విష్ణు సహస్ర స్తోత్ర పాఠం - 18 (Uttara Pitika Sloka 20 to 25)

🌹.   విష్ణు సహస్ర స్తోత్ర పాఠం - 18   🌹

🎤. స్వామి చిన్మయానంద మిషన్
📚. ప్రసాద్ భరద్వాజ

Audio file: [ Audio file : VS-Lesson-18 Uttara Pitika Sloka 20 to 25.mp3 ]

https://drive.google.com/file/d/18vSaL_jr4Lb36lhYjsNkoZd4t8mcNbPI/view?usp=sharing

🌻. ఉత్తర పీఠికా 🌻

ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః |

త్రీంలోకాన్వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః ‖ 20 ‖

ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితం |

పఠేద్య ఇచ్చేత్పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ ‖ 21 ‖

విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయమ్|

భజంతి యే పుష్కరాక్షం న తే యాంతి పరాభవం ‖ 22 ‖

న తే యాంతి పరాభవం ఓం నమ ఇతి |

అర్జున ఉవాచ

పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ |

భక్తానా మనురక్తానాం త్రాతా భవ జనార్దన ‖ 23 ‖

శ్రీభగవానువాచ

యో మాం నామసహస్రేణ స్తోతుమిచ్ఛతి పాండవ |

సోఽహమేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః ‖ 24 ‖

స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి |

వ్యాస ఉవాచ

వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయమ్ |

సర్వభూతనివాసోఽసి వాసుదేవ నమోఽస్తు తే ‖ 25 ‖

శ్రీవాసుదేవ నమోస్తుత ఓం నమ ఇతి |

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

06 Oct 2020

శ్రీ విష్ణు సహస్ర నామములు - 30 / Sri Vishnu Sahasra Namavali - 30

🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 30 / Sri Vishnu Sahasra Namavali - 30 🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

కర్కాటక రాశి - పుష్యమి నక్షత్రం 2వ పాద శ్లోకం

🌻. 30. ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః |

ఋద్దః స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః ‖ 30 ‖

🍀. ఓజస్తేజోద్యుతిధరః ---
పరిపూర్ణమగు ఓజస్సు (బలము), తేజస్సు (శతృవులను ఓడించు శక్తి), ద్యుతి (కీర్తి, కాంతి) కలిగినవాడు

🍀. ప్రకాశాత్మా ---
ప్రకాశవంతమగు స్వరూపము గలవాడు; (మూర్ఖులు కూడా అంగీకరించేటట్లుగా, గొప్పగా) ప్రకాశించేవాడు.

🍀. ప్రతాపనః ---
సూర్యాగ్నుల రూపమున వెలుతురును, జీవులలో ఉష్ణమును కలిగించి కాపాడువాడు; తన ఉగ్రరూపమున జగత్తును తపింపజేయువాడు; ప్రళయాగ్నియై జగత్తును లయము చేయువాడు.

🍀. ఋద్ధః ---
అన్ని ఉత్తమ గుణములు సమృద్ధిగా కలిగిన పరిపూర్ణుడు.

🍀. స్పష్టాక్షరః ---
స్పష్టమైన వేదాక్షరములు గలవాడు, అనగా వేదము లోని అక్షరముల ద్వారా స్పష్టమైనవాడు; దివ్యమగు ప్రణవ శబ్దము ద్వారా తెలియబడువాడు; విశ్వమును కలిపి పట్టియుంచువాడు.

🍀. మంత్రః ---
తన నామమును మననము చేయువారిని రక్షించువాడు; వేద స్వరూపుడు, మంత్ర మూర్తి.

🍀. చంద్రాంశుః ---
చంద్రుని కిరణములవలె (వెన్నెల వలె) చల్లగానుండి, ఆహ్లాదమును కలిగించి, సంసార తాపమును శమింపజేయువాడు; సస్యములను పోషించువాడు.

🍀. భాస్కరద్యుతిః
సూర్యుని వంటి తేజస్సు గలవాడు; శత్రుదుర్నిరీక్ష్య పరాక్రమశీలి; సూర్యునికి కాంతిని ప్రసాదించువాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹  Vishnu Sahasra Namavali - 30  🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj

🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻

Sloka for Karkataka Rasi, Pushyami 2nd Padam

🌻 30. ōjastejōdyutidharaḥ prakāśātmā pratāpanaḥ |

ṛddhaḥ spaṣṭākṣarō mantraścandrāṁśurbhāskaradyutiḥ || 30 || 🌻

🌷 Ōjas-tejō-dyuti-dharaḥ:
One who is endowed with strength, vigour and brilliance.

🌷 Prakāśātmā:
One whose form is radiant.

🌷 Pratāpanaḥ:
One who warms the world through the power manifestations like the Sun.

🌷 Ṛddhaḥ:
One who is rich in excellences like Dharma, Gyana (knowledge), Vairagya (renunciation) etc.

🌷 Spaṣṭākṣaraḥ:
He is so called because Omkara, the manifesting sound of the Lord, is Spashta or high pitched.

🌷 Mantraḥ:
One who manifests as the Mantras of the Rk, Sama, Yajus etc., or one who is known through Mantras.

🌷 Candrāṁśuḥ:
He is called 'Chandramshu' or moonlight because just as the moon-light gives relief to men burnt in the heat of the sun, He gives relief and shelter to those who are subjected to the heat of Samsara.

🌷 Bhāskara-dyutiḥ:
He who has the effulgence of the sun.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

06 Oct 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 68

🌹.   కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 68   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి - 32 🌻

ఇంకేమిటటా? మనము జన్మతః జననమనే కార్యముతో మొదలుపెట్టి మరణమనే కార్యముతో ముగిస్తూ వున్నాము, శరీర యాత్రని. ఇదొక శరీర యాత్ర. కాని ఆత్మ ఎక్కడికీ ప్రయాణించదు, ఆత్మ ఏ కార్యమూ చెయ్యదు. అది అకార్యము. కార్యమునకు కాదు. ఏ కార్యమునందు ప్రవేశించడం చేత గానీ, ఒక కార్యమును చెయ్యడం చేత గానీ, ఒక కార్యమును చెయ్యకపోవడం చేత గానీ నీవు ఆత్మ వస్తువుని తెలుసుకొనజాలవు.

ఇంకా ఏమిటటా? ఈ శరీరం ఒక కాలంలో వుంది. ఒక కాలంలో పరిణమించింది. ఒక కాలంలో పుట్టింది. ఒక కాలంలో పోతుంది. కాబట్టి మూడు కాలములందు భూత భవిష్యత్ వర్తమానములందు పరిణామము చెందుతూ వున్నది. కాని ఆత్మ సర్వకాలములందు ఒక్క తీరుగనే వున్నది కాబట్టి దానికి భూత భవిష్యత్ వర్తమానములనేవి లేవు. ఒక కాలమందు వున్నదని, ఒక కాలమందు లేనిదనీ చెప్పుటకు వీలు లేకుండా వున్నది.

ఇంకా ఏమిటటా? ఈ శరీరము పుట్టినప్పుడు చాలా చిన్న రూపముతో వున్నది. తరువాత క్రమేపీ పెరుగుతూ పెరుగుతూ ఒక స్థాయికి వచ్చింది. ఒక స్థాయికి వచ్చిన తరువాత పరిణామం చెందటం ప్రారంభమయింది. వృద్ధి చెందింది, పరిణామం చెందింది తిరిగి ఏమయింది క్షయించబడుతోంది. క్షీణించబడుతోంది ఒక స్థాయికి వచ్చిన తరువాత. బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య అవస్థల ద్వారా వృద్ధి క్షయాలను పొందుతూ వున్నది. కాని ఆత్మకు ఈ వృద్ధి క్షయములు లేవు. దానికెట్టి రూప పరిణామములు లేవు. దానికి నామ రూపములు అంటవు.

ఇంకేమిటటా? పురాతనమైనటువంటిది. పురాతనమంటే ఈ సృష్టికి ముందున్నటువంటి స్థితి నుంచీ సృష్టి మరలా లయించబడి పోయినప్పటికీ మార్పు చెందకుండా వుండేటటువంటిది ఏదైతే వుందో అది ఆత్మ.

కాబట్టి ఎప్పటినించీ వుందయ్యా? ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి వున్నది. కాబట్టి పురాణము అనగా అర్ధమేమిటంటే పురాతనమును గురించి తెలియజెప్పునది ఏదో అది పురాణము. పునః ఆయతనః ఇతి పురాతనః. అర్ధమైందా అండి?

పురమునందు ఈ సృష్టి అనేటటువంటి పురమునందు ఆయతనమై అధిష్టానమై ఆశ్రయమై వున్నటువంటి బ్రహ్మము ఏదైతే వున్నదో ఈ శరీరము అనేటటువంటి పురము నందు ఆయతనం ఆశ్రయము అధిష్టానము ఏదైతే అయి వున్నదో అటువంటి ఆత్మ - అటువంటి బ్రహ్మ.

ఇది తెలుసుకోవలసినటువంటి అంశం. ఈ లక్ష్యంలో ఏవైతే చెప్పబడుచున్నాయో వాటికి పురాణములని పేరు. కాబట్టి అష్టాదశ పురాణములకి కూడా లక్ష్యము ఆత్మ సాక్షాత్కార జ్ఞానమే. పరమాత్మ తత్వ బోధకమే.

కాబట్టి పురాణములన్నీ కూడా భగవద్ విషయముగానే చెప్పబడినప్పటికీ, చెప్పబడిన కధా కధన రీతిలో బేధముండవచ్చునేమో గానీ వాటి యొక్క లక్ష్యార్ధం మాత్రం ఆత్మతత్వమును గ్రహించడం మాత్రమే. అట్లాగే, ఎవరికైతే ఈ శరీరములో వున్నప్పటికీ ఆత్మకు ఏ రకమైన వికారమూ అంటుట లేదు.

ఎలా అంటే ఆకాశములో మేఘములు చలించుచున్నట్లు కనబడుచున్నవి. కాని ఆకాశమును ఏమైనా మేఘములు అంటినయ్యా అంటే అంటలేదు. ఆకాశములో వర్షము మేఘముల ద్వారా ఏర్పడినట్లు కనబడుచున్నది.

కాని ఆ మేఘముల వల్ల ఏర్పడిన వర్షము చేత ఆకాశము తడుపబడుచున్నదా అంటే తడుపబడుట లేదు. అదే ఆకాశమందు అగ్ని స్వరూపము కూడా చలించుచున్నట్లు కనబడుచున్నది. కాని అట్టి ఆకాశము అగ్ని చేత దహించబడుతున్నదా అంటే దహించబడుట లేదు. - విద్యా సాగర్ స్వామి

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

06 Oct 2020

అద్భుత సృష్టి - 47

🌹.    అద్భుత సృష్టి - 47   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 18. లైట్ బాడీస్ ( కాంతి శరీర స్థాయిలు) 🌻

కాంతి శరీరం అంటే నశింపు లేని దివ్యత్వం. ఈ కాంతి దేహం పొందటం అంటే తాను దైవంగా మారినట్లే. మన ప్రస్తుత శరీరం పరిణామం చెందుతూ అధిక మొత్తంలో కాంతిని స్వీకరిస్తూ నెమ్మది నెమ్మదిగా శరీరంలోని అణువులు అన్ని తమ ఫ్రీక్వెన్సీని "కార్బన్ స్థితి" నుండి "కాంతి స్థితి" లోనికి మార్చుకుంటుంది.

✨. ఈ ఆత్మకు సంబంధించిన అన్ని శక్తులు, శక్తి క్షేత్రాలు, శరీర అవయవాలు అన్నీ కూడా తమ ఫ్రీక్వెన్సీని ఉన్నత స్థాయి ఫ్రీక్వెన్సీతో అనుసంధానం చేస్తూ అతి సాధారణ భౌతిక స్థాయి నుండి ఆదిభౌతిక స్థాయికి, అక్కడి నుండి అనంత చైతన్య స్థాయికి ఎదిగేలా చేస్తుంది.

✨. కాంతిని స్వీకరిస్తూ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా, శారీరక, మానసిక, బుద్ధి, చైతన్య స్ధితులలో ప్రత్యేక మార్పులు జరుగుతాయి.

కర్బన ఆధారిత శరీర అణువులు మార్పును చెందుతున్న తరుణంలో కర్మలు కడగబడడం జరుగుతుంది. శరీరం అధిక సాంద్రతను కోల్పోవడం జరుగుతుంది. ఈ తరుణంలో శరీరం అతి సాధారణమైన రుగ్మతలకు గురి కావడం జరుగుతుంది. (జ్వరం, తలనొప్పి, దద్దులు, కండరాలు బిగదీయడం, కీళ్లనొప్పులు మొదలైనవి)

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

06 Oct 2020

గీతోపనిషత్తు - 46

🌹.   గీతోపనిషత్తు - 46   🌹

🍀  6. ఆరాధనము - దేవతలను ఆరాధించుట యనగా మానవుడు గూడ దేవతల వలె పరహిత ధర్మమునకు తన జీవితమును సమర్పించవలెను. 🍀

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚.   కర్మయోగము - 11   📚

11. దేవా న్భావయతానేన తే దేవా భావయంతు నః |

పరస్పరం భావయంత: శ్రేయః పర మవాప్స్యథ || 11

శ్రేయః పర మవాప్యుథ :

దేవతలు మానవులకు సహాయము చేయగలరు. దేవతలకు ప్రీతి కలిగించు మార్గము యజ్ఞార్థ జీవనమే. దేవతలు సంతుష్టులైనచో మానవులకు సంతుష్టిని, వృద్ధిని యొసగుదురు. మానవుల వృద్ధికి సహకరింతురు. దేవతలను ఆరాధించుట యనగా మానవుడు గూడ దేవతలవలె పరహిత ధర్మమునకు తన జీవితమును సమర్పించవలెను.

దేవతలట్లే సమర్పించుటచే సృష్టి ప్రణాళిక నెరిగి సృష్టిని నిర్వహణము చేయుచున్నారు. తమవలెనే ఏ మానవుడు పరహిత కార్యములకు సమర్పణ చెందునో అట్టి మానవుడు దేవతల ఆశీర్వచనము పొందును.

శ్రీకృష్ణుడు తెలిపిన భగవధారాధనము యిదియే. స్తుతి కొరకు, స్ఫూర్తి కొరకు ఆరాధనములు సలిపినను పరహితము సలుపని జీవితము జీవులకు హితముగా నుండనేరదు.

దేవతారాధనమనగా పరహితధర్మము నాచరించుట. స్వహితమును ఆశింపకుండుట. ఇది సర్వ శ్రేయోదాయకము. పరమ శ్రేయోదాయకము. పరమ శ్రేయస్సు దీని వలననే కలుగునని “శ్రేయః పర మవాప్యుథ" అని పలికినాడు.

నందగోపుడు వర్షాదులు కురియుటకై ఇంద్రుని ఆరాధించవలెనని సంకల్పించినాడు. బాలకృష్ణుని అడుగగా, ఇంద్రుని ఆరాధన పూజాది కార్యక్రమములుగా కాక, తోటిజీవుల శ్రేయస్సుగా కర్మ నాచరింపుమని బాలకృష్ణుడు తెలిపినాడు.

భగవద్గీతలో శ్రీకృష్ణుడిచ్చిన పరమోత్కృష్టమైన ధర్మమిది. అతడు దేవతా ప్రీతికై యజ్ఞ యాగములను, పూజాభిషేకములను, హోమములను తనకుగా తాను ఎన్నడును నిర్వర్తించలేదు. నిర్వర్తిస్తున్న వారిని గౌతమ బుద్ధునివలె ఖండించలేదు. తనను సలహా అడిగినవారికి మాత్రము దేవతారాధన మనగా పరహిత జీవనమే అని తెలియజెప్పినాడు.

దైవమొక్కడే. అతని కార్యమునే దేవతలు చేయుచున్నారు. వారు నిష్కాములు. జీవులు గూడ దేవతలను మార్గదర్శకులుగ నెంచు కొని, ఆ మార్గమునే నడచినచో దివ్యత్వము పొందగలరు.

దేవతలను, గురువులను మార్గదర్శకులుగా భావించుట, గౌరవించుట, పూజించుట తగుమాత్రముగ జరుగుచుండవలెను. అవియే ప్రధాన కార్యములైనచో ముక్తజీవనము దుర్లభము. పరమ శ్రేయస్సునకు పరహితమే పరమధర్మమని శ్రీకృష్ణుడు, శ్రీరాముడు నిర్వర్తించి బోధించినారు.

అదియే సనాతన ధర్మమార్గము. జీవుల శ్రేయస్సే దైవారాధనముగ సాగుట కృష్ణుడు తెలిపిన కర్మబంధ విమోచన మార్గము. (3-11)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

06 Oct 2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 128

🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 128   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. నారద మహర్షి - 2 🌻

12. ఆ కామేశ్వరి-కామేశ్వర మిధున ప్రణయఫలంగా విష్ణోత్పత్తి జరిగిందని; మూడవబ్రహ్మయైన ఆ విష్ణువు నాభికమలంనుంచి, ఈ భౌతిక సృష్టికి కారణభూతమైన మూలపదార్థములను సృష్టించిన బ్రహ్మయొక్క(చతుర్ముఖ బ్రహ్మయైన ఈ నాల్గవబ్రహ్మయొక్క) సృష్టిజరిగిందని పురాణకథనం.

13. ఈ బ్రహ్మచేసిన సృష్టికి, ఒక లయక్రియ కాలాంతరములో అవసరమవుతుంది. కాబట్టి బ్రహ్మచేసే సృష్టిని లయంచేసేటటువంటి రుద్రుడు ఆ బ్రహ్మముఖం నుంచి పుట్టాడని; ఈ రుద్రుడే అయిదో బ్రహ్మ అని ఇలా ఈ అయిదుగురు బ్రహ్మలయొక్క చరిత్ర పురాణాలలో అనేకవిధాలుగా వర్ణించబడింది.

14. రుద్రుడికి, బ్రహ్మచేసినటువంటి సృష్టిని హరించి దానినంతా చివరకు తనలో లయంచేయటమే కర్తవ్యం. బ్రహ్మచేసిన సృష్టియొక్క ప్రళయం అది. ఆ ప్రళయానికి కారణం రుద్రుడు. తర్వాత రుద్రప్రళయం. అందు ఈ రుద్రుడు బ్రహ్మలో లీనమవుతాడు. బ్రహ్మప్రళయం అని ఒకటుంది. బ్రహ్మవిష్ణువులో లయంఅవుటాడు. విష్ణుప్రళయం అని ఒకటుంది.

15. విష్ణువు ఆ రెండు తత్త్వము లందు (కామేశ్వరీ-కామేశ్వరులు) విలీనం చెందుతాడు. అవి తనను తామే ఉపసంహరించు కుంటాయి. అప్పుడు కేవలం నిర్గుణబ్రహ్మ వెలుగుతుంది.

ఈ ప్రకారంగా ఇట్టి రాకపోకలు సృష్టికి హేతువులుగా ఉన్నాయి.

16. వీటన్నిటిలోనూ పూసలలో దారంగా ఉన్నటువంటిది ఒకటుంది. అదే పరాశక్తి. ఆ ప్రాశక్తిని నిరూపణచేసి, ‘పంచ(బ్రహ్మ) మంచాధిశాయిని’గా పరాశక్తిని ఆరాధించేవాళ్ళను శాక్తేయులంటాము. ఈ అయిదుగురు బ్రహ్మలయందు, నిర్గుణమైన వస్తువులోనూకూడా ఆమె ఉన్నది! ‘కామేశ్వరీ-కామేశ్వర ప్రణయ మిధునం’ అనే భావన ఏదైతే ఉన్నదో, ఆ చైతన్యశక్తే పరాశక్తి. ఆమెది రెండవ స్థితి.

17. మూడవది విష్ణువుయందున్నది. బ్రహ్మయందూ ఆమె ఉన్నది. కాబట్టి ఈ అయిదుగురిలోనూ ఆమెయే అధికారికంగా విలసిల్లేటటువంటిది, నిరంతరంగా ఉండేది. అట్టిచైతన్య స్వరూపిణి అది. ఆ చైతన్యాన్ని చిద్గగనమందు యోగి దర్శనంచేసి, దానిని తెలుసుకుంటేకూడా ముక్తిలభిస్తుంది. బ్రహ్మను గురించి తపస్సు చేసి బ్రహ్మలోఉండే జ్ఞాన్నిపొందినా ముక్తి కలుగుతుంది.

18. రుద్రుని యందు ఏ జ్ఞానము ఉన్నదో, దానిని ఆరాధించినా అది ముక్తికి హేతువవుతుంది. విష్ణువులో ఏ జ్ఞానముందో-సత్యజ్ఞానము-దానిని ఆరాధించినా అదికూడా మోక్షహేతువవుతుంది.

19. ఇదంతా కాక, నిర్గుణమైన పరబ్రహ్మవస్తువు సర్వకారణకారకమైనది ఏదైతే ఉన్నదో, దానిని ఆరాధించినా మోక్షమే వస్తుంది. ఇవన్నీ మార్గములే! ఏదయినా మార్గమే!.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

06 Oct 2020

శ్రీ శివ మహా పురాణము - 240

🌹 .   శ్రీ శివ మహా పురాణము - 240   🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

54. అధ్యాయము - 9

🌻. మారగణములు - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! ఆ మన్మథుడు తన అనుచరులతో గూడి శివస్థానమునకు వెళ్లగానే, చిత్రమగు వృత్తాంతము జరిగినది. దానిని వినుము (1).

మహావీరుడు, మోహకారకుడు నగు మన్మథుడు అచటకు చేరి వెంటనే తన ప్రభావమును విస్తరింపజేసెను. మరియు ప్రాణులను మోహపెట్టెను (2).

వసంతుడు కూడా శివుని మోహపెట్టుటకై తన ప్రభావమును విస్తరింపజేసెను . ఓమునీ! ఏకకాలములో వృక్షములన్నియు పుష్పభరితములైనవి (3).

మన్మథుడు రతితో గూడి అనేక ప్రయత్నములను చేసెను. జీవులన్నియు వశమైనవి.కాని గణేశుడు, శివుడు వానికి వశము కాలేదు (4).

ఓ మహర్షీ! మన్మథుడు వసంతునితో కలిసి చేసిన ప్రయత్నములన్నియూ వ్యర్థము కాగా, ఆతని గర్వము తొలగి పోయెను. అపుడా తడు నా వద్దకు మరలి వచ్చెను (5).

ఓ మహర్షీ! ఆతడు గర్వము తొలగినవాడై, నిరుత్సాహముతో నుండి నాకు ప్రణమిల్లి గద్గదస్వరముతో నిట్లు పలికెను (6).

మన్మథుడిట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! యోగనిష్ఠుడగు శంభుని మోహింపజేయుట అసంభవము సుమా! నాకు గాని, ఇతరులకు గాని అట్టి శంభుని మోహింపజేయు శక్తి లేదు (7).

హే బ్రహ్మన్‌! నేను నా మిత్రుడగు వసంతునితో, మరియు రతితో గూడి శివుని యందు ప్రయోగించిన ఉపాయములన్నియూ వ్యర్థయమ్యెను (8).

హే బ్రహ్మన్‌! మేము శివుని మోహింపజేయుటకు చేసిన వివిధోపాయములను చెప్పెదను. తండ్రీ! వినుము (9).

శంభుడు ఇంద్రియములను నియంత్రించి సమాధియందుండగా, అపుడు నేను సమాధియందున్న ఆ ముక్కంటి మహాదేవునకు నిరంతరముగా ప్రయత్నపూర్వకముగా చల్లని, వేగముగల, మోహమును కలిగించే, పరిమళభరితమైన వాయువుతో వీచితిని (10.11).

నేను నా అయిదు బాణములను మరియు ధనస్సును చేత బట్టి శివగణములను మోహింపజేయుచూ ఆయన చుట్టు ప్రక్కల తిరుగాడితిని (12).

నేను ప్రవేశించుట తోడనే సర్వ ప్రాణులు నాకు తేలికగా వశమగును. కాని, శివప్రభువు మరియు ఆయన గణములు ఎట్టి వికారమునూ పొందనే లేదు (13).

హే బ్రహ్మన్‌! ప్రమథ గణాధిపతి యగు ఆ శివుడు హిమవత్పర్వత మైదానములకు వెళ్లగా, అపుడు నేను గూడ రతితి, వసంతునితో గూడి అచటకు వెళ్లితిని (14).

ఆ రుద్రుడు మేరు పర్వతమునకు గాని, నాగకేశర (?) పర్వతమునకు గాని, లేదా కైలాసమునకు గాని వెళ్లినప్పుడు నేను కూడా ఆయా స్థలములకు ఆయనను వెన్నంటి వెళ్లితిని (15).

ఎపుడైననూ శివుడు సమాధిని వీడినచో, ఆ సమయములో నేను ఆయన యెదుట చక్రవాక పక్షుల జంటను ప్రదర్శించితిని (16).

హేబ్రహ్మన్‌! ఆ పక్షుల జంట పునః పునః హావభావములను ప్రకటించుచూ ఉత్తమమగు దాంపత్యపద్ధతిని ప్రకటించినవి (17).

గణములతో కూడియున్న, నల్లని కంఠము గల ఆ మహాదేవుని యెదుట మృగములు, పక్షులు శృంగామును ప్రకటించినవి (18).

ఆయన యెదుట మరియు సమీపమునందు నెమలి జంట శృంగారరసమును ఉద్ధీపింపజేయు విధముగా వివిధ గతుల నాట్య మాడినది (19).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

06 Oct 2020

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 21, 22 / Sri Lalitha Chaitanya Vijnanam - 21, 22

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 14 🌹

🌹.   శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 21, 22 / Sri Lalitha Chaitanya Vijnanam - 21, 22  🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

8. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర

తాటంక యుగళీభూత తపనోడుప మండల

🌻 21. 'కదంబమంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా' 🌻

అమ్మ చెవి పై భాగమున కదంబ పుష్పగుచ్ఛమును ధరించుట చే మనోహరయై యొప్పుచున్నదని భావము. కదంబ మంజరి యనగా కదంబ పుష్పముల గుత్తి. అవి కర్ణమును పూరించి మనోహరత్వమును కలిగించు రీతిగ నున్నవి.

కర్ణమనగా చెవి యని ఒక అర్థము. లంబకోణ త్రిభుజమున

లంబకోణమున కెదురుగా యున్న భుజమును కూడా 'కర్ణ' మందురు. కర్ణము మీది చతురస్రము మిగిలిన రెండు భుజముల మీది చతురస్రములతో సమానమని 'పైథాగరస్' అను ఋషి తెలిపినట్లుగా మనము భావింతుము.

కానీ, యీ సిద్ధాంతము వేదకాలము నాటిదే. లంబకోణ త్రిభుజము నందలి నిలువు భుజము అయ్యవారుగను లేక పురుషునిగను, అడ్డము భుజము అమ్మవారిగను లేక మూల ప్రకృతిగను, ఈ రెండింటి సమాగమమే (సమమైన కలయికయే) కర్ణమను వెలుగునకు కారణమని, అట్టి వెలుగు నాధారముగా అగ్ని పుంజములుగ, పుంఖాను పుంఖములుగ సిందూర వర్ణములో సృష్టి యేర్పడినదని, అట్టి సృష్టి అత్యంత మనోహరమైనదని ఋషులు దర్శించినారు.

కదంబ పుష్పము సిందూరవర్ణము గలదై యుండును. ఆ పుష్పముల గుత్తి సృష్టియనెడి పుష్పగుచ్ఛమే. దానిని ధరించినటు వంటిది కర్ణము లేక వెలుగు లేక మహాచైతన్యము. సృష్టి మనోహరత్వమును గూర్చి

వేదములే వర్ణింపలేకపోయినవి.

ఇంతటి నర్మగర్భమైన భావమును ఈ మంత్రము ఆవిష్కరించుచున్నది. కర్ణముగ వ్యక్తమై దానిని పూరించు నట్లుగా పుంఖాను పుంఖములుగా సృష్టి గోళము లేర్పడుట ఈ మంత్రార్థము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹  Sri Lalitha Chaitanya Vijnanam - 21  🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 21. Kadamba- mañjarī- klpta- karṇapūra- manoharā कदम्ब-मञ्जरी-क्ल्प्त-कर्णपूर-मनोहरा (21) 🌻

She is wearing the petals of kadamba flowers in Her ears or flowers kept in Her hair flow down to Her ears.

These flowers are grown outside Her Cintāmani graha (The palace where She lives). These flowers have divine fragrance, which is derived from Her ear lobes.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 22 / Sri Lalitha Chaitanya Vijnanam - 22 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

8. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర

తాటంక యుగళీభూత తపనోడుప మండల

🌻 22. 'తాటంక యుగళీభూత తపనోడుప మండలా' 🌻

సూర్య మండలము, చంద్ర మండలము అను రెండు గోళములనూ తన చెవులకు దుద్దులుగా ధరించినది అమ్మ అని భావము. అనగా సూర్య చంద్రాత్మకమగు సృష్టి ప్రజ్ఞలకు 'అమ్మ'యే మూల స్థానమని తెలియవలెను.

సూర్యాత్మ ప్రజ్ఞ జీవులకు ప్రాణము నందించు చుండగ, చంద్రప్రజ్ఞ శరీరము - దాని పెరుగుదల - మనస్సు యిత్యాది వేర్పరచు చుండగ జీవ స్వరూపముగ సమస్త జీవకోటియందు అమ్మ అధిష్టించి యున్నది.

ఇడ-పింగళ నాడులుగ, గంగా యమునల ప్రవాహముగ ఆరు కేంద్రముల నేర్పరచుకొనుచు మానవుని స్వరూపముగా సృష్టి పరిపూర్ణము గావించుచున్నది.

శ్రీదేవియే 7వ కేంద్రమైన సహస్రారము నందు తానుండి సుషుమ్న ద్వారమున మూలాధారము వరకూ వ్యాపించి సమస్త లోకములను, మానవుని యందునూ - సృష్టి యందునూ శ్రీదేవియే నిర్వర్తించుచున్నది అని తెలియవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹   Sri Lalitha Chaitanya Vijnanam - 22  🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 22. Tāṭaṅka- yugalī- bhūta- tapanoḍupa- maṇḍalā ताटङ्क-युगली-भूत-तपनोडुप-मण्डला (22) 🌻

She is wearing sun and moon as Her ear rings. This means She controls all the activities of the universe, as sun and moon are responsible for sustaining life. It is also said that sun and moon represent her eyes, earrings and bosoms.

The bīja klīṁ (क्लीं) is symbolises Her two bosoms, which represent the two semi circles in the klīṁ bīja. The klīṁ bīja is also known as kāma bīja.

Further details are to be learnt from a Guru. Most of the nāma-s of this Sahasranāma subtly convey various bīja-s and hence this Sahasranām is considered as very powerful.

Saundarya Laharī (verse 28) says, “Brahma, Indra and other celestials perish even though they have drunk nectar which confers immunity from frightful grey hairs (of old age) and death.

If the longevity of Śiva despite His swallowing the terrific poison is not limited by time, it is because of the greatness of your ear ornaments.”

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

06 Oct 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 66

🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 66   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 16 🌻

271. బాహ్యమును సృష్టిలో ఏదైనను జరిగినట్లు, జరుగుచున్నట్లు జరగబోవునట్లు కనిపించినచో, అదియంతయు, భగవంతుడు"నేను ఎవరిని?" అన్నట్టి తన స్వీయమైన అనంత భగవద్విలాసము తరంగ చలితమైన క్షణికములో భగవంతుడు కనిన దివ్యస్వప్నము తప్ప మరేమియు కాదు.

272. భగవంతుడు, తన దివ్యమూలమైన అనంత దివ్యస్వప్నంలో శాశ్వతముగా ఏక కాలమందే సృష్టి--స్థితి--లయకారుల పాత్రలను నిర్వహించుకున్నారు.

273. భగవంతుడు మానవ స్థితిలో మానవునిగా, మానవునిలో నిద్రాణమైయున్న సంస్కారములు ద్వారా తన స్వీయ సృష్టికి, తానుకర్తయైన బ్రహ్మగను,

బయటికి చిమ్మిన సంస్కారముల ద్వారా మానవుని దైనందిన జీవితంలో, తన స్వీయ సృష్టిని పోషించుటలో స్థితికారుడైన విష్ణువుగను,

వ్యతిరేక సంస్కారముల ద్వారా పోషించుచున్న స్వీయ సృష్టిని నాశనమొనర్చుటలో లయకారుడైన మహేశ్వరునిగను-- ఇట్లు సృష్టి- స్థితి-లయకారుడైన జగత్కర్త (ఈశ్వరుడు)గా,తన విజయమును ధృవపరచు చున్నాడు.

274. (1) నిద్రాణ సంస్కారముల-- ద్వారా-- సృష్టిని,

(2) జాగృతిలో నిత్యజీవితము-- ద్వారా--స్థితిని

(3) సుషుప్తి లో వ్యతిరేక సంస్కారముల -- ద్వారా -- లయమును అనుభవించుట ద్వారా జగత్కర్తయౌచున్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

06 Oct 2020

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 73 / Sri Gajanan Maharaj Life History - 73

🌹.   శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 73 / Sri Gajanan Maharaj Life History - 73  🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 14వ అధ్యాయము - 4 🌻

నదిలో భేదార్ ఘాట్ కు తిరుగు ప్రయాణం ప్రారంభమయింది. దారిలో ఆపడవ ఒకరాయిని కొట్టుకుని పడవ క్రిందిభాగంలో ఒకచెక్క నీళ్ళలో కొట్టుకుపోయింది. నీళ్ళు పడవలోనికి దూసుకు రావడం మొదలు పెట్టాయి. ఇది చూసి పడవ నడిపేవాడు వాళ్ళజీవితాలు రక్షించేందుకు నదిలోకి దూకుతాడు. కానీ శ్రీమహారాజు ప్రశాంతంగా కూర్చుని గణ గణ గణాత బోతే అని నిర్విరామంగా భజించడం మొదలు పెట్టారు.

మారుతి, భజరంగ్, మార్తాండ్ మరియు బనకటలాల్ భయపడి వాళ్ళ గుండెలు భయంతో బిగుసు కోవడం మొదలు పెట్టాయి. వాళ్ళు చేతులు కట్టుకుని ఓకరుణా హృదయుడైన మహారాజ్ షేగాంలో మీమాట అలక్ష్యం చేసినందుకు మేము సిగ్గు పడుతున్నాం, దానిఫలితంగానే నర్మద మమ్మల్ని ముంచి శిక్షిస్తోంది.

ఓ స్వామీ ఇక నుండి మేము మీయొక్క ప్రతిమాట వేదవాక్కులా అనుకరిస్తాము. కావున ఈ ప్రమాదంనుండి మమ్మల్ని కాపాడి క్షేమంగా షేగాం తీసుకు వెళ్ళండి అన్నారు. వాళ్ళు అలా ప్రార్ధిస్తూండగానే అప్పటికే సగంపడవ నీళ్ళలోకి పోయింది. దానిని చూస్తున్న వాళ్ళు, ఈ ఐదుగురూ త్వరలో మునిగి పోతారు అని అంటున్నారు. కలవరపడకండి ఈ పవిత్ర నర్మద మీకు హానిచేయదు అని అప్పడు శ్రీమహారాజు అన్నారు. అలా అంటూ నర్మదని పొగుడుతూ శ్రీమహారాజు ఇలా వర్ణించడం మొదలు పెట్టారు.

ప్రతిచెడునూ నాశనంచేసే ఓ పవిత్రమైన నర్మదాదేవీ మీదయతో వీళ్ళతప్పును క్షమించు అని ఆయన ప్రార్ధిస్తూండగానే పడవలోనుండి నీళ్ళు బయటకు వెళ్ళిపోయాయి, నర్మద తన చేతితో పడవక్రింద కన్నాన్ని మూసివేసింది. పడవ మామూలుగా ఇదివరకటిలాగా నదిలో పైకితేలింది. దానితో పాటు నర్మదకూడా మనుష్యరూపంలో కనిపించింది.

ఆమె ఒక మశ్చకన్య రూపంలో రింగుల జుత్తుతో నడుంవరకు తడిగా ఉంది. పడవ ఒడ్డుకు చేరింది. అందరూ పడవ క్రిందిభాగం చూసి, ఓదేవీ మీరు మమ్మల్ని రక్షించారు. దయచేసి మీరు ఎవరో మాకు చెప్పండి. దయచేసి ఈ తడిబట్టలు మార్చుకోండి. మాదగ్గర మీకుఇచ్చేందుకు పొడిబట్టలు ఉన్నాయి అన్నారు. నేను ఓంకార్ అనే చేపలు పట్టేవాని కుమార్తెను, నాపేరు నర్మద, నాకు ఇలా తడిబట్టలలో ఉండడం అలవాటు, నేను ఎప్పుడూ తడిగానే ఉంటాను, నారూపమే నీళ్ళు అని పవిత్రమైన నర్మద అంది. అలా అంటూ శ్రీమహారాజుకు నమస్కరించి, ఆకాశంలో మెరుపులా అకస్మాత్తుగా అదృశ్యం అయింది.

ఇదంతా చూసిన ఈ నలుగురూ స్వయంగా నర్మద ఆయన దర్శనానికి వచ్చినందుకు శ్రీమహారాజు ఆధిక్యానికి పరవసులయ్యారు. అయినాసరే బనకట్ శ్రీమహారాజును అ స్త్రీ ఎవరో తమకు చెప్పవలసిందిగా అడిగాడు. నువ్వు అడుగుతున్నది నర్మద నీకు ఇదివరకే చెప్పింది.

ఓంకార్ మశ్చ్యకారుడు ఈ ఓంకారేశ్వరుడు, నాస్వరూపం నీళ్ళు అని ఆమెఅంది, అంటే తనే స్వయంగా నర్మద. మనసులో ఏవిధమయిన సంకోచం పెట్టుకోకు, ఆమె ఎప్పడూ కష్టంలో ఉన్న తన భక్తులకు చేయూతనిస్తుంది. కావున గట్టిగా ఆమెకు జేజేలు చేస్తూ ఎప్పడూ మమ్మల్ని ప్రమాదస్థితుల నుండి కాపాడమని ప్రార్ధించండి అని శ్రీమహారాజు వాళ్ళతో అన్నారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 73 🌹

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj

🌻 Chapter 14 - part 4 🌻

On their way, the boat dashed against a rock and a plank at the bottom of the boat was washed away. The water started rushing in through that hole and looking to it, the boatmen jumped out in the river for the safety of their lives. But Shri Gajanan Maharaj was sitting quietly and started chanting, “Gan Gan Ganat Bote” continously. Maroti, Bajarang, Martand and Bankatlal got scared and their hearts began throbbing with fright.

They, with folded hands, said, “O kind hearted Maharaj! We are guilty of disobeying You at Shegaon, as a result of which this holy Narmada is punishing by drowning us. O swami! We shall hereafter obey every word of Yours as if it were a directive from the Vedas. So kindly save us from this danger by taking us safely back to Sheagaon.”

As they were praying so, half of the boat had already gone under water. Onlookers were saying that these five persons would soon be drowned. Thereupon Shri Gajanan Maharaj said, “Don't get panicky! This holy Narmada will not hurt you at all.” Saying so, Shri Gajanan Maharaj started reciting the following in the praise of Narmada, “O Sacred Narmada Devi! Destroyer of everything that is inauspicious! Pardon their fault by your kindness.”

As He was reciting the above prayer, the water went away from the boat, and the hole was closed by the hand of Narmada. The Boat came up floating on the water as before and alongwith it was seen Narmada herself in human form. She, in the dress of a fisher woman, and with curly hair, was wet upto her waist.

The boat reached the shore and all of them looked surprisingly at the bottom of the boat and said, “O lady! You have saved us. Kindly tell us who You are. Please change Your wet clothes. We have dry clothing to offer You.” Holy Narmada said, “I am the daughter of Omkar fisherman.

My name is Narmada and it is my habit to be in wet clothes. I always remain wet as my form is water.” Saying so, she bowed before Shri Gajanan Maharaj, and suddenly disappeared like a lightening in the sky. Looking to that, all the four were overjoyed to see the authority wielded by Shri Gajanan Maharaj , as the holy Narmada, herself, had come for his Darshan.

Even then Bankatlal asked Shri Gajanan Maharaj to tell them as to who the lady was. Shri Gajanan Maharaj said, “What you are asking has already been told by Narmada to you. The fisherman Omkar, is this Omkareshwar. When She said that the water is Her form, She means that she, herself, is the Narmada river.

Do not have any doubt in your mind. She always extends Her helping hand to Her devotees in the times of danger. So, say loudly Jai! to Her with a prayer requesting you to save us in times of danger.”

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

06 Oct 2020

శివగీత - 84 / The Siva-Gita - 84

🌹.   శివగీత - 84 / The Siva-Gita - 84   🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

దశమాధ్యాయము

🌻. జీవ స్వరూప నిరూపణము - 10 🌻

భూత జన్మిని యద్భూతం - కరమత ద్వాసనావశాత్ |

నేదీ యస్త్యా ద్వయస్యాద్యే - స్వప్నం ప్రాయః ప్రపశ్యతి 46

మధ్యే వయసి కార్కశ్యా - త్కరణానా మిహార్జతః |

ప్రాయేణ వీక్షతే స్వప్నం - వాసనా కర్మణోర్వశాత్ 47

యియాసుః పరలోకంతు - కర్మ విద్యాది సంభ్రతమ్ |

భావినో జన్మనో రూపం - స్వప్న ఆత్మా ప్రపశ్యతి 48

యద్వత్ప్ర పతనాచ్చ్యేన - శ్శ్రాన్తో గగన మండలే |

ఆకుంచ్య పక్షౌ యతతే - నీడే నిశ్మయనాయనే 49

ఏవం జాగ్రత్స్వప్న భూమౌ - శాన్త ఆత్మాభి సంచరన్ |

అపీత కరణగ్రామః కారణే నైతి చైకతామ్ 50

శైశ వావస్థలో నేది యగుచున్నదో (జరుగుచున్నదో) ఆయా కార్యము వెనుకటి జన్మవాసన చేత జరుగుచున్నదిగా తెలియవలెను. శైశవ మనునది మొదటి జన్మకు సన్నిహిత సంబంధము కలది కావున అట్టి జన్ముల సంస్కారము అంటుకొని యుండును.

అవన్నియు స్వప్నమున అప్పుడప్పుడు దర్శన మిచ్చుచుండును. జ్ఞాన నిష్ఠా చరణాదుల సంపాదించబడిన ఫలితముగ పరలోక సుఖమున నుభవింప కోరిక యునవాడు (ప్రాణి) స్వప్నమున భవిష్య జ్జన్మ రూపమున గాంచుచున్నాడు.

ఎక్కువ వేగముతో పరుగిడిన డేగ తన గూటిలో నెట్లు ప్రవేశించి విశ్రాంతిని పొందునో అట్లుగానే జాగ్రత్స్వప్నాదుల అలసిన జీవుడు కూడ ఇంద్రియముల నెల్ల తనలో సంస్కార రూపమున అణచుకొని ఈశ్వరునితో నైక్యమును పొందుచున్నాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹   The Siva-Gita - 84   🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj

Chapter 10
🌻 Jeeva Swaroopa Niroopanam - 10
🌻

In the infancy whatever acts happens, they happen due to the Vasanas of the previous birth's karmas.

Since infancy is closely related to the past birth's actions, it remains influenced with the Vasanas of the previous birth. Sometimes these past birth's actions appear in dreams as well.

As a result of devotion and spiritualism, one having desires to enjoy the bliss of upper worlds, sees his future birth form in the dreams.

The way a swiftly running animal gets quickly inside her home and sleeps instantly, in the same way one who is tired from wakeful and dream states, becomes one with the Eswara by controlling the senses.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

06 Oct 2020

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 38, 39 / Vishnu Sahasranama Contemplation - 38, 39

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 38, 39 / Vishnu Sahasranama Contemplation - 38, 39 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 38. శంభుః, शंभुः, Śaṃbhuḥ 🌻

ఓం శంభవే నమః | ॐ शंभवे नमः | OM Śaṃbhave namaḥ

శం సుఖం భక్తానాం భావయతీతి శంభుః భక్తులకు సుఖమును కలిగించును. అంతఃకరణమునకు, బాహ్యమునకు శుభములను యిచ్చువాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 38 🌹

📚. Prasad Bharadwaj

🌻 38.Śaṃbhuḥ 🌻

OM Śaṃbhave namaḥ

Saṃ sukhaṃ bhaktānāṃ bhāvayatīti śaṃbhuḥ One who bestows happiness on devotees. He who brings Auspiciousness - both inner goodness and outer prosperity.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

स्वयम्भूश्शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः ।अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः ॥ 5 ॥

స్వయమ్భూశ్శమ్భురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః ।అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ॥ 5 ॥

Svayambhūśśambhurādityaḥ puṣkarākṣo mahāsvanaḥ ।Anādinidhano dhātā vidhātā dhāturuttamaḥ ॥ 5 ॥

Continues....
🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 39 / Vishnu Sahasranama Contemplation - 39 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 39. ఆదిత్యః, आदित्यः, Ādityaḥ 🌻

ఓం ఆదిత్యాయ నమః | ॐ आदित्याय नमः | OM Ādityāya namaḥ

ఆదిత్యః సూర్య మండలాతర్భాగమున నుండు హిరణ్మయ పురుషుడు. ఆదిత్యే భవః ఆదిత్యునందు ఉండువాడు. లేదా ఎట్లు ఆదిత్యుడు ఒక్కడే అయియుండియు అనేక జల పాత్రములయందు ప్రతిబింబిచుటచే అనేకులవలె ప్రతిభాసించుచున్నాడో, అదియే విధమున ఆత్మయు (పరమాత్ముడును) అనేక శరీరములయందు అనేకులవలె ప్రతిభాసించుచున్నాడు.

:: భగవద్గీత - విభూతి యోగము ::

ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ ।

మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ॥ 21 ॥

నేను ఆదిత్యులలో విష్ణువనువాడను. (1. ధాత, 2. మిత్రుడు, 3. అర్యముడు, 4. శక్రుడు, 5. వరుణుడు, 6. అంశువు, 7. భగుడు, 8. వివస్వంతుడు, 9. పూష, 10. సవిత, 11. త్వష్ట, 12. విష్ణువు), ప్రకాశింపజేయువానిలో కిరణములుగల సూర్యుడను, మరుత్తులలను దేవతలలో మరీచియనువాడను, నక్షత్రములలో చంద్రుడను అయియున్నాను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 39 🌹

📚. Prasad Bharadwaj

🌻 39.Ādityaḥ 🌻

OM Ādityāya namaḥ

The Golden-hued person in the Sun's orb. It may also imply the meaning that just as one Sun reflects as many in different water receptacles, it is one Spirit that is reflecting as many Jīvas in numerous body-minds.

Bhagavad Gīta - Chapter 10

Ādityānāmahaṃ Viṣṇurjyotiṣāṃ raviraṃśumān,

Marīcirmarutāmasmi nakṣatrāṇāmahaṃ śaśī. (21)

Among the Ādityās, I am Viṣṇu (1. Dhāta, 2. Mitra, 3. Aryama, 4. Śakra, 5. Varuṇa, 6. Aṃśu, 7. Bhaga, 8. Vivasvaṃta, 9. Pūṣa, 10. Savita, 11. Tvaṣṭa, 12. Viṣṇu), among the luminaries, the radiant Sun, among the (49) Maruts I am Marīcī, among the stars I am the moon.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

स्वयम्भूश्शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः ।अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः ॥ 5 ॥

స్వయమ్భూశ్శమ్భురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః ।అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ॥ 5 ॥

Svayambhūśśambhurādityaḥ puṣkarākṣo mahāsvanaḥ ।Anādinidhano dhātā vidhātā dhāturuttamaḥ ॥ 5 ॥

Continues....
🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

06 Oct 2020

6-October-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 510 / Bhagavad-Gita - 510 🌹 
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 38, 39 / Vishnu Sahasranama Contemplation - 38, 39 🌹
3) 🌹 Sripada Srivallabha Charithamrutham - 298 🌹
4) 🌹 Guru Geeta - Datta Vaakya - 87 🌹
5) 🌹. శివగీత - 84 / The Shiva-Gita - 84🌹
6) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 72 / Gajanan Maharaj Life History - 72🌹 
9) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 66 🌹
10) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 21, 22 / Sri Lalita Chaitanya Vijnanam - 21, 22🌹 
11) *🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 14🌹*
12) 🌹. శ్రీమద్భగవద్గీత - 426 / Bhagavad-Gita - 426 🌹

13) 🌹. శివ మహా పురాణము - 240 🌹
14) 🌹 Light On The Path - 6 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 128 🌹
16) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 70 🌹
17) 🌹 Seeds Of Consciousness - 192 🌹 
18) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 46 📚
19) 🌹. అద్భుత సృష్టి - 47 🌹
20) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 30 / Sri Vishnu Sahasranama - 30 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 510 / Bhagavad-Gita - 510 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 20 🌴*

20. గుణానేతానతీత్య త్రీన్ దేహీ దేహసముద్భవాన్ |
జన్మమృత్యుజరాదు:ఖైర్విముక్తో(మృతమశ్నుతే ||

🌷. తాత్పర్యం : 
*దేహధారియగు జీవుడు దేహముతో కూడియున్న ఈ త్రిగునములను దాటగాలిగినప్పడు జనన, మరణ, వార్ధక్యక్యముల నుండియు మరియు వాని దు:ఖముల నుండియు విడివడి ఈ జన్మమునందే అమృతత్వమును పొందును.*

🌷. భాష్యము :
సంపూర్ణ కృష్ణభక్తిభావనలో ప్రస్తుత దేహమునందే మనుజుడు ఏ విధముగా ఆధ్యాత్మికస్థితిలో నిలువగలడో ఈ శ్లోకమున వివరింపబడినది. “దేహే” యను పదమునకు దేహధారి యని భావము. అనగా జీవుడు దేహధారియైనను ఆధ్యాత్మికజ్ఞానమునందు పురోగతిని బడయుట ద్వారా త్రిగుణముల ప్రభావము నుండి బయటపడగలడు. దేహత్యాగము పిమ్మట నిక్కముగా భగవద్దామమునకు చేరనున్నందున అతడు ప్రస్తుత దేహమునందే ఆధ్యాత్మికజీవన ఆనందమును అనుభవింపగలడు. 

ఆధ్యాత్మికకానందమును అతడు ప్రస్తుత దేహమునందు అనుభవించుననుట నిశ్చయమైన విషయము. అనగా కృష్ణభక్తిభావనలో నొనరింపబడు భక్తియుత సేవ భౌతికసంపర్కము నుండి ముక్తికి చిహ్నమై యున్నది. ఈ విషయము రాబోవు అష్టాదశాధ్యాయమున వివరింపబడును. అనగా త్రిగుణముల ప్రభావము నుండి మనుజుడు బయటపడినపుడు భక్తియుతసేవ యందు ప్రవేశించును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 510 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 20 🌴*

20. guṇān etān atītya trīn
dehī deha-samudbhavān
janma-mṛtyu-jarā-duḥkhair
vimukto ’mṛtam aśnute

🌷 Translation : 
*When the embodied being is able to transcend these three modes associated with the material body, he can become free from birth, death, old age and their distresses and can enjoy nectar even in this life.*

🌹 Purport :
How one can stay in the transcendental position, even in this body, in full Kṛṣṇa consciousness, is explained in this verse. The Sanskrit word dehī means “embodied.” 

Although one is within this material body, by his advancement in spiritual knowledge he can be free from the influence of the modes of nature. He can enjoy the happiness of spiritual life even in this body because, after leaving this body, he is certainly going to the spiritual sky. 

But even in this body he can enjoy spiritual happiness. In other words, devotional service in Kṛṣṇa consciousness is the sign of liberation from material entanglement, and this will be explained in the Eighteenth Chapter. When one is freed from the influence of the modes of material nature, he enters into devotional service.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Sripada Srivallabha Charithamrutham - 299 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 40
*🌴 Meeting with Bhaskar - 2 🌴*

*🌻 Sri Rajarajeswari Devi represents ‘discrimination’ 🌻*

He said ‘My Dear! The chaitanyam of Rajarajeswari will remain located above our thinking mind and our ‘will’ in a vast area. 

 The thinking mind normally changes into ‘intellect’. Instead of that, the Mother will help to turn the mind towards ‘discrimination’ (the capacity to think which is truth and which is not).  

Thus She does the purification process. She graces us so that our ‘will’ leaves the narrow boundaries and develops vastness. Normally, ‘power’ and ‘discrimination’ will not stay together.  

But the grace of Rajarajeswari will see that ‘power’ and ‘discrimination’ stay together in us. The divine chaitanyam will have many facets. She will see that our mind opens the door for them. She helps to develop broad mindedness in the world. 

 Her grace is very much essential to have wonderful divine knowledge, to develop divine motherly powers in us and in the whole world and to achieve great works in a stable peaceful atmosphere. Rajarajeswari Devi represents the endless ‘discrimination’. If she wants to know, there is nothing which she can not know.  

She understands all the things, all living beings, their nature, the powers which move them, the dharma of this world and the appropriate time related to it. She has no partiality. She will not have hatred or affection towards anybody.  

She will consider people, who earned darshan of future by the power of sadhana, as trusted people and will accept them as her own people. People, who develop this power of Rajarajeswari, will be able to destroy their enemy power with their ‘discrimination’.  

She will give appropriate result. She will not keep any relation with anything in the world and will remain neutral. She will deal with everybody depending on their nature, necessity and capability. She will not force Her ‘will’ on any body.  

She will make people who accept transformation, advance forward accordingly. She will allow ‘ajnanis’ to go in their ‘ajnana’ path. She will respect the individuality developed by those people. She is not bothered if they are uplifted or spoiled.  

Her grace is endless and can not be exhausted. In Her looks, all are Her children only. She will consider Asuras (demons) and pisachas also as Her children. Her compassion is not blind unlike that of humans.  

Though She had endless compassion, She will not leave ‘vivekam’ - discrimination. She will not deviate from the path ordered by Paramatma. Jnanam is the center of Her power.  

So, if we get Her grace, we will have ‘satya jnana bodha’. To get Her power, we have to follow the ‘karthavya deeksha’ and satya sodhana (contemplation of truth). Then only we will be graced by Her.

I became successful in Rajarajeswari ‘deeksha’, because I was a native of Peethikapuram and became eligible for Sripada’s grace.  

This day is the day of my deeksha. This is the time when I should have been in dhyana. Tomorrow I will tell you in what circumstances Sripada started from Peethikapuram for roaming in the country.  

Before you came here, Sripada took a small quantity of ‘pulihora’ I offered. He gives darshan in the form of Rajarajeswari. Take that ‘maha prasadam’ and you also go into dhyana.’ 

End of Chapter 40

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 38, 39 / Vishnu Sahasranama Contemplation - 38, 39 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 38. శంభుః, शंभुः, Śaṃbhuḥ 🌻*

*ఓం శంభవే నమః | ॐ शंभवे नमः | OM Śaṃbhave namaḥ*

శం సుఖం భక్తానాం భావయతీతి శంభుః భక్తులకు సుఖమును కలిగించును. అంతఃకరణమునకు, బాహ్యమునకు శుభములను యిచ్చువాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 38 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 38.Śaṃbhuḥ 🌻*

*OM Śaṃbhave namaḥ*

Saṃ sukhaṃ bhaktānāṃ bhāvayatīti śaṃbhuḥ One who bestows happiness on devotees. He who brings Auspiciousness - both inner goodness and outer prosperity.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
स्वयम्भूश्शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः ।अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः ॥ 5 ॥ 

స్వయమ్భూశ్శమ్భురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః ।అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ॥ 5 ॥

Svayambhūśśambhurādityaḥ puṣkarākṣo mahāsvanaḥ ।Anādinidhano dhātā vidhātā dhāturuttamaḥ ॥ 5 ॥

Continues....
🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 39 / Vishnu Sahasranama Contemplation - 39 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 39. ఆదిత్యః, आदित्यः, Ādityaḥ 🌻*

*ఓం ఆదిత్యాయ నమః | ॐ आदित्याय नमः | OM Ādityāya namaḥ*

ఆదిత్యః సూర్య మండలాతర్భాగమున నుండు హిరణ్మయ పురుషుడు. ఆదిత్యే భవః ఆదిత్యునందు ఉండువాడు. లేదా ఎట్లు ఆదిత్యుడు ఒక్కడే అయియుండియు అనేక జల పాత్రములయందు ప్రతిబింబిచుటచే అనేకులవలె ప్రతిభాసించుచున్నాడో, అదియే విధమున ఆత్మయు (పరమాత్ముడును) అనేక శరీరములయందు అనేకులవలె ప్రతిభాసించుచున్నాడు.

:: భగవద్గీత - విభూతి యోగము ::
ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్ ।
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ॥ 21 ॥

నేను ఆదిత్యులలో విష్ణువనువాడను. (1. ధాత, 2. మిత్రుడు, 3. అర్యముడు, 4. శక్రుడు, 5. వరుణుడు, 6. అంశువు, 7. భగుడు, 8. వివస్వంతుడు, 9. పూష, 10. సవిత, 11. త్వష్ట, 12. విష్ణువు), ప్రకాశింపజేయువానిలో కిరణములుగల సూర్యుడను, మరుత్తులలను దేవతలలో మరీచియనువాడను, నక్షత్రములలో చంద్రుడను అయియున్నాను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 39 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 39.Ādityaḥ 🌻*

*OM Ādityāya namaḥ*

The Golden-hued person in the Sun's orb. It may also imply the meaning that just as one Sun reflects as many in different water receptacles, it is one Spirit that is reflecting as many Jīvas in numerous body-minds.

Bhagavad Gīta - Chapter 10
Ādityānāmahaṃ Viṣṇurjyotiṣāṃ raviraṃśumān,
Marīcirmarutāmasmi nakṣatrāṇāmahaṃ śaśī. (21)

Among the Ādityās, I am Viṣṇu (1. Dhāta, 2. Mitra, 3. Aryama, 4. Śakra, 5. Varuṇa, 6. Aṃśu, 7. Bhaga, 8. Vivasvaṃta, 9. Pūṣa, 10. Savita, 11. Tvaṣṭa, 12. Viṣṇu), among the luminaries, the radiant Sun, among the (49) Maruts I am Marīcī, among the stars I am the moon.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
स्वयम्भूश्शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः ।अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः ॥ 5 ॥ 

స్వయమ్భూశ్శమ్భురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః ।అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ॥ 5 ॥

Svayambhūśśambhurādityaḥ puṣkarākṣo mahāsvanaḥ ।Anādinidhano dhātā vidhātā dhāturuttamaḥ ॥ 5 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 84 / The Siva-Gita - 84 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ 

దశమాధ్యాయము
*🌻. జీవ స్వరూప నిరూపణము - 10 🌻*

భూత జన్మిని యద్భూతం - కరమత ద్వాసనావశాత్ |
నేదీ యస్త్యా ద్వయస్యాద్యే - స్వప్నం ప్రాయః ప్రపశ్యతి 46
మధ్యే వయసి కార్కశ్యా - త్కరణానా మిహార్జతః |
ప్రాయేణ వీక్షతే స్వప్నం - వాసనా కర్మణోర్వశాత్ 47
యియాసుః పరలోకంతు - కర్మ విద్యాది సంభ్రతమ్ |
భావినో జన్మనో రూపం - స్వప్న ఆత్మా ప్రపశ్యతి 48
యద్వత్ప్ర పతనాచ్చ్యేన - శ్శ్రాన్తో గగన మండలే |
ఆకుంచ్య పక్షౌ యతతే - నీడే నిశ్మయనాయనే 49
ఏవం జాగ్రత్స్వప్న భూమౌ - శాన్త ఆత్మాభి సంచరన్ |
అపీత కరణగ్రామః కారణే నైతి చైకతామ్ 50

శైశ వావస్థలో నేది యగుచున్నదో (జరుగుచున్నదో) ఆయా కార్యము వెనుకటి జన్మవాసన చేత జరుగుచున్నదిగా తెలియవలెను. శైశవ మనునది మొదటి జన్మకు సన్నిహిత సంబంధము కలది కావున అట్టి జన్ముల సంస్కారము అంటుకొని యుండును. 

అవన్నియు స్వప్నమున అప్పుడప్పుడు దర్శన మిచ్చుచుండును. జ్ఞాన నిష్ఠా చరణాదుల సంపాదించబడిన ఫలితముగ పరలోక సుఖమున నుభవింప కోరిక యునవాడు (ప్రాణి) స్వప్నమున భవిష్య జ్జన్మ రూపమున గాంచుచున్నాడు. 

ఎక్కువ వేగముతో పరుగిడిన డేగ తన గూటిలో నెట్లు ప్రవేశించి విశ్రాంతిని పొందునో అట్లుగానే జాగ్రత్స్వప్నాదుల అలసిన జీవుడు కూడ ఇంద్రియముల నెల్ల తనలో సంస్కార రూపమున అణచుకొని ఈశ్వరునితో నైక్యమును పొందుచున్నాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 The Siva-Gita - 84 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayala somayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 10 
*🌻 Jeeva Swaroopa Niroopanam - 10 🌻*

In the infancy whatever acts happens, they happen due to the Vasanas of the previous birth's karmas.

Since infancy is closely related to the past birth's actions, it remains influenced with the Vasanas of the previous birth. Sometimes these past birth's actions appear in dreams as well. 

As a result of devotion and spiritualism, one having desires to enjoy the bliss of upper worlds, sees his future birth form in the dreams. 

The way a swiftly running animal gets quickly inside her home and sleeps instantly, in the same way one who is tired from wakeful and dream states, becomes one with the Eswara by controlling the senses.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 87 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
80

Ashtavakra’s father once went to Mithila and lost a debate against scholars. He subsequently sacrificed his mortal body. Ashtavakra found out about this through his mother. He studied the Vedas and completed his education by the age of 12 years. He remembered the insult his father was met with.  

At exactly that time, he heard about a great Yajna that king Janaka was organizing. So, he went to Mithila, the city of scholars. Mithila was referred to as the city of scholars. Perhaps, all the scholars were there. At the main entrance to the kingdom, the highly-educated guards stopped the saint and questioned him per the scriptures. The guards were also learned in the scriptures.  

All the citizens of the kingdom were learned in the scriptures. So, when Maharishi Ashtavakra reached the entrance to the kingdom, the guards stopped him and questioned him in a logical manner as prescribed in the scriptures. 

The Maharishi imparted wisdom to them saying, “The king himself should step aside and give way to the physically handicapped, to the blind and to women. I am physically deformed. When scholars like me enter, even the king shouldn’t come in the way, correct? He should give way, correct? I am not saying this. The scriptures say this”. 

Saying this, Ashtavakra stepped in to the kingdom. This news instantly reached the ears of king Janka. King Janaka was happy. He ordered the guards to send the saint in. There, another guard stopped the saint and said, “Children like you should not be coming here. 

Only those highly proficient in the Vedas should come here”. To this, the saint skilfully replied, “I am not a child. I too studied the Vedas. Don’t go by my appearance. You should not judge anyone as big or small based on age or appearance. Proficiency doesn’t come to one based on appearance. 

On the other hand, just because someone is aged, they don’t become elderly. Don’t assume that someone with white beard, white hair and matted locks is well versed in the scriptures.  

Don’t assume that someone in their ripe old age is a Sanyasin. Not everyone that is aged is elderly. Only those ripened by wisdom are the elderly. The elderly are those that are ripened completely by knowledge.  

That means, only one with intelligence can be considered a human being”. Saying this, the saint crossed that gate too. By then, king Janaka who had already heard about the brilliance of Maharishi Ashtavakra quickly came down to receive and worship him. 

The king knew which scriptures the sage was quoting from and which scriptures the guards were referring to. The king was eager to see such a great saint, so he himself came running down to honor and worship the saint.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 73 / Sri Gajanan Maharaj Life History - 73 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 14వ అధ్యాయము - 4 🌻*

నదిలో భేదార్ ఘాట్ కు తిరుగు ప్రయాణం ప్రారంభమయింది. దారిలో ఆపడవ ఒకరాయిని కొట్టుకుని పడవ క్రిందిభాగంలో ఒకచెక్క నీళ్ళలో కొట్టుకుపోయింది. నీళ్ళు పడవలోనికి దూసుకు రావడం మొదలు పెట్టాయి. ఇది చూసి పడవ నడిపేవాడు వాళ్ళజీవితాలు రక్షించేందుకు నదిలోకి దూకుతాడు. కానీ శ్రీమహారాజు ప్రశాంతంగా కూర్చుని గణ గణ గణాత బోతే అని నిర్విరామంగా భజించడం మొదలు పెట్టారు. 

మారుతి, భజరంగ్, మార్తాండ్ మరియు బనకటలాల్ భయపడి వాళ్ళ గుండెలు భయంతో బిగుసు కోవడం మొదలు పెట్టాయి. వాళ్ళు చేతులు కట్టుకుని ఓకరుణా హృదయుడైన మహారాజ్ షేగాంలో మీమాట అలక్ష్యం చేసినందుకు మేము సిగ్గు పడుతున్నాం, దానిఫలితంగానే నర్మద మమ్మల్ని ముంచి శిక్షిస్తోంది. 

ఓ స్వామీ ఇక నుండి మేము మీయొక్క ప్రతిమాట వేదవాక్కులా అనుకరిస్తాము. కావున ఈ ప్రమాదంనుండి మమ్మల్ని కాపాడి క్షేమంగా షేగాం తీసుకు వెళ్ళండి అన్నారు. వాళ్ళు అలా ప్రార్ధిస్తూండగానే అప్పటికే సగంపడవ నీళ్ళలోకి పోయింది. దానిని చూస్తున్న వాళ్ళు, ఈ ఐదుగురూ త్వరలో మునిగి పోతారు అని అంటున్నారు. కలవరపడకండి ఈ పవిత్ర నర్మద మీకు హానిచేయదు అని అప్పడు శ్రీమహారాజు అన్నారు. అలా అంటూ నర్మదని పొగుడుతూ శ్రీమహారాజు ఇలా వర్ణించడం మొదలు పెట్టారు. 

ప్రతిచెడునూ నాశనంచేసే ఓ పవిత్రమైన నర్మదాదేవీ మీదయతో వీళ్ళతప్పును క్షమించు అని ఆయన ప్రార్ధిస్తూండగానే పడవలోనుండి నీళ్ళు బయటకు వెళ్ళిపోయాయి, నర్మద తన చేతితో పడవక్రింద కన్నాన్ని మూసివేసింది. పడవ మామూలుగా ఇదివరకటిలాగా నదిలో పైకితేలింది. దానితో పాటు నర్మదకూడా మనుష్యరూపంలో కనిపించింది. 

ఆమె ఒక మశ్చకన్య రూపంలో రింగుల జుత్తుతో నడుంవరకు తడిగా ఉంది. పడవ ఒడ్డుకు చేరింది. అందరూ పడవ క్రిందిభాగం చూసి, ఓదేవీ మీరు మమ్మల్ని రక్షించారు. దయచేసి మీరు ఎవరో మాకు చెప్పండి. దయచేసి ఈ తడిబట్టలు మార్చుకోండి. మాదగ్గర మీకుఇచ్చేందుకు పొడిబట్టలు ఉన్నాయి అన్నారు. నేను ఓంకార్ అనే చేపలు పట్టేవాని కుమార్తెను, నాపేరు నర్మద, నాకు ఇలా తడిబట్టలలో ఉండడం అలవాటు, నేను ఎప్పుడూ తడిగానే ఉంటాను, నారూపమే నీళ్ళు అని పవిత్రమైన నర్మద అంది. అలా అంటూ శ్రీమహారాజుకు నమస్కరించి, ఆకాశంలో మెరుపులా అకస్మాత్తుగా అదృశ్యం అయింది. 

ఇదంతా చూసిన ఈ నలుగురూ స్వయంగా నర్మద ఆయన దర్శనానికి వచ్చినందుకు శ్రీమహారాజు ఆధిక్యానికి పరవసులయ్యారు. అయినాసరే బనకట్ శ్రీమహారాజును అ స్త్రీ ఎవరో తమకు చెప్పవలసిందిగా అడిగాడు. నువ్వు అడుగుతున్నది నర్మద నీకు ఇదివరకే చెప్పింది. 

ఓంకార్ మశ్చ్యకారుడు ఈ ఓంకారేశ్వరుడు, నాస్వరూపం నీళ్ళు అని ఆమెఅంది, అంటే తనే స్వయంగా నర్మద. మనసులో ఏవిధమయిన సంకోచం పెట్టుకోకు, ఆమె ఎప్పడూ కష్టంలో ఉన్న తన భక్తులకు చేయూతనిస్తుంది. కావున గట్టిగా ఆమెకు జేజేలు చేస్తూ ఎప్పడూ మమ్మల్ని ప్రమాదస్థితుల నుండి కాపాడమని ప్రార్ధించండి అని శ్రీమహారాజు వాళ్ళతో అన్నారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 73 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 14 - part 4 🌻*

On their way, the boat dashed against a rock and a plank at the bottom of the boat was washed away. The water started rushing in through that hole and looking to it, the boatmen jumped out in the river for the safety of their lives. But Shri Gajanan Maharaj was sitting quietly and started chanting, “Gan Gan Ganat Bote” continously. Maroti, Bajarang, Martand and Bankatlal got scared and their hearts began throbbing with fright. 

They, with folded hands, said, “O kind hearted Maharaj! We are guilty of disobeying You at Shegaon, as a result of which this holy Narmada is punishing by drowning us. O swami! We shall hereafter obey every word of Yours as if it were a directive from the Vedas. So kindly save us from this danger by taking us safely back to Sheagaon.” 

As they were praying so, half of the boat had already gone under water. Onlookers were saying that these five persons would soon be drowned. Thereupon Shri Gajanan Maharaj said, “Don't get panicky! This holy Narmada will not hurt you at all.” Saying so, Shri Gajanan Maharaj started reciting the following in the praise of Narmada, “O Sacred Narmada Devi! Destroyer of everything that is inauspicious! Pardon their fault by your kindness.” 

As He was reciting the above prayer, the water went away from the boat, and the hole was closed by the hand of Narmada. The Boat came up floating on the water as before and alongwith it was seen Narmada herself in human form. She, in the dress of a fisher woman, and with curly hair, was wet upto her waist. 

The boat reached the shore and all of them looked surprisingly at the bottom of the boat and said, “O lady! You have saved us. Kindly tell us who You are. Please change Your wet clothes. We have dry clothing to offer You.” Holy Narmada said, “I am the daughter of Omkar fisherman. 

My name is Narmada and it is my habit to be in wet clothes. I always remain wet as my form is water.” Saying so, she bowed before Shri Gajanan Maharaj, and suddenly disappeared like a lightening in the sky. Looking to that, all the four were overjoyed to see the authority wielded by Shri Gajanan Maharaj , as the holy Narmada, herself, had come for his Darshan.

 Even then Bankatlal asked Shri Gajanan Maharaj to tell them as to who the lady was. Shri Gajanan Maharaj said, “What you are asking has already been told by Narmada to you. The fisherman Omkar, is this Omkareshwar. When She said that the water is Her form, She means that she, herself, is the Narmada river. 

Do not have any doubt in your mind. She always extends Her helping hand to Her devotees in the times of danger. So, say loudly Jai! to Her with a prayer requesting you to save us in times of danger.” 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 66 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 16 🌻*

271. బాహ్యమును సృష్టిలో ఏదైనను జరిగినట్లు, జరుగుచున్నట్లు జరగబోవునట్లు కనిపించినచో, అదియంతయు, భగవంతుడు"నేను ఎవరిని?" అన్నట్టి తన స్వీయమైన అనంత భగవద్విలాసము తరంగ చలితమైన క్షణికములో భగవంతుడు కనిన దివ్యస్వప్నము తప్ప మరేమియు కాదు.

272. భగవంతుడు, తన దివ్యమూలమైన అనంత దివ్యస్వప్నంలో శాశ్వతముగా ఏక కాలమందే సృష్టి--స్థితి--లయకారుల పాత్రలను నిర్వహించుకున్నారు.

273. భగవంతుడు మానవ స్థితిలో మానవునిగా, మానవునిలో నిద్రాణమైయున్న సంస్కారములు ద్వారా తన స్వీయ సృష్టికి, తానుకర్తయైన బ్రహ్మగను, 

బయటికి చిమ్మిన సంస్కారముల ద్వారా మానవుని దైనందిన జీవితంలో, తన స్వీయ సృష్టిని పోషించుటలో స్థితికారుడైన విష్ణువుగను, 

వ్యతిరేక సంస్కారముల ద్వారా పోషించుచున్న స్వీయ సృష్టిని నాశనమొనర్చుటలో లయకారుడైన మహేశ్వరునిగను-- ఇట్లు సృష్టి- స్థితి-లయకారుడైన జగత్కర్త (ఈశ్వరుడు)గా,తన విజయమును ధృవపరచు చున్నాడు.

274. (1) నిద్రాణ సంస్కారముల-- ద్వారా-- సృష్టిని,
(2) జాగృతిలో నిత్యజీవితము-- ద్వారా--స్థితిని
(3) సుషుప్తి లో వ్యతిరేక సంస్కారముల -- ద్వారా -- లయమును అనుభవించుట ద్వారా జగత్కర్తయౌచున్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 21, 22 / Sri Lalitha Chaitanya Vijnanam - 21, 22 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*8. కదంబ  మంజరీ  క్లుప్త  కర్ణపూర మనోహర*
*తాటంక యుగళీభూత తపనోడుప మండల*

*🌻 21. 'కదంబమంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా' 🌻*

అమ్మ చెవి పై భాగమున కదంబ పుష్పగుచ్ఛమును ధరించుట చే మనోహరయై యొప్పుచున్నదని భావము. కదంబ మంజరి యనగా కదంబ పుష్పముల గుత్తి. అవి కర్ణమును పూరించి మనోహరత్వమును కలిగించు రీతిగ నున్నవి.

కర్ణమనగా చెవి యని ఒక అర్థము. లంబకోణ త్రిభుజమున
లంబకోణమున కెదురుగా యున్న భుజమును కూడా 'కర్ణ' మందురు. కర్ణము మీది చతురస్రము మిగిలిన రెండు భుజముల మీది చతురస్రములతో సమానమని 'పైథాగరస్' అను ఋషి తెలిపినట్లుగా మనము భావింతుము. 

కానీ, యీ సిద్ధాంతము వేదకాలము నాటిదే. లంబకోణ త్రిభుజము నందలి నిలువు భుజము అయ్యవారుగను లేక పురుషునిగను, అడ్డము భుజము అమ్మవారిగను లేక మూల ప్రకృతిగను, ఈ రెండింటి సమాగమమే (సమమైన కలయికయే) కర్ణమను వెలుగునకు కారణమని, అట్టి వెలుగు నాధారముగా అగ్ని పుంజములుగ, పుంఖాను పుంఖములుగ సిందూర వర్ణములో సృష్టి యేర్పడినదని, అట్టి సృష్టి అత్యంత మనోహరమైనదని ఋషులు దర్శించినారు.

కదంబ పుష్పము సిందూరవర్ణము గలదై యుండును. ఆ పుష్పముల గుత్తి సృష్టియనెడి పుష్పగుచ్ఛమే. దానిని ధరించినటు వంటిది కర్ణము లేక వెలుగు లేక మహాచైతన్యము. సృష్టి మనోహరత్వమును గూర్చి
వేదములే వర్ణింపలేకపోయినవి.

 ఇంతటి నర్మగర్భమైన భావమును ఈ మంత్రము ఆవిష్కరించుచున్నది. కర్ణముగ వ్యక్తమై దానిని పూరించు నట్లుగా పుంఖాను పుంఖములుగా సృష్టి గోళము లేర్పడుట ఈ మంత్రార్థము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 21 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 21. Kadamba- mañjarī- klpta- karṇapūra- manoharā कदम्ब-मञ्जरी-क्ल्प्त-कर्णपूर-मनोहरा (21) 🌻*

She is wearing the petals of kadamba flowers in Her ears or flowers kept in Her hair flow down to Her ears.  

These flowers are grown outside Her Cintāmani graha (The palace where She lives). These flowers have divine fragrance, which is derived from Her ear lobes.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 22 / Sri Lalitha Chaitanya Vijnanam - 22 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*8. కదంబ  మంజరీ  క్లుప్త  కర్ణపూర మనోహర*
*తాటంక యుగళీభూత తపనోడుప మండల*
 
*🌻 22. 'తాటంక యుగళీభూత తపనోడుప మండలా' 🌻*

సూర్య మండలము, చంద్ర మండలము అను రెండు గోళములనూ తన చెవులకు దుద్దులుగా ధరించినది అమ్మ అని భావము. అనగా సూర్య చంద్రాత్మకమగు సృష్టి ప్రజ్ఞలకు 'అమ్మ'యే మూల స్థానమని తెలియవలెను. 

సూర్యాత్మ ప్రజ్ఞ జీవులకు ప్రాణము నందించు చుండగ, చంద్రప్రజ్ఞ శరీరము - దాని పెరుగుదల - మనస్సు యిత్యాది వేర్పరచు చుండగ జీవ స్వరూపముగ సమస్త జీవకోటియందు అమ్మ అధిష్టించి యున్నది. 

ఇడ-పింగళ నాడులుగ, గంగా యమునల ప్రవాహముగ ఆరు కేంద్రముల నేర్పరచుకొనుచు మానవుని స్వరూపముగా సృష్టి పరిపూర్ణము గావించుచున్నది.

 శ్రీదేవియే 7వ కేంద్రమైన సహస్రారము నందు తానుండి సుషుమ్న ద్వారమున మూలాధారము వరకూ వ్యాపించి సమస్త లోకములను, మానవుని యందునూ - సృష్టి యందునూ శ్రీదేవియే నిర్వర్తించుచున్నది అని తెలియవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 22 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 22. Tāṭaṅka- yugalī- bhūta- tapanoḍupa- maṇḍalā ताटङ्क-युगली-भूत-तपनोडुप-मण्डला (22) 🌻*

She is wearing sun and moon as Her ear rings. This means She controls all the activities of the universe, as sun and moon are responsible for sustaining life. It is also said that sun and moon represent her eyes, earrings and bosoms.  

The bīja klīṁ (क्लीं) is symbolises Her two bosoms, which represent the two semi circles in the klīṁ bīja. The klīṁ bīja is also known as kāma bīja.  

Further details are to be learnt from a Guru. Most of the nāma-s of this Sahasranāma subtly convey various bīja-s and hence this Sahasranām is considered as very powerful.

Saundarya Laharī (verse 28) says, “Brahma, Indra and other celestials perish even though they have drunk nectar which confers immunity from frightful grey hairs (of old age) and death. 

 If the longevity of Śiva despite His swallowing the terrific poison is not limited by time, it is because of the greatness of your ear ornaments.”

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 426 / Bhagavad-Gita - 426 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 35 🌴*

35. సంజయ ఉవాచ
ఏతచ్చ్రుత్వా వచనం కేశవస్య
కృతాంజలిర్వేపమాన: కిరీటీ |
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం
సగద్గదం భీతభీత: ప్రణమ్య ||

🌷. తాత్పర్యం : 
ధృతరాష్ట్రునితో సంజయుడు పలికెను; ఓ రాజా! దేవదేవుని ఈ పలుకులను వినిన పిమ్మట కంపించుచున్న అర్జునుడు ముకుళిత హస్తుడై మరల మరల వందనముల నొసగెను. భీతిని కూడినవాడై అతడు డగ్గుత్తికతో శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను.

🌷. భాష్యము : 
పూర్వమే తెలుపబడినట్లు శ్రీకృష్ణభగవానుని విశ్వరూపముచే సృష్టింపబడిన పరిస్థితి కారణముగా అర్జునుడు సంభ్రమమునకు గురియయ్యెను. 

తత్కారణముగా అతడు కృష్ణునకు గౌరవపూర్వక వందనములను మరల మరల అర్పించుట మొదలిడెను. అతడు స్నేహితునివలె గాక, అద్భుతరసభావితుడైన భక్తునిగా గద్గదస్వరముతో ప్రార్థింపదొడగెను.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 426 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 35 🌴*

35. sañjaya uvāca
etac chrutvā vacanaṁ keśavasya
kṛtāñjalir vepamānaḥ kirīṭī
namaskṛtvā bhūya evāha kṛṣṇaṁ
sa-gadgadaṁ bhīta-bhītaḥ praṇamya

🌷 Translation : 
Sañjaya said to Dhṛtarāṣṭra: O King, after hearing these words from the Supreme Personality of Godhead, the trembling Arjuna offered obeisances with folded hands again and again. He fearfully spoke to Lord Kṛṣṇa in a faltering voice, as follows.

🌹 Purport :
As we have already explained, because of the situation created by the universal form of the Supreme Personality of Godhead, Arjuna became bewildered in wonder; thus he began to offer his respectful obeisances to Kṛṣṇa again and again, and with faltering voice he began to pray, not as a friend, but as a devotee in wonder.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 240 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
54. అధ్యాయము - 9

*🌻. మారగణములు - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! ఆ మన్మథుడు తన అనుచరులతో గూడి శివస్థానమునకు వెళ్లగానే, చిత్రమగు వృత్తాంతము జరిగినది. దానిని వినుము (1). 

మహావీరుడు, మోహకారకుడు నగు మన్మథుడు అచటకు చేరి వెంటనే తన ప్రభావమును విస్తరింపజేసెను. మరియు ప్రాణులను మోహపెట్టెను (2). 

వసంతుడు కూడా శివుని మోహపెట్టుటకై తన ప్రభావమును విస్తరింపజేసెను . ఓమునీ! ఏకకాలములో వృక్షములన్నియు పుష్పభరితములైనవి (3). 

మన్మథుడు రతితో గూడి అనేక ప్రయత్నములను చేసెను. జీవులన్నియు వశమైనవి.కాని గణేశుడు, శివుడు వానికి వశము కాలేదు (4).

ఓ మహర్షీ! మన్మథుడు వసంతునితో కలిసి చేసిన ప్రయత్నములన్నియూ వ్యర్థము కాగా, ఆతని గర్వము తొలగి పోయెను. అపుడా తడు నా వద్దకు మరలి వచ్చెను (5). 

ఓ మహర్షీ! ఆతడు గర్వము తొలగినవాడై, నిరుత్సాహముతో నుండి నాకు ప్రణమిల్లి గద్గదస్వరముతో నిట్లు పలికెను (6).

మన్మథుడిట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! యోగనిష్ఠుడగు శంభుని మోహింపజేయుట అసంభవము సుమా! నాకు గాని, ఇతరులకు గాని అట్టి శంభుని మోహింపజేయు శక్తి లేదు (7). 

హే బ్రహ్మన్‌! నేను నా మిత్రుడగు వసంతునితో, మరియు రతితో గూడి శివుని యందు ప్రయోగించిన ఉపాయములన్నియూ వ్యర్థయమ్యెను (8). 

హే బ్రహ్మన్‌! మేము శివుని మోహింపజేయుటకు చేసిన వివిధోపాయములను చెప్పెదను. తండ్రీ! వినుము (9). 

శంభుడు ఇంద్రియములను నియంత్రించి సమాధియందుండగా, అపుడు నేను సమాధియందున్న ఆ ముక్కంటి మహాదేవునకు నిరంతరముగా ప్రయత్నపూర్వకముగా చల్లని, వేగముగల, మోహమును కలిగించే, పరిమళభరితమైన వాయువుతో వీచితిని (10.11).

నేను నా అయిదు బాణములను మరియు ధనస్సును చేత బట్టి శివగణములను మోహింపజేయుచూ ఆయన చుట్టు ప్రక్కల తిరుగాడితిని (12). 

నేను ప్రవేశించుట తోడనే సర్వ ప్రాణులు నాకు తేలికగా వశమగును. కాని, శివప్రభువు మరియు ఆయన గణములు ఎట్టి వికారమునూ పొందనే లేదు (13).

 హే బ్రహ్మన్‌! ప్రమథ గణాధిపతి యగు ఆ శివుడు హిమవత్పర్వత మైదానములకు వెళ్లగా, అపుడు నేను గూడ రతితి, వసంతునితో గూడి అచటకు వెళ్లితిని (14). 

ఆ రుద్రుడు మేరు పర్వతమునకు గాని, నాగకేశర (?) పర్వతమునకు గాని, లేదా కైలాసమునకు గాని వెళ్లినప్పుడు నేను కూడా ఆయా స్థలములకు ఆయనను వెన్నంటి వెళ్లితిని (15).

ఎపుడైననూ శివుడు సమాధిని వీడినచో, ఆ సమయములో నేను ఆయన యెదుట చక్రవాక పక్షుల జంటను ప్రదర్శించితిని (16). 

హేబ్రహ్మన్‌! ఆ పక్షుల జంట పునః పునః హావభావములను ప్రకటించుచూ ఉత్తమమగు దాంపత్యపద్ధతిని ప్రకటించినవి (17). 

గణములతో కూడియున్న, నల్లని కంఠము గల ఆ మహాదేవుని యెదుట మృగములు, పక్షులు శృంగామును ప్రకటించినవి (18).

ఆయన యెదుట మరియు సమీపమునందు నెమలి జంట శృంగారరసమును ఉద్ధీపింపజేయు విధముగా వివిధ గతుల నాట్య మాడినది (19).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 6 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

*🌻 INTRODUCTION - 6 🌻*

21. Our fifth sub-race has by no means reached its highest point or its greatest glory, and that point when reached will be a definite advance upon all other civilizations, especially in certain respects. 

It will have its own characteristics and some of them may seem to us less pleasing than those of the earlier civilizations, but on the whole it will be an advance, because the successive races are like the tide when the waves are coming in. Each comes in and recedes, and the next one comes in just a little further. 

They all have their rise and climax, and their decay. With us the tide is still rising, so we have not yet the settled order in certain respects that they had in some of the older civilizations. We are, unfortunately, far as yet from the realization of unselfishness – from the feeling that the community as a whole is the chief thing to be considered and not the individual. 

That was attained in some of the older civilizations to an extent which would make it seem to us now a kind of Utopia, but on the other hand we are growing into possession of powers which those older peoples did not possess. There was a short period in the early history of Rome when “none was for the party and all were for the State”, as Macaulay put it. 

Pythagoras, speaking to the people at Taormina, told them that the State was more than father and mother, more even than wife and child, and that every man should always be ready to give up his own thoughts, feeling and wishes for the sake of unity – for the res publica, the original of ‘republic’, the common weal or well-being of the whole, to which every one should be willing to sacrifice his personal interests. In England, too, in the days of Queen Elizabeth, there was a period of such true patriotic feeling and activity.

22. I do not mean that in ancient Egypt or in ancient Greece, or anywhere else in the world, all the people were unselfish. Not by any means, but all educated people took a very much wider view, a much more communal view of life than we do. 

They thought very much more of the State and much less of their individual welfare or progress. We shall attain to that too, and when we do we ought to realize it more fully than any of the ancient races, and also bring to it some development which the older races had not.

23. If, then, we could get back into that old Egyptian outlook, we should understand Light on the Path very much better. The student will do well to try to produce that attitude in himself in his study of it, so that it may help him to put himself into the place of those who studied it in the older times.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 128 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. నారద మహర్షి - 2 🌻*

12. ఆ కామేశ్వరి-కామేశ్వర మిధున ప్రణయఫలంగా విష్ణోత్పత్తి జరిగిందని; మూడవబ్రహ్మయైన ఆ విష్ణువు నాభికమలంనుంచి, ఈ భౌతిక సృష్టికి కారణభూతమైన మూలపదార్థములను సృష్టించిన బ్రహ్మయొక్క(చతుర్ముఖ బ్రహ్మయైన ఈ నాల్గవబ్రహ్మయొక్క) సృష్టిజరిగిందని పురాణకథనం. 

13. ఈ బ్రహ్మచేసిన సృష్టికి, ఒక లయక్రియ కాలాంతరములో అవసరమవుతుంది. కాబట్టి బ్రహ్మచేసే సృష్టిని లయంచేసేటటువంటి రుద్రుడు ఆ బ్రహ్మముఖం నుంచి పుట్టాడని; ఈ రుద్రుడే అయిదో బ్రహ్మ అని ఇలా ఈ అయిదుగురు బ్రహ్మలయొక్క చరిత్ర పురాణాలలో అనేకవిధాలుగా వర్ణించబడింది.

14. రుద్రుడికి, బ్రహ్మచేసినటువంటి సృష్టిని హరించి దానినంతా చివరకు తనలో లయంచేయటమే కర్తవ్యం. బ్రహ్మచేసిన సృష్టియొక్క ప్రళయం అది. ఆ ప్రళయానికి కారణం రుద్రుడు. తర్వాత రుద్రప్రళయం. అందు ఈ రుద్రుడు బ్రహ్మలో లీనమవుతాడు. బ్రహ్మప్రళయం అని ఒకటుంది. బ్రహ్మవిష్ణువులో లయంఅవుటాడు. విష్ణుప్రళయం అని ఒకటుంది. 

15. విష్ణువు ఆ రెండు తత్త్వము లందు (కామేశ్వరీ-కామేశ్వరులు) విలీనం చెందుతాడు. అవి తనను తామే ఉపసంహరించు కుంటాయి. అప్పుడు కేవలం నిర్గుణబ్రహ్మ వెలుగుతుంది.
ఈ ప్రకారంగా ఇట్టి రాకపోకలు సృష్టికి హేతువులుగా ఉన్నాయి.

16. వీటన్నిటిలోనూ పూసలలో దారంగా ఉన్నటువంటిది ఒకటుంది. అదే పరాశక్తి. ఆ ప్రాశక్తిని నిరూపణచేసి, ‘పంచ(బ్రహ్మ) మంచాధిశాయిని’గా పరాశక్తిని ఆరాధించేవాళ్ళను శాక్తేయులంటాము. ఈ అయిదుగురు బ్రహ్మలయందు, నిర్గుణమైన వస్తువులోనూకూడా ఆమె ఉన్నది! ‘కామేశ్వరీ-కామేశ్వర ప్రణయ మిధునం’ అనే భావన ఏదైతే ఉన్నదో, ఆ చైతన్యశక్తే పరాశక్తి. ఆమెది రెండవ స్థితి.

17. మూడవది విష్ణువుయందున్నది. బ్రహ్మయందూ ఆమె ఉన్నది. కాబట్టి ఈ అయిదుగురిలోనూ ఆమెయే అధికారికంగా విలసిల్లేటటువంటిది, నిరంతరంగా ఉండేది. అట్టిచైతన్య స్వరూపిణి అది. ఆ చైతన్యాన్ని చిద్గగనమందు యోగి దర్శనంచేసి, దానిని తెలుసుకుంటేకూడా ముక్తిలభిస్తుంది. బ్రహ్మను గురించి తపస్సు చేసి బ్రహ్మలోఉండే జ్ఞాన్నిపొందినా ముక్తి కలుగుతుంది. 

18. రుద్రుని యందు ఏ జ్ఞానము ఉన్నదో, దానిని ఆరాధించినా అది ముక్తికి హేతువవుతుంది. విష్ణువులో ఏ జ్ఞానముందో-సత్యజ్ఞానము-దానిని ఆరాధించినా అదికూడా మోక్షహేతువవుతుంది. 

19. ఇదంతా కాక, నిర్గుణమైన పరబ్రహ్మవస్తువు సర్వకారణకారకమైనది ఏదైతే ఉన్నదో, దానిని ఆరాధించినా మోక్షమే వస్తుంది. ఇవన్నీ మార్గములే! ఏదయినా మార్గమే!.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు - 46 🌹*
*🍀 6. ఆరాధనము - దేవతలను ఆరాధించుట యనగా మానవుడు గూడ దేవతల వలె పరహిత ధర్మమునకు తన జీవితమును సమర్పించవలెను. 🍀*  
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*📚. కర్మయోగము - 11 📚*

*11. దేవా న్భావయతానేన తే దేవా భావయంతు నః |*
*పరస్పరం భావయంత: శ్రేయః పర మవాప్స్యథ || 11*
 
*శ్రేయః పర మవాప్యుథ :*

దేవతలు మానవులకు సహాయము చేయగలరు. దేవతలకు ప్రీతి కలిగించు మార్గము యజ్ఞార్థ జీవనమే. దేవతలు సంతుష్టులైనచో మానవులకు సంతుష్టిని, వృద్ధిని యొసగుదురు. మానవుల వృద్ధికి సహకరింతురు. దేవతలను ఆరాధించుట యనగా మానవుడు గూడ దేవతలవలె పరహిత ధర్మమునకు తన జీవితమును సమర్పించవలెను.  

దేవతలట్లే సమర్పించుటచే సృష్టి ప్రణాళిక నెరిగి సృష్టిని నిర్వహణము చేయుచున్నారు. తమవలెనే ఏ మానవుడు పరహిత కార్యములకు సమర్పణ చెందునో అట్టి మానవుడు దేవతల ఆశీర్వచనము పొందును.

శ్రీకృష్ణుడు తెలిపిన భగవధారాధనము యిదియే. స్తుతి కొరకు, స్ఫూర్తి కొరకు ఆరాధనములు సలిపినను పరహితము సలుపని జీవితము జీవులకు హితముగా నుండనేరదు. 

దేవతారాధనమనగా పరహితధర్మము నాచరించుట. స్వహితమును ఆశింపకుండుట. ఇది సర్వ శ్రేయోదాయకము. పరమ శ్రేయోదాయకము. పరమ శ్రేయస్సు దీని వలననే కలుగునని “శ్రేయః పర మవాప్యుథ" అని పలికినాడు. 

నందగోపుడు వర్షాదులు కురియుటకై ఇంద్రుని ఆరాధించవలెనని సంకల్పించినాడు. బాలకృష్ణుని అడుగగా, ఇంద్రుని ఆరాధన పూజాది కార్యక్రమములుగా కాక, తోటిజీవుల శ్రేయస్సుగా కర్మ నాచరింపుమని బాలకృష్ణుడు తెలిపినాడు. 

భగవద్గీతలో శ్రీకృష్ణుడిచ్చిన పరమోత్కృష్టమైన ధర్మమిది. అతడు దేవతా ప్రీతికై యజ్ఞ యాగములను, పూజాభిషేకములను, హోమములను తనకుగా తాను ఎన్నడును నిర్వర్తించలేదు. నిర్వర్తిస్తున్న వారిని గౌతమ బుద్ధునివలె ఖండించలేదు. తనను సలహా అడిగినవారికి మాత్రము దేవతారాధన మనగా పరహిత జీవనమే అని తెలియజెప్పినాడు. 

దైవమొక్కడే. అతని కార్యమునే దేవతలు చేయుచున్నారు. వారు నిష్కాములు. జీవులు గూడ దేవతలను మార్గదర్శకులుగ నెంచు కొని, ఆ మార్గమునే నడచినచో దివ్యత్వము పొందగలరు. 

దేవతలను, గురువులను మార్గదర్శకులుగా భావించుట, గౌరవించుట, పూజించుట తగుమాత్రముగ జరుగుచుండవలెను. అవియే ప్రధాన కార్యములైనచో ముక్తజీవనము దుర్లభము. పరమ శ్రేయస్సునకు పరహితమే పరమధర్మమని శ్రీకృష్ణుడు, శ్రీరాముడు నిర్వర్తించి బోధించినారు. 

అదియే సనాతన ధర్మమార్గము. జీవుల శ్రేయస్సే దైవారాధనముగ సాగుట కృష్ణుడు తెలిపిన కర్మబంధ విమోచన మార్గము. (3-11)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 192 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 40. With the dropping off of the primary experience ‘I am’ all experiences would vanish and only the Absolute remains. 🌻*

The arising of the sense of being or the non-verbal feeling ‘I am’ was your first or primary experience. 

Without this primary experience none of the other experiences would have followed, you had ‘to be’ before anything could be.  

But as your abidance in the ‘I am’ becomes firm by your ‘Sadhana’ (practice) a stage comes when the ‘I am’ drops off and with that all experiences or memory would vanish leaving you in your True Absolute state.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. అద్భుత సృష్టి - 47 🌹*
 ✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
          
*🌻 18. లైట్ బాడీస్ ( కాంతి శరీర స్థాయిలు) 🌻*

కాంతి శరీరం అంటే నశింపు లేని దివ్యత్వం. ఈ కాంతి దేహం పొందటం అంటే తాను దైవంగా మారినట్లే. మన ప్రస్తుత శరీరం పరిణామం చెందుతూ అధిక మొత్తంలో కాంతిని స్వీకరిస్తూ నెమ్మది నెమ్మదిగా శరీరంలోని అణువులు అన్ని తమ ఫ్రీక్వెన్సీని *"కార్బన్ స్థితి"* నుండి *"కాంతి స్థితి"* లోనికి మార్చుకుంటుంది.

✨. ఈ ఆత్మకు సంబంధించిన అన్ని శక్తులు, శక్తి క్షేత్రాలు, శరీర అవయవాలు అన్నీ కూడా తమ ఫ్రీక్వెన్సీని ఉన్నత స్థాయి ఫ్రీక్వెన్సీతో అనుసంధానం చేస్తూ అతి సాధారణ భౌతిక స్థాయి నుండి ఆదిభౌతిక స్థాయికి, అక్కడి నుండి అనంత చైతన్య స్థాయికి ఎదిగేలా చేస్తుంది.

✨. కాంతిని స్వీకరిస్తూ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా, శారీరక, మానసిక, బుద్ధి, చైతన్య స్ధితులలో ప్రత్యేక మార్పులు జరుగుతాయి.

కర్బన ఆధారిత శరీర అణువులు మార్పును చెందుతున్న తరుణంలో కర్మలు కడగబడడం జరుగుతుంది. శరీరం అధిక సాంద్రతను కోల్పోవడం జరుగుతుంది. ఈ తరుణంలో శరీరం అతి సాధారణమైన రుగ్మతలకు గురి కావడం జరుగుతుంది. (జ్వరం, తలనొప్పి, దద్దులు, కండరాలు బిగదీయడం, కీళ్లనొప్పులు మొదలైనవి)

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 68 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మ విచారణ పద్ధతి - 32 🌻*

ఇంకేమిటటా? మనము జన్మతః జననమనే కార్యముతో మొదలుపెట్టి మరణమనే కార్యముతో ముగిస్తూ వున్నాము, శరీర యాత్రని. ఇదొక శరీర యాత్ర. కాని ఆత్మ ఎక్కడికీ ప్రయాణించదు, ఆత్మ ఏ కార్యమూ చెయ్యదు. అది అకార్యము. కార్యమునకు కాదు. ఏ కార్యమునందు ప్రవేశించడం చేత గానీ, ఒక కార్యమును చెయ్యడం చేత గానీ, ఒక కార్యమును చెయ్యకపోవడం చేత గానీ నీవు ఆత్మ వస్తువుని తెలుసుకొనజాలవు. 

ఇంకా ఏమిటటా? ఈ శరీరం ఒక కాలంలో వుంది. ఒక కాలంలో పరిణమించింది. ఒక కాలంలో పుట్టింది. ఒక కాలంలో పోతుంది. కాబట్టి మూడు కాలములందు భూత భవిష్యత్ వర్తమానములందు పరిణామము చెందుతూ వున్నది. కాని ఆత్మ సర్వకాలములందు ఒక్క తీరుగనే వున్నది కాబట్టి దానికి భూత భవిష్యత్ వర్తమానములనేవి లేవు. ఒక కాలమందు వున్నదని, ఒక కాలమందు లేనిదనీ చెప్పుటకు వీలు లేకుండా వున్నది.

         ఇంకా ఏమిటటా? ఈ శరీరము పుట్టినప్పుడు చాలా చిన్న రూపముతో వున్నది. తరువాత క్రమేపీ పెరుగుతూ పెరుగుతూ ఒక స్థాయికి వచ్చింది. ఒక స్థాయికి వచ్చిన తరువాత పరిణామం చెందటం ప్రారంభమయింది. వృద్ధి చెందింది, పరిణామం చెందింది తిరిగి ఏమయింది క్షయించబడుతోంది. క్షీణించబడుతోంది ఒక స్థాయికి వచ్చిన తరువాత. బాల్య యవ్వన కౌమార వృద్ధాప్య అవస్థల ద్వారా వృద్ధి క్షయాలను పొందుతూ వున్నది. కాని ఆత్మకు ఈ వృద్ధి క్షయములు లేవు. దానికెట్టి రూప పరిణామములు లేవు. దానికి నామ రూపములు అంటవు.

         ఇంకేమిటటా? పురాతనమైనటువంటిది. పురాతనమంటే ఈ సృష్టికి ముందున్నటువంటి స్థితి నుంచీ సృష్టి మరలా లయించబడి పోయినప్పటికీ మార్పు చెందకుండా వుండేటటువంటిది ఏదైతే వుందో అది ఆత్మ. 

కాబట్టి ఎప్పటినించీ వుందయ్యా? ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి వున్నది. కాబట్టి పురాణము అనగా అర్ధమేమిటంటే పురాతనమును గురించి తెలియజెప్పునది ఏదో అది పురాణము. పునః ఆయతనః ఇతి పురాతనః. అర్ధమైందా అండి?

 పురమునందు ఈ సృష్టి అనేటటువంటి పురమునందు ఆయతనమై అధిష్టానమై ఆశ్రయమై వున్నటువంటి బ్రహ్మము ఏదైతే వున్నదో ఈ శరీరము అనేటటువంటి పురము నందు ఆయతనం ఆశ్రయము అధిష్టానము ఏదైతే అయి వున్నదో అటువంటి ఆత్మ - అటువంటి బ్రహ్మ. 

ఇది తెలుసుకోవలసినటువంటి అంశం. ఈ లక్ష్యంలో ఏవైతే చెప్పబడుచున్నాయో వాటికి పురాణములని పేరు. కాబట్టి అష్టాదశ పురాణములకి కూడా లక్ష్యము ఆత్మ సాక్షాత్కార జ్ఞానమే. పరమాత్మ తత్వ బోధకమే.

 కాబట్టి పురాణములన్నీ కూడా భగవద్ విషయముగానే చెప్పబడినప్పటికీ, చెప్పబడిన కధా కధన రీతిలో బేధముండవచ్చునేమో గానీ వాటి యొక్క లక్ష్యార్ధం మాత్రం ఆత్మతత్వమును గ్రహించడం మాత్రమే. అట్లాగే, ఎవరికైతే ఈ శరీరములో వున్నప్పటికీ ఆత్మకు ఏ రకమైన వికారమూ అంటుట లేదు. 

ఎలా అంటే ఆకాశములో మేఘములు చలించుచున్నట్లు కనబడుచున్నవి. కాని ఆకాశమును ఏమైనా మేఘములు అంటినయ్యా అంటే అంటలేదు. ఆకాశములో వర్షము మేఘముల ద్వారా ఏర్పడినట్లు కనబడుచున్నది. 

కాని ఆ మేఘముల వల్ల ఏర్పడిన వర్షము చేత ఆకాశము తడుపబడుచున్నదా అంటే తడుపబడుట లేదు. అదే ఆకాశమందు అగ్ని స్వరూపము కూడా చలించుచున్నట్లు కనబడుచున్నది. కాని అట్టి ఆకాశము అగ్ని చేత దహించబడుతున్నదా అంటే దహించబడుట లేదు. - విద్యా సాగర్ స్వామి

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 30 / Sri Vishnu Sahasra Namavali - 30 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*కర్కాటక రాశి - పుష్యమి నక్షత్రం 2వ పాద శ్లోకం*

*🌻. 30. ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః |*
*ఋద్దః స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః ‖ 30 ‖*

🍀. ఓజస్తేజోద్యుతిధరః --- 
పరిపూర్ణమగు ఓజస్సు (బలము), తేజస్సు (శతృవులను ఓడించు శక్తి), ద్యుతి (కీర్తి, కాంతి) కలిగినవాడు 

🍀. ప్రకాశాత్మా --- 
ప్రకాశవంతమగు స్వరూపము గలవాడు; (మూర్ఖులు కూడా అంగీకరించేటట్లుగా, గొప్పగా) ప్రకాశించేవాడు. 

🍀. ప్రతాపనః ---
 సూర్యాగ్నుల రూపమున వెలుతురును, జీవులలో ఉష్ణమును కలిగించి కాపాడువాడు; తన ఉగ్రరూపమున జగత్తును తపింపజేయువాడు; ప్రళయాగ్నియై జగత్తును లయము చేయువాడు. 

🍀. ఋద్ధః --- 
అన్ని ఉత్తమ గుణములు సమృద్ధిగా కలిగిన పరిపూర్ణుడు. 

🍀. స్పష్టాక్షరః --- 
స్పష్టమైన వేదాక్షరములు గలవాడు, అనగా వేదము లోని అక్షరముల ద్వారా స్పష్టమైనవాడు; దివ్యమగు ప్రణవ శబ్దము ద్వారా తెలియబడువాడు; విశ్వమును కలిపి పట్టియుంచువాడు. 

🍀. మంత్రః --- 
తన నామమును మననము చేయువారిని రక్షించువాడు; వేద స్వరూపుడు, మంత్ర మూర్తి. 

🍀. చంద్రాంశుః --- 
చంద్రుని కిరణములవలె (వెన్నెల వలె) చల్లగానుండి, ఆహ్లాదమును కలిగించి, సంసార తాపమును శమింపజేయువాడు; సస్యములను పోషించువాడు. 

🍀. భాస్కరద్యుతిః 
సూర్యుని వంటి తేజస్సు గలవాడు; శత్రుదుర్నిరీక్ష్య పరాక్రమశీలి; సూర్యునికి కాంతిని ప్రసాదించువాడు. 

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 30 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Karkataka Rasi, Pushyami 2nd Padam*

*🌻 30. ōjastejōdyutidharaḥ prakāśātmā pratāpanaḥ |*
*ṛddhaḥ spaṣṭākṣarō mantraścandrāṁśurbhāskaradyutiḥ || 30 || 🌻*