శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 356-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 356-2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 356-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 356-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।
సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀

🌻 356-2. 'సదాచార ప్రవర్తికా' 🌻


యజ్ఞము దానము సహజ లక్షణము లైనవారికి మాత్రమే తపస్సు ఫలించును. తపస్సు ఆధారముగ దైవమే తానని, దేవుడే జీవుడుగ నున్నాడని తెలియును. ఇట్టి యజ్ఞ, దాన, తపస్సుల యందు జీవులను క్రమముగ ప్రవర్తింప జేయునది శ్రీమాత. ప్రతి జీవుని కథ యందు స్వార్థ చింతనచే చిక్కుల యందు పడుట, ఆర్తుడు, అర్థార్థుడు అయి గతి లేక దైవమును ప్రార్థించుట, దైవప్రార్థనమున కొంత చిక్కులు సడలగ దైవమునందు ఆసక్తి కలుగుట, అట్టి ఆసక్తి కారణముగ దైవముచే అనుగ్రహింపబడుటకు సదాచారముల నవలంబించుట జరుగుచున్నది.

ఇట్లు జీవులందరిని సదాచారమునకు శ్రీమాతయే మళ్ళించు చున్నది. దుర్బలుర నందరిని సదాచార మార్గమున బలవంతులను చేయుట శ్రీమాతయే జరుపు చున్నది. దుష్టులను సంహరించుచు దుర్బలురను తీర్చిదిద్దుచు సృష్టి చక్రమును నిర్వర్తించునది శ్రీమాతయే. సదాచారమున ప్రవర్తింప చేయుట శ్రీమాత ముఖ్య కార్యములలో నొకటి.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 356-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani
Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻

🌻 356-2. Sadācāra-pravartikā सदाचार-प्रवर्तिका 🌻


She removes the innate ignorance of the soul to realize the Brahman. In this nāma, She is said to induce the ignorant men to perform noble acts. Sat refers those who perform noble deeds and ācāra means the righteous acts performed by them. She makes the ignorant people (ignorant means lack of knowledge of the Brahman.

It could also mean the concept of duality) to pursue the righteous path to realize the Brahman. The principles of righteousness are expounded in epics. These principles form the basis of dharma śāstra (refer previous nāma).


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


17 Mar 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 154. తీర్పులు / Osho Daily Meditations - 154. JUDGING


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 154 / Osho Daily Meditations - 154 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 154. తీర్పులు 🍀

🕉. తీర్పులను ఇవ్వడం ఒక రోగంగా గుర్తించి వదిలిపెట్టు. ఆ లక్షణం ఎప్పటికీ శాంతిని ఇవ్వదు. 🕉


మీరు తీర్పు ఇవ్వడానికి పూనుకున్నప్పుడల్లా పోల్చవలసి వస్తుంది. కాలంలో వెనుకకు లేదా ముందుకు కదలాలి. అందువల్ల మీరు వర్తమానంలో మరియు ప్రస్తుతంలో ఉండలేరు. దీనిలో ఇది మంచిది, లేదా ఇది చెడ్డది అని పోల్చడానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే వర్తమానం మరియు ప్రస్తుత స్థితి అనేది కేవలం ఉంది అంతే; మంచిదా, చెడ్డదా అని చెప్పడానికి మార్గం కూడా లేదు, ప్రస్తుతం మరియు వర్తమానం యొక్క అందమే అది.

కానీ ప్రతీదాన్ని అంచనా వేయాలనే ఆలోచన మనది. దానిలోనే అహం దాగి ఉంటుంది. అహంకు గొప్పగా తనని తాను మెరుగు పరచుకుంటున్నాను అని అనుకునే లక్షణం వుంది. నిరంతరం ఎదుగతున్నట్టు చూపిస్తుంది. ఇది మిమ్మల్ని మీరు హింసించుకునేలా చేస్తుంది: "మెరుగుపడు, మెరుగుపడు అని పోరుతూ వుంటుంది.!". కానీ నిజానికి మెరుగు పరచడానికి ఏమీ లేదు. తీర్పు చెప్పడం అనేది కేవలం ఒక అలవాటు. నీ నుండి తీర్పు వచ్చినప్పుడల్లా, దాన్ని తక్షణం వదిలేయి, వదిలిపెట్టు. అనవసరంగా నిన్ను నీవు హింసించు కోవద్దు.

కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Osho Daily Meditations - 154 🌹

📚. Prasad Bharadwaj

🍀 154. JUDGING 🍀

🕉 Judging has to be dropped. It is an illness that will never allow you any peace. 🕉

When you judge, you can never be in the present-you are always comparing, always moving backward or forward, but never here and now. Because the here and now is simply there; it is neither good nor bad. And there is no way to tell whether it is better, because there is nothing with which to compare. It is simply there in all its beauty.

But the very idea to evaluate it has something of the ego in it. The ego is a great improver; it lives on improvement. It keeps torturing you: "Improve, improve!" And there is nothing to improve. Whenever a judgment comes, drop it then and there. Drop it. It is a habit. Don't torture yourself unnecessarily.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


17 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 165


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 165 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. వాదనలు వ్యర్థము 🌻


ఏ నరుడైనను స్వల్పకాలము దేనిని గూర్చి వాదనలోనికి దిగినను రోషము, పంతములు కలుగును. అనగా బాధ కలుగును. అది కలిగినంత కాలము వాని ఆయుర్దాయము వ్యర్థమై పోయి‌నట్లే.

ఏ నరుఁడే నొక నిమిషంబైన వృథావాదగతిని హరిపదకమల
ధ్యానానందుఁడు గాడే నా నరునకు నాయు వల్ప మగు మునినాథా!

వయస్సు‌ను బట్టి రోగము , ముసలితనము మున్నగు లక్షణములు వచ్చుట సిద్ధుల యందు పనిచేయదు.

మనస్సు , ఇంద్రియములు స్థూలదేహమునకు కోరికల రూపమున దాస్యము చేయుచున్నచో రోగము, ముసలితనము కనిపించును. అట్లుగాక ఇంద్రియములు , మనస్సు , బుద్ధి యోగమున భగవంతుని యందు వసించుట అభ్యాసమైనచో దేహము కూడ వానిమనుసరించి జీవింపవలసి వచ్చును. అప్పుడు రోగము, వయస్సు పనిచేయవు.

✍🏼. మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


17 Mar 2022

A person who is in search of a higher blissfulness has to be ready to suffer


🌹A person who is in search of a higher blissfulness has to be ready to suffer. 🌹

This may look a paradox to you: that a man of the status of a buddha, a man who is awakened, IS blissful -- absolutely -- and also suffers absolutely.

Of course he is blissful inside, the flowers go on showering there, but he suffers for everybody all around. He has to, because if you have sensitivity for blessings to become available to you, suffering will also become available to you. One has to choose. If you choose not to suffer, you don't want to suffer, then you will not attain to blissfulness either -- because they both come by the same door; this is the problem.

You can close your door in fear of the enemy, but the friend also comes by the same door. And if you lock it completely and block it completely, so afraid of the enemy, then the friend cannot come either.

God has not been coming to you, your doors are closed. You may have closed them against the evil, but when doors are closed they are closed. And one who needs, feels the hunger, the thirst to meet the divine, has to meet the evil also. You cannot choose one, you have to meet both.

🌹 🌹 🌹 🌹 🌹


17 Mar 2022


శ్రీ శివ మహా పురాణము - 535 / Sri Siva Maha Purana - 535


🌹 . శ్రీ శివ మహా పురాణము - 535 / Sri Siva Maha Purana - 535 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 47

🌻.శివుని అంతఃపుర ప్రవేశము - 5 🌻


వివాహ ప్రక్రియ నెరింగిన పురోహితుడు మహాత్ముడగు శంకరునకు మధుపర్కము మొదలగు వాటినిచ్చి చేయదగిన కర్మలనన్నిటినీ ఆనందముతో చేయించెను (43). ఓ మునీ! నాచే ప్రేరితుడైన ఆ పురోహితుడు అపుడు వివాహ ప్రస్తావమునకు అనురూపమగు మంగళకార్యముల నన్నిటినీ చేసెను (44). అపుడు శివుడు హిమవంతునితో బాటు వేదిపైన ప్రవేశించెను. అప్పటికి సర్వాలంకార శోభితయగు పార్వతీకన్య అచట ఉండెను (45). ఆ సుందరి వేదికపై నున్నదై మిక్కిలి ప్రకాశించెను. మహాదేవుని, విష్ణువును, నన్ను అచటకు దోడ్కొని వెళ్ళిరి (46).

బృహస్పతి మొదలగు వారు పరమానందముతో ఆచట కన్యాదాన లగ్నమును నిరీక్షించు చుండిరి (47). గర్గుడు గడియారము ఉన్నచోట కూర్చుండి లగ్నము వరకు గల మధ్య కాలములో ఓంకారమునుచ్చరించెను (48). గర్గుడు పుణ్యాహమం త్రములను పఠిస్తూ పార్వతి యొక్క దోసిలి యందు అక్షతలను నింపెను. ఆమె ఆనందముతో వాటిని శివుని శిరస్సుపై పోసెను. (49). గొప్ప ఉదారురాలు, సుందరమగు ముఖము గలది యగు పార్వతి పెరుగు, అక్షతలు, దర్భలు మరియు జలములతో రుద్రుని పూజించెను (50).

ఎవని కొరకై పరమ తపస్సును పూర్వము చేసినదో, అట్టి శంభుని మహానందముతో చూస్తూ ఆ పార్వతి మిక్కిలి ప్రకాశించెను (51). ఓ మునీ! నేను, గర్గాది మునులు చెప్పగా ఆ శంభుడు లోకాచారము నందు శ్రద్ధ గలవాడై పార్వతిని పూజించెను (52). ఈ విధముగా జగద్రూపులగు పార్వతీ పరమేశ్వరులు అపుడు పరస్పరము పూజించుకొని ప్రకాశించిరి (53).

ముల్లోకముల శోభను కలిగి ఒకరినొకరు చూచుకొనుచున్న వారిద్దరికి లక్ష్మి మొదలగు స్త్రీలు ప్రత్యేకముగా నీరాజనము నిచ్చిరి (54). మరియు బ్రాహ్మణ స్త్రీలు పార్వతీ పరమేశ్వరులకు తరువాత నీరాజనము నిచ్చిరి. వారిద్దరినీ చూస్తూ వారందరు మహానందమును, ఉత్సాహమును పొందిరి (55).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత యందు పార్వతీ ఖండలో శివుడు హిమవంతుని అంతః పురములో ప్రవేశించుట అను నలుబది ఏడవ అధ్యాయము ముగిసినది (47).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 SRI SIVA MAHA PURANA - 535 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 47 🌴

🌻 The ceremonious entry of Śiva - 5 🌻


43. The necessary rites such as offering of Madhuparka etc. to Śiva, the supreme soul, were joyously performed by the priest who knew his duties.

44-45. O sage, urged by me, the priest carried out the auspicious rites relevant to the context after entering the enclosure where the altar had been built along with Himavat. Pārvatī. bedecked in all her ornaments was seated as the bride.

46. She was seated over the raised platform and Śiva was led along with Viṣṇu and me.

47. Waiting for the auspicious Lagna befitting marriage, Bṛhaspati and others became jubilant.

48. Garga was seated in the place where the chronometer[1] had been kept. The Oṃkāra Mantra was repeated during the interval before the Lagna.

49. Repeating the Puṇyāha mantras, Garga lifted the handful of rice-grains and handing them over to Pārvatī he made her shower it on Śiva.

50. Śiva was duly worshipped by the joyful and sweetfaced Pārvatī with the rice-grains mixed with curd and Darbha water.

51. Gazing at Śiva for whom great penance had been performed by her formerly, Pārvatī shone beaming with pleasure.

52. Requested by me and the sages Garga and others, Śiva, following the worldly conventions worshipped her.

53. Thus, worshipping each other Śiva and Pārvatī identifying themselves with the universe, shone well.

54. Both of them, enveloped by the glory of the three worlds and gazing at each other, were offered the Nīrājana by Lakṣmī and other ladies particularly.

55. The brahmin ladies and the citizen ladies performed the Nīrājana rites. All of them derived great pleasure and gaiety on seeing Śiva and Pārvatī.


Continues....

🌹🌹🌹🌹🌹


17 Mar 2022

గీతోపనిషత్తు -337


🌹. గీతోపనిషత్తు -337 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 28-4 📚


🍀 28-4. సన్యాస యోగము - సంకల్పించుట, ఫలములాసించుట విసర్జించ వలెను. అన్నియు ఈశ్వరున కర్పించి, ఈశ్వరాధీనముగ జీవితమును నిర్వర్తించుకొనవలెను. కర్తవ్యములు మన వద్దకు కాలము రూపమున, దేశము రూపమున నడచి వచ్చును. మన మేమియు ప్రత్యేకించి సంకల్పింప అవసరము లేదు. దరిజేరిన కర్తవ్యమును పాలించుటయే. ఫలముల యందాసక్తి అవసరము లేదు. బుద్ధిమంతుడు భగవానుడు పలికిన సన్యాస యోగ మవలంబించి, భగవంతునితో సదా కూడి యుండుట నేర్వవలెను. అట్టి వానికి మోక్ష స్థితి తథ్యము. 🍀

28. శుభాశుభఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః |
సన్న్యాసయోగ యుక్తాత్మా విముక్తో మా ముపైష్యసి ||

🌻. తాత్పర్యము : పై విధముగ సర్వమును నాకు సమర్పణ చేసుకొనిన వానికి పాపపుణ్య ఫలముల బంధము విడువబడును. నాతో సమ్య జ్ఞాన యోగమున సమస్తము నుండి విముక్తి చెంది నన్ను పొందిన వాడగును.

🌻. వివరణము : కర్తవ్యములు మన వద్దకు కాలము రూపమున, దేశము రూపమున నడచి వచ్చును. మన మేమియు ప్రత్యేకించి సంకల్పింప అవసరము లేదు. దరిజేరిన కర్తవ్యమును పాలించుటయే. ఫలముల యందాసక్తి అవసరము లేదు. అట్టి వానికి మోక్ష స్థితి తథ్యము. పుణ్యము కోసము పుణ్యకర్మలు ఆచరించు వారు మోక్షమును పొందలేరని భగవాను డిచ్చట హెచ్చరిక చేయు చున్నాడు. కర్మ స్వరూప స్వభావములు, అవి బంధించు విధానము మానవులకు తెలియవలెను. కర్తవ్యమెంత ప్రధానమో కూడ తెలియవలెను.

సంకల్పించుట, ఫలములాసించుట విసర్జించ వలెను. అన్నియు ఈశ్వరున కర్పించి, ఈశ్వరాధీనముగ జీవితమును నిర్వర్తించు కొనవలెను. దుఃఖము, కష్టనష్టములు ఎట్లు బంధించునో, సుఖములు భోగభాగ్యములు కూడ అట్లే బంధించును. ఇనుప పంజరములో నున్నను, బంగారు పంజరములో నున్నను బంధ మొకటియే. కావున బుద్ధిమంతుడు భగవానుడు పలికిన సన్యాస యోగ మవలంబించి, భగవంతునితో సదా కూడి యుండుట నేర్వవలెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


17 Mar 2022

17 - MARCH - 2022 గురువారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 17, గురువారం, మార్చి 2022 బృహస్పతి వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 28-4 - 337 - సన్యాస యోగము 🌹 
3) 🌹. శివ మహా పురాణము - 535 / Siva Maha Purana - 535 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -165 🌹  
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 154 / Osho Daily Meditations - 154🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 356-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 356-2 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ గురువారం మిత్రులందరికీ 🌹*
*బృహస్పతి వాసరే, 17, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : హూళికా దహనం, పూర్ణిమ ఉపవాసం, Holika Dahan, Purnima Upavas🌻*

*🍀. శ్రీ కల్కి స్తోత్రం - 8 🍀*

*8. తవ జపః సతాం మానవర్ధనం జినకులక్షయం దేవపాలకమ్ |*
*కృతయుగార్పకం ధర్మపూరకం కలికులాంతకం శం తనోతు మే*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఆత్మిక ప్రగతిలో విఘ్నము కలగకుండుట కొరకే ఆనంద స్వరూపమైన ఆత్మకు కష్టములు ఏర్పాటు చేయబడినవి. - సద్గురు శ్రీరామశర్మ ఆచార్య. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
ఉత్తరాయణం, శిశిర ఋతువు, 
ఫాల్గుణ మాసం
తిథి: శుక్ల చతుర్దశి 13:31:44 వరకు
తదుపరి పూర్ణిమ
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 24:34:06 వరకు
తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: శూల 25:08:59 వరకు
తదుపరి దండ
కరణం: వణిజ 13:26:44 వరకు
వర్జ్యం: 08:26:00 - 10:02:48
దుర్ముహూర్తం: 10:23:58 - 11:12:12
మరియు 15:13:24 - 16:01:38
రాహు కాలం: 13:55:01 - 15:25:28
గుళిక కాలం: 09:23:40 - 10:54:07
యమ గండం: 06:22:46 - 07:53:13
అభిజిత్ ముహూర్తం: 12:00 - 12:48
అమృత కాలం: 18:06:48 - 19:43:36
సూర్యోదయం: 06:22:46
సూర్యాస్తమయం: 18:26:21
చంద్రోదయం: 17:44:05
చంద్రాస్తమయం: 05:48:12
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: సింహం
గద యోగం - కార్య హాని , చెడు
24:34:06 వరకు తదుపరి 
మతంగ యోగం - అశ్వ లాభం 

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -337 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 28-4 📚*
 
*🍀 28-4. సన్యాస యోగము - సంకల్పించుట, ఫలములాసించుట విసర్జించ వలెను. అన్నియు ఈశ్వరున కర్పించి, ఈశ్వరాధీనముగ జీవితమును నిర్వర్తించుకొనవలెను. కర్తవ్యములు మన వద్దకు కాలము రూపమున, దేశము రూపమున నడచి వచ్చును. మన మేమియు ప్రత్యేకించి సంకల్పింప అవసరము లేదు. దరిజేరిన కర్తవ్యమును పాలించుటయే. ఫలముల యందాసక్తి అవసరము లేదు. బుద్ధిమంతుడు భగవానుడు పలికిన సన్యాస యోగ మవలంబించి, భగవంతునితో సదా కూడి యుండుట నేర్వవలెను. అట్టి వానికి మోక్ష స్థితి తథ్యము. 🍀*

*28. శుభాశుభఫలై రేవం మోక్ష్యసే కర్మబంధనైః |*
*సన్న్యాసయోగ యుక్తాత్మా విముక్తో మా ముపైష్యసి ||*

*🌻. తాత్పర్యము : పై విధముగ సర్వమును నాకు సమర్పణ చేసుకొనిన వానికి పాపపుణ్య ఫలముల బంధము విడువబడును. నాతో సమ్య జ్ఞాన యోగమున సమస్తము నుండి విముక్తి చెంది నన్ను పొందిన వాడగును.*

*🌻. వివరణము : కర్తవ్యములు మన వద్దకు కాలము రూపమున, దేశము రూపమున నడచి వచ్చును. మన మేమియు ప్రత్యేకించి సంకల్పింప అవసరము లేదు. దరిజేరిన కర్తవ్యమును పాలించుటయే. ఫలముల యందాసక్తి అవసరము లేదు. అట్టి వానికి మోక్ష స్థితి తథ్యము. పుణ్యము కోసము పుణ్యకర్మలు ఆచరించు వారు మోక్షమును పొందలేరని భగవాను డిచ్చట హెచ్చరిక చేయు చున్నాడు. కర్మ స్వరూప స్వభావములు, అవి బంధించు విధానము మానవులకు తెలియవలెను. కర్తవ్యమెంత ప్రధానమో కూడ తెలియవలెను.*

*సంకల్పించుట, ఫలములాసించుట విసర్జించ వలెను. అన్నియు ఈశ్వరున కర్పించి, ఈశ్వరాధీనముగ జీవితమును నిర్వర్తించు కొనవలెను. దుఃఖము, కష్టనష్టములు ఎట్లు బంధించునో, సుఖములు భోగభాగ్యములు కూడ అట్లే బంధించును. ఇనుప పంజరములో నున్నను, బంగారు పంజరములో నున్నను బంధ మొకటియే. కావున బుద్ధిమంతుడు భగవానుడు పలికిన సన్యాస యోగ మవలంబించి, భగవంతునితో సదా కూడి యుండుట నేర్వవలెను.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 535 / Sri Siva Maha Purana - 535 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 47

*🌻.శివుని అంతఃపుర ప్రవేశము - 5 🌻*

వివాహ ప్రక్రియ నెరింగిన పురోహితుడు మహాత్ముడగు శంకరునకు మధుపర్కము మొదలగు వాటినిచ్చి చేయదగిన కర్మలనన్నిటినీ ఆనందముతో చేయించెను (43). ఓ మునీ! నాచే ప్రేరితుడైన ఆ పురోహితుడు అపుడు వివాహ ప్రస్తావమునకు అనురూపమగు మంగళకార్యముల నన్నిటినీ చేసెను (44). అపుడు శివుడు హిమవంతునితో బాటు వేదిపైన ప్రవేశించెను. అప్పటికి సర్వాలంకార శోభితయగు పార్వతీకన్య అచట ఉండెను (45). ఆ సుందరి వేదికపై నున్నదై మిక్కిలి ప్రకాశించెను. మహాదేవుని, విష్ణువును, నన్ను అచటకు దోడ్కొని వెళ్ళిరి (46).

బృహస్పతి మొదలగు వారు పరమానందముతో ఆచట కన్యాదాన లగ్నమును నిరీక్షించు చుండిరి (47). గర్గుడు గడియారము ఉన్నచోట కూర్చుండి లగ్నము వరకు గల మధ్య కాలములో ఓంకారమునుచ్చరించెను (48). గర్గుడు పుణ్యాహమం త్రములను పఠిస్తూ పార్వతి యొక్క దోసిలి యందు అక్షతలను నింపెను. ఆమె ఆనందముతో వాటిని శివుని శిరస్సుపై పోసెను. (49). గొప్ప ఉదారురాలు, సుందరమగు ముఖము గలది యగు పార్వతి పెరుగు, అక్షతలు, దర్భలు మరియు జలములతో రుద్రుని పూజించెను (50).

ఎవని కొరకై పరమ తపస్సును పూర్వము చేసినదో, అట్టి శంభుని మహానందముతో చూస్తూ ఆ పార్వతి మిక్కిలి ప్రకాశించెను (51). ఓ మునీ! నేను, గర్గాది మునులు చెప్పగా ఆ శంభుడు లోకాచారము నందు శ్రద్ధ గలవాడై పార్వతిని పూజించెను (52). ఈ విధముగా జగద్రూపులగు పార్వతీ పరమేశ్వరులు అపుడు పరస్పరము పూజించుకొని ప్రకాశించిరి (53).

ముల్లోకముల శోభను కలిగి ఒకరినొకరు చూచుకొనుచున్న వారిద్దరికి లక్ష్మి మొదలగు స్త్రీలు ప్రత్యేకముగా నీరాజనము నిచ్చిరి (54). మరియు బ్రాహ్మణ స్త్రీలు పార్వతీ పరమేశ్వరులకు తరువాత నీరాజనము నిచ్చిరి. వారిద్దరినీ చూస్తూ వారందరు మహానందమును, ఉత్సాహమును పొందిరి (55).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత యందు పార్వతీ ఖండలో శివుడు హిమవంతుని అంతః పురములో ప్రవేశించుట అను నలుబది ఏడవ అధ్యాయము ముగిసినది (47).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 535 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 47 🌴*

*🌻 The ceremonious entry of Śiva - 5 🌻*

43. The necessary rites such as offering of Madhuparka etc. to Śiva, the supreme soul, were joyously performed by the priest who knew his duties.

44-45. O sage, urged by me, the priest carried out

the auspicious rites relevant to the context after entering the enclosure where the altar had been built along with Himavat. Pārvatī. bedecked in all her ornaments was seated as the bride.

46. She was seated over the raised platform and Śiva was led along with Viṣṇu and me.

47. Waiting for the auspicious Lagna befitting marriage, Bṛhaspati and others became jubilant.

48. Garga was seated in the place where the chronometer[1] had been kept. The Oṃkāra Mantra was repeated during the interval before the Lagna.

49. Repeating the Puṇyāha mantras, Garga lifted the handful of rice-grains and handing them over to Pārvatī he made her shower it on Śiva.

50. Śiva was duly worshipped by the joyful and sweetfaced Pārvatī with the rice-grains mixed with curd and Darbha water.

51. Gazing at Śiva for whom great penance had been performed by her formerly, Pārvatī shone beaming with pleasure.

52. Requested by me and the sages Garga and others, Śiva, following the worldly conventions worshipped her.

53. Thus, worshipping each other Śiva and Pārvatī identifying themselves with the universe, shone well.

54. Both of them, enveloped by the glory of the three worlds and gazing at each other, were offered the Nīrājana by Lakṣmī and other ladies particularly.

55. The brahmin ladies and the citizen ladies performed the Nīrājana rites. All of them derived great pleasure and gaiety on seeing Śiva and Pārvatī.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 165 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు *
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. వాదనలు వ్యర్థము 🌻*

*ఏ నరుడైనను స్వల్పకాలము దేనిని గూర్చి వాదనలోనికి దిగినను రోషము, పంతములు కలుగును. అనగా బాధ కలుగును. అది కలిగినంత కాలము వాని ఆయుర్దాయము వ్యర్థమై పోయి‌నట్లే.*

*ఏ నరుఁడే నొక నిమిషంబైన వృథావాదగతిని హరిపదకమల*
*ధ్యానానందుఁడు గాడే నా నరునకు నాయు వల్ప మగు మునినాథా!*

*వయస్సు‌ను బట్టి రోగము , ముసలితనము మున్నగు లక్షణములు వచ్చుట సిద్ధుల యందు పనిచేయదు.*

*మనస్సు , ఇంద్రియములు స్థూలదేహమునకు కోరికల రూపమున దాస్యము చేయుచున్నచో రోగము, ముసలితనము కనిపించును. అట్లుగాక ఇంద్రియములు , మనస్సు , బుద్ధి యోగమున భగవంతుని యందు వసించుట అభ్యాసమైనచో దేహము కూడ వానిమనుసరించి జీవింపవలసి వచ్చును. అప్పుడు రోగము, వయస్సు పనిచేయవు.*

*✍🏼. మాస్టర్ ఇ.కె.🌻*
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 154 / Osho Daily Meditations - 154 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 154. తీర్పులు 🍀*

*🕉. తీర్పులను ఇవ్వడం ఒక రోగంగా గుర్తించి వదిలిపెట్టు. ఆ లక్షణం ఎప్పటికీ శాంతిని ఇవ్వదు. 🕉*
 
*మీరు తీర్పు ఇవ్వడానికి పూనుకున్నప్పుడల్లా పోల్చవలసి వస్తుంది. కాలంలో వెనుకకు లేదా ముందుకు కదలాలి. అందువల్ల మీరు వర్తమానంలో మరియు ప్రస్తుతంలో ఉండలేరు. దీనిలో ఇది మంచిది, లేదా ఇది చెడ్డది అని పోల్చడానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే వర్తమానం మరియు ప్రస్తుత స్థితి అనేది కేవలం ఉంది అంతే; మంచిదా, చెడ్డదా అని చెప్పడానికి మార్గం కూడా లేదు, ప్రస్తుతం మరియు వర్తమానం యొక్క అందమే అది.*

*కానీ ప్రతీదాన్ని అంచనా వేయాలనే ఆలోచన మనది. దానిలోనే అహం దాగి ఉంటుంది. అహంకు గొప్పగా తనని తాను మెరుగు పరచుకుంటున్నాను అని అనుకునే లక్షణం వుంది. నిరంతరం ఎదుగతున్నట్టు చూపిస్తుంది. ఇది మిమ్మల్ని మీరు హింసించుకునేలా చేస్తుంది: "మెరుగుపడు, మెరుగుపడు అని పోరుతూ వుంటుంది.!". కానీ నిజానికి మెరుగు పరచడానికి ఏమీ లేదు. తీర్పు చెప్పడం అనేది కేవలం ఒక అలవాటు. నీ నుండి తీర్పు వచ్చినప్పుడల్లా, దాన్ని తక్షణం వదిలేయి, వదిలిపెట్టు. అనవసరంగా నిన్ను నీవు హింసించు కోవద్దు.*
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 154 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 154. JUDGING 🍀*

*🕉 Judging has to be dropped. It is an illness that will never allow you any peace. 🕉*
 
*When you judge, you can never be in the present-you are always comparing, always moving backward or forward, but never here and now. Because the here and now is simply there; it is neither good nor bad. And there is no way to tell whether it is better, because there is nothing with which to compare. It is simply there in all its beauty.*

*But the very idea to evaluate it has something of the ego in it. The ego is a great improver; it lives on improvement. It keeps torturing you: "Improve, improve!" And there is nothing to improve. Whenever a judgment comes, drop it then and there. Drop it. It is a habit. Don't torture yourself unnecessarily.* 
  
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 356-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 356-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 78. భక్తిమత్-కల్పలతికా, పశుపాశ విమోచనీ ।*
*సంహృతాశేష పాషండా, సదాచార ప్రవర్తికా ॥ 78 ॥ 🍀*

*🌻 356-2. 'సదాచార ప్రవర్తికా' 🌻* 

*యజ్ఞము దానము సహజ లక్షణము లైనవారికి మాత్రమే తపస్సు ఫలించును. తపస్సు ఆధారముగ దైవమే తానని, దేవుడే జీవుడుగ నున్నాడని తెలియును. ఇట్టి యజ్ఞ, దాన, తపస్సుల యందు జీవులను క్రమముగ ప్రవర్తింప జేయునది శ్రీమాత. ప్రతి జీవుని కథ యందు స్వార్థ చింతనచే చిక్కుల యందు పడుట, ఆర్తుడు, అర్థార్థుడు అయి గతి లేక దైవమును ప్రార్థించుట, దైవప్రార్థనమున కొంత చిక్కులు సడలగ దైవమునందు ఆసక్తి కలుగుట, అట్టి ఆసక్తి కారణముగ దైవముచే అనుగ్రహింపబడుటకు సదాచారముల నవలంబించుట జరుగుచున్నది.*

*ఇట్లు జీవులందరిని సదాచారమునకు శ్రీమాతయే మళ్ళించు చున్నది. దుర్బలుర నందరిని సదాచార మార్గమున బలవంతులను చేయుట శ్రీమాతయే జరుపు చున్నది. దుష్టులను సంహరించుచు దుర్బలురను తీర్చిదిద్దుచు సృష్టి చక్రమును నిర్వర్తించునది శ్రీమాతయే. సదాచారమున ప్రవర్తింప చేయుట శ్రీమాత ముఖ్య కార్యములలో నొకటి.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 356-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 78. Bhaktimatkalpalatika pashupasha vimochani*
*Sanhruta sheshapashanda sadachara pravartika ॥ 78 ॥ 🌻*

*🌻 356-2. Sadācāra-pravartikā सदाचार-प्रवर्तिका 🌻*

*She removes the innate ignorance of the soul to realize the Brahman. In this nāma, She is said to induce the ignorant men to perform noble acts. Sat refers those who perform noble deeds and ācāra means the righteous acts performed by them. She makes the ignorant people (ignorant means lack of knowledge of the Brahman.*

*It could also mean the concept of duality) to pursue the righteous path to realize the Brahman. The principles of righteousness are expounded in epics. These principles form the basis of dharma śāstra (refer previous nāma).*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹