గీతోపనిషత్తు -189

🌹. గీతోపనిషత్తు -189 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 30

🍀 30. వాసుదేవోపాసన - సమస్త భూతముల యందును ఎవడు నన్ను చూచునో, అట్లే సమస్త భూతములను నా యందు చూచునో అట్టి వానికి నేను కనబడకపోను. అట్టివాడు నాకు కనబడకపోడు. ఇది శ్రీకృష్ణుని యొక్క అంతర్వాణి స్వరూపము. కృష్ణుడు తనను అన్నిట దర్శించును. అన్నిటిని తన యందు కూడ దర్శించును. అతడు విశ్వాత్మ. విశ్వరూపుడు. సమస్తము నందు వసించి యుండువాడు. సమస్తము అతనియందే వసించి యున్నది కనుక వాసుదేవుడు. వాసుదేవోపాసన మనగ ఇదియే సమస్తము నందును, తనయందును నిత్యము దైవమును దర్శించువాడు వాసుదేవోపాసకుడు. 🍀

యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి |
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి || 30

సమస్త భూతముల యందును ఎవడు నన్ను చూచునో, అట్లే సమస్త భూతములను నా యందు చూచునో అట్టి వానికి నేను కనబడకపోను. అట్టివాడు నాకు కనబడకపోడు. ఇది శ్రీకృష్ణుని యొక్క అంతర్వాణి స్వరూపము. కృష్ణుడు తనను అన్నిట దర్శించును. అన్నిటిని తన యందు కూడ దర్శించును. అతడు విశ్వాత్మ. విశ్వరూపుడు. సమస్తము నందు వసించి యుండువాడు. సమస్తము అతనియందే వసించి యున్నది కనుక వాసుదేవుడు.

వాసుదేవోపాసన మనగ ఇదియే సమస్తము నందును, తనయందును నిత్యము దైవమును దర్శించువాడు వాసుదేవోపాసకుడు. దినచర్యలో తనకు గోచరించు సమస్త జీవులయందును, వస్తువుల యందును, ప్రకృతి యందును దైవమును దర్శించుట నిజమగు సాధన. ఇట్టి సాధన చేయువారికి దినచర్యయే యోగ సాధనగ సాగును. యోగజీవనము అలవడును. ఇట్టివారు ప్రత్యేక ముగ క్రతువులు, ఆరాధనలు, అభిషేకములు, హోమములు చేయు అగత్యము లేదు. చేయుట వారి ముచ్చట.

యోగసాధనము వేరుగను, యోగజీవనము వేరుగను భావించువారు అజ్ఞానమున పడినవారు. యోగసాధన పేరిట వారు మోహము చెంది మాయలో పడుదురు. అట్లే భక్తులు, జ్ఞానులు కూడ. అన్నిట, అంతట దైవమే నిండియున్నపుడు చూచుట దైవమును చూచుటగనే యుండవలెను. వినుట దైవమును వినుటగనే యుండవలెను. సంభాషించుట దైవముతో సంభాషించుటగ యుండవలెను. సేవ చేయుట దైవమునకే అని తెలిసి చేయ వలెను.

తనకు సేవచేయువారి రూపములో కూడ దైవమే యున్నా డని తెలియవలెను. తన లోపల బయట కూడ ఉన్నది దైవమే అయినపుడు, దానిని చూచునపుడు అది తనను చూచును. దానిని వినుచుండు నపుడు అది తనను వినును. తాను సేవించునపుడు, తనను కూడ సేవించును. ఈ విషయమున ఎట్టి సందేహము అవసరము లేదు. ఇది ముమ్మాటికిని సత్యము.

అర్జునునికి బోధ చేయు సమయమున కృష్ణుడు, తాను అంతర్యామిగ బోధించెనే గాని ఒక వ్యక్తిగ బోధించలేదు. ఇది సాధనల కన్నిటి కన్నను ఉత్తమమైన సాధన. జీవితమందు మిళితమైన సాధన. ఈ నిత్య జీవన సాధన నిత్యయోగ జీవనమై నిలచును. ఇట్టి వానికి దైవముతో అవినాభావ సంబంధ మేర్పడును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

22 Apr 2021

శ్రీ లలితా సహస్ర నామములు - 66 / Sri Lalita Sahasranamavali - Meaning - 66

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 66 / Sri Lalita Sahasranamavali - Meaning - 66 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀. 66. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః ।
సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్ ॥ 66 ॥ 🍀

🍀 281. ఉన్మేషనిమిషోత్పన్న విపన్నభువనావళి -
తెరువబడుటతోను, మూయబడుటతోను పుట్టిన లీనమైన చతుర్దశ భువనములు కలది.

🍀 282. సహస్రశీర్షవదనా -
వెయ్యి లేదా అనంతమైన శిరస్సులతో, ముఖములు కలది.

🍀 283. సహస్రాక్షీ -
వెయ్యి లేదా అనంతమైన కన్నులు కలది.

🍀 284. సహస్రపాత్ - 
అనంతమైన పాదములు కలది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 66 🌹

📚. Prasad Bharadwaj

🌻 66. unmeṣa-nimiṣotpanna-vipanna-bhuvanāvalī |
sahasra-śīrṣavadanā sahasrākṣī sahasrapāt || 66 || 🌻

🌻 281 ) Unmesha nimishotpanna vipanna bhuvanavali -
She who creates and destroys the universe by opening and closing of her eye lids

🌻 282 ) Sahasra seersha vadana -
She who has thousands of faces and heads

🌻 283 ) Saharakshi -
She who has thousands of eyes

🌻 284 ) Sahasra path -
She who has thousands of feet

Continues..

🌹 🌹 🌹 🌹 🌹

22 Apr 2021

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 211

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 211 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుడు - 1 🌻

భగవంతుడు

774.

1. "భగవంతుడు అనిర్వాచ్యుడు (ఇట్టివాడిని చెప్పశక్యము కానివాడు)

2. భగవంతుడు నిర్వివాదాంశుడు (వాదోప వాదములచే తెలియబడువాడుకాడు)

3. భగవంతుడు సిద్ధాంతీకరింప బడడు.

4. భగవంతుడు చర్చల వలన తెలియబడడు.

5. భగవంతుడు అగ్రాహ్యుడు (బౌద్ధిక ప్రజ్ఞచే అవగాహనము కానివాడు)

6. భగవంతుడు ప్రేమద్వారా మన అహంభావములను వానిలో కోల్పోవుట వలన బ్రతుకులో మాత్రము అనుభవనీయుడు".

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

22 Apr 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 17

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 17 🌹

✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : పవన్

📚. ప్రసాద్ భరద్వాజ

🌸. పరమార్థ సాధన 🌸

పరమార్థ సాధనకు ఏకాంతవాసం అవసరం అని చెప్పటంలో, పరమార్థ సాధకులతోనే‌ కలిసి ఉండాలి, విషయ లంపటులతో కలిసి ఉండరాదు అనే‌‌ భావం.

బొత్తిగా ఎవరూ లేనిచోట కూర్చున్నప్పుడు మనస్సులో అనేక పిచ్చి ఆలోచనలు బయలుదేరతాయి. ఆ సమయంలో‌ అక్కడికి ఒక పరమార్థ సాధకుడు వస్తే ఆ అలోచనలు తిరిగి వెళ్ళిపోతాయి.

మన మనస్సునకు సిగ్గు కూడా తోస్తుంది. కాబట్టి అవకాశం కలిగించుకుని అయినా సరే, పరమార్థ సాధకులతోనే సర్వదా కలిసి ఉండాలి సాధకుడు.

🌹 🌹 🌹 🌹 🌹

22 Apr 2021

శ్రీ శివ మహా పురాణము - 389

🌹 . శ్రీ శివ మహా పురాణము - 389 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 16

🌻. బ్రహ్మ దేవతల నోదార్చుట - 3 🌻

ఆ హిమవత్పుత్రిక ఇప్పుడు పూర్ణ¸°వనమై ఉన్నది. హిమవత్పర్వముపై తపస్సును చేయుచున్న శివుని ఆమె ప్రతి దినము చక్కగా సేవించుచున్నది(32). శివపత్నియగు ఆ కాళి హిమవంతుని మాటను బట్టి, మరియు తన పట్టుదలవలన, ధ్యానమునందున్న పరమేశ్వరుని ఇద్దరు సఖురాండ్రతో గూడి సేవించుచున్నది.(33) ముల్లోకములలో సుందరియగు ఆమె తన ఎదుట సేవను చేయుచున్ననూ, ధ్యానమగ్నుడగు మహేశ్వరుడు ఆమెను మనస్సులోనైననూ కోరుకొనలేదు(34) ఓ దేవతలారా! ఆ చంద్రశేఖరుడు తొందరలోనే ఆ కాళిని భార్యను చేసుకొని కోరికను పొందునట్లు మీరు దృఢమగు యత్నమును చేయుడు(35)

తరువాత నేను ఆ తారకుని స్థానమునకు వెళ్లి అతనిని తన చెడు పట్టుదలనుండి నివారించగలను. ఓ దేవతలారా! మీ స్థానమునకు వెళ్లుడు (36). నేను దేవతలతో నిట్లు పలికి. వెంటనే తారకాసురిని వద్దకు వెళ్లి, మిక్కిలి ప్రీతితో పిలిచి, ఇట్లు చెప్పితిని (37) ఈ స్వర్గము తేజస్సు యొక్క సారము. నీవు మా రాజ్యమును పాలించుచున్నావు. నీవు దేవిని కోరి గొప్ప తపస్సును చేసితివో, అంతకు మించి ఇప్పుడు కోరుచుంటివి.(38) నేను నీకు ఇచ్చిన వరము ఇంతకంటె తక్కువది. నేను స్వర్గ రాజ్యవరమును నీకీయలేదు. కావున నీవు స్వర్గమును విడిచిపెట్టి, భూమిపై రాజ్యము నేలుము (39).

ఓ రాక్షసశ్రేష్ఠా! స్వర్గమునకు ఉచితమగు భోగములన్నియూ అచట కూడ ఉండగలవు. నీవీ విషయములో చింతిల్లకుము (40). నేను ఇట్లు పలికి ఆ రాక్షసుని ఒప్పించితిని. సర్వేశ్వరుడనగు నేను ఉమా పరమేశ్వరులను స్మరించి, అచటనే అంతర్ధానమైతిని (41). తారకుడు కూడా స్వర్గమును వీడి భూలోకమునకు వెళ్లి, శోణితనగరమునందున్నవాడై ముల్లోకముల నేలెను (42). నా ఈ మాటను విని దేవతలందరు నాకు ప్రణమిల్లి ఇంద్రునితో గూడి ప్రేమపూర్వకముగా స్వర్గమునకు వెళ్లిరి (43). అచటకు వెళ్లి ఆ దేవతలందరు తమలో తాము చర్చించుకొని ప్రేమ పూర్వకముగా ఇంద్రునితో నిట్లనిరి (44).

దేవతలిట్లు పలికిరి-

ఓ ఇంద్రా! కాముని ప్రభావముచే శంభునకు శివాదేవి యందు అనురాగము కల్గునట్లు నీవు ప్రయత్నించవలెను. ఈ విషయమునంతనూ బ్రహ్మగారు చెప్పియున్నారు గదా! (45)

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ దేవతలు ఈ తీరున దేవరాజునకు వృత్తాంతమునంతనూ నివేదించి, ఆనందముతో గూడిన వారై తమ తమ స్థానములకు వెళ్లిరి (46).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత యందు పార్వతీ ఖండములో దేవతల నోదార్చుట అనే పదునారవ అధ్యాయము ముగిసినది (16).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

22 Apr 2021

22-APRIL-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 189🌹  
2) 🌹. శివ మహా పురాణము - 389🌹 
3) 🌹 Light On The Path - 138🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -17🌹  
5) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 211🌹
6) 🌹 Osho Daily Meditations - 6 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 66 / Lalitha Sahasra Namavali - 66🌹 
8) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 66 / Sri Vishnu Sahasranama - 66🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -189 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 30

*🍀 30. వాసుదేవోపాసన - సమస్త భూతముల యందును ఎవడు నన్ను చూచునో, అట్లే సమస్త భూతములను నా యందు చూచునో అట్టి వానికి నేను కనబడకపోను. అట్టివాడు నాకు కనబడకపోడు. ఇది శ్రీకృష్ణుని యొక్క అంతర్వాణి స్వరూపము. కృష్ణుడు తనను అన్నిట దర్శించును. అన్నిటిని తన యందు కూడ దర్శించును. అతడు విశ్వాత్మ. విశ్వరూపుడు. సమస్తము నందు వసించి యుండువాడు. సమస్తము అతనియందే వసించి యున్నది కనుక వాసుదేవుడు. వాసుదేవోపాసన మనగ ఇదియే సమస్తము నందును, తనయందును నిత్యము దైవమును దర్శించువాడు వాసుదేవోపాసకుడు. 🍀*

యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి |
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి || 30

సమస్త భూతముల యందును ఎవడు నన్ను చూచునో, అట్లే సమస్త భూతములను నా యందు చూచునో అట్టి వానికి నేను కనబడకపోను. అట్టివాడు నాకు కనబడకపోడు. ఇది శ్రీకృష్ణుని యొక్క అంతర్వాణి స్వరూపము. కృష్ణుడు తనను అన్నిట దర్శించును. అన్నిటిని తన యందు కూడ దర్శించును. అతడు విశ్వాత్మ. విశ్వరూపుడు. సమస్తము నందు వసించి యుండువాడు. సమస్తము అతనియందే వసించి యున్నది కనుక వాసుదేవుడు.

వాసుదేవోపాసన మనగ ఇదియే సమస్తము నందును, తనయందును నిత్యము దైవమును దర్శించువాడు వాసుదేవోపాసకుడు. దినచర్యలో తనకు గోచరించు సమస్త జీవులయందును, వస్తువుల యందును, ప్రకృతి యందును దైవమును దర్శించుట నిజమగు సాధన. ఇట్టి సాధన చేయువారికి దినచర్యయే యోగ సాధనగ సాగును. యోగజీవనము అలవడును. ఇట్టివారు ప్రత్యేక ముగ క్రతువులు, ఆరాధనలు, అభిషేకములు, హోమములు చేయు అగత్యము లేదు. చేయుట వారి ముచ్చట. 

యోగసాధనము వేరుగను, యోగజీవనము వేరుగను భావించువారు అజ్ఞానమున పడినవారు. యోగసాధన పేరిట వారు మోహము చెంది మాయలో పడుదురు. అట్లే భక్తులు, జ్ఞానులు కూడ. అన్నిట, అంతట దైవమే నిండియున్నపుడు చూచుట దైవమును చూచుటగనే యుండవలెను. వినుట దైవమును వినుటగనే యుండవలెను. సంభాషించుట దైవముతో సంభాషించుటగ యుండవలెను. సేవ చేయుట దైవమునకే అని తెలిసి చేయ వలెను. 

తనకు సేవచేయువారి రూపములో కూడ దైవమే యున్నా డని తెలియవలెను. తన లోపల బయట కూడ ఉన్నది దైవమే అయినపుడు, దానిని చూచునపుడు అది తనను చూచును. దానిని వినుచుండు నపుడు అది తనను వినును. తాను సేవించునపుడు, తనను కూడ సేవించును. ఈ విషయమున ఎట్టి సందేహము అవసరము లేదు. ఇది ముమ్మాటికిని సత్యము.

అర్జునునికి బోధ చేయు సమయమున కృష్ణుడు, తాను అంతర్యామిగ బోధించెనే గాని ఒక వ్యక్తిగ బోధించలేదు. ఇది సాధనల కన్నిటి కన్నను ఉత్తమమైన సాధన. జీవితమందు మిళితమైన సాధన. ఈ నిత్య జీవన సాధన నిత్యయోగ జీవనమై నిలచును. ఇట్టి వానికి దైవముతో అవినాభావ సంబంధ మేర్పడును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 389🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 16

*🌻. బ్రహ్మ దేవతల నోదార్చుట - 3 🌻*

ఆ హిమవత్పుత్రిక ఇప్పుడు పూర్ణ¸°వనమై ఉన్నది. హిమవత్పర్వముపై తపస్సును చేయుచున్న శివుని ఆమె ప్రతి దినము చక్కగా సేవించుచున్నది(32). శివపత్నియగు ఆ కాళి హిమవంతుని మాటను బట్టి, మరియు తన పట్టుదలవలన, ధ్యానమునందున్న పరమేశ్వరుని ఇద్దరు సఖురాండ్రతో గూడి సేవించుచున్నది.(33) ముల్లోకములలో సుందరియగు ఆమె తన ఎదుట సేవను చేయుచున్ననూ, ధ్యానమగ్నుడగు మహేశ్వరుడు ఆమెను మనస్సులోనైననూ కోరుకొనలేదు(34) ఓ దేవతలారా! ఆ చంద్రశేఖరుడు తొందరలోనే ఆ కాళిని భార్యను చేసుకొని కోరికను పొందునట్లు మీరు దృఢమగు యత్నమును చేయుడు(35)

తరువాత నేను ఆ తారకుని స్థానమునకు వెళ్లి అతనిని తన చెడు పట్టుదలనుండి నివారించగలను. ఓ దేవతలారా! మీ స్థానమునకు వెళ్లుడు (36). నేను దేవతలతో నిట్లు పలికి. వెంటనే తారకాసురిని వద్దకు వెళ్లి, మిక్కిలి ప్రీతితో పిలిచి, ఇట్లు చెప్పితిని (37) ఈ స్వర్గము తేజస్సు యొక్క సారము. నీవు మా రాజ్యమును పాలించుచున్నావు. నీవు దేవిని కోరి గొప్ప తపస్సును చేసితివో, అంతకు మించి ఇప్పుడు కోరుచుంటివి.(38) నేను నీకు ఇచ్చిన వరము ఇంతకంటె తక్కువది. నేను స్వర్గ రాజ్యవరమును నీకీయలేదు. కావున నీవు స్వర్గమును విడిచిపెట్టి, భూమిపై రాజ్యము నేలుము (39).

ఓ రాక్షసశ్రేష్ఠా! స్వర్గమునకు ఉచితమగు భోగములన్నియూ అచట కూడ ఉండగలవు. నీవీ విషయములో చింతిల్లకుము (40). నేను ఇట్లు పలికి ఆ రాక్షసుని ఒప్పించితిని. సర్వేశ్వరుడనగు నేను ఉమా పరమేశ్వరులను స్మరించి, అచటనే అంతర్ధానమైతిని (41). తారకుడు కూడా స్వర్గమును వీడి భూలోకమునకు వెళ్లి, శోణితనగరమునందున్నవాడై ముల్లోకముల నేలెను (42). నా ఈ మాటను విని దేవతలందరు నాకు ప్రణమిల్లి ఇంద్రునితో గూడి ప్రేమపూర్వకముగా స్వర్గమునకు వెళ్లిరి (43). అచటకు వెళ్లి ఆ దేవతలందరు తమలో తాము చర్చించుకొని ప్రేమ పూర్వకముగా ఇంద్రునితో నిట్లనిరి (44).

  దేవతలిట్లు పలికిరి-

ఓ ఇంద్రా! కాముని ప్రభావముచే శంభునకు శివాదేవి యందు అనురాగము కల్గునట్లు నీవు ప్రయత్నించవలెను. ఈ విషయమునంతనూ బ్రహ్మగారు చెప్పియున్నారు గదా! (45)

  బ్రహ్మ ఇట్లు పలికెను-

ఆ దేవతలు ఈ తీరున దేవరాజునకు వృత్తాంతమునంతనూ నివేదించి, ఆనందముతో గూడిన వారై తమ తమ స్థానములకు వెళ్లిరి (46).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత యందు పార్వతీ ఖండములో దేవతల నోదార్చుట అనే పదునారవ అధ్యాయము ముగిసినది (16).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 LIGHT ON THE PATH - 138 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 11
*🌻 21. Look for the flower to bloom in the silence that follows the storm: not till then - 3 🌻*

520. Indeed, when we have had this direct experience we find it very difficult to think ourselves back into the condition m which we were before. It changes our whole attitude towards everything in the world. Happenings which seemed of great importance before are seen to be of much less significance; now that we know the great inner truth of the life which really matters, the outer life which does not matter takes its proper place. 

Yet we have to remember that most people whom we meet are still where we were before we had that expansion of consciousness, and it is sometimes a little difficult not to lack sympathy with them, because they are pursuing will-o’-the-wisps. We forget that until yesterday we were doing the same thing.

 *521. The silence may last a moment of time or it may last a thousand years. But it will end. Yet you will carry its strength with you. Again and again the battle must be fought and won. It is only for an interval that nature can be still.*

522. The actual moment of complete unfoldment may take place at any point of a man’s career; that is to say, when the time comes for the soul to unfold it can do so whether it has a physical body or not at the time; the silence would last only a moment, or only a very short time, here on the physical plane, but it might well last a thousand years if the man were in the heaven-world. It will come at some time to all, and once attained it can never be lost. 

Yet it is only for a moment that-nature can be still, because evolution is steadily going on, and to stand still is not to evolve. It has been said that in occultism no man stands still, that he is always either retrograding or advancing. I do not know whether that is actually so, but it is quite certain that if he is not advancing he should examine himself, and try to find out why. There ought to be steady and continuous progress.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 17 🌹*
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనం : పవన్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌸. పరమార్థ సాధన 🌸*

 పరమార్థ సాధనకు ఏకాంతవాసం అవసరం అని చెప్పటంలో, పరమార్థ సాధకులతోనే‌ కలిసి ఉండాలి, విషయ లంపటులతో కలిసి ఉండరాదు అనే‌‌ భావం. 

బొత్తిగా ఎవరూ లేనిచోట కూర్చున్నప్పుడు మనస్సులో అనేక పిచ్చి ఆలోచనలు బయలుదేరతాయి. ఆ సమయంలో‌ అక్కడికి ఒక పరమార్థ సాధకుడు వస్తే ఆ అలోచనలు తిరిగి వెళ్ళిపోతాయి. 

మన మనస్సునకు సిగ్గు కూడా తోస్తుంది. కాబట్టి అవకాశం కలిగించుకుని అయినా సరే, పరమార్థ సాధకులతోనే సర్వదా కలిసి ఉండాలి సాధకుడు.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్‌ఇకెసందేశములు 
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 6 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 GRATITUDE 🍀*

*🕉 Feel as grateful to existence as possible-jar small things, not only for great things ... just for sheer breathing. We don't have any claim on existence, so whatever is given is a gift. 🕉*

Grow more and more in gratitude and thankfulness; let it become your very style. Be grateful to everybody. If one understands gratitude, then one is grateful for things that have been done positively. And one even feels grateful for things that could have been done but were not done. 

You feel grateful that somebody helped you-this is just the beginning. Then you start feeling grateful that somebody has not harmed you-he could have; it was kind of him not to.

Once you understand the feeling of gratitude and allow it to sink deeply within you, you will start feeling grateful for everything. And the more grateful you are, the less complaining, grumbling. 

Once complaining disappears, misery disappears. It exists with complaints.
It is hooked with complaints and with the complaining mind. Misery is impossible with gratefulness. This is one of the most important secrets to learn.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 211 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుడు - 1 🌻*

భగవంతుడు

774. 
1. "భగవంతుడు అనిర్వాచ్యుడు (ఇట్టివాడిని చెప్పశక్యము కానివాడు)  

2. భగవంతుడు నిర్వివాదాంశుడు (వాదోప వాదములచే తెలియబడువాడుకాడు)

3. భగవంతుడు సిద్ధాంతీకరింప బడడు.

4. భగవంతుడు చర్చల వలన తెలియబడడు.

5. భగవంతుడు అగ్రాహ్యుడు (బౌద్ధిక ప్రజ్ఞచే అవగాహనము కానివాడు)

6. భగవంతుడు ప్రేమద్వారా మన అహంభావములను వానిలో కోల్పోవుట వలన బ్రతుకులో మాత్రము అనుభవనీయుడు".

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
Join and share
🌹 Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా 🌹
www.facebook.com/groups/avataarmeherbaba/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 66 / Sri Lalita Sahasranamavali - Meaning - 66 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. 66. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః ।*
*సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్ ॥ 66 ॥ 🍀

🍀 281. ఉన్మేషనిమిషోత్పన్న విపన్నభువనావళి - 
తెరువబడుటతోను, మూయబడుటతోను పుట్టిన లీనమైన చతుర్దశ భువనములు కలది.

🍀 282. సహస్రశీర్షవదనా - 
వెయ్యి లేదా అనంతమైన శిరస్సులతో, ముఖములు కలది.

🍀 283. సహస్రాక్షీ - 
వెయ్యి లేదా అనంతమైన కన్నులు కలది.

🍀 284. సహస్రపాత్ - అనంతమైన పాదములు కలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 66 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 66. unmeṣa-nimiṣotpanna-vipanna-bhuvanāvalī |*
*sahasra-śīrṣavadanā sahasrākṣī sahasrapāt || 66 || 🌻*

🌻 281 ) Unmesha nimishotpanna vipanna bhuvanavali -   
She who creates and destroys the universe by opening and closing of her eye lids

🌻 282 ) Sahasra seersha vadana -   
She who has thousands of faces and heads

🌻 283 ) Saharakshi -   
She who has thousands of eyes

🌻 284 ) Sahasra path -   
She who has thousands of feet

Continues..
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 66 / Sri Vishnu Sahasra Namavali - 66 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌷. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌷*

*అనూరాధ నక్షత్ర ద్వితీయ పాద శ్లోకం*

*🌻 66. స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః |*
*విజితాత్మాఽవిధేయాత్మా సత్కీర్తిచ్ఛిన్నసంశయః ‖ 66 ‖ 🌻*

🍀 615) స్వక్ష: - 
చక్కని కన్నులు కలవాడు.

🍀 616) స్వంగ: - 
చక్కని అంగములు కలవాడు.

🍀 617) శతానంద: - 
అసంఖ్యాకమైన ఉపాధుల ద్వారా ఆనందించువాడు.

🍀 618) నంది: - 
పరమానంద స్వరూపుడు.

🍀 619) జ్యోతిర్గణేశ్వర: - 
జ్యోతిర్గణములకు ప్రభువు.

🍀 620) విజితాత్మ - 
మనస్సును జయించువాడు.

🍀 621) విధేయాత్మా - 
సదా భక్తులకు విధేయుడు.

🍀 622) సత్కీర్తి: - 
సత్యమైన యశస్సు గలవాడు.

🍀 623) ఛిన్నసంశయ: - 
సంశయములు లేనివాడు.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 66 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌷 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌷*

*Sloka for Anuradha 2nd Padam*

*🌻 66. svakṣaḥ svaṅgaḥ śatānaṅdō naṅdirjyōtirgaṇeśvaraḥ |
vijitātmā vidheyātmā satkīrtiśchinnasaṁśayaḥ || 66 || 🌻*

🌻 615. Svakṣaḥ: 
One who's Akshas (eyes) are handsome like lotus flowers.

🌻 616. Svaṅgaḥ: 
One whose limbs are beautiful.

🌻 617. Śatānandaḥ: 
One who is non-dual and is of the nature of supreme bliss.

🌻 618. Nandiḥ: 
One who is of the nature of supreme Bliss.

🌻 619. Jyōtir-gaṇeśvaraḥ: One who is the Lord of the stars, that is, Jyotirgana.

🌻 620. Vijitātmā:  
One who has conquered the Atma that is the mind.

🌻 621. Vidheyātmā: 
One whose form or nature cannot be determined as 'only this'.

🌻 622. Satkīrtiḥ: One whose fame is of the nature of truth.

🌻 623. Chinna-saṁśayaḥ: 
One who has no doubts, as everything is clear to him like a fruit in the palm.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹