Showing posts with label కాలజ్ఞానం. Show all posts
Showing posts with label కాలజ్ఞానం. Show all posts

🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 13 🌹


*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 13 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. అచ్చమ్మకు చెప్పిన జ్యోతిష్యం - 1 🌻*

వేశ్యల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు. వావీ వరసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు.

ఇది అక్షర సత్యం అయింది. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు. ఈ వ్యాధి వచ్చినవారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి.

రాజులు తమ ధర్మాన్ని మరిచిపోతారు. వారు విలాసాలు, విందుల్లో మునిగితేలుతూ ఉంటారు. ధర్మభ్రష్టులవుతారు.

ఇక్కడ రాజులు అంటే, పాలకులు అని అర్ధం. వారు రాజులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రతినిధులు కావచ్చు. అనేక రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, దేశాల ప్రధాన మంత్రులు కూడా అవినీతి కుంభకోణాలలో చిక్కుకోవడం పత్రికల ద్వారా ప్రజలకు వెల్లడి అవుతోంది. పార్టీ ఏదైనా ప్రజా ప్రతినిధులు అత్యధిక శాతం అవినీతికి పాల్పడుతున్నారు.

శాంతమూర్తులకు కూడా విపరీతమైన కోపం వస్తుంది. వివిధ వర్ణాలవారు తమ ఆచారాలను వదిలి ఇతరుల ఆచారాలను అనుసరించి నాశనమవుతారు.

నిజమే కదా.. మానసిక వత్తిడి విపరీతంగా పెరిగిన దరిమిలా శాంతమూర్తులు కూడా ఆవేశానికి, ఆగ్రహానికి లోనవడం మనం చూస్తూనే ఉన్నాం.

పైర్లు సరిగా పండవు. పాడి పశువులు పాలు సరిగా ఇవ్వకపోవడం వల్ల కరువు భయంకరంగా పెరుగుతుంది..

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹

🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 12 🌹


*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 12 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

వీరబ్రహ్మేంద్రస్వామి తనకు తెలిసిన భవిష్యత్ విషయాలను వివిధ సందర్భాల్లో చెప్పుకుంటూ వెళ్లారు.

అంతే కాకుండా వీరబ్రహ్మేంద్రస్వామి వివిధ ఊళ్లు తిరుగుతూ ఉండేవారు. ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ తినేవారు, విశ్రమించేవారు. కాలజ్ఞాన ఉపదేశం చేసేవారు.

అందువల్ల కాలజ్ఞానం ఒక క్రమ పద్ధతిలో ఉండదు.

వీరబ్రహ్మేంద్రస్వామి తాను రాసిన కాలజ్ఞానంలో ఎక్కువ బనగానపల్లెలో ఒకచోట పాతిపెట్టారు. తర్వాత దానిపైన ఒక చింతచెట్టు మొలిచింది. ఈ చింతచెట్టు వయసు 4, 5 వందల సంవత్సరాల మధ్య ఉంటుందని నిర్ధారించారు.

ఈ చింతచెట్టుకు స్థానికులు పూజలు చేస్తూ ఉంటారు. ఈ చెట్టునుంచి కొన్నిసార్లు ఎర్రని ద్రవం వస్తుందని, స్థానికులు చెప్తారు. ఈ చెట్టుకు కాసే చింతకాయలు తినేందుకు పనికిరాకపోవడం ఆశ్చర్యం.

వీరబ్రహ్మేంద్రస్వామి, అచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తూ ఉంటారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 11 🌹


🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 11 🌹 
 📚. ప్రసాద్ భరద్వాజ

🌻. పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? 🌻 


ఒక శుభదినాన అచ్చమ్మగారిని ఈశ్వర క్షేత్రమైన యాగంటి’కి తీసుకుని వెళ్లారు వీరబ్రహ్మేంద్రస్వామి. అక్కడ జ్ఞానోపదేశం మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు వేశారు. వాటన్నిటికీ సామాన్యులకు అర్ధమయ్యే విధంగా సరళమైన భాషలో జవాబులిచ్చారు వీరబ్రహ్మేంద్రస్వామి.

వాటిలో కొన్ని... 

పరమాత్మ ప్రపంచంలో అణువణువునా ఉన్నాడు. ఈ పశువులలో, నీలో, నాలో, కీటకాలలో.. అన్నిటిలోనూ ఆయన నివాసం ఉంటుంది.

🌻. దేవుని తెలుసుకోవడం ఎలా? 🌻

దేవుని తెలుసుకోడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ భక్తి, ధ్యానం శ్రేష్టమైనవి. భక్తి మార్గం అంటే కేవలం భగవంతుని ధ్యానిస్తూ జీవితాన్ని గడపడమే. 

దీన్నే భక్తి యోగం అని కూడా అంటారు. ధ్యాన యోగం అంటే ప్రాణాయామం ద్వారా ఈ సృష్టిని ప్రారంభించిన బ్రహ్మ ను తెలుసుకోవడమే.

🌻. దేవుని ఏ రూపంలో మనం చూడగలం? స్త్రీయా, పురుషుడా? 🌻

పరబ్రహ్మ నిరాకారుడు, నిర్గుణుడు. మనం ఏ విధంగానూ నిర్వచించలేము.

ఈ విధంగా అచ్చమ్మగారి సందేహాలను తీర్చిన తర్వాత ఆమెకు కొన్ని మంత్రాలను ఉపదేశించారు వీరబ్రహ్మేంద్రస్వామి. వీటిని ఏకాగ్ర చిత్తంతో జపిస్తూ ఉండమని చెప్పారు.

తర్వాత కాలజ్ఞానం గురించి వివరించడం మొదలుపెట్టారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 10 🌹


*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 10 🌹*
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. గోవుల కోసం రేఖ 🌻*

అయితే తాను కాలజ్ఞాన గ్రంధం రాయడంలో నిమగ్నమయ్యే సమయంలో గోవులు అచ్చమ్మగారి పొలం దాటి వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళిపోతూ ఉండేవి. ఇలా జరగకుండా వుండేందుకు ఒక పుల్లతో ఆ గోవుల చుట్టూ పెద్ద వలయం గీశాడు. ”ఈ వలయం దాటి మీరు ఎక్కడికీ వెళ్ళవద్దు” అని గోవులను ఆదేశించాడు. తర్వాత ప్రశాంతంగా తన కాలజ్ఞానాన్ని కొనసాగించారు.

పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. రకరకాల సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు.ఆ తర్వాత దానిపైన చింతచెట్టు మొలిచింది.

ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు? ఇలా ఎందుకు చేశారు? అనే దానికి మాత్రం ఇప్పటివరకు జవాబు దొరకలేదు. ఒకరోజు మామూలుగా తన విధి నెరవేర్చేందుకు పశువులను తోలుకుని కొండకు బయల్దేరారు వీరబ్రహ్మేంద్రస్వామి.

యధాప్రకారం గోవుల చుట్టూ ఒక వలయం గీసి, కాలజ్ఞానం రాసుకునేందుకు తాటియాకులు, చెట్ల ముళ్ళు కోసుకుని కొండ గుహలోకి వెళ్ళిపోయారు వీరబ్రహ్మేంద్రస్వామి. ఆయనను అనుసరిస్తూ వచ్చిన అచ్చమ్మ ఇదంతా చూసి ఒక అద్భుతాన్ని చూసిన విధంగా ఆశ్చర్యంలో మునిగిపోయింది.

తన దగ్గర గోవులకాపరిగా పనిచేస్తున్న వీరబ్రహ్మేంద్రస్వామి ఒక జ్ఞాని అని అప్పుడు తెలుసుకోగలిగింది అచ్చమ్మ.

కానీ, గుహలోకి వెళ్ళి ఆయనతో మాట్లాడటానికి భయపడింది. తపస్సు చేస్తున్న మాదిరిగా కాలజ్ఞానాన్ని రాస్తున్న బ్రహ్మంగారి ఏకాగ్రతను భగ్నం చేసేందుకు ఆవిడ భయపడింది. అప్పటికి ఆయనతో ఏమీ మాట్లాడకుండా ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది.

వీరబ్రహ్మేంద్రస్వామి గోవులను తోలుకుని తిరిగి రాగానే ఆయన పాదాలకు నమస్కరించి, తెలీక తాను చేసిన తప్పులన్నిటినీ మన్నించమని కోరింది.

”నాకు దూషణ అయినా, భూషణ అయినా ఒక్కటే. నీవయినా, తల్లి అయినా ఒక్కటే. ఈ ప్రపంచంలోని జీవులన్నీ నాకు సమానమే” అని చెప్పిన బ్రహ్మంగారిని తనకు జ్ఞానోపదేశం కలిగించమని కోరింది అచ్చమ్మ.

ఆ పని ప్రస్తుతం చేసేందుకు వీలు లేదని, సమయం వచ్చినప్పుడు యాగంటి అనే పుణ్యక్షేత్రంలో జ్ఞానోపదేశం చేయగలనని, చెప్పారు వీరబ్రహ్మేంద్రస్వామి. ఆరోజు కోసం ఎదురుచూడసాగింది అచ్చమ్మ.

వీరబ్రహ్మేంద్రస్వామి మాత్రం యధాప్రకారం కాలజ్ఞానాన్ని రాసి, అచ్చంమగారి ఇంటిలో ఒకచోట పాతిపెడుతూ ఉండేవారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 9 🌹


*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 9 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. కాలజ్ఞాన రచనకు అనువైన ప్రదేశాన్ని ఎన్నుకొనుట 🌻*

బ్రహ్మంగారు చేసే కొన్ని పనులు వినేందుకు చాలా విచిత్రంగా ఉండేవి. ఆయన ఒకవైపు కొండగుహలో కూర్చుని కాలజ్ఞానం రాస్తూ ఉండేవారు. మరోవైపు పశువుల కాపరిగా తన బాధ్యతను నిర్వర్తించేవారు.

తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చుట్టి వచ్చేందుకు బయల్దేరిన వీరబ్రహ్మేంద్రస్వామి బనగానపల్లెకు చేరారు. ఆరోజు పగలంతా ప్రయాణం చేయడంతో బాగా అలసిపోయారు. 

రాత్రికి ఆ ఊరిలోని ఒక ఇంటి వద్దకు చేరారు. నిద్రా సమయం ఆసన్నం కావడంతో అక్కడున్న అచ్చమ్మ అనే స్త్రీ ఇంటిముందు ఉన్న అరుగుపైన నిద్రకు ఉపక్రమించారు.

మరుసటిరోజు పొద్దున్నే అచ్చమ్మగారు, తన ఇంటి అరుగుమీద పడుకున్న వీరబ్రహ్మేంద్రస్వామిని చూశారు. ఈ సన్యాసి ఎవరో అని కుతూహలం కలిగి, ఆయనను వివరాలు అడిగారు. 

తాను బతుకుతెరువు కోసం వచ్చానని, ఏదో ఒక పని చేయదలచానని చెప్పగా, తన దగ్గర ఉన్న గోవులను తోలుకెళ్ళమని చెప్పింది అచ్చమ్మ. 

అలా గోవుల కాపరిగా మారిన వీరబ్రహ్మేంద్రస్వామి ఆవులను తీసుకుని దగ్గరలో ఉన్న రవ్వలకొండ దగ్గరకు వెళ్ళాడు.

ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణం ఆయనను ఎంతో ఆకర్షించింది. ఆ ప్రదేశాన్ని కాలజ్ఞానం రాసి, అందరికీ తెలియజెప్పేందుకు తగిన ప్రదేశంగా నిర్ణయించుకున్నారు. ఒక గుహను తనకు ఆవాసయోగ్యంగా చేసుకున్నారు.

ప్రతిరోజూ గోవులను తీసుకుని వచ్చి, వాటిని పొలంలో వదిలిపెట్టి మనసును కేంద్రీకరించి ధ్యానంలో మునిగిపోయేవారు. ఆ ధ్యానం వల్ల ఆయనకు రకరకాల అనుభవాలు కలిగేవి. వాటన్నిటికీ అక్షరరూపం కల్పించేవారు.

కాలజ్ఞానాన్ని మొదలుపెట్టేందుకు నిర్ణయించుకున్న వీరబ్రహ్మేంద్రస్వామి అక్కడ ఉన్న ఒక తాటిచెట్టు ఆకులను కోసుకుని, కొండ గుహలో రాయడం మొదలుపెట్టాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 8 🌹


*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 8 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

పంచభూతాల కలయికతోనే ”నేను” అనే భావన ఏర్పడుతుంది. ఈ సమస్త చరాచర ప్రకృతిని అర్ధం చేసుకునేందుకు మనకు చెవి, కన్ను, ముక్కు వంటి జ్ఞానేంద్రియాల వల్ల సాధ్యమౌతుంది. 

వీటి ద్వారా వివిధ రకాల పద్ధతులు, మార్గాల ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం. అయితే వీటన్నిటినీ సమగ్రంగా అర్ధం చేసుకోడానికి ఉపయోగపడే తత్వమే నేను లేదా అహం. మనం సంపాదించే విషయ పరిజ్ఞానాన్ని మొత్తాన్ని మన మేధస్సు కు ఆర్దమవడానికి కారణం తత్వమే.

ఈ పంచాంశాల వల్ల కామ, క్రోధ, మోహాలు కలుగుతాయి.ఇవి ఎక్కువ తక్కువగా ఉన్నప్పుడు ఆ జీవుడు లేదా బుద్ధి ఆ దిశగా చలిస్తూ ఉంటుంది. ఆత్మ అనేది నిమిత్తమాత్రంగా ఉంటూ అన్నిటినీ గమనిస్తూ ఉంటుంది.

ఏది మంచిదో, ఏది చెడ్డదో చెప్పడం వరకే దాని బాధ్యత. అంతే కానీ తప్పనిసరిగా ‘నువ్వు ఈ దిశలో వెళ్ళు’ అని ఆదేశించదు. ఆ విషయం బుద్ధి అధీనంలో ఉంటుంది. బుద్ధి, కర్మ అధీనంలో ప్రవర్తిస్తుంది. అందుకే ”బుద్ధీ కర్మానుసారిణీ” అని పెద్దలు చెప్తారు.

భౌతికంగా ఎంతటి గోప్పవాడయినా కర్మ నుండి తప్పించుకోలేదు. శ్రీకృష్ణుడు అంతటి మహాయోగి చివరికి ఒక బోయవాని బాణపు దెబ్బకు అడవిలో మరణించాడు. 

ఈ విషయాన్ని ఎవరు గ్రహిస్తారో, పరబ్రహ్మను ఎవరు ధ్యానిస్తారో వార్కికి దుఃఖం తగ్గుతుంది” – అని తల్లి౮కి వివరించాదు

వీరబ్రహ్మేంద్రస్వామి. తర్వాత ఈ జనన మరణ చక్రాన్ని శాస్వతంగా వీడిపోయేందుకు, మోక్షాన్ని సాధించేందుకు పరబ్రహ్మను చేరుకునేందుకు ధ్యానం ఒక మార్గం అని చెప్పాడు పోతులూరి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 7 🌹



*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 7 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. కాలజ్ఞాన రచన 🌻*

వీరబ్రహ్మేంద్రస్వామికి వీరం భోట్లయ్య అనే పేరు కూడా ఉంది. ఈయన తండ్రి పేరు వీర భోజ్య రాయలు, తల్లి వీర పాపమాంబ. 8 సంవత్సరాల వయసు వచ్చేసరికి వీరబ్రహ్మేంద్రస్వామికి అపారమైన విజ్ఞానం ఏర్పడింది. ఆధ్యాత్మికత గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఇతరులతో తక్కువగా మాట్లాడుతుండేవాడు.

అద్భుత తత్వవేత్త ఆది శంకరాచార్యుల వలెనె వీర బ్రహ్మేంద్రస్వామి కూడా వివిధ విషయాలపై తాను జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా ఇతరులకు చెప్పేందుకు నిర్ణయించుకున్నాడు. తండ్రి మరణించిన కొద్దికాలం తర్వాత తన తల్లిని వదిలి వివిధ ప్రదేశాలను సందర్శించేందుకు నిర్ణయించుకుని తల్లి అనుమతి కోరాడు.

తల్లి పుత్రా ప్రేమవల్ల దీనికి అభ్యంతరం చెప్పింది. అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి తల్లికి వివిధ రకాల విషయాల గురించి జ్ఞానాన్ని అందజేశాడు.

అశాశ్వతమైన ఈ దేహం కోసం, బంధాలు, అనుబంధాల కోసం ప్రతి క్షణం తపించడం వృధా ప్రయాస అని తెలియచెప్పాడు. శరీర తత్వం ఎలా ఉంటుంది ? ఈ భౌతిక శరీరం ఆకాశం, గాలి, అగ్ని, నీరు, పృథ్వి అనే అయిదు అంశాలతో రూపొందుతుందని తల్లికి వివరించాడు వీరబ్రహ్మేంద్రస్వామి. వేదాల్లోనూ ఇదే ఉంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 6 🌹


*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 6 🌹*
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. కాలజ్ఞానంలో చెప్పినవి – ఇప్పటివరకు జరిగినవి - 3 🌻*

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన జోస్యాల్లో ఎన్నో నిజమయ్యాయి. ఉదాహరణకు..

గట్టివాడయిన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు ..

ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పొట్టివాడయిన లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమయిన పాలనను అందించారు.

కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. .

వీరివల్ల ప్రజలందరూ మోసపోతారు.. ప్రస్తుతం గాల్లోంచి ఏవేవో వస్తువులు సృష్టించి ప్రజలను మోసం చేసే బాబాలు, కపట సన్యాసులు పెరిగిపోయారు. వీరికి ఏ మహిమలూ లేకపోయినా ప్రజలు వారిని గుడ్డిగా నమ్ముతున్నారు. పైగా ఈ దొంగ స్వాములు భోగవిలాసాలకు బానిసలుగా ఉన్నారు. ఎందరో దొంగ సన్యాసుల గుట్టు రట్టవుతోంది.

దొంగ స్వాముల వల్ల నిజమైన యోగులకు చెడ్డ పేరు వస్తోంది. ఈ విషయం గురించి వీరబ్రహ్మేంద్రస్వామి 500 ఏళ్ళ కిందటే వివరించారు. ఈ విషయమొక్కటే చాలు వీరబ్రహ్మేంద్రస్వామి ఇప్పటి బాబాలు, నకిలీ యోగుల మాదిరిగా పేరు కోసం, డబ్బు కోసం, ఇతర సుఖాల కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదని రుజువు చేసేందుకు. అంతే కాకుండా నిజాలు తెలుసుకోకుండా యోగులందరూ దొంగలే అని వాదించే కొందరికి ఇది కనువిప్పు కలిగిస్తుంది.

కాలజ్ఞానంలో ఇలాంటి అంశాలు కోకొల్లలు. వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన అన్ని విషయాలూ తెలుసుకోవాలంటే కాలజ్ఞానం చదవాలి.

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 5 🌹


*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 5 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. కాలజ్ఞానంలో చెప్పినవి – ఇప్పటివరకు జరిగినవి - 2 🌻*

5. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. - ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. ఒక్క భారతదేశ జనాభానే వందకోట్లు దాటడం మితిమీరిన జనాభా పెరుగుదలకు నిదర్శనం. భవిష్యత్ లో అన్ని రకాల సమస్యలూ అధిక జనాభా గురించే మొదలవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

6. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. - ఇప్పటివారికి తెలియదు కానీ, వంద సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు వుండేవి. ప్రస్తుతం ఎక్కాడా అగ్రహారాలు లేవు.

7. హైదరాబాద్ లో తురకలు, హిందువులు పరస్పరం కిరాతకంగా చంపుకుంటారు…- . పదిహేనేళ్ళ కిందటి వరకు కూడా హైదరాబాద్ లో మత కల్లోలాలు – అది కూడా కేవలం ముస్లిం, హిందువుల మధ్య మాత్రమే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక హుండీలో చోరీలు చాలా ఎక్కువగా వున్నాయి.

8. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ, చావు పుట్టుకలు మాత్రం కనుగోనలేకపోతారు. - సృష్టిని మార్చటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అన్ని రంగాల్లాగే వైద్య రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది. కాలు విరిగేతే రాడ్ వేస్తున్నారు. అసలు కాలే లేకుంటే కృత్రిమ కాలు పెడుతున్నారు. గుండె మార్పిడి దగ్గర్నించీ ఎన్నో అపురూపమైన శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఇంత అభివృద్ధి సాధించిన మాట నిజమే కానీ, చనిపోయిన వారిని బతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటివరకూ కనుక్కోలేదు. బహుశా, భవిష్యత్ లో కనుగొనగలరనే నమ్మకం కూడా లేదు.

9. రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పెట్టాను. - రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు, శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. చివరకి ఆ వైరమే భారత ప్రధాని రాజీవ్ గాంధీని బలిగొన్న విషయం తెలిసిందే. ఎల్.టీ.టీ.ఈ. ప్రభాకరన్ హతుడైన సందర్భంలో ఇరుపక్షాలవారూ మృత్యువాతపడ్డారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 4 🌹


*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 4 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. కాలజ్ఞానంలో చెప్పినవి – ఇప్పటివరకు జరిగినవి 🌻*

1. కాశీ పట్న దేవాలయం నలభై రోజులు పాడుపడుతుంది అని భవిష్య వాణి చెప్పాడు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. అది ఎలా నిజమయిందో చూద్దాం. 1910 – 12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్ళలేదు.

2. ఒక అంబ పదారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది…. ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాలపాటు మన దేశానికి ప్రధానిమంత్రిగా వున్నారు. తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. ప్రస్తుతం సినీ నటులు రాజకీయాల్లోకి విస్తృతంగా వస్తున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంతకంటే ముందు సినిమా నటి. అలాగే మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సినీ రంగం నుంచి వచ్చినవారే! చిరంజీవి, విజయశాంతి, జమున- ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది తెరమీది నటులు రాజకీయాల్లో ప్రవేశించారు..

3. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి ఇప్పుడు భారతదేశంతో రాచరిక వ్యవస్థ లేదు. ఆఖరికి జమీందారీ వ్యవస్థ కూడా నశించింది. ఉన్నదల్లా ప్రభుత్వము, మంత్రులూను. ఈ మంత్రులు వారసత్వం లాగా రారు. నిరంకుశత్వం ఉండదు. ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తేనే అధికారంలోకి వస్తారు. కనుక పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన మాట అక్షరాలా నిజమైంది.

4. ఆకాశాన పక్షి వాహనాదులు కూలి అనేకమంది మరణిస్తారు ఆకాశంలో పక్షి వాహనాలు నడుస్తాయని పోతులూరి చెప్పేనాటికి అసలు విమానమే పుట్టలేదు. పుష్పకవిమానం అంటూ పురాణ కధలు మాత్రం ఉన్నాయి. ప్రస్తుతం తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విమాన ప్రమాదాల్లో ఎంతోమంది మరణిస్తున్నారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 3 🌹


*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 3 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

ఇప్పుడు మనం చూస్తున్న విపరీత పరిమాణాలు, దుర్ఘటనలు, ఆశ్చర్యకర సంఘటనల గురించి వేల సంవత్సరాల కిందటే వివరించిన మహాజ్ఞాని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. ఆయన కర్నూలు జిల్లాలోని బనగానపల్లిలో జన్మిచారు. ఆయన ఎప్పుడు పుట్టారు? ఎక్కడ పుట్టారు? కాలజ్ఞానాన్ని ఎప్పుడు సామాన్య ప్రజలకు వెల్లడి చేశారు- అనే విషయాలపైన వాదోపవాదాలు వున్నాయి.

ఏదేమయినా క్రీస్తు శకం 1600 – 1610 మధ్యలో ఆయన జన్మించి ఉండవచ్చని కొందరి అంచనా. పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి జీవితంలో ఎన్నో మహిమలు ప్రదర్శించినట్లు చెబుతారు. అయితే ఈ మహిమలు నిజంగా జరిగాయా లేదా అని తర్కించే వారి విషయం పక్కన పెడితే ఆయన చెప్పిన కాలజ్ఞానం మాత్రం భవిష్య సూచికగా అత్యధికశాతం హిందువులు నమ్ముతారు.

కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు ‘నీవెవరివి?’ అని శ్రీ కృష్ణుడిని ప్రశ్నించినపుడు “సర్వ శక్తిమంతుడైన కాలుడను నేను” అని జవాబిచ్చాడు. కాలుడు సమస్త చరాచర జగత్తును కబళించగలిగిన, సృష్టించగలిగిన శక్తి వున్నవాడు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు కాలుని అధీనంలోనే ఉంటాయి! 

సృష్టి మొత్తం కాలం అధీనంలోనే వుంటుంది. కేవలం మహాజ్ఞానులకు, యోగులకు మాత్రమే కాల పురుషుని గురించిన జ్ఞానం వుంటుంది. అటువంటి మహాత్ముడు యోగి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి. 

అందువల్ల ఆయన చెప్పిన కాలజ్ఞానం ఇప్పటికే అత్యధికులకు అనుసరణీయంగా వుంటోంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 2 🌹


🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 2 🌹 
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

నాస్ట్రోడామస్, నే ఉదాహరణగా తీసుకుంటే …. హిట్లర్, నెపోలియన్ వంటి ప్రముఖుల ప్రస్తావన నాస్ట్రోడామస్ జోస్యంలో కనిపిస్తుంది. రాజీవ్ గాంధి హత్య, ప్రపంచ వాణిజ్య భవన సముదాయం కూల్చివేత వంటి విపత్కర సంఘటనలకు నాస్ట్రోడామస్ జోస్యాలు కొన్నింటికి అన్వయం కుదురుతుంది. మరి ఆయన చెప్పింది వీరి గురించేనా? అనేది స్పష్టంగా చెప్పలేము. అయితే, వీటిని ఎక్కువమంది నమ్ముతారు.

వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిందీ ఇలాంటివే! నాస్ట్రోడామస్ ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలను దర్శించారని ఆయన జోస్యాలను నమ్మినవారు భావిస్తునట్టే, రాష్ట్రంలో అనేక సంఘటనల గురించి వీరబ్రహ్మేంద్రస్వామి ముందుగానే భవిష్యద్దర్శనం చేసి చెప్పిన ఉదంతాలు కాలజ్ఞానంలో కనిపిస్తాయి.

వీరబ్రహ్మేంద్రస్వామి జ్యోస్యాలలో కొన్ని సూటిగా వుంటే, మరికొన్నింటికి మనమే అన్వయం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఇప్పటికే జరిగాయి, ఇంకా కొన్ని ఇకముందు జరగవలసి ఉన్నాయి. భవిష్యత్తులో జరగవలసి ఉన్నవాటిలో ఎక్కువ ప్రచారంలో ఉన్న విషయం ‘కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుంది అనేది.

కృష్ణానది ఇంద్రకీలాద్రి అంత ఎత్తుకు చేరుకునేంతగా ఎగసి పడుతుందా? లేక కనకదుర్గమ్మ ముక్కుపోగు నీటిని చేరుకుంటుందా అనేది మనం ఊహించలేము. ఈ రెండింటిలో ఎదైనా జరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో జగరబోయే జలప్రళయాన్ని వీరబ్రహ్మేంద్రస్వామి మనోనేత్రంతో దర్శించారు.

జల ప్రళయమే అవసరం లేదు. ఏదైనా భూకంపం వంటి ప్రకృతి వైపరిత్యంవల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్ ఆనకట్టలకు బీటలు పడితే ఎగసి వచ్చే అపార జలరాశి చాలు. అలాంటి విపత్తు ఎదురైతే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది. ఇక ముక్కుపుడక కృష్ణానదిని చేరుకోవడం అనే విషయాన్ని ఎవరికి తోచినట్లు వారు ఊహిస్తున్నారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 1 🌹


🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 1 🌹 
 📚. ప్రసాద్ భరద్వాజ 

అసలు వీరబ్రహ్మేంద్రస్వామి ఎవరు? కాలజ్ఞానం అంటే ఏమిటి? వీరబ్రహ్మేంద్రస్వామి ఏం చెప్పారు, అవి ఎంతవరకూ నిజం అయ్యాయి అనే అంశాలు ఒక్కొక్కటీ తెలుసుకుందాం కాలజ్ఞానం అంటే భవిష్యద్దర్శనం అన్నమాట. భవిష్యత్తును దర్శించడం యోగులకు, ఋషులకు సాధ్యమే. మన పురాణ పురుషుల సంగతి వదిలేసినా, చరిత్రకు అందిన వారిలోనూ ఇలా భవిష్యద్దర్శనం చేసిన వారు ఉన్నారు.

ఇతర దేశాలలోనూ భవిష్యత్ ను తెలుసుకొని, జరగబోయేవి ముందే చెప్పిన మహనీయులు లేకపోలేదు. వీరిలో ప్రపంచానికి తెలిసిన ప్రముఖుడు నాస్ట్రోడామస్ అయితే తెలుగువారికి ఎక్కువగా తెలిసింది వీరబ్రహ్మేంద్రస్వామి.

రష్యా, టిబెట్, చైనా వంటి సుదీర్ఘ చరిత్ర కలిగి, ప్రాచీన నాగరికతలు వెల్లివిరిసిన దేశాలలో భవిష్యద్దర్శనం చేసిన కొందరి పేర్లు మనకు వినిపిస్తుంటాయి. వారి గురించిన చారిత్రక వివరాలు గ్రంథస్తం చేసి ఉన్నాయి.

కాలజ్ఞానం ఒక విధంగా జ్యోతిష్యం వంటిదనే చెప్పుకోవాలి. జ్యోతిష్యం గ్రహగతుల ఆధారంగా కొందరు వ్యక్తుల జీవితంలో భవిష్యత్ లో జరగబోయే సంగతులను వివరించి చెప్పేది. ఈ జ్యోతిషంలోనూ అనేక పద్దతులు ఉన్నాయి. నాడీ జోస్యం, హస్తసాముద్రికం తదితరాలు. అవి ఇప్పుడు అప్రస్తుతం.

కాలజ్ఞానం జ్యోతిషానికి భిన్నమైనది. ఇది ఒక దేశ, ప్రపంచ పోకడలను వివరించేది. భవిష్యత్తులో సాంకేతికంగా వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, దేశానికి ఏర్పడే ముప్పులు, పెను విపత్తులు, ప్రముఖ వ్యక్తుల జననం, వారి జీవనం ఇలాంటి సంగతులు ఎన్నిటినో వివరిస్తుంటుంది.

నాస్ట్రోడామస్, వీరబ్రహ్మేంద్రస్వామి చేసింది సరిగ్గా ఇదే! నాస్ట్రోడామస్, చెప్పినా, వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినా వారి జోస్యాలు సూటిగా ఉండవు. మర్మగర్భంగా ఉంటాయి. అలాగని వారేదో ఊహాప్రపంచంలో విహరించి, వారికి తోచిందేదో రాసేశారు అనుకోడానికీ లేదు. ఎందుకు రాశారు అన్నదీ ఆలోచించాలి.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹