🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) - 2 🌹
✍️ సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🌹 గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) 🌹
🌹 భాగము 2 🌹
🍃 మొదటి స్థితి 🍃
86. ఈ సృష్టి ప్రారంభము కాకముందు పూర్వ సృష్టి, ప్రళయ స్థితిలో ఎలా లయమైందో తెలుసుకుందాము.
87. మనము నిద్రస్థితిలోకి వెళ్ళే ప్రక్రియ ప్రకారము మనము ప్రతిరోజూ జాగ్రత్ నుండి స్వప్న, సుషుప్తిలోకి ఎలా వెలుతున్నామో గ్రహించాలి.
88. శాశ్వత జగత్ పితరులు 7 అనంతముల వరకు సుషుప్తిలోకి వెళ్ళారు. అదే ప్రళయకాల స్థితి.
89. శాశ్వత జగత్ అయిన ఆకాశము పితరుల నివాసమని గ్రహించాలి.
90. ప్రతి దృగ్గోచర పరిస్థితికి ఇది అగోచరము. ఉపాధిగా ఉన్న ఆకాశము నుండి వికిరణము చెందిన పంచతన్మాత్రలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంథాలు మొదట రూపొందినవి.
91. వ్యక్తి లయ స్థితిలో తన ఆత్మ, చిత్తము, బుద్ధి, మనస్సు, అహంకారములు అను దుస్తులను వదలి దృగ్గోచరము కాని బట్టలను చుట్టబెట్టుకొని ఉంటాడు.
92. ఆ సమయంలో కాలము అనంతము యొక్క హృదయములో నిద్రిస్తూ లేనిదై ఉంటుంది.
93. కాలమనేది ఒక చేతనత్వము నుండి (స్థితి) మరొక చేతనత్వములోనికి అనంతములో ప్రయాణిస్తున్నప్పుడు కలుగుతుంది. భ్రాంతి కలుగజేయు చేతనత్వము లేకపోయిన కాలము తెలియదు. కాలము నిద్రలేచినపుడే తెలుస్తుంది.
94. వర్తమానము (జాగ్రత్) నిజానికి భూత భవిష్యత్తులను వేరుచేసే ఒక భ్రమ మాత్రమే.
95. వర్తమానమనగా గతం యొక్క జ్ఞాపకాల పునాది మీద నిర్మింపబడి భవిష్యత్తుకు బాటవేసేది.
96. ఈ ప్రపంచంలో కనబడే సర్వభూతాలు ఇంతకు ముందు లేవు. ఇప్పుడు కనబడుతున్నాయి. చనిపోయిన తరువాత ఏ రూపం పొందునో తెలియదు.
97. నిద్రలోకి వెళుతున్న వ్యక్తి ముందు తన 7 కోశములను క్రమంగా తాకుతూ చివరికి బీజరూపములోనికి వెళ్ళి చైతన్యం నిద్రించగా కాల విస్మృతి కలుగుతుంది. అపుడు మనస్సు లేనిదవుతుంది.
98. సంకల్పము, ఆలోచన, కోరికల సమన్వయ చేతనత్వమే మనస్సు.
99. సాధకుడు నిద్రా స్థితిలో, బాహ్య, దేశ, కాల స్థితిని దాటి తన అంతరంగములో ప్రవేశించి, సాధన యొక్క పరిణతితో ఆ మానసిక శక్తులను ఉపయోగిస్తాడు. నిద్రకు ముందు సాధకుడు దివ్య జ్యోతిని దర్శిస్తాడు. కాని సాధారణ వ్యక్తి లౌకిక ఊహాగానాలు చేసి నిద్రలేని స్థితికి లోనవుతాడు.
100. నిద్రకు ముందు శ్వాసలోని మార్పులను గమనిస్తూ వుండాలి. అది సాధనలోని ఒక భాగము.
101. ఆనందానికి, దుఃఖానికి ప్రత్యేకకారణాలు ఏవీలేవు. అవి వాటివాటి బంధనాలలో వున్న వారికి మాత్రమే.
102. సత్, చిత్, ఆనందము కేవలము లయ స్థితిలోనే కలుగుతుంది. కావున అవి లేనట్లే.
103. ద్వాదశ రాశులు వాటి ఫలితాలు కూడా కేవలము లయ స్థితిలోనే ఉంటాయి. కాని అనగా నిజానికి ఏమీలేవు. బాహ్య దృష్టిలో అయితే దోషాలను గమనించి వాటికి తగిన ప్రాయశ్చిత్తము చేసుకోవాలి.
104. చీకటి స్థితిలో తల్లి, తండ్రి, కొడుకు లేరు. అంతా ఒక్కటే. వెలుగులోకి వచ్చినప్పుడే పుత్రుడు తన యాత్ర మొదలుపెడతాడు.
105. చీకటి అనగా ఇంద్రియాతీత స్థితి. వెలుగులోకి వచ్చినప్పుడే కాలము, ఇంద్రియాలు గోచరమవుతాయి.
106. గుప్త విద్య ప్రకారం బ్రహ్మమే తల్లి, తండ్రి, కొడుకు, జీవితము, చేతనత్వము. ఇవన్నీ ఆత్మ పదార్థముల కలయిక వలన ఏర్పడినవే.
107. బ్రహ్మము నుండి విడివడిన పంచభూతాలు, మనస్సు, బుద్ధి మరల కలుస్తూ, విడిపోతూ చివరికి బ్రహ్మములో విలీనం కావలసినదే. ఇవన్నీ సత్యమైన ఆత్మ యొక్క సత్యములు(విభూతులు).
108. ఏదైతే ఉండియూ లేకుండా ఉన్నదో (బ్రహ్మము) దాని నుండి ఉత్పత్తి అయ్యేది ఏదీలేదు, దానలోకి మరొకటి లయమయ్యేదీ ఏదీలేదు.
109. పంచభూతములలోని భూమి, నీరు, అగ్ని, వాయువులను దర్శించటం సులభమే. 5వది అయిన ఆకాశ తత్వం, పై నాలుగింటిలో అంతర్లీనమై ఉంది, మరియు ఆ నాలుగింటితో సంబంధం లేకుండా ఉంది. అవి లేకపోయీ ఆకాశ తత్త్వం ఉంటూనే ఉంది.
110. లయ స్థితిలో నుండి వికాస స్థితిలోకి కావలసిన పనిముట్లు తయారు చేసుకొనుటకు, ప్రస్తుత స్థితి నుండి ఇంకను వికాసం చెందుటకు, పరిపూర్ణత సాధించుటకు కావలసిన ముడి పదార్థములను, పరిస్థితులను లయస్థితిలోనే తయారుచేసుకుంటుంది, ఇది ప్రణాళికా రూపంలో ఉండి, సరిగా అలాగే క్రమముగా వ్యక్తమవుతుంది.
111. సృష్టి స్థితిలో లయ స్థితి యొక్క ప్రణాళిక ప్రకారము మార్పులు వాటంతట అవె ప్రణాళికా బద్ధంగా జరుగుతాయి.
112. ఉనికికి కారణమైన దృగ్గోచర ప్రపంచం, లయ కాలములో ఉనికి రహిత స్థితిలో విశ్రాంతి తీసుకుంటున్నాయి.
113. ఉనికికి లక్షణాలైన 'ఉండాలి' అనే కోరిక 'జీవించాలి' అనే కోరిక పరమాణువు నుండి సూర్యుని వరకు కనిపిస్తుంది.
114. కాని ఉనికికి కారణాలేవి కనిపించవు. మనస్సుకు కూడా కారణాలు తెలియవు. వాటిని తెలుసుకోవాలంటే విజ్ఞానము, ఆధ్యాత్మిక స్థితికి చెరుకోవలసి ఉంటుంది.
115. నిద్ర స్థితిలోకి వెళ్ళినప్పుడు ఎఱుక నుండి మరుపు స్థితికి ఎప్పుడు ఎలా వెలుచున్నామో గమనించుటయే సాధన యొక్క ముఖ్య భాగము.
116. ఆ గమన స్థితిలో విశ్వాంతరాళములలో జీవితము మూర్ఛ స్థితిలో ఉన్నప్పటికి స్పందిస్తూనే ఉంటుంది. ఆ స్పందనను తెలుసుకోవటమే సాధన యొక్క ముఖ్య పని.
117. మూర్ఛ స్థితిలో విశ్వమంత ఒకే స్థితిలో బ్రహ్మములో లీనమై ఉంటుంది. అపుడే మార్పుతో కూడిన కలయికలు, విడిపోవటాలు జరుగుతుంటవి. వైజ్ఞానికులు ఆ మూల స్థితికి (హైడ్రోజన్ ఆటమ్) చేరుటకు కృషి చేస్తున్నారు.
118. నిద్ర యొక్క స్వప్న రహిత స్థితిలో మనస్సు యొక్క కొంత భాగము ఎఱుక స్థితినే, శివుని యొక్క మూడవ నేత్రం అన్నారు. ఇదే జీవన్ముక్తుని ఆధ్యాత్మిక కేంద్రము.
119. వ్యక్తిగత సాధనలో శ్వాసను గమనిస్తూ నిద్రకుపక్రమించిన సాధకుడు తన గడిచిన రోజును గుర్తుచేసుకుంటూ, జరిగిన తప్పులను అతీత శక్తులనుపయోగించి సవరించుకుంటూ, స్వప్న రహిత స్థితికి చేరుకుంటాడు.
120. మనస్సుకు ఆలయము శరీరము. సూక్ష్మమైన మనస్సు యొక్క వ్యక్తీకరణ స్థూల శరీరము ద్వారానే జరుగుతుంది. మనోవ్యాపారము శరీరమనే పనిముట్లు ద్వారా జరుగుతుంది. ఆధ్యాత్మిక స్థితిలో మనస్సు ఆత్మకు నిలయముగా మారుతుంది. అప్పుడు మనస్సుతో కూడిన ఆత్మ తనను తాను లీలగా వ్యక్తపరచుకొంటుంది. మనో వ్యాపారాన్ని విలక్షణముగా ఉండి సాక్షిగా గమనిస్తూ ఉంటుంది.
121. దేవతా గణాలు స్వయం ఉత్పత్తులు అగుటచే, స్వప్న రహిత స్థితిలో, అనుత్పాదక స్థితిలో సృష్టి క్రమం దాగి ఉంటుంది.
122. సాధారణముగా సాధకుడు అనుత్పాదక స్థితిలో సాక్షిగా ఉండుటచే గాఢ నిద్రలో ఎఱుకతో ఉండగలడు. ఇది తురీయము.
118. నిద్ర యొక్క స్వప్న రహిత స్థితిలో మనస్సు యొక్క కొంత భాగము ఎఱుక స్థితినే, శివుని యొక్క మూడవ నేత్రం అన్నారు. ఇదే జీవన్ముక్తుని ఆధ్యాత్మిక కేంద్రము.
119. వ్యక్తిగత సాధనలో శ్వాసను గమనిస్తూ నిద్రకుపక్రమించిన సాధకుడు తన గడిచిన రోజును గుర్తుచేసుకుంటూ, జరిగిన తప్పులను అతీత శక్తులనుపయోగించి సవరించుకుంటూ, స్వప్న రహిత స్థితికి చేరుకుంటాడు.
120. మనస్సుకు ఆలయము శరీరము. సూక్ష్మమైన మనస్సు యొక్క వ్యక్తీకరణ స్థూల శరీరము ద్వారానే జరుగుతుంది. మనోవ్యాపారము శరీరమనే పనిముట్లు ద్వారా జరుగుతుంది. ఆధ్యాత్మిక స్థితిలో మనస్సు ఆత్మకు నిలయముగా మారుతుంది. అప్పుడు మనస్సుతో కూడిన ఆత్మ తనను తాను లీలగా వ్యక్తపరచుకొంటుంది. మనో వ్యాపారాన్ని విలక్షణముగా ఉండి సాక్షిగా గమనిస్తూ ఉంటుంది.
121. దేవతా గణాలు స్వయం ఉత్పత్తులు అగుటచే, స్వప్న రహిత స్థితిలో, అనుత్పాదక స్థితిలో సృష్టి క్రమం దాగి ఉంటుంది.
122. సాధారణముగా సాధకుడు అనుత్పాదక స్థితిలో సాక్షిగా ఉండుటచే గాఢ నిద్రలో ఎఱుకతో ఉండగలడు. ఇది తురీయము.
🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹