మైత్రేయ మహర్షి బోధనలు - 109


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 109 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 86. సమాధాన విద్య - 1 🌻


ప్రశ్నకు సమాధానము తెలుపువాడు అవగాహన ఏర్పడునట్లు సమాధానమీయవలెను. సమాధానమిచ్చినను అవగాహన కాదు అని అనిపించినచో సమాధాన మీయకుండుటయే మంచిది. సాధారణముగ సమాధానము నుండి మరల ప్రశ్నలు పుట్టుచుండును. అనగా పృచ్ఛకుడు సమాధానపడలేదనే కదా అర్థము. ప్రశ్నలతో కలవర పడువారికి సమాధానము మరింత కలవరపెట్టకలదు సుమా!

అందుకే తెలిసిననూ సమాధానమీయ కుండుట ఉత్తమము. పృచ్ఛకుడే సమాధాన పడునట్లు సూచన లీయుట బోధన కాని సూటిగా సమాధానమును చెప్పుట ఉపయోగకరము కాదు. సూచనలే ఉపయోగకరము. సూచనలు ప్రశ్నించు వాడి ప్రశ్నయందే యుండును. ప్రశ్న యందే సమాధాన మున్నది అని తెలుపుటలో గల రహస్య మిదియే.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


26 Apr 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 170


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 170 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నువ్వు అహం లేకుండా వుండగలిగితే, ఫలానాగా , ఎవరిగానో వుండని పక్షంలో, ఏమీ లేనితనంగా వుండే పక్షంలో అనంతాన్ని అందుకుంటావు. అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటావు. దాన్ని మించిన లక్ష్యం లేదు. 🍀


అహమొక్కటే సమస్య. అప్పుడది వేల సమస్యల్ని సృష్టిస్తుంది. ఈర్ష్య, అసూయ, కాంక్ష, ద్వేషం యిట్లా లెక్కలేనన్ని వాటిని సృష్టిస్తుంది. జనం వాటన్నిటితో ఘర్షిస్తారు. ఫలితముండదు. పునాదుల్ని మార్చినపుడు కానీ ఫలితముండదు. కొమ్మల్ని నరికితే మళ్ళీ చిగురిస్తాయి. ఆకుల్ని తుంపితే మళ్ళీ వస్తాయి. చెట్టు మరిం బలంగా మారుతుంది. నేనేమంటానంటే వాటితో ఘర్షించకు. మూలాల్లోకి వెళ్ళు. అక్కడ పునాదిగా వున్నది అహం. నువ్వు అహం లేకుండా వుండగలిగితే, ఫలానాగా వుండలేని పక్షంలో, ఎవరిగానో వుండని పక్షంలో, ఎవరిగానో మారని పక్షంలో ఏమీలేనితనంగా వుండే పక్షంలో అనంతాన్ని అందుకుంటావు. అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటావు. దాన్ని మించిన లక్ష్యం లేదు. దాన్ని సులభంగా అందుకోవచ్చు.

కారణం అహమన్నది ఒక పొరపాటు విషయం భ్రాంతి. అందు వల్ల దాన్ని వదిలించుకోవచ్చు. అది యథార్థం కాదు. వూహ, నీడ. అది వున్నదని నువ్వు నమ్ముతూ పోతే అది వుంటుంది. లోలోతుల్లోకి నువ్వు చూస్తే అది వుండదు. ధ్యానమంటే లోలోతుల్లోకి గాఢంగా చూడడం. అహాన్ని చూడడం అన్ని కోణాల్లో నీ అస్తిత్వం ఎక్కడ వుందో పరిశీలనగా చూడడం. అదెక్కడా కనిపించదు. అదెక్కడా కనిపించని క్షణంలో నీ ప్రయత్నం ఫలవంతమవుతుంది. కొత్త జన్మనెత్తుతావు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


26 Apr 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 270 - 26. మోక్షానికి కృషి చేయడం అన్ని సేవల కంటే గొప్పది. / DAILY WISDOM - 270 - 26. To work for the salvation is the greatest of all services


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 270 / DAILY WISDOM - 270 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 26. మోక్షానికి కృషి చేయడం అన్ని సేవల కంటే గొప్పది. 🌻


'నిన్నులాగే నీ పొరుగువానిని ప్రేమించు' అనే సూక్తి చుట్టూ తిరుగుతున్న ప్రసిద్ధ కార్యక్రమం చాలా విస్తృతమైన జ్ఞానాన్ని కలిగి ఉంది. పొరుగువారిని ఎందుకు ప్రేమించాలి? వేదాంత తత్వశాస్త్రం ఎలా సమాధానం ఇస్తుందంటే : 'ఎందుకంటే నీ పొరుగువాడు కూడా నీ స్వయమే కాబట్టి.' ఇక్కడ ఇరుగుపొరుగు అని పిలువబడే మరొక వ్యక్తి పట్ల ఒక వ్యక్తి యొక్క బాధ్యత, ఆ వ్యక్తి యొక్క స్వయాన్ని తనలో ఎంతవరకు గుర్తించారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మానవాళికి అత్యున్నతమైన సేవ చేసేవారు తమ ముందు అనేక మంది వ్యక్తులను చూసి వారికి సేవ చేయాలనే సామాజిక మరియు రాజికీయ ఆవశ్యకము చూడకుండా అందరూ తనలో భాగమే అనే నిగూఢమైన విషయాన్ని దర్శిస్తారు.

మానవజాతి యొక్క ఆధ్యాత్మిక నాయకులు మాత్రమే వారి ఆత్మల పరంగా ప్రజలకు గొప్ప సేవను అందించగలరు, అయితే సాధారణ సామాజిక-సంక్షేమ పథకాలు మానవాళి అవసరాల యొక్క అంచుని మాత్రమే తాకగలవు. ఆహారం, దుస్తులు, నివాసం మరియు వైద్య సహాయంతో శరీరానికి సేవ చేయడం నిజంగా మంచిదే, కానీ మానవుని గౌరవాన్ని దైవత్వ చిహ్నంగా గుర్తించడం ద్వారా ప్రజలను విద్యావంతులను చేయడం మరియు వారిలో విశ్వాసం కలిగించడం మెరుగైన సేవ. ఆత్మ యొక్క మోక్షానికి కృషి చేయడం అన్ని సేవల కంటే గొప్పది. సాధువులు మరియు ఋషులు, వారి శక్తివంతమైన ఆలోచనలు మరియు ఏకాగ్రమైన భావాలతో, భౌతిక నేత్రాలతో చూడలేని సేవను అందిస్తారు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 270 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 26. To work for the salvation is the greatest of all services 🌻


The well-known programme revolving round the dictum, “Love thy neighbour as thyself,” has far-reaching implications. Why should one love one's neighbour? The Vedanta philosophy would give the answer: “Because thy neighbour is thy own self.” The responsibility of a person to another person, who is here called the neighbour, depends on the extent to which one recognises in the person of another the essence of one's own self. Those who render the greatest service to mankind are people who do not merely behold in front of them a multitude of persons and feel a social obligation or a political necessity to be considerate and serviceful to them, but those in whom a deeper impulse is welling up to see their own selves in all.

The spiritual leaders of mankind alone can render the greatest service to people in terms of their very souls, while the common social-welfare projects can touch only the fringe of humanity's needs. To serve the body with food, clothing, shelter and medical attention is indeed good, but a better service would be to educate people and make them confident in themselves with the recognition of the dignity of man as an emblem of divinity. To work for the salvation of the soul is the greatest of all services. The saints and sages, with their powerful thoughts and concentrated feelings, render a service which cannot be seen with the physical eyes.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


26 Apr 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 591 / Vishnu Sahasranama Contemplation - 591


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 591 / Vishnu Sahasranama Contemplation - 591🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 591. గోహితః, गोहितः, Gohitaḥ 🌻

ఓం గోహితాయ నమః | ॐ गोहिताय नमः | OM Gohitāya namaḥ

గవాం వృద్ధ్యర్థమపి గోవర్ధనం ధృతవానితి ।
గోభ్యోహితో గోహిత ఇత్యుచ్యతే విబుదైర్హరిః ॥

గోవులకు హితుడు. గోవుల విషయమున హితకరమగు పనులు చేయువాడు గోహితః. గోవులను కాపాడటానికై గోవర్ధన గిరిని ధరించియుండుట ఒక ఉదాహరణ. లేదా 'గో' అనగా భూమికి సంబంధించిన విషయమున హితమును చేకూర్చువాడు అని కూడా చెప్పవచ్చును. భూభారమును తగ్గించుటకొరకై పలు అవతారములను దాల్చి యుండెను కదా!


:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వ భాగము ::

క. ఏ నవతరించు టెల్లను, మానుగఁ జతురంతధరణి మండలభరమున్‍
మానుపుకోఱకుం గాదే, పూనెద నిది మొదలు దగిలి భూభార మణఁపన్‍. (1533)
ఆ. మగధనాథుఁ బోర మడియింపఁ బోలదు, మడియకున్న వీఁడు మరల మరలి
బలము గూర్చికొంచుఁ బఱతెంచుఁ బరతేరఁ, ద్రుంపవచ్చు నేల దొసఁగు దొఱఁగ. (1534)

నేను అవతరించుట నాలుగు చెఱగుల భూభారమును నివారించుట కొరకేగనుక నేటినుంచి భూభారమును హరించుటకు ఉద్యమిస్తాను. యుద్ధములో మగధేశ్వరుడైన జరాసంధుడిని చంపరాదు. వీడు చావకుంటే మళ్ళీ మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకొని వస్తూ వుంటాడు. అప్పుడు అందరినీ చంపి ధరాభారమును ఉడిపి, ఆవల వీడిని చంపవచ్చును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 591🌹

📚. Prasad Bharadwaj

🌻 591. Gohitaḥ 🌻

OM Gohitāya namaḥ


गवां वृद्ध्यर्थमपि गोवर्धनं धृतवानिति ।
गोभ्योहितो गोहित इत्युच्यते विबुदैर्हरिः ॥

Gavāṃ vr‌ddhyarthamapi govardhanaṃ dhr‌tavāniti,
Gobhyohito gohita ityucyate vibudairhariḥ.


The One who thinks of welfare of the cows. For the welfare of cows he lifted and sustained the Govardhana hill. So Gohitaḥ or the One who thinks of welfare of the cows.

Or 'Go' can also be interpreted as earth. To ease the burden of earth, i.e., annihilate the evil doers who are a burden to earth, He incarnated many times and hence He is Gohitaḥ.


:: श्रीमद्भागवते एकादशस्कन्धे पञ्चमोऽध्यायः ::

भूभारासुरराजन्य हन्तवे गुप्तये सताम् ।
अवतीर्णस्य निर्वृत्यैः यशो लोके वितन्तये ॥ ५० ॥


Śrīmad Bhāgavata - Canto 11, Chapter 5

Bhūbhārāsurarājanya hantave guptaye satām,
Avatīrṇasya nirvr‌tyaiḥ yaśo loke vitantaye. 50.


The Lord descended to kill the demoniac kings who were the burden of the earth and to protect the saintly devotees. However, both the demons and the devotees are awarded liberation by the Lord's mercy. Thus, His transcendental fame has spread throughout the universe.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।
गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥

శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥

Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,
Gohito gopatirgoptā vr‌ṣabhākṣo vr‌ṣapriyaḥ ॥ 63 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


26 Apr 2022

26 - APRIL - 2022 మంగళవారం, భౌమ వాసరే MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 26, ఏప్రిల్ 2022 మంగళవారం, భౌమ వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 192 / Bhagavad-Gita - 192 - 4-23 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 591 / Vishnu Sahasranama Contemplation - 591🌹
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 270 / DAILY WISDOM - 270 🌹  
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 170 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 109 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 26, ఏప్రిల్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : వరూధిని ఏకాదశి, Varuthini Ekadashi, 🌻*

*🍀. అంజని పుత్ర స్తోత్రం - 7 🍀*

*సీతా రక్షక హనుమంత* 
*ఇహపర దాయక హనుమంత*
*జయ బజరంగబలి*
*జయ జయ జయ బజరంగబలి..*
*ఆంజని పుత్ర సోత్రం సంపూర్ణం.*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మానవాళి విధి రూపకల్పనకు మనతోనే ప్రారంభించి, అటు తర్వాత ఇతరులు మన చైతన్యంలో 
కలిసి పోయేలా దాన్ని విస్తరించాలి. - సద్గురు శ్రీరామశర్మ 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, చైత్ర మాసం
ఉత్తరాయణం, వసంత ఋతువు
తిథి: కృష్ణ ఏకాదశి 24:49:43 వరకు
తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: శతభిషం 16:58:24 వరకు
తదుపరి పూర్వాభద్రపద
యోగం: బ్రహ్మ 19:05:53 వరకు
తదుపరి ఇంద్ర
కరణం: బవ 13:13:14 వరకు
వర్జ్యం: 00:20:12 - 01:55:08
మరియు 23:23:24 - 25:00:00
దుర్ముహూర్తం: 08:25:28 - 09:16:15
రాహు కాలం: 15:24:25 - 16:59:38
గుళిక కాలం: 12:13:59 - 13:49:12
యమ గండం: 09:03:34 - 10:38:47
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:38
అమృత కాలం: 09:49:48 - 11:24:44
సూర్యోదయం: 05:53:07
సూర్యాస్తమయం: 18:34:51
చంద్రోదయం: 02:59:05
చంద్రాస్తమయం: 14:48:46
సూర్య సంచార రాశి: మేషం
చంద్ర సంచార రాశి: కుంభం
మృత్యు యోగం - మృత్యు భయం
16:58:24 వరకు తదుపరి కాల యోగం
- అవమానం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 192 / Bhagavad-Gita - 192 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 30 🌴*

*30. సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషా: |*
*యజ్ఞశిష్టామృతభుజో యాన్తి బ్రహ్మ సనాతనమ్ ||*

🌷. తాత్పర్యం :
*యజ్ఞ ప్రయోజనము నెరిగిన ఈ కర్తలందరును పాపఫలముల నుండి శుద్ధిపది, యజ్ఞఫలమనెడి అమృతమును ఆస్వాదించినందున నిత్యమైన భగవద్ధామము వైపునకు పురోగమింతురు.*

🌷. భాష్యము :
ఇంతవరకు తెలిపిన వివిధ యజ్ఞముల (ద్రవ్యమయ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, యోగయజ్ఞము) వివరణను బట్టి ఇంద్రియనిగ్రహమే వాటన్నింటి మూలలక్ష్యమని అవగతమగుచున్నది. ఇంద్రియభోగానుభవమే భవబంధమునకు మూలకారణమై యున్నందున భోగానుభవముకు పరమైన స్థితి యందు నిలువనిదే ఎవ్వరును నిత్యమును మరియు జ్ఞానానందపూర్ణమును అగు నిత్యస్థితికి ఉద్దరింపబడు అవకాశము లేదు. అట్టి స్థితి నిత్యాకాశమునందు (పరబ్రహ్మాకాశము నందు) కలదు. 

ఇంతవరకు తెలుపబడిన యజ్ఞములన్నియును భౌతికజీవనపు పాపఫలముల నుండి శుద్ధిపడుటకు మనుజునకు తోడ్పడును. ఇట్టి పురోగతి ద్వారా అతడు జీవితమునందు ఆనందమయుడు మరియు వైభవోపేతుడగుటయే గాక అంత్యమున నిరాకారబ్రహ్మమునందు లీనమగుట ద్వారా కాని లేదా దేవదేవుడైన శ్రీకృష్ణుని సాహచర్యమును పొందుట ద్వారా కాని నిత్యమైన భగవద్ధామమున ప్రవేశింపగలడు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 192 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 30 🌴*

*30. sarve ’py ete yajña-vido yajña-kṣapita-kalmaṣāḥ*
*yajña-śiṣṭāmṛta-bhujo yānti brahma sanātanam*

🌷 Translation : 
*All these performers who know the meaning of sacrifice become cleansed of sinful reactions, and, having tasted the nectar of the results of sacrifices, they advance toward the supreme eternal atmosphere.*

🌹 Purport :
From the foregoing explanation of different types of sacrifice (namely sacrifice of one’s possessions, study of the Vedas or philosophical doctrines, and performance of the yoga system), it is found that the common aim of all is to control the senses. Sense gratification is the root cause of material existence; therefore, unless and until one is situated on a platform apart from sense gratification, there is no chance of being elevated to the eternal platform of full knowledge, full bliss and full life. 

This platform is in the eternal atmosphere, or Brahman atmosphere. All the above-mentioned sacrifices help one to become cleansed of the sinful reactions of material existence. By this advancement in life, not only does one become happy and opulent in this life, but also, at the end, he enters into the eternal kingdom of God, either merging into the impersonal Brahman or associating with the Supreme Personality of Godhead, Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 591 / Vishnu Sahasranama Contemplation - 591🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 591. గోహితః, गोहितः, Gohitaḥ 🌻*

*ఓం గోహితాయ నమః | ॐ गोहिताय नमः | OM Gohitāya namaḥ*

*గవాం వృద్ధ్యర్థమపి గోవర్ధనం ధృతవానితి ।*
*గోభ్యోహితో గోహిత ఇత్యుచ్యతే విబుదైర్హరిః ॥*

*గోవులకు హితుడు. గోవుల విషయమున హితకరమగు పనులు చేయువాడు గోహితః. గోవులను కాపాడటానికై గోవర్ధన గిరిని ధరించియుండుట ఒక ఉదాహరణ. లేదా 'గో' అనగా భూమికి సంబంధించిన విషయమున హితమును చేకూర్చువాడు అని కూడా చెప్పవచ్చును. భూభారమును తగ్గించుటకొరకై పలు అవతారములను దాల్చి యుండెను కదా!*

:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వ భాగము ::
క. ఏ నవతరించు టెల్లను, మానుగఁ జతురంతధరణి మండలభరమున్‍
    మానుపుకోఱకుం గాదే, పూనెద నిది మొదలు దగిలి భూభార మణఁపన్‍. (1533)
ఆ. మగధనాథుఁ బోర మడియింపఁ బోలదు, మడియకున్న వీఁడు మరల మరలి
     బలము గూర్చికొంచుఁ బఱతెంచుఁ బరతేరఁ, ద్రుంపవచ్చు నేల దొసఁగు దొఱఁగ. (1534)

*నేను అవతరించుట నాలుగు చెఱగుల భూభారమును నివారించుట కొరకేగనుక నేటినుంచి భూభారమును హరించుటకు ఉద్యమిస్తాను. యుద్ధములో మగధేశ్వరుడైన జరాసంధుడిని చంపరాదు. వీడు చావకుంటే మళ్ళీ మళ్ళీ సైన్యాన్ని సమకూర్చుకొని వస్తూ వుంటాడు. అప్పుడు అందరినీ చంపి ధరాభారమును ఉడిపి, ఆవల వీడిని చంపవచ్చును.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 591🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 591. Gohitaḥ 🌻*

*OM Gohitāya namaḥ*

गवां वृद्ध्यर्थमपि गोवर्धनं धृतवानिति ।
गोभ्योहितो गोहित इत्युच्यते विबुदैर्हरिः ॥

*Gavāṃ vr‌ddhyarthamapi govardhanaṃ dhr‌tavāniti,*
*Gobhyohito gohita ityucyate vibudairhariḥ.*

*The One who thinks of welfare of the cows. For the welfare of cows he lifted and sustained the Govardhana hill. So Gohitaḥ or the One who thinks of welfare of the cows.*

*Or 'Go' can also be interpreted as earth. To ease the burden of earth, i.e., annihilate the evil doers who are a burden to earth, He incarnated many times and hence He is Gohitaḥ.*

:: श्रीमद्भागवते एकादशस्कन्धे पञ्चमोऽध्यायः ::
भूभारासुरराजन्य हन्तवे गुप्तये सताम् ।
अवतीर्णस्य निर्वृत्यैः यशो लोके वितन्तये ॥ ५० ॥

Śrīmad Bhāgavata - Canto 11, Chapter 5
Bhūbhārāsurarājanya hantave guptaye satām,
Avatīrṇasya nirvr‌tyaiḥ yaśo loke vitantaye. 50.

*The Lord descended to kill the demoniac kings who were the burden of the earth and to protect the saintly devotees. However, both the demons and the devotees are awarded liberation by the Lord's mercy. Thus, His transcendental fame has spread throughout the universe.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
शुभाङ्गश्शान्तिदस्स्रष्टा कुमुदः कुवलेशयः ।गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः ॥ ६३ ॥
శుభాఙ్గశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ 63 ॥
Śubhāṅgaśśāntidassraṣṭā kumudaḥ kuvaleśayaḥ,Gohito gopatirgoptā vr‌ṣabhākṣo vr‌ṣapriyaḥ ॥ 63 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 270 / DAILY WISDOM - 270 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 26. మోక్షానికి కృషి చేయడం అన్ని సేవల కంటే గొప్పది. 🌻*

*'నిన్నులాగే నీ పొరుగువానిని ప్రేమించు' అనే సూక్తి చుట్టూ తిరుగుతున్న ప్రసిద్ధ కార్యక్రమం చాలా విస్తృతమైన జ్ఞానాన్ని కలిగి ఉంది. పొరుగువారిని ఎందుకు ప్రేమించాలి? వేదాంత తత్వశాస్త్రం ఎలా సమాధానం ఇస్తుందంటే : 'ఎందుకంటే నీ పొరుగువాడు కూడా నీ స్వయమే కాబట్టి.' ఇక్కడ ఇరుగుపొరుగు అని పిలువబడే మరొక వ్యక్తి పట్ల ఒక వ్యక్తి యొక్క బాధ్యత, ఆ వ్యక్తి యొక్క స్వయాన్ని తనలో ఎంతవరకు గుర్తించారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మానవాళికి అత్యున్నతమైన సేవ చేసేవారు తమ ముందు అనేక మంది వ్యక్తులను చూసి వారికి సేవ చేయాలనే సామాజిక మరియు రాజికీయ ఆవశ్యకము చూడకుండా అందరూ తనలో భాగమే అనే నిగూఢమైన విషయాన్ని దర్శిస్తారు.*

*మానవజాతి యొక్క ఆధ్యాత్మిక నాయకులు మాత్రమే వారి ఆత్మల పరంగా ప్రజలకు గొప్ప సేవను అందించగలరు, అయితే సాధారణ సామాజిక-సంక్షేమ పథకాలు మానవాళి అవసరాల యొక్క అంచుని మాత్రమే తాకగలవు. ఆహారం, దుస్తులు, నివాసం మరియు వైద్య సహాయంతో శరీరానికి సేవ చేయడం నిజంగా మంచిదే, కానీ మానవుని గౌరవాన్ని దైవత్వ చిహ్నంగా గుర్తించడం ద్వారా ప్రజలను విద్యావంతులను చేయడం మరియు వారిలో విశ్వాసం కలిగించడం మెరుగైన సేవ. ఆత్మ యొక్క మోక్షానికి కృషి చేయడం అన్ని సేవల కంటే గొప్పది. సాధువులు మరియు ఋషులు, వారి శక్తివంతమైన ఆలోచనలు మరియు ఏకాగ్రమైన భావాలతో, భౌతిక నేత్రాలతో చూడలేని సేవను అందిస్తారు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 270 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 26. To work for the salvation is the greatest of all services 🌻*

*The well-known programme revolving round the dictum, “Love thy neighbour as thyself,” has far-reaching implications. Why should one love one's neighbour? The Vedanta philosophy would give the answer: “Because thy neighbour is thy own self.” The responsibility of a person to another person, who is here called the neighbour, depends on the extent to which one recognises in the person of another the essence of one's own self. Those who render the greatest service to mankind are people who do not merely behold in front of them a multitude of persons and feel a social obligation or a political necessity to be considerate and serviceful to them, but those in whom a deeper impulse is welling up to see their own selves in all.*

*The spiritual leaders of mankind alone can render the greatest service to people in terms of their very souls, while the common social-welfare projects can touch only the fringe of humanity's needs. To serve the body with food, clothing, shelter and medical attention is indeed good, but a better service would be to educate people and make them confident in themselves with the recognition of the dignity of man as an emblem of divinity. To work for the salvation of the soul is the greatest of all services. The saints and sages, with their powerful thoughts and concentrated feelings, render a service which cannot be seen with the physical eyes.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 170 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. నువ్వు అహం లేకుండా వుండగలిగితే, ఫలానాగా , ఎవరిగానో వుండని పక్షంలో, ఏమీ లేనితనంగా వుండే పక్షంలో అనంతాన్ని అందుకుంటావు. అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటావు. దాన్ని మించిన లక్ష్యం లేదు. 🍀*

*అహమొక్కటే సమస్య. అప్పుడది వేల సమస్యల్ని సృష్టిస్తుంది. ఈర్ష్య, అసూయ, కాంక్ష, ద్వేషం యిట్లా లెక్కలేనన్ని వాటిని సృష్టిస్తుంది. జనం వాటన్నిటితో ఘర్షిస్తారు. ఫలితముండదు. పునాదుల్ని మార్చినపుడు కానీ ఫలితముండదు. కొమ్మల్ని నరికితే మళ్ళీ చిగురిస్తాయి. ఆకుల్ని తుంపితే మళ్ళీ వస్తాయి. చెట్టు మరిం బలంగా మారుతుంది. నేనేమంటానంటే వాటితో ఘర్షించకు. మూలాల్లోకి వెళ్ళు. అక్కడ పునాదిగా వున్నది అహం. నువ్వు అహం లేకుండా వుండగలిగితే, ఫలానాగా వుండలేని పక్షంలో, ఎవరిగానో వుండని పక్షంలో, ఎవరిగానో మారని పక్షంలో ఏమీలేనితనంగా వుండే పక్షంలో అనంతాన్ని అందుకుంటావు. అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటావు. దాన్ని మించిన లక్ష్యం లేదు. దాన్ని సులభంగా అందుకోవచ్చు.*

*కారణం అహమన్నది ఒక పొరపాటు విషయం భ్రాంతి. అందు వల్ల దాన్ని వదిలించుకోవచ్చు. అది యథార్థం కాదు. వూహ, నీడ. అది వున్నదని నువ్వు నమ్ముతూ పోతే అది వుంటుంది. లోలోతుల్లోకి నువ్వు చూస్తే అది వుండదు. ధ్యానమంటే లోలోతుల్లోకి గాఢంగా చూడడం. అహాన్ని చూడడం అన్ని కోణాల్లో నీ అస్తిత్వం ఎక్కడ వుందో పరిశీలనగా చూడడం. అదెక్కడా కనిపించదు. అదెక్కడా కనిపించని క్షణంలో నీ ప్రయత్నం ఫలవంతమవుతుంది. కొత్త జన్మనెత్తుతావు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 109 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 86. సమాధాన విద్య - 1 🌻*

*ప్రశ్నకు సమాధానము తెలుపువాడు అవగాహన ఏర్పడునట్లు సమాధానమీయవలెను. సమాధానమిచ్చినను అవగాహన కాదు అని అనిపించినచో సమాధాన మీయకుండుటయే మంచిది. సాధారణముగ సమాధానము నుండి మరల ప్రశ్నలు పుట్టుచుండును. అనగా పృచ్ఛకుడు సమాధానపడలేదనే కదా అర్థము. ప్రశ్నలతో కలవర పడువారికి సమాధానము మరింత కలవరపెట్టకలదు సుమా!*

*అందుకే తెలిసిననూ సమాధానమీయ కుండుట ఉత్తమము. పృచ్ఛకుడే సమాధాన పడునట్లు సూచన లీయుట బోధన కాని సూటిగా సమాధానమును చెప్పుట ఉపయోగకరము కాదు. సూచనలే ఉపయోగకరము. సూచనలు ప్రశ్నించు వాడి ప్రశ్నయందే యుండును. ప్రశ్న యందే సమాధాన మున్నది అని తెలుపుటలో గల రహస్య మిదియే.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹