10-July-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 423 / Bhagavad-Gita - 423 🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 211 / Sripada Srivallabha Charithamrutham - 211 🌹
3) 🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 75🌹
4) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 91🌹 
5) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 114 🌹
6) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 53 🌹 
7) 🌹. నారద భక్తి సూత్రాలు - 31 🌹 
8) 🌹. VEDA UPANISHAD SUKTHAM - 54 🌹
9)  🌹. శ్రీ దత్తాత్రేయ విరచిత జీవన్ముక్తగీత - 3🌹
10) 🌹. సౌందర్య లహరి - 38 / Soundarya Lahari - 38 🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 337 / Bhagavad-Gita - 337 🌹
12) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 166 🌹 
13) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 38 🌹
14) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 43 🌹
15) 🌹 Seeds Of Consciousness - 118 🌹
16) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 28 / Sri Lalita Sahasranamavali - Meaning - 28 🌹
17) 🌹. మనోశక్తి - Mind Power - 56 🌹
18) 🌹. సాయి తత్వం - మానవత్వం - 47 / Sai Philosophy is Humanity - 47 🌹
19) 🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 1 🌹
20)

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 423 / Bhagavad-Gita - 423 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 32 🌴

32. శ్రీ భగవానువాచ
కాలో(స్మి లోకక్షయకృత్ ప్రవృద్దో
లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త: |
ఋతే(పి త్వాం న భవిష్యన్తి సర్వే
యే(వస్థితా: ప్రత్యనీకేషు యోధా: ||

🌷. తాత్పర్యం : 
దేవదేవుడైన శ్రీకృష్ణభగవానుడు పలికెను : నేను ఘనమైన లోకవినాశకర కాలమును. జనులందరినీ నశింపజేయుటకే నేను ఇచ్చటకు అరుదెంచితిని. నీవు (పాండవులు) తప్ప ఇచ్చటనున్న ఇరుపక్ష యోధులందరును చంపబడనున్నారు.

🌷. భాష్యము : 
శ్రీకృష్ణుడు దేవదేవుడని, తనకు స్నేహితుడని తెలిసినను అతని వివిధరూప ప్రదర్శనచే అర్జునుడు విభ్రాంతుడయ్యెను. 

కనుకనే అతడు ఆ వినాశకర శక్తి యొక్క వాస్తవ ప్రయోజనమును గూర్చి మరల అడిగెను. పరమసత్యము సమస్తమును (చివరికి బ్రాహ్మణులను కూడా) నశింపజేయునని వేదములందు తెలుపబడినది.

 కఠోపనిషత్తు (1.2.25) నందు ఈ క్రింది విధముగా తెలుపబడినది.
యస్య బ్రహ్మ చ క్షత్రం చ ఉభే భవత ఓదన: |
మృత్యుర్యస్యోపసేచనం కే ఇత్థా వేద యత్ర స: ||

అనగా అంత్యమున బ్రాహ్మణులు, క్షత్రియులు మరియు ప్రతియొక్కరు దేవదేవునిచే ఆహారము వలె మ్రింగివేయబడుదురు. దేవదేవుని ఈ ప్రస్తుత రూపము సర్వమును హరించునటువంటిది. 

ఈ విధముగా శ్రీకృష్ణుడు తనను సర్వమును హరించు కాలముగా ప్రదర్శించుచున్నాడు. పాండవులు తప్ప అచ్చట యుద్ధరంగము నందు నిలిచిన సర్వులును అతనిచే మ్రింగివేయబడుచున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 423 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 32 🌴

32. śrī-bhagavān uvāca
kālo ’smi loka-kṣaya-kṛt pravṛddho
lokān samāhartum iha pravṛttaḥ
ṛte ’pi tvāṁ na bhaviṣyanti sarve
ye ’vasthitāḥ praty-anīkeṣu yodhāḥ

🌷 Translation : 
The Supreme Personality of Godhead said: Time I am, the great destroyer of the worlds, and I have come here to destroy all people. With the exception of you [the Pāṇḍavas], all the soldiers here on both sides will be slain.

🌹 Purport :
Although Arjuna knew that Kṛṣṇa was his friend and the Supreme Personality of Godhead, he was puzzled by the various forms exhibited by Kṛṣṇa. Therefore he asked further about the actual mission of this devastating force. 

It is written in the Vedas that the Supreme Truth destroys everything, even the brāhmaṇas. As stated in the Kaṭha Upaniṣad (1.2.25),

yasya brahma ca kṣatraṁ ca
ubhe bhavata odanaḥ
mṛtyur yasyopasecanaṁ
ka itthā veda yatra saḥ

Eventually all the brāhmaṇas, kṣatriyas and everyone else are devoured like a meal by the Supreme. 

This form of the Supreme Lord is the all-devouring giant, and here Kṛṣṇa presents Himself in that form of all-devouring time. Except for a few Pāṇḍavas, everyone who was present on that battlefield would be devoured by Him. 

Arjuna was not in favor of the fight, and he thought it was better not to fight; then there would be no frustration. 

In reply, the Lord is saying that even if he did not fight, every one of them would be destroyed, for that was His plan. 

If Arjuna stopped fighting, they would die in another way. Death could not be checked, even if he did not fight. In fact, they were already dead. 

Time is destruction, and all manifestations are to be vanquished by the desire of the Supreme Lord. That is the law of nature.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 211 / Sripada Srivallabha Charithamrutham - 211 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 38

🌻. బైరాగి కథనం (బగళాముఖీ) 
(శ్రీపాదులకు 14ఏళ్ళు) 🌻

మాకు దారిలో రావిచెట్టు కింద కూర్చున్న ఒక బైరాగి కన్పించారు. ఆయన ముఖం ఎంతో తేజోవంతంగా ఉంది. 

వారు మమ్మల్ని మీరు శంకరభట్టు, ధర్మగుప్తులేనా? అని అడిగి మేము ఔనని చెప్పడంతో మీ దగ్గర ఉన్న పాదుక లను నాకు ఇచ్చి నా దగ్గరున్న కాలనాగమణిని తీసుకో మని చెప్పారు.

 తరువాత తాము బగళాముఖీ ఉపాసకుడనని చెప్పి ఆదేవి గురించి ఇలా వివరించారు," బగళాముఖీ దేవి దశమహా విద్యలలో ఒకటి. ఈ దేవి ఆరాధన వలన వాక్సిద్ధి కలుగు తుంది. సత్యయుగంలో సమస్త జగత్తును నాశనం చేసేంత తుఫాను వచ్చింది. 

విష్ణుమూర్తి చింతాక్రాంతుడై జీవులను రక్షించడానికి తపస్సు చేసారు. శ్రీవిద్యామహాదేవి బగళా ముఖీ రూపంలో దర్శనమిచ్చి ఆ భయంకరమైన తుఫా నుని స్తంభింపచేసింది. 

మంగళవారం చతుర్దశి అర్ధరాత్రి ఈమె ఆవిర్భవించింది. సాధకుని జీవితంలో అల్ల కల్లోలం లేపే దుష్ట శక్తులని, అంధశక్తులని స్తంభింపచేసి సాధకుని పురోగతికి తోడ్పడుతుంది. 

విష్ణువు, పరశు రాముడు ఈ దేవి ఉపాసకులలో ముఖ్యులు," అని చెప్పి పీఠికాపురంలో తమ అనుభవాలని చెప్పడం మొదలు పెట్టారు,
 "నేను నా తీర్థయాత్రలలో పీఠికాపురంలోని కుక్కు టేశ్వరాలయా నికి వెళ్ళాను. 

అక్కడ ముద్దులు మూటగట్టే మూడేళ్ళ బాలుడు కనిపించి తాను చాలా కాలంనుండి ఈ మధ్య కాలంవరకు స్వయంభూదత్తుడి పేరుతో లోపల బందీయై ఉన్నానని, అర్చకులు శీతలోపచారాలు సరిగా చేయడానికి తిరస్కరిం చడంతో బయటకు వచ్చేసానని చెప్పాడు. 

నాకు వారు దత్తులని, కర్మఠులైన బ్రాహ్మణులు అస్పృశ్యులను లోనికి రానీయకపోవటంవల్ల ఖిన్నులైన దత్తప్రభువులు ఆర్తులను రక్షించడానికి స్వయంగా అవతరించారని తెలిసింది. 

నేను వారిని బగళాముఖీ రూపంలో దర్శనమిమ్మని అడిగాను. శ్రీపాదులు ఆ దేవి రూపంలో దర్శనమిచ్చారు.
 పీఠికాపురం - అపప్రథల నిలయం

ఆ మహాతేజస్వరూపిణిని చూడగానే ఎనిమిది రోజులు ఒళ్ళు తెలియని బ్రహ్మానంద స్థితిలో ఉండిపోయాను. 

ఊరిలో నేనొక క్షుద్ర మాంత్రికుణ్ణని, ఏదో ప్రయోగంద్వారా కుక్కుటేశ్వరుని, స్వయంభూదత్తుని శక్తిని అపహరించ బోయానని, కాని పూజారుల నియమనిష్ఠల వల్ల అది బెడిసికొట్టి, మూర్ఛలో పడి ఉన్నానని వదంతులు పుట్టి అర్చకస్వాముల ప్రాముఖ్యత పెరిగి పోయింది. 

అర్చక స్వాములతో విశేష పూజలు చేయించు కొన్నట్లయితే అరి ష్టాలన్నితొలగిపోయి ఇతోధిక శ్రేయస్సు కలుగుతుందనే ప్రచారం ఉద్ధృతం అయ్యి పీఠికాపుర వాస్తవ్యులు వేలం వెర్రిగా అర్చకస్వాములతో పూజలు చేయించుకోవడం మొదలు పెట్టారు. అర్చకులకు పెద్ద మొత్తంలో దక్షిణలు దొరకసాగాయి.

 అయితే ఇంటికి తెచ్చుకున్న ధనం తెల్లవారే సరకి మాయం అయ్యేది. అందరికి అర్చనలు చేయించ డానికి ఒప్పుకొని కష్టపడి పూజలు చేయించడమే అవు తుంది తప్ప వారికి ఫలితం శూన్యంగా ఉంది. 

మనసు విప్పి వారి గోడు ఎవ్వరితోనూ చెప్పు కోలేరు. ఎందుకంటె ఈ విషయం కనుక బయటికి పొక్కితే కొత్త గానూ అపురూపం గానూ దొరుకుతున్నవారి గౌరవం దెబ్బ తింటుంది. 

వాళ్ళ ఇబ్బంది ఇలా ఉండగా, నా విషయం పెద్ద చర్చనీయాంశం అయ్యింది, ఈ బైరాగి బ్రతికి ఉన్నాడా? మరణించాడా? దహనం చేస్తే మంచిదా? చేస్తే బైరాగి శక్తులు ఇంకా విజృంభిస్తాయా? అనే మీమాంసలో మొత్తానికి నా శరీరాన్ని దహనం చేయడం జరగలేదు. ఇదంతా శ్రీపాదుల విచిత్ర లీల.
 
ఎనిమిదవ రోజు నేను స్పృహలోకి వచ్చాను. బ్రాహ్మణులు ఎవ్వరు భిక్ష ఇవ్వకపొవడంతో నన్ను గొల్లవారి వాడలో ఉంచారు. అందులో ఒక గొల్లవనిత పేరు లక్ష్మి. ఆమెకు ఇటివలె వైధవ్యం సంప్రాప్తించింది. 

శ్రేష్ఠిగారి ఇంటి ఆవు వట్టి పోవడంతో లక్ష్మి వారి ఇంటికి పాలు తీసికొని వెళ్ళేది. శ్రేష్ఠిగారి ఇంటిలో శ్రీపాదులు ఈ పాలను తాగుతుండేవారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sripada Srivallabha Charithamrutham - 211 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj 

CHAPTER 21

🌻. Moksham (liberation) comes when Moham (attachment) is lost - 2 🌻 

There is no difference in my looks between formless, qualityless state and the state of ‘form and with qualities’; and between ‘liberation’ and ‘bound state’.  

Every moment, countless new worlds will be created, sustained and destroyed. There are no limits to the highest states and highest blissful planes, which can be acquired by jeevas.  

People who want to come to me after death, can come certainly. My sankalpam (will) will decide how many hundreds of divine years they should remain in such ‘states’ and in which ‘lokas’ they should be sent again.  

The key person in this world drama is Myself. At present I am in human form before you. You are seeing me. Even in the formless state also I will be always seeing you. 

 I have come down from that highest state to this human form to tell this to you. The yogic powers of Maha yogis should be used only for the world welfare. ‘World’ does not mean only this ‘Bhulokam’. 

 It is your dharma to help the helpless jeevas who are in a lesser ‘state’ than you. I took avathar only to teach the paths of dharma, karma, yoga, bhakti and jnana.  

I am the only Truth which is the basis for all truths. I am the only ‘dharma’ which is the basis for all dharmas. I am the only ‘cause’ which is the basis for all ‘causes’.  

Nothing is seen in this creation which is not in my ‘sankalpa’. If ‘I’ am not there, there is no creation. Because ‘I’ am there, you are there and the ‘creation’ is there.  

How do you want me to tell more than this? You go to Himalayas and do ‘tapas’ alone. You don’t keep the burden of ‘disciples’. Even if you do not get liberation or you are not uplifted, there is no harm to Me or to this creation.  

The programmes in this creation will go on as usual. This is the real thing. A new band of disciples in Peethikapuram has come in support of you. It is like donkeys’ music concert for the marriage of camels.  

While donkeys are praising the beauty of camels, the camels are praising the sweetness of donkeys’ music. Even if you praise each other like this, the truth is something different.” Thus he taught Dandi Swami.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 91 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. *చేయవలసినది- చేయదలచినది - 7* 🌻

 కన్నులు మూసికొన్న, ముక్కు మూసికొన్న,ఇంద్రియాల్ని‌ మనస్సులోనికి నిగ్రహించుకొనుటకు, మనస్సును ఆత్మలోకి నిగ్రహించుకొనుటకు సాధన కొరకు మాత్రమే గాని‌ మూసికొనటం కోసం కాదు. 

ఎలా అయితే శరీరం వదిలి నిద్రలో మనం కాలు, చేయి కూడదీసికొనుట కోసం మనలోనికి‌ మనం వెళ్ళిపోతామో, అలాంటిదే కన్నులు మూసికొన్నా, ముక్కులు మూసికొన్నా. 

ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ లీనమైపోవటం ఎక్కడా చెప్పలేదు. ఋషులు చతుర్విధపురుషార్థములు, వాటి సమన్వయము, ధర్మాచరణం, ధర్మాచరణం వలన వచ్చే కామము, దాని వలన వచ్చే అర్థము, త్యాగం చేత పరమేశ్వరుని‌ యందు‌ అర్పణ బుద్ధితో చేయటం వలన వచ్చే మోక్షము గురించి చెప్పారు గానీ ఏదో‌ ఒక స్థితిలో కన్నులు మూసికొని ఉండిపోవటం చెప్పలేదు. 

ప్రార్థన గానీ, అనుష్ఠానం గానీ, నిరంతరం చేస్తూండటం వలన వికాసం చెందుతూ ఉంటూ ఉంటాం. చేస్తూ ఉన్నన్నాళ్ళు వికాసం చెందుతాం, 

చేయటం మానేసిన తరువాత రోజున వికాసం ఆగిపోతుంది. ఎన్ని పదుల సంవత్సరాలు వందల సంవత్సరాలు (జన్మలు) సాధన చేసినా మానేస్తే భ్రష్టుపట్టిపోతాం. 

చేస్తే ఏం వస్తుందనేదేం లేదు. చేస్తూ ఉండటం పరమాత్మ యందు ఉండటం కోసమే. పరమాత్మ యందు ఉండటం మొదలు పెట్టిన తరువాత సాధన చేయకపోవటం ఉండదు. నిరంతరం నిత్యం ఉండేదే సాధన..
.....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹 The Masters of Wisdom - The Journey Inside - 113 🌹
🌴 Meditation for the Aquarian AGE - 4 🌴
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

🌻 The Fundamental - 1 🌻

By meditating we get subtle powers – not to use them for ourselves but in order to be able to serve better. 

Meditation and study are for better service. As long as we don’t make a right use of what we get, nothing deeper can be given to us. 

The wisdom or the teacher of wisdom feel obliged to reveal more to us only when we make a good use of what we have received.

In all prayers and meditations we should thing of the welfare of mankind as a whole. 

This work has to be intensified, so that the energy of those can be neutralized who act with very much violence and force and who have a selfish intention behind. We invoke the Avatar of Synthesis: 

“May He lift up the earth to the Kings of Beauty.” For this uplift we must not aspire toward our individual enlightenment, but we have to try to be of use for the whole.

If we don’t have the attitude of serving it is dangerous to meditate.

🌻 🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K. P. Kumar: The Aquarian Master / seminar notes.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 75 🌹
🌻. శ్రీ లలితా స్తవరత్న వైజ్ఞానిక ధ్యాన యోగము 🌻
✍️. విరచితం : భగవాన్ శ్రీ క్రోధభట్టారక (దుర్వాస మహర్షి)
📚. ప్రసాద్ భరద్వాజ

కువలయ సదృక్ష నయనైః
కులగిరి కూటస్థ బన్ధు కుచభారైః I
కరుణాస్యన్ది కటాక్షైః
కవచిత చిత్తోఽస్మి కతిపయైః కుతుకైః II 191 II

నతజన సులభాయ నమో
నాళీక సనాభిలోచనాయ నమః I
నన్దిత గిరిశాయ నమో
మహసే నవనీప పాటలాయ నమః II 192 II

కాదమ్బ కుసుమ దామ్నే
కాయాచ్ఛాయా కణాయితార్యమ్ణే I
సీమ్నే చిర న్తనగిరాం
భూమ్నే కస్మైచిదాదదే ప్రణతిమ్ II 193 II

కుటిల కబరీ భరేభ్యః
కుఙ్కుమ సబ్రహ్మచారి కిరణేభ్యః I
కూలఙ్కష స్తనేభ్యః
కుర్మః ప్రణతిం కులాద్రి కుతుకేభ్యః II 194 II

కోకనద శోణవసనాత్
కోమల చికురాళి విజిత శైవలాత్ I
ఉత్పల సగన్ధి నయనా
దూరీకుర్మోన దేవతా మన్యామ్ II 195 II

ఆపాటలాధరాణా
మానీల స్నిగ్ధ బర్బర కచానామ్ I
ఆమ్నాయ జీవనానా
మాకూతానాం హరస్య దాసోఽస్మి II 196 II

పుఙ్ఖిత విలాస హాస
స్ఫురితాను పురాహితాఙ్క నిలయాసు I
మగ్నం మనో మదీయం
కాస్వపి కామారి జీవనాడీషు II 197 II

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. నారద భక్తి సూత్రాలు - 31 🌹 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, అచల గురు పీఠము. 
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 18

🌻 18. ఆత్మరత్య విరోధేనేతి శాండిల్యః - 1 🌻

            పరాభక్తి ద్వారా ఆత్మానందం కలుగుతుంది. ఆత్మానందం లేని భక్తి గౌణభక్తి అవుతుంది. ఆ భక్తి మొదట అవసరమే అయినా అవి ఆత్మానందానికి దారి తీయకపోతే వ్యర్థమౌతుంది అని శాండిల్య మహర్షి చెప్తున్నారు.

            ఆత్మానందం కలగాలంటే బుద్ధి ప్రాపంచిక విషయాల మీదికి పోకూడదు. విషయ త్యాగం కావాలి. పనులు చేస్తున్నట్లుగా కాదు. అవే జరిగి పోతున్నట్లు, వాటికి అసంగంగా ఉండాలి. రాగద్వేషాలు, ఈర్ష్యాసూయలు, దంభం, దర్పం, అహంకారం పోవాలి. 

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు భక్తుడిలో జయించబడి ఉండాలి. భక్తుడు తన ప్రవర్తనలో తమోగుణం గాని, రజోగుణం గాని లేకుండా చేసుకోవాలి. చివరకు సత్వగుణ ప్రవర్తనలోనూ, కీర్తి కాంక్ష, ''నేను ఈ మంచి పనిచేశాను'' అనే భావన కూడా రాకూడదు.

            తనచేత ఉపకారం పొందిన వారిని మరచి పోవాలి. తనచేత ఉపకారం పొందిన వారితో తనకు తరువాత ప్రత్యుపకారమవసరమైనప్పుడు అతడు నిరాకరించినా సరే తాను అతడికి గతంలో చేసిన సహాయం గుర్తుకు రాకూడదు. ఉపకారికి ఉపకారం చేయడం కాదు. అపకారికి ఉపకారం నెపమెన్నక చేసేవాడు మాత్రమే గౌణభక్తి నుండి విడుదలవుతాడు.

ఎవరికైతే త్రిగుణాల ప్రభావం ఉండదో వారికి అహంకారం అడ్డు తొలగుతుంది. అట్టి ఖాళీలోనే ప్రశాంతత కలుగుతుంది. అప్పుడు భక్తి హృదయ పూర్వకమైతే సాధన ఫలంగా ఆత్మానందం కలుగుతుంది. నేను భక్తి క్రియలు జరుపుతున్నాననే స్పృహ లేకుండా ఉంటాడు. ''నేను'' అనే ముసుగు ఉన్నంత వరకు భగవత్ప్రేమ సహజం కాజాలదు.

  నేను అను సంకుచితమైన నీదు ముసుగు 
క్షణములో తొలగింపజాలు ప్రేమ !
 నీవు శాశ్వత జ్ఞాన మాసింతువేని ముందు నిను నీవు మరచిపోవలయును -మెహెర్‌ బాబా

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. VEDA UPANISHAD SUKTHAM - 54 🌹
🌻 1. Annapurna Upanishad - 15 🌻
--- From Atharva Veda
✍️ Dr. A. G. Krishna Warrier
📚. Prasad Bharadwaj

IV-41. The tree of the mind has two seeds; one is the vibration of the vital breath; the other, obstinate imagination. 

IV-42. When the vital breath, aroused by nervous contacts, vibrates, at once the mind is transformed into a mass of sensations. 

IV-43. That all-pervading awareness is aroused by the vibration of the vital breath. It is better to suppress the awareness (of objects); less harmful is the vibration of the vital breath, etc.

 IV-44. For mental peace, the Yogins suppress vital breaths through breath-control, meditation and practices dictated by reasoning. 

IV-45. Know the supreme cause yielding the fruit of mental peace: (namely) the joyful Self-abidance of cognition that is known as breath-control. 

IV-46. Latent impression is said to consist in the seizing of an object (by the force of) entrenched imagination, despite all considerations of cause and effect. 

IV-47. Rejecting everything and imagining nothing, either to be chosen or rejected, the mind remains (in itself); now is the mind unborn. 

IV-48. Being continuously free from latent impressions, when the mind ceases to ponder there arises mindlessness that yields supreme tranquility. 

IV-49. When no aspect of objects in the world is imagined how can the mind be born in the empty sky of the heart? 

IV-50. The conception of a thing's absence is based on its non-being; mindlessness is posited with reference to the object-as-such.

Continues.....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 53 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పులస్త్యమహర్షి-హవిర్భువు - 2 🌻

5. రాక్షసుడికి ఊరికే ఎవడినిచూచినా తినేయ్యాలనిపిస్తుంది. అది వాడి లక్షణం. తనకేమి అపకారం చేసిఉండవలసిన పనిలేదు. మోక్షకామన, ధర్మప్రవృత్తివంటి లక్షణాలను ఎవరయినా కలిగిఉంటే, అట్టివాడిని ఆటంకపరిచి, బాధించటమే రాక్షసుడి లక్షణం. అకారణద్వేషం. 

6. ఈ లక్షణాలతోపాటు, ఇతరులయొక్క ధనమందు ఆశ, ఎవరియొక్క ప్రాభవమూ సహించకపోవటం, ఇంకొకడిని పీడించి దుఃఖపెట్టడంలో ఆనందం – ఇవన్నీ రాక్షసలక్షణాలు. 

7. ఇంకొకరి దుఃఖం చూసి ఆనందించటం అనేటటువంటి లక్షణం ఎవరి దగ్గరయితే ఉంటుందో అది రాక్షసాంశ.

8. ఒకడు పండితుడు కావచ్చు, అనేకమయిన పుణ్యకార్యాలు చేస్తూ ఉండవచ్చు, తపస్వి కావచ్చు, శక్తి ఉండవచ్చు, యోగి కావచ్చు – ఎవరైనా కావచ్చు; కాని అతడు మరొకడి దుఃఖంలో ఆనందం పొందే వాడైతే రాక్షసాంశలో ఉంటాడు అనే బోధ మన పురాణాలలో వస్తుంది.

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీ దత్తాత్రేయ విరచిత జీవన్ముక్తిగీత - 3 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

9. శారీరం కేవలం కర్మ
శోకమోహాది వర్జితం
శుభాశుభ పరిత్యాగీ
జీవన్ముక్త స్స ఉచ్యతే ll  

భావము: 
ఎవడు శోక మోహములు తెలియని కాయక కర్మను చేయుచున్నాడో, శుభాశుభములను పరిత్యజించి యున్నాడో అతడే ‘జీవన్ముక్తుడు’.

10. కర్మ సర్వత్ర ఆదిష్టం
న జానాతి చ కించన
కర్మబ్రహ్మ విజానాతి
జీవన్ముక్త స్స ఉచ్యతే ll  

భావము: 
శాస్త్ర విధానోక్త కర్మలు కూడా తెలియనివాడు, కర్మ బ్రహ్మస్వరూపమేయని తెలిసినవాడు ‘జీవన్ముక్తుడు’

11. చిన్మయం వ్యాపితం సర్వం
ఆకాశం జగదీశ్వరం
సహితం సర్వభూతానాం
జీవన్ముక్త స్స ఉచ్యతే ll  

భావము: 
జగదీశ్వరుడైన పరమాత్మ చిద్రూప మనియు, ఆకాశము వలె సర్వవ్యాపకుడు అనియు, సర్వభూత సహితుడనియు ఎవ్వడు గ్రహించు చున్నాడో అతడే ‘జీవన్ముక్తుడు’.

12. అనాదివర్తి భూతానాం
జీవః శివో న హన్యతే
నిర్వైర స్సర్వ భూతేషు
జీవన్ముక్త స్స ఉచ్యతే ll  

భావము: 
సమస్త భూతముల యందలి అనాదియైన జీవుడు వాస్తవానికి శివుడే కనుక అతడు అవినాశి. సర్వభూతముల యందలి ఈ సత్యమును దర్శించువాడు వైరము లేనివాడై యుండును. అతడే ‘జీవన్ముక్తుడు’.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. సౌందర్య లహరి -38 / Soundarya Lahari - 38 🌹
📚. ప్రసాద్ భరద్వాజ 

38 వ శ్లోకము

🌴. బాలారిష్ట వ్యాధులు నశించి పోవుటకు, చిన్న పిల్లల రోగముల నివారణకు 🌴

శ్లో: 38. సమున్మీలత్సం విత్కమల మకరందైక రసికం 
భజేహంసద్వన్ద్వం కిమపి మహతాం మానసచరంl 
యదాలాపా దష్టాదశ గుణిత విద్యాపరిణతిః 
ర్యదాదత్తే దోషాద్గుణ మఖిల మధ్భ్యః పయ ఇవ II 
 
🌻. తాత్పర్యము :  
అమ్మా : వికసించిన జ్ఞానము అను కమలము నందు ఉన్న పూమధువు నందే ఆసక్తి కలదియు యోగ పుంగవుల మనస్సు అను మానస సరస్సున సంచరించునదియు ఇటువంటిది అని నిర్వచించుటకు వీలు కానిది అగు హంసల రూపమయిన రాజ హంస మిథునమును నేను పూజించు చున్నాను.అ హంస ద్వయముల యొక్క కూతలవలన పరిపక్వత కలుగును.అది నీళ్ళ నుండి పాలవలె దోషములనుండి సద్గుణములను వేరు చేయును .కదా ! 
  
🌻. జప విధానం - నైవేద్యం :--

ఈ శ్లోకమును 1000, సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, మినప గారెలు, కొబ్బరికాయ లేదా మీకు నచ్చిన పదార్థము నివేదించినచో బాలారిష్ట వ్యాధులు నశించును, చిన్న పిల్లలకు వచ్చు రోగముల దరిచేరక నివారణ జరుగును అని చెప్పబడింది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Soundarya Lahari - 38 🌹 
📚 Prasad Bharadwaj 

SLOKA -38

🌴 Curing of Sickness during Childhood 🌴

38. Samunmeelath samvithkamala makarandhaika rasikam Bhaje hamsadwandham kimapi mahatham maanasacharam Yadhalapaa dhashtadasa gunitha vidhyaparinathi Yadadhathe doshad gunamakhila madhbhaya paya eva

🌻 Translation :
I pray before the swan couple, who only enjoy the honey, from the fully open, lotus flowers of knowledge, and who swim in the lake, which is the mind of great ones, and also who can never be described from them come the eighteen arts, and they differentiate the good from the bad, like the milk from water.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :   

If one chants this verse 1000 times each day for 45 days, offering dal vada, the coconut or whatever you desire as prasadam (apeeshta), all the sickness during the childhood days are cured.

🌻 BENEFICIAL RESULTS: 
Cures infant polio. Protects children from danger, disease and disaster. 
 
🌻 Literal Results: 
Power of discrimination, equipoise of mind, ability to grasp art forms.

Continues.. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 337 / Bhagavad-Gita - 337 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 18 🌴

18. గతిర్భర్తా ప్రభు: సాక్షీ నివాస: శరణం సుహృత్ |
ప్రభవ: ప్రలయ: స్థానం నిధానం బీజమవ్యయమ్ ||

🌷. తాత్పర్యం :
గమ్యమును, భరించువాడను, ప్రభువును, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, సన్నిహిత స్నేహితుడను నేనే. నేనే సృష్టిని, ప్రళయమును, సర్వమునకు స్థానమును, విధానమును, అవ్యయ బీజమును అయి యున్నాను.

🌷. భాష్యము : 
“గతి”యనగా చేరవలసిన గమ్యస్థానమని భావము. జనులు తెలియకున్నను వాస్తవమునకు వారందరికిని శ్రీకృష్ణభగవానుడే చేరవలసిన గమ్యస్థానము. 

శ్రీకృష్ణుని తెలిసికొనలేనివాడు తప్పుదోవ పట్టగలడు. అంతియేగాక అట్టివాని నామమాత్ర పురోగతి పాక్షికము లేదా భ్రాంతి మాత్రమే కాగలదు. 

కొందరు వివిధదేవతలను తమ గమ్యస్థానముగా భావించి ఆయా విధానముల తీవ్ర యత్నములచే చంద్రలోకము, సూర్యలోకము, ఇంద్రలోకము, మహర్లోకాది వివిధలోకములును చేరుచుందురు. 

శ్రీకృష్ణుని సృష్టియే అయినందున ఆ లోకములన్నియు ఏకకాలమున కృష్ణునితో సమానములు మరియు కృష్ణునితో అసమానములై యున్నవి. కృష్ణశక్తి యొక్క వ్యక్తీకరణములై ఆ లోకములు కృష్ణునితో సమానమైన కృష్ణుని సంపూర్ణజ్ఞానమును పొందుటలో ముందడుగు వంటివి మాత్రమే. 

అనగా కృష్ణుని వివిధశక్తుల దరిచేరుట లేదా వాటిని గమ్యముగా భావించుట యనునది శ్రీకృష్ణుని పరోక్షముగా చేరుట వంటిది. కాని మనుజుడు కాలము మరియు శక్తి వ్యర్థము కాకూడదని తలచినచో ప్రత్యక్షముగా శ్రీకృష్ణుని దరిచేరవలెను. 

ఉదాహరణమునకు అనేక అంతస్థులు కలిగిన భవంతి యొక్క చివరి అంతస్థునకు చేరుటకు యంత్రసౌకర్యమున్నచో మెట్ల మీద నెమ్మదిగా ఏల పోవలెను? సర్వము శ్రీకృష్ణుని శక్తి పైననే ఆధారపడి యున్నందున అతని ఆశ్రయము లేనిదే ఏదియును స్థితిని కలిగియుండలేదు. 

సమస్తము శ్రీకృష్ణునికే చెంది అతని శక్తి పైననే ఆధారపడియుండుటచే వాస్తవమునకు సర్వమును ఆ భగవానుడే పరమ నియామకుడు. సర్వుల హృదయములందు పరమాత్మ రూపున వసించియుండుటచే అతడే దివ్య సాక్షి. 

మన నివాసములు, దేశములు లేక లోకములన్నియు వాస్తవమునకు శ్రీకృష్ణునితో సమానమే. అతడే పరమ ఆశ్రయమైనందున రక్షణమునకు లేదా దుఃఖనాశమునకు ప్రతియొక్కరు అతనినే శరణము నొందవలెను. 

మనము ఏదేని రక్షణము అవసరమైనప్పుడు దానిని సమాకుర్చునది ఒక సజీవశక్తియై యుండవలెనని మనము గుర్తెరుగవలెను. శ్రీకృష్ణుడే పరమజీవశక్తియై యున్నాడు. 

మన సృష్టికి అతడే కారణుడైనందున లేదా దివ్యజనకుడైనందున అతనికి మించిన సన్నిహిత స్నేహితుడుగాని, బంధువుగాని వేరొకరుండరు. 

ఆ శ్రీకృష్ణుడే సృష్టికి ఆదికారణుడు మరియు ప్రళయము పిమ్మట సర్వమునకు నిధానమునై యున్నాడు. కనుకనే శ్రీకృష్ణభగవానుడు సర్వకారణములకు నిత్యకారణమని తెలియబడినాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 337 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 18 🌴

18. gatir bhartā prabhuḥ sākṣī
nivāsaḥ śaraṇaṁ suhṛt
prabhavaḥ pralayaḥ sthānaṁ
nidhānaṁ bījam avyayam

🌷 Translation : 
I am the goal, the sustainer, the master, the witness, the abode, the refuge and the most dear friend. I am the creation and the annihilation, the basis of everything, the resting place and the eternal seed.

🌹 Purport :
Gati means the destination where we want to go. But the ultimate goal is Kṛṣṇa, although people do not know it. 

One who does not know Kṛṣṇa is misled, and his so-called progressive march is either partial or hallucinatory. 

There are many who make as their destination different demigods, and by rigid performance of the strict respective methods they reach different planets known as Candraloka, Sūryaloka, Indraloka, Maharloka, etc. But all such lokas, or planets, being creations of Kṛṣṇa, are simultaneously Kṛṣṇa and not Kṛṣṇa. 

Such planets, being manifestations of Kṛṣṇa’s energy, are also Kṛṣṇa, but actually they serve only as a step forward for realization of Kṛṣṇa. 

To approach the different energies of Kṛṣṇa is to approach Kṛṣṇa indirectly. One should directly approach Kṛṣṇa, for that will save time and energy. 

For example, if there is a possibility of going to the top of a building by the help of an elevator, why should one go by the staircase, step by step? Everything is resting on Kṛṣṇa’s energy; therefore without Kṛṣṇa’s shelter nothing can exist. 

Kṛṣṇa is the supreme ruler because everything belongs to Him and everything exists on His energy. Kṛṣṇa, being situated in everyone’s heart, is the supreme witness.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹 . శ్రీ శివ మహా పురాణము - 166 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴 
38. అధ్యాయము - 13

🌻. శివపూజ - 6 🌻

సుగంధం చందనం దద్యాదన్యలేపాని యత్నతః | ససుగంధ జలేనైవ జలధారాం ప్రకల్పయేత్‌ || 58

వేదమంత్రైః షడంగైర్వా నామభీ రుద్రసంఖ్యయా | యథా వకాశం తాం దత్వా వస్త్రేణ మార్జయేత్తతః || 59

పశ్చాదాచమనం దద్యాత్తతో వస్త్రం సమర్పయేత్‌ | తిలాశ్చైవ జవా వాపి గోధూమా ముద్గమాషకాః || 60

అర్పణీయాశ్శివాయైవం మంత్రైర్నానావిధై రపి | తతః పుష్పాణి దేయాని పంచాస్యాయ మహాత్మనే || 61

సువాసనగల గంధమును, ఇతర లేపములను శ్రద్ధతో అర్పించవలెను. సుగంధముగల నీటితో మాత్రమే జలధారను కల్పించవలెను (58).

షడంగములతో కూడిన వేద మంత్రములతో గాని, పదకొండు నామములతో గాని వీలును బట్టి జలధారను అర్పించి, తరువాత వస్త్రముతో తుడువవలెను (59). 

తరువాత ఆచమనమును, వస్త్రమును అర్పించవలెను. తిలలను, యవలను, గోధుమలను, పెసలను, మినుములను (60) 

అనేక విధములగు మంత్రములతో శివునకు అర్పించవలెను. తరువాత ఐదు మోముల మహాదేవునకు పుష్పముల నర్పించవలెను (61).

ప్రతివక్త్రం యథా ధ్యానం యథాయోగ్యాభిలాషతః | కమలైశ్శతపత్రైశ్చ శంఖపుషై#్పః పరైస్తథా || 62

కుశపుషై#్పశ్చ ధత్తూరై ర్మందారై ర్ద్రోణసంభ##వై | తథా చ తులసీపత్రైర్బిల్వపత్రై ర్విశేషతః || 63

పూజయేత్పరయా భక్త్యా శంకరం భక్తవత్సలమ్‌ | సర్వాభావే బిల్వ పత్రమర్పణీయం శివాయ వై || 64

బిల్వ పత్రార్పణనైవ సర్వపూజా ప్రసిధ్యతి | తతస్సుగంధ చూర్ణం వై వాసితం తైలముత్తమమ్‌ || 65

అర్పణీయం చ వివిధం శివాయ పరయా ముదా | తతో ధూపః ప్రకర్తవ్యో గుగ్గలా గురుభిర్ముదా || 66

యోగ్యతకు, కామనకు అనురూపముగా భక్తుడు ఐదు మోములను ధ్యానించవలెను. వందరేకుల కమలములతో, గొప్పవి యగు శంఖపుష్పములతో (62), 

కుశపుష్పములతో, ధత్తూరపుష్పములతో, మందారములతో, ద్రోణపుష్పములతో, తులసీ పత్రములతో, మరియు విశేషించి బిల్వదళములతో (63), 

భక్తవత్సలుడగు శంకరుని గొప్ప భక్తితో పూజించవలెను. ఇతర పుష్పములు లేకపోయిననూ, శివునకు బిల్వ పత్రము నర్పించవలెను (64). 

బిల్వ పత్రము నర్పించినచో అన్ని పుష్పములతో పూజించినట్లగును. తరువాత సుగంధ చూర్ణమును, ఉత్తమమగు సుగంధినూనెను (65), 

శివునకు మిక్కిలి యానందముతో అర్పించవలెను. తరువాత గుగ్గిలముతో, అగరుతో ధూపమును ఆనందముగా నర్పిపవలెను (66).

దీపో దేయస్తతస్తసై#్మ శంకరాయ ఘృతప్లుతః | అర్ఘ్యం దద్యాత్‌ పునస్తసై#్మ మంత్రేణానేన భక్తితః || 67

కారయేద్భావతో భక్త్యా వస్త్రేణ ముఖమార్జనమ్‌ |రూపం దేహి యశో దేహి భోగం దేహి చ శంకర || 68

భుక్తిముక్తిఫలం దేహి గృహీత్వార్ఘ్యం నమోsస్తుతే | తతో దేయం శివాయైవ నైవేద్యం వివిధం శుభమ్‌ || 69

తత ఆచమనం ప్రీత్యా కారయేద్వా విలంబతః | తతశ్శివాయ తాంబూలం సాంగోపాంగం విధాయ చ || 70

తరువాత శంకరునకు నేయితో దీపమును పెట్టవలెను. అపుడు మరల శివునకు ఈ మంత్రమునుచ్చరించి భక్తితో అర్ఘ్యమునీయవలెను (67). 

వస్త్రముతో శివునకు, భక్తిశ్రద్ధాపూర్వకముగా ముఖమును వత్తవలెను. ' హే శంకరా! రూపమునిమ్ము. కీర్తిని ఇమ్ము. భోగమునిమ్ము (68). 

నీకు నమస్కారమగుగాక ఈ అర్ఘ్యమును స్వీకరించి, భుక్తిని, మోక్షఫలమును ఇమ్ము' . తరువాత శివునకు వివిధ శుభపదార్ధములను నైవేద్యమిడవలెను (69). 

తరువాత కొద్ది కాలము వేచియుండి శివునకు ప్రీతితో ఆచమనము నీయవలెను. పిమ్మట శివునకు వివిధ ద్రవ్యములతో కూడిన తాంబూలము నర్పించవలెను (70).

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 43 🌹
Chapter 13
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

🌻 Infinite Knowledge in the Avatars Work - 1 🌻

God is Infinite Knowledge, and Infinite Knowledge is the source of INFINITE CON SCIOUSNESS.  

Consciousness is not conscious without knowledge, and so out of the INFINITE CONSCIOUSNESS comes the Infinite Knowledge that knows everything. This Infinite Knowledge does not have to think about anything to know what It knows. 

It Infinite Knowledge simply knows! It knows now what happened millions and billions of years ago, and knows now what will happen after millions and billions of years.  

It therefore knows the p ast history of each individual from stone to human level, and it knows its future from human consciousness to the infinite state of GodRealization. 

The Avatar is this Infinite Knowledge. It was in the beginning of creation when he realized His Real state , that he became conscious of his Infinite Knowledge. 

 When Infinite Knowledge uses Its knowledge It becomes INFINITE INTELLIGENCE since intelligence is the use of knowledge.  

During the Avatar's Realization he took the responsibility of the whole creation, and though he became infinitely free, he allowed — himself to become bound by the responsibility of making each one free from the bondage of illusion ignorance.  

Having attained Infinite Knowledge, he knew in the beginning what he had to do to free each one i n creation, and he knows this every time he comes into creation to work. 

To share in this responsibility, the Avatar has created five divine the Avatar alone who offices held by Perfect Masters. In these offices are contained the divine plans for the whole of creation. 

It is appoints separate duties to each Perfect Master, and each Perfect Master remains responsible for these duties until the end of his life.  

But it is the Avatar alone who remains responsible for all the functionings within the five office s, and it is he alone who is responsible for making the plans.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 38 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 16
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. బుద్ధావతార కధనము 🌻

అథ షోడశోధ్యాయః.
అథ బుద్ధాద్యవతార కథనమ్‌.

అగ్ని రువాచ :

వక్ష్యేబుద్ధావతారం చ పఠతః శృణ్వతోర్ధదమ్‌ | పురా దైవాసురే యుద్ధే దైత్యైద్దేవాః పరాజితాః. 1

రక్ష రక్షేతి శరణం వదన్తో జగ్మురీశ్వరమ్‌ | మాయామోహస్వరూపో7సౌ శుద్ధోదనసుతోభవత్‌. 2

మోహయామాస దైత్యాంస్తాంస్త్యాజితా వేదధర్మకమ్‌ | తే చ బౌద్ధా బభూవుర్హి తేభ్యోన్యే వేదవర్జితాః.

అగ్ని పలికెను. బుద్ధావతారమును గూర్చి చెప్పెదను. ఇది చదువువానికిని వినువానికిని గూడ మంచి ప్రయోజనమును చేకూర్చును. పూర్వము దేవాసుర యుద్ధము జరిగెను. ఆ యుద్ధమున పరాజితు లైన దేవతలు ''రక్షింపుము రక్షింపుము అని ప్రార్థించుచు పరమేశ్వరుని శరణు జొచ్చిరి. 

అపుడు మాయామోహ స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు శుద్ధోదనుని కుమారుడుగా జనించి, దైత్యులకు మోహము కలిగించి, వారు వేదధర్మమును విడచునట్లు చేసెను. వారందరును బౌద్ధులైరి. 

ఆ పరమేశ్వరుడే ఆర్హతుడై, మిగిలిన వేదవర్జితుల నందరిని ఆర్హతులను చేసెను. ఈ విధముగ దైత్యులు వేద ధర్మాదివర్జితు లైన పాషండులుగా ఆయిరి.

నారకార్హం కర్మ చక్రుర్గ్రహీష్యన్త్యధమాదపి | సర్వే కలియుగా న్తే తు భవిష్యన్తి చ సఙ్కరాః. 5

దస్యవః శీలహీనాశ్చ వేదో వాజసనేయకః | దశ పఞ్ఛ చ శాఖా వై ప్రమాణంను భవిష్యతి. 6

వారు నరకమును ఇచ్చు కర్మలు చేసిరి. వీరందరును అధమునినుండి కూడ ప్రతి గ్రహము చేయుదురు. కలియుగాంతమున సంకర మగుదురు. శీలరహితు లైన దొంగ లగుదురు. పదునైదు శాఖలు గల వాజసనేయ వేదము ప్రమాణము కాగలదు.

ధర్మకఞ్చకసంవీతా అధర్మరుచయ స్తథా | మానుషాన్‌ భక్షయిష్యని వ్లుచ్ఛాః సార్థివరూపిణః. 7

ధర్మ మను చొక్కా తొడిగికొనిన వ్లుచ్ఛులు, రాజులై, అధర్మమునందు ఆసక్తి కలవారై మనుష్యులను భక్షించగలరు. (పీడించగలరు.)

కల్కీ విష్ణుయశఃపుత్రో యాజ్ఞవల్క్యపురోహితః | ఉత్సదయిష్యతి వ్లుచ్ఛాన్‌ గృహీతాస్త్రః కృతాయుధః. 8

విష్ణుయశుని కుమారుడును, యాజ్ఞవల్క్యుడు పురోహితుడుగా కల వాడును అగు కల్కి ఆయుధములలో మిక్కిలి నేర్పరియై, అస్త్రములను ధరించి వ్యచ్ఛులను నశింపజేయును.

స్థాపయిష్యతి మర్యాదాం చాతుర్వర్ణ్యే యథోచితామ్‌ | ఆశ్రమేషు చ సర్వేషు ప్రజాః సద్ధర్మవర్త్మని. 9

నాలుగు వర్ణములందు తగిన కట్లుబాట్లు చేయగలడు. ప్రజలను నాలుగు ఆశ్రమములందును, సద్దర్మమార్గము నందును నిలుపగలడు.

కల్కిరూపం పరిత్యజ్య హరిః స్వర్గం గమిష్యతి | తతః కృతయుగం నామ పురావత్సంభవిష్యతి. 10

విష్ణువు కల్కిరూపమును విడచి స్వర్గమునకు వెళ్లును. పిమ్మట పూర్వము నందు వలె కృతయుగ మేర్పడును.

వర్ణాశ్రమాశ్చ ధర్మేషు స్వేషు స్థాస్యన్తి సత్తమ | ఏవం సర్వేషు కల్పేషు సర్వమన్వన్తరేషు చ. 11

అవతారా ఆసంఖ్యాతా అతీతానాగతాదయః | విష్ణోర్దశావతారాఖ్యాన్యః పఠేచ్ఛృణుయాన్నరః. 12

సోవాప్తకామో విమలః సకులః స్వర్గమాప్నుయత్‌ | ధర్మాధర్మవ్యవస్థాన మేవం వై కురుతే హరిః. 13

అవతీర్ణశ్చ స గతః సగ్గాదేః కారణం హరిః |

ఇత్యాదిమహాపురాణే ఆగ్నేయే బుద్ధకల్క్యవతారవర్ణనం నామ షోడశోధ్యాయ.

ఓ మునీ ! వర్ణాశ్రమములు తమ తమ ధర్మములను ఆచరించును, ఈ విధముగా శ్రీమహావిష్ణువు అన్ని కల్పములందును, అన్ని మన్వంతరములందును అనేకము లైన అవతారము లెత్తుచుండును. 

గడచినవి, రానున్నవి అవతారములు ఎన్నియో లెక్కకు మించి ఉన్నవి. విష్ణు దశావతారములను పఠించినవాడును, వినినవాడును, పాపములు నశించి, సర్వకామములు పొంది, కులముతో కూడి స్వర్గము చేరును. 

విష్ణువు ఈ విధముగ ధర్మాధర్మవ్యవస్థ చేయుచుండును సృష్ట్యాదులకు కారణ మైన ఆ హరి ఈ విధముగ అవతరించి మరల (స్వర్గమునకు) వెళ్ళిపోయెను.

ఆగ్ని మహాపురాణమున బుద్ధకల్క్యవతారవర్ణన మను షోడశాధ్యాయము సమాప్తము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 28 / Sri Lalita Sahasranamavali - Meaning - 28 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 59

238. మనువిద్యా - 
మనువు చేత ఉపాసింపబడిన విద్యారూపిణి.

239. చంద్రవిద్యా - 
చంద్రుని చేత ఉపాసింపబడిన విద్యారూపిణి.

240. చంద్రమండలమధ్యగా - 
చంద్ర మండలములో మధ్యగా నుండునది.

241. చారురూపా -
 మనోహరమైన రూపము కలిగినది.

242. చారుహాసా - 
అందమైన మందహాసము కలది.

243. చారుచంద్రకళాధరా - 
అందమైన చంద్రుని కళను ధరించునది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 28 🌹
📚. Prasad Bharadwaj 

🌻 Sahasra Namavali - 28 🌻

238 ) Manu Vidya -   
She  who is personification of Sri Vidya as expounded by Manu

239 ) Chandra Vidya -  
 She  who is personification of Sri Vidya as expounded by Moon

240 ) Chandra mandala Madhyaga -   
She who is in the center of the universe around the moon

241 ) Charu Roopa -   
She who is very beautiful

242 ) Charu Hasa -  
 She who has a beautiful smile

243 ) Charu Chandra Kaladhara -   
She who wears the beautiful crescent

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. ఓంకారము యొక్క చతుష్పాదములు - వివరణ 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
చలాచల బోధ 
📚. ప్రసాద్ భరద్వాజ 

‘ఓం’ అనే అక్షరము సర్వము అయివున్నది. భూత భవిష్య వర్తమానములలో ఓం అనునదే వున్నది. త్రికాలాతీతమైనది ఏదైతే వున్నదో అది కూడా ఓంకారమే అవుతున్నది. ఇదంతయూ బ్రహ్మమే. ఈ ప్రత్యగాత్మ కూడా బ్రహ్మమే. అట్టి ఈ ఆత్మ చతుష్పాదములు కలది. 

ప్రథమ పాదము వైశ్వానరుడు. అతని కర్మక్షేత్రము జాగ్రదావస్థ. అతడు బహిః ప్రజ్ఞ కలవాడు. అతనికి సప్త అంగములు, 19 ముఖములు కలవు. అతడు స్థూల విషయములనే అనుభవించును.

ద్వితీయ పాదము తైజసుడు. అతని కర్మక్షేత్రము స్వప్నావస్థ. అంతః ప్రజ్ఞ కలిగివున్నాడు. సప్త అంగములు మరియు 19 అంగములు కలిగివున్నాడు. అతడు మానసిక ప్రపంచము నందలి, సూక్ష్మ విషయములను అనుభవించుచున్నాడు. 

తృతీయ పాదము ప్రాజ్ఞుడు. నిద్రపోవువాడు. ఎచట ఎట్టి కోరికలను కోరడో, స్వప్నమును కూడా చూడడో అదే సుషుప్తి అవస్థ. అతని యందు అన్ని అనుభవములు భేదరహితమై ఏకీభవించుచున్నవి. అతను సంపూర్ణ చైతన్యము యొక్క ప్రజ్ఞానఘనరూపమై వున్నాడు. ఈ సుషుప్త్యావస్థ జాగ్రత స్వప్నములయందు ఆ చైతన్యమును ప్రసరింపచేయుటకు ముఖద్వారమై వున్నది. 

నాల్గవ పాదము తురీయము. ప్రత్యగాత్మ. అది అంతః ప్రజ్ఞకాదు. బహిః ప్రజ్ఞ కాదు. ఉభయతా ప్రజ్ఞ కలది కాదు. ప్రజ్ఞాన ఘనమూ కాదు. ప్రజ్ఞయూ, అప్రజ్ఞయూ కాదు. అది అదృష్టము. అవ్యవహారము, అగ్రాహ్యము, అలక్షణము, అచింత్యము, అన్యాపదేశము, ఏకాత్మ, ప్రపంచోపశమము, శాంతము, శివము, అద్వైతము అదియే చతుర్థపాదము. అదియే ఆత్మ.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹 Seeds Of Consciousness - 118 🌹
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

🌻 I AM CALLING YOU BACK TO YOURSELF..... 🌻

Q: What benefit do I derive from listening to you?

M: I am calling you back to yourself. All I ask you is to look at yourself, towards yourself, into yourself.

Q: To what purpose?

M: You live, you feel, you think. By giving attention to your living, feeling and thinking, you free yourself from them and go beyond them. 

Your personality dissolves and only the witness remains. Then you go beyond the witness. Do not ask how it happens. Just search within yourself.

Q: What makes the difference between the person and the witness?

M: Both are modes of consciousness. In one you desire and fear, in the other you are unaffected by pleasure and pain and are not ruffled by events. You let them come and go.

Q: How does one get established in the higher state, the state of pure witnessing?

M: Consciousness does not shine by itself. It shines by a light beyond it. 

Having seen the dreamlike quality of consciousness, look for the light in which it appears, which gives it being. There is the content of consciousness as well as the awareness of it.

Q: I know and I know that I know.

M: Quite so, provided the second knowledge is unconditional and timeless. Forget the known, but remember that you are the knower. Don't be all the time immersed in your experiences. 

Remember that you are beyond the experience ever unborn and deathless. In remembering it, the quality of pure knowledge will emerge, the light of unconditional awareness...

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. మనోశక్తి - Mind Power - 56 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌹. Q 53:-- మిధ్యా భౌతికరూపం అంటే ఏమిటి? - 1 🌹

Ans :--
మనం ఒక సముద్రం దెగ్గర ఒక అందమైన ప్రదేశాన్ని ఊహించుకుని అక్కడ మనం ఉన్నట్లు ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతున్నట్లు emotions, ఫీలింగ్స్ తో ఊహించుకుంటే మన అంతర్ ప్రపంచం నుండి విద్యుదయస్కాంత తరంగాలు సముద్రపు ఒడ్డున మన దేహం లాగానే ఒక రూపం లాగా ప్రత్యక్షీకరిస్తాయి.

ఈ రూపం ఇతరులకు కనిపించదు. ఏ శాస్త్ర పరికరాలకు కనిపించదు. మన మైండ్ నుండి వెలువడిన ఆలోచనా తరంగాలు దాని ఫ్రీక్వెన్సీ ని బట్టి భౌతికరూపం సృష్టింపబడుతుంది. దీనినే మిధ్యా భౌతిక రూపం అంటారు.

2) మనం నిరంతరం ఇలాంటి రూపాలను అంతర్ ప్రపంచం నుండి సృష్టిస్తూనే ఉంటాము. ఈ ప్రక్రియ ప్రతిక్షణమూ సాగుతూనే ఉంటుంది. మన ఆలోచనా తరంగాల యొక్క శక్తి సాంద్రత తీవ్రత ఫ్రీక్వెన్సీ మారితే అనగా దాని స్థాయిని బట్టి భౌతిక రూపాలు వేర్వేరు సాంద్రత లతో సృష్టింపబడతాయి. 

దేని ప్రత్యేకత దానికుంటుంది.
మనం మన ఆలోచనల ద్వారా సృష్టింపచేసిన భౌతిక రూపాలకు సృష్టికర్త మనమే అవుతాము.

3) మనం మన మనోశక్తి ద్వారా ఫలానా పరిస్థితులు కావాలని బలంగా కోరుకుంటే మన అంతర్ ప్రపంచం దానిని బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటన గా రూపొందిస్తుంది. కావున జీవితంలో ప్రవేశించే పరిస్థితులకు సంఘటనలకు మనమే సృష్టికర్తలం.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 1 🌹 
 📚. ప్రసాద్ భరద్వాజ 

అసలు వీరబ్రహ్మేంద్రస్వామి ఎవరు? కాలజ్ఞానం అంటే ఏమిటి? వీరబ్రహ్మేంద్రస్వామి ఏం చెప్పారు, అవి ఎంతవరకూ నిజం అయ్యాయి అనే అంశాలు ఒక్కొక్కటీ తెలుసుకుందాం కాలజ్ఞానం అంటే భవిష్యద్దర్శనం అన్నమాట. భవిష్యత్తును దర్శించడం యోగులకు, ఋషులకు సాధ్యమే. మన పురాణ పురుషుల సంగతి వదిలేసినా, చరిత్రకు అందిన వారిలోనూ ఇలా భవిష్యద్దర్శనం చేసిన వారు ఉన్నారు.

ఇతర దేశాలలోనూ భవిష్యత్ ను తెలుసుకొని, జరగబోయేవి ముందే చెప్పిన మహనీయులు లేకపోలేదు. వీరిలో ప్రపంచానికి తెలిసిన ప్రముఖుడు నాస్ట్రోడామస్ అయితే తెలుగువారికి ఎక్కువగా తెలిసింది వీరబ్రహ్మేంద్రస్వామి.

రష్యా, టిబెట్, చైనా వంటి సుదీర్ఘ చరిత్ర కలిగి, ప్రాచీన నాగరికతలు వెల్లివిరిసిన దేశాలలో భవిష్యద్దర్శనం చేసిన కొందరి పేర్లు మనకు వినిపిస్తుంటాయి. వారి గురించిన చారిత్రక వివరాలు గ్రంథస్తం చేసి ఉన్నాయి.

కాలజ్ఞానం ఒక విధంగా జ్యోతిష్యం వంటిదనే చెప్పుకోవాలి. జ్యోతిష్యం గ్రహగతుల ఆధారంగా కొందరు వ్యక్తుల జీవితంలో భవిష్యత్ లో జరగబోయే సంగతులను వివరించి చెప్పేది. ఈ జ్యోతిషంలోనూ అనేక పద్దతులు ఉన్నాయి. నాడీ జోస్యం, హస్తసాముద్రికం తదితరాలు. అవి ఇప్పుడు అప్రస్తుతం.

కాలజ్ఞానం జ్యోతిషానికి భిన్నమైనది. ఇది ఒక దేశ, ప్రపంచ పోకడలను వివరించేది. భవిష్యత్తులో సాంకేతికంగా వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, దేశానికి ఏర్పడే ముప్పులు, పెను విపత్తులు, ప్రముఖ వ్యక్తుల జననం, వారి జీవనం ఇలాంటి సంగతులు ఎన్నిటినో వివరిస్తుంటుంది.

నాస్ట్రోడామస్, వీరబ్రహ్మేంద్రస్వామి చేసింది సరిగ్గా ఇదే! నాస్ట్రోడామస్, చెప్పినా, వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినా వారి జోస్యాలలో స్పష్టత ఉండదు. అస్పష్టతే ఎక్కువ. సూటిగా ఉండవు. మర్మగర్భంగా ఉంటాయి. అలాగని వారేదో ఊహాప్రపంచంలో విహరించి, వారికి తోచిందేదో రాసేశారు అనుకోడానికీ లేదు. ఎందుకు రాశారు అన్నదీ ఆలోచించాలి.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. సాయి తత్వం - మానవత్వం - 47 / Sai Philosophy is Humanity - 47 🌹
🌴. అధ్యాయము - 7 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. సాయిబాబా విచిత్ర వైఖరులు - 1 🌻

1. శిరిడీ గ్రామములో నున్న శని, గణపతి, పార్వతీ-శంకర, గ్రామదేవత, మారుతీ మొదలగు దేవాలయములన్నిటిని తాత్యాపాటీలు ద్వారా బాబా మరమ్మతు చేయించెను.

2. వారి దానగుణము ఎన్నదగినది. దక్షిణరూపముగా వసూలయిన పైకమునంతయు నొక్కక్కరికి రోజుకొక్కంటికి రూ.

3. 50/-, 20/-, 15/-ల చొప్పున ఇచ్ఛవచ్చినట్లు పంచిపెట్టెడివారు.

4. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతు లగుచుండిరి.

5. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి. కుష్ఠువారు కూడ రోగవిముక్తులగుచుండిరి.

6. అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. ఎటువంటి మందులు పసరులతో పనిలేకుండనే గ్రుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను.

7. కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును ఎవ్వరును కనుగొనకుండిరి.

8. వారి కీర్తి నలుమూలల వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు శిరిడీకి తండోపతండములుగ రాసాగిరి.

9. బాబా ఎల్లప్పుడు ధునికెదురుగా ధ్యానమగ్నులయి కూర్చొనెడివారు. ఒక్కొక్కప్పుడు మలమూత్రవిసర్జన కూడా అక్కడే చేసేవారు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹. Sai Philosophy is Humanity - 47 🌹
Chapter 7
✍️. Sri NV. Gunaji
📚. Prasad Bharadwaj

🌻. Behaviour of Sai Baba - 1 🌻

Fool that I am, I cannot describe Baba’s miracles. He got almost all the temples in Shirdi repaired. 

Through Tatya Patil, the temples of Shani, Ganapati, Shankar-Parvati, Village Deity, and Maruti were put in order. His charity was also remarkable. 

The money He used to collect as Dakshina was freely distributed, Rs.20 to some, Rs.15 or 50, to others everyday. 

The recipients thought that this was ‘pure’ charity money, and Baba wished that it should be usefully employed.

People were immensely benefited by having a darshana of Baba. 

Some became hale and hearty; wicked people were turned into good ones. 

Kushtha (Leprosy) was cured in some cases, many got their desires fulfilled, without any drops or medicine being put in the eyes, some blind men got back their sight and some lame ones got their legs. 

Nobody could see the end of His extraordinary greatness. His fame spread far and wide, and pilgrims from all sides flocked to Shirdi. 

Baba sat always near the Dhuni and eased Himself there, and always sat in meditation; sometimes with and on other times without a bath.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹