కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 6

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 6 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

నిద్రాదేవత ఈ మృత్యు దేవత ఆధీనంలో వుంటుంది. నిద్ర పట్టని వారు కొంతమంది వున్నారు. ఊరకూరికే లేచికూర్చొంటుంటారు, ఊరుకూరికే కలత నిద్ర పోతూ వుంటారు. కారణం ఏమిటి? అంటే, మరణభయ సమానమైనటువంటి కలలు వస్తుంటాయి.

ఆ మరణ భయ సమానమైనటువంటి కలలు ఎప్పుడైతే ప్రస్ఫటమైనటువంటి, బలవత్తరమైనటువంటి ప్రభావాన్ని నీ మనోబుద్ధులమీద చూపిస్తాయో, అప్పుడు నీ నిద్ర భంగమై పోతుంది.

కారణమేమంటే, మేల్కొంటే తప్ప ఆ కల యొక్క ప్రభావం పోదు కాబట్టి, పూర్తిగా ఎఱుకను పొందితే తప్ప ఆ కల యొక్క ప్రభావం పోదు కాబట్టి, ఒక్కొక్కప్పుడు పోదు కూడా, మేల్కొన్నా కూడా ఆ కల యొక్క ప్రభావం పోదు. కారణం మరుపు, మరణము, సుషుప్తి, మూర్ఛలు ఈ నాలుగు అవస్థలు ఒకదానికి ఒకటి సంబంధపడి వుంటాయన్నమాట.

కాబట్టే, మనం నిద్రావస్థలో మనం మన ఎఱుకను మనం పూర్తిగా కోల్పోతున్నాము. మరణములో కూడా ‘నేను’ అనే ఎఱుకని కోల్పోతున్నాము.

ఎవరైతే, ఈ నాలుగు అవస్థలలో ‘నేను’ అనే ఎఱుకను నిలబెట్టుకున్నారో, వారు ఆత్మనిష్ఠులు అనేటటువంటి నిర్ణయాన్ని సూచన ప్రాయంగా చెప్తున్నారు.

చాలామంది తామసికమైన అజ్ఞానభూయిష్టమైనటువంటి నిద్ర పోయి, ఆహా! చాలా బాగా నిద్రపట్టిందండీ, ఒళ్ళు మరచిపోయి, ఒడలు మరచిపోయి నిద్రించాను అని ఆనందిస్తూ వుంటారు. ఇదో రకమైన ఆనందము. ఇది తామసిక గరిష్ఠమైనటువంటి నిద్ర. కానీ... ఇది శాంత చిత్తమైన నిద్ర కాదన్నమాట.

ఎవరైతే తన ప్రజ్ఞను తాను గుర్తిస్తూ, తన ఎఱుకను తాను గుర్తిస్తూ, స్వస్థితిని గుర్తిస్తూ, ‘స్వీయ నేను’ ని గుర్తిస్తూ, ‘సెల్ఫ్‌ రియలైజ్‌డ్‌ స్టేటస్‌’ [self realized status] లో ఎవరైతే నిద్రావస్థని ఆచరిస్తారో, వాళ్ళు శాంత చిత్తులై నిద్రిస్తారని అర్థం.

ఎప్పుడైతే ఆ శాంత చిత్తంతో నిద్రించాడో, అతనిలో ప్రజ్ఞ మేల్కొంటుంది. మనమందరం కూడా రోజువారీ నిద్రని ఇలా శాంత చిత్తంతో ఆచరించడం నేర్చుకోవాలి.

నీలో ప్రజ్ఞ మేల్కొన్నవాడవై, స్వప్రకాశ స్థితిలో వుండి, నిద్రలో మనం విశ్రాంతి తీసుకోవడం అభ్యాసం చెయ్యాలి. ఆ రకమైన మెలకువను కలిగి వున్నటువంటి నిద్రగా మనం నిద్రను స్వీకరించాలి. ఆ రకంగా మీరు తురీయంలో ప్రవేశిస్తారన్నమాట!

అటువంటి నిర్వాణానుభవం ద్వారా తాను తురీయస్థితిలోనికి ప్రవేశిస్తాడు. కాబట్టి శాంత చిత్తుడై నిద్రించడం అన్నటువంటి దాంట్లో, సూచన ప్రాయంగా నిర్వాణానుభవ స్థితిని సూచిస్తున్నాడు.

ఎప్పుడైతే ఒకసారి నీకు నిర్వాణ సుఖం లభించిందో, నువ్వు వాటిని మెలకువలోనూ, స్వప్నంలోనూ పోగొట్టుకోవడానికి ఇష్టపడవు ఇక. ఎలాగో చెప్పనా?

ఎవరైనా తమ తలకాయిని ఇవ్వడానికి సిద్ధపడతారా? ఎవరైనా సిద్ధపడుతారా? ఎవ్వరూ సిద్ధపడరు. ఎందుకని? తల లేకపోతే జీవితం లేదు కాబట్టి. అంత ముఖ్యమైనటువంటిది. అట్లాగే, నీ జీవితానుభవాల మొత్తం మీద, అత్యంత విలువైన అనుభూతి ఏదైన ఒకటి ఉందంటే అది నిర్వాణం.

ఒక్కసారి నిర్వాణ సుఖాన్ని అనుభూతి పొందినటువంటివాడు మరలా ఎట్టి కష్ట పరంపర వచ్చినప్పటికీ కూడా, ఎట్టి సుఖదుఃఖ పరంపర ఏర్పడినప్పటికీ కూడా, ఎట్టి ద్వంద్వానుభూతులు ఏర్పడుతున్నప్పటికీ కూడా, ఈ నిర్వాణ సుఖాన్ని పోగొట్టుకోరు.

జాగ్రత్‌ స్వప్న సుషుప్తులలో ప్రయత్న పూర్వకముగా నిర్వాణ సుఖాన్ని నిలబెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యం. అన్ని సాధనలలో కెల్లా ముఖ్య సాధనమిదే!

ఈ శాంత చిత్తం ఎప్పుడైతే వచ్చేస్తుందో, నీలో నిర్వాణ సుఖం ఏర్పడుతుంది. అట్టి నిర్వాణ సుఖమే, ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి పునాది. ఆధారభూతమైనటువంటి పునాది స్థితి అన్నమాట!
🌹 🌹 🌹 🌹 🌹

Twelve Stanzas from the Book of Dzyan - 1


🌹 Twelve Stanzas from the Book of Dzyan - 1 🌹
The Prophetic Record of Human Destiny and Evolution 
📚. Prasad Bharadwaj 

🌻 STANZA I - The Genesis of Divine Love - 1 🌻

1. The Gods were at work, rotating the Stellar Wheel. They were winding up the hidden mainspring, which then would unfold, manifesting itself in the concept of Time. 

The Earth was waiting for it, for the spot bearing that name was already aware of its mission. A small, barely visible drop of Matter was swirling around in Eternity. 

And for it the Lords of Destiny had foreordained Love! It was their loving intention to see that Love would fill that little drop and, after condensing it, carry it to its defined ultimate boundaries.

2. The Sun was beginning his Round. He had a defined role — the Bearer of Love. It was his job to imbue that small cluster with the warmth of the Fiery Heart, which finally started to take on a definite appearance. 

The newly attenuated state of Matter enabled the Sun to carry out the excellent work of filling it with his currents of abundant Love.

3. The Gods knew their Task and set a new pace for their Wheel, which was now vibrating faster than ever. 

The density of Matter was coupled with firmness and elasticity. The currents of Love had to struggle in order to successfully pierce the stone with their Fire.

4. The new Kingdom of Stones was populating the Earth, endowing her with power over their motionless bodies. 

The planet, raised by the currents of Love, knew only one way she herself could bring forth Life, and that was Love! Love! Here she was a rule, a law, a form of Life. 

Only one thing was required of the Earth: to love! And the Lords of Destiny kept strict watch over the fulfilling of Karma.
🌹 🌹 🌹 🌹 🌹

20-July-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 433 / Bhagavad-Gita - 433🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 221 / Sripada Srivallabha Charithamrutham - 221 🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 101🌹 
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 124🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 37 / Sri Lalita Sahasranamavali - Meaning - 37 🌹
6) 🌹 VEDA UPANISHAD SUKTHAM - 64🌹
7) 🌹. నారద భక్తి సూత్రాలు - 41 🌹 
8) 🌹. శివగీత - 6 / The Shiva-Gita - 6🌹 
9)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 11 🌹 
10) 🌹. సౌందర్య లహరి - 48 / Soundarya Lahari - 48🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 347 / Bhagavad-Gita - 347 🌹

12) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 175🌹 
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 52 🌹
14) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 48 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 63 🌹 
16) 🌹 Seeds Of Consciousness - 127 🌹
17) 🌹. మనోశక్తి - Mind Power - 66 🌹
18) 🌹 Guru Geeta - Datta Vaakya - 9🌹
19) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 6 🌹
20) 🌹. సాయి తత్వం - మానవత్వం - 55 / Sai Philosophy is Humanity - 55🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 433 / Bhagavad-Gita - 433 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 43 🌴*

43. పితాసి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ |
న త్వత్సమో(స్త్యభ్యదిక: కుతో(న్యో
లోకత్రయే(ప్యప్రతిమప్రభావ ||

🌷. తాత్పర్యం : 
స్థావర, జంగమ పూర్ణమైన ఈ సమస్త విశ్వమునకు నీవే తండ్రివి. దానికి ముఖ్యపూజనీయుడగు పరమ ఆధ్యాత్మికగురుడవు నీవే. నీతో సమానమైనవాడు గాని, ఏకమైనవాడుగాని మరొకడుండడు. ఓ అపరిమితశక్తి సంపన్నుడా! అట్టి యెడ నీ కన్నను అధికుడు ముల్లోకములలో ఎవడుండును?

🌷. భాష్యము : 
లుపబడినది.
న తస్య కార్యం కరణం చ విద్యతే |
న తత్సమ శ్చాభ్యధికశ్చ దృశ్యతే ||
సాధారణ మనుజుని వలెనే దేవదేవుడైన శ్రీకృష్ణుడు సైతము ఇంద్రియములను మరియు దేహమును కలిగియున్నాను, ఆ భగవానుని విషయమున అతని ఇంద్రియములు, దేహము, మనస్సు, ఆత్మ నడుమ ఎట్టి భేదము లేదు. కాని అతనిని పూర్ణముగా నెరుగని మూఢులే అతని ఇంద్రియములు, మనస్సు, దేహాదులు అతని కన్నను అన్యమని పలుకుదురు. కాని వాస్తవమునకు శ్రీకృష్ణుడు దివ్య పరతత్త్వము. కనుకనే అతని కర్మలు, శక్తులు దివ్యములై యున్నవి. మనకున్నటువంటి ఇంద్రియములు లేకున్నను, ఇంద్రియకార్యములన్నింటిని అతడు చేయగలిగినంతనే అతని ఇంద్రియములు పరిమితములు లేక అసమగ్రములు కావని తెలుపబడినది. అతని కన్నను ఘనుడైనవాడు లేడు. అలాగుననే అతనికి సముడును లేదు. సర్వులును ఆ శ్రీకృష్ణభగవానుని కన్నను తక్కువైనవారే. 
దేవదేవుని జ్ఞానము, శక్తి, కర్మలు అన్నియును దివ్యములు. ఈ విషయమే భగవద్గీత యందు ఇట్లు తెలుపబడినది (4.9).
జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్త్వత: |
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మా మేతి సో(ర్జున ||
శ్రీకృష్ణుని దివ్యమైన జన్మను, కర్మలను, పూర్ణత్వమును సంపూర్ణముగా నెరిగినవాడు దేహమును విడిచిన పిమ్మట ఆ కృష్ణునే చేరి ఈ దుఃఖపూర్ణ జగమునకు తిరిగిరాకుండును. కనుక శ్రీకృష్ణుని కర్మలు ఇతరుల కర్మల కన్నను భిన్నమైనవని ప్రతియొక్కరు ఎరుగవలెను. అందులకు శ్రీకృష్ణుడు తెలిపిన నియమములను పాటించుట అత్యుత్తమ పధ్ధతి. అది ఎల్లరును పూర్ణులను చేయగలదు. ఆ భగవానునకు ఎవ్వరును యజమానులు కారనియు, ప్రతియొక్కరు అతని భృత్యులనియు తెలుపబడినది. “కృష్ణుడొక్కడే భగవానుడు. ఇతరులందరును అతని సేవకులు” అని చైతన్యచరితామృతము (ఆదిలీల 5.14) ఈ విషయమునే నిర్ధారించుచున్నది (ఏకలే ఈశ్వర కృష్ణ, ఆర సబ భృత్య). అనగా ప్రతియొక్కరు అతని ఆజ్ఞానుసారమే వర్తింపవలసియున్నది. ఎవ్వరును అతని ఆజ్ఞను త్రోసిపుచ్చజాలరు. ఆ రీతిగా ప్రతియొక్కరు అతని పర్యవేక్షణలో అతని నిర్దేశము ననుసరించియే వర్తించుచున్నారు. బ్రహ్మసంహిత యందు తెలుపబడినట్లు ఆ దేవదేవుడే సర్వకారణములకు కారణుడై యున్నాడు. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 433 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 43 🌴*

43. pitāsi lokasya carācarasya
tvam asya pūjyaś ca gurur garīyān
na tvat-samo ’sty abhyadhikaḥ kuto ’nyo
loka-traye ’py apratima-prabhāva

🌷 Translation : 
You are the father of this complete cosmic manifestation, of the moving and the nonmoving. You are its worshipable chief, the supreme spiritual master. No one is greater than You, nor can anyone be one with You. How then could there be anyone greater than You within the three worlds, O Lord of immeasurable power?

🌹 Purport :
The Supreme Personality of Godhead, Kṛṣṇa, is worshipable as a father is worshipable for his son. He is the spiritual master because He originally gave the Vedic instructions to Brahmā and presently He is also instructing Bhagavad-gītā to Arjuna; therefore He is the original spiritual master, and any bona fide spiritual master at the present moment must be a descendant in the line of disciplic succession stemming from Kṛṣṇa. Without being a representative of Kṛṣṇa, one cannot become a teacher or spiritual master of transcendental subject matter.

The Lord is being paid obeisances in all respects. He is of immeasurable greatness. No one can be greater than the Supreme Personality of Godhead, Kṛṣṇa, because no one is equal to or higher than Kṛṣṇa within any manifestation, spiritual or material. Everyone is below Him. No one can excel Him. This is stated in the Śvetāśvatara Upaniṣad (6.8):

na tasya kāryaṁ karaṇaṁ ca vidyate
na tat-samaś cābhyadhikaś ca dṛśyate

The Supreme Lord, Kṛṣṇa, has senses and a body like the ordinary man, but for Him there is no difference between His senses, His body, His mind and Himself. 

Foolish persons who do not perfectly know Him say that Kṛṣṇa is different from His soul, mind, heart and everything else. Kṛṣṇa is absolute; therefore His activities and potencies are supreme. It is also stated that although He does not have senses like ours, He can perform all sensory activities; therefore His senses are neither imperfect nor limited. No one can be greater than Him, no one can be equal to Him, and everyone is lower than Him.

The knowledge, strength and activities of the Supreme Personality are all transcendental. As stated in Bhagavad-gītā (4.9):

janma karma ca me divyam
evaṁ yo vetti tattvataḥ
tyaktvā dehaṁ punar janma
naiti mām eti so ’rjuna

Whoever knows Kṛṣṇa’s transcendental body, activities and perfection, after quitting his body, returns to Him and doesn’t come back again to this miserable world. 

Therefore one should know that Kṛṣṇa’s activities are different from others. The best policy is to follow the principles of Kṛṣṇa; that will make one perfect. It is also stated that there is no one who is master of Kṛṣṇa; everyone is His servant. 

The Caitanya-caritāmṛta (Ādi 5.142) confirms, ekale īśvara kṛṣṇa, āra saba bhṛtya: only Kṛṣṇa is God, and everyone else is His servant. Everyone is complying with His order. 

There is no one who can deny His order. Everyone is acting according to His direction, being under His superintendence. As stated in the Brahma-saṁhitā, He is the cause of all causes.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 221 / Sripada Srivallabha Charithamrutham - 221 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 41
*🌴. దత్తదీక్షా ప్రహసనం (శ్రీపాదులకు 16ఏళ్ళు) - 3 🌴*

*🌻. వెంకయ్యకు దత్త దీక్ష 🌻*

ఊళ్ళో వెంకయ్య అనే పంటకాపు శ్రీపాదులవారి భక్తుడు. ఆ రోజు గురువారం, శ్రీపాదులు స్వయంగా వెంకయ్య ఇంటికి వచ్చి దీక్ష తీసుకోలేక పోతున్నందుకు నిరాశ పడవద్దని, మండలదీక్ష అవసరం లేదని, ఏకరాత్రి దీక్ష చాలని యథాశక్తి దక్షిణ ఇవ్వవచ్చని వాళ్ళకి సాంత్వన చెప్పి వెంకయ్యతో పాటు అష్టాదశ వర్ణాలవారికి తామే స్వయంగా దీక్ష ఇచ్చి ఆశీర్వదించారు. 

ఆ రోజంతా వాళ్ళ ఇంట్లోనే గడిపి, వారితో భజనలు చేయించి, తానే దత్తుడనని, తమను స్మరిస్తేనే చాలు ప్రసన్నులమై వారి కోరికలు తీరుస్తామని అభయమిచ్చారు. 

*🌻. శ్రీపాదుల ప్రస్థానం 🌻*

ఆ మరునాడు శుక్రవారం శ్రీపాదులు మొదట వర్మ గారింటికి, తరువాత బాపనార్యుల యింటికి వెళ్ళారు. అక్కడ వారికి మంగళ స్నానం చేయించి, పాలు, పండ్లు మొదలైనవి తినడానికి ఇచ్చారు. 

తాము సాక్షాత్తు దత్తుడనని, తమను భక్తులు పిలుస్తున్నారని, లోకాన్ని ఉద్ధరించే కార్యక్రమం చేపట్టడానికి తాము పీఠికాపురం వదిలి వెళ్తున్నామని తెలియజేసారు. 

అక్కడనుండి తమ యింటికి వెళ్ళారు. అక్కడ తల్లితండ్రులు వివాహ ప్రస్తావన తేగా, తాము తాతగారికి, వర్మ, శ్రేష్ఠిగార్లకు ఎన్నోమార్లు అనఘాసమేతులై దర్శనం ఇచ్చామని, వివాహ ప్రసక్తి ఎత్తినట్లయితే తాము ఇల్లు వదిలి వెళ్ళిపోతామని ఇదివరకే చెప్పానని గుర్తు చేసి తమ అనఘాలక్ష్మీసమేత దివ్య భవ్య రూపంతో వాళ్ళకి దర్శనం ఇచ్చారు. 

సుమతీ, రాజశర్మలు నిశ్చేష్టులై చూస్తూ ఉండగానే తమ అమృత స్పర్శతో అన్నలిద్దరి అంగ వైకల్యాన్ని పోగొట్టారు.

 *🌻. ప్రభువుల ఋణాను బంధం 🌻*

ఇంతలో బాపనార్యులగారి, వర్మ, శ్రేష్ఠిగార్ల కుటుంబ సభ్యు లంతా రాజశర్మగారింటికి వచ్చారు. శ్రీపాదులు అందరితో కులాసాగా కబుర్లు చెప్పుతుండగా సుమతి," నాయనా! అన్ని బాకీలు తీర్చుకొని వెళ్ళుతున్నావు, కాని మల్లాది వారి, వర్మగారి, శ్రేష్ఠిగారి పాలఋణం తీర్చుకోలేవు," అని అన్నారు. 

అపుడు శ్రీచరణులు, "అమ్మా! నీవు చెప్పినది నిజమే. ఈ మూడు వంశాలపై నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. 

నీ పుట్టింటివారి ప్రతి తరంలోను వారి ఇంట భోజనం చేస్తాను. వారు నన్ను మేనల్లునిగా భావించి వాత్సల్య దృష్టితో చూస్తారని నాకు తెలుసు, కాబట్టి నేను కూడా ఈ మానవీయ బాంధవ్యానికి మన్నన ఇస్తూ వాళ్ళతో బుద్ధిమంతుడైన మేనల్లునిలా ప్రవర్తిస్తాను. 

ఇంత కంటె నీకు ఏం కావాలి?" అని తల్లికి సమాధానం చెప్పి తండ్రితో, "నాన్నగారూ! నా అన్నలిద్దరూ మంచి వేదపండి తులు కాగలరు. 

శ్రీధరశర్మ సమర్థ రామదాసుగా జన్మించి ఛత్రపతి శివాజీగా జన్మించే వర్మగారికి గురుత్వం వహిస్తారు. రామరాజశర్మ శ్రీధరుడనే పేరుతో మహా యోగిగా ప్రసిద్ధి పొందుతారు," అని అభయం ఇచ్చారు. 

తరువాత వేదపఠనం జరుగుతుండగా శ్రీపాదులు అంతర్హితులు అయ్యారు.

శ్రీపాదరాజం శరణం ప్రపద్యే

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sripada Srivallabha Charithamrutham - 221 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj 

CHAPTER 22
*🌻 The Story of Gurudatta Bhatt Only Sripada will give the fruit written in Horoscope - 6 🌻*

If any one keeps thinking of living in Kasi or Peethikapuram he will get the fruit of living in Kasi or Peethikapuram

If the body is in one kshetram but his mind is not there he will not get the fruit of living in that kshetram

If a person is mentally having a strong desire and thinks, ‘I am going to Kasi, I always live in Kasi’, he will get the fruit of living in Kasi. Thus, even if he is physically living in any other place, his ‘manasik desam’ is Kasi only.  

If a person lives in Kasi and does ‘Go hatya’ (killing a cow), he will not get the fruit of living in Kasi. The cranes standing in Ganga waters and keep waiting for fish to eat, will not get the fruit of bathing in Ganga waters.  

Even if one is living physically in Peethikapuram and even if he had darshan of Sripada, he will not get the fruits if his ‘manasik kalam’ and ‘manasik desam’ are not proper. He will not be counted as living in Peethikapuram or a follower of Sripada.  

Only people with spiritual power will understand the ‘yoga kalam’ and ‘yoga desam’. ‘yoga kalam’ and ‘yoga desam’ are divine secrets. Man has the authority to do ‘karma’ (action).  

Good actions (Satkarma) will give good results and bad actions (Dushkarma) will give bad results. This is certain.  

Even if the bonds of karma of previous births are chasing us, ‘yoga kalam’ will be decided by the grace of ‘sadguru’. When it comes, that karma will be erased in that particular yoga desam ear marked for that.  

This is a wonderful thing. In Peethikapuram, Sivaiah was working as a servant with Narasimha Varma. Suddenly one day Sripada looked at him intensely. Immediately, there occurred a gross change in his mental condition. 

 He was not having sleep and food and was talking like a mad man, “I am the one who does ‘Shristi, Sthithi and Laya’. I am the prime cause. All this creation is created in me, progresses in me and is merging in me.”  

Narasimha Varma took pity on him and prayed Sripada to save Sivaiah. Sripada took him to the burial ground along with Narasimha Varma. The dried branches of Oudumber tree were piled up and Sripada got them burnt by Sivaiah. Then Sivaiah was relieved from that strange behavior.  

It was all strange for Narasimha Varma. Sripada said, ‘Thatha! What is there to be surprised in this?  

One pundit in Vayasapura Agraharam (Kakinada) used to think of Me “what a great offence? Where is that paramathma who is the form of Veda? Where is this small boy Sripada? Is he the cause of creation, sustenance and annihilation? Is he the prime cause?  

All this is arrogance, untruth!” Recently, that pundit died and he became a ‘brahma rakshasa’. In one birth Sivaiah owed a little to him. I created the yoga kalam and decided the burial ground as the yoga desam.  

I got the funeral rites done to that pundit with Oudumber wood as ‘yoga karma’ and thus I liberated him from the janma of Brahma Rakshasa. I saved our Sivaiah from that Brahma Rakshasa,’ 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 101 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 *🌻. మహాశివరాత్రి పర్వదిన సందేశము - 1 🌻*

మానవ హృదయం అనేది ఆనాటికి ఆనాటికి మంచి అవుతుంది కాని చెడు అవ్వదు! Brain పాడైపోతే పాడయినవారు పిచ్చివారులాగా తిరగవచ్చుగాని హృదయం పాడవటం ఎవరికి ఉండదు. భౌతికమయిన గుండెకాయ గుండెజబ్బు వస్తే పాడవుతుంది కాని లోపల హృదయం పాడవటం అనేది ఉండదు. కనుక ప్రకృతి సహజంగా ఆనాటికి ఆనాటికి మంచి అభివృద్ధిని కలిగిస్తుంది. 

మనలను మంచివాళ్ళను చేసేటందుకు ప్రకృతి సృష్టి పరిణామమును ఇచ్చినది. ఇది మొదటి నుంచి ఉన్నదే. ఈ రకమైన లక్షణానికి పెద్దలు ఒక చక్కని పేరు పెట్టారు. దాని పేరే శివం. 

శివం అనగా శుభం. ఈ రోజు కంటే రేపు రేపటికంటే ఎల్లుండి అభివృద్ధి చెందేది. దానికో పేరు పెట్టి ఎలా ఉంటుందో చూద్దాం అని దానినే శివం అన్నారు. ప్రతి హృదయమునందున్న శివుడు వారిని పవిత్రీకరణం చేస్తున్నాడు. ఈ రుద్రాభిషేకం జరిగే చోట చెప్పే ప్రార్థనా శ్లోకం మీకు గుర్తుండే ఉంటుంది. 

"దేహూదేవాలయః ప్రోక్తః" దేహమే దేవుని యొక్క ఆలయము గాని మానవుడు ఉంటున్నది కాదు. మీరు అడుగవచ్చు. ఏమయ్యా ఈ దేహములో మనము ఉంటూ దేవుడిది అంటావేం అని కావలసి వస్తే ఆయన ఎవరు మన భార్య వెంటనే మన పేరు చెప్తుంది కాని దేవుడు పేరు చెప్పదు కదా! 

అనగా ఈ శరీరము మనం తెచ్చుకుందామంటే వచ్చింది కాదు. మనం పుడదామని Propose చేసి పుట్టింది కాదు. శరీరం తయారైన కొన్నాళ్ళకు మనం బయటకి వచ్చి మనం ఉన్నట్లు మనకి తెలియటం మొదలు పెడుతుంది. కనుక ఈ దేహము దేహాలయము అని తెలుసుకోవాలి. .
..✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 123 🌹*
*🌴 The Pulsation - 1 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

*🌻 The Double Movement 🌻*

The eternal wisdom speaks of the universal laws of time and of nature. One of the most important laws we have to understand is the law of pulsation. 

It functions on every plane of activity, in the development of galaxies as well as within a cell. Space pulsates, and it pulsates also within us. The pulsating sun keeps the planets in the equilibrium of a rhythmic movement. 

Pulsation expresses life, light and movement. Pulsation is a double movement of two kinds of forces, the centripetal and centrifugal movement.

Expansion and contraction make the nerves and muscles within us pulsate. This generates the respiration, the peristalsis of the organs, the blood circulation and the heartbeat. 

It makes the nerve tissues respond to the mind and the environment. Ayurveda calls this principle of the pulsation in the body Vaata. If Vaata is disturbed, this results in different forms of weaknesses such as disturbances of digestion and loss of stability. 

The pulsation is also called Vayu, sometimes translated as air; however, it means the principle of movement in space which makes the air circulate.

Through the pulsation the “bubble” of the individual soul emerges out of the universal consciousness. 

With its rhythmic pulsation the soul enters into the body and takes its seat in the heart. The pulsation in us is also called the thread of life, which makes the heart beat and the lungs breathe. 

It is connected with the thread of consciousness, which has its seat in the Ajna centre on the forehead. The pulsation precedes the heartbeat. As long as the heart pulsates, the body keeps on living. 

At the moment of death the pulsation disappears from the physical planes. Whereas the body is put into the grave and decays, the pulsation continues to exist. We too keep on existing when we connect to the pulsation.

🌻 🌻 🌻 🌻 🌻 
Master K.P. Kumar: Listening to the Invisible Master / notes from seminars / Master E. Krishnamacharya: Spiritual Psychology.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 37 / Sri Lalita Sahasranamavali - Meaning - 37 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శ్లోకం 70*

298. నారాయణీ - 
నారాయణత్వ లక్షణము గలది.

299. నాదరూపా - 
నాదము యొక్క రూపము అయినది.

300. నామరూపవివర్జితా - 
పేరు, ఆకారము లేనిది

301. హ్రీంకారీ - 
హ్రీంకార స్వరూపిణి.

302. హ్రీమతీ - 
లజ్జాసూచిత బీజాక్షర రూపిణి.

303. హృద్యా - 
హృదయమునకు ఆనందము అయినది.

304. హేయోపాదేయవర్జితా -
 విడువదగినది, గ్రహింపదగినది, లేనిది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 37 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 37 🌻*

298 ) Naarayani -   
She who is like Narayana

299 ) Naada roopa -   
She who is the shape of music (sound)

300 ) Nama roopa vivarjitha -   
She who does not have either name or shape

301 ) Hrim kari -  
 She who makes the holy sound Hrim

302 ) Harimathi -  
 She who is shy

303 ) Hrudya -   
She who is in the heart (devotees)

304 ) Heyopadeya varjitha -   
She who does not have aspects which can be accepted or rejected

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 40 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 25

*🌻. 25. సాతు కర్మ జ్ఞాన యోగేభ్యో ఽప్యధికతరా - 3 🌻*

అయితే మూడు మార్గాలలో ప్రతి ఒక్క దానికి, ఇతర రెండు మార్గాల సహాయం అవసరమవుతుంది. ఎలాగంటే తత్త్వ విచారణ చేసిన వారికి యోగబలం కూడా ఉంటేనే గాని అపరోక్షానుభూతి కలుగదు. ఇష్టదైవ భక్తికి బదులు గురు భక్తి తీవ్రంగా ఉంటేనే గాని జ్ఞానం సిద్ధించదు. 

దీనికి చతుర్విధ గురు శుశ్రూషలు చేయాలి. అవి అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావశుశ్రూష, ఆత్మ శుశ్రూష అని నాలుగు విధాలు. ఈ శుశ్రూషలను బాహ్యార్థంతో గాక అంతరార్థంతో చేయాలి. 

గురువంటే సాక్షాత్‌ పరబ్రహ్మ అని తెలియాలి. ఎంత చేసినా, భక్తిలో కలిగే విధంగా ఇతర మార్గాలలో పారవశ్యం లభించదు. దీనికోసం యోగబలం అవసర మవుతుంది. 

భక్తి కూడా ప్రధానంగా ఉన్నప్పుడే అపరోక్షానుభూతి కలుగుతుంది. ముందుగా దైవభక్తిలో నిష్ణాతులైన వారే గురు భక్తిలో కుదురుకొనగలరు.

            యోగాభ్యాసం చేసేవారికి మార్గదర్శకులైన గురువు దొరకాలి. అయినా యోగి స్వప్రయత్నంతోనే యోగ సాధన చేయాలి. 

అది యోగా భ్యాసకుడి నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. సమాధి స్థితులలో సవితర్క సమాధితోనో, సవిచార సమాధితోనో ఆగిపోతారు. దీనిని రజః ప్రధాన సమాధి అని కొందరు అంటారు.

            ఇక్కడ తర్కం, విచారణ అనేవి జ్ఞాన మార్గంలో లభించేవి. ఈ రెండింటి ఫలం ఆనందం. ఫలితంగా వచ్చే సానంద సమాధి సిద్ధ వస్తువు కానందున అది మోక్షం కాదు. పైగా చిత్త వృత్తి నిరోధమైతే వచ్చే ప్రశాంతతను ఆత్మానందమని పొరబడతారు. 

ఆందోళన కలిగించే వృత్తులు ఆగిపోవడం వలన లభించే ప్రశాంతతను అనుభవిస్తారే గాని, ఆ శూన్యంలో స్వరూప చైతన్యానుభవాన్ని గుర్తించలేరు. 

కొందరికి ప్రజ్ఞాత సమాధి కలిగి సూక్ష్మ ప్రపంచానుభవాలు వస్తాయి. అది మోక్షం కాదు. దృశ్యాలు, శబ్దాలువస్తే కూడా అది మోక్షం కాదు. 

కొందరు వాటిని భగవత్సా క్షాత్కారంగా భావిస్తారు. ఇవన్నీ సాధకుని ప్రజ్ఞలో కలిగే అనుభవాలు గనుక ప్రజ్ఞాత సమాధులంటారు. ఇవన్నీ సవికల్పమే గాని నిర్వికల్పం కాదు. 

మోక్షమంటే సహజ నిర్వికల్ప సమాధి లేక అసంప్రజ్ఞాత సమాధి. దీనిని సత్వప్రధాన సమాధి అని కొందరు అంటారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. VEDA UPANISHAD SUKTHAM - 64 🌹*
*🌻 1. Annapurna Upanishad - 25 🌻*
--- From Atharva Veda
✍️ Dr. A. G. Krishna Warrier
📚. Prasad Bharadwaj

V-51. What is required to be won by all is the uncaused and still status; the contemplation of the one changeless Real, the control of breaths, the dwindling of the mind. 

V-52. When one of them is perfected, it helps perfect the others (also). The vital breaths and mind of living beings are all concomitant.

V-53. Like the container and the content they perish when only one is present. Through selfdestruction they produce that best of products, namely, liberation. 

V-54. If, remaining steady, you reject all this by understanding, then, on the cessation of the I-sense, you yourself are the supreme Status. 

V-55. There is but one Great Spirit, which is called the Being; it is flawless, even, pure and free from the I-sense. 

V-56. It shines forth but once, the pure, the ever risen, the same. It is described by many names, as Brahman, the supreme Self, etc. 

V-57. O Nidagha, knowing for creation 'I am That', having done what had to be accomplished, I never think of the past or the future. 

V-58. I cling wholly to the vision that is present here (and now). 'This have I won today; I shall achieve this beautiful' (thing). 

V-59. I laud not; neither do I condemn. Nothing other than the self is anywhere. The gaining of the good does not gladden me; evil betiding me does not sadden me. 

V-60. Sage, the wavering of my mind has been totally stilled; it is rod of all sorrow. It is cured of all wanting. It is tranquil. Therefore I am hale, and untrammeled.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 6 / The Siva-Gita - 6 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రధమాధ్యాయము
*🌻. భక్తి నిరూపణ యోగము - 5 🌻*

శివార్పణ దియా కానూ - న్పరిత్యజ్య యధావిధి: 17

18. అనుగ్ర హాత్తేవ శంభో -ర్జాయతే సుద్రుడో నర;
తతో భీతా; పలాయన్తే - విఘ్నం హిత్వా సురేశ్వరా: 

దాని వలన మానవుడు తన కోరికలను వీడి నిష్కామము గలవాడై శివార్పణ బుద్ది చేత సత్కర్మల ననుష్ఠించుట వలన అతడు శివాను గ్రహమునకు పాత్రుడై సంకల్ప సిద్దులను పొందును. అట్టి యమూల్యమైన శివానుగ్రహము చేత నాతని సుఖములకు జరుగపోవు నాటంకములు సమసి పోవుటే గాకుండా అమరులు సఫలీ భూతంబు లగు కర్మలు పసిగట్టి పరమ శివుని యనుగ్రహము వలన దమకెటువంటి చెరుపు (నష్టము ) కలుగునో యని భయముతో నాతడు చేపట్టిన కార్యములకు ఏ విధమైన ఆటంకములను కలిగింపక పలాయన మగుదురు.

19. జాయతే తేన శుశ్రూషా - చరితే చంద్ర మౌళిన:
శృణ్వతో జాయతే జ్ఞానం - జ్ఞానా దేవి విముచ్యతే 

అందువలన మానవుడెల్లప్పుడు శివార్పణ బుద్ది కలిగి నిష్కామముతో శివార్చన శివ కధా శ్రవణాదులందు జ్ఞానార్జనను గావించు కొనును. దాని ప్రభావమున సంసృతి మోక్షమును పొందును.

20. బహునాత్ర కిముక్తేన - యస్య భక్తి శ్శివే దృడా,
మహాపాపో పపాపౌఘ - కోటి గ్రస్తో విముచ్యతే 

వేయేల ఏ భక్తుడి కైతే పరమశివుని యందు దృడమై నిర్మలమగు భక్తి కలుగునో అట్టివాడే మహా పాపముల చేతను ముక్తుడగును.

21. అనాధ రేణ శాట్యేన - పరిహాసై ర సూయయా,
శివ భక్తి రతశ్చేత్స్యా - దంత్య జో సివి ముచ్యతే 

అస్పృశ్యు డైనను, కారణ మేమియు లేకుండ గాని, వంచ కత్వముతో గాని , పరిహాసమునకు గాని , ఈర్ష్య చేత గాని శివుని యందు భక్తి యంకురించిన యెడల అటువంటి వాడు సమస్త పాపముల నుండి ముక్తుడగును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 6 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 01: 
*🌻 Bhakti Niroopana Yoga - 5 🌻*

17. 18. Because of that, devotee would become detached from all his desires and would get filled with a devoting everything to Shiva. Due to that nature he would keep doing good deeds and would gain the grace of Lord Shiva. When he earns the grace of Lord Shiva, the demi gods would not dare to interrupt his devotion
because of the fear of Lord Shiva's anger.

19. That's why human would all the time remain with 'Shivarpana' buddhi and would remain immersed in the
worship of Shiva and would gain knowledge which gives him Mukti (Salvation)

20. The devotee who keeps an unshaken faith in lord Paramashiva, only that person would get saved from
Maha Papa (Great Sins) and Upa Paapa (Minor Sins) even if they are crores in number.

21. Anyone while doing criticism, or while disrespecting, or due to jealousy, if gets devoted or gains devotion
for Shiva, he would get cleansed of all the Sins immediately. 

N.B: Let's analyze this statement further. We have real examples in our Hindu scriptures where such instances have been seen. Kamsa, Ravana Shishupaala, etc, all were filled with "Virodhi Bhakti" for Lord Vishnu, their hatred for hari increased to such limits that they unknowingly used to think constantly about Hari only. Finally what happened we all know. They were given Salvation by Lord through killing. So, the same way, even if while criticizing Shiva, or while disrespecting him, or while hating him if one gets filled with that 'Virodhi Bhakti' he would get liberated of all sins. The idea here is not to develop Virodh Bhakti, but the sloka tells the importance of Shiva Bhakti. The meaning in short is:Even if inadvertently one develops slightest interest and devotion towards Shiva, he would get cleansed of sins right at that moment). 

22. One whose Shiva Bhakti becomes strong, such people would get all theyr desires fulfilled by it. But for those who are totally submitted in Shiva Bhakti, would get liberated out of the birthrebirth cycle and would attain Salvation.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 11 🌹 
 📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? 🌻 


ఒక శుభదినాన అచ్చమ్మగారిని ఈశ్వర క్షేత్రమైన యాగంటి’కి తీసుకుని వెళ్లారు వీరబ్రహ్మేంద్రస్వామి. అక్కడ జ్ఞానోపదేశం మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు వేశారు. వాటన్నిటికీ సామాన్యులకు అర్ధమయ్యే విధంగా సరళమైన భాషలో జవాబులిచ్చారు వీరబ్రహ్మేంద్రస్వామి.

వాటిలో కొన్ని... 

పరమాత్మ ప్రపంచంలో అణువణువునా ఉన్నాడు. ఈ పశువులలో, నీలో, నాలో, కీటకాలలో.. అన్నిటిలోనూ ఆయన నివాసం ఉంటుంది.

🌻. దేవుని తెలుసుకోవడం ఎలా? 🌻

దేవుని తెలుసుకోడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ భక్తి, ధ్యానం శ్రేష్టమైనవి. భక్తి మార్గం అంటే కేవలం భగవంతుని ధ్యానిస్తూ జీవితాన్ని గడపడమే. 

దీన్నే భక్తి యోగం అని కూడా అంటారు. ధ్యాన యోగం అంటే ప్రాణాయామం ద్వారా ఈ సృష్టిని ప్రారంభించిన బ్రహ్మ ను తెలుసుకోవడమే.

🌻. దేవుని ఏ రూపంలో మనం చూడగలం? స్త్రీయా, పురుషుడా? 🌻

పరబ్రహ్మ నిరాకారుడు, నిర్గుణుడు. మనం ఏ విధంగానూ నిర్వచించలేము.

ఈ విధంగా అచ్చమ్మగారి సందేహాలను తీర్చిన తర్వాత ఆమెకు కొన్ని మంత్రాలను ఉపదేశించారు వీరబ్రహ్మేంద్రస్వామి. వీటిని ఏకాగ్ర చిత్తంతో జపిస్తూ ఉండమని చెప్పారు.

తర్వాత కాలజ్ఞానం గురించి వివరించడం మొదలుపెట్టారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. సౌందర్య లహరి - 48 / Soundarya Lahari - - 48 🌹
📚. ప్రసాద్ భరద్వాజ 

48 వ శ్లోకము

🌴. నవ గ్రహముల దోషములు తొలగుటకు 🌴

శ్లో: 48. అహస్సూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయా 
త్రియామాం వామం తే సృజతి రజనీనాయకతయాl 
తృతీయా తే దృష్టి ర్దరదలిత హేమాంబుజరుచిః 
సమాధత్తే సంధ్యాం దివసనిశయో రంతర చరీమ్ll 
 
🌻. తాత్పర్యము : 
అమ్మా ! నీ యొక్క కుడి కన్ను సూర్య స్వరూపము కలది అగుట చేత పగలును, ఎడమ కన్ను చంద్రుని స్వరూపమగుట చేత రాత్రి ని కలిగించు చున్నవి. కొంచెముగా వికసించిన బంగారు కమలము వంటి నీ మూడవ కన్ను ఉదయ సంధ్య, సాయంత్ర సంధ్యలను కలుగ జేయు చున్నవి, కదా ! 
  
🌻. జప విధానం - నైవేద్యం :--

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 9 రోజులు జపం చేస్తూ, రకరకముల అన్నములు, తేనె, పండ్లు నివేదించినచో నవ గ్రహముల దోషములు తొలగును అని చెప్పబడింది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Soundarya Lahari - 48 🌹
📚. Prasad Bharadwaj 

SLOKA - 48 

🌴 Removal of Problems created by Nine Planets 🌴

48. Ahah sute savyam tava nayanam ark'athmakathaya Triyamam vamam the srujati rajani-nayakataya; Trithiya the drishtir dhara-dhalita-hemambuja-ruchih Samadhatte sandhyam divasa-nisayor antara-charim 
 
🌻 Translation : 
Right eye of yours is like the sun, and makes the day, left eye of yours is like the moon, and creates the night, thine middle eye, which is like the golden lotus bud, slightly opened in to a flower, makes the dawn and the dusk.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) : 

If one chants this verse 1000 times a day for 9 days, offering variety rice ,fruits and honey as prasadam, they are said to overcome all problems caused by nine planets.

🌻 BENEFICIAL RESULTS: 
Averting evil effects of planets, success in efforts, attaining all desires. 
 
🌻 Literal Results: 
Unexpected joy and turn of events for the better in life.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 347 / Bhagavad-Gita - 347 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 28 🌴*

28. శుభాశుభఫలరేవం మోక్ష్యసే కర్మబన్ధనై: |
సన్న్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి ||

🌷. తాత్పర్యం :
ఈ విధముగా నీవు కర్మబంధముల నుండి మరియు వాని శుభాశుభఫలముల నుండి ముక్తుడవు కాగలవు. ఇట్టి సన్న్యాసయోగముతో నా యందు మనస్సును స్థిరపరచుట ద్వారా నీవు విముక్తుడవై నన్ను పొందగలవు.

🌷. భాష్యము : 
ఉన్నతమైన మార్గదర్శకత్వమున కృష్ణభక్తిభావనలో వర్తించువాడు యుక్తుడని పిలువబడును. దీనికి సరియైన పదము “యుక్తవైరాగ్యము”. ఈ విషయమును గూర్చి శ్రీరూపగోస్వామి మరింతగా ఇట్లు వర్ణించిరి.

అనాసక్తస్య విషయాన్ యథార్హముపయుంజత: |
 నిర్భంధ: కృష్ణసంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే ||

(భక్తిరసామృతసింధువు 1.2.255)

భౌతికజగమున ఉన్నంతవరకు మనము కర్మ చేయవలసిన ఉండును. కర్మను విరమించుట సాధ్యము కాదు. 

కనుకనే కర్మలను ఒనరించి ఆ ఫలమును శ్రీకృష్ణునకు సమర్పించినచో అది “యుక్తవైరాగ్యము” అనబడునని శ్రీరూపగోస్వామి పలికిరి. వైరాగ్యమునందు వాస్తవముగా నెలకొనినపుడు అట్టి కర్మలు చిత్తదర్పణమును పరిశుభ్రము చేయగలవు. 

ఇక కర్త ఆధ్యాత్మికానుభవమునందు క్రమపురోగతి సాధించిన కొలది శ్రీకృష్ణభగవానుని సంపూర్ణ శరణాగతుడై అంత్యమున మోక్షమును బడయును. అతడు పొందు ముక్తియు స్పష్టముగా వివరింపబడినది. 

ఈ ముక్తి ద్వారా అతడు బ్రహ్మజ్యోతిలో లీనముగాక భగవద్దామమున ప్రవేశించునని “మాముపైష్యసి” (నన్ను పొందును) యను పదము ద్వారా స్పష్టముగా తెలుపబడినది. 

వాస్తవమునకు ముక్తి ఐదురకములైనను జీవితమంతయు శ్రీకృష్ణభగవానుని నేతృత్వమున భక్తియోగమును సాగించిన భక్తుడు మాత్రము ఆధాత్మికముగా అత్యున్నతస్థితికి చేరి, దేహత్యాగానంతరము ఆ దేవదేవుని ధామము కేగి అతని ప్రత్యక్ష సాహచర్యమున నియుక్తుడగును.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 347 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 28 🌴*

28. śubhāśubha-phalair evaṁ
mokṣyase karma-bandhanaiḥ
sannyāsa-yoga-yuktātmā
vimukto mām upaiṣyasi

🌷 Translation : 
In this way you will be freed from bondage to work and its auspicious and inauspicious results. With your mind fixed on Me in this principle of renunciation, you will be liberated and come to Me.

🌹 Purport :
One who acts in Kṛṣṇa consciousness under superior direction is called yukta. The technical term is yukta-vairāgya. This is further explained by Rūpa Gosvāmī as follows:

anāsaktasya viṣayān
yathārham upayuñjataḥ
nirbandhaḥ kṛṣṇa-sambandhe
yuktaṁ vairāgyam ucyate

(Bhakti-rasāmṛta-sindhu, 1.2.255)

Rūpa Gosvāmī says that as long as we are in this material world we have to act; we cannot cease acting. Therefore if actions are performed and the fruits are given to Kṛṣṇa, then that is called yukta-vairāgya. 

Actually situated in renunciation, such activities clear the mirror of the mind, and as the actor gradually makes progress in spiritual realization he becomes completely surrendered to the Supreme Personality of Godhead. Therefore at the end he becomes liberated, and this liberation is also specified. 

By this liberation he does not become one with the brahma-jyotir, but rather enters into the planet of the Supreme Lord. It is clearly mentioned here: mām upaiṣyasi, “he comes to Me,” back home, back to Godhead. 

There are five different stages of liberation, and here it is specified that the devotee who has always lived his lifetime here under the direction of the Supreme Lord, as stated, has evolved to the point where he can, after quitting this body, go back to Godhead and engage directly in the association of the Supreme Lord.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 175 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴*
39. అధ్యాయము - 14

*🌻. శివపూజ - 8 🌻*

లక్ష మానం తు పుష్పాణాం శృణు ప్రీత్యా మునీశ్వర | ప్రస్థానాం చ తథా చైకం శంఖపుష్పసముద్భవమ్‌ || 59

ప్రోక్తం వ్యాసేన లక్షం హి సూక్ష్మమాన ప్రదర్శినా | ప్రస్థై రేకాదశైర్జాతీ లక్ష మానం ప్రకీర్తితమ్‌ || 60

యూథికాయాస్తథా మానం రాజికాయాస్తదర్ధకమ్‌ | ప్రస్థైర్వింశతికైశ్చైవ మల్లికామానముత్తమ్‌ || 61

తిలపుషై#్పస్తథా మానం ప్రస్థాన్న్యూనం తథైవ చ | తతశ్చ ద్విగుణం మానం కరవీరభవే స్మృతమ్‌ || 62

ఓ మునిశ్రేష్ఠా! పుష్పములకు వర్తించే లక్షమానమును ప్రీతితో వినుము. శంఖపుష్పముల ఒక ప్రస్థము ఒక లక్షయగునని (59) 

సూక్ష్మమానమును వివరించిన వ్యాసుడు చెప్పినాడు. పదకొండు ప్రస్థముల అడవి మల్లెలు ఒక లక్ష యగును (60). 

కొండమల్లెల మానము కూడా ఇంతే. దీనిలో సగము ఆవపువ్వులు లక్షయగును. ఇరువది ప్రస్థముల తీగమల్లె పువ్వులు ఒక లక్షయగును (61).

ప్రస్థము కంటె కొద్ది తక్కువ నువ్వుల పువ్వులు ఒక లక్షయగును. దీనికి రెండు రెట్లు ఎర్రగన్నేరు పువ్వులు ఒక లక్ష మానమగును (62).

నిర్గుండీకుసుమే మానం తథైవ కథితం బుధైః | కర్ణికారే తథా మానం శిరీషకు సుమే పునః || 63

బంధుజీవే తథా మానం ప్రస్థానాం దశకేన చ | ఇత్యాద్యైర్వివిధైర్మానం దృష్ట్వా కుర్యాచ్ఛివార్చనమ్‌ || 64

సర్వకామసమృద్ధ్యర్థం ముక్త్యర్థం కామనోజ్ఘితః | అతః పరం ప్రవక్ష్యామి ధారాపూజాఫలం మహత్‌ || 65

యస్య శ్రవణ మాత్రేణ కల్యాణం జాయతే నృణామ్‌ | విధాన పూర్వకం పూజాం కృత్వా భక్త్యా శివస్య వై || 66

పశ్చాచ్చ జలధారా హి కర్తవ్యా భక్తి తత్పరైః |

సిందూర పుష్పముల విషయములో కూడ మానము ఇటులనే అనియు, కొండగోగు పువ్వులకు మరియు దిరిసెన పువ్వులకు ఇదియే మానమనియు పండితులు చెప్పెదరు (63). 

మంకెన పుష్పముల వి,యములో నలభై మానికెల కొలత ఒక లక్షయగును. భక్తుడు ఈ వివిధ మానములను పరిశీలించి, శివుని అర్చించినచో (64), 

సర్వకామనలు సిద్ధించును. కామనలు లేని భక్తునకు ముక్తి లభించును. ఈపైన పరమ పవిత్రమైన ధారాపూజ యొక్క ఫలమును చెప్పెదను (65). 

దీనిని విన్నంత మాత్రానా మానవులకు మంగళములు కలుగును. శివునకు యథావిధిగా భక్తితో పూజసలిపి (66), 

ఆ తరువాత భక్తి తత్పరులగు సాధకులు శివునిపై జలధారను ఏర్పాటు చేయవలెను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 52 🌹*
Chapter 14, 15
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 THRONES 🌻*

The unnatural sanskaras are always the obstruction s on the road toward Truth. The poor man who is afflicted with unnatural sanskaras walks on a road of thorns.  

When one gets thorns stuck in his foot, one cannot move on in his journey until the thorns are removed. At this time the man calls out for help to remove them.  

The Avatar comes and uses a thorn to remove the thorns. Until the thorns are removed, further progress along the road is not possible.

*🌻 THE PATH TO TRUTH - 1 🌻*

The path to Truth has three sections, and each section is a world onto itself, yet each world overla ps the other.  

The path to Truth is of Light, and this Light has three forms of darkness — they are shadows. Each of the three shadows overlaps the other.  

The mental world is the shadow of the Seventh plane, and the subtle world is the shadow of the mental wo rld, and the gross world is the shadow of the subtle world.  

It is through these worlds of shadows that one must journey to realize the Truth. Sanskaras prevent one from seeing the Light.  

Gross sanskaras cause one to see gross shadows; subtle sanskaras cau se one to see the subtle shadows, and mental sanskaras cause one to see the mental shadows.  

Shadows only have existence because of the existence of sanskaras, and it is these very sanskaras that give life to these shadows.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 48 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 23
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆదిమూర్త్యాది పూజావిధి - 2 🌻*
*సర్వకార్య జయమునకు*

వా మేతు వర్థనీం న్యస్య పూజాద్రవ్యం తు దక్షిణ | ప్రక్షాళ్యాస్త్రేణ చార్ఘే7థ గన్దపుష్పాన్వితే న్యసేత్‌ 9

చైతన్యం సర్వగం జ్యోతిరస్త్రజప్తేన వారిణా | షడన్తేనతు సంసిచ్య హస్తే ధ్యాత్వా హరిం పరే 10

ధర్మం జ్ఞానం చ వైరాగ్యమైశ్వర్యం వహ్నిగిఙ్ముఖాన్‌ | అధర్మాదీని గాత్రాణి పుర్వాదౌ యోగపీఠకే 11

కూర్మం పీఠే హ్యనన్తం చ యమం స్యూర్యాదిమణ్డలమ్‌ | విమలాద్యాః కేసరస్థానగ్రహాః కర్ణికాస్థితాః 12

పూర్వం స్వహృదయే ధ్యాత్వా ఆవాహ్యార్బేచ్చ మణ్డలే |

అర్ఘ్యం పాద్యం తథాచామం మధుపర్కం పునశ్చ తత్‌.

స్నానం వస్త్రోపవీతం చ భూషణం గన్దపుష్పకమ్‌ | ధూపదీపనైవేద్యాని పుణ్డరీకాక్షవిద్యయా. 14

యజేదఙ్గాని పూర్వాదౌ ద్వారి పూర్వే పరేణ్డజమ్‌ |

దక్షేచక్రం గదాం సౌమ్యకోణ శఙ్ఖం ధనుర్వ్యసేత్‌. 15

దేవన్య వామతో దక్షే చేషుధీ ఖడ్గమేవ చ | వామే చర్మ శ్రియం దక్షేపుష్టిం వామేగ్రతో న్యసేత్‌ . 16

జలకుంభమును ఎడమ వైపునను, పూజాద్రవ్యములను కుడి వైపునను ఉంచవలెను. అస్త్రముచే ప్రక్షాళనచేసి గంధపుష్పాన్వితము నైన అర్ఘ్యములను ఉంచవలెను. 

సర్వవ్యాప్తము, జ్యోతిఃస్వరూపము అయిన చైతన్యములను "అస్త్రాయఫట్‌" అని అభిమంత్రించిన, ఉదరముచే యోగబీజము నడిపి. హరిని ధ్యానించి, పూర్వాదియోగ పీఠము నందు ధర్మమును. వైరాగ్యమున, ఐశ్వర్యమును, ఆగ్నేయదిక్కు మొదలైన వాటిని, ఆధర్మము మొదలగు అంగములకు, పీఠమునందు కూర్మమును, అనంతుని, యముని, సూర్యాదుల మండలములను, విమల మొదలగు కేసరస్థానము నందున్న గ్రహణములను, కర్ణిక (ఈ పద్మము మధ్యనున్న దుద్దు యందున్న గ్రహణములనుముందు తన హృదయము నందు ధ్యానము చేసి పిమ్మట మండలము పై ఆవాహనము చేసి అర్చించవలెను. 

వైష్ణవ విద్యానుసారముగా అర్ఘ్య-పాద్య- ఆచమన - మధుపర్క - స్నాన, వస్త్ర - యజ్ఞోపవీత - అలంకార - గంధ - పుష్ప - ధూప - దీప- నైవేద్యములను సమర్పింపవలెను. 

పూర్వాది దిక్కులందు అంగదేవతలను పూజించవలెను. తూర్పు-పడమర దిక్కులందు గరుత్మ తుని, కుడివైపున చక్రమును, గదను, ఎడమవైపున శంఖమును, ధనస్సును ఉంచవలెను దేవుని ఎడమవైపున అంబుల పొదులను, కుడివైపున ఖడ్గమును. ఎడమ వైపున డాలును ఉంచవలెను. కుడి వైపున అగ్రభాగమున పుష్టిని ఉంచవలెను. 9-16

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 63 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. అంగిరసమహర్షి - శ్రద్ధ - 8 🌻*

15. పితృలోకంలో అయిదుగురు దేవతలు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళను పితృదేవతలు అంటారు. పిత్రుదేవతలు శాశ్వతంగా ఉంటారు. చనిపోయిన జీవులు ఆ దేవతల అనుగ్రహం సంపాదించి అక్కడికివెళ్ళటానికి, ఆ దేవతలయందుండే మహత్తర శక్తిచేత, పుణ్యం అభివృద్ధి చేసుకుని తమపాపం నశింపచేసుకుని ఆ లోకాలకు వెళ్ళటానికని, ఇక్కడ ఆ జీవుల బంధువులు క్రతువులు చేస్తారు. 

అంతే తప్ప చనిపోయిన వాళ్ళకు పాపక్షయం చేయగల శక్తి మనకు లేదు. వీళ్ళు ఏ లోకాలకు వెళ్లితే పాపక్షయం అయి సుఖపడతారో, అక్కడికి పంపించేందుకు వేదమంత్రాలను ఉపయోగిస్తాము. వాటినే తర్పణాలు అంటారు. పితృదేవతల కార్యం అది.

16. మనం ఒక మంత్రోపాసన చేస్తాం. ఆ మంత్రాన్ని విసర్జించే విధానం ఉంది. అవసరమయితే, గోవు చెవిలో చెప్తాం. గోవుచెవిలో చెపితే ఆ మంత్రాన్ని ఇక మళ్ళీ ఉపాసించకూడాదు. దాన్ని ఇక విసర్జించినట్లే. అంటే గోవు చెవిలో దాన్ని వదిలి పెట్టవచ్చు.

17. అంగిరసుడు ఋషిగా ఉన్న గోత్రాలు చాలా ఉన్నాయి. సప్తార్ష్యంలో ఉన్నాడు. త్రయార్ష్యంలో ఉన్నాడు. ఏకాదశార్ష్యంలో ఉన్నాడు. అంగిరస ఋషి కలిస్తే వివాహంకూడా చెయ్యవచ్చని అంటారు. ఎందుకంటే రెండు గోత్రాలను చూచి వివాహం చేసుకునేటప్పుడు, అంగిరసుడు రెండు గోత్రాలలోనూ ఋషిగా కలిసినప్పటికీ దోషంలేదు, తప్పులేదు. వివాహం చేసుకోవచ్చు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 9 🌹*
✍️ Sri GS Swami ji 
📚. Prasad Bharadwaj

*🌻 Guru is very difficult for you to recognize. Guru himself comes to you 🌻*

We were discussing as to how Guru may be obtained. We have established that at some particular point during your life’s journey, while you are in the association of some good souls, you will experience extraordinary peace inside your heart. An indefinable joy is experienced. In His presence you forget all the turmoil that is in your life. Confidence is gained that you can overcome all problems. 

When you see that individual, you feel a sense of intimacy with him, a feeling of love that he belongs to you, that he is a family member. Your fear is gone, and you feel assured that he can remove all your troubles. 

When you experience such a feeling, when your attention becomes focused on that person, you may recognize and feel certain that He is your Guru. His presence automatically infuses you with peace and joy. That form, that personality, gives indescribable joy.

Narada performed penance and felt convinced that he had conquered desire. Vishnu questioned him as to the location where the penance was performed. 

Narada replied that it was where Siva had burnt Kama, the God of Desire to ashes. Vishnu said, “The tremendous energy that permeates that location granted you the perfect sense control while you were there. 

The sense control that you had experienced there has vanished now. Away from that spot, the restraint no longer exists. You must maintain that self-control throughout, wherever you may be.”

Guru is very difficult for you to recognize. Guru himself comes to you. You, with your limited mental capacity do not possess the ability to identify Guru. 

But from this statement stems a type of obstinacy, a false argument in some people that you should simply remain at ease without making any effort on your part, since Guru will come to you on his own regardless. 

Such complacency should not be entertained. It is wrong. The reason is that the ocean of compassion, the Supreme Soul Himself, the first and foremost Guru, takes on innumerable forms to suit his disciples who are all of very different natures. Not every form is suitable for everyone. 

Not every circumstance where he manifests is applicable for each one’s individual experience and situation.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మనోశక్తి - Mind Power - 66 🌹*
 *Know Your Infinite Mind*
*🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴*
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 Q 60:--మానవ దేహం యొక్క చరిత్ర - 2 🌻*

Ans : --
6) darwin చెప్పినట్లు కోతి నుండి మానవదేహం ఉద్భవించింది అన్నది అసత్యం.

7) మనిషి మనిషిగానే పుట్టాడు. పక్షి పక్షిగానే పుట్టింది. జంతువు జంతువు గానే పుట్టాడు.

8) మానవ దేహం భూమి మీద ఒకే దేహాకృతి కలిగి ఉండాలనే నిబంధన ఏది లేదు. భూమి మీద పరిణామానికి అనుగుణంగా దేహాకృతి ఉంటుంది. 

కొన్ని million సంవత్సరాల తరవాత మానవ జాతి ఇంకొక దేహాకృతిలో ఉండవచ్చు. ఆ ఆకృతి అప్పటి పరిస్తితులు బట్టి, అప్పటి చైతన్య పరిణామాన్ని బట్టి ఉంటుంది.

9) భూమి మీద ఎన్నో నాగరికతలు అంతరించి అంతర్ధానమయ్యాయి.
మనిషితల+జంతువు దేహం
జంతువుతల+మనిషిదేహం
మనిషి తల+పక్షి దేహం
పక్షి తల+మనిషి దేహం 
పాములాగ పాకే మనుష్యజాతి
పక్షి లాగా ఎగిరే మనుష్యజాతి
సముద్రాల లోపల నివసించే మనుష్యజాతి, వేళా సంవత్సరాల జీవితాయుష్షు గల మనుష్యజాతి ఆయా కాల పరిస్థితుల్లో చైతన్య పరిణామానికి అనుగుణంగా వాటి జెనెటిక్ నిర్మాణం ఉండేది.

ఇలా రకరకాల combinations తో జీవజాతులు భూమి మీద మనుగడ సాగించాయి.

10) ఇప్పుడు మనం భూమి మీద వ్యవసాయం చేస్తున్నట్లే అప్పట్లో సముద్రాల్లో నీటిలో నివసించే మనుష్యజాతి నీటిలో వ్యవసాయం చేసేవారు. కొన్ని నాగరికతల్లో మనకంటే తెలివైన వాళ్ళు వున్నారు, మనకంటే వెనుకబడి వున్నారు.

11) ఈ భూమి మీద లేదా విశ్వంలో ఏలోకంలోనైనా ఏదైనా సంభవమే.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 127 🌹*
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

*🌻 ANALYZING THOUGHT 🌻*

A visitor said: 
Maharaj has often said that anyone wanting to be 'awakened' must eschew thought. And yet all thought cannot surely mean conceptualizing, which, one supposes, is what is to be avoided. For instance, Maharaj's answers to questions are generally so appropriate and yet so spontaneous that it might seem that there is no thought behind them, yet some thought must surely be the basis of those answers.

Maharaj said: 
There is indeed a great difference between thoughts and thoughts. Thoughts which form day-dreaming, or thoughts of regret about the events in the past, or thoughts of fear and worry and anticipation regarding the future are surely very much different from the thoughts which spring up spontaneously from the depth of one's psyche, what one might call thoughts that do not need any argument and interpretation by the mind.

The former are to be ignored and avoided; the latter are incapable of being ignored or avoided, because they are essentially spontaneous and immediate and basically non-conceptual.

Maharaj then continued: 
The very first thought 'I am' is surely a thought, but one that does not need any argument or confirmation from the mind. Indeed, as the basis of all further thought, it is the pre-conceptual thought — very source of the mind. 

Living according to indirect or mediate thought, in a divided, dualistic mind is what most people do because they have identified themselves with a pseudo-entity that considers itself as the subject of all action. 

But direct or absolute thought is the process by which the Absolute non-manifest manifests itself. Such thought is spontaneous and instantaneous and therefore, without the element of duration which is an aspect of the split mind. 

Whenever there is duration the thought must necessarily be an after-thought, interpreted phenomenally and dualistically.

No spontaneous, non-dual, intuitive thought can arise unless the storm of conceptual thinking has subsided and the mind rests in a 'fasting' state; and such thought obviously cannot know bondage.

 Instantaneous, pure thought results in pure action without any tinge of bondage, because no entity is involved.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 6 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

నిద్రాదేవత ఈ మృత్యు దేవత ఆధీనంలో వుంటుంది. నిద్ర పట్టని వారు కొంతమంది వున్నారు. ఊరకూరికే లేచికూర్చొంటుంటారు, ఊరుకూరికే కలత నిద్ర పోతూ వుంటారు. కారణం ఏమిటి? అంటే, మరణభయ సమానమైనటువంటి కలలు వస్తుంటాయి. 

ఆ మరణ భయ సమానమైనటువంటి కలలు ఎప్పుడైతే ప్రస్ఫటమైనటువంటి, బలవత్తరమైనటువంటి ప్రభావాన్ని నీ మనోబుద్ధులమీద చూపిస్తాయో, అప్పుడు నీ నిద్ర భంగమై పోతుంది. 

కారణమేమంటే, మేల్కొంటే తప్ప ఆ కల యొక్క ప్రభావం పోదు కాబట్టి, పూర్తిగా ఎఱుకను పొందితే తప్ప ఆ కల యొక్క ప్రభావం పోదు కాబట్టి, ఒక్కొక్కప్పుడు పోదు కూడా, మేల్కొన్నా కూడా ఆ కల యొక్క ప్రభావం పోదు. కారణం మరుపు, మరణము, సుషుప్తి, మూర్ఛలు ఈ నాలుగు అవస్థలు ఒకదానికి ఒకటి సంబంధపడి వుంటాయన్నమాట. 

కాబట్టే, మనం నిద్రావస్థలో మనం మన ఎఱుకను మనం పూర్తిగా కోల్పోతున్నాము. మరణములో కూడా ‘నేను’ అనే ఎఱుకని కోల్పోతున్నాము. 

ఎవరైతే, ఈ నాలుగు అవస్థలలో ‘నేను’ అనే ఎఱుకను నిలబెట్టుకున్నారో, వారు ఆత్మనిష్ఠులు అనేటటువంటి నిర్ణయాన్ని సూచన ప్రాయంగా చెప్తున్నారు.

            చాలామంది తామసికమైన అజ్ఞానభూయిష్టమైనటువంటి నిద్ర పోయి, ఆహా! చాలా బాగా నిద్రపట్టిందండీ, ఒళ్ళు మరచిపోయి, ఒడలు మరచిపోయి నిద్రించాను అని ఆనందిస్తూ వుంటారు. ఇదో రకమైన ఆనందము. ఇది తామసిక గరిష్ఠమైనటువంటి నిద్ర. కానీ... ఇది శాంత చిత్తమైన నిద్ర కాదన్నమాట. 

ఎవరైతే తన ప్రజ్ఞను తాను గుర్తిస్తూ, తన ఎఱుకను తాను గుర్తిస్తూ, స్వస్థితిని గుర్తిస్తూ, ‘స్వీయ నేను’ ని గుర్తిస్తూ, ‘సెల్ఫ్‌ రియలైజ్‌డ్‌ స్టేటస్‌’ [self realized status] లో ఎవరైతే నిద్రావస్థని ఆచరిస్తారో, వాళ్ళు శాంత చిత్తులై నిద్రిస్తారని అర్థం. 

ఎప్పుడైతే ఆ శాంత చిత్తంతో నిద్రించాడో, అతనిలో ప్రజ్ఞ మేల్కొంటుంది. మనమందరం కూడా రోజువారీ నిద్రని ఇలా శాంత చిత్తంతో ఆచరించడం నేర్చుకోవాలి.

         నీలో ప్రజ్ఞ మేల్కొన్నవాడవై, స్వప్రకాశ స్థితిలో వుండి, నిద్రలో మనం విశ్రాంతి తీసుకోవడం అభ్యాసం చెయ్యాలి. ఆ రకమైన మెలకువను కలిగి వున్నటువంటి నిద్రగా మనం నిద్రను స్వీకరించాలి. ఆ రకంగా మీరు తురీయంలో ప్రవేశిస్తారన్నమాట! 

అటువంటి నిర్వాణానుభవం ద్వారా తాను తురీయస్థితిలోనికి ప్రవేశిస్తాడు. కాబట్టి శాంత చిత్తుడై నిద్రించడం అన్నటువంటి దాంట్లో, సూచన ప్రాయంగా నిర్వాణానుభవ స్థితిని సూచిస్తున్నాడు. 

ఎప్పుడైతే ఒకసారి నీకు నిర్వాణ సుఖం లభించిందో, నువ్వు వాటిని మెలకువలోనూ, స్వప్నంలోనూ పోగొట్టుకోవడానికి ఇష్టపడవు ఇక. ఎలాగో చెప్పనా? 

ఎవరైనా తమ తలకాయిని ఇవ్వడానికి సిద్ధపడతారా? ఎవరైనా సిద్ధపడుతారా? ఎవ్వరూ సిద్ధపడరు. ఎందుకని? తల లేకపోతే జీవితం లేదు కాబట్టి. అంత ముఖ్యమైనటువంటిది. అట్లాగే, నీ జీవితానుభవాల మొత్తం మీద, అత్యంత విలువైన అనుభూతి ఏదైన ఒకటి ఉందంటే అది నిర్వాణం. 

ఒక్కసారి నిర్వాణ సుఖాన్ని అనుభూతి పొందినటువంటివాడు మరలా ఎట్టి కష్ట పరంపర వచ్చినప్పటికీ కూడా, ఎట్టి సుఖదుఃఖ పరంపర ఏర్పడినప్పటికీ కూడా, ఎట్టి ద్వంద్వానుభూతులు ఏర్పడుతున్నప్పటికీ కూడా, ఈ నిర్వాణ సుఖాన్ని పోగొట్టుకోరు. 

జాగ్రత్‌ స్వప్న సుషుప్తులలో ప్రయత్న పూర్వకముగా నిర్వాణ సుఖాన్ని నిలబెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యం. అన్ని సాధనలలో కెల్లా ముఖ్య సాధనమిదే!          

 ఈ శాంత చిత్తం ఎప్పుడైతే వచ్చేస్తుందో, నీలో నిర్వాణ సుఖం ఏర్పడుతుంది. అట్టి నిర్వాణ సుఖమే, ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి పునాది. ఆధారభూతమైనటువంటి పునాది స్థితి అన్నమాట!
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సాయి తత్వం - మానవత్వం - 55 / Sai Philosophy is Humanity - 55 🌹*
🌴. అధ్యాయము - 7 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. బాబా పండరి ప్రయాణము - 2 🌻*

8. నానాసాహెబు నీంగాం చేరుసరికి శిరిడీ మసీదులో కలకలము రేగెను. బాబా మసీదులో కుర్చుండి మహాల్సాపతి, అప్పాశిందే, కాశీరాములతో మాట్లాడుచుండెను.

9. హఠాత్తుగా బాబా వారితో నిట్లనియెను: "మన నలుగురము కలిసి భజన చేసెదము. పండరీ ద్వారములు తెరచినారు.

10. కనుక ఆనందముగా పాడెదము లెండు!" అందరు కలిసి పాడదొడంగిరి. ఆ పాట యొక్క భావమేమన, "నేను పండరీ పోవలెను.

11. నేనక్కడనే నివసించవలెను. ఎందుకనగా, అదియే నా ప్రభువు యొక్క ధామము.

12. అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరు బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబసమేతముగ వచ్చి బాబా పాదములకు సాష్టాంగనమస్కారము చేసి, తనకు పండరీపురము బదలీయైనదనీ, బాబా కూడా వారితో పండరీపురము వచ్చి యక్కడుండవలసినదనీ వేడుకొనెను.

13. అటుల ప్రతిమాలుట కవసరము లేకుండెను. ఏలన బాబా యప్పటికే పండరీ పోవలెను, అచ్చట నుండవలెనను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి.

14. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై బడెను. బాబా యొక్క ఊదీ ప్రసాదము ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది, నానాసాహెబు పోయెను.

15. ఇట్టి బాబా లీలల కంతులేదు!

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 


*🌹. Sai Philosophy is Humanity - 55 🌹*
Chapter 7
✍️. Sri NV. Gunaji
📚. Prasad Bharadwaj

*🌻 Going to Pandharpur and Staying There - 2 🌻*

As soon as Nanasaheb approached Neemgaon, a few miles from Shirdi, there was stir in the Masjid at Shirdi. 

Baba was sitting and talking with Mhalsapati, Appa Shinde and Kashiram, when He at once said, "Let us all four do some Bhajan, the doors of Pandhari are open, let us merrily sing." 

Then they began to sing in chorus, the burden of the song being "I have to go to Pandharpur and I have to stay on there, for it is the house of my Lord."

Baba sang and the devotees followed Him. In a short time Nanasaheb came there with his family, prostrated before Baba and requested Him to accompany them to Pandharpur and stay with them there. 

This solicitation was not necessary, as the devotees told Nanasaheb that Baba was already in the mood of going to Pandharpur and staying there. Hearing this Nanasaheb was moved and fell at Baba’s Feet. 

Then getting Baba’s permission, Udi (sacred ashes) and Blessings, Nanasaheb left for Pandharpur.

There is no end to Baba’s stories, but let me now make a halt here, reserving for the next Chapter other topics, such as importance of human life, Baba’s living on alms, Bayajabai’s service and other stories.

Bow it Shri Sai -- Peace be to all

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శివగీత - 6 / The Siva-Gita - 6 🌹


*🌹. శివగీత - 6 / The Siva-Gita - 6 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రధమాధ్యాయము
*🌻. భక్తి నిరూపణ యోగము - 5 🌻*

శివార్పణ దియా కానూ - న్పరిత్యజ్య యధావిధి: 17

18. అనుగ్ర హాత్తేవ శంభో -ర్జాయతే సుద్రుడో నర;
తతో భీతా; పలాయన్తే - విఘ్నం హిత్వా సురేశ్వరా: 

దాని వలన మానవుడు తన కోరికలను వీడి నిష్కామము గలవాడై శివార్పణ బుద్ది చేత సత్కర్మల ననుష్ఠించుట వలన అతడు శివాను గ్రహమునకు పాత్రుడై సంకల్ప సిద్దులను పొందును. అట్టి యమూల్యమైన శివానుగ్రహము చేత నాతని సుఖములకు జరుగపోవు నాటంకములు సమసి పోవుటే గాకుండా అమరులు సఫలీ భూతంబు లగు కర్మలు పసిగట్టి పరమ శివుని యనుగ్రహము వలన దమకెటువంటి చెరుపు (నష్టము ) కలుగునో యని భయముతో నాతడు చేపట్టిన కార్యములకు ఏ విధమైన ఆటంకములను కలిగింపక పలాయన మగుదురు.

19. జాయతే తేన శుశ్రూషా - చరితే చంద్ర మౌళిన:
శృణ్వతో జాయతే జ్ఞానం - జ్ఞానా దేవి విముచ్యతే 

అందువలన మానవుడెల్లప్పుడు శివార్పణ బుద్ది కలిగి నిష్కామముతో శివార్చన శివ కధా శ్రవణాదులందు జ్ఞానార్జనను గావించు కొనును. దాని ప్రభావమున సంసృతి మోక్షమును పొందును.

20. బహునాత్ర కిముక్తేన - యస్య భక్తి శ్శివే దృడా,
మహాపాపో పపాపౌఘ - కోటి గ్రస్తో విముచ్యతే 

వేయేల ఏ భక్తుడి కైతే పరమశివుని యందు దృడమై నిర్మలమగు భక్తి కలుగునో అట్టివాడే మహా పాపముల చేతను ముక్తుడగును.

21. అనాధ రేణ శాట్యేన - పరిహాసై ర సూయయా,
శివ భక్తి రతశ్చేత్స్యా - దంత్య జో సివి ముచ్యతే 

అస్పృశ్యు డైనను, కారణ మేమియు లేకుండ గాని, వంచ కత్వముతో గాని , పరిహాసమునకు గాని , ఈర్ష్య చేత గాని శివుని యందు భక్తి యంకురించిన యెడల అటువంటి వాడు సమస్త పాపముల నుండి ముక్తుడగును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 6 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 01: 
*🌻 Bhakti Niroopana Yoga - 5 🌻*

17. 18. Because of that, devotee would become detached from all his desires and would get filled with a devoting everything to Shiva. Due to that nature he would keep doing good deeds and would gain the grace of Lord Shiva. When he earns the grace of Lord Shiva, the demi gods would not dare to interrupt his devotion
because of the fear of Lord Shiva's anger.

19. That's why human would all the time remain with 'Shivarpana' buddhi and would remain immersed in the
worship of Shiva and would gain knowledge which gives him Mukti (Salvation)

20. The devotee who keeps an unshaken faith in lord Paramashiva, only that person would get saved from
Maha Papa (Great Sins) and Upa Paapa (Minor Sins) even if they are crores in number.

21. Anyone while doing criticism, or while disrespecting, or due to jealousy, if gets devoted or gains devotion
for Shiva, he would get cleansed of all the Sins immediately. 

N.B: Let's analyze this statement further. We have real examples in our Hindu scriptures where such instances have been seen. Kamsa, Ravana Shishupaala, etc, all were filled with "Virodhi Bhakti" for Lord Vishnu, their hatred for hari increased to such limits that they unknowingly used to think constantly about Hari only. Finally what happened we all know. They were given Salvation by Lord through killing. So, the same way, even if while criticizing Shiva, or while disrespecting him, or while hating him if one gets filled with that 'Virodhi Bhakti' he would get liberated of all sins. The idea here is not to develop Virodh Bhakti, but the sloka tells the importance of Shiva Bhakti. The meaning in short is:Even if inadvertently one develops slightest interest and devotion towards Shiva, he would get cleansed of sins right at that moment). 

22. One whose Shiva Bhakti becomes strong, such people would get all theyr desires fulfilled by it. But for those who are totally submitted in Shiva Bhakti, would get liberated out of the birthrebirth cycle and would attain Salvation.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹