శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 343-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 343 -2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 343-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 343 -2🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।
క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀

🌻 343-2. 'క్షేత్రక్షేత్రజ్ఞ పాలినీ' 🌻

క్షేత్రమున వసించు క్షేత్రజ్ఞునకు క్షేత్రము తెలియవలెను కదా! గృహమున వసించువారికి గృహమును గూర్చి తెలియవలెను. అట్లే రాష్ట్ర పాలకులు, దేశపాలకులు, లోకపాలకులు వారి క్షేత్రముల పొలిమేరల వర కంతయు తెలియవలెను. అపుడే క్షేత్రజ్ఞు డనబడును. సృష్టి మొత్తమొక క్షేత్రమని చెప్పబడినది. కురుక్షేత్రముగ వివరింపబడినది. అది వాసుదేవుని శరీరముగ గూడ తెలుపబడినది.

వాసుదేవుడనగా సృష్టి రూపమే తన శరీరముగ వసించియున్న శ్రీమాత వ్యాపినీ ప్రజ్ఞ. అంతయూ వ్యాపించి సృష్టి మొత్తము యేమరుపాటు లేక తెలిసి యుండును. విశ్వమయుడుగ వాసుదేవు డుండును. అతడే శ్రీమాత క్షేత్రజ్ఞ స్వరూపము. క్షేత్రము ఆమెయే. క్షేత్రజ్ఞు డగు వాసుదేవుని, క్షేత్ర మగు సృష్టిని రెంటినీ పలిపాలించునది శ్రీమాత. అట్లే మన శరీరము క్షేత్రము. అందు వసించు మనము క్షేత్రజ్ఞులై యుండవలెను. అట్లుండక పోవటమువలన శరీర బంధము కలుగును. క్షేత్ర జ్ఞానము సంపాదించుకొని ఆ జ్ఞానమున కనుగుణముగ వర్తించినచో క్షేత్రజ్ఞుల మగుదుము. అట్టి జ్ఞానము కలుగవలె నన్నచో శ్రీమాత అనుగ్రహము ప్రధానము. ఆమె అనుగ్రహించిననే ఏ జ్ఞానమైననూ కలుగును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 343-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini
Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻

🌻 343-2. Kṣetra-kṣetrajña-pālinī क्षेत्र-क्षेत्रज्ञ-पालिनी (343) 🌻


The protector of both kṣetra and Kṣetrajña. She protects both viz. the gross body and the soul. Kṣetrajña-pālinī could mean the protector of the soul or the protector of Śiva. Being Śiva’s wife She has to necessarily protect Him. Being Śrī Mātā or the divine Mother, She has to protect Her children. That is why Śiva is called as the universal father and Śaktī as the universal mother. (Poet Kālidāsa says in his Raghuvaṃśa “jagataḥ pitarau vande pārvati parameśvarau जगतः पितरौ वन्दे पार्वति परमेश्वरौ ।“)


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


28 Jan 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 141


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 141 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. అంతర్యామి స్మరణ 🌻


ఈ బ్రహ్మసృష్టి యందు నారాయణుని అడుగుజాడలు గోచరించుట ప్రారంభమైనపుడు ఆ పాదపద్మములే తన్నాకర్షించును. ముక్కునకు పుష్పగంధమెట్లు ఆకర్షకమో, అదే విధముగా ఆకర్షించును. అంతర్యామి స్మరణ యందు మనస్సు నిలబడినచో తన దేహము దాని యందున్నదే కనుక అది వేరుగా గుర్తుండదు.

భార్య, బిడ్డలు, మిత్రులు, బంధువులు మున్నగు వారి దేహములును , అదివరకు తనవారనుకొని వ్యామోహపడుచున్న పరివారమెల్లరు నారాయణుని రూపములుగా తెలియబడుదురు. వారి ముఖములతని ముఖములుగ తెలియబడును కనుక అతడు విశ్వతోముఖుడై దర్శనమిచ్చును.

✍🏼 మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


28 Jan 2022

శ్రీ శివ మహా పురాణము - 511

🌹 . శ్రీ శివ మహా పురాణము - 511 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 43

🌻. శివుని అద్భుత లీల - 3 🌻


ఇంతలో అంతకు రెట్టింపు కాంతి గలవాడు, దేవతలందరిలో శ్రేష్ఠుడు, అనేక దివ్యప్రభలు గలవాడు, దేవతలకు ప్రభువు అగు ఇంద్రుడు వచ్చెను (25). ఆ మేనక ఆతనిని చూచి ఈతడే శంకరుడని పలికెను. అపుడు నీవు 'ఇతడు దేవతలకు అధిపతి యగు ఇంద్రుడు; రుద్రుడు కాడు' అని చెప్పితివి (26). ఇంతలో అంతకు రెట్టింపుశోభను కలిగియున్న చంద్రుడు వచ్చెను. ఆమె ఆతనిని చూచి ఈతడు రుద్రుడని పలుకుగా, నీవామెతో కాదని చెప్పితివి (27). అంతకు రెట్టింపు శోభ గల సూర్యుడు ఇంతలో ముందుకు వచ్చెను. ఆతనిని చూచి ఆమె శివుడీతడే అని పలుకగా, నీవామెతో కాదని చెప్పితివి (28).

ఇంతలో అచటికి తేజోరాశులగు భృగువు మొదలైన మునిశ్రేష్టులు తమ శిష్యగణములతో గూడి విచ్చేసిరి (29). వారి మధ్యలో నున్న బృహస్పతిని చూచి ఆ మేనక 'పార్వతీ పతి యగు రుద్రుడీతడే' అని పలుకగా, కాదని నీవు చెప్పితివి (30). ఇంతలో అచటకు గొప్ప తేజోరాశి, ఋషిశ్రేష్ఠులచే కుమారులచే స్తుతింపబడు వాడు, సాక్షాత్తుగా మూర్తీభవించిన ధర్మము వలె నున్న బ్రహ్మా విచ్చేసెను (31). ఓ మునీ! ఆయనను చూచి అపుడు మేన మహానందమును పొంది 'గిరిజాపతి యగు శివుడితడే' అని పలుకగా, నీవామెతో కాదని చెప్పితివి (32).

ఇంతలో అచటకు సర్వశోభలతో కూడిన వాడు, మేఘమువలె నీలవర్ణము గలవాడు, నాల్గు చేతులవాడు (33), కోటి మన్మథుల లావణ్యము గలవాడు, సత్త్వగుణప్రధానుడు, గరుడుడు వాహనముగా గలవాడు (34), శంఖము మొదలగు చిహ్నముతో కూడినవాడు, లక్ష్మీపతి, ఇంద్రియ గోచరము గాని ప్రకాశము గలవాడు నగు శ్రీవిష్ణుదేవుడు విచ్చేసెను (35). ఆయనను చూచి విస్మయము నిండిన కన్నులతో ఆ మేన మహానందమును పొంది 'పార్వతీపతి యగు శివుడు నిశ్చయముగా నీతడే, సందియము లేదు' అని పలికెను (36).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


28 Jan 2022

గీతోపనిషత్తు -313


🌹. గీతోపనిషత్తు -313 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 22 -2 📚

🍀 22-2. అభియుక్తుడు - అంతయు దైవ స్వరూపమే అనెడి భావన మన యందు స్థిరపడినచో అంతటిని దైవముగ చూచుట వీలుపడును. అనన్యచింతన అనగా ఎప్పుడునూ దైవమునే చింతించుట లేక భావించుట. ఇది నిత్య జీవన సాధన. దీని వలన నిత్య జీవన యోగము లభించును. దీని యందు ఏమి చూచినను, దేనిని చూచినను, ఎవరిని చూచినను ఆ కనపడు చున్నది ఈశ్వరుడే అను భావన కలుగవలెను. ఇతరములుగ గోచరించినదంతయు ఈశ్వరుడే అను భావన సిద్ధించవలెను 🍀

22. అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహా మ్యహమ్ ||

తాత్పర్యము : అనన్యచింతనము, పరిఉపాసనము, నిత్య అభియుక్తత ఏ జనులైతే నిర్వర్తింతురో అట్టివారి యోగ క్షేమము లను నేను వహించుచున్నాను.

వివరణము : అనన్యచింతన అనగా ఎప్పుడునూ దైవమునే చింతించుట లేక భావించుట. కనబడుచున్న దంతయు దైవమే. వినబడుచున్న దంతయు దైవమే. ఇంద్రియముల ద్వారా గ్రహించున దంతయు నిజమునకు దైవమే. సమస్త సృష్టి యంతయు తానే నిండియున్నానని ముందు శ్లోకములలో దైవము తెలియపరిచి యున్నాడు.

కనుక అంతయు దైవ స్వరూపమే అనెడి భావన మన యందు స్థిరపడినచో అంతటిని దైవముగ చూచుట వీలుపడును. ఇది నిత్య జీవన సాధన. దీనివలన నిత్య జీవన యోగము లభించును. భార్యను భర్త చూచినపుడు భార్య ఈశ్వర స్వరూపమే. యథార్ధమదియే. కాని భార్య గుర్తువచ్చునా? ఈశ్వరుడు గుర్తు వచ్చునా? ఇక్కడే సాధకుని సాధన తేలిపోవును. అట్లే ఏమి చూచినను, దేనిని చూచినను, ఎవరిని చూచినను ఆ కనపడు చున్నది ఈశ్వరుడే అను భావన కలుగవలెను. ఇతరములుగ గోచరించినదంతయు ఈశ్వరుడే అను భావన సిద్ధించవలెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


28 Jan 2022

28-JANUARY-2022 శుక్రవారం MESSAGES షట్ తిల ఏకాదశి

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 28, శుక్రవారం, జనవరి 2022 భృగు వాసరే 🌹 
🌹. గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 22-2 - 313 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 511🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -141🌹  
5) 🌹 Osho Daily Meditations - 130🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 343-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 343-2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*బృగు వాసరే, 28, జనవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ మహాలక్ష్మి స్తోత్రం - 7 🍀*

*13. తావద్విరాజతే రూపం తావచ్ఛీలం విరాజతే |*
*తావద్గుణా నరాణాం చ యావల్లక్ష్మీః ప్రసీదతి 13*

*14. లక్ష్మిత్వయాలంకృతమానవా యే పాపైర్విముక్తా నృపలోకమాన్యాః |*
*గుణైర్విహీనా గుణినో భవంతి దుశ్శీలినః శీలవతాం వరిష్ఠః*

🌻 🌻 🌻 🌻 🌻

*పండుగలు మరియు పర్వదినాలు :*
*షట్ తిలా ఏకాదశి, Shat Tila Ekadashi*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: కృష్ణ ఏకాదశి 23:37:38 వరకు
తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: అనూరాధ 07:11:56
వరకు తదుపరి జ్యేష్ఠ
సూర్యోదయం: 06:48:49
సూర్యాస్తమయం: 18:09:09
వైదిక సూర్యోదయం: 06:52:34
వైదిక సూర్యాస్తమయం: 18:05:24
చంద్రోదయం: 02:42:59
చంద్రాస్తమయం: 14:07:17
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: వృశ్చికం
యోగం: ధృవ 21:41:54 వరకు
తదుపరి వ్యాఘత
కరణం: బవ 12:56:38 వరకు
వర్జ్యం: 12:18:18 - 13:46:06
దుర్ముహూర్తం: 09:04:53 - 09:50:14
మరియు 12:51:40 - 13:37:01
రాహు కాలం: 11:03:56 - 12:28:59
గుళిక కాలం: 08:13:51 - 09:38:54
యమ గండం: 15:19:04 - 16:44:07 
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:50
అమృత కాలం: 21:05:06 - 22:32:54
రాక్షస యోగం - మిత్ర కలహం
07:11:56 వరకు తదుపరి చర
యోగం - దుర్వార్త శ్రవణం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PANCHANGUM
#DAILYCalender
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -313 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 22 -2 📚*
 
*🍀 22-2. అభియుక్తుడు - అంతయు దైవ స్వరూపమే అనెడి భావన మన యందు స్థిరపడినచో అంతటిని దైవముగ చూచుట వీలుపడును. అనన్యచింతన అనగా ఎప్పుడునూ దైవమునే చింతించుట లేక భావించుట. ఇది నిత్య జీవన సాధన. దీని వలన నిత్య జీవన యోగము లభించును. దీని యందు ఏమి చూచినను, దేనిని చూచినను, ఎవరిని చూచినను ఆ కనపడు చున్నది ఈశ్వరుడే అను భావన కలుగవలెను. ఇతరములుగ గోచరించినదంతయు ఈశ్వరుడే అను భావన సిద్ధించవలెను 🍀*

*22. అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |*
*తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహా మ్యహమ్ ||*

*తాత్పర్యము : అనన్యచింతనము, పరిఉపాసనము, నిత్య అభియుక్తత ఏ జనులైతే నిర్వర్తింతురో అట్టివారి యోగ క్షేమము లను నేను వహించుచున్నాను.*

*వివరణము : అనన్యచింతన అనగా ఎప్పుడునూ దైవమునే చింతించుట లేక భావించుట. కనబడుచున్న దంతయు దైవమే. వినబడుచున్న దంతయు దైవమే. ఇంద్రియముల ద్వారా గ్రహించున దంతయు నిజమునకు దైవమే. సమస్త సృష్టి యంతయు తానే నిండియున్నానని ముందు శ్లోకములలో దైవము తెలియపరిచి యున్నాడు.*

*కనుక అంతయు దైవ స్వరూపమే అనెడి భావన మన యందు స్థిరపడినచో అంతటిని దైవముగ చూచుట వీలుపడును. ఇది నిత్య జీవన సాధన. దీనివలన నిత్య జీవన యోగము లభించును. భార్యను భర్త చూచినపుడు భార్య ఈశ్వర స్వరూపమే. యథార్ధమదియే. కాని భార్య గుర్తువచ్చునా? ఈశ్వరుడు గుర్తు వచ్చునా? ఇక్కడే సాధకుని సాధన తేలిపోవును. అట్లే ఏమి చూచినను, దేనిని చూచినను, ఎవరిని చూచినను ఆ కనపడు చున్నది ఈశ్వరుడే అను భావన కలుగవలెను. ఇతరములుగ గోచరించినదంతయు ఈశ్వరుడే అను భావన సిద్ధించవలెను.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 511 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 43

*🌻. శివుని అద్భుత లీల - 3 🌻*

ఇంతలో అంతకు రెట్టింపు కాంతి గలవాడు, దేవతలందరిలో శ్రేష్ఠుడు, అనేక దివ్యప్రభలు గలవాడు, దేవతలకు ప్రభువు అగు ఇంద్రుడు వచ్చెను (25). ఆ మేనక ఆతనిని చూచి ఈతడే శంకరుడని పలికెను. అపుడు నీవు 'ఇతడు దేవతలకు అధిపతి యగు ఇంద్రుడు; రుద్రుడు కాడు' అని చెప్పితివి (26). ఇంతలో అంతకు రెట్టింపుశోభను కలిగియున్న చంద్రుడు వచ్చెను. ఆమె ఆతనిని చూచి ఈతడు రుద్రుడని పలుకుగా, నీవామెతో కాదని చెప్పితివి (27). అంతకు రెట్టింపు శోభ గల సూర్యుడు ఇంతలో ముందుకు వచ్చెను. ఆతనిని చూచి ఆమె శివుడీతడే అని పలుకగా, నీవామెతో కాదని చెప్పితివి (28).

ఇంతలో అచటికి తేజోరాశులగు భృగువు మొదలైన మునిశ్రేష్టులు తమ శిష్యగణములతో గూడి విచ్చేసిరి (29). వారి మధ్యలో నున్న బృహస్పతిని చూచి ఆ మేనక 'పార్వతీ పతి యగు రుద్రుడీతడే' అని పలుకగా, కాదని నీవు చెప్పితివి (30). ఇంతలో అచటకు గొప్ప తేజోరాశి, ఋషిశ్రేష్ఠులచే కుమారులచే స్తుతింపబడు వాడు, సాక్షాత్తుగా మూర్తీభవించిన ధర్మము వలె నున్న బ్రహ్మా విచ్చేసెను (31). ఓ మునీ! ఆయనను చూచి అపుడు మేన మహానందమును పొంది 'గిరిజాపతి యగు శివుడితడే' అని పలుకగా, నీవామెతో కాదని చెప్పితివి (32).

ఇంతలో అచటకు సర్వశోభలతో కూడిన వాడు, మేఘమువలె నీలవర్ణము గలవాడు, నాల్గు చేతులవాడు (33), కోటి మన్మథుల లావణ్యము గలవాడు, సత్త్వగుణప్రధానుడు, గరుడుడు వాహనముగా గలవాడు (34), శంఖము మొదలగు చిహ్నముతో కూడినవాడు, లక్ష్మీపతి, ఇంద్రియ గోచరము గాని ప్రకాశము గలవాడు నగు శ్రీవిష్ణుదేవుడు విచ్చేసెను (35). ఆయనను చూచి విస్మయము నిండిన కన్నులతో ఆ మేన మహానందమును పొంది 'పార్వతీపతి యగు శివుడు నిశ్చయముగా నీతడే, సందియము లేదు' అని పలికెను (36).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 141 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. అంతర్యామి స్మరణ 🌻*

*ఈ బ్రహ్మసృష్టి యందు నారాయణుని అడుగుజాడలు గోచరించుట ప్రారంభమైనపుడు ఆ పాదపద్మములే తన్నాకర్షించును. ముక్కునకు పుష్పగంధమెట్లు ఆకర్షకమో, అదే విధముగా ఆకర్షించును. అంతర్యామి స్మరణ యందు మనస్సు నిలబడినచో తన దేహము దాని యందున్నదే కనుక అది వేరుగా గుర్తుండదు.*

*భార్య, బిడ్డలు, మిత్రులు, బంధువులు మున్నగు వారి దేహములును , అదివరకు తనవారనుకొని వ్యామోహపడుచున్న పరివారమెల్లరు నారాయణుని రూపములుగా తెలియబడుదురు. వారి ముఖములతని ముఖములుగ తెలియబడును కనుక అతడు విశ్వతోముఖుడై దర్శనమిచ్చును.*

✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 130 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 130. INTERPRETATION 🍀*

*🕉 Thinking is nothing but a habit if interpreting. When thinking disappears the lake of the mind is silent, calm, and quiet. Then there are no more waves, no more ripples-nothing is distorted, the moon is reflected perfectly. 🕉*
 
*Thinking is like ripples in a lake, and because of the ripples, the reflection cannot be true; the moon is reflected, but the ripples distort it. God is reflected in everybody, we mirror God, but our mind is so full of thoughts, waverings, clouds, that whatever we come to see is no longer the same; it is not that which is. The mind has imposed its own thoughts on it, it has interpreted it, and all interpretation is a distortion. Reality needs no interpretation; it needs only reflection.*

*There is no point in interpreting; the interpreter goes on missing the point. If you see a rose, it is there: there is no need to interpret it, there is no need to dissect it, there is no need to know about its meaning. It is its meaning. It is not a metaphor; it does not stand for something else. It is simply there! It is reality, it is not a symbol. A symbol needs to be interpreted, a dream needs to be interpreted. So psychoanalysis is right, because it interprets dreams, but philosophers are not right, because they interpret reality. A dream is symbolic, it stands for something else. An interpretation may be helpful to find out what it stands for. But a rose is a rose; it stands only for itself. It is self-evident.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 343-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 343 -2🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।*
*క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀*

*🌻 343-2. 'క్షేత్రక్షేత్రజ్ఞ పాలినీ' 🌻* 

*క్షేత్రమున వసించు క్షేత్రజ్ఞునకు క్షేత్రము తెలియవలెను కదా! గృహమున వసించువారికి గృహమును గూర్చి తెలియవలెను. అట్లే రాష్ట్ర పాలకులు, దేశపాలకులు, లోకపాలకులు వారి క్షేత్రముల పొలిమేరల వర కంతయు తెలియవలెను. అపుడే క్షేత్రజ్ఞు డనబడును. సృష్టి మొత్తమొక క్షేత్రమని చెప్పబడినది. కురుక్షేత్రముగ వివరింపబడినది. అది వాసుదేవుని శరీరముగ గూడ తెలుపబడినది.*

*వాసుదేవుడనగా సృష్టి రూపమే తన శరీరముగ వసించియున్న శ్రీమాత వ్యాపినీ ప్రజ్ఞ. అంతయూ వ్యాపించి సృష్టి మొత్తము యేమరుపాటు లేక తెలిసి యుండును. విశ్వమయుడుగ వాసుదేవు డుండును. అతడే శ్రీమాత క్షేత్రజ్ఞ స్వరూపము. క్షేత్రము ఆమెయే. క్షేత్రజ్ఞు డగు వాసుదేవుని, క్షేత్ర మగు సృష్టిని రెంటినీ పలిపాలించునది శ్రీమాత. అట్లే మన శరీరము క్షేత్రము. అందు వసించు మనము క్షేత్రజ్ఞులై యుండవలెను. అట్లుండక పోవటమువలన శరీర బంధము కలుగును. క్షేత్ర జ్ఞానము సంపాదించుకొని ఆ జ్ఞానమున కనుగుణముగ వర్తించినచో క్షేత్రజ్ఞుల మగుదుము. అట్టి జ్ఞానము కలుగవలె నన్నచో శ్రీమాత అనుగ్రహము ప్రధానము. ఆమె అనుగ్రహించిననే ఏ జ్ఞానమైననూ కలుగును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 343-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini*
*Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻*

*🌻 343-2. Kṣetra-kṣetrajña-pālinī क्षेत्र-क्षेत्रज्ञ-पालिनी (343) 🌻*

*The protector of both kṣetra and Kṣetrajña. She protects both viz. the gross body and the soul. Kṣetrajña-pālinī could mean the protector of the soul or the protector of Śiva. Being Śiva’s wife She has to necessarily protect Him. Being Śrī Mātā or the divine Mother, She has to protect Her children. That is why Śiva is called as the universal father and Śaktī as the universal mother. (Poet Kālidāsa says in his Raghuvaṃśa “jagataḥ pitarau vande pārvati parameśvarau जगतः पितरौ वन्दे पार्वति परमेश्वरौ ।“)*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹