శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 321 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 321-2

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 321 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 321-2 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀

🌻 321-2. 'కామ్యా' 🌻

కోరబడిన విషయమును పొందుటకు తదనుగుణమైన జ్ఞానమును పొందును. అట్టి జ్ఞానమును క్రియా రూపమున నిర్వర్తించుచూ ఒక్కొక్క కోరికను పూరించుకొను చుండును. ఇట్లు అన్నపానీయాదులతో మొదలిడి జీవుడు దేహపోషణమును పొందుట, ఇంద్రియార్థముల ద్వారా ఇంద్రియ పరిపూర్తి గావించు కొనుట, మనోభావముల ననుసరించి భావ పరితృప్తి గావించుకొనుట, అట్లే బుద్ధి లోకములను లేక వెలుగు లోక విషయములను తెలియ గోరుట; అటుపైన యోగము, ధ్యానము, జ్ఞానము అనుచు తనను, దైవమును తెలియకోరుట క్రమముగ జరుగును.

తన నిజస్థితి తనకి తెలిసినపుడు తాను పరిపూర్ణు డగును. నిజస్థితి తెలియుటగ అనగా తాను ఉండుట అనగా ఏమో తెలియుట. అట్లు తెలిసినవానికి ఇక వుండుటయే వుండును. అదియే సమాధి. అదియే పరమాత్మ స్థితి. ఇంత కార్యక్రమము నడిపించి జీవులను పరిపూర్ణము చేయుటకు శ్రీమాత సృష్టియందు కోరబడు రూపముగ నుండును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 321-2 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻

🌻 321-1. Kāmyā काम्या (321)🌻

Kāmyā means longing for. She is desired by the seekers of liberation. Liberation is possible only through knowledge and She is that knowledge (nāma 980). The 12th night of dark lunar fortnight is known as kāmyā.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

20 Nov 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 97

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 97 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ఈ జీవితమన్నది వ్యర్థం చెయ్యడానికి కాదు. అభివృద్ధి చెందడానికి వున్న అవకాశం. వ్యక్తి తన లోపలికి వెళ్ళాలి. ఏ క్షణం నీ కేంద్రం నీ ప్రశ్నలన్నిటికీ సమాధానమిస్తుందో నీ సంక్లిష్టతలన్నీ అదృశ్యమయి పోతాయి. అయోమయ ముండదు. ప్రతిదీ స్పష్టమవుతుంది. 🍀

హృదయపు లోలోతుల్లో జీవితమన్నది ఎంతో విలువయిన అపూర్వ బహుమతిగా భావించాలి. జీవితంలో ప్రతిక్షణమూ విలువైందే. కాబట్టి ఈ జీవితమన్నది వ్యర్థం చెయ్యడానికి కాదు. అభివృద్ధి చెందడానికి వున్న అవకాశం. ప్రతి మనిషి విలువైన దాన్ని, ముఖ్యమైన దాన్ని చెయ్యాలి. వ్యక్తి ముందుకు చూడాలి. వ్యక్తి బాహ్యమయిన విషయాల గురించి మాత్రమే ప్రకటించు కోకూడదు. జనాలు చేస్తున్నదదే. వ్యక్తి తన లోపలికి వెళ్ళాలి. పరిశీలించాలి. లోపలి లోపలికి వెళ్ళు కేంద్రాన్ని చేరాలి.

ఏ క్షణం నీ కేంద్రం నీ ప్రశ్నలన్నిటికీ సమాధానమిస్తుందో నీ సంక్లిష్టతలన్నీ అదృశ్యమయి పోతాయి. అయోమయ ముండదు. ప్రతిదీ స్పష్టమవుతుంది. స్వచ్ఛ స్పటికంగా వుంటుంది. అన్నీ ఆ స్పష్టత నించీ చూడొచ్చు. ఆ క్షణం వ్యక్తి విశ్వం తనకు ఎంత యిచ్చిందో తెలుసు కుంటాడు. అంతే కాదు. మనం ఎంతగా విశ్వం పట్ల కృతజ్ఞత లేకుండా వున్నామో కూడా తెలిసి వస్తుంది. మత పూర్వకమయిన జీవితానికి కృతజ్ఞత అన్నది ప్రాధమిక అవసరం. కృతజ్ఞత నించీ ప్రార్థన పుడుతుంది. ప్రేమ పుడుతుంది. దయ పుడుతుంది. విలువ తెలిసిన వ్యక్తి కృతజ్ఞత ప్రకటించాలి. జీవితం విలువ తెలిసిన, అస్తిత్వపు అనంత విలువ తెలిసిన వ్యక్తి కృతజ్ఞత ప్రకటించాలి.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

20 Nov 2021

మైత్రేయ మహర్షి బోధనలు - 30

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 30 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 19. నిజమైన విశ్రాంతి-2 🌻

విశ్రాంతి కోరుట తమోగుణ లక్షణము, అది స్తబ్దతను పెంచును. నదీ ప్రవాహము ఎక్కువగ ఉన్నను, అసలు లేకున్నను హాయిని గొలుపదు, అటులనే మానవ జీవనము కూడ. మహానగరము నందునను, మహారణ్యము నందునను ఒకే రకమైన వేగము నందుండుట అభ్యసింపుము. నిశ్చల వేగము సమతుల్యము నకు దారిచూపును. సమతుల్యమే యోగస్థితి, విశ్రాంత స్థితి. ఈ స్థితి యందున్నవాడు సహజయోగి.

అతని మనస్సున అతివేగముగాని, అతినిదానము గాని యుండదు. సన్నివేశములు అతనికి వేగమును గాని, నిదానమును గాని కలిగింపపు. అతని సాన్నిధ్యమున సమస్తము సమవేగము నందుండును. అనగా అతివేగవంతులు కొంత వేగమును కోల్పోవుదురు. అతి నిదానస్తులు కొంతవేగమును పొందుదురు. యోగులు సమస్తమును సమవేగమున నుంచుదురు. సమవేగులకు శక్తి ధారాపాతముగ అందుచు నుండును. వారి యందు శక్తి దుర్వినియోగము కాదు. విశ్రాంతి యనుపదము ఒక ఆరాటముగ గాక, ఆచరణ యందు అవతరించి యుండును. అవిశ్రాంతముగ, సమ వేగమున కృషిచేయువారే నిజమైన విశ్రాంతి ననుభవించుచున్నారు.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

20 Nov 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 513 / Vishnu Sahasranama Contemplation - 513

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 513 / Vishnu Sahasranama Contemplation - 513🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 513. జీవః, जीवः, Jīvaḥ 🌻

ఓం జీవాయ నమః | ॐ जीवाय नमः | OM Jīvāya namaḥ

జీవః, जीवः, Jīvaḥ

ప్రాణాన్ క్షేత్రజ్ఞరూపేణ ధారయన్ జీవ ఉచ్యతే

ప్రాణములను నిలుపువాడు అను అర్థమున 'జీవ' శబ్దము ఏర్పడును. పరమాత్ముడే క్షేత్రజ్ఞ రూపమున దేహమునందలి ప్రాణములను నిలుపి ఉంచును గనుక జీవః.

:: శ్రీమద్భగవద్గీత - పురుషోత్తమప్రాప్తి యోగము ::

మమైవాంశో జీవలోకే జీవభూతస్సనాతనః ।
మనష్షష్ఠానీన్ద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ॥ 7 ॥

నా యొక్క అనాదీ, నిత్యమగు అంశయే జీవలోకమందు జీవుడై ప్రకృతియందున్న త్వక్‍, చక్షు, శ్శ్రోత, జిహ్వ, ఘ్రాణ, మనంబులను ఆరు (ఐదు జ్ఞానేంద్రియములు + మనస్సు) ఇంద్రియములను ఆకర్షించుచున్నది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 513🌹

📚. Prasad Bharadwaj

🌻 513. Jīvaḥ 🌻

OM Jīvāya namaḥ

प्राणान् क्षेत्रज्ञरूपेण धारयन् जीव उच्यते /

Prāṇān kṣetrajñarūpeṇa dhārayan jīva ucyate

Supporting the Prāṇa or life in the form of kṣetrajña i.e., the in dweller, He is called Jīvaḥ.

:: श्रीमद्भगवद्गीत - पुरुषोत्तमप्राप्ति योग ::

ममैवांशो जीवलोके जीवभूतस्सनातनः ।
मनष्षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ॥ ७ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 15

Mamaivāṃśo jīvaloke jīvabhūtassanātanaḥ,
Manaṣṣaṣṭhānīndriyāṇi prakr‌tisthāni karṣati. 7.

It is verily a part of Mine which, becoming the eternal individual soul in the region of living beings, draws the organs which have the mind as their sixth and which abide in Nature.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः ।
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥

జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః ।
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥

Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

20 Nov 2021

20-NOVEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 20 శని వారం, , స్థిర వారము ఆక్టోబర్ 2021 కార్తీక మాసం 16వ రోజు 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 116 / Bhagavad-Gita - 116 2-69🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 513 / Vishnu Sahasranama Contemplation - 513 🌹
4) 🌹 DAILY WISDOM - 191🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 30🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 97🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 321-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 321-2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹*
*20, నవంబర్‌ 2021, స్థిర వారము*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 16వ రోజు 🍀*

*నిషిద్ధములు : ఉల్లి, ఉసిరి, చద్ది ,ఎంగిలి, చల్ల*
*దానములు : నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారం*
*పూజించాల్సిన దైవము :* 
*స్వాహా అగ్ని*
*జపించాల్సిన మంత్రము :*
*ఓం స్వాహాపతయే జాతవేదసే నమః*
*ఫలితము : వర్చస్సు, తేజస్సు ,పవిత్రత*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,  
కార్తీక మాసం
తిథి: కృష్ణ పాడ్యమి 17:06:39 వరకు 
తదుపరి కృష్ణ విదియ
నక్షత్రం: రోహిణి 31:36:47 వరకు
తదుపరి మృగశిర
యోగం: శివ 28:50:28 వరకు 
తదుపరి సిధ్ధ 
కరణం: కౌలవ 17:05:38 వరకు
వర్జ్యం: 22:33:40 - 24:22:08 
దుర్ముహూర్తం: 07:53:41 - 08:38:45
రాహు కాలం: 09:12:33 - 10:37:03
గుళిక కాలం: 06:23:33 - 07:48:03
యమ గండం: 13:26:04 - 14:50:34
అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:23
అమృత కాలం: 27:59:04 - 29:47:32 
మరియు 24:47:04 - 26:35:36
సూర్యోదయం: 06:23:33
సూర్యాస్తమయం: 17:39:34
వైదిక సూర్యోదయం: 06:27:20
వైదిక సూర్యాస్తమయం: 17:35:47
చంద్రోదయం: 18:24:07
చంద్రాస్తమయం: 07:00:35
సూర్య రాశి: వృశ్చికం, చంద్ర రాశి: వృషభం
శ్రీవత్స యోగం - ధన లాభం , 
సర్వ సౌఖ్యం 31:36:47 వరకు 
తదుపరి వజ్ర యోగం - ఫల ప్రాప్తి 
పండుగలు : రోహిణి వ్రతం, Rohini Vrat
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 116 / Bhagavad-Gita - 116 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 69 🌴*

69. యా నిశా సర్వభూతానాం 
తస్యాం జాగర్తి సంయమీ |
యస్యాం జాగ్రతి భూతాని 
సా నిశా పశ్యతో మునే: ||

🌷. తాత్పర్యం :
*సకల జీవులకు ఏది రాత్రియో అదియే ఆత్మనిగ్రహము కలవానికి మేల్కొని యుండు సమయము. సర్వజీవులు మేల్కొని యుండు సమయము అంతర్ముఖుడైన మునికి రాత్రి సమయము.* 

🌷. భాష్యము :
తెలివిగల వారిలో రెండు తరగతుల వారు కలరు. అందులో నొకరు ఇంద్రియ ప్రీత్యర్థమై భౌతికకర్మల యందు తెలివిని కలిగియుండగా, ఇంకొక రకమువారు అంతర్ముఖులు మరియు అభ్యాసతత్పరులై యుందురు. అంతర్ముఖుడైన ముని (తెలివిగల మనుజుడు) కర్మల విషయములో లగ్నమైయున్న మనుజులకు రాత్రి వంటివి. ఆత్మానుభవరాహిత్యము వలన అట్టి రాత్రి యందు లౌకికజనులు సదా నిద్రలో నుందురు. అట్టి విషయానురక్తుల “రాత్రిసమయము” నందు మాత్రము అంతర్ముఖుడైన ముని జాగరూకుడై యుండును. 

మునియైనవాడు ఆద్యాత్మిక పురోభివృద్ధి యందు దివ్యానందము నొందగా, ఆత్మానుభవ విషయమున నిద్రించు కారణముగా భౌతికకర్మల యందున్న మనుజుడు పలువిధములైన భోగములను గూర్చి కలలు గనుచు ఆ నిద్రావస్థ యందు కొన్నిమార్లు సుఖమును, మరికొన్నిమార్లు దుఖమును అనుభవించుచుండును. అతర్ముఖుడైన ముని భౌతికములైన సుఖదు:ఖముల యెడ సదా తటస్థుడై యుండును. భౌతికకర్మలచే ఏమాత్రము కలతచెందక అతడు తన ఆత్మానుభవకర్మల యందు నిమగ్నుడై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 116 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 2 - Sankhya Yoga - 69 🌴*

69. yā niśā sarva-bhūtānāṁ tasyāṁ jāgarti saṁyamī
yasyāṁ jāgrati bhūtāni sā niśā paśyato muneḥ

🌷Translation :
*What is night for all beings is the time of awakening for the self-controlled; and the time of awakening for all beings is night for the introspective sage.*

🌷 Purport :
There are two classes of intelligent men. One is intelligent in material activities for sense gratification, and the other is introspective and awake to the cultivation of self-realization. Activities of the introspective sage, or thoughtful man, are night for persons materially absorbed.

Materialistic persons remain asleep in such a night due to their ignorance of self-realization. The introspective sage remains alert in the “night” of the materialistic men. The sage feels transcendental pleasure in the gradual advancement of spiritual culture, whereas the man in materialistic activities, being asleep to self-realization, dreams of varieties of sense pleasure, feeling sometimes happy and sometimes distressed in his sleeping condition. The introspective man is always indifferent to materialistic happiness and distress. He goes on with his self-realization activities undisturbed by material reactions.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 513 / Vishnu Sahasranama Contemplation - 513🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 513. జీవః, जीवः, Jīvaḥ 🌻*

*ఓం జీవాయ నమః | ॐ जीवाय नमः | OM Jīvāya namaḥ*

జీవః, जीवः, Jīvaḥ

ప్రాణాన్ క్షేత్రజ్ఞరూపేణ ధారయన్ జీవ ఉచ్యతే 

ప్రాణములను నిలుపువాడు అను అర్థమున 'జీవ' శబ్దము ఏర్పడును. పరమాత్ముడే క్షేత్రజ్ఞ రూపమున దేహమునందలి ప్రాణములను నిలుపి ఉంచును గనుక జీవః.

:: శ్రీమద్భగవద్గీత - పురుషోత్తమప్రాప్తి యోగము ::
మమైవాంశో జీవలోకే జీవభూతస్సనాతనః ।
మనష్షష్ఠానీన్ద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ॥ 7 ॥

నా యొక్క అనాదీ, నిత్యమగు అంశయే జీవలోకమందు జీవుడై ప్రకృతియందున్న త్వక్‍, చక్షు, శ్శ్రోత, జిహ్వ, ఘ్రాణ, మనంబులను ఆరు (ఐదు జ్ఞానేంద్రియములు + మనస్సు) ఇంద్రియములను ఆకర్షించుచున్నది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 513🌹*
📚. Prasad Bharadwaj

*🌻 513. Jīvaḥ 🌻*

*OM Jīvāya namaḥ*

प्राणान् क्षेत्रज्ञरूपेण धारयन् जीव उच्यते / 
Prāṇān kṣetrajñarūpeṇa dhārayan jīva ucyate 

Supporting the Prāṇa or life in the form of kṣetrajña i.e., the in dweller, He is called Jīvaḥ.

:: श्रीमद्भगवद्गीत - पुरुषोत्तमप्राप्ति योग ::
ममैवांशो जीवलोके जीवभूतस्सनातनः ।
मनष्षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति ॥ ७ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 15
Mamaivāṃśo jīvaloke jīvabhūtassanātanaḥ,
Manaṣṣaṣṭhānīndriyāṇi prakr‌tisthāni karṣati. 7.

It is verily a part of Mine which, becoming the eternal individual soul in the region of living beings, draws the organs which have the mind as their sixth and which abide in Nature.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
जीवो विनयिता साक्षी मुकुन्दोऽमितविक्रमः ।
अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः ॥ ५५ ॥

జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః ।
అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః ॥ 55 ॥

Jīvo vinayitā sākṣī mukundo’mitavikramaḥ,
Ambhonidhiranantātmā mahodadhiśayo’ntakaḥ ॥ 55 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 191 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 9. No One Escapes the Ups and Downs of Life 🌻*

The power of sadhana does not gain adequate confidence until divine powers collaborate with it, and God Himself seems to be at the back of the seeker of God. We have been noting a great epic symbol in the Mahabharata, wherein we are given the narration of the adventure of the spirit in its struggle for ultimate freedom. 

The wilderness of the forest life that the Pandavas had to undergo is a great lesson to the spiritual seeker. No one can escape the ups and downs of life, the vicissitudes of time through which the ancient sages and saints have passed; everyone seems to have the duty to tread the same path. We have to walk the same path, and the path is laid before us with all its intricacies, with all its problems and difficulties, as well as its own facilities. 

We seem to be lost to ourselves and lost to the whole world, with no ray of hope before us, at least to our waking consciousness. When the Pandavas were in the forest, they did not know what would happen in the future. It was just oblivion and gloom which hung heavy like dark clouds upon them. The strength of the Pandavas was not equal to the task. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 30 🌹* 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 19. నిజమైన విశ్రాంతి-2 🌻*

*విశ్రాంతి కోరుట తమోగుణ లక్షణము, అది స్తబ్దతను పెంచును. నదీ ప్రవాహము ఎక్కువగ ఉన్నను, అసలు లేకున్నను హాయిని గొలుపదు, అటులనే మానవ జీవనము కూడ. మహానగరము నందునను, మహారణ్యము నందునను ఒకే రకమైన వేగము నందుండుట అభ్యసింపుము. నిశ్చల వేగము సమతుల్యము నకు దారిచూపును. సమతుల్యమే యోగస్థితి, విశ్రాంత స్థితి. ఈ స్థితి యందున్నవాడు సహజయోగి.* 

*అతని మనస్సున అతివేగముగాని, అతినిదానము గాని యుండదు. సన్నివేశములు అతనికి వేగమును గాని, నిదానమును గాని కలిగింపపు. అతని సాన్నిధ్యమున సమస్తము సమవేగము నందుండును. అనగా అతివేగవంతులు కొంత వేగమును కోల్పోవుదురు. అతి నిదానస్తులు కొంతవేగమును పొందుదురు. యోగులు సమస్తమును సమవేగమున నుంచుదురు. సమవేగులకు శక్తి ధారాపాతముగ అందుచు నుండును. వారి యందు శక్తి దుర్వినియోగము కాదు. విశ్రాంతి యనుపదము ఒక ఆరాటముగ గాక, ఆచరణ యందు అవతరించి యుండును. అవిశ్రాంతముగ, సమ వేగమున కృషిచేయువారే నిజమైన విశ్రాంతి ననుభవించుచున్నారు. 

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 97 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. ఈ జీవితమన్నది వ్యర్థం చెయ్యడానికి కాదు. అభివృద్ధి చెందడానికి వున్న అవకాశం. వ్యక్తి తన లోపలికి వెళ్ళాలి. ఏ క్షణం నీ కేంద్రం నీ ప్రశ్నలన్నిటికీ సమాధానమిస్తుందో నీ సంక్లిష్టతలన్నీ అదృశ్యమయి పోతాయి. అయోమయ ముండదు. ప్రతిదీ స్పష్టమవుతుంది. 🍀*

హృదయపు లోలోతుల్లో జీవితమన్నది ఎంతో విలువయిన అపూర్వ బహుమతిగా భావించాలి. జీవితంలో ప్రతిక్షణమూ విలువైందే. కాబట్టి ఈ జీవితమన్నది వ్యర్థం చెయ్యడానికి కాదు. అభివృద్ధి చెందడానికి వున్న అవకాశం. ప్రతి మనిషి విలువైన దాన్ని, ముఖ్యమైన దాన్ని చెయ్యాలి. వ్యక్తి ముందుకు చూడాలి. వ్యక్తి బాహ్యమయిన విషయాల గురించి మాత్రమే ప్రకటించు కోకూడదు. జనాలు చేస్తున్నదదే. వ్యక్తి తన లోపలికి వెళ్ళాలి. పరిశీలించాలి. లోపలి లోపలికి వెళ్ళు కేంద్రాన్ని చేరాలి. 

ఏ క్షణం నీ కేంద్రం నీ ప్రశ్నలన్నిటికీ సమాధానమిస్తుందో నీ సంక్లిష్టతలన్నీ అదృశ్యమయి పోతాయి. అయోమయ ముండదు. ప్రతిదీ స్పష్టమవుతుంది. స్వచ్ఛ స్పటికంగా వుంటుంది. అన్నీ ఆ స్పష్టత నించీ చూడొచ్చు. ఆ క్షణం వ్యక్తి విశ్వం తనకు ఎంత యిచ్చిందో తెలుసు కుంటాడు. అంతే కాదు. మనం ఎంతగా విశ్వం పట్ల కృతజ్ఞత లేకుండా వున్నామో కూడా తెలిసి వస్తుంది. మత పూర్వకమయిన జీవితానికి కృతజ్ఞత అన్నది ప్రాధమిక అవసరం. కృతజ్ఞత నించీ ప్రార్థన పుడుతుంది. ప్రేమ పుడుతుంది. దయ పుడుతుంది. విలువ తెలిసిన వ్యక్తి కృతజ్ఞత ప్రకటించాలి. జీవితం విలువ తెలిసిన, అస్తిత్వపు అనంత విలువ తెలిసిన వ్యక్తి కృతజ్ఞత ప్రకటించాలి.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 321 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 321-2 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 73. కామ్యా, కామకళారూపా, కదంబ కుసుమప్రియా ।
కళ్యాణీ, జగతీకందా, కరుణారస సాగరా ॥ 73 ॥ 🍀*

*🌻 321-2. 'కామ్యా' 🌻* 

కోరబడిన విషయమును పొందుటకు తదనుగుణమైన జ్ఞానమును పొందును. అట్టి జ్ఞానమును క్రియా రూపమున నిర్వర్తించుచూ ఒక్కొక్క కోరికను పూరించుకొను చుండును. ఇట్లు అన్నపానీయాదులతో మొదలిడి జీవుడు దేహపోషణమును పొందుట, ఇంద్రియార్థముల ద్వారా ఇంద్రియ పరిపూర్తి గావించు కొనుట, మనోభావముల ననుసరించి భావ పరితృప్తి గావించుకొనుట, అట్లే బుద్ధి లోకములను లేక వెలుగు లోక విషయములను తెలియ గోరుట; అటుపైన యోగము, ధ్యానము, జ్ఞానము అనుచు తనను, దైవమును తెలియకోరుట క్రమముగ జరుగును. 

తన నిజస్థితి తనకి తెలిసినపుడు తాను పరిపూర్ణు డగును. నిజస్థితి తెలియుటగ అనగా తాను ఉండుట అనగా ఏమో తెలియుట. అట్లు తెలిసినవానికి ఇక వుండుటయే వుండును. అదియే సమాధి. అదియే పరమాత్మ స్థితి. ఇంత కార్యక్రమము నడిపించి జీవులను పరిపూర్ణము చేయుటకు శ్రీమాత సృష్టియందు కోరబడు రూపముగ నుండును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 321-2 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 73. Kamya kamakalarupa kadanba kusumapriya
Kalyani jagatikanda karunarasasagara ॥ 73 ॥ 🌻*

*🌻 321-1. Kāmyā काम्या (321)🌻*

Kāmyā means longing for. She is desired by the seekers of liberation. Liberation is possible only through knowledge and She is that knowledge (nāma 980). The 12th night of dark lunar fortnight is known as kāmyā.    

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹