🌹. శ్రీరామశర్మ ప్రజ్ఞా సూక్తములు - 1 🌹

*🌹. శ్రీరామశర్మ ప్రజ్ఞా సూక్తములు - 1 🌹*
 ✍️. సద్గురు పండిత శ్రీరామశర్మ ఆచార్య
📚. ప్రసాద్ భరద్వాజ 

*గురువు సామర్థ్యము - శిష్యుని పాత్రత,*

*గురువు యొక్క సిద్ధి - శిష్యుని సాధన,*

*గురువు ప్రేరణ - శిష్యుని సక్రియత,*

*గురువు స్నేహము - శిష్యుని శ్రద్ధ,*

*గురువు అనుశాసనము - శిష్యుని అనుగమనము,*

*ఇలా గురుశిష్యులు పరస్పరము సహాయ సహకారములు అందించుకుంటూ ఉంటారు.*
🌹 🌹 🌹 🌹 🌹

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 1 🌹

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 1 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 1 🌻*

1. భగవంతుడు అనగా శాశ్వత అస్థిత్వము, అనంత సర్వవ్యాపకత్వము.
భగవంతుడు శాశ్వత అనంత అస్థిత్వమైనపుడు, అందులో
భగవంతుని అనంత సంఖ్య గల స్థితులున్నవి.
కానీ అందు భగవంతునికి రెండే రెండు మూలాధార స్థితులున్నవి.
1. అసలు (మూల) స్థితి.
2 చరమ (పరమ) స్థితి. 

2. భగవంతునికి చైతన్యమందు ఎరుకలేని
( "భగవంతుడు ఉన్నాడు" అనెడు) పరాత్పర పరబ్రహ్మ స్థితి.

3. భగవంతునికి చైతన్యము లేని స్థితి - పరాత్పరము,
భగవంతునికి చైతన్యము గల స్థితి - పరమాత్మ

4. పరాత్పర స్థితికిని, పరమాత్మ స్థితికిని గల భేదము చైతన్యము మాత్రమే.
🌹 🌹 🌹 🌹 🌹

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 16

Image may contain: 1 person, standing and shoes
🌹. కఠోపనిషత్‌ వివరణ  - చలాచలభోధ  - 16 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయో మార్గము - ప్రేయో మార్గములు  స్వధర్మము-పరధర్మము - 4 🌻

మరి అటువంటి సంధ్యాకాలమును మనం ఇవాళ సద్వినియోగ పరచుకుంటున్నామా అంటే ఈ ప్రేయోమార్గమును ఆశ్రయించడం ద్వారా ఆయా సంధ్యాకాలములందు ఒకసారి గమనిస్తే ఉదయం ఆరుగంటలకి అవకాశం వున్నంతవరకు నిద్రావస్థలో గడుపుతూవుంటారు. 

మధ్యాహ్నం పన్నెండు గంటలకి అవకాశం వున్నంతవరకూ ధనార్జనలో గడుపుతూ వుంటారు. సాయంత్రం ఆరుగంటలకి విషయ సుఖాపేక్షలో అది తిందామా ఇది తాగుదామా అనే భావనతో గడుపుతూ వుంటాడు. అర్ధరాత్రి పన్నెండు గంటలకి కామోపభోగములందు మునిగిపోయి వుంటాడు. 

మరి ఇప్పుడు నాలుగు సంధ్యలలో జీవుడు ఈరకంగా తన ఆయుక్షీణం అయిపోతున్నటువంటి పద్ధతిని అయినటువంటి ప్రేయోమార్గమును ఆశ్రయించి, తత్ కాల సుఖమును అనుభవిస్తూ శాశ్వత దుఃఖములోపలికి, శాశ్వత దుఃఖకారణమైన జననమరణ చక్రంలో బంధింపబడేటటువంటి, కర్మచక్రంలో బంధింపబడేటటువంటి, ద్వంద్వానుభవములలో బంధింపబడేటటువంటి, విధానమును ఆశ్రయించడం వలన నిరంతరాయముగా చనిపోతున్నప్పటికీ, అంటే అర్ధం ఏమిటి? జీవుడు నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నాడు. 

ఎప్పుడో 100 సంవత్సరాలకి ఒకసారి చనిపోవడంలా.  కేవలం ప్రతిరోజూ గాఢనిద్రావస్థలో తనని తాను మర్చిపోవడం ద్వారా , తనను తాను ఎఱుక లేకుండా జీవించడం ద్వారా, తాను ఏ స్థితిలో వున్నాడో తెలియకుండా జీవించడం ద్వారా నిత్య ప్రళయాన్ని అనుభవిస్తూ, గాఢ సుషుప్తియందు మరణిస్తూ మరల మేల్కొనేటప్పటికీ ఆ తెలివిని పొంది సజీవుడై మెలకువలో వ్యవహరిస్తున్నాడు.

 కాబట్టి జ్ఞానపద్ధతిగా వివేకము రీత్యా, విజ్ఞానము దృష్ట్యా గమనించినట్లయితే జీవుడు ప్రతిరోజూ చనిపోతున్నాడు. ప్రతిరోజూ మరణమునే పొందుతున్నాడు. 

కాబట్టి అట్టి నిత్యప్రళయాన్ని పొందేటటువంటి ప్రేయోమార్గము దూరముగా పెట్టవలసినటువంటి జీవన విధానము. మానవులందరూ ఈ సత్యాన్ని తప్పక గ్రహించాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

మనోశక్తి - Mind Power - 76

Image may contain: one or more people
🌹. మనోశక్తి  - Mind Power  - 76 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 Q 70 :--పునర్జన్మ vs కుమారుడు 🌻

Ans :--
గత జన్మలో శత్రువు ఈ జన్మలో కుమారుడిగా లేదా కుమార్తె గా జన్మిస్తుంది. వీరు ప్రేమ సృజనాత్మకత జీవితం విలువలు ఆధ్యాత్మికతను గురించి జ్ఞాన సముపార్జన చేస్తారు.

2) మన ఎమోషన్స్ మనకు బంధాలను కలుగజేస్తాయి.

ఒకవేళ ఈ జన్మలో ఒక వ్యక్తితో emotional గా బంధాన్ని కొనసాగిస్తే దాని గురించిన dynamics అర్థం చేసుకోకుండానే మరణిస్తే తర్వాతి జన్మలో కూడా అదే బంధాన్ని కొనసాగించి ఆ dynamics పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఒక emotion ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఒక జన్మ లేదా కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు.

ఆ ఎమోషన్ ని కొనసాగించడానికి ఆ వ్యక్తినే ఎంచుకోవచ్చు లేదా అదే frequency ఉన్న మరో వ్యక్తిని ఎంచుకోవచ్చు. ఆత్మకు ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మజ్ఞానం విస్తారంగా పెరిగినపుడు emotion పరంగా పెంచుకున్న బంధాల సంకెళ్ళు అన్నీ పటాపంచలు అవుతాయి.

ఇంక ఎమోషన్స్ కోసం జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.ప్రతి ఆత్మ జ్ఞాన సముపార్జన చేసుకుని ఇతర జీవాత్మలకు భోదించకుండా వారిని ఆత్మజ్ఞానులు చేయకుండా ఈ లోకం నుండి విముక్తి పొందడం జరుగదు. 

ప్రస్తుతం భూమి మీద ఎవరైతే విరివిగా ఆత్మజ్ఞానం భోదిస్తున్నారో వారందరు ఆఖరిజన్మల్లో ఉన్నారని సేత్ తెలియజేస్తున్నారు. ఎమోషనల్ గా బంధాన్ని పూర్తిగా ఆస్వాదించి దాని dynamics అధ్యయనం చేయడానికి కవల పిల్లలుగా జన్మిస్తారు.
🌹 🌹 🌹 🌹 🌹

శివగీత - 18 / The Siva-Gita - 18

🌹. శివగీత - 18 / The Siva-Gita - 18 🌹
 🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము
🌻. విరజాదీక్షా లక్షణ యోగము - 2 🌻

దుర్గం యస్యాస్తి లంకాఖ్యం దుర్జయం దేవ దానవై:,
చతురంగ బలం యస్య - వర్తతే కోటి సంఖ్యయా.7

ఏకాకి నా త్వయా జేయ - స్సకధం నృప నందన!
ఆకాంక్షతే కారే దుర్తుం - బాలశ్చంద్ర మాసం యధా 8

సురాసురులకు ప్రవేశించుట వీలులేని (శక్యము కాని ) ది, అజేయమైనది లంకాపురము రాజధానిగా అతనికి కలదు, మరియు కోట సంఖ్యాక (అసంఖ్యాక )మైన గజ - తురగ -పదాతి మున్నగు చతురంగ సైన్యము గల అంతటి రావణుని నీ వొక్కండ 
వెట్లు జయింప దలచావు.? 

నీ తలంపును విచారించినచో 
బాల్యావస్థలో నున్న శిశువు తన హస్తములతో నాకాశ మందలి చంద్రుని గ్రహించు మాడ్కి కామ మోహింతు డవైన నీవు గొప్ప బలశాలి యైన రావణుని చంప చూస్తున్నావు.

తధాత్వం కామ మోహేన - జయం తస్యాభి వాంఛసి,
క్షత్రియోహం ముని శ్రేష్ఠ! - భార్యా మే రక్ష సా హృతా. 9

యదితం నిహ న్మ్యాశు - జీవనే మేస్తి కిం ఫలమ్,
అతస్తే తత్వ బోదేనన - మే కించిత్ప్ర యోజనమ్ 10

కామ క్రోధాదయ స్సర్వే -దహంతే తే తనుం మమ,
అహంకారో పిమే నిత్యం - జీవనం హర్తు ముధ్యతః .11

శ్రీరాముడు పలుకుచున్నాడు: ఓయీ! మునికుల చంద్రా! క్షత్రియ వంశ జనితుండ నేను. నా సతియైన సీతా దేవి రావణుని చేత అపహరించ బడినది.

 అందుచేత లంకాధి పతియైన రావణుని చంపి నా సీతను అతని చెరవిడి పంపకుండిన నేను బ్రతికి యుండుట ప్రయోజనమేమి? 
కాన నీవిప్పుడు నాకు బోధించు తత్వము నుండి ఏలాంటి లాభము లేదు.

 కామ క్రోధ లోభ మోహము మొదలగు నరి షడ్వర్గము నా దేహమును దహింప చేయు చున్నది. అహంకార మనునది. నన్ను ఎల్లప్పుడు నా ప్రాణముల నపహరింప చేయుటకు నుధ్యుక్తమై యున్నది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 18 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 03 : 
🌻 Viraja Deeksha Lakshana Yoga - 2 🌻
 
7. The fort called Lanka which is his capital is impregnable to Gods and demons. 

8. Also, he has a Chaturangini army which consists of billions of horses, elephants, and soldiers. 

How is it possible for you alone to defeat such a mighty demon? You who has become a victim of desire and attachment are thinking of defeating that mighty demon. 

 It looks like a child trying to grab the moon in his fist in infancy stage.
 
9. Sri Rama said: " O great Saint! I'm born in Kshatriya clan. My consort Sita has been abducted by Ravana.
 
10. Hence what's the use of remaining alive if i can't rescue her back from the trap of that Ravana?
 
11. Therefore, there is no use if you preach me tatwa bodha. My body is burning with anger etc. qualities. My Ego is like ready to take my life away. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 10 / Sri Gajanan Maharaj Life History - 10

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 10  /  Sri Gajanan Maharaj Life History - 10 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 2వ అధ్యాయము - 6 🌻

సాధారణంగా యోగులు తమయోగావస్థలో ధ్యానంలో ఉంటారు. అందులో వారికి దొరికే రసానందం దేనితోపోల్చలేనిది. భక్తులు ఆషాఢ మాసంలో పండరపూర్, సింహలగ్నంలో నాసిక్, కుంభమేళకు హరిద్వార్ వెళుతున్నట్టు శ్రీగజానన మహారాజు కోసం షేగాం వెళ్ళడం ప్రారంభించారు. 

స్వయంగా విఠల నారాయణుడయిన స్వామిసమర్ధ గజానన్ దృఢనిశ్చయంతో షేగాంలో ఉన్నారు. ఈయన మాటలు గోదావరి ఒడ్డు అయితే దానినుంచి వచ్చేఆనందం హరిద్వార్ లాంటిది. శ్రీగజానన్ మందిరంగా మారిన బనకటలాల్ ఇంటికి దర్శనం కోసం వెళ్ళేందుకు షేగాం అంతా భక్తులతో నిండి ఉంది. 

ఈ విధంగా బనకటలాల్ ఇంటికి అనేకమంది గజానన్ దర్శనార్ధం వస్తూఉన్నారు.

 బ్రహ్మజ్ఞానంపొందినవానికి కులంలేదు. సూర్యకిరణాలు అందరికీ ఒకేవిధంగా లభ్యంఅవుతాయి. కొత్తగుంపులు రోజూ షేగాం వస్తూ ఉండగా, రోజూ వందలాది భక్తులకు ప్రసాదం వడ్డించబడేది. 

నిజంగా నాలాంటి ఒకచిన్న కీటకానికి ఈవిషయం వర్ణించ సఖ్యంకానిది. ప్రతీదీ శ్రీగజానన్ వల్లనే చెప్పబడింది / వర్ణించబడింది. నేను కేవలం దీనికి ఒక సాధనంగా వాడబడ్డాను. ఈయన జీవితచరిత్ర చాలావిశాలమయినది. నేను చెప్పడంలో చాలావెనకబడతాను. 

అయినా సరే ఈయన దినచర్యగురించి ఇక వర్ణిస్తాను. ఒక్కొక్కసారి చక్కగా స్నానంచేసేవారు. మరోసారి మురికినీళ్ళు త్రాగేవారు. గాలివేగంలా ఈయన దినచర్య చాలాచంచల మయినది. పొగ త్రాగడానికి ఇష్టపడేవారు కానీ దానికి బానిస కాలేదు. ఇంక శ్రద్ధతో తరువాత అధ్యాయం వినండి. 

ఈగ్రంధం భక్తులకు ఒక అనుచిత మార్గదర్శిని కావాలని దాసగణు కోరుకుంటున్నాడు.
 
శుభం భవతు 
 2. అధ్యాయము సంపూర్ణము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 10 🌹
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 2 - part 6 🌻

Yogis are perpetually engrossed in their yogic trance and the joy that they derive out of that has no comparison. 

As people go to Pandharpur in Ashadha, to Nasik in Sinhastha or to Haridwar for Kumbhamela, they started going to Shegaon to worship Shri Gajanan Maharaj. Swami Samarth Gajanan is the incarnation of Vithal Narayan and is standing like a rock of determination at Shegaon. 

His words were the bank of holy Godavari, the joy begotten out of it was Haridwar and the whole Shegaon was crowded by people who wished to meet Shri Gajanan in this temple which was Bankatlal's house. 

Thus innumerable people were coming to Bankatlal's house for the Darshan of Shri Gajanan. One who has attained Brahmapada has no caste. The rays of the sun equally bless everything and everybody. 

Fresh batches of people were coming daily to Shegaon and food was served to hundreds of people. In fact it is all beyond the power of description of a small fly like me. 

Everything is being said and narrated by Shri Gajanan Himself by using me as a tool for that purpose. His life story is vast and I fall too short to describe it. However, I now narrate to you His daily routine. 

At times He took a good bath and some times used to drink dirty water. His daily routine was most uncertain like the speed of air. He loved smoking but had no craving for it. 

Now listen to the next chapter with faith. Dasganu desires this book to be an ideal guide for the devotees.

 ||SHUBHAM BHAVATU||
 Here ends Chapter Two

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

Twelve Stanzas from the Book of Dzyan - 5 : STANZA I - The Genesis of Divine Love - 5

Image may contain: text that says "0 skyloveart.com"
🌹 Twelve Stanzas from the Book of Dzyan  - 5 🌹
🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴

🌻 STANZA I -  The Genesis of Divine Love  - 5 🌻

11. The Light was fighting bravely, armed with the One Power of Love. But because he was always ablaze with pure Divine Love, he felt no hatred towards the darkness, nor did he know jealousy. Love was the most powerful weapon, and the darkness was helpless against her. 

It was necessary to wield that weapon to be omnipotent! But the darkness could not approach the Light openly, for she would immediately burn down, engulfed in the Flame of Love. 

But by and by she found a way around: she would enter human Hearts, which were alone capable of holding the Sacred Divine Gift.

12. The human Heart started to glow, like the Celestial Star itself. And that tiny sun in a human breast was full of the bright and brimming-over currents of Love. 

Nevertheless, the Heart, parched with an endless thirst, went on constantly searching — only for Love, for that Divine impulse could be quenched by Love alone.

Apparently, the Love of the earthly Hearts did not know satisfaction, for she still had not yet fully experienced the Power of the Sacred, Divinely Supreme Love. An enormous task of recognition lay ahead.

And so to fulfil that Task of pure Heavenly Labour, the Lords of Destiny asked the Gods to launch the Supreme Mechanism which would turn another Wheel — one that would go beyond the bounds of Time, leading human Hearts  along heavenly pathways to the recognition of True Love.
🌹 🌹 🌹 🌹 🌹

1-August-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 445 / Bhagavad-Gita - 445🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 233 / Sripada Srivallabha Charithamrutham - 233🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 113🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 135🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 49 / Sri Lalita Sahasranamavali - Meaning - 49 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 52 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 20 🌹
8) 🌹. శివగీత - 18 / The Shiva-Gita - 18🌹
9) 🌹. సౌందర్య లహరి - 60 / Soundarya Lahari - 60🌹
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 359 / Bhagavad-Gita - 359🌹

11) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 186🌹
12) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 62 🌹
13) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 58🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 73 🌹
15) 🌹 Seeds Of Consciousness - 136 🌹
16) 🌹. మనోశక్తి - Mind Power - 76 🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 22🌹
18) 🌹 Twelve Stanzas from the Book of Dzyan - 5 🌹
18) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 16🌹
19) 🌹. సాయి తత్వం - మానవత్వం - 60 / Sai Philosophy is Humanity - 60 🌹
20) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 1 🌹
21) 🌹. శ్రీరామశర్మ ప్రజ్ఞా సూక్తములు - 1 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 445 / Bhagavad-Gita - 445 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 55 🌴*

55. మత్కర్మకృన్మత్పరమో మద్భక్త: సఙ్గవర్జిత: |
నిర్వైర: సర్వభూతేషు య: స మామేతి పాణ్డవ ||

🌷. తాత్పర్యం : 
ఓ ప్రియమైన అర్జునా! కామ్యకర్మలు, మనోకల్పనలనెడి కల్మషముల నుండి విడివడి నా శుద్ధభక్తి యందు నియుక్తుడయ్యెడివాడును, నన్నే తన జీవితపరమగమ్యముగా భావించి నా కొరకై కర్మనొనరించువాడును, సర్వజీవుల యెడ మిత్రత్వమును కలిగినవాడును అగు మనుజుడు తప్పక నన్నే చేరగలడు.

🌷. భాష్యము : 
ఆధ్యాత్మికాకాశము నందలి కృష్ణలోకములో దివ్యపురుషుడు శ్రీకృష్ణుని చేరి అతనితో సన్నిహిత సంబంధమును పొందవలెనని అభిలషించువాడు ఆ భగవానుడే స్వయముగా తెలిపినటువంటి ఈ సూత్రమును తప్పక అంగీకరింపవలెను. కనుకనే ఈ శ్లోకము గీతాసారముగా పరిగణింప బడుచున్నది. 

ప్రకృతిపై ఆధిపత్యమును వహింపవలెనను ప్రయోజనముచే భౌతికజగత్తునందు మగ్నులైనవారును, నిజమైన ఆధ్యాత్మికజీవనమును గూర్చి తెలియనివారును అగు బద్దజీవుల కొరకే భగవద్గీత ఉద్దేశింపబడియున్నది. 

మనుజుడు ఏ విధముగా తన ఆధ్యాత్మికస్థితిని, భగవానునితో తనకు గల నిత్య సంబంధమును అవగతము చేసికొనగలడో చూపి, ఏ విధముగా భగవద్దామమునకు అతడు తిరిగి చేరగలడో ఉపదేశించుటకే భగవద్గీత ఉద్దేశింపబడినది. 

మనుజుడు తన ఆధ్యాత్మిక కర్మమున (భక్తియుతసేవ) విజయమును సాధించు విధానమును ఈ శ్లోకము స్పష్టముగా వివరించుచున్నది.
కర్మకు సంబంధించినంతవరకు మనుజుడు తన శక్తినంతటిని కృష్ణభక్తిభావన కర్మలకే మరల్చవలెను. 

శ్రీమద్భగవద్గీత యందలి “విశ్వరూపము” అను ఏకాదశాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 445 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 55 🌴*

55. mat-karma-kṛn mat-paramo
mad-bhaktaḥ saṅga-varjitaḥ
nirvairaḥ sarva-bhūteṣu
yaḥ sa mām eti pāṇḍava

🌷 Translation : 
My dear Arjuna, he who engages in My pure devotional service, free from the contaminations of fruitive activities and mental speculation, he who works for Me, who makes Me the supreme goal of his life, and who is friendly to every living being – he certainly comes to Me.

🌹 Purport :
Anyone who wants to approach the supreme of all the Personalities of Godhead, on the Kṛṣṇaloka planet in the spiritual sky, and be intimately connected with the Supreme Personality, Kṛṣṇa, must take this formula, as stated by the Supreme Himself. Therefore, this verse is considered to be the essence of Bhagavad-gītā. 

The Bhagavad-gītā is a book directed to the conditioned souls, who are engaged in the material world with the purpose of lording it over nature and who do not know of the real, spiritual life. 

The Bhagavad-gītā is meant to show how one can understand his spiritual existence and his eternal relationship with the supreme spiritual personality and to teach one how to go back home, back to Godhead. 

Now here is the verse which clearly explains the process by which one can attain success in his spiritual activity: devotional service.

Thus end the Bhaktivedanta Purports to the Eleventh Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of the Universal Form.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 233 / Sripada Srivallabha Charithamrutham - 233 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 44
*🌻. కర్త ఎవరు? 🌻*

ఆ తరువాత గ్రంథ రచన విషయంలో నా భయాలని కనిపెట్టి, "ఈ చరితామృత గ్రంథాన్ని వ్రాయడానికి కాని, అనువదించ డానికి కాని యోగ్యత ఉన్నవారిని స్వయంగా ఆయనే ఎన్నుకుంటారు. 

ఈ గ్రంథాన్ని వ్రాసేటప్పుడుకాని, అనువదించే టప్పుడు కాని గ్రంథకర్తపైన, అనువాదకుల పైన వారి కృపాదృష్టి ప్రసరిస్తూనే ఉంటుంది. కాబట్టి నీవు ఈ గ్రంథాన్ని వ్రాస్తున్నావనేది పైకి కనిపించే ఒక ప్రక్రియ మాత్రమే, వాస్తవానికి వ్రాయించేది వారే, శ్రీపాదశ్రీవల్లభులే." అని నిష్కర్షగా చెప్పారు. 

"నాలాంటి అల్పఙ్ఞునితో ఇంతటి మహత్ కార్యాన్ని చేయించడం ఆశ్చర్యంగాను, ఆనందం గాను ఉన్నది," అన్న నా మాటలను విని, "దత్తుని విధానమే అంత. 

నిషిద్ధ పదార్ధాలతో వ్యాధులను తగ్గించడం, బొత్తిగా ఏమీ తెలియని వారితో మహత్కార్యాలను చేయించడం వారి విధానం, వారికది వినోదం, దివ్యశక్తికి నిదర్శనం కూడా," అని దత్త విధానాన్ని వర్ణించారు. ఆ తరువాత ఒక విచిత్ర సంఘటన మాకు వినిపించారు. 

*🌻. మత్స్యావతార రహస్యం 🌻*

"ఒకసారి ఒక సన్యాసి కుక్కుటేశ్వరాలయానికి వచ్చి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుండగా మత్స్యావతారానికి యోగ పరమైన అర్థం ఏదైనా ఉందా? అన్న ఆలోచన వారి మనసులో మెదిలింది. 

సరిగ్గా అదే సమయానికి వర్మ, శ్రేష్ఠిగార్లు శ్రీపాదులను తీసుకొని అక్కడకు వచ్చారు. ఆ సన్యాసిని చూస్తూనే శ్రీపాదులు, "ఈ చేపలవాడిని ఇక్కడకు ఎవరు రానిచ్చారు?" అని అడిగారు. వారి నోటివెంట ఈ మాట రావడం తడవుగా సన్యాసి శరీరంనుండి చేపల వాసన రావడం మొదలుపెట్టింది. 

శ్రీపాదులు తీక్ష్ణంగా ఆయనను చూడటంతో అతనికి యోగదృష్టి కలిగి తన శరీరంలోని రక్త నాళాలలోను, విభిన్న ద్రవాలలోను వివిధ కణాలు చేప ఆకారంలో ఉండటం గమనించారు. 

ఆ చిన్నచిన్న కణాలే శరీరంలో అనేక రకాల అనుభూతులను కలిగిస్తున్నాయని అలాగే వాసనను గ్రహించ గలిగే, రుచిని పసిగట్టకల్గే కణాలు కూడా చేప ఆకృతిలోనే ఉన్నట్లు గమనించారు. 

సృష్టి మొదట అంతా జలమయమని పరిణామ ప్రక్రియలో చేప మొదటి జంతువని అదే మన శరీరంలోని తత్వాన్ని కూడా సూచిస్తుందని అదే మత్స్యావ తార ప్రక్రియ అని వారికి అర్ధమయ్యింది. అతడు శ్రీపాదుల చరణాలు తాకి నమస్కరించాడు
 శ్రీపాదుల కరుణావృష్టితో ఆ సన్యాసి శరీరంనుండి సువాసనలు రాసాగాయి. 

శరీరంలోని అనుభూతులలో చక్కటి మార్పు వచ్చినట్లైతే అది భౌతికంగా కూడా ప్రకటం అవుతుందని శ్రీపాదులు మౌనంగా బోధించారు. "ఓయీ! మత్స్యావతారం గురించి నీకు తెలిసింది కదా!. కూర్మావతారం దైవీ ప్రకృతికి, అసురీ ప్రకృతికి ఆధారం. 

మంధర పర్వతాన్ని కూర్మంమీద ఉంచే దేవదానవులు సముద్రాన్ని మధించారు, కాని కూర్మం మాత్రం అంతర్ముఖంగా ఉంటూ నిశ్చలంగానే ఉండిపో యింది. అదే విధంగా నీవు కూర్మ న్యాయంతో అంతర్ము ఖుడవై యోగాభ్యాసం చేయాలి.

 కర్మబంధంనుండి విడుదల పొందాలి, బహిర్ముఖుడవయ్యావో బంధనాల్లో ఇరుక్కు పోతావు," అని బోధించారు. 

శ్రీపాదరాజం శరణం ప్రపద్యే
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sripada Srivallabha Charithamrutham - 233 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 25

🌻 The greatness of Rudraksha Ways of Siva worship – Their Results 🌻

I asked Sri Dharma Gupta to grace me by telling how to do worship of Siva and in what method.  

Sri Dharma Gupta said, ‘Sir! Shankar Bhatt! The first method is doing Siva Panchakshari through ‘japa’ and ‘anushthana’. The second method is through Mahanyasa.  

The third one is by doing Rudra Abhishekam. The five letters in the panchaakshari represent the pancha bhutas. Jeeva is called ‘pasuvu’ because he is in the bonds (paasas) like passion etc. The one who gives the liberation from the bonds to pasuvu is ‘pasupathi’. 

Siva Panchaakshari is described as a star having five angles. In the mantras of this five angles, the mantras that give liberation are one type and those that give wealth and fame are the second type.  

In the five ‘upachaaras’ (services), chandan (gandham) is used for Bhutatwam, coconut water for jala tatwam, deeparadhana for agni tatwam, sambrani dhupam which gives a good fragrance for vayu tatwam and ghantanadam (ringing bell) for akasa tatwam. The five letters in panchaakshari, the five tatwas, give darshan in five colours to those who do sadhana.  

(1) The glow like a white pearl or mercury (2) The red light similar to Pagadam (3) Golden Yellow colour (4)  

The all pervading blue colour like blue sky (5) Pure white light. The glow of five coloured jyothi was mentiond as sandhyopasana by Risheeswaras. 

The main types of sadhana are yantram, mantram, pancha tatwa sadhana, yoga sadhana and surrender to ‘atma’. With this, the thinking that ‘dehatma’ (body is atma) will perish and one feels that jeeva’s body is the temple and the jeeva who glows in it is Sivatma.  

Thus he attains liberation. To get this state, japa of panchaakshari, Sivaaraadhana with Mahanyasam and Rudra abhishekas help. Vishnu is fond of ‘sahasra nama stotra’ (chanting of His thousand names). 

Ganapathi is fond of Modakas. Sun is fond of prostrations. Chandra (moon) is fond of ‘water offering’s. Agni (fire) is fond of ‘havis’. Siva will be pleased with abhishekam. 

Previously when ‘pralayam’ came in one kalpam, Brahma filled the seeds of all jeeva rasis, trees and medicinal plants in a kalasam for future creation. In that he poured amrit and the water from all seas and rivers. With Gayathri mantra, He invoked His prana Shakti into it.  

This is called ‘poorna kumbham’. Maharshis annointed earth with amrit from this poorna kumbham in a continuous stream. This kalasa abhishekam happened at Kailasa giri. So it became the place of amrit.  

On the full moon day in the month of Shravan, the ice lingam forms naturally in the cave of Amaranath. With mere darshan of that Lingam, all sins will perish.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 113 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 

*🌻. జ్ఞానులు- దైత్యులు - 1 🌻*

ఆది నుండియు మానవులలో రెండు తరగతులవారున్నారు. ప్రకృతి శక్తులను చూచి మోజుపడి వానిని తమ అభిప్రాయముల ప్రకారము వినియోగించుకొనుటకు యత్నించు వారొక జాతి. ఈ ప్రకృతి యందును, తమ యందును గల అంతర్యామి చైతన్యమును నమ్మి దానికి ప్రాధాన్యమిచ్చువారు మరొక జాతి. 

అందు మొదటి జాతి వారి దృష్టిలో ప్రకృతిని వశపరచుకొని వినియోగించుకొను స్వార్థ దృష్టి తప్పదు. వారిలో నాస్తికులు, ఆస్తికులు అను రెండు తెగలవారున్నారు. 

నాస్తికులకు ప్రకృతి శక్తులను వినియోగించుకొను దృష్టియే గాని, వినియోగ పద్ధతిలొ బాధ లేకుండునట్లు తీర్చిదిద్దుకొను నేర్పరితనము ఉండదు. దానితో సాంఘిక దురాచారములను ఎత్తి చూపుటతోనే ఆయుర్దాయము వ్యయమై పోవును. 

ఇక మిగిలిన వారు ఆస్తికులు. ఏ దైవము పేరు పెట్టినను వారు తమ వినియోగమునకై దేవుని పేరిట ప్రకృతి శక్తులను కొలుచుచుందురు. ఏ ఇద్దరి దృష్టిలోను వినియోగము ఒక విధముగా ఉండదు‌. 

కనుక ఈ తెగకు చెందిన అస్తికులు మతములను, సంప్రదాయములను, ఆరాధన విధానములను ఎవనికి వాడుగా ఏర్పరచుకొని, తాను మిగిలిన వారి కన్నా ఏ విధముగా జ్ఞానవంతుడో, తన ఆదర్శములు మిగిలిన వారి ఆదర్శముల కన్న ఏ విధముగా శ్రేష్ఠములో గుర్తుంచుకొనుటతోనే సరిపోవును. తత్ఫలితములుగా వర్గములు, పట్టుదలలు, కలహములు తప్పవు. 

ఈ లక్షణములు కలవారిని ప్రాచీనులు దైత్యులని వ్యవహరింతురు.
....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 135 🌹*
*🌴 Crises and Development - 3 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

*🌻 Planetary Crises 🌻*

If we look at the last hundred years, we are technologically far advanced, but humanity is more inclined to the ignorant and unreasonable energy of Atlantis than to the wise side. 

The decline of Atlantis has been caused by excessive objective manifestations at the expense of subjective growth. We are currently turning to similar patterns. The Hierarchy has, therefore decided to form groups for whom inner development is important. The energy of the seventh ray was invoked and transmitted to the people. 

As a result, there are groups all over the planet that have recognized the need to turn more inward to find the inner man and later the divine man. If we make an inner development, it can withstand the outer development and achieve a balance. If we only live an outer development, we will get into a deep crisis and catastrophes.

The work of the violet ray brings to light the hidden diseases of the planet and of humanity. 

The Masters of Wisdom say that all the crises we see on the planet were previously hidden within us and in the world. 

Wars, catastrophes, crises, and diseases as well as the corresponding pain bring things to light that need to be learned: this is how a process of healing happens. The law of karma finally brings back the pain to those who hurt others. 

If we do violence to nature or if the developed countries exploit the less developed countries or export garbage, this comes back in another way. 

The countries responsible for ongoing crises, such as those in the Middle East, will also receive their karma for this. Crises and diseases contain a message that we should change our habits.

🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K.P. Kumar: Uranus. Notes from seminars.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 49 / Sri Lalita Sahasranamavali - Meaning - 49 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 91

423. తత్త్వాసనా - 
తత్ సంబంధమైన భావమే ఆసనముగా గలది.

424. తత్ - 
ఆ పరమాత్మను సూచించు పదము.

425. త్వమ్‌ - నీవు.

426. అయీ - అమ్మవారిని సంబోధించు పదము.

427. పంచకోశాంతరస్థితా -
 ఐదు కోశముల మధ్యన ఉండునది.

428. నిస్సీమ మహిమా - 
హద్దులు లేని మహిమ గలది.

429. నిత్యయౌవనా - 
సర్వకాలములందును యవ్వన దశలో నుండునది.

430. మదశాలినీ - 
పరవశత్వముతో కూడిన శీలము కలది.

🌻. శ్లోకం 92

431. మదఘూర్ణితరక్తాక్షీ - 
పరవశత్వము వలన తిరుగుటచే ఎర్రదనమును పొందిన కన్నులు గలది.

432. మదపాటల గండభూః - 
ఆనంద పారవశ్యము వలన తెలుపు, ఎరుపుల సమిశ్ర వర్ణములో ప్రకాంశించు చెక్కిళ్లు కలది.

433. చందనద్రవదిగ్ధాంగీ - 
మంచి గంధపు రసముతో పూయబడిన శరీరము గలది.

434. చంపేయకుసుమప్రియా - 
సంపెంగ పుష్పములందు ప్రీతి కలది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 49 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 49 🌻*

423 ) Dwija brinda nishewitha -   
She who is being worshipped  by all beings

424 ) Tatwasana -   
She who sits on principles

425 ) Tat -   
She who is that

426 ) Twam -   
She who is you

427 ) Ayee -   
She who is the mother

428 ) Pancha kosandara sthitha -   
She who is in between the five holy parts

429 ) Nissema mahima -   
She who has limitless fame

430 ) Nithya youawana -   
She who is ever young

431 ) Madha shalini -   
She who shines by her exuberance

432 ) Madha goornitha rakthakshi -   
She who has rotating red eyes due to her exuberance

433 ) Madha patala khandaboo -   
She who has red cheeks due to excessive action

434 ) Chandana drava dhigdhangi -   
She who applies sandal paste all over her body

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 52 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 30

*🌻.. 30. స్వయం ఫలరూపతేతి బ్రహ్మ కుమారః 🌻*

     పరాభక్తి అనేది ఏ ఒక్క సాధనకు గాని, అన్ని సాధనలకు గాని ఫలంగా వచ్చేది కాదు. కార్యకారణంగా నిర్ణయించేది కాదు. దానికదే ఫలరూపం. ఇది బ్రహ్మ మానస పుత్రుడైన నారద మహర్షి అభిప్రాయం.

     మరి సాధనలన్నీ దేని కొరకు ? అవన్నీ అజ్ఞాన నివృత్తి కోసం, గుణాలను లేకుండా చేసుకోవడానికి, అహంకారాన్ని అడ్డు తొలగించు కోవడానికి అవసరమౌతాయి. శాస్త్ర పఠనం వలన మ్షోం సిద్ధించదు. కాని శాస్త్రం వలన భగవంతుడెలాగుంటాడో ఎలా పొంద బడతాడో విషయంగా తెలుస్తుంది. 

సాధన ఎలా చెయ్యాలో ఉపాయా లేమిటో, లక్ష్యాన్ని ఎలా సమీపించాలో తెలుసుకోవడానికి పనికి వస్తుంది. అనగా సాధనల వలన భగవంతుని సమీపిస్తాం గాని, భగవదైక్యం జరుగదు. ఐక్యత అనేది భగవంతుని అనుగ్రహం లేక గురు కృపా విశేషం. మోక్షేచ్ఛ ఎంత తీవ్రతరమో, భగవదనుగ్రహం కూడా అంతే శీఘ్రంగా వర్షిస్తుంది.

      నిజానికి విచారిస్తే అది ఐక్యత కూడా కాదు. అది స్వతఃసిద్ధం. దాని సహజ స్థితి అజ్ఞానావరణ వలన తెలియలేదు గాని, ఆవరణ తొలగగానే తెలియబడింది. ఈ సహజ స్థితిని జీవుని స్థానం నుండి చెప్పవలసి వస్తే పొందేదిగా చెప్తున్నారు. 

భగవంతుని స్థితినుండి చెప్పవలసివస్తే అది ఎప్పుడూ ఉన్నదిగానే చెప్తున్నారు. సర్వ కాలాలలో, సర్వ దేశాలలో, సర్వ జీవులందు, స్వతః సిద్ధమయ్యే ఉన్నది ఆ సహజ స్థితి. సత్యవస్తువు గోచరించక పోవడం అంటే అజ్ఞానావరణం కారణంగా మరుగై ఉండటం. 

సాధనలన్నీ కూడా ఆ మరుగును తొలగించడానికే. మరుగు పోగానే ఉన్నదేదో ఉన్నది. అది ఆ సత్యవస్తువును సాక్షాత్కరింప చేస్తుంది. అంతేగాని అది క్రొత్తగా ఎక్కడి నుండో రాలేదు. అది మనలోనే ఉన్నది.

            విద్య అంటే ఉన్నది అని అర్థం. అనగా పరబ్రహ్మం. అవిద్య అంటే విద్య కానిది. అనగా లేనిది. కారణ కార్యాలకు అతీతమైనది ఆ పరబ్రహ్మం. కార్యకారణ సంబంధమైన ప్రపంచాన్ని అవిద్య లేక మాయ అంటారు. సత్యవిచారణ చేస్తే అవిద్య, లేక ప్రపంచం లేకుండా పోతుంది.

            దీనిని, అనగా పరబ్రహ్మను పరాభక్తి అని కూడా అంటారు. అందువలన పరాభక్తి అనేది స్వయంగా ఫలరూపం. అది సాధిస్తే, ఫలితంగా సాధ్యమయ్యేది కాదు.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 20 🌹*
✍️ Sri GS Swami ji 
📚. Prasad Bharadwaj

*🌷 As long as you have your Guru, you should only follow his precepts 🌷* 
 
It has been stressed that under no circumstance should one change the Guru and also that one cannot have more than one Guru. The question arises whether holy persons who are not one’s Guru are not great souls worthy of reverence when they come into your life. 

Yes, all great souls are worthy of reverence and worship. You must offer them service when required. See them all as different forms of your own Guru. You must accept the truth that Guru appears in many forms. You must adore and worship them, no doubt, but it is not acceptable that you should treat them as Guru and follow the principles or practices that they teach. 

What your Guru has instructed is the only path for you to follow. Once you decide to follow the precepts of one Guru, you should never receive instructions from other gurus, regardless of the worth and eligibility of the other great souls. 

You should only follow what your Guru has taught you. If what the others teach is in accordance with the teachings of your own Guru, there is no conflict and you can appreciate the similarity. It endorses that they also think along the same lines as your own Guru. But if there is any difference in the principles taught you must never say, “Oh, my Guru has failed to teach me this, or oh, someday perhaps my Guru will also teach me the same thing, there is nothing great about this person.” One feeling expresses your ego, and the other sentiment is baseless.
 
To a true seeker, every single atom in Creation is Guru. Avadhoota has 24 gurus according to the Datta Purana. When any teaching from another guru differs from what your own Guru has taught you, such teaching should be rejected. Guru determines the instruction that is suited to each disciple, and customizes his teaching. That is where a spiritual seeker has to be extremely careful. That is the significance of the 24 gurus mentioned in Datta Purana. One must be very careful in following the specific instruction given to each disciple.
 
When a great soul enters your life, serve him as if he is another form of your own Guru, but never consider him to be yet another Guru in your life. Such a thought must never arise in the mind. It is only under circumstances where your Sadguru gives up his physical form, leaves for penance to some faraway place such as the Himalayas on an extended stay, or when he himself directs you to follow another Guru, that you are allowed to accept another Guru. This should be done only when there is absolutely no chance for you to follow your own Guru in the rest of your lifetime. 

As long as you have your Guru, you should only follow his precepts. This is ordained and endorsed by the scriptures. You must not receive any initiation or yantras (ritual diagrams or images) from other gurus. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 18 / The Siva-Gita - 18 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము
*🌻. విరజాదీక్షా లక్షణ యోగము - 2 🌻*

దుర్గం యస్యాస్తి లంకాఖ్యం దుర్జయం దేవ దానవై:,
చతురంగ బలం యస్య - వర్తతే కోటి సంఖ్యయా.7

ఏకాకి నా త్వయా జేయ - స్సకధం నృప నందన!
ఆకాంక్షతే కారే దుర్తుం - బాలశ్చంద్ర మాసం యధా 8

సురాసురులకు ప్రవేశించుట వీలులేని (శక్యము కాని ) ది, అజేయమైనది లంకాపురము రాజధానిగా అతనికి కలదు, మరియు కోట సంఖ్యాక (అసంఖ్యాక )మైన గజ - తురగ -పదాతి మున్నగు చతురంగ సైన్యము గల అంతటి రావణుని నీ వొక్కండ 
వెట్లు జయింప దలచావు.? 

నీ తలంపును విచారించినచో 
బాల్యావస్థలో నున్న శిశువు తన హస్తములతో నాకాశ మందలి చంద్రుని గ్రహించు మాడ్కి కామ మోహింతు డవైన నీవు గొప్ప బలశాలి యైన రావణుని చంప చూస్తున్నావు.

తధాత్వం కామ మోహేన - జయం తస్యాభి వాంఛసి,
క్షత్రియోహం ముని శ్రేష్ఠ! - భార్యా మే రక్ష సా హృతా. 9

యదితం నిహ న్మ్యాశు - జీవనే మేస్తి కిం ఫలమ్,
అతస్తే తత్వ బోదేనన - మే కించిత్ప్ర యోజనమ్ 10

కామ క్రోధాదయ స్సర్వే -దహంతే తే తనుం మమ,
అహంకారో పిమే నిత్యం - జీవనం హర్తు ముధ్యతః .11

శ్రీరాముడు పలుకుచున్నాడు: ఓయీ! మునికుల చంద్రా! క్షత్రియ వంశ జనితుండ నేను. నా సతియైన సీతా దేవి రావణుని చేత అపహరించ బడినది.

 అందుచేత లంకాధి పతియైన రావణుని చంపి నా సీతను అతని చెరవిడి పంపకుండిన నేను బ్రతికి యుండుట ప్రయోజనమేమి? 
కాన నీవిప్పుడు నాకు బోధించు తత్వము నుండి ఏలాంటి లాభము లేదు.

 కామ క్రోధ లోభ మోహము మొదలగు నరి షడ్వర్గము నా దేహమును దహింప చేయు చున్నది. అహంకార మనునది. నన్ను ఎల్లప్పుడు నా ప్రాణముల నపహరింప చేయుటకు నుధ్యుక్తమై యున్నది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 18 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 03 : 
*🌻 Viraja Deeksha Lakshana Yoga - 2 🌻*
 
7. The fort called Lanka which is his capital is impregnable to Gods and demons. 

8. Also, he has a Chaturangini army which consists of billions of horses, elephants, and soldiers. 

How is it possible for you alone to defeat such a mighty demon? You who has become a victim of desire and attachment are thinking of defeating that mighty demon.

 It looks like a child trying to grab the moon in his fist in infancy stage.
 
9. Sri Rama said: " O great Saint! I'm born in Kshatriya clan. My consort Sita has been abducted by Ravana.
 
10. Hence what's the use of remaining alive if i can't rescue her back from the trap of that Ravana?
 
11. Therefore, there is no use if you preach me tatwa bodha. My body is burning with anger etc. qualities. My Ego is like ready to take my life away. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 10 / Sri Gajanan Maharaj Life History - 10 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. 2వ అధ్యాయము - 6 🌻*

సాధారణంగా యోగులు తమయోగావస్థలో ధ్యానంలో ఉంటారు. అందులో వారికి దొరికే రసానందం దేనితోపోల్చలేనిది. భక్తులు ఆషాఢ మాసంలో పండరపూర్, సింహలగ్నంలో నాసిక్, కుంభమేళకు హరిద్వార్ వెళుతున్నట్టు శ్రీగజానన మహారాజు కోసం షేగాం వెళ్ళడం ప్రారంభించారు. 

స్వయంగా విఠల నారాయణుడయిన స్వామిసమర్ధ గజానన్ దృఢనిశ్చయంతో షేగాంలో ఉన్నారు. ఈయన మాటలు గోదావరి ఒడ్డు అయితే దానినుంచి వచ్చేఆనందం హరిద్వార్ లాంటిది. శ్రీగజానన్ మందిరంగా మారిన బనకటలాల్ ఇంటికి దర్శనం కోసం వెళ్ళేందుకు షేగాం అంతా భక్తులతో నిండి ఉంది. 

ఈ విధంగా బనకటలాల్ ఇంటికి అనేకమంది గజానన్ దర్శనార్ధం వస్తూఉన్నారు.

 బ్రహ్మజ్ఞానంపొందినవానికి కులంలేదు. సూర్యకిరణాలు అందరికీ ఒకేవిధంగా లభ్యంఅవుతాయి. కొత్తగుంపులు రోజూ షేగాం వస్తూ ఉండగా, రోజూ వందలాది భక్తులకు ప్రసాదం వడ్డించబడేది. 

నిజంగా నాలాంటి ఒకచిన్న కీటకానికి ఈవిషయం వర్ణించ సఖ్యంకానిది. ప్రతీదీ శ్రీగజానన్ వల్లనే చెప్పబడింది / వర్ణించబడింది. నేను కేవలం దీనికి ఒక సాధనంగా వాడబడ్డాను. ఈయన జీవితచరిత్ర చాలావిశాలమయినది. నేను చెప్పడంలో చాలావెనకబడతాను. 

అయినా సరే ఈయన దినచర్యగురించి ఇక వర్ణిస్తాను. ఒక్కొక్కసారి చక్కగా స్నానంచేసేవారు. మరోసారి మురికినీళ్ళు త్రాగేవారు. గాలివేగంలా ఈయన దినచర్య చాలాచంచల మయినది. పొగ త్రాగడానికి ఇష్టపడేవారు కానీ దానికి బానిస కాలేదు. ఇంక శ్రద్ధతో తరువాత అధ్యాయం వినండి. 

ఈగ్రంధం భక్తులకు ఒక అనుచిత మార్గదర్శిని కావాలని దాసగణు కోరుకుంటున్నాడు.
 
శుభం భవతు 
 2. అధ్యాయము సంపూర్ణము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 10 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 2 - part 6 🌻*

Yogis are perpetually engrossed in their yogic trance and the joy that they derive out of that has no comparison. 

As people go to Pandharpur in Ashadha, to Nasik in Sinhastha or to Haridwar for Kumbhamela, they started going to Shegaon to worship Shri Gajanan Maharaj. Swami Samarth Gajanan is the incarnation of Vithal Narayan and is standing like a rock of determination at Shegaon. 

His words were the bank of holy Godavari, the joy begotten out of it was Haridwar and the whole Shegaon was crowded by people who wished to meet Shri Gajanan in this temple which was Bankatlal's house. 

Thus innumerable people were coming to Bankatlal's house for the Darshan of Shri Gajanan. One who has attained Brahmapada has no caste. The rays of the sun equally bless everything and everybody. 

Fresh batches of people were coming daily to Shegaon and food was served to hundreds of people. In fact it is all beyond the power of description of a small fly like me. 

Everything is being said and narrated by Shri Gajanan Himself by using me as a tool for that purpose. His life story is vast and I fall too short to describe it. However, I now narrate to you His daily routine. 

At times He took a good bath and some times used to drink dirty water. His daily routine was most uncertain like the speed of air. He loved smoking but had no craving for it. 

Now listen to the next chapter with faith. Dasganu desires this book to be an ideal guide for the devotees.

 ||SHUBHAM BHAVATU||
 Here ends Chapter Two

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 60 / Soundarya Lahari - 60 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

60 వ శ్లోకము

*🌴. అమ్మ దీవెనలతో దైవీ జ్ఞానము, వాక్శుద్ధి 🌴*

శ్లో:60. సరస్వత్యాః సూక్తి రమృతలహరీ కౌశల హరీః పిబన్త్యా శ్శర్వాణీ శ్రవణచుళుకాభ్యా మవిరళంl 
చమత్కార శ్లాఘా చలిత శిరసః కుండల గణో ఝణత్కారైస్తారైః ప్రతివచన మాచష్ట ఇవ తే.ll 
 
🌷. తాత్పర్యం : 
అమ్మా! పరమ శివుని పత్ని అయిన ఓ పార్వతీ దేవీ అమృత ప్రవాహముల మాదుర్యములను హరించు మధురమయిన పలుకులతో సరస్వతీదేవి చేయు స్తోత్రములను చెవులనెడు పుడిసిళ్ళ చేత చక్కగా వినుచూ , ఆ స్తోత్రముల లోని చమత్కారములను మెచ్చుకొనుటకు శిరస్సును కదల్చగా నీ యొక్క కర్ణాభరణములు ఝణత్కారములచే మారు మాటను చెప్పు చున్నట్లు ఉన్నది కదా 

🌷. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, పాయాసం, తేనె నివేదించినచో అమ్మ దీవెనల ద్వారా దైవీ జ్ఞానము, వాక్శుద్ధి కలుగును అని చెప్పబడింది.

*🌹 SOUNDARYA LAHARI - 60 🌹* 
📚. Prasad Bharadwaj 

SLOKA - 60 

*🌴 Divine knowledge and Making your Predictions Come True 🌴*

60. Sarasvatyah sukthir amrutha-lahari-kaushala-harih Pibanthyah Sarvani Sravana-chuluk abhyam aviralam; Chamathkara-slagha-chalita-sirasah kundala-gano Jhanatkarais taraih prati-vachanam achashta iva te. 
 
Translation : 
Oh goddess, who is the consort of lord Shiva, your sweet voice which resembles, the continuous waves of nectar ,fills the ear vessels of Saraswathi, without break, and she shakes her head hither and thither, and the sound made by her ear studs, appear as if they applaud your words.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) : 
If one chants this verse 1000 times a day for 45 days, offering milk payasam and honey as prasadam, it is believed that they will be blesses with divine knowledge and the power to bring their utterances true.

🌻 BENEFICIAL RESULTS: 
Great knowledge, skill in fine arts, eloquence, removes dumbness, provides power of foretelling future events. 
 
🌻 Literal Results: 
Magnetic speech.Great intellect, useful for debates, lawyers, politicians and orators.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀

🌹 🌹. శ్రీమద్భగవద్గీత - 359 / Bhagavad-Gita - 359 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 07 🌴

07. ఏతాం విభూతిం యోగం చ మామ యో వేత్తి తత్త్వత: |
సోవికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ: ||

🌷. తాత్పర్యం :
నా ఈ దివ్యవిభూతిని, యోగశక్తిని యథార్థముగ నెరిగినవాడు నా విశుద్ధ భక్తియుతసేవలో నియుక్తుడు కాగలడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. 

🌷. భాష్యము : 
దేవదేవుడైన శ్రీకృష్ణునికి సంబంధించిన జ్ఞానము ఆధ్యాత్మికపూర్ణత్వము యొక్క అత్యున్నతదశ వంటిది. ఆ భగవానుని వివిధములైన దివ్యవిభూతుల యెడ స్థిరనిశ్చయము కలుగనిదే ఎవ్వరును సంపూర్ణముగా భక్తియోగమున నెలకొనలేరు. సాధారణముగా జనులు భగవానుడు గొప్పవాడని తెలిసియుందురుగాని అతడెంతటి గొప్పవాడనెడి విషయమును పూర్తిగా ఎరిగియుండరు. ఇచ్చట ఆ విషయములన్నియును సమగ్రముగా తెలుపబడినవి. శ్రీకృష్ణభగవానుడు ఎంతటి ఘనుడనెడి విషయము సమగ్రముగా తెలిసినపుడు సహజముగా మనుజుడు అతనికి శరణమునొంది భక్తియుతసేవలో నిమగ్నుడగును. భగవానుని దివ్యవిభూతులు యథార్థముగా అవగతమైనప్పుడు అతని శరణుజొచ్చుట కన్నను మనుజునకు వేరొక్క మార్గముండదు. ఇటువంటి వాస్తవమైన జ్ఞానమును భగవద్గీత, భాగవతము మరియు అటువంటి ఇతర వాజ్మయము ద్వారా తెలిసికొనవచ్చును.

ఈ విశ్వపాలనము కొరకు విశ్వమనదంతటను పలుదేవతలు కలరు. వారిలో బ్రహ్మ, శివుడు, సనకసనందనాదులు, ఇతర ప్రజాపతులు ముఖ్యమైనవారు. విశ్వజనులకు గల పలువురు పితృదేవతలు శ్రీకృష్ణుని నుండియే జన్మించిరి. కనుకనే దేవదేవుడైన శ్రీకృష్ణుడు సర్వపితృదేవతలకు ఆది పితృదేవుడై యున్నాడు.

ఇవన్నియును వాస్తవమునకు శ్రీకృష్ణభగవానుని కొన్ని విభూతులు మాత్రమే. ఈ విభూతుల యెడ విశ్వాసము కలిగినవాడు శ్రీకృష్ణుని శ్రద్ధతో శంకారహితముగా గ్రహించి, అతని భక్తియుతసేవలో నియుక్తుడు కాగలడు. భగవత్సేవలో ఆసక్తిని మరియు శ్రద్ధను వృద్ధిపరచుకొనుటకు ఈ ప్రత్యేక జ్ఞానము అత్యంత అవసరమై యున్నది. శ్రీకృష్ణభగవానుని దివ్యఘనతను సంపూర్ణముగా నెరుగుటచే మనుజుడు శ్రద్ధాపూరితమైన భక్తియోగమున స్థిరుడు కాగాలనందున ఆ దేవదేవుడు ఎంతటి ఘనుడో తెలిసికొనుట యందు ఎవ్వరును ఉపేక్ష వహింపరాదు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 359 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 07 🌴

07. etāṁ vibhūtiṁ yogaṁ ca
mama yo vetti tattvataḥ
so ’vikalpena yogena
yujyate nātra saṁśayaḥ

🌷 Translation : 
One who is factually convinced of this opulence and mystic power of Mine engages in unalloyed devotional service; of this there is no doubt.

🌹 Purport :
The highest summit of spiritual perfection is knowledge of the Supreme Personality of Godhead. Unless one is firmly convinced of the different opulences of the Supreme Lord, he cannot engage in devotional service. Generally people know that God is great, but they do not know in detail how God is great. Here are the details. If one knows factually how God is great, then naturally he becomes a surrendered soul and engages himself in the devotional service of the Lord. When one factually knows the opulences of the Supreme, there is no alternative but to surrender to Him. This factual knowledge can be known from the descriptions in Śrīmad-Bhāgavatam and Bhagavad-gītā and similar literatures.

In the administration of this universe there are many demigods distributed throughout the planetary system, and the chief of them are Brahmā, Lord Śiva and the four great Kumāras and the other patriarchs. There are many forefathers of the population of the universe, and all of them are born of the Supreme Lord, Kṛṣṇa. The Supreme Personality of Godhead, Kṛṣṇa, is the original forefather of all forefathers.

These are some of the opulences of the Supreme Lord. When one is firmly convinced of them, he accepts Kṛṣṇa with great faith and without any doubt, and he engages in devotional service. All this particular knowledge is required in order to increase one’s interest in the loving devotional service of the Lord. One should not neglect to understand fully how great Kṛṣṇa is, for by knowing the greatness of Kṛṣṇa one will be able to be fixed in sincere devotional service.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 187 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴* 
41. అధ్యాయము - 16

*🌻. సృష్టి వర్ణనము - 4 🌻*

అహం విష్ణుశ్చ రుద్రశ్చ గుణాస్త్రయ ఉదాహృతాః | స్వయం సదా నిర్గుణశ్చ పరబ్రహ్మ వ్యయశ్శివః || 37

విష్ణుస్సత్త్వం రజోsహం చ తమో రుద్ర ఉదాహృతః | లోకాచారత ఇత్యేవం నామతో వస్తుతోsన్యథా || 38

అంతస్తమో బహిస్సత్త్వో విష్ణూ రుద్రస్తథా మతః | అంతస్సత్త్వస్తమో బాహ్యో రజోsహం సర్వధా మునే || 39

రాజసీ చ సురా దేవీ సత్త్వరూపాత్తు సా సతీ | లక్ష్మీస్తమోమయీ జ్ఞేయా త్రిరూపా చ శివా పరా || 40

నేను, విష్ణువు మరియు రుద్రుడు త్రిగుణస్వరూపులము. శివపర బ్రహ్మ సదా నిర్గుణుడు, వికారములు లేనివాడు (37).

 విష్ణువు సత్త్వ గుణము. నేను రజోగుణము. రుద్రుడు తమోగుణము. సృష్టి కార్యములను బట్టి ఈ నామము లేర్పడినవి. కాని వస్తుతత్త్వమునందు భేదము లేదు (38).

 ఓ మహర్షీ! విష్ణువునకు లోపల తమోగుణము, బయట సత్త్వగుణము ఉండును. రుద్రునకు లోపల సత్త్వగుణము, బయట తమోగుణము ఉండును. నాకు లోపల, బయట రజోగుణము గలదు (39). 

సరస్వతి రజోగుణ ప్రధాన. సతీదేవి సత్త్వ స్వరూపురాలు. లక్ష్మీదేవి తమోమయి. శివాపరాభట్టారికయే ఈ మూడు రూపములుగా నున్నదని తెలియవలెను (40).

ఏవం శివా సతీ భూత్వా శంకరేణ వివాహితా | పితుర్యజ్ఞే తనుం త్యక్త్వా నాదాత్తాం స్వపదం య¸° || 41

పునశ్చ పార్వతీ జాతా దేవ ప్రార్థనయా శివా | తపః కృత్వా సువిపులం పునశ్శివముపాగతా || 42

తస్యా నామాన్యనే కాని జాతాని చ మునీశ్వర | కాలికా చండికా భద్రా చాముండా విజయా జయా || 43

జయంతీ భద్రకాలీ చ దుర్గా భగవతీతి చ | కామాఖ్య కామదా హ్యంబా మృడానీ సర్వమంగలా || 44

నామధేయాన్యనేకాని భుక్తిముక్తి ప్రదానిచ | గుణ కర్మాను రూపాణి ప్రాయశస్తత్ర పార్వతీ || 45

శివాదేవి సతియై శంకరుని వివాహమాడినది. తండ్రియగు దక్షుని యజ్ఞములో ఆమె శరీరమును విడచి, మరల ఆ శరీరమును స్వీకరించలేదు. ఆమె తన ధామమును పొందెను (41). 

మరల దేవతలు ప్రార్ధించగా శివాదేవి పార్వతియై జన్మించెను. ఆమె ఘోరమగు తపస్సును జేసి మరల శివుని పొందెను (42). 

ఓ మహర్షీ! ఆమెకు అనేక నామములు గలవు. కాలిక, చండికా, భద్ర, చాముండ, విజయ, జయ (43), జయంతి, భద్రకాలి, దుర్గ, భగవతి, కామాఖ్యా, కామద, అంబ, మృడాని, సర్వమంగల (44) 

ఇత్యాది అనేక నామములు ఆమెకు గుణములను బట్టి, కర్మలను బట్టి ఏర్పడినవి. ఈ నామములు భక్తిని, ముక్తిని ఇచ్చును. వాటిలో పార్వతి యను పేరు ప్రసిద్ధమైనది (45).

గుణమయ్యస్తథా దేవ్యో దేవా గుణ మయాస్త్రయః | మిలిత్వా వివిధం సృష్టేశ్చక్రుస్తే కార్యముత్తమమ్‌ || 46

ఏవం సృష్టిప్రకారస్తే వర్ణితో మునిసత్తమ | శివాజ్ఞయా విరచితో బ్రహ్మాండస్య మయాsఖిలః || 47

పరం బ్రహ్మ శివః ప్రోక్తస్తస్య రూపాస్త్రయస్సురాః | అహం విష్ణుశ్చ రుద్రశ్చ గుణభేదానురూపతః || 48

గుణస్వరూపులగు త్రిమూర్తులు గుణ స్వరూపలు అగు దేవీ మూర్తులతో గూడి ఉత్తమమగు సృష్టి కార్యమును చేసిరి (46).

 ఓ మహర్షీ! నేనీ సృష్టి ప్రకారమును నీకు వివరించి చెప్పితిని. నేను బ్రహ్మాండములనన్నిటినీ శివుని ఆజ్ఞచే రచించితిని (47). 

శివుడు పరబ్రహ్మ, నేను, విష్ణువు, రుద్రుడు అనే త్రిమూర్తులు గుణభేదముచే ఏర్పడిన ఆ శివుని రూపములు మాత్రమేనని ఋషులు చెప్పుచున్నారు. (48).

శివయా రమతే సై#్వరం శివలోకే మనోరమే | స్వతంత్రః పరమాత్మా హి నిర్గుణ స్సగుణోsపి వై || 49

తస్య పూర్ణావతారో హి రుద్రస్సాక్షాచ్ఛివః స్మృతః | కైలాసే భవనం రమ్యం పంచవక్త్రశ్చ కార హ || 50

బ్రహ్మాండస్య తథా నాశే తస్య నాశోsస్తి వై న హి || 51

ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమఖండే సృష్ట్యుపాఖ్యానే బ్రహ్మనారద సంవాదే సృష్టి వర్ణనం నామ షోడశః అధ్యాయః (16).

ఆయన మనోహరమగు శివలోకములో ఉమతో గూడి యథేచ్ఛగా సంచరించును. ఆయన స్వతంత్రుడగు పరమాత్మ. నిర్గుణుడు, సగుణుడు కూడా (49). 

రుద్రుడు ఆయన యొక్క పూర్ణావతారము గనుక సాక్షాత్తు శివుడే యని చెప్పబడినాడు. అయిదు మోముల శివుడు కైలాసమునందు సుందరమగు భవనమును నిర్మించినాడు (50).

 బ్రహ్మాండము నశించిననూ దానికి నాశము లేదు (51).

శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు మొదటి ఖండములో సృష్ట్యుపాఖ్యానమునందు బ్రహ్మ నారద సంవాదములో సృష్టివర్ణనమనే పదునారవ అధ్యాయము ముగిసినది (16).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 62 🌹*
Chapter 18
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 The Most Important aspect of God - 1 🌻*

The Avatar's work is always connected directly with the Reality of God, because he himself is the Reality. 

And through his work he shapes the shadow of his own Reality in such proportions so that the shadow does not expand more than the necessary proportions required to balance the pull between his INFINITE CONSCIOUSNESS and INFINITE UNCONSCIOUSNESS. 

This ultimately means to mankind that the Avatar brings everything in the world into proper balance so that the journey of each individual toward the Truth may become natural, and not in a zigzagged unnatural way.

As Meher Baba manifests to the world, mankind will become more deeply concerned with God, because mankind will be witnessing the Avatar's manifestation of God. 

Mankind will gradually accept Meher Baba as the Avatar of God, and naturally people will become interested to know of the different aspects of God, and the different aspects of the Avatar's life as God-Man. 

In this way, mankind will know, through the Avatar, more about both the impersonal and the personal aspects of God.

Though most of mankind is interested in the Avatar's personal aspect, this personal aspect reveals the side of his impersonal aspect. 

During the manifestation and afterward, the personal aspect of God will always be evident to mankind, because the personal aspect is the very medium he employs to reveal to mankind his impersonal aspect. 

Whether in the future, or in the present, the personal aspect is the most important aspect of God to mankind! Because through the body of the Avatar, God has given out everything necessary in this Avataric advent to the world. 

The personal aspect of God has been presented to the world through the body of the Avatar—his photographs, films, messages, books and his tomb. 

And through the body of the Avatar, the INFINITE CONSCIOUSNESS of the impersonal God has worked internally and personally for each individual.

The personal and impersonal aspects cannot be separated in God, even when he is in human form, because in order to reveal the knowledge necessary in awakening mankind to his impersonal form of INFINITE CONSCIOUSNESS, he must take a personal form. 

Thus through the birth, life, and death of the personal body of the Avatar, God reveals both sides of himself to mankind. 

Ultimately, it is the impersonal INFINITE CON- SCIOUSNESS that individual human consciousness merges with forever; 

but while individual human consciousness remains bound in illusion, it is always the personal side of God, through the Avatar, that is most important to the individual.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 58 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 25
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. వాసుదేవ మంత్ర లక్షణము - 5 🌻*

విష్ణుర్మధుహరశ్చైవ త్రివిక్రమకవామనౌ | శ్రీధరో7థహృషీ కేశః పద్మనాభస్తథైవ చ. 38

దామోదరః కేశవశ్చ నారాయణస్తతః పరః| మాధవశ్చాథ గోవిన్దో విష్ణుర్త్వె వ్యాపకం న్యసేత్‌ . 39

అఙ్గుష్ఠాదౌ తలాదౌ చ పదే జానుని వై కటౌ | శిరః శిఖోరః కట్యాస్యజానుపాదాదిషు న్యసేత్‌. 40

ద్వాదశాత్మా పంచవింశః షడ్వింశవ్యూహకస్తథా |

విష్ణువు, మధుహరుడు, త్రివిక్రముడు, వామనుడు, శ్రీధరుడు హృషీకేశుడు, పద్మనాభుడు, దామోదరుడు, కేశవుడు, నారాయణుడు, మాధవుడు, గోవిందుని అని ద్వాదశాత్ముడు. 

వీటిలో విష్ణువును వ్యాపకునిగా విన్యసించి, మిగిలిన వారిని అంగుష్ఠాదులందును, తలాదులందును, పాదమునందును, జానువునందను, కటియందును, శిరస్సు, శిఖ, ఉరస్సు, కటి, ముఖము, జానువు, వాదము మొదలైన వాటియందును విన్యసించవలెను. పంచవింశవ్యూహములు కలవాడును, షడ్వింశవ్యూహములు కలవాడును, ఎట్లనగా,

పురుషో ధీరహఙ్కారో మనిశ్చిత్తం చ శబ్దకః 41

తథా స్పర్శో రసో రూపం గన్ధః శ్రోత్రం త్వచస్తథా |
చక్షుర్జిహ్వా నాసికా చ వాక్చ పాణ్యంఘ్రిశ్చ పాయవః. 42

ఉపస్థో భూర్జలం తేజో వాయురాకాశమేవ చ | పురుషం వ్యాపకం న్యస్య అఙ్గష్ఠాదౌ దశ న్యసేత్‌. 43

శేషాన్‌ హస్తతలే న్యస్య శిరస్యథ లలాటకే | ముఖహృన్నాభిగుహ్యోరుజన్వంఫ్ర° కరణోద్గతౌ. 44

పాదౌ జాన్వోరుపస్థే చ హృదయే మూర్ధ్ని చ క్రమాత్‌ |
పరశ్చ పురుషాత్మాదౌ షడ్వింశే పూర్వవత్‌ పరమ్‌. 45

పురుష-ధీ-అహంకార-మనన్‌-చిత్త-శబ్ద-స్పర్శ-రస-రూప-గంధ-శ్రోత్ర-త్వక్‌-చక్షుర్‌-జిహ్వా-నాసికా-వాక్‌-పాణి-పాద-పాయు-ఉపస్థ-భూ-జల-తేజన్‌-వాయు-అకాశములు పంచవింశతివ్యూహము. పురుషుని వ్యాపకునిగా విన్యసించి, పదింటిని అంగుష్ఠాదులందు, మిగిలిన వాటిని హస్త తలమునందును విన్యసించవలెను.

 పిమ్మట శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, ఊరువులు, జానువులు, పాదములు, దశేంద్రియములు, పాదములు, జానువులు, ఉపస్థ, హృదయము, శిరస్సు-వీటిపై క్రమముగా విన్యసించవలెను. షడ్వింశవ్యూహమునందు పురుషాత్మకు ముందు పరరూపము ఉండును. మిగిలినదంతయు వెనుక చెప్పనట్లే.

సంచిన్త్య మణ్డలైకే తు ప్రకృతిం పూజయేద్బుధః పూర్వయామ్యాప్యసౌమ్యేఘ హృదయాదీని పూజయేత్‌. 46

అస్త్రమాగ్న్యాదికోణషు వైనతేయాదిపూర్వవత్‌ | దిక్పాలశ్చ విధిస్తస్య త్రివ్యూహేగ్నిశ్చ మధ్యతః. 47

పూర్వాదిదిగ్దాలా వాసై రాజ్యాదిభిరలఙ్కృతః | కర్ణికాయాం నాభసశ్చ మానసః కర్ణికాస్థితః. 48

పండితుడు ఒక మండలముపై ప్రకృతిని ధ్యానించి పూజింపవలెను. పూర్వ-దక్షిణ-పశ్చిమ-ఉత్తరదిశలందు హృదయాదులను పూజింప వలెను. 

అగ్య్నాది కోణములందు అస్త్రమును, వైనతేయాదులను, దిక్పాలులను పూర్వమునందు వలెనే పూజింపవలెను. త్రివ్యూహమునందు అగ్ని మధ్యను దుండను. 

పూర్వాది దిక్కలందు దలములం దున్నదేవతలలో కూడా రాజ్యాద్యలంకృతుడై కమల కర్ణికయందు నభోరూపుడగు, మాన స్మాత (అంతరాత్మ) ఉండును.

విశ్వరూపం సర్వస్థిత్యై యజేద్రాజ్య జయాయ చ | సర్వవ్యూహైః సమాయుక్త మఙ్గైరపి చ పఞ్చభిః. 49

గురుడాద్యైస్తథేన్ద్రాద్యైః సర్వాన్‌ కామానవాప్నుయాత్‌ |
విష్వక్సేనం యజేన్నామ్నా వై బీజం వ్యోమసంస్థితమ్‌. 50

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే వాసుదేవాదిమన్త్ర ప్రదర్శనం నామ పఞ్చవింశో7ధ్యాయః.

ఈ విఖముగ సర్వవ్యూహములతోను, గరుడాదిపంచాంగములతోను, ఇంద్రాదులతోను కూడిన విశ్వరూపుని లోకస్థితినిమిత్తము, రాజ్యయముకొరకును పూజింపవలెను. సమస్తకామములను పొందును. ఆకాశమునం దున్న బీజమును స్మరించుచు విష్వక్సేనుని పేరుతో పూజించవలెను.

అగ్ని మహాపురాణములో వాసుదేవాదిమన్త్ర ప్రదర్శనరూప మగు ఇరువదియైదవ అధ్యాయము సమాప్తము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 73 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

57. అయితే వేదం నాకు ప్రమాణం కాదు. అదే యథార్థమయితే వేదం నాకు ప్రమాణం కాదు.” అన్నాడు బుద్ధుడు. వేదము యొక్క నిర్వచనము, దానియొక్క ఉపయోగమూ, దాని యొక్క స్వరూపస్వభావ కార్యస్థితి అన్నీ కూడా బ్రహ్మణులు, బోధకులు ఏంచెప్పరో వాళ్ళ ముఖతః విని, “వాళ్ళు ప్రతిపాదించిన వేదం నాకు ప్రమాణం కాదు” అన్నాడు బుద్ధుడు. 

58. పూర్వమీమాంసకులు చెప్పినదే వేదహృదయమైతే, అట్టి వేదం తనకు ప్రమాణము కాదు అని ఆయన భావం. అంతే కాని ఆయన వేదాన్ని అసలే తిరస్కరించినవాడు కానేకాదు. బుద్ధావతారం అంత సులభంగా అర్థంచేసుకునే వస్తువు కాదు.
బుద్ధావతారం తరువాత మంత్రములు శక్తిహీనములయ్యాయంటే మనమెందుకు నేడు యజ్ఞం చేయాలి అనే ప్రశ్న రావచ్చు. 

59. ఎందుకు చేయాలంటే, మంత్రాలు నిర్వీర్యములైనా మంత్రానికి హేతువయిన ఈశ్వరుడు నిర్వీర్యం కాలేదు. ఈశ్వరుడు లేకుండా పోయాడా? మనం ఎంత అధర్మంలో ఉన్నా, చేతకాని తప్పుడు మాటలతో ప్రార్థించినా, ఈశ్వరుడు వరమిచ్చేవాడే! 

60. వేదమంత్రముల శక్తిమీదకాక, వేదమంత్రములు ఎవరిని స్తోత్రం చేసి ఏ పరమేశ్వరుడి యొక్క అనేక లక్షణములను స్తుతిచేస్తున్నాయో, అటువంటి వేదములకు కారణభూతుడయిన ఈశ్వరుడు దయామయుడు కాబట్టి, ఆయన యందు విశ్వాసంతో మనం నేడుకూడా యజ్ఞాలు చేస్తున్నాము. ఆ దృక్పథంతోనే చేయాలి. మనం నేడు కేవలం పూర్వ మీమాంసకులంకాదు. భగవద్భక్తులం. 

61. మనకు ఈశ్వరుడి మీద, ఈశ్వరుడి యొక్క అస్తిత్వం మీద విశ్వాసం ఉందేకాని మంత్రాల బలం మీద కాదు. మంత్రాలు ఒక మార్గమే. తెలుగు మాటలతో కూడా ఈశ్వరుణ్ణి ప్రార్థించవచ్చు. అది కూడా ఉత్తమమయిన భాషే! బ్రహ్మముఖంనుంచీ వచ్చినవి వేదములు, మంత్రములు. 

62. ఈ మంత్రాలను అనేక మహత్తులయందు గొప్పశక్తుల ప్రదర్శనయందు వాడుకున్న ఋషియుగం వేరు. ఆ తరగతి వేరు. మనం మాత్రం ప్రార్థనాపూర్వకంగానే మంత్రాలను నేడు ఉచ్చరిస్తున్నాము ఉత్తమమైన దేవభాషలో.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 137 🌹*
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

*🌻 Beyond the mind there is no such thing as experience. 🌻*

 Experience is a dual state. You cannot talk of reality as an experience. Once this is understood, you will no longer look for being and becoming as separate and opposite. 

In reality they are one and inseparable, like roots and branches of the same tree. 

Both can only exist in the light of consciousness, which again arises in the wake of the sense ' I am'. 

This is the primary fact. If you miss this, you miss all.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మనోశక్తి - Mind Power - 76 🌹*
 *Know Your Infinite Mind*
*🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴*
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 Q 70 :--పునర్జన్మ vs కుమారుడు 🌻*

Ans :--
గత జన్మలో శత్రువు ఈ జన్మలో కుమారుడిగా లేదా కుమార్తె గా జన్మిస్తుంది. వీరు ప్రేమ సృజనాత్మకత జీవితం విలువలు ఆధ్యాత్మికతను గురించి జ్ఞాన సముపార్జన చేస్తారు.

2) మన ఎమోషన్స్ మనకు బంధాలను కలుగజేస్తాయి.

ఒకవేళ ఈ జన్మలో ఒక వ్యక్తితో emotional గా బంధాన్ని కొనసాగిస్తే దాని గురించిన dynamics అర్థం చేసుకోకుండానే మరణిస్తే తర్వాతి జన్మలో కూడా అదే బంధాన్ని కొనసాగించి ఆ dynamics పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఒక emotion ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఒక జన్మ లేదా కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు.

ఆ ఎమోషన్ ని కొనసాగించడానికి ఆ వ్యక్తినే ఎంచుకోవచ్చు లేదా అదే frequency ఉన్న మరో వ్యక్తిని ఎంచుకోవచ్చు. ఆత్మకు ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మజ్ఞానం విస్తారంగా పెరిగినపుడు emotion పరంగా పెంచుకున్న బంధాల సంకెళ్ళు అన్నీ పటాపంచలు అవుతాయి.

ఇంక ఎమోషన్స్ కోసం జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు.ప్రతి ఆత్మ జ్ఞాన సముపార్జన చేసుకుని ఇతర జీవాత్మలకు భోదించకుండా వారిని ఆత్మజ్ఞానులు చేయకుండా ఈ లోకం నుండి విముక్తి పొందడం జరుగదు. 

ప్రస్తుతం భూమి మీద ఎవరైతే విరివిగా ఆత్మజ్ఞానం భోదిస్తున్నారో వారందరు ఆఖరిజన్మల్లో ఉన్నారని సేత్ తెలియజేస్తున్నారు. ఎమోషనల్ గా బంధాన్ని పూర్తిగా ఆస్వాదించి దాని dynamics అధ్యయనం చేయడానికి కవల పిల్లలుగా జన్మిస్తారు.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 22 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. అచ్చమ్మకు చెప్పిన జ్యోతిష్యం - 10 🌻*

క్షీణించిపోతున్న ధర్మాన్ని కాపాడి, పాపాత్ములను శిక్షించేందుకు నేను ఐదువేల ఏళ్ళ తర్వాత వీరభోగ వసంతరాయలుగా తిరిగి అవతరిస్తాను. .అప్పుడు నా భక్తులందరూ తిరిగి నన్ను చేరుకుంటారు.

దీనికి ఇంకా చాలా సమయం ఉంది. వందల ఏళ్ళు జరగాల్సిఉంది.

విజయనగరం కొన్నాళ్ళు అత్యంత వైభవంగా వెలుగుతుంది. ఆ తర్వాత ప్రాభవం కోల్పోయి నాశనమైపోతుంది.

ఇది ఒక చారిత్రక వాస్తవం. శ్రీకృష్ణదేవరాయల తర్వాత విజయనగర సామ్రాజ్యంలో అంతః కలహాలు ఏర్పడి, అసమర్థులు, భోగలాలసులైన చక్రవర్తుల నేతలుగా మారారు.

మరోవైపు మహమ్మదీయుల దండయాత్రల వల్ల ఆ మహా సామ్రాజ్యం బలహీనమవడం ప్రారంభించింది. మిగిలిన భారతీయ రాజుల మాదిరిగానే కర్నాటక, ఆంధ్ర ప్రాంత రాజుల్లో అనైక్యత వల్ల కూడా విదేశీయులైన మహమ్మదీయులు విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేయగలిగారు.

వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు.

వేంకటేశ్వరునికి మహమ్మదీయ వనిత బీబీ నాంచారి భార్య అనే విషయం అందరికీ తెలిసిందే. బీబీ నాంచారిని మహమ్మదీయులు పూజిస్తారు కాబోలు.

కృష్ణా గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చచ్చేను.

కృష్ణా గోదావరి నదులు సముద్రంలో కలిసే చోటు మన రాష్ట్రంలోనే ఉంది. గతంలో కృష్ణా జిల్లాలో వచ్చిన తుఫానుల వల్ల వేల సంఖ్యలో పశువులు మృతి చెందిన విషయం అందరికీ తెలుసు.

తూరుపు నుంచి పడమర వరకు ఆకాశంబున యోజన ప్రమాణం వెడల్పుగా చెంగావి చీర కట్టినట్టు కనపడుతుంది.

ఇది కూడా అణ్వస్త్రాల వల్ల కలిగే ఫలితమే. అణుబాంబు వల్ల పుట్టే ఎర్రని మంటలు ఆకాశాన్ని కప్పివేసినట్టు కనబడ్డాయి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Twelve Stanzas from the Book of Dzyan - 5 🌹*
*🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴*

*🌻 STANZA I - The Genesis of Divine Love - 5 🌻*

11. The Light was fighting bravely, armed with the One Power of Love. But because he was always ablaze with pure Divine Love, he felt no hatred towards the darkness, nor did he know jealousy. Love was the most powerful weapon, and the darkness was helpless against her. 

It was necessary to wield that weapon to be omnipotent! But the darkness could not approach the Light openly, for she would immediately burn down, engulfed in the Flame of Love. 

But by and by she found a way around: she would enter human Hearts, which were alone capable of holding the Sacred Divine Gift.

12. The human Heart started to glow, like the Celestial Star itself. And that tiny sun in a human breast was full of the bright and brimming-over currents of Love. 

Nevertheless, the Heart, parched with an endless thirst, went on constantly searching — only for Love, for that Divine impulse could be quenched by Love alone. 

Apparently, the Love of the earthly Hearts did not know satisfaction, for she still had not yet fully experienced the Power of the Sacred, Divinely Supreme Love. An enormous task of recognition lay ahead. 

And so to fulfil that Task of pure Heavenly Labour, the Lords of Destiny asked the Gods to launch the Supreme Mechanism which would turn another Wheel — one that would go beyond the bounds of Time, leading human Hearts along heavenly pathways to the recognition of True Love.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 16 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శ్రేయో మార్గము - ప్రేయో మార్గములు స్వధర్మము-పరధర్మము - 4 🌻*

మరి అటువంటి సంధ్యాకాలమును మనం ఇవాళ సద్వినియోగ పరచుకుంటున్నామా అంటే ఈ ప్రేయోమార్గమును ఆశ్రయించడం ద్వారా ఆయా సంధ్యాకాలములందు ఒకసారి గమనిస్తే ఉదయం ఆరుగంటలకి అవకాశం వున్నంతవరకు నిద్రావస్థలో గడుపుతూవుంటారు. 

మధ్యాహ్నం పన్నెండు గంటలకి అవకాశం వున్నంతవరకూ ధనార్జనలో గడుపుతూ వుంటారు. సాయంత్రం ఆరుగంటలకి విషయ సుఖాపేక్షలో అది తిందామా ఇది తాగుదామా అనే భావనతో గడుపుతూ వుంటాడు. అర్ధరాత్రి పన్నెండు గంటలకి కామోపభోగములందు మునిగిపోయి వుంటాడు. 

మరి ఇప్పుడు నాలుగు సంధ్యలలో జీవుడు ఈరకంగా తన ఆయుక్షీణం అయిపోతున్నటువంటి పద్ధతిని అయినటువంటి ప్రేయోమార్గమును ఆశ్రయించి, తత్ కాల సుఖమును అనుభవిస్తూ శాశ్వత దుఃఖములోపలికి, శాశ్వత దుఃఖకారణమైన జననమరణ చక్రంలో బంధింపబడేటటువంటి, కర్మచక్రంలో బంధింపబడేటటువంటి, ద్వంద్వానుభవములలో బంధింపబడేటటువంటి, విధానమును ఆశ్రయించడం వలన నిరంతరాయముగా చనిపోతున్నప్పటికీ, అంటే అర్ధం ఏమిటి? జీవుడు నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నాడు. 

ఎప్పుడో 100 సంవత్సరాలకి ఒకసారి చనిపోవడంలా. కేవలం ప్రతిరోజూ గాఢనిద్రావస్థలో తనని తాను మర్చిపోవడం ద్వారా , తనను తాను ఎఱుక లేకుండా జీవించడం ద్వారా, తాను ఏ స్థితిలో వున్నాడో తెలియకుండా జీవించడం ద్వారా నిత్య ప్రళయాన్ని అనుభవిస్తూ, గాఢ సుషుప్తియందు మరణిస్తూ మరల మేల్కొనేటప్పటికీ ఆ తెలివిని పొంది సజీవుడై మెలకువలో వ్యవహరిస్తున్నాడు.

 కాబట్టి జ్ఞానపద్ధతిగా వివేకము రీత్యా, విజ్ఞానము దృష్ట్యా గమనించినట్లయితే జీవుడు ప్రతిరోజూ చనిపోతున్నాడు. ప్రతిరోజూ మరణమునే పొందుతున్నాడు. 

కాబట్టి అట్టి నిత్యప్రళయాన్ని పొందేటటువంటి ప్రేయోమార్గము దూరముగా పెట్టవలసినటువంటి జీవన విధానము. మానవులందరూ ఈ సత్యాన్ని తప్పక గ్రహించాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 1 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 1 🌻*

1. భగవంతుడు అనగా శాశ్వత అస్థిత్వము, అనంత సర్వవ్యాపకత్వము.
భగవంతుడు శాశ్వత అనంత అస్థిత్వమైనపుడు, అందులో
భగవంతుని అనంత సంఖ్య గల స్థితులున్నవి.
కానీ అందు భగవంతునికి రెండే రెండు మూలాధార స్థితులున్నవి.
1. అసలు (మూల) స్థితి.
2 చరమ (పరమ) స్థితి. 

2. భగవంతునికి చైతన్యమందు ఎరుకలేని
( "భగవంతుడు ఉన్నాడు" అనెడు) పరాత్పర పరబ్రహ్మ స్థితి.

3. భగవంతునికి చైతన్యము లేని స్థితి - పరాత్పరము,
భగవంతునికి చైతన్యము గల స్థితి - పరమాత్మ

4. పరాత్పర స్థితికిని, పరమాత్మ స్థితికిని గల భేదము చైతన్యము మాత్రమే.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీరామశర్మ ప్రజ్ఞా సూక్తములు - 1 🌹*
 ✍️. సద్గురు పండిత శ్రీరామశర్మ ఆచార్య
📚. ప్రసాద్ భరద్వాజ 

*గురువు సామర్థ్యము - శిష్యుని పాత్రత,*

*గురువు యొక్క సిద్ధి - శిష్యుని సాధన,*

*గురువు ప్రేరణ - శిష్యుని సక్రియత,*

*గురువు స్నేహము - శిష్యుని శ్రద్ధ,*

*గురువు అనుశాసనము - శిష్యుని అనుగమనము,*

*ఇలా గురుశిష్యులు పరస్పరము సహాయ సహకారములు అందించుకుంటూ ఉంటారు.*
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹