4-July-2020 messages


1) 🌹 శ్రీమద్భగవద్గీత - 417 / Bhagavad-Gita - 417 🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 205 / Sripada Srivallabha Charithamrutham - 205 🌹
3) 🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 69 🌹
4) 🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 48 / Dasarathi Satakam - 48 🌹
5) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 108 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 25 🌹 
7) 🌹. పంచకోశములు - మనోమయకోశము 🌹
8) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 85 🌹 
9) 🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 56 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 56 🌹 
10)  🌹. సౌందర్య లహరి - 32 / Soundarya Lahari - 32 🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 331 / Bhagavad-Gita - 331 🌹
12) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 162 🌹
13) 🌹. VEDA UPANISHAD SUKTHAM - 49 🌹
14)  🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 34 🌹
15) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 39 🌹
16) 🌹 Seeds Of Consciousness - 114 🌹
17)  🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 24 / Sri Lalita Sahasranamavali - Meaning - 24 🌹
18) 🌹. మనోశక్తి - Mind Power - 52 🌹
19) 🌹. సాయి తత్వం - మానవత్వం - 44 / Sai Philosophy is Humanity - 44 🌹
20)

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



🌹. శ్రీమద్భగవద్గీత - 417 / Bhagavad-Gita - 417 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 25 🌴

25. దంష్ట్రాకరాలాని చ తే ముఖాని
దృష్ట్వైవ కాలానలసన్నిభాని |
దిశో న జానే న లభే చ శర్మ
ప్రసీద దేవేశ జగాన్నివాస ||

🌷. తాత్పర్యం : 
ఓ దేవదేవా! ప్రపంచశరణ్యా! దయచే నా యెడ ప్రసన్నుడవగుము. నీ మండుచున్న మృత్యువును బోలిన ముఖములను మరియు భయంకరములైన దంతములను గాంచి సమత్వమును నిలుపుకొనలేక సర్వవిధముల నేను భ్రాంతుడనైతిని.

🌷. భాష్యము : 

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 417 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 25 🌴

25. daṁṣṭrā-karālāni ca te mukhāni
dṛṣṭvaiva kālānala-sannibhāni
diśo na jāne na labhe ca śarma
prasīda deveśa jagan-nivāsa

🌷 Translation : 
O Lord of lords, O refuge of the worlds, please be gracious to me. I cannot keep my balance seeing thus Your blazing deathlike faces and awful teeth. In all directions I am bewildered.

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 205 / Sripada Srivallabha Charithamrutham - 205 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 35

🌻. దుష్ట శిక్షణ -శిష్ట రక్షణ (శ్రీపాదులకు 12 ఏళ్ళు) (ఉగ్రతారాదేవి) 🌻

🌻. తారా ఉపాసకుడు 🌻

మేము తిరిగి మా ప్రయాణం కొనసాగించాము. మార్గ మధ్యంలో ఒక ఆశ్రమం బయట ఇద్దరు శిష్యులు నిలుచొని శంకరభట్టు, ధర్మగుప్తులు మీరేనా? అని ప్రశ్నించారు. మేము ఔనని చెప్పడంతో మమ్మల్ని లోపలకు తీసుకొని వెళ్ళారు. 

అక్కడ తారాదేవి విగ్రహం చూసి ఆ సిద్ధుడు తారా దేవి ఉపాసకుడని గ్రహించాము. శ్రీపాదుల పూజ, భజన, మా భోజనం అయ్యాక సిద్ధుడు తారాదేవి గురించి ఇలా వివరించారు: 

మోక్షాన్ని ప్రసాదించి తరింపచేసేది కాబట్టి ఈమెను తార అని పిలుస్తారు. భయంకరమైన విపత్తుల నుండి భక్తు లను రక్షించే దేవి కనుక, వాక్శక్తిని ప్రసాదించే తల్లి కనుక ఈమెను నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. 

ఈ దేవి ఉపాసన వల్ల సామాన్యులు కూడా బృహస్పతి అంత విద్వాంసులు అవుతారు. భారతదేశంలో మొట్టమొదటగా తారా ఉపాసన చేసినది వశిష్ఠ మహర్షియే.

 🌻. అందాల బహూకృతి 🌻

మిథిలదేశంలోని మహిషి అనే గ్రామంలో ఉగ్రతారా సిద్ధ పీఠంలో ఉగ్రతారా, ఏకజట, నీలసరస్వతి ముగ్గురూ ఏక స్థానంలో ఉంటారు. 

మాతని దర్శించి నేను బయటకు రాగానే ముద్దులు మూటగట్టే 13ఏళ్ళ బాలిక కనిపించి, "నాయనా! నాకోసమేనా నీవు లోకాలంతా గాలిస్తున్నావు?" అని అడిగింది. ఆ ముగ్ధ మోహన రూపాన్ని మైమరచి చూస్తుండగా ఆమె శరీరంలోని కణాలు తేజోభరితమై అందుండి ఒక బాలుని రూపం ఉద్భవించింది. ఆ బాలుని రెండు కాళ్ళకు అందెలు ఉన్నాయి, కాని అవి చాలా బిగుతుగా ఉండటంతో నన్ను విప్పమని అడిగి విప్పాక అవి నా చేతికే ఇచ్చి వాటిలో జీవశక్తి ఉందని, అవి నాకు మార్గదర్శకంగా ఉంటాయని చెప్పి అదృశ్యమయ్యారు. 

🌻. గుణపాఠం 🌻

తరువాత అన్ని పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ పీఠికాపురం వచ్చాను. అక్కడ స్వయంభూదత్తుని మందిరంలో ఉన్న సర్ప దర్శనంతో నాలోని కుండలినీ శక్తి విజృంభించి, శరీరం స్వాధీనం తప్పి పిచ్చివానిలా తిరుగుతూ నరసింహవర్మ గారింటికి చేరాను. అక్కడ మహిషీ గ్రామంలో చూసిన బాలుడినే చూసాను. వర్మగారి ఇంటి వద్ద మనిషిలాగే జట్కాబండి ఒకటి ఉంది. 

అందులో శ్రీపాదులు తాత గారింటికి వెళ్తుండటం కద్దు. వర్మగారు జట్కాలాగే నౌకర్ని పిలిచారు. శ్రీపాదులు జట్కాలో తాము కూర్చొని, ఆ నౌకర్ని కూడా కూర్చోబెట్టి నన్ను బండి లాగమని ఆదేశించారు. 

నేను ఆ పని చేయనని మొరాయిస్తే బెదిరించి బండి లాగేలా చేసారు. వారిద్దరి బరువు 20మంది బరువులా ఉంది. అసలే లాగలేక అవస్థ పడుతుంటే ఆ కసాయి బాలుడు దుడ్డుకర్రతో నన్ను మోదడం ప్రారంభించాడు. ఒంటి నిండా రక్తంతో, అర్ధనగ్నంగా వాళ్ళని వారి ఇంటి వరకు తీసుకొని వెళ్ళాను. 

బాలుడు లోపలికి వెళ్ళి రెండు చేతుల నిండా మిరప పొడి తెచ్చి నా శరీరంపై దట్టించాడు. పుండుమీద కారం చల్లడం, కాదు కాదు రుద్దడం అంటే ఇదే కాబోలు. గాయాల బాధకి తోడు, భగభగ మంటలు.
 తల్లితండ్రుల సమ్మతం లేని సన్యాసం-గురువు లేని దీక్ష వ్యర్థం

ఇంతలో వారి అమ్మమ్మ రాజమాంబ బయటకు వచ్చారు. ఆమెను చూడటంతోనే నా బాధ చాలా వరకు తగ్గింది. ఆ నౌకరు జరిగినదంతా ఆవిడకు చెప్పితే శ్రీపాదులవారు అదంతా అబద్ధమని, నాకు చల్లగా గంధమే రాసానని చెప్పారు నౌకరు వచ్చి చూస్తే వారు చెప్పిందే నిజమ యింది. 

శ్రీపాదులు తమ తాతగారితో నాగురించి చెప్పుతూ వీడు తారా ఉపాసకుడు, మంచిదే కాని సన్యాస దీక్షను గురు అనుమతితో కాక తన ఇష్టం వచ్చినట్లు తీసుకు న్నాడు. ఇతని తండ్రి అష్ట కష్టాలు పడి వీడిని పెంచి పెద్ద చేసారు. 

ఇతని తల్లి వీడు గర్భమందున్న పుడు ఎంతో కష్టాన్నిఅనుభవించింది, వీడు జన్మించేటపుడు ఎంతో రక్తం పోగొట్టుకొని, గాయాలపై కారం అద్దినపుడు కల్గే బాధని అనుభ వించింది. కాలాంతరంలో వారిద్దరు మరణించి పీఠికాపురంలో జన్మించారు. 

వర్మగారి ఇంట్లో పనిచేసే ఈ నౌకరే పూర్వ జన్మలో వీడి తండ్రి. ఆ నౌకరు భార్యయే వీడి తల్లి. వీడు తాను సన్యసించానని చెప్పి తల్లి తండ్రులకు పిండప్రదానం చేయలేదు. స్వల్ప బాధను ఇచ్చి వీడిని కర్మ విముక్తుడిని చేసాను. 

ఇతడు 9 రోజులు తన పూర్వ జన్మలోని తల్లితండ్రులయిన ఈ భార్యా భర్తలకు సేవ చేసి నట్లయితే పితృదేవతల శాపం తొలగి పోతుంది”, అని చెప్పారు. 

నేను ఆ రకంగానే చేసి, వారి అనుగ్రహ ఆశీర్వా దాలు పొంది, మహిషి గ్రామంలో ఇచ్చిన కాలి అందెలను పూజ గదిలో భద్ర పరిచి ఉగ్రతారా సిద్ధిని పొంది నా తంత్ర శక్తితో జనుల బాధలు దూరంచేస్తూ జీవిస్తు న్నాను. మీరు రావడానికి ముందే శ్రీపాదులు కనిపించి ఆ కాలి అందెలు మీకు ఇమ్మని ఆదేశించారని చెప్పి అందెలు మాకు అందచేసారు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sripada Srivallabha Charithamrutham - 205 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj 

CHAPTER 20
🌴. The Story of Vissavadhanulu Description of Sripada’s divine auspicious form - 12 🌴

🌻 There is no end to my avathar - 2 🌻

Sripada said, ‘These sanjeevini plants are available in Himalaya mountain ranges, Kashmir, Manasa Sarovaram, at the origin of Sindhu river, at Srisaila mountain the abode of Mallikarjuna Prabhu, in Sahyadri, Mahendragiri, Vindhya mountain ranges and in the forests of Badari. Laxmana came out of unconsciousness due its influence only. By taking this, one gets relief from many diseases.  

By applying this on body, one gets the ‘siddhi’ of ‘akasa gamana’ (walking in space). It will help in strengthening of muscles, increase the luster in the eyes, improve the power of hearing.

Under its influence, one will not have any fear or grief from fire, water and poison. It also gives eight siddhis (Anima etc.)  

In the suklapaksha (the first half of lunar month), this plant will give one leaf per day and on 15th day, that plan will have 15 leaves. From the next day, one leaf will be falling every day. By the Amavasya day, 30th day, all leaves will fall and the plant dries.  

The dried stem of the plant if made wet and kept in the room at night, will emanate light. In Sahyadri Mountain range and Bhima Sankara Mountains, wild animals will be guarding these sanjeevini plants.  

In the mid night of Amavasya day this plant can be easily identified because of its glow. My Dear! Gurucharana! There are 24 types of such divine medical plants.  

All these are very sacred. Godly powers will be resting in these plants. So one should take that plant, digging with utmost humility chanting sacred veda mantras.  

These are the 24 divine sacred medicinal plants. (1) Soma (2) Maha Soma (3) Chandrama (4) Amshuman (5) Manjuvan (6) Rajita Prabhu (7) Durva (8) Kaniyan (9) Swetan (10) Kanaka Prabhu (11) Pratanavan (12) Lal Vritha (13) Karadheera (14) Amsuvan (15) Swayam Prabhu (16) Rudraksha (17) Gayatri (18) Eshtam (19) Pavatha (20) Jagath (21) Shakar (22) Anishtam (23) Raikta (24) Tripada Gayatri.”

 I took leave from Sripada and left Peethikapuram” As Gurucharana finished explaining this to me, Maha Guru’s subtle wandering finished and we received the order to come for His darshan. We had His darshan. We received fruits and Prasad from His divine hands. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 85 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. *చేయవలసినది- చేయదలచినది - 1* 🌻

ఆరాధన కాకుండా మనం చేసే పని జీవితంలో ఉండరాదు. మనం ఇతర జాతులను చూసినట్లయితే అక్కడ ఆరాధనే విశేషమే కనిపిస్తూ ఉంటుంది. 

సామాన్యంగా తెల్లజాతులలో 24 గంటలు వాళ్ళచేసే వ్యాపారం గానీ, వృత్తి గానీ సంఘానికి అంకితంగా, సంకేతంగా, ఆరాధనా విశేషంగా చేయటం ప్రారంభం చేశారు. అందుకని ఆరాధన విశేషాన్ని పునరుద్ధరించుట కొరకు భారతదేశంలో 19వ శతాబ్ధి నుండి మళ్ళీ చాలా చక్కని ప్రయత్నం చేస్తున్న మహాభావులనే పరమగురువులు అని అంటారు. 

వారిలో ముఖ్యంగా ఇద్దరు ఇప్పటికి 5 వేల సంవత్సరాల నుండి ఇప్పటివరకు అఖండమైన కృషి ధర్మసంస్థాపనకై చేస్తూ ఉన్నారు. వారే మరువు మహర్షి, దేవాపి మహర్షి. 

19వ శతాబ్ధి చివరలో 20వ శతాబ్ది ప్రారంభంలో (తమకు ఉన్న) భౌతిక శరీరంతో Master MORYA, Master KOOT HOOMI అనే పేర్లతో ఉండిరి‌. 

హిమాలయములలోని ఒక చిన్న గ్రామము నందుండి వారి శిష్యుడైన జ్వాలాకూలుడను మహనీయుని ద్వారా వాళ్ళు బ్రహ్మ విద్యా సర్వస్వమును వ్యాప్తి చేసి మళ్ళా క్రమశిక్షణను ప్రపంచంలో స్థాపించటానికి ఇచ్చారు. 

ఆ ఇచ్చిన మార్గం వేద, ఉపనిషత్ గీతాసమ్మతమైనది. దీనిని సకల జగత్తుకి‌ ఇచ్చిన ఫలితంగా ఈ రోజున పాశ్చాత్య దేశములలో కొన్ని లక్షల మంది అఖండంగా అనుసరణం ఆచరణం చేస్తూ ఉన్నారు..
....✍ *మాస్టర్ ఇ.కె.*🌹
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹 The Masters of Wisdom - The Journey Inside - 108 🌹
🌴 The Aquarian AGE - 4 🌴
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

🌻 The Sound Key 🌻

Master CVV broke with all the traditions of the past and he issued a simple method of transformation that leads to the transcending of death. He introduced a prayer to be uttered twice daily at an interval of 12 hours. 

This is how the practice of 6 o'clock in the morning and evening came into being. We can choose another time that suits us, but we should not change it. What is important is that consistency is maintained. 

In prayer we utter the sound C. V. V. consciously and not mechanically and we feel either in the heart centre or in the brow centre that the Master is present. We then allow the energy to work within us for 15 minutes, observing the inner movements as the transformation takes place. 

If we notice any instructions during the prayer, we should write them down and try to follow them. Within a short time, we will experience many changes.

The Master's promise is that whoever utters the sound key CVV will experience rapid changes in their system and the blockages that hinder the free flow of energy will be eliminated. He demands three things from those who are willing to work with him: 

To think of the needs of others more than one's own needs; to see in every being the manifestation of the first energy; to invoke the sound CVV regularly and to live in simplicity. This should be maintained for at least 12 years. His promise is that he will lift us up into pure states of experience of consciousness.

Master CVV declared himself as the first channel for this energy on the planet. He is the transmitter, not the giver. Halley's comet, acting as a messenger, also brought the energy to earth. 

The supracosmic impulse descended via Varuna (on the supracosmic plane the Mother Energy, which becomes Uranus on the cosmic plane), and further via Sirius, via Regulus in Leo, and then via the comet. 

This event cannot be compared to anything else. It is the Avatar of Synthesis - the descent of the Energy of Synthesis, which was brought into our system by Sirius in triangular work with the Great Bear and the Pleiades. 

This energy represents the synthesis of all energies. It dissolves apparent opposites, neutralizes diverging points of view and brings to light a common understanding. 

As a result, humanity will reach unity in a few thousand years. To work out this synthesis within us, there is the invocation of the Avatar of Synthesis.

🌻 🌻 🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K.P. Kumar: The Aquarian Master. Div. seminar notes/ Master E. Krishnamacharya: Spiritual Astrology.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 69 🌹
🌻. శ్రీ లలితా స్తవరత్న వైజ్ఞానిక ధ్యాన యోగము 🌻
✍️. విరచితం : భగవాన్ శ్రీ క్రోధభట్టారక (దుర్వాస మహర్షి)
📚. ప్రసాద్ భరద్వాజ

సర్వజ్ఞా సదనోపరి
చక్రేవిపులే సమాకలిత గేహాః I
వన్దే వశినీ ముఖ్యాః
శక్తీః సిన్దూర రేణు రుచి హారీః II 141 II

శ్రీసర్వరోగహాఖ్యే
చక్రేఽస్మిం స్త్రిపుర పూర్వికాం సద్ధామ్ I
వన్దే రహస్యనామ్నా
వేద్యాభి శ్శక్తిభి స్సదాసేవ్యామ్ II 142 II

వశినీ గృహోపరిష్టాద్
వింశతి హస్తోన్నతే మహాపీఠే I
శమయన్తు శత్రుబృన్దం
శస్త్రాణ్యస్త్రాణి చాది దమ్పత్యోః II 143 II

శస్త్రసదనో పరిష్టా ద్వలయే
బలవైరి రత్న సంఘటితే I
కామేశ్వరీ ప్రధానాః
కలయే దేవీస్సమస్త జనసేవ్యాః II 144 II

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 48 / Dasarathi Satakam - 48 🌹
పద్యము - భావము 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 95వ పద్యము : 
సరసునిమానసంబుMeaning
తల్లిదండ్రుల పూర్వజన్మ పుణ్యఫలము వలన ఎవరిని యాచించకుండ, అడిగినవారికి లేదనకుండ, అసత్యము పలుకక, యుద్ధరంగమున జంకకనుండు గుణవంతుడయిన ఒక పుత్రుడు పుట్టినా తల్లిదండ్రులకే గాక వంశములకే, నీ వలెనే ఖ్యాతిదేగలడు. సర సఙ్ఞుడెరుంగును ముష్కరాధముం
డెఱిఁగిగ్రహించువాడె కొల నేకనిసముఁ గాగదుర్దురం
బరయఁగ నేర్చునెట్లు విక చాబ్దమరంద రసైక సౌరభో
త్కరముమిళింద మొందుక్రియ దాశరథీ కరుణాపయోనిధీ

🌻. భావము : 
రసజ్ఞుని మనసును రసజ్ఞుడే గ్రహింపగలడు. కొలనులోనే నివసించు కప్ప ఆ కొలనులోని కమలముయొక్క తేనె గ్రహించలేనట్లే మూఢుడైన నీచుడు రసజ్ఞుని వూహ తెలిసికొనలేడు.

🌻. 96వ పద్యము : 
నోఁచినతల్లిదండ్రికిఁ దనూభవుఁడొక్కడెచాలు మేటిచే
చాఁచనివాడు వేఱొకఁడు చాచిన లేదన కిచ్చువాఁడునో
రాఁచినిజంబకాని పలు కాడనివాఁడు రణంబులోన మేన్
దాచనివాఁడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ

🌻. భావము : 
తల్లిదండ్రుల పూర్వజన్మ పుణ్యఫలము వలన ఎవరిని యాచించకుండ, అడిగినవారికి లేదనకుండ, అసత్యము పలుకక, యుద్ధరంగమున జంకకనుండు గుణవంతుడయిన ఒక పుత్రుడు పుట్టినా తల్లిదండ్రులకే గాక వంశములకే, నీ వలెనే ఖ్యాతిదేగలడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Dasarathi Satakam - 48 🌹
Sloka and Meaning 
📚. Prasad Bharadwaj
 
🌻 95th Poem : 
sarasunimAnasaMbu sarasaj~juDeruMgunu muShkarAdhamuM 
DerxigigrahiMcuvADe kolanEkanivAsamu gAgadarduraM 
barayaga nErcuTeTlu vika cAbdamaraMda rasaika sauraBO 
tkaramumiLiMda moMdukriya dASarathI karuNApayOnidhI

🌻 Meaning : 
A connoisseur can appreciate the mind of another connoisseur. An ignorant/foolish man cannot do it. Though a lotus and fish reside in the same pond, a fish cannot appreciate the sweet fragrance of a lotus the same way that a holy bee (Bhramara) can.

🌻 96th Poem : 
nOcinatallidaMDriki danUBavuDokkaDecAlu mETicE 
cAcanivADu vErxokaDu cAcina lEdana kiccuvADunO 
rAcinijaMbakAni palu kADanivADu raNaMbulOna mEn 
dAcanivADu Badragiri dASarathI karuNApayOnidhI

🌻 Meaning : 
Blessed are the parents whose son never begs from anybody ; does not say no when somebody seeks something from him; fights to the best of his ability in the battle field without fleecing and who never lies.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. నారద భక్తి సూత్రాలు - 25 🌹 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, అచల గురు పీఠము. 
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 15

🌻. 15. తల్లక్షణాని వాచ్యంతే నానా మత భేదాత్‌ - 2 🌻

4. పరాభక్తుడు భగవత్ప్రీతి కలిగి ఉండి భగవంతుని నుండి ఏమీ కోరడు. ఏ ఫలం ఆశించడు. అతడి భక్తి అచంచలం, ఏకాగ్రం. 

ఇది యోగస్థితిగా కనిపిస్తుంది. కాని అది సిద్ధించినదే కనుక అది క్షేమ స్థితి. అది కౌశలం. అది పరాకాష్ఠ. 

5. పరాభక్తుడిలో ఒకసారి భగవంతుని కల్యాణ గుణాల భావన యౌగికం కాగా ఇక అది ఎన్నటికీ చెదరదు, తరగదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా భగవంతుడిపై ఉన్న అతడి ప్రేమ ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. అతడు ఆ పట్టును వదలడు. 

సాధకులకైతే లౌకికమైన వాటినన్నీ వదిలితే గాని ఈ భగవత్ప్రేమ సిద్ధించదు. ఈ విధంగా సిద్ధమైనదే పరాభక్తి. ఇది సమాప్తస్థితి. అతడిలో జీవ భావానికి సంకేతమైన అహంకార మమకారాలు తిరిగి తలెత్తవు. 

ఎందుకంటే సత్యం అనుభవమయ్యాక అసత్యం మరలా ఎందుకు నిర్ణయమవుతుంది ? ఉన్నది భగవంతుడే, భగవంతుడు తప్ప అన్యం లేదు అనే సత్యం గోచరమై, అనుభవ సిద్ధమైన పిదప ఇక జీవ భావంగాని, ప్రపంచ భావంగాని తోచదు. ఇదే కదా పరాభక్తి అంటే !

            6. శాండిల్య భక్తి సూత్రాల ప్రకారం భగవంతుని పట్ల పరమప్రేమ కలిగి ఉండటమే పరాభక్తి అవుతుంది. పరమప్రేమ అంటేనే లౌకిక ప్రేమకు పరమై విలక్షణమైనది. 

అనగా అలౌకికమైన భగవత్ప్రేమ. భగవంతుడు సచ్చిదానందుడు గనుక, పరమప్రేమ అంటే పరమశాంతి, పరమానందం. ఇది పరాభక్తి లక్షణమై ఉన్నది.

            7. స్వప్నేశ్వరుని ప్రకారం భగవంతుని మహిమలను గ్రహించి అనుభవిస్తున్నప్పుడు కలిగిన ప్రీతి పరాభక్తి అవుతుంది. భగవంతుని మహిమలను గ్రహించే భక్తుడు ముఖ్యభక్తుడు. ఆ మహిమకు పరవశించడమనేది ఇంకా భగవంతునిలో ఐక్యం కానట్టి స్థితి. 

భగవంతునితో అనుసంధానమైనట్టి భక్తుడు తన భావావేశ స్థితిలో కూడా ఆయన కంటే వేరుగా ఉండడు. అనగా భగవత్ప్రీతి అనేది క్రియగా ఉండదు. అది ఘన రూపమై ఉంటుంది. అదే పరాభక్తి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. పంచకోశములు -మనోమయ కోశము 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
చలాచల బోధ... 
📚. ప్రసాద్ భరద్వాజ

మనస్సు + జ్ఞానేంద్రియములు ఐదింటిని కలిపి మనోమయ కోశము అంటారు.
 
ఒకే అంత:కరణను వృత్తి బేధమును బట్టి
ఆలోచన నిశ్చయాత్మక వృత్తిని పొందిన బుద్ధి అని 
ఆలోచన సంశయ రూపములో ఉన్న మనస్సు అని అంటారు.

ఈ వృత్తిబేధమును బట్టి మనస్సు + జ్ఞానేంద్రియములు ఐదింటిని కలిపి మనోమయ కోశము అని
బుద్ధి+ జ్ఞానేంద్రియములు ఐదింటిని కలిపి విజ్ఞాన కోశము అని అంటారు.

విజ్ఞాన కోశము కత్రుత్వ భావనను , మనోమయ కోశము భోక్తృత్వ భావనను కలిగిస్తాయి.

మనస్సు జ్ఞానేంద్రియముల ద్వారా పంచ విషయములను గ్రహించుట , కర్మేంద్రియముల ద్వారా బుద్ధి నిర్ణయములను అమలు పరచుట చేస్తుంది

ఈ మనస్సు అవిద్య లేక మాయ క్రియారూపము ధరించుటకు వాహకముగా పనిచేస్తుంది.

ఇంద్రియాభిముకమైన మనస్సు వాసనలను ఏర్పరచి జనన మరణ చక్రములో బంధించ బదేటట్లు చేస్తే అదే మనస్సును అంతర్ముఖము ఆత్మ జ్ఞాన దిశగా వినియోగించిన మోక్షముపొందుటకు సహాయకారి అవుతుంది. కనుకనే పెద్దలు మనస్సు బంధ మోక్షములకు కారకముగా చెబుతారు .

మనస్సు , దేహ తధాత్మ్యతవలన పరిమితించబడి నేను, నాది అను బేధభావనను సృష్టిస్తుంది. నేను ఆత్మ స్వరూపుడను అన్న భావనను మరపు కలిగిస్తుంది. కనుకనే ఇది కోశము ఐనది.

మనస్సులోని ఆలోచనలు నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి. పరిణామము లేక ఏక రీతిగా ఉండునది ఆత్మ. కనుక మనోమయ కోశము ఆత్మ కాదు.

మనస్సులోని ఆలోచనలు నాకు తెలియబడుచున్నాయి. ఏదైతే నాకు తెలియబడుచున్నదో అది నేను కాదు. కనుక మనోమయ కోశము ఆత్మ కాదు.

మనస్సు జాగ్రత్, సుషుప్తి యందు పనిచేస్తూ నిద్రయందు వ్యవహారము లేకుండా పోవుచున్నది.సర్వ కాల సర్వ అవస్థల యందు ఉండునది ఆత్మ. కనుక మనోమయ కోశము ఆత్మ కాదు.
 
కాని నేను వ్యవహరించే సమయమున
నేను కుంటివాడిని, గ్రుడ్డివాడిని అని ఇంద్రియ లోపములను నేనుకు అపదిస్తున్నాము .

సుఖము, దుఃఖము మనో ధర్మములు
కాని నేను సుఖిని, దు:ఖిని అని మనో ధర్మములను నేనుకు అపదిస్తున్నాము .
 
ఇవన్నియు ఇంద్రియ, మనో ధర్మములు. నేను వీటన్నింటికి విలక్షణమైన, సాక్షి అయిన ఆత్మ స్వరూపుడను అను నిశ్చయ జ్ఞానముతో జీవించవలెను.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 56 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 56 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻 
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

     అష్టమి రోజు ఉదయం జగద్గురువు, వారి పరివారం హుమానాబాద్ నుండి బయలుదేరగానే ఇక్కడ ఎదురు వెళ్ళడానికి ప్రభు పరివారం బయలుదేరింది. ముందుగా ఏనుగు, గుర్రాలను తీసుకొని తాత్యాసాహెబ్ తన ఇద్దరు పుత్రులతో ఎదురువెళ్లి పాదాభివందనం చేసి రెండువేల రూపాయలను కానుకగా సమర్పించుకొని స్వాగతించారు. 

రామశాస్త్రి వారి ఇద్దరు పుత్రులను జగద్గురువుల పాదాల వద్ద ఉంచి తాత్యావారిని వీరు ప్రభువు యొక్క కనిష్ట సోదరుడు అని పరిచయం చేశారు. తరువాత వారు తాత్యాసాహెబ్ ని ఆలింగనం చేసుకొని తన మెడలో ఉన్న అమూల్యమైన హారాలను తాత్యావారికి వేసి ఇద్దరు పుత్రులకు పుష్ప హారం, కొబ్బరిని ప్రసాదంగా ఇచ్చి ప్రభు వద్దకు వెళ్ళడానికి పల్లకిలో కూర్చున్నారు.

   హుమానాబాద్ నుండి స్వామి బయలు దేరగానే ఇక్కడ ప్రభు పాదయాత్రగా తనతో రెండు వేల మంది బ్రాహ్మణులను, రెండు ఏనుగులను, రెండువేల మంది జనం వెనుక ముందు నడుస్తుండగా, తుపాకులతో నిజాం రాజ్యం యొక్క సిపాయిలు పేలుస్తూ నడుస్తుంటే పొగతో ఆ ప్రదేశం నిండిపోయి, సంతులు, సాధువులు, బైరాగుల భజనతో నడుస్తూ పదివేల మందితో ప్రభువు రుమాలు కట్టుకొని పీఠాధిపతులను స్వాగతించడానికి పల్లకి బయలుదేరింది. ఇక్కడినుండి ప్రభు పల్లకి అటువైపు నుండి జగద్గురువుల పల్లకి మధ్య దారిలో కలిశాయి. ఆ సమయంలో ఒకే స్వరంతో అందరూ జయజయధ్వానాలు చేశారు.

    ముందుగానే ప్రభువు జగద్గురువుల ఎదుట 'భక్తకార్య కల్పద్రుమ' అని ఎవరు అనకూడదని జనులకు ఆజ్ఞాపించారు. కారణం ఆయన మన గురువు. ఆయనకు ఈవిధంగా మనం జయకారం చేస్తే వారికి అమర్యాద అవుతుంది. ఇద్దరి పల్లకీలు దగ్గరికి రాగానే ముందుగా స్వామి వారి గర్జన వినిపించింది. 

ఇక్కడ ప్రభు బృందం ప్రభు ఆజ్ఞాపించిన విషయం మరిచి వెంట ఉన్న రెండువేల మంది ఒకేసారిగా "భక్తకార్య కల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమత్ రాజాధిరాజా యోగి మహారాజ్ త్రిభువన ఆనంద అద్వైత, అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై" అని గద్గద స్వరంతో అనగానే అన్ని దిక్కులా ఆనంద పారవశ్యమైంది.

   ప్రభు వచ్చిన విషయం స్వామికి తెలిసి అంతమందిలో బ్రాహ్మణులతో, రుమాలు కట్టుకొని సాదా టోపీ వేసుకొని శరీరంపై కేవలం జుబ్బాతో, చేతులు కట్టుకొని ఉన్న ప్రభు స్వరూపాన్ని చూసి పల్లకి నుండి దిగి ప్రభు వద్దకు వచ్చారు. 

ప్రభు నమస్కారం చేయగానే, స్వామి గట్టిగా ప్రభువుని ఆలింగనం చేసుకోగానే స్వామి వారి నేత్రాలనుండి ఆనంద అశ్రువులు రాసాగాయి. ఈ విధంగా ఇద్దరు మహాపురుషుల కలయిక అద్భుతంగా జరిగింది. ఈ ఆనంద క్షణాలను వర్ణించడం ఎవరి తరము కాదు.

   ఆ క్షణంలో మరొకసారి ప్రభు బృందం 'భక్తకార్య' ఉచ్ఛరించగానే ఆ ఆనంద క్షణంలో అందరూ మైమరిచిపోయారు. కాని స్వామి మహారాజ్ యొక్క పూర్వాశ్రమ సోదరుడు అహోబిల శాస్త్రి పెద్ద విద్వాంసులు, స్వాభిమానియై ఉండిరి. 

ఆయనకు ఈ "భక్తకార్య" వినగానే అమర్యాదగా అనిపించి కోపం వచ్చింది. కాని తమాయించుకున్నారు. తరువాత ఇద్దరూ పల్లకిలో కూర్చుందామని స్వామి, ప్రభువుని అడిగారు. కాని, ప్రభువు తిరస్కరించి స్వామి యొక్క పల్లకి మోయడానికి తమ భుజాన్ని అందించారు. కానీ, ఏదైనా వాహనంలో కూర్చోవాలని స్వామి కోరగా ప్రభు మేనాలో కూర్చున్నారు. ఆ విధంగా మాణిక్ నగర్ లోని దత్త గాది వద్దకు వచ్చారు. 

ప్రభు స్వయంగా స్వామిని తీసుకొని వచ్చి వారికి ఏర్పాటు చేసిన రత్నఖచిత సింహాసనంపై కూర్చోపెట్టారు. స్వామి యొక్క పూజ, పాదపూజ తాత్యామహారాజ్ చేసిన తరువాత, వస్త్రభూషణాలను సమర్పించుకున్నారు. ప్రభు చేసిన ఆదర సత్కారాలను చూసి జగద్గురువులు సంతోషించారు.

   తరువాత ప్రభు వద్ద నుండి వెళ్ళడానికి స్వామి అనుమతి కోరుతూ ముత్యాలహారం, ఒక ఏనుగు, నాలుగు ఉత్తమజాతి గుర్రాలను, ఒక పల్లకి, శాలువ ఇలా అనేకవస్తువులు ప్రసాదంగా ఎంత వద్దని వారించినా కానుకగా ఇచ్చారు. చివరికి బయలుదేరే సమయంలో మీరు 'సకలమత స్థాపిత భక్తకార్య' అనడం మానకండి అని ప్రభు బృందంతో చెప్పారు. 

నాతో వచ్చిన మా సోదరుడు, ఇతర పండితులు ఈ అధికారం ఎవరిచ్చారో అడగమని అన్నారు. దీనికి సమాధానం నేను మా వాళ్ళకి ఇస్తాను. కానీ, మీకు మాత్రం నేను మనస్ఫూర్తిగా ఆజ్ఞాపిస్తున్నాను. 'భక్తకార్య' యోగ్యమైనది. సకలమత కళ్యాణం చేయండి అని ఆజ్ఞాపించి జగద్గురువులు వెళ్ళిపోయారు.

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 56 🌹
✍️. Nagesh D. Sonde
📚. Prasad Bharadwaj

🌻 15. Shri Siddharaj Manik Prabhu (1939 – 2009) - 2 🌻

All of Shri Siddharaj Manik Prabhu’s activities were guided by these thoughts. While new ideas were not rejected just because they were new, the old values also were not forgotten because they were old.  

Out of the historical heritage, from which humankind had gathered cultural, ethical, moral and social norms, the things which are permanent in nature and Eternal in essence were required to be protected and inculcated in the coming generation.  

This is what Shri Siddharaj Manik Prabhu did with great sense of passion and dedication. For all these generations, Shri Manik Prabhu Sampradaya was looking for traditional values to inculcate in the character of the human being.  

Bhakti and unquestioned faith in Guru’s Grace were predominantly emphasized. Shri Martand Manik Prabhu gave a direction to Jnana, wisdom of the Dharma.

Shri Shankar Manik Prabhu and Shri Siddharaj Manik Prabhu felt that along with these, sense of enquiry should also be inculcated in the devotees.  

They should enquire how they happened to be here in this world? What is the characteristic of the diversity which they see before them?  

Where is one proceeding and what should be one’s role and objective? Realising this fact, Shreeji opened a school in Maniknagar, on the model of the school in Gwalior where he had taken his education.  

Here education was not teaching the pupil only the essentials to make him pass the examination and be prepared to earn his livelihood, but to make it the basic forum which will make him enquire and think about life in general and its values in particular.  

It is rightly said by Shri Krishna in Gita (IV.38) “There is indeed nothing in the world equal in purity to wisdom.  

He who becomes perfected by yoga finds this of himself in his very Self in course of time”. This does not mean he gave lesser importance to religious rites and rituals.  

The tragedy of the modern mind is that what he considers as knowledge is but the collection of information and not wisdom born out of one’s own endeavour or experience which comes out of hard work, sacrifice, austerity or Tapas.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. సౌందర్య లహరి - 32 / Soundarya Lahari - 32 🌹
📚. ప్రసాద్ భరద్వాజ 
32 వ శ్లోకము

🌴. దీర్ఘ ఆయుష్షు - సర్వ ఆకర్షణ 🌴

శ్లో: 32. శివ శ్శక్తిః కామః క్షితిరథ రవి శీతకిరణః 
స్మరోహంస శ్శక్ర స్తదనుచ పరామార హరయఃl 
అమీ హృల్లేఖాభిస్తి సృభి రవసానేషు ఘటితా 
భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ll 
 
🌻. తాత్పర్యము : 
అమ్మా ! క, ఏ, ఈ , ల కారములగు శివుడు, శక్తి, కాముడు,భూమి ప్రధమ ఖండముగాను, హ, స, క, హ, ల కారములగు రవి, చంద్రుడు, మారుడు, హంస,ఇంద్రుడు ద్వితీయ ఖండముగాను,తదుపరి స, క, ల, కారములగు పరాశక్తి, మన్మధుడు,విష్ణువు తృతీయ ఖండముగాను హ్రీం కారములతో కూడి పంచ దశాక్షరీ మంత్రము అగుచున్నది కదా ! 

🌻. జప విధానం - నైవేద్యం :

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, పెరుగు అన్నం, మినుము వడలు, తీపి పొంగల్ నివేదించినచో సర్వ ఆకర్షణ శక్తిని, సంతోషకరమైన దీర్ఘకాలిక జీవితాన్ని పొందును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Soundarya Lahari - 32 🌹 
📚. Prasad Bharadwaj 
SLOKA -32 

🌴 Long Life and Attracting Everything 🌴

32. Sivah saktih kamah kshitir atha ravih sithakiranah Smaro hamsah sakrastadanu cha para-mara-harayah; Amee hrllekhabhis tisrbhir avasanesu ghatitha Bhajante varnaste tava janani nam'avayavatham.

🌻 Translation :
She who is mother of us all, the seed letter ka of my lord Shiva, the seed letter a of goddess Shakthi, the seed letter ee of the god of love, the seed letter la of earth, the seed letter ha of the sun god, the seed letter sa of the moon with cool rayshe seed letter ka of again the god of love, the seed letter ha of the sky, the seed letter la of Indra, the king of devas,the seed letter sa of para,the seed letter ka of the god of love, the seed letter la of the lord Vishnu, along with your seed letters hrim, which joins at the end of each of the three holy wheels, become the holy word to worship you. [This stanza gives indirectly the most holy Pancha dasakshari manthra which consists of three parts viz., ka-aa-ee-la-hrim at the end of Vagbhava koota, ha-sa-ka-ha-la-hrin at the end of kama raja koota and sa-ka-la-hrim at the end of Shakthi koota.These parts are respectively called Vahni kundalini, Surya Kundalini and Soma kundalini.]

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :   

If one chants this verse 1000 times each day for 45 days, offering, curd rice, dhal(urad ) vada and sweet pongal as prasadam, it is said that one would be able get the attraction of everything and lead a long happy life.

🌻 BENEFICIAL RESULTS:
Royal and governmental favours, winning popularity, fulfillment of desires.(Yantra to be held on a piece of red silk spread on right palm). 
 
🌻 Literal Results:
Freedom and independence from usual surroundings and people, through new approach towards life. 

🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 331 / Bhagavad-Gita - 331 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 12 🌴

12. మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతస: |
రాక్షసీమాసురీం చైవ ప్రకృతిమ మోహినీం శ్రితా: ||

🌷. తాత్పర్యం :
ఆ విధముగా మోహపరవశులైనవారు దానవ, నాస్తికభావములచే విమోహితులగుదురు. అట్టి భ్రాంతస్థితిలో వారి ముక్తికి సంబంధించిన ఆశలు, కామ్యకర్మలు, జ్ఞానసముపార్జన లన్నియును వ్యర్థములగును.

🌷. భాష్యము : 
తమను తాము కృష్ణభక్తిభావన యందు మరియు భక్తియుతసేవ యందు నిలిచియున్నవారిగా భావించుచునే అంతరంగమున మాత్రము దేవదేవుడైన శ్రీకృష్ణుని పరతత్త్వముగా అంగీకరింపని భక్తులు పెక్కురు గలరు. భగవద్ధామప్రాప్తి యను భక్తియోగఫలమును అట్టి వారెన్నడును రుచిచూడలేరు. 

అదే విధముగా కామ్యకర్మలందు, పుణ్యకర్మలందు మగ్నులైనవారు మరియు భౌతికబంధముల నుండి ముక్తిని వాంచించువారు సైతము దేవదేవుడైన శ్రీకృష్ణుని నిరసించు కారణముగా కృతకృత్యులు కాజాలరు. వేరుమాటలలో శ్రీకృష్ణుని యెడ అపహాస్య భావముతో వర్తించువారే దానవస్వభావులు లేదా నాస్తికస్వభావులు అయినట్టివారు. 

భగవద్గీత యందలి సప్తమాధ్యాయమున వివరింపబడినట్లు అట్టి దానవప్రవృత్తి కలవారు కృష్ణుని శరణునొందరు. కనుక పరతత్త్వమును అవగాహన చేసికొన యత్నించు వారు మానసికకల్పనలు సాధారణజీవుడు మరియు శ్రీకృష్ణుడు ఏకమే, సమానమే అనెడి మిథ్యానిర్ణయమునకు వారిని చేర్చును. 

అట్టి మిథ్యాభావనలో వారు ప్రస్తుతము దేహము ప్రక్రుతిచే కప్పబడియున్నదనియు, భౌతికదేహము నుండి ముక్తిని బడసినంతనే భగవానుడు మరియు తమ నడుమ భేదముండదనియు భావింతురు. 

కాని శ్రీకృష్ణునితో ఏకము కావలెననెడి వారు ప్రయత్నము భ్రాంతి కారణముగా వ్యర్థమగును. అట్టి దానవ, నాస్తికప్రవృత్తితో కూడియున్న జ్ఞానము వ్యర్థమని ఈ శ్లోకమున సూచించబడినది. 

అనగా వేదాంతసూత్రములు, ఉపనిషత్తులు వంటి వేదవాజ్మయమునందలి జ్ఞానసముపార్జనము దానవ, నాస్తికప్రవృత్తి గలవారికి సదా వ్యర్థమే కాగలదు.

కనుకనే దేవదేవుడైన శ్రీకృష్ణుని సామాన్యమానవునిగా భావించుట గొప్ప అపరాధము. అట్లు భావించెడివారు శ్రీకృష్ణుని నిత్యస్వరూపమును తెలియలేనందున నిక్కము భ్రాంతులగుదురు. ఈ విషయమునే బృహద్విష్ణుస్మృతి ఇట్లు స్పష్టముగా పలుకుచున్నది.

యోవేత్తి భౌతికం దేహమ్ కృష్ణస్య పరమాత్మన: |
స సర్వస్మా ద్బహిష్కార్య: శ్రౌతస్మార్తవిధానత: |
ముఖం తస్యావలోక్యాపి సచేలం స్నానమాచరేత్ ||

“శ్రీకృష్ణుని దేహమును భౌతికమని భావించువారిని శృతి మరియు స్మృతుల సర్వకర్మకలాపముల నుండి తరిమివేయవలెను. 

అట్టివారి ముఖమును చూచినచో, పాపపరిహారార్థము తక్షణమే గంగలో స్నానమాడవలెను.” శ్రీకృష్ణుని దేవదేవత్వముపై అసూయ కలిగినవారైనందుననే జనులు అతనిని అవమానింతురు. 

వారు నిక్కముగా మరల, మరల నాస్తిక, దానవజన్మలనే పొందుదురు. తత్కారణముగా వారి నిజజ్ఞానము భ్రాంతికి లోనైయుండి క్రమముగా వారు సృష్టియందలి అంధకారబంధురమైన లోకములను చేరుదురు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 331 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 12 🌴

12 . moghāśā mogha-karmāṇo
mogha-jñānā vicetasaḥ
rākṣasīm āsurīṁ caiva
prakṛtiṁ mohinīṁ śritāḥ

🌷 Translation : 
Those who are thus bewildered are attracted by demonic and atheistic views. In that deluded condition, their hopes for liberation, their fruitive activities, and their culture of knowledge are all defeated.

🌹 Purport :
There are many devotees who assume themselves to be in Kṛṣṇa consciousness and devotional service but at heart do not accept the Supreme Personality of Godhead, Kṛṣṇa, as the Absolute Truth. For them, the fruit of devotional service – going back to Godhead – will never be tasted. 

Similarly, those who are engaged in fruitive pious activities and who are ultimately hoping to be liberated from this material entanglement will never be successful either, because they deride the Supreme Personality of Godhead, Kṛṣṇa. 

In other words, persons who mock Kṛṣṇa are to be understood to be demonic or atheistic. As described in the Seventh Chapter of Bhagavad-gītā, such demonic miscreants never surrender to Kṛṣṇa. 

Therefore their mental speculations to arrive at the Absolute Truth bring them to the false conclusion that the ordinary living entity and Kṛṣṇa are one and the same. 

With such a false conviction, they think that the body of any human being is now simply covered by material nature and that as soon as one is liberated from this material body there is no difference between God and himself.

This attempt to become one with Kṛṣṇa will be baffled because of delusion. Such atheistic and demoniac cultivation of spiritual knowledge is always futile. 

That is the indication of this verse. For such persons, cultivation of the knowledge in the Vedic literature, like the Vedānta-sūtra and the Upaniṣads, is always baffled.

It is a great offense, therefore, to consider Kṛṣṇa, the Supreme Personality of Godhead, to be an ordinary man. 

Those who do so are certainly deluded because they cannot understand the eternal form of Kṛṣṇa. The Bṛhad-viṣṇu-smṛti clearly states:

yo vetti bhautikaṁ dehaṁ
kṛṣṇasya paramātmanaḥ
sa sarvasmād bahiṣ-kāryaḥ
śrauta-smārta-vidhānataḥ
mukhaṁ tasyāvalokyāpi
sa-celaṁ snānam ācaret

“One who considers the body of Kṛṣṇa to be material should be driven out from all rituals and activities of the śruti and the smṛti. 

And if one by chance sees his face, one should at once take bath in the Ganges to rid himself of infection.” People jeer at Kṛṣṇa because they are envious of the Supreme Personality of Godhead. 

Their destiny is certainly to take birth after birth in the species of atheistic and demoniac life. Perpetually, their real knowledge will remain under delusion, and gradually they will regress to the darkest region of creation.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹 . శ్రీ శివ మహా పురాణము - 162 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴 
38. అధ్యాయము - 13

🌻. శివపూజ - 2 🌻

దేశం కాలం విచార్యైవం స్నాం కుర్యాద్యథావిధి | ఉత్తరాభిముఖశ్చైవ ప్రాజ్ఞ్ముఖోsప్యథవా పునః || 14

ఉచ్ఛిష్టైనైవ వసై#్రణ న స్నాయాత్స కదాచన | శుద్ధవస్త్రేణ స స్నాయాత్తద్దేవస్మరపూర్వకమ్‌ || 15

పరధార్యం చ నోచ్ఛిష్టం రాత్రౌ చ విధృతం చ యత్‌ | తేన స్నానం తథా కార్యం క్షాలితం చ పరిత్యజేత్‌ || 16

తర్పణం చ తతః కార్యం దేవర్షి పితృతృప్తిదమ్‌ | ధౌతవస్త్రం తతో ధార్యం పునరాచమనం చరేత్‌ || 17

శుచౌ దేశే తతో గత్వా గోమయాద్యుపమార్జితే | ఆసనం చ శుభం తత్ర రచనీయం ద్విజోత్తమాః || 18

ఈ విధముగా దేశకాలములను విచారణ చేసి, తూర్పువైపునకు, లేదా ఉత్తరాభిముఖముగా తిరిగి యథావిధిగా స్నానమును చేయవలెను (14). 

కట్టి విడిచిన వస్త్రముతో ఎన్నడునూ స్నానము చేయరాదు. శుద్ధవస్త్రమును ధరించి పరమేశ్వరుని స్మరిస్తూ స్నానము చేయవలెను (15). 

ఇతరులు ధరించిన వస్త్రము, రాత్రి కట్టి విడిచిన వస్త్రము స్నానమునకు పనికిరాదు. అట్టి వస్త్రమును ఉతుకుటకు ఈయవలెను (16). 

స్నానము చేసిన తరువాత దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణములనిచ్చి తృప్తిని కలిగించవలెను. తరువాత తెల్లని వస్త్రమును ధరించి, మరల ఆచమనమును చేయవలెను (17). 

తరువాత శుభ్రమగు గోమయముతో అలుకబడిన స్థానమును చేరవలెను. ఓ విప్రశ్రేష్ఠులారా! అట్టి స్థానము నందు శుభమగు ఆసనమును ఏర్పాటు చేసుకొనవలెను (18).

శుద్ధ కాష్ఠ సముత్పన్నం పూర్ణం స్తరిత మేవ వా | చిత్రాసనం తథా కుర్యాత్సర్వ కామఫలప్రదమ్‌ || 19

యథా యోగ్యం పునర్గ్రాహ్యం మృగచర్మాదికం చ యత్‌ | తత్రోపవిశ్య కుర్వీత త్రిపుండ్రం భస్మనా సుధీః || 20

జపస్తపస్తథా దానం త్రిపుండ్రాత్సఫలం భ##వేత్‌ | అభావే భస్మనస్తత్ర జలస్యాది ప్రకీర్తితమ్‌ || 21

ఏవం కృత్వా త్రిపుండ్రం చ రుద్రాక్షాన్థారయేన్నరః | సంపాద్య భస్మనస్తత్ర జలస్యాది ప్రకీర్తితమ్‌ || 21

ఏవం కృత్వా త్రిపుండ్రం చ రుద్రాక్షాన్థారయేన్నరః | సంపాద్య చ స్వకం కర్మ పునరారాధయే చ్ఛివమ్‌ || 22

చక్కని చెక్కతో చేసి పూర్తిగా విడదీసి యున్న పీటపై కోర్కెలన్నిటినీ ఈడేర్చు చిత్రాసనమును ఏర్పాటు చేయవలెను (19). 

ఆపైన మృగచర్మ మొదలగు వాటిని ఉచితమగు తీరున ఏర్పాటు చేసి, దానిపై కూర్చుండి విద్వాంసుడు భస్మతో త్రిపుండ్రమును ధరించవలెను (20). 

త్రిపుండ్రమును ధరించి చేసిన జపము, తపస్సు మరియు దానములు సఫలమగును (21). 

ఈ తీరున త్రిపుండ్రమును ధరించి సాధకుడు రుద్రాక్షలను ధరించవలెను. అటు పిమ్మట నిత్య కర్మను అనుష్ఠించి, మరల శివుని ఆరాధించవలెను (22).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. VEDA UPANISHAD SUKTHAM - 49 🌹
🌻 1. Annapurna Upanishad - 11 🌻
--- From Atharva Veda
✍️ Dr. A. G. Krishna Warrier
📚. Prasad Bharadwaj

III-15. As a bird, for flying in the sky, leaves the net (in which it was enmeshed), the great sage sheds (his) identification with the sense-organs; then (he sheds) his awareness of limbs which has become illusory. 

III-16. He has won the knowledge of a new-born infant; as if the air should give up its power to vibrate, he has terminated the proneness of consciousness to attach itself to objects. 

III-17. Then, attaining the unqualified state of Consciousness - the state of pure Being -resorting, (as it were), to the state of dreamless slumber, he has stayed immovable like a mountain. 

III-18. Winning the stability of dreamless sleep he has attained the Fourth; though gone beyond bliss, (he is) still blissful; he has become both being and non-being. 

III-19. Then he becomes that which is beyond even the range of words which is the nihil of the nihilist and Brahman of the knowers of Brahman; 

III-20. Which is the pure blemishless cognition of the knowers of cognition, the Purusha of the Sankhyas and Ishvara of the Yogins; 

III-21. The Shiva of the Shivagamas; the Time of those who affirm Time alone (as the basic principle); the final doctrine of all Shastras, and what conforms to every heart; 

III-22. Which is the All, the all-pervading Reality, the Truth? He has become That, the unuttered, the moveless, the illuminator even of lights; 

III-23. The Principle whose sole proof is one's experience of It - he has remained as That. 

III-24. That which is unborn, deathless, beginningless and the First immaculate state, whole and impartite - he has remained as That; a state subtler than that of the sky. In a moment, he has become the hallowed God.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 34 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 14
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భారత వ్యాఖ్యానము - 5 🌻

దుర్యోధనే తు శోక్తార్తే ద్రోణః సేనాపతి స్త్వభూత్‌ | పాణ్డవే హర్షితే సైన్యే దృష్టద్యుమ్నశ్చమావతిః 11

దుర్యోధనుడు శోకార్తు డయ్యెను అపుడు ద్రోణుడు సేనాధిపత్యము వహించెను. సంతసించిన పాండవ సైన్యమున దృష్టద్యుమ్నుడు సేనాపతి అయ్యెను.

తయోర్యుద్దం బభూవోగ్రం యమరాష్ట్ర వివర్ధనమ్‌ | విరాటద్రుపదాద్యాశ్ఛ విమగ్నా ద్రోణసాగరే. 12

వారిరువురికిని యముని రాష్ట్రమును పెంచు యుద్ధము జరిగెను. ద్రోణుడను మహాసముద్రమునందు విరాట ద్రువదాదులు మునిగిపోయిరి.

దౌర్యోధనీ మహాసేనా హస్త్యశ్వరథపత్తనీ | దృష్ఠద్యుమ్నాధిపతినా ద్రోణః కాల ఇవాబభో. 13

హస్త్యశ్వరథవదాతులు గల దుర్యోధనసేన కూడ పాండవసేనాపతియైన దృష్ఠద్యుమ్ముని చేత (చంపబడెను). ద్రోణుడు యుద్దమునందు యముడు వలె కన్పట్టెను.

హతో7శ్వత్థామా చేత్యుక్తేద్రోణః శస్త్రాణి చాత్యజత్‌ | ధృష్టద్యుమ్నశరాక్రాన్తః పాతితః స మహీతలే. 14

వఞ్చమేహని దుర్ధర్షః సర్వక్షత్రం ప్రమథ్యం చ |

అశ్వత్థామ మరణించెను. అను మాట విని ద్రోణుడు ఆయుధములను విసర్జించెను. ఎదిరింప శక్యము కాని అతడు సర్వక్షత్రియులను సంహరించి ఐదవ దివసమున ధృష్టద్యుమ్నుని బాణములచే కొట్టబడి మరణించెను.

దుర్యోధనే తు శోకార్తేకర్ణః సేనాపతి స్త్వభూత్‌.15

అర్జునః పాణ్డవానాం చ తయోర్యద్ధం బభూవ హ | శస్త్రాశస్త్రి మహారౌద్రం దేవాసురరణోపమ్‌. 16

దుర్యధనుడు శోకార్తుడయ్యెను. అపుడు కర్ణుడు సేనాపతి ఆయెను. అర్జునుడు పాండవుల సేనాపతి ఆయెను వారిరువురును శస్త్రములతో ఒకరి నొకరు కొట్టుకొనగా భయంకరమైన, దేవాసురయుద్ధతుల్య మగు యుద్ధము జరిగెను.

కర్ణార్జునాఖ్యే సఙ్గ్రామే కర్ణో7రీనవధీచ్ఛరైః | ద్వితీయో7హని కర్ణస్తు అర్జునేన నిపాతితః. 17

కర్ణార్జునసంగ్రామమునందు కర్ణుడు బాణములతో శత్రువులను సంహరించెను. రెండవ రోజున కర్ణుని అర్జునుడు సంహరించెను.

శల్యో దినార్ధం యయుధే హ్యవధీత్తం యుధిష్ఠిరంః | యుయుధే భీమసేనేన హతసైన్యః సుయోధనః. 18

బహున్‌ హత్వా నరాదీంశ్చ భీమసేన మథద్రవత్‌ | గదయా ప్రహరన్తం తు భీమస్తం హి వ్యపాతయత్‌.

గదయాన్యానుజాం స్తస్య తస్మిన్నష్టాదశే7హని |

శల్యుడు సేనాధిపత్యమును వహించి అర్ద దివనము యుద్దము చేసెను. యుధిష్ఠిరు డాతనిని సంహరించెను. సైన్యము నశించగా సుయోధనుడు భీమసేనునితో యుద్ధము చేసెను. చాలమంది సైనికులు మొదలగు వారిని చంపి అతడు భీమసేనుని మీదకు వెళ్ళెను. భీమసేనుడు గదతో యుద్ధము చేయుచున్న ఆతనిని ఆతని తమ్ములను పదు నెనిమిదవ దినమున పడగొట్టెను.

రాత్రౌ సుషుప్తం చ బలం పాణ్డవానాం న్యపాతయత్‌. 20

అక్షౌహిణీ ప్రమాణం తు అశ్వత్థామా మహాబలః | ద్రౌపదేయాన్‌ స పాఞ్చాలాన్‌ దృష్టద్యుమ్నం చ సో7వధీత్‌.

మహాబలశాలి యైన అశ్వత్థామ, రాత్రియందు నిద్రించుచున్న, పాండవుల, అక్షౌహిణీప్రమాణము గల సేనను ద్రౌపదీపుత్రులను, పాంచాలులను, ధృష్టద్యుమ్నుని చంపెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 39 🌹
Chapter 12 
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

🌻 Lost in Darkness 🌻

When you are lost you look for guidance. When you are in darkness you look for light. 

 In this manner, the Avatar create s such a situation in the world that each one feels lost in darkness, looking for a guiding light.  

The light is the divine free impressions from the sun of his being.  

In this manner, the Avatar maintains a proper relationship between his shadow, the creati on, and his Reality, the Infinite.

🌻 The Force of the Whim - 1 🌻

In the infinite Ocean of God, there exist innumerable drops and as the Ocean has the whim to know "Who Am I?" each drop, therefore, has that same whim, because the Ocean is indivisible. Each drop in the Ocean is not a drop at all, but the Ocean Itself. — 

The whim is of the infinite Ocean and therefore, it must manifest an infinite number of times and it is manifesting!  

Therefore, the process of creation is continuous and it will never end, because the whim of the infinite Ocean must manifest an infinite number of times! Oceanic. 

Each drop in creation is not a drop, but Ocean, and because Ocean is indivisible, each drop's force is Each drop in creation has the oceanic whim within itself. 

Because of the force of the whim, the entire process of evolution and involution takes place in creation, because this whim is the whim of the Reality (the infinite Ocean). 

When the whim begins to activate, the shadow of the Reality (illusion) starts giving false answers to the orig inal question of Reality, real answer to the question 

"Who Am I?" "Who Am I?" and unless the whim attains the the drop goes on passing through the seven stages of evolution and involution created by the very shadow of Reality (the illusion).

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 48 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. గౌతమమహర్షి-అహల్య - 1 🌻

బోధనలు/గ్రంధాలు: గౌతమధర్మసూత్రాలు, గౌతమస్మృతి

🌻. జ్ఞానం:

1. అహల్య అంటే ఏమిటి? ‘హలం నామేవ వైరూప్యం’ – హలం అంటే వంకటింకరగా ఉండేది! వైరూప్యం-విరూపంగా ఉండేది. 

2. ‘హల్యం’ అంటే వంకరగా ఉండేది. (హలం అంటే నాగలి. నాగలి వంకరగా ఉంటుంది. దాని ఆకారం అందరికీ పరిచితమే!) కాబట్టి వంకరగా ఉండేది హలమయితే, అహల లక్షణం కలిగింది అహల్య. ‘అహల్య’ అంటే వంకరలేనిది. సృష్టిలోని ఎలాంటి వంకరా లేదు; ఆదర్శసౌందర్యం ఆవిడది.

3. గౌతముడు అహల్యాసమేతుడై దండకారణ్యవాటికలో బ్రహ్మదేవుడినిగురించి ఉగ్రంగా తపస్సుచేసాడు. 

4. బ్రహ్మదేవుడే కదా గౌతముడిని పిలిచి అహల్యనిచ్చి వివాహం చేసాడు! ఆయన గురించి తపస్సు చేయటమేమిటి? మళ్ళీ ఎందుకు చెయ్యాలి? అవసరమయితే బ్రహ్మదగ్గరికి వెళ్ళగలదు కదా! ఆయన అవసరమనుకుంటే రాగలడు కూడా! 

5. మరి ముఖాముఖీ మాట్లాడగలిగిన వాడికోసం తపస్సెందుకు? అంటే; బ్రహ్మదేవుడి దగ్గరికివెళ్ళగలడు. ఏదయినా అడిగితే ఆయన ఇస్తాడు. 

6. అయితే బ్రహ్మను గురించి చేసిన తపస్సులో, బ్రహ్మలోపల ఉండే విజ్ఞానం ఏదయితే ఉన్నదో అది పొందడంకోసం, తాను తత్తుల్యం కావడంకోసం, ఆ సంకల్పంతో గౌతముడు తపస్సు చేసాడు.

7. గోవును రక్షించిందికాబట్టి, ఆ నదికి ‘గోదావరి’ అనిపేరు. గౌతముడిచేత తీసురాబడిందికాబట్టి, ‘గౌతమి’ అని పేరు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹 Seeds Of Consciousness - 114 🌹
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

🌻 AS LONG AS THE MIND IS BUSY WITH ITS CONTORTIONS... 🌻

All the universe of experience is born with the body and dies with the body; it has its beginning and end in awareness, but awareness knows no beginning, nor end.

If you think it out carefully and brood over it for a long time, you will come to see the light of awareness in all its clarity and the world will fade out of your vision.

It is like looking at a burning incense stick, you see the stick and the smoke first; when you notice the fiery point, you realise that it has the power to consume mountains of sticks and fill the universe with smoke.

Timelessly the self actualises itself, without exhausting its infinite possibilities. 

In the incense stick simile the stick is the body and the smoke is the mind. As long as the mind is busy with its contortions, it does not perceive its own source.

The Guru comes and turns your attention to the spark within. By its very nature the mind is outward turned; it always tends to seek for the source of things among the things themselves; to be told to look for the source within, is, in a way, the beginning of a new life.

Awareness takes the place of consciousness; in consciousness there is the 'I', who is conscious while awareness is undivided; awareness is aware of itself. 

The 'I am' is a thought, while awareness is not a thought, there is no 'I am aware' in awareness. Consciousness is an attribute while awareness is not; one can be aware of being conscious, but not conscious of awareness. 

God is the totality of consciousness, but awareness is beyond all -- being as well as not-being...

Continues.....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 24 / Sri Lalita Sahasranamavali - Meaning - 24 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

శ్లోకం 54

212. మహారూపా - 
గొప్పదైన లేదా మహిమాన్వితమైన రూపము గలది.

213. మహాపూజ్యా - 
గొప్పగా పూజింపబడునది.

214. మహాపాతక నాశినీ - 
ఘోరమైన పాతకములను నాశనము చేయునది.

215. మహామాయా -
 మహిమాన్వితమైన మాయా లక్షణం కలది.

216. మహాసత్వా - మహిమాన్వితమైన ఉనికి గలది.

217. మహాశక్తిః - 
అనంతమైన శక్తి సామర్థ్యములు గలది.

218. మహారతిః - 
గొప్ప ఆసక్తి గలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 24 🌹
📚. Prasad Bharadwaj 

🌻 Sahasra Namavali - 24 🌻

212 ) Maha roopa -   
She who is very big

213 ) Maha poojya -   
She who is fit to be worshipped by great people

214 ) Maha pathaka nasini -   
She who destroys the major misdemeanors

215 ) Maha maya -   
She who is the great illusion

216 ) Maha sathva -   
She who is greatly knowledgeable

217 ) Maha sakthi -   
She who is very strong

218 ) Maha rathi -   
She who gives great happiness

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. మనోశక్తి - Mind Power - 52 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 Q 51:-- మూల చైతన్యం - 2 🌻 

4) ఒక atom ని తీసుకుంటే ఆ పరమాణువులో nucleous, electrons, protons, neurons ఉన్నాయి. ఎలెక్ట్రాన్ ఆత్మ భ్రమణం చెందుతూ nucleous చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇది విద్యుదాకర్షణ శక్తి వల్ల జరుగుతుంది. ఈ విద్యుదాకర్షణ బలానికి చలనాన్ని కలుగజేసిన చైతన్య శక్తి ఎంత గొప్పదో ఆలోచించండి.

5) మన సౌరవ్యవస్థ ని గమనిస్తే చంద్రుడు భూమి చుట్టూ భూమి సూర్యుని చుట్టూ ఆత్మభ్రమణం చెందుతూ పరిభ్రమణం చెందుతాయి. ఇలా పరిభ్రమించడానికి కారణం చైతన్యశక్తి. 

6) ఇతర లోకాలలో మనకు తెలిసిన సైన్స్ కంటే ఎంతో గొప్ప సైన్స్ ఉంది.ఒక పరమాణువులో nucleous electrons గమనం multidimensional దాని వేగం మన లెక్కల ప్రకారం కాంతి వేగం కంటే ఎన్నో లక్షల రేట్లు ఉంటుంది.ఈ వేగాన్ని మన సైన్స్ పసిగట్టే స్థితిలో లేదు.

7) కొన్ని పరమాణువులు కలిసి ఒక అణువు ఏర్పడుతుంది. 
అది రసాయనిక బంధం ద్వారా ఏర్పడుతుంది. ఈ రసాయనిక బంధాన్ని చైతన్య శక్తిని కలుగజేస్తుంది. కొన్ని అణువులు కలిసి చైతన్య శక్తి ప్రేరణతో ఒక జీవకణం తయారవుతుంది. 

మన దేహం ఎన్నో జీవకణాలతో ఏర్పడింది. ఈ జీవ కణాలన్నింటిలో జీవరసాయనికశక్తి, విద్యుదయస్కాంతశక్తి చైతన్య శక్తి నింపబడి ఉంది.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. సాయి తత్వం - మానవత్వం - 44 / Sai Philosophy is Humanity - 44 🌹
🌴. అధ్యాయము - 6 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మరమ్మతులు - 2 🌻

12. బాబా నేత్రములు నిప్పుకణములవలె వెలుగుచుండెను. ఎవరికిని బాబావైపు చూచుటకుకూడా ధైర్యము చాలకుండెను.

13. అందరు భయకంపితులైరి. బాబా తన జేబులోంచి ఒక రూపాయి తీసి యటువైపు విసరెను. అది శుభసమయమందు చేయు యాహుతివలె కనబడెను.

14. తాత్యా కూడ చాల భయపడెను. తాత్యాకేమి జరుగునున్నదో ఎవరికీ ఏమియు తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టునుండి తాత్యాను విడిపించుటకెవ్వరికిని ధైర్యము చాలలేదు.

15. ఇంతలో కుష్టురోగియు బాబా భక్తుడు నగు భాగోజి శిందే కొంచెము ధైర్యము కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వానిని ఒక ప్రక్కకు త్రోసివేసెను.

16. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకరాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదలచిరో అందరికి యొకే గతి పట్టెను.

17. కాని కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారుని పిలిపించి, వాని వద్దనుంచి యొక నగిషీ జరీపాగాను కొని, తాత్యాను ప్రత్యేకముగా సత్కరించుటకా యన్నట్లు, దానిని స్వయముగా తాత్యా తలకు చుట్టెను.

18. బాబా యొక్క యీ వింతచర్యను జూచినవారెల్లరు నాశ్చర్యమగ్నులైరి. అంత త్వరలో బాబా కెట్లు కోపము వచ్చెను? ఎందుచేత నీ విధముగ తాత్యాను శిక్షించెను? వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను? అని యందరు ఆలోచించుచుండిరి.

19. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తివలె గూర్చుండి అత్యంత ప్రేమానురాగముతో మాట్లాడుచుండువారు.

20. అంతలో నకరాణముగా కోపించెడివారు. అటువంటి సంఘటనలు అనేకములు గలవు. కాని యేది చెప్పవలెనను విషయము తేల్చుకొనలేకున్నాను.

21. అందుచే నాకు జ్ఞాపకము వచ్చినప్పుడెల్ల ఒక్కొక్కటి చెప్పెదను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sai Philosophy is Humanity - 44 🌹
Chapter 6
✍️. Sri NV. Gunaji
📚. Prasad Bharadwaj

🌻 Repairs to the Masjid - 2 🌻

 At that time, Baba’s eyes flashed like burning embers. None dared to look at Him. All got terribly frightened. 

Baba took out a rupee from his pocket and threw it there, as if it were an offering on an auspicious occasion. Tatya also was much frightened. 

None knew what was going to happen to Tatya, and none dared to interfere. Bhagoji Shinde, the leper devotee of Baba, made a little boldly advance, but he was pushed out by Baba. 

Madhavrao was also similarly treated, he being pelted with brick pieces. So all those, who went to intercede, were similarly dealt with. But after some time, Baba’s anger cooled down. 

He sent for a shopkeeper, got from him an embroidered Pheta and Himself tied it on Tatya’s head, as if he was being given a special honour. All the people were wonderstruck to see this strange behavior of Baba. 

They were at a loss to know, what enraged Baba so suddenly and what led Him to assault Tatya Patil, and why His anger cooled down, the next moment. 

Baba was sometimes very calm and quiet and talked sweet things with love, but soon after, with or without any pretext, got enraged. 

Many such incidents may be related; but I do not know which to choose and which to omit. I, therefore, refer them as they occur to me.

In the next Chapter the question whether Baba was a Hindu or a Mahomedan will be taken up; and His Yogic practices and powers, and other matters will be dealt with.

Bow to Shri Sai Baba - Peace be to all.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹