మైత్రేయ మహర్షి బోధనలు - 103


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 103 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 82. చికాకు -2 🌻


ఇక రెండవ విషము. ప్రాపంచిక విషయములను గూర్చి కలుగు చికాకు. దీనత దీనికి పునాదిరాయి. తనపై తనకు దయ, కరుణ దీనతను కలిగించును. హృదయమును దుర్బలము చేయును. తననందరూ మోసము చేయుచున్నారని భావన కలుగును. తన నెవరూ ప్రేమించుట లేదనిపించును. అందరూ స్వార్థపరులే అనిపించును. ప్రపంచము లోపభూయిష్టమైనదని అనిపించును. బాధే సౌఖ్య మనిపించును. మంచి చెడుల తారతమ్యము లేదనిపించును. బుద్ధి వక్రించును. కుంచించుకొని పోవును. నిష్ప్రయోజనమగు వేదాంత ధోరణి పుట్టును.

సద్విషయముల యందు, సత్కార్యముల యందు, సత్పురుషుల యందు ఏహ్యభావము కలుగును. వీని నుండి పుట్టిన విషము నుండి బయల్పడుట బహుకష్టము. సర్వమునకు విముఖత చెందిన మనస్సును కేవలము దైవస్పర్శయే మార్చగలదు. జీవులను, ప్రపంచమును ద్వేషించుట వలన పుట్టిన విషమును దైవము కూడ హరింపడు. కాని దైవము నందు అనుగ్రహమను శుభలక్షణ ముండుటచే అది ప్రసరించినచో కాలము రూపములో పరిష్కారము లభింప గలదు. అట్టి వారికి కాలమే పరిష్కారకుడు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


13 Apr 2022

No comments:

Post a Comment