🌹 02, APRIL 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹

🍀🌹 02, APRIL 2023 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 02, APRIL 2023 SUNDAY ఆదివారం, భాను వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 349 / Bhagavad-Gita - 349 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 11 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 196 / Agni Maha Purana - 196 🌹 🌻. అధివాసనము - 3 / Preliminary consecration of an image (adhivāsana) - 3 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 061 / DAILY WISDOM - 061 🌹 🌻1. మానవ జీవితం తనను తాను సర్దుబాటు చేసుకోవాలి / 1. Human Life has to Adjust Itself 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 326 🌹
6) 🌹. శివ సూత్రములు - 63 / Siva Sutras - 63 🌹 
🌻. 20. భూత సంధాన భూత పృథక్త్వా విశ్వ సంఘటః - 2 / 20. Bhūta sandhāna bhūta pṛthaktva viśva saṃghaṭṭāḥ - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 02, ఏప్రిల్‌, Apirl 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : వైష్ణవ కామద ఏకాదశి, Vaishnava Kamada Ekadashi 🌻*

*🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 1 🍀*

*1. ఓం విశ్వవిద్విశ్వజిత్కర్తా విశ్వాత్మా విశ్వతోముఖః |*
*విశ్వేశ్వరో విశ్వయోనిర్నియతాత్మా జితేంద్రియః*
*2. కాలాశ్రయః కాలకర్తా కాలహా కాలనాశనః |*
*మహాయోగీ మహాసిద్ధిర్మహాత్మా సుమహాబలః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : నిశ్చలాసన ప్రయోజనం - చైతన్యం తనలో తాను చుట్టచుట్టుకొని కర్మప్రవృత్తి రహితంగా ఊరక యుండే స్థితి ఏకాగ్రతా సాధనకు మిక్కిలి అనుకూలం. కనుకనే నిశ్చలాసనమున కూర్చుండి సాధన చెయ్యవలె ననునది యేర్పడింది. 🍀* 

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,  
వసంత ఋతువు, ఉత్తరాయణం, 
చైత్ర మాసం
తిథి: శుక్ల ద్వాదశి 30:25:50 వరకు
తదుపరి శుక్ల త్రయోదశి 
నక్షత్రం: మఘ 31:24:07 వరకు
తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: శూల 27:21:34 వరకు
తదుపరి దండ
కరణం: బవ 17:22:51 వరకు
వర్జ్యం: 18:06:30 - 19:52:50
దుర్ముహూర్తం: 16:50:52 - 17:40:08
రాహు కాలం: 16:57:01 - 18:29:24
గుళిక కాలం: 15:24:38 - 16:57:01
యమ గండం: 12:19:51 - 13:52:15
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:43
అమృత కాలం: 28:44:30 - 30:30:50
మరియు 26:37:32 - 28:22:24
సూర్యోదయం: 06:10:19
సూర్యాస్తమయం: 18:29:24
చంద్రోదయం: 15:27:03
చంద్రాస్తమయం: 03:50:15
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: ముద్గర యోగం - కలహం
31:24:07 వరకు తదుపరి ఛత్ర యోగం
- స్త్రీ లాభం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 349 / Bhagavad-Gita - 349 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 11 🌴*

*11. అవజానన్తి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్ |*
* పరం భావమజానన్తో మమ భూతమహేశ్వరమ్ |*

🌷. తాత్పర్యం :
*నేను మానవరూపమున అవతరించినపుడు మూఢులు నన్ను అపహాస్యము చేయుదురు. సమస్తమునకు పరమప్రభువైన నా దివ్యత్వమును వారెరుగరు.*

🌷. భాష్యము : 
*శ్రీకృష్ణభగవానుడు మనవరూపమున అవతరించినప్పటికిని సామాన్య మానవుడు కాడని ఈ అధ్యాయమునందలి కడచిన శ్లోకముల భాష్యము వలన స్పష్టముగా విదితమైనది. వాస్తవమునకు సమస్త విశ్వము సృష్టి, స్థితి, లయములను గావించు శ్రీకృష్ణభగవానుడు సాధారణమానవుడు కానేకాడు. అయినప్పటికిని పెక్కురు మూఢులు శ్రీకృష్ణుడు కేవలము శక్తిమంతుడైన మానవుడే గాని అంతకు మించి ఏదియును కాడని భావింతురు. కాని బ్రహ్మసంహిత యందు నిర్ధారింపబడినట్లు అతడే ఆదిదేవుడు మరియు దేవదేవుడు (ఈశ్వర: పరమ: కృష్ణ: ) .*

*వాస్తవమునకు నియమించెడి ఈశ్వరులు పెక్కురు గలరు. వారిలో ఒకరికన్నను వేరొకరు అధికులుగా గోచరింతురు. భౌతికజగమునందలి లౌకికకార్యములందు కూడా ఒక అధికారి, అతనిపై ఒక కార్యదర్శి, అతనిపై ఒక మంత్రి, ఆ మంత్రిపై అధ్యక్షుడు ఉన్నట్లుగా మనము గాంతుము. వీరందరు తమ పరధిలో ఈశ్వరులేయైనను వేరొకనిచే నియమింపబడెడివారు. కాని శ్రీకృష్ణభగవానుడు మాత్రము దివ్య నియామకుడని బ్రహ్మసంహిత యందు తెలుపబడినది. భౌతిక, ఆధ్యాత్మికజగత్తులలో పలు ఈశ్వరులున్నను శ్రీకృష్ణుడు మాత్రము పరమేశ్వరుడు (ఈశ్వర: పరమ: కృష్ణ: ) మరియు అతని దేహము సచ్చిదానందమయమైనది (భౌతికము కానిది).*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 349 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 11 🌴*

*11 . avajānanti māṁ mūḍhā mānuṣīṁ tanum āśritam*
*paraṁ bhāvam ajānanto mama bhūta-maheśvaram*

🌷 Translation : 
*Fools deride Me when I descend in the human form. They do not know My transcendental nature as the Supreme Lord of all that be.*

🌹 Purport :
*From the other explanations of the previous verses in this chapter, it is clear that the Supreme Personality of Godhead, although appearing like a human being, is not a common man. The Personality of Godhead, who conducts the creation, maintenance and annihilation of the complete cosmic manifestation, cannot be a human being. Yet there are many foolish men who consider Kṛṣṇa to be merely a powerful man and nothing more. Actually, He is the original Supreme Personality, as is confirmed in the Brahma-saṁhitā (īśvaraḥ paramaḥ kṛṣṇaḥ); He is the Supreme Lord.*

*There are many īśvaras, controllers, and one appears greater than another. In the ordinary management of affairs in the material world, we find some official or director, and above him there is a secretary, and above him a minister, and above him a president. Each of them is a controller, but one is controlled by another. In the Brahma-saṁhitā it is said that Kṛṣṇa is the supreme controller; there are many controllers undoubtedly, both in the material and spiritual world, but Kṛṣṇa is the supreme controller (īśvaraḥ paramaḥ kṛṣṇaḥ), and His body is sac-cid-ānanda, nonmaterial.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 196 / Agni Maha Purana - 196 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 59*

*🌻. అధివాసనము - 3 🌻*

*శబ్దతన్మాత్ర తత్త్వవాచకమగు నకారమును (నం) శిరస్సుపైనను, స్పర్శరూప ధకారమును (ధం) ముఖప్రదేశమునందును, రూపతత్త్వవాచకమగు దకారమును (దం) నేత్రప్రాంతము నందును, రసతన్మాత్రబోధక థకారమును (థం) వస్తి ప్రదేశ (మూత్రాశయ) మునందును, గంధతన్మాత్ర స్వరూపమగు తకారమును (తం) పిక్కలయందును, ణకారమును (ణం) శ్రోత్రములందును, ఢకారమును (ఢం) త్వక్కుపైనను, డకారమును (డం) నేత్రములందును, ఠకారమును (ఠం) జిహ్వయందును. టకారమును (టం) నాసికయందును ఞకారమును (ఇం) వాగింద్రియమునందును, పాణితత్త్వరూపమగు ఝకారమును (ఝం) హస్తములందును. జకారమును (జం) పాదములందును, ఛకారమును (ఛం) పాయువునందును చకారము (చం) ఉపస్ధయందును, పృధ్వీతత్త్వ రూపమగు జకారమును (జం) పాదములందును, ఘకారము (ఘం) వస్తి యందును, తేజస్తత్త్వరూపమగు (గం) ను హృదయమునందును, వాయుతత్త్వరూపమగు ఖకారమును (ఖం) నాసికయందును న్యాసము చేయవలెను. కకారము (కం) ఆకాశతత్త్వరూపమైనది. విద్వాంసుడు దాని నెల్లప్పుడును శిరస్సుపై న్యాసము చేయవలెను.*

*హృదయ కమలమునందు సూర్యదేవతకు సంబంధించిన 'యం' బీజము న్యాసము చేసి, హృదయమును నుండి బయల్వెడలిన డెబ్బది రెండువేలనాడులలో షోడశలాయుక్తసకార (సం) న్యాసము చేయవలెను. దాని మధ్యభాగమునందు బిందు స్వరూపవహ్ని మండలమును భావించవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 196 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 59*
*🌻Preliminary consecration of an image (adhivāsana) - 3 🌻*

I 9. The letter na which is a symbol of the principle of sound should be placed on the forehead. The letter dha which is the symbol of sense of touch should be placed in the region of the face (of image).

20. The letter da denoting the gradations should be placed in the region of the heart. The letter tha symbolising the sense of taste should be placed in the region of pelvis.

21. The letter ta signifying the sense of smell should be located on the shanks. After having located the letter ṇa in the ears, the letter ḍha should be located on the skin.

22. The letter ḍa should be located in the two eyes, the letter ṭha in the tongue, the letter ṭa in the nose and the letter ña in the speech.

23. Having placed the letter jha representing the hands in. the hands, a wise man should place the letter ja in the feet, cha in the anus and ca in the genitals.

24. The letter ṅa symbolising the principle of earth should be placed on the feet. The letter gha (should be placed) in the pelvis. (The letter) ga representing the principle of lustre should. be placed in the heart.

25. The letter kha which represents the principle of wind should be placed in the nose. The letter ka signifying the principle of ether should be assigned to the forehead by the wise.

26-27. The letter ya denoting lord Sun having been placed in the lotus of the heart, the letter sa possessing sixteen digits should be placed in the seventy-two thousand (rays) emanating from the (lotus) heart. The priest fully initiated in the mystic syllables should contemplate on the point (bindu) representing the region of fire in the middle of it.

28. The excellent letter ha along with the syllable oṃ (praṇava) should be placed there. Oṃ, āṃ, salutations to the parameṣtyātman.[3] Āṃ, salutations to puruṣātman[4].

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 61 / DAILY WISDOM - 61 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻1. మానవ జీవితం తనను తాను సర్దుబాటు చేసుకోవాలి 🌻*

*మానవ జీవితానికి మార్గనిర్దేశం చేసే అన్ని సూత్రాలలో, బాహ్యం మరియు అంతరం అని పిలువబడే రెండు అంశాలు ఉన్నాయి. రోజువారీ జీవితంలోని దినచర్య ఎక్కువగా మనం బాహ్య సామాజిక సూత్రాలు అని పిలిచే వాటి ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది. ఇవి మానవ సామాజిక పరిధిలో విలువను మరియు ప్రామాణికతను కలిగి ఉంటాయి. ఈ కోణంలో, మానవ జీవితంలోని ప్రతి కార్యాచరణ అప్పటి పరిస్థితులకు సాపేక్షంగా ఉన్నందున, బాహ్య జీవిత విలువలు అని పిలువబడే విలువలు సాపేక్షమైనవి అని మనం చెప్పవచ్చు.*

*అందువల్ల, వాటికి శాశ్వతమైన విలువ లేదు. అవి కాలం యొక్క పరీక్షలను తట్టుకోలేవు, ప్రతి పరిస్థితిలో స్థిరంగా చెల్లుబాటు కావు. దీని ద్వారా చెప్పేది ఏమిటంటే మానవుని రోజువారీ సామాజిక జీవితాన్ని నిర్దేశించే ఈ సామాజిక జీవన సూత్రం సైతం, అప్పటి మానవ జీవన విధానాలపై, విలువలపై ఆధారపడి ఉన్నందున, కేవలం సాపెక్షమైనదే తప్ప మరొకటి కాదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 61 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻1. Human Life has to Adjust Itself 🌻*

*In all principles which guide human life, there are two aspects known as the exoteric and the esoteric. The formal routine of daily life is mostly guided by what we call the exoteric principles which have a working value and a validity within the realm of human action. In this sense, we may say that the values which are called exoteric are relative, inasmuch as every activity in human life is relative to circumstances.*

*Hence, they do not have eternal value, and they will not be valid persistently under every condition in the vicissitudes of time. This principle which is exoteric, by which what we mean is the outward relative principle of life, becomes, tentatively, the guiding line of action, notwithstanding the fact that even this relative principle of exoteric life changes itself according to the subsidiary changes with which human life has to adjust itself.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 326 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ధ్యానమన్నది చేసేది కాదు, అది స్వచ్ఛమైన చైతన్యం, ఐతే జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుంది. పరిశీలిస్తే నీకు తెలిసి వస్తుంది. ఒక నిశ్శబ్దం, ఒక నిర్మలత్వం ఒక సమతూకం ఏర్పడుతుంది. 🍀*

*ధ్యానమన్నది చేసేది కాదు, అది స్వచ్ఛమైన చైతన్యం, ఐతే జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుంది. పరిశీలిస్తే నీకు తెలిసి వస్తుంది. నీ శరీరం దయాన్వితమవుతుంది. విశ్రాంతిని అందుకుంటుంది. నిర్బంధం లేనిదవుతుంది. తేలిక పడుతుంది. నీ శరీరం నించీ పర్వతాల భారం దిగిపోతుంది. నీ మనసు చురుకుదనం తగ్గుతుంది. గాని చర్యల మధ్య చాలా వ్యవధాన ముంటుంది. ఆ వ్యవధానంలో అపూర్వ అనుభవాలు కలుగుతాయి. క్రమక్రమంగా నీ ఉద్వేగాలు శాంతినిస్తాయి.*

*నువ్వు ఎంతో కాలం ఆనందంగానూ వుండవు. బాధగానూ వుండవు. వాటి మధ్య తేడా అంతరిస్తుంది. అవి రెండూ లేవి పరమానంద స్థితి ఏర్పడుతుంది. ఒక నిశ్శబ్దం, ఒక నిర్మలత్వం ఒక సమతూకం ఏర్పడుతుంది. అక్కడ పర్వతాలూ వుండవు. లోయలూ వుండవు. చీకటి వెలుగులుండవు. నువ్వు వాటి మధ్య నుంటావు. ఈ అనుభవాలు గాఢమవుతాయి. అప్పుడు ఒక పెద్ద ముందడుగు వేస్తావు. అప్పుడు నిన్ను నువ్వు చూస్తావు. దాన్ని ఆత్మ అను లేదా స్వీయతత్వమను, దేవుడను. అప్పుడు అంతా కాంతిమయమే. అంతర్నేత్రం తెరుచుకుంటుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శివ సూత్రములు - 063 / Siva Sutras - 063 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻. 20. భూత సంధాన భూత పృథక్త్వా విశ్వ సంఘటః - 2 🌻*
*🌴.సంకల్ప శక్తి ద్వారా యోగి తన అవగాహనను కేంద్రీకరించి మూలకాలను తన శరీరం నుండి మరియు ఇతరుల నుండి వేరు చేయగలడు. అతను స్థలం మరియు సమయం యొక్క పరిమితుల నుండి విముక్తి పొందగలడు. 🌴*

*యోగి తన వ్యాధిని లేదా ఇతర వ్యాధులను నయం చేయడంపై తన అవగాహనను (అంటే అతని చైతన్యాన్ని స్థిరపరచడం) కేంద్రీకరించడం ద్వారా, యోగి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి యొక్క శరీరం నుండి అనారోగ్యాన్ని వేరు చేయగలడు. అతను తన సంకల్ప శక్తిని మరియు ఏకాగ్రతను ఉపయోగించి వ్యాధులను నయం చేయగలడు. తన కేంద్రీకృత సంకల్ప శక్తితో, ఒక యోగి ఒకరి శరీరం నుండి ఏవైనా అవాంఛిత లక్షణాలను వేరు చేయగలడు.* 

*ఈ యోగి తన ఆకలి మరియు దాహాన్ని కూడా ఈ విధంగా తీర్చుకోగలడు. అతని ఆలోచనాప్రక్రియే అతని అవసరాలను తీర్చివేస్తుంది. ఈ ప్రక్రియలో, ఒక యోగి, స్థలం మరియు సమయాన్ని అధిగమిస్తూ, తన అవగాహన నుండి తన స్థూల శరీరాన్ని వేరు చేయగలడు, . దాహం, ఆకలి, అనారోగ్యాలు మొదలైనవి స్థూల శరీరాలకి సంబంధించినవి మాత్రమే.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras - 063 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 20. Bhūta sandhāna bhūta pṛthaktva viśva saṃghaṭṭāḥ - 2 🌻*
*🌴. By will power the yogi can concentrate his awareness and separate the elements from his own body and that of others. He can become free from the limitations of space and time. 🌴*

*By focusing his awareness (which means fixing his consciousness) towards healing of his ailment or other’s ailments, the yogi is able disconnect the illness from the body of the one who suffers from the ailment. He is able to cure ailments using his will power and concentration. With his concentrated will power, a yogi is able to segregate any unwanted features from one’s body.*

*This yogi is also able to satiate his hunger and thirst this way. His thought process alone satiates his requirements. During this process, a yogi is able to disconnect his gross body from his awareness, transcending space and time. Thirst, hunger, ailments, etc are associated only with gross bodies.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 444 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 444 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 444 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 444 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।
శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀

🌻 444. ‘ధృతిః’ - 2 🌻


చంచలమగు ప్రజ్ఞ గాలిలో దీపము వంటిది. నీటిపై వ్రాత వంటిది. ప్రజ్ఞ మనస్సు నుండి బుద్ధిలోనికి ప్రవేశించినపుడు స్థిరమగును. పాదరసము వంటి మనస్సు బుద్ధిలోకమున ఘనీభవించి స్థిరమై యుండును. అందులకే రసలింగములకు పూజలు చేయు సంప్రదాయ మేర్పడినది. నూనె, నెయ్యి దీపములు గాలికి తల్లడిల్లును, విద్యుత్ దీపమట్లుగాదు. విద్యుత్ దీపము బుద్ధి వంటిది. విద్యుత్ ఆత్మవంటిది. నూనె, నెయ్యి దీపములు మనస్సు వంటివి. అవి పదార్థ మాధారముగ వెలుగును. విద్యుత్ దీపము సూక్ష్మ పదార్థ మాధారముగ వెలుగును. శ్రీమాత ఆరాధనము ద్వారా మానవు డచంచలమగు మతి నుండి దివ్యమగు మతిలోనికి చేరును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 444 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 94. Kumara gananadhanba tushtih pushtirmati dhrutih
Shanti spastimati mantirnandini vignanashini ॥ 94 ॥ 🌻

🌻 444. 'Dhrutih' - 2 🌻


Fickle knowledge is like a lamp in the wind. It's like a writing on water. Pragya is solidified as it transcends from mind to buddhi. The ever changing fluid like mind solidifies as it enters buddhi. It is for them that the tradition of worshiping the rasalingas is unique. Oil and ghee lamps sway in the wind, unlike electric lamps. An electric lamp is like buddhi. Electricity is like a soul. Oil and ghee lamps are like the mind. They are material-based light. An electric lamp emits light based on subtle matter. Through the worship of Sri Mata, a human being can reach the divine mind from the mundane mind.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

Osho Daily Meditations - 328. YOUR DECISION / ఓషో రోజువారీ ధ్యానాలు - 328. మీ నిర్ణయం


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 328 / Osho Daily Meditations - 328 🌹

✍️. ప్రసాద్ భరద్వాజ

🍀 328. మీ నిర్ణయం 🍀

🕉. ప్రపంచంలోని ప్రేమ అంతా మీకు ఇచ్చినా కానీ మీరు దు:ఖితులుగా ఉండాలని నిర్ణయించుకుంటే, మీరు ద:ఖితులుగానే ఉంటారు. ఇక ఎవరైనా ఎటువంటి కారణం లేకుండా సంతోషంగా, మరింత సంతోషంగా ఉండవచ్చు - ఎందుకంటే ఆనందం మరియు దుఃఖం మీ నిర్ణయాలు. 🕉


ఆనందం మరియు దుఃఖం మీపై ఆధారపడి ఉన్నాయని గ్రహించడానికి చాలా సమయం పడుతుంది, ఎందుకంటే ఇతరులు మిమ్మల్ని దుఃఖానికి గురిచేస్తున్నారని అహం అనుకోవడం చాలా సౌకర్యంగా ఉంటుంది. అహం అసాధ్యమైన పరిస్థితులను సృష్టిస్తుంది మొదట ఈ షరతులను నెరవేర్చాలి అప్పుడు మాత్రమే మీరు సంతోషంగా ఉండగలరు. ఇంత నీచమైన లోకంలో, నీచమైన వ్యక్తులతో, నీచమైన పరిస్థితిలో నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవు అని అడుగుతుంది.

మిమ్మల్ని మీరు సరిగ్గా చూస్తే మీ గురించి మీరు నవ్వుకుంటారు. అది హాస్యాస్పదమైనది, కేవలం హాస్యాస్పదమైనది. మనం చేస్తున్నది అసంబద్ధం. దీన్ని చేయమని ఎవరూ మమ్మల్ని బలవంతం చేయరు, కానీ చేస్తాము- మరియు సహాయం కోసం అర్ధిస్టాము. మరియు మీరు దాని నుండి బయటకు రావచ్చు; ఇది మీ స్వంత ఆట - దు:ఖితులుగా మారడం, ఆపై సానుభూతి మరియు ప్రేమ కోసం అడగడం. మీరు సంతోషంగా ఉంటే, ప్రేమ మీ వైపు ప్రవహిస్తుంది ... అడగవలసిన అవసరం లేదు. ఇది ప్రాథమిక చట్టాలలో ఒకటి. నీరు క్రిందికి ప్రవహిస్తుంది, మరియు అగ్ని పైకి ప్రవహిస్తుంది, ప్రేమ ఆనందం వైపు ప్రవహిస్తుంది ... సంతోషం వైపు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 328 🌹

📚. Prasad Bharadwaj

🍀 328. YOUR DECISION 🍀

🕉. All the love in the world can be given to you, but if you decide to be miserable, you will remain miserable. And one can be happy, tremendously happy, for no reason at all--because happiness and misery are your decisions. 🕉

It takes much time to realize that happiness and misery are up to you, because it is very comfortable for the ego to think that others are making you miserable. The ego goes on making impossible conditions, and it says that first these conditions have to be fulfilled and only then can you be happy. It asks how can you be happy in such an ugly world, with such ugly people, in such an ugly situation?

If you see yourself rightly you will laugh about yourself. It is ridiculous, simply ridiculous. What we are doing is absurd. Nobody is forcing us to do it, but we go on doing it--and crying for help. And you can simply come out of it; it is your own game--to become miserable, and then to ask for sympathy and love. If you are happy, love will be flowing toward you ... there is no need to ask for it. It is one of the basic laws. Just as water flows downward, and fire flows upward, love flows toward happiness ... happiness wards.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ మహా పురాణము - 709 / Sri Siva Maha Purana - 708


🌹 . శ్రీ శివ మహా పురాణము - 709 / Sri Siva Maha Purana - 708 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 05 🌴

🌻. త్రిపుర మోహనము - 7 🌻


మాయావి, మాయావులలో అగ్రేసురుడు అగు ఆ యతి స్నానదానాదులను, విశేషించి పర్వకాలములో చేయు స్నానదానాదులను ఖండించెను (53). ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా! ఇన్ని మాటలేల? ఆ మాయావి త్రిపురములలో గలవేద ధర్ములన్నియూ దూరమగునట్లు చేసెను (54). పాతివ్రత్య ధర్మము ప్రధానముగా గల త్రిపురస్త్రీలు అందరు మోహితలై భర్తను శుశ్రూష చేయవలెననే ఉత్తమ బుద్ధిని విడనాడిరి (55). పురుషులు స్త్రీలను ఆకర్షించి వశము చేసుకొనే విద్యను నేర్చి మాయామోహితులై పరస్త్రీలయందు ఆ విద్యను సఫలమొనర్చిరి (56).

అంతఃపురస్త్రీలు, రాజకుమారులు, పౌరులు మరియు పురస్త్రీలు అందరు వాని శిష్యులచే మోహింప చేయబడిరి (57). ఇట్లు పౌరులందరు అన్ని విధములా స్వధర్మ విముఖులు కాగా అధర్మము తాండవించెను (58). దేవదేవుడగు విష్ణుప్రభుని ఆజ్ఞచే మాయ, మరియు అలక్ష్మి స్వయముగా త్రిపురములకు వెళ్లిరి (59). దేవతలకు ప్రభువగు బ్రహ్మ తపస్సునకు మెచ్చి ఏ లక్ష్మిని వారికి ఇచ్చినాడో, ఆ లక్ష్మి బ్రహ్మ గారి ఆజ్ఞచే వారిని విడిచి దూరముగా వెళ్లిపోయెను (60).

ఆ నారదుడు విష్ణువు యోక్క మాయచే నిర్మితమైన అట్టి బుద్ధి వ్యామోహమును వారికి క్షణకాలములో కలిగించి కృతార్థుడాయెను (61). ఆ మాయావి యగు యతి ఏ రూపములో నుండెనో, నారదుడు కూడ అదే రూపములో నుండెను. అయిననూ పరమేశ్వరుని ఆనుగ్రహముచే ఆయన బుద్ధిలో ఎట్టి వికారములు కలుగలేదు (62). ఓ మహర్షీ! అచట సోదరులిద్దరితో మరియు మయునితో కూడి యున్న ఆ రాక్షసరాజు యొక్క సామర్థ్యము శివుని సంకల్పముచే మొక్క వోయెను (63).

శ్రీ శివమహాపురాణములో రుద్రసంహితయందు యుద్ధ ఖండములో త్రిపురమోహనమనే అయిదవ అధ్యాయము ముగిసినది (5).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 709🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 05 🌴

🌻 The Tripuras are fascinated - 7 🌻


53. The heretic sage, an expert in wielding magic art, foremost among the deceptive, criticised the ceremonial ablutions and charitable gifts that are made on auspicious occasions.

54. O foremost among brahmins, why shall I dilate upon this topic? Suffice it to say that in the three cities every type of Vedic rites was completely stopped by that deceptive heretic sage.

55. The women of the three cities who were hitherto devotedly attached to their husbands were deluded and misguided and they abandoned their noble inclinations to serve their husbands.

56. The fascinated men practised rites of seduction and winning over and made their artifices fruitful in gaining other men’s wives.

57. The attendant maids in the haremss, the princes, the citizens and the ladies were perfectly enchanted by him.

58. Thus when the citizens became averse to virtuous rites and actions, evil reigned supreme.

59. At the bidding of lord Viṣṇu, his magic art and evil fortune visited the three cities.

60. The glory that they had acquired by the boon of Brahmā, the lord of the gods, went out forsaking them, at the behest of Brahmā.

61. Blessing them with the utter delusion of their intellect, perpetrated by the illusion of Viṣṇu, Nārada became contented.

62. Though Nārada and the heretic sage had been in that guise for long, they were not defiled, thanks to the benediction of lord Śiva.

63. As Śiva willed, O sage, the capacity of the ruler of the Asuras became stunted and thwarted as also of his brothers and Maya.


Continues....

🌹🌹🌹🌹🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 748 / Vishnu Sahasranama Contemplation - 748


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 748 / Vishnu Sahasranama Contemplation - 748🌹

🌻748. మానదః, मानदः, Mānadaḥ🌻

ఓం మానదాయ నమః | ॐ मानदाय नमः | OM Mānadāya namaḥ


స్వమాయయాత్మాభిమానం సర్వేషామప్య నాత్మసు ।
వాదదాతి స్వభక్తానామ్ సత్కారం మానమేనవా ॥

ఖణ్డయత్సాత్మాభిమానమ్ తత్త్వజ్ఞానామవాత్మసు ।
ఇతివా మానద ఇది శ్రీహరిః ప్రోచ్యతే బుధైః ॥

మానమును ఇచ్చువాడు, మానమును ఖండించువాడు మానదః అను రెండు వ్యుత్పత్తులును ఈ నామమునకు చెప్పదగును. ఈ రెండు వ్యుత్పత్తులకును భాష్యకారులు ఇచ్చు వివరణము ఇది. తన మాయచే ఎల్లవారికిని అనాత్మవస్తువుల విషయమున 'ఇది ఆత్మ' అను ఆత్మాభిమానమును కలిగించుచు ఉన్నాడు.

తత్త్వ వేత్తలకు మాత్రము అనాత్మవస్తు విషయమున ఆత్మాభిమానమును ఖండించును. తన భక్తులకు మాన సత్కారమును ఇచ్చును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 748🌹

🌻748. Mānadaḥ🌻

OM Mānadāya namaḥ


स्वमाययात्माभिमानं सर्वेषामप्य नात्मसु ।
वाददाति स्वभक्तानाम् सत्कारं मानमेनवा ॥

खण्डयत्सात्माभिमानम् तत्त्वज्ञानामवात्मसु ।
इतिवा मानद इदि श्रीहरिः प्रोच्यते बुधैः ॥

Svamāyayātmābhimānaṃ sarveṣāmapya nātmasu,
Vādadāti svabhaktānām satkāraṃ mānamenavā.

Khaṇḍayatsātmābhimānam tattvajñānāmavātmasu,
Itivā mānada idi śrīhariḥ procyate budhaiḥ.


The name Mānadaḥ can be interpreted either as 'causes pride' or 'cuts off pride.' Scholars provide below reasoning to support the two possibilities.

By the power of His māya, He causes attachment as to the ātman to things which are not ātman.

He cuts off from the knowers of the Truth the thought of the ātman in what are not the ātman. He confers māna or prestige on His devotees.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

अमानी मानदो मान्यो लोकस्वामी त्रिलोकधृक् ।
सुमेधा मेधजो धन्यस्सत्यमेधा धराधरः ॥ ८० ॥

అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ ।
సుమేధా మేధజో ధన్యస్సత్యమేధా ధరాధరః ॥ 80 ॥

Amānī mānado mānyo lokasvāmī trilokadhr‌k,
Sumedhā medhajo dhanyassatyamedhā dharādharaḥ ॥ 80 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


కపిల గీత - 156 / Kapila Gita - 156


🌹. కపిల గీత - 156 / Kapila Gita - 156 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 10 🌴

10. మనోఽచిరాత్స్యాద్విరజం జితశ్వాసస్య యోగినః|
వాయ్వగ్నిభ్యాం యథా లోహం ధ్మాతం త్యజతి వై మలమ్॥


తాత్పర్యము : వాయువు సహాయముతో బంగారమును అగ్నిలో బాగుగా కాల్చినపుడు ఆ బంగారమునందలి మలినములు తొలగిపోవును. అదే విధముగా యోగి ప్రాణాయామము ద్వారా ప్రాణవాయువును జయించినచో, మనస్సులోని మాలిన్యములు నశించి, అది శీఘ్రముగ నిర్మలమగును.

వ్యాఖ్య : శ్వాసను గెలిచిన యోగికి, ఇలా ప్రాణాయామాదులతో ప్రారంభిస్తే త్వరలోనే మనసు స్థిరమవుతుంది, రజో గుణం లేకుండా అవుతుంది. మనసుకి పట్టిన మురికి పోతుంది. వాయువు అగ్నిని ప్రేరేపిస్తే, వాయువు ద్వారా ప్రేరేపించబడిన అగ్ని లోహం యొక్క మురికి పోగొడుతుది. అలాగే ప్రాణాయామముతో ఆయా మార్గములలో వెళ్ళినపుడు మనసు మురికి వదులుతుంది


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 156 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 4. Features of Bhakti Yoga and Practices - 10 🌴

10. mano 'cirāt syād virajaṁ jita-śvāsasya yoginaḥ
vāyv-agnibhyāṁ yathā lohaṁ dhmātaṁ tyajati vai malam


MEANING : The yogīs who practice such breathing exercises are very soon freed from all mental disturbances, just as gold, when put into fire and fanned with air, becomes free from all impurities.

PURPORT : This process of purifying the mind is also recommended by Lord Caitanya; He says that one should chant Hare Kṛṣṇa. He says further, paraṁ vijayate: "All glories to Śrī Kṛṣṇa saṅkīrtana!" All glories are given to the chanting of the holy names of Kṛṣṇa because as soon as one begins this process of chanting, the mind becomes purified. By chanting the holy name of Kṛṣṇa one is cleansed of the dirt that accumulates in the mind. One can purify the mind either by the breathing process or by the chanting process, just as one can purify gold by putting it in a fire and fanning it with a bellows.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


01 Apr 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 01, ఏప్రిల్‌, Apirl 2023 పంచాగము - Panchagam 🌹

శుభ శనివారం, Saturday, స్థిర వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : కామద ఏకాదశి, Kamada Ekadashi 🌻

🍀. శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం - 13 🍀


23. ద్విభుజాయ నమస్తుభ్యం భుజత్రయసుశోభినే |
నమోఽణిమాదిసిద్ధాయ స్వర్ణహస్తాయ తే నమః

24. పూర్ణచంద్రప్రతీకాశవదనాంభోజశోభినే |
నమస్తే స్వర్ణరూపాయ స్వర్ణాలంకారశోభినే

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : చదువుకు, ఆలోచనకు ఏకాగ్రతాస్థానం - చదివేటప్పుడు గాని, ఆలోచించేటప్పుడు గాని యోగపద్ధతిలో ఏకాగ్రతా సాధనకు సరియైన స్థానం నడినెత్తి, దాని ఉపరిభాగం అని సాధకుడు గ్రహించడం అవసరం. 🍀

🌷🌷🌷🌷🌷


విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వసంత ఋతువు, ఉత్తరాయణం,

చైత్ర మాసం

తిథి: శుక్ల-ఏకాదశి 28:21:47 వరకు

తదుపరి శుక్ల ద్వాదశి ?

నక్షత్రం: ఆశ్లేష 28:49:05 వరకు

తదుపరి మఘ

యోగం: ధృతి 26:44:22 వరకు

తదుపరి శూల

కరణం: వణిజ 15:09:52 వరకు

వర్జ్యం: 16:17:12 - 18:04:36

దుర్ముహూర్తం: 07:49:31 - 08:38:43

రాహు కాలం: 09:15:37 - 10:47:54

గుళిక కాలం: 06:11:06 - 07:43:22

యమ గండం: 13:52:25 - 15:24:42

అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:44

అమృత కాలం: 27:01:36 - 28:49:00

మరియు 28:44:30 - 30:30:50

సూర్యోదయం: 06:11:06

సూర్యాస్తమయం: 18:29:13

చంద్రోదయం: 14:36:23

చంద్రాస్తమయం: 03:11:02

సూర్య సంచార రాశి: మీనం

చంద్ర సంచార రాశి: కర్కాటకం

యోగాలు: మానస యోగం - కార్య

లాభం 28:49:05 వరకు తదుపరి పద్మ

యోగం - ఐశ్వర్య ప్రాప్తి

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹