద అధికారం సంపాదిస్తున్నాడు.
 
296. భూమి పరిణామ క్రమములో పృధ్వీ సూక్ష్మ కణాలతో నిర్మింపబడి ఉన్నత మార్గములోకి వెలుతుంది.

297. భూమి మొదటి పరిభ్రమణములో ఆకాశభూతాన్ని తయారు చేసింది. రెండవ పరిభ్రమణములో అగ్ని, భూమి కలసి పరిస్థితులకు తగిన జీవులను తయారు చేసింది. అలా క్రమముగా పంచేంద్రియాలు అభివృద్ధి పర్చుకొని సహజ దివ్య దృష్టివైపు మనిషి ఎదుగుచున్నాడు.

298. మొదటి ఈ పరిణామ దిశలో దివ్య శక్తులు, జంతువులు మొదలగునవి ఏర్పడినవి. రెండవ స్థాయిలో భౌతికత పెంపొందింది. మూడవ పరిభ్రమణములో మానవ జాతి రూపొందింది. అపుడే జలమును దాని తత్వమును గూర్చి మానవుడు గ్రహించగలిగాడు. ఈ తత్వము మొదట అతి సూక్ష్మ కణాలతో, లక్షణాలతో ఉండేది.

299. నాల్గవ పరిణామ దశలో అరూప స్థితిలో ఉన్న మానవుడు క్రింది స్థాయికి స్వరూప స్థాయికి దిగినపుడు అప్పటి వరకు అతనికున్న అతీంద్రియ శక్తులు కొల్పోయాడు.

300. నిశ్శబ్దం అనగా కన్ను చూడలేనిది, చెవి వినలేనిది.

301. 5వ పరిణామములో ఆకాశము ఒక తత్వము లాగా రూపొందింది. దానికి శరీరము ఒక వాహనముగా మారింది.

302. వైజ్ఞానికుల పరిశోధన ప్రకారము మనము అనేక జీవరాశుల మధ్య జీవిస్తున్నాము. ప్రకృతిలోని ప్రతి కణము రెండు లక్షణాలు కలిగి ఉంది. 1) జీవాన్నిఇచ్చేది. 2) జీవాన్ని తీసుకొనేది. ఈ రెండింటి మధ్య ఏర్పడిన అనేక సంఘటనలు, విఘటనలు (ఇచ్చేవి, తీసుకొనేవి) వలన సృష్టి నిర్మించబడుతుంది. ప్రాణశక్తులు తమ పనులను నియమబద్దముగా కొనసాగించుటకు తోడ్పడుతుంది.
 
303. చంద్రుడు ఈ పరిణామాలకు ముఖ్యకారకుడు. చంద్రుడు ఔషధపదార్థములలో రస కారకుడు. మరియు చంద్రుడు స్త్రీల మీద తన ప్రభావము చూపి సృష్టికి కారణమగుచున్నాడు. 

304. పరమాత్మ (సాక్షి) పైలోకాల్లో ఉండి అతని నీడ, క్రింది లోకాలకు వ్యాపించి సాక్షిగా ఉన్నాడు. సాక్షి ఒకడే అయినా అతనికి పునర్జన్మలు అనేకము.

305. పరమాత్మ ఒకడే అయినా దాని వాహనమైన బుద్ధి ధ్యానిలోకములో సంబంధం కలిగి ఉంది.
 
306. జీవి ప్రతి జన్మకు నిరంతర పరిణామ క్రమములో ఒత్తిడికి లోనై అత్యున్నత స్థాయిని చేరుకుంటుంది.

307. ఏ రోజు వ్యక్తి 'ధ్యానీచోహాన్‌'లో కలుస్తాడో, నిర్మాణ స్థాయికి చేరుకుంటాడో అపుడు నిప్పురవ్వ జ్వాలలో కలిసినట్లు, వ్యక్తి బ్రహ్మములో కలుస్తాడు. కాని అతని వ్యక్తిత్వము అతనికుంటుంది. గాఢ నిద్రలో స్పురణం అంతాపోయి, సుషిప్తిలో ఉన్నపుడు, ఆత్మిక స్థితిలో లీనమై ఉన్నప్పటికి, మెలుకువ వచ్చిన తరువాత వ్యక్తి మామూలు స్థాయికి వస్తాడు. ఈ విధముగా సప్త విధ పరిణామ క్రమము, సప్తవిధ ప్రకృతిలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది.

సర్వం బ్రహ్మ మయమే కదా!

🌹🌹🌹🌹🌹🌹🌹🌹