శ్రీ లలితా సహస్ర నామములు - 156 / Sri Lalita Sahasranamavali - Meaning - 156

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 156 / Sri Lalita Sahasranamavali - Meaning - 156 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 156. ప్రాణేశ్వరీ, ప్రాణదాత్రీ, పంచాశత్-పీఠరూపిణీ ।
విశృంఖలా, వివిక్తస్థా, వీరమాతా, వియత్ప్రసూః ॥ 156 ॥ 🍀

🍀 828. ప్రాణేశ్వరీ :
ప్రాణములకు అధీశ్వరి

🍀 829. ప్రాణదాత్రీ :
ప్రాణములు ఇచ్చునది

🍀 830. పంచాశత్పీఠరూపిణీ :
శక్తిపీఠముల రూపమున వెలసినది

🍀 831. విశృంఖలా :
యధేచ్ఛగా ఉండునది

🍀 832. వివిక్తస్థా :
ఏకాంతముగా ఉండునది

🍀 833. వీరమాతా :
వీరులకు తల్లి

🍀 834. వియత్ప్రసూ: :
ఆకాశమును సృష్టించినది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 156 🌹

📚. Prasad Bharadwaj

🌻 156. Praneshvari pranadatri panchashatpritarupini
Vishrunkhala viviktasdha viramata viyatprasuh ॥ 156 ॥ 🌻

🌻 828 ) Praneshwari -
She who is goddess to the soul

🌻 829 ) Prana Dhatri -
She who gives the soul

🌻 830 ) Panchast peeta roopini -
She who is in fifty Shakthi peethas like Kama ropa, Varanasi. Ujjain etc

🌻 831 ) Vishungala -
She who is not chained.

🌻 832 ) Vivikthastha -
She who is in lonely places

🌻 833 ) Veera matha -
She who is the mother of heroes

🌻 834 ) Viyat prasoo -
She who has created the sky.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

23 Nov 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 108

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 108 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. కృష్ణుని లక్షణములు 🌻

సామాన్యముగ‌ న్యూనత గాని, ఆధిక్యము గాని లేని సమబుద్ధియే మహానుభావుల లక్షణము. కాని శ్రీ కృష్ణునికి ఆధిక్యము అను బుద్ధి లేకుండుటయే గాక , అందరును సమానమను అభిప్రాయము కూడ అతనికి లేదు. అనగా ఎవడు చేసుకొనిన కర్మకు తగిన ఫలము వానిని అనుభవింప జేయుటయు, ఎదుటివాని స్వభావమునకు తగినట్లు ప్రవర్తించుటయు కృష్ణుని లక్షణములు.

తానందరికి సముడు గాని, తనయందు అందరును సమముగా ప్రవర్తింపరు. కనుకనే కృష్ణుడందరి యెడల ఒకే విధముగ ప్రవర్తింపలేదు. గోపకుల యెడల చూపిన ప్రవర్తనకును, యాదవుల యెడ చూపిన ప్రవర్తనకు సంబంధము లేదు. పాండవుల యెడ చూపిన ప్రవర్తనకు , కౌరవుల యెడ చూపిన ప్రవర్తనకు సంబంధము లేదు. భక్తుల యెడ చూపిన ప్రవర్తనకు ఋషుల యెడ చూపిన ప్రవర్తనకు సంబంధము లేదు. ఇట్లే మిగిలిన చేష్టలనూహింపవలెను.

🌻 🌻 🌻 🌻 🌻

భగవంతుడు జీవులకు కల్పవృక్షముగా పనిచేయును. ఎవ్వరేమి కోరి అర్చింతురో వారి కది సమకూర్చును. కోరినదిచ్చును గాని తానిచ్చునది యని యుండదు. కోరుట వలన గలుగు మోసము ఇది. కోరనివారికి తానే నిర్ణయించును. కనుక కోరనివారి కిచ్చునట్టి స్థితి కోరినవారు పుచ్చుకొనలేక పోవుచున్నారు.

.......... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

23 Nov 2021

వివేక చూడామణి - 156 / Viveka Chudamani - 156

🌹. వివేక చూడామణి - 156 / Viveka Chudamani - 156🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -3 🍀

512. నేను కేవలము బ్రహ్మాన్ని, రెండవది ఏది కాని దానిని. ఆకాశము వలె మొదలు, చివర లేని దానిని. అందులో విశ్వమంతా ఏవిధమైన మార్పు లేకుండా, ఏ పదార్థమునకు అంటకుండా కేవలము నీరు వలె ఉంటుంది.

513. నేను కేవలము బ్రహ్మాన్ని. రెండవదేది కాని దానిని. అన్నింటికి ఆధారము నేనే. అన్ని వస్తువులను ప్రకాశింపజేసేది నేనే. అది శాశ్వతమైనది, ఏకమైనది, విభజించటానికి వీలులేనిది, స్థిరమైనది, స్వచ్ఛమైనది, కదలనిది, పూర్ణమైనది అదే బ్రహ్మము.

514. నేను బ్రహ్మమును రెండవదేది కాని దానిని. అనేక మార్పులకు కారణమైన దానిని. మాయకు కారణము నేనే. అదే అన్నింటిలోనూ సారముగా, ఎఱుకకు అతీతముగా, సత్యమైన జ్ఞానసారము, బ్రహ్మానంద స్థితిని నేనే.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 156 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 32. I am the one who knows Brahman -3🌻

512. I am verily that Brahman, the One without a second, which is like the sky, subtle, without beginning or end, in which the whole universe from the Undifferentiated down to the gross body, appears merely as a shadow.

513. I am verily that Brahman, the One without a second, which is the support of all, which illumines all things, which has infinite forms, is omnipresent, devoid of multiplicity, eternal, pure, unmoved and absolute.

514. I am verily that Brahman, the One without a second, which transcends the endless differentiations of Maya, which is the inmost essence of all, is beyond the range of consciousness, and which is Truth, Knowledge, Infinity and Bliss Absolute.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

23 Nov 2021

శ్రీ శివ మహా పురాణము - 479

🌹 . శ్రీ శివ మహా పురాణము - 479 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 36

🌻. సప్తర్షుల ఉపదేశము - 1 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను-

వసిష్ఠుని మాటను విని బంధువులతో భార్యతో గూడియున్న పర్వతరాజగు ఆ హిమవంతుడు ఇతర పర్వతములతో నిట్లనెను (1).

హిమవంతుడిట్లనెను-

పర్వతరాజగు ఓ మేరు పర్వతమా! సహ్య గంధమాదన మందర మైనాక వింధ్య పర్వత శ్రేష్ఠులారా! నామాటను మీరందరు వినుడు (2). వసిష్ఠుడు ఇట్లు చెప్పుచున్నాడు. నా కర్తవ్యమేమిటి? అను విషయమును మీరు విచారించి సర్వమును మనస్సులో నిర్ణయించి నాకు చెప్పుడు (3)?

పర్వతములిట్లు పలికినవి-

ఇపుడు విమర్శించి ప్రయోజనమేమి? కర్తవ్యమును అనుష్ఠించవలెను. మహాత్మా! ఈమె దేవకార్యము కొరకు మాత్రమే జన్మించినది (4). ఈమె రుద్రుని ఆరాధించినది. రుద్రుడు ఈమెతో సంభాషించినాడు. ఈమె శివుని కొరకై అవతరించినది గనుక, శివునకు ఇచ్చి వివాహమును చేయవలెను (5).

బ్రహ్మ ఇట్లు పలికెను-

మేరువు ఇత్యాది పర్వతముల ఈ మాటను విని హిమవంతుడు మిక్కలి ప్రసన్నుడాయెను. పార్వతి తన మనస్సులో నవ్వుకొనెను (6). అరుంధతి మేనకకు అనేక యుక్తులను, వివిధములగు ఇతిహాసములను చెప్పి ఆమెను ఒప్పించెను (7). అపుడు హిమవంతుని పత్నియగు మేనక తెలుసుకొని ప్రసన్నమగు మనస్సుగలదై మునులకు అరుంధతికి భోజనము పెట్టి తాను భుజించెను (8). అపుడు జ్ఞానియగు హిమవంతుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై, తొలగిన భ్రమలు గలవాడై మునులను, అరుంధతిని చక్కగా సెవించి చేతులు జోడించి ప్రీతిపూర్వకముగా నిట్లనెను (9).

హిమవంతుడిట్లు పలికెను-

సప్తర్షులారా! మహాత్ములారా! నా మాటను వినుడు. నాకు గల గర్వమంతయూ తొలగినది. ఉమాపరమేశ్వరుల చరితమును వింటిని (10). నా శరీరము, భార్యయగు మేన, కుమారులు, కుమార్తె, సాధనసంపత్తి, సిద్ధి, మరియు ఇతరము శివునకు చెందినదే గాని, మరియొకటి గాదు (11).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

23 Nov 2021

గీతోపనిషత్తు -280

🌹. గీతోపనిషత్తు -280 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 13-4

🍀 13-4. ఈశ్వర తత్వము - సత్య దర్శనమునకు సత్వగుణము నాశ్రయించుట తప్పనిసరి. అట్టి ఆశ్రయము వలన జీవుని కోశముల యందలి మలినములు తొలగును. మలినమే అజ్ఞానము. అది తొలగినపుడు జ్ఞాన మావిష్కరింప బడును. అట్టి జ్ఞానము నామరూపాతీతమగు వెలుగును దర్శింప జేయును. ఇట్లు దర్శించిన మహాత్ములకు సర్వము ఈశ్వరమయముగనే గోచరించును. ఈశ్వరుని భూత మహేశ్వరత్వము కూడ తెలియబడును. ఈశ్వరుడు సర్వవ్యాపి, సర్వమునకు మూలము అని తెలియ బడును. అట్టి ఈశ్వర తత్త్వము నందు సర్వ జీవులును తేలుచు యున్నారని దర్శనమగును. ఇట్టి దర్శనము నిత్యము అనుభవించు చున్నవారే మహాత్ములు. 🍀

మహాత్మానసు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః |
భజం త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాది మవ్యయమ్ || 13

తాత్పర్యము : దైవీ ప్రకృతి నాశ్రయించి మహాత్ములు సమస్త ప్రాణికోటికి ఆదికారణునిగను, నాశ రహితునిగను నన్నెరిగి ఇతర చింతన లేక నన్నే సేవించు చున్నారు.

వివరణము : కనుక ఈ శ్లోకమున సత్యదర్శనమునకు సత్వగుణము నాశ్రయించుట తప్పనిసరి అని తెలుపబడినది. అట్టి ఆశ్రయము వలన జీవుని కోశముల యందలి మలినములు తొలగును. మలినమే అజ్ఞానము. అది తొలగినపుడు జ్ఞాన మావిష్కరింపబడును. అట్టి జ్ఞానము నామరూపాతీతమగు వెలుగును దర్శింపజేయును. ఇట్లు దర్శించిన మహాత్ములకు సర్వము ఈశ్వరమయముగనే గోచరించును. ఈశ్వరుని భూత మహేశ్వరత్వము కూడ తెలియబడును. ఈశ్వరుడు సర్వవ్యాపి, సర్వమునకు మూలము అని తెలియ బడును.

అట్టి ఈశ్వర తత్త్వము నందు సర్వ జీవులును తేలుచు యున్నారని దర్శనమగును. ఇట్టి దర్శనము నిత్యము అనుభవించు చున్నవారే మహాత్ములు. వారికీశ్వరుడు కాని దేమియు లేదు. అట్టి ఈశ్వరుడు శాశ్వతుడని కూడ తెలుయును. ఇట్లు దర్శనము చేయుచున్న మహాత్ములు లోకమున పూజ్యులు. ఆశామోహములకు లోబడినవారు లోకమున బద్ధులు. మహాత్ములు తన దైవీ ప్రకృతి నాశ్రయించి యుండుటచే తనను ఎప్పుడును తెలిసియే యుందురు. అట్లు తెలిసి నన్ను సేవించుచు నుందురు. వారికి తరము లేదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

23 Nov 2021

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మదిన శుభాకాంక్షలు. Happy Birthday to Lord Sri Sathya Sai Baba.

🌹. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జన్మదిన శుభాకాంక్షలు. 🌹

"LOVE ALL - SERVE ALL"
"HELP EVER - HURT NEVER"

అనే నినాదాలని ప్రత్యక్షంగా ఆచరింపచేస్తూ, అవతార లక్ష్యాన్ని తెలియచేసిన అవతార పురుషుడు.

విద్య, వైద్య రంగాలలో మనం ప్రస్తుతం చూస్తున్న వాణిజ్య విధానానికి విరుగుడుగా - పుట్టపర్తిలో - ఆధ్యాత్మిక విలువలతోనూ ఉచితంగానూ సంస్థలు స్థాపించి నడిపిస్తున్నతీరు ఆదర్శం.

భద్రాచలం సమీపంలోని కాగిత కర్మాగార సారపాక గ్రామంలో స్థానిక సాయి సంస్థ పేదబస్తీలో నడుపుతున్న విద్యాలయం స్వామి అవతార సంకల్ప ఆచరణలో ఒక మణి.

🍀. ప్రసాద్ భరద్వాజ 🙏

23 Nov 2021

23-NOVEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 23, మంగళవారం, నవంబర్ 2021 భౌమ వారము 🌹
🍀. కార్తీక మాసం 19వ రోజు 🍀

2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 280 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 479🌹 
4) 🌹 వివేక చూడామణి - 156 / Viveka Chudamani - 156🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -108🌹  
6) 🌹 Osho Daily Meditations - 97🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 156 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 156 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*23, నవంబర్‌ 2021, భౌమ వారము*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. కార్తీక మాసం 19వ రోజు 🍀*

నిషిద్ధములు : నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైధునం, ఉసిరి
దానములు : నువ్వులు, కుడుములు
పూజించాల్సిన దైవము : 
వినాయకుడు
జపించాల్సిన మంత్రము :
ఓం గం గణపతయే స్వాహా
ఫలితము : విజయం, సర్వవిఘ్న నాశనం

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు,  
కార్తీక మాసం
తిథి: కృష్ణ చవితి 24:57:39 వరకు 
తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: ఆర్ద్ర 13:45:42 వరకు 
తదుపరి పునర్వసు
యోగం: సద్య 06:45:17 వరకు 
తదుపరి శుభ
 కరణం: బవ 11:42:28 వరకు
వర్జ్యం: 27:07:30 - 28:54:30
దుర్ముహూర్తం: 08:40:03 - 09:25:01
రాహు కాలం: 14:50:54 - 16:15:11
గుళిక కాలం: 12:02:20 - 13:26:37
యమ గండం: 09:13:46 - 10:38:03
అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:24
అమృత కాలం: 02:30:00 - 04:18:00
సూర్యోదయం: 06:25:12
సూర్యాస్తమయం: 17:39:27
వైదిక సూర్యోదయం: 06:29:02
వైదిక సూర్యాస్తమయం: 17:35:40
చంద్రోదయం: 20:48:46
చంద్రాస్తమయం: 09:35:55
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: జెమిని
చర యోగం - దుర్వార్త శ్రవణం 
13:45:42 వరకు తదుపరి స్థిర యోగం - 
శుభాశుభ మిశ్రమ ఫలం 
పండుగలు : సంకష్టి చతుర్థి 
Sankashti Chaturthi
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -280 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 13-4
 
*🍀 13-4. ఈశ్వర తత్వము - సత్య దర్శనమునకు సత్వగుణము నాశ్రయించుట తప్పనిసరి. అట్టి ఆశ్రయము వలన జీవుని కోశముల యందలి మలినములు తొలగును. మలినమే అజ్ఞానము. అది తొలగినపుడు జ్ఞాన మావిష్కరింప బడును. అట్టి జ్ఞానము నామరూపాతీతమగు వెలుగును దర్శింప జేయును. ఇట్లు దర్శించిన మహాత్ములకు సర్వము ఈశ్వరమయముగనే గోచరించును. ఈశ్వరుని భూత మహేశ్వరత్వము కూడ తెలియబడును. ఈశ్వరుడు సర్వవ్యాపి, సర్వమునకు మూలము అని తెలియ బడును. అట్టి ఈశ్వర తత్త్వము నందు సర్వ జీవులును తేలుచు యున్నారని దర్శనమగును. ఇట్టి దర్శనము నిత్యము అనుభవించు చున్నవారే మహాత్ములు. 🍀*

*మహాత్మానసు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః |*
*భజం త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాది మవ్యయమ్ || 13*

*తాత్పర్యము : దైవీ ప్రకృతి నాశ్రయించి మహాత్ములు సమస్త ప్రాణికోటికి ఆదికారణునిగను, నాశ రహితునిగను నన్నెరిగి ఇతర చింతన లేక నన్నే సేవించు చున్నారు.*

*వివరణము : కనుక ఈ శ్లోకమున సత్యదర్శనమునకు సత్వగుణము నాశ్రయించుట తప్పనిసరి అని తెలుపబడినది. అట్టి ఆశ్రయము వలన జీవుని కోశముల యందలి మలినములు తొలగును. మలినమే అజ్ఞానము. అది తొలగినపుడు జ్ఞాన మావిష్కరింపబడును. అట్టి జ్ఞానము నామరూపాతీతమగు వెలుగును దర్శింపజేయును. ఇట్లు దర్శించిన మహాత్ములకు సర్వము ఈశ్వరమయముగనే గోచరించును. ఈశ్వరుని భూత మహేశ్వరత్వము కూడ తెలియబడును. ఈశ్వరుడు సర్వవ్యాపి, సర్వమునకు మూలము అని తెలియ బడును.* 

*అట్టి ఈశ్వర తత్త్వము నందు సర్వ జీవులును తేలుచు యున్నారని దర్శనమగును. ఇట్టి దర్శనము నిత్యము అనుభవించు చున్నవారే మహాత్ములు. వారికీశ్వరుడు కాని దేమియు లేదు. అట్టి ఈశ్వరుడు శాశ్వతుడని కూడ తెలుయును. ఇట్లు దర్శనము చేయుచున్న మహాత్ములు లోకమున పూజ్యులు. ఆశామోహములకు లోబడినవారు లోకమున బద్ధులు. మహాత్ములు తన దైవీ ప్రకృతి నాశ్రయించి యుండుటచే తనను ఎప్పుడును తెలిసియే యుందురు. అట్లు తెలిసి నన్ను సేవించుచు నుందురు. వారికి తరము లేదు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 479 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 36

*🌻. సప్తర్షుల ఉపదేశము - 1 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను-

వసిష్ఠుని మాటను విని బంధువులతో భార్యతో గూడియున్న పర్వతరాజగు ఆ హిమవంతుడు ఇతర పర్వతములతో నిట్లనెను (1).

హిమవంతుడిట్లనెను-

పర్వతరాజగు ఓ మేరు పర్వతమా! సహ్య గంధమాదన మందర మైనాక వింధ్య పర్వత శ్రేష్ఠులారా! నామాటను మీరందరు వినుడు (2). వసిష్ఠుడు ఇట్లు చెప్పుచున్నాడు. నా కర్తవ్యమేమిటి? అను విషయమును మీరు విచారించి సర్వమును మనస్సులో నిర్ణయించి నాకు చెప్పుడు (3)?

పర్వతములిట్లు పలికినవి-

ఇపుడు విమర్శించి ప్రయోజనమేమి? కర్తవ్యమును అనుష్ఠించవలెను. మహాత్మా! ఈమె దేవకార్యము కొరకు మాత్రమే జన్మించినది (4). ఈమె రుద్రుని ఆరాధించినది. రుద్రుడు ఈమెతో సంభాషించినాడు. ఈమె శివుని కొరకై అవతరించినది గనుక, శివునకు ఇచ్చి వివాహమును చేయవలెను (5).

బ్రహ్మ ఇట్లు పలికెను-

మేరువు ఇత్యాది పర్వతముల ఈ మాటను విని హిమవంతుడు మిక్కలి ప్రసన్నుడాయెను. పార్వతి తన మనస్సులో నవ్వుకొనెను (6). అరుంధతి మేనకకు అనేక యుక్తులను, వివిధములగు ఇతిహాసములను చెప్పి ఆమెను ఒప్పించెను (7). అపుడు హిమవంతుని పత్నియగు మేనక తెలుసుకొని ప్రసన్నమగు మనస్సుగలదై మునులకు అరుంధతికి భోజనము పెట్టి తాను భుజించెను (8). అపుడు జ్ఞానియగు హిమవంతుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై, తొలగిన భ్రమలు గలవాడై మునులను, అరుంధతిని చక్కగా సెవించి చేతులు జోడించి ప్రీతిపూర్వకముగా నిట్లనెను (9).

హిమవంతుడిట్లు పలికెను-

సప్తర్షులారా! మహాత్ములారా! నా మాటను వినుడు. నాకు గల గర్వమంతయూ తొలగినది. ఉమాపరమేశ్వరుల చరితమును వింటిని (10). నా శరీరము, భార్యయగు మేన, కుమారులు, కుమార్తె, సాధనసంపత్తి, సిద్ధి, మరియు ఇతరము శివునకు చెందినదే గాని, మరియొకటి గాదు (11).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 156 / Viveka Chudamani - 156🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -3 🍀*

512. నేను కేవలము బ్రహ్మాన్ని, రెండవది ఏది కాని దానిని. ఆకాశము వలె మొదలు, చివర లేని దానిని. అందులో విశ్వమంతా ఏవిధమైన మార్పు లేకుండా, ఏ పదార్థమునకు అంటకుండా కేవలము నీరు వలె ఉంటుంది. 

513. నేను కేవలము బ్రహ్మాన్ని. రెండవదేది కాని దానిని. అన్నింటికి ఆధారము నేనే. అన్ని వస్తువులను ప్రకాశింపజేసేది నేనే. అది శాశ్వతమైనది, ఏకమైనది, విభజించటానికి వీలులేనిది, స్థిరమైనది, స్వచ్ఛమైనది, కదలనిది, పూర్ణమైనది అదే బ్రహ్మము.

514. నేను బ్రహ్మమును రెండవదేది కాని దానిని. అనేక మార్పులకు కారణమైన దానిని. మాయకు కారణము నేనే. అదే అన్నింటిలోనూ సారముగా, ఎఱుకకు అతీతముగా, సత్యమైన జ్ఞానసారము, బ్రహ్మానంద స్థితిని నేనే. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 156 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 32. I am the one who knows Brahman -3🌻*

512. I am verily that Brahman, the One without a second, which is like the sky, subtle, without beginning or end, in which the whole universe from the Undifferentiated down to the gross body, appears merely as a shadow.

513. I am verily that Brahman, the One without a second, which is the support of all, which illumines all things, which has infinite forms, is omnipresent, devoid of multiplicity, eternal, pure, unmoved and absolute.

514. I am verily that Brahman, the One without a second, which transcends the endless differentiations of Maya, which is the inmost essence of all, is beyond the range of consciousness, and which is Truth, Knowledge, Infinity and Bliss Absolute.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 108 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. కృష్ణుని లక్షణములు 🌻*

*సామాన్యముగ‌ న్యూనత గాని, ఆధిక్యము గాని లేని సమబుద్ధియే మహానుభావుల లక్షణము. కాని శ్రీ కృష్ణునికి ఆధిక్యము అను బుద్ధి లేకుండుటయే గాక , అందరును సమానమను అభిప్రాయము కూడ అతనికి లేదు. అనగా ఎవడు చేసుకొనిన కర్మకు తగిన ఫలము వానిని అనుభవింప జేయుటయు, ఎదుటివాని స్వభావమునకు తగినట్లు ప్రవర్తించుటయు కృష్ణుని లక్షణములు.* 

*తానందరికి సముడు గాని, తనయందు అందరును సమముగా ప్రవర్తింపరు. కనుకనే కృష్ణుడందరి యెడల ఒకే విధముగ ప్రవర్తింపలేదు. గోపకుల యెడల చూపిన ప్రవర్తనకును, యాదవుల యెడ చూపిన ప్రవర్తనకు సంబంధము లేదు. పాండవుల యెడ చూపిన ప్రవర్తనకు , కౌరవుల యెడ చూపిన ప్రవర్తనకు సంబంధము లేదు. భక్తుల యెడ చూపిన ప్రవర్తనకు ఋషుల యెడ చూపిన ప్రవర్తనకు సంబంధము లేదు. ఇట్లే మిగిలిన చేష్టలనూహింపవలెను.*
🌻 🌻 🌻 🌻 🌻

*భగవంతుడు జీవులకు కల్పవృక్షముగా పనిచేయును. ఎవ్వరేమి కోరి అర్చింతురో వారి కది సమకూర్చును. కోరినదిచ్చును గాని తానిచ్చునది యని యుండదు. కోరుట వలన గలుగు మోసము ఇది. కోరనివారికి తానే నిర్ణయించును. కనుక కోరనివారి కిచ్చునట్టి స్థితి కోరినవారు పుచ్చుకొనలేక పోవుచున్నారు.*

.......... ✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌻 
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 97 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 97. MAKING LOVE 🍀*

*🕉 Love has to be cherished, tasted very slowly, so that it suffuses your being and becomes such a possessing experience that you are no more. It. is not that you are making love--you are love. 🕉*
 
*Love can become a bigger energy around you. It can transcend you and your lover so that you are both lost in it. But for that you will have to wait. Wait for the moment, and soon you will have the knack of it. Let the energy accumulate, and let it happen on its own. By and by, you will become aware when the moment arises. You will start seeing the symptoms of it, the presymptoms, and then there will be no difficulty.*

*If the moment does not arise in which you naturally fall into lovemaking, then wait; there is no hurry. The Western mind is in too much hurry--even while making love, it is something that has to be done with and finished. That is a completely wrong attitude. You cannot manipulate love. It happens when it happens, if it is not happening, there is nothing to be worried about.* 

*Don't make it an ego trip that somehow you have to make love. That is also there in the Western mind; the man thinks he has to perform somehow. If he is not managing, he is not manly enough. This is foolish, stupid. Love is something transcendental. You cannot manage it. Those who have tried to have missed all its beauty. Then at the most it becomes a sexual release, but all the subtle and deeper realms remain untouched.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 156 / Sri Lalita Sahasranamavali - Meaning - 156 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 156. ప్రాణేశ్వరీ, ప్రాణదాత్రీ, పంచాశత్-పీఠరూపిణీ ।*
*విశృంఖలా, వివిక్తస్థా, వీరమాతా, వియత్ప్రసూః ॥ 156 ॥ 🍀*

🍀 828. ప్రాణేశ్వరీ :
 ప్రాణములకు అధీశ్వరి 

🍀 829. ప్రాణదాత్రీ : 
ప్రాణములు ఇచ్చునది 

🍀 830. పంచాశత్పీఠరూపిణీ :
 శక్తిపీఠముల రూపమున వెలసినది 

🍀 831. విశృంఖలా : 
యధేచ్ఛగా ఉండునది 

🍀 832. వివిక్తస్థా :
 ఏకాంతముగా ఉండునది 

🍀 833. వీరమాతా : 
వీరులకు తల్లి 

🍀 834. వియత్ప్రసూ: :
 ఆకాశమును సృష్టించినది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 156 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 156. Praneshvari pranadatri panchashatpritarupini*
*Vishrunkhala viviktasdha viramata viyatprasuh ॥ 156 ॥ 🌻*

🌻 828 ) Praneshwari -   
She who is goddess to the soul

🌻 829 ) Prana Dhatri -   
She who gives the soul

🌻 830 ) Panchast peeta roopini -   
She who is in fifty Shakthi peethas like Kama ropa, Varanasi. Ujjain etc

🌻 831 ) Vishungala -   
She who is not chained.

🌻 832 ) Vivikthastha -   
She who is in lonely places

🌻 833 ) Veera matha -   
She who is the mother of heroes

🌻 834 ) Viyat prasoo -   
She who has created the sky.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranam
 #PrasadBhardwaj 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://mymandir.page.link/wdh7G
https://t.me/ChaitanyaVijnanam 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹