ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనం విశిష్టత - Vaikunta Ekadashi Significance



https://youtu.be/p7XiTMQ-kCg


🌹 ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనం విశిష్టత Vaikunta Ekadashi Significance వైకుంఠ ఏకాదశి 2025 తేదీ, తిథి, ఏమి చేయాలి? 🌹

ప్రసాద్‌ భరధ్వాజ


🍀 విష్ణు పురాణం ప్రకారం.. పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువుకి, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆ ఇంట్లో సిరిసంపదలు నెలకొంటాయని, మోక్షం లభిస్తుందని ప్రగాఢ నమ్మకం. అలాగే విష్ణు భక్తికి ప్రతీక జాగారం అని చెబుతారు. వైకుంఠ ఏకాదశి రోజు రాత్రి శ్రీమన్నారాయణ నామ సంకీర్తనలతో, భజనలతో, భాగవత కథలతో కాలక్షేపం చేస్తూ జాగరణ చేయడం వల్ల మోక్షం పొందవచ్చు అని శాస్త్రం చెబుతోంది. 🍀

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹


11వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక / 11th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita



https://youtube.com/shorts/yDrvIrMJ9vg

🌹 11వ పాశురము - తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక - 11th Pasuram - Tiruppavai Pasuras Bhavartha Gita 🌹

🍀 గుణగణాల మెచ్చికతో మేల్కొలుపు గీతం 🍀

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 ఈ 11వ పాశురం ద్వారా ఆండాళ్, గోపికల చెలికత్తెను నిద్ర లేపుతూ, ఇంటికి ఐశ్వర్యాన్ని, పేరును నిలబెట్టే ఇల్లాలువి అంటూ, సోమరితనాన్ని విడనాడి, కుటుంబ బాధ్యతలను, భగవత్సేవను స్వీకరించాలని మహిళలకు పిలుపునిస్తుంది. 🍀

Like, Subscribe and Share

Prasad Bharadwaj

🌹🌹🌹🌹🌹



'సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే గౌరి' - Gauri Mata Prayer - 'Sarva mangala Mangalye'



https://youtube.com/shorts/6Kikab4LBIU


🌹 సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే గౌరి Gouri Mata Prayer - Sarva mangala Mangalye 🌹

ప్రసాద్‌ భరధ్వాజ

Like, Subscribe and Share


🌹🌹🌹🌹🌹


కలియుగంలో భగవన్నామ స్మరణమే మోక్షసాధనం / In the Kali Yuga, chanting the name of God is the means to salvation


🌹 కలియుగంలో భగవన్నామ స్మరణమే మోక్షసాధనం. భక్తి తత్త్వమే తరుణోపాయం. - నారద మహర్షి 🌹
ప్రసాద్ భరద్వాజ


🌹 In the Kali Yuga, chanting the name of God is the means to salvation. Devotion is the only way to liberation. - Sage Narada 🌹
Prasad Bhardwaj



నారద మహర్షి భూలోక పర్యటన చేస్తూ, చాలా పుణ్యక్షేత్రాలు సందర్శించి, యమునా తీరంలో సంచరిస్తున్న సమయంలో, కొంచెం దూరంలో ఒక యువతి ఖిన్నురాలై, దు:ఖిస్తూ కూర్చుంది. ఆమె ముందు ఇద్దరు వ్యక్తులు, చాలా నీరసంతో, అచేతనంగా పడి ఉన్నారు. ఆ యువతి వారికి సేవ చేస్తూ కూర్చొని, మేలుకొలపడానికి ప్రయత్నం చేస్తోంది. ఎవరైనా వచ్చి రక్షిస్తారేమోనని నాలుగు దిక్కులా చూస్తోంది. ఆ యువతి చుట్టూ కొంతమంది స్త్రీలు వింజామరలు వీస్తూ, ఆమెకు సేవ చేస్తున్నారు.

నారద మహర్షి చూసి, కుతూహలంతో, ఆమెను సమీపించి, "దేవీ! నువ్వు ఎవరివి? ఎందుకు దు:ఖిస్తూ ఉన్నావు? ఆ పడిపోయిన ముసలి వాళ్ళు ఎవరు? నీకు చుట్టూ ఉండి నీకు సేవ చేస్తున్న వీళ్ళు ఎవరు? అని అడగ్గానే, ఆ యువతి "మహాత్మా! మీరైనా నా బాధ తొలగించండి. తమరి దర్శనంవల్ల సమస్త పాపములు పటాపంచలై పోయాయి.

మహర్షీ! నా పేరు 'భక్తి'. ఈ ఇరువురు నా కుమారులు. వారి పేర్లు జ్ఞానము, వైరాగ్యము. కలి ప్రభావంతో వీరి అంగాలు శిథిలమయ్యాయి. నా చుట్టూ ఉన్న నన్ను సేవిస్తున్న వారు గంగ, యమున, తపతి, సరస్వతి మున్నగు పవిత్ర నదులే. స్త్రీ రూపంలో నన్ను ఆరాధిస్తున్నారు. సాక్షాత్తు దేవతలచే ఆరాధింపబడుతున్నా కూడా, నాకు సుఖ సంతోషాలు కరువైపోయాయి. నన్ను గౌరవించే వారే కరువై పోయారు.

తపోధనా! కలియుగ ప్రభావం వల్ల పాషాండులు నా అంగములన్నింటినీ భంగపరిచారు. అందువల్ల, నేను, నా కుమారులు తేజో విహీనులమై పోయాం. అచేతనత్త్వంతో అల్లాడుతున్నాము. వీరిద్దరి పరిస్థితి చూస్తే నా మనస్సు వికలమైపోతోంది. దు:ఖంతో విలవిలలాడుతున్నాము." అని చెప్పగానే, నారద మహర్షి, "సాధ్వీ! నా జ్ఞానదృష్టిచే నీ దు:ఖానికి గల కారణం పరిశీలించి చెపుతాను. నీకు మేలు చేకూరుతుంది." అని చెప్పి కొద్ది క్షణాలు ధ్యానంలో ఉండి, ఆమె బాధకు కారణం తెలుసుకొని, "దేవీ ! ఇది కలియుగం. అతి భయంకరమైనది.

సదాచారాలు లోపించాయి. ధర్మం లేదు. ప్రజలు మూఢులై, అజ్ఞానంతో, వంచకులై, దుష్కర్మలు చేస్తూన్నారు. కేవలం ధనార్జన పట్ల మమకారంతో జీవిస్తున్నారు. తమ జీవన విధానానికి ముఖ్యమైన భగవంతుని మర్చిపోతున్నారు. బాలా! నీ దు:ఖం దూరం కాగలదు. శ్రీ కృష్ణ భగవానుడు ఏనాడు ఈ భూలోకాన్ని వదిలి తన పరంథామానికి వెళ్ళాడో, ఆ నాటి నుండే కలి ప్రభావం చూపుతోంది. ఈ కలియుగంలో తపస్సు, యోగము చేత లభించని ఫలం కూడా శ్రీమన్నారాయణ కీర్తనము చేతనే సంపూర్ణంగా లభిస్తుంది.

సత్యయుగము, త్రేతాయుగం, ద్వాపర యుగములలో జ్ఞానము, వైరాగ్యం ముక్తికి సాధనాలై ఉన్నాయి. కానీ కలియుగంలో కేవలం "భక్తి"యే బ్రహ్మ సాయుజ్యము పొందుటకు ఏకైక మార్గం."

సుముఖీ! కలియుగంలో ప్రతీ ఇంటిలో, ప్రతీ వ్యక్తి యొక్క హృదయంలో నిన్ను నేను ప్రతిష్ఠించెదను. ధర్మములన్నటిని త్రోసిరాజని భక్తి దేవికి పట్టం కట్టేటట్లు, మహోత్సవ సంబరాల తీరుగా ప్రచారం చేస్తాను. అలా చేయని పక్షంలో నేను శ్రీ నారాయణ దాసుడును కానేకాదు. కాబట్టి నిన్ను ఆసరా చేసుకుని జీవించడం ఆవశక్యమై ఉంటుంది.

భగవన్నామస్మరణ చేయగానే నీ ద్వారానే ప్రజలు అదే భక్తులు శ్రీ కృష్ణ పరంథామం చేరుకొంటారు. భక్తి శ్రద్ధలతో ఉరకలు వేస్తూ ఆ శ్రీకృష్ణుని తలపోస్తూ ఉంటారు. భగవంతుడు దేనివల్ల వశుడు కాడు. కేవలం ఒక భక్తి అంటే నీ ద్వారానే వశుడు కాగలడు అని ప్రజల్లో భక్తిని కలిగించే మార్గాలు విశదీకరించాడు. అలా నారదుని మాటలు వినేసరికి ఆమెలో చైతన్యం వచ్చింది. కానీ కుమారులైన జ్ఞానము, వైరాగ్యం కదలక ఉంటే, నారదమహర్షి వారి చెవిలో భగవన్నామస్మరణ చేయగానే చైతన్యవంతులయ్యారు. ఇలా కలియుగంలో మనం ఎంతోకొంత భక్తి తత్త్వాన్ని కలిగి ఉన్నామంటే, మహాత్ములే కారణం. భగవన్నామ స్మరణ మాత్రమే ఈ యుగంలో మోక్షసాధనం.

🌹 🌹 🌹 🌹 🌹

తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 6 - పాశురాలు 11 & 12 / Tiruppavai Pasuras Bhavartha Gita Series 6 - Pasuras 11 & 12



https://youtu.be/820TU-pI5jY


🌹 తిరుప్పావై పాశురాల భావార్థ గీత మాలిక 6 - పాశురాలు 11 & 12 Tiruppavai Pasuras Bhavartha Gita Series 6 - Pasuras 11 & 12 🌹

🍀 11వ పాశురము - గుణగణాల మెచ్చికతో మేల్కొలుపు గీతం, 12వ పాశురం - గోసంపద సేవా మహిమ – వ్రత పిలుపు గీతం 🍀

తప్పకుండా వీక్షించండి

రచన, గానం, స్వరకర్త : ప్రసాద్‌ భరధ్వాజ


🍀 11వ పాశురంలో ఈ పాశురం ద్వారా ఆండాళ్, గోపికల చెలికత్తెను నిద్ర లేపుతూ, ఇంటికి ఐశ్వర్యాన్ని, పేరును నిలబెట్టే ఇల్లాలువి అంటూ, సోమరితనాన్ని విడనాడి, కుటుంబ బాధ్యతలను, భగవత్సేవను స్వీకరించాలని మహిళలకు పిలుపునిస్తుంది. 12వ పాశురం ద్వారా గోదాదేవి గోసేవా మహిమను, భగవంతుని సేవ యొక్క ప్రాముఖ్యతను, లోక బాధ్యతల కంటే భగవద్భక్తి ముఖ్యం అని, అజ్ఞానాన్ని వదిలి భగవంతునిపై భక్తితో మేల్కొని, అతనిని కీర్తించమని, నిత్యమైన ఆనందాన్ని పొందమని ప్రోత్సహిస్తుంది. 🍀

Like, Subscribe and Share

🌹🌹🌹🌹🌹