మైత్రేయ మహర్షి బోధనలు - 103


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 103 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 82. చికాకు -2 🌻


ఇక రెండవ విషము. ప్రాపంచిక విషయములను గూర్చి కలుగు చికాకు. దీనత దీనికి పునాదిరాయి. తనపై తనకు దయ, కరుణ దీనతను కలిగించును. హృదయమును దుర్బలము చేయును. తననందరూ మోసము చేయుచున్నారని భావన కలుగును. తన నెవరూ ప్రేమించుట లేదనిపించును. అందరూ స్వార్థపరులే అనిపించును. ప్రపంచము లోపభూయిష్టమైనదని అనిపించును. బాధే సౌఖ్య మనిపించును. మంచి చెడుల తారతమ్యము లేదనిపించును. బుద్ధి వక్రించును. కుంచించుకొని పోవును. నిష్ప్రయోజనమగు వేదాంత ధోరణి పుట్టును.

సద్విషయముల యందు, సత్కార్యముల యందు, సత్పురుషుల యందు ఏహ్యభావము కలుగును. వీని నుండి పుట్టిన విషము నుండి బయల్పడుట బహుకష్టము. సర్వమునకు విముఖత చెందిన మనస్సును కేవలము దైవస్పర్శయే మార్చగలదు. జీవులను, ప్రపంచమును ద్వేషించుట వలన పుట్టిన విషమును దైవము కూడ హరింపడు. కాని దైవము నందు అనుగ్రహమను శుభలక్షణ ముండుటచే అది ప్రసరించినచో కాలము రూపములో పరిష్కారము లభింప గలదు. అట్టి వారికి కాలమే పరిష్కారకుడు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


13 Apr 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 164


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 164 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. జీవితానికి సరిహద్దులు లేవు. జీవితం ఆద్యంతాలు లేనిది. కానీ మనం మరీ ఎక్కువగా శరీరానికి, మనసుకు అతుక్కుపోయి వుంటాం. అది మన యధార్థం కాదన్న విషయాన్ని మనం పూర్తిగా మరిచిపోయాం. మనం రూపరహితులమని గుర్తించినపుడు మనం దేవుడిలో భాగాలవుతాం. దేవుడు మనలో భాగమవుతాడు. 🍀


జీవితం దాని యథార్థాన్ని బట్టి సరిహద్దులు లేనిది. అది శరీరానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది కాదు. అది సముద్ర సంబంధమయినది. సముద్రాల కయినా సరిహద్దులుంటాయి. కానీ జీవితానికి సరిహద్దులు లేవు. జీవితం ఆద్యంతాలు లేనిది. కానీ మనం మరీ ఎక్కువగా శరీరానికి, మనసుకు అతుక్కుపోయి వుంటాం. అది మన యధార్థం కాదన్న విషయాన్ని మనం పూర్తిగా మరిచిపోయాం.

మనం ఎన్నో శరీరాల్లో జీవించాం. నువ్వు ప్రయాణికుడివి, తీర్థయాత్రికుడివి. జీవితం, చైతన్యం ఒక శరీరం నించీ యింకో శరీరానికి సాగుతుంది. మనం రూపరహితులమని గుర్తించినపుడు ఆ రోజు మనకు గొప్పరోజు అది పరివర్తన చెందిన రోజు. అపుడు మనం వెనకటిలా వుండం. అప్పుడు మనం దేవుడిలో భాగాలవుతాం. దేవుడు మనలో భాగమవుతాడు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


13 Apr 2022

నిత్య ప్రజ్ఞా సందేశములు - 264 - 20. ‘మోక్షం’ అనే పదం అన్ని విషయాల అంతిమ లక్ష్యాన్ని వివరిస్తుంది. / DAILY WISDOM - 264 - 20. The Term ‘Moksha' Describes the Final Aim of All Things


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 264 / DAILY WISDOM - 264 🌹

🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀

📝 .స్వామి కృష్ణానంద
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 20. ‘మోక్షం’ అనే పదం అన్ని విషయాల అంతిమ లక్ష్యాన్ని వివరిస్తుంది. 🌻


ప్రజల యొక్క అవసరాలు ఏమిటి? అవి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ భద్రత అని ఎవరైనా అనవచ్చు. కానీ, ఇది స్థూల స్థాయి నుండి మాత్రమే విషయాలను చూడటం. ఈ విషయాన్ని చాలా నిశితంగా పరిశీలించిన స్మృతులు, పురాణేతిహాసాలు మానవుల అవసరాలను ధర్మ, అర్ధ కామ మోక్షాలుగా వర్గికరించాయి. ఋషులకు మానవ జీవిత ఆవశ్యకతలపై ఉన్న గొప్ప అంతర్దృష్టికి ఇది నిలువెత్తు ఉదాహరణ. మానవుని పూర్తి అవసరాలను కేవలం ఈ నాలుగు వర్గాలుగా మాత్రమే విభజించవచ్చు.

'మోక్షం' అనే పదం అన్ని విషయాల యొక్క చివరి లక్ష్యాన్ని వివరిస్తుంది. ప్రతి జీవికి ఉండే అనంతమైన కోరికలు ఎక్కడో ఒకచోట ముగియాలి. కోరికలకు దాన్ని నెరవేర్చే అవకాశం లేకుండా అడగడంగా మాత్రమే ఉండదు. ఉన్నత లోకాలను పొందాలనే కోరిక ప్రతి జీవిలో, మరియు మానవులలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ కోరికకు సైతం ఏదో ఒక జన్మస్థానం ఉండాలి. ఈ కోరిక సామూహిక ప్రాణ శక్తి ని ధరించే చైతన్యంలో ఉత్పన్నమౌతుంది తప్ప ఇంక ఎక్కడా కాదు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 264 🌹

🍀 📖 from Essays in Life and Eternity 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 20. The Term ‘Moksha' Describes the Final Aim of All Things 🌻


What are the needs of people? One may say that they are social, economic and political security. But, this would be to look at things only from the peripheral level. Ancient Indian thought, recorded in the scriptural texts, such as the Smritis, Epics and Puranas, which have gone into great detail in this field of investigation, has classified the basic requirement in terms of what are known as dharma, artha, kama and moksha. Here is a standing example of the great intuition of the early seers into the essentials of human life.

The four aims stated exhaust the entire area of human aspiration and performance. The term ‘moksha' describes the final aim of all things. The resistless asking, characterising all living beings in a variety of ways, has to end somewhere, sometime. There cannot be only asking without the chance of fulfilling it. An endless asking for wider dimensions which can be seen working vigorously in every living being, and most perspicaciously in human nature, has to have its origin nowhere except in the very consciousness and the very life principle of all beings.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


13 Apr 2022

శ్రీ మదగ్ని మహాపురాణము - 34 / Agni Maha Purana - 34




🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 34 / Agni Maha Purana - 34 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు

ప్రథమ సంపుటము, అధ్యాయము - 12

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

🌻. శ్రీహరి వంశ వర్ణనము - 5 🌻


గౌరి శివునితో క్రీడించు చుండగా చూచి ఉష భర్తను గూర్చి అభిలాష కలదాయెను. గౌరి ఆమెతో ఇట్లనెను. వైశాఖమాన ద్వాదశీదివసమున నీకు స్వప్నమునందు కనబడు పురుషుడు నీకు భర్తకాగలడు గౌరి మాటలు విని సంతసించిన ఉష గృహమునందు నిద్రించి ఆతనిని చూచెను. అతడు తనతో సంగము చేసినట్లు తెలిసికొని, చిత్రపటముపై అతని మూర్తిని చిత్రించి దాని సాహాయ్యముతో సఖియైన చిత్రలేఖ ద్వారా కృష్ణుని పౌత్రుడైన ఆనిరుద్ధుని ద్వారకనుండి తెప్పించికొనెను. ఆ చిత్రలేఖ బాణాసురుని మంత్రియైన కుంభాడుని పుత్రిక. అనిరుద్దుడు ఉషతో కూడ రమించెను. రక్షకులు వెళ్లి బాణుని ధ్వజము పడిపోయినట్లు అతనికి తెలిపిరి. అనిరుద్దునకు బాణునితో సూదారుణౖన యుద్ధము జరిగెను.

కృష్ణుడు నారదుని నుండి ఈ విషయము తెలియగా, గరుడారూఢుడై, ప్రద్యుమ్న బలరామసమేతడై వచ్చి శత్రువులను, మహేశ్వరజ్రమును కూడ జయించెను. పిమ్మట హరిశంకరుల మధ్య బాణములతో యుద్దము జరిగెను. తార్యుడు మొదలగు వారు నంది - వినాయక- స్కందాదులను జయించిరి. విష్ణువు ప్రయోగించిన జృంభణాస్త్రముచే శంకరుడు ఆవులించుచు నిద్రపోయెను. అపుడు బాణుని బాహస్రము భేదింపబడెను. రుద్రుడు బాణున కభయ మిమ్మని విష్ణువును కోరెను. విష్ణువు బాణుని రెండు బాహువులతో జీవింపచేసి శివునితో ఇట్లనెను (కృష్ణుడు పలికెను.) " నీవు ఈ బాణునకు ఆభయమిచ్చినావు గాన నేనును ఇచ్చుచున్నాను. మన ఇరువురికిని భేదము లేదు. భేదమును చూచువాడు నరకమున పడును."

అగ్ని పలికెను : విష్ణువు శివాదులచే పూజడింపబడి, ఉషానిరుద్ధాదులతో కూడి ద్వారకకు వెళ్లి ఉగ్రసేనాదియాదవులతో కలిసి సుఖముగా ఉండెను.

అగ్ని మహాపురాణము నందు హరివంశ వర్జనమున ద్వాదశ అధ్యాయము సమాప్తము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana -34 🌹

✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj

Chapter 12

🌻 Manifestation of Viṣṇu as Kṛṣṇa - 5 🌻


43-44. Having seen Gauri (Pārvatī) sporting with Śiva, Uṣā. was desirous of (getting) a husband. Gaurī said to her, “The person seen by you in your dream on the twelfth day in the month of Vaiśākha (the second month in the Hindu new year) will become you husband”. Uṣā becoming happy on these words of Gaurī, saw him (that person) (in dream) while she slept in her house.

45-46. Knowing (that person)united with herself, she (identified) Aniruddha from the drawn portraits (of princes) through (the assistance of) her friend Citralekhā (and) brought that grandson of Kṛṣṇa from Dvārakā (to her place) by the daughter of Kumbhāṇḍa, the minister of Bāṇa. Aniruddha went and made marry with Uṣā.

47-48. (Bāṇa was) informed (of this) by his mobile guards. Aniruddha had a fierce fight with Bāṇa.[9] Having heard this from Nārada, Kṛṣṇa (went along) with Pradyumna (and) Balabhadra (and) remaining on the Garuḍa (vehicle of Viṣṇu) conquered the fires and the fever related to Maheśvara (Siva).

49. There was a fight between Hari and Śaṅkara (Siva) with arrows. Nandi, Vināyaka, Skanda and others were conquered by Tārkṣya (Garuḍa) and others.

50. When Śaṅkara (Śiva) yawned, Viṣṇu (employed) the missile Jṛmbhaṇa and cut the thousand arms (of Śaṅkara). Protection was sought by Rudra (Siva).

51-53. Bāṇa was animated by Viṣṇu. The two-armed (Viṣṇu) said to Śiva, “What protection was offered by you to Bāṇa (is identical with) that (offered) by me. There is no difference between us and one who (thinks of) any difference goes to hell. Viṣṇu was propitiated by Śiva and others. Aniruddha in the company of Uṣā and others, having gone to Dvārakā, amused himself along with Ugrasena and other Yādavas. Vajra (was) the son of Aniruddha. He learnt all knowledge from Mārkaṇḍeya.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


13 Apr 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 585 / Vishnu Sahasranama Contemplation - 585


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 585 / Vishnu Sahasranama Contemplation - 585🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 585. పరాయణమ్, परायणम्, Parāyaṇam 🌻

ఓం పరాయ్ణాయ నమః | ॐ पराय्णाय नमः | OM Parāyṇāya namaḥ


పరముత్కృష్టమయనం స్థానం బ్రహ్మ సనాతనమ్ ।
పునరావృత్తిశాఙ్కాయా విరహాత్తత్పరాయణమ్ ॥
పరముత్కృష్ఠమయనం స్థానం యస్య రమాపతేః ।
స పరాయణ ఇత్యేవం బహువ్రీహిః పుమానపి ॥

పరాయణమ్ అనగా పరమ ఉత్కృష్టమూ, గొప్పదీ, పునరావృత్తి రహితమూయగు ఆయనము అనగా స్థానము. ఈ నామము పరాయణః అనుచు పులింగ రూపముగా గ్రహించబడినచో, 'ఎవని స్థానము ఉత్కృష్టమైయున్నదో' అని బహువ్రీహి సమాసముగా చెప్పవలెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 585🌹

📚. Prasad Bharadwaj

🌻 585. Parāyaṇam 🌻

OM Parāyṇāya namaḥ


परमुत्कृष्टमयनं स्थानं ब्रह्म सनातनम् ।
पुनरावृत्तिशाङ्काया विरहात्तत्परायणम् ॥
परमुत्कृष्ठमयनं स्थानं यस्य रमापतेः ।
स परायण इत्येवं बहुव्रीहिः पुमानपि ॥

Paramutkr‌ṣṭamayanaṃ sthānaṃ brahma sanātanam,
Punarāvr‌ttiśāṅkāyā virahāttatparāyaṇam.
Paramutkr‌ṣṭhamayanaṃ sthānaṃ yasya ramāpateḥ,
Sa parāyaṇa ityevaṃ bahuvrīhiḥ pumānapi.

The state which is the highest and from which there is no return to lower states is Parāyaṇam. If the divine name is taken as 'Parāyaṇaḥ', then linguistically considering it to be of masculine gender, it should be interpreted as 'He whose is the highest of the states.'


:: श्रीमद्भागवते चतुर्थस्कन्धे एकादशोऽध्यायः ::

तमेव मृत्युममृतं तात दैवं सर्वात्मनोपेहि जगत्परायणम् ।
यस्मै बलिं विश्वसृजो हरन्ति गावो यथा वै नसि दामयन्त्रिताः ॥ २७ ॥


Śrīmad Bhāgavata - Canto 4, Chapter 11

Tameva mr‌tyumamr‌taṃ tāta daivaṃ sarvātmanopehi jagatparāyaṇam,
Yasmai baliṃ viśvasr‌jo haraṃti gāvo yathā vai nasi dāmayaṃtritāḥ. 27.


Surrender unto the Him, who is the ultimate goal of the world. Everyone, including the gods headed by Lord Brahmā, is working under His control, just as a bull, prompted by a rope in its nose, is controlled by its owner.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।
सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,
Sannyāsakr‌cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


13 Apr 2022

13 - APRIL - 2022 బుధవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 13, ఏప్రిల్ 2022 బుధవారం, సౌమ్య వాసరే 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 186 / Bhagavad-Gita - 186 - 4-24 జ్ఞానయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 585 / Vishnu Sahasranama Contemplation - 585🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 34 / Agni Maha Purana 34🌹
5) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 264 / DAILY WISDOM - 264 🌹  
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 165 🌹
7) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 103 🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 13, ఏప్రిల్‌ 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*పండుగలు మరియు పర్వదినాలు : లేవు*

*🍀. శ్రీ గణేశ అష్టకం - 7 🍀*

*7. వరదవిశదశస్తం దక్షిణం యస్య హస్తం*
*సదయమభయదం తం చిన్తయే చిత్తసంస్థమ్ ।*
*శబలకుటిలశుణ్డం చైకతుణ్డం ద్వితుణ్డం*
*గణపతిమభివన్దే సర్వదా వక్రతుణ్డమ్ ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మనిషి జీవితలక్ష్య మూలం తనకు తాను సన్నిహితంగా ఉండడమే. తనను తాను తెలుసుకోవడమే - పండిత శ్రీరామశర్మ ఆచార్య 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2079 రక్ష
శాలివాహన శక : 1944
ఉత్తరాయణం, వసంత ఋతువు
శుభకృత్‌ సంవత్సరం, చైత్ర మాసం
తిథి: శుక్ల ద్వాదశి 28:51:12 వరకు
తదుపరి శుక్ల త్రయోదశి
నక్షత్రం: మఘ 09:37:02 వరకు
తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: దండ 11:14:34 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: బవ 16:56:20 వరకు
వర్జ్యం: 17:43:20 - 19:20:36
దుర్ముహూర్తం: 11:51:45 - 12:41:45
రాహు కాలం: 12:16:45 - 13:50:29
గుళిక కాలం: 10:43:01 - 12:16:45
యమ గండం: 07:35:32 - 09:09:16
అభిజిత్ ముహూర్తం: 11:52 - 12:40
అమృత కాలం: 07:06:54 - 08:46:58
మరియు 27:26:56 - 29:04:12
సూర్యోదయం: 06:01:48
సూర్యాస్తమయం: 18:31:43
చంద్రోదయం: 15:31:13
చంద్రాస్తమయం: 03:42:30
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: సింహం
చర యోగం - దుర్వార్త శ్రవణం 09:37:02
వరకు తదుపరి స్థిర యోగం 
- శుభాశుభ మిశ్రమ ఫలం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 186 / Bhagavad-Gita - 186 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 4 వ అధ్యాయము - జ్ఞాన యోగము - 24 🌴*

*24. బ్రహ్మార్పణ బ్రహ్మ హవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ |*
*బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా ||*

🌷. తాత్పర్యం :
*కృష్ణభక్తిరసభావన యందు సంపూర్ణముగా నిమగ్నుడైన మనుజుడు భగవద్ధామమును తప్పక పొందితీరును. స్వీకరించునది మరియు అర్పింపబడునది యను రెండును బ్రహ్మమేయైనటువంటి ఆధ్యాత్మికకర్మల యందు అతడు తత్పరుడై యుండుటచే అందులకు కారణము.*

🌷. భాష్యము :
కృష్ణభక్తిభావన యందలి కర్మలు ఏ విధముగా అంత్యమున మనుజుని ఆధ్యాత్మికగమ్యమును చేర్చగలవో ఇచ్చట వివరింపబడినది. కృష్ణభక్తి యందు పలుకార్యములు గలవు. అవియన్నియు రాబోవు శ్లోకములందు వివరింపబడినను ప్రస్తుతము మాత్రము కృష్ణభక్తిభావన యందలి సిద్ధాంతము తెలుపబడినది. భౌతికత్వమున బద్దుడైన బద్ధజీవి భౌతికభావన యందే కర్మనొనరింప వలసి వచ్చినను ఏదియో ఒక విధముగా దాని నుండి అతడు ముక్తుడు కావాలసియున్నది. ఆ విధముగా బద్ధజీవుడు భౌతికభావన నుండి ముక్తిని పొందు విధానమే కృష్ణభక్తిరసభావనము. 

ఈ పద్ధతే యజ్ఞము లేదా విష్ణుప్రీత్యర్థమై ఒనరింపబడు కర్మగా తెలియబడుచున్నది. భౌతికజగమునందలి కర్మలు ఎంత ఎక్కువగా విష్ణువు కొరకై (కృష్ణభక్తిభావన యందు) నిర్వహింపబడునో అంట అధికముగా వాతావరణము ఆధ్యాత్మికముగా రూపొందగలదు. “బ్రహ్మము” అనగా ఆధ్యాత్మికమని భావము. శ్రీకృష్ణభగవానుడే పరబ్రహ్మము. అతని దివ్యశరీరకాంతియే ఆధ్యాత్మికతెజమైన “బ్రహ్మజ్యోతి”గా పిలువబడును. స్థితిని కలిగిన ప్రతిదియు ఆ బ్రహ్మజ్యోతి యందే నిలిచియుండును. 

కాని అట్టి జ్యోతి మాయచే లేక ఇంద్రియభోగముచే కప్పుబడినప్పుడు భౌతికమని తెలియబడును. అట్టి భౌతికతెర కృష్ణభక్తిభావనచే శీఘ్రమే తొలాగబడుచున్నందున ఆ భావన యందు అర్పణము చేయబడునది, అట్టి అర్పణము స్వీకరించునది, అర్పణవిధానము, అర్పణము చేయువాడు, దాని ఫలములన్నియును బ్రహ్మమే(పరతత్త్వమే) అయియున్నవి. 

మాయచే ఆవరింపబడిన బ్రహ్మము భౌతికము కాగా, బ్రహ్మమునకు అనుసంధానము కావింపబడిన భౌతికపదార్థము ఆధ్యాత్మిక గుణము తిరిగి పొందును. 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 186 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 4 - Jnana Yoga - 24 🌴*

*24. brahmārpaṇaṁ brahma havir brahmāgnau brahmaṇā hutam*
*brahmaiva tena gantavyaṁ brahma-karma-samādhinā*

🌷 Translation : 
*A person who is fully absorbed in Kṛṣṇa consciousness is sure to attain the spiritual kingdom because of his full contribution to spiritual activities, in which the consummation is absolute and that which is offered is of the same spiritual nature.*

🌹 Purport :
How activities in Kṛṣṇa consciousness can lead one ultimately to the spiritual goal is described here. There are various activities in Kṛṣṇa consciousness, and all of them will be described in the following verses. But, for the present, just the principle of Kṛṣṇa consciousness is described. A conditioned soul, entangled in material contamination, is sure to act in the material atmosphere, and yet he has to get out of such an environment. The process by which the conditioned soul can get out of the material atmosphere is Kṛṣṇa consciousness. 

The materially absorbed conditioned soul can be cured by Kṛṣṇa consciousness as set forth here in the Gītā. This process is generally known as yajña, or activities (sacrifices) simply meant for the satisfaction of Viṣṇu, or Kṛṣṇa.

The more the activities of the material world are performed in Kṛṣṇa consciousness, or for Viṣṇu only, the more the atmosphere becomes spiritualized by complete absorption. The word brahma (Brahman) means “spiritual.” The Lord is spiritual, and the rays of His transcendental body are called brahma-jyotir, His spiritual effulgence. Everything that exists is situated in that brahma-jyotir, but when the jyotir is covered by illusion (māyā) or sense gratification, it is called material. 

This material veil can be removed at once by Kṛṣṇa consciousness; thus the offering for the sake of Kṛṣṇa consciousness, the consuming agent of such an offering or contribution, the process of consumption, the contributor and the result are – all combined together – Brahman, or the Absolute Truth. The Absolute Truth covered by māyā is called matter.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 585 / Vishnu Sahasranama Contemplation - 585🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 585. పరాయణమ్, परायणम्, Parāyaṇam 🌻*

*ఓం పరాయ్ణాయ నమః | ॐ पराय्णाय नमः | OM Parāyṇāya namaḥ*

*పరముత్కృష్టమయనం స్థానం బ్రహ్మ సనాతనమ్ ।*
*పునరావృత్తిశాఙ్కాయా విరహాత్తత్పరాయణమ్ ॥*
*పరముత్కృష్ఠమయనం స్థానం యస్య రమాపతేః ।*
*స పరాయణ ఇత్యేవం బహువ్రీహిః పుమానపి ॥*

*పరాయణమ్ అనగా పరమ ఉత్కృష్టమూ, గొప్పదీ, పునరావృత్తి రహితమూయగు ఆయనము అనగా స్థానము. ఈ నామము పరాయణః అనుచు పులింగ రూపముగా గ్రహించబడినచో, 'ఎవని స్థానము ఉత్కృష్టమైయున్నదో' అని బహువ్రీహి సమాసముగా చెప్పవలెను.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 585🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 585. Parāyaṇam 🌻*

*OM Parāyṇāya namaḥ*

परमुत्कृष्टमयनं स्थानं ब्रह्म सनातनम् ।
पुनरावृत्तिशाङ्काया विरहात्तत्परायणम् ॥
परमुत्कृष्ठमयनं स्थानं यस्य रमापतेः ।
स परायण इत्येवं बहुव्रीहिः पुमानपि ॥

*Paramutkr‌ṣṭamayanaṃ sthānaṃ brahma* sanātanam,
*Punarāvr‌ttiśāṅkāyā virahāttatparāyaṇam.*
*Paramutkr‌ṣṭhamayanaṃ sthānaṃ yasya ramāpateḥ,*
*Sa parāyaṇa ityevaṃ bahuvrīhiḥ pumānapi.*

*The state which is the highest and from which there is no return to lower states is Parāyaṇam. If the divine name is taken as 'Parāyaṇaḥ', then linguistically considering it to be of masculine gender, it should be interpreted as 'He whose is the highest of the states.'*

:: श्रीमद्भागवते चतुर्थस्कन्धे एकादशोऽध्यायः ::
तमेव मृत्युममृतं तात दैवं सर्वात्मनोपेहि जगत्परायणम् ।
यस्मै बलिं विश्वसृजो हरन्ति गावो यथा वै नसि दामयन्त्रिताः ॥ २७ ॥ 

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 11
Tameva mr‌tyumamr‌taṃ tāta daivaṃ sarvātmanopehi jagatparāyaṇam,
Yasmai baliṃ viśvasr‌jo haraṃti gāvo yathā vai nasi dāmayaṃtritāḥ. 27.

*Surrender unto the Him, who is the ultimate goal of the world. Everyone, including the gods headed by Lord Brahmā, is working under His control, just as a bull, prompted by a rope in its nose, is controlled by its owner.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
त्रिसामा सामगस्साम निर्वाणं भेषजं भिषक् ।सन्न्यासकृच्छमश्शान्तो निष्ठा शान्तिः परायणम् ॥ ६२ ॥

త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్ ।సన్న్యాసకృచ్ఛమశ్శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ ॥ 62 ॥

Trisāmā sāmagassāma nirvāṇaṃ bheṣajaṃ bhiṣak,Sannyāsakr‌cchamaśśānto niṣṭhā śāntiḥ parāyaṇam ॥ 62 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 34 / Agni Maha Purana - 34 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 12*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*

*🌻. శ్రీహరి వంశ వర్ణనము - 5 🌻*

గౌరి శివునితో క్రీడించు చుండగా చూచి ఉష భర్తను గూర్చి అభిలాష కలదాయెను. గౌరి ఆమెతో ఇట్లనెను. వైశాఖమాన ద్వాదశీదివసమున నీకు స్వప్నమునందు కనబడు పురుషుడు నీకు భర్తకాగలడు గౌరి మాటలు విని సంతసించిన ఉష గృహమునందు నిద్రించి ఆతనిని చూచెను. అతడు తనతో సంగము చేసినట్లు తెలిసికొని, చిత్రపటముపై అతని మూర్తిని చిత్రించి దాని సాహాయ్యముతో సఖియైన చిత్రలేఖ ద్వారా కృష్ణుని పౌత్రుడైన ఆనిరుద్ధుని ద్వారకనుండి తెప్పించికొనెను. ఆ చిత్రలేఖ బాణాసురుని మంత్రియైన కుంభాడుని పుత్రిక. అనిరుద్దుడు ఉషతో కూడ రమించెను. రక్షకులు వెళ్లి బాణుని ధ్వజము పడిపోయినట్లు అతనికి తెలిపిరి. అనిరుద్దునకు బాణునితో సూదారుణౖన యుద్ధము జరిగెను. 

కృష్ణుడు నారదుని నుండి ఈ విషయము తెలియగా, గరుడారూఢుడై, ప్రద్యుమ్న బలరామసమేతడై వచ్చి శత్రువులను, మహేశ్వరజ్రమును కూడ జయించెను. పిమ్మట హరిశంకరుల మధ్య బాణములతో యుద్దము జరిగెను. తార్యుడు మొదలగు వారు నంది - వినాయక- స్కందాదులను జయించిరి. విష్ణువు ప్రయోగించిన జృంభణాస్త్రముచే శంకరుడు ఆవులించుచు నిద్రపోయెను. అపుడు బాణుని బాహస్రము భేదింపబడెను. రుద్రుడు బాణున కభయ మిమ్మని విష్ణువును కోరెను. విష్ణువు బాణుని రెండు బాహువులతో జీవింపచేసి శివునితో ఇట్లనెను (కృష్ణుడు పలికెను.) " నీవు ఈ బాణునకు ఆభయమిచ్చినావు గాన నేనును ఇచ్చుచున్నాను. మన ఇరువురికిని భేదము లేదు. భేదమును చూచువాడు నరకమున పడును."

అగ్ని పలికెను : విష్ణువు శివాదులచే పూజడింపబడి, ఉషానిరుద్ధాదులతో కూడి ద్వారకకు వెళ్లి ఉగ్రసేనాదియాదవులతో కలిసి సుఖముగా ఉండెను.

అగ్ని మహాపురాణము నందు హరివంశ వర్జనమున ద్వాదశ అధ్యాయము సమాప్తము. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana -34 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *

*Chapter 12*
*🌻 Manifestation of Viṣṇu as Kṛṣṇa - 5 🌻*

43-44. Having seen Gauri (Pārvatī) sporting with Śiva, Uṣā. was desirous of (getting) a husband. Gaurī said to her, “The person seen by you in your dream on the twelfth day in the month of Vaiśākha (the second month in the Hindu new year) will become you husband”. Uṣā becoming happy on these words of Gaurī, saw him (that person) (in dream) while she slept in her house.

45-46. Knowing (that person)united with herself, she (identified) Aniruddha from the drawn portraits (of princes) through (the assistance of) her friend Citralekhā (and) brought that grandson of Kṛṣṇa from Dvārakā (to her place) by the daughter of Kumbhāṇḍa, the minister of Bāṇa. Aniruddha went and made marry with Uṣā.

47-48. (Bāṇa was) informed (of this) by his mobile guards. Aniruddha had a fierce fight with Bāṇa.[9] Having heard this from Nārada, Kṛṣṇa (went along) with Pradyumna (and) Balabhadra (and) remaining on the Garuḍa (vehicle of Viṣṇu) conquered the fires and the fever related to Maheśvara (Siva).

49. There was a fight between Hari and Śaṅkara (Siva) with arrows. Nandi, Vināyaka, Skanda and others were conquered by Tārkṣya (Garuḍa) and others.

50. When Śaṅkara (Śiva) yawned, Viṣṇu (employed) the missile Jṛmbhaṇa and cut the thousand arms (of Śaṅkara). Protection was sought by Rudra (Siva).

51-53. Bāṇa was animated by Viṣṇu. The two-armed (Viṣṇu) said to Śiva, “What protection was offered by you to Bāṇa (is identical with) that (offered) by me. There is no difference between us and one who (thinks of) any difference goes to hell. Viṣṇu was propitiated by Śiva and others. Aniruddha in the company of Uṣā and others, having gone to Dvārakā, amused himself along with Ugrasena and other Yādavas. Vajra (was) the son of Aniruddha. He learnt all knowledge from Mārkaṇḍeya.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #శ్రీమదగ్నిమహాపురాణం #AgniMahaPuranam #చైతన్యవిజ్ఞానం
Join 
🌹Agni Maha Purana Channel 🌹
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 264 / DAILY WISDOM - 264 🌹*
*🍀 📖. జీవితం మరియు అనంతం యొక్క ఉపదేశాలు నుండి 🍀*
*📝 .స్వామి కృష్ణానంద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 20. ‘మోక్షం’ అనే పదం అన్ని విషయాల అంతిమ లక్ష్యాన్ని వివరిస్తుంది. 🌻*

*ప్రజల యొక్క అవసరాలు ఏమిటి? అవి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ భద్రత అని ఎవరైనా అనవచ్చు. కానీ, ఇది స్థూల స్థాయి నుండి మాత్రమే విషయాలను చూడటం. ఈ విషయాన్ని చాలా నిశితంగా పరిశీలించిన స్మృతులు, పురాణేతిహాసాలు మానవుల అవసరాలను ధర్మ, అర్ధ కామ మోక్షాలుగా వర్గికరించాయి. ఋషులకు మానవ జీవిత ఆవశ్యకతలపై ఉన్న గొప్ప అంతర్దృష్టికి ఇది నిలువెత్తు ఉదాహరణ. మానవుని పూర్తి అవసరాలను కేవలం ఈ నాలుగు వర్గాలుగా మాత్రమే విభజించవచ్చు.*

*'మోక్షం' అనే పదం అన్ని విషయాల యొక్క చివరి లక్ష్యాన్ని వివరిస్తుంది. ప్రతి జీవికి ఉండే అనంతమైన కోరికలు ఎక్కడో ఒకచోట ముగియాలి. కోరికలకు దాన్ని నెరవేర్చే అవకాశం లేకుండా అడగడంగా మాత్రమే ఉండదు. ఉన్నత లోకాలను పొందాలనే కోరిక ప్రతి జీవిలో, మరియు మానవులలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ కోరికకు సైతం ఏదో ఒక జన్మస్థానం ఉండాలి. ఈ కోరిక సామూహిక ప్రాణ శక్తి ని ధరించే చైతన్యంలో ఉత్పన్నమౌతుంది తప్ప ఇంక ఎక్కడా కాదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 264 🌹*
*🍀 📖 from Essays in Life and Eternity 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 20. The Term ‘Moksha' Describes the Final Aim of All Things 🌻*

*What are the needs of people? One may say that they are social, economic and political security. But, this would be to look at things only from the peripheral level. Ancient Indian thought, recorded in the scriptural texts, such as the Smritis, Epics and Puranas, which have gone into great detail in this field of investigation, has classified the basic requirement in terms of what are known as dharma, artha, kama and moksha. Here is a standing example of the great intuition of the early seers into the essentials of human life.*

*The four aims stated exhaust the entire area of human aspiration and performance. The term ‘moksha' describes the final aim of all things. The resistless asking, characterising all living beings in a variety of ways, has to end somewhere, sometime. There cannot be only asking without the chance of fulfilling it. An endless asking for wider dimensions which can be seen working vigorously in every living being, and most perspicaciously in human nature, has to have its origin nowhere except in the very consciousness and the very life principle of all beings.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom
#నిత్యప్రజ్ఞాసందేశములు #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 164 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. జీవితానికి సరిహద్దులు లేవు. జీవితం ఆద్యంతాలు లేనిది. కానీ మనం మరీ ఎక్కువగా శరీరానికి, మనసుకు అతుక్కుపోయి వుంటాం. అది మన యధార్థం కాదన్న విషయాన్ని మనం పూర్తిగా మరిచిపోయాం. మనం రూపరహితులమని గుర్తించినపుడు మనం దేవుడిలో భాగాలవుతాం. దేవుడు మనలో భాగమవుతాడు. 🍀*

*జీవితం దాని యథార్థాన్ని బట్టి సరిహద్దులు లేనిది. అది శరీరానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది కాదు. అది సముద్ర సంబంధమయినది. సముద్రాల కయినా సరిహద్దులుంటాయి. కానీ జీవితానికి సరిహద్దులు లేవు. జీవితం ఆద్యంతాలు లేనిది. కానీ మనం మరీ ఎక్కువగా శరీరానికి, మనసుకు అతుక్కుపోయి వుంటాం. అది మన యధార్థం కాదన్న విషయాన్ని మనం పూర్తిగా మరిచిపోయాం.*

*మనం ఎన్నో శరీరాల్లో జీవించాం. నువ్వు ప్రయాణికుడివి, తీర్థయాత్రికుడివి. జీవితం, చైతన్యం ఒక శరీరం నించీ యింకో శరీరానికి సాగుతుంది. మనం రూపరహితులమని గుర్తించినపుడు ఆ రోజు మనకు గొప్పరోజు అది పరివర్తన చెందిన రోజు. అపుడు మనం వెనకటిలా వుండం. అప్పుడు మనం దేవుడిలో భాగాలవుతాం. దేవుడు మనలో భాగమవుతాడు.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/ 
https://oshodailymeditations.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 103 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 82. చికాకు -2 🌻*

*ఇక రెండవ విషము. ప్రాపంచిక విషయములను గూర్చి కలుగు చికాకు. దీనత దీనికి పునాదిరాయి. తనపై తనకు దయ, కరుణ దీనతను కలిగించును. హృదయమును దుర్బలము చేయును. తననందరూ మోసము చేయుచున్నారని భావన కలుగును. తన నెవరూ ప్రేమించుట లేదనిపించును. అందరూ స్వార్థపరులే అనిపించును. ప్రపంచము లోపభూయిష్టమైనదని అనిపించును. బాధే సౌఖ్య మనిపించును. మంచి చెడుల తారతమ్యము లేదనిపించును. బుద్ధి వక్రించును. కుంచించుకొని పోవును. నిష్ప్రయోజనమగు వేదాంత ధోరణి పుట్టును.*

*సద్విషయముల యందు, సత్కార్యముల యందు, సత్పురుషుల యందు ఏహ్యభావము కలుగును. వీని నుండి పుట్టిన విషము నుండి బయల్పడుట బహుకష్టము. సర్వమునకు విముఖత చెందిన మనస్సును కేవలము దైవస్పర్శయే మార్చగలదు. జీవులను, ప్రపంచమును ద్వేషించుట వలన పుట్టిన విషమును దైవము కూడ హరింపడు. కాని దైవము నందు అనుగ్రహమను శుభలక్షణ ముండుటచే అది ప్రసరించినచో కాలము రూపములో పరిష్కారము లభింప గలదు. అట్టి వారికి కాలమే పరిష్కారకుడు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹