మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 108
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 108 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. కృష్ణుని లక్షణములు 🌻
సామాన్యముగ న్యూనత గాని, ఆధిక్యము గాని లేని సమబుద్ధియే మహానుభావుల లక్షణము. కాని శ్రీ కృష్ణునికి ఆధిక్యము అను బుద్ధి లేకుండుటయే గాక , అందరును సమానమను అభిప్రాయము కూడ అతనికి లేదు. అనగా ఎవడు చేసుకొనిన కర్మకు తగిన ఫలము వానిని అనుభవింప జేయుటయు, ఎదుటివాని స్వభావమునకు తగినట్లు ప్రవర్తించుటయు కృష్ణుని లక్షణములు.
తానందరికి సముడు గాని, తనయందు అందరును సమముగా ప్రవర్తింపరు. కనుకనే కృష్ణుడందరి యెడల ఒకే విధముగ ప్రవర్తింపలేదు. గోపకుల యెడల చూపిన ప్రవర్తనకును, యాదవుల యెడ చూపిన ప్రవర్తనకు సంబంధము లేదు. పాండవుల యెడ చూపిన ప్రవర్తనకు , కౌరవుల యెడ చూపిన ప్రవర్తనకు సంబంధము లేదు. భక్తుల యెడ చూపిన ప్రవర్తనకు ఋషుల యెడ చూపిన ప్రవర్తనకు సంబంధము లేదు. ఇట్లే మిగిలిన చేష్టలనూహింపవలెను.
🌻 🌻 🌻 🌻 🌻
భగవంతుడు జీవులకు కల్పవృక్షముగా పనిచేయును. ఎవ్వరేమి కోరి అర్చింతురో వారి కది సమకూర్చును. కోరినదిచ్చును గాని తానిచ్చునది యని యుండదు. కోరుట వలన గలుగు మోసము ఇది. కోరనివారికి తానే నిర్ణయించును. కనుక కోరనివారి కిచ్చునట్టి స్థితి కోరినవారు పుచ్చుకొనలేక పోవుచున్నారు.
.......... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
23 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment