వివేక చూడామణి - 156 / Viveka Chudamani - 156
🌹. వివేక చూడామణి - 156 / Viveka Chudamani - 156🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -3 🍀
512. నేను కేవలము బ్రహ్మాన్ని, రెండవది ఏది కాని దానిని. ఆకాశము వలె మొదలు, చివర లేని దానిని. అందులో విశ్వమంతా ఏవిధమైన మార్పు లేకుండా, ఏ పదార్థమునకు అంటకుండా కేవలము నీరు వలె ఉంటుంది.
513. నేను కేవలము బ్రహ్మాన్ని. రెండవదేది కాని దానిని. అన్నింటికి ఆధారము నేనే. అన్ని వస్తువులను ప్రకాశింపజేసేది నేనే. అది శాశ్వతమైనది, ఏకమైనది, విభజించటానికి వీలులేనిది, స్థిరమైనది, స్వచ్ఛమైనది, కదలనిది, పూర్ణమైనది అదే బ్రహ్మము.
514. నేను బ్రహ్మమును రెండవదేది కాని దానిని. అనేక మార్పులకు కారణమైన దానిని. మాయకు కారణము నేనే. అదే అన్నింటిలోనూ సారముగా, ఎఱుకకు అతీతముగా, సత్యమైన జ్ఞానసారము, బ్రహ్మానంద స్థితిని నేనే.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 156 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 32. I am the one who knows Brahman -3🌻
512. I am verily that Brahman, the One without a second, which is like the sky, subtle, without beginning or end, in which the whole universe from the Undifferentiated down to the gross body, appears merely as a shadow.
513. I am verily that Brahman, the One without a second, which is the support of all, which illumines all things, which has infinite forms, is omnipresent, devoid of multiplicity, eternal, pure, unmoved and absolute.
514. I am verily that Brahman, the One without a second, which transcends the endless differentiations of Maya, which is the inmost essence of all, is beyond the range of consciousness, and which is Truth, Knowledge, Infinity and Bliss Absolute.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
23 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment