🌹 23, MARCH 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹

🍀🌹 23, MARCH 2023 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 23, MARCH 2023 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 344 / Bhagavad-Gita - 344 🌹 🌴 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం / Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 06 వ శ్లోకము 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 191 / Agni Maha Purana - 191 🌹 🌻. స్నపనాది విధానము - 3 / Consecration of the idol (snāna) - 3 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 056 / DAILY WISDOM - 056 🌹 🌻25. మా అధ్యయనాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి / 25. All Our Studies Look Like a Blank 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 321 🌹
6) 🌹. శివ సూత్రములు - 58 / Siva Sutras - 58 🌹 
🌻 18. లోకానన్దః సమాధిసుఖమ్ - 4 / 18. lokānandaḥ samādhisukham - 4 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 23, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : జులేలాల్ జయంతి (ప్రధమ చంద్ర దర్శనము), Jhulelal Jayanti (Cheti Chand) 🌺*

*🍀. శ్రీ హయగ్రీవ స్తోత్రం - 32 🍀*

*32. వ్యాఖ్యాముద్రాం కరసరసిజైః పుస్తకం శంఖచక్రే*
*భిభ్రద్భిన్న స్ఫటికరుచిరే పుండరీకే నిషణ్ణః ।*
*అమ్లానశ్రీరమృతవిశదైరంశుభిః ప్లావయన్మాం*
*ఆవిర్భూయాదనఘమహిమామానసే వాగధీశః ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : సామాన్య ధ్యాన లక్షణం - చైతన్యాన్ని కూడగట్టి ఒక బిందువు నందు గాని, ఒక లక్ష్యమందు గాని కేంద్రీకృతం చెయ్యడమే ఏకాగ్రత. సామాన్య ధ్యానంలో చైతన్యాన్ని ఇలా కూడగట్ట వలసిన అవసరం లేదు. ప్రశాంత చిత్తంతో ఒక విషయాన్ని ఆలోచిస్తూ చైతన్యమందు దానిని గుర్తించడమే అచట జరగవలసిన పని.🍀*

🌷🌷🌷🌷🌷

*🌹. శ్రీ శోభకృన్నామ సంవత్సర దేవతా ధ్యానమ్ 🌹*
*సహొజనం శోభకృతం నృణా మిష్టద మాశ్రయే |*
*శిబికావాహనారూఢం చామర ద్వయ పాణికమ్ ||*

🌷🌷🌷🌷🌷

శోభకృత్‌, వసంత ఋతువు,
ఉత్తరాయణం, చైత్ర మాసం
తిథి: శుక్ల విదియ 18:22:51 వరకు
తదుపరి శుక్ల తదియ
నక్షత్రం: రేవతి 14:10:58 వరకు
తదుపరి అశ్విని
యోగం: ఇంద్ర 27:42:02 వరకు
తదుపరి వైధృతి
కరణం: బాలవ 07:17:39 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 10:21:19 - 11:09:56
మరియు 15:13:01 - 16:01:38
రాహు కాలం: 13:54:01 - 15:25:10
గుళిక కాలం: 09:20:32 - 10:51:42
యమ గండం: 06:18:13 - 07:49:23
అభిజిత్ ముహూర్తం: 11:58 - 12:46
అమృత కాలం: 22:51:36 - 36:52:48
సూర్యోదయం: 06:18:13
సూర్యాస్తమయం: 18:27:29
చంద్రోదయం: 07:23:36
చంద్రాస్తమయం: 20:08:32
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: మిత్ర యోగం - మిత్ర
లాభం 14:10:58 వరకు తదుపరి మానస
యోగం - కార్య లాభం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 344 / Bhagavad-Gita - 344 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 06 🌴*

*06. యథాకాశస్థితో నిత్యం వాయు: సర్వత్రగో మహాన్ |*
*తథా సర్వాణి భూతాని మత్థ్సానీత్యుపధారయ ||*

🌷. తాత్పర్యం :
*సర్వత్రా వీచునట్టి ప్రచండవాయువు సదా ఆకాశము నందే స్థితిని కలిగియుండునట్లు, సృజింపబడిన సమస్తజీవులు నా యందు స్థితిని కలిగియున్నవని గ్రహింపుము.*

🌷. భాష్యము : 
బ్రహ్మాండమైన విశ్వము ఏ విధముగా శ్రీకృష్ణభగవానునిపై ఆధారపడియున్నదో తెలియుట సామాన్యమానవునికి దాదాపు ఊహాతీత విషయము. కాని మన అవగాహనకు తోడ్పడు ఉపమానము నొకదానిని భగవానుడు ఒసగుచున్నాడు. మనము ఊహింపగలిగిన వానిలో అత్యంత ఘనమైనది ఆకాశము. అట్టి ఆకాశమున వాయువే అతి గొప్పదైనది. అది ప్రతిదాని చలనమును పభావితము చేయగలదు. ఆ విధముగా వాయువు అతిఘనమైనను ఆకాశమునందే స్థితిని కలిగియుండును. అది ఆకాశపరధిని దాటక దాని యందే ఒదిగియుండును. అదేవిధముగా అధ్భుతమైన సృష్టులన్నియును శ్రీకృష్ణభగవానుని సంకల్పము చేతనే స్థితిని కలిగియుండి అతనికి లోబడి వర్తించును. సాధారణముగా చెప్పబడునట్లు భగవానుని ఆజ్ఞ లేనిదే తృణము కూడా కదలదు. అనగా ఆ భగవానుని సంకల్పము చేతనే సమస్తము నడుచుచున్నది. 

అతని సంకల్పము చేతనే సర్వము సృష్టింపబడి, పోషింపబడి, అంత్యమున నశించిపోవుచున్నది. అయినను వాయువు యొక్క కార్యకలాపములకు ఆకాశము అతీతముగా నున్నట్లు, శ్రీకృష్ణభగవానుడు సమస్తము నుండి వేరుగా నున్నాడు. “భగవానుని భయము చెట్నీ వాయువు వీచుచున్నది” అని తైత్తరీయోపనిషత్తు (2.81) నందు తెలుపబడినది (యద్భీషా వాత: పవతే). అదే విధముగా బృహదారణ్యకోపనిషత్తు (3.8.9) నందు కూడా “దేవదేవుని నేతృత్వములో అతని దివ్య శాసనము చేతనే సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహములు చలించుచున్నవి” యని తెలుపబడినది ( ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి సూర్యచంద్రమసౌ విధ్రుతౌ తిష్టత ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి ద్యావాపృథివ్యౌ విద్రుతౌ తిష్టత: ). 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 344 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 06 🌴*

*06 . yathākāśa-sthito nityaṁ vāyuḥ sarvatra-go mahān*
*tathā sarvāṇi bhūtāni mat-sthānīty upadhāraya*

🌷 Translation : 
*Understand that as the mighty wind, blowing everywhere, rests always in the sky, all created beings rest in Me.*

🌹 Purport :
For the ordinary person it is almost inconceivable how the huge material creation is resting in Him. But the Lord is giving an example which may help us to understand. The sky may be the biggest manifestation we can conceive. And in that sky the wind or air is the biggest manifestation in the cosmic world. The movement of the air influences the movements of everything. But although the wind is great, it is still situated within the sky; the wind is not beyond the sky. Similarly, all the wonderful cosmic manifestations are existing by the supreme will of God, and all of them are subordinate to that supreme will. As we generally say, not a blade of grass moves without the will of the Supreme Personality of Godhead. 

Thus everything is moving under His will: by His will everything is being created, everything is being maintained, and everything is being annihilated. Still He is aloof from everything, as the sky is always aloof from the activities of the wind. In the Upaniṣads it is stated, yad-bhīṣā vātaḥ pavate: “It is out of the fear of the Supreme Lord that the wind is blowing.” (Taittirīya Upaniṣad 2.8.1) In the Bṛhad-āraṇyaka Upaniṣad (3.8.9) it is stated, etasya vā akṣarasya praśāsane gārgi sūrya-candramasau vidhṛtau tiṣṭhata etasya vā akṣarasya praśāsane gārgi dyāv-āpṛthivyau vidhṛtau tiṣṭhataḥ. “By the supreme order, under the superintendence of the Supreme Personality of Godhead, the moon, the sun, and the other great planets are moving.”
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 191 / Agni Maha Purana - 191 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 58*

*🌻. స్నపనాది విధానము - 3 🌻*

*"యఓషధీః" ఇత్యాది మంత్రము చదువును ఓషధి మిశ్రజలము చేతను, యజ్ఞా యజ్ఞా" ఇత్యాది మంత్రము చదువుచు ఉసిరి మొదలగు కషాయ పదార్థములు కలిపిన జలములచేతను, "పయః పృథివ్యామ్‌" ఇత్యాది మంత్రముతో పంచగవ్యముల చేతను, "యాఃఫలినీః" ఇత్యాది మంత్రముతో ఫలిమిశ్రిత జలములచేతను స్నానము చేయించవలెను. "విశ్వతశ్చక్షుః" ఇత్యాది మంత్రముతో ఉత్తరదిక్కుననున్న కలశ చేతను. "సోమం రాజనమ్‌" అను మంత్రముతో పూర్వదిక్కలశముచేతను, "విష్ణారరాటమసి" ఇత్యాది మంత్రముతో దక్షిణకలశ చేతను, "హంసః శుచిషత్‌" ఇత్యాది మంత్రముతో పశ్చిమముననున్న కలశచేతను ఉద్వర్తన స్నానము చేయించవెలను.*

*"మూర్ధానందివో" ఇత్యాది మంత్రముతో ఉసిరికాయతో కూడిన జలముచేతను, "మానస్తోకే" ఇత్యాది మంత్రముతో జటామాంసికలసిన జలముచేతను, "గన్దద్వారామ్‌ " ఇత్యాది మంత్రముతో గంధమిశ్రిత జలముచేతను, "ఇంద్రమాప" ఇత్యాది మంత్రముతో ఎనుబది యొక్క పదముల వాస్తు మండపమునందుంచిన కలశలముచేతను స్నానము చేయించవలెను. స్నానానంతరము - "సమస్త లోకములను అనుగ్రిహించు భగవంతుడవైన మహావిష్ణూ! రమ్ము, రమ్ము, ఈ యజ్ఞభాగమును గ్రహింపును. మీకు నమస్కారము " అని ప్రార్థించుచు దేవేశ్వరుని ఆవాహనము చేసి, "మఞ్చామిత్వా" ఇత్యాది మంత్రము చదువుచు విష్ణు విగ్రహహస్తమునకు క్టటిన కౌతుక సూత్రమును, ఆచార్యుని చేతికి కట్టిన సూత్రమును కూడ విప్పివేయవలెను. పిమ్మట "హిరణ్మయేన" ఇత్యాది మంత్రముతో పాద్యము "అతోదేవా!" ఇత్యాది మంత్రముతో అర్ఘ్యము, "మధువాతాః" ఇత్యాది మంత్రముతో మధుపర్కము ఇచ్చి "మయిగృహ్ణామి" ఇత్యాదిమంత్రముతో ఆచమనము చేయించవలెను. పిమ్మట విద్వాంసుడు "అక్షన్నమీమదన్త" ఇత్యాది మంత్రము చదువును శ్రీమహావిష్ణువు ఆవయవములపై దూర్వలు, అక్షతుల చల్లవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 191 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 58*
*🌻Consecration of the idol (snāna) - 3 🌻*

15. (The image should be bathed) with herbal waters (with the syllable) tadviṣṇoḥ[13] and yā oṣadhī,[14] with herbal decoctions (with the syllable) yajñā-ajñā[15] and then with the pañcagavya (the five things got from a cow).

16. (The image should be bathed) with the waters containing fruits (with the syllables) payaḥ pṛthivyām[16] and yāḥ phalinī[17] and with (the contents of) the pitchers (kept in) the north and east with (the syllables) viśvataścakṣuḥ.[18]

17. The cleansing (of the image) of Hari (Viṣṇu) should be done with (the recitation of the syllables somaṃ rājānam, viṣṇo rarāṭamasi[19] from the right and with haṃsaḥ śuci[20] on the west.

18. One should offer the dhātrī and māṃsī (herbs) on the head with the sacred syllables mūrdhānaṃ divā[21]. (One should bathe the image) with perfumes with the syllables gandhadvāra and mā nas toka.[22]

19. (One has to pour over its head the contents of the pitchers) placed in the eighty-one squares (with the syllables) idam ȧpaḥ. O Lord Viṣṇu! the bestower of grace on the universe! you come.

20. (You) accept this share in the sacrificial offerings. O Vāsudeva! Salutations to you! Having invoked the lord in this way, the wrist thread (on the hand of the image) should be unfastened.

21. The wrist thread on (the hand of) the priest should also be unfastened with the hymn muñcāmi tvā.[23] The water for washing the feet should be offered with (the syllable) hiraṇmaya[24] and the offering with ato devā.[25]

22. The madhuparka (should be offered) with (the syllables) madhuvātā[26] and the ācamana (the ceremonial sipping of waters at the commencement of any rite) should be done with mayi gṛhṇāmi.[27] The learned (priest) should scatter the unbroken rice-with (the syllable) akṣannamīmadanta.[28]

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 56 / DAILY WISDOM - 56 🌹*
*🍀 📖. యోగా యొక్క తత్వశాస్త్రం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻25. మా అధ్యయనాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి 🌻*

*మన ప్రయోగశాల జీవితానికి మరియు మన ప్రజా జీవితానికి మధ్య ఎల్లప్పుడూ వ్యత్యాసం ఉంటుంది. మనం ప్రయోగశాలలలో శాస్త్రవేత్తలం కానీ దుకాణాలలో, రైల్వే స్టేషన్లలో మరియు బస్టాండ్లలో సాధారణ వ్యక్తులం. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో, ఇన్‌స్టిట్యూషన్స్‌లోని మన చదువు యొక్క ఫలితం ఇది. మనం ఎక్కడున్నా ఈ తరహా జీవితంతో విసిగిపోయాం కనుకనే వీలైతే కాస్త సమయం వెతుక్కుని, వేరే పద్ధతిలో ఆలోచించాలని ప్రయత్నిస్తున్నాం. చదువుకోవడం సులభం.*

*ప్రపంచంలో లెక్కలేనన్ని పాఠశాలలు ఉన్నాయి మరియు వాటి అధ్యయనాల ఫలితంగా ప్రజల మనస్సులలో ఉద్వేగాలు మరియు భావాల పెరుగుదల, ఎప్పుడైనా యుద్ధం ముంచుకు వస్తుందేమో అనిపించే పరిస్థితిలో, కనీసం ఒక్క వ్యక్తైనా ఈ అందోళన నుంచి ముక్తి పొంది, ఒక్క రాత్రైనా హాయిగా నిద్రిస్తాడా అన్నది చెప్పడం కష్టం. మనం దీనిని చూశాము మరియు ఇది మనకు తెలుసు మరియు మనం ఈ వాతావరణం మధ్యలో ఉన్నాము. మనం దానితో విసిగిపోయాము మరియు మన జీవన విధానం మరియు ఆలోచనా విధానంలో ప్రాథమిక లోపం ఉందని మనం గ్రహించాము, దాని కారణంగా మన అధ్యయనాలన్నీ ఖాళీగా కనిపిస్తాయి. ఇవి మనల్ని ఎక్కడికీ తీసుకుపోలేవు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 56 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 25. All Our Studies Look Like a Blank 🌻*

*There is always a distinction between our laboratory life and our public life. We are scientists in the laboratories but commonplace persons in the shops, in the railway stations, and the bus stands. This is the outcome of our learning in colleges, in universities, in institutions. Wherever we are, we are fed up with this kind of life, and that is why we are trying to find a little time, if it is possible, to think in a different manner. It is easy to study.*

*There are countless schools in the world and the result of all the studies is an upsurge of emotions and feelings in the minds of people, a veritable warfare perpetually threatening to take place, so that it is difficult to say if one person, at least, sleeps soundly in the night, with freedom from all anxiety. We have seen this, and we know this, and we are in the midst of this atmosphere. We are tired of it to the core and we realise that there is a basic error in our way of living and thinking, due to which all our studies look like a blank. These have led us nowhere.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 321 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఆనంద మార్గంలో వుండడమంటే అనుభవం నించీ నేర్చుకోవడం. చేసిన తప్పుల్నే చెయ్యకపోవడం. అదే ఈర్ష్య, అదే కోపం, అదే అసూయ, అదే అత్యాశ. వాటిని మళ్ళీ మళ్ళీ చేయకు. ఇది మేలుకునే సమయం. 🍀*

*అనుభవం నించీ నేర్చుకోని జంతువు మనిషి ఒక్కడే. ఇది నా పరిశీలన. చివరికి గాడిదలు కూడా నేర్చుకుంటాయి. అరబిక్లో గాడిద కూడా రెండోసారి గుంతలో పడదు అన్న సామెత వుంది. మనిషి వేలసార్లు గోతిలో పడతాడు. ఒకటి రెండుసార్లు కాదు, వేలసార్లు, 'అరే పొరపాటయింది. అప్పుడయితే చీకటి. ఇప్పుడు వెలుగు వుంది. ఈ సారయినా పడను అని ఆలోచించాడు. ఇది మనిషికి సంబంధించిన ముఖ్యమయిన పరిశీలన. అతను తన అనుభవం నించీ నేర్చుకోడు.*

*ఆనంద మార్గంలో వుండడమంటే అనుభవం నించీ నేర్చుకోవడం. చేసిన తప్పుల్నే చెయ్యకపోవడం. అదే ఈర్ష్య, అదే కోపం, అదే అసూయ, అదే అత్యాశ. వాటిని మళ్ళీ మళ్ళీ చేయకు. ఇది మేలుకునే సమయం. పరిశీలనకు, చురుకుదనానికి, పాతమార్గాల్లో పడకుండా చైతన్యంతో వుండడానికి సమయం. నువ్వు పరీశీలనకు, సమర్థుడివి. అన్ని ఆటంకాల్ని, వంచనల్ని అధిగమించడానికి సమర్థుడివి. వాటిని దాటి వచ్చినపుడే నువ్వు ఆనందాన్ని అందుకుంటావు. అప్పుడే ఆకాశం నించీ నీ మీద పూల వర్షం కురుస్తుంది. నీ జీవితం ఆనందమయమైతే ఆ కాంతి యితరుల మీద కూడా ప్రసరిస్తుంది.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శివ సూత్రములు - 058 / Siva Sutras - 058 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
 *✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 18. లోకానన్దః సమాధిసుఖమ్ - 4 🌻*
*🌴. అతని అత్యున్నత ఆధ్యాత్మిక స్థితి (సమాధి) యొక్క ఆనందం మొత్తం విశ్వానికి ఆనందం.🌴*

*భగవద్గీత (6-15) ఈ సూత్రం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. కృష్ణుడు ఇలా అంటాడు, 'స్వయం పాలనలో ఉన్న యోగి (అంటే అతని మనస్సు పూర్తిగా అతని నియంత్రణలో ఉంటుంది) తన ఆత్మను పరమాత్మతో ఐక్యం చేసి, నా అస్తిత్వం యొక్క శాంతిని, అంతిమ నిర్వాణాన్ని పొందుతాడు.' వ్యక్తిగత చైతన్యం, అహంకారాన్ని త్యజించి సర్వతః వ్యాపించి ఉన్న విశ్వ చైతన్యంలో కరిగిపోతుంది. యోగి తాను శివునికి భిన్నంగా లేడని తెలుసుకుని, శివుడిలా నిత్యం ఆనందాన్ని పొందుతాడు. అతడే శివుడు అవుతాడు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras - 058 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 18. lokānandaḥ samādhisukham - 4 🌻*
*🌴. The joy of his mystical trance (samādhi) is bliss for the whole universe.🌴*

*Bhagavad Gita (6-15) explains the significance of this sūtra. Krishna says, “the self-governed yogi (which means his mind is totally under his control) engaging his soul in ceaseless union with Spirit, attains the peace of My being, the final nirvāṇa.” The importance of individual self is dissolved along with the destruction of egotism paving way to the universal consciousness, a state where the individual consciousness pervades everywhere. The yogi perpetually rejoices in bliss, like Śiva, as he knows that he is not different from Śiva. He has become Śiva Himself.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 441 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 441 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 441 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 441 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 94. కుమార గణనాథాంబా, తుష్టిః, పుష్టి, ర్మతి, ర్ధృతిః ।
శాంతిః, స్వస్తిమతీ, కాంతి, ర్నందినీ, విఘ్ననాశినీ ॥ 94 ॥ 🍀

🌻 441. 'తుష్టిః' - 1 🌻


సకల ప్రాణులకు తుష్టి నిచ్చునది శ్రీమాత అని అర్థము. కోరికలు తీరినపుడు ప్రాణులకు తృప్తి కలుగును. సంతోషము కలుగును. తృప్తి, సంతోషము కలిగియున్న జీవుడు నిండుదనముతో ప్రకాశించును. అదియే తుష్టి. దప్పిక కొన్నవారికి నీరు, ఆకలి గొన్న వారికి అన్నము యేర్పరచుచు ప్రాణులను తృప్తి పరచి తుష్టి కలిగించుట, శ్రీమాత కార్యములలో నొకటి. కోరికలను తీర్చునది తల్లియే కదా! శ్రీమాత కొన్ని కోరికలను తీర్చి తృప్తి పరచును. కొన్ని కోర్కెలను తీర్చక శిక్షణ నిచ్చి ఆ కోరికల నుండి ఉత్తీర్ణులను చేయును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 441 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 94. Kumara gananadhanba tushtih pushtirmati dhrutih
Shanti spastimati mantirnandini vignanashini ॥ 94 ॥ 🌻

🌻 441. 'Tushtih' - 1 🌻

It means that Srimata satisfies the thirst to all beings. When the desires are fulfilled, the beings are satisfied. There will be happiness. A contented and happy being shines with fullness. That is Tushti. One of the works of Sri Mata is to provide water for those who are thirsty and food for those who are hungry and satisfy the living beings. It is the mother who fulfills the wishes! Srimata fulfills certain desires and gives satisfaction. She trains the disciple to overcome the rest of the desires.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ మహా పురాణము - 704 / Sri Siva Maha Purana - 704

🌹 . శ్రీ శివ మహా పురాణము - 704 / Sri Siva Maha Purana - 704 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 05 🌴

🌻. త్రిపుర మోహనము - 2 🌻


సౌందర్యలావణ్యములకు నిధానమనదగిన స్త్రీలు వేలాది మంది ఉండవచ్చును. కాని వివాహమాడి గృహస్థ జీవనమునకు అంకితమయ్యేది ఒక స్త్రీతో మాత్రమే గదా! (11). కొన్ని వందల గుర్రములు ఉపలభ్యము గానున్ననూ, అధిరోహించు కాలమునందు ఉపకరించునది ఒక గుర్రమే గాని, రెండు కాదు (12). హంస తూలికాతల్పముపై పరున్న వానికి ఏ నిద్రా సుఖము కలుగునో, భూమిపై శయనించువానికి కూడా అదియే నిద్రాసుఖము లభించును (13). మనవంటి దేహధారులకు ఎట్టి మరణభయము గలదో, అదే మరణ భయము బ్రహ్మ మొదలు కీటకము వరకు గల ప్రాణులన్నింటికీ గలదు (14).

బుద్ధితో విచారణ చేసినచో, దేహధారులందరు సమానమే. ఈ సత్యమును దృఢముగా ఎరింగి ఎవ్వరైననూ ఎక్కడైననూ ఇతర ప్రాణులను హింసించరాదు (15). భూమండలమునందు భూతదయతో సమానమైన ధర్మము ఎచ్చటనూ లేదు. కావున మానవులు సర్వప్రయత్నములను చేసి భూతదయను పాలించవలెను (16). ఒక్క ప్రాణిని రక్షించినచో, ముల్లోకములను రక్షించునట్లు అగును. ఒక్క ప్రాణిని హింసించినచో, ముల్లోకములను హింసించినట్లు అగును. కావున ప్రాణులను రక్షించవలెనే గాని, హింసించరాదు (17). అహింస సర్వోత్తమ మగు ధర్మము. దేహమునకు హింసను కలిగించుట పాపము. పరాధీనుడు కాకుండటయే మోక్షము. కోరిన సుఖముల ననుభవించుటయే స్వర్గము (18).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 704🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 05 🌴

🌻 The Tripuras are fascinated - 2 🌻


11. There may be a thousand damsels of exquisite beauty and comely features. But only one of them can be used at a time for the sexual intercourse.

12. Let there be hundreds of horses, of different varieties. But for the purpose of riding only one can be used on one occasion.

13. The pleasure that one derives in that sleep on a cushioned couch is the same that one derives by sleeping on the bare ground.

14. Just as we, the embodied beings, are afraid of death so also the bodies from Brahmā to the worm are afraid of death.

15. If we analyse with a keen intellect, all the embodied being are equal. After coming to this conclusion it does not behove anyone to injure anyone else.

16. There is no other virtue equal to the mercy shown to living beings. Hence all men shall strenuously practise acts of mercy to living beings.

17. If a single living being is protected it amounts to the protection of the three worlds. If that is killed it amounts to the killing of all others. Hence it is our duty to protect and abstain from killing others.

18. Non-violence is the greatest virtue. Affliction of others is a great sin. Salvation is defined as non-dependence on others. Eating the food of our choice is heavenly bliss.


Continues....

🌹🌹🌹🌹🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 743 / Vishnu Sahasranama Contemplation - 743


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 743 / Vishnu Sahasranama Contemplation - 743🌹

🌻743. శూన్యః, शून्यः, Śūnyaḥ🌻

ఓం శూన్యాయ నమః | ॐ शून्याय नमः | OM Śūnyāya namaḥ


సర్వ విశేష రహితః శూన్యవత్ శూన్య ఉచ్యతే

శూన్యము వంటివాడు. ఏలయన - పరమాత్ముడు సర్వ విశేష రహితుడు. అతనిని గుర్తించుటకు సహకారులగు ఏ విశేషములును లేదా ఇతర వస్తువులనుండి వేరు పరచు భేదక లక్షణములును లేవు. ఇతని కంటె ఇతరులు మరి ఎవ్వరును లేరు కదా!


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 743🌹

🌻743. Śūnyaḥ🌻

OM Śūnyāya namaḥ


सर्व विशेष रहितः शून्यवत् शून्य उच्यते / Sarva viśeṣa rahitaḥ śūnyavat śūnya ucyate

As He is devoid of all qualities, He is Śūnyaḥ, as it were. There are no attributes to uniquely identify Him. There are no qualities that make Him indifferent to any other thing; hence He is Śūnyaḥ.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

सुवर्णवर्णो हेमाङ्गो वरांगश्चन्दनाङ्गदी ।
वीरहा विषमश्शून्यो घृताशीरचलश्चलः ॥ ७९ ॥

సువర్ణవర్ణో హేమాఙ్గో వరాంగశ్చన్దనాఙ్గదీ ।
వీరహా విషమశ్శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ 79 ॥

Suvarṇavarṇo hemāṅgo varāṃgaścandanāṅgadī,
Vīrahā viṣamaśśūnyo ghr‌tāśīracalaścalaḥ ॥ 79 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹


కపిల గీత - 151 / Kapila Gita - 151


🌹. కపిల గీత - 151 / Kapila Gita - 151 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 4. భక్తి యోగ లక్షణములు మరియు సాధనలు - 05 🌴

05. మౌనం సదాసనజయః స్థైర్యం ప్రాణజయః శనైః|
ప్రత్యాహారశ్చేంద్రియాణాం విషయాన్మనసా హృది॥


తాత్పర్యము : మాట్లాడునప్పుడు సంయమనమును కలిగియుండవలెను. పరిశుభ్రమైన ప్రదేశమున స్థిరమైన ఆసనముపై కూర్చుండవలెను. ఆ ఆసనముపై క్రమముగా దర్భలను, జింకచర్మమును, వస్త్రమును ఏర్పరచు కొనవలెను. అది అంత ఎక్కువగా గానీ, తక్కువగాగాని గాక సమస్ఠాయిలో ఉండవలెను. ప్రాణాయామసాధన ద్వారా మెల్ల మెల్లగా శ్వాసను అదుపులో ఉంచుకొనవలెను. చంచలమైస మనస్సును భగవంతునిపై ఏకాగ్ర మొనర్పవలెశు.

వ్యాఖ్య : సాధారణంగా యోగ అభ్యాసాలు మరియు ప్రత్యేకించి హఠ-యోగం స్థిరత్వాన్ని సాధించడానికి సాధనాలు. యోగ సాధన కోసం ముందుగా ఒకరు సరిగ్గా కూర్చోగలగాలి, ఆపై మనస్సు మరియు శ్రద్ధ తగినంత స్థిరంగా ఉంటాయి. క్రమంగా, శ్వాస ప్రసరణను నియంత్రించాలి మరియు అటువంటి నియంత్రణతో అతను ఇంద్రియ వస్తువుల నుండి ఇంద్రియాలను ఉపసంహరించుకోగలడు. పూర్వం శ్లోకంలో బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలని చెప్పబడింది. ఇంద్రియ నియంత్రణలో అత్యంత ముఖ్యమైన అంశం లైంగిక జీవితాన్ని నియంత్రించడం. దానినే బ్రహ్మచర్యం అంటారు. వివిధ కూర్చున్న భంగిమలను అభ్యసించడం ద్వారా మరియు ప్రాణాధారమైన శ్వాసను నియంత్రించడం ద్వారా, ఇంద్రియాలను అనియంత్రిత ఇంద్రియ ఆనందం నుండి నియంత్రించవచ్చు మరియు నిరోధించవచ్చు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 151 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 4. Features of Bhakti Yoga and Practices - 05 🌴

05. maunaṁ sad-āsana-jayaḥ sthairyaṁ prāṇa-jayaḥ śanaiḥ
pratyāhāraś cendriyāṇāṁ viṣayān manasā hṛdi


MEANING : One must observe silence, acquire steadiness by practicing different yogic postures, control the breathing of the vital air, withdraw the senses from sense objects and thus concentrate the mind on the heart.

PURPORT : The yogic practices in general and haṭha-yoga in particular are not ends in themselves; they are means to the end of attaining steadiness. First one must be able to sit properly, and then the mind and attention will become steady enough for practicing yoga. Gradually, one must control the circulation of vital air, and with such control he will be able to withdraw the senses from sense objects. In the previous verse it is stated that one must observe celibacy. The most important aspect of sense control is controlling sex life. That is called brahmacarya. By practicing the different sitting postures and controlling the vital air, one can control and restrain the senses from unrestricted sense enjoyment.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


22 Mar 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 22, మార్చి, March 2023 పంచాగము - Panchagam 🌹

శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday

🍀. 'శ్రీ శోభకృత్‌' ఉగాది, గుడిపౌడ్వ, శ్రీరామ (చైత్ర ) నవరాత్రులు శుభాకాంక్షలు అందరికి , Good Wishes on Sri Shobhakruth Ugadi, Gudi Padwa, Srirama (Chaitra) Navratri to All. 🍀

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌺. పండుగలు మరియు పర్వదినాలు : 'శ్రీ శోభకృత్‌' ఉగాది, గుడిపౌడ్వ, శ్రీరామ (చైత్ర ) నవరాత్రులు, Sri Shobhakruth Ugadi, Gudi Padwa, Srirama (Chaitra) Navratri 🌺

🍀. శ్రీ గణేశ హృదయం - 14 🍀


15. మాతాపితాఽయం జగతాం పరేషాం
తస్యాపి మాతాజనకాదికం న |

శ్రేష్ఠం వదంతి నిగమాః పరేశం
తం జ్యేష్ఠరాజం ప్రణమామి నిత్యమ్

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : అలసట రానివ్వరాదు - చైతన్యాన్ని ఏకత్ర కేంద్రీకృతం చెయ్యడమనే అభ్యాసం ప్రారంభ దశలో దీర్ఘకాలం చెయ్యరాదు. అలా చేస్తే అలసట వలన సాధన నిష్ప్రయోజనమై పోతుంది. అలసట కలిగేటట్లు ఉన్నప్పుడు చైతన్య కేంద్రీకరణాభ్యాసం విరమించి దానికి బదులు మామూలు ధ్యానం చెయ్యవచ్చు. 🍀

🪷 🪷 🪷 🪷 🪷


🌻. 'శోభకృత్‌' నామ సంవత్సరానికి స్వాగతం. భగవంతుడు తన ప్రేమపూర్వక సృష్టిలో ఈ ప్రపంచాన్ని యుగాది నాడు సామరస్యంగా జీవించటానికి సృష్టించాడు. ఈ ఉగాది మీ జీవితానికి శాంతి, శ్రేయస్సు మరియు సమతుల్యతలను తేవాలి ఆకాంక్షిస్తూ, ఈ కొత్త సంవత్సరం ఆనందం, శాంతి, శ్రేయస్సు మరియు సంతృప్తి యొక్క గొప్ప సంవత్సరంగా ఉండనివ్వండి. 🌻

🌹. శ్రీ శోభకృన్నామ సంవత్సర దేవతా ధ్యానమ్ 🌹

సహొజనం శోభకృతం నృణా మిష్టద మాశ్రయే |
శిబికావాహనారూఢం చామర ద్వయ పాణికమ్

🥣. ఉగాది ప్రసాద శ్లోకాలు :

1. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం

2. "త్వామష్ఠ శోక నరా భీష్ట, మధు మాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు"


🌴. ఉగాది విశిష్టత : 🌴

‘‘ఉగము’’ ఆదిగా గలది - ఉగాది. ‘ఉగము’ అంటే జన్మ, ఆయుష్షు, యుగము, అనే అర్థాలున్నాయి. ఉగ్+ఆది ఉగాది. ‘‘ఉక్ ఆదౌయస్వసః ఉగాదిః’’. ‘‘ఉగ్’’ ఆదియుందుగల రోజు - ఉగాది. ‘ఉ’ అంటే శివుడు. ‘ఉ’ ఆదిగా గలది ‘ఉమ’. కనుక ఉగాది అంటే ‘ఉమ’ - ప్రకృతిసుందరి - బ్రహ్మవిద్య - కుండలినీ యోగాశక్తి, చేతనాచేతన జీవరాశికి ప్రతీక. సరైన జీవన విధానానికి ఉపకరించే అసలైన విద్యను నేర్చుకొనటానికి ప్రారంభ దినమే - ఉగాది.

ఉగాది అంటే నూతన సంవత్సర ప్రారంభ దినమ. గత సంవత్సరానికి వీడ్కోలు పలికి, నూతన సంవత్సరాలకి స్వాగతం పలికే రోజు. ఈ సంయోగ వియోగ పరిధి రోజు - ఉగాది. ‘గాది అనే పదం ‘‘యుగాది’’ అనే సంస్కృత పదానికి వికృతి రూపం. కనుక ఉగాది అంటే యుగమునకు ఆది అని అర్థం. పరమాత్మ కాల స్వరూపుడు. యుగ సంవత్సర, ఋతు, మాస, స్వరూపుడని కూడా విష్ణు సహస్ర నామములు తెలియ జేస్తున్నాయి. అహః సంవత్సరో వ్యాళః ఋతు స్సుదర్శనః కాలః, ఉగ్రః సంవత్సరో, దక్షో, వత్సరో వత్రలో వత్సి’ దీనిని బట్టి సంవత్సరాది కూడా యుగాది - ఉగాది అవుతుంది.


🌷🌷🌷🌷🌷




శోభకృత్‌, వసంత ఋతువు,

ఉత్తరాయణం, చైత్ర మాసం

తిథి: శుక్ల పాడ్యమి 20:22:58

వరకు తదుపరి శుక్ల విదియ

నక్షత్రం: ఉత్తరాభద్రపద 15:33:16

వరకు తదుపరి రేవతి

యోగం: శుక్ల 09:17:35 వరకు

తదుపరి బ్రహ్మ

కరణం: కింస్తుఘ్న 09:35:57 వరకు

వర్జ్యం: 02:16:48 - 03:45:16

దుర్ముహూర్తం: 11:58:52 - 12:47:26

రాహు కాలం: 12:23:09 - 13:54:11

గుళిక కాలం: 10:52:07 - 12:23:09

యమ గండం: 07:50:03 - 09:21:05

అభిజిత్ ముహూర్తం: 11:59 - 12:47

అమృత కాలం: 11:07:36 - 12:36:04

సూర్యోదయం: 06:19:00

సూర్యాస్తమయం: 18:27:17

చంద్రోదయం: 06:44:01

చంద్రాస్తమయం: 19:11:21

సూర్య సంచార రాశి: మీనం

చంద్ర సంచార రాశి: మీనం

యోగాలు: లంబ యోగం - చికాకులు,

అపశకునం 15:33:16 వరకు తదుపరి

ఉత్పాద యోగం - కష్టములు,

ద్రవ్య నాశనం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹




'శ్రీ శోభకృత్‌' ఉగాది, గుడిపౌడ్వ, శ్రీరామ (చైత్ర ) నవరాత్రులు శుభాకాంక్షలు - Good Wishes on Sri Shobhakruth Ugadi, Gudi Padwa, Srirama (Chaitra) Navratri


🍀🌹. 'శ్రీ శోభకృత్‌' ఉగాది, గుడిపౌడ్వ, శ్రీరామ (చైత్ర ) నవరాత్రులు శుభాకాంక్షలు అందరికి , Good Wishes on Sri Shobhakruth Ugadi, Gudi Padwa, Srirama (Chaitra) Navratri to All. 🌹🍀


🌹. శ్రీ శోభకృన్నామ సంవత్సర దేవతా ధ్యానమ్ 🌹

సహొజనం శోభకృతం నృణా మిష్టద మాశ్రయే |
శిబికావాహనారూఢం చామర ద్వయ పాణికమ్ ||


🌻. 'శోభకృత్‌' నామ సంవత్సరానికి స్వాగతం. భగవంతుడు తన ప్రేమపూర్వక సృష్టిలో ఈ ప్రపంచాన్ని యుగాది నాడు సామరస్యంగా జీవించటానికి సృష్టించాడు. ఈ ఉగాది మీ జీవితానికి శాంతి, శ్రేయస్సు మరియు సమతుల్యతలను తేవాలి ఆకాంక్షిస్తూ, ఈ కొత్త సంవత్సరం ఆనందం, శాంతి, శ్రేయస్సు మరియు సంతృప్తి యొక్క గొప్ప సంవత్సరంగా ఉండనివ్వండి. 🌻

🌴. ఉగాది విశిష్టత : 🌴

‘‘ఉగము’’ ఆదిగా గలది - ఉగాది. ‘ఉగము’ అంటే జన్మ, ఆయుష్షు, యుగము, అనే అర్థాలున్నాయి. ఉగ్+ఆది ఉగాది. ‘‘ఉక్ ఆదౌయస్వసః ఉగాదిః’’. ‘‘ఉగ్’’ ఆదియుందుగల రోజు - ఉగాది. ‘ఉ’ అంటే శివుడు. ‘ఉ’ ఆదిగా గలది ‘ఉమ’. కనుక ఉగాది అంటే ‘ఉమ’ - ప్రకృతిసుందరి - బ్రహ్మవిద్య - కుండలినీ యోగాశక్తి, చేతనాచేతన జీవరాశికి ప్రతీక. సరైన జీవన విధానానికి ఉపకరించే అసలైన విద్యను నేర్చుకొనటానికి ప్రారంభ దినమే - ఉగాది.

ఉగాది అంటే నూతన సంవత్సర ప్రారంభ దినమ. గత సంవత్సరానికి వీడ్కోలు పలికి, నూతన సంవత్సరాలకి స్వాగతం పలికే రోజు. ఈ సంయోగ వియోగ పరిధి రోజు - ఉగాది. ‘గాది అనే పదం ‘‘యుగాది’’ అనే సంస్కృత పదానికి వికృతి రూపం. కనుక ఉగాది అంటే యుగమునకు ఆది అని అర్థం. పరమాత్మ కాల స్వరూపుడు. యుగ సంవత్సర, ఋతు, మాస, స్వరూపుడని కూడా విష్ణు సహస్ర నామములు తెలియ జేస్తున్నాయి. అహః సంవత్సరో వ్యాళః ఋతు స్సుదర్శనః కాలః, ఉగ్రః సంవత్సరో, దక్షో, వత్సరో వత్రలో వత్సి’ దీనిని బట్టి సంవత్సరాది కూడా యుగాది - ఉగాది అవుతుంది.

🪷. ఉగస్య ఆది ఉగాది : 🪷

ఉగమంతా, నక్షత్ర గమనం. నక్షత్రముల నడవడిక ఆరంభమైన కాలమే అనగా సృష్టి మొదలైన కాలము యొక్క ఆది - ఉగాది. వేదములను తస్కరించిన సోమకాసురుని చెంత నుడి వేదాలను గైకొని చతుర్ముఖునికి అందజేసిన శ్రీహరి మత్స్యావతారాన్ని దాల్చిన రోజు, చైత్ర శుద్ధ పాడ్యమి, ఉగాది రోజు అని, పురాణములు పేర్కొన్నాయి.

🪷. ఉగాది నాడు పాటించే ప్రధానాంశములు 🪷

ఉగాది పండుగ నాడు ప్రధానంగా ఆచరించే విషయములు: అభ్యంగన స్నానము, ఇష్ట దేవతారాధన, సంవత్సర దేవతారాధన, భగవంతునికి నివేదించిన షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి సేవనం, పంచాంగ శ్రవణం.

🪷. పంచాంగ శ్రవణం - చేకూరు లాభములు🪷

తిథి వార నక్షత్రయోగ కరణములతో కూడినది - పంచాంగం.

‘‘తిథేశ్చ, శ్రీయమాప్నోతి వారాదాయుష్య వర్థనమ్

నక్షత్రాత్థరతాపాపం, యోగార్రోగ నివారణమ్

కరణాత్కార్య సిద్ధిస్తు పంచాంగం ఫలముత్తమమ్

కాల విత్కర్మ కృద్దీమాన్ దేవతానుగ్రహం లభౌత్’’

తిథి వలన సంపద, వారము వలన ఆయుష్షు, నక్షత్రము వలన పాపపరిహారం, యోగము వలన వ్యాధి నివారణం, కరణము వలన కార్యానుకూలత, పంచాంగ శ్రవణము వలన నవగ్రహముల ధ్యానము వలన కలిగే శుభ ఫలితాలు కలుగుతాయి.


🪷 🍯🥭🥣. ఉగాది పచ్చడి 🪷🍯🥭🥣

ఇది షడ్రుచులతో కూడిన భక్షణం. వేపపువ్వు (చేదు), మామిడి పిందె (వగరు), క్రొత్త చింతపండు (పులుపు), మిరియాల పొడి (కారం) ఇప్పుడు పచ్చి మిర్చి ముక్కలు వేస్తున్నారు. కొద్దిగా సైంధవ లవణం (ఉప్పు). మానవజీవిత వైవిధ్యం అంతా, ఉగాది పచ్చడిలో ప్రతిబింబిస్తుంది. జీవితంలో అంతా మాధుర్యము- సుఖమే ఉండదు. చేదు, పులుపు, వగరు లాంటి కష్టనష్టములతో, ఒడుదుడుకులతో కూడికొని ఉంటుంది. ఉప్పు ఉంటుంది, బెల్లము ఉంటుంది. జీవితంలోనూ సుఖదుఃఖాలుంటాయి. అన్నింటినీ సమచిత్తంతో స్వీకరించే ఆత్మస్థైర్యం ఉండాలన్నది, ఉగాది పచ్చడి మనకిచ్చే సందేశం.


🥣. ఉగాది ప్రసాద శ్లోకాలు :

1. శతాయు వజ్రదేహాయ సర్వసంపత్ కరాయచ

సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం


2. "త్వామష్ఠ శోక నరా భీష్ట, మధు మాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు"

ఉగాదినాడు ఈ శ్లోకములను చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి.

🌹 🌹 🌹 🌹 🌹