విష్ణు సహస్ర స్తోత్ర పాఠం - 19 ( Uttara Pitika Sloka 26 to 30 )

🌹.   విష్ణు సహస్ర స్తోత్ర పాఠం - 19   🌹

🎤. స్వామి చిన్మయానంద మిషన్
📚. ప్రసాద్ భరద్వాజ

Audio file: [ Audio file : VS-Lesson-19 Uttara Pitika Sloka 26 to 30.mp3 ]

🌻. ఉత్తర పీఠికా 🌻

పార్వత్యువాచ

కేనోపాయేన లఘునా విష్ణోర్నామసహస్రకం |

పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో ‖ 26 ‖

ఈశ్వర ఉవాచ

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ‖ 27 ‖

శ్రీరామ నామ వరానన ఓం నమ ఇతి |

బ్రహ్మోవాచ

నమోఽస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే |

సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగధారిణే నమః ‖ 28 ‖

శ్రీ సహస్రకోటీ యుగధారిణే నమ ఓం నమ ఇతి |

సంజయ ఉవాచ

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః |

తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ ‖ 29 ‖

శ్రీ భగవాన్ ఉవాచ

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్| ‖ 30 ‖

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

07 Oct 2020

శ్రీ విష్ణు సహస్ర నామములు - 31 / Sri Vishnu Sahasra Namavali - 31

🌹.   శ్రీ విష్ణు సహస్ర నామములు - 31 / Sri Vishnu Sahasra Namavali - 31  🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

కర్కాటక రాశి - పుష్యమి నక్షత్ర 3 పాద శ్లోకం

🌻 31. అమృతాంశూద్భవో భానుః శశబిందుః సురేశ్వరః |

ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమః ‖ 31 ‖

🍀. అమృతాంశూద్భవః ---
అమృత కిరణ్మయుడగు చంద్రుని జననమునకు కారణము, చంద్రుని తన మనస్సునుండి పుట్టించినవాడు; జలములను వ్యాపింపజేసి జీవులను సృష్టించువాడు. 

🍀. భానుః ---
ప్రకాశించువాడు, కిరణ్మయుడు, సూర్యుడు; సూర్యునకు కూడా వెలుగును ప్రసాదించువాడు. 

🍀. శశబిందుః ---
దుర్మార్గులను విడనాడువాడు, శిక్షించువాడు; చంద్రుడు (కుందేలు వంటి మచ్చ గలవాడు) ; నక్షత్రముల, గ్రహముల గతులను నియంత్రించువాడు. 

🍀. సురేశ్వరః ---
దేవతలకు ప్రభువు; సన్మార్గమున నడచువారికి అండ. 

🍀. ఔషధం ---
భవరోగమును, భయంకరమగు జనన మరణ జరావ్యాధి పూరితమగు సంసారమను వ్యాధిని నయముచేయు దివ్యమగు నివారణ. (పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటిరాయడా! చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా, రోగాలడచి రక్షంచే దివ్యౌషధమా!) 

🍀. జగతస్సేతుః ---
మంచి, చెడుల మధ్య అడ్డుగా నిలచినవాడు; సంసారసాగరమును దాటుటకు ఉపయోగపడు వంతెన; చలించుచున్నవానిని అదుపులోనుంచువాడు; ప్రపంచమునకు, జీవునకు వంతెన వంటివాడు.. 

🍀. సత్యధర్మపరాక్రమః
సదా నిజమైన ధర్మగుణము, పరాక్రమము కలిగినవాడు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹 

🌹   Vishnu Sahasra Namavali - 31  🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj

🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻

Sloka for Karkataka Rasi, Pushyami 3rd Padam

🌻 13. amṛtāṁśūdbhavō bhānuḥ śaśabinduḥ sureśvaraḥ |

auṣadhaṁ jagataḥ setuḥ satyadharmaparākramaḥ || 31 ||

🌻 Amṛtāṁśūdbhavaḥ:
The Paramatman from whom Amrutamshu or the Moon originated at the time of the churning of the Milk-ocean.

🌻 Bhānuḥ:
One who shines.

🌻 Śaśabinduḥ:
The word means one who has the mark of the hare, that is the Moon.

🌻 Sureśvaraḥ:
One who is the Lord of all Devas and those who do good.

🌻 Auṣadham:
One who is the Aushadha or medicine for the great disease of Samsara.

🌻 Jagataḥ setuḥ:
One who is the aid to go across the ocean of Samsara.

🌻 Satya-dharma-parākramaḥ:
One whose excellences like righteousness, omniscience, puissance, etc. are all true.

07 Oct 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 69

🌹.   కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 69   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి - 33 🌻

“ఆకాశస్య సంభూతాత్మా” అనవచ్చునా అంటే అనరాదు. అంటే అర్ధమేమిటి? నీ కళ్ళముందున్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఆకాశమే మిగిలిన నాలుగు భూతముల చేత ప్రభావితము కాకుండా వున్నట్టు కనబడుతున్నది కదా.

అట్టి ఆకాశమునకంటే ముందుగా వున్నటువంటి ఆత్మ స్వరూపము, అధిష్టానముగా వున్న ఆత్మ స్వరూపము, ఆశ్రయముగా వున్న ఆత్మస్వరూపము తదుపరి ఏర్పడినటువంటి వాటి చేత ప్రభావితమగుట, బాధింపబడుట అసత్యము, సాధ్యము కాదు. ఇంకా, మరి ఆకాశమునకంటే ముందున్నటువంటి సూర్య ప్రకాశము ఆత్మ ప్రకాశము వలననే సూర్యుడు ప్రకాశిస్తున్నాడనేటటువంటి అధిష్టాన ధర్మము కలిగినటువంటి ఆత్మ స్వరూపము, స్వరూప జ్ఞానమును ఎవరైనా ఒకరు చంపుతారని చంపెదనని చనిపోతుందని అనడం అసంబద్ధం కదా.

కాబట్టి చంపుట గాని చంపబడుట గాని చనిపోవుటగాని శరీర గతమైన లక్షణములే గాని ఆత్మ లక్షణము కావు. ఇట్టి ఆత్మ లక్షణములను తప్పక మానవులందరూ పూర్తిగా శ్రవణ మనన నిధి ధ్యాస యుక్తముగా ఆత్మస్వరూప లక్షణములను చక్కగా అనుశీలించవలసిన అవసరము వున్నది.

ఒకవేళ ఈ ఆత్మ లక్షణమునకు వ్యతిరేకముగా నీకెప్పుడైనా తోచినట్లయితే అపుడు శరీర గత ధర్మములను ఆశ్రయించావు అనేటటువంటి నిర్ణయాన్ని నువ్వు పొందాలి. ఏ భావములోనైనా, ఏ ఆలోచనలో అయినా ఈ శరీర ధర్మమేమిటి ఆ ఆత్మ ధర్మమేమిటి అని చక్కగా విచారణ చేసి ఆత్మ ధర్మమును ఆశ్రయించి ఆత్మ భావమునందు స్థిరముగా నిలబడి వుండటమే సాధకులకు అత్యావశ్యకమైనది.

కాబట్టి ఆత్మ ఎవరినీ చంపుటా లేదు, చచ్చుటా లేదు. ఆత్మకు రెండు లక్షణములూ లేవు. ఏమిటవీ? చంపబడదు, చనిపోదు. కాబట్టి ఎవరైనా చనిపోయారు అంటే అర్ధమేమిటంటే వారి శరీరము మాత్రమే చనిపోయింది. వారు చనిపోయే అవకాశం లేదు. ఈ రకమైనటువంటి సత్యాన్ని తప్పక మానవులు నిర్ణయాత్మకంగా గ్రహించవలసినటువంటి అవసరం వున్నది. అర్ధమయిందా అండి? ఈ రకంగా నీవు ఈ అంశాలను గ్రహించుకోవాలి.

ఇలా గ్రహించుకున్న తరువాత నీ నిజ జీవితంలో నువ్వు ఈ ఆత్మ భావనలో నిలకడ చెంది వుండటమనేది అతి ముఖ్యమైనటువంటిది. ఎందుకనంటే అన్నీ ఇంద్రియములతో ఇంద్రియార్ధములతో విషయములతో కూడుకుని వున్నటువంటి భావనలు భావములే కలుగుతూ వుంటాయి.

అసంబద్ధమైనటువంటి శరీర ధర్మానుసారము వున్నటువంటి, మనో ధర్మానుసారము వున్నటువంటి, ఇంద్రియములతో కూడుకున్నటువంటి, గుణములతో కూడుకున్నటువంటి, వాసనలతో కూడుకున్నటువంటి, శరీరములతో కూడుకున్నటువంటి, అవస్థలతో కూడుకున్నటువంటి, కాలత్రయముతో కూడుకున్నటువంటి, కాలత్రయం, శరీరత్రయం, అవస్థాత్రయం, దేహత్రయం, జననమరణాలతో కూడుకున్నటువంటి, జరామరణ మృత్యు స్వరూపమైనటువంటి, ఏదో ఒక కాలంలో నేను చనిపోతాను కదా అనేటటువంటి భావన చేత మానవుడు శరీర ధర్మాన్ని పొందుతున్నాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

07 Oct 2020

అద్భుత సృష్టి - 48

🌹.   అద్భుత సృష్టి - 48   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 18. లైట్ బాడీస్ (కాంతి శరీర స్థాయిలు) 🌻

కాంతి శరీరం అంటే నశింపు లేని దివ్యత్వం. ఈ కాంతి దేహం పొందటం అంటే తాను దైవంగా మారినట్లే. మన ప్రస్తుత శరీరం పరిణామం చెందుతూ అధిక మొత్తంలో కాంతిని స్వీకరిస్తూ నెమ్మది నెమ్మదిగా శరీరంలోని అణువులు అన్ని తమ ఫ్రీక్వెన్సీని "కార్బన్ స్థితి" నుండి "కాంతి స్థితి" లోనికి మార్చుకుంటుంది.

✨. ఈ ఆత్మకు సంబంధించిన అన్ని శక్తులు, శక్తి క్షేత్రాలు, శరీర అవయవాలు అన్నీ కూడా తమ ఫ్రీక్వెన్సీని ఉన్నత స్థాయి ఫ్రీక్వెన్సీతో అనుసంధానం చేస్తూ అతి సాధారణ భౌతిక స్థాయి నుండి ఆదిభౌతిక స్థాయికి, అక్కడి నుండి అనంత చైతన్య స్థాయికి ఎదిగేలా చేస్తుంది.

✨. కాంతిని స్వీకరిస్తూ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా, శారీరక, మానసిక, బుద్ధి, చైతన్య స్ధితులలో ప్రత్యేక మార్పులు జరుగుతాయి.

కర్బన ఆధారిత శరీర అణువులు మార్పును చెందుతున్న తరుణంలో కర్మలు కడగబడడం జరుగుతుంది. శరీరం అధిక సాంద్రతను కోల్పోవడం జరుగుతుంది. ఈ తరుణంలో శరీరం అతి సాధారణమైన రుగ్మతలకు గురి కావడం జరుగుతుంది. (జ్వరం, తలనొప్పి, దద్దులు, కండరాలు బిగదీయడం, కీళ్లనొప్పులు మొదలైనవి)

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

07 Oct 2020

గీతోపనిషత్తు - 47

🌹.   గీతోపనిషత్తు - 47   🌹

🍀   7. పరహితము - లభించిన భోగ భాగ్యములు ఇతరుల శ్రేయస్సు కొరకు వినియోగించు వాడు బుద్ధిమంతుడు. తనకు తానే అనుభవించు వాడు మూర్ఖుడు.   🍀

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚.   కర్మయోగము - 12   📚

12. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః |

తైత్తా నప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః || 12

యః అప్రదాయః, సహస్తేన ఏవః :

పరహిత కార్యములను నిర్వర్తించుచు తద్వారా దేవతల ప్రీతి నందిన వాడు భోగ్యమగు అనేక విషయములను వారి యనుగ్రహముగ పొందు చుండును. అట్లు విశేషములైన భోగములను గూడ అనుగ్రహింప బడును. అనుగ్రహింప బడిన భోగ్య విషయములు తనకు తానే అనుభవించుట దొంగతనము. అట్టి దొంగ మరల పతనము చెందగలడు.

లభించిన భోగ భాగ్యములు ఇతరుల శ్రేయస్సు కొరకు వినియోగించు వాడు బుద్ధిమంతుడు. తనకు తానే అనుభవించు వాడు మూర్ఖుడు. అట్టి మూర్ఖుడు తన ప్రవర్తనము ద్వారా తానే పతనము చెందుచుండును. తాను పరహిత కార్యము లొనర్చుటచే దేవతానుగ్రహము పొందినవాడు. దేవతలు అనుగ్రహించుటకు కారణము తనయందు పరహిత బుద్ధి యున్నదని.

భోగ్యవిషయము లభ్యముకాగానే, పరహిత ధర్మము మరచుట కృతఘ్నత్వమగును. అందించిన ప్రతి భోగ్యవిషయమును పరహితమునకే సమర్పించుట వృద్ధికి కారణమగును. అట్లు కానిచో వృద్ధి యాగును. పతనము ప్రారంభమగును.

పరహిత బోధనలు విన్న పేద బ్రాహ్మణుడొకడు తనకుగల రెండు అంగవస్త్రములలో ఒక దానిని గౌతమబుద్ధునకు సమర్పించెను. ఆనందముతో ఏకవస్త్రము ధరించి బాటను పోవుచున్న పేద బ్రాహ్మణుని చూసి, ఆదేశపు రాజు, విషయము తెలుసుకొని బ్రాహ్మణునకు పది అంగవస్త్రముల జంటను అందించినాడు. లభ్యమైన పది అంగవస్త్రముల జంటలను బ్రాహ్మణుడు మరల దానము చేసి ఏకవస్త్రుడుగ నిలచి అమితానందము పొందినాడు.

పై విషయము తెలిసిన రాజు బ్రాహ్మణునియందు మిక్కిలి సంతసించి ధన కనకములు, ధాన్యము బ్రాహ్మణున కందించినాడు.

అవియును గూడ మండలము రోజులలో ఇతరుల శ్రేయస్సునకు వినియోగించి మరల ఏకవస్త్రుడుగ చరించసాగినాడు. ఈ విషయము తెలిసిన రాజు ఆనందభరితుడై, బ్రాహ్మణునకు సస్యశ్యామలమైన అగ్రహారము నిచ్చినాడు.

అగ్రహారమునంతను బౌద్ధసన్యాసులకు ఆశ్రమముగ నేర్పరచి పేద బ్రాహ్మణుడు పరమానందభరితుడై బుద్ధుని సాన్నిధ్యము పొందినాడు. రాజు మిక్కుటముగ ఆనందము పొంది పరహితమార్గమున పరిపూర్ణముగ నడచుటకు సంకల్పించి, దీక్షగ లోకహితమును ఆచరించి రాజర్షియై దైవసాన్నిధ్యమున నిలచినాడు.

ఇట్లు తనదగ్గర ఉన్నటువంటి విద్యగాని, తెలివిగాని, శక్తిగాని, ధనాదులుగాని ఇతరుల శ్రేయస్సు కొరకై వినియోగించు వాడు సృష్టియందు నిజమైన రాజుగ నిలచును. అట్లు జీవించని వారు ఎప్పుడును పేదలే. పేదలేగాదు దొంగలు కూడ అని కృష్ణుడు కర్మానుష్ఠాన రహస్యమును తెలిపినాడు. (3-12)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

07 Oct 2020

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 129

🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 129   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. నారద మహర్షి - 3 🌻

20. రుద్రుడి యొక్క తత్త్వం ఏమిటంటే, అయిదవ బ్రహ్మగా అతడు అంతర్ముఖుడై ఉన్నాడు. శుద్ధజ్ఞానలక్షణ విలసితుడై, అంతర్ముఖుడై అతడు ఉండటచేత సాధారణంగా నిష్క్రియుడు.

21. అతడి యందు అతని యొక్క కార్యలక్షణము ఎప్పుడు వస్తుందంటే, లోకంలో ఏదయినా విపత్తు సంభవించినప్పుడుకాని, ఎవరైనా ఆరాధించినప్పుడుకాని (అతడున్నాడని తెలిసినవాడూ అతడిని ఆరాధిస్తే), అతడికి క్రియ ఏర్పడుతుంది తప్ప; లేకపొతే అతడి యందు క్రియలేదు.

22. శుద్ధజ్ఞాన స్వరూపమై, ఆదియందున్న పరబ్రహ్మతత్త్వమైన సదాశివతత్త్వం ఏదయితే ఉన్నదో, దానియొక్క జ్ఞానం సంపూర్ణంగా కలిగి ఉండటంచేత – రుద్రుడు నిష్క్రియుడై, క్రియాతీతుడై సర్వకాలములకు అతీతుడైన స్థితిలో ఉంటాడు.

23. కనుక రుద్రుడు ప్రథమమైనటువంటి పరబ్రహ్మ-సదాశివబ్రహ్మ-యొక్క రూపాంతరమే. అందుకని లోకమందున్న విభూతులు, ఐశ్వర్యము, సుఖము – వాటియొక్క స్పృహ అతడియందు ఉండదు.

24. అయితే, ఈ రుద్రునికి మళ్ళీ పత్నిగా పరాశక్తి ప్రక్కన ఉన్నదని మనవేదాలు, పురాణాలు, శాస్త్రాలు విరూపణంచేసాయి. అంటే, మన ఉపాసనాసౌలభ్యంకోరకే ఈ సిద్ధంతం ఏర్పడినదని గ్రహించాలి. లేకపోతే, రుద్రుడు వివాహంచేసుకున్నాడని, ఆయనకు స్వాధీనంగా లేకుండానే ఆమె వెళ్ళిపోయి, దాక్షాయణిగా తనను తాను ఉపసంహారం చేసుకుందనీ, ఈ కథకంతటికీకూడా ఎలాగ అర్థం చెప్పుకోవాలి? సృష్టిమూలకమైన తత్త్వములకు – మన పౌరాణికగాధలన్నీ కొన్ని రూపకల్పనలని చేసుకోవాలి.

25. కథారూపకల్పన లేకుంటే, ఆ తాత్త్వముల అంతరార్థం మానవబుద్ధికి సులభంగా అవ్గాహన కాదు.

దేవాలయంలో నందీశ్వరుడిని, గణపతిని ప్రతిష్ఠ చేస్తాం. ఆ రెండూ లేకపోతే ఈ రుద్రుణ్ణి మనం చేరటానికి, సమీపించడానికి, ఆయనను ఉపాసించడానికి సాధ్యంకాదు. ఆ వేదాంతతత్త్వమే మనయొక్క ఈశ్వర ఉపాసనా విధానములందుకూడా అనేక రూపాంతరములు పొంది వచ్చింది ఈ ప్రకారంగా.

26. జ్ఞానాజ్ఞానముల యొక్క అనేక అవస్థలలో జీవులు ఆయా పరిణామదశలలో ఉన్నారు. ఈ సృష్టిలో అనేక చరిత్రలు జరగవలసి ఉంది. దానికి దేవకార్యం అనిపేరు.

27. ఈశ్వరుని నుండి బహిర్గతమైన జగత్తంతా – ఈ జీవకోటి అంతా కూడా – తనలో మళ్ళీ లయం చెందాలనేది ఒకటే ఆయన సంకల్పం. కానీ జీవులకు ఆయన్ స్వేఛ్ఛనిచ్చాడు. వాళ్ళందరినీ తను వెంటనే ఉపసంహారం చేసుకోవచ్చు కదా! అటువంటి క్రియయందు అతడికి కారణత్వంలేదు. అలాంటికారణం అతడు కాడు.

28. స్వేఛ్ఛ జీవాహంకారానికి ఇవ్వటంచేత, దానంతట దానికే ఎప్పుడైతే ఆ మోహమ్నుంచి విడిపోదామనే మోక్షేఛ్ఛ కలుగుతుందో, అప్పుడే దానికి మార్గాలు ఈ సృష్టిలో ఏర్పాటు చేయబడి ఉన్నాయి. కర్మయొక్క బంధ్నాన్నే కోరుకొని శాశ్వతంగా ఇక్కడే ఉండేవాళ్ళకు దానికి ఏర్పాట్లు వేరే ఉన్నయి.

29. రెండు విధాలుగా రాచబాటలు వేసి ఈశ్వరుడు జీవాత్మకు ఇచ్చాడు. అతడు మనకు ఇచ్చిన దానికే చిత్తము – బుద్ధి – మనసు అని మనమంటున్నాం. అంటే, జీవుని కివ్వబడిన ‘స్వేఛ్ఛ’ పేరే, మనోబుద్ధిచిత్తములు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

07 Oct 2020

శ్రీ శివ మహా పురాణము - 241

🌹 . శ్రీ శివ మహా పురాణము - 241 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

54. అధ్యాయము - 9

🌻. మారగణములు - 2 🌻

నా బాణమును ప్రయోగించుటకు ఆవశ్యకమగు దౌర్బల్యము శివునియందు నాకు ఏనాడూ కానరాలేదు. హే జగత్ర్ప భూ! నేను సత్యమును పలుకుచున్నాను. శివుని మోహింపజేయు శక్తి నాకు లేదు (20).

వసంతుడు శివుని మోహింపజేయుటకు ప్రయత్నించినాడు. మహాత్మా! ఆ వృత్తాంతమును వినుము. నేను ముమ్మాటికీ సత్యమునే పలుకుచున్నానను (21).

శివుడు ఉన్నచోట వసంతుడు సంపెంగలను, కేసరపుష్పములను, కురువేరు పుష్పములను, అరుణవర్ణము గల పొన్నలను, నాగకేశరములను, కింశుక పుష్పములను, మొగలి పువ్వులను, దానిమ్మ పువ్వులను (22),

అడవి మల్లెలను, దట్టమగు మోదుగ పువ్వులను, గోరింట పువ్వులను వికసింపజేసెను (23).

ఆతడు ప్రయత్న పూర్వకముగా శివుని ఆశ్రమములో సరస్సులను వికసించిన పద్మములతో సుగంధ భరితములగునట్లు చేసి మలయానిలము వీచునట్లు చేసెను (24).

అచట గల లతలన్నియూ పూలతో, చిగుళ్లతో నిండి వృక్షముల మొదళ్లను ప్రేమతో చుట్టుకొని యుండెను (25).

పుష్పములతో నిండియున్న ఆ వృక్షములను చూచి, ఆ సుంగధి భరితములగు గాలులను అనుభవించిన మునులు కూడా కామమునకు వశమైరి. ఇతరుల గురించి చెప్పనదేమున్నది? (26).

ఇట్లు ఉన్ననూ శివునకు మోహమును పొందే హేతువు గాన రాలేదు. ఆయనలో లేశమైనను వికారము కలుగలేదు. శంకరుడు నాపై కోపమును కూడ చేయలేదు (27).

ఈ వృత్తాంతమునంతనూ చూచిన నేను ఆ శివుని భావనను తెలుసుకున్నాను. నాకు శివుని మోహింపచేయుట యందు అభిరుచి లేదు. నేనీ మాటను నీకు నిశ్చయముగా చెప్పుచున్నాను (28).

ఆయన సమాధిని వీడినప్పుడు ఆయన చూపుల ముందు మేము నిలబడుటకైననూ సమర్థులము కాము. అట్టి రుద్రుని ఎవరు మోహింపజేయగలరు? (29).

హే బ్రహ్మన్‌! మండే అగ్నివలె ప్రకాశించు కన్నులు కలిగినట్టియు, జటాజూటముతో భయంకరముగా నున్నట్టియు, విషమును ధరించియున్న శివుని చూచి, ఆయన యెదుట నిలబడ గలవారెవ్వరు? (30).

బ్రహ్మ ఇట్లు పలికెను -

నాల్గు మోములు గల నేను ఈ మన్మథుని మాటలను విని, సమాధానమును చెప్పగోరియు చెప్పక ఊరకుంటిని. అపుడు నా మనస్సు చింతతో నిండి పోయెను (31).

శివుని నేను మోహింపచేయ జాలను అను మన్మథుని పలుకులను వింటిని. ఓ మహర్షీ! ఈ మాటలను విన్న నేను మహా దుఃఖముతో నిట్టూర్పు విడిచితిని (32).

నా నిట్టూర్పు వాయువుల నుండి అనేక రూపములు గలవారు, మహాబలులు, వ్రేలాడు జిహ్వలు గలవారు, అతి చంచలమైన వారు, మిక్కిలి భయమును గొల్పువారు నగు గణములు పుట్టినవి (33).

వారందరు అసంఖ్యాకములు, గొప్ప భయంకరమైన ధ్వని చేయునవి అగు పటహము మొదలగు అనేక వాద్యములను మ్రోగించిరి (34).

నా నిట్టూర్పుల నుండి పుట్టిన ఆ మహాగణములు నా ఎదుట నిలబడి 'చంపుడు నరుకుడు' అని కేకలు వేసినవి (35).

నన్ను ఉద్దేశించి వారు 'చంపుడు నరుకుడు' అని వేయుచున్న కేకలను విని మన్మథుడు వారిని ఎదుర్కొనెను (36).

ఓ మహర్షీ! అపుడు మన్మథుడు నాయెదుటనున్న ఆ గణములను వారించి, నాతో బ్రహ్మన్‌ అని సంబోధించి ఇట్లు పలికెను (37).

మన్మథుడిట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! ప్రజాపతీ! సృష్టినంతనూ ప్రవర్తిల్ల జేయువాడవు నీవే . ఈ భయంకర వీరులు ఉత్పన్నమైరి. వీరెవ్వరు? (38).

హే విధీ! వీరి కర్తవ్యమేమి? వీరు ఎక్కడ ఉండెదరు? వీరినామము ఏమి? ఈ విషయములను చెప్పి, వీరిని నియోగింపుము (39).

వారికి స్థానమునిచ్చి, పేరు పెట్టి, వారి కర్మలయందు వారిని నియోగింపుము. హే దేవేశా! అపుడు దయతో నాకు తగిన ఆజ్ఞను ఇమ్ము (40).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణం

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

07 Oct 2020

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 23, 24 / Sri Lalitha Chaitanya Vijnanam - 23, 24

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 15 🌹

🌹.   శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 23, 24 / Sri Lalitha Chaitanya Vijnanam - 23, 24  🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

9. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ:

నవవిద్రుమ బింబశ్రి న్యక్కారి దసన్నచ్చద

🌻 23. 'పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ!' 🌻

అద్దము కంటె నిర్మలములైనవి పద్మరాగ శిలలు! వానియందలి

పదార్థము అత్యంత పారదర్శకముగను, స్పష్టముగను, నిర్మలముగను యుండును. అమ్మవారి కపోలములు అంతకు మించిన పారదర్శకత కలిగినవని యీ నామమున వర్ణించుచున్నారు. పరమాత్ముని దర్శించుట యనగా అమ్మను దర్శించుటయే! పరమాత్మ దర్శన మిచ్చుట యనగా అమ్మ దర్శన మిచ్చుటయే యగును.

అవ్యక్తమగు తత్త్వము శివము. అట్టి శవము యథాతథముగా ప్రతిబింబించినపుడే దృగ్గోచరమగును. అమ్మవారి చెక్కిళ్ళు అయ్యవారిని ప్రతిబింబింపగలిగిన పారదర్శకత్వముతో ప్రకాశించుచున్నవని తెలియవలెను. అయ్యకు ప్రతిబింబము అమ్మ! అమ్మ ప్రతిబింబింప చేయునదీ అయ్యనే! మరొకటి కాదు. ఇంకనూ వివరములు వలసినవారు కేనోపనిషత్ చదువు కొనవచ్చును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 23 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 23. Padmarāga- śilādharśa- paribhāvi-kapolabhūḥ पद्मराग-शिलाधर्श-परिभावि-कपोलभूः (23) 🌻

Her cheeks are shining, soft and reflecting. Padmarāga is a type of ruby, red in colour.

Ruby is of four types: vipra, kuruvinda, saugandhika and mansa-khanda, out of which vipra is superior. Wearing afflicted rubies cause irreparable damages in one’s life.

Her cheeks are reflecting red colour as Her complexion itself is red. The other ornaments that have been described above are also red in colour.

The sun and the moon in Her ear lobes make Her cheeks shining red. Everything associated with Her is red. As discussed earlier, red indicates compassion.

Saundarya Laharī (verse 59) says, “Your face is cupid’s four wheeled chariot, having the pair of your ear ornaments reflected in the expanse of your cheeks.

Cupid, the mighty warrior sitting on it plots revengefully against the Lord Śiva, resting on the chariot of the Earth having the Sun and Moon for its wheels.”

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 24 / Sri Lalitha Chaitanya Vijnanam - 24 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

9. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ:

నవవిద్రుమ బింబశ్రి న్యక్కారి దసన్నచ్చద

🌻 24. 'నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా' 🌻

విద్రుమ బింబమనగా ఎఱ్ఱని కాంతిబింబము. క్రొత్తగా కొనిరాబడిన ఎఱ్ఱని కాంతులతో కూడిన శుభప్రదమైన పెదవులు కలిగినది. సృష్టియందలి అందమైన ఎఱ్ఱని పగడము, దొండపండు వంటి రూపములను, అధిగమించిన అందముగల పెదవులు అని విశ్లేషించబడినవి.

క్రొత్తగా కొనిరాబడిన ఎఱ్ఱని బింబముయొక్క శోభ తెలియవలె

నన్నచో తూర్పున ఉదయించుచున్న సూర్యబింబమును దర్శించవలెను.

ఉదయ సూర్యబింబపు కాంతి మనస్సున కాహ్లాదము కలిగించును. అనురక్తి ఏర్పరచును. అందుండి వెలువడు కిరణములు నీటిపై పడునపుడు ఉపరితలమున పగడములు పరచినట్లుగా అమితానందము కలిగించును.

సూర్యోదయ సమయమున తూర్పు సముద్ర తీరమునను, నదీ తీరమునను, తటాక తీరముననూ ఈ కాంతిని దర్శించి అమ్మ పెదవుల కాంతి అనుభూతి పొందవచ్చును.

సృష్టియందలి అత్యంత సుందరమైన కాంతులన్నియూ అమ్మ విన్యాసములే! పై విధముగ పెదవులను వర్ణించుట ఋషి దర్శనము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 24 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 24. Navavidruma- bimbaśrī- nyakkāri- radanacchadā नवविद्रुम-बिम्बश्री-न्यक्कारि-रदनच्छदा (24) 🌻

Her lips outshine fresh coral and the bimba fruit (momordica monadelpha).

Bimba fruit is normally compared to beautiful lips. Both are red in colour.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

07 Oct 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 67

🌹.   భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 67   🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 17 🌻

275. భగవంతుడు మానవుని స్థితిలో నిత్యము సంస్కారములద్వారా సృష్టి--స్థితి--లయములైన ప్రధాన ధర్మములను నిరూపించు చున్నాడు.ఇది,జగత్కర్త పాత్రను నిర్వహించుచున్న భగవంతుని స్థితి.

276. భగవంతుని యొక్క దివ్య సుషుప్తిలో నిద్రాణమైన సంస్కారముల ద్వారా సచరాచర సమన్వితంబైన మాయ సృష్టింపబడి , భగవంతుని దివ్యస్వప్నమైన వర్తమానములో పోషింపబడి ,దివ్యజాగృతియైన భవిష్యత్తులో నాశనమగుచున్నది .

అనగా మానవ రూపములోనున్న భగవంతుడు ,దివ్యత్వసిద్ధిని బడయుటతో మాయా సృష్టి నాశనమగుచున్నది .

277. సృష్టిలో :_ స్థితి _లయములు

స్థితిలో :_ సృష్టి _లయములు

లయములో :_ సృష్టి _స్థితులు

పరస్పరాశ్రితములై యున్నవి .

278. మానవుడు స్వప్నావస్థ యందున్నప్పుడు , భూత_ వర్తమాన _భవిష్యద్రూపములతో కలియుచున్నాడు . అతడు సమావేశములను సృష్టించుట ,వాటిని పోషించుట , వాటిని నాశనము చేయుట అనెడు పాత్రలను సృజించుచున్నాడు .ఇవ్విధముగా మానవుడు ఎల్లప్పుడు వీటన్నింటికి , స్వప్నమునకు భవిష్యత్తు అయిన వర్తమానముతో సాక్షీ భూతుడైయున్నాడు .

279. ఈపె ( ఈ పై ) ఆధారములనుబట్టి ,స్వప్నములోగాని మెలకువలోగాని , సృష్టింపబడినవి , పోషింపబడినవి వర్తమానములో అడుగడుగునకు తప్పనిసరిగా నాశనము కావలసిన భవిష్యత్తు పొంచియే యున్నది .

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

07 Oct 2020

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 74 / Sri Gajanan Maharaj Life History - 74

🌹.   శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 74 / Sri Gajanan Maharaj Life History - 74   🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 14వ అధ్యాయము - 5 🌻

ఇది విన్న బనకటలాల్ మరియు మిగిలిన ముగ్గురూ పదేపదే శ్రీమహారాజుకు మొక్కారు. వాళ్ళు క్షేమంగా షేగాం చేరి ఈ వృత్తాంతాన్ని సంతోషంగా అక్కడి ప్రజలకు చెప్పారు. సదాశివ రంగనాధ్ వానవలె తన స్నేహితునితో ఒకసారి, శ్రీగజానన్ మహారాజు దర్శనానికి షేగాం వచ్చాడు. తాత్యా ముద్దుపేరుగల ఈ సదాశివ, మాల్వాలో అనేకమంది అనుచరులున్న, యోగవిద్యలో ప్రావీణ్యతగల, చిత్రకూట్ వాసిఅయిన శ్రీమాధవనాధ్ మహరాజు శిష్యుడు.

సదాశివ్ శ్రీగజానన్ మహారాజు దర్శనానికి వచ్చినప్పడు ఆయన తన భోజనం తీసుకుంటున్నారు. సదాశివ్ కనిపించగానే, శ్రీమహారాజు శ్రీమాధవనాధ్ మహారాజును గుర్తు చేసుకున్నారు. యోగులు కలవకుండానే ఒకరిగురించి ఒకరికి తెలుస్తుంది. శ్రీనాధ్ శిష్యులను నాముందుకు తెండి, భోజనం చేసి ఇప్పడే వాళ్ళగురువు వెళ్ళిపోయారు. కొద్దిగా కనక ముందు వచ్చిఉంటే వాళ్ళ గురువును వాళ్ళు ఇక్కడే కలిసి ఉండేవారు. ఇప్పడు వీళ్ళు తమగురువు తాంబూలం మర్చిపోయి వెళ్ళినతరువాత వచ్చారు అని శ్రీమహారాజు అన్నారు.

తన సహోదరుని పిల్లలవడంతో శ్రీమహారాజు వానవలెను ఆలింగనం చేసుకుని ఆనవాయితీ ప్రకారం ఆహ్వనించారు. శ్రీనాధ్ కు ఇచ్చేందుకు రెండు తమలపాకులు ఆయన అప్పడు వాళ్ళకి ఇచ్చి, మాటలు మార్చకుండా ఉదహరించిన సందేసం ఇయ్యమని అన్నారు. మనం కలిసి భోజనంచేసాం, కానీ మీకిళ్ళీ ఇక్కడ మర్చిపోయారు, ఇప్పుడు మేము దానిని మీకోసం తెచ్చాము. వానవలె అదివిని ఆరెండు తమలపాకులతో తిరిగి వచ్చాడు.

శ్రీనాధ్ కు షేగాంలో జరిగిన చర్చలు వివరంగా వర్నించి, మీరు నిజంగా షేగాం ఆరోజు వెళ్ళారా అని అడిగాడు. శ్రీగజానన్ ఏమి చెప్పారో అది నిజం. తను భోజనం చేస్తున్నప్పుడు నన్ను గుర్తు చేసుకోవడమే మేము కలుసుకోవడం. ఈ విధంగా మేము తరచు కలుసుకుంటూ ఉంటాం. దీనిగురించి ఏవిధమయిన శంక లేకుండా ఉండు. ఒకళ్ళని ఒకళ్ళు గుర్తుచేసుకోవడమే మేము కలుసుకోవడం. మాఇద్దరి శరీరాలు వేరుగా ఉన్నా, మా జీవనధార ఒక్కటే. ఇది చాలా గూఢమయిన జ్ఞానం, దీనిని అర్ధం చేసుకోవడానికి నీకు ఇంకా కొంత సమయం కావాలి.

నేను షేగాంలో మర్చిపోయిన తాంబూలం తెచ్చి మంచిపని చేసావు అని శ్రీనాధ్ అన్నారు. శ్రీనాధ్ ఆ తమలపాకులు తీసుకొని నూరి తిన్నారు, ఆయన కొంత వానవలకి కూడా ప్రసాదంగా ఇచ్చారు. శ్రీధ్యానేశ్వరు మాహారాజు తన చాందోపనిషత్తులో యోగులు ఈవిధంగా కలుసుకోవడం గురించి వివరంగా వర్నించారు. వారు ఆవిధంగా కలుసుకునే పద్ధతి తెలుసుకుందుకు అది చదవాలి.

యోగులు ఒకరికొకరు ఎంతదూరంగా ఉన్నా తమ స్థానం వదలకుండా కలుసుకోడం అనే సంగతి తెలుసుకోడం కుతూహలమైన విషయం. షేక్ మహమ్మద్ శ్రీగోండాలోను, తుకారాం దేహులోను ఉన్నారు, కానీ శ్రీతుకారాం దేహులో కీర్తన చేస్తున్న మండపానికి నిప్పు అంటుకున్నప్పుడు శ్రీగోండానుండి షేక్ మహమ్మద్ దానిని ఆపుతారు. దీనిని భక్తి విజయలో మహిపాల్ వర్నించారు.

శ్రీమాణిక్ ప్రభు హలి గ్రామంచేరి పాటిల్ కొడుకును బావిలో మునగకుండా రక్షించారు. నిజమైన యోగులే ఇటువంటి చమత్కారాలు చెయ్యగలరు. యోగ అన్నిటికంటే కుడా శక్తివంతమయినది. కాబట్టి దేశాన్ని పటిష్ఠం చెయ్యడానికి యోగ నేర్చుకోండి. ఈ మహాకావ్యమయిన గజానన్ విజయను ప్రియమైన భక్తులు పూర్తి విశ్వాసంతో వినుగాక. అందరికీ సంతోషంకలుగుగాక. హర మరియు హరికి నమస్సులు.

శుభం భవతు

14. అధ్యాయము సంపూర్ణము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 74 🌹

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj

🌻 Chapter 14 - part 5 🌻

Hearing this, Bankatlal and the three others again and again prostrated before Shri Gajanan Maharaj . They returned to Shegaon and, with great happiness, narrated the incident to the people there. Once Sadashiv Ranganath Wanawale, alongwith his friend, came to Shegaon for the Darshan of Shri Gajanan Maharaj.

This Sadashiv, nicknamed as Tatya, was the disciple of Shri Madhaonath Maharaj of Chitrakut, who had mastered the art of yoga and had a large following in Malwa. When Sadashiv came for the darshan of Shri Gajanan Maharaj, Maharaj was taking His meals.

At the sight of Sadashiv, Shri Gajanan Maharaj remembered Shri Madhaonath Maharaj. Saints know each other even without meeting. Shri Gajanan Maharaj said, “Bring those disciples of Shri Nath before Me. Their Guru just went away after taking meals with Me.

Had they come a bit earlier, they would have met their Guru here only. Now they have come after their Guru went away without taking the Paan. Being the children of a brother, Shri Gajanan Maharaj embraced Wanawale and gave him the traditional reception. Then He gave him two leaves of betel for giving to Shri Nath and asked to convey the message as follows without a change of word, “We had meals together but You forgot your Paan here. We have now brought it for You.”

Wanawale heard this message and returned with those two leaves of betel. He narrated the detailed talk at Shegaon to Shri Nath and asked if He had really gone to Shegaon that day. Shri Nath said, What Shri Gajanan said is true. His remembering Me at the time of meals is Our meeting.

We meet each other like that quite frequently. Don't have any doubt about it. Remembering each other is Our meeting. Though We have different bodies, Our life breath is the same. This is a deep knowledge and you may require some time to understand it. It is good that you brought the Paan, which I had forgotten at Shegaon.”

Then Shri Nath took the betel leaves, crushed and ate it. He also gave some to Wanawale as Prasad. Shri Dyaneshwar Maharaj, in his ‘Changdeo Pasasti’, has described in great detail the way saints meet each other. One should read that to understand their manner of meeting. It is interesting to know that Yogis meet each other from any distance without leaving their places.

Sheik Mohamed was in Shri Gonda and Shri Tukaram at Dehu, but when the pendal at Dehu where Shri Tukaram was doing Kirtan caught fire, Sheik Mohamed extinguished if from Shri Gonda. This has been narrated by Mahipal in the ‘Bhaktivijay’. Shri Manik Prabhu saved Patil's son from drowning in a well, by reaching Hali village.

Only true yogis can perform such Miracle. Yoga is more powerful than anything else. So learn Yoga to make the nation strong. May the affectionate devotees with full faith, listen to this Gajanan Vijay epic! Let Joy be to all! Obeisance to Har and Hari.

||SHUBHAM BHAVATU||

Here ends Chapter Fourteen

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

07 Oct 2020

శివగీత - 85 / The Siva-Gita - 85

🌹. శివగీత - 85 / The Siva-Gita - 85 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

దశమాధ్యాయము

🌻. జీవ స్వరూప నిరూపణము - 11 🌻

నాడీ మార్దైరింద్రి యాణా - మాకృష్యాదాయ వాసనాః |

సర్వం గ్రసిత్వా కార్యం - విజ్ఞానాత్మా విలీయతే 51

ఈశ్వరాఖ్యే వ్యాకృతేథ - యథా సుఖమయో భవేత్ |

కృత్స్నప్రపంచివిలయ స్తథా భవతి చాత్మనః 52

యోషితః కామ్యమానాయాః - సంభోగాంతే యథా సుఖమ్ |

స ఆనంద మాయో బాహ్యో - నాన్తరః కేవలం యథా 53

ప్రాజ్ఞాత్మతాం సమాసాద్య - విజ్ఞానాత్మా తథైవసః |

విజ్ఞానాత్మా కారణాత్మా - యథా తిష్ఠన్న థాపిసః 54

అవిద్యా సూక్ష్మ వృత్త్యాను - భవిత్యేవ యథాసుఖమ్ |

అజ్ఞాన మపి సాక్ష్యాది - వృత్తిభిశ్చా మభూయతే 55

తథాహం సుఖ మాస్వాప్సం - నైవ కించిద నేదిషమ్ |

ఇత్యేవం ప్రత్యభి జ్ఞాపి - పశ్చాత్త స్యోప పద్యతే 56 
 
జీవుడునాడీ మార్గమున ఇంద్రి యముల సున్నితమైన వాసనలను ఆకర్షించుకొని సమస్త కార్యములను తనలో లీన మొనర్చుకొని యవ్యాకృతమైన ఈశ్వర చైతన్యములో నైక్యమును పొందుచున్నాడు.

ఆ సందర్భములో అతనికి కేవలమానందము మాత్రమే

గోచరించుచుండునట్లు ఈ తుచ్చ ప్రపంచ మంతయు స్వరూప సత్తుగా లీనమై యుండును.

కాముకురాలగు స్త్రీ రాసక్రీడా మధ్యన అనందాతి రేకముతో నెట్లు బాహ్య విషయములను మరచి కేవల మానందములోనే నిమగ్నమై యుండునో అట్లుగానే జీవుడు ప్రాజ్ఞాతత్వమును పొంది అంతులేని ఆనందానుభవము చేత కారణాత్మగా వ్యవహరింపబడును.

సాక్షి జ్ఞాన వేద్యమగు అజ్ఞాన సూక్ష్మము యొక్క యావృత్తి చేత నిద్రాంతమున నేను బాహ్యప్రపంచ మెరుంగను. ఇంత వరకు నేను సుఖముగా నిద్రింతిచిని, అనుకొనును (ప్రాణి యనుట) ఇహర లోకమునందు జాగ్రత్స్వప్న సుషుప్త్యవ స్థలు మరల వచ్చుచుండును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 85 🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj

Chapter 10
🌻 Jeeva Swaroopa Niroopanam - 11
🌻

The Jiva merges with the Avyakruta Eswara through the Nadi (sushumna), by contracting all the vasanas and actions into himself.

At that moment he experiences a supreme bliss alone which remains above all these insignificant worldly possessions.

The way a sexually aroused woman forgets all the outward senses and remains in extreme bliss of orgasm during the coition activity, in the same manner the Jiva after obtaining the Prajnatatwam remains in infinite bliss.

Due to becoming one as the witnesser, devoid of outside feelings, at the culmination of the sleep he feels he slept blissfully.

In the IhaPara loka the three states of wakefulness (jagrut swapna sushupti) appears again and again.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

07 Oct 2020

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 40, 41 / Vishnu Sahasranama Contemplation - 40, 41

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 40, 41 / Vishnu Sahasranama Contemplation - 40, 41 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 40. పుష్కరాక్షః, पुष्कराक्षः, Puṣkarākṣaḥ 🌻

ఓం పుష్కరాక్షాయ నమః | ॐ पुष्कराक्षाय नमः | OM Puṣkarākṣāya namaḥ

పుష్కరేణ ఉపమితే అక్షిణీ యస్య పుష్కరముతో, పద్మముతో పోల్చబడు కన్నులు ఎవనికిగలవో అట్టి సుందరమగు కన్నులున్నవాడు పుష్కరాక్షుడు.

:: శ్రీమద్భాగవతము - తృతీయ స్కందము, 21వ అధ్యాయము ::

తావత్ ప్రసన్నో భగవాన్ పుష్కరాక్షః కృతే యుగే ।

దర్శయామ్ ఆస తం క్షత్తః శబ్ధం బ్రహ్మ దధద్ వపుః ॥ 8 ॥

అప్పుడు కృత (సత్య) యుగంలో, ప్రసన్నుడై పుష్కరాక్షుడైన భగవంతుడు ఆతనికి (కర్దమ మునికి) వేదముల ద్వారానే తెలుసుకొనదగిన సర్వోత్కృష్టమైన పరబ్రహ్మ స్వరూపంలో ప్రత్యక్షమయ్యెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 40 🌹

📚. Prasad Bharadwaj

🌻 40. Puṣkarākṣaḥ 🌻

OM Puṣkarākṣāya namaḥ

Puṣkareṇa upamite akṣiṇī yasya One who has eyes resembling the petals of Puṣkara or Lotus.

Śrīmadbhāgavata - Canto 3, Chapter 21

Tāvat prasanno bhagavān puṣkarākṣaḥ kr̥te yuge,

Darśayām āsa taṃ kṣattaḥ śabdhaṃ brahma dadhad vapuḥ. (8)

Then, in the Kr̥ta yuga (Satya yuga), the Lotus eyed Lord, being pleased, showed Himself to him (Sage Kardama) and displayed His transcendental form, which can be understood only through the Vedas.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

स्वयम्भूश्शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः ।अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः ॥ 5 ॥

స్వయమ్భూశ్శమ్భురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః ।అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ॥ 5 ॥

Svayambhūśśambhurādityaḥ puṣkarākṣo mahāsvanaḥ ।Anādinidhano dhātā vidhātā dhāturuttamaḥ ॥ 5 ॥

Continues....
🌹 🌹 🌹 🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 41/ Vishnu Sahasranama Contemplation - 41🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 41. మహాస్వనః, महास्वनः, Mahāsvanaḥ 🌻

ఓం మహాస్వనాయ నమః | ॐ महास्वनाय नमः | OM Mahāsvanāya namaḥ

మహాన్ (ఊర్జితః) స్వనః (నాదో వా శ్రుతి లక్షణః) యస్య గొప్పది, బలము కలదియగు కంఠధ్వని లేదా వేదరూపమగు ఘోషము ఎవనికి కలదో అట్టివాడు.

:: బృహదారణ్యకోపనిషత్తు - ద్వితీయాధ్యాయము ::

స యథాద్రైధాగ్నేరమ్యాహితాప్తృథగ్ధ్మా వినిష్వరన్తి, ఏవం వా అరేఽస్య మహతో భూతస్య నిఃశ్వసితమేతద్యదృగ్వేదో యజుర్వేదః సామవేదోఽథర్వాంగిరస ఇతిహాసః పురాణం విద్యా ఉపనిషదః శ్లోకాః సూత్రాణ్యనువ్యాఖ్యానాని వ్యాఖ్యానాని; అస్యైవైతాని నిఃశ్వాసితాని ॥ 4.10 ॥

చెమ్మగిల్లిన సమిధలచే (కట్టె పుల్లల) ప్రేరేపింపబడిన వివిధమైనట్టి ధూమముల వలె - ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణాంగీరసము, ఇతిహాసములు, పురాణములు, కళలు, ఉపనిషత్తులు, శ్లోకములు, సూత్రములు, విశదీకరణలు, వ్యాఖ్యానములు - ఈ ఉనికిగల తత్వములన్నిటిలో మిగుల గొప్పవాని నిశ్వాసములే.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 41 🌹

📚. Prasad Bharadwaj

🌻41.Mahāsvanaḥ🌻

OM Mahāsvanāya namaḥ

Mahān (Ūrjitaḥ) Svanaḥ (Nādo vā śruti lakṣaṇaḥ) yasya One from whom comes the great sound - the Veda.

Br̥hadāraṇyakopaniṣad - Chapter 2, Section 4

Sa yathā draidhāgne ramyāhitāptr̥thagdhˈmā viniṣvaranti, evaṃ vā are’sya mahato bhūtasya niḥśvasitametadyadr̥gvedo yajurvedaḥ sāmavedo’tharvāgṅirasa itihāsaḥ purāṇaṃ vidyā upaniṣadaḥ ślokāḥ sūtrāṇyanuvyākhyānāni vyākhyānāni; asyaivaitāni niḥśvāsitāni. (10)

As from a fire kindled with wet faggot - diverse kinds of smoke issue, even so, my dear, the R̥gvēda, Yajurveda, Sāmavēda, Atharvaṇāṃgīrasa, history, mythology, arts, Upaniṣads, verses, aphorisms, elucidations and explanations are (like) the breath of this infinite Reality. They are like the breath of this (Supreme self).

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

स्वयम्भूश्शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः ।अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः ॥ 5 ॥

స్వయమ్భూశ్శమ్భురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః ।అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ॥ 5 ॥

Svayambhūśśambhurādityaḥ puṣkarākṣo mahāsvanaḥ ।Anādinidhano dhātā vidhātā dhāturuttamaḥ ॥ 5 ॥

Continues....
🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama

Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

07 Oct 2020

7-October-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 511 / Bhagavad-Gita - 511 🌹 
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 40, 41 / Vishnu Sahasranama Contemplation - 40, 41 🌹
3) 🌹 Sripada Srivallabha Charithamrutham - 299 🌹
4) 🌹 Guru Geeta - Datta Vaakya - 88 🌹
5) 🌹. శివగీత - 85 / The Shiva-Gita - 85 🌹
6) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 73 / Gajanan Maharaj Life History - 73🌹 
9) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 67 🌹
10) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 23, 24 / Sri Lalita Chaitanya Vijnanam - 23, 24🌹 
11) *🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 15🌹*
12) 🌹. శ్రీమద్భగవద్గీత - 427 / Bhagavad-Gita - 427🌹

13) 🌹. శివ మహా పురాణము - 241 🌹
14) 🌹 Light On The Path - 7 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 129 🌹
16) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 69🌹
17) 🌹 Seeds Of Consciousness - 193 🌹 
18) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 47 📚
19) 🌹. అద్భుత సృష్టి - 48 🌹
20) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 31 / Sri Vishnu Sahasranama - 31 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 511 / Bhagavad-Gita - 511 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 21 🌴*

21. అర్జున ఉపాచ
కైర్ లిఙ్గైస్త్రీన్ గుణానేతానతీతో భవతి ప్రభో |
కిమాచార: కథం చైతాంస్త్రీన్ గుణానతివర్తతే ||

🌷. తాత్పర్యం : 
*అర్జునుడు ప్రశ్నించెను : హే ప్రభూ! ఈ త్రిగుణములకు అతీతుడైనవాడు ఏ లక్షణముల ద్వారా తెలియబడును? అతని ప్రవర్తనమెట్టిది? ప్రకృతి త్రిగుణములను అతడు ఏ విధముగా అధిగమించును?*

🌷. భాష్యము :
ఈ శ్లోకమునందలి అర్జునుని ప్రశ్నలు మిగుల సమంజసముగా నున్నవి. త్రిగుణములను దాటినట్టి మహాత్ముని లక్షణములను అతడు తెలిసికొనగోరుచున్నాడు. అట్టి త్రిగుణాతీత మహాత్ముని లక్షణములను తొలుత అతడు విచారణ కావించుచున్నాడు. అట్టివాడు త్రిగుణ ప్రభావమును ఇదివరకే దాటియున్నాడని మనుజుడు ఎట్లు జీవించునో, అతని కర్మలేవియో అర్జునుడు అడుగుచున్నాడు. .

ఆ కర్మలు నియమబద్ధములైనవా లేక నియమబద్ధములు కానివా! పిదప అర్జునుడు అట్టి దివ్యస్వభావమును పొందగలిగే మార్గమును గూర్చి ప్రశ్నించుచున్నాడు. ఈ విషయము అత్యంత ముఖ్యమైనది. సర్వదా దివ్యస్థితి యందు నిలుచుటకు ప్రత్యక్షమార్గమును తెలియనిదే ఎవ్వరును అట్టి దివ్యలక్షణములను కలిగియుండు నవకాశము లేదు. 

కనుకనే అర్జునుడు అడిగిన ఈ ప్రశ్నలన్నియును అత్యంత ముఖ్యమై యున్నవి. శ్రీకృష్ణుడు ఆ ప్రశ్నలన్నింటికిని సమాధానమొసగుచున్నాడు. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 511 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 21 🌴*

21. arjuna uvāca
kair liṅgais trīn guṇān etān
atīto bhavati prabho
kim-ācāraḥ kathaṁ caitāṁs
trīn guṇān ativartate

🌷 Translation : 
*Arjuna inquired: O my dear Lord, by which symptoms is one known who is transcendental to these three modes? What is his behavior? And how does he transcend the modes of nature?*

🌹 Purport :
In this verse, Arjuna’s questions are very appropriate. He wants to know the symptoms of a person who has already transcended the material modes. He first inquires of the symptoms of such a transcendental person. 

How can one understand that he has already transcended the influence of the modes of material nature? The second question asks how he lives and what his activities are. Are they regulated or nonregulated? Then Arjuna inquires of the means by which he can attain the transcendental nature. 

That is very important. Unless one knows the direct means by which one can be situated always transcendentally, there is no possibility of showing the symptoms. So all these questions put by Arjuna are very important, and the Lord answers them.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Sripada Srivallabha Charithamrutham - 300 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 41
*🌻 The story of cunning ‘parivraajaka’ - 1 🌻*

Shri Bhaskar Shastri told us that Sripada Srivallabha was the combined form of Maha Saraswathi, Maha Laxmi, Maha Kaali and Rajarajeswari. Sripada’s Devi tatwam will be understood only by people doing ‘anushtanam’. 

I asked Bhaskara Shastri, ‘I have heard that there are four types of speech as Para, Pasyanthi, Madhyama and Vykhari. Please let me know their explanation.’ Bhaskara Shastri said, ‘Ambika gets expressed with all types of speech.  

She will speak through every person. The speech that is heard outside is called ‘gross speech’. The speech not heard outside but seen as the movements of lips, is called Madhyama. The speech, more subtle that this Madhyama, is called Vykhari speech. The speech starts in the neck and comes upto the throat.  

Staying there in the middle without coming out and moving in the mind only is called ‘pashyanthi’ speech. More subtle speech than this and remaining in the umbilicus without expression and remaining in the ‘will’ only, is called ‘para’ speech. Ambika also is worshipped as Tripura Bhairavi.  

She is the presiding Mother of the triads of three gunas (satva, rajas, tamo), three jagats, three Murthis (Brahma, Vishnu and Maheswar) and three states (Jagrit, Swapna, Shushupti) and all other triads.  

She will be ruling the ‘triputis’ as ‘puratrayam’ (three worlds). Having devotion, if we completely surrender to Her, we will not be harmed when encountered with enemies from this world, or unseen worlds.  

The enemy powers need not be only related to the physical world. We have different identities related to prana. Physical, mental and spiritual aspects are related to ‘antharatma’.  

There are different worlds also accordingly. If we develop enough, we can live in those worlds also as we are living in this physical world. If a man wants to progress, he should have devotion and stable confidence. Devotion means acceptance with complete belief. Confidence will come with experience only.  

We have to live on the basis of confidence only. We should always have confidence that help will certainly come whenever needed. If we have a sense of security along with confidence, it is called self-confidence. Jnanam without Shakti will lead to complacence.  

Shakti without jnanam will be blind and leads to destruction. So we have to get liberated from the bonds of ‘prakruthi’ by means of jnana. After that, we should achieve ‘wholesomeness’ by the grace of Shakti. Shakti should get permission from jnanam. In the ‘saankhya path’, chaitanyam is called ‘purusha’.  

The thing which does karma is called ‘prakrithi’. In the lower planes, there will be contradictions between these two. Chaitanyam will not do any ‘karma’. ‘Prakruthi’ has no jnana. When these two meet, creation occurs. Both have handicap. Chaitanyam is lame.  

Prakrithi is blind. To indicate that there are lameness and blindness in this world, Sripada’s one brother was born blind and the other brother was born lame. They symbolically indicate that chaitanyam is lame and prakrithi is blind.  

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 40, 41 / Vishnu Sahasranama Contemplation - 40, 41 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 40. పుష్కరాక్షః, पुष्कराक्षः, Puṣkarākṣaḥ 🌻*

*ఓం పుష్కరాక్షాయ నమః | ॐ पुष्कराक्षाय नमः | OM Puṣkarākṣāya namaḥ*

పుష్కరేణ ఉపమితే అక్షిణీ యస్య పుష్కరముతో, పద్మముతో పోల్చబడు కన్నులు ఎవనికిగలవో అట్టి సుందరమగు కన్నులున్నవాడు పుష్కరాక్షుడు.

:: శ్రీమద్భాగవతము - తృతీయ స్కందము, 21వ అధ్యాయము ::
తావత్ ప్రసన్నో భగవాన్ పుష్కరాక్షః కృతే యుగే ।
దర్శయామ్ ఆస తం క్షత్తః శబ్ధం బ్రహ్మ దధద్ వపుః ॥ 8 ॥

అప్పుడు కృత (సత్య) యుగంలో, ప్రసన్నుడై పుష్కరాక్షుడైన భగవంతుడు ఆతనికి (కర్దమ మునికి) వేదముల ద్వారానే తెలుసుకొనదగిన సర్వోత్కృష్టమైన పరబ్రహ్మ స్వరూపంలో ప్రత్యక్షమయ్యెను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 40 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 40. Puṣkarākṣaḥ 🌻*

*OM Puṣkarākṣāya namaḥ*

Puṣkareṇa upamite akṣiṇī yasya One who has eyes resembling the petals of Puṣkara or Lotus.

Śrīmadbhāgavata - Canto 3, Chapter 21
Tāvat prasanno bhagavān puṣkarākṣaḥ kr̥te yuge,
Darśayām āsa taṃ kṣattaḥ śabdhaṃ brahma dadhad vapuḥ. (8)

Then, in the Kr̥ta yuga (Satya yuga), the Lotus eyed Lord, being pleased, showed Himself to him (Sage Kardama) and displayed His transcendental form, which can be understood only through the Vedas.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
स्वयम्भूश्शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः ।अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः ॥ 5 ॥ 

స్వయమ్భూశ్శమ్భురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః ।అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ॥ 5 ॥

Svayambhūśśambhurādityaḥ puṣkarākṣo mahāsvanaḥ ।Anādinidhano dhātā vidhātā dhāturuttamaḥ ॥ 5 ॥

Continues....
🌹 🌹 🌹 🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 41/ Vishnu Sahasranama Contemplation - 41🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻 41. మహాస్వనః, महास्वनः, Mahāsvanaḥ 🌻*

*ఓం మహాస్వనాయ నమః | ॐ महास्वनाय नमः | OM Mahāsvanāya namaḥ*

మహాన్ (ఊర్జితః) స్వనః (నాదో వా శ్రుతి లక్షణః) యస్య గొప్పది, బలము కలదియగు కంఠధ్వని లేదా వేదరూపమగు ఘోషము ఎవనికి కలదో అట్టివాడు.

:: బృహదారణ్యకోపనిషత్తు - ద్వితీయాధ్యాయము ::

స యథాద్రైధాగ్నేరమ్యాహితాప్తృథగ్ధ్మా వినిష్వరన్తి, ఏవం వా అరేఽస్య మహతో భూతస్య నిఃశ్వసితమేతద్యదృగ్వేదో యజుర్వేదః సామవేదోఽథర్వాంగిరస ఇతిహాసః పురాణం విద్యా ఉపనిషదః శ్లోకాః సూత్రాణ్యనువ్యాఖ్యానాని వ్యాఖ్యానాని; అస్యైవైతాని నిఃశ్వాసితాని ॥ 4.10 ॥

చెమ్మగిల్లిన సమిధలచే (కట్టె పుల్లల) ప్రేరేపింపబడిన వివిధమైనట్టి ధూమముల వలె - ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణాంగీరసము, ఇతిహాసములు, పురాణములు, కళలు, ఉపనిషత్తులు, శ్లోకములు, సూత్రములు, విశదీకరణలు, వ్యాఖ్యానములు - ఈ ఉనికిగల తత్వములన్నిటిలో మిగుల గొప్పవాని నిశ్వాసములే.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 41 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻41.Mahāsvanaḥ🌻*

*OM Mahāsvanāya namaḥ*

Mahān (Ūrjitaḥ) Svanaḥ (Nādo vā śruti lakṣaṇaḥ) yasya One from whom comes the great sound - the Veda.

Br̥hadāraṇyakopaniṣad - Chapter 2, Section 4

Sa yathā draidhāgne ramyāhitāptr̥thagdhˈmā viniṣvaranti, evaṃ vā are’sya mahato bhūtasya niḥśvasitametadyadr̥gvedo yajurvedaḥ sāmavedo’tharvāgṅirasa itihāsaḥ purāṇaṃ vidyā upaniṣadaḥ ślokāḥ sūtrāṇyanuvyākhyānāni vyākhyānāni; asyaivaitāni niḥśvāsitāni. (10)

As from a fire kindled with wet faggot - diverse kinds of smoke issue, even so, my dear, the R̥gvēda, Yajurveda, Sāmavēda, Atharvaṇāṃgīrasa,  history, mythology, arts, Upaniṣads, verses, aphorisms, elucidations and explanations are (like) the breath of this infinite Reality. They are like the breath of this (Supreme self).

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
स्वयम्भूश्शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः ।अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः ॥ 5 ॥ 

స్వయమ్భూశ్శమ్భురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః ।అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ॥ 5 ॥

Svayambhūśśambhurādityaḥ puṣkarākṣo mahāsvanaḥ ।Anādinidhano dhātā vidhātā dhāturuttamaḥ ॥ 5 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 85 / The Siva-Gita - 85 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ 

దశమాధ్యాయము
*🌻. జీవ స్వరూప నిరూపణము - 11 🌻*

నాడీ మార్దైరింద్రి యాణా - మాకృష్యాదాయ వాసనాః |
సర్వం గ్రసిత్వా కార్యం - విజ్ఞానాత్మా విలీయతే 51
ఈశ్వరాఖ్యే వ్యాకృతేథ - యథా సుఖమయో భవేత్ |
కృత్స్నప్రపంచివిలయ స్తథా భవతి చాత్మనః 52
యోషితః కామ్యమానాయాః - సంభోగాంతే యథా సుఖమ్ |
స ఆనంద మాయో బాహ్యో - నాన్తరః కేవలం యథా 53
ప్రాజ్ఞాత్మతాం సమాసాద్య - విజ్ఞానాత్మా తథైవసః |
విజ్ఞానాత్మా కారణాత్మా - యథా తిష్ఠన్న థాపిసః 54
అవిద్యా సూక్ష్మ వృత్త్యాను - భవిత్యేవ యథాసుఖమ్ |
అజ్ఞాన మపి సాక్ష్యాది - వృత్తిభిశ్చా మభూయతే 55
తథాహం సుఖ మాస్వాప్సం - నైవ కించిద నేదిషమ్ |
ఇత్యేవం ప్రత్యభి జ్ఞాపి - పశ్చాత్త స్యోప పద్యతే 56   

జీవుడునాడీ మార్గమున ఇంద్రి యముల సున్నితమైన వాసనలను ఆకర్షించుకొని సమస్త కార్యములను తనలో లీన మొనర్చుకొని యవ్యాకృతమైన ఈశ్వర చైతన్యములో నైక్యమును పొందుచున్నాడు.  

ఆ సందర్భములో అతనికి కేవలమానందము మాత్రమే 
గోచరించుచుండునట్లు ఈ తుచ్చ ప్రపంచ మంతయు స్వరూప సత్తుగా లీనమై యుండును. 

కాముకురాలగు స్త్రీ రాసక్రీడా మధ్యన అనందాతి రేకముతో నెట్లు బాహ్య విషయములను మరచి కేవల మానందములోనే నిమగ్నమై యుండునో అట్లుగానే జీవుడు ప్రాజ్ఞాతత్వమును పొంది అంతులేని ఆనందానుభవము చేత కారణాత్మగా వ్యవహరింపబడును.

సాక్షి జ్ఞాన వేద్యమగు అజ్ఞాన సూక్ష్మము యొక్క యావృత్తి చేత నిద్రాంతమున నేను బాహ్యప్రపంచ మెరుంగను. ఇంత వరకు నేను సుఖముగా నిద్రింతిచిని, అనుకొనును (ప్రాణి యనుట) ఇహర లోకమునందు జాగ్రత్స్వప్న సుషుప్త్యవ స్థలు మరల వచ్చుచుండును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 The Siva-Gita - 85 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayala somayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 10 
*🌻 Jeeva Swaroopa Niroopanam - 11 🌻*

The Jiva merges with the Avyakruta Eswara through the Nadi (sushumna), by contracting all the vasanas and actions into himself.

 At that moment he experiences a supreme bliss alone which remains above all these insignificant worldly possessions. 

The way a sexually aroused woman forgets all the outward senses and remains in extreme bliss of orgasm during the coition activity, in the same manner the Jiva after obtaining the Prajnatatwam remains in infinite bliss. 

Due to becoming one as the witnesser, devoid of outside feelings, at the culmination of the sleep he feels he slept blissfully. 

In the IhaPara loka the three states of wakefulness (jagrut swapna sushupti) appears again and again.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 88 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
81

We discussed that King Janaka who found out about the greatness of Sage Ashtavakra came down to honor and worship the sage. 

The sage then told the king about theinsult meted out to his father and asked the king to summon all the scholars. The sage vowed that he would jump in to the ocean if he failed to answer the questions posed by the scholars.  

He said, “This was the place my father was insulted, so please invite all the scholars here. I will have a debate with them right here. If I lose, I will jump in to the ocean”. The king didn’t say a word. He immediately called for a conference. All the egoistic scholars lost miserably to Sage Ashtavakra.  

Ashtavakra defeated all the scholars who had insulted his father. He won the debate on scriptures. The scholars lost miserably. Subsequently, king Janaka accepted sage Ashtavakra as Guru and surrendered himself along with his body, mind and wealth. 

He received knowledge and blessings from the sage. Regardless of how highly educated one is, he should not be arrogant about his knowledge when he meets a Sadguru. 

 Lord Shiva is teaching us through this sloka that one should be humble, should serve the Guru and earn the blessings of the Guru. To help seekers improve their dedication to the Guru, they are once again talking about the greatness of the Guru Principle.

Sloka: 
Gurureva jagatsarvam brahma visnu sivatmakam | Guroh parataram nasti tasmat sampujayedgurum ||

 The entire universe and the Trinity of Godhead – Brahma, Vishnu, Shiva – are the image of the Guru. There is nothing other than Guru. There is nothing more important. So, Guru should be worshipped well. 

Arjuna worshipped Dronacharya with this same feeling. He became a beloved disciple and the best disciple of Guru Dronacharya. Through the story of this Guru and disciple, let us learn about the greatness of the Guru. 

 Because Arjuna was of noble character, he received initiation to Bhagavad Gita directly. Arjuna was so blessed that God Himself came as Guru and initiated him to the Bhagavad Gita. Arjuna was very dear to Dronacharya.  

Arjuna earned a special place in Dronacharya’s heart. Dronacharya, who noticed the great focus that Arjuna had, removed the veil of illusion that Arjuna was faced with in several instances. In many stories in the Bhagavatam and Mahabharata,  

Lord Krishna stood by Arjuna, removed his ignorance and imparted wisdom. Similarly, the Guru (Dronacharya) also lifted the veil of ignorance several times.  

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 74 / Sri Gajanan Maharaj Life History - 74 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 14వ అధ్యాయము - 5 🌻*

ఇది విన్న బనకటలాల్ మరియు మిగిలిన ముగ్గురూ పదేపదే శ్రీమహారాజుకు మొక్కారు. వాళ్ళు క్షేమంగా షేగాం చేరి ఈ వృత్తాంతాన్ని సంతోషంగా అక్కడి ప్రజలకు చెప్పారు. సదాశివ రంగనాధ్ వానవలె తన స్నేహితునితో ఒకసారి, శ్రీగజానన్ మహారాజు దర్శనానికి షేగాం వచ్చాడు. తాత్యా ముద్దుపేరుగల ఈ సదాశివ, మాల్వాలో అనేకమంది అనుచరులున్న, యోగవిద్యలో ప్రావీణ్యతగల, చిత్రకూట్ వాసిఅయిన శ్రీమాధవనాధ్ మహరాజు శిష్యుడు. 

సదాశివ్ శ్రీగజానన్ మహారాజు దర్శనానికి వచ్చినప్పడు ఆయన తన భోజనం తీసుకుంటున్నారు. సదాశివ్ కనిపించగానే, శ్రీమహారాజు శ్రీమాధవనాధ్ మహారాజును గుర్తు చేసుకున్నారు. యోగులు కలవకుండానే ఒకరిగురించి ఒకరికి తెలుస్తుంది. శ్రీనాధ్ శిష్యులను నాముందుకు తెండి, భోజనం చేసి ఇప్పడే వాళ్ళగురువు వెళ్ళిపోయారు. కొద్దిగా కనక ముందు వచ్చిఉంటే వాళ్ళ గురువును వాళ్ళు ఇక్కడే కలిసి ఉండేవారు. ఇప్పడు వీళ్ళు తమగురువు తాంబూలం మర్చిపోయి వెళ్ళినతరువాత వచ్చారు అని శ్రీమహారాజు అన్నారు. 

తన సహోదరుని పిల్లలవడంతో శ్రీమహారాజు వానవలెను ఆలింగనం చేసుకుని ఆనవాయితీ ప్రకారం ఆహ్వనించారు. శ్రీనాధ్ కు ఇచ్చేందుకు రెండు తమలపాకులు ఆయన అప్పడు వాళ్ళకి ఇచ్చి, మాటలు మార్చకుండా ఉదహరించిన సందేసం ఇయ్యమని అన్నారు. మనం కలిసి భోజనంచేసాం, కానీ మీకిళ్ళీ ఇక్కడ మర్చిపోయారు, ఇప్పుడు మేము దానిని మీకోసం తెచ్చాము. వానవలె అదివిని ఆరెండు తమలపాకులతో తిరిగి వచ్చాడు. 

శ్రీనాధ్ కు షేగాంలో జరిగిన చర్చలు వివరంగా వర్నించి, మీరు నిజంగా షేగాం ఆరోజు వెళ్ళారా అని అడిగాడు. శ్రీగజానన్ ఏమి చెప్పారో అది నిజం. తను భోజనం చేస్తున్నప్పుడు నన్ను గుర్తు చేసుకోవడమే మేము కలుసుకోవడం. ఈ విధంగా మేము తరచు కలుసుకుంటూ ఉంటాం. దీనిగురించి ఏవిధమయిన శంక లేకుండా ఉండు. ఒకళ్ళని ఒకళ్ళు గుర్తుచేసుకోవడమే మేము కలుసుకోవడం. మాఇద్దరి శరీరాలు వేరుగా ఉన్నా, మా జీవనధార ఒక్కటే. ఇది చాలా గూఢమయిన జ్ఞానం, దీనిని అర్ధం చేసుకోవడానికి నీకు ఇంకా కొంత సమయం కావాలి.

 నేను షేగాంలో మర్చిపోయిన తాంబూలం తెచ్చి మంచిపని చేసావు అని శ్రీనాధ్ అన్నారు. శ్రీనాధ్ ఆ తమలపాకులు తీసుకొని నూరి తిన్నారు, ఆయన కొంత వానవలకి కూడా ప్రసాదంగా ఇచ్చారు. శ్రీధ్యానేశ్వరు మాహారాజు తన చాందోపనిషత్తులో యోగులు ఈవిధంగా కలుసుకోవడం గురించి వివరంగా వర్నించారు. వారు ఆవిధంగా కలుసుకునే పద్ధతి తెలుసుకుందుకు అది చదవాలి.

యోగులు ఒకరికొకరు ఎంతదూరంగా ఉన్నా తమ స్థానం వదలకుండా కలుసుకోడం అనే సంగతి తెలుసుకోడం కుతూహలమైన విషయం. షేక్ మహమ్మద్ శ్రీగోండాలోను, తుకారాం దేహులోను ఉన్నారు, కానీ శ్రీతుకారాం దేహులో కీర్తన చేస్తున్న మండపానికి నిప్పు అంటుకున్నప్పుడు శ్రీగోండానుండి షేక్ మహమ్మద్ దానిని ఆపుతారు. దీనిని భక్తి విజయలో మహిపాల్ వర్నించారు.

 శ్రీమాణిక్ ప్రభు హలి గ్రామంచేరి పాటిల్ కొడుకును బావిలో మునగకుండా రక్షించారు. నిజమైన యోగులే ఇటువంటి చమత్కారాలు చెయ్యగలరు. యోగ అన్నిటికంటే కుడా శక్తివంతమయినది. కాబట్టి దేశాన్ని పటిష్ఠం చెయ్యడానికి యోగ నేర్చుకోండి. ఈ మహాకావ్యమయిన గజానన్ విజయను ప్రియమైన భక్తులు పూర్తి విశ్వాసంతో వినుగాక. అందరికీ సంతోషంకలుగుగాక. హర మరియు హరికి నమస్సులు. 

శుభం భవతు 
14. అధ్యాయము సంపూర్ణము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 74 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 14 - part 5 🌻*

Hearing this, Bankatlal and the three others again and again prostrated before Shri Gajanan Maharaj . They returned to Shegaon and, with great happiness, narrated the incident to the people there. Once Sadashiv Ranganath Wanawale, alongwith his friend, came to Shegaon for the Darshan of Shri Gajanan Maharaj. 

This Sadashiv, nicknamed as Tatya, was the disciple of Shri Madhaonath Maharaj of Chitrakut, who had mastered the art of yoga and had a large following in Malwa. When Sadashiv came for the darshan of Shri Gajanan Maharaj, Maharaj was taking His meals. 

At the sight of Sadashiv, Shri Gajanan Maharaj remembered Shri Madhaonath Maharaj. Saints know each other even without meeting. Shri Gajanan Maharaj said, “Bring those disciples of Shri Nath before Me. Their Guru just went away after taking meals with Me. 

Had they come a bit earlier, they would have met their Guru here only. Now they have come after their Guru went away without taking the Paan. Being the children of a brother, Shri Gajanan Maharaj embraced Wanawale and gave him the traditional reception. Then He gave him two leaves of betel for giving to Shri Nath and asked to convey the message as follows without a change of word, “We had meals together but You forgot your Paan here. We have now brought it for You.” 

Wanawale heard this message and returned with those two leaves of betel. He narrated the detailed talk at Shegaon to Shri Nath and asked if He had really gone to Shegaon that day. Shri Nath said, What Shri Gajanan said is true. His remembering Me at the time of meals is Our meeting. 

We meet each other like that quite frequently. Don't have any doubt about it. Remembering each other is Our meeting. Though We have different bodies, Our life breath is the same. This is a deep knowledge and you may require some time to understand it. It is good that you brought the Paan, which I had forgotten at Shegaon.” 

Then Shri Nath took the betel leaves, crushed and ate it. He also gave some to Wanawale as Prasad. Shri Dyaneshwar Maharaj, in his ‘Changdeo Pasasti’, has described in great detail the way saints meet each other. One should read that to understand their manner of meeting. It is interesting to know that Yogis meet each other from any distance without leaving their places. 

Sheik Mohamed was in Shri Gonda and Shri Tukaram at Dehu, but when the pendal at Dehu where Shri Tukaram was doing Kirtan caught fire, Sheik Mohamed extinguished if from Shri Gonda. This has been narrated by Mahipal in the ‘Bhaktivijay’. Shri Manik Prabhu saved Patil's son from drowning in a well, by reaching Hali village. 

Only true yogis can perform such Miracle. Yoga is more powerful than anything else. So learn Yoga to make the nation strong. May the affectionate devotees with full faith, listen to this Gajanan Vijay epic! Let Joy be to all! Obeisance to Har and Hari. 

||SHUBHAM BHAVATU||
 Here ends Chapter Fourteen

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 67 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 17 🌻*

275. భగవంతుడు మానవుని స్థితిలో నిత్యము సంస్కారములద్వారా సృష్టి--స్థితి--లయములైన ప్రధాన ధర్మములను నిరూపించు చున్నాడు.ఇది,జగత్కర్త పాత్రను నిర్వహించుచున్న భగవంతుని స్థితి.

276. భగవంతుని యొక్క దివ్య సుషుప్తిలో నిద్రాణమైన సంస్కారముల ద్వారా సచరాచర సమన్వితంబైన మాయ సృష్టింపబడి , భగవంతుని దివ్యస్వప్నమైన వర్తమానములో పోషింపబడి ,దివ్యజాగృతియైన భవిష్యత్తులో నాశనమగుచున్నది .
అనగా మానవ రూపములోనున్న భగవంతుడు ,దివ్యత్వసిద్ధిని బడయుటతో మాయా సృష్టి నాశనమగుచున్నది .

277. సృష్టిలో :_ స్థితి _లయములు
స్థితిలో :_ సృష్టి _లయములు
లయములో :_ సృష్టి _స్థితులు
పరస్పరాశ్రితములై యున్నవి .

278. మానవుడు స్వప్నావస్థ యందున్నప్పుడు , భూత_ వర్తమాన _భవిష్యద్రూపములతో కలియుచున్నాడు . అతడు సమావేశములను సృష్టించుట ,వాటిని పోషించుట , వాటిని నాశనము చేయుట అనెడు పాత్రలను సృజించుచున్నాడు .ఇవ్విధముగా మానవుడు ఎల్లప్పుడు వీటన్నింటికి , స్వప్నమునకు భవిష్యత్తు అయిన వర్తమానముతో సాక్షీ భూతుడైయున్నాడు .

279. ఈపె ( ఈ పై ) ఆధారములనుబట్టి ,స్వప్నములోగాని మెలకువలోగాని , సృష్టింపబడినవి , పోషింపబడినవి వర్తమానములో అడుగడుగునకు తప్పనిసరిగా నాశనము కావలసిన భవిష్యత్తు పొంచియే యున్నది .

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 23, 24 / Sri Lalitha Chaitanya Vijnanam - 23, 24 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :* 
*9. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ:*
*నవవిద్రుమ బింబశ్రి న్యక్కారి దసన్నచ్చద*

*🌻 23. 'పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ!' 🌻*

అద్దము కంటె నిర్మలములైనవి పద్మరాగ శిలలు! వానియందలి
పదార్థము అత్యంత పారదర్శకముగను, స్పష్టముగను, నిర్మలముగను యుండును. అమ్మవారి కపోలములు అంతకు మించిన పారదర్శకత కలిగినవని యీ నామమున వర్ణించుచున్నారు. పరమాత్ముని దర్శించుట యనగా అమ్మను దర్శించుటయే! పరమాత్మ దర్శన మిచ్చుట యనగా అమ్మ దర్శన మిచ్చుటయే యగును. 

అవ్యక్తమగు తత్త్వము శివము. అట్టి శవము యథాతథముగా ప్రతిబింబించినపుడే దృగ్గోచరమగును. అమ్మవారి చెక్కిళ్ళు అయ్యవారిని ప్రతిబింబింపగలిగిన పారదర్శకత్వముతో ప్రకాశించుచున్నవని తెలియవలెను. అయ్యకు ప్రతిబింబము అమ్మ! అమ్మ ప్రతిబింబింప చేయునదీ అయ్యనే! మరొకటి కాదు. ఇంకనూ వివరములు వలసినవారు కేనోపనిషత్ చదువు కొనవచ్చును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 23 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 23. Padmarāga- śilādharśa- paribhāvi-kapolabhūḥ पद्मराग-शिलाधर्श-परिभावि-कपोलभूः (23) 🌻* 

Her cheeks are shining, soft and reflecting. Padmarāga is a type of ruby, red in colour. 

Ruby is of four types: vipra, kuruvinda, saugandhika and mansa-khanda, out of which vipra is superior. Wearing afflicted rubies cause irreparable damages in one’s life.   

Her cheeks are reflecting red colour as Her complexion itself is red. The other ornaments that have been described above are also red in colour.  

The sun and the moon in Her ear lobes make Her cheeks shining red. Everything associated with Her is red. As discussed earlier, red indicates compassion.

Saundarya Laharī (verse 59) says, “Your face is cupid’s four wheeled chariot, having the pair of your ear ornaments reflected in the expanse of your cheeks.  

Cupid, the mighty warrior sitting on it plots revengefully against the Lord Śiva, resting on the chariot of the Earth having the Sun and Moon for its wheels.”

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 24 / Sri Lalitha Chaitanya Vijnanam - 24 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :* 
*9. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ:*
*నవవిద్రుమ బింబశ్రి న్యక్కారి దసన్నచ్చద*

*🌻 24. 'నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా' 🌻*

విద్రుమ బింబమనగా ఎఱ్ఱని కాంతిబింబము. క్రొత్తగా కొనిరాబడిన ఎఱ్ఱని కాంతులతో కూడిన శుభప్రదమైన పెదవులు కలిగినది. సృష్టియందలి అందమైన ఎఱ్ఱని పగడము, దొండపండు వంటి రూపములను, అధిగమించిన అందముగల పెదవులు అని విశ్లేషించబడినవి.

క్రొత్తగా కొనిరాబడిన ఎఱ్ఱని బింబముయొక్క శోభ తెలియవలె
నన్నచో తూర్పున ఉదయించుచున్న సూర్యబింబమును దర్శించవలెను. 

ఉదయ సూర్యబింబపు కాంతి మనస్సున కాహ్లాదము కలిగించును. అనురక్తి ఏర్పరచును. అందుండి వెలువడు కిరణములు నీటిపై పడునపుడు ఉపరితలమున పగడములు పరచినట్లుగా అమితానందము కలిగించును. 

సూర్యోదయ సమయమున తూర్పు సముద్ర తీరమునను, నదీ తీరమునను, తటాక తీరముననూ ఈ కాంతిని దర్శించి అమ్మ పెదవుల కాంతి అనుభూతి పొందవచ్చును.

 సృష్టియందలి అత్యంత సుందరమైన కాంతులన్నియూ అమ్మ విన్యాసములే! పై విధముగ పెదవులను వర్ణించుట ఋషి దర్శనము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 24 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 24. Navavidruma- bimbaśrī- nyakkāri- radanacchadā नवविद्रुम-बिम्बश्री-न्यक्कारि-रदनच्छदा (24) 🌻*

Her lips outshine fresh coral and the bimba fruit (momordica monadelpha).  

Bimba fruit is normally compared to beautiful lips. Both are red in colour.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 427 / Bhagavad-Gita - 427 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 36 🌴

36. అర్జన ఉవాచ
స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా
జగత్ప్రహష్యత్యనురజ్యతే చ |
రక్షాంసి భీతాని దిశో ద్రవన్తి
సర్వే సమస్యన్తి చ సిద్ధసఙ్ఘా: ||

🌷. తాత్పర్యం : 
అర్జునుడు పలికెను : ఓ హృశీకేశా! నీ నామమును వినినంతనే లోకమంతయు సంతోషించి, ప్రతియొక్కరు నీ యెడ అనురక్తులగుచున్నారు. సిద్ధసమూహములు నీకు గౌరవపుర్వకముగా అంజలి ఘటించుచున్నను రాక్షసులు భీతిచెందినవారై పలుదిక్కుల పలాయనమగుచున్నారు. ఇది యంతయు యుక్తముగనే ఉన్నది. 

🌷. భాష్యము : 
కురుక్షేత్ర సంగ్రామ ఫలితమును కృష్ణుని ద్వారా వినినంతనే అర్జునుడు ఉత్తేజితుడయ్యెను. కనుకనే పరమభక్తునిగా మరియు స్నేహితునిగా అతడు శ్రీకృష్ణుడు చేసినది సర్వము యుక్తముగా నున్నదని పలుకుచున్నాడు. శ్రీకృష్ణుడే భక్తులకు పోషకుడు మరియు పూజా ధ్యేయమనియు, అతడే సర్వానర్థములను నశింపజేయువాడనియు అర్జునుడు నిర్ధారించుచున్నాడు. 

ఆ భగవానుని కార్యములు సర్వులకు సమానముగా హితమునే గూర్చును. కురుక్షేత్రరణము జరుగు సమయమున అచ్చట శ్రీకృష్ణుడు నిలిచియున్న కారణముగా అంతరిక్షము నుండి దేవతలు, సిద్ధులు, ఊర్థ్వలోకవాసులు దానిని వీక్షించుచున్నారని అర్జునుడు ఎరుగగలిగెను. 

అర్జునుడు శ్రీకృష్ణభగవానుని విశ్వరూపమును దర్శించినపుడు దేవతలు ఆ రూపమును గాంచి ముదము నొందగా, దానవులు మరియు నాస్తికులైనవారు ఆ భగవానుని కీర్తనము సహింపలేకపోయిరి. భగవానుని వినాశకర రూపము యెడల గల తమ సహజభీతితో వారు అచ్చట నుండి పలాయనమైరి. 

తన భక్తుల యెడ మరియు నాస్తికుల యెడ శ్రీకృష్ణభగవానుడు వ్యవహరించు విధానమును అర్జునుడు కీర్తించుచున్నాడు. శ్రీకృష్ణడేది చేసినను అది సర్వులకు హితముగనే గూర్చునని యెరిగియున్నందున భక్తుడైనవాడు అన్నివేళలా ఆ భగవానుని కీర్తించును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 427 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 36 🌴

36. arjuna uvāca
sthāne hṛṣīkeśa tava prakīrtyā
jagat prahṛṣyaty anurajyate ca
rakṣāṁsi bhītāni diśo dravanti
sarve namasyanti ca siddha-saṅghāḥ

🌷 Translation : 
Arjuna said: O master of the senses, the world becomes joyful upon hearing Your name, and thus everyone becomes attached to You. Although the perfected beings offer You their respectful homage, the demons are afraid, and they flee here and there. All this is rightly done.

🌹 Purport :
Arjuna, after hearing from Kṛṣṇa about the outcome of the Battle of Kurukṣetra, became enlightened, and as a great devotee and friend of the Supreme Personality of Godhead he said that everything done by Kṛṣṇa is quite fit. 

Arjuna confirmed that Kṛṣṇa is the maintainer and the object of worship for the devotees and the destroyer of the undesirables. His actions are equally good for all. 

Arjuna understood herein that when the Battle of Kurukṣetra was being concluded, in outer space there were present many demigods, siddhas, and the intelligentsia of the higher planets, and they were observing the fight because Kṛṣṇa was present there. When Arjuna saw the universal form of the Lord, the demigods took pleasure in it, but others, who were demons and atheists, could not stand it when the Lord was praised. 

Out of their natural fear of the devastating form of the Supreme Personality of Godhead, they fled. Kṛṣṇa’s treatment of the devotees and the atheists is praised by Arjuna. In all cases a devotee glorifies the Lord because he knows that whatever He does is good for all.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 241 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
54. అధ్యాయము - 9

*🌻. మారగణములు - 2 🌻*

నా బాణమును ప్రయోగించుటకు ఆవశ్యకమగు దౌర్బల్యము శివునియందు నాకు ఏనాడూ కానరాలేదు. హే జగత్ర్ప భూ! నేను సత్యమును పలుకుచున్నాను. శివుని మోహింపజేయు శక్తి నాకు లేదు (20). 

వసంతుడు శివుని మోహింపజేయుటకు ప్రయత్నించినాడు. మహాత్మా! ఆ వృత్తాంతమును వినుము. నేను ముమ్మాటికీ సత్యమునే పలుకుచున్నానను (21). 

శివుడు ఉన్నచోట వసంతుడు సంపెంగలను, కేసరపుష్పములను, కురువేరు పుష్పములను, అరుణవర్ణము గల పొన్నలను, నాగకేశరములను, కింశుక పుష్పములను, మొగలి పువ్వులను, దానిమ్మ పువ్వులను (22), 

అడవి మల్లెలను, దట్టమగు మోదుగ పువ్వులను, గోరింట పువ్వులను వికసింపజేసెను (23).

ఆతడు ప్రయత్న పూర్వకముగా శివుని ఆశ్రమములో సరస్సులను వికసించిన పద్మములతో సుగంధ భరితములగునట్లు చేసి మలయానిలము వీచునట్లు చేసెను (24).

 అచట గల లతలన్నియూ పూలతో, చిగుళ్లతో నిండి వృక్షముల మొదళ్లను ప్రేమతో చుట్టుకొని యుండెను (25). 

పుష్పములతో నిండియున్న ఆ వృక్షములను చూచి, ఆ సుంగధి భరితములగు గాలులను అనుభవించిన మునులు కూడా కామమునకు వశమైరి. ఇతరుల గురించి చెప్పనదేమున్నది? (26). 

ఇట్లు ఉన్ననూ శివునకు మోహమును పొందే హేతువు గాన రాలేదు. ఆయనలో లేశమైనను వికారము కలుగలేదు. శంకరుడు నాపై కోపమును కూడ చేయలేదు (27).

ఈ వృత్తాంతమునంతనూ చూచిన నేను ఆ శివుని భావనను తెలుసుకున్నాను. నాకు శివుని మోహింపచేయుట యందు అభిరుచి లేదు. నేనీ మాటను నీకు నిశ్చయముగా చెప్పుచున్నాను (28). 

ఆయన సమాధిని వీడినప్పుడు ఆయన చూపుల ముందు మేము నిలబడుటకైననూ సమర్థులము కాము. అట్టి రుద్రుని ఎవరు మోహింపజేయగలరు? (29). 

హే బ్రహ్మన్‌! మండే అగ్నివలె ప్రకాశించు కన్నులు కలిగినట్టియు, జటాజూటముతో భయంకరముగా నున్నట్టియు, విషమును ధరించియున్న శివుని చూచి, ఆయన యెదుట నిలబడ గలవారెవ్వరు? (30).

బ్రహ్మ ఇట్లు పలికెను -

నాల్గు మోములు గల నేను ఈ మన్మథుని మాటలను విని, సమాధానమును చెప్పగోరియు చెప్పక ఊరకుంటిని. అపుడు నా మనస్సు చింతతో నిండి పోయెను (31). 

శివుని నేను మోహింపచేయ జాలను అను మన్మథుని పలుకులను వింటిని. ఓ మహర్షీ! ఈ మాటలను విన్న నేను మహా దుఃఖముతో నిట్టూర్పు విడిచితిని (32). 

నా నిట్టూర్పు వాయువుల నుండి అనేక రూపములు గలవారు, మహాబలులు, వ్రేలాడు జిహ్వలు గలవారు, అతి చంచలమైన వారు, మిక్కిలి భయమును గొల్పువారు నగు గణములు పుట్టినవి (33). 

వారందరు అసంఖ్యాకములు, గొప్ప భయంకరమైన ధ్వని చేయునవి అగు పటహము మొదలగు అనేక వాద్యములను మ్రోగించిరి (34).

నా నిట్టూర్పుల నుండి పుట్టిన ఆ మహాగణములు నా ఎదుట నిలబడి 'చంపుడు నరుకుడు' అని కేకలు వేసినవి (35). 

నన్ను ఉద్దేశించి వారు 'చంపుడు నరుకుడు' అని వేయుచున్న కేకలను విని మన్మథుడు వారిని ఎదుర్కొనెను (36). 

ఓ మహర్షీ! అపుడు మన్మథుడు నాయెదుటనున్న ఆ గణములను వారించి, నాతో బ్రహ్మన్‌ అని సంబోధించి ఇట్లు పలికెను (37).

మన్మథుడిట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! ప్రజాపతీ! సృష్టినంతనూ ప్రవర్తిల్ల జేయువాడవు నీవే . ఈ భయంకర వీరులు ఉత్పన్నమైరి. వీరెవ్వరు? (38). 

హే విధీ! వీరి కర్తవ్యమేమి? వీరు ఎక్కడ ఉండెదరు? వీరినామము ఏమి? ఈ విషయములను చెప్పి, వీరిని నియోగింపుము (39). 

వారికి స్థానమునిచ్చి, పేరు పెట్టి, వారి కర్మలయందు వారిని నియోగింపుము. హే దేవేశా! అపుడు దయతో నాకు తగిన ఆజ్ఞను ఇమ్ము (40).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 7 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

*🌻 INTRODUCTION - 7 🌻*

24. It is easy for some of us who have undergone the training that enables us to remember our past lives. 

I remember my own last incarnation in Greece, where I took part in the Eleusinian Mysteries, and another life much earlier in which the great Mysteries of Egypt, of which some remnants still exist in Freemasonry, figured largely, and that enables me to get more good out of such books as this than I could without such memory. 

Even impressions from the past, giving a sense of atmosphere, are a great help. Egyptian or Indian, there is no more precious gem in our Theosophical literature – no book which will better repay the most careful and detailed study.

25. As already explained, Light on the Path was the first of three treatises which occupy an unique position in our Theosophical literature, as they give directions from Those who have trodden the Path to those who desire to tread it. 

I remember that the late Swami T. Subba Row once told us that its precepts had several layers of meaning – that they could be taken over and over again as directions for different stages. 

First, they are useful for the aspirants – those who are treading the probationary path. Then they begin all over again at a higher level for him who has entered upon the Path proper through the portal of the first of the great Initiations. 

And yet again, when Adeptship has been attained, it is said that once more, in some still higher sense, these same precepts may be taken as directions for one who presses onwards to still higher achievements. In this way, for the man who can understand it in the whole of its mystic meaning, this manual carries us farther than any other. 

These books which are definitely written for the quickening of the evolution of those who are on the Path put forward ideals which men in the world are usually not prepared to accept. Even among students there may be some who wonder at the form in which the teaching is given. The only way to understand it is to take it for granted and try to live it. 

In At the Feet of the Master it is said that it is not enough to say that it is poetic and beautiful; a man who wishes to succeed must do exactly what the Master says, attending to every word and taking every hint. That is equally true of this book. 

The man who does not try to live according to the teaching will constantly come up against points in it which will ruffle him – with which he will find himself quite out of agreement; but if he tries to live it, the sense in which it is to be taken will eventually dawn upon him. 

Any honest effort really to live the teaching always throws light on it, and that is the only way in which this priceless pearl can be appreciated.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 129 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. నారద మహర్షి - 3 🌻*

20. రుద్రుడి యొక్క తత్త్వం ఏమిటంటే, అయిదవ బ్రహ్మగా అతడు అంతర్ముఖుడై ఉన్నాడు. శుద్ధజ్ఞానలక్షణ విలసితుడై, అంతర్ముఖుడై అతడు ఉండటచేత సాధారణంగా నిష్క్రియుడు.

21. అతడి యందు అతని యొక్క కార్యలక్షణము ఎప్పుడు వస్తుందంటే, లోకంలో ఏదయినా విపత్తు సంభవించినప్పుడుకాని, ఎవరైనా ఆరాధించినప్పుడుకాని (అతడున్నాడని తెలిసినవాడూ అతడిని ఆరాధిస్తే), అతడికి క్రియ ఏర్పడుతుంది తప్ప; లేకపొతే అతడి యందు క్రియలేదు. 

22. శుద్ధజ్ఞాన స్వరూపమై, ఆదియందున్న పరబ్రహ్మతత్త్వమైన సదాశివతత్త్వం ఏదయితే ఉన్నదో, దానియొక్క జ్ఞానం సంపూర్ణంగా కలిగి ఉండటంచేత – రుద్రుడు నిష్క్రియుడై, క్రియాతీతుడై సర్వకాలములకు అతీతుడైన స్థితిలో ఉంటాడు. 

23. కనుక రుద్రుడు ప్రథమమైనటువంటి పరబ్రహ్మ-సదాశివబ్రహ్మ-యొక్క రూపాంతరమే. అందుకని లోకమందున్న విభూతులు, ఐశ్వర్యము, సుఖము – వాటియొక్క స్పృహ అతడియందు ఉండదు. 

24. అయితే, ఈ రుద్రునికి మళ్ళీ పత్నిగా పరాశక్తి ప్రక్కన ఉన్నదని మనవేదాలు, పురాణాలు, శాస్త్రాలు విరూపణంచేసాయి. అంటే, మన ఉపాసనాసౌలభ్యంకోరకే ఈ సిద్ధంతం ఏర్పడినదని గ్రహించాలి. లేకపోతే, రుద్రుడు వివాహంచేసుకున్నాడని, ఆయనకు స్వాధీనంగా లేకుండానే ఆమె వెళ్ళిపోయి, దాక్షాయణిగా తనను తాను ఉపసంహారం చేసుకుందనీ, ఈ కథకంతటికీకూడా ఎలాగ అర్థం చెప్పుకోవాలి? సృష్టిమూలకమైన తత్త్వములకు – మన పౌరాణికగాధలన్నీ కొన్ని రూపకల్పనలని చేసుకోవాలి. 

25. కథారూపకల్పన లేకుంటే, ఆ తాత్త్వముల అంతరార్థం మానవబుద్ధికి సులభంగా అవ్గాహన కాదు.
దేవాలయంలో నందీశ్వరుడిని, గణపతిని ప్రతిష్ఠ చేస్తాం. ఆ రెండూ లేకపోతే ఈ రుద్రుణ్ణి మనం చేరటానికి, సమీపించడానికి, ఆయనను ఉపాసించడానికి సాధ్యంకాదు. ఆ వేదాంతతత్త్వమే మనయొక్క ఈశ్వర ఉపాసనా విధానములందుకూడా అనేక రూపాంతరములు పొంది వచ్చింది ఈ ప్రకారంగా.

26. జ్ఞానాజ్ఞానముల యొక్క అనేక అవస్థలలో జీవులు ఆయా పరిణామదశలలో ఉన్నారు. ఈ సృష్టిలో అనేక చరిత్రలు జరగవలసి ఉంది. దానికి దేవకార్యం అనిపేరు. 

27. ఈశ్వరుని నుండి బహిర్గతమైన జగత్తంతా – ఈ జీవకోటి అంతా కూడా – తనలో మళ్ళీ లయం చెందాలనేది ఒకటే ఆయన సంకల్పం. కానీ జీవులకు ఆయన్ స్వేఛ్ఛనిచ్చాడు. వాళ్ళందరినీ తను వెంటనే ఉపసంహారం చేసుకోవచ్చు కదా! అటువంటి క్రియయందు అతడికి కారణత్వంలేదు. అలాంటికారణం అతడు కాడు.

28. స్వేఛ్ఛ జీవాహంకారానికి ఇవ్వటంచేత, దానంతట దానికే ఎప్పుడైతే ఆ మోహమ్నుంచి విడిపోదామనే మోక్షేఛ్ఛ కలుగుతుందో, అప్పుడే దానికి మార్గాలు ఈ సృష్టిలో ఏర్పాటు చేయబడి ఉన్నాయి. కర్మయొక్క బంధ్నాన్నే కోరుకొని శాశ్వతంగా ఇక్కడే ఉండేవాళ్ళకు దానికి ఏర్పాట్లు వేరే ఉన్నయి.

 29. రెండు విధాలుగా రాచబాటలు వేసి ఈశ్వరుడు జీవాత్మకు ఇచ్చాడు. అతడు మనకు ఇచ్చిన దానికే చిత్తము – బుద్ధి – మనసు అని మనమంటున్నాం. అంటే, జీవుని కివ్వబడిన ‘స్వేఛ్ఛ’ పేరే, మనోబుద్ధిచిత్తములు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు - 47 🌹*
*🍀 7. పరహితము - లభించిన భోగ భాగ్యములు ఇతరుల శ్రేయస్సు కొరకు వినియోగించు వాడు బుద్ధిమంతుడు. తనకు తానే అనుభవించు వాడు మూర్ఖుడు. 🍀*  
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*📚. కర్మయోగము - 12 📚*

*12. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః |*
*తైత్తా నప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః || 12*

*యః అప్రదాయః, సహస్తేన ఏవః :*

*పరహిత కార్యములను నిర్వర్తించుచు తద్వారా దేవతల ప్రీతి నందిన వాడు భోగ్యమగు అనేక విషయములను వారి యనుగ్రహముగ పొందు చుండును. అట్లు విశేషములైన భోగములను గూడ అనుగ్రహింప బడును. అనుగ్రహింప బడిన భోగ్య విషయములు తనకు తానే అనుభవించుట దొంగతనము. అట్టి దొంగ మరల పతనము చెందగలడు.*

లభించిన భోగ భాగ్యములు ఇతరుల శ్రేయస్సు కొరకు వినియోగించు వాడు బుద్ధిమంతుడు. తనకు తానే అనుభవించు వాడు మూర్ఖుడు. అట్టి మూర్ఖుడు తన ప్రవర్తనము ద్వారా తానే పతనము చెందుచుండును. తాను పరహిత కార్యము లొనర్చుటచే దేవతానుగ్రహము పొందినవాడు. దేవతలు అనుగ్రహించుటకు కారణము తనయందు పరహిత బుద్ధి యున్నదని. 

భోగ్యవిషయము లభ్యముకాగానే, పరహిత ధర్మము మరచుట కృతఘ్నత్వమగును. అందించిన ప్రతి భోగ్యవిషయమును పరహితమునకే సమర్పించుట వృద్ధికి కారణమగును. అట్లు కానిచో వృద్ధి యాగును. పతనము ప్రారంభమగును.

 పరహిత బోధనలు విన్న పేద బ్రాహ్మణుడొకడు తనకుగల రెండు అంగవస్త్రములలో ఒక దానిని గౌతమబుద్ధునకు సమర్పించెను. ఆనందముతో ఏకవస్త్రము ధరించి బాటను పోవుచున్న పేద బ్రాహ్మణుని చూసి, ఆదేశపు రాజు, విషయము తెలుసుకొని బ్రాహ్మణునకు పది అంగవస్త్రముల జంటను అందించినాడు. లభ్యమైన పది అంగవస్త్రముల జంటలను బ్రాహ్మణుడు మరల దానము చేసి ఏకవస్త్రుడుగ నిలచి అమితానందము పొందినాడు. 

పై విషయము తెలిసిన రాజు బ్రాహ్మణునియందు మిక్కిలి సంతసించి ధన కనకములు, ధాన్యము బ్రాహ్మణున కందించినాడు.

 అవియును గూడ మండలము రోజులలో ఇతరుల శ్రేయస్సునకు వినియోగించి మరల ఏకవస్త్రుడుగ చరించసాగినాడు. ఈ విషయము తెలిసిన రాజు ఆనందభరితుడై, బ్రాహ్మణునకు సస్యశ్యామలమైన అగ్రహారము నిచ్చినాడు. 

అగ్రహారమునంతను బౌద్ధసన్యాసులకు ఆశ్రమముగ నేర్పరచి పేద బ్రాహ్మణుడు పరమానందభరితుడై బుద్ధుని సాన్నిధ్యము పొందినాడు. రాజు మిక్కుటముగ ఆనందము పొంది పరహితమార్గమున పరిపూర్ణముగ నడచుటకు సంకల్పించి, దీక్షగ లోకహితమును ఆచరించి రాజర్షియై దైవసాన్నిధ్యమున నిలచినాడు. 

ఇట్లు తనదగ్గర ఉన్నటువంటి విద్యగాని, తెలివిగాని, శక్తిగాని, ధనాదులుగాని ఇతరుల శ్రేయస్సు కొరకై వినియోగించు వాడు సృష్టియందు నిజమైన రాజుగ నిలచును. అట్లు జీవించని వారు ఎప్పుడును పేదలే. పేదలేగాదు దొంగలు కూడ అని కృష్ణుడు కర్మానుష్ఠాన రహస్యమును తెలిపినాడు. (3-12)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 193 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 41. On your true state has arisen this subtle principle ‘I am’, which is the cause of all mischief, no ‘I am’, and no question of mischief. 🌻*

This subtle principle ‘I am’ which is subtler than the mind has appeared on your True state,  

After it appeared it remained in a pure state for some time and then began the piling up of words, language and concepts. 

The ‘I am’ was now verbal and identified itself with body, you became ‘so and so’ living in this world as a person. Your mind developed and became a workshop of mischief, but the root cause was the ‘I am’.  

Now you have reverted and come back to that ‘I am’, the primary mischief monger, you meditate on it and realize its falseness and it disappears. 

You have now transcended the ‘I am’ so where is the question of any mischief?
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. అద్భుత సృష్టి - 48 🌹*
 ✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
          
 *🌻 18. లైట్ బాడీస్ (కాంతి శరీర స్థాయిలు) 🌻*

కాంతి శరీరం అంటే నశింపు లేని దివ్యత్వం. ఈ కాంతి దేహం పొందటం అంటే తాను దైవంగా మారినట్లే. మన ప్రస్తుత శరీరం పరిణామం చెందుతూ అధిక మొత్తంలో కాంతిని స్వీకరిస్తూ నెమ్మది నెమ్మదిగా శరీరంలోని అణువులు అన్ని తమ ఫ్రీక్వెన్సీని *"కార్బన్ స్థితి"* నుండి *"కాంతి స్థితి"* లోనికి మార్చుకుంటుంది.

✨. ఈ ఆత్మకు సంబంధించిన అన్ని శక్తులు, శక్తి క్షేత్రాలు, శరీర అవయవాలు అన్నీ కూడా తమ ఫ్రీక్వెన్సీని ఉన్నత స్థాయి ఫ్రీక్వెన్సీతో అనుసంధానం చేస్తూ అతి సాధారణ భౌతిక స్థాయి నుండి ఆదిభౌతిక స్థాయికి, అక్కడి నుండి అనంత చైతన్య స్థాయికి ఎదిగేలా చేస్తుంది.

✨. కాంతిని స్వీకరిస్తూ.. ప్రత్యక్షంగా, పరోక్షంగా, శారీరక, మానసిక, బుద్ధి, చైతన్య స్ధితులలో ప్రత్యేక మార్పులు జరుగుతాయి.

కర్బన ఆధారిత శరీర అణువులు మార్పును చెందుతున్న తరుణంలో కర్మలు కడగబడడం జరుగుతుంది. శరీరం అధిక సాంద్రతను కోల్పోవడం జరుగుతుంది. ఈ తరుణంలో శరీరం అతి సాధారణమైన రుగ్మతలకు గురి కావడం జరుగుతుంది. (జ్వరం, తలనొప్పి, దద్దులు, కండరాలు బిగదీయడం, కీళ్లనొప్పులు మొదలైనవి)

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 69 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మ విచారణ పద్ధతి - 33 🌻*

 “ఆకాశస్య సంభూతాత్మా” అనవచ్చునా అంటే అనరాదు. అంటే అర్ధమేమిటి? నీ కళ్ళముందున్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఆకాశమే మిగిలిన నాలుగు భూతముల చేత ప్రభావితము కాకుండా వున్నట్టు కనబడుతున్నది కదా. 

అట్టి ఆకాశమునకంటే ముందుగా వున్నటువంటి ఆత్మ స్వరూపము, అధిష్టానముగా వున్న ఆత్మ స్వరూపము, ఆశ్రయముగా వున్న ఆత్మస్వరూపము తదుపరి ఏర్పడినటువంటి వాటి చేత ప్రభావితమగుట, బాధింపబడుట అసత్యము, సాధ్యము కాదు. ఇంకా, మరి ఆకాశమునకంటే ముందున్నటువంటి సూర్య ప్రకాశము ఆత్మ ప్రకాశము వలననే సూర్యుడు ప్రకాశిస్తున్నాడనేటటువంటి అధిష్టాన ధర్మము కలిగినటువంటి ఆత్మ స్వరూపము, స్వరూప జ్ఞానమును ఎవరైనా ఒకరు చంపుతారని చంపెదనని చనిపోతుందని అనడం అసంబద్ధం కదా. 

కాబట్టి చంపుట గాని చంపబడుట గాని చనిపోవుటగాని శరీర గతమైన లక్షణములే గాని ఆత్మ లక్షణము కావు. ఇట్టి ఆత్మ లక్షణములను తప్పక మానవులందరూ పూర్తిగా శ్రవణ మనన నిధి ధ్యాస యుక్తముగా ఆత్మస్వరూప లక్షణములను చక్కగా అనుశీలించవలసిన అవసరము వున్నది. 

ఒకవేళ ఈ ఆత్మ లక్షణమునకు వ్యతిరేకముగా నీకెప్పుడైనా తోచినట్లయితే అపుడు శరీర గత ధర్మములను ఆశ్రయించావు అనేటటువంటి నిర్ణయాన్ని నువ్వు పొందాలి. ఏ భావములోనైనా, ఏ ఆలోచనలో అయినా ఈ శరీర ధర్మమేమిటి ఆ ఆత్మ ధర్మమేమిటి అని చక్కగా విచారణ చేసి ఆత్మ ధర్మమును ఆశ్రయించి ఆత్మ భావమునందు స్థిరముగా నిలబడి వుండటమే సాధకులకు అత్యావశ్యకమైనది.

         కాబట్టి ఆత్మ ఎవరినీ చంపుటా లేదు, చచ్చుటా లేదు. ఆత్మకు రెండు లక్షణములూ లేవు. ఏమిటవీ? చంపబడదు, చనిపోదు. కాబట్టి ఎవరైనా చనిపోయారు అంటే అర్ధమేమిటంటే వారి శరీరము మాత్రమే చనిపోయింది. వారు చనిపోయే అవకాశం లేదు. ఈ రకమైనటువంటి సత్యాన్ని తప్పక మానవులు నిర్ణయాత్మకంగా గ్రహించవలసినటువంటి అవసరం వున్నది. అర్ధమయిందా అండి? ఈ రకంగా నీవు ఈ అంశాలను గ్రహించుకోవాలి. 

ఇలా గ్రహించుకున్న తరువాత నీ నిజ జీవితంలో నువ్వు ఈ ఆత్మ భావనలో నిలకడ చెంది వుండటమనేది అతి ముఖ్యమైనటువంటిది. ఎందుకనంటే అన్నీ ఇంద్రియములతో ఇంద్రియార్ధములతో విషయములతో కూడుకుని వున్నటువంటి భావనలు భావములే కలుగుతూ వుంటాయి.

         అసంబద్ధమైనటువంటి శరీర ధర్మానుసారము వున్నటువంటి, మనో ధర్మానుసారము వున్నటువంటి, ఇంద్రియములతో కూడుకున్నటువంటి, గుణములతో కూడుకున్నటువంటి, వాసనలతో కూడుకున్నటువంటి, శరీరములతో కూడుకున్నటువంటి, అవస్థలతో కూడుకున్నటువంటి, కాలత్రయముతో కూడుకున్నటువంటి, కాలత్రయం, శరీరత్రయం, అవస్థాత్రయం, దేహత్రయం, జననమరణాలతో కూడుకున్నటువంటి, జరామరణ మృత్యు స్వరూపమైనటువంటి, ఏదో ఒక కాలంలో నేను చనిపోతాను కదా అనేటటువంటి భావన చేత మానవుడు శరీర ధర్మాన్ని పొందుతున్నాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 31 / Sri Vishnu Sahasra Namavali - 31 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*కర్కాటక రాశి - పుష్యమి నక్షత్ర 3 పాద శ్లోకం*

*🌻 31. అమృతాంశూద్భవో భానుః శశబిందుః సురేశ్వరః |*
*ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమః ‖ 31 ‖*

🍀. అమృతాంశూద్భవః --- 
అమృత కిరణ్మయుడగు చంద్రుని జననమునకు కారణము, చంద్రుని తన మనస్సునుండి పుట్టించినవాడు; జలములను వ్యాపింపజేసి జీవులను సృష్టించువాడు. 

🍀. భానుః --- 
ప్రకాశించువాడు, కిరణ్మయుడు, సూర్యుడు; సూర్యునకు కూడా వెలుగును ప్రసాదించువాడు. 

🍀. శశబిందుః --- 
దుర్మార్గులను విడనాడువాడు, శిక్షించువాడు; చంద్రుడు (కుందేలు వంటి మచ్చ గలవాడు) ; నక్షత్రముల, గ్రహముల గతులను నియంత్రించువాడు. 

🍀. సురేశ్వరః --- 
దేవతలకు ప్రభువు; సన్మార్గమున నడచువారికి అండ. 

🍀. ఔషధం --- 
భవరోగమును, భయంకరమగు జనన మరణ జరావ్యాధి పూరితమగు సంసారమను వ్యాధిని నయముచేయు దివ్యమగు నివారణ. (పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్యా కోనేటిరాయడా! చెడనీక బ్రతికించే సిద్ధ మంత్రమా, రోగాలడచి రక్షంచే దివ్యౌషధమా!) 

🍀. జగతస్సేతుః --- 
మంచి, చెడుల మధ్య అడ్డుగా నిలచినవాడు; సంసారసాగరమును దాటుటకు ఉపయోగపడు వంతెన; చలించుచున్నవానిని అదుపులోనుంచువాడు; ప్రపంచమునకు, జీవునకు వంతెన వంటివాడు.. 

🍀. సత్యధర్మపరాక్రమః 
సదా నిజమైన ధర్మగుణము, పరాక్రమము కలిగినవాడు. 

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 31 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Karkataka Rasi, Pushyami 3rd Padam*

*🌻 13. amṛtāṁśūdbhavō bhānuḥ śaśabinduḥ sureśvaraḥ |*
*auṣadhaṁ jagataḥ setuḥ satyadharmaparākramaḥ || 31 ||*