Showing posts with label భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం. Show all posts
Showing posts with label భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం. Show all posts

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 252


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 252 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కాశ్యప మహర్షి - 3 🌻

చివరిభాగము


17. ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణకు తన పళ్ళమీద దృష్టి ఉంటే, పళ్ళను గురించే ఆలోచిస్తుంది మనసు. “నా పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, వంకరగా ఉన్నాయి” అని అలోచిస్తుంది. మంచిది అలాగే ఉండనియ్యి. ఆ విధంగా మనస్సును నిగ్రహించిన తరువాత, ఇక యోగికి దాని పీడ తొలగిపోతుంది! ఈ మనస్సనేది అతడిని బాధించకుండా వదిలేసింది కాబట్టి, అప్పుడు యోగంలోకి వెళ్ళ గలుగుతాడు అతదు.

18. అది కోరిన పని తీర్చనంతసేపు, అతడు యోగంలో ఉండడు. ఏమీ చెయ్యలేడు. దానిని నిగ్రహించే విధానం, దానికి సాధ్యం కానిపని అప్పగించటమే! అసాధ్యమైన పని, దుస్సాధ్యమైన పని అప్పజెప్పాలి.

18. మనస్సు నశించిన వెనుక, యోగి బ్రహ్మోన్ముఖుడైపోతాడు. బ్రహ్మవైపు, నిర్గుణమైన బ్రహ్మవస్తువును తాను చేరటం మొదలుపెడతాడు. ఈ మనస్సనేది దానియొక్క చప్పుడు, అల్లరి. అది ఉడిగిపోయిన తరువాత, బ్రహ్మదర్శనం కోసమని వెళతాదు.

19. అనాది అయిన బ్రహ్మము పంచేంద్రియాలకు గ్రాహ్యంకాదు. అది పంచేంద్రియాలకు, వానితోకలిసిన మనోవృత్తికి తెలియదు. కాబట్టి అన్నిటినుంచి మనసు తొలగిపోయి, మనస్సు నశించాక, ఉజ్జ్వలమైన బ్రహ్మవస్తువు అంతటా కూడా కనబడుతుంది.

20. దాంట్లో వెలుగుతున్న తేజస్సులో తాను, తన లోకము, తన బంధువులు, తన ప్రపంచమున చెట్టు, పుట్టలు, ఇంద్రియాలు, తన పూర్వాపరములు, భూత వర్తమాన భవిష్యత్తులు అన్ని కూడా ఆ తేజస్సులో కనబడతాయి. తన లోపల తేజస్సును వెతుక్కుంటాయి, దాంట్లోనూ కనబడతాయి.

21. చివరకు అవి ఏవీ కూడా కనబడవు. కేవలం అదే కనబడుతుంది, అనంతమైన సత్యము. అది కామక్రోధలోభాలకు అతీతంగా ఉంటుంది అది అని చెప్పి, దానిని – ఆ వెలుగును – చూసినవాడే బ్రహ్మవేత్త అని అంటారు, అని చెప్పి కాశ్యపుడికి బ్రహ్మవిద్యా రహస్యం, యోగవిద్యా విధానమంతా ఆ సిద్ధుడు బోధించాడు.

సమాప్తం .... 🙏. శ్రీ శివానంద సద్గురవే నమః

🌹 🌹 🌹 🌹 🌹

18 Mar 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 251


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 251 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కాశ్యప మహర్షి - 2 🌻


9. ఈ విషయం చాలా చమత్కారంగా ఉంది. మనసును శంకించటం ఎలాగ అంటారు. ఉదాహరణకు ఒక బ్రహ్మరాక్షసుడున్నాడు. వాడు ఒకడిని పట్టుకున్నడనుకోండి. అలా పట్టుకుని అతడి వశంలో ఉండి, ఘడియ ఘడియకూ తనకు ఏదయినా పని చెప్పమని, “నీవు నాకు చేతినిండా పనిచెప్పు, అట్లాగైతే నేను నిన్ను సేవిస్తూ ఉంటాను.

10. నాకు ఎప్పుడయితే పని చెప్పలేకపోతావో అప్పుడు నేను నిన్ను తినేస్తాను.” అని, పని అడగడం మొదలు పెట్టాడు. వీడు ఏం చేస్తాడు! కాశీనుంచి గనగను తెమ్మన్నాడు. అరక్షణంలో పట్టుకొచ్చాడు వాడు. తనవద్ద పదార్తాలులేవు, అగ్నిహోత్రంలేదు, ఉన్నాట్టుండి బ్రహ్మాండమైన భోజనం కల్పించమని అడిగాడు. అంతే, భోజనం వచ్చేసింది! ఏ పని చెప్పినా, వాడు క్షణంలో చేసేస్తున్నాడు!

11. ఈ బ్రహ్మరాక్షసుడికి పని చెప్పకపోతే తనను తినేస్తాడు. ఏమీ తోచలేదు. ఇక వాడికి పనిచెప్పలేక పారిపోతున్నాడు. అలా పోతుంటే ఒక పెద్ద అరణ్యం కనబడింది. “ఇక్కడి చెట్లన్నీ శుభ్రంగా నరికేసెయ్యి, నేలఅంతా చదును చేసెయ్యి అంటే, అర ఘడియలో అలాచేసి వచ్చేసాడు! అక్కడ ఒక పట్టణనిర్మాణం చెయ్యమంటే, అదీ చేసాడు. ఒక పెద్ద చెరువును, నదిని నిర్మించమంటే, క్షణంలో అది అయిపోయింది. మళ్ళీ పనిచెప్పమన్నాడు వాడు! ఇక చేసేది లేక మళ్ళో పారిపోవటం మొదలెట్టాడు.

12. చివరిగా ఆగి అక్కడ పెద్ద తాడిచెట్టు ఉన్నది, నువ్వు ఆ చెట్టును కింది నుంచి పైకి, పైనుంచి కిందికి, మళ్ళీ పైకి, కిందికి ఎక్కిదిగుతూ ఉండు, నేను చెప్పేవరకూ అలాగే చేస్తూఉండు. ఇంకే పనీ చెయ్యకు అన్నాడు. కొంతసేపు అలా చేసిన తరువాత, “బాబోయ్! నన్ను రక్షించు. ఈ తాటిచెట్టు నుంచి నన్ను వదిలిపెట్టు. ఇక నువ్వు స్మరిస్తేనే వస్తాను. నిన్ను చంపను, నీ జోలికిరాను అని వెళ్ళిపోయాడు.

13. అపరిమితమైన శక్తి గల వారికి ఏ పని చెప్పినా, అంతులేని పని చెప్పాలి. అలాగే మనసు కూడా! మనసుకు కూడా ఏ పని చెప్పినా, అది చేసి వెనక్కు వచ్చేస్తుంది. ఆ బ్రహ్మరాక్షసుడి లాంటిదే మనసుకూడా. దానికి సాధ్యం కానిది ఒకటి అప్పగిస్తే, అంతలోనే అది నశిస్తుంది.

14. మనసు నశించాలి కదా! “ఆత్మ ఎక్కడ ఉందో చూచిపెట్టు” అని మనస్సును అడగాలి. అంటే అన్ని రకాల పనులూ చేస్తుంది ఈ మనస్సు. దానికి సాధ్యం కానిది లేదు. “ఆత్మ వస్తువు ఎక్కడ ఉందో వెతికిపెట్టు” అని అన్నరనుకోండి! ఏంచేస్తుంది మనస్సు? దానికి అది దొరకక, విసిగివేసారి ఎక్కడో నశిస్తుంది అది.

15. అంటే, మనస్సు, “హృదయంలోని జ్యోతిని చూడు” అంటే, చూచి ఇవతలికి వస్తుంది ఆ బ్రహ్మరాక్షసుడివలె. అలాగే, “ఒకమాటు శ్రీహరిని ధ్యానం చెయ్యి” అంటే. చేసి, “ధ్యానం అయిపోయింది” అంటుంది. “కాసేపు రుద్రుణ్ణి ధ్యానం చెయ్యి” అంటే, చేసి వచ్చేస్తుంది. చెప్పినపనినల్లా చేసి వచ్చేస్తుంది.

16. అందుకని, దానికి అంతులేని పనిచెప్పాలి. ఇంక దాని అంతు ఆ కార్యమే కనుక్కుంటుంది. అది ఒక్కక్షణమే. అందువల్ల. మనస్సు ఎక్కడ నిల్సుతుందో, అక్కడ దానిని నిలుపమన్నాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


16 Mar 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 250


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 250 🌹

🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. కాశ్యప మహర్షి - 1 🌻


1. కశ్యప ప్రజాపతి వంశంలో జన్మించిన వాడే కాశ్యపుడు. ఆయనకు ఒకసారి సిద్ధుడు కనబడ్డాడు. ఆ సిద్ధుడు త్రికాలవేది, విజ్ఞానసాగరం, లోకతత్త్వం బాగా తెలిసినవాడు. ఆ సిద్ధుడు, ఆయన శిష్యులు అలా ఆకాశమార్గాన వెళ్ళుతుంటే వాళ్ళ దివ్యతేజస్సులు చూచి ఆ సిద్ధుడికి నమస్కరించి “నిన్ను నేను గురువుగా భావిస్తున్నాను, నువ్వెవరు? నాకు మార్గం చూపించు, తనకు మార్గోపదేశం చేయమంటే, ఆ సిద్ధుడు బోధ చేసాడు.

2. “ఈ శరీరము ధర్మశాసనం కోసమే పుట్టింది. ధర్మపరిజ్ఞానంవల్ల లోకంలో ఏది ధర్మమో తెలుస్తుంది. ఆత్మహితంకోరి ధర్మాచరణకోసమని శరీరాన్ని కాపాడుకోవాలితప్ప, దానియందు మోహబుద్ధి ఉండకూడదు అని బోధించి, ఆహారము, ఉపవాసము ఇవన్నీ ఎంతవరకు ఉండాలో, ఎంతకు మించి ఉండకూడదో చెప్పాడు.

3. ధర్మాన్ని బాగా ఆచరించినవాళ్ళు, ధర్మమార్గంలో ఉన్నవాళ్ళు పుణ్యం చేస్తే స్వర్గం వస్తుంది.స్వర్గసుఖాలు సమాప్తమైన తరువాత వాళ్ళు సూర్యచంద్ర నక్షత్రలోకాల్లో ఎప్పుడు ఉంటారా? అక్కడినుంచీ పతనమై, మళ్ళీ భూమిపై పుడుతుంటారు. ఈ శరీరగతమైన ఆత్మకు సుఖదు@ఖాలు తప్పవు. మన కర్తవ్యము ఒక్కటే. సుఖదుఃఖములకు అతీతమైన మోక్షమార్గమునే మనం అన్వేషించాలి. దానికి యోగమే మార్గము.

4. సుఖదుఃఖాలను ఏకకాలంలో వదిలిపెట్టాలి. సంకల్పం అనేదాని విసర్జించాలి. ఇక ధర్మమేమో జీవనవిధానంగా ఉండాలి, మోక్షమేమో ప్రధానం కావాలి. ధర్మం ప్రధానం కాదు, అప్రధానం, మోక్షమే ఆత్యంతికమైన విషయం.

5. అధర్మం మనకు దోషాన్నిస్తుంది. కాబట్టి తపస్సును భంగంచేస్తుంది. కనుక జీవన విధానంలో ధర్మంలో ఉండాలి. ధర్మం ఎందుకు ఆచరిస్తున్నామంటే, మోక్షం కోసమని చెప్పాలి. కాబట్టి ప్రధానమైనటువంటి పురుషార్థం ఇదే! అని బోధించాడు కాశ్యపుడికి.

6. “యోగమార్గాలున్నాయి కదా! తపస్సుచేసి ఆత్మదర్శనం చేయమని అంటారుకదా మాహాత్మా! ఆ విధివిధానం ఎలాగో బోధించమని అడిగాడు కాశ్యపుడు.

7. అందుకు బదులుగా సిద్ధుడు, “జిహ్వ, కుత్తుక, తాలువు, కంఠనాళము, హృదయము వీటిలో మనసు ఎక్కడ నిలబడుతుందో అక్కడే ఉంటుంది. ఉదాహరణకు పళ్ళమీద మనసు నిలబడిందనుకో, మనసుని అక్కడే నిలబెట్టు. దానిని మరెక్కడోనిలబేట్టే ప్రయత్నం చేయవద్దు.

8. అది ఎక్కడ సుస్థిరంగా దాని ప్రాంతంలో నిలబడిందో అక్కడే ఉంచెయ్యి. అట్లా కదల్చకుండా మనస్సును ఎక్కడయితే పెడతావో, దానికి అప్పుడు అన్వేషణను గురించి చెప్పు. ఆత్మ ఎక్కడ ఉందో తెలుసుకునేటటువంటి దృష్టిని మనసుతో చెప్పు. ఆ ఆత్మను వెతుకుతూ ఆ మనసు దానిని పొందలేక, తానే లయం పొందుతుంది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


14 Mar 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 249


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 249 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. జడమహర్షి - 4 🌻


18. తల్లి కడుపున పడ్డదిమొదలు మనుష్యుడికి సుఖం లేదు. స్వర్గముకూడా దుఃఖకరమే. ఎందుకంటే, పుణ్యం ఉన్నంత కాలమే స్వర్గప్రాప్తి కలుగుతుంది. పుణ్యం క్షీణించిపోగానే తిరిగి భూలోకప్రాప్తి తప్పదు. భయానికికూడా అది హేతువౌతుంది.

19. అందువల్ల అది సుఖకరం కాదని పెద్దలు చెపుతూంటారు. నరకము ఘోరమైన, తీవ్రమైన, దుస్తరమైన యాతనాకరమైన విషయము. దానిని గురించి చెప్పవలసిన పనిలేదు. నరకం ఎట్లా ఉంటుందో దానిని గురించి చెప్పేదేముంది? చాలాబగా ఉన్నరోజులలోనే ఇన్ని కష్టాలు పడుతూకూడా, బాగా లేము అని అంటూంటాం.

20. ఇక నరకంమాట చెప్పేదేముంది? పశువు, పురుగు, క్రిమికీటకాదుల యాతనలు అనంతములైనవి. ఆ జీవితాలనుంచీ బయటకు వెళ్ళటం తప్పనిసరి. అందుచేతనే ఈ త్రయీమార్గమునుండి బుద్ధి మరల్చి నైష్కర్మభావం పూనాను” అని చెప్పాడు జడమహర్షి.

21. వైదికమార్గము ఈ లోకంలో సుఖాన్నిస్తుందని, అందులో సందేహం లేదని, పితృదేవతలు ఆర్య జనానికి సంతతి, ఆయుర్దాయం, భోజనం, సుఖం అన్నీ ఇస్తారు అని కూడా బోధించాడు జడమహర్షి. త్రయి(మూడు) అంటే వేదములు. వేదం చెప్పిన వైదికమార్గములు ఇక్కడ ఈ లోకంలో సుఖాన్నిస్తాయనటంలో సందేహం లేదు.

22. జీవుడికి ఏ జన్మలోనైనా సుఖం కలిగినా, మరణంలో అంతోఇంతో వేదన ఉన్నది. వెళ్ళిపోతాడు. మళ్ళీ వస్తాడు. ఇది చర్వితచరణం. ఇలాగే తిరుగుతాడు తప్ప ఎప్పటికీ ముందడుగు వెయ్యడు. గానుగ చుట్టూ తిరిగే ఎద్దు అక్కడే ఉంటుంది. పొద్దుట నుంచీ సాయంత్రం దాకా 10 కిలోమీటర్లు నడుస్తూనే ఉంటుంది కానీ దూరం వెళ్ళదు. అక్కడే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది సాయంత్రం దాకా నడిచి, గమనశీలంగా ఉంటుంది కాని ప్రగతి లేదు. జీవుడు కూడా అంతే! అలాగే జన్మనుంచి మృత్యువు, మృత్యువు నుంచీ జన్మ – అలాగే ఉంటాడని జడమహర్షి భార్గవుడికి బోధచేసాడు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


12 Mar 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 248


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 248 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. జడమహర్షి - 3 🌻


12. మనలో ఎవరికైనా చావు గురించి జ్ఞాపకం ఉందా? ఎవరికీ లేదు. అందుకనే సుఖంగా ఉన్నాము. కానీ దాని లక్షణము ఇలా ఉంటుందని పెద్దలు చెప్పినప్పుడు, పునర్జన్మ తనకు వద్దు అనేటటువంటి తీవ్రమయిన సంకల్పం మినిషికి కలగాలి. అదే వివేకం.

13. అందుకనే జడమహర్షి చెపుతున్నాడు ఇదంతా. “మోక్షం కోసమయినా, మృత్యువాతను తప్పించుకోవటం కోసమయినా మనుష్యుడు పురంజన్మ లేకుండా చేసుకోవాలి. మృత్యువు యొక్క బాధ అంత భయంకరమైనది.

14. ముక్తి యందు ఆసక్తి అనేది ఉన్నాలేక పోయినా, అది వేరే విషయం. మృత్యువు యొక్క బాధ ఇలా ఉంటుందని పెద్దలు చెపుతున్నారు. ఏమయినప్పటికీ మరణించిన తరువాత యముడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన పుణ్యానికి పుణ్యఫలం, పాపానికి పాపఫలం ఇస్తాడు. అదెట్లాగూ తప్పదు.

15. కానీ, ఇది అయిపోయిన తరువాత జీవుడు మళ్ళీ ఇంకొక పురుషుడి వీర్యంలో ప్రవేశిస్తాడు. స్త్రీగర్భంలోకి వెళతాడు, మళ్ళీ పుడతాడు. అప్పటికే అంతా మరచిపోతాడు. యమదర్శనం, చావు, దుఃఖము, కష్టము, పోయిన జన్మలో తల్లి తండ్రులు, వళ్ళెవరు వీళ్ళెవరు – అన్నీపోతాయి. మరచిపోతాడు. అవి ఏవీ మిగలవు. పలక మీద వ్రాసి, తడితో చెరిపేస్తే ఏం మిగులుతుందో, ఇదీ అంతే! అతడి మనస్సులో ఏమీ ఉండదు.

16. “కాబట్టి ఇదంతా ఒక భయంకరమయిన మాయాజాలం. ఈ వలలో తగులుకున్న వాళ్ళు బయటికి రాలేరు. ఎప్పుడయితే గురువును ఆశ్రయించి బోధ పొందుతాడో, అప్పుడే ఇది తప్పుతుంది. గురువును ఆశ్రయిస్తే, మార్గాన్ని అన్వేషించమనేదే ఆయన చెప్పవలసింది. ఎందుకంటే హితబోధ ఎవ్వరయినా చేయగలరు.

17. హితైషి ఏం చెపుతాడంటే, నీ విషయం అన్వేషించుకో! నీ మంచి, నీ భవిష్యత్తు ఆలోచించుకో! సమయం ఆసన్నమవుతున్నది. దినదినము మృత్యువు దగ్గరికి వెళుతున్నావు. జాగ్రత్తపడు – చెప్పినవాడే నీకు ఆప్తుడనుకో.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


09 Mar 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 247


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 247 🌹

🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. జడమహర్షి - 2 🌻

7. అయితే, ఆ జీవుడు ఇతరులకు అన్నోదకములు భక్తితో పెట్టిన వాడయితే ఎటువంటి మరణవేదనా అనుభవించడు. తెలివిగా శరీరంలో ఉండగానే, జ్ఞానమార్గాన్ని, పుణ్యమార్గాన్ని అవలంబించినవాడయితే; అసూయారహితుడు, ధర్మం తప్పనివాడు, అధర్మంలో ఉన్నటువంటి కామాది వికారములు లేనివాడు, క్రోధం లేకుండా జీవించిన వాడు అయితే;

8. మాత్సర్య రహితుడైతే, మరణవేదన అనుభవించకుండానే పోతాడు. సుఖమయిన మృతిని పొందుతాడు. అన్నదానం చేయనివాడు, కూటసాక్షి, వేదదూషకుడు మొదలైన వాళ్ళకు భయంకరమైన యమకింకరులు దర్శనమిస్తారు. దాంతో విపరీతమయిన భయం కలుగుతుంది.

9. తనకు భయమేస్తోంది అని చెప్పటానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే జిహ్వ వెనక్కు వెళ్ళిపోతుంది. మాటరాదు. చూస్తూఉంటాడుకాని మాట్లాడలేడు. అటువంటి స్థితిలో వెళ్ళిపోతాడు. జీవులిలా యాతనాశరీరాలను పొంది చాలా బాధలు పడతారు అని ఇవన్నీ చెప్పి మరణవేదననూ వర్ణించాడు.

10. “మృత్యువుయొక్క స్థితి అల్ల ఉంటుంది. మృత్యువును గురించి ఎందుకు చెపుతున్నానంటే, జన్మ అంటే భయపడాల్సిన కారణాలున్నాయి. చనిపోయిన తరువాత, చావు అనేది ఇంత భయంకరంగా ఉంటుంది అని తెలుసుకుని కూడా ప్రయోజనంలేదు. ఎందుకంటే అప్పుడు తెలుసుకున్నా తనకు పనికిరాదు. మళ్ళీ జన్మించేటప్పటికి ఈ మృత్యువేదన అనే కష్టాన్ని గురించి మరిచిపోతాడు.

11. ఇక వాడికేమి జ్ఞాపకం ఉంటుంది? వాడికి బోధ ఎలా కలుగుతుంది? మృత్యువాత పడ్డప్పుడు, ‘అయిపోయింది! ఇంకేప్పుడూ ఈ జన్మకు రాను, ఇక నాకు పునర్జన్మ వద్దు!’ అని అప్పుడు అనిపిస్తుంది. కాని అది స్మృతిపథంలోంచి మరుగైపోతుంది. మళ్ళీ జన్మించేటప్పటికి చావుని గురించి ఎరుగని వాడివలెనే ఉంటాడు” అని చెప్పాడు జడమహర్షి.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


08 Mar 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 247


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 247 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. జడమహర్షి - 1 🌻


1. తండ్రి అయిన భార్గవుడు ఆ పిల్లవాడికి ఎన్ని బోధలు చేసినా ఒక జడుడివలె, చేవిటివాడిలాగా జడత్వం వహించి ఉన్నాడట. తనకు కావలసిన అహారాదులను గురించి మాత్రమే అడిగేవాడు. అంతేకాని ఎక్కువగా మాట్లాడలేదు. అందువల్ల భార్గవుడి మాటలకు ఆ పిల్లవాడు నవ్వగానే భార్గవుడికి ఆశ్చర్యం వేసింది.

2. “తండ్రీ! నీవు చెప్పిన ప్రకారం బాల్యావస్థలో గురువు దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవటము, వేదవేదాంగములను చదువుకోవటము, యజ్ఞ యాగాదులు చేయటము, క్రతువులు చేయటము, నిత్యకర్మానుష్ఠానము, సంసారము, సంతానము కనటము, ఈ ప్రకారంగా నేను అయిదువేల జన్మల నుంచీ చేసాను.

3. అయిదువేల మంది తల్లుల గర్భాలలోంచి మళ్ళీ మళ్ళీ పుట్టాను. నేటికి నీవు మళ్ళీ చేసిన ఉపదేశము వింటే నవ్వొస్తున్నది” అన్నాడు. అందుకు ఆ భార్గవుడు ఆశ్చర్యంతో జడుడితో, “నాయనా! నీకు ఇంత విజ్ఞానం ఏమిటి! నీ వయసెంత? ఇన్నాళ్ళూ నువ్వు నాతో మాట్లాడకపోవడమేమిటి! అంత బుద్ధిమంతుడవైన నువ్వు ఈ సామాన్యుడింట్లో జన్మించటం ఏమిటి! అని అడిగి జదమహర్షి పూర్వజన్మల వృత్తాంతం తెలుసుకొని, ‘మహానుభావా! నీవు నా పూర్వజన్మపుణ్యంచేత పుట్టావు.

4. ఆగర్భజ్ఞానివైన నిన్ను కనటం మా తపోఫలం. అని గురుభావాన్ని పెట్టుకుని కొన్ని ప్రశ్నలు అడిగాడు జదమహర్షిని. “ఈ సృష్టిలో జన్మరహస్యం ఏమిటి? జీవులు ఏ విధంగా చనిపోతాయి? పాపపుణ్యాలు ఎలా ఉంటాయి? వాటి స్వరూపం ఏమిటి?” అని అడిగాడు భార్గవుడు.

5. జడమహర్షి చెప్పిన వాటిలో, మరణానికి ముందు జీవుడు ఏయే పద్ధతులలో శరీరాన్ని వదిలి పెడతాడో చెప్పబడి ఉంది. సాధారణంగా మనం యోగశాస్త్రంలో విన్న మాటలే ఇక్కడా ఉన్నాయి.

6. ఆయన చెప్పినవి: మరణకాల మాసన్నపైనప్పుడు మానవుడి శరీరంలో పెద్ద వేదన కలుగుతుంది. లోపలి నుంచీ మిక్కిలి వేడి అయిన ఆవిర్లు బయలుదేరుతాయి. మర్మస్థానాలన్నీ పట్టుతప్పిపోతాయి. ఉదానవాయువు ఊర్ధ్వగతిలో వెళ్లుతుంది. శరీరంలో తడి ఆరిపోతుంది. మాట పడిపోతుంది. ఉఛ్ఛ్వాసనిశ్వాసాలు ఆగిపోతాయి. నాలుక వెనకకు వెళ్ళిపోతుంది. జీవుడికి బాధ ఎక్కువయిపోతుంది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


06 Mar 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 246



🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 246 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. గౌరముఖ మహర్షి - 4 🌻


15. “వ్యతీపాతము, ఆయనము, విషువత్తు, చంద్రసూర్యగ్రహణములు, సంక్రమణము, పుణ్యకాలాలు, నక్షత్రగ్రహపీడాసమయాలు, చెడ్డకలలు వచ్చినప్పుడు, విశిష్టద్రవ్య పాత్రాలాభాలు కలిగినప్పుడు, గంగాది మహాతీర్థాలకు వెళ్ళినప్పుడు యధాశక్తిగా శ్రాద్ధకర్మలు చేయాలి” అని చెప్పాడు.

16. ధనం లేని వాళ్ళు తిలతర్పణము లిచ్చినా శ్రాద్ధకర్మఫలం లభిస్తుందని చెప్పాడు. అదికూడా సాధ్యంకాకపోతే ఒక గోవుదగ్గరికివెళ్ళి దాని ముందర ఇంత గడ్డిపెట్టి నమస్కరించినా క్షేమకరమే! అది కూడా చేయలేనివాడు అడవికి వెళ్ళి చేతులు పైకెత్తి సూర్యుణ్ణి చూచి బిగ్గరగా ఇలా చెప్పాలి:

17. “ఓ పితృదేవతలారా! నన్ను మన్నించి నా నమస్కారం స్వీకరించండి”. అలా అంటే, పితృదేవతలు తృప్తి పడతారు అని స్మృతులలో ఉంది.

18. పితృకర్మలకు ఎవరు అర్హులు అంటే – యోగి, యతి, శిష్యుడు, సోమయాజి, ఋత్విజుడు, సోదరికొడుకు, అల్లుడు, మేనమామ మున్నగువారు పైతృకర్మలు చేయటానికి అర్హులు. అటువంటి బాకీలన్నీ వీళ్ళు తీర్చాలి. కొడుకులు ఎలాగూ చేయాలి.

19. యతి తన గురువుకు చెయ్యవచ్చు, తప్పుకాదు. ఆశ్రమాలలో గురువుగారి తిథి శిష్యులు జరుపుకోవచ్చు. శ్రాద్ధం అంటే ఈ ప్రకారంగా కొన్ని తర్పణాలు ఇస్తారు. తండ్రికి కొడుకు చేసినట్లుగానే, యతికి మరెవరూ చేసేవాళ్ళు లేకపోతే – యాగం చేసే సోమయాజి ఎవరైనా చేయవచ్చు.

20. కొడుకులు లేని వాళ్ళు కూడా అలా తమకు చేయించుకోవచ్చు. నపుంసకుడు, దొంగ, నిందితుడు, రోగి, బ్రాహ్మణులు (యాచన చేసే వాళ్ళు) అనర్హులని, ఈ కర్మలు చేయకూడదని నిషేధించారు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


05 Mar 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 245


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 245 🌹

🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. గౌరముఖ మహర్షి - 3 🌻


10. “ఎటువంటివారికైనా పితృసర్గమును గురుంచి సమస్తమూ వివరించడం సాధ్యమేకాదు. అన్నిలోకాలలో అంతమంది ఉన్నారు. ప్రధానంగా అందరిచే పూజ్యతపొందేటటువంటి పితృదేవతలు కొందరున్నారు.

11. వసు, సాధ్య, రుద్ర, ఆదిత్య, అశ్వేమరుద్రులు(అశ్వినులు, మరుత్తులు, ఋషులు) – అంటే వాళ్ళు ఋషులని అర్థం. వసురుద్రులందరికీ, సమానంగా – ప్రతీవారికీ సమానమైన ఆరాధన చేయాల్సిన – పితృదేవతలు అని పేరు.

12. అలా లోకాలలోంచి వెళ్ళి ఉత్తమలోకాలలో శాశ్వతంగా ఉంటారని అర్థం. అంతేకాక ఆ ఋషులందరూ వాళ్ళ కీర్తిచేతపుట్టిన వాళ్ళసంతానము. అంటే ఏ ఋషులసంతానంలో పుట్టిన వాళ్ళున్నారో వాళ్ళు ఆ ఋషులను ఆరాధించాలి. వసురుద్రాదులను పూజించాలి.

13. వసిష్ఠ బ్రహ్మపితరులైన అగ్నిష్వాత్తాదులు, బ్రహ్మక్షత్రియ వైశ్యులకు పూజనీయులు. అంటే ఈ మూడు వర్ణములవాళ్ళు ఎవరైతే పితృకార్యాలునిర్వహిస్తారో, వాళ్ళందరూ సామాన్యంగా అందరిచేత ఆరాధించ బడేటటువంటి దేవతలను ఆరాధించవలసిందే” అన్నాడు మార్కండేయుడు.

14. “ఎవరికైనా పితృసర్గం పూర్తిగా దొరకటం సులభంకాదు; దానిని సంక్షోభంలో పెట్టరాదు” అన్నాడు. తరువాత వాళ్ళకు ఎప్పుడు పూజచేయాలో చెప్పాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


04 Mar 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 244


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 244 🌹

🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. గౌరముఖ మహర్షి - 2 🌻


5. వాళ్ళే మొట్టమొదట స్వర్గానికి వెళ్ళిన – భూమిమీద పుత్రులనుకని వెళ్ళిపోయిన – మొట్టమొదటి పితృదేవతలు. వాళ్ళే సప్తర్షులు. వాళ్ళల్లో మూర్తిమంతంగా ఉండేవాళ్ళూ నలుగురు. ఆ మూర్తులు నిజతేజస్వరూపులుగా ఉన్నారు.

6. ఆ నలుగురూ భూలోకంలో ఏ రూపంలో ఉన్నారో ఆ రూపంలో అక్కడా ఉన్నారు. తరువాత వాళ్ళు ఆకడనుంచే భూలోకంలో ఆరాధన పొందారు. ఆ తరువాత కేవలం భూలోకానికివచ్చి శుద్ధ బ్రహ్మజ్ఞానంతో వాళ్ళు పునరావృత్తిరహితమైన యోగసిద్ధినిపొందారు. వీళ్ళనే పితృదేవతలంటారు” అని చెప్పాడు మార్కండేయుడు.

7. ఇంకా, “ఇది ప్రథమ పితృసర్గం. ఈ ప్రకారంగా అనేకమంది పితరులు సప్తలోకాల్లో ఉన్నారు. ఇక్కడకువచ్చి, ఇక్కడనుండివెళ్ళి దివ్యత్వంపొందిన ఉత్తమలోకవాసులందరూ పితృదేవతలు. వాళ్ళందరూ అనేక స్వర్గములలో ఉన్నారు.

8. భూలోకవాసులైన జనులు, భువర్లోకవాసులైన పితృలోకవాసులను పూజిస్తారు” అన్నాడు. “భువర్లోకవాసులు, మరీచాదులు మొదలుగాగల సువర్లోకవాసులు, కల్పోపవాసిసంజ్ఞులైన మహర్లోకవాసులందరూ – జనలోక వాసులైనటువంటి సనకాది పితరులను కొలుస్తారు.

9. వాళ్ళ పైలోకవాసంలో ఉండేవాళ్ళను కొలుస్తారు. వాళ్ళను ఆరాధిస్తారు. పితృసర్గమని దీనికిపేరు. ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోవటంచేత, వారు ఇక్కడ మానవజన్మ పరంపరకు కారణమవుతున్నారు. వాళ్ళను ఆరాధించమని పితృదేవతల యొక్క ఆరాధనా విధివిధానం ఇవ్వబడింది” అని చెప్పాడు మార్కండేయుడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


03 Mar 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 243


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 243 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. గౌరముఖ మహర్షి - 1 🌻


1. ఒకసారి గౌరముఖుడు ప్రభాసతీర్థం ప్రంతంలో ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకునే సమయంలో మార్కండేయ మహర్షి వచ్చాడు. అప్పుడు మార్కండేయునితో ‘వేదవిదులు పితృదేవతలని అంటారు కదా, వాళ్ళు ఎవరు” అని అడిగాడు గౌరముఖుడు.

2. “విశ్వానికి తండ్రి విష్ణువే! అతనినుంచి బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మకు ఏడుగురు కొడుకులున్నారు. ఏడుగురూ పుట్టిన తరువాత బ్రహ్మ వాళ్ళతో, ‘నన్నే ఆరాధిస్తూ సృష్టిని పెంచండి’ అని చెప్పితే, వాళ్ళు బ్రహ్మజ్ఞానులు కాబట్టి, సృష్టి అంటే వైముఖ్యము కలిగి బ్రహ్మ ఆజ్ఞను తిరస్కరించి తపస్సుకు వెళ్ళారు. అందుకు బ్రహ్మ ఆగ్రహించి, ‘మీరు ఏ బ్రహ్మజ్ఞానం చేత తరిస్తున్నారో అది మీకు నశిస్తుంది’ అని శపించాడు.

3. “తరువాత వాళ్ళు సంసారంలో ప్రవేశించారు, వాళ్ళకు సంతానం కలిగిన తరువాత, వాళ్ళ బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే నశించిందో, వళ్ళు ఈ లోకాన్ని వదిలిపెట్టి వేరే లోకానికి వెళ్ళిపోయే లక్షణం కలిగిన వాళ్ళాయ్యారు. భూలోకానికి వచ్చిన తరువాత సంతానాన్ని కన్న తరువాత ఈ లోకాన్ని వదిలి పెట్టారు. అది తప్పదు. న్శ్వరమైన దేహములే ఇవి.

4. కాబట్టి వాళ్ళు ఈ లోకాన్ని వదులిపెట్టి ఉత్తమలోకాలకు వెళ్ళిపోయారు. స్వర్గానికి వెళ్ళారు. స్వర్గంలోనే వాళ్ళు నిత్యంగా శాశ్వతంగా ఉండదలచుకున్నారు, కాబట్టి వాళ్ళు తమ కొడుకులతో, ‘నాయనలారా! మమ్మల్ని మీరు మరువకండి! శ్రాద్ధాది పితృకర్మలతో మమ్మల్ని అర్చించండి’ అని చెప్పారు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


02 Mar 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 243


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 243 🌹

🌷. సద్గురు శివానంద 🌷

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. యాజ్ఞవల్క్యమహర్షి - 7 🌻


48. ఎవరికి భవంతునిమీద పగ ఉంటుందో, వాడికి ఆయన కనపడడు, వాడిని పట్టించుకోడు. వాడెంత అపచారం చేసినా సహిస్తాడు, మాట్లాడడు. కాని, వాడిని కటాక్షించడు. ఎందుచేతనంటే, వాడికి తన ఉనికి తెలియటంకూడా ఆయన సహించడు.

49. కాబట్టి వాళ్ళ యందు పూర్తిగా భగవంతుడికి ఉపేక్ష ఉంటుంది. శత్రువులయందు శ్రద్ధ ఉండదు, భక్తుడియందే శ్రద్ధ ఉంటుంది. అలాకాకపోతే, శత్రువుమీద ఆయనకు కోపమే ఉండి ఉంటే, అది శ్రద్ధ అవుతుంది కదా!.

50. ఆసేతుశీతాచల పర్యంతం రామేశ్వరం నుంచీ కేదార్‌నాథ్ వరకు ఆ సంప్రదాయాలు, ఆ పూజలు, ఆ మంత్రాలు, ఆ విగ్రహాలు అవన్నీ ఏదో విచిత్రంగా ఉంటాయితప్ప తత్త్వం మాత్రం ఒక్కటే!

51. భారతీయతలో ఆ గురుతత్త్వం, ఆ ప్రబోధం, ఆ మార్గం, ఆ శరణాగతి అదంతాకూడా అలాగే ఉంటుంది. ఈ భారతీయ సంప్రదాయంలో ఈ మహర్షులు ప్రతిష్ఠించింది ఏమిటంటే, అది ఈశ్వరతత్త్వంకంటే, గురుతత్త్వం అనే చెప్పాలి. వాళ్ళు దానిని సుప్రతిష్ఠంచేసి దానికి శాశ్వతం ఇచ్చి వెళ్ళిపోయారు.

52. నిజంగా గురుతత్త్వమే అయిన ఈ ఋషుల చరిత్రలన్నీకూడా అమోఘమైనటు వంటివి. వీటిలో ప్రతీచోట బ్రహ్మవిష్ణు రుద్రులొస్తున్నారు. అంటే త్రిమూర్తులతీనే సన్నిహితసంబంధం కలిగిఉన్నప్పటికీ, వీరు మనుష్యులే! వాళ్ళు ఎంతోమందిని ఉద్ధరించారు. ఈ గురుతత్త్వం మాత్రం ఎప్పుడైనా ఈ భారతదేశంలో నశించదు.

53. ఈ సంప్రదాయం ఎప్పుడయినా, ఎప్పటికైనా భారతదేశ సంస్కృతికి కల్యాణప్రదమై పునరుజ్జీవన హేతువవుతుంది. ఈ సంస్కృతియొక్క పునరుజ్జీవనహేతువు దేంట్లో ఉండంటే, ఈ గురుతత్త్వంలోనే.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




01 Mar 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 242


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 242 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. యాజ్ఞవల్క్యమహర్షి - 6 🌻


40. జ్ఞాని ముక్తుడైన తర్వాత అతడికి చ్యుతి లేదు. అందుకనే వారికి పరీక్షలు పెడితే – అప్సరసలు, ఇంద్రాదులు వాళ్ళను పరీక్షచేయబోయి వాళ్ళే భంగపడ్డారు. జ్ఞానులను ఏదీ భ్రమపెట్టలేదు.

41. బ్రహ్మవస్తువు దర్శనమైన తరువాత ఈ సృష్టిలో అతడిని భ్రమపెట్టగలిగినది ఇంకొకటి లేనేలేదు. సృష్టిలో ఎవరినైనా బాధించేది బాహ్యదృష్టి, రక్షించేది అంతర్దృష్టి. బాహ్య దృష్టి బాధిస్తుంది, బంధిస్తుంది. బాహ్యదృష్టే సహజమైతే, వాడు బద్ధుడు. ముక్తుడు కాడు.

42. బాహ్యదృష్టి కలిగి అది సహజంగా ఉండి, సహజదృష్టి వేరే ఉంటే, అతడిని బాహ్యదృష్టి బాధించదు. సహజంగా బాహ్యదృష్టి కలిగిన బద్ధుణ్ణి అంతర్దృష్టి రక్షిస్తుంది. ఈ అంతర్దృష్టిని అలవాటుచేసుకునే కాలంలో బాహ్యదృష్టిని ఉపసంహారంచేసే ప్రయత్నం పేరే సాధన.

43. అంతర్దృష్టిసాధన అంటే బాహ్యదృష్టి వైముఖ్యము. దీనినే సాధన అంటారు. ఇంద్రియాలను నిగ్రహించుకునే ప్రయత్నం, కామక్రోధాదులను జయించే ప్రయత్నం – ఇట్లాంటి ప్రయత్నమే సాధన అనబడుతుంది.

44. కానీ ఆత్మదర్శన సాధన చేస్తున్నానని చెప్పకూడదు. ఆత్మసర్శనం అసలు ఉండదక్కడ. బాహ్యదృష్టి నిర్మూలనమవుతుందంతే. ఇది సర్వులకూ సాధ్యమే! సంసారం అంత భయంకరమయినది, అంత బలమయినదీ అనుకోకూడదు. అది కేవలం బలహీనుడి విషయంలో మాత్రమే చాలా బలమైనది.

45. ఆసురీ సంపత్తి దైవీ సంపత్తి ఉన్నవారినే వచ్చి బాధిస్తుంది కాని, అది దానికి అహారం దొరకక్ కాదు. దానికి కావలసిన ఆహారం చాలాచోట్ల ఉంది కాని, ఈ జ్ఞానులను తింటే వచ్చే రుచి ఇంకెక్కడా ఉండదు! అది దాని తత్త్వం. దనిని చూచి కూడా ఉపేక్షించాలి. ఎందుచేతనంటే, ఆసురీసంపత్తికి దైవిసంపత్తిమీద స్వేషం ఉంటుందికాని, దైవీసంపత్తికి దానిపై ద్వేషం ఉంటుందా! ఉండదు. ఇది దాన్ని ఉపేక్షిస్తుంది.

46. ఆశ్రమంలో దుష్టుడు క్షేమంగా ఉంటాడు. బయట ఉండలేడు. అందుకే దానిని ఆశ్రయిస్తాడు. ప్రపంచంలో ఇదంతా సహజంగానే జరుగుతూ ఉంటుంది. భగవంతుడు హీనుడైన పూజారి దృష్టిలో అక్కడ లేడు. లేనేలేడాతడికి. ఉన్నాడనుకున్నవాడికి ఉన్నాడంతే.

47. ఎందుకంటే, శిథిలాలలో ఉండే గబ్బిలం శిథిలాలలోనే క్షేమంగా ఉంటుంది. బాగా పెద్ద లైటు వెలిగిచేటటువంటి దివ్యభవనాలలోకి వెళితే చంపేస్తారు దానిని. ఒక్కొక్కదానికి సృష్టిలో ఒక్కొక్క స్థానం కల్పించబడి ఉంది. అది అక్కడ క్షేమంగా ఉంటుంది, ఆ స్థానం కోల్పోతే స్థానబలిమి పోతుంది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


28 Feb 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 241


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 241 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. యాజ్ఞవల్క్యమహర్షి - 5 🌻


31. ఈ యథార్థ సంసారజీవనవిధానం కర్మయొక్క రచన. దానిని విమర్శనాదృష్టితో చూడటం విమర్శకారిత్వం. తను అందులో ఎందుకు లీనంకావాలి? అది తనను అనుభవించటం లేదు. తనెందుకు దానిని అనుభవించాలి? తాను యథార్థస్థితిలో సాక్షివలె చూడాలి.

32. అప్పుడు అది బంధనహేతువు కాదు. అది ఈతడిని ఏమీ చేయలేదు. కీర్తి, అపకీర్తి, విమర్శ, ప్రశంశ, రావటం, పోవటం, ధనం రావటం, పోవటం ఇవన్నీ కూడా తాను అనుభవించేదికాదు. అనుభవించినా తాదాత్మ్యతతో కాదు. అది వేరి, తాను వేరు.

33. “నేను నేనే! నాతోనే నేనుంటాను. నేణు ఇంక దేనితోనూ ఉండను. దేనియందూ నాకు సంగబుద్ధి లేదు. నాకు నాయందే సంగబుద్ధి” అని ఉండాలి. ప్రకృతిని చూచి భయపడి పారిపోవలసిన అవసరంలేదు. సంసారానికి భయపడి ఎక్కడికి పారిపోయినా, మనస్సులో అనుసరిస్తూనే ఉంటుంది సంసారం. నమసు ఇక్కడే ఉంతుంది. ఇది మనసులోకి వచ్చి ప్రవేశిస్తుంది.

34. నిస్సంగత్వం, నిర్మోహత్వం ఈ సంసారంలో ఉండికూడా సాధ్యమే. ఏ వస్తువునందు తనకు ఉపరతి కలుగుతుందో – బ్రహ్మ కావచ్చు, శివుడు కావచ్చు, లేకపోతే నిర్గుణమైన బ్రహ్మవస్తువే కావచ్చు – దేనియందైతే అతడు శ్రద్ధ వహించి ఉంటాడో అక్కడికి వెళ్ళగలడు!

35. అట్టివారు (మహర్షులు) త్రిలోకసంచారులు అయ్యారు అంటే అర్థం, వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండి నిర్గుణమైన బ్రహ్మలో లయం పొందుతారు కొద్దిసేపు. మళ్ళీ వస్తారు. శివధ్యానం చేస్తారు. కైలాస ప్రాప్తి కలుగుతుంది. కాసేపు విష్ణులోకానికి వెళతారు. మళ్ళీ మనుష్యుల్లో కొంతసేపు తిరుగుతారు. అంటే స్వతంత్రులు అని అర్థం. ఆనందస్వరూపులై ఉంటారు.

36. తపోలోక జనోలోక మహర్లోకాదులన్నీ కూడా కర్మలోకములు కావు. స్వతంత్రమైన జీవలక్షణం కలిగినవాళ్ళు ఆత్మపరిధిని పొంది అక్కడే ఉండవచ్చును. వాళ్ళకు ఆ లోకంలో స్థానాలున్నాయి. వారు నిరాశ్రయులు కారు. లోకానుగ్రహకాంక్షతో ఇతరులను ఉద్ధరించే లక్షణం కలిగి ఉంటారు.

37. యాజ్ఞవల్క్యుని భార్యలు ఆయనను అంత్యకాలంలో “జరా మృత్యువులు లేని మోక్షమార్గాన్ని తెలియచెప్పమన్నారు”. అందుకు ఆయన, “భర్త భార్యకు ప్రియుడు అంటాముకాని, ఆత్మకొరకే ప్రియుడు. అంటే, తనకొరకే ప్రియుడు అవుతున్నాడు. అంటే, భార్యను భర్త ప్రేమించటం తన ఆనందం కోసమనే, ఎవరూ ఎవరినీ, నిస్వార్థంగా ప్రేమించరు. తమకొరకే వాళ్ళను ప్రేమిస్తారు.

38. పుత్రమిత్రాదులనే కాక, సంస్తాన్నీకూడా ఆత్మప్రయోజన్మ్ కోసమనే ఎవరైనా ప్రేమిస్తారు. ‘అందుచేత, నాకొరకే, నేనే అంటున్నావు కదా! ఎవరీ నేను!’ వినేది, మననం చేసేది అంతా ఆత్మయే అని (ఆత్మావా అరే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యో).

39. పరమాత్మ సకలానికీ కారణం. ఈ వేదశాస్త్రాలన్నీ ఆ పరమాత్మయొక్క నిట్టూర్పులే!. అజ్ఞానం చేత ఆత్మకు దేహేంద్రియాత్మకమైన జీవభావం కలిగిందని చెప్పాడు. ఆత్మజ్ఞానమే అమృతత్వమని వారికి బోధించి, తాను సన్యసించి వెళ్ళిపోయాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


27 Feb 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 240


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 240 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. యాజ్ఞవల్క్యమహర్షి - 4 🌻


24. పురుషోత్తముడు అని పరమేశ్వరుడికి పేరు. షడ్వింశతి తత్త్వమని సాంఖ్యదర్శనం చెప్పినదానిని – ప్రతి మహర్షీ చెప్పాడు. యోగము చెప్పని ఋషిలేడు. ఋషులందరూ చెప్పారు. అంటే, అది(ప్రకృతి) ఉన్నది కాబట్టి చెప్పారు.

25. ప్రకృతిని కాదని ఎవరనగలరు? ప్రకృతి పురుషుణ్ణి చూడదు. ఇక్కడ ప్రకృతి అంటే ఏమిటి? అహంకారం. జీవాహంకారం వరకూ ఉండే ప్రకృతి, పరుడైన పురుషుణ్ణి చూస్తుందా? ప్రకృతి ప్రకృతినే చూస్తుంది. ఆ లోపల అంతరాత్మలో ఉండే పరమపురుషుడు ప్రకృతిని చూస్తూ ఉంటాడు.

26. కానీ ఆ అంతరాత్మ యందుండేటటు వంటి పురుషుడు అని చెప్పబడే జీవి, ప్రకృతిని చూస్తున్నంత సేపూ తనను తాను చూచుకోదు. మోక్షము, ముక్తి అనే మాటకు అర్థం ఏమిటంటే, ఈ పురుషుడు యథార్థంగా నిస్సంగుడే! కాని అతడు, ప్రకృతిని చూచే స్థితిలో భోక్తవలె ఉండటంచేత, అన్నిటికీ అతీతమై నిరంజనుడైన వాడైనప్పటికీ, అతడు దీనిని చూచి దీని యందు శ్రద్ధ వహించి ఉండటంవలన, తనను తాను చూడటం మరచిపోయాడు. కాబట్టే బద్ధుడైపోయాడు. స్వస్వరూపజ్ఞానం తెలుసుకుని ముక్తుడు ప్రకృతినుంచి విడిపోవాలి.

27. ఇది అనిత్యమైనటువంటిది. నిత్యము, అనిత్యము కూడా కానిది. అనిత్యత్వము నిత్యంగా కలిగిన ప్రకృతి ఇది. క్షణక్షణమూ ప్రతీ వస్తువు కూడా ఉన్నట్లు కనిపించి నశించిపోతోంది. ఇటువంటి అనిత్యత్వం నిత్యంగా ఉంది. నిత్యమైన అనిత్యవస్తువుల యందు తాదాత్మ్యత పొందటం చేత, ఈతడు ఎప్పుడూ అనిత్యుడు అవుతూనే ఉన్నాడు. ఎప్పుడూ మరణం పాలు పడుతున్నాడు.

28. మృత్యువు వచ్చి, తాను అమర్త్యుడననే తన స్వస్వరూప స్తిథి జ్ఞాపకం రావటం లేదు. మృత్యువు లేనివాడు మృత్యువును అనుభవిస్తున్నాడు. దానియందు ఆత్మారోపణం. అది తనను ఏమీ చెయ్యటంలేదు. తానే దానిలో ప్రవేశించాడు.

29. సంగీతం పాడేవాడు, నాట్యం చేస్తున్నవాడూ మనను చూస్తున్నారా? మనం కదా వాళ్ళను చూస్తున్నాం! కాని, వాళ్ళు మనలో బుద్ధిపూర్వకంగా ప్రవేశిస్తున్నారా! ఎవరు ఎవరియందు తాదాత్మ్యత పొందారు అనేది ప్రశ్న. మనం ప్రకృతియందు తాదాత్మ్యతపొందినా, ప్రకృతి మనలో ప్రవేశించలేదు. ప్రవేశించజాలదు. దానికి ఇందులో ప్రవేశంలేదు. పురుషుణ్ణి ప్రకృతి చూడదు.

30. అలాగే ప్రకృతివిషయంలో తాదాత్మ్యత లేకుండా దానిని చూదవచ్చు. అందులో, ఇది ప్రకృతి, ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది సుఖము, ఇది నిన్నటి దుఃఖము, ఇదే రేపు మళ్ళీ సుఖము – ఇలా దానిని విశ్లేషణ చేయవచ్చు. తాదాత్మ్యత పొందనక్కరలేదు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


26 Feb 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 239


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 239 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. యాజ్ఞవల్క్యమహర్షి - 3 🌻


16. సాంఖ్యము, యోగము రెండూకూడా ఒకటే! ప్రణాయామంవలన చిత్తము, శరీరము రెండూకూడా పరిశుద్ధమవుతాయి. ఇంద్రియాలు మనసులో, మనసేమో అహంకారంలో, అహంకారం బుద్ధిలో, బుద్ధి ప్రకృతిలో కలిసినప్పుడు ధ్యానతత్పరత సిద్ధిస్తుంది. బుద్ధి ప్రకృతిని కలవటమంటే ఏమిటి? అంటే, బుద్ధి ఈ దేహప్రకృతిని కాదు, పరాకృతిని పొందుతుంది అని అర్థం.

17. బుద్ధి ప్రకృతిని పొందుతుంది అంటే, మళ్ళీ పోనేపోయింది అని అన్నట్టే, ప్రకృతినుంచేకదా దూరంపారిపోయి వచ్చాము, మళ్ళీ ప్రకృతిలో కలవటం ఏమిటి అంటే, ఇది పరాకృతి అని తాత్పర్యం. బుద్ధి అందులో కలవాలి. ఈ ప్రకృతిని ధరించి భరిస్తున్నటువంటి పరాశక్తిత్వము ఏదయితే ఉన్నదో, దానియందు ఈ బుద్ధిచిత్తములు లయించాలి.

18. విశ్వమంటే భూత భవ్య భవత్కరమై, వ్యక్తవ్యక్త నామకమైన ప్రకృతే! వ్యక్తమందు, అవ్యక్తమందు రెండురూపాలు కలిగిన ప్రకృతి ఒకటుంది. (the manifest and the unmanifest) అని వివరించాడు.

19. ఇందులో అర్థం తెలుసుకుంటే, మనకు సందేహం అక్కరలేదు. ఈ ప్రకృతి అవ్యక్తంగాకూడా ఉంది. అవ్యక్తప్రకృతి అని ఒకటుంది. రాబోయే శతాబ్దాలలో పుట్టబోయే వాళ్ళందరూ అవ్యక్తప్రకృతి (Yet to manifest) మనమంతా పోతాం. తర్వాత ఎవరైనా ఉంటామా?

20. ఈనాటి నుంచి 100 ఏళ్ళ తర్వాత ఇప్పటి వాళ్ళం ఎవరమైనా ఉంటామా? నది శాస్వతం, నీళ్ళూ అశాశ్వతం. అక్కడ ఉన్న నీళ్ళు గంట తరువాత ఎక్కడి సముద్రంలో కలిసిపోతుంది. కనబడేదాంట్లోనే వ్యక్తావ్యక్తములు, నిరంతర నిత్యానిత్యములు కలిసి ఉన్నాయి. కాబ్ట్టి విద్య-అవిద్య, వేద్యావేద్యములు, చలాచలములు అనే శబ్దములు పురుష, ప్రకృతులకు వాచకములని చెప్పాడు యాజ్ఞవల్క్యుడు.

21. పురుషుడు అనుభవించేది ప్రకృతిని! పురుషుడు ప్రకృతి కాడు. పురుషుడు భోక్త. అనుభవించేటటువంటిది ప్రకృతినేకాని, అవిద్యలో అనుభవిస్తాడు కానీ అతడుయందు అవిద్య ప్రవేశించటం లేదు. అతడు సుఖక్దుఃఖములకు అతీతుడు.

22. అయితే ఆ తరువాత, అనిభవించిన సత్యాన్ని వ్యక్తపరచడానికి యథార్థమైన, సంపూర్ణమైన భాషలేదు. దానికి అనేకమార్లు అనేకవిధాలైన భాషలలో, అనేకమైన అర్థముల స్ఫూర్తిని కలుగచేసేటట్లుగా, వివిధంగా చెప్పినట్లుగా, ఒక్కొక్కప్పుడు పరస్పరం అన్వయించకుండా చెపుతున్నారు.

23. అనేకమైన భాషల్లో కూడా సత్యమే పలుకుతారు. ఒకసారి ఒక భాష వస్తే, మరొకసారి మరిక భాష వస్తోంది. ఆ రెండూ అన్వయించనట్లుగానే కనబడతాయి. కానీ ఒక నుభవంలోంచే వతాయి. అనుభవానికి భాష లేదు, భాషకు అనుభవంలేదు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


23 Feb 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 238


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 238 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. యాజ్ఞవల్క్యమహర్షి - 2 🌻

7. మనసు నిర్వికారంగా చేసుకోవాలంటే ప్రకృతి, పురుషులు అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఒక దీపంతో అనేక దీపాలను ముట్టించుకోవచ్చును. ఆప్రకారంగానే ప్రకృతి బహురూపగుణాలతో ఉంటుంది, పెరుగుతుంది. ఒకదానితో ఒకటి తగిలి పెరుగుతుంది.

8. గుణములు మూడింటిలో సంతోషము, ఆనందము, ఆరోగ్యము, అక్రొధము, అర్జవము, అంటే ఋజుమార్గము; శుద్ధి, ప్రకాశత్వము, సుస్థిరత్వము, అహింస, నిర్మల శ్రద్ధ, వినీతి, లజ్జ, అంటే వినయము; సత్యము, శౌచము, సమత, ఆచారము, అకార్పణ్యము, అంటే కృపణత్వము లేకుండా, పైశునత్వము(లోభత్వము) లేకుండా ఉండటము; అకామవృత్తి(తీవ్రమైన కోరిక లేకుండటము), ఇవన్నీకూడా సత్వగుణముంలు అని చెప్పాడు యాజ్ఞవల్క్యుడు.

9. విగ్రహము, దర్పము, తిరస్కార, అభిమానములు(అంటే మరొకరిని తిరస్కరించి యుద్ధం చెయ్యటము), కామక్రోధములు, మాత్సర్యము, కరుణ లేకపోవటము, భోగకాంక్ష, అహంకారము – ఇవన్నీ కూడా రజోగుణలక్షణములు.

10. అప్రకాశము (చీకటి, కాంతి లేకపోవటము), బహుతరాశనము (అతిగా భోజనము చేయటము), మోహము, వాదము, ప్రమాదము, పెద్దలోస్తే లేవకుండా మత్తుగా ఒకచోట కూర్చుని ఉండటము, మూర్ఖత్వము, మందబుద్ధి, మరణమంటే భయము, దుఃఖము మొదలైనివి తమోగుణలక్షణాలు.

11. పురుషుడు లోపలి చేతనుడు, ప్రకృతి జడమైనటువంటిది. ఆత్ముడు తనను తాను తెలుసుకుంటే, వ్యక్తమైన(తనను పరివేష్టించిన) ప్రకృతితో తాదాత్మ్యం చెందడు. ప్రకృతిని సమీక్షించక, ‘అజర శాశ్వత నిరంజన విమలాచ్యుత పదము’న నిజప్రకాశ స్థిరుడై అక్షరుడవుతాడు. అంటే మోక్ష పదవిని పొందుతాడు. ప్రకృతివశంకాడు. ఆత్ముడు తనను తాను తెలుసుకుంటే, పురుషుడు ప్రకృతి యందు, ప్రకృతి పురుషుని యందు నిలుస్తారు.

12. పురుషుడు నీటిలో చేపవలె, ఉదుంబరమశకములు సంగమించిన రీతిగా వికృతి చెందడు. (మేడిపండుపైన దోమ వాలినప్పుడు ఒకటిగా కనబడినా, ఆ రెండూ వేరే అయినట్లు, శరీరానికీ – ఆత్మకూ భిన్నత్వం ఉంది అని అర్థం) అంతరాత్మ ప్రకృతిని పొందినా – నీటిలో కమలము ఉండికూడా నీరు అంటనట్లుగా – వికారము పొందదు.

13. మనసు ఇంద్రియాలతో ఉండి వికారం చెందుతుంది. మనసుననుసరించి ముద్ధి వికారము చెందుతుంది. పాపపుణ్యాలలో ప్రవర్తిస్తోంది. ఈ ప్రకృతిననుసరించి చిత్తము సంక్షుభితమవుతోంది. అంతరాత్మ ఈ ప్రకృతిలో ఉండికూడా, మాలిన్యం లేకుండా విమలంగా ఉంది.

14. మనోబుద్ధి చిత్తహంకారాలు మాత్రం ఈ ప్రకారంగా మాలిన్యం పొందుతుంటే, ఆత్మ వస్తువుకు మరి ఈ ప్రకృతిలో ఉండికూడా విమలత్వం ఎలా వచ్చింది? దాని స్వభావం ఏమిటి? ఇలాంటి విచారణ వల్ల జీవుడికి ఆత్మజ్ఞానము కలుగుతుంది.

15. అహంకారమేమో పునర్జన్మహేతువవుతోంది. దీనిలో పాపపుణ్యాలు ప్రవేశిస్తున్నాయి, లోభమోహాలవుతున్నాయి. కానీ ఎటువంటి పరిస్థితిలోనూ కూడా ప్రకృతివల్ల ఏ దోషం సంక్రమించకుండా ఉండే ఆత్మవస్తువు ఒకటుందే, దాని స్వభావమేది అనే విచారణ మోక్షమార్గం.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


22 Feb 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 237


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 237 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. యాజ్ఞవల్క్యమహర్షి - 1 🌻

1. ఒకచోట పురాణం మనకు ఏమి చెప్పిందంటే, మనమంతా బ్రహ్మదేవుడి సంతానం కాదు, బ్రహ్మలమే అని చెపుతున్నది. బ్రహ్మ అపరిమితమైన కర్మ అనేక పూర్వకల్పములలో చేసివున్నాడు. అన్ని జీవులూ అతడే కబట్టి, కర్మలోకాలను సృష్టించినవాడు అతడే కబట్టి, ఇన్ని కోట్ల జీవరాశులలో అతడే పుడుతున్నాడని అర్థం.

2. యాజ్ఞవల్క్యుడుని తన తండ్రి వైశంపాయనుడి దగ్గరికి తీసుకెళ్ళి అప్పగించాడు. వైశంపాయనుడు ఆ పిల్లవాణ్ణి, అతడి లక్షణాలను చూచి తన శిష్యుల్లో అత్యుత్తముడు అతడే కాబోతున్నాడు అని గ్రహించి అతడి శిష్యరికాన్ని అంగీకరించాడు.

3. అప్పటి నుంచీ వైశంపాయనుడు దగ్గర యజుర్వేదమును సహాధ్యాయులైన మునిపుత్రులల్తో కలిసి నేర్చుకున్నాడు. యాజ్ఞవల్క్యుడు సత్వగుణ సంపన్నుడయ్యాడు. అతడిలో సాత్వికాహంకారము ఒకటి వచ్చిది.

4. సాత్వికగర్వము తను పరమ సాత్వికుడనని, ప్రథమజ్ఞానినని, తనకు ఆగ్రహమేలేదని ఇలాంటివి అనుకునేవాడు. అదో గర్వం. తరువాత వైశంపాయనుడి ఆగ్రహనికిగురై నేర్చుకున్నవిద్యలన్నీ విసర్జించి వెళ్ళిపోమన్నాడు. యాజ్ఞవల్క్యుడు నేర్చుకున్న విద్యనంతా శరీరంలోని రక్తం రూపంలో విసర్జించాడు.

5. ఆయన వమనం చేసిన రక్తం రూపంలో ఉన్న వేద విద్యనంతా తిత్తిరి పక్షులు తిన్నాయి. అది మళ్ళీ వాటిచేత చెప్పబడటం చేత దానిని ‘తైత్తిరీయం’ అని అన్నారు. ఆ పక్షులు వాటిని మళ్ళీ విసర్జించాయి పక్షి పలుకుల రూపంలో! అదే ‘తైత్తిరీయ ఉపనిషత్తుగా’గా ప్రసిద్ధిచెందింది.

6. అలా తైత్తిరీయోపనిషత్తు ఏర్పడింది, తైత్తిరీయశాఖ ఏర్పడింది. తాత్తిరీయ బ్రాహ్మణకూడా అలాగే వచ్చింది. తరువాత యాజ్ఞవల్క్యుడు తపస్సుచేసి సూర్యుణ్ణి ఆరాధించాడు. ఆయన అనుగ్రంతో శుక్లయజుర్వేదాన్ని పొందాడు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




19 Feb 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 236


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 236 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. దేవలమహర్షి - 7 🌻


36. ఆ రెండు ఫలాలనూ మాత్రమే కోరినట్లయితే, మోహంలేని సంసారయాత్ర చేయవచ్చు. నిజానికి ఏ వస్తువులో మాత్రం ఏమి దోషముంది? మోహమనే దోషం మన బుద్ధిలోనే ఉంది. భార్యలోనో, సంతానంలోనో ఏమి దోషముంది?

37. మనను పీడిస్తున్నది మన బుద్ధిలోని దోషమే. అది వారి యందలి మోహమే. మనమేలా ఉండాలో అలా ఉండ గలిగితే, సంసారబంధాలు మనకు ఉపకారమే చేస్తాయి. సేవ చేస్తాయి, వెళ్ళిపోతాయి. మనం కూడా చివరకు బంధనం లేకుండా వెళ్ళిపోతాము.

38. నారదమహర్షి దేవలుదికి అనేక ధర్మాలు చెప్పాడు. “జీవుడు ఎవ్వరి వాడూ కాదు. నాది అనే వస్తువు ఏదీ ఈ ప్రపంచంలో జీవుడికి లేదు.

39. ఇతర జీవులు కాని, ఇతర పదార్థములు కాని తనవి కావు. తనకు ఏ సంబంధమూ లేదు.ఒక్కడే ఉంటాడు. తన దేహంద్వారా సుఖదుఃఖాలను తానే సృష్టించుకుంటూ, పునర్జన్మకై తానే కర్మచేసుకుంటూ ఉంటాడు.

40. అనేక పుణ్యపాప కర్మల వలన వచ్చిన ఆయా దేహములు, ఆయా కర్మలు క్షీణించటంతో నశించి, తాను బ్రహ్మమయుడై పోతున్నాడు. దానినే మోక్షం అంటారు.

41. పుణ్యపాపకర్మల వినాసనమునకు జ్ఞానమే కారణమౌతోంది. జ్ఞానమనే కుఠారంతో(గొడ్డలితో) పుణ్యపాపకర్మలచే నిర్మితమైన సంసారమనే వృక్షాన్ని ఛేదించు. ఇదే సాంఖ్యమతం.

42. పుణ్యపాప కర్మల మూలాన్ని ఛేదిస్తే, జీవుడు బ్రహ్మీభావం పొందడమనేది సహజంగా జరిగిపోతుంది. దానిని ఎవరూ ప్రత్యేకంగా కోరుకోనవసంలేదు. విజ్ఞానులు దీనిని ఇలా అర్థంచేసుకుంటున్నారూ అని నారదమహర్షి బోధించాడు.

43. మహర్షులు ఆత్మజ్ఞానులు, ఆప్తకాములు. మోక్షం పొందినవారు. శరీరం ఉన్నతరువాత ఏంచేసినా కర్మ ఏర్పడి, కర్మలోంచి ఫలంపుట్టి, దాని ఫలితంగా మరొకజన్మ ఎత్తవలసి వస్తుంది కనుక; అలా కాక, శరీరానికి తపస్సు తప్ప మరొక కర్తవ్యం ఏదీ లేకుండా వారు ఉంటారు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


18 Feb 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 235


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 235 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. దేవలమహర్షి - 6 🌻


30. ఒకడు ఎంతటిపాపంచేసాడో, ఎలాంటిపాపంచేసాడో, ఆ పాపానికి – ఆ లక్షణానికి – అనుగుణమైన శరీరాన్ని అతడికి మహర్షులు ప్రసాదిస్తారు. దానినే శాపం అంటారు.

31. ఎవరైనా బిడ్డలను దేసంకోసం కనాలి. తనకోసం కాదు. మంచి సంతానాన్ని కనడం ఎందుకంటే – వార్ధక్యంలో తనకు వాళ్ళు సేవచేస్తారా లేదా అని ఆలోచించటం కంటే, ఈ దేశానికి మంచిపౌరులను ఇచ్చి ఋనం తీర్చుకొంటాననే ఉద్దేశ్యంతో కనాలి. సంతానాన్ని ఆ కారణంతో కోరుకున్న వారికి ఆ ఫలం లభిస్తుంది.

32. మరి వార్ధక్యంలో ఎవరు చూస్తారు అంటే, తన జాతకంలో పుణ్యంఉంటే అలా చూచే సంతానం కలుగుతుంది. దేశానికి తన పుణ్యం ఇస్తాను అంటే, ఆ ఫలంగా అట్టి సంతానం కలుగవచ్చు. ఎవరైనా సంతానంలేక దుఃఖపడుతున్నాడంటే అది సామాన్యమే.

33. కాని సంతానాన్ని దేసంకోసం అడగాలి. ఆర్యులు అలా అడిగారు. వారు దానికోసం తపస్సుచేసారు. కాబట్టి భారతీయులందరూ కూడా సంతానాన్ని పెద్దలను తెరింపచేయడానికి కోరటం అని సామాన్యవాక్యంగా చెప్పినప్పటికీ; ఇందులో పరమార్థం ఏమిటంటే – దేశానికి సేవచేసేవాళ్ళు, ధర్మాన్ని నిలబేట్టేవాళ్ళు, దేవతలను మెప్పించే వాళ్ళను కోరి పొందమని, అలా పొంది సమాజానికి ఇచ్చినవాడు శాశ్వతమైన మోక్షానికి అర్హుడవుతాడని. అది ప్రధానమైన అంశం. అందుకోసమని పుత్రలాభం ఉంటుంది.

34. సంసారం ఒక విషవృక్షం అని ఒక వంక మన పెద్దలు చెబుతున్నారు. విషవృక్షమే అయినప్పటికీ, దానికి రెండు మధురఫలాలు ఉన్నాయని అన్నారు. విషవృక్షానికి మధుర ఫలాలు ఉంటాయా అంటే, ఆ సంసారమనే విషవృక్షానికి మాత్రం ఉన్నాయని చెబుతున్నారు. ఆ రెండు ఫలాలకోసమే ఈ సంసారవృక్షాన్ని భరించమని చెప్పారు.

35. అవి రెండూ ఏమిటంటే – ఒకటి, అనుకూలవతియైన భార్య – అంటే ధర్మాచరణలో తనకు అనుకూలంగా, తోడుగా ఉండే భార్య; రెండవది, వంశవర్ధనుడై ధర్మాన్ని పాలించే పుత్రుడు. అట్టివాడి ముఖంచూచే భాగ్యం రెండవ మధురఫలం. ఈ రెండు మధురఫలాలు లభిస్తే సంసారం విషవృక్షం అయితే మాత్రం ఏమవుతుంది? భరిస్తారు. అలా చెప్పారు మన పెద్దలు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


17 Feb 2021