*🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ
ప్రధమాధ్యాయము
*🌻. భక్తి నిరూపణ యోగము - 5 🌻*
శివార్పణ దియా కానూ - న్పరిత్యజ్య యధావిధి: 17
18. అనుగ్ర హాత్తేవ శంభో -ర్జాయతే సుద్రుడో నర;
తతో భీతా; పలాయన్తే - విఘ్నం హిత్వా సురేశ్వరా:
దాని వలన మానవుడు తన కోరికలను వీడి నిష్కామము గలవాడై శివార్పణ బుద్ది చేత సత్కర్మల ననుష్ఠించుట వలన అతడు శివాను గ్రహమునకు పాత్రుడై సంకల్ప సిద్దులను పొందును. అట్టి యమూల్యమైన శివానుగ్రహము చేత నాతని సుఖములకు జరుగపోవు నాటంకములు సమసి పోవుటే గాకుండా అమరులు సఫలీ భూతంబు లగు కర్మలు పసిగట్టి పరమ శివుని యనుగ్రహము వలన దమకెటువంటి చెరుపు (నష్టము ) కలుగునో యని భయముతో నాతడు చేపట్టిన కార్యములకు ఏ విధమైన ఆటంకములను కలిగింపక పలాయన మగుదురు.
19. జాయతే తేన శుశ్రూషా - చరితే చంద్ర మౌళిన:
శృణ్వతో జాయతే జ్ఞానం - జ్ఞానా దేవి విముచ్యతే
అందువలన మానవుడెల్లప్పుడు శివార్పణ బుద్ది కలిగి నిష్కామముతో శివార్చన శివ కధా శ్రవణాదులందు జ్ఞానార్జనను గావించు కొనును. దాని ప్రభావమున సంసృతి మోక్షమును పొందును.
20. బహునాత్ర కిముక్తేన - యస్య భక్తి శ్శివే దృడా,
మహాపాపో పపాపౌఘ - కోటి గ్రస్తో విముచ్యతే
వేయేల ఏ భక్తుడి కైతే పరమశివుని యందు దృడమై నిర్మలమగు భక్తి కలుగునో అట్టివాడే మహా పాపముల చేతను ముక్తుడగును.
21. అనాధ రేణ శాట్యేన - పరిహాసై ర సూయయా,
శివ భక్తి రతశ్చేత్స్యా - దంత్య జో సివి ముచ్యతే
అస్పృశ్యు డైనను, కారణ మేమియు లేకుండ గాని, వంచ కత్వముతో గాని , పరిహాసమునకు గాని , ఈర్ష్య చేత గాని శివుని యందు భక్తి యంకురించిన యెడల అటువంటి వాడు సమస్త పాపముల నుండి ముక్తుడగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 The Siva-Gita - 6 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 01:
*🌻 Bhakti Niroopana Yoga - 5 🌻*
17. 18. Because of that, devotee would become detached from all his desires and would get filled with a devoting everything to Shiva. Due to that nature he would keep doing good deeds and would gain the grace of Lord Shiva. When he earns the grace of Lord Shiva, the demi gods would not dare to interrupt his devotion
because of the fear of Lord Shiva's anger.
19. That's why human would all the time remain with 'Shivarpana' buddhi and would remain immersed in the
worship of Shiva and would gain knowledge which gives him Mukti (Salvation)
20. The devotee who keeps an unshaken faith in lord Paramashiva, only that person would get saved from
Maha Papa (Great Sins) and Upa Paapa (Minor Sins) even if they are crores in number.
21. Anyone while doing criticism, or while disrespecting, or due to jealousy, if gets devoted or gains devotion
for Shiva, he would get cleansed of all the Sins immediately.
N.B: Let's analyze this statement further. We have real examples in our Hindu scriptures where such instances have been seen. Kamsa, Ravana Shishupaala, etc, all were filled with "Virodhi Bhakti" for Lord Vishnu, their hatred for hari increased to such limits that they unknowingly used to think constantly about Hari only. Finally what happened we all know. They were given Salvation by Lord through killing. So, the same way, even if while criticizing Shiva, or while disrespecting him, or while hating him if one gets filled with that 'Virodhi Bhakti' he would get liberated of all sins. The idea here is not to develop Virodh Bhakti, but the sloka tells the importance of Shiva Bhakti. The meaning in short is:Even if inadvertently one develops slightest interest and devotion towards Shiva, he would get cleansed of sins right at that moment).
22. One whose Shiva Bhakti becomes strong, such people would get all theyr desires fulfilled by it. But for those who are totally submitted in Shiva Bhakti, would get liberated out of the birthrebirth cycle and would attain Salvation.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment