శ్రీ శివ మహా పురాణము - 527 / Sri Siva Maha Purana - 527


🌹 . శ్రీ శివ మహా పురాణము - 527 / Sri Siva Maha Purana - 527 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 45

🌻. శివుని సుందర రూపము - 4 🌻


పురస్త్రీలు ఇట్లు పలికిరి -

హిమవంతుని నగరమునందు నివసించు పౌరుల కన్నులు సార్థకమాయెను. ఎవరెవరైతే ఈ రూపమును చూచిరో, వారి వారి జన్మలు సార్థకమాయెను (35). సర్వ పాపములను పోగొట్టు శివుని ఎవరైతే ప్రత్యక్షముగా దర్శించెదరో వారి జన్మ మాత్రమే సఫలము. వారి కర్మలు మాత్రమే సఫలము లగును (36). శివుని కొరకు తపస్సును చేసి పార్వతి సర్వమును సాధించినది. ఈమె ధన్యురాలు. శివుని భర్తగా పొందిన ఈ పార్వతి కృతకృత్యురాలు (37) సృష్టి కర్త ఆనందముతో ఈ పార్వతీ పరమేశ్వరుల జంటను కలుపక పోయినచో, అపుడాతని శ్రమ అంతయూ నిష్పలమై యుండెదిది (38).

ఈ ఉత్తమమగు జంటను కలిపి బ్రహ్మ మంచి పని చేసినాడు. అందరు చేసిన కర్మలన్నియూ ఈ కలయికచే సార్థకమైనవి (39). మానవులకు తపస్సు చేయనిదే శివుని దర్శనము లభించదు. మానవులందరు శివుని దర్శనము చేత మాత్రమే కృతార్థులగుదురు (40). పూర్వము లక్ష్మి నారాయణుని భర్తగా పొందిన తీరున, సరస్వతి బ్రహ్మను భర్తగా పొందిన తీరున ఈ పార్వతీ దేవి శివుని భర్తగా పొంది మిక్కిలి ప్రకాశించుచున్నది (41, 42).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఇట్లు పలికి వారు గంధముతో, మరియు అక్షతలతో శివుని పూజించి సాదరముగా పేలాలను వర్షించిరి (44). ఆ స్త్రీలందరు మేనతో గూడి ఉత్సుకతతో అచట నిలబడిరి. వారు మేనా హిమవంతుల మహాభాగ్యమును వర్ణించుచుండిరి (45). ఆ స్త్రీలచే వర్ణింపబడిన అటువంటి శుభగాథలను శివుడు వినుచుండెను. ఓ మహర్షీ ! శంభుడు విష్ణువు మొదలగు వారందరితో గూడి అపుడు చాల ఆనందించెను (46).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహిత యందు పార్వతీ ఖండలో శివసుందర స్వరూప వర్ణనమనే నలుబది అయిదవ అధ్యాయము ముగిసినది (45).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 SRI SIVA MAHA PURANA - 527 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 45 🌴

🌻 Śiva’s comely form and the Jubilation of the Citizens - 3 🌻



The ladies said:—

35. The eyes of the residents of this town have become fruitful. The life of the persons who have seen this comely form has become meaningful.

36. The life is fruitful and the rites are fruitful only of the person who has seen Śiva, the destroyer of all sins.

37. Pārvatī has accomplished everything inasmuch as she performed penance for Śiva. She is blessed, she is contented in securing Śiva as her husband.

38. If Brahmā had not joined this pair, Śiva and Śivā, his endeavour of creation would have entirely become fruitless.

39. This is well done. The excellent pair has been united. Everything has become meaningful in every activity.

40. A vision of Śiva is inaccessible to men without penance. All of us have now become contented by seeing Śiva.

41. Just as Lakṣmī was blessed by securing Viṣṇu as her lord, formerly, so also the gentle lady Pārvatī has become embellished on securing Śiva.

42. Just as Sarasvatī was blessed by securing Brahmā as her husband, so also the gentle lady Pārvatī has become embellished on getting Śiva as her husband.

43. All of us, men and women, are blessed—we who see Śiva, the lord of all, the husband of Pārvatī.

Brahmā said:—

44. Saying thus they worshipped Śiva with sandal paste and raw rice grains. They showered Him with fried grains respectfully.

45. The ladies standing near Menā were enthusiastically praising the good luck of Menā and the mountain.

46. Hearing the auspicious stores and anecdotes of the ladies, the lord became delighted, O sage, along with Viṣṇu and others.

Chapter 45 ends..


Continues....

🌹🌹🌹🌹🌹


01 Mar 2022

No comments:

Post a Comment