🌹 26, JULY 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹

🍀🌹 26, JULY 2023 WEDNESDAY ALL MESSAGES బుధవారం, సౌమ్య వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 26, JULY 2023 WEDNESDAY బుధవారం, సౌమ్య వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 211 / Kapila Gita - 211🌹 
🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 21 / 5. Form of Bhakti - Glory of Time - 21 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 803 / Vishnu Sahasranama Contemplation - 803 🌹 
🌻803. మహాహ్రదః, महाह्रदः, Mahāhradaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 764 / Sri Siva Maha Purana - 764 🌹
🌻. దేవాసుర యుధ్ధము - 5 / The battle of the gods - 5 🌻
5) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 018 / Osho Daily Meditations - 018 🌹 
🍀17. కోపం వెెనుక / 18. BEHIND ANGER 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 466 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 466 - 2 🌹 
🌻 466. ‘సూక్ష్మరూపిణి’ - 2 / 466. 'Sukshmarupini' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 26, జూలై, JULY 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌺. పండుగలు మరియు పర్వదినాలు : మాసిక దుర్గాష్టమి, Masik Durgashtami 🌺*

*🍀. శ్రీ గజానన స్తోత్రం - 04 🍀*

*04. జగత్ప్రమాణం జగదీశమేవ- -మగమ్యమాద్యం జగదాదిహీనమ్ |*
*అనాత్మనాం మోహప్రదం పురాణం గజాననం భక్తియుతా భజామః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మానవ ప్రేమలోని కలగాపులగపు స్థితి - మానవ ప్రేమలో ప్రాణకోశ ప్రవృత్తులతో పాటు మనఃకోశ, అంతః హృదయకోశ ప్రవృత్తులు కూడా చేరి వుండవచ్చుననే మాట నిజమే. కాని, అదంతా ఒక కలగాపులగపు స్థితి. కనుకనే. ఒక దశకు వచ్చే సరికి జీవితము, ప్రపంచము, మానవ సమాజము, అందలి సంబంధాలు, ఈ మానవ సేవాభావం కూడా తక్కిన ప్రవృత్తుల వలెనే (ఆహంకార భూయిష్ఠం) - ఇవన్నీ నిస్సారములై గోచరిస్తాయి. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల-అష్టమి 15:53:06 వరకు
తదుపరి శుక్ల-నవమి
నక్షత్రం: స్వాతి 25:11:39 వరకు
తదుపరి విశాఖ
యోగం: సద్య 14:39:54 వరకు
తదుపరి శుభ
కరణం: బవ 15:47:06 వరకు
వర్జ్యం: 05:55:38 - 07:36:06
మరియు 30:51:12 - 32:28:24
దుర్ముహూర్తం: 11:56:35 - 12:48:28
రాహు కాలం: 12:22:32 - 13:59:49
గుళిక కాలం: 10:45:14 - 12:22:32
యమ గండం: 07:30:39 - 09:07:57
అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47
అమృత కాలం: 15:58:26 - 17:38:54
సూర్యోదయం: 05:53:21
సూర్యాస్తమయం: 18:51:42
చంద్రోదయం: 12:40:01
చంద్రాస్తమయం: 00:20:00
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: ధూమ్ర యోగం - కార్య
భంగం, సొమ్ము నష్టం 25:11:39 వరకు
తదుపరి ధాత్రి యోగం - కార్య జయం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻    

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 211 / Kapila Gita - 211 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 21 🌴*

*21. అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థితస్సదా|*
*తమవజ్ఞాయ మాం మర్త్య కురుతేఽర్చావిడంబనమ్॥*

*తాత్పర్యము : భగవంతుడు ఆత్మస్వరూపమున సకలజీవుల యందును సర్వదా యుండును. సర్వప్రాణులలో ఆత్మస్వరూపముగా, భగవంతుడు అంతర్యామిగా ఉన్నవిషయమును విస్మరించి వారియెడ అనాదరభావము వహించుచు, కేవలము భగవత్ప్రతిమనే అర్చించు వాని పూజ ఆడంబరముతో గూడినదేయగును.*

*వ్యాఖ్య : పరమాత్మ అన్ని వేళలా అన్ని చోట్లా అందరిలో అంతర్యామిగా ఉంటాడు. ఈ విషయాన్ని కాస్తా మరచిపోయి, నిర్లక్షం చేసి, ఆ భావాన్ని వదిలిపెట్టి, ఆరాధనకు అర్భాటం చేస్తాడు. సర్వభూతాంతర్యామిగా ఉన్న నన్ను గుర్తించకుండా ఆరాధనలో ఆడంబరం చూపిస్తే అది ఆడంబరం మాత్రమే. అంతటా పరమాత్మను చూడగలిగినవాడు, పరమాత్మ రూపముగా ఉన్న వారందరినీ సమానముగా ఆదరిస్తాడు, ఆదరిస్తాడు. వారందరి సహకారముతో భగవానున్ని ఆరాధిస్తాడు. దాన్ని మర్చిపోయి అర్చావిడంబనం చేస్తున్న వారికి నా మీద భక్తి ఉండదు.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 211 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 5. Form of Bhakti - Glory of Time - 21 🌴*

*21. ahaṁ sarveṣu bhūteṣu bhūtātmāvasthitaḥ sadā*
*tam avajñāya māṁ martyaḥ kurute 'rcā-viḍambanam*

*MEANING : I am present in every living entity as the Supersoul. If someone neglects or disregards that Supersoul everywhere and engages himself in the worship of the Deity in the temple, that is simply imitation.*

*PURPORT : In purified consciousness, or Kṛṣṇa consciousness, one sees the presence of Kṛṣṇa everywhere. If, therefore, one only engages in Deity worship in the temple and does not consider other living entities, then he is in the lowest grade of devotional service. One who worships the Deity in the temple and does not show respect to others is a devotee on the material platform, in the lowest stage of devotional service. A devotee should try to understand everything in relationship with Kṛṣṇa and try to serve everything in that spirit. To serve everything means to engage everything in the service of Kṛṣṇa. If a person is innocent and does not know his relationship with Kṛṣṇa, an advanced devotee should try to engage him in the service of Kṛṣṇa. One who is advanced in Kṛṣṇa consciousness can engage not only the living being but everything in the service of Kṛṣṇa.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 803 / Vishnu Sahasranama Contemplation - 803🌹*

*🌻803. మహాహ్రదః, महाह्रदः, Mahāhradaḥ🌻*

*ఓం మహాహృదాయ నమః | ॐ महाहृदाय नमः | OM Mahāhr‌dāya namaḥ*

*అవగాహ్య యదానన్దం విశ్రమ్య సుఖ మాసతే ।*
*మహాహ్రద ఇవ మహాయోగినస్స మహాహ్రదః ॥*

*గొప్ప హ్రదము అనగా మడుగువంటివాడు. ఏలయన ముముక్షువులు అనగా యోగులు ఆ పరమాత్ముని అనుభవము వలన కలుగు ఆనందమున మునిగి స్నానమాడి విశ్రాంతినంది సుఖముగ నుందురు గనుక.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 803🌹*

*🌻803. Mahāhradaḥ🌻*

*OM Mahāhr‌dāya namaḥ*

अवगाह्य यदानन्दं विश्रम्य सुख मासते ।
महाह्रद इव महायोगिनस्स महाह्रदः ॥

*Avagāhya yadānandaṃ viśramya sukha māsate,*
*Mahāhrada iva mahāyoginassa mahāhradaḥ.*

*Since the yogis remain peaceful and happy plunging in the refreshing waters of His bliss, He is compared to a big pond of cool water; hence He is Mahāhradaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुवर्णबिंदुरक्षोभ्यस्सर्ववागीश्वरेश्वरः ।महाह्रदो महागर्तो महाभूतो महानिधिः ॥ ८६ ॥
సువర్ణబిందురక్షోభ్యస్సర్వవాగీశ్వరేశ్వరః ।మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥
Suvarṇabiṃdurakṣobhyassarvavāgīśvareśvaraḥ,Mahāhrado mahāgarto mahābhūto mahānidhiḥ ॥ 86 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 764 / Sri Siva Maha Purana - 764🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 16 🌴*
*🌻. దేవాసుర యుధ్ధము - 5 🌻*

*జలంధరుడిట్లు పలికెను - ఓ రాక్షసవీరులారా! బలశాలుడు, కాని పిరికి వారునగు ఇంద్రాది దేవతలతో మీరు భయంకరమగు యుద్ధమును చేయుడు (35). లక్షమంది మౌర్యులు, వందమంది దౌర్హృదులు, కోటిమంది కాలకేయాసురులు (36). లక్షమంది కంకులు మరియు ఇతరులు తమసైన్యములతో గూడి నా ఆజ్ఞచే బయలుదేరెదరు గాక! (37).*

*మీరందరు వివిధ వస్త్రములను, అస్త్రములను దోడ్కొని, సంశయములను విడనాడి నిర్భయులై, పెద్దపైన్యమును వెంటబెట్టుకొని సన్నద్ధులై బయలుదేరుడు (38). ఓ శుంభనిశుంభులారా! మహావీరులగు మీరిద్దరు యుద్ధమునకు భయపడే నీచులగు దేవతలను క్షణకాలములో నాశనము చేయుడు (39).*

*సనత్కుమారుడిట్లు పలికెను- యుద్ధనిపుణులగు ఆ రాక్షసులందరు జలంధరునిచే ఇట్లు ఆజ్ఞాపించబడిన వారై చతురంగ సైన్యముతో గూడి యుద్ధమును చేసిరి (40). దేవదానవులు గదలతో, పదునైన బాణములతో, శూలములతో, పట్టిశములతో, తోమరాయుధములతో, గొడ్డళ్లతో, శూలములతో ఒకరినొకరు సంహరించుకొనిరి (41). హృషీకేశుని సన్నిధిచే బలమును పొందియున్న మహావీరులగు దేవతలు కూడ ఇతరములగు వివిధాయుధములతో రాక్షసులను సంహరించిరి (42). దేవదానవులు సింహనాదములను చేస్తూ వాడి బాణములను ప్రయోగిస్తూ, మరియు రోకళ్లతో తోమరాయుధములతో యుద్దమును చేసిరి (43). ఈ తీరున దేవదానవులకు గొప్ప సంగ్రామము జరిగెను. అత్యుగ్రమగు ఆ యుద్దము మునులకు సిద్ధులకు భయమును కలిగించెను (44).*

*శ్రీ శివమహాపురాణములోరుద్రసంహితయందలి యుద్ధఖండలో దేవాసురయుద్ధ వర్ణన మనే పదునారవ అధ్యాయము ముగిసినది (16).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 764🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 16 🌴*

*🌻 The battle of the gods - 5 🌻*

Jalandhara said:—
35. O Excellent Asuras, put up a stiff fight with Indra and other gods who are always cowardly though they have a huge army.

36-37. At my bidding let all these come out with their entire army—the Mauryas numbering a hundred thousand, the Dhūmras in hundreds, the Asuras and the Kālakeyas in crores and the Kālakas, the Daurhṛdas and the Kaṅkas in lakhs.

38. All of you come out readily equipped with many divisions of the army and different kinds of weapons. Be fearless and free from hesitations.

39. O Śumbha, O Niśumbha, destroy in a trice the insignificant gods who feel nervous in the battle field. You are extremely valorous.

Sanatkumāra said:—
40-41. Thus the Asuras clever and efficient in battle, commanded by Jalandhara on the one hand and gods equipped with the four sorts of fighting groups on the other fought one another with maces, arrows, javelins, spears etc. They hit one another with axes and spears.

42. The strong ones hit and struck with different weapons. The heroic gods supported and invigorated by Hṛṣīkeśa roared like lions and discharged sharp arrows.

43. Some fought with arrows of very sharp points; some with pestles and iron clubs and some with axes and spears.

44. Thus the fight between the gods and the Asuras was terrific. It was very fierce frightening the sages and the Siddhas.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 18 / Osho Daily Meditations  - 18 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 18. కోపం వెనుక 🍀*

*🕉. కోపం నుండి సృజనాత్మకతకు మారండి, వెంటనే మీలో గొప్ప మార్పు తలెత్తడాన్ని మీరు చూస్తారు. రేపు అవే విషయాలు కోపంగా ఉండటానికి సాకులుగా భావించవు. 🕉*

*కోపంతో బాధపడుతున్న వంద మందిలో, దాదాపు 50 శాతం మంది చాలా సృజనాత్మక శక్తితో బాధ పడుతున్నారు, అది వారు ఉపయోగించలేక పోయారు. వారి సమస్య కోపం కాదు, జీవితాంతం ఇలాగే ఆలోచిస్తూనే ఉంటారు. సమస్యను సరిగ్గా గుర్తించిన తర్వాత, అందులో సగం ఇప్పటికే పరిష్కరించ బడింది. మీ శక్తులను సృజనాత్మకతలో ఉంచండి. కోపాన్ని సమస్యగా మరచిపోండి; దానిని విస్మరించండి. మీ శక్తిని మరింత సృజనాత్మకత వైపు మళ్లించండి.*

*మీరు ఇష్టపడే దానిలో మిమ్మల్ని మీరు నింపుకోండి. కోపాన్ని మీ సమస్యగా మార్చుకునే బదులు, సృజనాత్మకత మీ ధ్యాన వస్తువుగా ఉండనివ్వండి. కోపం నుండి సృజనాత్మకతకు మారండి మరియు వెంటనే మీలో గొప్ప మార్పును మీరు చూస్తారు. మరియు రేపు అదే విషయాలు కోపంగా ఉండటానికి సాకులుగా భావించవు ఎందుకంటే ఇప్పుడు శక్తి కదులుతోంది, అది తనను తాను ఆనందిస్తోంది, దాని స్వంత నృత్యం. చిన్న చిన్న విషయాలను ఎవరు పట్టించుకుంటారు?*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 18 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 18. BEHIND ANGER 🍀*

*🕉  Shift from anger to creativity, and immediately you will see a great change arising in you. Tomorrow the same things will not feel like excuses for being angry. 🕉*

*Out of one hundred people suffering from anger, about 50 percent suffer from too much creative energy that they have not been able to put into use. Their problem is not anger, but they will go on thinking their whole life that it is. Once a problem is diagnosed rightly, half of it is already solved.Put your energies into creativity. Forget about anger as a problem; ignore it. Channel your energy towards more creativity.*

*Pour yourself into something that you love. Rather than making anger your problem, let creativity be your object of meditation. Shift from anger to creativity and immediately you will see a great change arising in you. And tomorrow the same things will not feel like excuses for being angry because now energy is moving, it is enjoying itself, its own dance. Who cares about small things?*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 466 - 2  / Sri Lalitha Chaitanya Vijnanam  - 466  - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।*
*కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀*

*🌻 466. ‘సూక్ష్మరూపిణి’ - 2 / 466. 'Sukshmarupini' - 2🌻* 

*రూపములు మందముగను, సున్నితముగను గోచరించును. సున్నితమగు రూపములలో మరీ సున్నితమగు రూపము లుండును. అందు పదార్థము తక్కువ, వెలుగెక్కువగ నుండును. ఇట్టి రూపములు కన్నులకు గోచరింపవు. ఋషుల రూపములు, దేవతా రూపములు ఇట్టి రూపములై యున్నవి. ఉదాహరణకు పంచభూతములతో చేయ బడిన రూపములలో పదార్థముతో చేయబడు రూపముకన్న, నీటితో చేయబడిన రూపము సున్నితము. అగ్నిరూపము మరింత సున్నితము. వాయు రూపము గోచరింపనంత సున్నితము. ఆకాశరూపము అన్నింటి కన్న సూక్ష్మముగ నుండును. ఇట్లు రూపములు స్థూలము, సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమముగా యుండును. అవ్యక్తము నుండి వ్యక్తమునకు సృష్టి కొనిరాబడు చున్నప్పుడు ప్రకృతి అష్ట ప్రకృతులుగ సూక్ష్మము నుండి స్థూలమునకు యేర్పడును. ఇది అవరోహణ క్రమము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 466 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika*
*Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻*

*🌻 466. 'Sukshmarupini' - 2 🌻*

*Appearances are thick and delicate. Among the delicate forms there is a very delicate form. That has less material and more light. These forms are invisible to the eyes. The forms of the sages and the forms of the gods are these forms. For example, among forms made of five elements, the form made of water is more sensitive than the form made of matter. Agnirupa is more sensitive. Vayu form is so subtle as to be invisible. The sky is the subtlest of all. These forms are gross, subtle and subtler. When creation is brought from the unmanifest to the manifest, the eight natures of nature are divided from the subtle to the gross. This is in descending order.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

Siva Sutras - 117 : 2-07. Mātrkā chakra sambodhah - 20 / శివ సూత్రములు - 117 : 2-07. మాతృక చక్ర సంబోధః - 20


🌹. శివ సూత్రములు - 117 / Siva Sutras - 117 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

2వ భాగం - శక్తోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 2-07. మాతృక చక్ర సంబోధః - 20 🌻

🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴


ఒక వ్యక్తి యొక్క జ్ఞానం సాధారణంగా అతని శరీరం ద్వారా ప్రసరిస్తుంది మరియు శివునికి కూడా అదే సూత్రం వర్తిస్తుంది. అతని జ్ఞానం కారణంగా, అతను మహిమాన్వితుడు అవుతాడు. అతని వైభవం సాటిలేనిది. ఈ సమయంలో, మొత్తం పదహారు అచ్చులు, ఇరవై ఐదు హల్లులు మరియు ఎనిమిది ఉభాయాక్షరములు, మొత్తం నలభై తొమ్మిది అక్షరాల గురించి చర్చించబడుతుంది. ఈ అక్షరాల స్థానాన్ని మాతృక చక్రం అని పిలుస్తారు, ఇది తల్లి యొక్క చక్రం, ఆమె అన్ని వర్ణమాలలను కలిగి ఉండటమే కాకుండా పోషిస్తుంది కూడా.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 117 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 2 - Śāktopāya.

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 2-07. Mātrkā chakra sambodhah - 20 🌻

🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization. 🌴


A person’s knowledge is generally radiated through his body and the same principle applies to Śiva. Because of His knowledge, He becomes grandeur. His splendour is of incomparable magnitude. At this point of discussion, all the sixteen vowels, twenty five consonants and eight semi-vowels, totalling to forty nine letters have been dealt with. The positioning of these letters is known as mātṛkā cakra, the wheel of the Mother, who not only owns but also nourishes all the alphabets.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 381


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 381 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. కొంత మంది మాత్రమే హృదయంలో ధైర్యంగా జీవిస్తారు. వాళ్ళు మార్మికులు. వాళ్ళు చాలా దగ్గరి కొచ్చారు. ఒక్క పెద్ద అంగ వేస్తే అవ్యక్త స్థితికి చేరుతారు. 🍀


సమాజం 'తల' నించీ సృష్టింపబడింది. హృదయం వున్న మనుషులు సమాజంతో వినిమయం కలిగి వుండరు. సంబంధం కలిగి వుండరు. వాళ్ళను సమాజం పిచ్చి వాళ్ళంటుంది వాళ్ళ సమస్య అల్లా ప్రపంచంలోని తక్కిన వాళ్ళ కన్నా వాళ్ళలో 'స్థలం' ఎక్కువగా వుంటుంది. అది కళ్ళు లేని వాళ్ళ మధ్య కళ్ళున్న వాళ్ళు. వాళ్ళు నిరంతరం కష్టాల్లో వుంటారు. వాళ్ళ మాట ఎవరూ వినరు. వాళ్ళను ఎవరూ అర్థం చేసుకోరు. తప్పుగా అర్థం చేసుకుంటారు.

కాబట్టి కొంత మంది మాత్రమే హృదయంలో ధైర్యంగా జీవిస్తారు. వాళ్ళు మార్మికులు. వాళ్ళు చాలా దగ్గరికొచ్చారు. ఒక్క పెద్ద అంగవేస్తే అవ్యక్త స్థితికి చేరుతారు. ఆ అవ్యక్త స్థితి హృదయం కాదు, మనసు కాదు. శరీరం కాదు. వాటన్నిటిని దాటింది దాన్ని వివరించడానికి మాటలు చాలవు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


DAILY WISDOM - 115 : 24. The Path of Return to the Absolute / నిత్య ప్రజ్ఞా సందేశములు - 115 : 24. సంపూర్ణ స్థితికి తిరిగి వచ్చే మార్గం




🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 115 / DAILY WISDOM - 115 🌹

🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 24. సంపూర్ణ స్థితికి తిరిగి వచ్చే మార్గం 🌻


చైతన్యం యొక్క శాశ్వతత్వం దేశ కాల పరిస్థితుల్లో స్వీయ-సంరక్షణ మరియు స్వీయ-పునరుత్పత్తిగా వ్యక్తమవుతుంది. అవరోహణ అనేది మూడు పరిధుల్లో జరుగుతుంది. అవి మానసిక స్వీయ-ధృవీకరణ, భౌతిక స్వీయ-ధృవీకరణ మరియు శాశ్వతత కోసం తపన. ఈ మూడు ప్రవృత్తులు ఏకకాలంలో పనిచేస్తాయి. కానీ అనుకూలమైన పరిస్థితులలో ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే నిర్దిష్ట దశ వ్యక్తపరచబడుతుంది. తద్వారా మానసిక, భౌతిక ధృవీకరణ మరియు లైంగిక కోరిక వ్యక్తీకరణ అన్ని వాటి వాటి అనుకూల సమయాల్లో వ్యక్తీకరించబడతాయి.

ఇక్కడ సానుకూల పరిస్థితులు అనే విషయం గుర్తుంచుకోవాలి. మట్టిలోనికి విసిరిన విత్తనం మొలకెత్తడానికి అనుకూలమైన పరిస్థితులు కాలక్రమేణా వ్యక్తీకరించ బడినప్పుడు మాత్రమే అది మొలకెత్తుతుంది. ఇక్కడ చెప్పబడిన ఈ కీలకమైన అంశాన్ని ప్రత్యేకించి తమ జీవితాలను సంపూర్ణంగా ఆరోహణ మార్గంలో నడపడానికి అంకితం చేసిన వారు తప్పక గమనించాలి. ఈ విషయంపై కొంచెం అవగాహన అవసరం.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 115 🌹

🍀 📖 The Ascent of the Spirit 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 24. The Path of Return to the Absolute 🌻

Self-preservation and self-reproduction are the spatio-temporal forms taken by the absolute character of the eternity of Consciousness. The ‘fall’ is a single act with the threefold downward pressure of psychic self-affirmation, physical self-affirmation and the urge for self-perpetuation. The threefold instinct acts simultaneously, only manifesting a particular phase at a particular time attended with favourable circumstances, so that the psychophysical affirmation and the sex urge, though they are present in the individual at all times hiddenly or expressedly.

Assume special emphasis under given conditions alone, even as a seed thrown into the soil germinates only when the conditions suited to its sprouting manifest themselves in the course of time. Here is a crucial point which has to be taken notice of particularly by those who have dedicated their lives to tread the ‘path of return’ to the Absolute, on which subject a little dilation of understanding is called for.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ మదగ్ని మహాపురాణము - 250 / Agni Maha Purana - 250


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 250 / Agni Maha Purana - 250 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 74

🌻. శివ పూజా విధి వర్ణనము - 6 🌻


అమృత (ధేను) ముద్ర ప్రదర్శించి, తన ఆసనముపై పుష్ప ముంచి, లలాటముపై తిలకము ధరించి, మూల మంత్రముతో దేవతకు పుష్పము అర్పించవలెను. సాధకుడు - స్నాన - దేవతాపూజా - హోమ - భోజన - యజ్ఞా - నుష్ఠాన - యోగ సాధన - ఆవశ్యక జపసమయములందు, స్థిరబుద్ధి యై మౌనముగా ఉండవలెను, నాదపర్యంతము ప్రణవోచ్చారణముచేయుచు మంత్రశోధనము చేయవలెను. ఉత్తమసంస్కారముక్తుడై దేవపూజా ప్రారంభము చేయవలెను.

మూలగాయత్రి చేత గాని, రుద్ర గాయత్రిచేత గాని అర్ఘ్యపూజనము చేసి ఆ సామాన్యార్ఘ్యమును దేవతకు సమర్పింపవలెను. బ్రహ్మపంచకము (పంచగవ్యములు, కుశోదకముతో చేసిన బ్రహ్మకూర్చము) సిద్ధముచేసికొని, శివలింగమునుండి పుష్పనిర్మాల్యమును తీసివేసి, ఈశాన్యము నందు ''చండాయ నమః'' అని చెప్పుచు చుండునకు సమర్పించవలెను. బ్రహ్మపంచకముతో పిండికా శివలింగములకు స్నానము చేయించి, 'ఫట్‌' అని ఉచ్చరించుచు, మరల ఉదకముతో స్నానము చేయించవలెను. ''నమో నమః'' అని ఉచ్చరించుచు అర్ఘ్యపాత్రగతజలముతో ఆ శివలింగమునకు అభిషేకము చేయవలెను. ఇది లింగశోధన విధానము.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 250 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 74

🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 6 🌻


38-39. After having shown the amṛtā mudrā (formation with fingers denoting non-decay) and putting flower on its seat and a mark on the forehead consecrated by the principal mantra (of the god) a bold man should remain perfectly silent at the time of bathing, worship of the god, (offering) oblation unto fire, eating, practising yoga and repetition of necessary (mantras).

40. The mantra should be purified by pronouncing the nāda (oṃ) at the end. That purified mantra should then be used in the worship along with the gāyatrī (mantra) and the general water of oblation should be offered.

41. After having repeated the brahmapañcaka[2], (the worshipper) should collect the garland from the liṅga and offer it to Caṇḍa in the north-eastern direction.

42. The purification of the liṅga consists in the washing of the pedestal and the liṅga with the water (consecrated) by the mantra of weapon and hṛdmantra and sprinkle with the water (for washing) from the vessel of arghya.

43. All the celestials should be worshipped for the purification of the self, the materials, the mantra and the liṅga. Hāṃ, Salutations to God Gaṇapati in the north-western direction. One should pay obeisance to the preceptor in the north-east.

44-45. One should worship the goddess of the seat (of the god) in the kūmaśilā (the tortoise form on the stone) as possessing complexion of the tender shoots and the seat of Śiva known as ananta (endless) should be worshipped as seated on the brahmaśilā along with the attendants of the god such as Vicitra-keśa, Kṛta and Tretā who form the seat and shoes as they were of divinity.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీమద్భగవద్గీత - 403: 10వ అధ్., శ్లో 31 / Bhagavad-Gita - 403: Chap. 10, Ver. 31

 


🌹. శ్రీమద్భగవద్గీత - 403 / Bhagavad-Gita - 403 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 31 🌴

31. పవన: పవతాస్మి రామ: శస్త్రభృతామహమ్ |
ఝషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ ||


🌷. తాత్పర్యం : నేను పవిత్రమొనర్చువానిలో వాయువును, శస్త్రధారులలో శ్రీరాముడను, జలజంతువులలో మకరమును, నదులలో గంగానదిని అయి యున్నాను.

🌻. భాష్యము : అతిపెద్దవైన జలజంతువులలో మకరము ఒకటి. అది నిక్కముగా మానవునకు ప్రమాదకరమైనది. అట్టి మకరము శ్రీకృష్ణునకు ప్రాతినిధ్యము వహించును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 403 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 31 🌴


31. pavanaḥ pavatām asmi rāmaḥ śastra-bhṛtām aham
jhaṣāṇāṁ makaraś cāsmi srotasām asmi jāhnavī

🌷 Translation : Of purifiers I am the wind, of the wielders of weapons I am Rāma, of fishes I am the shark, and of flowing rivers I am the Ganges.

🌹 Purport : Of all the aquatics the shark is one of the biggest and is certainly the most dangerous to man. Thus the shark represents Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹


25 Jul 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 25, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹

శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు. 🌻

🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 13 🍀

26. లంకేశనిధనస్థాయీ లంకాదాహక ఈశ్వరః |
చంద్రసూర్యాగ్నినేత్రశ్చ కాలాగ్నిః ప్రలయాంతకః

27. కపిలః కపిశః పుణ్యరాతిర్ద్వాదశరాశిగః |
సర్వాశ్రయోఽప్రమేయాత్మా రేవత్యాదినివారకః

🌻 🌻 🌻 🌻 🌻

🍀. నేటి సూక్తి : మానవులు ప్రేమించేది ఎందుకు? - మానవ స్నేహం, ప్రేమ. అనురాగం. సానుభూతి మున్నగునవి సామాన్యంగా ప్రాణకోశమందు ప్రతిష్ఠితములై వుంటాయి. వాటి కేంద్రంలో అహంకారం తిష్ఠవేసుకొని వుంటుంది. ఇతరుల నుండి ప్రేమను తిరిగి పొందడం కోసం, ఇతరుల తోడి సంసర్గం ద్వారా అహంకారాన్ని విస్తరింప జేసుకోడం కోసం, ప్రాణకోశ ప్రవృత్తుల పరస్పర వినిమయం ద్వారా తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించు కోవడం కోసం మానవులు సామాన్యంగా ఇతరులను ప్రేమిస్తూ వుంటారు. 🍀

🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

శ్రావణ మాసం

తిథి: శుక్ల-సప్తమి 15:10:24 వరకు

తదుపరి శుక్ల-అష్టమి

నక్షత్రం: చిత్ర 24:04:36 వరకు

తదుపరి స్వాతి

యోగం: సిధ్ధ 15:02:12 వరకు

తదుపరి సద్య

కరణం: వణిజ 15:04:24 వరకు

వర్జ్యం: 06:50:40 - 08:34:00

మరియు 29:55:38 - 31:36:06

దుర్ముహూర్తం: 08:28:50 - 09:20:46

రాహు కాలం: 15:37:16 - 17:14:38

గుళిక కాలం: 12:22:32 - 13:59:54

యమ గండం: 09:07:47 - 10:45:09

అభిజిత్ ముహూర్తం: 11:57 - 12:47

అమృత కాలం: 17:10:40 - 18:54:00

సూర్యోదయం: 05:53:02

సూర్యాస్తమయం: 18:52:01

చంద్రోదయం: 11:48:29

చంద్రాస్తమయం: 23:41:46

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: కన్య

యోగాలు: ధ్వాo క్ష యోగం - ధన

నాశనం, కార్య హాని 24:04:36 వరకు

తదుపరి ధ్వజ యోగం - కార్య సిధ్ధి

దిశ శూల: ఉత్తరం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి


🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹