భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 239


🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 239 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. యాజ్ఞవల్క్యమహర్షి - 3 🌻


16. సాంఖ్యము, యోగము రెండూకూడా ఒకటే! ప్రణాయామంవలన చిత్తము, శరీరము రెండూకూడా పరిశుద్ధమవుతాయి. ఇంద్రియాలు మనసులో, మనసేమో అహంకారంలో, అహంకారం బుద్ధిలో, బుద్ధి ప్రకృతిలో కలిసినప్పుడు ధ్యానతత్పరత సిద్ధిస్తుంది. బుద్ధి ప్రకృతిని కలవటమంటే ఏమిటి? అంటే, బుద్ధి ఈ దేహప్రకృతిని కాదు, పరాకృతిని పొందుతుంది అని అర్థం.

17. బుద్ధి ప్రకృతిని పొందుతుంది అంటే, మళ్ళీ పోనేపోయింది అని అన్నట్టే, ప్రకృతినుంచేకదా దూరంపారిపోయి వచ్చాము, మళ్ళీ ప్రకృతిలో కలవటం ఏమిటి అంటే, ఇది పరాకృతి అని తాత్పర్యం. బుద్ధి అందులో కలవాలి. ఈ ప్రకృతిని ధరించి భరిస్తున్నటువంటి పరాశక్తిత్వము ఏదయితే ఉన్నదో, దానియందు ఈ బుద్ధిచిత్తములు లయించాలి.

18. విశ్వమంటే భూత భవ్య భవత్కరమై, వ్యక్తవ్యక్త నామకమైన ప్రకృతే! వ్యక్తమందు, అవ్యక్తమందు రెండురూపాలు కలిగిన ప్రకృతి ఒకటుంది. (the manifest and the unmanifest) అని వివరించాడు.

19. ఇందులో అర్థం తెలుసుకుంటే, మనకు సందేహం అక్కరలేదు. ఈ ప్రకృతి అవ్యక్తంగాకూడా ఉంది. అవ్యక్తప్రకృతి అని ఒకటుంది. రాబోయే శతాబ్దాలలో పుట్టబోయే వాళ్ళందరూ అవ్యక్తప్రకృతి (Yet to manifest) మనమంతా పోతాం. తర్వాత ఎవరైనా ఉంటామా?

20. ఈనాటి నుంచి 100 ఏళ్ళ తర్వాత ఇప్పటి వాళ్ళం ఎవరమైనా ఉంటామా? నది శాస్వతం, నీళ్ళూ అశాశ్వతం. అక్కడ ఉన్న నీళ్ళు గంట తరువాత ఎక్కడి సముద్రంలో కలిసిపోతుంది. కనబడేదాంట్లోనే వ్యక్తావ్యక్తములు, నిరంతర నిత్యానిత్యములు కలిసి ఉన్నాయి. కాబ్ట్టి విద్య-అవిద్య, వేద్యావేద్యములు, చలాచలములు అనే శబ్దములు పురుష, ప్రకృతులకు వాచకములని చెప్పాడు యాజ్ఞవల్క్యుడు.

21. పురుషుడు అనుభవించేది ప్రకృతిని! పురుషుడు ప్రకృతి కాడు. పురుషుడు భోక్త. అనుభవించేటటువంటిది ప్రకృతినేకాని, అవిద్యలో అనుభవిస్తాడు కానీ అతడుయందు అవిద్య ప్రవేశించటం లేదు. అతడు సుఖక్దుఃఖములకు అతీతుడు.

22. అయితే ఆ తరువాత, అనిభవించిన సత్యాన్ని వ్యక్తపరచడానికి యథార్థమైన, సంపూర్ణమైన భాషలేదు. దానికి అనేకమార్లు అనేకవిధాలైన భాషలలో, అనేకమైన అర్థముల స్ఫూర్తిని కలుగచేసేటట్లుగా, వివిధంగా చెప్పినట్లుగా, ఒక్కొక్కప్పుడు పరస్పరం అన్వయించకుండా చెపుతున్నారు.

23. అనేకమైన భాషల్లో కూడా సత్యమే పలుకుతారు. ఒకసారి ఒక భాష వస్తే, మరొకసారి మరిక భాష వస్తోంది. ఆ రెండూ అన్వయించనట్లుగానే కనబడతాయి. కానీ ఒక నుభవంలోంచే వతాయి. అనుభవానికి భాష లేదు, భాషకు అనుభవంలేదు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


23 Feb 2021

No comments:

Post a Comment