కాలభైరవాష్టకం Kala-bhairav-ashtakam


🌹. కాలభైరవాష్టకం Kala-bhairav-ashtakam 🌹


దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||

శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||

అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||

🌹 🌹 🌹 🌹 🌹


27 Nov 2021

శ్రీ లలితా సహస్ర నామములు - 158 / Sri Lalita Sahasranamavali - Meaning - 158


🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 158 / Sri Lalita Sahasranamavali - Meaning - 158 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 158. ఛంద:సారా, శాస్త్రసారా, మంత్రసారా, తలోదరీ ।
ఉదారకీర్తి, రుద్దామవైభవా, వర్ణరూపిణీ ॥ 158 ॥ 🍀

🍀 841. ఛంద:సారా :
వేదముల సారము

🍀 842. శాస్త్రసారా :
వేదాంతాది సమస్త శాస్త్రముల సారము

🍀 843. మంత్రసారా :
మంత్రముల యొక్క సారము

🍀 844. తలోదరీ :
పలుచని ఉదరము కలిగినది

🍀 845. ఉదారకీర్తి :
గొప్ప కీర్తి కలిగినది

🍀 846. రుద్దమవైభవా :
అధికమైన వైభవము కలిగినది

🍀 847. వర్ణరూపిణీ :
అక్షరరూపిణి


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 158 🌹

📚. Prasad Bharadwaj

🌻 158. Chandasara shastrasara mantrasara talodari
Udarakirti rudhamavaibhava varnarupini ॥ 158 ॥ 🌻

🌻 841 ) Chanda sara -
She who is the meaning of Vedas

🌻 842 ) Sasthra sara -
She who is the meaning of Puranas(epics)

🌻 843 ) Manthra sara -
She who is the meaning of Manthras ( chants)

🌻 844 ) Thalodharee -
She who has a small belly

🌻 845 ) Udara keerthi -
She who has wide and tall fame

🌻 846 ) Uddhhama vaibhava - 
She who has immeasurable fame

🌻 847 ) Varna roopini -
She who is personification of alphabets


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


27 Nov 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 110


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 110 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని తత్త్వము అంతు పట్టనది 🌻

భగవంతుడు జీవుడుగా దేహములలోనికి దిగి వచ్చునపుడు , దేహములందలి యింద్రియములను సృష్టించి కాపాడు దేవతలకు గూడ వాని తత్త్వము అంతుపట్టదు. కనుకనే వేదములలో " కంటి నుండి ఎవడు చూచునో, కన్ను ఎవరిని చూడలేదో, చెవి నుండి ఎవడు వినునో, చెవి ఎవరిని వినలేదో, మనస్సు నుండి ఎవడూహించునో, మనస్సు ఎవనిని గూర్చి ఊహింపలేదో.....". అతడే భగవంతుడని వర్ణింపబడినది. ఆతడు ఇంద్రియముల నడుమ జీవుడై దిగివచ్చి క్రీడించుచు , ఇంద్రియములచే కూడ తెలియబడడు‌.

వేడుకతో గోపాలవరులతో గూడి గోవులను, దూడలను గాచెను. అపుడు గూడ నందలి గోపాల శ్రేష్ఠులకైనను తన సమగ్రమైన నిజస్వరూపమును చూపలేదు. (గోపాలవరులు అను మాటకు ఇంద్రియములను రక్షించు దేవతలని కూడ నర్థము.)

భగవంతునికి పూజాదికముల రూపమున తమకున్నది సమర్పించుట మాని తమ్ము తాము సమర్పణ చేసుకొనువారికి సంసార తాపములను అతడే నివారించును. అట్టివారి కథలను ఆతని కథలుగా అనుభవించు వారు నిజమైన మోక్షమును పొందుచున్నారు.

...... ✍🏼 మాస్టర్ ఇ.కె.

🌹 🌹 🌹 🌹 🌹


27 Nov 2021

వివేక చూడామణి - 158 / Viveka Chudamani - 158


🌹. వివేక చూడామణి - 158 / Viveka Chudamani - 158🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -5 🍀

518. ఓ ప్రభూ! నీ యొక్క దయ నన్ను నిద్ర నుండి మేల్కొలిపి నన్ను రక్షించినది. నేను కలల ప్రపంచములో తిరుగాడుతూ, పుట్టుక చావులనే మహారణ్యములో, అహంతో, భ్రమలో రోజురోజుకు లెక్కలేనన్ని బాధలలో చిక్కుకున్నాను.

519. నీకు ఇవే నా నమస్కారములు. నీవు బోధకులలో యువరాజువు. నీకు ఏ పేరు లేదు. నీ యొక్క ఔనత్యము ఎల్లప్పుడు మారనిది. అట్టి నీవు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నావు. నీకు ఇవే నా నమస్కారములు.

520. అర్హుడైన నీ శిష్యుని చూసి, అతడు ఆత్మానందమును పొంది, సత్యాన్ని గ్రహించి, హృదయములో ఆనందముతో ఆవిధముగా సాగిలపడి, అట్టి ఉన్నత ఉపాధ్యాయుడు ఈ విధముగా బోధించుచున్నాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 VIVEKA CHUDAMANI - 158 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 32. I am the one who knows Brahman -5🌻

518. O Master, thou hast out of sheer grace awakened me from sleep and completely saved me, who was wandering, in an interminable dream, in a forest of birth, decay and death created by illusion, being tormented day after day by countless afflictions, and sorely troubled by the tiger of egoism.

519. Salutations to thee, O Prince of Teachers, thou unnamable Greatness, that art ever the same and dost manifest thyself as this universe – thee I salute.

520. Seeing the worthy disciple, who had attained the Bliss of the self, realised the Truth and was glad at heart, thus prostrating himself, that noble, ideal Teacher again addressed the following excellent words:


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


27 Nov 2021

శ్రీ శివ మహా పురాణము - 481

🌹 . శ్రీ శివ మహా పురాణము - 481 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 36

🌻. సప్తర్షుల ఉపదేశము - 3 🌻

ఋషులు ఇట్లనిరి -

దేవదేవా! మహాదేవా! పరమేశ్వరా! మహాప్రభూ! నీ సేవకులమగు మేము చేసిన కార్యమును గురించి చెప్పెదము. మా మాటలను ప్రీతితో వినుము (23). ఓ మహేశ్వరా! మేనా హిమవంతులకు అనేకములగు మంచి మాటలను, ఇతిహాస దృష్టాంతములను బోధించి సత్యమును తెలుసుకొనునట్లు చేసితిమి. సందేహము లేదు (24). పర్వతరాజు పార్వతిని నీకు ఇచ్చినట్లు మాటను ఇచ్చినాడు. దీనికి విరోధము లేదు. నీవు దేవతలతో, గణములతో గూడి వివాహము కొరకు తరలివెళ్లుము (25). ఓ మహాదేవా! ప్రభో! నీవు పార్వతిని వివాహమాడి పుత్రసంతానమును పొందవలసి యున్నది. కావు శీఘ్రముగా హిమవంతుని గృహమునకు బయలుదేరుము (26).

బ్రహ్మ ఇట్లు పలికెను-

లోకాచారములయందు శ్రద్ధగల మహేశ్వరుడు మిక్కిలి సంతసించిన మనస్సు గలవాడై వారి ఆ మాటలను విని నవ్వి ఇట్లు పలికెను (27).

మహేశ్వరుడిట్లు పలికెను-

మహాత్ములారా! నేను వివాహమును గురించి వినలేదు, చూడలేదు. మీరు పూర్వము వివాహ విధానమును నిర్వచించి యున్నారు. ఆ వివరములను నాకు చెప్పుడు (28).

బ్రహ్మ ఇట్లు పలికెను-

మహేశుని శుభకరమగు ఆ లౌకిక వచనము విని వారు నవ్వి ఆ దేవదేవుడగు సదాశివునకు ఇట్లు బదులిడిరి (29).

ఋషులిట్లు పలికిరి -

పరివారముతో గూడిన విష్ణువును వెంటనే ప్రత్యేకముగా ఆహ్వానించుడు. మరియు కుమారులతో గూడిన బ్రహ్మను, ఇంద్రదేవుని ప్రీతి పూర్వకముగా ఆహ్వానించుడు (30). మరియు సర్వ ఋషిగణములను, యక్ష గంధర్వ కిన్నర సిద్ధ విద్యాధరులను, అప్సరసల గణములను విలపించుడు (31). ఓ ప్రభూ! వీరిని ఇతరులను అందరిని ఇచటకు సాదరముగా పిలిపించుడు. వారు నీకార్యమును అంతనూ చక్కబెట్టగలరు. సందేహము వలదు (32).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ సప్తర్షులు ఇట్లు పలికి శివుని యాజ్ఞను బడసి, వారందరు శంకరుని మహిమను కొనియాడుతూ ఆనందముతో తమ ధామకు వెళ్లిరి (33).

శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహితయందు పార్వతీఖండలో సప్తర్షుల ఉపదేశము అనే ముప్పది యారవ అధ్యాయము ముగిసినది (36).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


27 Nov 2021

గీతోపనిషత్తు -282


🌹. గీతోపనిషత్తు -282 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 14-2

🍀 14-2. మహాత్ములు - మహాత్ములు సర్వ కాలము లందు, సర్వ దేశము లందు, సర్వ రూపము లందు, సర్వ నామము లందు దైవమునే దర్శింతురు. అందరి యందలి దైవమునే కీర్తింతురు. జీవులను పొగడుట అను లౌక్యము వారి వద్ద యుండదు. వారి ప్రయత్నము నిత్యయత్నముగ నుండును. అట్టి నిత్యయత్నమున దైవముతో కూడియుండు వారిని యతులందురు. వారి ప్రయత్నము అత్యంత దృఢమై యుండును. వారి దృష్టి ఎల్లప్పుడును ప్రకృతి యందిమిడి యున్న దైవమును దర్శించుట యందే యుండును. తాము నిర్వర్తించు కార్యములు అంతయు దైవమే. 🍀

సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః |
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే || 14

తాత్పర్యము : దైవీ ప్రకృతి నాశ్రయించిన వారిని గూర్చి ముందు శ్లోకమున తెలుపబడినది. వారి లక్షణములు మరికొన్ని ఈ శ్లోకమున దైవము తెలియజేయుచున్నాడు. ముందు శ్లోకమున మహాత్ములు దైవమును భూతము లన్నిటికిని మూలమని, అది అవ్యయమగు తత్త్వమని తెలిసి అన్యము లేని మనసుతో వానిని నిత్యము సేవించు చుందురని తెలిపెను.

వివరణము : మహాత్ముల లక్షణములు లోపించిన వానిని మహాత్ములుగ గుర్తించ నవసరము లేదు. పై లక్షణము లన్నియు దైవీ ప్రకృతి సంబంధితములు. అట్టి లక్షణములు గలవారు సర్వ కాలములందు, సర్వ దేశము లందు, సర్వ రూపము లందు, సర్వ నామము లందు దైవమునే దర్శింతురు. అందరి యందలి దైవమునే కీర్తింతురు. జీవులను పొగడుట అను లౌక్యము వారి వద్ద యుండదు. వారి ప్రయత్నము నిత్యయత్నముగ నుండును.

అట్టి నిత్యయత్నమున దైవముతో కూడి యుండు వారిని యతులందురు. వారి ప్రయత్నము అత్యంత దృఢమై యుండును. వారి దృష్టి ఎల్లప్పుడును ప్రకృతి యందిమిడి యున్న దైవమును దర్శించుట యందే యుండును. అట్టి సాలోక్య ప్రయత్నమున దైవమునకు సామీప్యమున నుందురు.

దైవ సాయుజ్యమందు వసించి నిత్యకృత్యములు జరుపుచు నుందురు. వారికి తల్లి, తండ్రి, దైవము, మిత్రులు, బంధువులు, సంఘము, కుటుంబము, తాము నిర్వర్తించు కార్యములు అంతయు దైవమే. క్రమముగ అన్యము లేక సమస్తము దైవముగనే దర్శన మగుచుండును. అట్టి అనన్య స్థితి యందు పరమానందభరితులై యుందురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


27 Nov 2021

కాలభైరవ స్వరూపం..!! విశిష్టత Kaalabhairava Swarupam..!! Vishistta కాలభైరవ జయంతి శుభాకాంక్షలు - Kala Bhairava Jayanthi Subhakankhalu



🌹. కాలభైరవ స్వరూపం..!! విశిష్టత 🌹

🍀. కాలభైరవ జయంతి శుభాకాంక్షలు - Kala Bhairava Jayanthi Subhakankhalu మిత్రులందరికి 🍀

📚. ప్రసాద్‌ భరధ్వాజ

ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మమెవరని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి “సద్యోదాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అను అయిదు ముఖములు ఉంటాయి. ఈ అయిదు ముఖములతో ఋషుల వంక చూస్తూ అన్నాడు ‘అదేమిటయ్యా బ్రహ్మమెవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును’ అన్నాడు.

అపుడు బ్రహ్మగారు ‘నేనే ఈ లోకముల నన్నిటిని సృష్టించాను నేనే కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింప చేశాను. నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. కాబట్టి నాకన్నా బ్రహ్మమెవరు? నేనే బ్రహ్మమును’ అన్నాడు.

తరువాత పక్కనున్న విష్ణువు ‘బ్రహ్మా, నా అంతవాడిని నేను అంటున్నావు. అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా! బ్రహ్మమును నేను’ అన్నారు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదాలని పిలుద్దాం అని వేదాలని పిలిచారు. అపుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం చేయాలని మొట్టమొదట నారాయణుడు జన్మించాడో ఎవడు చిట్టచివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది.

దాన్ని తీసి పారేసి యజుర్వేదమును పిలిచారు. అసురీశక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింప బడుతున్న వాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది తరువాత సామవేదమును పిలిచి అడిగారు మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో ఎవరు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది.

పిమ్మట అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు. తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. నాలుగు వేదములు అదే చెప్తున్నారు.

ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అపుడు ప్రణవం ఎవడు నిరంతరమూ శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో, అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము’ అని చెప్పింది. ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు.

ఈ మాటలు రుచించక పోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించ వలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారింది. జ్యోతి సాకారం అయింది. సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ నీవు ఎవరు? నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి’ అన్నాడు. బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి.

కాబట్టి ఇపుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. ‘ఏమి నీ ఆజ్ఞ అని మొదటి రూపమును అడిగాడు. అహంకారంతో మాట్లాడుతున్నాడు. అయిదవ తలను గిల్లెయ్యి’ అంది. ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై అయిదవతలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం.

ఇలా జరిగేసరికి బ్రహ్మ నాలుగు తలకాయలు పట్టుకు వెళ్లి అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి ఈశ్వరా, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు. అపుడు శంకరుడు కాల భైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు.

కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఇవాళ్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. నీవు ఎంత గొప్ప వాడవయినా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. అపుడు నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది.

పుట్టేటప్పటికే నీ స్వరూపమును చూసేటప్పటికీ లోకం అంతా గజగజలాడిపోయింది. కాబట్టి నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు. ఎవడు ఈశ్వరుని ధిక్కరించి ఇచట బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు. దీనిని ‘భైరవ యాతన’ అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలి పోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయమునకు వచ్చినపుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసెయ్యి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను ‘అమర్దకుడు’ అని పిలుస్తారు.

ఇక నుంచి నీవు నా దేవాలయములలో క్షేత్ర పాలకుడవయి ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేసెయ్యి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు ‘పాప భక్షకుడు’ అనే పేరును ఇస్తున్నాను. నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్న వాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు’ అని చెప్పాడు.

అందుకే మనను కాశీ క్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్రప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింప చేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవా’ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతా పూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇకనుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తాడు. భైరవ మూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మేడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి. ఇహలోకము నందు ఇప్పటి వరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తాడు.

అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసా దేవి ఆలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ‘ఒకసారి ఒంగోండి’ అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి. ఈవిధంగా ఆ నాడు పరమేశ్వరుడు కాల భైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు. ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వర ఆజ్ఞను ఔదలదాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు.

ఆయన భక్తుల పాలిట కొంగుబంగారం. ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు. కాబట్టి ఆ కాలభైరవుడు, ఆయన స్వరూపం అంత గొప్పది.

కాలభైరవ జయంతి నాడు కాలభైరవ అష్టకం చదివితే మంచిది. అష్ట కాలభైరవుల ఆశీస్సులు మనందరి మీదా సదా నిలచుగాక. 🙏

🌹 🌹 🌹 🌹 🌹


27 Nov 2021

27-NOVEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 27, శనివారం, నవంబర్ 2021  స్థిరవారము 🌹
🍀. కార్తీక మాసం 23వ రోజు 🍀
🌹. కాలభైరవ జయంతి శుభాకాంక్షలు 
కాలభైరవ స్వరూపం..!! విశిష్టత

2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 282 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 481🌹 
4) 🌹 వివేక చూడామణి - 158 / Viveka Chudamani - 158🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -110🌹  
6) 🌹 Osho Daily Meditations - 99🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 158 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 158 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*27, నవంబర్‌ 2021, స్థిరవారము*
*కాలభైరవ జయంతి శుభాకాంక్షలు*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 23వ రోజు 🍀*

*నిషిద్ధములు : ఉసిరి, తులసి*
*దానములు : మంగళ ద్రవ్యాలు*
*పూజించాల్సిన దైవము : అష్టమాతృకలు*
*జపించాల్సిన మంత్రము :*
*ఓం శ్రీమాత్రే నమః , అష్టమాతృ కాయ స్వాహా*
*ఫలితము : మాతృరక్షణం, వశీకరణం*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,  
కార్తీక మాసం
తిథి: కృష్ణ అష్టమి 30:01:00 వరకు 
తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: మఘ 21:44:17 వరకు 
తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: ఇంద్ర 07:36:01 వరకు 
తదుపరి వైధృతి
కరణం: బాలవ 17:52:01 వరకు
వర్జ్యం: 09:11:00 - 10:51:24 
మరియు29:51:20 - 31:28:48 
దుర్ముహూర్తం: 07:57:08 - 08:41:56
రాహు కాలం: 09:15:32 - 10:39:33
గుళిక కాలం: 06:27:31 - 07:51:32
యమ గండం: 13:27:34 - 14:51:34
అభిజిత్ ముహూర్తం: 11:41 - 12:25
అమృత కాలం: 19:13:24 - 20:53:48
సూర్యోదయం: 06:27:31
సూర్యాస్తమయం: 17:39:36
వైదిక సూర్యోదయం: 06:31:22
వైదిక సూర్యాస్తమయం: 17:35:46
చంద్రోదయం: 00:22:23
చంద్రాస్తమయం: 12:35:59
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: సింహం
పద్మ యోగం - ఐశ్వర్య ప్రాప్తి 21:44:17 
వరకు తదుపరి లంబ యోగం - 
చికాకులు, అపశకునం 
పండుగలు : కాలభైరవ జయంతి, 
Kalabhairav Jayanti
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కాలభైరవ స్వరూపం..!! విశిష్టత 🌹*
*🍀. కాలభైరవ జయంతి శుభాకాంక్షలు - Kala Bhairava Jayanthi Subhakankhalu మిత్రులందరికి 🍀*
*📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మమెవరని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి “సద్యోదాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అను అయిదు ముఖములు ఉంటాయి. ఈ అయిదు ముఖములతో ఋషుల వంక చూస్తూ అన్నాడు ‘అదేమిటయ్యా బ్రహ్మమెవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును’ అన్నాడు.*

*అపుడు బ్రహ్మగారు ‘నేనే ఈ లోకముల నన్నిటిని సృష్టించాను నేనే కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింప చేశాను. నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. కాబట్టి నాకన్నా బ్రహ్మమెవరు? నేనే బ్రహ్మమును’ అన్నాడు.*

*తరువాత పక్కనున్న విష్ణువు ‘బ్రహ్మా, నా అంతవాడిని నేను అంటున్నావు. అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా! బ్రహ్మమును నేను’ అన్నారు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదాలని పిలుద్దాం అని వేదాలని పిలిచారు. అపుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం చేయాలని మొట్టమొదట నారాయణుడు జన్మించాడో ఎవడు చిట్టచివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది.*

*దాన్ని తీసి పారేసి యజుర్వేదమును పిలిచారు. అసురీశక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింప బడుతున్న వాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది తరువాత సామవేదమును పిలిచి అడిగారు మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో ఎవరు తనలో తాను రమిస్తూ ఉంటాడో అటువంటి శివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది.*

*పిమ్మట అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు. తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. నాలుగు వేదములు అదే చెప్తున్నారు.*

*ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అపుడు ప్రణవం ఎవడు నిరంతరమూ శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో, అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము’ అని చెప్పింది. ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు.*

*ఈ మాటలు రుచించక పోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించ వలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారింది. జ్యోతి సాకారం అయింది. సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ నీవు ఎవరు? నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి’ అన్నాడు. బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి.*

*కాబట్టి ఇపుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. ‘ఏమి నీ ఆజ్ఞ అని మొదటి రూపమును అడిగాడు. అహంకారంతో మాట్లాడుతున్నాడు. అయిదవ తలను గిల్లెయ్యి’ అంది. ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై అయిదవతలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపం.*

*ఇలా జరిగేసరికి బ్రహ్మ నాలుగు తలకాయలు పట్టుకు వెళ్లి అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి ఈశ్వరా, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు. అపుడు శంకరుడు కాల భైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు.*

*కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. కాబట్టి నిన్ను ఇవాళ్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. నీవు ఎంత గొప్ప వాడవయినా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. అపుడు నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది.*

*పుట్టేటప్పటికే నీ స్వరూపమును చూసేటప్పటికీ లోకం అంతా గజగజలాడిపోయింది. కాబట్టి నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు. ఎవడు ఈశ్వరుని ధిక్కరించి ఇచట బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు. దీనిని ‘భైరవ యాతన’ అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలి పోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయమునకు వచ్చినపుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసెయ్యి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను ‘అమర్దకుడు’ అని పిలుస్తారు.*

*ఇక నుంచి నీవు నా దేవాలయములలో క్షేత్ర పాలకుడవయి ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేసెయ్యి. నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు ‘పాప భక్షకుడు’ అనే పేరును ఇస్తున్నాను. నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్న వాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు’ అని చెప్పాడు.*

*అందుకే మనను కాశీ క్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్రప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింప చేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవా’ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతా పూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇకనుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తాడు. భైరవ మూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మేడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి. ఇహలోకము నందు ఇప్పటి వరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తాడు.*

*అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసా దేవి ఆలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ‘ఒకసారి ఒంగోండి’ అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి. ఈవిధంగా ఆ నాడు పరమేశ్వరుడు కాల భైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు. ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వర ఆజ్ఞను ఔదలదాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు.*

*ఆయన భక్తుల పాలిట కొంగుబంగారం. ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు. కాబట్టి ఆ కాలభైరవుడు, ఆయన స్వరూపం అంత గొప్పది.*

*కాలభైరవ జయంతి నాడు కాలభైరవ అష్టకం చదివితే మంచిది. అష్ట కాలభైరవుల ఆశీస్సులు మనందరి మీదా సదా నిలచుగాక. 🙏*
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -282 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 14-2
 
*🍀 14-2. మహాత్ములు - మహాత్ములు సర్వ కాలము లందు, సర్వ దేశము లందు, సర్వ రూపము లందు, సర్వ నామము లందు దైవమునే దర్శింతురు. అందరి యందలి దైవమునే కీర్తింతురు. జీవులను పొగడుట అను లౌక్యము వారి వద్ద యుండదు. వారి ప్రయత్నము నిత్యయత్నముగ నుండును. అట్టి నిత్యయత్నమున దైవముతో కూడియుండు వారిని యతులందురు. వారి ప్రయత్నము అత్యంత దృఢమై యుండును. వారి దృష్టి ఎల్లప్పుడును ప్రకృతి యందిమిడి యున్న దైవమును దర్శించుట యందే యుండును. తాము నిర్వర్తించు కార్యములు అంతయు దైవమే. 🍀*

*సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః |*
*నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే || 14*

*తాత్పర్యము : దైవీ ప్రకృతి నాశ్రయించిన వారిని గూర్చి ముందు శ్లోకమున తెలుపబడినది. వారి లక్షణములు మరికొన్ని ఈ శ్లోకమున దైవము తెలియజేయుచున్నాడు. ముందు శ్లోకమున మహాత్ములు దైవమును భూతము లన్నిటికిని మూలమని, అది అవ్యయమగు తత్త్వమని తెలిసి అన్యము లేని మనసుతో వానిని నిత్యము సేవించు చుందురని తెలిపెను.*

*వివరణము : మహాత్ముల లక్షణములు లోపించిన వానిని మహాత్ములుగ గుర్తించ నవసరము లేదు. పై లక్షణము లన్నియు దైవీ ప్రకృతి సంబంధితములు. అట్టి లక్షణములు గలవారు సర్వ కాలములందు, సర్వ దేశము లందు, సర్వ రూపము లందు, సర్వ నామము లందు దైవమునే దర్శింతురు. అందరి యందలి దైవమునే కీర్తింతురు. జీవులను పొగడుట అను లౌక్యము వారి వద్ద యుండదు. వారి ప్రయత్నము నిత్యయత్నముగ నుండును.*

*అట్టి నిత్యయత్నమున దైవముతో కూడి యుండు వారిని యతులందురు. వారి ప్రయత్నము అత్యంత దృఢమై యుండును. వారి దృష్టి ఎల్లప్పుడును ప్రకృతి యందిమిడి యున్న దైవమును దర్శించుట యందే యుండును. అట్టి సాలోక్య ప్రయత్నమున దైవమునకు సామీప్యమున నుందురు.*

*దైవ సాయుజ్యమందు వసించి నిత్యకృత్యములు జరుపుచు నుందురు. వారికి తల్లి, తండ్రి, దైవము, మిత్రులు, బంధువులు, సంఘము, కుటుంబము, తాము నిర్వర్తించు కార్యములు అంతయు దైవమే. క్రమముగ అన్యము లేక సమస్తము దైవముగనే దర్శన మగుచుండును. అట్టి అనన్య స్థితి యందు పరమానందభరితులై యుందురు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 481 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 36

*🌻. సప్తర్షుల ఉపదేశము - 3 🌻*

ఋషులు ఇట్లనిరి -

దేవదేవా! మహాదేవా! పరమేశ్వరా! మహాప్రభూ! నీ సేవకులమగు మేము చేసిన కార్యమును గురించి చెప్పెదము. మా మాటలను ప్రీతితో వినుము (23). ఓ మహేశ్వరా! మేనా హిమవంతులకు అనేకములగు మంచి మాటలను, ఇతిహాస దృష్టాంతములను బోధించి సత్యమును తెలుసుకొనునట్లు చేసితిమి. సందేహము లేదు (24). పర్వతరాజు పార్వతిని నీకు ఇచ్చినట్లు మాటను ఇచ్చినాడు. దీనికి విరోధము లేదు. నీవు దేవతలతో, గణములతో గూడి వివాహము కొరకు తరలివెళ్లుము (25). ఓ మహాదేవా! ప్రభో! నీవు పార్వతిని వివాహమాడి పుత్రసంతానమును పొందవలసి యున్నది. కావు శీఘ్రముగా హిమవంతుని గృహమునకు బయలుదేరుము (26).

బ్రహ్మ ఇట్లు పలికెను-

లోకాచారములయందు శ్రద్ధగల మహేశ్వరుడు మిక్కిలి సంతసించిన మనస్సు గలవాడై వారి ఆ మాటలను విని నవ్వి ఇట్లు పలికెను (27).

మహేశ్వరుడిట్లు పలికెను-

మహాత్ములారా! నేను వివాహమును గురించి వినలేదు, చూడలేదు. మీరు పూర్వము వివాహ విధానమును నిర్వచించి యున్నారు. ఆ వివరములను నాకు చెప్పుడు (28).

బ్రహ్మ ఇట్లు పలికెను-

మహేశుని శుభకరమగు ఆ లౌకిక వచనము విని వారు నవ్వి ఆ దేవదేవుడగు సదాశివునకు ఇట్లు బదులిడిరి (29).

ఋషులిట్లు పలికిరి -

పరివారముతో గూడిన విష్ణువును వెంటనే ప్రత్యేకముగా ఆహ్వానించుడు. మరియు కుమారులతో గూడిన బ్రహ్మను, ఇంద్రదేవుని ప్రీతి పూర్వకముగా ఆహ్వానించుడు (30). మరియు సర్వ ఋషిగణములను, యక్ష గంధర్వ కిన్నర సిద్ధ విద్యాధరులను, అప్సరసల గణములను విలపించుడు (31). ఓ ప్రభూ! వీరిని ఇతరులను అందరిని ఇచటకు సాదరముగా పిలిపించుడు. వారు నీకార్యమును అంతనూ చక్కబెట్టగలరు. సందేహము వలదు (32).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ సప్తర్షులు ఇట్లు పలికి శివుని యాజ్ఞను బడసి, వారందరు శంకరుని మహిమను కొనియాడుతూ ఆనందముతో తమ ధామకు వెళ్లిరి (33).

శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహితయందు పార్వతీఖండలో సప్తర్షుల ఉపదేశము అనే ముప్పది యారవ అధ్యాయము ముగిసినది (36).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 158 / Viveka Chudamani - 158🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -5 🍀*

518. ఓ ప్రభూ! నీ యొక్క దయ నన్ను నిద్ర నుండి మేల్కొలిపి నన్ను రక్షించినది. నేను కలల ప్రపంచములో తిరుగాడుతూ, పుట్టుక చావులనే మహారణ్యములో, అహంతో, భ్రమలో రోజురోజుకు లెక్కలేనన్ని బాధలలో చిక్కుకున్నాను. 

519. నీకు ఇవే నా నమస్కారములు. నీవు బోధకులలో యువరాజువు. నీకు ఏ పేరు లేదు. నీ యొక్క ఔనత్యము ఎల్లప్పుడు మారనిది. అట్టి నీవు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నావు. నీకు ఇవే నా నమస్కారములు. 

520. అర్హుడైన నీ శిష్యుని చూసి, అతడు ఆత్మానందమును పొంది, సత్యాన్ని గ్రహించి, హృదయములో ఆనందముతో ఆవిధముగా సాగిలపడి, అట్టి ఉన్నత ఉపాధ్యాయుడు ఈ విధముగా బోధించుచున్నాడు. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 158 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 32. I am the one who knows Brahman -5🌻*

518. O Master, thou hast out of sheer grace awakened me from sleep and completely saved me, who was wandering, in an interminable dream, in a forest of birth, decay and death created by illusion, being tormented day after day by countless afflictions, and sorely troubled by the tiger of egoism.

519. Salutations to thee, O Prince of Teachers, thou unnamable Greatness, that art ever the same and dost manifest thyself as this universe – thee I salute.

520. Seeing the worthy disciple, who had attained the Bliss of the self, realised the Truth and was glad at heart, thus prostrating himself, that noble, ideal Teacher again addressed the following excellent words:

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 158 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 32. I am the one who knows Brahman -5🌻*

518. O Master, thou hast out of sheer grace awakened me from sleep and completely saved me, who was wandering, in an interminable dream, in a forest of birth, decay and death created by illusion, being tormented day after day by countless afflictions, and sorely troubled by the tiger of egoism.

519. Salutations to thee, O Prince of Teachers, thou unnamable Greatness, that art ever the same and dost manifest thyself as this universe – thee I salute.

520. Seeing the worthy disciple, who had attained the Bliss of the self, realised the Truth and was glad at heart, thus prostrating himself, that noble, ideal Teacher again addressed the following excellent words:

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 110 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. భగవంతుని తత్త్వము అంతు పట్టనది 🌻*

*భగవంతుడు జీవుడుగా దేహములలోనికి దిగి వచ్చునపుడు , దేహములందలి యింద్రియములను సృష్టించి కాపాడు దేవతలకు గూడ వాని తత్త్వము అంతుపట్టదు. కనుకనే వేదములలో " కంటి నుండి ఎవడు చూచునో, కన్ను ఎవరిని చూడలేదో, చెవి నుండి ఎవడు వినునో, చెవి ఎవరిని వినలేదో, మనస్సు నుండి ఎవడూహించునో, మనస్సు ఎవనిని గూర్చి ఊహింపలేదో.....". అతడే భగవంతుడని వర్ణింపబడినది. ఆతడు ఇంద్రియముల నడుమ జీవుడై దిగివచ్చి క్రీడించుచు , ఇంద్రియములచే కూడ తెలియబడడు‌.*

*వేడుకతో గోపాలవరులతో గూడి గోవులను, దూడలను గాచెను. అపుడు గూడ నందలి గోపాల శ్రేష్ఠులకైనను తన సమగ్రమైన నిజస్వరూపమును చూపలేదు. (గోపాలవరులు అను మాటకు ఇంద్రియములను రక్షించు దేవతలని కూడ నర్థము.)*

*భగవంతునికి పూజాదికముల రూపమున తమకున్నది సమర్పించుట మాని తమ్ము తాము సమర్పణ చేసుకొనువారికి సంసార తాపములను అతడే నివారించును. అట్టివారి కథలను ఆతని కథలుగా అనుభవించు వారు నిజమైన మోక్షమును పొందుచున్నారు.*

...... ✍🏼 *మాస్టర్ ఇ.కె.*
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 99 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 99. LOGIC 🍀*

*🕉 The modern mind has become too rational; it is caught in the net if logic. Much repression has happened because logic is a dictatorial force, totalitarian. Once logic controls you, it kills many things. 🕉*
 
*Logic is like Adolf Hitler or Joseph Stalin; it does not allow the opposite to exist, and emotions are opposite. Love, meditation, is opposite to logic. Religion is opposite to reason. So reason simply massacres them, kills them, uproots them. Then suddenly you see that your life is meaningless-because all meaning is irrational.*

*So first you listen to reason, and then you kill all that was going to give meaning to your life. When you have killed and you are feeling victorious, suddenly you feel empty. Now nothing is left in your hand, only logic. And what can you do with logic? You cannot eat it. You cannot drink it. You cannot love it. You cannot live it. It is just rubbish. If you tend to be intellectual, it will be difficult. Life is simple, nonintellectual.*

*The whole problem of humanity is metaphysics. Life is as simple as a rose -there's nothing complicated about it--and yet it is mysterious. Although there is nothing complicated about it, we are not able to comprehend it through the intellect. You can fall in love with a rose, you can smell it, you can touch it, you can feel it, you can even be it, but if you start dissecting it, you will only have something dead in your hands.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 158 / Sri Lalita Sahasranamavali - Meaning - 158 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 158. ఛంద:సారా, శాస్త్రసారా, మంత్రసారా, తలోదరీ ।*
*ఉదారకీర్తి, రుద్దామవైభవా, వర్ణరూపిణీ ॥ 158 ॥ 🍀*

🍀 841. ఛంద:సారా : 
వేదముల సారము 

🍀 842. శాస్త్రసారా : 
వేదాంతాది సమస్త శాస్త్రముల సారము 

🍀 843. మంత్రసారా : 
మంత్రముల యొక్క సారము 

🍀 844. తలోదరీ : 
పలుచని ఉదరము కలిగినది 

🍀 845. ఉదారకీర్తి : 
గొప్ప కీర్తి కలిగినది 

🍀 846. రుద్దమవైభవా : 
అధికమైన వైభవము కలిగినది 

🍀 847. వర్ణరూపిణీ : 
అక్షరరూపిణి  

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 158 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 158. Chandasara shastrasara mantrasara talodari*
*Udarakirti rudhamavaibhava varnarupini ॥ 158 ॥ 🌻*

🌻 841 ) Chanda sara -   
She who is the meaning of Vedas

🌻 842 ) Sasthra sara -   
She who is the meaning of Puranas(epics)

🌻 843 ) Manthra sara -   
She who is the meaning of Manthras ( chants)

🌻 844 ) Thalodharee -   
She who has a small belly

🌻 845 ) Udara keerthi -  
 She who has wide and tall fame

🌻 846 ) Uddhhama vaibhava - She who has immeasurable fame

🌻 847 ) Varna roopini -   
She who is personification of alphabets

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranam
 #PrasadBhardwaj 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://mymandir.page.link/wdh7G
https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹