శివలింగాభిషేకం - వివిధ ఫలితాలు Shivalingabhishekam - Various Phalas/results

🌹.శివలింగాభిషేకం - వివిధ ఫలితాలు🌹

🙏🙏🕉🙏🙏☘️🙏🙏🕉🙏🙏

1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.

2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.

3 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును

4 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును.

5 .ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును

6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును.

7 .మెత్తని చెక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును

8 .మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును.

9 .తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.

10.పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.

11.కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.

12 .రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.

13 .భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.

14 .గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.

15 .బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.

16 .నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును

17 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును.

శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నాన్ని మెత్తగా రుబ్బి దాంతో లింగాకారానికి లేపనంలాగా రాస్తారు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.

18 మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాలవ్యాదులు నయమగును.

19 కస్తురి కలిపిన నీటితో అభిషేకం చేస్తే చక్రవర్తి యోగం కలుగును.

20 పసుపు కలిపిన నీటితో అభిషేకం చేస్తే మంగళ ప్రదమగును శుభకార్యాలు జరుగును.

🌹 🌹 🌹 🌹 🌹

01 Mar 2022

మహిమాన్విత 108 లింగాలు - 108 Shivalingas

*🌹. మహిమాన్విత 108 లింగాలు 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఈ రోజు 108 నామాలు ఒకసారి చదువుకోండి 🍀*

1. ఓం లింగాయ నమః
2. ఓం శివ లింగాయనమః
3. ఓం శంబు లింగాయనమః
4. ఓం ఆధిగణార్చిత లింగాయనమః
5. ఓం అక్షయ లింగాయనమః
6. ఓం అనంత లింగాయనమః
7. ఓం ఆత్మ లింగాయనమః
8. ఓం అమరనాదేశ్వర లింగాయనమః
9. ఓం అమర లింగాయనమః
10. ఓం అగస్థేశ్వర లింగాయనమః

11. ఓం అచలేశ్వర లింగాయనమః
12. ఓం అరుణాచలేశ్వర లింగాయనమః
13. ఓం అర్ధ నారీశ్వర లింగాయనమః
14. ఓం అపూర్వ లింగాయనమః
15. ఓం అగ్ని లింగాయనమః
16. ఓం వాయు లింగాయనమః
17. ఓం జల లింగాయనమః
18. ఓం గగన లింగాయనమః
19. ఓం పృథ్వి లింగాయనమః
20. ఓం పంచభూతేశ్వర లింగాయనమః

21. ఓం పంచముఖేశ్వర లింగాయనమః
22. ఓం ప్రణవ లింగాయనమః
23. ఓం పగడ లింగాయనమః
24. ఓం పశుపతి లింగాయనమః
25. ఓం పీత మణి మయ లింగాయనమః
26. ఓం పద్మ రాగ లింగాయనమః
27. ఓం పరమాత్మక లింగాయనమః
28. ఓం సంగమేశ్వర లింగాయనమః
29. ఓం స్పటిక లింగాయనమః
30. ఓం సప్త ముఖేశ్వర లింగాయనమః

31. ఓం సువర్ణ లింగాయనమః
32. ఓం సుందరేశ్వర లింగాయనమః
33. ఓం శృంగేశ్వర లింగాయనమః
34. ఓం సోమనాథేశ్వర లింగాయనమః
35. ఓం సిధేశ్వర లింగాయనమః
36. ఓం కపిలేశ్వర లింగాయనమః
37. ఓం కాపర్డేశ్వర లింగాయనమః
38. ఓం కేదారేశ్వర లింగాయనమః
39. ఓం కళాత్మక లింగాయనమః
40. ఓం కుంభేశ్వర లింగాయనమః

41. ఓం కైలాస నాదేశ్వర లింగాయనమః
42. ఓం కోటేశ్వర లింగాయనమః
43. ఓం వజ్ర లింగాయనమః
44. ఓం వైడుర్య లింగాయనమః
45. ఓం వైద్య నాదేశ్వర లింగాయనమః
46. ఓం వేద లింగాయనమః
47. ఓం యోగ లింగాయనమః
48. ఓం వృద్ధ లింగాయనమః
49. ఓం హిరణ్య లింగాయనమః
50. ఓం హనుమతీశ్వర లింగాయనమః

51. ఓం విరూపాక్షేశ్వర లింగాయనమః
52. ఓం వీరభద్రేశ్వర లింగాయనమః
53. ఓం భాను లింగాయనమః
54. ఓం భవ్య లింగాయనమః
55. ఓం భార్గవ లింగాయనమః
56. ఓం భస్మ లింగాయనమః
57. ఓం భిందు లింగాయనమః
58. ఓం బిమేశ్వర లింగాయనమః
59. ఓం భీమ శంకర లింగాయనమః
60. ఓం బృహీశ్వర లింగాయనమః

61. ఓం క్షిరారామ లింగాయనమః
62. ఓం కుమార రామ బిమేశ్వర లింగాయనమః
63. ఓం మహానంది ఈశ్వర లింగాయనమః
64. ఓం మహా రుద్ర లింగాయనమః
65. ఓం మల్లికార్జున లింగాయనమః
66. ఓం మహా కాళేశ్వర లింగాయనమః
67. ఓం మల్లీశ్వర లింగాయనమః
68. ఓం మంజునాథ లింగాయనమః
69. ఓం మరకత లింగాయనమః
70. ఓం మహేశ్వర లింగాయనమః

71. ఓం మహా దేవ లింగాయనమః
72. ఓం మణికంధరేశ్వర లింగాయనమః
73. ఓం మార్కండేయ లింగాయనమః
74. ఓం మాడిణ్యేశ్వర లింగాయనమః
75. ఓం ముక్తేశ్వర లింగాయనమః
76. ఓం మృతింజేయ లింగాయనమః
77. ఓం రామేశ్వర లింగాయనమః
78. ఓం రామనాథేశ్వర లింగాయనమః
79. ఓం రస లింగాయనమః
80. ఓం రత్నలింగాయనమః

81. ఓం రజిత లింగాయనమః
82. ఓం రాతి లింగాయనమః
83. ఓం గోకర్ణాఈశ్వర లింగాయనమః
84. ఓం గోమేధిక లింగాయనమః
85. ఓం నాగేశ్వర లింగాయనమః
86. ఓం ఓంకారేశ్వర లింగాయనమః
87. ఓం ఇంద్ర నిల మణి లింగాయనమః
88. ఓం శరవణ లింగాయనమః
89. భృగువేశ్వర లింగాయనమః
90. ఓం నీలకంటేశ్వర లింగాయనమః

91. ఓం చౌడేశ్వర లింగాయనమః
92. ఓం ధర్మ లింగాయనమః
93. ఓం జోతిర్ లింగాయనమః
94. ఓం సైకత లింగాయనమః
95. ఓం చంద్రమౌలీశ్వర లింగాయనమః
96. ఓం జ్వాలా లింగాయనమః
97. ఓం ధ్యాన లింగాయనమః
98. ఓం పుష్యా రాగ లింగాయ నమః
99. ఓం నందికేశ్వర లింగాయ నమః
100. ఓం అభయ లింగాయ నమః
101. ఓం సహస్ర లింగాయ నమః
102. ఓం ఏకాంబరేశ్వర లింగాయనమః
103. ఓం సాలగ్రామ లింగాయనమః
104. ఓం శరభ లింగాయనమః
105. ఓం విశ్వేశ్వర లింగాయనమః
106. ఓం పథక నాశన లింగాయనమః
107. ఓం మోక్ష లింగాయనమః
108. ఓం విశ్వరాధ్య లింగాయనమః.
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

01 Mar 2022

🌹. నిర్వాణ షట్కమ్ - తాత్పర్యం / Nirvana Shattkkam - Meaning 🌹

*🌹. నిర్వాణ శతకం - తాత్పర్యం / Nirvana Shatakam - Meaning 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

1) మనో బుధ్యహంకార చితాని నాహం, న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే
న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః, చిదానంద రూపః శివోహం శివోహం

 నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు, అంతర్గత స్వీయ ప్రతిబింబాలు కాదు. నేను పంచేంద్రియాలను కాను. నేను అంతకు మించి ఉన్నాను. నేను ఈథర్ కాదు, భూమి కాదు, అగ్ని లేదా గాలి (అంటే పంచభూతాలు) కాదు. నేను నిజానికి, ఆ శాశ్వతమైన జ్ఞానం మరియు ఆనందం, శివుడు, ప్రేమ మరియు స్వచ్ఛమైన స్పృహ.

2) న చ ప్రాణ సంజ్ఞో న వై పంచ వాయుహూ, న వా సప్త ధాతుర్ న వా పంచ కోశః
న వాక్ పాణి పాదౌ న చోపస్థపాయుః, చిదానంద రూపః శివోహం శివోహమ్

నన్ను శక్తి (ప్రాణ), లేదా ఐదు రకాల శ్వాస (వాయు), లేదా ఏడు భౌతిక సారాంశాలు (ధాతు), లేదా ఐదు ఆవరణలు (పంచ-కోశం) అని పేర్కొనలేము. నేను నిర్మూలన, సంతానోత్పత్తి, చలనం, గ్రహించడం లేదా మాట్లాడే ఐదు సాధనాలను కూడా కాదు. నేను నిజానికి, ఆ శాశ్వతమైన జ్ఞానం మరియు ఆనందం, శివుడు, ప్రేమ మరియు స్వచ్ఛమైన స్పృహ.

3) న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ, మదో నైవ మే నైవ మాత్సర్యా భావః
న ధర్మో న చార్థో న కామో న మోక్ష, చిదానంద రూపః శివోహం శివోహం

 నాకు ద్వేషం లేదా అయిష్టం, అనుబంధం లేదా ఇష్టం, దురాశ, మాయ, గర్వం లేదా అహంకారం లేదా అసూయ లేదా అసూయ భావాలు లేవు. నాకు కర్తవ్యం (ధర్మం), డబ్బు లేదు, కోరిక లేదు (చూడండి: కామ), లేదా విముక్తి కూడా లేదు (చూడండి: మోక్షం). నేను నిజానికి, ఆ శాశ్వతమైన జ్ఞానం మరియు ఆనందం, శివుడు, ప్రేమ మరియు స్వచ్ఛమైన స్పృహ.

4) న పుణ్యన్ న పాపన్ న సౌఖ్యన్ న దుఃఖం, న మంత్రో న తీర్థన్ న వేదాః న యజ్ఞః
అహం భోజనన్ నైవ్ భోజ్యన్ న భోక్తా, చిదానంద రూపః శివోహం శివోహమ్

 నాకు పుణ్యం (పుణ్యం), లేదా దుర్గుణం (పాప) లేవు. నేను పాపాలు లేదా పుణ్యకార్యాలు చేయను, సుఖం లేదా దుఃఖం, బాధ లేదా ఆనందం లేదు. నాకు మంత్రాలు, పవిత్ర స్థలాలు, గ్రంథాలు, కర్మలు లేదా యాగాలు (యజ్ఞం) అవసరం లేదు. నేను పరిశీలకుడి లేదా అనుభవించే, గమనించే లేదా అనుభవించే ప్రక్రియ లేదా ఏదైనా వస్తువును గమనించిన లేదా అనుభవించే త్రయంలో ఎవరూ కాదు. నేను నిజానికి, ఆ శాశ్వతమైన జ్ఞానం మరియు ఆనందం, శివుడు, ప్రేమ మరియు స్వచ్ఛమైన స్పృహ.

5) న మృత్యుర్ న శంక న మే జాతి భేదః, పితా నైవ మే నైవ మాతా న జన్మ
న బంధుర్ న మిత్రం గురు నైవ శిష్యః, చిదానంద రూపః శివోహం శివోహమ్

 నాకు మరణం లేనట్లే నాకు మరణ భయం లేదు. నా నిజమైన స్వయం నుండి నాకు వేరు లేదు, నా ఉనికి గురించి ఎటువంటి సందేహం లేదు లేదా పుట్టుక ఆధారంగా నాకు వివక్ష లేదు. నాకు తండ్రి లేదా తల్లి లేరు, నాకు జన్మ లేదు. నేను బంధువును కాదు, మిత్రుడను, గురువును, శిష్యుడిని కాను. నేను నిజానికి, ఆ శాశ్వతమైన జ్ఞానం మరియు ఆనందం, శివుడు, ప్రేమ మరియు స్వచ్ఛమైన స్పృహ.

6) అహం నిర్వికల్పో నిరాకార రూపో, విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్
న చా సంగతాన్ నైవ ముక్తిర్ న మేయః చిదానంద రూపః శివోహం శివోహమ్

 నేను సర్వ వ్యాపకుడిని. నేను ఎలాంటి గుణాలు లేకుండా ఉన్నాను, ఏ రూపం లేకుండా ఉన్నాను. నాకు ప్రపంచంతో, విముక్తితో అనుబంధం లేదు. నేను ప్రతిదీ, ప్రతిచోటా, ప్రతిసారీ, ఎల్లప్పుడూ సమతౌల్యంగా ఉన్నందున నాకు దేనిపైనా కోరికలు లేవు. నేను నిజానికి, ఆ శాశ్వతమైన జ్ఞానం మరియు ఆనందం, శివుడు, ప్రేమ మరియు స్వచ్ఛమైన స్పృహ.

మహాశివరాత్రి శుభాకాంక్షలు
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Happy Maha Shiva Rati to all 🌹 
Prasad Bharadwaj 🙏

🌹 Lyrics of Nirvana Shatakam 🌹

1) Mano Budhyahankaar Chitani Naaham, Na Cha Shrotra Jihve Na Cha Ghraana netre
Na Cha Vyoma Bhumir Na Tejo Na Vayuh, Chidananda Rupah Shivoham Shivoham

 I am not mind, nor intellect, nor ego, nor the reflections of inner self. I am not the five senses. I am beyond that. I am not the ether, nor the earth, nor the fire, nor the wind (i.e. the five elements). I am indeed, That eternal knowing and bliss, Shiva, love and pure consciousness.

2) Na Cha Praana Sanjno Na Vai Pancha Vaayuhu, Na Vaa Sapta Dhaatur Na Va Pancha Koshah
Na Vaak Paani Paadau Na Chopasthapaayuh, Chidaananda Rupah Shivoham Shivoham

Neither can I be termed as energy (Praana), nor five types of breath (Vaayu), nor the seven material essences (dhaatu), nor the five coverings (panca-kosha). Neither am I the five instruments of elimination, procreation, motion, grasping, or speaking. I am indeed, That eternal knowing and bliss, Shiva, love and pure consciousness.

3) Na Me Dvesha Raagau Na Me Lobha Mohau, Mado Naiva Me Naiva Maatsarya Bhaavah
Na Dharmo Na Chaartho Na Kaamo Na Moksha, Chidaananda Rupah Shivoham Shivoham

 I have no hatred or dislike, nor affiliation or liking, nor greed, nor delusion, nor pride or haughtiness, nor feelings of envy or jealousy. I have no duty (dharma), nor any money, nor any desire (refer: kama), nor even liberation (refer: moksha). I am indeed, That eternal knowing and bliss, Shiva, love and pure consciousness.

4) Na Punyan Na Paapan Na Saukhyan Na Dukham, Na Mantro Na Tirthan Na Vedaah Na Yajnaah
Aham Bhojanan Naiv Bhojyan Na Bhoktaa, Chidaananda Rupah Shivoham Shivoham

 I have neither virtue (punya), nor vice (paapa). I do not commit sins or good deeds, nor have happiness or sorrow, pain or pleasure. I do not need mantras, holy places, scriptures, rituals or sacrifices (yajna). I am none of the triad of the observer or one who experiences, the process of observing or experiencing, or any object being observed or experienced. I am indeed, That eternal knowing and bliss, Shiva, love and pure consciousness.

5) Na Mrityur Na Shanka Na Me Jaati Bhedah, Pitaa Naiva Me Naiva Maataa Na Janma
Na Bandhur Na Mitram Guru Naiva Shishyah, Chidaananda Rupah Shivoham Shivoham

 I do not have fear of death, as I do not have death. I have no separation from my true self, no doubt about my existence, nor have I discrimination on the basis of birth. I have no father or mother, nor did I have a birth. I am not the relative, nor the friend, nor the guru, nor the disciple. I am indeed, That eternal knowing and bliss, Shiva, love and pure consciousness.

6) Aham Nirvikalpo Niraakaara Rupo, Vibhutvaaccha Sarvatra Sarvendriyaanaam
Na Chaa Sangatan Naiva Muktir Na meyah Chidananda Rupah Shivoham Shivoham

 I am all pervasive. I am without any attributes, and without any form. I have neither attachment to the world, nor to liberation. I have no wishes for anything because I am everything, everywhere, every time, always in equilibrium. I am indeed, That eternal knowing and bliss, Shiva, love and pure consciousness.

Happy Mahashivratri
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 352-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 352-2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 352-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 352-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।
వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀

🌻 352-2. 'వహ్నిమండలవాసినీ' 🌻

సృష్టి యొక అగ్నికార్యముగ శ్రీమాతయే నిర్వర్తించుచున్నది. అందు వర్తించునది కూడ ఆమెయే. మూలాధారము నందు మూడగ్నులు యున్నవి. సహస్రారమందు కూడ మూడగ్ను లున్నవి. శ్రీమాత స్వస్థానము సహస్రారము కాగ సృష్టి నిర్వహణమునకు అవరోహణ మార్గమున వ్యాప్తి చెంది మూలాధారమున వసించును. మరల ఆరోహణ మార్గమున ఆమె సహస్రారము చేరుటయే సృష్టి కథ. వ్యక్తిగతముగ ఇదియే జీవుని పరిణామ కథ కూడ.

సోమాగ్ని విద్యుతాగ్నిగను, సూర్యాగ్ని జ్వాలాగ్నిగను భూమి యందలి వేడిమి పావకాగ్నిగను తెలియవలెను. అట్లే మన యందలి నేను అను ప్రజ్ఞ సోమాగ్ని వలన తెలియబడుచున్నది. అందుండి యేర్పడు శక్తి మన శక్తి సామర్థ్యములుగ గోచరించును. అట్లే మన శరీరమందలి వేడిమి పావకాగ్నిగ పేర్కొనబడినది. ఉపనిషత్తులలో ఈ మూడింటిని ప్రాజ్ఞుడు, తైజసుడు, వైశ్వానరుడు అని పిలుతురు. ఈ మూడగ్నుల ప్రభావము వలననే సత్త్వగుణము, రజోగుణము, తమోగుణము యేర్పడు చున్నవి. ఇవి అన్నియూ శ్రీమాతపైనే ఆధారపడి యున్నవి. ఈ మూడు వహ్ని మండలములను సృష్టించి వానియందు వసించునది శ్రీదేవియే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 352-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala
Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻

🌻 352-2. Vahni-maṇḍala-vāsinī वह्नि-मण्डल-वासिनी 🌻

She lives in the sphere of fire. Vahni means fire. The sphere of fire is said to be in mūlādhāra cakra and in ākāś or ether. Already nāma 99 mūlādhārika nilaya explained that She resides in the base cakra. The other interpretation that She resides in ākāś is based on the saying that agni prevails in ether as well. Vahni also means numeric three. This numeric three could mean the moon, the sun and the fire one below the other in the spine.

The moon is in sahasrāra, the sun in anāhata and the fire in mūlādhāra. She is in the form all these three. The Pañcadaśī mantra consists of three kūṭa-s and this nāma could mean that She resides in this mantra. Possibly this could be the reason why Pañcadaśī mantra is considered as the supreme mantra.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

01 Mar 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 146. తృప్తి - భ్రమలు / Osho Daily Meditations - 146. ILLUSIONS OF CONTENTMENT

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 146 / Osho Daily Meditations - 146 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 146. తృప్తి - భ్రమలు 🍀

🕉 . దివ్యత్వంలో మాత్రమే సంతృప్తి ఉంటుంది; తృప్తి అనేది కేవలం ఓదార్పు మాత్రమే అయితే అన్ని ఇతర రూపాలు మనస్సుచే సృష్టించ బడిన భ్రమలు మాత్రమే. 🕉

అసంతృప్తిలో నిరంతరం జీవించడం చాలా బాధాకరం, అందుకని మనసు సంతృప్తి భ్రమలు సృష్టిస్తుంది; ఆ భ్రమలు ప్రజలను ముందుకు నడిపిస్తాయి, అవి ప్రజలకు సహాయపడతాయి. మీరు అన్ని భ్రమలను తొలగిస్తే, ఒక వ్యక్తి ఒక్క క్షణం కూడా జీవించడానికి ఎటువంటి కారణం ఉండదు. అవి అవసరం. అజ్ఞానంలో భ్రమలు తప్పనిసరి. ఎందుకంటే భ్రమల ద్వారా మనం జీవితంలో నకిలీ అర్థాలను సృష్టిస్తాము మరియు సహజంగా నిజమైనది జరిగే వరకు, మనం ఈ నకిలీ అర్థాలను సృష్టించడం కొనసాగించాలి. మనం ఒక భ్రమతో విసిగి పోయినప్పుడు, మనం మరొకటి సృష్టిస్తాము. మేము డబ్బుతో విసిగి పోయాము, రాజకీయాల్లోకి వెళ్తాము; రాజకీయాలతో విసిగిపోయి వేరొక దానిలోకి వెళ్తాము. మతం అని పిలవబడేది కూడా ఒక సూక్ష్మ భ్రమ తప్ప మరొకటి కాదు.

అసలు మతానికి, మతాలు అని పిలవబడే వాటితో సంబంధం లేదు. అసలైన మతం అన్ని భ్రమలు పగిలి పోవడమే. ఇది అసంతృప్తిలో, లోతైన బాధలో, నొప్పిలో పూర్తిగా జీవించి తరువాత అసలు విషయం కోసం వెతకడం. మార్గం చాలా బాధాకరమైనది మరియు కొద్దిమంది మాత్రమే సాధిస్తారు. ఎందుకంటే, మొదటి స్థానంలో, ప్రజలు దానిని ప్రారంభించ లేరు కనుక. మొదటి స్థానంలో, వారు జీవితంలోని బాధను అంగీకరించలేరు - కాని ఆ నొప్పి అన్ని పెరుగుదలలకు మూలం. తప్పించు కోకుండా, దానిలోంచి చూడటం, అన్నిటిలోని నగ్న సత్యాన్ని చూడటం - అదే తెలివికి నాంది, బుద్ధికి నాంది, అవగాహనకు ప్రారంభం.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Osho Daily Meditations - 146 🌹

📚. Prasad Bharadwaj

🍀 146. ILLUSIONS OF CONTENTMENT 🍀

🕉 Only in Buddhahood is there contentment; all other forms if contentment are just consolations just illusions, created by the mind. 🕉

To live constantly in discontent is so painful that the mind creates illusions of contentment; those illusions keep people going, they help people. If you take away all the illusions, a person will not have any reason to live for even a single moment more. They are needed. In unawareness illusions are a must, because through illusions we create pseudo meanings in life, and naturally until the real has happened, we have to go on creating these pseudo meanings. When we become fed up with one pseudo meaning, we create another. We become fed up with money, move into politics; we get fed up with politics and move into something else. Even socalled religion is nothing but a subtle illusion.

The real religion has nothing to do with so-called religions-- The real religion is the shattering of all illusions. It is to live in discontent, in deep suffering, in utter pain, and to search for the real thing. The path is of great pain and only a few attain, because, in the first place, people can't start out on it. In the first place, they can't accept the pain of life-but that pain is the source of all growth. Seeing the naked truth of it all-not avoiding, not escaping, looking into it through and through-that is the beginning of intelligence, the beginning of mindfulness, the beginning of awareness.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

01 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 157

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 157 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సర్వాంతర్యామి సాక్షాత్కారం 🌻

సృష్టిలో నున్న భగవంతుని మరచి, అందలి రూపములైన జీవుల సంబంధములను జ్ఞప్తి యందుంచు కొనినవాడు మత్తుడై ఇంద్రియార్థములను గూర్చిన చింతలలో నిమగ్నుడై జీవించును. దినములు గడచి పోవుచుండునే గాని, జీవించుటకు తీరుబడి యుండదు. అనగా అంతర్యామిని స్మరించుట ఉండదు. చిత్తశాంతి లభింపక ఆశల వెంట పరుగెత్తుచుండును. క్రమముగా వ్యాధి, ముసలితనము, ఇతరులపై పట్టుదలలు, తన పరాజయములు, ఆశాభంగములు మున్నగు దుష్టశక్తులు యమదూతలై పొడుచు చుందురు.

దుఃఖపరంపరలతో జీవితమును ఈదవలసి వచ్చును కనుక, నిప్పుల గుండమును ఈదుచున్నట్లుండును. ఈ స్థితినే వైతరణి యందురు పరిస్థితుల రూపములలోని‌ అంతర్యామిని మరచి, పరిస్థితులకు లొంగిచేయకూడని పనులు అనేకములు చేయుటతో శిక్షానుభవము తప్పదు. రోగముల రూపమును యమదూతలు దేహమున మంటలు మండింతురు. శస్ర్తచికిత్సల రూపమున ముక్కలుగా ‌కోయుదురు. (కృతాంతుని భటులు వీరు. కృతాంతుడు అనగా చేసిన కర్మలకు ఫలితములు ఇచ్చువాడు. యముడనగా అధర్మము ‌నుండి ధర్మమార్గమునకు నియమించునట్టి నిర్మల ధర్మస్వరూపుడు.).

...✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

01 Mar 2022

శ్రీ శివ మహా పురాణము - 527 / Sri Siva Maha Purana - 527

🌹 . శ్రీ శివ మహా పురాణము - 527 / Sri Siva Maha Purana - 527 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 45

🌻. శివుని సుందర రూపము - 4 🌻

పురస్త్రీలు ఇట్లు పలికిరి -

హిమవంతుని నగరమునందు నివసించు పౌరుల కన్నులు సార్థకమాయెను. ఎవరెవరైతే ఈ రూపమును చూచిరో, వారి వారి జన్మలు సార్థకమాయెను (35). సర్వ పాపములను పోగొట్టు శివుని ఎవరైతే ప్రత్యక్షముగా దర్శించెదరో వారి జన్మ మాత్రమే సఫలము. వారి కర్మలు మాత్రమే సఫలము లగును (36). శివుని కొరకు తపస్సును చేసి పార్వతి సర్వమును సాధించినది. ఈమె ధన్యురాలు. శివుని భర్తగా పొందిన ఈ పార్వతి కృతకృత్యురాలు (37) సృష్టి కర్త ఆనందముతో ఈ పార్వతీ పరమేశ్వరుల జంటను కలుపక పోయినచో, అపుడాతని శ్రమ అంతయూ నిష్పలమై యుండెదిది (38).

ఈ ఉత్తమమగు జంటను కలిపి బ్రహ్మ మంచి పని చేసినాడు. అందరు చేసిన కర్మలన్నియూ ఈ కలయికచే సార్థకమైనవి (39). మానవులకు తపస్సు చేయనిదే శివుని దర్శనము లభించదు. మానవులందరు శివుని దర్శనము చేత మాత్రమే కృతార్థులగుదురు (40). పూర్వము లక్ష్మి నారాయణుని భర్తగా పొందిన తీరున, సరస్వతి బ్రహ్మను భర్తగా పొందిన తీరున ఈ పార్వతీ దేవి శివుని భర్తగా పొంది మిక్కిలి ప్రకాశించుచున్నది (41, 42).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇట్లు పలికి వారు గంధముతో, మరియు అక్షతలతో శివుని పూజించి సాదరముగా పేలాలను వర్షించిరి (44). ఆ స్త్రీలందరు మేనతో గూడి ఉత్సుకతతో అచట నిలబడిరి. వారు మేనా హిమవంతుల మహాభాగ్యమును వర్ణించుచుండిరి (45). ఆ స్త్రీలచే వర్ణింపబడిన అటువంటి శుభగాథలను శివుడు వినుచుండెను. ఓ మహర్షీ ! శంభుడు విష్ణువు మొదలగు వారందరితో గూడి అపుడు చాల ఆనందించెను (46).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహిత యందు పార్వతీ ఖండలో శివసుందర స్వరూప వర్ణనమనే నలుబది అయిదవ అధ్యాయము ముగిసినది (45).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 SRI SIVA MAHA PURANA - 527 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 45 🌴

🌻 Śiva’s comely form and the Jubilation of the Citizens - 3 🌻

The ladies said:—

35. The eyes of the residents of this town have become fruitful. The life of the persons who have seen this comely form has become meaningful.

36. The life is fruitful and the rites are fruitful only of the person who has seen Śiva, the destroyer of all sins.

37. Pārvatī has accomplished everything inasmuch as she performed penance for Śiva. She is blessed, she is contented in securing Śiva as her husband.

38. If Brahmā had not joined this pair, Śiva and Śivā, his endeavour of creation would have entirely become fruitless.

39. This is well done. The excellent pair has been united. Everything has become meaningful in every activity.

40. A vision of Śiva is inaccessible to men without penance. All of us have now become contented by seeing Śiva.

41. Just as Lakṣmī was blessed by securing Viṣṇu as her lord, formerly, so also the gentle lady Pārvatī has become embellished on securing Śiva.

42. Just as Sarasvatī was blessed by securing Brahmā as her husband, so also the gentle lady Pārvatī has become embellished on getting Śiva as her husband.

43. All of us, men and women, are blessed—we who see Śiva, the lord of all, the husband of Pārvatī.

Brahmā said:—

44. Saying thus they worshipped Śiva with sandal paste and raw rice grains. They showered Him with fried grains respectfully.

45. The ladies standing near Menā were enthusiastically praising the good luck of Menā and the mountain.

46. Hearing the auspicious stores and anecdotes of the ladies, the lord became delighted, O sage, along with Viṣṇu and others.

Chapter 45 ends..

Continues....

🌹🌹🌹🌹🌹

01 Mar 2022

గీతోపనిషత్తు -329

🌹. గీతోపనిషత్తు -329 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 26-2 📚

🍀 26-2. భక్తి శ్రద్ధలు - శ్రద్ధ వలన జ్ఞానము, భక్తి వలన అనుగ్రహము లభించును. ఆడంబరములకు గాని, డంభమునకు గాని, అహంకారమునకు గాని, అశ్రద్ధకు గాని దైవము లొంగడు. కృష్ణతులాభారము, కుచేలోపాఖ్యానము, అంబరీషుని కథ- ఇట్టి ఉపాఖ్యానము లన్నియు భక్తి ప్రాధాన్యతను ఆవిష్కరించు చున్నవి. ఎవరికి ఏ పని చేసిపెట్టుచున్నను వారియందలి ఈశ్వరుని దర్శించుట వలన భక్తి ప్రేమలు జనించును. అట్టి బుద్ధితో చిన్నవారికైనను, పెద్దవారికైనను అదే విధమగు శ్రద్ధాభక్తులతో చేయవలెను. 🍀

26. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
తదహం భక్త్యుపహృత మశ్నామి ప్రయతాత్మనః ||

తాత్పర్యము : భక్తిపూర్వకముగ నాకు ఒక పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, నీటిని గాని ఎవరందించినను నేను స్వీకరించి అనుగ్రహింతును.

వివరణము :

సర్వేశ్వరుండగు శౌరి కింకరు సేయు ధనమున్నదే భక్తి ధనము కాక !
సర్వోపగతుడగు చక్రి బంధించెడు బలమున్నదే భక్తిబలము గాక !
సర్వభోక్తను జలజాతాక్షు దనియించు ఫలమున్నదే భక్తిఫలము గాక !
సర్వజ్ఞుడైన కేశవుని మెప్పించెడు విద్య యున్నదె భక్తివిద్య గాక !
సర్వవరదుడైన శార్జి సన్నిధి చేర్చుపథము గలదె భక్తిపథము గాక !
కాన నితడు భక్తిగల వారలకే గాని పరుల కగ్గమగునె పడతులార !!

భక్తితో ఏమిచ్చినను దైవ మంగీకరించును. దైవమునకు సమర్పించుట యనగా జీవులయందలి ఈశ్వరుని దర్శించుచు, జీవులకు సమర్పించుటయే. అట్లు చేసినచో అది భక్తి నివేదన మగును. ఆడంబరములకు గాని, డంభమునకు గాని, అహంకారమునకు గాని, అశ్రద్ధకు గాని దైవము లొంగడు. కృష్ణతులాభారము, కుచేలోపాఖ్యానము, అంబరీషుని కథ- ఇట్టి ఉపాఖ్యానము లన్నియు భక్తి ప్రాధాన్యతను ఆవిష్కరించు చున్నవి. ఎవరికి ఏ పని చేసిపెట్టుచున్నను వారియందలి ఈశ్వరుని దర్శించుట వలన భక్తి ప్రేమలు జనించును. అట్టి బుద్ధితో చిన్న పనియైనను, పెద్ద పనియైనను చేయవలెను. చిన్నవారికైనను, పెద్దవారికైనను అదే విధమగు శ్రద్ధాభక్తులతో చేయవలెను.

శ్రద్ధ వలన జ్ఞానము, భక్తి వలన అనుగ్రహము లభించును. బ్రహ్మాండము లన్నియు తన కుక్షి (పొట్ట) యందే ఇముడ్చు కొనిన దైవమునకు ఎవడేమి ఈయగలడు? దైవమున కావశ్యకత ఏమున్నది? అతడు జీవుల ప్రేమకు, భక్తికి ఆనందించును. లోకము లందు కూడ తలిదండ్రులు పిల్లల నుండి ఆశించునది ప్రేమాభిమానములే గదా! అట్లే పరమాత్మ గూడను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

01 Mar 2022

మహా శివరాత్రి విశిష్టత - విధి - శివ మంగళాష్టకం Shivaratri - Significance, and Shiva Mangalashtakam

🌹. మహా శివరాత్రి విశిష్టత - విధి - శివ మంగళాష్టకం 🌹

🍀. మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికి 🍀

ప్రసాద్ భరద్వాజ

మాఘ మాసం అమావాస్య ముందు రాత్రి శివరాత్రి జరుపుకుంటారు. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను పారదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే ఈ మహా శివరాత్రి.

శివరాత్రి దినాన శివుని లింగ రూపంలో - "లింగోద్భవ మూర్తి" లేక "జ్యోతిర్లింగరూపం" లో పూజిస్తారు. లింగం తేజో రూపం. దీనికి ఆది,అంతం లేదు. నిర్గుణుడూ, అరూపుడూ అయిన ఆ తేజోమూర్తి రూపమే లింగం. శివరాత్రి తో సంబంధించిన ఎన్నో కధలు ఉన్నాయి. శివోభావం, లింగోద్భవం, శివతాండవ ఆద్యం, కాలకూట సేవనం, బిల్వ పత్రాల యొక్క గొప్పతనాన్ని చెప్పే వేటగాని కధ తదితరులు.

శివ రాత్రి విశిష్టతను స్వయంగా స్వామే పార్వతీదేవికి ఇలా వివరించాడు - "మాఘ మాసంలో పద్నాలగవ రాత్రి అయిన అమావాస్య నాకు ఎంతో ప్రీతివంతమైనది . ఈ దినమున కేవలము ఉపవాసము చేయటమే ఎన్నో స్నానములు, దానములు, పుషా, నైవేద్య సమర్పణలకన్న గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మణులు కన్నా కొన్ని బిల్వ పత్రాలతో పూజ చేస్తే చాలును.

ఉపవాసము ఉండి, రాత్రి నాలుగు ఝాములలో నాకు అభిషేకము చెయ్యాలి. మొదటిఝాము పాలతోనూ, రెండవఝాము పెరుగుతోనూ, మూడవఝాము నెయ్యితోనూ, చివరిఝాము తేనేతోనూ చేస్తే ఎంతో ఫలితము. మర్నాడు ఉదయమున, సాధువులకు ఆహారము సమర్పించి, పూజా కార్యక్రమములను పూర్తి చేసుకొని తర్వాత ఉపవాసాన్ని చాలించాలి. ఈ ఆచారాన్ని మించినది వేరొకటి లేదు!!” ఈ రోజున స్వామిని జ్యోతిర్లింగ రూపంలో సేవించడం ఆనవాయితి. రాత్రంతా జాగరణ చేసి, ఉపవాసముండి, శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు.

నాలుగు ఝాములు అభిషేకం చేసి, బిల్వ పత్రాలతో పూజలు విశేషంగా చేస్తారు. శివుడు సన్యాస మూర్తి. అందుకే సన్యాస దీక్షను స్వీకరించే వారు ఈ రోజున దీక్షను తీసుకుంటారు.

🍀. శ్రీ శివ మంగళాష్టకం 🍀

1) భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే |
కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్

2) వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ |
పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్

3) భస్మోద్ధూళిత దేహాయ నాగయఙ్ఞోపవీతినే |
రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్

4) సూర్యచంద్రాగ్ని నేత్రాయ నమః కైలాసవాసినే |
సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్

5) మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే |
త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళమ్

6) గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే |
ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్

7) సద్యోజాతాయ శర్వాయ భవ్య ఙ్ఞానప్రదాయినే |
ఈశానాయ నమస్తుభ్యం పంచవక్రాయ మంగళమ్

8) సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ |
అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్

9) మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకమ్ |
సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తతః పరమ్ ||

🌹 🌹 🌹 🌹 🌹

01 Mar 2022

01 - MARCH - 2022 మంగళవారం MESSAGES మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 01, మంగళవారం, మార్చి 2022 భౌమ వాసరే 🌹

🌹. మహాశివరాత్రి శుభాకాంక్షలు మరియు శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹
🌹. మహా శివరాత్రి విశిష్టత - విధి - శివ మంగళాష్టకం 🌹

2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 26-2 - 329 - పరమ పదము🌹
3) 🌹. శివ మహా పురాణము - 527 / Siva Maha Purana - 527 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -157🌹  
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 145 / Osho Daily Meditations - 145 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 352-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 352-2 🌹

🌹. మహిమాన్విత 108 లింగాలు 🌹
🌹.శివలింగాభిషేకం - వివిధ ఫలితాలు🌹
🌹. నిర్వాణ షట్కమ్ - తాత్పర్యం / Nirvana Shattkam - Meaning 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మహాశివరాత్రి శుభాకాంక్షలు మరియు శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 01, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ శివ మంగళాష్టకం 🍀*

*1) భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే |*
*కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ *
*2) వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ |*
*పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ *
*3) భస్మోద్ధూళిత దేహాయ నాగయఙ్ఞోపవీతినే |*
*రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్ *
*4) సూర్యచంద్రాగ్ని నేత్రాయ నమః కైలాసవాసినే |*
*సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్ *
*5) మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే |*
*త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళమ్ *
*6) గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే |*
*ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్ *
*7) సద్యోజాతాయ శర్వాయ భవ్య ఙ్ఞానప్రదాయినే |*
*ఈశానాయ నమస్తుభ్యం పంచవక్రాయ మంగళమ్ *
*8) సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ |*
*అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్ *
*9) మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకమ్ |*
*సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తతః పరమ్ ||*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : అవగాహన పెంచుకోవడం యోగానికి అతి ముఖ్యం. పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి మాత్రమే శివుడిగా మారగలడు. 🍀*

*పండుగలు మరియు పర్వదినాలు : మహాశివరాత్రి, Maha Sivaratri*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శశిర ఋతువు,
మాఘ మాసం
తిథి: కృష్ణ చతుర్దశి 25:01:40
వరకు తదుపరి అమావాశ్య 
పక్షం: నక్షత్రం: ధనిష్ట 27:48:53
వరకు తదుపరి శతభిషం
యోగం: పరిఘ 11:16:59 వరకు
తదుపరి శివ
సూర్యోదయం: 06:34:31
సూర్యాస్తమయం: 18:22:30
వైదిక సూర్యోదయం: 06:38:05
వైదిక సూర్యాస్తమయం: 18:18:55
చంద్రోదయం: 05:34:57
చంద్రాస్తమయం: 17:09:17
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: మకరం
కరణం: విష్టి 14:08:49 వరకు
వర్జ్యం: 09:03:50 - 10:33:46
దుర్ముహూర్తం: 08:56:07 - 09:43:19
రాహు కాలం: 15:25:30 - 16:54:00
గుళిక కాలం: 12:28:30 - 13:57:00
యమ గండం: 09:31:31 - 11:00:01
అభిజిత్ ముహూర్తం: 12:05 - 12:51
అమృత కాలం: 18:03:26 - 19:33:22
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య 
నాశనం 27:48:53 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మహా శివరాత్రి విశిష్టత - విధి - శివ మంగళాష్టకం 🌹*
* 🍀. మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికి 🍀*
*ప్రసాద్ భరద్వాజ*

*మాఘ మాసం అమావాస్య ముందు రాత్రి శివరాత్రి జరుపుకుంటారు. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను పారదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే ఈ మహా శివరాత్రి.*

*శివరాత్రి దినాన శివుని లింగ రూపంలో - "లింగోద్భవ మూర్తి" లేక "జ్యోతిర్లింగరూపం" లో పూజిస్తారు. లింగం తేజో రూపం. దీనికి ఆది,అంతం లేదు. నిర్గుణుడూ, అరూపుడూ అయిన ఆ తేజోమూర్తి రూపమే లింగం. శివరాత్రి తో సంబంధించిన ఎన్నో కధలు ఉన్నాయి. శివోభావం, లింగోద్భవం, శివతాండవ ఆద్యం, కాలకూట సేవనం, బిల్వ పత్రాల యొక్క గొప్పతనాన్ని చెప్పే వేటగాని కధ తదితరులు.*

శివ రాత్రి విశిష్టతను స్వయంగా స్వామే పార్వతీదేవికి ఇలా వివరించాడు - "మాఘ మాసంలో పద్నాలగవ రాత్రి అయిన అమావాస్య నాకు ఎంతో ప్రీతివంతమైనది . ఈ దినమున కేవలము ఉపవాసము చేయటమే ఎన్నో స్నానములు, దానములు, పుషా, నైవేద్య సమర్పణలకన్న గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మణులు కన్నా కొన్ని బిల్వ పత్రాలతో పూజ చేస్తే చాలును.*

*ఉపవాసము ఉండి, రాత్రి నాలుగు ఝాములలో నాకు అభిషేకము చెయ్యాలి. మొదటిఝాము పాలతోనూ, రెండవఝాము పెరుగుతోనూ, మూడవఝాము నెయ్యితోనూ, చివరిఝాము తేనేతోనూ చేస్తే ఎంతో ఫలితము. మర్నాడు ఉదయమున, సాధువులకు ఆహారము సమర్పించి, పూజా కార్యక్రమములను పూర్తి చేసుకొని తర్వాత ఉపవాసాన్ని చాలించాలి. ఈ ఆచారాన్ని మించినది వేరొకటి లేదు!!” ఈ రోజున స్వామిని జ్యోతిర్లింగరూపంలో సేవించడం ఆనవాయితి. రాత్రంతా జాగరణ చేసి, ఉపవాసముండి, శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు.*

*నాలుగు ఝాములు అభిషేకం చేసి, బిల్వ పత్రాలతో పూజలు విశేషంగా చేస్తారు. శివుడు సన్యాస మూర్తి. అందుకే సన్యాస దీక్షను స్వీకరించే వారు ఈ రోజున దీక్షను తీసుకుంటారు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🍀. శ్రీ శివ మంగళాష్టకం 🍀*

*1) భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే |*
*కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ *
*2) వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ |*
*పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ *
*3) భస్మోద్ధూళిత దేహాయ నాగయఙ్ఞోపవీతినే |*
*రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్ *
*4) సూర్యచంద్రాగ్ని నేత్రాయ నమః కైలాసవాసినే |*
*సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్ *
*5) మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే |*
*త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళమ్ *
*6) గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే |*
*ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్ *
*7) సద్యోజాతాయ శర్వాయ భవ్య ఙ్ఞానప్రదాయినే |*
*ఈశానాయ నమస్తుభ్యం పంచవక్రాయ మంగళమ్ *
*8) సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ |*
*అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్ *
*9) మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకమ్ |*
*సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తతః పరమ్ ||*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -329 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 26-2 📚*
 
*🍀 26-2. భక్తి శ్రద్ధలు - శ్రద్ధ వలన జ్ఞానము, భక్తి వలన అనుగ్రహము లభించును. ఆడంబరములకు గాని, డంభమునకు గాని, అహంకారమునకు గాని, అశ్రద్ధకు గాని దైవము లొంగడు. కృష్ణతులాభారము, కుచేలోపాఖ్యానము, అంబరీషుని కథ- ఇట్టి ఉపాఖ్యానము లన్నియు భక్తి ప్రాధాన్యతను ఆవిష్కరించు చున్నవి. ఎవరికి ఏ పని చేసిపెట్టుచున్నను వారియందలి ఈశ్వరుని దర్శించుట వలన భక్తి ప్రేమలు జనించును. అట్టి బుద్ధితో చిన్నవారికైనను, పెద్దవారికైనను అదే విధమగు శ్రద్ధాభక్తులతో చేయవలెను. 🍀*

*26. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |*
*తదహం భక్త్యుపహృత మశ్నామి ప్రయతాత్మనః ||*

*తాత్పర్యము : భక్తిపూర్వకముగ నాకు ఒక పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, నీటిని గాని ఎవరందించినను నేను స్వీకరించి అనుగ్రహింతును.*

*వివరణము :*
*సర్వేశ్వరుండగు శౌరి కింకరు సేయు ధనమున్నదే భక్తి ధనము కాక !* 
*సర్వోపగతుడగు చక్రి బంధించెడు బలమున్నదే భక్తిబలము గాక !* 
*సర్వభోక్తను జలజాతాక్షు దనియించు ఫలమున్నదే భక్తిఫలము గాక !* 
*సర్వజ్ఞుడైన కేశవుని మెప్పించెడు విద్య యున్నదె భక్తివిద్య గాక !* 
*సర్వవరదుడైన శార్జి సన్నిధి చేర్చుపథము గలదె భక్తిపథము గాక !*
*కాన నితడు భక్తిగల వారలకే గాని పరుల కగ్గమగునె పడతులార !!*

*భక్తితో ఏమిచ్చినను దైవ మంగీకరించును. దైవమునకు సమర్పించుట యనగా జీవులయందలి ఈశ్వరుని దర్శించుచు, జీవులకు సమర్పించుటయే. అట్లు చేసినచో అది భక్తి నివేదన మగును. ఆడంబరములకు గాని, డంభమునకు గాని, అహంకారమునకు గాని, అశ్రద్ధకు గాని దైవము లొంగడు. కృష్ణతులాభారము, కుచేలోపాఖ్యానము, అంబరీషుని కథ- ఇట్టి ఉపాఖ్యానము లన్నియు భక్తి ప్రాధాన్యతను ఆవిష్కరించు చున్నవి. ఎవరికి ఏ పని చేసిపెట్టుచున్నను వారియందలి ఈశ్వరుని దర్శించుట వలన భక్తి ప్రేమలు జనించును. అట్టి బుద్ధితో చిన్న పనియైనను, పెద్ద పనియైనను చేయవలెను. చిన్నవారికైనను, పెద్దవారికైనను అదే విధమగు శ్రద్ధాభక్తులతో చేయవలెను.*

*శ్రద్ధ వలన జ్ఞానము, భక్తి వలన అనుగ్రహము లభించును. బ్రహ్మాండము లన్నియు తన కుక్షి (పొట్ట) యందే ఇముడ్చు కొనిన దైవమునకు ఎవడేమి ఈయగలడు? దైవమున కావశ్యకత ఏమున్నది? అతడు జీవుల ప్రేమకు, భక్తికి ఆనందించును. లోకము లందు కూడ తలిదండ్రులు పిల్లల నుండి ఆశించునది ప్రేమాభిమానములే గదా! అట్లే పరమాత్మ గూడను.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 527 / Sri Siva Maha Purana - 527 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 45

*🌻. శివుని సుందర రూపము - 4 🌻*

పురస్త్రీలు ఇట్లు పలికిరి -

హిమవంతుని నగరమునందు నివసించు పౌరుల కన్నులు సార్థకమాయెను. ఎవరెవరైతే ఈ రూపమును చూచిరో, వారి వారి జన్మలు సార్థకమాయెను (35). సర్వ పాపములను పోగొట్టు శివుని ఎవరైతే ప్రత్యక్షముగా దర్శించెదరో వారి జన్మ మాత్రమే సఫలము. వారి కర్మలు మాత్రమే సఫలము లగును (36). శివుని కొరకు తపస్సును చేసి పార్వతి సర్వమును సాధించినది. ఈమె ధన్యురాలు. శివుని భర్తగా పొందిన ఈ పార్వతి కృతకృత్యురాలు (37) సృష్టి కర్త ఆనందముతో ఈ పార్వతీ పరమేశ్వరుల జంటను కలుపక పోయినచో, అపుడాతని శ్రమ అంతయూ నిష్పలమై యుండెదిది (38).

ఈ ఉత్తమమగు జంటను కలిపి బ్రహ్మ మంచి పని చేసినాడు. అందరు చేసిన కర్మలన్నియూ ఈ కలయికచే సార్థకమైనవి (39). మానవులకు తపస్సు చేయనిదే శివుని దర్శనము లభించదు. మానవులందరు శివుని దర్శనము చేత మాత్రమే కృతార్థులగుదురు (40). పూర్వము లక్ష్మి నారాయణుని భర్తగా పొందిన తీరున, సరస్వతి బ్రహ్మను భర్తగా పొందిన తీరున ఈ పార్వతీ దేవి శివుని భర్తగా పొంది మిక్కిలి ప్రకాశించుచున్నది (41, 42).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇట్లు పలికి వారు గంధముతో, మరియు అక్షతలతో శివుని పూజించి సాదరముగా పేలాలను వర్షించిరి (44). ఆ స్త్రీలందరు మేనతో గూడి ఉత్సుకతతో అచట నిలబడిరి. వారు మేనా హిమవంతుల మహాభాగ్యమును వర్ణించుచుండిరి (45). ఆ స్త్రీలచే వర్ణింపబడిన అటువంటి శుభగాథలను శివుడు వినుచుండెను. ఓ మహర్షీ ! శంభుడు విష్ణువు మొదలగు వారందరితో గూడి అపుడు చాల ఆనందించెను (46).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహిత యందు పార్వతీ ఖండలో శివసుందర స్వరూప వర్ణనమనే నలుబది అయిదవ అధ్యాయము ముగిసినది (45).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 527 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 45 🌴*

*🌻 Śiva’s comely form and the Jubilation of the Citizens - 3 🌻*

The ladies said:—

35. The eyes of the residents of this town have become fruitful. The life of the persons who have seen this comely form has become meaningful.

36. The life is fruitful and the rites are fruitful only of the person who has seen Śiva, the destroyer of all sins.

37. Pārvatī has accomplished everything inasmuch as she performed penance for Śiva. She is blessed, she is contented in securing Śiva as her husband.

38. If Brahmā had not joined this pair, Śiva and Śivā, his endeavour of creation would have entirely become fruitless.

39. This is well done. The excellent pair has been united. Everything has become meaningful in every activity.

40. A vision of Śiva is inaccessible to men without penance. All of us have now become contented by seeing Śiva.

41. Just as Lakṣmī was blessed by securing Viṣṇu as her lord, formerly, so also the gentle lady Pārvatī has become embellished on securing Śiva.

42. Just as Sarasvatī was blessed by securing Brahmā as her husband, so also the gentle lady Pārvatī has become embellished on getting Śiva as her husband.

43. All of us, men and women, are blessed—we who see Śiva, the lord of all, the husband of Pārvatī.
Brahmā said:—

44. Saying thus they worshipped Śiva with sandal paste and raw rice grains. They showered Him with fried grains respectfully.

45. The ladies standing near Menā were enthusiastically praising the good luck of Menā and the mountain.

46. Hearing the auspicious stores and anecdotes of the ladies, the lord became delighted, O sage, along with Viṣṇu and others.
Chapter 45 ends..

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 157 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు  
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 *🌻. సర్వాంతర్యామి సాక్షాత్కారం 🌻*

*సృష్టిలో నున్న భగవంతుని మరచి, అందలి రూపములైన జీవుల సంబంధములను జ్ఞప్తి యందుంచు కొనినవాడు మత్తుడై ఇంద్రియార్థములను గూర్చిన చింతలలో నిమగ్నుడై జీవించును. దినములు గడచి పోవుచుండునే గాని, జీవించుటకు తీరుబడి యుండదు. అనగా అంతర్యామిని స్మరించుట ఉండదు. చిత్తశాంతి లభింపక ఆశల వెంట పరుగెత్తుచుండును. క్రమముగా వ్యాధి, ముసలితనము, ఇతరులపై పట్టుదలలు, తన పరాజయములు, ఆశాభంగములు మున్నగు దుష్టశక్తులు యమదూతలై పొడుచు చుందురు.*

*దుఃఖపరంపరలతో జీవితమును ఈదవలసి వచ్చును కనుక, నిప్పుల గుండమును ఈదుచున్నట్లుండును. ఈ స్థితినే వైతరణి యందురు పరిస్థితుల రూపములలోని‌ అంతర్యామిని మరచి, పరిస్థితులకు లొంగిచేయకూడని పనులు అనేకములు చేయుటతో శిక్షానుభవము తప్పదు. రోగముల రూపమును యమదూతలు దేహమున మంటలు మండింతురు. శస్ర్తచికిత్సల రూపమున ముక్కలుగా ‌కోయుదురు. (కృతాంతుని భటులు వీరు. కృతాంతుడు అనగా చేసిన కర్మలకు ఫలితములు ఇచ్చువాడు. యముడనగా అధర్మము ‌నుండి ధర్మమార్గమునకు నియమించునట్టి నిర్మల ధర్మస్వరూపుడు.).*

...✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 146 / Osho Daily Meditations - 146 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 146. తృప్తి - భ్రమలు 🍀*

*🕉 . దివ్యత్వంలో మాత్రమే సంతృప్తి ఉంటుంది; తృప్తి అనేది కేవలం ఓదార్పు మాత్రమే అయితే అన్ని ఇతర రూపాలు మనస్సుచే సృష్టించ బడిన భ్రమలు మాత్రమే. 🕉*
 
*అసంతృప్తిలో నిరంతరం జీవించడం చాలా బాధాకరం, అందుకని మనసు సంతృప్తి భ్రమలు సృష్టిస్తుంది; ఆ భ్రమలు ప్రజలను ముందుకు నడిపిస్తాయి, అవి ప్రజలకు సహాయపడతాయి. మీరు అన్ని భ్రమలను తొలగిస్తే, ఒక వ్యక్తి ఒక్క క్షణం కూడా జీవించడానికి ఎటువంటి కారణం ఉండదు. అవి అవసరం. అజ్ఞానంలో భ్రమలు తప్పనిసరి. ఎందుకంటే భ్రమల ద్వారా మనం జీవితంలో నకిలీ అర్థాలను సృష్టిస్తాము మరియు సహజంగా నిజమైనది జరిగే వరకు, మనం ఈ నకిలీ అర్థాలను సృష్టించడం కొనసాగించాలి. మనం ఒక భ్రమతో విసిగి పోయినప్పుడు, మనం మరొకటి సృష్టిస్తాము. మేము డబ్బుతో విసిగి పోయాము, రాజకీయాల్లోకి వెళ్తాము; రాజకీయాలతో విసిగిపోయి వేరొక దానిలోకి వెళ్తాము. మతం అని పిలవబడేది కూడా ఒక సూక్ష్మ భ్రమ తప్ప మరొకటి కాదు.*

*అసలు మతానికి, మతాలు అని పిలవబడే వాటితో సంబంధం లేదు. అసలైన మతం అన్ని భ్రమలు పగిలి పోవడమే. ఇది అసంతృప్తిలో, లోతైన బాధలో, నొప్పిలో పూర్తిగా జీవించి తరువాత అసలు విషయం కోసం వెతకడం. మార్గం చాలా బాధాకరమైనది మరియు కొద్దిమంది మాత్రమే సాధిస్తారు. ఎందుకంటే, మొదటి స్థానంలో, ప్రజలు దానిని ప్రారంభించ లేరు కనుక. మొదటి స్థానంలో, వారు జీవితంలోని బాధను అంగీకరించలేరు - కాని ఆ నొప్పి అన్ని పెరుగుదలలకు మూలం. తప్పించు కోకుండా, దానిలోంచి చూడటం, అన్నిటిలోని నగ్న సత్యాన్ని చూడటం - అదే తెలివికి నాంది, బుద్ధికి నాంది, అవగాహనకు ప్రారంభం.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 146 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 146. ILLUSIONS OF CONTENTMENT 🍀*

*🕉 Only in Buddhahood is there contentment; all other forms if contentment are just consolations just illusions, created by the mind. 🕉*
 
*To live constantly in discontent is so painful that the mind creates illusions of contentment; those illusions keep people going, they help people. If you take away all the illusions, a person will not have any reason to live for even a single moment more. They are needed. In unawareness illusions are a must, because through illusions we create pseudo meanings in life, and naturally until the real has happened, we have to go on creating these pseudo meanings. When we become fed up with one pseudo meaning, we create another. We become fed up with money, move into politics; we get fed up with politics and move into something else. Even socalled religion is nothing but a subtle illusion.*

*The real religion has nothing to do with so-called religions-- The real religion is the shattering of all illusions. It is to live in discontent, in deep suffering, in utter pain, and to search for the real thing. The path is of great pain and only a few attain, because, in the first place, people can't start out on it. In the first place, they can't accept the pain of life-but that pain is the source of all growth. Seeing the naked truth of it all-not avoiding, not escaping, looking into it through and through-that is the beginning of intelligence, the beginning of mindfulness, the beginning of awareness.*
 
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 352-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 352-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।*
*వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀*

*🌻 352-2. 'వహ్నిమండలవాసినీ' 🌻* 

*సృష్టి యొక అగ్నికార్యముగ శ్రీమాతయే నిర్వర్తించుచున్నది. అందు వర్తించునది కూడ ఆమెయే. మూలాధారము నందు మూడగ్నులు యున్నవి. సహస్రారమందు కూడ మూడగ్ను లున్నవి. శ్రీమాత స్వస్థానము సహస్రారము కాగ సృష్టి నిర్వహణమునకు అవరోహణ మార్గమున వ్యాప్తి చెంది మూలాధారమున వసించును. మరల ఆరోహణ మార్గమున ఆమె సహస్రారము చేరుటయే సృష్టి కథ. వ్యక్తిగతముగ ఇదియే జీవుని పరిణామ కథ కూడ.*

*సోమాగ్ని విద్యుతాగ్నిగను, సూర్యాగ్ని జ్వాలాగ్నిగను భూమి యందలి వేడిమి పావకాగ్నిగను తెలియవలెను. అట్లే మన యందలి నేను అను ప్రజ్ఞ సోమాగ్ని వలన తెలియబడుచున్నది. అందుండి యేర్పడు శక్తి మన శక్తి సామర్థ్యములుగ గోచరించును. అట్లే మన శరీరమందలి వేడిమి పావకాగ్నిగ పేర్కొనబడినది. ఉపనిషత్తులలో ఈ మూడింటిని ప్రాజ్ఞుడు, తైజసుడు, వైశ్వానరుడు అని పిలుతురు. ఈ మూడగ్నుల ప్రభావము వలననే సత్త్వగుణము, రజోగుణము, తమోగుణము యేర్పడు చున్నవి. ఇవి అన్నియూ శ్రీమాతపైనే ఆధారపడి యున్నవి. ఈ మూడు వహ్ని మండలములను సృష్టించి వానియందు వసించునది శ్రీదేవియే.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 352-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala*
*Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻*

*🌻 352-2. Vahni-maṇḍala-vāsinī वह्नि-मण्डल-वासिनी 🌻*

*She lives in the sphere of fire. Vahni means fire. The sphere of fire is said to be in mūlādhāra cakra and in ākāś or ether. Already nāma 99 mūlādhārika nilaya explained that She resides in the base cakra. The other interpretation that She resides in ākāś is based on the saying that agni prevails in ether as well. Vahni also means numeric three. This numeric three could mean the moon, the sun and the fire one below the other in the spine.*

*The moon is in sahasrāra, the sun in anāhata and the fire in mūlādhāra. She is in the form all these three. The Pañcadaśī mantra consists of three kūṭa-s and this nāma could mean that She resides in this mantra. Possibly this could be the reason why Pañcadaśī mantra is considered as the supreme mantra.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మహిమాన్విత 108 లింగాలు 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఈ రోజు 108 నామాలు ఒకసారి చదువుకోండి 🍀*

1. ఓం లింగాయ నమః
2. ఓం శివ లింగాయనమః
3. ఓం శంబు లింగాయనమః
4. ఓం ఆధిగణార్చిత లింగాయనమః
5. ఓం అక్షయ లింగాయనమః
6. ఓం అనంత లింగాయనమః
7. ఓం ఆత్మ లింగాయనమః
8. ఓం అమరనాదేశ్వర లింగాయనమః
9. ఓం అమర లింగాయనమః
10. ఓం అగస్థేశ్వర లింగాయనమః

11. ఓం అచలేశ్వర లింగాయనమః
12. ఓం అరుణాచలేశ్వర లింగాయనమః
13. ఓం అర్ధ నారీశ్వర లింగాయనమః
14. ఓం అపూర్వ లింగాయనమః
15. ఓం అగ్ని లింగాయనమః
16. ఓం వాయు లింగాయనమః
17. ఓం జల లింగాయనమః
18. ఓం గగన లింగాయనమః
19. ఓం పృథ్వి లింగాయనమః
20. ఓం పంచభూతేశ్వర లింగాయనమః

21. ఓం పంచముఖేశ్వర లింగాయనమః
22. ఓం ప్రణవ లింగాయనమః
23. ఓం పగడ లింగాయనమః
24. ఓం పశుపతి లింగాయనమః
25. ఓం పీత మణి మయ లింగాయనమః
26. ఓం పద్మ రాగ లింగాయనమః
27. ఓం పరమాత్మక లింగాయనమః
28. ఓం సంగమేశ్వర లింగాయనమః
29. ఓం స్పటిక లింగాయనమః
30. ఓం సప్త ముఖేశ్వర లింగాయనమః

31. ఓం సువర్ణ లింగాయనమః
32. ఓం సుందరేశ్వర లింగాయనమః
33. ఓం శృంగేశ్వర లింగాయనమః
34. ఓం సోమనాథేశ్వర లింగాయనమః
35. ఓం సిధేశ్వర లింగాయనమః
36. ఓం కపిలేశ్వర లింగాయనమః
37. ఓం కాపర్డేశ్వర లింగాయనమః
38. ఓం కేదారేశ్వర లింగాయనమః
39. ఓం కళాత్మక లింగాయనమః
40. ఓం కుంభేశ్వర లింగాయనమః

41. ఓం కైలాస నాదేశ్వర లింగాయనమః
42. ఓం కోటేశ్వర లింగాయనమః
43. ఓం వజ్ర లింగాయనమః
44. ఓం వైడుర్య లింగాయనమః
45. ఓం వైద్య నాదేశ్వర లింగాయనమః
46. ఓం వేద లింగాయనమః
47. ఓం యోగ లింగాయనమః
48. ఓం వృద్ధ లింగాయనమః
49. ఓం హిరణ్య లింగాయనమః
50. ఓం హనుమతీశ్వర లింగాయనమః

51. ఓం విరూపాక్షేశ్వర లింగాయనమః
52. ఓం వీరభద్రేశ్వర లింగాయనమః
53. ఓం భాను లింగాయనమః
54. ఓం భవ్య లింగాయనమః
55. ఓం భార్గవ లింగాయనమః
56. ఓం భస్మ లింగాయనమః
57. ఓం భిందు లింగాయనమః
58. ఓం బిమేశ్వర లింగాయనమః
59. ఓం భీమ శంకర లింగాయనమః
60. ఓం బృహీశ్వర లింగాయనమః

61. ఓం క్షిరారామ లింగాయనమః
62. ఓం కుమార రామ బిమేశ్వర లింగాయనమః
63. ఓం మహానంది ఈశ్వర లింగాయనమః
64. ఓం మహా రుద్ర లింగాయనమః
65. ఓం మల్లికార్జున లింగాయనమః
66. ఓం మహా కాళేశ్వర లింగాయనమః
67. ఓం మల్లీశ్వర లింగాయనమః
68. ఓం మంజునాథ లింగాయనమః
69. ఓం మరకత లింగాయనమః
70. ఓం మహేశ్వర లింగాయనమః

71. ఓం మహా దేవ లింగాయనమః
72. ఓం మణికంధరేశ్వర లింగాయనమః
73. ఓం మార్కండేయ లింగాయనమః
74. ఓం మాడిణ్యేశ్వర లింగాయనమః
75. ఓం ముక్తేశ్వర లింగాయనమః
76. ఓం మృతింజేయ లింగాయనమః
77. ఓం రామేశ్వర లింగాయనమః
78. ఓం రామనాథేశ్వర లింగాయనమః
79. ఓం రస లింగాయనమః
80. ఓం రత్నలింగాయనమః

81. ఓం రజిత లింగాయనమః
82. ఓం రాతి లింగాయనమః
83. ఓం గోకర్ణాఈశ్వర లింగాయనమః
84. ఓం గోమేధిక లింగాయనమః
85. ఓం నాగేశ్వర లింగాయనమః
86. ఓం ఓంకారేశ్వర లింగాయనమః
87. ఓం ఇంద్ర నిల మణి లింగాయనమః
88. ఓం శరవణ లింగాయనమః
89. భృగువేశ్వర లింగాయనమః
90. ఓం నీలకంటేశ్వర లింగాయనమః

91. ఓం చౌడేశ్వర లింగాయనమః
92. ఓం ధర్మ లింగాయనమః
93. ఓం జోతిర్ లింగాయనమః
94. ఓం సైకత లింగాయనమః
95. ఓం చంద్రమౌలీశ్వర లింగాయనమః
96. ఓం జ్వాలా లింగాయనమః
97. ఓం ధ్యాన లింగాయనమః
98. ఓం పుష్యా రాగ లింగాయ నమః
99. ఓం నందికేశ్వర లింగాయ నమః
100. ఓం అభయ లింగాయ నమః
101. ఓం సహస్ర లింగాయ నమః
102. ఓం ఏకాంబరేశ్వర లింగాయనమః
103. ఓం సాలగ్రామ లింగాయనమః
104. ఓం శరభ లింగాయనమః
105. ఓం విశ్వేశ్వర లింగాయనమః
106. ఓం పథక నాశన లింగాయనమః
107. ఓం మోక్ష లింగాయనమః
108. ఓం విశ్వరాధ్య లింగాయనమః.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹.శివలింగాభిషేకం - వివిధ ఫలితాలు🌹*

🙏🙏🕉🙏🙏☘️🙏🙏🕉🙏🙏

1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు. 

2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు. 

3 .ఆవు పాల అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును 

4 .పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. 

5 .ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును 

6. చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ది కలుగును. 

7 .మెత్తని చెక్కరతో అభిషేకించిన దుఃఖ నాశనము కలుగును  

8 .మారేడు బిల్వదళ జలము చేత అభిషేకము చేసిన భోగభాగ్యములు లభించును. 

9 .తేనెతో అభిషేకించిన తేజోవృద్ది కలుగును.

10.పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును.

11.కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును.

12 .రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములనిచ్చును.

13 .భస్మాభిషేకంచే మహా పాపాలు నశించును.

14 .గందోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును.

15 .బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును.

16 .నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును

17 .అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. 
శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు - పెరుగు కలిపిన అన్నాన్ని మెత్తగా రుబ్బి దాంతో లింగాకారానికి లేపనంలాగా రాస్తారు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.

18 మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేస్తే దీర్ఘకాలవ్యాదులు నయమగును.

19 కస్తురి కలిపిన నీటితో అభిషేకం చేస్తే చక్రవర్తి యోగం కలుగును.

20 పసుపు కలిపిన నీటితో అభిషేకం చేస్తే మంగళ ప్రదమగును శుభకార్యాలు జరుగును.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు / Happy Maha Shiva Rati to all 🌹*
*ప్రసాద్ భరద్వాజ 🙏*

*🌹. నిర్వాణ షట్కమ్ - తాత్పర్యం / Nirvana Shattkam - Meaning 🌹*

1) మనో బుధ్యహంకార చితాని నాహం, న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే
న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః, చిదానంద రూపః శివోహం శివోహం

 నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు, అంతర్గత స్వీయ ప్రతిబింబాలు కాదు. నేను పంచేంద్రియాలను కాను. నేను అంతకు మించి ఉన్నాను. నేను ఈథర్ కాదు, భూమి కాదు, అగ్ని లేదా గాలి (అంటే పంచభూతాలు) కాదు. నేను నిజానికి, ఆ శాశ్వతమైన జ్ఞానం మరియు ఆనందం, శివుడు, ప్రేమ మరియు స్వచ్ఛమైన స్పృహ.

2) న చ ప్రాణ సంజ్ఞో న వై పంచ వాయుహూ, న వా సప్త ధాతుర్ న వా పంచ కోశః
న వాక్ పాణి పాదౌ న చోపస్థపాయుః, చిదానంద రూపః శివోహం శివోహమ్

నన్ను శక్తి (ప్రాణ), లేదా ఐదు రకాల శ్వాస (వాయు), లేదా ఏడు భౌతిక సారాంశాలు (ధాతు), లేదా ఐదు ఆవరణలు (పంచ-కోశం) అని పేర్కొనలేము. నేను నిర్మూలన, సంతానోత్పత్తి, చలనం, గ్రహించడం లేదా మాట్లాడే ఐదు సాధనాలను కూడా కాదు. నేను నిజానికి, ఆ శాశ్వతమైన జ్ఞానం మరియు ఆనందం, శివుడు, ప్రేమ మరియు స్వచ్ఛమైన స్పృహ.

3) న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ, మదో నైవ మే నైవ మాత్సర్యా భావః
న ధర్మో న చార్థో న కామో న మోక్ష, చిదానంద రూపః శివోహం శివోహం

 నాకు ద్వేషం లేదా అయిష్టం, అనుబంధం లేదా ఇష్టం, దురాశ, మాయ, గర్వం లేదా అహంకారం లేదా అసూయ లేదా అసూయ భావాలు లేవు. నాకు కర్తవ్యం (ధర్మం), డబ్బు లేదు, కోరిక లేదు (చూడండి: కామ), లేదా విముక్తి కూడా లేదు (చూడండి: మోక్షం). నేను నిజానికి, ఆ శాశ్వతమైన జ్ఞానం మరియు ఆనందం, శివుడు, ప్రేమ మరియు స్వచ్ఛమైన స్పృహ.

4) న పుణ్యన్ న పాపన్ న సౌఖ్యన్ న దుఃఖం, న మంత్రో న తీర్థన్ న వేదాః న యజ్ఞః
అహం భోజనన్ నైవ్ భోజ్యన్ న భోక్తా, చిదానంద రూపః శివోహం శివోహమ్

 నాకు పుణ్యం (పుణ్యం), లేదా దుర్గుణం (పాప) లేవు. నేను పాపాలు లేదా పుణ్యకార్యాలు చేయను, సుఖం లేదా దుఃఖం, బాధ లేదా ఆనందం లేదు. నాకు మంత్రాలు, పవిత్ర స్థలాలు, గ్రంథాలు, కర్మలు లేదా యాగాలు (యజ్ఞం) అవసరం లేదు. నేను పరిశీలకుడి లేదా అనుభవించే, గమనించే లేదా అనుభవించే ప్రక్రియ లేదా ఏదైనా వస్తువును గమనించిన లేదా అనుభవించే త్రయంలో ఎవరూ కాదు. నేను నిజానికి, ఆ శాశ్వతమైన జ్ఞానం మరియు ఆనందం, శివుడు, ప్రేమ మరియు స్వచ్ఛమైన స్పృహ.

5) న మృత్యుర్ న శంక న మే జాతి భేదః, పితా నైవ మే నైవ మాతా న జన్మ
న బంధుర్ న మిత్రం గురు నైవ శిష్యః, చిదానంద రూపః శివోహం శివోహమ్

 నాకు మరణం లేనట్లే నాకు మరణ భయం లేదు. నా నిజమైన స్వయం నుండి నాకు వేరు లేదు, నా ఉనికి గురించి ఎటువంటి సందేహం లేదు లేదా పుట్టుక ఆధారంగా నాకు వివక్ష లేదు. నాకు తండ్రి లేదా తల్లి లేరు, నాకు జన్మ లేదు. నేను బంధువును కాదు, మిత్రుడను, గురువును, శిష్యుడిని కాను. నేను నిజానికి, ఆ శాశ్వతమైన జ్ఞానం మరియు ఆనందం, శివుడు, ప్రేమ మరియు స్వచ్ఛమైన స్పృహ.

6) అహం నిర్వికల్పో నిరాకార రూపో, విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్
న చా సంగతాన్ నైవ ముక్తిర్ న మేయః చిదానంద రూపః శివోహం శివోహమ్

 నేను సర్వ వ్యాపకుడిని. నేను ఎలాంటి గుణాలు లేకుండా ఉన్నాను, ఏ రూపం లేకుండా ఉన్నాను. నాకు ప్రపంచంతో, విముక్తితో అనుబంధం లేదు. నేను ప్రతిదీ, ప్రతిచోటా, ప్రతిసారీ, ఎల్లప్పుడూ సమతౌల్యంగా ఉన్నందున నాకు దేనిపైనా కోరికలు లేవు. నేను నిజానికి, ఆ శాశ్వతమైన జ్ఞానం మరియు ఆనందం, శివుడు, ప్రేమ మరియు స్వచ్ఛమైన స్పృహ.

మహాశివరాత్రి శుభాకాంక్షలు
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Happy Maha Shiva Rati to all 🌹 
Prasad Bharadwaj 🙏

🌹 Lyrics of Nirvana Shattkam 🌹