విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 304, 305 / Vishnu Sahasranama Contemplation - 304, 305


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 304 / Vishnu Sahasranama Contemplation - 304🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 304. అదృశ్యః, अदृश्यः, Adr̥śyaḥ 🌻

ఓం అదృశ్యాయ నమః | ॐ अदृश्याय नमः | OM Adr̥śyāya namaḥ

సర్వేషాం బుద్ధీంద్రియాణాం నోఽగమ్యోఽదృశ్య ఇతీర్యతే కనబడువాడు కాదు. బుద్ధికినీ, సకల జ్ఞానేంద్రియముల చేతను చేరరానివాడు.

వ. మఱియు జవనిక మఱుపున నాట్యంబు సలుపు నటుని చందంబున మాయా యవనికాంతరాళంబున నిలువంబడి నీ మహిమచేఁ బరమహంసలు వివృతరాగద్వేషులు నిర్మలాత్ములు నయిన మునులకు నదృశ్యమానుండవై పరిచ్ఛిన్నుండవు గాని నీకు మూఢదృక్కులు గుటుంబవంతులు నగు మాకు నెట్లు దర్శనీయుండ వయ్యెదు? శ్రీకృష్ణ! వాసుదేవ! దేవకీనందన! నందగోపకుమార! గోవింద! పంకజనాభ! పద్మమాలికాలంకృత! పద్మలోచన! పద్మసంకాశ చరణ! హృషీకేశ! భక్తియోగంబునం జేసి నమస్కరించెద నవధరింపుము. (187)

తెరచాటున వర్తించే నటునిలాగా మాయ అనే యవనిక మాటున వర్తించే నీ మహిమ అగోచరమైనది. పరమహంసలూ, రాగద్వేషరహితులూ అయిన మునీశ్వరులు సైతం దర్శింపలేని పూర్ణపురుషుడవైన నిన్ను సంసార నిమగ్నులమూ, జ్ఞానహీనులమూ అయిన మా వంటివారం ఎలా చూడగలుగుతాము? శ్రీకృష్ణ! వాసుదేవ! దేవకీనందన! నందగోపకుమార! గోవింద! పంకజనాభ! పద్మమాలా విభూషణా! పద్మనయనా! పద్మసంకాశ చరణ! హృషీకేశ! భక్తిపూర్వకమైన నా ప్రణామాలు పరిగ్రహించు! నా విన్నపం మన్నించు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 304🌹

📚. Prasad Bharadwaj

🌻304. Adr̥śyaḥ 🌻

OM Adr̥śyāya namaḥ

Sarveṣāṃ buddhīṃdriyāṇāṃ no’gamyo’dr̥śya itīryate / सर्वेषां बुद्धींद्रियाणां नोऽगम्योऽदृश्य इतीर्यते He who cannot be known or conceived; neither by buddhi i.e., intellect nor by jñānendriyas or the sensory organs.


Śrīmad Bhāgavata - Canto 8, Chapter 5

Avikriyaṃ satyamanantamādyaṃ guhāśayaṃ niṣkalamapratarkyam,
Mano’grayānaṃ vacasāniruktaṃ namāmahe devavaraṃ vareṇyam. (26)


:: श्रीमद्भागवते अष्टमस्कन्धे पञ्चमोऽध्यायः ::

अविक्रियं सत्यमनन्तमाद्यं गुहाशयं निष्कलमप्रतर्क्यम् ।
मनोऽग्रयानं वचसानिरुक्तं नमामहे देववरं वरेण्यम् ॥ २६ ॥


O Supreme Lord, O changeless, unlimited supreme truth. You are the origin of everything. Being all-pervading, You are in everyone's heart and also in the atom. You have no material qualities. Indeed, You are inconceivable. The mind cannot catch You by speculation, and words fail to describe You. You are the supreme master of everyone, and therefore You are worshipable for everyone. We offer our respectful obeisances unto You.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः ।
अदृश्योव्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् ॥ ३३ ॥

యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ ॥ ౩౩ ॥

Yugādikr̥dyugāvarto naikamāyo mahāśanaḥ ।
Adr̥śyovyaktarūpaśca sahasrajidanantajit ॥ 33 ॥


Continues....
🌹 🌹 🌹 🌹🌹



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 305 / Vishnu Sahasranama Contemplation - 305🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 305. వ్యక్తరూపః, व्यक्तरूपः, Vyaktarūpaḥ 🌻

ఓం వ్యక్తరూపాయ నమః | ॐ व्यक्तरूपाय नमः | OM Vyaktarūpāya namaḥ

వ్యక్తరూపః, व्यक्तरूपः, Vyaktarūpaḥవ్యక్తం రూపం భవత్యస్య స్థూలరూపేణ యోగినామ్ ।
స్వయంప్రకాశమానత్వాద్ వ్యక్తరూప ఇతీర్యతే ॥

ఆయా అవతారములలో స్థూల రూపముతో వ్యక్తమగు, స్పష్టముగా గోచరించు వాడు. లేదా స్వయం ప్రకాశమానుడు కావున యోగులకు వ్యక్తమగు రూపము కలవాడు.


:: పోతన భాగవతము తృతీయ స్కంధము ::

సీ.అనఘాత్మా! మఱి భవదవతార గుణకర్మ ఘనవిడంబన హేతుకంబు లయిన
రమణీయమగు దాశరథి వసుదేవ కుమారాది దివ్యనామంబు లోలి
వెలయంగ మనుజులు వివశాత్ములై యవసానకాలంబున సంస్మరించి
జన్మ జన్మాంతర సంచిత దురితంబుఁ బాసి కైవల్యసంప్రాప్తు లగుదుతే.రట్టి దివ్యావతారంబు లవధరించు, నజుఁడవగు నీకు మ్రొక్కెద ననఘచరిత!

చిరశుభాకార! నిత్యలక్ష్మీవిహార! భక్తమందార! దుర్భవ భయవిదూర! (304)

స్వామీ! నీవు పరమపవిత్రుడవు! సచ్చరిత్రుడవు! శాశ్వతమైన దివ్యమంగళ స్వరూపం కలవాడవు! ఎల్లప్పుడూ లక్ష్మీదేవితో కూడి సంచరించేవాడవు. భక్తులకు కల్పవృక్షం వంటి వాడవు. దుర్భరమైన సంసార భయాన్ని దూరంగా పోగొట్టేవాడవు. నీ అవతారాలకూ, సద్గుణాలకూ, సత్కార్యాలకూ, మహదాశయాలకూ కారణమైనవీ, మనోహరమైనవీ అయిన "దాశరథి", "వాసుదేవా"ది దివ్యనామాలను మనుష్యులు తమ తుది ఘడియల్లో స్మరించి, జన్మజన్మాలలో కూడబెట్టుకొన్న పాపాలను పొగొట్టుకొని మోక్షం పొందుతారు. జన్మలేనివాడవై కూడా అటువంటి దివ్యావతారాలలో జన్మించే నీకు మ్రొక్కుతున్నాను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 305🌹

📚. Prasad Bharadwaj

🌻305. Vyaktarūpaḥ🌻

OM Vyaktarūpāya namaḥ

Vyaktaṃ rūpaṃ bhavatyasya sthūlarūpeṇa yoginām,
Svayaṃprakāśamānatvād vyaktarūpa itīryate.

व्यक्तं रूपं भवत्यस्य स्थूलरूपेण योगिनाम् ।
स्वयंप्रकाशमानत्वाद् व्यक्तरूप इतीर्यते ॥

His form is perceived when He assumes a concrete shape. Or being self-luminous, He is visible to the Yogis or learned men.


Śrīmad Bhāgavata - Canto 10, Chapter 10

Kr̥ṣṇa kr̥ṣṇa mahāyogiṃstvamādyaḥ puruṣaḥ paraḥ,
Vyaktāvyaktamidaṃ viśvaṃ rūpaṃ te brāhmaṇā viduḥ. (29)


:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे दशमोऽध्यायः ::

कृष्ण कृष्ण महायोगिंस्त्वमाद्यः पुरुषः परः ।
व्यक्ताव्यक्तमिदं विश्वं रूपं ते ब्राह्मणा विदुः ॥ २९ ॥


O Lord Kṛṣṇa! Lord Kṛṣṇa! Your opulent mysticism is inconceivable. You are the supreme, original person, the cause of all causes, immediate and remote, and You are beyond this material creation. Learned brāhmaṇas know that You are everything and that this cosmic manifestation, in its gross and subtle aspects, is Your form.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः ।
अदृश्योव्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् ॥ ३३ ॥

యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ || ౩౩ ||

Yugādikr̥dyugāvarto naikamāyo mahāśanaḥ ।
Adr̥śyovyaktarūpaśca sahasrajidanantajit ॥ 33 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹


23 Feb 2021

No comments:

Post a Comment