🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. నారద మహర్షి - 2 🌻
12. ఆ కామేశ్వరి-కామేశ్వర మిధున ప్రణయఫలంగా విష్ణోత్పత్తి జరిగిందని; మూడవబ్రహ్మయైన ఆ విష్ణువు నాభికమలంనుంచి, ఈ భౌతిక సృష్టికి కారణభూతమైన మూలపదార్థములను సృష్టించిన బ్రహ్మయొక్క(చతుర్ముఖ బ్రహ్మయైన ఈ నాల్గవబ్రహ్మయొక్క) సృష్టిజరిగిందని పురాణకథనం.
13. ఈ బ్రహ్మచేసిన సృష్టికి, ఒక లయక్రియ కాలాంతరములో అవసరమవుతుంది. కాబట్టి బ్రహ్మచేసే సృష్టిని లయంచేసేటటువంటి రుద్రుడు ఆ బ్రహ్మముఖం నుంచి పుట్టాడని; ఈ రుద్రుడే అయిదో బ్రహ్మ అని ఇలా ఈ అయిదుగురు బ్రహ్మలయొక్క చరిత్ర పురాణాలలో అనేకవిధాలుగా వర్ణించబడింది.
14. రుద్రుడికి, బ్రహ్మచేసినటువంటి సృష్టిని హరించి దానినంతా చివరకు తనలో లయంచేయటమే కర్తవ్యం. బ్రహ్మచేసిన సృష్టియొక్క ప్రళయం అది. ఆ ప్రళయానికి కారణం రుద్రుడు. తర్వాత రుద్రప్రళయం. అందు ఈ రుద్రుడు బ్రహ్మలో లీనమవుతాడు. బ్రహ్మప్రళయం అని ఒకటుంది. బ్రహ్మవిష్ణువులో లయంఅవుటాడు. విష్ణుప్రళయం అని ఒకటుంది.
15. విష్ణువు ఆ రెండు తత్త్వము లందు (కామేశ్వరీ-కామేశ్వరులు) విలీనం చెందుతాడు. అవి తనను తామే ఉపసంహరించు కుంటాయి. అప్పుడు కేవలం నిర్గుణబ్రహ్మ వెలుగుతుంది.
ఈ ప్రకారంగా ఇట్టి రాకపోకలు సృష్టికి హేతువులుగా ఉన్నాయి.
16. వీటన్నిటిలోనూ పూసలలో దారంగా ఉన్నటువంటిది ఒకటుంది. అదే పరాశక్తి. ఆ ప్రాశక్తిని నిరూపణచేసి, ‘పంచ(బ్రహ్మ) మంచాధిశాయిని’గా పరాశక్తిని ఆరాధించేవాళ్ళను శాక్తేయులంటాము. ఈ అయిదుగురు బ్రహ్మలయందు, నిర్గుణమైన వస్తువులోనూకూడా ఆమె ఉన్నది! ‘కామేశ్వరీ-కామేశ్వర ప్రణయ మిధునం’ అనే భావన ఏదైతే ఉన్నదో, ఆ చైతన్యశక్తే పరాశక్తి. ఆమెది రెండవ స్థితి.
17. మూడవది విష్ణువుయందున్నది. బ్రహ్మయందూ ఆమె ఉన్నది. కాబట్టి ఈ అయిదుగురిలోనూ ఆమెయే అధికారికంగా విలసిల్లేటటువంటిది, నిరంతరంగా ఉండేది. అట్టిచైతన్య స్వరూపిణి అది. ఆ చైతన్యాన్ని చిద్గగనమందు యోగి దర్శనంచేసి, దానిని తెలుసుకుంటేకూడా ముక్తిలభిస్తుంది. బ్రహ్మను గురించి తపస్సు చేసి బ్రహ్మలోఉండే జ్ఞాన్నిపొందినా ముక్తి కలుగుతుంది.
18. రుద్రుని యందు ఏ జ్ఞానము ఉన్నదో, దానిని ఆరాధించినా అది ముక్తికి హేతువవుతుంది. విష్ణువులో ఏ జ్ఞానముందో-సత్యజ్ఞానము-దానిని ఆరాధించినా అదికూడా మోక్షహేతువవుతుంది.
19. ఇదంతా కాక, నిర్గుణమైన పరబ్రహ్మవస్తువు సర్వకారణకారకమైనది ఏదైతే ఉన్నదో, దానిని ఆరాధించినా మోక్షమే వస్తుంది. ఇవన్నీ మార్గములే! ఏదయినా మార్గమే!.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
06 Oct 2020
No comments:
Post a Comment