28-June-2020 messages

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

1) శ్రీమద్భగవద్గీత - 411 / Bhagavad-Gita - 411
2) శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 199 / Sripada Srivallabha Charithamrutham - 199 
3) శ్రీ ఆర్యా ద్విశతి - 63
4) దాశరధి శతకము - పద్య స్వరూపం - 42 / Dasarathi Satakam - 42
5) నారద భక్తి సూత్రాలు - 19
6) శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 53 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 53
7) సాధనా చతుష్టయ సంపత్తి - శ్రద్ధ

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Image may contain: 2 people

🌹. శ్రీమద్భగవద్గీత - 411 / Bhagavad-Gita - 411 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 19 🌴

19. అనాదిమధ్యాన్తమనన్తవీర్యమ్
అనన్తబాహుం శశిసూర్యనేత్రమ్ |
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రమ్
స్వతేజసా విశ్వమిదం తపన్తమ్ ||

🌷. తాత్పర్యం : 
నీవు ఆదిమధ్యాంత రహితుడవై యున్నావు. నీ వైభవము అపరిమితమై యున్నది. అసంఖ్యాకములుగా భుజములను కలిగిన నీవు సూర్యచంద్రులను నేత్రములుగా కలిగియున్నావు. ముఖము నుండి తేజోమయమైన అగ్ని బయల్వెడలుచుండ స్వతేజముతో ఈ సమస్త విశ్వమును తపింపజేయుచున్నట్లుగా నిన్ను గాంచుచున్నాను.

🌷. భాష్యము : 
శ్రీకృష్ణభగవానుని షడ్గుణైశ్వర్యములకు పరిమితి లేదు. ఈ సందర్భమున మరియు పెక్కు ఇతరచోట్ల పునరుక్తి జరిగియున్నది. కాని శాస్త్రరీత్యా శ్రీకృష్ణుని వైభములను పునరుక్తి సారస్వతలోపము కాదు. సంభ్రమము, ఆశ్చర్యము లేదా పారవశ్యము కలిగినపుడు పదముల పునరుక్తి కలుగుచుండుననియు, అది దోషమేమియును కాదనియు తెలుపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 411 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 19 🌴

19. anādi-madhyāntam ananta-vīryam
ananta-bāhuṁ śaśi-sūrya-netram
paśyāmi tvāṁ dīpta-hutāśa-vaktraṁ
sva-tejasā viśvam idaṁ tapantam

🌷 Translation : 
You are without origin, middle or end. Your glory is unlimited. You have numberless arms, and the sun and moon are Your eyes. I see You with blazing fire coming forth from Your mouth, burning this entire universe by Your own radiance.

🌹 Purport :
.There is no limit to the extent of the six opulences of the Supreme Personality of Godhead. Here and in many other places there is repetition, but according to the scriptures, repetition of the glories of Kṛṣṇa is not a literary weakness. It is said that at a time of bewilderment or wonder or of great ecstasy, statements are repeated over and over. That is not a flaw.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Image may contain: 1 person, text that says 'శ్రీపాద వల్లభ దిగంబరా.. శ్రీపాద వల్లభ దిగంబరా.. శ్రీపాద వల్లభ దిగంబరా.. శ్రీపాద వల్లభ దిగంబరా.. www.sripadavallabha.org'

🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 199 / Sripada Srivallabha Charithamrutham - 199 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 30
🌻. సంశయాత్మా వినశ్యతి
చైతన్యస్థాయి 🌻

శ్రీపాదులు ఉపాసకుల సాధనా విధానాలు, వారి చైతన్య స్థాయిలను ఈ విధంగా వివరించారు: “జీవులకు 64 చైతన్య స్థాయిలు ఉంటాయి. 

నాథసంప్రదాయం వారు ఈ 64 చైతన్య స్థాయిలలో తాదాత్మ్యస్థితిని పొంది జీవులను ఉద్ధరించ డానికి 64 శాబర తంత్రాలను సాధన చేస్తారు. 

ఈ నాథ సంప్రదాయానికి ఆది గురువు దత్తాత్రేయుడే. మీ కనులముందున్న ఈ శ్రీపాదుడే ఆ నాటి దత్తుడు.
 మానవుల శరీరంలో చైతన్య స్థాయిలనుబట్టి వారి పరిణామ వేగం ఆధారపడి ఉంటుంది. 

మానవుల శరీరంలోని ఆత్మ జ్యోతి ప్రకాశం వారు ఆచరించే యోగపద్ధతులు, మంత్ర జపాలు, యఙ్ఞ యాగాది క్రతువులు, ధర్మకార్యాలు మొదలైన వాటి పైన, వారు సాధించిన చైతన్య స్థాయిపైన ఆధారపడి ఉంటుంది. ఆ ప్రకాశానికి అనుగుణంగా నాడీ శుద్ధి జరుగుతుంది. 

ఆ నాడీశుద్ధి స్థాయిని బట్టి మానవుల్లో అనేక రకాలైన శారీరిక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులు పెరుగుతాయి. ఆయా శక్తులను వారు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనే దానిపై దైవానుగ్రహం ఆధారపడి ఉంటుంది. 

ఇలా ఇవి ఒకదానికి ఒకటి ఆధారంగాను, ఆధేయంగాను ఉంటాయి. అదే విధంగా శుభప్రదములైన సరస్వతీ, లక్ష్మీ, దుర్గా శక్తులు మానవునిలో అంకురించి ప్రవర్ధమానం అవుతుంటే అంబిక తమ అనుగ్రహాన్ని వారిపై కురిపిస్తుంది.

మానవులు చేసే పాపకార్యాలు కాని, పుణ్య కార్యాలు కాని వ్యక్తం నుండి అవ్యక్తానికి, అవ్యక్తంనుండి వ్యక్తానికి వస్తూ పోతూ ఉంటాయి. వారు పూర్వజన్మలో చేసిన పాపాలు అవ్యక్తంలో ఉండి, ఈజన్మలో సంసారంలోని బాధలు, కష్టాల రూపంలో వ్యక్తం అవుతాయి. 

ఆ విధంగానే ఈ జన్మలో చేస్తున్న పాప కర్మలు, పుణ్య కర్మలు అవ్యక్తంలోకి పోయి తరువాతి జన్మలో అవ్యక్తంనుండి వ్యక్తంలోకి వస్తాయి. కాని తీవ్రమైన దుష్కర్మ, తీవ్రమైన సత్కర్మల ఫలం చాలావరకు ఈ జన్మలోనే అనుభవించడం జరుగుతుంది. 

🌻. సంశయాత్మకులు 🌻

“ప్రభూ! వాసవీ మాత తమరిని వారి దేవస్థాన పరిసర ప్రాంతంలో వేంకటేశ్వర రూపంలో రమ్మని కోరారు కదా. దీని అర్థం ఏమిటి?” అని నేను ప్రశ్నించాను. “నీవు నా చరితామృతం వ్రాయుచున్నావు. దీనిలోని విషయాలకు ప్రమాణమేమిటి? అని అడిగే సందేహ మనస్కులు కొందరు ఉంటారు. 

శ్రీపాదులే వేంకటేశ్వరులని నమ్మడం ఎలా ? అని వారి తర్కం. దానికి ప్రమాణంగానూ వాసవి ఆర్య మహాదేవి అవతారమని రూఢి చేయడానికని నేను వేంకటేశ్వర రూపంలో బృహత్శిలా నగరంలో నెలకొంటాను. 

ఇందరు దేవతలు ఉండగా వేంకటేశ్వర రూపమే ఎందుకు అక్కడ నెలకొల్పబడింది? ఇదే వాళ్ళ సందేహాలకు సమాధానం ప్రత్యక్ష ప్రమాణమూ కూడా. అదేవిధంగా పీఠికాపురంలో బాపనార్యుల వంశంలోని వాళ్ళద్వారా వాసవీ ఆలయ నిర్మాణం ఏర్పాటు చేయిస్తాను. 

కలి యుగాంతంలో తిరుమలకి, పీఠికాపురానికి మరికొన్ని పుణ్య క్షేత్రాలకు నేను నా నిజ రూపంతో వస్తాను,” అని చెప్పారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Sripada Srivallabha Charithamrutham - 199 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj 

CHAPTER 20
🌴. The Story of Vissavadhanulu Description of Sripada’s divine auspicious form - 6 🌴

🌻 The greatness of Oudumber Tree 🌻

Haridas laughed loudly and said, ‘What you say is correct. I don’t deny. The whole secret of this creation is known only to Adi Guru Datta Prabhu.  

Even the seven rishis can not say what He does the next moment. How can you and I say? You are thinking that death means death of physical body.  

If a person has a ‘maaraka dasa’ (the time of death), Sadguru can grant rebirth by destroying his karma by making him suffer intense mental torture, great insults and unbearable troubles and losses.  

But Dattatreya will attract the life force into the Oudumbar tree where he also lives, and by the life force emanating from the Oudumber tree, he will save the body of his devotee.  

The devotee having no knowledge thinks that he is living because of the life force present in his body. But the truth is that the life force emanates from the Oudumbar and keeps the functions of the body without hindrance.  

Once the maaraka dasaa passes, the life force comes out of the Oudumbar tree and gets established in the devotee and he will live for some more time. Oudumbar always remains complete even if any amount of life force has gone out of it.  

The reason for it is, Sri Dattatreya will remain always established at the root of Oudumbr tree in subtle form.’ Thus he explained. What Haridas said was all surprising to me. The Haridas, named Krishnadas went away.  

I had been caring that Oudumbar plant with great love and devotion in the backyard of our house. A few days passed. One of my distant relatives was doing business in silk sarees. He became old. He did not have children.  

He developed unexplained affection towards me. He started living in my house. He gave me some money and suggested that I should do business in silk clothes.  

He also used to do circumambulation to the Oudumber tree and worship Datta Prabhu with great devotion. Whenever difficulties arose in our house, we used to circumambulate that Oudumber tree and submit our problems to that King of Trees.  

Our prayer would reach Datta Prabhu and get solved in an unexpected way. The Oudumber tree used to be a friendly bridge between Dattatreya and us. Sir! It is the main duty of a Datta devotee to serve Oudumber tree.  

When Oudumber tree is in our house, it means Dattatreya is indeed in our house. However much you describe the greatness of Oudumber tree, it will be less only.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Image may contain: 3 people, indoor

🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 63 🌹
🌻. శ్రీ లలితా స్తవరత్న వైజ్ఞానిక ధ్యాన యోగము 🌻
✍️. విరచితం : భగవాన్ శ్రీ క్రోధభట్టారక (దుర్వాస మహర్షి)
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 II ఆర్యా ద్విశతి - 125వ శ్లోకము II 🌻 

మణిసదనస్యాంతరతో మహనీయే రత్నవేదికామధ్యే I
బిందుమయ చక్రమీడే పీఠానాముపరి విరచితావాసమ్ II ౧౨౫

🌻. తాత్పర్యము :
మణిసదనస్య - ఆ చింతామణి గృహము యొక్క, అంతరతః - నడుమ ఉన్నట్టి, మహనీయే - మహిమాన్వితమైన, రత్నవేదికా మధ్యే - మణినిర్మితమైన వేదిక నడుమ, పీఠానాముపరి - పీటల మీద, విరచితావాసాం - కల్పింపబడిన (రచింపబడిన), బిందుమయచక్రం - బిందుమయమైన చక్రమును, ఈడే - స్తుతించుచున్నాను !!

చింతామణి గృహము మధ్యన ఉన్నట్టి, మహిమాన్వితమైన మణిమయ వేదిక నడుమ పీటల మీద రచింపబడిన బిందుమయ శ్రీచక్రమును స్తుతించుచున్నాను !!

🌻. వివరణ :
బిందుమయచక్రము - శ్రీలలితాదేవి యొక్క చక్రము - దీనికి చక్రరాజ రథమని పేరు. ఈ చక్రము నందు తొమ్మిది పర్వములు (దొంతులు) గలవు. వానిలో అడుగున ఉండు తొమ్మిదవ పర్వమును - త్రైలోక్యమోహన చక్రము అని పిలువబడును. దానియందు మూడు అంతస్థులు గలవు. మొదటి అంతస్థులో అణిమాది దశ సిద్ధి దేవతలును, దానికిపైన రెండవ అంతస్థులో బ్రాహ్మి మొదలగు అష్టమాతృక దేవతలును, దానికిపైన మూడవ అంతస్థులో సంక్షోభిణి మొదలగు దశముద్రాదేవతలును నివసించుచుందురు. వీరికందరికిని ప్రకటశక్తులని పేరు. వీరికి యజమానురాలు త్రిపురాదేవి.

సిద్ధి బ్రాహ్మ్యాది ముద్రాశ్చ ఏతా ప్రకటశక్తయః I
భండాసురస్య సంహారం కర్తుం చక్రే రథే స్థితాః II (లలితోపాఖ్యానము)

🌻 II ఆర్యా ద్విశతి - 126వ శ్లోకము II 🌻

చక్రాణాం సకలానాం ప్రథమ మధస్సీమ్ని ఫలకవాస్తవ్యాః I
అణిమాదిసిద్ధయోః మామవంతు దేవీప్రభాస్వరూపిణ్యః II ౧౨౬

🌻. తాత్పర్యము :
సకలానాం చక్రాణాం - అన్ని చక్రముల, అధస్సీమ్ని - అడుగు ప్రదేశము నందు, ప్రథమం - మొదట, ఫలకవాస్తవ్యాః - పీటపై ఉండు, దేవీప్రభా స్వరూపిణ్యః - శ్రీలలితాదేవి యొక్క దేహకాంతి వంటి రూపములు గల, అణిమాదిసిద్ధయః - అణిమ మొదలగు పది సిద్ధిదేవతలు, మాం - నన్ను, అవంతు - రక్షింతురుగాక !!

చింతామణి గృహము నందు ఉన్న అన్ని చక్రముల అడుగు ప్రదేశము నందు, మొదట పీటపై ఉండు, శ్రీలలితాదేవి దేహకాంతి వంటి తేజోమయమైన రూపము కలిగిన అణిమాది దశ సిద్ధిదేవతలు మమ్మల్ని రక్షింతురుగాక !!

అణిమా మహిమా చైవ లఘిమా గరిమా తథా I
ఈశితా వశితాచైవ ప్రాప్తిస్సిద్ధిశ్చ సప్తమీ II
ప్రాకామ్యా భుక్తి సిద్ధిశ్చ సర్వకామాభిధా పరా II (లలితోపాఖ్యానము, 24వ అధ్యాయము, 4-5 శ్లోకములు)

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Image may contain: one or more people and people standing

🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 42 / Dasarathi Satakam - 42 🌹
పద్యము - భావము 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 83వ పద్యము : 
వనకరిచిక్కు మైనసకు పాచవికిం జెడిపోయె మీనుతా
వినికికిఁజిక్కెఁజిల్వగను వేఁదుఱుఁ జెందెను లేళ్ళు తావిలో
మనికినశించె దేటితర మాయిరుమూఁటిని గెల్వనై దుసా
ధనములనీ వె కావనగు దాశరథీ కరుణాపయోనిధీ

🌻. భావము : 
ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సిందెంతో ఉంది. పంచేంద్రియములకు బానిస అయితే, ఎంత నష్టపోతామో తెలుస్తుంది. అడవి ఏనుగు దేహ చాపల్యమునకు చిక్కెను. అది చర్మేంద్రియమునకు లొనయ్యెను. చేప ఎరను చూసి జిహ్వేంద్రియములకు ఆశపడి చిక్కెను. పాము, నాగస్వరము వినుచు, శ్రవణేంద్రియములకు లోనయి నశించెను. లేడులు నేత్రేంద్రియమునకు ఆశపడి నశించెను. తుమ్మెద పరిమళమునకాశపడి ఘ్రాణేంద్రియమునకు వశపడి నశించెను. ఈ పంచేంద్రియములను గెలుచుట నా తరమా? వానిని గెలుచుటకు నీవే తోడ్పడవలెను.

🌻. 84వ పద్యము : 
కరములుమీకుమ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ
స్మరణదనర్పవీనులుభ వత్కథలన్ వినుచుండనాస మీ
యఱుతును బెట్టుపూసరుల కాసగొనం బరమార్థ సాధనో
త్కరమిది చేయవేకృపను దాశరథీ కరుణాపయోనిధీ

🌻. భావము : 
చేతులు నీకు నమస్కరించుచున్నవి. కన్నులు నిన్నే చూచుచున్నవి. నాలుక నిన్నే స్మరించుచున్నది. వీనులు నీ కథామృతమును గ్రోలుచున్నవి. ముక్కు నీ పూలపరిమళములను ఆశ్వాదించుచున్నది. ఇట్లు చేయుట మోక్షమునకు గొప్ప మార్గము. అట్లు పంచేంద్రియములు నిన్నే తలచి మ్రోక్కేటటువంటి భక్తి నాకు అనుగ్రహింపుము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Dasarathi Satakam - 42 🌹
Sloka and Meaning 
📚. Prasad Bharadwaj
 
🌻 83rd Poem : 
vanakaricikke mainasaku vAcavikiM jeDipOye mInu tA 
vinikikijikkejilvaganu vEdurxu jeMdenu lELLu tAvilO 
manikinaSiMce dETitara mAyirumUTini gelvanai dusA 
dhanamulanIve kAvanagu dASarathI karuNApayOnidhI.

🌻 Meaning : 
An elephant is ambushed by its temptation for touching the skin of another elephant. A fish is caught by its weakness for the taste of the bait at the end of the fishing rod. The snakes are trapped by the sound of a snake charmer's trumpet. The deers are snared by their tendency to move towards light. Holy bee /black carpenter (Bhramara) is enticed by the fragrance of flowers. Please save me from the temptations of the sensory organs. (All the above are trapped from the temptations of touch, tongue, ears, eyes and nose respectively)

🌻 84th Poem : 
karamulumIkumrokkuliDa kannulu mimmune cUDa jihva mI 
smaraNadanarpavInuluBavatkathalan vinucuMDanAsa mI 
yarxutanu beTTupUsarula kAsagonaM baramArtha sAdhanO 
tkaramidi cEyavEkRupanu dASarathI karuNApayOnidhI.

🌻 Meaning : 
Let our hands do obeisances to you ; let our eyes feast the sight of your handsome face ; let our tongue chant your sacred name ; let our ears listen to your glorious tales ; let our nose enjoy the fragrance of the garlands adorning you. Let me use these five sense organs to pursue the spiritual path.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Image may contain: one or more people, text that says 'HARE KRISHNA'


🌹. నారద భక్తి సూత్రాలు - 19 🌹 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, అచల గురు పీఠము. 
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 11

🌻 11. లోక వేదేషు తదనుకూలాచరణం తద్విరోధి షూదాసీనతా 🌻

            భక్తుడి లోకం భగవంతుడే. భగవత్ప్రీతి అతడికి సహజం. దీనికి ఆటంకం కలిగించే ఏ పని చేయడు. 

కాని ఏ పనీ చేయకుండా ఉండే పరిస్థితి కుదరదు. అందువలన వేరేదారి లేక తనకు లభించిన ఏకాగ్ర భక్తినే మరింత బలపరచు కుంటూ ఉంటాడు. 

అతడేమి చేసినా తనలో ఉండే భక్తికి అనుగుణంగానే ఉంటుంది. ఆ భక్తిని నిరంతరం పరిపోషించేవి గానే, అతని మాట, చేత ఉంటుంది. 

అందువలన ఊరకుండలేక భగవత్సేవ ప్రారంభిస్తాడు. ప్రాపంచిక విషయాలలోకి అతడి బుద్ధిపోదు. ఆ విషయాలు ఎదురైనప్పుడు ఉదాసీనత చెంది ఉంటాడు. 

చేయబడే కర్మ లౌకికమైనాసరే, వైదికమైనా సరే అది భగవత్ప్రీతిగా, భగవత్సేవగానే జరుగుతుంది. సర్వాధిష్ఠాన చేతనంతో కలిసిపోయి తనవరకు మాత్రం ఉదాసీనుడై ఉంటాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Image may contain: 5 people, text that says 'చతుర్ధ దత్తావతారులైన త్తావతా శ్రీ సద్గురు మాణిక్యప్రభు మహారాజులవారి సమగ్ర చరిత్రాత్మక నిత్య పారాయణ గ్రంథము'

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 53 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 53 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻 
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ  

🌴. అక్కల్కోట స్వామి 🌴

          అక్కల్ కోట స్వామి సచ్ఛరిత్రలో ప్రభువు గురించి పద్యరూపంలో ఇచ్చిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

     "మొగలాయిల కాలంలో హుమనాబాద్ కి దగ్గరలో మాణిక్ నగర్ అనే సుందరమైన ప్రదేశం ఉంది. అక్కడ మాణిక్ ప్రభు అనే సిద్ధపురుషుడు నివాసము ఉండేవరు. దయ, క్షమ, శాంతి, భక్తి, జ్ఞానసహిత విరాగియై రాగద్వేషాలను పరిత్యజించి, బాల్యావస్థ నుండి సంసారాన్ని పరిత్యజించి, బ్రహ్మానందంలో మునిగి కళ్యాణి నగరాన్ని ఉద్ధరించి, మాణిక్ నగరాన్ని నిర్మించి, దానిని తప స్థానంగా చేసుకొని శుద్ధ భావనతో వేలమందికి దర్శనం ఇచ్చేవారు. 

వారి వద్దకు వైదికులు, పండితులు, హరిదాసులు, గాయకులు, జ్యోతిష్యులు, శ్రీమంతులు, గృహస్థులు మొదలైన వారు వచ్చేవారు."

      మహారాష్ట్రలో ఆ కాలంలో సత్పురుషులకు ఇతర సత్పురుషులతో సంబంధాలు ఉండేవి. ఆ కాలంలో మహారాష్ట్రలోని ప్రముఖ సత్పురుషులలో అక్కల్కోట స్వామి, మీరజ్ గ్రామానికి చెందిన అన్నాబువా మహారాజ్, కొల్హాపూర్ కి చెందిన కృష్ణస్వామి (కుంభార్ స్వామి) మరియు యశ్వంత్ రావు దేవ్ మామల్దార్ ఈ నలుగురు ప్రభు యొక్క సమకాలీనులు.

     అక్కల్ కోట గ్రామ ప్రజలకు, అక్కడి రాజదర్బార్ కు చెందిన అధికారులకు మాణిక్ నగర్ తో విశేషమైన సంబంధం ఉండేది. ఆ దర్బార్ లోని, గ్రామంలోని చాలా మంది ప్రభు దర్బార్ కు వస్తూపోతూ ఉండేవారు. 

అక్కడి రాజా వారు ప్రభు వద్దకు ఛత్రం, పల్లకి పంపారు. ప్రభు అక్కల్కోటకి రావాలని వారికి కోరికగా ఉండేది. తరువాత ఎపుడైనా వస్తాను అని ప్రభు వాళ్ళకి మాట ఇచ్చారు. ఇలా మాట ఇవ్వడం వలన ప్రభు రాక కోసం నిరీక్షిస్తూ ఆ ఊరి వారందరూ ఉండిపోయారు.

    అక్కల్ కోట సంస్థాన ప్రతినిథి అయిన బాబా సబ్ నిస్ ప్రభువును తమ గురువుగా అక్కల్ కోట తీసుకువెళ్లేందుకు వచ్చిరి. అదే సమయంలో ఒక తేజోమయ సత్పురుషులు ప్రభు దర్శనానికి మాణిక్ నగర్ వచ్చి ఉండిరి. 

వీరు దిగంబరులై, దృఢకాయులై ఉండిరి. వారు ఇక్కడకి వచ్చినపుడు ఎవరితో మాట్లాడేవారు కాదు. ప్రభువు ఆ సత్పురుషునితో మూడు రోజులు ఏకాంత చర్చ జరిపారు. ప్రభు వారిని తమ సోదరులుగా భావించేవారు. ప్రభు ప్రేమకు ఆ స్వామి ముగ్ధులై తను కూడా మాణిక్ నగర్ లో ఉంటామని చెప్పారు. 

అప్పుడు ప్రభువు "ఒక వృక్షము క్రింద మరో వృక్షము పెరగదని" చెపుతూ బాబా సబ్ నీస్ గారితో, వీరే మీ సద్గురువులు, మీకు మంచి జరుగుతుంది అని ఆశీర్వదించి వారిని అక్కల్కోకి తీసుకువెళ్ళమని చెప్పి పంపించారు. ఈ సత్పురుషులే అక్కల్ కోట స్వామి.

తరువాయి భాగము రేపు చదువు కుందాము.... 

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹 🌹 🌹 🌹 🌹

🌹 SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 53 🌹
✍️. Nagesh D. Sonde
📚. Prasad Bharadwaj

🌻 14. Shri Shankar Manik Prabhu (1895 – 1945) - 2 🌻

Shri Martand Manik Prabhu had special affection for this boy. He had given him all the education. 

He studied law and qualified as a High Court Pleader. In selecting him as the administrator, Shreeji could not have made a better choice to take care of the changing times. A life time of spiritual and temporal induction made him an exceptional choice for the Gadi.

He authoritatively took charge of the affairs, yet there was no trace of arrogance in him.  

On taking over the Gadi, the personality of Shri Shankar Manik Prabhu changed dramatically. His inbuilt humility endeared him to all. He had no unkind word for anybody.  

Even when he disagreed, it would be couched in the mildest of words. He had identified with Shri Manik Prabhu’s ideal to the fullest extent and he knew the role which had been assigned to him.  

Even when some would disagree with him, he would in all humility say, “I am after all the servant of Shri Manik Prabhu. Whatever he impels me to do, I do.  

Even if you do not agree with what I say, or do not desire to give respect to me, at least give respect to the Gadi, the Padukas and the memory of Shreeji”. 

He was a scholar and had studied all the scriptures. His philosophicalessays show the depth of his assimilation of the basic principles of Advaita philosophy.  

He was a regular writer in “Tattvadnyan Mandir” a monthly magazine dedicated to philosophy published by the Indian Institute of Philosophy at Amalner. He had also cultivated considerable interest in Astrology, Medicine and Music. 

One may say that after the dominating personality of Shri Martand Manik Prabhu, the period of Shri Shankar Manik Prabhu came like a breather, to consolidate the vision of Shri Martand Manik Prabhu but those who had come to know him closely were impressed by his immense organizational capability, but for which the entire edifice so devotedly raised by Shri Martand Manik Prabhu would not have been sustained. 

It was possible that this was fully realised by Shri Martand Manik Prabhu himself and that was the reason of his being designated as the successor to the Gadi.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Image may contain: 1 person

🌹. సాధనా చతుష్టయ సంపత్తి - శ్రద్ధ 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
చలాచల బోధ... 
📚. ప్రసాద్ భరద్వాజ 

 శాస్త్రవాక్యములు, గురువాక్యములు అవి సత్యము అని దృడమైన నమ్మకము లేక విశ్వాసము కలిగి ఉండటము శ్రద్ధ.
 
గురువు, శాస్త్రములు నీవు పరిపూర్ణుడవు , బ్రహ్మమువై ఉన్నావు అని బోధిస్తాయి. కాని నీ అనుభవములో నిన్ను నీవు పరిమితుడుగా , అసంపూర్ణుడవుగా గుర్తిస్తున్నావు. 

అంటే గురువు, శాస్త్రములు నీ అనుభవమునకు భిన్నమైన వాక్యములను బోధిస్తున్నాయి. అటువంటి జ్ఞానమును అనుభవములోనికి తెచ్చుకోవలెనన్న గురువు, శాస్త్ర వాక్యముల పట్ల నమ్మకము లేక విశ్వాసము తప్పనిసరి.
 
శ్రద్ధ ఉన్నప్పుడు మాట్రమే గురువు, శాస్త్ర వాక్యములను స్వీకరించి శ్రవణ , మనన, నిధి ద్యాసముల ద్వారా విన్న జ్ఞానమును అనుభవములోనికి తెచ్చుకోగలుగుతాము.
 
ప్రాధమికముగా శాస్త్రవాక్యములు, గురువాక్యములు సత్యము అను విశ్వాసము కలిగి ఉండుటను శ్రద్ధ అంటారు.  

విన్న వాక్యములను ఆచరించి అనుభవములోనికి తెచ్చుకొనుట వలన గురి కుదిరి శాస్త్రవాక్యములు, గురువాక్యముల పట్ల అచంచలమైన భక్తి ఏర్పడుతుంది. ఇటువంటి స్తితిలో శాస్త్రవాక్యములు, గురువాక్యముల పట్ల అచంచలమైన భక్తినే శ్రద్ధ అంటారు.
 
 తదుపరి శాస్త్రవాక్యములు, గురువాక్యముల లక్యార్థమైన పరబ్రహ్మమందు విశ్వాసమునే శ్రద్ధ అంటారు. బ్రహ్మనిష్ట యందు మునిగి ఉండుటనే శ్రద్ధ అంటారు.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Image may contain: text

🌹. సౌందర్య లహరి - 26 / Soundarya Lahari - 26 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. శత్రువుల మీద, శత్రుత్వము మీద విజయము 🌴

శ్లో: 26. విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం
వినాశం కీనాశో భజతి ధనదో యాతినిధనమ్ l
వితంద్రీ మాహేంద్రీవితతిరపి సమ్మీలిత దృశా
మహా సంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌll

🌻. తాత్పర్యము :
అమ్మా ! మహా ప్రళయము సంభవించినప్పుడు బ్రహ్మ, విష్ణువు కూడా అంతమును పొందెదరు. అందరికీ మృత్యు పాశములు వేయు యముడు కూడా మృత్యువును పొందుచున్నాడు. ధనమునకు అధిపతి అయిన కుబేరుడు కూడా మరణము చెందు చున్నాడు. ఇంద్రుడు మున్నగు దేవతలు, మునులు కూడా అంతము చెందుచున్నారు. అటువంటి మహా ప్రళయమునందు కూడా నీ పతి యగు సదాశివుడు నిన్ను చేరి స్వేచ్చగా నీతో విహారము చేయుచున్నాడు కదా !

🌻. జప విధానం - నైవేద్యం :
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 6 రోజులు జపం చేస్తూ, తేనె, పానకము నివేదించినచో, శత్రువుల మీద విజయము, 6 అమావాస్యలు జపము చేసి తీపి అన్నము నివేదించినచో శత్రుత్వము అంతమొందును అని చెప్పబడింది.

🌹 Soundarya Lahari - 26 🌹
📚 Prasad Bharadwaj

🌴 Victory over Enemies and enmity 🌴

26. Virincih panchatvam vrajati harir apnoti virathim Vinasam kinaso bhajati dhanado yati nighanam; Vitandri mahendri vithathir api sammeelita-drsa Maha-samhare smin viharati sati tvat-patirasau.

🌻 Translation :
The creator reaches the dissolution, the Vishnu attains death, the god of death even dies, Kubera the lord of wealth expires, the indras close their eyes one after one, and attain the wake less sleep, during the final deluge, but you my chaste mother, play with your consort the Sadashiva.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :

If one chants this verse 1000 times each day for 6 days offering honey, and panakam as prasadam it is said that one would be able to overcome his enemies, and if it is done 6 consecutive new moon days, offering sweet pongal as prasadam, one will come out of all enmity.

🌻 BENEFICIAL RESULTS:
Destruction of enemies and all round success.

🌻 Literal Results:
Practitioner will witness destruction of enemies as described in the sloka, all trouble shooters will be silenced.He alone will taste success against fierce odds.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #సౌందర్యలహరి #soundarya_lahari